TS 6th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson Telangana మన జాతర-జన జాతర

Telangana SCERT TS 6th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 2nd Lesson మన జాతర-జన జాతర Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson మన జాతర-జన జాతర

ప్రశ్న 1.
మన జాతర-జన జాతర పాఠ్యభాగ సారాంశం రాయండి.
(లేదా)
సమ్మక్క-సారక్కల గురించి రాయండి.
జవాబు.
పరిచయం : వరంగల్ జిల్లాలోని మేడారంలో రెండేళ్ళకోసారి మూడు రోజులపాటు జరిగే సమ్మక్క-సారక్క జాతర గురించిన విశేషాలను ఈ పాఠ్య భాగంలో వివరించారు.
సమ్మక్క-సారక్క అనే తల్లీకూతుళ్ళు వీరవనితలు. 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా పాలవాస ప్రాంతాన్ని పాలించిన మేడరాజు అనే గిరిజన దొర అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న చిన్నపిల్లను సమ్మక్క అని పేరు పెట్టి పెంచాడు. మేడారం రాజు అయిన పగిడిద్దరాజును పెళ్ళిచేసుకుని నాగులమ్మ, సారలమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లల్ని కన్నది. మేడారం మహారాణిగా ప్రజల మేలుకోసం ఎన్నో మంచి పనులు చేసింది.

కాకతీయుల దండయాత్ర : మేడరాజుకు ఆశ్రయం ఇచ్చాడనీ, కప్పం కట్టలేదనీ, స్వతంత్రం ప్రకటించుకున్నాడని మేడారం రాజుపై కాకతీయ ప్రతాపరుద్రుడు యుద్ధానికి సైన్యాన్ని పంపాడు. అంత పెద్ద సైన్యాన్ని ఓడించలేక పగిడిద్దరాజు, జంపన్న వీరమరణం పొందినా సమ్మక్క మాత్రం వీరోచితంగా పోరాడింది. చివరికి కాకతీయ సైనికుల దొంగ దెబ్బవల్ల గాయపడి చిలకలగుట్ట మీదికి వెళ్ళి మాయమయ్యింది. కులదైవం కలలో కనిపించి సమ్మక్క దేవత అని చెప్పడంతో రాజు జాతరకు ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు.

జాతర జరిగే విధానం : నియమనిష్ఠలతో గిరిజన పురోహితులు పవిత్రమైన చిలకలగుట్ట మీది నుంచి పసుపు కుంకుమ భరిణను, వెదురుగడను తెచ్చి గద్దెపై నిలపడంతో జాతర మొదలవుతుంది. దేవతల వన ప్రవేశంతో ముగిసే ఈ జాతరలో ప్రజలు బంగారం అని పిలిచే బెల్లాన్ని తమ బరువు సరిపడా తూచి పంచి తమ మొక్కులు తీర్చుకుంటారు.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సరియైన జవాబులు గుర్తించండి.

ఆమెకు పెండ్లి వయస్సు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారంను పాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగు పెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల పక్షం | వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకున్నది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు. ప్రజలకు కనిపించరు. కాని మేడారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండేది.

1. మేడరాజు ఎవరికి మేనమామ ?
(అ) జంపన్న
(ఆ) సమ్మక్క
(ఇ) పగిడిద్దరాజు
(ఈ) సారలమ్మ
జవాబు.
(ఇ) పగిడిద్దరాజు

2. మేడారం మహారాణి ఎవరు ?
(అ) సమ్మక్క
(ఆ) సారక్క
(ఇ) అమ్మక్క
(ఈ) చిన్నక్క
జవాబు.
(అ) సమ్మక్క

TS 6th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson Telangana మన జాతర-జన జాతర

3. పగిడిద్దరాజు ఎవరికి సామంతుడు ?
(అ) నిజాం నవాబుకు
(ఆ) ఢిల్లీ సుల్తానులకు
(ఇ) చాళుక్యులకు
(ఈ) కాకతీయులకు
జవాబు.
(ఈ) కాకతీయులకు

4. పరిపాలనలో సమ్మక్క ఎవరి పక్షం వహించింది ?
(అ) భర్త పక్షం
(ఆ) ప్రజల పక్షం
(ఇ) బిడ్డల పక్షం
(ఈ) తండ్రి పక్షం
జవాబు.
(ఆ) ప్రజల పక్షం

5. మహారాణులు సాధారణంగా ఎక్కడ ఉంటారు ?
(అ) ప్రజల మధ్యన
(ఆ) యుద్ధరంగంలో
(ఇ) మేడల్లో
(ఈ) గుడిసెల్లో
జవాబు.
(ఇ) మేడల్లో

2. కింది పేరా చదవండి. ఖాళీలను పూరించండి.

యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనకనుంచి వచ్చి దెబ్బకొట్టరు. ఇది యుద్ధనీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుకనుంచి వెళ్లి బల్లెంతో వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రంమీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకలగుట్టమీదికి పోయింది. ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఆమెకోసం వెదుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు, దానికింద ఓ పుట్ట. పుట్టమీద ఓ కుంకుమ భరిణ కనిపించింది. ఆ భరిణలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు.

ఖాళీలు :
1. చిలకలగుట్ట ఉన్న దిక్కు …………………….
2. సమ్మక్క కోసం వెతుకుతున్న గిరిజనులకు పుట్టమీద కనిపించినది ………………..
3. యుద్ధంలో …………….. పోరాడడం యుద్ధనీతి.
4…………………. పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది.
5. సమ్మక్క తల్లి ………………. రూపం పొందిందని గిరిజనులు నమ్మారు.
జవాబు.
1. చిలకలగుట్ట ఉన్న దిక్కు ఈశాన్యం.
2. సమ్మక్క కోసం వెతుకుతున్న గిరిజనులకు పుట్టమీద కనిపించినది కుంకుమ భరిణ
3. యుద్ధంలో ముందుండి పోరాడడం యుద్ధనీతి.
4. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది.
5. సమ్మక్క తల్లి దేవతా రూపం పొందిందని గిరిజనులు నమ్మారు.

పై పేరాననుసరించి తప్పు ( X ), ఒప్పు ( √ ) లను గుర్తించండి.

6. యుద్ధంలో వెనుక నుంచి దెబ్బకొడతారు. (X)
7. సమ్మక్క పోరాటాన్ని చూసి, కాకతీయ సైన్యం ఆనందించింది. (X)
8. సైనికుడు దొంగ దెబ్బతీశాడు. ( √ )
9. సమ్మక్క యుద్ధంలో మరణించింది. (X)
10. గిరిజనులు సమ్మక్క తల్లి దేవతగా మారిందని నమ్మారు. ( √ )

3. క్రింది గద్యాన్ని చదవండి. దాని కింద ఇవ్వబడిన పదాల నుండి సరైన పదాన్ని ఎన్నుకొని సంబంధిత ఖాళీలను పూరించండి.

12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి ……………… లేదు. ఒకనాడు (2) ……………….. మధ్య ఆడుకుంటున్న చిన్న పిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ (3) ……………
ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. (4) …………….. అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుండి సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ, తోటి (5) ………………… ను రక్షించేది. (పాప, వేట, శతాబ్దం, జాతర, గిరిజనుల, బాగోగులు, సమ్మక్క, సంతానం)
జవాబు.
12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేట మధ్య ఆడుకుంటున్న చిన్న పిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాప ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని పేరు  పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుండి సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ, తోటి గిరిజనులను ను రక్షించేది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson Telangana మన జాతర-జన జాతర

 

4. క్రింది గద్యాన్ని చదివి, తప్పు – ఒప్పులను గుర్తించండి.

జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమ నిష్ఠలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్ట పైకి ఎవరూ పోరు. జాతర ముందర ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న భరిణను, వెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్ల గద్దె అని అంటారు. ఈ తతంగాన్ని ‘దేవతలను ఆహ్వానించడం’ అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

తప్పు ( X ), ఒప్పు( √ ) లను గుర్తించండి.

1. చిలకల గుట్టపైకి ఎవరైన పోతారు (X)
2. జాతరలో కోయ యువకుడు పూనకంతో ఉంటాడు. (√)
3. పసుపు, కుంకుమ భరిణ, వెదురుగోడ చిలకల గుట్టపై ఉంటాయి. (√)
4. దేవతల ఆహ్వానం తర్వాతనే భక్తులు గద్దెలను దర్శించుకుంటారు. (√)
5. మేడారం జాతర ఏడవ రోజుకు ముగుస్తుంది. (X)

5. ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో ‘చిలకల గట్టు’ ఉన్నది. చుట్టు దట్టమైన అడవి. ఇక్కడ రెండేండ్లకొకసారి మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరి నెలలో) మొదలకొని మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క – సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయరీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రం నుంచేకాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలనుండి కూడా లక్షల మంది వచ్చి మొక్కు తీర్చుకుంటారు.

ప్రశ్న 1.
సమ్మక్క – సారక్క జాతర ఎన్ని రోజులు జరుగుతుంది ?
జవాబు.
మూడు రోజులు జరుగుతుంది.

ప్రశ్న 2.
జాతరకు ఏయే రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు ?
జవాబు.
ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్.

ప్రశ్న 3.
గిరిజన సంప్రదాయంలో జరిగే జాతర ఏది ?
జవాబు.
సమ్మక్క – సారక్క జాతర

TS 6th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson Telangana మన జాతర-జన జాతర

ప్రశ్న 4.
సమ్మక్క – సారక్క జాతర ఎప్పుడు జరుగుతుంది ?
జవాబు.
మాఘశుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరి నెలలో)

ప్రశ్న 5.
మేడారం ఏ జిల్లాలో ఉంది ?
జవాబు.
జయశంకర్ జిల్లాలో ఉంది.

6. క్రింది పేరాను చదివి, ఇచ్చిన ఖాళీలను పూర్తి చేయండి.

గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే సమ్మక్క, సారక్కలు ఇద్దరూ తల్లీకూతుళ్ళు. గిరిజన హక్కుల కోసం ఎదురుతిరిగి పోరాడిన వీర వనితలు. 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా “పొలవాస” ప్రాంతాన్ని మేడరాజు పాలిస్తుండేవాడు. అతనికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న చిన్న పిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి, ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు ఉన్నాయని, దేవతామూర్తి అని గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడేనికి తలలో నాలుకయింది. ఆమెకు పెండ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు.

ఖాళీలు :
1. సమ్మక్క, సారక్కలను గిరిజనులు …………… గా కొలుస్తారు.
2. “పొలవాస” ప్రాంతాన్ని ……………..రాజు పాలించేవాడు.
3. అడవిలో పాప ………………… మధ్య ఆడుకుంటుంది.
4. సమ్మక్క …………… వైద్యం చేసేది.
5. మేడరాజు మేనల్లుడు ………………
జవాబు.
1. సమ్మక్క, సారక్కలను గిరిజనులు దేవతామూర్తులుగా గా కొలుస్తారు.
2. “పొలవాస” ప్రాంతాన్ని మేడరాజు రాజు పాలించేవాడు.
3. అడవిలో పాప పులుల మధ్య మధ్య ఆడుకుంటుంది.
4. సమ్మక్క చెట్ల వైద్యం వైద్యం చేసేది.
5. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు

Leave a Comment