TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

Telangana SCERT TS 6th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson తెలంగాణ పల్లెలు-సంస్కృతి

1. కింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘తెలంగాణ పల్లెలు – సంస్కృతి’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు.
పరిచయం : తెలంగాణ సంస్కృతికి ఆట, పాట, భాష, యాస ఇప్పటికీ సజీవంగా ఉన్న పల్లెలే పట్టుగొమ్మలు. పల్లెలు వివిధ పండుగలతో, రకరకాల కులవృత్తుల ప్రజలతో, పాడి పంటలతో, ఆటపాటలతో, పెళ్ళిళ్ళు పేరంటాళ్ళతో, ఉ మ్మడి కుటుంబాలతో, వినోద ప్రదర్శనలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి.

పండగలు : సంవత్సరంలో రెండు పంటలు పండించే రైతులు పంట చేతికి వచ్చిన ఆనందంతో పదిమందిని పిలిచి కడుపునిండా భోజనం పెట్టగానే కొత్త పండుగ అంటారు. భక్తి శ్రద్ధలతో, నియమనిష్ఠలతో రైతులు వ్యవసాయపు పనులు మొదలుపెట్టే పవిత్ర దినాన్ని సాగువాటు లేక ఏరువాక అంటారు.

కులవృత్తులు : పల్లెల్లో ఎవరికి వారే తమ తమ కులాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసి వాటిని అవసరమైన వారికి ఇచ్చి వారి దగ్గర తమకు అవసరమైన వస్తువులను, సేవలనుగాని తిరిగి పొందే వస్తుమార్పిడి పద్ధతి ఉండేది. గ్రామ ప్రజలకు అవసరాలు తీర్చడం కోసం వడ్రంగులు కర్ర పనిముట్లను, కమ్మరి వాళ్ళు ఇనుప వస్తువులనూ, కుమ్మరులు మట్టివస్తువులనూ, అవుసుల వాళ్ళు బంగారు నగలను తయారు చేయగా, కోమట్లు ఇతర సరుకులను, రైతులు ఆహార ధాన్యాలను, కూరగాయలను సమకూర్చేవారు.

పాడి పంటలు : ఊర్లో నాలుగు పాడి బర్రెలు ఉంటే ఊరందరికీ పాలు, పెరుగు, చల్ల పంచబడుతుంది.

ఆటపాటలు : పల్లెలో ఆడుకునే గోటీలు, చిర్ర గోనె, కబడ్డి, ఓమన గుంటలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళ మొదలైన ఆటల వల్ల శరీరం గట్టిబడటమే కాకుండా మానసిక ఎదుగుదల కూడా కలిగేది. ఇంకా బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా వంటి ఆటల్లో పాటలుకూడా పాడడం వల్ల సంగీత సాహిత్యాలలో చరిత్ర ప్రవేశం లభించేవి. వాటివల్ల ఆచార వ్యవహారాలు తెలియడమే కాక గ్రహణ శక్తి, ఆలోచనా పరిధి, భాషా పరిజ్ఞానం పెరిగేవి.

పెళ్ళిళ్ళు : ఎవరింట్లో పెళ్ళి జరిగినా పందిళ్ళు వేయడం, విస్తళ్ళు కుట్టడం, వడ్లు దంచడం, బియ్యం ఏరడం, సన్నాయి వాయించడం, పూలు అల్లివ్వడం, పత్రికలు పంచడం మొదలైన పనులలో ఊరి వాళ్ళందరూ పాలుపంచుకొనే వాళ్ళు.

ఉమ్మడి కుటుంబాలు : ప్రతి ఇంట్లో తాతయ్య, నాయనమ్మలు, పెద్దమ్మ, పెద్దనాయనలు, అత్తయ్య, మామయ్యలు, పిల్లలు మొదలైన వారంతా ఉమ్మడిగా కలిసే ఉండేవారు. తాతలు, అవ్వలు చెప్పే నీతికథల ద్వారా పిల్లలు కష్టం, సుఖం, శ్రమ, నీతి, వినయం, మర్యాద వంటి మంచి విషయాలు నేర్చుకొనేవారు.

ముగింపు :పల్లెల్లో నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, చెంచు బాగోతాల ద్వారా ప్రజలు వినోదంతో పాటు సందేశాన్ని కూడా పొందేవారు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

ప్రశ్న 2.
తెలంగాణ పల్లెల్లో జరుపుకునే పండగల గురించి రాయండి.
జవాబు.
పరిచయం : పాడి పంటలతో తులతూగే తెలంగాణ పల్లెలు పండుగరోజుల్లో ఆటపాటలతో కళకళలాడుతూఉంటాయి. వీటిలో కొత్త పండుగ, సాగువాటు ముఖ్యమైన పండుగలు.

కొత్త పండుగ : కొత్త వడ్లను దంచి, కొత్త బియ్యం తీసి, వండి పదిమందిని పిలిచి, కడుపు నిండా భోజనం పెట్టి పంచడమే కొత్త పండుగ. ఏడాదిలో రెండుసార్లు పంట చేతికి వస్తుంది. కాబట్టి కొత్త పండుగను రెండుసార్లు చేసుకుంటారు. కడుపునిండా అన్నం దొరకని కాలంలో ప్రజలకు ‘కొత్త’ ఒక పెద్ద పండుగ. కుండను దేవుడిగా పూజించే తెలంగాణ సంస్కృతిలో పండుగలకు, శుభకార్యాలకు ‘కూరాడు’ పేరుతో కుండను పూజిస్తారు.

సాగువాటు : ఏరువాక, ఏరొక అని కూడా పిలిచే సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు మొదలుపెట్టే పవిత్రమైన రోజు. ఈ రోజున రైతు దంపతులు తెల్లారకుండానే నిద్రలేచి తలస్నానం చేసి దేవునికి మొక్కుకుంటారు. ముందురోజే కడిగి కొమ్ములకు రంగులు వేసిన ఎద్దులనూ, శుభ్రం చేసి ఉంచిన నాగలి, పార, తట్ట, కొడవలి వంటి పనిముట్లను తీసుకొని తెల్లవారకుండానే రైతు పొలం వెడతాడు. పొలంలో నాగలికట్టి దున్నడం గానీ, నాలుగు తట్టల మట్టిని తవ్విపోయడం గానీ చేసే ఆ రోజున రైతు ఎవ్వరితోనూ మాట్లాడాడు. రైతు ఇంటికి వచ్చేవరకూ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోరు.

ముగింపు : ఈ విధంగా తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయానికి సంబంధించిన పండుగల ప్రాధాన్యం తెలుస్తుంది.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

ప్రశ్న3.
కులవృత్తుల ద్వారా పల్లె ప్రజల మధ్య ఏర్పడే అనుబంధాలను వివరించండి.
జవాబు.
పరిచయం : పల్లెల్లో పూర్వం ఎవరికి వారు తమ తమ కులాలకు సంబంధించిన వస్తువులు తయారు చేసి, ఆ వస్తువులను ఇచ్చి తమకు అవసరమైన వాటిని తీసుకునేవారు. కొందరు తమ సేవలను అందించేవారు.

వస్తువుల తయారీ : వడ్రంగి వాళ్ళు రైతుకు కావలసిన నాగండ్లను, గొర్రులను, ఇతర కర్ర పనిముట్లను తయారు చేసి ఇచ్చేవారు. కమ్మరివాళ్ళు కర్రు, కొడవలి, పార, గడ్డపార, బండికమ్ములు మొదలైన ఇనుప వస్తువులను తయారు చేసి ఇచ్చేవారు. కుమ్మరివాళ్ళు కుండ, గురిగి, పటువ, ఎసుల, కాగు, గూన వంటి మట్టి వస్తువులనూ, అవుసుల వాళ్ళు బంగారు నగలనూ తయారుచేసేవారు.

సేవలు అందించడం : సవరం పనిచేసి మంగలివాళ్ళు, బట్టలు నేసి పద్మశాలి వాళ్ళు, తట్టబుట్టలను అల్లి మేదరి వాళ్ళూ, ఎరుకలవాళ్ళు, బట్టలను కుట్టి మేర వాళ్ళు పల్లె ప్రజలకు అవసరమైన ఆహారధాన్యాలు, కూరగాయలు పండించేవారు. రైతులు పండించిన పల్లికాయలు, నువ్వులు, కుసుమలను, గానుగ పడితే వాటివల్ల అటు మనుషులకు నూనె, ఇటు పశువులకు మేత దొరికింది.

వస్తు మార్పిడి : పల్లెల్లో డబ్బుతో పని లేకుండా ఆయా వృత్తుల ప్రజలు తమ దగ్గర ఉన్నది. ఇతరులకు ఇచ్చి వారి దగ్గర తమకు అవసరమైనది తీసుకొనేవారు. వ్యవసాయంతో, కుల వృత్తులతో సంబంధం లేని కళాకారులు తమ కళానైపుణ్యంతో ప్రజలను మెప్పించి వారి నుంచి తమ అవసరాలకు సరిపడా వస్తువులనూ, ధాన్యాన్ని సేకరించేవారు. ముగింపు : ఈ విధంగా ప్రజల్లో ఈ ఇచ్చిపుచ్చుకునే విధానం వల్ల బలమైన అనుబంధాలు ఏర్పడేవి.

పరిచిత గద్యభాగాలు

1. కింది గద్యభాగాన్ని చదవండి. ప్రశ్నలకు సమాధానం రాయండి.

తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు. ఆట, పాట, భాష, యాస, ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు, వివిధ వృత్తుల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఊరిమీది చెరువుతో, ఊరి కింది వాగుతో వారు సహజీవనం చేసేవారు. వివిధ కులాల వారు తమ వృత్తికి సంబంధించిన వస్తువులు తయారు చేసేవారు. వస్తుమార్పిడి జరిగేది. రైతు పండించిన పంటలో అందరికీ భాగం దక్కేది. పండుగలు, జాతరలు, పెండ్లిండ్లకు అన్ని వృత్తుల వారి భాగస్వామ్యం ఉండేది. ప్రతి పండుగలో పాట ఒక భాగమైపోయేది. పాటలేని పండుగలు, వేడుకలు తెలంగాణలో లేనేలేవు.

ప్రశ్న 1.
పల్లెల్లో ప్రజలందరూ ప్రధానంగా దేనిమీద ఆధారపడి జీవించేవారు ?
జవాబు.
పల్లెల్లో ప్రజలందరూ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు.

ప్రశ్న 2.
వృత్తి పనివారు తమ వస్తువులను ఇతరులకు ఇచ్చి ఇతరులు మంచి వస్తువులను తాము తీసుకోవడానికి ఏమని పేరు?
జవాబు.
వృత్తి పనివారు తమ వస్తువులను ఇతరులకు ఇచ్చి ఇతరుల నుంచి వస్తువులను తాము తీసుకోవడానికి వస్తుమార్పిడి అని పేరు.

ప్రశ్న 3.
తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మలు ఏవి ?
జవాబు.
తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

ప్రశ్న 4.
ప్రతి పండుగలో ఏది ఒక భాగమై పోయింది ?
జవాబు.
ప్రతి పండుగలో పాట ఒక భాగమైపోయింది.

ప్రశ్న 5.
ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నవి ఏవి ?
జవాబు.
ఆట, పాట, భాష, యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి.

2. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.

రైతుకు కావలసిన నాగండ్లను, గొర్రులను, ఇతర కర్ర పనిముట్లను వడ్రంగి వాళ్లు తయారు చేసి ఇచ్చేవారు. కర్రు, కొడవలి, పార, గడ్డపార, బండికమ్ములు మొదలైన ఇనుప వస్తువులను కమ్మరి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు. కుండ, గురిగి, పటువ, ఎసుల, కాగు, గూన వంటి మట్టివస్తువులను కమ్మరివాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు. బంగారు నగలను అవుసుల వాళ్ళు తయారు చేసేవారు. మంగలివాళ్లు సవరం పని చేస్తే, పద్మశాలివాళ్ళు బట్టలు నేసేవారు. మేదరివాళ్ళ, ఎరుకలవాళ్ళు తట్టబుట్టలను అల్లేవారు. బట్టలను మేరవాళ్ళు కుట్టేవాళ్ళు, కోమటివాళ్ళు అందరికి కావలసిన ఇతర సరుకులను అమ్మేవారు. రైతులు వీళ్లనుంచి తనకు కావలసిన వస్తువులను తీసుకుని పొలం దున్ని పంటను పండించేవారు. పండించిన పంటను అన్ని కులాల వారికి ‘ఎరం’ పేరుతో పంచేవారు. ఈ ధాన్యాన్ని ఆయా కులాలవారు తమ తిండికి సరిపోను నిలువ చేసుకుని మిగతాది షావుకారికి అమ్మి ఇతర వస్తువులు తీసుకునేవారు.

ప్రశ్నలు:

1. బట్టలు నేసేవారిని ఏమంటారు ?
(అ) మంగలి వాళుళ
(ఆ) మేదరి వాళ్ళు
(ఇ) పద్మశాలి వాళ్ళు
(ఈ) కుమ్మరి వాళ్ళు
జవాబు.
(ఇ) పద్మశాలి వాళ్ళు

2. కింది వాటిలో కుమ్మరివాళ్ళు తయారు చేయని వస్తువు ఏది ?
(అ) బంగారు నగలు
(ఆ) కాగు
(ఇ) కుండ
(ఈ) పటువ
జవాబు.
(అ) బంగారు నగలు

3. మేదరివాళ్ళు ఎరుకలవాళ్ళు ఏమి చేసేవారు ?
(అ) బట్టలు కుట్టడం
(ఆ) తట్ట బుట్టలను అమ్మడం
(ఇ) పంటలు పండించడం
(ఈ) తట్టబుట్టలను అల్లడం
జవాబు.
(ఈ) తట్టబుట్టలను అల్లడం

4. పండించిన పంటను అన్ని కులాల వారికి పంచడానికి ఏమని పేరు ?
(అ) శిరం
(ఆ) ఎరం
(ఇ) వరం
(ఈ) గరం
జవాబు.
(ఆ) ఎరం

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

5. కర్ర పనిముట్లను ఎవరు తయారు చేస్తారు ?
(అ) వడ్రంగులు
(ఆ) కుమ్మరులు
(ఇ) కమ్మరులు
(ఈ) రైతులు
జవాబు.
(అ) వడ్రంగులు

3. కింది పేరా చదవండి. ఖాళీలను పూరించండి.

చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి ‘పెద్ద నీరటికాడు’ ఉండేవాడు. ఇతడు తూములను జాగ్రత్తగా చూసుకొంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు. ఒక్కొక్క కాలువకు ఒక నీరటికాడు ఉండేవాడు. అతడు కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు. వీరిద్దరు కలిసి నీటిచుక్కను కూడా వృధా పోనీయకుండా పంటచేలకు, కాలువలకు ఉపయోగించేవారు. ‘పెద్ద నీరటికాడు’ పదవి వంశపారంపర్యంగా వచ్చేది. కాని చిన్న నీరటి గాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు.

ఖాళీలు:

1. కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు …………………
2. పెద్ద నీరటికాడు ……………….. నీళ్ళను పొలాలకు సమంగా పంచేవాడు.
3. చిన్న నీరటిగాళ్లను …………………. నియమించుకుంటారు.
4. నీరటిగాళ్ళు ………………… వృథా చేయరు.
5. తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు ………………
జవాబు.
1. కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు నీరటికాడు
2. పెద్ద నీరటికాడు చెరువు నీళ్ళను పొలాలకు సమంగా పంచేవాడు.
3. చిన్న నీరటిగాళ్లను పొలాల రైతులే నియమించుకుంటారు.
4. నీరటిగాళ్ళు చుక్క నీటిని వృథా చేయరు.
5. తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు పెద్ద నీరటికాడు

4. క్రింది పేరాను చదివి ‘5’ ప్రశ్నలు తయారు చేయండి.

సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు మొదలు పెట్టేరోజన్న మాట. దీన్ని ఎరువాక పండుగ అని కూడా అంటారు. రైతు వ్యవసాయం పని చేయని రోజంటూ ఉండదు. కాని సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకొని నాగలి కట్టి నాలుగు సాళ్లు దున్ని పారతో నాలుగుసార్తు తవ్వి భూదేవతను మొక్కుకుంటాడు. సాగువాటు అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అద్దం పడుతుంది. ఆరోజు రైతు దంపతులు కూరుకు రాత్రే నిద్ర లేస్తారు. తలంటుస్నానం చేస్తారు. దేవుడికి మొక్కుకుంటారు.
జవాబు.
1. రైతు వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజును ఏమంటారు ?
2. సాగువాటుకు మరో పేరేమిటి ?
3. రైతు సాగువాటు రోజు ఏ దేవతకు మొక్కుకుంటాడు ?
4. ఎవరు పని చేయని రోజంటు ఉండదు ?
5. ఎరువాక రైతు జీవితంలో దేనికి అద్దం పడుతుంది ?

TS 6th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana తెలంగాణ పల్లెలు-సంస్కృతి

5. కింది పేరా చదవండి. ఖాళీలను పూరించండి.

పల్లెల్లో ప్రజలు నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, చిందుబాగోతాలతో కాలక్షేపం చేసేవారు. వీటితో ప్రజలకు మంచి సందేశం అందేది. రాత్రంత మెలకువతో ఉండి నాటకాలు, బాగోతాలు చూసేవారు. ఎండకాలం వచ్చిందంటే చాలు ఏ చెట్టుకిందనో, కూలిన గోడలమధ్యనో బాగోతాలు ఆడేవారు. ఆ పాటలు విన్న పిల్లలు మరునాడు ఏచూరు కిందనో అరుగులమీదనో అదే పాటలతో ఆటలను ఆడేవారు. ఇప్పుడు ఇంటింటా టీవీలు, సినిమాలు వచ్చాయి. టీవీల్లో అసభ్య సన్నివేశాలతో సీరియళ్లు వస్తున్నాయి. అవి మనుషుల్లో జుగుప్సను, దురాలోచనలను పెంచుతున్నాయి. కారణాలు ఏవైనా పల్లెల సంస్కృతి కనుమరుగైపోతున్నది.

ఖాళీలు

1. రాత్రంత మెలకువతో ఉండి నాటకాలు, ……………………. చూసేవారు.
2. ఇప్పుడు ఇంటింటా ……………… సినిమాలు వచ్చాయి.
3. కారణాలు ఏవైన ……………. కనుమరుగై పోతున్నది.
4. పిల్లల్లో దురాలోచనలను కలుగజేసేవి …………….
5. చెట్టు కిందనో, కూలిన గోడల మధ్యనో ……………. ఆడేవారు
జవాబు.
1. రాత్రంత మెలకువతో ఉండి నాటకాలు, బాగోతాలు చూసేవారు.
2. ఇప్పుడు ఇంటింటా టీవీలు సినిమాలు వచ్చాయి.
3. కారణాలు ఏవైన పల్లెల సంస్కృతి కనుమరుగై పోతున్నది.
4. పిల్లల్లో దురాలోచనలను కలుగజేసేవి సినిమాలు టీవీలలో వచ్చే అసభ్య సన్నివేశాలు
5. చెట్టు కిందనో, కూలిన గోడల మధ్యనో బాగోతాలు ఆడేవారు

6. క్రింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

పల్లెల్లో ఆటపాటలు విభిన్నంగా ఉండేవి. గోటీలు, చిర్రగోనె, కబడ్డి, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళ, పరమపదసోపానపటం, పచ్చీసు, అష్టా చెమ్మ, మట్టికుప్పలు, రేసు, కాశెపుల్ల, దాల్దడి దస్సన్న పొడి వంటి ఆటలతో శారీరక దృఢత్వమే కాదు మానసిక ఎదుగుదల ఉండేది. కలిసి ఆడటం వలన స్నేహం బలపడేది. జీవితంలో పోటీ తత్వం పెరిగేది. బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు వంటి ఆటల్లో పాటలు కూడా ఉండేవి. పాటను, ఆటను కలిపి లయబద్ధంగా ఆడి పాడటంలో సంగీతం, సాహిత్యాల్లో ప్రవేశం లభించేది. గ్రహణశక్తి పెరిగేది. పాటల ద్వారా మంచి విషయాలు, చరిత్ర తెలిసేది. ఆలోచనా పరిధి విస్తరించేది. తరం నుంచి తరానికి ఆచార వ్యవహారాలు తెలిసేవి. భాషా పరిజ్ఞానం అలవడేది.
జవాబు.
1. లయబద్ధంగా ఆడి పాడటంలో దేనిలో ప్రవేశం లభించేది ?
2. తరం నుంచి తరానికి ఏమి తెలిసేవి ?
3. పల్లెల్లో ఆటలు ఎలా ఉండేవి ?
4. కలిసి ఆడటం వలన ఏం బలపడేది ?
5. పాటల ద్వారా ఏఏ విషయాలు తెలిసేవి ?

Leave a Comment