Here students can locate TS Inter 1st Year Chemistry Notes 1st Lesson పరమాణు నిర్మాణం to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 1st Lesson పరమాణు నిర్మాణం
→ ఉత్సర్గనాళ ప్రయోగం ద్వారా విడుదలైన కాథోడ్ కిరణాలను విద్యుత్, అయస్కాంత క్షేత్రాలలో ఉంచినపుడు వాటి ప్రవర్తన రుణ విద్యుదాత్మక కణాల ప్రవర్తనను పోలి ఉంది. వీటినే ఎలక్ట్రానులు అంటారు.
→ అన్ని పరమాణువులకు, ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు ప్రాథమిక కణాలు. * ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి 9.10939 x 10-31 kg .
→ ఎలక్ట్రాన్ ఆవేశం –1.6022 × 10-19 coulomb
→ ప్రోటాన్ ద్రవ్యరాశి 1.67262 × 10-27 kg
ప్రోటాన్ ఆవేశం +1.6022 × 10-19 coulomb
→ న్యూట్రాన్ ద్రవ్యరాశి 1.67493 × 10-27 kg న్యూట్రాన్ ఆవేశం 0
→ ఎలక్ట్రాన్ \(\frac{e}{m}\) విలువ 1.758820 × 1011 c.kg-1
→ ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి పరమాణు సంఖ్య వేరుగా ఉన్న పరమాణువులను ఐసోబార్లు అంటారు. ఉదా : 146C, 147N
→ ఒకే పరమాణు సంఖ్య కలిగి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు గల పరమాణువులను ఐసోటోపులు అంటారు.
→ రూథర్ ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులోని ధనావేశం, ద్రవ్యరాశి అంతా కొద్ది ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది. దీనినే కేంద్రకం అంటారు.
→ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు వృత్తాకార కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి.
→ న్యూట్రానుల సంఖ్య = ద్రవ్యరాశి సంఖ్య – పరమాణు సంఖ్య
→ ఆవేశిత కణాలు త్వరణం చెందుట వలన ఏకాంతర విద్యుత్, అయస్కాంతక్షేత్రాలు ఉత్పత్తి అయి ప్రసారం అవుతాయి.
→ Maxwell కాంతి తరంగాలు విద్యుత్ అయస్కాంత లక్షణాల డోలనంతో కూడి ఉంటాయని తెలిపేను.
→ కాంతి విద్యుత్ ప్రభావం ఎలక్ట్రానుల కణ స్వభావాన్ని సూచిస్తుంది.
→ కాంతికి తరంగ స్వభావం అనువర్తిస్తే- వివర్తనం, వ్యతికరణం ‘దృగ్విషయాలను వివరించవచ్చు. అంటే కాంతికి ద్వంద్వ స్వభావం ఉంటుంది.
→ పదార్థం శోషించుకొన్న శక్తిని ఉద్గారించే వికిరణాల వర్ణపటాలను ఉద్గార వర్ణపటం అంటారు.
→ హైడ్రోజన్ వర్ణపటంలో లైమన్, చామర్, పాషన్, బ్రాకెట్, ఫండ్ శ్రేణులు తరంగ సంఖ్యలను రిబ్బర్గ్ సమీకరణం ద్వారా గణించవచ్చు.
υ = 1.09677 × 107\(\left(\frac{1}{n_1^2} \frac{-1}{n_2^2}\right)\)m-1
→ బోర్ నమూనా ప్రకారం స్థిర వ్యాసార్థాలు గల వృత్తాకార కక్ష్యలలో నిర్ణీత శక్తులతో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి.
→ హైడ్రోజన్ వర్ణపట సూక్ష్మ నిర్మాణాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది.
→ కాంతి వలెనే పదార్థానికి కూడా ద్వంద్వ స్వభావం వర్తిస్తుందని డీబ్రోలి ప్రతిపాదించెను. పదార్థ కణాల ద్రవ్యవేగానికి, తరంగదైర్ఘ్యానికి సంబంధం
λ = \(\frac{h}{m v}=\frac{h}{p}\)
m = కణ ద్రవ్యరాశి v = కణవేగం P = ద్రవ్యవేగం
→ ఎలక్ట్రాన్ వివర్తన ప్రయోగం ద్వారా ఎలక్ట్రాన్ తరంగ స్వభావం నిర్ధారించబడింది. ఎలక్ట్రాన్ తరంగ స్వభావంపై ఆధారపడి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు నిర్మించబడింది.
→ ఎలక్ట్రాన్ వంటి సూక్ష్మకణం స్థానాన్ని, ద్రవ్యవేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా ఏకకాలంలో నిర్ణయించడం అసాధ్యం.
ΔX. Δp ≥ \(\frac{\mathrm{h}}{4 \pi}\)
→ హైసెన్ బర్గ్ నియమం ప్రకారం బోర్ స్థిరకక్ష్యల భావన సరైనది కాదు.
→ క్వాంటం యాంత్రికశాస్త్రం సూక్ష్మాతిసూక్ష్మమైన తరంగ, కణస్వభావాలు గల కణాల చలనాలను వివరిస్తుంది.
→ ఒక వ్యవస్థకు ప్రోడింగర్ సమీకరణం
\(\frac{\partial^2 \Psi}{\partial \mathrm{x}^2}+\frac{\partial^2 \Psi}{\partial \mathrm{y}^2}+\frac{\partial^2 \psi}{\partial \mathrm{z}^2}+\frac{8 \pi^2 \mathrm{~m}}{\mathrm{~h}^2}\)(E – V)Ψ = 0
Ψ అనునది తరంగ ప్రమేయం. ప్రతి శక్తి స్థాయికి సహచరితమైన తరంగ ప్రమేయం ఉంటుంది.
→ పరమాణువులో ఒక నిర్దిష్టమైన బిందువు వద్ద ఎలక్ట్రానును కనుక్కొనే సంభావ్యత ఆ బిందువు వద్ద |Ψ|2 కి అనులోమానుపాతంలో ఉంటుంది.
→ హైడ్రోజన్ గాని, హైడ్రోజన్ లాంటి ఒక ఎలక్ట్రాన్ గల కణాల యొక్క తరంగ ప్రమేయ వర్గాన్ని పరమాణు ఆర్బిటాల్ అంటారు.
→ క్వాంటం సంఖ్యలు పరమాణు ఆర్బిటాలుల తారతమ్యాలను తెలుపును.
→ ప్రధాన క్వాంటం సంఖ్య n కు సరళ పూర్ణాంక విలువలు ఉంటాయి. n = 1, 2, 3,…………. ఇది ఆర్బిటాల్ పరిమాణాన్ని, దాదాపుగా దాని శక్తినీ తెలుపుతుంది.
→ ప్రతీ శక్తి స్థాయికీ ఉపశక్తి స్థాయిలుంటాయి. వీటిని ఎజిమూతల్ క్వాంటం సంఖ్య l చే సూచిస్తారు. lకి n విలువలు ఉంటాయి. అవి 0 నుండి (n – 1) వరకు ఉంటాయి. అయస్కాంతక్షేత్రంలో వర్ణపటరేఖల సూక్ష్మవిభజనను జీమన్ ఫలితం అంటారు. ఈ విషయాన్ని అయస్కాంత క్వాంటం సంఖ్య వివరిస్తుంది. దీనిని ‘m’ చే సూచిస్తారు. ml కు సాధ్యపడే విలువలు 2l + 1.
m1 = -l, – (l – 1), – (l – 2),…………..0, l ………….(l – 2)(l – 1), l
→ ఈ మూడు క్వాంటం సంఖ్యలు బహు ఎలక్ట్రాన్ల పరమాణువుల వర్ణపట రేఖలను వివరించడానికి చాలవు. అందువల్ల 4వ క్వాంటం సంఖ్య అవసరం. దానినే ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటం సంఖ్య ms య అంటారు. ఎలక్ట్రాన్ ఆత్మ ప్రదక్షిణ దిశ సవ్యదిశ స్పిన్ క్వాంటం సంఖ్య S = +\(\frac{1}{2}\) అపసవ్యదిశ అయితే S = –\(\frac{1}{2}\)
→ ఏ ప్రదేశాలలోనైతే ఎలక్ట్రాన్ సంభావ్యతా సాంద్రత ప్రమేయం విలువ సున్నాకు తగ్గుతుందో వాటిని నోడల్ తలాలు లేదా నోడ్లు అంటారు.
→ ఆఫ్గ నియమం : భూస్థాయిలో ఉన్న పరమాణువులోని ఆర్బిటాల్లను వాటి శక్తులు పెరిగే క్రమంలో ఎలక్ట్రాన్లతో భర్తీ చేయాలి.
→ పౌలివర్ణన సూత్రం : ఒకే పరమాణువులో ఏ రెండు ఎలక్ట్రాన్లకైనా ఒకే సమితి గల నాలుగు క్వాంటం సంఖ్యలు ఉండకూడదు.
→ హుండ్ గరిష్ట బాహుళ్యతా నియమం : ఉపకర్పరంలో గల ప్రతి సమశక్తి (డీజనరేటి) ఆర్బిటాల్లోకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరేంతవరకు అదే ఉపకర్పరం (p, d, f) లోని ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ జతగూడటం జరగదు. అంటే ముందు ఒక్కొక్కటి చేరాలి.
→ సగం నిండిన లేదా పూర్తిగా నిండిన ఉపకర్పరాలకు అధిక స్థిరత్వానికి కారణం సౌష్ఠవంగా ఉండడంవల్ల
- సాపేక్షంగా తక్కువ కవచం ఉండడం,
- కులంబిక్ వికర్షణ శక్తి స్వల్పంగా ఉండడం
- మార్చుకొనే శక్తి అధికంగా ఉండటం.
→ s – ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది. p – ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. d- ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది.
→ సమాన శక్తిగల ఆర్బిటాళ్లను డీజనరేట్ ఆర్బిటాళ్లు అంటారు.
→ బలమైన విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖల సూక్ష్మ విభజనను స్టార్క్ ఫలితం అంటారు.
→ క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1
కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1