TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 7th Lesson వ్యాపార ప్రారంభం Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 7th Lesson వ్యాపార ప్రారంభం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ రిజిస్ట్రార్కి సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలు ఏవి ?
జవాబు.
వాటా మూలధనం ఉన్న ఏ పబ్లిక్ కంపెనీ అయినా రిజిస్ట్రార్ నుండి వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం పొందిన తర్వాతనే వ్యాపారం ప్రారంభించాలి. ఈ పత్రం లేకుండా పబ్లిక్ కంపెనీ వ్యాపారం ప్రారంభించరాదు మరియు అప్పులు సేకరించరాదు.

ఒక పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందడానికి ఈ క్రింద తెలియచేసిన పత్రాలను రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి.

  • పరిచయపత్రం లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రం.
  • డైరెక్టర్లు వారు తీసుకోవాల్సిన అర్హత వాటాలను తీసుకున్నట్లు, వాటి మొత్తాన్ని చెల్లించినట్లు తెలియచేసే ధృవీకరణ ప.
  • కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరించే పత్రం.
  • వ్యాపార ప్రారంభానికి కావలసిన అన్ని లాంఛనాలను పాటించడమైందని కంపెనీ డైరెక్టర్లు లేదా సెక్రటరీ (కార్యదర్శి) చేత ఇవ్వబడిన ప్రకటన.

పై పత్రాలను కంపెనీ రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తిచెందినట్లయితే, అప్పుడు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందడంతో కంపెనీ స్థాపన పూర్తి అయినట్లు పరిగణించి, కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

కంపెనీ స్థాపనకు తయారుచేయవలసిన ముఖ్యపత్రాలు: కంపెనీ స్థాపనకు అవసరమైన క్రింది ముఖ్యపత్రాల అవసరం.

  1. సంస్థాపన పత్రం.
  2. నియమావళి.
  3. పరిచయ పత్రం.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

ప్రశ్న 2.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ? వాటిలోని క్లాజులను వివరించండి.
జవాబు.
సంస్థాపన పత్రం అర్థం: సంస్థాపన పత్రం కంపెనీకి రాజ్యాంగం లాంటిది. కంపెనీ ధ్యేయాలను, పరిధిని, బయటి వారితో ఉన్న సంబంధాలను ఇది నిర్వచిస్తుంది. ఇది కంపెనీ నిర్మాణానికి పునాది లాంటిది. వాటాదారులు, ఋణదాతలు, ఇతర వ్యక్తులు కంపెనీతో నిర్వహించే వ్యవహారాలకు సంస్థాపన పత్రం హద్దులను నిర్ణయిస్తుంది. ఈ పత్రంలోని అంశాలకు విరుద్ధంగా (భిన్నంగా) జరిపే కార్యకలాపాలు న్యాయాతీతమవుతాయి. కంపెనీ నమోదు సమయంలో రిజిస్ట్రార్కు అందచేయవలసిన ముఖ్యపత్రాలలో సంస్థాపన పత్రం ప్రధానమైంది.

నిర్వచనం: కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(56) ప్రకారం కంపెనీ నమోదు సమయంలో అతి ముఖ్యమైన పత్రం రిజిస్ట్రార్కి సమర్పించవలసిన అతి ముఖ్యమైన పత్రం. సంస్థాపన పత్రంపై పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు సభ్యులు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు సభ్యులు తప్పనిసరిగా సంతకాలు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఈ పత్రాన్నీ మార్చటం అంత తేలిక కాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా దూరదృష్టితో ఆలోచించి తయారు చేయాలి.

సంస్థాపన పత్రం క్లాజులు: సంస్థాపన పత్రములో పొందుపరిచే ముఖ్య అంశాలను క్లాజులు అంటారు. కంపెనీల చట్టం, సెక్షన్ – బి ప్రకారం సంస్థాపన పత్రంలోని క్లాజులను క్రింది విధంగా వివరించడమైంది. 1. నామధేయపు క్లాజు (సెక్షన్ 4(1)(a)]: కంపెనీకి చట్టపరమైన అస్తిత్వం ఉంది. అందువల్ల దానికి ఒక ప్రత్యేకమైన పేరు అవసరం. ఈ క్లాజులో కంపెనీ పేరును సూచిస్తారు. అయితే కంపెనీకి నిర్ణయించిన పేరు, ఉనికిలో ఉన్న కంపెనీ పేర్లను పోలి ఉండరాదు. రాజు, రాణి, ప్రభుత్వ సంస్థల పేర్లను అనుకరించేదిగా ఉండరాదు. ప్రతిపాదించిన పేరు, చిహ్నాలు పేర్లు చట్టం 1950లో సూచించిన నియమాలకు విరుద్ధంగా ఉండకూడదు. పబ్లిక్ కంపెనీ అయితే “లిమిటెడ్” అని ప్రైవేటు కంపెనీ అయితే “ప్రైవేటు లిమిటెడ్” అని పేరు చివర రాయాలి.

2. కార్యాలయపు క్లాజు (సెక్షన్ 4(1)(b)]: కంపెనీ రిజిస్ట్రార్ ఆఫీసు (కార్యాలయం) ఉన్న ప్రదేశం, చిరునామాలను ఈ క్లాజులో వెల్లడించాలి. కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కార్యాలయ చిరునామా చాలా అవసరం. ఒకవేళ నమోదు తేదీనాటికి రిజిస్టర్ కార్యాలయం స్థాపించే ప్రదేశం నిర్ధారణ కాకపోతే, కంపెనీ నమోదైన లేదా ప్రారంభించిన 30 రోజులలోపు, ఆ కార్యాలయపు చిరునామాను కంపెనీ రిజిష్ట్రారికి తెలియపరచాలి.

3. ధ్యేయాల క్లాజు (సెక్షన్ 4(1)(c)]: ఈ క్లాజు కంపెనీ కార్యకలాపాల పరిధిని. నిర్వచిస్తుంది. కంపెనీ అధికారాలను నిర్ణయిస్తుంది. కంపెనీ స్థాపించిన ధ్యేయం, వ్యాపార స్వభావం ఈ క్లాజులో స్పష్టీకరిస్తారు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన క్లాజు. ఈ క్లాజులో కంపెనీ ఎ) ప్రధాన ధ్యేయాలు బి) అనుబంధ ధ్యేయాలు ఉంటాయి. వాటాదారులు, ఋణదాతలు ఇచ్చిన సొమ్ము ఏ ఉద్దేశం కోసం వినియోగించడం జరిగిందో తెలియజేస్తూ ఈ క్లాజు వారికి రక్షణ కల్పిస్తుంది.

4. ఋణబాధ్యత క్లాజు (సెక్షన్ 4(1)(d)]: ఈ క్లాజు వాటాదారుల ఋణ బాధ్యత స్వభావాన్ని తెలియజేస్తుంది. వాటాదారుల ఋణ బాధ్యత వారు చెల్లించిన వాటాల మొత్తానికే పరిమితమని స్పష్టీకరిస్తుంది. అంటే కంపెనీ సభ్యులు వారు తీసుకొన్న వాటాలకు మించి ఋణ బాధ్యత కలిగి ఉండరు. ఒకవేళ వాటా మొత్తంలో కొంత భాగం చెల్లించినట్లయితే వారి ఋణ బాధ్యత ఆ చెల్లించని మొత్తానికి మాత్రమే పరిమితమవుతుంది.

5. మూలధనం క్లాజు [సెక్షన్ 4(1)(e)]: ఈ క్లాజు మూలధన స్వరూపాన్ని వివరిస్తుంది. ఆధిక్యపు మూలధనం ఎంతో ఈ క్లాజు తెలియజేస్తుంది. మూలధనం ఎన్ని రకాల వాటాలుగా విభజించడం జరిగింది, ఒక్కొక్కరకంలో వాటాల సంఖ్య, వాటి విలువ, వాటాదారుల హక్కులను వివరిస్తుంది. మూలధనాన్ని ఆధిక్యపు వాటాలు, ఈక్విటీవాటాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క రకం మూలధనం ఎంతమేరకు ఉందో విశదీకరిస్తుంది.

6. వ్యవస్థాపన, చందాల క్లాజు [సెక్షన్ 13 (4) (c)]: ఈ క్లాజులో సంస్థాపన పత్రంపై సంతకం చేసినవారి పేర్లు చిరునామాలు, వృత్తి, మొదలైనవి పేర్కొంటారు. వారి సంతకాలను సాక్షులు ధృవీకరించాలి. వారంతా కలిసి కంపెనీని స్థాపించడానికి సమిష్టిగా పూనుకున్నామని, నిర్దిష్ట వాటాలు తీసుకోవడానికి అంగీకరించామని, కలిసికట్టుగా వ్యాపారాన్ని చేస్తామని ప్రకటించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

ప్రశ్న 3.
నియమావళి అంటే ఏమిటి ? నియమావళిలోని అంశాలను వివరించండి.
జవాబు.
కంపెనీ నమోదు చేసేటప్పుడు రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయవలసిన పత్రాలలో రెండవది నియమావళి. కంపెనీ ఆంతరంగిక వ్యవహారములు సమర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని నియమాలు, నిబంధనలు అవసరము. ఆ నియమ నిబంధనలు గల పత్రమే నియమావళి. కంపెనీ నియమావళి ఆంతరంగిక వ్యవహారములకు చుక్కాని వంటిది. నిర్వహణాధికారులకు ఈ నియమావళి మార్గదర్శకముగా ఉంటుంది. కంపెనీకి వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ఇది డైరెక్టర్లు, నిర్వహణాధికారులు, వాటాదారులు, ఋణపత్రదారుల అధికారాలను విధులను, బాధ్యతలను స్పష్టముగా నిర్వచిస్తుంది.

కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి, ముద్రించవలెను. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు నియమావళి మీద సాక్షి సమక్షములో సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీలు, వాటాపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అపరిమిత కంపెనీలు నియమావళిని తప్పని సరిగా తయారు చేసుకొనవలెను. పబ్లిక్ కంపెనీ తన సొంత నియమావళిని తయారుచేసుకోవచ్చు. నియమావళిలో ఉండే అంశాలు:

  1. వాటా మూలధనము దాని రకాలు, వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు, వాటా పిలుపులు.
  2. వాటాల బదిలీ, వాటాల జప్తు, తిరిగి జారీచేసే విధానము.
  3. డిబెంచర్లు, స్టాకు జారీ విధానం.
  4. వాటా మూలధనము మార్చుట, మూలధన తగ్గింపు..
  5. డైరెక్టర్ల నియామకము, వారి అధికారాలు, బాధ్యతలు, పారితోషికము.
  6. మేనేజింగ్ డైరెక్టర్ నియామకము.
  7. కంపెనీ సమావేశాలు – తీర్మానాలు.
  8. డివిడెండ్లు, రిజర్వులు ఏర్పాటు.
  9. ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకునే నిబంధనలు.
  10. కంపెనీ అధికార ముద్ర, ఉపయోగించే విధానం.
  11. కంపెనీ లెక్కలు, వాటి తనిఖీ.
  12. సభ్యుల ఓటింగ్ పద్ధతి (ఆడిట్).
  13. సమావేశానికి కోరం నిర్ణయించుట.
  14. బ్యాంకు ఖాతాల నిర్వహణ.
  15. కనీసపు చందా.
  16. సాధారణ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పద్ధతి, ఎన్నికలు, తీర్మానాలు.
  17. కంపెనీని రద్దు చేసే విధానము.
  18. కంపెనీ యొక్క ఇతర నియమ నిబంధనలు.

ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా కంపెనీ తన నియమావళిని మార్చుకోవచ్చు. మార్చిన వివరాలను మరియు తీర్మాన కాపీలను చట్టబద్ధంగా 30 రోజులలోగా రిజిస్ట్రార్కు అందజేయాలి.

ప్రశ్న 4.
పరిచయ పత్రం అంటే ఏమిటి ? దానిలోని అంశాలను వివరించండి.
జవాబు.
పరిచయ పత్రం: ఒక పబ్లిక్ కంపెనీ మూలధనంను సమకూర్చుకొనుటకు తమ వాటాలలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టమని ప్రజలను ఆహ్వానిస్తూ జారీ చేసే పత్రాన్ని పరిచయ పత్రం అంటారు. పరిచయ పత్రం ప్రజలకు కొత్త కంపెనీ స్థాపన గురించి తెలియచేస్తుంది.

పబ్లిక్ కంపెనీ వాటాలు ఋణ పత్రాలను (డిబెంచర్లు) కొనమని ప్రజలను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేస్తుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న ఆ ప్రకటన లేదా ఆహ్వానాన్ని పరిచయపత్రం అంటారు. నిర్వచనం: కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(70) ప్రకారం పరిచయం చేసుకోవడానికి కంపెనీ చేత జారీ చేయబడిన ఒక పత్రాన్ని పరిచయ పత్రం అంటారు.

పరిచయ పత్రం క్రింది సమాచారంను కల్గి ఉండవలెను:

  1. ఇది ప్రజలకు ఒక ఆహ్వాన పత్రంగా ఉండాలి.
  2. ఇది కంపెనీ తరపున గాని లేదా కంపెనీకి సంబంధించినదై ఉండాలి.
  3. ఇది చందాలు సేకరించడానికి గాని, కొనుగోలుకు సంబంధించి ఆహ్వానం అయి ఉండాలి.
  4. ఇది వాటాలు లేక డిబెంచర్లను కొనుగోలు చేయుటకు ప్రజలను ఆహ్వానిస్తూ ఉండాలి.

పరిచయ పత్రంలో పేర్కొన్న విధంగా దరఖాస్తు ద్వారా, పెట్టుబడిదారుడు కంపెనీ వాటాలను, డిబెంచర్లను కొనుగోలు చేస్తాడు. పరిచయ పత్రం జారీ చేసిన 120 రోజుల లోపు కావలసిన కనీస మూలధనాన్ని సేకరించలేకపోతే, అంతవరకు సేకరించిన మొత్తాన్ని నిర్ణీత గడువు లోపల పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

పరిచయ పత్రంలో ఉండే అంశాలు: ముఖ్యమైన కొన్ని అంశాలను ఈ క్రింద ఇవ్వడమైంది. అవి:

  1. కంపెనీ పేరు, పూర్తి చిరునామా.
  2. సంస్థాపన పత్రం మీద సంతకం చేసినవారి పేర్లు, వృత్తి నియమాలు వారు తీసుకున్న వాటాల సంఖ్య. 3. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – వారి పేర్లు, చిరునామా, వృత్తి వివరాలు.
  3. వ్యవస్థాపకులు నిర్ణయించిన కనీసపు చందా మొత్తం.
  4. ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తే దాని వివరాలు.
  5. చందాల జాబితా తెరిచి ఉంచే కాలం, దరఖాస్తు స్వీకరించే గడువు తేదీ.
  6. మూలధన వివరాలు – జారీ చేసిన మూలధనం వాటాల వివరాలు.
  7. వాటాల దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై చెల్లించవలసిన మొత్తం వాటి వివరాలు.
  8. జారీ చేస్తున్న వాటాలకు ధర నిర్ణయించడానికి గల మూలాధారాలు.
  9. వాటాలు, డిబెంచెర్లు పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రత్యేక హక్కులు, వాటి వివరాలు.
  10. చందా పూచీదార్ల పేర్లు, కమీషన్, ఇతర వివరాలు.
  11. రిజర్వులు మరియు మిగుళ్ళ వివరాలు.
  12. ప్రాథమిక ఖర్చుల వివరాలు.
  13. లెక్కల తనిఖీదారుల (ఆడిటర్స్) పేర్లు, చిరునామాలు.
  14. కంపెనీ వాటాదారుల ఓటింగ్ హక్కులు, సమావేశాల వివరాలు.
  15. నష్ట భయం గురించి నిర్వాహకుల అభిప్రాయాలు (పరిజ్ఞానం).
  16. వాటాదారుల సమస్యలు పరిష్కరించబడే విధానం.

ప్రశ్న 5.
సంస్థాపన పత్రం మరియు నియమావళి మధ్య వ్యత్యాసాలను చర్చించండి.
జవాబు.
సంస్థాపన పత్రానికి – కంపెనీ నియమావళికి మధ్య ఉన్న తేడాలు లేదా వ్యత్యాసాలు:
TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం 1
TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం 2

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిచయ పత్రంలోని ఏవేని 5 అంశాలను తెలపండి.
జవాబు.
పరిచయ పత్రం: ఒక పబ్లిక్ కంపెనీ మూలధనంను సమకూర్చుకొనుటకు తమ వాటాలలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టమని ప్రజలను ఆహ్వానిస్తూ జారీ చేసే పత్రాన్ని పరిచయ పత్రం అంటారు. పరిచయ పత్రం ప్రజలకు కొత్త కంపెనీ స్థాపన గురించి తెలియచేస్తుంది.

పబ్లిక్ కంపెనీ వాటాలు ఋణ పత్రాలను (డిబెంచర్లు) కొనమని ప్రజలను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేస్తుంది. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న ఆ ప్రకటన లేదా ఆహ్వానాన్ని పరిచయపత్రం అంటారు. నిర్వచనం: కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(70) ప్రకారం పరిచయం చేసుకోవడానికి కంపెనీ చేత జారీ చేయబడిన ఒక పత్రాన్ని పరిచయ పత్రం అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

పరిచయ పత్రంలో ఉండే అంశాలు: ముఖ్యమైన కొన్ని అంశాలను ఈ క్రింద ఇవ్వడమైంది. అవి:

  1. కంపెనీ పేరు, పూర్తి చిరునామా.
  2. సంస్థాపన పత్రం మీద సంతకం చేసినవారి పేర్లు, వృత్తి నియమాలు వారు తీసుకున్న వాటాల సంఖ్య.
  3. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వారి పేర్లు, చిరునామా, వృత్తి వివరాలు.
  4. వ్యవస్థాపకులు నిర్ణయించిన కనీసపు చందా మొత్తం.
  5. ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తే దాని వివరాలు.
  6. చందాల జాబితా తెరిచి ఉంచే కాలం, దరఖాస్తు స్వీకరించే గడువు తేదీ.
  7. మూలధన వివరాలు జారీ చేసిన మూలధనం వాటాల వివరాలు.
  8. వాటాల దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై చెల్లించవలసిన మొత్తం వాటి వివరాలు.

ప్రశ్న 2.
పరిచయ పత్రానికి సంబంధించిన చట్టపరమైన ఆవశ్యకాలను తెలపండి.
జవాబు.
పరిచయ పత్రం – చట్టపరమైన ఆవశ్యకాలు: పెట్టుబడిదారుల పరిరక్షణకు కంపెనీల చట్టం పరిచయపత్రం జారీ చేయడంలో కొన్ని నియమ నిబంధనలను తెలిపింది. వాటిలో ముఖ్యమైనవి.

ఎ) పరిచయ పత్రం జారీ చేసిన తేదీని ముద్రించాలి.

బి) డైరెక్టర్లుగా నియమింపబడిన, సంతకాలు చేసినవారి పేర్లు, వివరాలు పేర్కొనాలి.

సి) కంపెనీ నమోదు అయిన 90 రోజులలోపు వార్తా పత్రిక ప్రకటన ద్వారా పరిచయ పత్రాన్ని జారీ చేయాలి.

డి) కంపెనీ రిజిస్ట్రార్ వద్ద పరిచయ పత్రం ప్రతిని దాఖలు పరచకుండా, ప్రకటించకూడదు.

ఇ) పరిచయ పత్రం రాతపూర్వకంగానే ఉండాలి. నోటిమాట ద్వారా ఏవిధమైన ఆహ్వానం చెల్లదు. దూరదర్శన్, సినిమా ద్వారా ప్రకటించిన పరిచయ పత్రం ఆమోదయోగ్యం కాదు.
ఎఫ్) పరిచయ పత్రంలో ఇచ్చే సమాచారం పూర్తిగా వాస్తవమై ఉండాలి. యదార్థ విషయాలను దాచిపెట్టడం చేయకూడదు.

జి) కంపెనీకి సంబంధించిన సరైన సమాచారాన్ని మాత్రమే పేర్కొనాలి. అసత్య ప్రకటనలు, పెట్టుబడిదారులను మోసగించే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వరాదు.

హెచ్) ఒకవేళ అసత్య ప్రకటనలు చేసినట్లయితే దానికి బాధ్యులైన వ్యక్తులు, సివిల్, క్రిమినల్ చర్యలకు గురవుతారు. ఐ) సివిల్ బాధ్యత ప్రకారం పరిచయ పత్రంలో ఏవైనా అసత్య ప్రకటనలు ఉంటే వాటిని నమ్మి ఎవరైనా వాటాలు, డిబెంచెర్లు కొని నష్టపోతే దానికి బాధ్యులైనవారు, నష్టపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలి.

ఐ) క్రిమినల్ బాధ్యత ప్రకారం పరిచయ పత్రంలో అసత్య ప్రకటనలుంటే దానితో సంబంధం ఉన్నవారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా 50,000/- ల వరకు జరిమానా లేదా రెండింటిని విధించవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ?
జవాబు.

  1. భారత కంపెనీల చట్టము క్రింద నమోదయిన అన్ని కంపెనీలకు అత్యావశ్యకమైన పత్రము సంస్థాపనా పత్రము. సంస్థాపనా పత్రము అనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికారానికి గల ఎల్లలను, వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది.
  2. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగమంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

ప్రశ్న 2.
నియమావళి అంటే ఏమిటి ?
జవాబు.

  1. కంపెనీ అంతర్గత పరిపాలనకు అవసరమయ్యే సూత్రాలు, నిబంధనలు తెలియచేసే పత్రమే నియమావళి. కంపెనీ దైనందిన వ్యవహారాలను నిర్వహించడానికి రూపొందించిన నియమ నిబంధనలను నియమావళి అంటారు.
  2. కంపెనీల చట్టం, 2013, సెక్షన్ 2(5) ప్రకారం “కంపెనీ యొక్క నియమావళి మరియు నియమావళిలోని మార్పులు కంపెనీల చట్టంలోని టేబుల్ – ఎ, షెడ్యూల్ – ఐ నిబంధనలకు లోబడి ఉండాలి.
  3. కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుస సంఖ్యలు వేసి, ముద్రించి తగిన స్టాంపులను అతికించాలి. సంస్థాపన పత్రంపై సంతకం చేసినవారందరూ నియమావళిపై కూడా సంతకాలు చేసి సాక్షులతో ఈ పత్రాన్ని ధృవీకరించాలి. ఈ పత్రాన్ని సంస్థాపన పత్రంతోపాటు కంపెనీ రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

ప్రశ్న 3.
కనీసపు చందా అంటే ఏమిటి ?
జవాబు.

  1. పబ్లిక్ కంపెనీ స్థాపనకు కావలసిన కనీసపు మూలధనాన్ని కనీసపు చందా అంటారు.
  2. 90% జారీ చేయబడిన మూలధనాన్ని కనీసపు చందాగా వ్యవహరిస్తారు. కనీసపు చందాను పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజుల లోపు సేకరించాలి. ఈ మొత్తాన్ని సేకరించకుండా పబ్లిక్ కంపెనీ వాటాలను కేటాయించరాదు.
  3. కనీసపు చందా మొత్తాన్ని క్రింది అంశాల ఆధారముగా నిర్ణయిస్తారు.
    • కంపెనీ స్థిరాస్థుల కొనుగోలుకు,
    • ప్రాథమిక ఖర్చులు చెల్లించడానికి
    • నిర్వహణకు అవసరమైన మూలధన సేకరణకు
    • కంపెనీ స్థాపనకు, నిర్వహణకు అవసరమయ్యే ఇతర వ్యయాలకు.

ప్రశ్న 4.
ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటే ఏమిటి ?
జవాబు.
1) ప్రత్యామ్నాయ పరిచయపత్ర నివేదిక పరిచయపత్రానికి బదులుగా జారీచేసే పత్రం. పబ్లిక్ కంపెనీ తనంత తానుగా మూలధనాన్ని సేకరించుకోగలిగితే పరిచయపత్రాన్ని జారీచేయనక్కరలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ నివేదికను తయారుచేసి, వాటాల కేటాయింపుకు కనీసం మూడు రోజులు ముందుగా కంపెనీ రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి.

2) కంపెనీల చట్టంలోని పార్టు 1, షెడ్యూల్ 3లో సూచించిన విధంగా ఈ ప్రత్యామ్నాయ పరిచయపత్రాన్ని రూపొందించాలి, పరిచయపత్రంలోని అంశాలే దాదాపు దీనిలోనూ ఉంటాయి. ఈ నివేదికపై డైరెక్టర్లందరు సంతకం చేయాలి.

ప్రశ్న 5.
వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం అంటే ఏమిటి ?
జవాబు.

  1. పబ్లిక్ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించుటకు రిజిస్ట్రార్ కార్యాలయం నుండి పొందే అనుమతి పత్రంను వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం అంటారు.
  2. ఈ పత్రం లేకుండా పబ్లిక్ కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 7 వ్యాపార ప్రారంభం

అదనపు ప్రశ్న

ప్రశ్న 1.
పరిచయ పత్రంలోని అసత్య ప్రకటనలకు విధించే క్రిమినల్ బాధ్యత.
జవాబు.
పరిచయ పత్రములో అసత్య ప్రకటనలు ఉండి, వాటిని నమ్మి ఎవరైనా వాటాలను గాని, డిబెంచర్లను గాని కొని నష్టపోయామని నిరూపించినట్లయితే, పరిచయ పత్రము జారీతో సంబంధమున్న ప్రతి వ్యక్తికి 750,000 జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా రెండింటిని విధించవచ్చును.

Leave a Comment