వానకురిస్తే Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material ఉపవాచకం 4th Lesson వానకురిస్తే Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu వానకురిస్తే Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అవినీతి మార్గంలో డబ్బు సంపాదించే వారి తీరును, అప్పులు తీర్చే విషయంలో పాపయ్య ఆలోచనా తీరును వివరించండి.
జవాబు:
అప్పు తీసుకుంటే అణాపైసల్తో సహా అప్పు తీర్చాలనేది పాపయ్య పద్ధతి. అతనే కాదు వారి వంశంలో వారంతా అటువంటివారే. ఋణం ఉంచుకో కూడదు, బంధువుల దగ్గర రుణం అస్సలు ఉంచుకోకూడదనేది పాపయ్యకు ఆయన తండ్రి చెప్పిన మాటలు. అందుకే తను బాధ్యత తీసుకోగానే 10 ఎకరాలను అమ్మి, అప్పులను వడ్డీతో సహా తీర్చేశాడు.

అంత కచ్చితంగా బాకీలు తీర్చేవారెవ్వరూ ఈ రోజులలో లేరని పాపయ్య అభిప్రాయం. అప్పులు చేసేస్తారు. ఆస్తులు ఎవరి పేరో పెట్టేస్తారు. సొమ్ము వెనకేసుకుంటారు. దొంగ బాండుల్ని పుట్టిస్తారు. I.P పెట్టి సంపాదించుకొనే వాళ్ళు నీతికీ, అభిమానానికీ కట్టుబడరని పాపయ్య అభిప్రాయం.

పాపయ్య ఆలోచన ప్రకారం అటువంటి డబ్బు సంపాదించడం వలన ప్రయోజనం లేదు. అటువంటి డబ్బు లేకపోయినా నష్టం లేదు. ఆస్తి తగ్గిపోయినా ఫరవాలేదు. తమ కుటుంబానికి పరువుంది. ప్రతిష్ఠ ఉంది. పరువు ప్రతిష్ఠలు లేకుండా ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదనేది పాపయ్య ఉద్దేశం.

అంగడి రామిరెడ్డి దగ్గర కావల్సినంత డబ్బుంది ఆ డబ్బు కోసం దొంగ సారా అమ్మాడు. దొంగ సల్ఫేటమ్మాడు. నానా దొంగ పనులూ చేశాడు. దొంగ వడ్డీ లెక్కలు కట్టి వసూలు చేసి డబ్బు సంపాదించాడు. ఎన్నో కొంపలు కూల్చి డబ్బు పోగు చేశాడు.

ఈ రోజులలో ఎంత నీతిని విడిస్తే అంత డబ్బు సంపాదించవచ్చును. ఎంత సిగ్గును విడిచిపెడితే అంత ధనం పోగు చేసుకోవచ్చు. ఇతరులను ఎంత మోసం చేయగలిగితే అంత ఐశ్వర్యవంతుడు కావచ్చు. కాని పాపయ్యకు అలాంటి సంపాదనంటే అసహ్యం. అలాగ సంపాదించేవారంటే పరమ అసహ్యం.

పాపయ్య దృష్టిలో డబ్బు కోసం తప్పుడు పనులు చేయకూడదు. మోసం చేయకూడదు. దొంగ లెక్కలు రాయకూడదు. అధిక వడ్డీలు వసూలు
చేయకూడదు.

కష్టపడి డబ్బు సంపాదించాలి. నిబద్ధతతో బతకాలి. నిజాయితీగా జీవించాలి. ప్రకృతిని నమ్ముకోవాలి. తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించాలి. అప్పు చేసినా, వడ్డీతో సహా తీర్చేయాలి. ఎవరి ఋణాన్ని, ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఆస్తి లేకున్నా పరవాలేదు కాని, అప్పిచ్చిన వారిని మోసం చేయకూడదనేది పాపయ్య ఆలోచనా తీరు.

ప్రశ్న 2.
‘వాన కురిస్తే’ కథ ఆధారంగా రైతు జీవితాన్ని వివరించండి.
జవాబు:
రైతు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాడు. ఇప్పుడు కాకుంటే రేపైనా ప్రకృతి కరుణిస్తుందని భావిస్తాడు. అదే ఆశతో జీవిస్తాడు.

ఎన్ని కష్టాలనైన భరిస్తాడు కానీ, వ్యవసాయాన్ని మాత్రం విడిచిపెట్టడు. రైతు ఎవ్వరినీ ఎప్పుడూ మోసం చేయడు. విధి లేక అప్పులు చేసినా వడ్డీతో సహా తీర్చేస్తాడు. తను మోసపోతాడేమో కానీ, మోసం చేయడు. అవసరమైతే ఆస్తులు అమ్మేసి అయినా అప్పులు పూర్తిగా తీర్చేస్తాడు.

వివాదాలను ఇష్టపడడు. రోజంతా వ్యవసాయం గురించే ఆలోచిస్తాడు. తన పనేదో తాను చేసుకొంటాడు. వీలైతే ఉపకారం చేస్తాడే తప్ప ఇతరుల పనులలో కల్పించుకొని వాటిని పాడుచేయడు. ఎవరి చేతా మాటపడడు. ఎవరైనా హేళన చేస్తే సహించడు.

రైతు పదిమందికీ పెడతాడు తప్ప ఎవరి దగ్గరా ఏదీ ఆశించడు. ఆత్మగౌరవం కాపాడుకొంటాడు. ఆత్మాభిమానంతో జీవిస్తాడు.

వర్షం కోసం ఎదురుచూస్తాడు. తన సుఖం కోరుకోడు. ఎంత డబ్బున్నా వ్యవసాయానికే ఖర్చు పెడతాడు. అధిక లాభాలు ఆశించడు. గౌరవంగా జీవించగలిగితే చాలనుకొంటాడు. పెద్ద పెద్ద ఆశలు ఉండవు. ఎవ్వరితోనూ పోటీ పడడు.

ఏ రైతైనా తను మాత్రమే బాగుపడాలనుకోడు. అందరూ బాగుండాలని కోరుకొంటాడు. వ్యవసాయంలో ఒకటి రెండేళ్లు నష్టాలు వచ్చినా భయపడడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా బాగా పండుతుందనే ఆశతో జీవిస్తాడు. ఎప్పటికైనా వ్యవసాయం కలిసి వస్తుందని ఆశిస్తాడు. పరిస్థితులెంత దారుణంగా ఉన్నా నిరాశపడడు. అధైర్యపడడు, బెదరడు, ఆ యేటికాఏడు ఉత్సాహంగా పనిచేస్తాడు.

రైతు పరిస్థితులను తనకనుకూలంగా ఎలాగ మలచుకోవాలా ? అనే ఆలోచిస్తాడు. ఖర్చులెలా తగ్గించుకోవాలో ఆలోచిస్తాడు. ఇంకా కష్టపడి పని చేయాలి అనుకొంటాడు. చేస్తాడు.

వానకురిస్తే Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
ఈనాడు చాలామంది వ్యవసాయాన్ని ఎందుకు విడిచి పెడుతున్నారో వ్రాయండి.
జవాబు:
ఈ రోజులలో వ్యవసాయం అనేది చాలా కష్ట నష్టాలతో కూడినదిగా తయారైంది.

ఖర్చులు పెరిగిపోయాయి. విత్తనాలు నాటడం నుండి పంట కోసే వరకూ అన్నీ సమస్యలే, కూలీలు దొరకడం లేదు. దొరికినా కూలీ రేట్లు బాగా పెరిగిపోయాయి. విత్తనాలు కూడా రేటు పెరిగిపోయాయి. సరైన విత్తనాలు కాకపోతే మొలకలు రావు. ఎరువులు, పురుగుమందులు కూడా కొంతమంది కల్తీవి అమ్మేస్తున్నారు.

ప్రకృతి కూడా వ్యతిరేకమే. సకాలంలో వర్షాలు పడితే పరవాలేదు. అనావృష్టి వల్ల మొలకలు మాడిపోతాయి. అతివృష్టి వలన వరిమళ్లు కుళ్లిపోతాయి. మళ్లీ నారు నాటాలంటే అప్పులు చేయక తప్పదు. వడ్డీలు కట్టలేక బాధపడాలి. అన్ని అడ్డంకులూ దాటి పంట చేతికొచ్చే సమయం సమీపించినా, సరిగ్గా అప్పుడు వర్షాలు, గాలివానలు మొదలైనవి వస్తే ఇంతే సంగతులు. పంట చేజారిపోతుంది. దుఃఖం మిగులుతుంది.

గ్యారంటీ లేని వ్యవసాయం చేసి, చేతులు కాల్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో చాలామంది వ్యవసాయానికి దూరమౌతున్నారు.

ఎవరి వస్తువులకీ, సేవలకీ వారు ధర నిర్ణయించుకోవచ్చును కానీ, రైతుకి మాత్రం తను పండించిన వాటికి తాను ధర నిర్ణయించుకొనే స్వేచ్ఛ లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలి. ధాన్యం తడిసినా, ముక్కినా కొనే నాధుడే ఉండడు. ధర పాతాళానికి పడిపోతుంది.

రైతు దేశానికి వెన్నెముక, రైతు అన్నదాతా లాంటి నినాదాలకు లోటు లేదు. కానీ, ఆదుకొనే ఆపద్బాంధవుడే కనుచూపు మేరలో కనబడడు. ప్రభుత్వం ఆదుకొంటే మళ్లీ మన భూములన్నీ వ్యవసాయంతో కలకల లాడతాయి. రైతుల ఇంట సిరుల పంట పండుతుంది.

ప్రశ్న 4.
పాపయ్య వర్షం గురించి అంత ఎక్కువగా ఎదురుచూశాడో వివరించండి.
జవాబు:
పాపయ్యది రాయలసీమ. అక్కడ ఎక్కువగా వ్యవసాయం అంతా వర్షం మీదే ఆధారపడుతుంది. పాపయ్యది కూడా అదే పరిస్థితి.

అతని పొలంలో బావిలో నీరు లేదు. ఎన్ని బావులు తవ్వించినా ప్రయోజనం లేదు. అతని దగ్గర అంత డబ్బూ లేదు. పంట పండించడానికి సరిపడ నీటి సదుపాయం లేదు. కాలువలు లేవు. చెరువులు లేవు. వర్షం తప్ప దిక్కులేదు.

300 అడుగులు బోరు వేస్తే నీరు పడవచ్చు. కానీ, అది ఖర్చుతో కూడు కొన్న పని. ఒక సామాన్య రైతుకు అంత ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు.

పట్టాభి చెప్పినట్లుగా చెక్క భజనలు చేస్తారు. తప్పించి ప్రభుత్వం పట్టించుకోదు. కనీసం తాలూకాకు పది రిగ్గులు దించినా వ్యవసాయం చేయడానికి అనువుగా నీరు దొరుకుతుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయించదు. భూమిలోని నీరు పైకి తేవడానికి చవకగా బావులు తవ్వించవచ్చు. కానీ, ప్రభుత్వ పెద్దలకు అవసరం లేదు.

చెరువులైనా బాగు చేయించరు. 5 లక్షలు పెట్టి, చెరువు కట్టించినా, కనీసం బట్టలుతుక్కొందుకు కూడా దానిలో నీరు నిలబడలేదు. మట్టి కొట్టుకొని పోతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఆ చెరువే ఉంటే పాపయ్య లాంటి రైతులు మబ్బుల కోసం ఆకాశంలోకి చూడక్కర్లేదు కదా !

గండికోట ప్రాజెక్టు కడితే వ్యవసాయానికి నీటికి లోటు లేకపోను కదా! పోనీ తుంగభద్ర ఎగువ కాలువ వచ్చినా పాపయ్య వంటి రైతులకు బాధలుండక పోను.

ఇవన్నీ ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోవాలి. స్థానిక నాయకులు, అధికారులు పరిస్థితులను వివరించాలి. ఒత్తిడి తెచ్చి, వ్యవసాయానికి నీటి సదుపాయం కల్పించుకోవాలి. కానీ, ఎవ్వరూ పట్టించుకోరు. ఎవ్వరికీ అక్కర్లేదు.

అందరి నిర్లక్ష్యం కారణంగా పాపయ్య లాంటి ఎంతోమంది రైతులు ఆకాశంలో మబ్బుల వైపు చూస్తున్నారు. నిరాశ చెందుతున్నారు. అప్పుల విషవలయంలో కూరుకుపోతున్నారు. చివరకు ప్రాణాలనే కోల్పోతున్నారు.

వానకురిస్తే Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : కేతు విశ్వనాథ రెడ్డిగారు.
జననం : వై.యస్.ఆర్. కడపజిల్లా, కమలాపురం తాలూకా రంగశాయిపురంలో 10.7.1939న జన్మించారు.
చదువు : రంగశాయిపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, కడప, తిరుపతులలో పూర్తయింది. వీరు పరిశోధనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ‘కడప ఊర్ల పేర్లు’ అనే అంశంపై డాక్టరేట్ పొందారు.
ఉద్యోగం : పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరా విశ్వ విద్యాలయం, హైదరాబాద్ లోని డా॥ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలోనూ ఆచార్యునిగా పనిచేశారు. విద్యాశాఖలో డైరెక్టరుగా ఉద్యోగ విరమణ పొందారు.

కొడవటిగంటి కుటుంబరావు గారి రచనా సంపుటాలకు, విశాలాంధ్ర వారి – తెలుగు చరిత్ర సంస్కృతి, రాయలసీమ రాగాలు అనే సంకల నాలకు సంపాదకులుగా పనిచేశారు.

రచనలు : అనాది వాళ్లు (1963-తొలికథ), జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి, కథలు – 3 సంపుటాలు, సుమారు 100కు పైగా కథలను రచించారు. విశ్వరూపం, దప్పిక, నమ్ముకున్న నేల, కూలిన బురుజు వంటి గొప్ప కథలు రచించారు. వేర్లు, బోధి (నవలలు), దృష్టి (వ్యాస సంపుటం), ‘దీపదారులు’ (ప్రసిద్ధ కథా రచయితల గురించి)

ప్రత్యేకతలు : పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో చాలాసార్లు సంపాదకత్వం వహించారు. డిగ్రీ చదివేటప్పుడే కథానికా రచన ప్రారంభించారు. నల్లపాటి రామప్ప నాయుడు అనే మిత్రుడి సహవాసంతో మంచి రచనలు చేశారు. వామపక్ష సాహిత్యానికి దగ్గరయ్యారు. సామ్యవాద భావజాలాన్ని అవగాహన చేసుకొన్నారు. రాయలసీమ గ్రామీణ సమస్యలే మూలాలుగా అనేక కథానికలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు రాశారు. 1960 నుండి 30 సం||ల మానవ సమాజ మార్పులే కథానికల వస్తువుగా స్వీకరించారు.

“ఒక మధ్యతరగతి మేధావి, ఆధునిక రచయిత. తన సమాజానికి చేయగలిగినంతా విశ్వనాథరెడ్డిగారు చేశారు’ అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డిగారు ప్రశంసించారు. విశ్వనాథ రెడ్డిగారు కథలు ఆంగ్లం, రష్యన్, అనేక భారతీయ భాషలలో అనువదించబడ్డాయి.

అవార్డులు : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో బాటు అనేక అవార్డులు పొందారు. మే 22, 2023న కీర్తిశేషులయ్యారు.

కఠిన పదాలకు అర్థాలు

108వ పేజి :

సచిత్రవార పత్రిక = బొమ్మలతో కూడిన వారపత్రిక
ఇచ్ఛ = ఇష్టం
అగచాట్లు = బాధలు, కష్టాలు
దుఃఖం = బాధ
దోబూచులాడటం = కనబడడం, కనబడకుండా దాగడం అనే ఆట ఆడడం
అప్పు = ఋణం
ఆటుపోటులు = లాభనష్టాలు, కష్టసుఖాలు
పట్టుదల = సాధించాలనే ఆలోచన
అదను = తగిన సమయం
పులక = నారు వేసిన తర్వాత (మూడో రోజు) పెట్టే తడి
సేద్యం = వ్యవసాయం
పారకం = ప్రవాహం
మట్లు = మెట్లు
ఏడు = సంవత్సరం
దండిగా = ఎక్కువగా
ధర = ఖరీదు
బావి = రాతి కట్టడంతో ఏర్పరచిన పెద్ద నుయ్యి
హీనం = తక్కువ
బాకీ = అప్పు
వెలి = మెట్ట (బయలు)

వానకురిస్తే Questions and Answers Summary Inter 1st Year Telugu

110వ పేజి:

ముందుకు రావడం = బాగుపడడం
మర్యాద = గౌరవం
ముంచడం = నష్టపరచడం
మాదిరి = ఉదాహరణ
లెక్క = లక్ష్యం
దోవ = త్రోవ, దారి
బ్రహ్మాండమయిన = గొప్పదయిన
లాయికీ = యోగ్యమైనది
ముక్తసరిగా = పొడిపొడిగా, బాగా తక్కువగా మాట్లాడడం
ధోరణి = పద్ధతి
దండగ = వృథా
చీనీ చెట్లు = కమలా చెట్లు వంటివి (నారింజ రకం)
పీడ = బాధ

111వ పేజి:

స్వామివారు = పంతులుగారు
లగ్నం = ముహూర్తం
బొంగు = లోపల గట్టిగా లేని కర్ర (వెదురు వంటిది)
వాక్కు = మాట
చట్టు = భూమి
వంక = వైపు
కమామిషి = వ్యవహారం
నిక్కచ్చి = కచ్చితం
I.P. = Insolvency Petition – ఆస్తి కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని, అప్పులు తీర్చ లేమని కోర్టులో వేసే దివాళా పిటిషన్

112వ పేజి :

గడ్డి తినడం = తప్పుడు పనులు చేయడం
ముచ్చు = దొంగ
స్మృతి = జ్ఞప్తి
అసహ్యం = సహింపలేనిది
పగవాడు = విరోధి
దైన్యం = దీనత్వం
కార్తె = కృత్తికా నక్షత్రం మొదలు ఒక్కొక్క నక్షత్రంలో సూర్యుడుండే కాలం, సుమారు 132 రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు కార్తెలు ఉంటాయి.
పంచాంగం = 5 అంగములు (తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం)తో మంచి చెడ్డలు వివరించే పుస్తకం
వల్లె = (వల్లెవాటు సరియైనది)
వల్లెవాటు = కండువా (లేక) అంగవస్త్రం

113వ పేజి:

తల + ఎత్తుకోవడం = దర్జాగా ఉండడం
అవ్యక్తం = వ్యక్తం చేయలేని, చెప్పలేని
నిడు + ఊర్పు = నిట్టూరు = బలంగా గాలి పీల్చి వదలడం
మోడం = ముసురు, మబ్బు
దొబ్బుతెగులు = లోటు లేని పరిస్థితి
తత్తా = వేడి

114వ పేజి :

దేశం = ప్రాంతం
ఇరు+నూరు = ఇన్నూరు = రెండు వందలు
మూడు + నూరు = మున్నూరు = మూడు వందలు
అగ్గువ = చౌక
కేకలు = అరుపులు
లౌక్యం = లోకజ్ఞానం
గుడ్డొచ్చి పిల్లనెక్కిరించడం = = గుడ్డు కంటె పిల్ల చిన్నది, అయినా గుడ్డుకు అవయవాలు లేవు. పిల్లకు అవయవాలు, తెలివి ఉంటాయి కదా ! తెలివైన వారిని తెలివిలేని వారు వేళాకోళం చేయడం అని దీని భావం
విసర్జనం = విడిచిపెట్టడం
వంక = నీటి వాగు
గుమ్మళ్లు = గుమ్మడి కాయలు
గవాసులు = కిటికీలు
దంతె = వాసం, దూలం
పదిలం = జాగ్రత్త
జాగరం = రాత్రంతా నిద్రపోకుండా ఉండడం

వానకురిస్తే Questions and Answers Summary Inter 1st Year Telugu

116వ పేజి :

ఉబ్బరం = కడుపు నిండుగా ఉన్నట్లు ఉండడం
తోటకాడ = తోట దగ్గర
అంగడి = దుకాణం
నాయన = నాన్న

117వ పేజి :

మద్దెన = మధ్యన
దివసం = దినకార్యం (రోజు)
ఆత్రగాడు = కంగారు మనిషి