TS Inter 2nd Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

TS Inter 2nd Year Economics Study Material 8th Lesson విదేశీ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశపు విదేశీ వర్తక సంతులనం మరియు చెల్లింపు శేషంను పరిశీలించండి.
జవాబు.
ఒక నిర్ణీత కాలంలో ఒక దేశం, ప్రపంచ దేశాలతో నిర్వహించే వర్తకానికి సంబంధించి వివరాలు ఆస్తి అప్పుల పట్టీ రూపంలో సంఖ్యాత్మకంగా రూపొందించబడే రికార్డును విదేశీ వర్తక చెల్లింపుల శేషం తెలియజేస్తుంది.

భారతదేశంలో విదేశీ వర్తక మిగులు, విదేశీ వర్తక చెల్లింపుల శేషం :

1. విదేశీ వర్తక మిగులు :
భారతదేశం ఇంతవరకు అమలు పరచిన పంచవర్ష ప్రణాళికల కాలంలో ఇంచుమించు అన్ని ప్రణాళికల కాలాల్లో ప్రతికూల విదేశీ వర్తక మిగులు ఉన్నదనే చెప్పాలి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ లోటు రూ. 108 కోట్లు అయితే, రెండవ ప్రణాళికలో ఇది రూ.467 కోట్లకు చేరింది.

అలాగే ఈ లోటు 3వ ప్రణాళికా కాలంలో రూ.477 కోట్లు ఉండగా, తొమ్మిదవ ప్రణాళికా కాలం నాటికి రూ.36,363 కోట్లకు చేరింది. పదవ ప్రణాళికా కాలంలో ఇది రూ. 1,49,841 కోట్లకు చేరుకొంది.

భారతదేశ విదేశీ వ్యాపారంలో దశాబ్దాల వారీ ధోరణులు (రూ. కోట్లలో)

TS Inter 2nd Year Economics Study Material 8th Lesson విదేశీ రంగం 1

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

i) విదేశీ వర్తకపు విలువలో దశాబ్దాల వారీగా వ్యత్యాసాల ధోరణులు :
ఇది వరకే చెప్పినట్లు విదేశీ వ్యాపార మొత్తం విలువ తెలుసుకోవటానికి ఎగుమతుల, దిగుమతుల విలువలు కలుపాలి. పట్టిక ప్రకారం, 1960-61 మధ్య కాలంలో భారతదేశ విదేశీ వ్యాపార పరిమాణం రూ.3835 కోట్లు, ఇది. 1970-71లో రూ.3,169 కోట్లు, 1980-81లో రూ. 19,260 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత, వ్యాసార విలువ మరింత వేగంతో పెరిగింది.

1990-91లో రూ.75,751 కోట్లున్న ఈ విలువ 2000 01లో రూ. 4,29,663 కోట్లకు, 2010-11లో రూ.28,26,289 కోట్లకు గణనీయంగా పెరిగిందని అర్ధమవుతుంది. 2014 – 15లో రూ. 46,33,486 కోట్ల గరిష్ఠ స్థాయికి చేరి, 2015-16లో రూ.42,06,676 కోట్లకు తగ్గి, తిరిగి 2017-18లో రూ. 49,57,548 కోట్ల మేరకు పెరిగింది. మళ్ళీ 2019-20 సంవత్సరం నాటికి రూ. 28,18,764 కోట్ల మేరకు తగ్గింది.

1960-61 నుండి 1980-81 ల మధ్య మొదటి రెండు దశాబ్దాల్లో దేశ వ్యాపార పరిమాణం 579.4 శాతం పెరిగింది. 1980-81 నుండి 1990-91 మధ్య 293 శాతం పెరిగితే, 1990-91 నుండి 2000-01 మధ్య 467 శాతం, 2000-01 నుండి 2010-11 మధ్య దశాబ్ది కాలంలో 558 శాతం పెరిగింది. 2018-19 పై 2019-20లో 3 శాతం మేరకు తగ్గింది. కాబట్టి 1960-61 నుండి భారతదేశపు విదేశీ వర్తకపు విలువ అధిక రేటులో పెరుగుతుందనేది స్పష్టమవుతుంది.

ii) దిగుమతులలో దశాబ్దాల వారీగా వృద్ధి :
భారతదేశ విదేశీ వ్యాపారంలో చెప్పుకోదగిన లక్షణం ఏమంటే నిర్విరామంగా పెరుగుతున్న దిగుమతులు. 1960-61లో రూ.2,795 కోట్లు ఉన్న దిగుమతుల మొత్తం విలువ 1980-81లో రూ. 12,549 కోట్లకు, అంటే 349 శాతం పెరిగింది. 1990-91 నుండి 2000-01 దశాబ్దంలో దిగుమతుల విలువ రూ. 2,28,307 కోట్లకు, అనగా 428 శాతం పెరిగింది. 2000-01 తో పోలిస్తే 2010-11లో రూ.16,83,467 కోట్లకు 637 శాతం పెరిగాయి. 2014-15లో రూ.27,37,087 కోట్లతో దిగుమతులు గరిష్ఠంగా నమోదైనాయి.

2015-16, 2016-17లలో దిగుమతులు స్వల్పంగా తగ్గాయి. 2019-20 దిగుమతుల విలువ రూ.17,01,997 కోట్ల మేరకు తగ్గింది మరియు 2018-19 పై 5 శాతం మేరకు తగ్గింది. పారిశ్రామిక ఉత్పాదకాలు (inputs), ఆహార పదార్థాలు, వంట నూనెలు, ద్రవ్యోల్బణ – నిరోధక దిగుమతులు, చమురు ధరలు క్రమం తప్పకుండా పెరగటం, 1991 తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత దిగుమతి విధానం మొదలైనవన్నీదిగుమతులు పెరగటానికి కారణాలు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

iii) ఎగుమతులలో దశాబ్దాల వారీ వృద్ధి :
కొన్ని సంవత్సరాలుగా భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు మందకొడిగా ఉన్నది. 1960-61, 1980-81 ల మధ్య ఎగుమతుల విలువ వరుసగా రూ.1,040 కోట్ల నుండి రూ.6,711 కోట్లకు పెరిగింది.

ఈ రెండు దశాబ్దాల వృద్ధి రేటు 545.3 శాతంగా ఉన్నది. 1990-91లో రూ. 32,553 కోట్లు ఉన్న ఎగుమతులు, 2000-01ల ఎగుమతులు రూ.11,42, 922 కోట్లకు, అంటే 468 శాతం పెరిగాయి. ఇదే దశాబ్ద కాలంలో దిగుమతుల వృద్ధి 637 శాతం. 2017-18 లో రూ. 19,56,515 కోట్లతో గరిషానికి చేరిన ఎగుమతులు, 2019-20 నాటికి రూ.11,16,767 కోట్ల మేరకు తగ్గాయి.

iv) వ్యాపార సంతులనంలో లోటు :
దిగుతులలో అధిక వృద్ధి, మందకొడి, ఎగుమతులు వ్యాపార సంతులనంలో లోటుకు కారణమవుతున్నారు. 1951 నుండి గమనిస్తే 1972-73, 1976-77 లలో మాత్రమే దేశానికి స్వల్ప మిగులు ఏర్పడింది. 1961లో రూ. 1,755 కోట్లు ఉన్న వర్తక సంతులన లోటు, 1980-81లో రూ.5,838 కోట్లకు పెరిగింది.

ఈ కాలంలో లోటు 673 శాతం పెరిగింది. తర్వాత కాలంలోనూ ఇదే లోటు కొనసాగింది. 2000-01తో పోలిస్తే 2010-11లో వర్తక లోటు రూ. 5,40,545 కోట్లకు అనగా 191 శాతం మేరకు పెరిగింది. 2017-18 ఈ లోటు రూ. 10,44,519 కోట్ల గరిష్టానికి చేరింది.

2019-20 లో ఈ లోటు రూ. 5,85,230 కోట్లకు తగ్గింది. మొదటి ప్రణాళికలో రూ.108 కోట్లు ఉన్న వర్తక లోటు క్రమంగా పెరిగి ఏడవ ప్రణాళిక నాటికి రూ.7,720 కోట్లకు పెరిగింది. 2017-18 సంవత్సరంతో పోల్చినప్పుడు 2018-19, 2019-20 వర్తక లోటు స్వల్పంగా తగ్గినా, మొత్తం మీద వర్తక లోటు భారీగానే ఉన్నది. డాలర్తో పోల్చినప్పుడు రూపాయి మారకం విలువ క్రమంగా తగ్గిపోవటం వల్ల దిగుమతులు ఖరీదుగా మారి వర్తక లోటు మరింత పెరుగుతున్నది.

చైనాతో భారత్కు గల వర్తక లోటు 2012-13లో 20.3 శాతం ఉన్నదల్లా 2017-18 వాటికి 43.2 శాతం మేరకు పెరిగింది. చైనా వస్తువులు భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. చైనా నుండి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడే దిగుమతులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం డంపింగ్- వ్యతిరేక పన్నులు విధించాలని తీవ్రంగా ఆలోచిస్తున్నది.

2. విదేశీ వర్తక చెల్లింపుల శేషం :
మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి ఇప్పటి వరకు అమలుపరచిన వివిధ ప్రణాళికల కాలంలో విదేశీ వర్తక చెల్లింపుల శేషపు కరెంటు ఖాతా లోటు వివరాలు పట్టికలో పొందుపరచబడ్డాయి. ఈ పట్టికలోని వివరాల ప్రకారం మొదటి ప్రణాళికా కాలంలో ఈ లోటు రూ.42 కోట్లు ఉంటే, రెండవ ప్రణాళికలో రూ.1,725 కోట్లకు చేరింది.

కరెంట్ ఖాతాలో ఇంత మొత్తంలో భారీ లోటు ఏర్పడటానికి గల ప్రధాన కారణం భారీ పరిశ్రమల అభివృద్ధి కోసం చేసుకొన్న దిగుమతులు, వ్యవసాయ రంగంలో ప్రతికూల పరిస్థితులు.

అయితే ఆర్థిక స్వావలంబన (self-reliance) లక్ష్య సాధన కోసం ఎగుమతుల వృద్ధి కోసం దిగుమతి ప్రత్యామ్నాయ (import substitution) పద్ధతిని ప్రభుత్వం అవలంభించింది. దిగుమతులపై నియంత్రణలు విధించింది. తత్ఫలితంగా నాల్గవ ప్రణాళికా కాలంలో మొదటిసారి విదేశీ వర్తక చెల్లింపుల శేషంలో రూ.100 కోట్ల మిగులును చవి చూసింది. అలాగే అదృశ్యాంశ వ్యాపార మిగులు అధికంగా పెరగడం వల్ల ఐదవ ప్రణాళికా కాలంలో రూ.3,082 కోట్ల మిగులును సాధించింది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 2.
భారతదేశపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి స్థితిగతులను వివరించండి.
జవాబు.
భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి :
1991 నుండి 2016 వరకు భారతదేశం పొందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్థూల ప్రవాహాలను సూచిస్తుంది. పట్టికలో పొందుపరిచిన దత్తాంశ వివరాల ప్రకారం, 1991న సంవత్సరంలో 129 యు.యస్. డాలర్ మిలియన్ల FDI ఉండగా 1997-98 నాటికి అది 3,557 యు.యస్. డాలర్ మిలియన్ల మేరకు పెరిగింది.

కానీ 1999- 2000 నాటికి 2,155 యు.యస్. డాలర్ మిలియన్ల మేరకు తగ్గింది. ఈ తగ్గుదలకు ప్రాచ్య ఆసియా దేశాలలోని సంక్షోభంసు ప్రధాన కారణంగా అపాదిస్తారు.

ఆ దేశాలలో సంక్షోభం ఇటీవల కాలంలో ప్రజాదరణ పొందుతున్న మార్కెట్లన్నింటిలోని మూలధన .ప్రవాహాలపై ఋణాత్మక ప్రభావాన్ని కనబరిచింది. 2000-01 కాలంలో పెట్టుబడుల ప్రవాహంలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. FDI ప్రవాహంల విలునలో సకారాత్మక పెరుగుదల ద్యోతకమవుతుంది. భారతీయ వినియోగదారుల భారీ డిమాండ్, సరళీకరించబడిన ప్రభుత్వ విధానం, కమ్యూనికేషన్ సౌకర్యాలు మొదలగు వాటిని ఈ పెరుగుదలకు గల పలు కారణాలుగా తెలియజేయవచ్చు.

2001-02వ సంవత్సరంలో FDI ప్రవాహాలు 6,130 యు.యస్ డాలర్ మిలియన్లు ఉండగా 2002-03వ సంవత్సరం నాటికి యు.యస్. డాలర్ 5,095 మిలియన్ల మేరకు మళ్ళీ తగ్గింది. 2003-04వ సంవత్సరం నాటికి మరింతగా అంటే యు.యస్. డాలర్ 4,322 మిలియన్ల మేరకు తగ్గింది.

అయితే 2004-05వ సంవత్సరం నాటికి మళ్ళీ యు.యస్. డాలర్ 6,052 మిలియన్ల మేరకు పెరిగింది. 2006-07వ సంవత్సరం నాటికి యు.యస్. డాలర్ 22,862 మిలియన్ల మేరకు పెరిగింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో గల ప్రపంచ పెట్టుబడి ధోరణిని తెలియజేస్తుంది.

తదుపరి కాల వ్యవధిలో తిరోగమన పథంలో మందగమనంను గమనించవచ్చు మరియు అలాంటి సందర్భంలో పెట్టుబడి ప్రవాహంలు యు.యస్. డాలర్ 37,746 మిలియన్ల మేరకు తగ్గినాయి. అయితే 2011-12వ సంవత్సరం నాటికి అవి మళ్ళీ యు.యస్. డాలర్ 46,552 మిలియన్ల మేరకు పెరిగినాయి. ఈ క్రమం సరళీకృత ఆర్ధిక వ్యవస్థ మరియు క్రమంగా తెరవబడుతున్న మూలధన ఖాతాలపై గణనీయమైన ప్రభావాన్ని కనపరిచింది.

అట్టి సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సరళత అనే సాధారణ దృక్పథాన్ని కలిగి ఉండడం వల్ల మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2013-14వ సంవత్సరంలో యు.యస్. డాలర్ 36,047 మిలియన్ల మేరకు తగ్గినాయి.

అవినీతి కేసులు పెరుగుతుండడం, అనవసరపు విధానపరమైన జాప్యాలు, పర్యావరణ సంబంధిత అంశాలు, మరియు అధిక ద్రవ్యోల్బణ రేటులు మొదలగునవి ఈ కాలంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల తగ్గుదలకు గల ప్రధానమైన పలు కారణాలుగా చెప్పవచ్చు.

ఇవి గాకుండా దేశీయపరంగా నెలకొని ఉన్న అంశాలు కూడా భారతదేశపు దీర్ఘకాలిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువపై దుష్ప్రభావాన్ని కనపరిచినాయి.

కాని 2014-15వ సంవత్సరంలో మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు యు.యస్. డాలర్ 45,147 మిలియన్ల మేరకు పెరగగా 2015-16 నాటికి యు.యస్. డాలర్ 55,559 మిలియన్ల మేరకు పెరిగినాయి. కాని 2016-17వ సంవత్సరంలో తగ్గి, 2017-18 మరియు 2018-19 లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వరుసగా యు.యస్. డాలర్ 42,156 మిలియన్ల మరియు యు.యస్. డాలర్ 50,553 మిలియన్ల మేరకు పెరిగినాయి.

భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మారిషస్ పెట్టుబడుల శాతం 32 గా ఉంది. అందువల్ల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలో ప్రబలమైన ఆధారంగా తెరపైకి వచ్చింది. మొత్తం పెట్టుబడిలో 20 శాతం మేరకు సింగపూర్ పెట్టుబడి ఉంది.

కాబట్టి, భారతదేశపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో సింగపూర్ రెండవ ప్రధాన వనరుగా ఉందనేది అర్ధమవుతుంది. 7 శాతం వాటాతో జపాన్ మరియు నెదర్లాండ్స్ మూడవ మరియు నాలుగవ స్థానంలో నిలిచాయి. యు.కె. మరియు యు.యస్.ఏ. దేశాలు ఒక్కొక్కటి 6 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి.

ఆ తదుపరి 3 శాతం వాటాను జర్మనీ కలిగి ఉంది. సైప్రస్, యు.ఏ.ఇ. మరియు ఫ్రాన్స్ దేశాలు 2 శాతం వాటాల చొప్పున కలిగి ఉన్నాయి. అంతేగాక, భారతదేశపు మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో దాదాపుగా 52 శాతం మేరకు మారిషస్, సింగపూర్ దేశాలు వాటాలను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

ఆఫ్షోర్ బ్యాంకింగ్ మరియు తక్కువ పన్ను రేటు, అత్యంత గోప్యతలలో ఆమోదయోగ్యమైన పరిష్కారాలను వారు సూచించడాన్ని దీనికి గల కారణంగా చెప్పవచ్చు. అంతేగాక, ఎక్కడైతే భారతదేశంలో లాభాలుంటాయో అక్కడ ఏవేని పన్నులతో సంబంధం లేకుండా భారతదేశంతో వారు Double Tax Avoidance Agreement (DTAA) ను కూడా కలిగి ఉన్నారు.

కాబట్టి, భారతదేశంలోని ఏదేనీ పెట్టుబడికి ప్రత్యక్ష సుగమమైన మార్గంగా మారిషస్ ఉందనేది గమనించదగినదిగా చెప్పవచ్చు. అందువల్ల, మన దేశపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మారిషస్ దేశం సింహ భాగాన్ని కలిగి ఉంది. దీనికి గల ప్రధాన కారణం ద్రవ్యం భారతదేశం నుండి మారిషసకు పోతుంది.

మరియు అక్కడి నుండి తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో భారతదేశానికి వస్తుంది. మొత్తం పెట్టుబడిలో సింగపూర్ 2వ స్థానంలో ఉన్నప్పటికీ 2018-19వ సంవత్సరం లోని పెట్టుబడుల వెల్లువను గమనించినచో 2016-17తో పోల్చినప్పుడు, అది రెండింతలైంది.

మారిషస్ DTAA యొక్క ఉపసంహరణను ఈ ఆకస్మిక పెరుగుదలకు కారణంగా తెలియజేయవచ్చు. ఒప్పందం . వల్ల ఎవరైతే లాభాలు పొందుతారో వారిపై ఆత్మాశ్రయ, పరాశ్రయ షరతులనే రెండు ఉన్నప్పటికీ సింగపూర్ నుండి తక్కువ పెట్టుబడులకు గల కారణంగా అంతకు ముందు కూడా గమనించనైనది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 3.
గాట్లో గల నిబంధనలు ఏవి ?
జవాబు.
ప్రపంచంలో 1930 సం॥లో ఏర్పడిన ఆర్థిక మాంధ్యం, రెండవ ప్రపంచయుద్ధం తరువాత అగ్రదేశాలు సరళీకరణతో కూడిన ప్రపంచ వ్యాపారం ఉండాలని భావించాయి. ఫలితంగా జెనీవాలో 23 దేశాల సంతకాలతో “సుంకాలు, వ్యాపారంపై సాధారణ ఒప్పందం”. (GATT) ని 30.10.1947లో ఏర్పాటు చేయడం జరిగింది.
విధులు :
1. అత్యంత అభిమానదేశం :
గాట్ ప్రథమ సూత్రాన్ని మొదటి ప్రకరణలో చేర్చారు. దీనిప్రకారం సభ్యదేశాల మధ్య విచక్షణ రహితంగా ప్రవర్తించటం. ఏదైన ఒక సభ్యదేశానికి అనుకూలమైన తీర్మానం చేస్తే గాట్లోని అన్ని సభ్యదేశాలకు ఆ తీర్మానం వర్తిస్తుంది.

గాట్ సభ్యదేశాలలో ఏదైనా ఒక దేశానికి సుంకాల రాయితీని కల్పించనట్లైతే MFN ప్రకారం మిగిలిన అన్ని దేశాలకు సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఒక సభ్యదేశంలోని పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి కోటాను నిర్ణయిస్తే మిగిలిన సభ్యదేశాన్ని MFN ప్రకారం దిగుమతి కోటా నిర్ణయించుకోవచ్చును.

2. సుంకాల రాయితీ :
అన్ని సభ్యదేశాల సుంకాల తగ్గింపు ఒకే విధంగా ఉండాలి అనేది గాట్ ప్రాథమిక అంశం గాట్ ఒప్పందం ప్రకారం సభ్యదేశాలు నిర్ణయించుకొన్న దిగుమతి సుంకాల పట్టికలను అధికం చేసుకోవడానికి వీలులేదు.

3. పరిమాణాత్మక నియంత్రణలను తొలగించడం :
అర్టికల్ XI ప్రకారం సభ్యదేశాలు అంతర్జాతీయ వర్తకంలో పరిమాణాత్మక నియంత్రణలు విధించకూడదు. అయితే విదేశీ వర్తక చెల్లింపుల శేషం సర్దుబాటు కోసం పరిమితులకు లోబడి నియంత్రణను అమలు చేయవచ్చు. అయితే ఇది విచక్షణా రహితంగా ఉండాలి.

4. అత్యవసర రక్షణ కోడ్ :
గాట్లోని XIX వ అర్టికల్ అత్యవసర రక్షణ కోడ్ను కల్పించింది. దీని ప్రకారం సభ్య దేశాలలోని దేశీయ ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోయినప్పుడు, ఆ దేశం సుంకాన్ని కాని, కోటానుగాని విధించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

5. మినహాయింపులు :
అర్టికల్ XX; XXI సాధారణ, భద్రత సదుపాయాలను కల్పిస్తాయి. ఇవి ఒప్పంద దేశాల దిగుమతి కోటాల రద్దు మినహాయింపులను తెలియజేస్తాయి.

6. ప్రతికూల పన్నులు, సబ్సిడీలపై నియమాలు :
టోక్యో రౌండ్ సమావేశంలో 1970లో జరిగిన ఒప్పందంపై సబ్బిడీలను, ప్రతికూల పన్నులపై నియమాలను చేర్చారు. దీని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలను మినహాయించి, తయారీ వస్తువులపై ఎగుమతి సుంకాలను రద్దు చేయడం, ప్రపంచ వర్తకంలో ప్రాథమిక వస్తువుల వాటా ఎక్కువగా ఉండే వాటి పైన ఎగుమతి సబ్సిడీలను నియంత్రించడం, ఎగుమతి సబ్సిడీల పెరుగుదల వల్లగాని డంపింగ్ వల్ల కాని దిగుమతి దేశాలకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం చెల్లించడం చేయాలి.

అదే విధంగా దిగుమతి దేశం లబ్ధి పొందుతున్న వస్తువులపై ప్రత్యక్ష సుంకాలను విధించి, లేదా ఎగుమతి దేశాలు ఎగుమతి సబ్బిడీలను కల్పిస్తే అప్పుడు స్వదేశ మార్కెట్కు నష్టం వాటిల్లుతుంది.

7. తగాదాల పరిష్కారం :
సభ్యదేశాల తగాదాల పరిష్కార వేదికగా గాట్ గొప్ప విజయాన్ని సొంతం చేసుకొన్నదని చెప్పవచ్చు. గాట్ నిబంధనలకు విరుద్ధంగా ఏ సభ్య దేశమైన ప్రవర్తించినప్పుడు అందిన ఫిర్యాదు పరిష్కారం కోసం గాట్ వార్షిక సమావేశాల్లో ప్రవేశ పెట్టి పరిష్కరించడం జరుగుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 4.
ప్రపంచ వర్తక సంస్థ యొక్క నిబంధనలేవి ?
జవాబు.
ఉరుగ్వే రౌండ్ అంతిమ చట్టంపై ఏప్రిల్ 1994 సం॥లో 124 గాట్ సభ్య దేశాలు సంతకాలు చేయడం వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. దీనికి జెనీవా ముఖ్య కార్యలయం కల్గి ఉండి 1-1 1995 సం॥ నుండి తన విధులను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2013 నాటికి దీనిలో 163 సభ్యదేశాలున్నాయి. ఇది చట్టబద్దమైన హోదా కలిగిన వ్యవస్థ. ఇది ప్రపంచ వ్యాపారాన్ని, సేవలు విదేశీ పెట్టుబడిని, మేథో సంపత్తి హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది.

నిబంధనలు :

  1. ప్రపంచ దేశాల మధ్య వీలయినంత మేరకు స్వేచ్ఛగా, ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా వర్తక వ్యవహారాలు జరిగేలా చూడడం ఈ సంస్థ ప్రధాన విధి.
  2. బహుళ వ్యాపార ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు, సంస్థ ఆశయాలు, పరిపాలన మొదలైన వాటి అమలు కోసం ఈ సంస్థ సౌకర్యాలను కల్పిస్తుంది.
  3. బహుళ వ్యాపార చర్యలకు వేదికగా పని చేస్తుంది.
  4. వర్తక ఒప్పంద తగాదాల పరిష్కారానికి కృషి చేస్తుంది.
  5. ఒప్పందాలు, తీర్మానాలు సభ్య దేశాల మధ్య అమలుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుంది.
  6. ప్రపంచ ఆర్థిక -విధానాల రూపకల్పనలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, వాటి అనుబంధ సంస్థలకు ప్రపంచ వర్తక సంస్థ సహకరిస్తుంది.

ప్రశ్న 5.
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ వర్తక సంస్థ (WTO) ప్రభావాన్ని వివరించండి. గాట్ (GATT) కంటె ఏ విధంగా భిన్నమైనది?
జవాబు.
భారతదేశం ప్రపంచ వర్తక సంస్థలో సభ్యత్వం పొందడం ద్వారా. కొన్ని ప్రయోజనాలు, మరియు ఆప్రయోజనాలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి.

ప్రయోజనాలు :

  1. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, వినియోగింపదగిన, ఆహార పదార్థాలు మరియు ఆల్కహాల్ ఉత్పత్తుల ద్వారా భారతదేశం పెద్ద మొత్తంలో లాభాన్ని అర్జిస్తుంది.
  2. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం ఎగుమతుల వాటా 0.5% నుంచి 1% శాతానికి పెరగవచ్చు.
  3. ప్రతి సం|| సగటున ఎగుమతుల వల్ల 2.7 బిలియన్ డాలర్లు అదనంగా సంపాదించే అవకాశం ఉంటుంది.
  4. బహుళ – పీచు ఒప్పందం రద్దు కావడం వల్ల భారతదేశ వస్త్రాల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది.
  5. సబ్బిడీల తగ్గింపు, ప్రతి బంధకాల తొలగింపు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వల్ల మనదేశ వ్యవసాయ ఎగుమతులకు మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది.
  6. అంతర్జాతీయ వర్తకం బహుళ ఒప్పంద నియమాల వల్ల క్రమశిక్షణలో పట్టిష్ఠంగా తయారైనందు వల్ల భారతదేశానికి అంతర్జాతీయ వర్తకంలో దైపాక్షిక ఒప్పందాల అవసరం లేకుండానే అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
  7. WTO, UNO ఉమ్మడి అజమాయిషీలో అంతర్జాతీయ వర్తక కేంద్రం పని చేస్తుంది కాబట్టి WTO లో భారతదేశం చేరినందు వల్ల ITC నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
  8. గాట్ ఒప్పందం వల్ల భారతదేశ బాంకింగ్, భీమా టెలి కమ్యూనికేషన్స్, నౌకాయానరంగాల్లో ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.

అప్రయోజనాలు :

  1. ప్రపంచ స్థాయిలో వర్తకం పెరిగినందువల్ల భారతదేశ ఎగుమతులు పెరుగుతాయా అనే నమ్మకం లేదు.
  2. WTO ఒప్పందం ప్రకారం ఔషధాలు, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు పెరిగి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగాల ప్రగతిని దెబ్బతీస్తాయి.
  3. WTO ఒప్పందంలో నిర్దేశించిన మేధో సంపత్తి పరిరక్షణ చట్టాలు బహుళ జాతి సంస్థల ఏకస్వామ్యానికి దారితీస్తాయి.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ వర్తక పాత్రను అంచనా వేయండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో అంతర్జాతీయ వర్తకపు పాత్ర గణనీయంగా ఉంటుంది. ప్రపంచదేశాల ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వర్తకం అత్యంత ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.

  1. తులనాత్మక వ్యయ ప్రయోజనం : తులనాత్మక వ్యయ ప్రయోజనం ఉన్న వస్తువుల ఉత్పత్తి అంతార్జాతీయ వర్తకం ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ వర్తకం, తక్కువ వ్యయంతో వస్తువులను ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది.
  2. మార్కెట్ల విస్తరణ : వస్తువులకు దేశీయ వినియోగదారుల డిమాండుతో బాటు విదేశీ వినియోగదారుల డిమాండు తోడవడంతో మార్కెట్ల విస్తరణకు అంతర్జాతీయ వర్తకం ఉపకరిస్తుంది. వస్తుత్పత్తి అధిక మొత్తంలో పెరిగినప్పుడు సగటు వ్యయం తగ్గి వస్తువుల ధరలు తగ్గుతాయి.
  3. వ్యవసాయరంగ అభివృద్ధి : భారతదేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయరంగం వెన్నుముక లాంటిది. వ్యవసాయ రంగ అభివృద్ధి విదేశీ వర్తకానికి ఎంతగానో తోడ్పడుతుంది.
  4. పోటీ : ఒక దేశంలో స్థానికంగా ఉండే ఏకస్వామ్యాల నిరోధనకు అంతర్జాతీయ వర్తకం తోడ్పడుతుంది. దిగుమతులు చౌకగా లభించినప్పుడే స్థానిక ఏకస్వామ్యదారులు దేశీయ వినియోగదారులను మోసానికి గురిచేయలేరు.
  5. వ్యాపార విధానం : వ్యాపార, వాణిజ్య రంగాలు భారతదేశ ఆర్థికాభివృద్ధిలో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. సుగంధ `ద్రవ్యాలు, భారతదేశ ఎగుమతుల్లో ప్రముఖ పాత్రను కలిగి ఉన్నాయి.
  6. విదేశీ పెట్టుబడి : ఆర్థిక సంస్కరణ అమలులో భాగంగా విద్యుచ్ఛక్తి శక్తి వనరులు ఎలక్ట్రికల్ సామాగ్రి, రవాణా వంటి కీలక రంగాలలో కూడా బహుళ జాతి సంస్థల పెట్టుబడి అనుమతించబడింది.

ప్రశ్న 2.
విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం, విదేశీ వర్తక మిగులును విభేదించండి.
జవాబు.
ఒక నిర్ణీతకాలంలో ఒక దేశం, ప్రపంచ దేశాలతో నిర్వహించే వర్తకానికి సంబంధించిన వివరాలు ఆస్తి-అప్పుల పట్టిక రూపంలో సంఖ్యాత్మకంగా రూపొందింపబడే రికార్డును విదేశీవర్తక చెల్లింపుల శేషం తెలియజేస్తుంది. ఒక నిర్ణీత కాలంలో ఒకదేశంలో నివసించే ప్రజలు, సంస్థలు ఇతర దేశాల ప్రజలు, సంస్థలలో జరిపే ఆర్థిక వ్యవహారాలను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో రికార్డు రూపంలో రాయడమే విదేశీ వర్తక చెల్లింపుల శేషం.

ఒక నిర్ణీతకాలంలో ఒక దేశంలో నివసించేవారు, ఇతర దేశాల నిర్వాసితులతో చేసే వ్యాపార వ్యవహారాల చెల్లింపులు విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అంతర్భాగాలు. విదేశీ వర్తక చెల్లింపుల శేషం చెల్లింపులు, రాబడులకు సంబంధించిన పట్టిక, కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే వ్యత్యాసం మిగులు లేదా లోటును తెలుపుతుంది. ఒకవేళ చెల్లింపుల కంటే రాబడి ఎక్కువగా ఉంటే అది మిగులును, ఇందుకు భిన్నంగా చెల్లింపులకంటే రాబడి తక్కువగా ఉంటే అది లోటును తెలుపుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 3.
కరెంటు ఖాతా, మూలధన ఖాతాలను విభేదించండి.
జవాబు.
అంతర్జాతీయ చెల్లింపుల, రాబడుల వివరాలు పట్టికయే విదేశీ వర్తక చెల్లింపుల శేషం. ఇది జంట పద్దు విధానం రూపంలో ఉంటుంది.” సాధారణంగా ఒక దేశపు విదేశీ వర్తక చెల్లింపుల శేషంలో రెండు ఖాతాలు ఉంటాయి. అవి కరెంటు ఖాతా, మూలధన ఖాతా. వీటిని క్రింది విధంగా వివరించవచ్చును.

TS Inter 2nd Year Economics Study Material 8th Lesson విదేశీ రంగం 2

ప్రశ్న 4.
గాట్ ( GATT) విధులను విపులీకరించండి.
జవాబు.
ప్రపంచంలో 1930 సం॥లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచయుద్ధం తరువాత అగ్రదేశాలు సరళీకరణతో కూడిన ప్రపంచ వ్యాపారం ఉండాలని భావించాయి. ఫలితంగా జెనీవాలో 23 దేశాల సంతకాలతో “సుంకాలు, వ్యాపారంపై సాధారణ ఒప్పందం”. (GATT) ని 30.10.1947లో ఏర్పాటు చేయడం జరిగింది.

విధులు :
1. అత్యంత అభిమానదేశం :
గాట్ ప్రథమ సూత్రాన్ని మొదటి ప్రకరణలో చేర్చారు. దీనిప్రకారం సభ్యదేశాల మధ్య విచక్షణ రహితంగా ప్రవర్తించటం. ఏదైన ఒక సభ్యదేశానికి అనుకూలమైన తీర్మానం చేస్తే గాట్ లోని అన్ని సభ్యదేశాలకు ఆ తీర్మానం వర్తిస్తుంది. గాట్ సభ్యదేశాలలో ఏదైనా ఒక దేశానికి సుంకాల రాయితీని కల్పించినట్లైతే MFN ప్రకారం మిగిలిన అన్ని దేశాలకు ముఖ్యమైన ప్రశ్న
కరెంటు ఖాతా, మూలధన ఖాతాలను విభేదించండి.

సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఒక సభ్యదేశంలోని పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి కోటాను నిర్ణయిస్తే మిగిలిన సభ్యదేశాన్ని ప్రకారం దిగుమతి కోటా నిర్ణయించుకోవచ్చును.

2. సుంకాల రాయితీ :
అన్ని సభ్యదేశాల సుంకాల తగ్గింపు ఒకే విధంగా ఉండాలి అనే ది. గాట్ ప్రాథమిక అంశం. గాట్ ఒప్పందం ప్రకారం సభ్యదేశాలు నిర్ణయించుకొన్న దిగుమతి సుంకాల పట్టికలను అధికం చేసుకోవడానికి వీలులేదు.

3. పరిమాణాత్మక నియంత్రణలను తొలగించడం :
అర్టికల్ XI ప్రకారం సభ్యదేశాలు అంతర్జాతీయ వర్తకంలో పరిమాణాత్మక నియంత్రణలు విధించకూడదు. అయితే విదేశీ వర్తక చెల్లింపుల శేషం సర్దుబాటు కోసం పరిమితులకు లోబడి నియంత్రణను అమలు చేయవచ్చు. అయితే ఇది విచక్షణా రహితంగా ఉండాలి.

4. అత్యవసర రక్షణ కోడ్ :
గాట్లోని XIX వ ఆర్టికల్ అత్యవసర రక్షణ కోడ్ను కల్పించింది. దీని ప్రకారం సభ్య దేశాలలోని దేశీయ ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోయినప్పుడు, ఆ దేశం సుంకాన్ని కాని, కోటానుగాని విధించుకోవడానికి అవకాశం .కల్పిస్తుంది.

5. మినహాయింపులు :
అర్టికల్ XX; XXI సాధారణ, భద్రత సదుపాయాలను కల్పిస్తాయి. ఇవి ఒప్పంద దేశాల దిగుమతి కోటాల రద్దు మినహాయింపులను తెలియజేస్తాయి.

6. ప్రతికూల పన్నులు, సబ్బిడీలపై నియమాలు :
టోక్యో రౌండ్ సమావేశంలో 1970లో జరిగిన ఒప్పందంపై సబ్బిడీలను, ప్రతికూల పన్నులపై నియమాలను చేర్చారు.

దీని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలను మినహాయించి, తయారీ వస్తువులపై ఎగుమతి సుంకాలను రద్దు చేయడం, ప్రపంచ వర్తకంలో ప్రాథమిక వస్తువుల వాటా ఎక్కువగా ఉండే వాటి పైన ఎగుమతి సబ్సిడీలను నియంత్రించడం, ఎగుమతి సబ్సిడీల పెరుగుదల వల్లగాని డంపింగ్ వల్ల కాని దిగుమతి దేశాలకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం చెల్లించడం చేయాలి.

అదే విధంగా దిగుమతి దేశం లబ్ధి పొందుతున్న వస్తువులపై ప్రత్యక్ష సుంకాలను విధించి, లేదా ఎగుమతి దేశాలు ఎగుమతి సబ్సిడీలను కల్పిస్తే అప్పుడు స్వదేశ మార్కెట్కు నష్టం వాటిల్లుతుంది.

7. తగాదాలు పరిష్కారం :
సభ్యదేశాల తగాదాల పరిష్కార వేదికగా గాట్ గొప్ప విజయాన్ని సొంతం చేసుకొన్నదని చెప్పవచ్చు. గాట్ నిబంధనలకు విరుద్ధంగా ఏ సభ్య దేశమైన ప్రవర్తించినప్పుడు అందిన ఫిర్యాదు పరిష్కారం కోసం గాట్ వార్షిక సమావేశాల్లో ప్రవేశ పెట్టి పరిష్కరించడం జరుగుతుంది.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 5.
గాట్ (GATT) సమావేశాలు చర్చించండి.
జవాబు.
1947 నుంచి 1993 వరకు ఎనిమిది సార్లు గాట్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలు, వాటి చర్చలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చార్ట్ : గాట్ సభ్య దేశాల సమావేశాలు

TS Inter 2nd Year Economics Study Material 8th Lesson విదేశీ రంగం 3

మొదటి ఆరు సమావేశాలు సుంకాల తగ్గింపుపై చర్చించాయి. ఏడవ సమావేశం సుంకేతర అంశాలపై చర్చించండి. ఎనిమిదవ సమావేశం గతంలోని సమావేశాల కంటే పూర్తిగా భిన్నమైంది. దీనిని ఉరుగ్వే రౌండ్ అంటారు. ఈ సమావేశంలోనే ప్రపంచ వర్తక సంస్థ (W.T.O) ఆవిర్భవించింది.

ప్రశ్న 6.
W.T.O లక్ష్యాలను వివరించండి.
జవాబు.
ఉరుగ్వే రౌండ్ అంతిమ చట్టంపై 1994 సం॥లో 124 గాట్ సభ్యదేశాలు సంతకాలు చేయడం వల్ల “ప్రపంచ వాణిజ్య సంస్థ” ఏర్పడింది. దీని ముఖ్య కార్యాలయం జెనీవాలో ఉంది. 1.1.1995 నుండి తన విధులను నిర్వహిస్తోంది.

ఆశయాలు :

  1. అంతర్జాతీయ వర్తకం, ఆర్థిక అభివృద్ధి ద్వారా సంపూర్ణత ఉద్యోగితను సాధించి, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడం.
  2. సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచంలోని ఉత్పాదక వనరులను అంతర్జాతీయ వర్తకంలో అభిలషణీయంగా వినియోగించుకొని, పర్యావరణాన్ని రక్షించుకొని అభివృద్ధిని సాధించుకోవడం.
  3. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అభివృద్ధితో పాటు అంతర్జాతీయ వర్తకంలో వాటి వాటి పెరిగే విధంగా అనుకూలమైన విధానాలను చేపట్టడం.
  4. సభ్య దేశాల మధ్య తగదాల పరిష్కార పద్ధతులను రూపొందించడం.
  5. అంతర్జాతీయ వర్తకంలో అన్ని దేశాల మధ్య పరస్పర సహకార భావాల్ని పెంపొందించి సుంకాలను, ఇతర వ్యాపార ప్రతిబంధకాలను తొలగించి ప్రత్యక్ష లాభాలు పొందే విధంగా సదుపాయాలను సమకూర్చడం.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 7.
గాట్ (GATT) మరియు W.T.O మధ్య గల విభేదాలను విశ్లేషించండి.
జవాబు.

గాట్ ప్రపంచ వర్తక సంస్థ
1. వ్యవస్థాపూర్వకమైన పునాది లేదు. 1. ఇది సచివాలయంతో కూడుకున్న శాశ్వత సంస్థ.
2. నియమ నిబంధనలు ప్రాతిపదిక రూపంలో ఉంటాయి. 2. ఒప్పంద నిబంధనలు శాశ్వతమైన రూపంలో సంపూర్ణంగా ఉంటాయి.
3. నియమ నిబంధనలు వస్తువులకు మాత్రమే పరిమితం అవుతాయి. 3. వస్తువులతో బాటు సేవలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి.
4. ప్రత్యేకమైన అంశాలపైన ప్రత్యేకమైన ఒప్పందాలు ఏర్పాటు చేశారు. వీటి పైన సంతకాలు చేసినవారు మాత్రమే కట్టుబడి ఉండాలి. కాని ఇతరులు నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు. 4. ఒప్పంద నియమ నిబంధనలను సభ్యదేశాలన్ని తప్పకుండా ఆచరించాలి.
5. తగాదాల పరిష్కార నివేదికలోని అంశాలను సభ్య దేశాలు తప్పకుండా ఆచరించాలనే నిబంధన లేదు. 5. ప్రపంచ వాణిజ్య సంస్థలోని ఒప్పందాలు శాశ్వతమైనవి. ఏ సభ్యదేశాలు అయినా వాటిని అతిక్రమించినట్లయితే శిక్షను అనుభవించాల్సిందే.

 

ప్రశ్న 8.
వ్యవసాయ ఒప్పందం (AOA) పై ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు.
ఈ ఒప్పందం మార్కెట్ల సౌలభ్యత, స్వదేశీ ప్రోత్సాహం, ఎగుమతుల ప్రోత్సాహనికి సంబంధించినది. సభ్యదేశాలు సుంకేత ఆటంకాలు అయిన కోటాలను సమానంగా సుంకాలు మార్చుకోవలసి ఉంటుంది. ఈ సుంకాలను తమ తమ వ్యవసాయ ఉత్పత్తులపై తగ్గించుకోవలసిన అవసరం ఉంటుంది.

వ్యవసాయ ఉత్పత్తులు, వర్తకానికి సంబంధించి వ్యవసాయంపై ప్రపంచవర్తక సంస్థ ఒప్పందంలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ఎ) మార్కెట్ సౌలభ్యత – సుంకేతర ఆటంకాలైన కోటాలు, లెవీలు కనీస దిగుమతి ధరలు మొదలైనవి.
బి) స్వదేశీ ప్రోత్సాహం – అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తగ్గింపు శాతం 20 అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 13.3%.
సి) ఎగుమతి సబ్సిడీల – అభివృద్ధి చెందిన దేశాల్లో 6సం॥రాల కాల వ్యవధిలో సబ్బిడీ వ్యయ తగ్గింపు 36% పరిమాణం 21% అయితే 10సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సబ్సిడీ వ్యయ తగ్గింపు 24% పరిమాణం 14%.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI)
జవాబు.
ఇది దీర్ఘకాలికంగా వివిధ దేశాల మధ్య బదిలీ అవుతుంది. విదేశస్తులు, వివిధ దేశాలలోని సంస్థలలో యాజమాన్యపు నియంత్రణ కోసం లేదా ఉత్పత్తిలో భాగస్వాములుగా చేరడానికి చేసే పెట్టుబడిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు.

ప్రశ్న 2.
విదేశీ వర్తక సంతులనం.
జవాబు.
ఒక నిర్ణీత కాలంలో ఒక దేశపు ఎగుమతులు, దిగుమతుల విలువల మధ్య గల నికర తేడాను విదేశీ వర్తక సంతులనం అంటారు. ఇక్కడ దృశ్య అంశాల మధ్యగల తేడాను (వస్తువుల ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య గల తేడాను) చెబుతాము.

ప్రశ్న 3.
అదృశ్యాంశాలు.
జవాబు.
అంతర్జాతీయ వ్యాపారంలో ప్రపంచంలోని ఒక దేశం ఇతర దేశాలతో చేసే వ్యాపారంలో సేవలు అయిన రవాణా, బీమా, బ్యాంకింగ్, వడ్డీ చెల్లింపు మొదలైన అంశాల ఎగుమతుల దిగుమతులను అదృశ్యాంశాలు అని అంటారు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 4.
గాట్ (GATT) లక్ష్యాలు.
జవాబు.

  1. నిష్పక్షపాతంగా అత్యంత అభిమాన దేశం క్లాజ్ను అనుసరించడం.
  2.  సుంకాల ద్వారానే స్వదేశ పరిశ్రమలకు రక్షణ కల్పించడం.
  3. అంతర్జాతీయ వర్తకాన్ని పాదర్శకంగా విచక్షణా రహితంగా అమలు పర్చడం.
  4. బహుళ ఒప్పందాల ద్వారా సుంకాలను, సుంకేతర అంశాలను సరళీకరించడం.

ప్రశ్న 5.
W.T.O లక్ష్యాలు
జవాబు.

  1. అంతర్జాతీయ వర్తకం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.
  2. సుస్థిర అభివృద్ధి.
  3. సభ్యుదేశాల మధ్య తగాదాల పరిష్కార పద్ధతులను రూపొందించడం.
  4. అంతర్జాతీయ వర్తకంలో అన్ని దేశాల మధ్య పరస్పర సహకార ఖాతాల్ని పెంపొందించి, సుంకాలను, ఇతర వ్యాపార ప్రతిబంధకాలను తొలగించి ప్రత్యక్ష లాభాలు పొందే విధంగా సదుపాయాలను సమకూర్చడం.

ప్రశ్న 6.
అత్యంత అభిమాన దేశం (M.F.N).
జవాబు.
గాట్ ఒప్పందపు ఆర్టికల్ – (II) అత్యంత అభిమాన దేశం క్లాజ్ను వివరిస్తుంది. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ వర్తకానికి సంబంధించి అన్ని సభ్యుదేశాలను సమాన ప్రాతిపదికన చూడాలి. ఏ ఒక్క దేశానికి ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించకూడదు. ఒక సభ్యదేశంలోని పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి కోటాను నిర్ణయిస్తే మిగిలిన సభ్యదేశాలన్నీ M.F.N ప్రకారం దిగుమతి కోటాను నిర్ణయించుకోవచ్చు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 7.
మేధో సంపత్తి హక్కులు (TRIP’s).
జవాబు. వర్తక సంబంధిత మేధో సంపత్తి హక్కుల ఒప్పందం ప్రపంచ వర్తక సంస్థ సభ్యు దేశాల మధ్య జరిగింది. పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లు, భౌగోళిక సూచికలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ప్రశ్న 8.
పెట్టుబడి సంబంధిత వర్తకపు ఒప్పందం (TRIMS).
జవాబు.
వ్యాపార సంబంధిత పెట్టుబడి కొలమానముల ప్రకారం దేశంలోని అన్ని రకములైన నియమ నిబంధనలను తొలగించి విదేశీ పెట్టుబడులను స్వదేశీ పెట్టుబడులుగా పరిగణించడం ద్వారా జాతీయ భావం కల్పించడం. ఈ నిబంధనలో వర్తించే ఎవరైనా ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న 90 రోజులలో అమలులోకి వస్తుంది. నిర్ణయించిన కాలపరిమితి ముగియగానే ప్రతిబంధకాలను వారు తొలగించాలి.

ప్రశ్న 9.
సేవల ఒప్పందం (GATS).
జవాబు.
ఉరుగ్వే సమావేశంలో మొదటి సారిగా బ్యాంకింగ్ భీమా, ప్రయాణం, నీటి రవాణా, శ్రామిక గమనశీలత మొదలైన సేవ వ్యాపారాన్ని ఒప్పందం క్రిందకు తీసుకొచ్చారు. సేవల వర్తక ఒప్పందంలో కొన్ని నియమాలు, నిబంధనలు రూపొందించారు. సేవల వ్యాపారంలో పారదర్శకత, పురోగామి సరళీకరణ విధానం ప్రవేశపెట్టారు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 10.
ఎగుమతి రాయితీలు.
జవాబు.
ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకొని వాటి సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లో పెంపొందించుకొనుటకు ప్రభుత్వం దేశంలోని పరిశ్రమలకు ఇచ్చేటటువంటి సబ్బిడీలు అంటారు.

ప్రశ్న 11.
విదేశీ వర్తక చెల్లింపుల శేషం/సంతులనం
జవాబు.
ఒక నిర్ణీత కాలం ఒక దేశం లేదా ప్రపంచ దేశాలలో నిర్వహించే వర్తకానికి సంబంధించిన వివరాలు ఆస్తి అప్పుల పట్టిక రూపంలో సంఖ్యాత్మకంగా రూపొందించబడే రికార్డును విదేశీ వర్తక చెల్లింపుల శేషం అంటారు.

TS Board Inter Second Year Economics Study Material Chapter 8 విదేశీ రంగం

ప్రశ్న 12.
డంకెల్ ప్రతిపాదనలు
జవాబు.
ఉరుగ్వే రౌండ్ సెప్టెంబర్ 1986 సంవత్సరంలో ప్రారంభం అయింది. వాస్తవంగా దీనికి సంబంధించిన ఒప్పందాలు అన్నీ నాలుగు సంవత్సరంలో ముగియవలసి ఉంది. కాని వివిధ సభ్యదేశాలు వివిధ రకాలు అయిన అభిప్రాయాలను అప్పటి డైరెక్టర్ సర్ ఆర్థర్ డంకెల్ క్రోఢీకరించి విస్తృతమైన డాక్యుమెంట్ను రూపొందించారు. దీనినే డంకెల్ ప్రతిపాదనలు అంటారు.

TS Inter 2nd Year Economics Study Material

Leave a Comment