TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి

Telangana SCERT TS 6th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళిTextbook Questions and Answers.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson ఎలుకమ్మ పెళ్ళి

కింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఎలుకమ్మ పెళ్ళి పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు.
పరిచయం : సంతానం లేని బ్రహ్మయ్య తమకు దొరికిన ఎలుక పిల్లను భార్య కోరిక మేరకు తన మంత్రశక్తితో చిన్న పాపగా మార్చి పెంచి పెద్ద చేసి పెళ్ళి జేయడమే ఈ పాఠ్యభాగంలోని ప్రధానాంశం.

మూషిక బాల సహజ లక్షణం : ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టి బ్రహ్మయ్య దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పెరిగి పెద్ద అయిన ఆ పాప ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూండడం, ప్రతి వస్తువునూ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, రంధ్రాలున్న చోట ఆడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయపడడం వంటి ఎలుక లక్షణాలతో ప్రవర్తించేది.

మూషికబాల వినాయక భక్తి : మూషిక బాల ఒకసారి హఠాత్తుగా అమ్మానాన్నలకు చెప్పకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలలో వినాయకుని విగ్రహానికి పూజలు చేసింది. నవరాత్రులు పూర్తయ్యాక కూడా ఆమె పొద్దస్తమానం శివాలయంలోని వినాయక విగ్రహం దగ్గరే ఆనందంగా గడిపేది.

మూషిక బాల చదువు సంధ్యలు : మూషిక బాలను బడిలో చేర్పించినా కూడా గుడికి వెళ్ళటం మాత్రం మానేది కాదు. బాగా అల్లరి చేస్తూ పుస్తకాలు అన్నీ కొరికేది. ఒకసారి వాళ్ళ టీచరు తోటి బాలలతో విహార యాత్రకు తీసుకెళ్ళినప్పుడు ఒక బాలిక వలలో చిక్కుకుపోతే తన పదునైన పళ్ళతో వలను కొరికి ఆమెను రక్షించింది.

మూషిక బాల పెళ్ళి : బ్రహ్మయ్య తన మంత్రశక్తితో సూర్యుణ్ణి వీరుడిగా తెచ్చి పెళ్ళి చేసుకోమని కూతురుని అడిగితే మిరుమిట్లు గొలిపే ఆ వెలుగులను భరించలేనన్నది. నల్లగా ఉన్నాడని మేఘుణ్ణి, నిలకడ లేని వాడని వాయుదేవుణ్ణి, మృదుత్వం లేకుండా బండబారినట్లున్నాడని మేరు పర్వతుణ్ణి ఆమె పెళ్ళాడటానికి ఒప్పుకోలేదు. చివరికి మూషిక రాజును చూసి వలచి వరించింది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి

ప్రశ్న 2.
మూషిక బాల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
పరిచయం : తుంగభద్రా నది ఒడ్డున ఉన్న గ్రామంలో నివసిస్తున్న సంతానం లేని బ్రహ్మయ్య దంపతులకు తమ కుటీరం ముందు ఒక ఎలుక పిల్ల కనిపించింది. దానికి సపర్యలు చేసిన బ్రహ్మయ్య భార్య కోరిక మేరకు తన మంత్రశక్తితో ఆ ఎలుకపిల్లను చిన్న పాపగా మార్చి మూషిక బాల అని పేరు పెట్టాడు.

ప్రవర్తన : అల్లారుముద్దుగా పెరిగి పెద్దదైన మూషిక బాల ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండేది కాదు. కనిపించిన వస్తువులన్నింటినీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటనే ఆడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయంతో ఉరకడం, మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి.

వినాయక భక్తి : మూషిక బాల ఒకసారి తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ నవరాత్రి మండపంలోని వినాయకుని విగ్రహం ముందు పూజారితో పాటు పూజలు చేసింది.

చదువు సంధ్యలు : మార్పు వస్తుందని భావించి బళ్ళో వేసినా ఆమె గుడికి వెళ్ళడం మాత్రం మానలేదు.

వివాహం : మూషిక బాలకు గొప్ప వరుణ్ణి తేవాలని తండ్రి ప్రయత్నించినా ఆమె సూర్యుణ్ణి, మేఘుణ్ణి, వాయుదేవుణ్ణి, మేరు పర్వతుణ్ణి తిరస్కరించి మూషికరాజును పెళ్ళి చేసుకుంది.

ప్రశ్న 3.
ఎలుకమ్మ ఎవరిని ఎందుకు వరించింది ?
జవాబు.
పరిచయం : మూషిక బాలకు పెళ్ళీడు రాగానే పెళ్ళి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. సూర్యుణ్ణి పెళ్ళి కొడుకుగా తీసుకు వచ్చాడు తండ్రి. కానీ మూషిక బాల తండ్రి తీసుకు వచ్చిన సూర్యుడు, మేఘుడు, వాయుదేవుడు, మేరు పర్వతుడు వంటి గొప్ప వరులను తిరస్కరించి మూషిక రాజును వరించింది.

సూర్యుడు : తండ్రి వరుడుగా తెచ్చిన సూర్యుణ్ణి చూసి బాగానే ఉన్నాడు కానీ అతని మిరుమిట్లు గొలిపే కాంతిని తాను భరించలేనన్నది మూషిక బాల.

మేఘుడు : మేఘుణ్ణి చూసిన మూషిక బాల వరుడు అందగాడే గాని నల్లగా ఉన్నాడు అని తిరస్కరించింది.

వాయుదేవుడు : ఇతడు అందగాడే గానీ ఇతనికి అస్సలు నిలకడలేదు. ఈయనకంటే మంచివాడూ, గొప్పవాడూ లేడా అని తండ్రిని ప్రశ్నించింది మూషిక బాల.

మేరు పర్వతుడు : మేరు పర్వతుడు మృదుత్వం లేకుండా బండబారినట్లుండడం వల్ల మూషిక బాలకు నచ్చలేదు. మూషికరాజు : మూషిక రాజును చూసీ చూడగానే మూషికబాల సిగ్గుతో తలవంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ అందగాణ్ణి పెండ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది మూషిక బాల.

ముగింపు : అందరికంటే ధనవంతుడూ, యోగ్యుడూ, చక్కని అందగాడూ, చదువుకున్న వాడయిన వరుణ్ణి తేవాలనుకున్నా మూషికబాల మూషిక రాజుని పెళ్ళాడింది కదా! అని బ్రహ్మయ్య దంపతులు ఆశ్చర్యపోయారు.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.

ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వశక్తులున్నాయి. ఒకరోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్ళుతుండగా జారి బ్రహ్మయ్య ఇంటిముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, ‘మనకు పిల్లలు లేరు కదా! మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి” అన్నది.

భార్య మాట కాదనలేక, ‘సరే, నీ ఇష్టం!’ అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలోని నీళ్ళను చిట్టెలుకమీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారుముద్దుగా పెంచసాగింది. వాళ్ళిద్దరూ ఆ పాపకు ‘మూషిక బాల’ అని పేరు పెట్టారు.

1. బ్రహ్మయ్య ఇంటి ముందర ఏమి పడింది ?
(అ) కాకిపిల్ల
(ఆ) కోకిల పిల్ల
(ఇ) ఎలుక పిల్ల
(ఈ) పక్షి పిల్ల
జవాబు.
(ఇ) ఎలుక పిల్ల

2. కింది వాటిలో బ్రహ్మయ్యకు లేనిది ఏమిటి ?
(అ) ధనం
(ఆ) విద్య
(ఇ) మంత్రశక్తి
(ఈ) తెలివి
జవాబు.
(అ) ధనం

3. బ్రహ్మయ్య చిట్టెలుకను ఎట్లా మార్చాడు ?
(అ) పెద్ద ఎలుక
(ఆ) పక్షిలా
(ఇ) చిలుకలా
(ఈ) చిన్న పాపలా
జవాబు.
(ఈ) చిన్న పాపలా

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి

4. ఎలుకను ముక్కున కరుచుకొని వెడుతున్నది ఏది ?
(అ) చిలుక
(ఆ) కాకి
(ఇ) పిల్లి
(ఈ) గద్ద
జవాబు.
(ఆ) కాకి

5. చిన్న పాపకు పెట్టిన పేరు ఏమిటి ?
(అ) హంసరాజు
(ఆ) మూషిక బాల
(ఇ) వెన్నెల బాల
(ఈ) హిమబాల
జవాబు.
(ఆ) మూషిక బాల

2. కింది పేరా చదవండి. ఖాళీలను పూరించండి.

“మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను. ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది” అని అసలు సంగతి చెప్పింది ఆ మనిషి. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య శివాలయానికి పోయారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చుని, పూజలో అతనికి సాయంచేస్తున్నది. భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నది. తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయమై పోతున్నది.
తల్లిదండ్రులను చూసి, తననక్కడి నుంచి తోలుకొని పోతారేమోనని భయంతో దేవుడి విగ్రహం వెనుకకు పోయి దాక్కున్నది.

ఖాళీలు :

1. వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటు ………………
2. మూషిక బాల …………… దగ్గరే కూర్చొని ఉన్నది.
3. మూషిక బాల ……………. ను చూస్తూ తన్మయమై పోతున్నది.
4. బాలిక శివాలయంలో ………………. నుంచి ఉన్నది.
5. తల్లిదండ్రులు తనను తీసుకుపోతారేమోనని ……………. వెనుక దాక్కున్నది.
జవాబు.
1. వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటు శివాలయం
2. మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని ఉన్నది.
3. మూషిక బాల వినాయకుణ్ణి ను చూస్తూ తన్మయమై పోతున్నది.
4. బాలిక శివాలయంలో నిన్న ఉదయం నుంచి ఉన్నది.
5. తల్లిదండ్రులు తనను తీసుకుపోతారేమోనని దేవుడి విగ్రహం వెనుక దాక్కున్నది.

3. క్రింది పేరాను చదివి ‘ఐదు’ ప్రశ్నలు తయారు చేయండి.

మూషికబాల నాలుగో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడిపిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్కు పోయారు. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తూ, ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది. ఎంత మంది ప్రయత్నించినా ఆ వలనుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల తన పదునైన పండ్లతో ఆ వల తాళ్ళను క్షణాల్లో కొరికి, గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికి మూషిక బాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారీ మూషిక బాలదే మొదటి బహుమతి. మెల్లమెల్లగా మూషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాఘాటంగా పూర్తిచేసింది.

ప్రశ్నలు :
1. సంఘటన జరిగినపుడు మూషికబాల ఏ తరగతిలో ఉంది ?
2. బడి పిల్లలు టీచర్తో కలిసి ఎక్కడికి పోయారు ?
3. ప్రమాదంలో చిక్కుకున్న బాలిక పేరు ఏమిటి ?
4. గీతను ప్రమాదం నుండి తప్పించింది ఎవరు ?
5. మూషిక బాలకు దేని పట్ల ఇష్టం పెరిగింది ?

TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి

4. క్రింది పేరాను చదివి, ఇచ్చిన ఖాళీలను పూర్తి చేయండి.

కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దదయింది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయింది. కనిపించిన వస్తువులన్నీ కొరుకడం, చిరుతిండ్లకోసం వెతుకడం, పచ్చికూరగాయలు తినడం, పప్పుడబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరుగడం, రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడం, పిల్లులు కనిపిస్తే భయంతో ఉరకడం, మూషిక బాలకు సహజలక్షణాలుగా మారిపోయాయి.

ఖాళీలు :

1. మూషిక బాల ………………. కనిపిస్తే భయంతో ఉరకడం చేసేది
2. ఒక చోట ………………. ఉండకుండా తిరగడం అలవాటయింది.
3. ……………….. ఉన్న చోట ఆటలాడుకునేది.
4. కనిపించిన వస్తువులన్నీ …………………. చేసేది.
5. ……………. కోసం వెదికేది
జవాబు.
1. మూషిక బాల పిల్లులు కనిపిస్తే భయంతో ఉరకడం చేసేది
2. ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయింది.
3. రంధ్రాలు ఉన్న చోట ఆటలాడుకునేది.
4. కనిపించిన వస్తువులన్నీ కొరుకడం చేసేది.
5. చిరుతిండ్లు కోసం వెదికేది

Leave a Comment