మహామనిషి రతన్ టాటా Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material ఉపవాచకం 5th Lesson మహామనిషి రతన్ టాటా Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu మహామనిషి రతన్ టాటా Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రతన్ టాటా భారతీయులకు చేసిన సేవలను వివరించండి.
జవాబు:
వ్యాపార సామ్రాజ్యంలో చక్రవర్తిగా ఎదిగిన రతన్జటా గొప్ప మానవతావాది. టాటాగ్రూప్ ఆదాయంలో 66% డబ్బును ప్రజా సంక్షేమం మరియు సమాజ పురోభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం మొదలైన అంశాలలో వందలాది సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా టాటా గ్రూప్స్ నిర్వహిస్తున్నాయి.

కరోనా వైరస్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. అప్పుడు రతన్ టాటా 1500 కోట్ల రూపాయిలను దానం చేశారు. ఎన్నో జీవితాలను నిలబెట్టారు.

రతన్ టాటా ఔదార్యం రంతిదేవుడు, శిబి చక్రవర్తి వంటి వారితో పోల్చతగినది.

ఒక సందర్భంలో ఆయన ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఒక కుటుంబాన్ని చూసి చలించిపోయారు. అటువంటి ప్రయాణాలు ప్రమాద కరమని గుర్తించారు. ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం ఔతుందని ఆందోళన చెందారు. వెంటనే పేదలకారైన ‘నానో” తయారీకి ఆయన మనసులో బీజం పడింది. అందరికీ అందుబాటులో ఉండే ధరను నిర్ణయించా లనుకొన్నారు.

అందుకే లక్ష రూపాయిలకే నానో కారు అందించారు. నానో తయారీ, ఆటోమొబైల్ రంగంలో వారు చేసిన కృషి ఫలితంగా “ఇండియన్ హెన్రీ ఫోర్డ్”గా విఖ్యాతి గడించారు. కార్నెల్ విశ్వ విద్యాలయంలో చదువుకొనే భారతీయ విద్యార్థుల సంక్షేమం కోసం 2.8 కోట్ల డాలర్లతో ఉపకారవేతన నిధిని ఏర్పరిచారు. రతన్ టాటా తనకున్న 3,800 కోట్ల రూపాయిల ఆస్తిలో ఎక్కువ భాగాన్ని రతన్జటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్లాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలూ ఆ నిధులను సేవా కార్యక్రమాలకే వినియోగించాలి.

ఈ విధంగా భారతదేశాన్ని తన కుటుంబంగా భావించిన గొప్ప వ్యక్తి రతన్ టాటా. భారతీయులందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించిన మహా మనీషి రతన్ టాటా. ఆయన భారతదేశానికి చేసిన సేవలు కొన్ని తరాలపాటు భారతీయులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రశ్న 2.
రతన్ టాటా వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు ?
జవాబు:
నావల్టాటా, సూనీ దంపతులకు రతన్ టాటా 28.12.1937న బొంబాయిలో
జన్మించారు. 1962లో చదువు ముగించుకొని భారతదేశానికి వచ్చారు. వ్యాపారంలో మెళకువలను తెలుసుకోవడానికి జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా చేరారు. కష్టపడి పని చేశారు.

1991లో టాటా సన్స్ పగ్గాలను అందుకొన్నారు. కానీ, కొంతమంది మేనేజింగ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు రతన్లాటాను వారసుడిగా గుర్తించలేదు. సహకరించేవారు కాదు. రతన్జటా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే నాటికి 10,000 కోట్ల టర్నోవర్ ఉండేది. 2012లో ఆయన పదవీ విరమణ చేసే నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరిందంటే ఆయన వ్యాపార దక్షత ఎటువంటిదో మనకు అర్థమౌతుంది.

బ్రిటిష్ స్టీల్ కంపెనీ, డచ్ స్టీల్ కంపెనీ ‘హూగోవెన్స్’ కలిసి 1999లో ‘కోరస్’ సంస్థగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దానికి 42,000 మంది ఉద్యోగులున్నారు. కొన్ని కారణాల వలన ‘కోరస్’ అమ్మకానికి వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా దానిని కొనుగోలు చేశారు. తన టాటాస్టీల్స్లో కలిపేశారు. ఆయన పదవీ విరమణ చేసేనాటికి కోరస్, టాటాస్టీల్స్ కలిసి 50 దేశాలలో 80 వేలమందికి ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. 32 బిలియన్ డాలర్ల టర్నోవర్తో ప్రపంచంలోని ప్రధాన ఉక్కు సంస్థలలో 5వ స్థానంలో నిలిచాయి.

1898లో టాటా ఇండికా పేరుతో కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించారు. అనుకున్నంత అభివృద్ధి కనబడక ఆ కంపెనీని ఫోర్డ్కు అమ్మాలనుకొన్నారు. అమెరికాలో కల్సినపుడు ఆయన చులకనగా మాట్లాడాడు, దానితో టాటా అమ్మకం విరమించారు. పట్టుదలతో ఇండికాను లాభాల బాటలో నడిపారు.

పది సంవత్సరాలు తర్వాత అమెరికాలో ఆర్థికమాంద్యం ఏర్పడింది. ఫోర్డ్ దివాళా తీసింది. తన దిగ్గజ బ్రాండైన జాగ్వార్, ల్యాండ్ రోవర్లను అమ్మకానికి పెట్టింది. రతన్లాటా 2.3 బిలియన్ డాలర్లకు ఆ కంపెనీలను సొంతం చేసుకొన్నారు.

ఈ విధంగా వ్యాపార రంగంలో తనకు ఎదురులేదని నిరూపించారు.

మహామనిషి రతన్ టాటా Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
రతన్ టాటా మానసికంగా బలవంతుడని ఎలా చెప్పగలరు ?
జవాబు:
కార్ల తయారీ రంగంలో ‘టాటా ఇండికా’ కార్ల తయారీ సంస్థను స్థాపించారు రతన్ టాటా. అది విజయవంతం కాలేదు. దానిని ‘ఫోర్డ్’కు అమ్మాలను కొంటే, ఆయన అవమానకరంగా మాట్లాడాడు.

మానసిక బలవంతుడైన టాటాలో పట్టుదల పెరిగింది. టాటా ఇండికాను లాభాల బాటలో నడిపారు. జాగ్వార్, ల్యాండ్ రోవర్లను ఫోర్డ్ నుండి కొన్నారు. అది ఆయన దక్షతకు, మానసిక బలానికి తార్కాణం.

26.11.2008న కొంతమంది ఉగ్రవాదులు బొంబాయిలో చాలా చోట్ల దాడులు జరిపారు. రతస్టాటాకు చెందిన తాజ్ హెూటల్పై కూడా వాళ్లు. పంజా విసిరారు. తాజ్ హెూటల్లో ఉన్న అతిథులు, ఉద్యోగులను బంధించారు. విషయం తెలుసుకొన్న రతన్ టాటా హెూటల్కు ఫోన్ చేశారు. ఎవరూ ఫోన్ ఎత్తలేదు. ఇక టాటాయే బయల్దేరి హెూటల్కు వెళ్లారు. లోపల భయంకరమైన వాతావరణం ఉంది.

రతన్ టాటా మానసిక ధైర్యం ముందు ఆ పరిస్థితి వెల వెల బోయింది.

ఆయనను భద్రతా సిబ్దంది వారించారు. 70 సంవత్సరాల వయస్సులో భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లారు. హెూటల్ దగ్గర భద్రతా వలయంలోకి వెళ్లారు. దేశ ద్రోహం తలపెట్టిన తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. హెూటల్లోని సామాను పూర్తిగా ధ్వంసం అయినా పరవాలేదని భరోసా ఇచ్చారు.

ఏ క్షణానికి ఏమౌతుందో తెలీదు. ఉగ్రవాదులు ఎవరిపై విరుచుకు పడతారో తెలీదు. వాళ్లు సాయుధులు. రతన్ టాటా వయస్సు 70 సంవత్సరాలు. కానీ, ఆయన మానసిక ధైర్యం ముందు ఇవన్నీ చిన్నబోయాయి.

1991లో జె.ఆర్.డి. టాటా నుండి టాటాసన్స్ పగ్గాలను రతన్ టా అందుకొన్నారు. సుదీర్ఘ నాయకత్వం, ఘనచరిత్ర కలిగిన జె.ఆర్.డి. టాటా తర్వాత వ్యాపారంలో వారసుడిగా వచ్చిన రతన్ టాటా మీద కొంతమంది ఉద్యోగులకు నమ్మకం లేదు. కొంతమంది మేనేజింగ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు రతన్ టాటాను వారసుడిగా గుర్తించలేదు. అయినా ఆయన ఆగ్రహించలేదు. చింతించలేదు. మనోధైర్యం కోల్పోలేదు. వారి వైపు నుండి ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. అయినా టాటా చలించలేదు. ధైర్యం కోల్పోలేదు. చాలా ఓర్పుతో వ్యవహరించారు. నేర్పుతో అటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మలచుకొన్నారు. మేరునగధీరత్వం కలిగిన మానసిక స్థైర్యం రతన్ టాటాకు పెట్టని కోట.

ప్రశ్న 4.
రతన్ టాటా ఉదార స్వభావాన్ని తెలియజేయండి.
జవాబు:
నావ టాటా, సూనీ దంపతులకు 28.12.1937న రతన్ టాటా బొంబాయిలో జన్మించారు.

రతన్ టాటా ఉదారతకు మారుపేరు. ఆయన కార్నెల్ యూనివర్శిటీలో అమెరికాలో చదువుకొన్నారు. తరువాత కాలంలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదువుకొనే భారతీయ విద్యార్థుల సంక్షేమం కోసం 2.8 కోట్ల డాలర్లతో ఉపకారవేతన నిధిని ఏర్పాటు చేశారు.

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కోర్సును పూర్తి చేశారు. 2010వ సంవత్సరంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు 5 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించారు.

రతన్ టాటా గొప్ప మానవతా వాది. టాటా గ్రూప్ ఆదాయంలో 66% డబ్బును ప్రజా సంక్షేమం, సమాజ పురోభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం మొదలైన అంశాలలో వందలాది సేవాకార్య క్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు 1500కోట్ల రూపాయిలు దానం చేశారు. ఎన్నో జీవితాలను నిలబెట్టారు.

వీధి కుక్కలంటే చాలామందికి చులకన. ఒకసారి చలికి వణికిపోతున్న వీధి కుక్కను చూశారు. వెంటనే కారు ఆపారు. ఆ కుక్కను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. తనతోపాటు తీసుకెళ్లి పెంచుకొన్నారు. తాజ్ హెూటల్లోకి వీధి కుక్కలు స్వేచ్ఛగా ప్రవేశించే వీలు కల్పించిన ఉదార హృదయుడు రతన్ టాటా. తన పెంపుడు కుక్కకు అనారోగ్యం కారణంగా బ్రిటన్ యువరాజు చార్లెస్ ఇస్తానన్న జీవిత సాఫల్య పురస్కారానికి కూడా టాటా వెళ్లలేదు. తన పెంపుడు కుక్కల కోసం 12 లక్షల రూపాయలను తన ఆస్తిలో కేటాయించిన జాలి గుండె రతన్ టాటాది.

26.11.2008న తాజ్ హెూటల్పై బొంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడిలో 31 మంది హెూటల్ సిబ్బందితో పాటు అతిథులు కూడా బలయ్యారు. ఇది రతన్ టాటాను కలచివేసింది. మరణించిన వారి కుటుంబ సభ్యులను రతన్ టాటా ఆదుకొన్నారు. మరణించిన వారి జీవితకాలం ఎంత సంపాదించగలరో దానిని లెక్కగట్టి ఆ డబ్బును ఆ కుటుంబాలకు అందించారు. వారి పిల్లలు దేశ విదేశాలలో ఎక్కడ చదువుకున్నా అయ్యే ఖర్చును భరించారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చారు. వైద్య ఖర్చులు భరించారు.

తన వీలునామాలో కూడా దాతృత్వానికి పెద్ద పీట వేశారు. రతన్ టాటా తనకున్న 3,800 కోట్ల ఆస్తిలో ఎక్కువ భాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకే కేటాయించారు.

పురాణాలలో శిబి, దధీచి వంటి త్యాగధనులతో పోల్చదగిన ఉదార హృదయుడు రతన్ టాటాజీ.

మహామనిషి రతన్ టాటా Questions and Answers Summary Inter 1st Year Telugu

మహామనిషి రతన్ టాటా Summary in Telugu

కఠిన పదాలకు అర్థాలు

119వ పేజి :

అనుయాయులు = అనుసరించేవారు
ఆరాధకులు = పూజించేవారు
యుగద్రష్ట = యుగాన్ని దర్శించినవాడు
పితామహుడు = తాత (తండ్రి తండ్రి)
దార్శనికత = ముందుచూపు
ఆర్జన = సంపాదన
కృషి = ప్రయత్నం
సంయమనం = నిగ్రహం
పయనం = ప్రయాణం

120వ పేజి :

వేత్త = బాగా తెలిసినవాడు
దివంగతులవ్వడం = మరణించడం
కొనియాడడం = పొగడడం
చిరు = చిన్న
భూరి = చాలా ఎక్కువ (అధిక మొత్తం)
కీర్తి = యశస్సు
ఇనుమడించడం = ఎక్కువ అవ్వడం
నడత = ప్రవర్తన
మెళకువ = సులువు

121వ పేజి :

దక్షత = సామర్థ్యం

మహామనిషి రతన్ టాటా Questions and Answers Summary Inter 1st Year Telugu

122వ పేజి :

ఆసక్తి = ఇష్టం, శ్రద్ధ

123వ పేజి:

కలచి వేయడం = కలవర పరచడం
దుర్దినం = చెడ్డరోజు
ముష్కరులు = దుర్మార్గులు