TS 6th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana వాగ్గేయకారుడు రామదాసు

Telangana SCERT TS 6th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 5th Lesson వాగ్గేయకారుడు రామదాసు Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson వాగ్గేయకారుడు రామదాసు

కింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వాగ్గేయకారుడు రామదాసు పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు.
పరిచయం : భారతదేశంలోని పవిత్రమైన నదుల్లో ఒకటైన గోదావరీ తీరంలోని భద్రాచలంలో వెలసిన శ్రీరాముని సేవించి తరించిన భక్తుడు, వాగ్గేయకారుడు అయిన రామదాసు జీవిత విశేషాలే ఈ పాఠ్యభాగం. ఇందులో రామదాసు బాల్యం, విద్యాభ్యాసం, తాగక మంత్రోపదేశం, తహసీలుదారు ఉద్యోగం, రామదాసు కావడం, చెరసాల జీవితం, రామలక్ష్మణులు విడిపించడం అనే అంశాలు ఉన్నాయి.

బాల్యం, విద్యాభ్యాసం : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామంలో క్రీ.శ. 17వ శతాబ్దంలో కంచెర్ల లింగన్న, కామమ్మ దంపతులు తమ కుమారుడికి గోపన్న అని పేరు పెట్టారు. రఘునాథ భట్టాచార్యుల వద్ద బాలరామాయణం చదువుకున్న గోపన్న అన్ని శాస్త్రాలలో పండితుడేకాక రాముడికి భక్తుడు కూడా అయ్యాడు.

తారక మంత్రోపదేశం : కబీరుదాసు చేసి తారకమంత్ర ఉపదేశాన్ని ఆనందతన్మయంతో పారాయణ చేశాడు. నిత్యం భజన కాలక్షేపాలు, అన్న సంతర్పణల వల్ల ఆస్తి తరిగిపోవటంతో ఉద్యోగం కోసం గోలకొండ కోటలో ముఖ్య ఉద్యోగులైన అక్కన్న మాదన్నలను ఆశ్రయించాడు.

తహసీలుదారు ఉద్యోగం : గొప్పవాడైన తానాషా ప్రభువు అక్కన్న మాదన్నల సూచనల మేరకు గోపన్నను భద్రాచలానికి తహసీలుదారుగా నియమించాడు.

రామదాసు కావడం : గోపన్న తహసీలుదారుగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించటంతో పాటు భద్రాచల రామచంద్రుడి సేవలు, రామకోటి రాయడం కూడా కొనసాగించాడు. ఒకసారి రామకోటి పూర్తిచేసిన సందర్భంగా అన్న సమారాధన ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అన్నం వార్చిన గంజిగుంటలో పడి అతని కుమారుడు మరణించాడు. గోపన్న చేసిన ప్రార్థనతో ఆ బాలుడు తిరిగి బతకడం వల్ల నాటినుండి గొప్ప భక్తుడైన గోపన్న రామదాసుగా పిలవబడ్డాడు.

చెరసాల జీవితం : ప్రభువు అనుమతి లేకుండా ప్రజల డబ్బును ఆలయ నిర్మాణానికి ఖర్చుపెట్టడం వల్ల రామదాసు జైలు జీవితం గడిపాడు.

రామలక్ష్మణులు విడిపించడం : రామదాసు భక్తి ప్రపత్తులకు మెచ్చి రామలక్ష్మణులే స్వయంగా వచ్చి సేవకుల వేషంలో వెళ్ళి తానాషాకు డబ్బు కట్టడం వల్ల రాజు రామదాసును విడిపించి పశ్చాత్తాపపడ్డాడు.

ముగింపు : దాశరథి శతకం, ఎన్నో కీర్తనలు రచించిన రామదాసు కవిగా, రామభక్తుడిగా, గొప్ప వాగ్గేయకారుడిగా పేరుపొందాడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

ప్రశ్న 2.
తానాషా ప్రభువు గొప్పదనం తెలపండి.
జవాబు.
పరిచయం: గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా. ఎంతో ఉత్తముడై తన ప్రజలందరినీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజలచేత తానాషా (మంచిరాజు) అనే బిరుదును పొందాడు.

అక్కన్న మాదన్నలు : ముస్లిం అయిన తానాషా ప్రభువుకి హిందువులైన అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఎంతో విశ్వాసంతో సేవ చేశారు. ఇది గిట్టని ఢిల్లీ పాదుషా ఔరంగజేబు హెచ్చరించినా అక్కన్న మాదన్నలను వదులుకోని స్నేహశీలి, గొప్పవ్యక్తి తానాషా. అక్కన్న మాదన్నల సూచన మేరకు భద్రాచలానికి తహసీలుదారుగా నియమించి కంచెర్ల గోపన్నకు మేలు చేశాడు.

రామదాసు చెర : రామదాసు ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి తనకు ఎంతో కీర్తి తెచ్చినందుకు లోపల్లోపల సంతోషించాడు తానాషా. కానీ తక్కిన తహసీలుదార్లు కూడా ఇలాగే చేస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోతుందేమోననే భయంతో రామదాసును చెరసాలలో బంధించాడు.

శ్రీరామ లక్ష్మణ దర్శనం : రామదాసును విడిపించమని చెప్పి డబ్బు చెల్లించడానికి వచ్చి రామలక్ష్మణులు సేవకుల రూపంలో తానాషాకు దర్శనం ఇచ్చారు. తానాషా వెంటనే రామదాసును చెరనుంచి విడిపించి రాజమర్యాదలు చేశాడు. పశ్చాత్తాపం : మహాభక్తుడైన రామదాసును చెరలో చిత్రహింసలు పెట్టినందుకు తానాషా ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అందుకే రామలక్ష్మణులు తనకు చెల్లించిన డబ్బుతో పాటు పట్టువస్త్రాలు గూడా ఇచ్చి భద్రాచలాన్ని శ్రీరామచంద్రునికి మాన్యంగా ప్రకటించాడు.

ముగింపు : స్నేహానికి, మంచితనానికి మారుపేరైన తానాషా హిందూ ముస్లింల ఐకమత్యానికి, తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన మహానుభావుడు.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తల్లిదండ్రులు ఆ బిడ్డకు ‘గోపన్న’ అనే పేరు పెట్టారు. గోపన్నకు తగిన వయస్సు రాగానే ఉపనయనం చేశారు. అయిదో ఏటనే అక్షరాభ్యాసం చేశారు. శాస్త్ర పండితులయిన రఘునాథ భట్టాచార్యుల వంటి వైష్ణవదీక్షా గురువులు గోపన్నకు బాల రామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పటం జరిగింది. అందువల్ల చిన్నతనం నుంచే గోపన్న మనసులో శ్రీరాముడి మహిమలు నాటుకొనిపోయాయి. ఎప్పుడూ సీతారాముల విగ్రహాలకు భక్తితో పూజలు చేసేవాడు. తన స్నేహితులతో రామభజనలు చేసేవాడు.

రామకోటి రాసేవాడు. ఐదేళ్ళ వయసులోనే గోపన్నకు ఎంత రామభక్తి ఉండేదంటే, తాను గూడా ఆ రాముడున్న కాలంలోనే పుట్టి ఉంటే సుగ్రీవుడు, ఆంజనేయుడు వలె భక్తితో శ్రీరాముడిని సేవించే భాగ్యం లభించేది గదా అని అనుకునేవాడు. ఈ విధంగా ఎంత రామభక్తి పరాయణుడైనా, గోపన్న సర్వశాస్త్రాలను నేర్చుకొని తల్లిదండ్రులను తృప్తి పరిచాడు. కాని విద్యావంతుడు, దైవభక్తియుక్తుడైన పుత్రుడి అభివృద్ధిని చూసి ఆనందించే భాగ్యం ఆ తల్లిదండ్రులకు లేదు. కొద్ది రోజులకే వారు కన్నుమూశారు.

ప్రశ్నలు :

1. అక్షరాభ్యాసం అంటే ఏమిటి ?
జవాబు.
‘ఓ నమః’ అంటూ పలకమీద రాయించి చదువు నేర్పడం మొదలు పెట్టడాన్ని అక్షరాభ్యాసం అంటారు.

2. గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్యసహితంగా బోధించిన గురువు ఎవరు?
జవాబు.
గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా బోధించిన గురువు పేరు రఘునాథ భట్టాచార్యులు

3. సీతారాముల విగ్రహాలకు పూజలతో పాటు గోపన్న ఇంకేమి చేసేవాడు ?
జవాబు.
స్నేహితులతో భజనలు చేసేవాడు. ‘రామకోటి’ రాసేవాడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

4. రామకోటి అంటే ఏమిటి ?
జవాబు.
శ్రీరామ అనే మూడు అక్షరాల నామాన్ని కోటిసార్లు రాయడాన్ని ‘రామకోటి’ అంటారు.

5. గోపన్న చక్కగా చదువుకోవడం చూసి ఎవరు తృప్తిపడ్డారు ?
జవాబు.
గోపన్న చక్కగా చదువుకోవడం చూసి అతని తల్లిదండ్రులు తృప్తిపడ్డారు.

2. కింది పేరాను చదవండి. ఖాళీలను పూరించండి.

అక్కన్న – మాదన్నలనే వాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు. వాళ్ళలో అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మాదన్న ప్రధానమంత్రి. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశరావు. ఈ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబు దాడుల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర వహించారు. మహారాష్ట్ర నాయకుడు శివాజీకీ తానాషాకూ సంధి జరిపారు. అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలం ఢిల్లీ సుల్తాను, గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వాళ్ళ అన్నదమ్ములు కాకపోయినా ఒకరినుంచి మరొకరిని వేరుచేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు. వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీ చేయగలిగాడు. ఒక ముస్లిం రాజ్యానికి మంత్రులుగా హిందువులుండటం ఔరంగజేబు సహించలేకపోయాడు. అక్కన్న మాదన్నలను వదిలించుకొమ్మని ఔరంగజేబు ఎంత చెప్పినా తానాషా వారిని వదులుకోలేదు. అక్కన్న మాదన్నలకు తానాషాతో గల అనుబంధం హిందూ, ముస్లింల ఐకమత్యాన్ని, స్నేహసౌహార్ద్రతలను చాటుతున్నది.

ఖాళీలు:

1. అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యాన్ని………………….. దాడుల నుంచి కాపాడారు.
2. ఔరంగజేబు ముస్లిం రాజ్యానికి హిందువులు …………….. ఉండటం సహించలేకపోయాడు.
3. తానాషా కొలువులో అక్కన్న …………….. పదవులు నిర్వహించాడు.
4. తానాషా ప్రధానమంత్రి అయిన సూర్యప్రకాశరావు ………………….. పేరుతో ప్రసిద్ధుడు.
5. అక్కన్న మాదన్నలు తానాషాకి ………………. తో సంధి జరిపారు.
జవాబు.
1. అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు దాడుల నుంచి కాపాడారు.
2. ఔరంగజేబు ముస్లిం రాజ్యానికి హిందువులు మంత్రులుగా ఉండటం సహించలేకపోయాడు.
3. తానాషా కొలువులో అక్కన్న మంత్రి, దండనాయకుడు పదవులు నిర్వహించాడు.
4. తానాషా ప్రధానమంత్రి అయిన సూర్యప్రకాశరావు మాదన్న పేరుతో ప్రసిద్ధుడు.
5. అక్కన్న మాదన్నలు తానాషాకి శివాజీ తో సంధి జరిపారు.

3. ఈ క్రింది పేరాను చదివి తప్పు / ఒప్పులను గుర్తించుము

దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం కూడా ఒకటి. గోల్కొండను పాలించిన రాజులు ప్రజల హితం కోరిన వారు. ధర్మబద్ధంగా పాలించారు. ఆ రాజుల మాతృభాష తెలుగుకాదు. అయినా వాళ్ళలో కొందరు తెలుగు నేర్చుకొని తెలుగు భాషను ప్రోత్సహించి తెలుగు కావ్యాల్ని అంకితంగా తీసుకున్నారు గూడా. తెలుగు చాటువుల్లో కనిపించే ‘మల్కిభరాముడు’ గోల్కొండ ప్రభువైన ‘ఇబ్రహీం కులీకుతుబ్షా’ అన్నది అందరికీ తెలిసిన విషయమే. మహ్మద్ కులీకుతుబ్షా కాలంలోనే నేటి హైదరాబాద్ నగరం నిర్మాణమయింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్ట చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా.

ప్రశ్నలు :

1. గోల్కొండను పాలించిన రాజులు ప్రజలహితం కోరినవారు
2. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్ట చివరి రాజు కులీకుతుబ్షా
3. ఇబ్రహీం కుతుబ్షా కాలంలో హైదరాబాద్ నగరం నిర్మాణమయింది
4. గోలకొండ రాజుల మాతృభాష తెలుగు కాదు
5. ఇబ్రహీం కుతుబ్షాకు మల్కిభరాముడని పేరు.
జవాబు.
1. గోల్కొండను పాలించిన రాజులు ప్రజలహితం కోరినవారు (ఒప్పు)
2. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్ట చివరి రాజు కులీకుతుబ్షా (తప్పు)
3. ఇబ్రహీం కుతుబ్షా కాలంలో హైదరాబాద్ నగరం నిర్మాణమయింది (తప్పు)
4. గోలకొండ రాజుల మాతృభాష తెలుగు కాదు (ఒప్పు)
5. ఇబ్రహీం కుతుబ్షాకు మల్కిభరాముడని పేరు. (ఒప్పు)

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

4. కింది పేరాను చదవండి. ఖాళీలను పూరించండి.

ఇంటి భారమంతా గోపన్న మీద పడింది. బంధుమిత్రుల సలహామీద గోపన్న పెండ్లి చేసుకున్నాడు. భార్య కమల సౌందర్యవతి. సకల సద్గుణాలు గల ఇల్లాలు. ఆ దంపతులిద్దరూ ఇంటికి వచ్చే అతిథులను సేవించుకుంటూ అన్నప్రదానం చేసేవారు. ఒకనాడు కబీరుదాసు గోపన్న ఇంటి సమీపంలోకి హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చాడు. ఇంట్లో నుండి బయటికి వచ్చి గోపన్న కబీరును చూశాడు. అతడు కూడా గోపన్నను చూచి చేతులు చాచి పిలిచాడు. గోపన్నలో భగవద్భక్తి లక్షణాలు కనిపించాయి కబీరుకు. గోపన్నా! నీలో శాంతి, సౌమనస్యం వంటి సద్గుణాలున్నాయి. నీకు అఖండయోగం, శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతాయి.

ఖాళీలు:

1. గోపన్న భార్య పేరు …………….
2. గోపన్నలో కబీరుకు ……………. లక్షణాలు కనిపించాయి.
3. హరినామ సంకీర్తన చేసుకుంటూ …………….. గోపన్న ఇంటి సమీపంలోకి వచ్చారు.
4. ఇంటికి వచ్చే అతిథులను సేవించుకుంటూ ……………. చేసేవారు.
5. నీకు అఖండ యోగం, ……………. అనుగ్రహం కలుగుతాయి అని కబీరు చెప్పాడు.
జవాబు.
1. గోపన్న భార్య పేరు కమల.
2. గోపన్నలో కబీరుకు భగవద్భక్తి లక్షణాలు కనిపించాయి.
3. హరినామ సంకీర్తన చేసుకుంటూ కబీరు గోపన్న ఇంటి సమీపంలోకి వచ్చారు.
4. ఇంటికి వచ్చే అతిథులను సేవించుకుంటూ అన్నదానం చేసేవారు.
5. నీకు అఖండ యోగం, శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతాయి అని కబీరు చెప్పాడు.

Leave a Comment