Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 6th Lesson వ్యాపారాన్ని నెలకొల్పడం Textbook Questions and Answers.
TS Inter 2nd Year Commerce Study Material 6th Lesson వ్యాపారాన్ని నెలకొల్పడం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపారాన్ని నెలకొల్పడంలోని ప్రాథమిక స్థాయిలో తీసుకోవలసిన చర్యలు ఏమిటో వివరించండి.
జవాబు.
వ్యాపారాన్ని నెలకొల్పడం కోసం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన అనేక లాంఛనాలు, నియమ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది.
సంస్థలను ఏర్పరచడంలో ప్రాథమిక స్థాయిలో తీసుకోవల్సిన చర్యలు:
1) 1వ దశ: స్వయం ఉపాధికై నిర్ణయం:
- వ్యవస్థాపకుడు మొట్టమొదట తాను నిర్ణయించుకున్న వస్తువుల గురించి, ఆ వస్తువులను మార్కెట్లో స్పందన ఎలా ఉందో, ఒకవేళ కొత్త వస్తువును మార్కెట్లోకి పంపినప్పుడు వాటి వల్ల కలిగే లాభనష్టాలను, సంస్థను స్థాపించడానికి ముందుగానే సమగ్ర మార్కెట్ సర్వేను నిర్వహించి తెలుసుకోవాలి.
- ఎంట్రప్రిన్యూర్ వ్యాపారాన్ని నెలకొల్పడానికి అనేక అంతర్గత మరియు బహిర్గత కారకాలు ప్రభావితం చేస్తాయి.
2) 2వ దశ: వ్యాపార పరిసరాల అవగాహన:
1) స్వయం ఉపాధి నిర్ణయం తీసుకున్న తర్వాత వ్యవస్థాపకుడు చిన్నతరహా పరిశ్రమలలో గల వ్యాపార పరిసరాలను కింది విధంగా పరిశీలించాలి.
- వ్యవస్థాపరమైన చట్రం – పరిశీలన
- విధాన నిర్ణయం
- నియమ నిబంధనలు.
2) ఔత్సాహికులకు తగిన ఆలోచనలు ఇవ్వడానికి ఆధారాలను నిర్వహణపరమైన చట్రం అందిస్తుంది. ఈ నిర్వహణ చట్రంలో అంతర్భాగాలు అభివృద్ధి కమీషనర్, అనుబంధ సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. సంబంధిత ప్రభుత్వాలు నియమ నిబంధనలు, మార్గదర్శక విధానాలను పొందుపరుస్తాయి.
3) 3వ దశ: ఆలోచనల ఎంపిక:
- సరైన ప్రాజెక్టును ఎంచుకోవడానికి, సరైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి, సేవలను అందించడానికి తద్వారా మంచి ఆలోచనల ఎంపికకు అవసరమైన కారకాలను పరిశీలించాలి.
- ప్రతి వ్యవస్థాపకుడు తాను ఎంచుకున్న వస్తు మార్గం యొక్క మార్కెట్ సర్వేను పూర్తిగా వ్యవస్థను స్థాపించడానికి ముందే సమగ్రంగా పరిశీలించాలి. ఇది అతనికి తప్పక ‘ప్రస్తుత మార్కెట్ వివరాలు” మరియు “మార్కెట్లో కలిగే ప్రతిస్పందనలు గురించి పూర్తి అవగాహన”కు తోడ్పడుతుంది.
4) 4వ దశ: వ్యవస్థాపక నిర్మాణ నిర్ణయం: చిన్న తరహా సంస్థలు తమ వ్యవస్థ నిర్మాణాన్ని నిర్ణయించేందుకు గల అనేక అవకాశాలు కింది విధంగా ఉన్నాయి.
- సొంత యాజమాన్యం,
- భాగస్వామ్య సంస్థ,
- సహకార సంస్థ,
- హిందూ అవిభాజిత కుటుంబం,
- కంపెనీ (HUF).
ఎలాంటి సంస్థను చేపట్టాలో నిర్ణయించేందుకు కింది కారకాలను పరిశీలించాలి.
వ్యాపారం యొక్క పరిమాణం, మూలధన పెట్టుబడి, వ్యాపార స్వభావం, నియంత్రణ కోణం, పన్ను చెల్లింపు, ప్రభుత్వ ఆంక్షలు
5) 5వ దశ ప్రాజెక్టు తయారీ:
- వస్తువును, వ్యాపార వ్యవస్థ అనే నిర్ణయించుకున్న తర్వాత వ్యవస్థాపకుడు అతని ఆలోచనలను కాగితంపై పెట్టి వివరించాలి. దీనినే ప్రాజెక్టు రిపోర్టు అంటారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు సంతృప్తికరంగా ఇందులో నిక్షిప్తం చేయాలి.
- తదనుగుణంగా ప్రాజెక్టు రిపోర్టు తయారీలో అనేక శీర్షిక కింద వివరాలను విశదీకరించాలి. అవసరమైన డాక్యుమెంట్లు, కొటేషన్లు, ఎంక్వైరీలు ఇచ్చిన శీర్షిక కింద ప్రాజెక్టు రిపోర్టుకు జతపరచాలి.
6) 6వ దశ: ప్రాజెక్టు తులనాత్మక పరిశీలన:
- ప్రతిపాదన యొక్క తుది నిర్ణయాన్ని సాంకేతిక, ఆర్థిక, వాణిజ్య నిర్వాహక మరియు ఆపరేటింగ్ కార్యకలాపాలను అన్నింటినీ అంచనా వేసి తీసుకోవడమవుతుంది.
- ప్రాజెక్టులోని లోటుపాట్లను కనిష్టం చేయడానికిగాను వ్యవస్థాపకులు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. సలహాలను, సూచనలను తగిన మేరకు తప్పక నిర్వర్తించాలి.
7) 7వ దశ: ప్రదేశ నిర్ణయం:
1) ప్రతీ పారిశ్రామిక ప్రాజెక్టుకు సరియైన ప్రదేశాన్ని ఎన్నిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన మేరకు కింది విషయాలకు లోబడి శోధించాలి:
- మార్కెట్కు, ముడిపదార్థాలకు దగ్గరగా ఉండటం
- పవర్ మరియు నీరు లభ్యతను చూసుకోవడం
- కావలసిన నైపుణ్యత లభ్యత, అమలులో ఉన్న వేతనపు రేట్లు
- పారిశ్రామికంగా వెనుకబడిన ప్రదేశాలకు వర్తించే రాయితీలు, ప్రోత్సాహకాలు.
2) సంస్థకు అవసరమైన ప్రదేశాన్ని ఎ) రాష్ట్ర ప్రభుత్వం – పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు, బి) పారిశ్రామిక కొ ఆపరేటివ్ సొసైటీలు, సి) ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి పొందవచ్చు.
8) 8వ దశ: తాత్కాలిక నమోదు:
- తాత్కాలిక నమోదు, సంస్థను వెలుగులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సహాయపడుతుంది. తాత్కాలిక నమోదు కోసం పారిశ్రామిక కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలి.
- తాత్కాలిక నమోదు పత్రాన్ని అంటే దరఖాస్తు చేసిన ఏడురోజులలోగా ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలిక నమోదు యొక్క వ్యవధి కాలం సాధారణంగా ఆరు మాసాలు ఉంటుంది. ఈ వ్యవధి కాలాన్ని తగినంత ఆధారం చూపి అభ్యర్ధిస్తే మరొక ఆరు మాసాలను పొడిగించడం జరుగుతుంది.
9) 9వ దశ: యంత్ర పరికరాల మరియు సాంకేతికలపై విచారణ:
1) యంత్ర పరికరాలు, విడి పనిముట్ల అవసరాలను సరిగ్గా అంచనావేసి ప్లాంటు యంత్రాల సైజును నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్థిరాస్తులను ఏర్పరచిన తరువాత మార్పు చేయడం చాలా కష్టం. కొన్ని సందర్భాలలో కొత్తగా యంత్రాలలో పెట్టుబడి పెట్టడం కంటే కొన్ని భాగాలను కొని లేదా బయటి వారిచే జాబ్వర్క్ చేయించుకోవడం తక్కువ వ్యయంతో కూడుకొని ఉంటుంది.
2) అవసరమైన యంత్రాలను ఉత్పత్తి చేసే అనేక ఉత్పత్తిదారులను గుర్తించి వారి వద్ద నుంచి కొటేషన్లను పొందాలి. ప్లాంటు, పరికరాలకు, వివరణాత్మకమైన కొటేషన్లను పేరుపొందిన సప్లయిదారుల వద్ద నుంచి పొందినట్లయితే ప్రాజెక్టు రిపోర్టుకు మరియు విత్త సహాయం పొందడానికి రాష్ట్ర విత్త కార్పొరేషన్లు లేదా బ్యాంకులకు వాటిని జతపరచడం సులభమవుతుంది.
ప్రశ్న 2.
వ్యాపారాన్ని నెలకొల్పడంలో ఆచరణ స్థాయిలో పాటించాల్సిన చర్యలను సవివరంగా తెలపండి.
జవాబు.
వ్యాపార సంస్థల స్థాపన ప్రక్రియలో రెండవదశ “అమలుపరిచే దశ” దీనినే “ఆచరణ దశ” అంటారు. ఆచరణ స్థాయిలో పాటించాల్సిన చర్యలు:
1) 1వ దశ: శాసనాత్మక పారిశ్రామిక లైసెన్స్ / క్లియరెన్స్ పొందడం:
1) మూలధన ఎక్విప్మెంట్ల దిగుమతి, విదేశీ ఒడంబడికలు మొదలైనవన్నీ పర్యవేక్షించడానికి అనేక నిర్వహణా బోర్డులను స్థాపించడం జరిగింది. ఈ బోర్డులు అనుమతించిన కాలపరిధిలోపు వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి లైసెన్సును జారీ చేయాలి.
2) పారిశ్రామిక అభివృద్ధి, క్రమబద్ధీకరణ చట్టం 1951లో గల షెడ్యూల్ ప్రకారం జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తికి లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి. ఉదా: లోహానికి సంబంధించిన పరిశ్రమలు, ఇంధనాలు, బాయిలర్లు మరియు ఆవిరి ఉత్పత్తి చేసే ప్లాంట్లు, విద్యుచ్ఛక్తి పరికరాలు, టెలికమ్యూనికేషన్స్, రవాణా, పారిశ్రామిక యంత్రాలు, ఎరువులు రసాయనాలు మొదలైనవి.
2) 2వ దశ: విత్త ఏర్పాట్లు: చిన్న తరహా సంస్థలు వాటి ప్రాజెక్టులకు విత్తమును మూడు విధాలుగా సమకూర్చుకోవచ్చు.
- దీర్ఘకాలిక రుణం: స్థిరాస్తులైన ప్లాంటు, యంత్రాలు, భూమి, భవనాలు, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైన
వాటి సేకరణ కోసం నిధులను సమకూర్చుకోవడానికి దీర్ఘకాలిక రుణాలను పొందుతారు. - వారధి రుణం: దీర్ఘకాలిక రుణం మంజూరు అయ్యే వరకు ప్రాజెక్టు నడిపించడానికి అయ్యే ఖర్చులను చెల్లించుకునేందుకు తీసుకునే రుణం. ఈ రుణాన్ని పొందడానికి ఆర్థిక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి, మంజూరును
దాలి. - నిర్వహణ మూలధనం రుణం: తనఖా, కుదువ, క్యాష్ క్రెడిట్ బిల్లు సౌకర్యంతో తీసుకునే అతి స్వల్పకాలిక ్వన్సులనే నిర్వహణ మూలధనం అంటారు.
3) 3వ దశ: విత్త సహాయానికి దరఖాస్తు పద్ధతి:
1) ప్రాజెక్టు నిర్ణయం తరువాత తాత్కాలిక రిజిస్ట్రేషన్ మరియు ఇతర లాంఛనాలు పూర్తి చేయడానికి వ్యవస్థాపకులు విత్తసహాయం కోసం దరఖాస్తును ప్రాజెక్టు రిపోర్టుతో జతపరచి విత్త సంస్థలకు లేదా బ్యాంకులకు కాల రుణాల కోసం సమర్పించాలి.
2) విత్త సంస్థలకు లేదా బ్యాంకులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కింది పత్రాలను జతపరచాలి.
- ప్రాజెక్టు రిపోర్టు ప్రతి
- భాగస్వామ్య ఒప్పందం లేదా సంస్థాపన పత్రం, కంపెనీ నియమావళి పత్రాలు.
- ప్లాంటు, యంత్రాల కొటేషన్లు
- భూమికి సంబంధించి లీజు ఒప్పందం లేదా భూమి స్వాధీన పత్రాలు.
- ఫ్యాక్టరీ భవనానికి ఆర్కిటెక్ట్ అంచనాలు.
4) 4వ దశ: భవనాల నిర్మాణం, సివిల్ పనులు:
విత్త సహాయక సంస్థ నుంచి మొదటి విడత రుణం మొత్తం పొందిన తరువాత, భవన నిర్మాణ పనులు మొదలవుతాయి. ఒకవేళ అంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వపు పారిశ్రామిక వాడలలో నిర్మించబడిన ఫ్యాక్టరీ షెడ్ పొందిఉనట్లయితే, ఆ షెడ్ను తమ స్వాధీనంలోకి తీసుకురావడం ద్వారా ఈ పనిని పూర్తి చేయవచ్చు. అలాకాక ఫ్యాక్టరీ స్థలాన్ని మాత్రమే పొంది ఉన్నట్లయితే సివిల్ పనులు మొదలు పెట్టవచ్చు. వ్యవస్థాపకుడు ఫ్యాక్టరీ షెడ్ను నిర్మించడానికి పురపాలక లేదా కార్పొరేషన్ అధికారుల వద్ద నుంచి అవసరమైన లైసెన్స్ పొందాలి. ఇందుకోసం భవన ప్రణాళిక, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ ఇచ్చిన నియమ నిబంధనలకు లోబడి ఉండాలి.
5) 5వ దశ: ప్లాంటు, యంత్రాల కోసం, ఇతర స్థిరాస్తుల కోసం ఆర్డరు చేయడం, సేకరించడం:
స్థిరాస్తుల సేకరణకై ఆర్డర్లను, ఎంపిక చేసుకున్న సప్లయిదారులకు ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ చేయవలసిన సమయాన్ని సప్లయిదారులతో చర్చించి ప్లాంటు, యంత్రాల సప్లయి మరియు భవన నిర్మాణ పనులు ఒకేసారి పూర్తి అయ్యేటట్లు చూసుకోవాలి.
6) 6వ దశ: విద్యుచ్ఛక్తి, నీటి కనెక్షన్లు:
విద్యుచ్ఛక్తి మరియు నీటి కనెక్షన్లకై అవసరమైన దరఖాస్తులను చేసుకొని అవసరమైన చర్యలను చేపట్టి కనెక్షన్లు పొందాలి. ఒక వినియోగదారునకు విద్యుచ్ఛక్తి కలుపబడిన లోడ్ ప్రకారం కనెక్షన్ తీసుకోవాలి.
7) 7వ దశ: సిబ్బందిని చేర్చుకోవడం మరియు వారి శిక్షణ:
1) సిబ్బంది సహకారం, ఉత్సుకత మరియు ప్రవర్తనలతో సాధారణ మరియు గణనీయమైన వ్యాపారాల మధ్య తేడాను చూపవచ్చు. సంపూర్ణ పోటీ పరిస్థితులలో ఉత్సాహం లేని లేదా శిక్షణ లేని సిబ్బంది, వ్యాపారానికి పూర్తి నష్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. సిబ్బందిలో ముఖ్యంగా చూడవలసిన అర్హతలు, అతని ఉత్పాదకత మరియు నమ్మకం.’
2) ఈ దశలో వ్యాపారానికి సంబంధించిన సిబ్బంది విధానాలను నిర్ణయించుకోవాలి. అంటే ఎంత మందిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా, లేదా పాక్షిక స్థాయి ఉద్యోగులుగా చేర్చుకోవాలి, అలాగే ఎంత మంది సాంకేతిక పరిజ్ఞానం కలవారిని, ఎంతమంది అకౌంటింగ్ నిపుణులను తీసుకోవాలి అని నిర్ణయించుకోవాలి.
3) సిబ్బంది నియామకానికి ముందుగా వ్యాపార అవసరాలను స్పష్టంగా గుర్తించి ప్రతి కొత్త ఉద్యోగికి అతన నెరవేర్చవలసిన నిర్దిష్ట బాధ్యతలు లిఖిత పూర్వకంగా తెలియపరచాలి. అంతేకాక వారికి ఇవ్వవలసిన జీతాలు కల్పించాలి. సదుపాయాలను వారి వారి నైపుణ్యత, అనుభవం మరియు స్థితిగతులను బట్టి నిర్ణయించాలి.
8) 8వ దశ: ముడిసరుకు సేకరణ:
కొత్త వస్తువులను మార్కెట్లో విడుదల చేయడానికి ముందుగా, తన అవసరాలకు సరిపడా ముడిసరుకు లభ్యతను సరైన కాలంలో కొత్త వ్యవస్థాపకులు లభింపచేసుకోవాలి. ఇందుకుగాను అతను ఒక సప్లయిదారుని నుంచి సరుకు సేకరించకుండా అనేక సప్లయిదారుల నుంచి సరుకును సేకరించాలి.
9) 9వ దశ: ప్లాంటు, యంత్రాలను స్థాపన ప్రారంభించడం:
1) కొత్త వ్యవస్థాపకుడు ఉత్పత్తి కార్యకలాపాలు సమర్ధవంతంగా కొనసాగించడానికి సరైన లేఅవుట్ను రూపొందించాలి. యంత్ర పరికరాలను నిర్వహించడానికి, ప్రతీ కార్మికుడు అతని కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా ఉండే గదులు, వెలుతురు ఉన్న గదులను ఏర్పరచడం మొదలైన వాటిలో అతను తగిన శ్రద్ధ తీసుకోవాలి.
2) నిర్వాహకుడు ఫ్యాక్టరీ ఆవరణను, అందులో వివిధ పనులకై కేటాయించిన స్థలాలను, ఒక క్రమమైన పద్ధతిలో పొందుపరిచినట్లుగా బ్లూప్రింట్ను తయారు చేయించాలి.
10) 10వ దశ: మార్కెటింగ్:
1) మార్కెటింగ్ అంటే సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది సంస్థ వస్తుసేవలకు వినియోగదారులకు ఏర్పరచుకునే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వినియోగదారులను గుర్తించి, వారి అవసరాలను శ్రద్ధతో కనుగొని, ప్రతీసారి వారి అవసరాలను మెరుగైన సేవలతో అందించడం జరుగుతుంది.
2) ప్రతీ మార్కెటింగ్ ప్రణాళికలో ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఉండవలసిన ధ్యేయాలు: వస్తు సేవల గురించి వినియోగదారునికి అవగాహన కల్పించడం, వస్తు సమాచారాన్ని సక్రమంగా అందించడం మరియు వినియోగదారులను వస్తువుల కొనుగోలుకై ప్రేరేపించడం.
3) వీటితో పాటుగా వ్యాపార ప్రకటనలు మరియు వస్తువుల ప్రమోషన్ మరియు దీర్ఘకాలిక వ్యూహాత్మక మార్కెటింగ్ గురించి కూడా సరియైన అవగాహన ఏర్పరచుకోవాలి.
11) 11వ దశ: శాశ్వతమైన నమోదు:
1) జిల్లా పారిశ్రామిక కేంద్రాల నుంచి శాశ్వతమైన నమోదును పొందవచ్చు. వ్యవస్థాపకుడు సంస్థను స్థాపించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్న తరువాత అంటే ఫ్యాక్టరీ భవనం సిద్ధంగా ఉండి, విద్యుచ్ఛక్తి కనెక్షన్ను, యంత్ర పరికరాలను సిద్ధం చేసుకున్న తరువాత సంస్థ శాశ్వత నమోదుకై దరఖాస్తు చేసుకోవాలి.
2) అలాంటి దరఖాస్తును తీసుకున్న ఏడు రోజులలోగా, జిల్లా పారిశ్రామిక కేంద్రాధికారి లేదా తత్సమానమైన అధికారి సంస్థ యొక్క తనిఖీకి తేదీ, సమయాలను వ్యవస్థాపకునికి తెలియపరచాలి. తనిఖీలో సంస్థ ఉత్పత్తి సామర్ధ్యంతో అధికారులు సంతృప్తి చెందగానే, పరిశ్రమల డైరెక్టరేట్ వద్ద నుంచి శాశ్వత నమోదు పత్రం లభిస్తుంది.
12) 12వ దశ: లాభాలను ఆర్జించి అప్పును తిరిగి చెల్లించడం:
1) సఫలీకృతుడైన వ్యవస్థాపకుడు తప్పక ఉత్పత్తి వ్యయాలపై, లాభాలను పొందడంపై దృష్టిని సారించాలి. ఒకవేళ లాభాలు ఎక్కువగా లేకపోతే అందుకు తగిన కారణాలను వెతికి ఉత్పత్తి పరిమాణాన్ని సరిచేయాలి, కనిష్ట వ్యయం కోసం కృషి చేయాలి. అంతేకాక వృధాను తగ్గించడానికి వ్యయ నియంత్రణా చర్యలు చేపట్టాలి.
2) ప్రతి నెలకు అతను లాభాల నివేదికలను తయారు చేయాలి. సంవత్సరాంతంలో పెట్టుబడిపై వచ్చిన ఆదాయాన్ని “సౌభ నిష్పత్తులను మరియు అమ్మకాలపై లాభదాయక నిష్పత్తులను లెక్కించి చూడాలి. అంతేకాక భవిష్యత్తులో రాదగిన యాలు వేటికైనా ప్రణాళికలను తయారు చేయాలి. ఏవైనా అనుకోని పరిస్థితుల వల్ల లాభాలను సరైన స్థాయిలో, ఉత్పత్తి కందువల్ల రాబట్టలేకపోతే అందుకు స్పందించి తగిన చర్యలను వెంటనే తీసుకోవాలి.
ప్రశ్న 3.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఔత్సాహికత ప్రోత్సాహకాలు ఏమిటో చర్చించండి.
జవాబు.
తెలంగాణ ప్రభుత్వం అందించే అవకాశాలు, ఔత్సాహికులను ప్రేరేపించి తమ వ్యాపార సంస్థలను నెలకొల్పడానికి ఎక్కువగా దోహదపడతాయి. తెలంగాణా ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీ వల్ల తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రాంతీయ, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఎందుకంటే అక్రమ లాభ రహిత, కష్టరహిత పరిస్థితులను ప్రభుత్వం, తమ పారిశ్రామిక పాలసీ ద్వారా ఔత్సాహికులకు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహికులకు అందిస్తున్న వివిధ అవకాశాలను కింద వివరించడమైనది.
1) తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర విభాగాలు తమ పనులను సరైన కాలంలో నిర్వర్తించకపోయినా, అవినీతిని ప్రోత్సహించిన సందర్భాలను ఔత్సాహికులు ఎదుర్కొన్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి గాను ‘ఆన్లైన్ మరియు హెల్ప్ డెస్క్ గ్రివిన్స్ రిడెస్రల్ విధానాన్ని’ ప్రవేశపెట్టారు. దీని వల్ల పరిశ్రమల స్థాపన పనులు ప్రభుత్వ విభాగాలు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది.
2) ప్రభుత్వ విభాగాలు ‘కనీస తనిఖీ విధానాన్నిపాటిస్తాయి. దీని వల్ల పారిశ్రామిక యూనిట్ను 3 లేదా 4 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే తనిఖీ చేస్తారు. తనిఖీని ఎప్పుడు చేపడతారో కూడా ముందుగానే నిర్ణయిస్తారు.
3) పారిశ్రామిక యూనిట్లు తమంతట తాముగా ధ్రువీకరించుకునే ప్రక్రియను ప్రోత్సహించి, వాటి రిజిస్ట్రేషన్ రెనివల్స్న అమలుపరుస్తారు. హైదరాబాదు నగరంలో మరియు ఇతర జిల్లాలలో వెబ్ ఆధారిత ఎలక్ట్రానిక్ హెల్ప్ లైన్ సౌకర్యాలు మరియు భౌతికంగా హెల్ప్ డెస్క్లు ఏర్పరచి ఔత్సాహికుల పనిని సులభతరం చేయడమయింది.
4) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 రంగాలను ప్రముఖమైన రంగాలు అని సూటిగా పేర్కొన్నది. ఈ రంగాలలో పెట్టుబడి పెట్టే ఔత్సాహికులకు మిగతా పారిశ్రామిక రంగాల కంటే ప్రాముఖ్యతను కలిగిస్తారు.
5) తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్యతరహా పరిశ్రమలకు కింది ప్రత్యేక నిబంధనలను తమ పారిశ్రామిక విధానంలో రూపొందించింది.
- సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల కోసం పారిశ్రామిక వాడలలో పార్కులలో సరిపడా స్థాయిలో చిన్న చిన్న ప్లాట్ల ఏర్పాటు, సూక్ష్మ యూనిట్లకై అభివృద్ధి పరచబడిన షెడ్స్ కేటాయింపు.
- ప్రారంభదశలోనే ఇబ్బందులకు గురి అయిన పరిశ్రమలను మెరుగుపరచడానికి ప్రత్యేకమయిన నిధిని ఏర్పరచడమైనది.
- స్వంత స్థలంలో ఔత్సాహికులు పరిశ్రమను నెలకొల్పదలచి, ఆ స్థలాన్నీ పరిశ్రమ అవసరాలకు అనువుగా మార్చడానికి సంబంధించి అయిన వ్యయాలను తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం చేయూతనిచ్చింది.
- ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్స్ స్థాయిలోనే సూక్ష్మ సంస్థలకు అనుమతులు ఇవ్వడానికి, లైసెన్స్లు జారీ చేయడానికి అధికార వికేంద్రీకరణ చేయడమైనది.
6) తెలంగాణా స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇన్కబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్ (TS-PRIDE) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం SC/ST ఔత్సాహికులకు ప్రత్యేకమైన చేయూతను కలిగిస్తుంది. ఈ సంస్థ ద్వారా చేపట్టబడే కొన్ని ముఖ్యమైన వ్యాపకాలను కింద ఉదహరించడమైంది.
- SC/ST ఔత్సాహికులకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష ఫండింగ్ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం.
- రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ రిఫండ్ స్కీము ఏర్పరచి గౌ 5 కోట్లను ఇందుకు గాను కల్పించి, SC/ST ఔత్సాహికులకు మార్జిన్ మనీని చెల్లించడం.
- పారిశ్రామిక పార్కులలో SC/ST ఔత్సాహికులకు ప్లాట్లు కేటాయింపు చేయడంలో ప్రాముఖ్యతను కల్పిస్తూ, వారికి ఆ పారిశ్రామిక వాడలలో 22% రిజర్వేషన్ సౌకర్యం ఏర్పరచింది.
- SC/ST అభ్యర్థులకు ప్రత్యేకంగా ఇంటెన్సివ్ ఎంట్రప్రిన్యూర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్న నిర్వహించడం.
- SC/STల కోసం ప్రత్యేక కార్యక్రమాలను దళిత్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంటి సంస్థలు చేపట్టి, వారి ఔత్సాహిక కార్యక్రమాల ప్రణాళికీకరణ అమలుపరచడం, నియంత్రించడం చేయూతను ఇవ్వడం.
7) నిర్మల్ పెయింటింగ్స్, డోక్రా మెటల్ వర్క్, బిద్రివేర్, పెంబర్తీ బ్రాస్వేర్, పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, గద్వాల్ చీరలు, వరంగల్ కార్పెట్ లాంటి సాంప్రదాయక కళాత్మక మరియు హస్త కళల వస్తువుల ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను తెలంగాణ స్టేట్ హాండిక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిసాన్స్ రివైవల్ విత్ టెక్నాలజీ ప్రోగ్రామ్ (T – HART) వివిధ కార్యక్రమాలను చేపడుతుంది.
8) తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలంగా లేని సుమారు 20 లక్షల ఎకరాల భూమిని గుర్తించడమైనది. దీన్ని పారిశ్రామికవాడలుగా ఏర్పరచడానికి గాను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పోరేషన్కు (TSIIC) మళ్ళించడమైంది. దీనివల్ల పారిశ్రామిక వాడల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
9) TSIIC పారిశ్రామిక వాడలలో అవసరమైన అన్ని మౌళిక వస్తువులను కల్పిస్తుంది. అంటే రోడ్లు, నీటి సరఫరా, పారిశ్రామిక టవర్స్, వ్యర్థాలను శుద్ధిపరచే సౌకర్యాలు మొదలయినవి సులభంగా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఔత్సాహికుడు తనకు యూనిట్ ఏర్పాటుకు అనుమతి వచ్చిన రోజునుంచే అవసరమైన షెడ్ నిర్మాణాన్ని చేపట్టవచ్చు.
10) TSIIC మరియు పరిశ్రమలు, వాణిజ్య విభాగాల వెబ్సైట్ల ద్వారా పారిశ్రామిక పార్క్లో లభించే భూమి వివరాలను అందరికి అందుబాటులో ఉంచుతారు. ఈ వెబ్సైట్ ద్వారా పారిశ్రామిక పార్కు సమీపంలోని హైవేకు / రైల్వే స్టేషన్కు / విమానాశ్రయానికి / పట్టణానికి ఎంత దూరంలో ఉన్నది, ఆ ప్లాటు యొక్క పరిమాణం ఎంత, ఆ స్థలం ఫోటోగ్రాఫ్స్, గూగుల్ మాప్స్ మొదలయిన వివరాలన్నీ ప్రదర్శిస్తారు.
11) యువకులైన ఔత్సాహికులకు ఉద్దేశించబడిన శిక్షణా కార్యక్రమాలు అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్న Telangana State Accelerated Small scale Industries Training Centres చేపడతాయి. ఇవి ప్రభుత్వం యొక్క Industries and Commerce Department అధీనంలో నిర్వహించబడతాయి.
12) పారిశ్రామిక పురోగతికి, ఆర్థిక వనరులను బలోపేతం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలమైన రాష్ట్రీయ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ఔత్సాహికులకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉత్పాదకాలను పొందాలన్నా, తుది వస్తువులను తరలించాలన్నా రాష్ట్రీయ పన్ను భారం సరళీకృతం అవుతుంది.
13) కేవలం మహిళా ఔత్సాహికులకు ప్రోత్సహించుటకై 2018 మార్చి 18వ తేదీన వీ-హబ్ (V-Hub) ను కౌ 15కోట్ల ఆరంభ నిధితో నెలకొల్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం మహిళా ఔత్సాహికులను ప్రోత్సహించుటకు ఒక సంస్థను దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క కొత్త పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మరియు ఔత్సాహికులకు అనేక అవకాశాలు కల్పించి, వారి ఔత్సాహికతను సంతృప్తిపరచడానికి చర్యలు సుముఖంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
అంకుర సంస్థను నిర్వచించి దాని ఆవశ్యకాలు ఏమిటో వివరించండి.
జవాబు.
అంకుర సంస్థలు: ప్రారంభదశలో ఉన్న సంస్థలను అంకుర సంస్థలు అంటారు.
అంకుర సంస్థల నిర్వచనం: ప్రారంభ దశలో ఉన్న సంస్థలనే అంకుర సంస్థలంటారు. ప్రభుత్వం అంకు సంస్థలకై రూపొందించిన ప్రోత్సాహక పథకాల కోసం ప్రారంభ దశ (Startup)లోని సంస్థలను కింద తెలిపిన విధంగా నిర్వచించడం జరిగింది.
2013లో ఆమోదించబడిన భారతీయ కంపెనీ చట్టం కింద నమోదైన కంపెనీగానీ, 1932లో ఆమోదించబడిన భాగస్వామ్య సంస్థల చట్టం కిందగానీ లేదా 2008లో ఆమోదించబడిన పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం కిందగానీ లేదా ఏదైనా స్వంత వ్యాపార సంస్థగానీ, స్థాపించిన తరువాత పది సంవత్సరాలు గడవనట్టి, స్థాపించిన తరువాత పది సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా వ్యాపార టర్నోవర్ 100 కోట్లు దాటనటువంటి, ఏదైనా సంస్థను విభజించిన కారణంగా కానీ, దాని పునర్నిర్మాణం వల్ల ఏర్పడనటువంటి సంస్థలు, భవిష్యత్తులో అభివృద్ధి, పెరుగుదలకు అవకాశం ఉన్న వ్యాపారాన్ని ప్రారంభించిన సంస్థలను అంకుర సంస్థలు (Startup) అని అనవచ్చు.
అంకుర సంస్థల ఆవశ్యకాలు: ప్రభుత్వం అంకుర సంస్థగా వారిచే గుర్తింపు పొందడానికి కింద ఆవశ్యకాలను పూర్తి చేయవలసి ఉంటుంది.
- కంపెనీ వయోపరిమితి: స్థాపించిన తేదీ నుంచి పది సంవత్సరాలు పూర్తి అయి ఉండరాదు.
- సంస్థ లక్షణం: ఇటువంటి సంస్థను, కంపెనీల చట్టం కింద ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా కానీ, నమోదు చేయబడిన భాగస్వామ్య సంస్థగా కానీ, పరిమిత బాధ్యతగల భాగస్వామ్య సంస్థగా గానీ ప్రారంభించబడి ఉండాలి.
- వార్షిక వ్యాపార టర్నోవర్: సంస్థ ఏర్పడిన తరువాత పది సంవత్సరాలలోపు, ఏ సంవత్సరంలో కూడా కౌ 100 కోట్ల వ్యాపార టర్నోవర్ని మించి వ్యాపారం చేయని సంస్థలు.
- నూతనంగా ప్రారంభించబడిన సంస్థ: ఇటువంటి సంస్థలు ప్రప్రథమంగా స్వంత ప్రతిపత్తితో స్థాపించబడి ఉండాలి. అంతేగానీ, ఇదివరకే పనిచేస్తున్న సంస్థలను విడగొట్టినందువల్ల గానీ లేదా పునర్నిర్మాణం చేసినందువల్ల గానీ ఏర్పడిన సంస్థలై ఉండరాదు.
- నవకల్పన, వృద్ధి చెందుటకు అవకాశాలు: ఇటువంటి సంస్థలు చేపట్టిన వ్యాపారంగానీ, సేవల రూపకల్పనగానీ, భవిష్యత్తులో వృద్ధి చెందుటకు అవకాశాలు ఉండాలి. ఇదివరకే స్థాపించబడిన సంస్థలు అందిస్తున్న వస్తు సేవలకంటే భిన్నమైన వస్తుసేవలను అందించుటకు అవకాశం ఉండాలి.
ప్రశ్న 5.
విజయవంతమైన ఇద్దరు భారతీయ ఔత్సాహికుల గురించి వివరించండి.
జవాబు.
వ్యాపార రంగంలో ఘన విజయం పొందిన వ్యాపారదక్షులు:
భారతదేశం 130 కోట్ల జనాభా కలిగి జనసాంద్రత అధికంగా ఉన్న దేశం. ప్రతి సంవత్సరం సుమారు 1.2 కోట్ల మంది వివిధ విశ్వవిద్యాలయాల నుంచి శిక్షణ, సాంకేతిక సంస్థల నుంచి ఉత్తీర్ణులై ఉద్యోగ అర్హత పట్టాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం వీరందరికి ఉద్యోగావకాశాలు కల్పించడం సాధ్యం కాని పని. అయితే కొందరు ఉద్యోగాలను ఆశించే బదులు, ఉద్యోగాలను కల్పించే ఆలోచనతో కష్ట, నష్టాలను ఓర్చి ముందడుగువేసి తమ తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అటువంటి వారి విజయవంతమైన గాథలను / విషయాలను విద్యార్థులు తెలుసుకుంటే స్ఫూర్తి పొందగలరనే ఉద్దేశం విజయం సాధించిన వ్యాపార ఔత్సాహికుల గురించి వివరించడం జరిగింది.
1) లక్ష్మీనివాస్ మిట్టల్: లక్ష్మీనారాయణ్ మిట్టల్ ప్రపంచ ఉక్కు దిగ్గజ ఉక్కు వ్యాపారవేత్త, రాజస్థాన్లోని సదుల్పూరు అనే గ్రామంలో 1950 జూన్ 15న జన్మించాడు. కలకత్తాలో విద్యనభ్యసించి ఇంగ్లాండ్ దేశం లండన్లో స్థిరపడిన మిట్టల్ ప్రపంచంలో, నాలుగవ ధనవంతుడు. ప్రపంచంలోని ఉక్కు ఉత్పత్తిలో ఈయన సంస్థ ఆర్సెల్లార్ మిత్తల్ మొదటి స్థానంలో ఉంది.
తన గ్రాడ్యుయేషన్ (1970)లో అభ్యసించిన తరువాత ఒక మిల్లులో ట్రైనీగా పని ప్రారంభించి, 1976లో ఇండోనేషియాలో స్వంతంగా ఒక స్టీల్ మిల్లుని ప్రారంభించాడు. ఒక పది సంవత్సరాల పాటు ఆ కంపెనీ ఎలా నడుస్తుంది. ఇందులోని లోటుపాట్లని క్షుణ్ణంగా గమనించి 1989 మిట్టల్ ట్రినికాడ్ అండ్ టొబాగోలో ఆ దేశ ప్రభుత్వం నడుపుతున్న స్టీల్ కంపెనీని కొనుగోలు చేసుకొని గత అనుభవంతో దానిని విజయవంతంగా నడిపించి, ఆ కంపెనీని గట్టెక్కించి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించాడు.
అదే నూపుణ్యంతో ప్రపంచంలో నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బలహీనమైన, చిన్న చిన్న యూనిట్లుగా ఉన్న పరిశ్రమలను చేజిక్కించుకొని సమీకృతం చేసి బలపరిచి వ్యాపారాన్ని నడిపించి లాభం ఆర్జించాలనేది అతడి వ్యాపారతత్వం. కార్ల తయారీలో ఉపయోగించే ఇనుప రేకుల ఉత్పత్తిలో మిట్టల్ కంపెనీకి మార్కెట్లో 40% వాటా కలదు. మిట్టల్ తన ఓహియోలు కల తన ఇంటర్నేషనల్ స్టీల్ గ్రూప్లను 2004 ఏకీకృతం చేసాడు. వీటన్నింటిని కలిపి మిట్టల్ స్టీల్ కంపెనీ NV గా ఏర్పాటు చేశాడు.
మిట్టల్ గురించి ప్రస్తావించిన ముఖ్యాంశాలు:
1) ప్రపంచంలో అత్యంత ఆదాయాన్ని (70.6 బిలియన్ డాలర్ల) రాబడి కలిగిన ఆర్సెలార్ మిట్టల్ అనే దిగ్గజ కంపెనీకి మిట్టల్ చైర్మన్ గాను మరియు ముఖ్య నిర్వహణ అధికారిగా నిర్వహిస్తున్నారు.
2) తోబుట్టువులతో కలిపి వ్యాపారం ప్రారంభించిన మిట్టల్, ‘వారితో వేరుపడి 2006 సం॥లో ఫ్రాన్స్ యొక్క Arcelor కంపెనీని తను మిట్టల్ కంపెనీలో కలిపివేసాడు. స్టీలు ధరలు తగ్గడం వల్ల, ముడిసరుకు వ్యయం పెరగడం వల్ల 2019లో 2.5 బిలియన్ల నష్టం వచ్చినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
3) భారతదేశ బిలియనీర్లు అయిన శశి, రవి రుయాలకి చెందిన ఎస్సార్ స్టీల్ కంపెనీకి లక్ష్మీ మిట్టల్ 5.9బి. బిలియన్ డాలర్ల మూల్యం చెల్లించి 2019లో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
4) ఫోర్బ్స్ వారు విడతల చేసిన ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రభావంగల వ్యక్తుల జాబితాలో 196వ ర్యాంకులో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 9వ స్థానంలో భారతదేశంలో పదవ ర్యాంకులో ఉన్నాడు.
5) మిట్టల్ జులై 2020 కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీ పరిశోధన కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి √ 3300 కోట్లను విరాళం ఇచ్చి తన సేవానిరతిని చాటుకున్నాడు.
2) రాధిక రాజోజు:
1.3 మిలియన్ జనాభా కలిగిన మనదేశంలో రెండు పూటలా ఆహారం లభించని కుటుంబాల సంఖ్య అపరిమితంగా ఉంటుంది. అయితే వారిలో కొందరికి ఏదో చేయాలని, ఏదో సాధించాలని తద్వారా తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే సంకల్పం ఉంటుంది.
అటువంటి వారు ఎదురైన ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటూ తాము అనుకున్నది సాధించడానికి హసోపేతమైన నిర్ణయాలు తీసుకొని కష్టనష్టాలకు తెగువ చూపి విజయం సాధిస్తారు. అటువంటివారిలో వరంగల్ రల్ జిల్లా పరకాలకు చెందిన రాజోజు రాధికను చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక బీద కుటుంబంలో జన్మించిన రాధిక, ఒకానొక సందర్భంలో ముగ్గురితో కూడిన కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడవలసి వచ్చేది. ఏదైనా మంచిపని దొరికితే కుటుంబ పోషణ సులువు అవుతుంది అనే ఉద్దేశంతో ఉండేది. స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న వ్యాపకాన్ని, ఒక వ్యాపార సంస్థగా మారడం అనే ప్రక్రియకి రాధిక రాజోజు వ్యాపార సంస్థను తార్కాణంగా తీసుకోవచ్చు. ప్రారంభంలో రాధిక జీవనం గడపడానికి దర్జీ (Tailoring) పనినేర్చుకుని కుటుంబాన్ని పోషించడం ప్రారంభించింది. అయితే అప్పుడు కూడా ఆమె బతుకు కష్టనష్టాలతో నడిచేది. తన కుటుంబాన్ని నడపడానికి చేతిలో కేవలం 7 20,000 మాత్రమే ఉన్నాయి. ఆ స్వల్ప మొత్తంతో తన స్వగ్రామంలోనే దర్జీ పనిని ప్రారంభించింది. అయితే ఆ వ్యాపకంలో కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదురై చిక్కు పరిస్థితులు ఎదుర్కొంది. తన దర్జీ యూనిట్ గ్రామీణ ప్రాంతంలో పెట్టడం వల్ల, సరైన గిరాకీ (డిమాండ్) లేక ఆదాయం చాలా తక్కువగా వచ్చేది. ఎంతో కొంత ఆదాయం సంపాదించాలనే ఉద్దేశంతో కేవలం 3 20 చార్జికే ఒక జత పాఠశాల యూనిఫాం కుట్టడానికి ఒప్పుకొనేది. అయితే అటువంటి కష్టపరిస్థితుల్లో కూడా ఆమె మనసులో దుస్తుల తయారీ యూనిట్ ప్రారంభించాలనే ఆలోచన మెరిసింది. అదే సందర్భంలో రాధిక రాజోజుకి ‘తెలంగాణ ప్రభుత్వం’ వారి సారధ్యంలో నెలకొల్పబడి, కేవలం మహిళా ఔత్సాహిక వ్యాపారస్తులకు తోడ్పడుతున్న We – Hub (వీ – హబ్) గురించి తెలిసింది.
రాధిక రాజోజు We-Hub (వీ-హబ్)ని సంప్రదించడం, వారు ఆమెకి మార్గదర్శకత్వం చేసి, వ్యాపార మెలకువలు నేర్పి నిధులు సమకూర్చుకునే విషయంలో సహాయం చేయడం జరిగింది. ఆ క్రమంలో రాధికకు పెట్టుబడికోసం నాలుగు లక్షల రూపాయలు (4,00,000) నిధులు సమకూరినవి.
ఈ మొత్తంతో అవసరమైన ఎంబ్రాయిడరీ మెషిన్ ను, బట్టల దుకాణం కోసం అవసరమైన వస్త్ర నిల్వలను తెప్పించుకోవడం జరిగింది. ఇందువల్ల రాధికకు దుస్తుల తయారీ యూనిట్ని, ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పం నెరవేరింది. తనతో పాటు మరో 6 గురికి ఉపాధి కల్పించడం జరిగింది. అందుకని ఈమెని, వ్యాపారసంస్థ నెలకొల్పి విజయం సాధించిన మహిళా ఔత్సాహికురాలిని పరిగణించవచ్చు.
రాధిక నెలకొల్పిన దుస్తుల తయారీ సంస్థ వివరాలు:
- సంస్థలో ఉపాధి పొందుతున్న వారు తనతో కలిపి 7 గురు
- వార్షిక టర్నోవర్ 7 10,00,000
- లాభ శాతం: 35%
- భవిష్యత్ లక్ష్యాలు: భారీ స్థాయిలో దుస్తుల తయారీ పరిశ్రమ యూనిట్ని నెలకొల్పి వందలమందికి ఉపాధి కల్పించడం.
తెలంగాణ ప్రభుత్వం వారి We-Hub (వీ-హబ్) వారు 2019-20 సంవత్సరానికి ఉత్తమ ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలుగా ఎంపిక చేసిన ఐదుగురి పేర్లలో రాధిక పేరుండడం ఎంతో సబబు అనాలి.
ప్రశ్న 6.
అంకుర సంస్థలకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకుంటుందో వివరించండి.
జవాబు.
అంకుర సంస్థలకు నిధులు: అంకుర సంస్థలకు నిధులు రకరకాల ఆధారాల ద్వారా సమకూర్చబడతాయి. కిఁ తెలిపినట్టి అనేక మూలాధారాల ద్వారా అంకుర (Startup) సంస్థలకు నిధులు సమకూరుతాయి.
1. స్వీయ నిధులు: సంస్థలు, తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునే క్రమంలో సంపాదించే నిధులను తిరిగి సంస్థలోనే పెట్టుబడి పెట్టడంవల్ల బయట నుంచి నిధులను సేకరించుకునే అవసరం లేకుండా, స్వంత నిధులపై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. అంటే, వ్యాపార టర్నోవర్ పెరుగుతున్నందువల్ల వసూలు అయ్యే మొత్తాల నుంచి ఏర్పడే మిగులు నిధులు, -సంస్థకు అదనపు నిధుల అవసరాన్ని భర్తీ చేస్తాయి.
2. ఆరంభ రుణాలు: కొత్తగా వ్యాపార సంస్థను ప్రారంభించిన ఔత్సాహికులకు లేదా రెండు సంవత్సరాలకు మించకుండా వ్యాపారం చేస్తున్న సంస్థల యజమానులకు ప్రభుత్వం ద్వారా అంకుర (Startup) సంస్థల కోసం ఉద్దేశించబడిన రుణ సౌకర్యం అందుతుంది. ఈ రుణ సౌకర్యం స్థిరవడ్డీ రేటుపై, ఎటువంటి పూచీ లేకుండా మంజూరు చేయబడతాయి.
3) స్నేహితులు, కుటుంబ సభ్యులు: అంకుర సంస్థ ఔత్సాహికులు తమ కుటుంబ సభ్యుల నుంచి గానీ, మిత్ర బృందం నుంచి గానీ నిధులను సమకూర్చుకుంటారు. ఇటువంటి నిధులను సమంజసమైన వడ్డీరేటుపై తిరిగి చెల్లింపు హామీగా ప్రామిసరీ నోటులను అందజేసి సేకరిస్తారు.
4) స్వంత పొదుపు మొత్తాలు: ఇటువంటి సంస్థల ఔత్సాహిక యజమానులు తాము పొదుపు చేసుకున్న మొత్తాలని కూడా సంస్థ కార్యకలాపాల కోసం వినియోగిస్తారు.
5) సప్లయిదారుని రుణ సౌకర్యం: ఇటువంటి సంస్థలకు సరుకు సరఫరా చేసేవారు సరుకు విలువను నిర్ణీత గడువులోపల చెల్లించే పద్ధతిపై సరుకుని అందజేస్తారు. సాధారణంగా ఇటువంటి గడువు సరుకు సరఫరా చేసిన రోజు నుంచి 30 రోజులు గానీ అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
6) లీజింగ్: సాధారణంగా వ్యాపార సంస్థలకు స్థిరాస్తులను సరఫరా చేయువారు అద్దె కొనుగోలు పద్ధతిపై ఆస్తులను అందచేయుటవల్ల అంకుర సంస్థలకు అవసరమైన పెట్టుబడి మొత్తం తగ్గుతుంది.
7) కాలపరిమితి రుణాలు: ఇటువంటి రుణాలు నిర్ణీత కాలపరిమితి లోపల తిరిగి చెల్లించే విధంగా మంజూరు చేయబడతాయి. ఈ రుణాలు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక రుణాలుగా మంజూరు చేయబడతాయి.
8) ఆస్తులపై రుణం: ఇది తనఖా అప్పులాంటిది. లాభార్జన ప్రారంభించని సంస్థలు తమ ముఖ్యమైన విలువైన ఆస్తులను హామీగా చూపి రుణాలు తీసుకుంటాయి. ఇటువంటి రుణాలు అంకుర సంస్థలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.
9) సామాజిక వర్గాలకు చేయూతనిచ్చే పథకాలు: బ్యాంకుల నుంచి గానీ, ఇతర విత్త సహాయ సంస్థల నుంచి గానీ, రుణాలు పొందలేని సందర్భాలలో ఇటువంటి పథకాల కింద రుణ సహాయం లభిస్తుంది. ఇటువంటి రుణాలు అవసరమైన ఆస్తులు, పరికరాలు సమకూర్చుకోవడానికి ఉపయోగపడతాయి.
10) క్రెడిట్ కార్డులు: అంకుర సంస్థలు నిధుల అవసరాల కోసం ఈ పద్ధతిని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిపై ప్రతినెల వాయిదాలు క్రమంగా చెల్లించవలసి ఉంటుంది. లేని యెడల వడ్డీ రేటుతోపాటు, ఆలస్యంగా, గడువులోపల చెల్లించనందుకు జరిమానా (Penalty) కూడా విధిస్తారు.
11) ప్రభుత్వ సహాయంతో పొందే రుణాలు: ప్రభుత్వం వారు స్వయంగా గానీ లేదా చిన్న సంస్థలకు వారు తీసుకునే గ్యారంటీ ఇవ్వడం ద్వారా గానీ అంకుర సంస్థలకు నిధులు అందడానికి తోడ్పడతారు.
అంకుర సంస్థలు వివిధ మూలాధారాల నుంచి తమకు అవసరమైన నిధులను సేకరించవచ్చు. అలాగే ప్రభుత్వం రు ప్రోత్సాహక పథకాల కింద అందించే నిధులను కూడా పొందే అవకాశం ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అంకుర సంస్థను ఎలా నమోదు చేస్తారు.
జవాబు.
అంకుర సంస్థను నమోదు చేసే ప్రక్రియ:
1. వ్యాపార సంస్థను నమోదు చేయించడం: సంస్థలను ‘ప్రైవేటు లిమిటెడ్’ గానీ, పరిమిత ఋణ బాధ్యతగల భాగస్వామ్య సంస్థగా గానీ, భాగస్వామ్య సంస్థగానీ నమోదు చేయించాలి.
2. అంకుర సంస్థను నమోదు చేయించడం: అంకుర సంస్థగా నమోదు చేయించడానికి అవసరమైన వివరాలను ఆన్లైన్లో సూచించబడినటువంటి దరఖాస్తులను Startup India Website మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి Website లోని దరఖాస్తులో అవసరమైన వివరాలను నింపి నమోదు చేయించుకోవాలి.
3. పత్రాలను అప్లోడ్ చేయడం: దరఖాస్తుల్లో అవసరమైన వివరాలను పొందుపరచి తరువాత, అవసరమైనటువంటి దస్తావేజుల కాపీలను (Online) ద్వారా నమోదు చేయాలి. అప్లోడ్ చేయాల్సిన ముఖ్యమైన పత్రాలు:
- సిఫారసు లేఖ
- సంస్థను నమోదు చేసినట్టు జారీ అయిన ధ్రువపత్రం
- భాతస్వామ్య సంస్థ అయినట్టయితే, నమోదు కాబట్టినట్టు జారీ అయిన ధ్రువపత్రం
- సంస్థ చేపట్టబోయే వ్యాపార లక్షణాల గురించి వివరణ, భవిష్యత్తులో వృద్ధి చెందగల అవకాశాల వివరణ /అంచనాలు.
‘స్టార్టప్ ఇండియా’ పథకం కింద నమోదు కాబడినటువంటి సంస్థలు అంకుర సంస్థలుగా గుర్తించబడతాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందచేస్తున్న సహాయ, సహకారాలను, రాయితీలను పొందుతున్న కారణంగా, అనేక సంస్థలు అంకుర సంస్థలుగా (Startup) నమోదు కావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగావకాశాలు పెరిగి కొత్తగా ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి.
ప్రశ్న 2.
అంకుర సంస్థ నిధులు ఎలా పొందగలుగుతుంది?
జవాబు.
అంకుర సంస్థలకు నిధులు: అంకుర సంస్థలకు నిధులు రకరకాల ఆధారాల ద్వారా సమకూర్చబడతాయి. కింద తెలిపినట్టి అనేక మూలధారాల ద్వార అంకుర (Start up) సంస్థలకు నిధులు సమకూరుతాయి.
1) స్వీయ నిధులు: సంస్థలు, తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునే క్రమంలో సంపాదించే నిధులను తిరిగి సంస్థలోనే పెట్టుబడి పెట్టడం వల్ల బయట నుంచి నిధులను సేకరించుకునే అవసరం లేకుండా, స్వంత నిధులపై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. అంటే, వ్యాపార టర్నోవర్ పెరుగుతున్నందువల్ల వసూలు అయ్యే మొత్తాల నుంచి ఏర్పడే మిగులు నిధులు, సంస్థకు అదనపు నిధుల అవసరాన్ని భర్తీ చేస్తాయి.
2) ఆరంభ రుణాలు: కొత్తగా వ్యాపార సంస్థను ప్రారంభించిన ఔత్సాహికులకు లేదా రెండు సంవత్సరాలకు మించకుండా వ్యాపారం చేస్తున్న సంస్థల యజమానులకు ప్రభుత్వం ద్వారా అంకుర (Startup) సంస్థల కోసం ఉద్దేశించబడిన రుణ సౌకర్యం అందుతుంది. ఈ రుణ సౌకర్యం స్థిరవడ్డీ రేటుపై, ఎటువంటి పూచీ లేకుండా మంజూరు చేయబడతాయి.
3) స్నేహితులు, కుటుంబసభ్యులు: అంకుర సంస్థ ఔత్సాహికులు తమ కుటుంబసభ్యుల నుంచి గానీ, మిత్ర బృందం నుంచి గానీ నిధులను సమకూర్చుకుంటారు. ఇటువంటి నిధులను సమంజసమైన వడ్డీరేటుపై తిరిగి చెల్లింపు హామీగా ప్రామిసరీ నోటులను అందజేసి సేకరిస్తారు.
4) స్వంత పొదుపు మొత్తాలు: ఇటువంటి సంస్థల ఔత్సాహిక యజమానులు తాము పొదుపు చేసుకున్న మొత్తాలని కూడా సంస్థ కార్యకలాపాల కోసం వినియోగిస్తారు.
5) కాలపరిమితి రుణాలు: ఇటువంటి రుణాలు నిర్ణీత కాలపరిమితి లోపల తిరిగి చెల్లించే విధంగా ‘మంజూరు చేయబడతాయి. ఈ రుణాలు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక రుణాలుగా మంజూరు చేయబడతాయి.
6) ప్రభుత్వ సహాయంతో పొందే రుణాలు: ప్రభుత్వం వారు స్వయంగా గానీ లేదా చిన్న సంస్థలకు వారు తీసుకునే గ్యారంటీ ఇవ్వడం ద్వారా గానీ అంకుర సంస్థలకు నిధులు అందడానికి తోడ్పడతారు.
ప్రశ్న 3.
ఏ కారకాలు ఒక వ్యక్తిని ఔత్సాహికుడిగా మారడానికి దోహదపడతాయి?
జవాబు.
ఔత్సాహికుడుగా మారడానికి ప్రభావితం చేసే కారకాలు రెండు విధాలుగా వర్గీకరించారు. అవి: 1) అంతర్గత కారకాలు 2) బహిర్గత కారకాలు.
1. అంతర్గత కారకాలు:
- విద్యార్హతలు
- వృత్తిపరమైన అనుభవం
- ఉత్పత్తి మార్గంలో స్వతంత్రంగా పనిచేయాలనే ఆసక్తి
- కుటుంబ చరిత్ర
- ఉత్పత్తిని వేరుగా చేయాలనే ఆసక్తి
- ఇతర కారకాలు.
2. బహిర్గత కారకాలు:
- ప్రభుత్వం నుంచి సహాయం
- ఆర్థిక సంస్థల నుంచి సహాయం
- లభ్యమయ్యే సాంకేతిక పరిజ్ఞానం మరియు ముడిసరుకు
- మిగులు నిధులను వినియోగించుకోవడం
- ఇతర కారకాలు.
ప్రశ్న 4.
వ్యాపార ఆలోచనను ఎంపిక చేయడానికి ఏయే అంశాలను పరిగణించాల్సి ఉంటుంది.
జవాబు.
సరైన ప్రాజెక్టును ఎంచుకోవడానికి, సరైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి, సేవలను అందించడానికి మంచి ఆలోచనల ఎంపికకు అవసరమైన క్రింది కారకాలను పరిశీలించాలి.
- ఎంచుకున్న ఆలోచనలు నూతన పంథా కలవా?
- ఆ ప్రదేశంలో పోటీ తక్కువగా ఉందా?
- ముడిపదార్థాలు సులభంగా దొరుకుతాయా?
- మౌళిక వసతులు, భూమి, నీరు, విద్యుత్ లభ్యమగునా?
- వ్యవస్థాపకునికి ఆ రంగంలో తగినంత అనుభవం, విజ్ఞానం ఉందా?
- అనుకున్న వస్తువు ఇంతకుముందే ఉత్పత్తి చేయబడుతున్నదా? వాటి సప్లయి డిమాండ్ మధ్య అంతరం ఎక్కువగా ఉందా?
- ప్రభుత్వ విధానాలు అలాంటి వస్తుత్పత్తికి సౌకర్యాలు కల్పిస్తున్నాయా?
- అలాంటి వస్తుఉత్పత్తిలో లాభ మార్జినీ ఎంత ఉండవచ్చు?
ప్రశ్న 5.
ప్రాజెక్టు నివేదికలో పొందుపరచవలసిన వివిధ అంశాల జాబితాను ఇవ్వండి.
జవాబు.
ప్రాజెక్టు సఫలీకృతం కావడానికి ప్రాజెక్టు రిపోర్టులో ఈ క్రింది అంశాలు తెలపాలి:
- ప్రతిపాదించిన ప్రాజెక్టు గురించి క్లుప్తమైన పరిచయం
- వ్యవస్థాపకుడు ఈ ప్రాజెక్టునే ఎన్నుకున్నందుకు ఉన్న చరిత్ర తెల్పడం
- వ్యవస్థ స్వరూపం
- వ్యవస్థాపకులు, ముఖ్యసిబ్బంది
- వస్తువులు, వస్తు ఉత్పత్తి గురించి వివరాలు
- మార్కెటింగ్ మరియు పోటీ
- ఉత్పత్తి విధానం
- యంత్రాలు, ప్లాంటు సామర్థ్యాలు
- ముడిపదార్థాలు
- భవనాలు,. భూమి
- సాధారణ నిర్వహణ, సాంకేతిక సిబ్బంది
- ప్రాజెక్టు వ్యయం
- విత్త మార్గాలు
- నిర్వహణ మూలధనం
- ఉత్పత్తి వ్యయం మరియు లాభదాయికత
- లాభదాయకత మరియు లాభనష్టరహిత బిందువు
- ప్రాజెక్టు అమలుపరిచే విధానం షెడ్యూలు
- వ్యవస్థాపకుని ఇష్ట ప్రకారం తిరిగి చెల్లింపు విధానం
- ప్రతిపాదించిన సెక్యూరిటీ వివరాలు
- ఇతర వివరాలు
ప్రశ్న 6.
ఒక వ్యాపార సంస్థ కేంద్రాన్ని, స్థలాన్ని ఎంపిక చేయడంలో పరిగణించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటో తెలియపరచండి.
జవాబు.
ప్రతి పారిశ్రామిక సంస్థ సరిఅయిన ప్రదేశం ఎన్నుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ఈ క్రింది అంశాలు ద్వారా సరియైన ప్రదేశాలు ఎంపికను తెలియపరచవచ్చును.
- మార్కెట్కు, ముడిపదార్థాలకు దగ్గరగా ఉండటం.
- పవర్ మరియు నీరు లభ్యత చూసుకోవడం.
- ముడిపదార్థాల కొనుగోలుకు, ఉత్పత్తి అయిన వస్తువుల రవాణా సౌకర్యాలు.
- పవర్, నీరు వృధాను బయటికి పోయే మార్గాలు.
- కావల్సిన నైపుణ్యత, అమలు ఉన్న వేతనరేట్లు.
- పరిశ్రమలపై ప్రభావం చూపే వాతావరణ పరిస్థితులు, పరిసరాల ప్రభావం.
- పారిశ్రామిక వెనుకబడిన ప్రదేశాలకు లభించే రాయితీలు, ప్రోత్సాహకాలు.
- వ్యాపారం అభివృద్ధికి అదనపు స్థలం లభ్యత.
- ఫ్రెట్, పార్సిల్ సేవల లభ్యత.
- కొన్ని ప్రత్యేక సౌకర్యాలు (ఉదా: అగ్నిమాపక, అద్దె, గిడ్డంగి లెక్కలోనికి తీసుకోవాల్సిన అంశాలు.)
ప్రశ్న 7.
ఒక వ్యాపార యూనిట్ విత్తాన్ని ఏయే మార్గాల ద్వారా సమకూర్చుకోవచ్చునో తెలపండి.
జవాబు.
వ్యాపార సంస్థలకు విత్తము మూడు రకాలుగా సమకూర్చును.
- దీర్ఘకాలిక రుణం: స్థిరాస్తులైన ప్లాంటు, యంత్రాలు, భూమి, భవనాలు, సెక్యూరిటీ డిపాజిట్లు, మొదలైన వాటి సేకరణ కోసం నిధులను సమకూర్చుకోవడానికి దీర్ఘకాలిక రుణాలు పొందుతారు.
- వారధి రుణం: ధీర్ఘకాలిక రుణం మంజూరు అయ్యేవరకు ప్రాజెక్టు నడిపించడానికి అయ్యే ఖర్చులను చెల్లించుకునేందుకు తీసుకునే రుణం. ఈ రుణాన్ని పొందడానికి ఆర్థిక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి, మంజూరు పొందాలి.
- నిర్వహణ మూలధనం: తనఖా, కుదువ, క్యాష్ క్రెడిబ్బిల్లు సౌకర్యంతో తీసుకునే అతిస్వల్ప కాలిక రుణాలు నిర్వహణ మూలధనం అంటారు.
ప్రశ్న 8.
వ్యాపార యూనిట్ యొక్క శాశ్వత రిజిస్ట్రేషన్ను పొందడానికి సంబంధించిన లాంఛనాలు ఏమిటో తెలపండి..
జవాబు.
జిల్లా పారిశ్రామిక కేంద్రాలు నుంచి శాశ్వతమైన నమోదును పొందవచ్చు. వ్యవస్థాపకుడు సంస్థను స్థాపించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్న తరువాత అంటే ప్యాక్టరీ భవనం సిద్ధంగా ఉండి, విద్యత్ కనక్షన్, యంత్ర పరికరాలు సిద్ధం చేసుకున్న తరువాత సంస్థ శాశ్వత నమోదుకై దరఖాస్తు చేసుకోవాలి.
అలాంటి దరఖాస్తును తీసుకున్న ఏడురోజులలోగా, జిల్లా పారిశ్రామిక కేంద్రాధికారి లేదా తత్సమానమైన అధికారి సంస్థ యొక్క తనికి తేది, సమయాలను వ్యవస్థాపకునికి తెలియపరచాలి. తనిఖీలో, సంస్థలో స్థాపించిన ప్లాంటు సామర్థ్య మదింపు కూడా ఒక భాగంగా ఉంటుంది. సంస్థ ఉత్పత్తి సామర్థ్యంలో అధికారులు సంతృప్తి చెందగానే పరిశ్రమలతో డైరెక్టరేట్ వద్ద శాశ్వత నమోదు పత్రం లభిస్తుంది.
ప్రశ్న 9.
తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ముఖ్యమైన పెట్టుబడి పారిశ్రామిక కేంద్రాలు ఏమిటో తెలపండి.
జవాబు.
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 14 రంగాలను ప్రముఖమైన రంగాలు అని సూటిగా పేర్కొన్నది. ఈ రంగాలలో పెట్టుబడి పెట్టే ఔత్సాహికులకు మిగతా పారిశ్రామిక రంగాల కంటే ప్రాముఖ్యతను కల్గిస్తారు. ప్రభుత్వం గుర్తించిన ఈ14 పరిశ్రమలు ఏవంటే:
- జీవశాస్త్రాలు: బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్స్, టీకాలు, న్యూట్రీ సెంటికల్స్ బయోలాజికల్ పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యాలు.
- సాంకేతిక సమాచారం హార్డ్వేర్: వైద్యరంగానికి చెందిన సాధనాలు, సెల్యూలార్ కమ్యూనికేషన్.
- ఇంజనీరింగ్ పరికరాలు: విమానయానం, అంతరిక్ష నౌకలు, రక్షణ.
- ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పోషక ఉత్పత్తులు: డైరీ, పౌల్ట్రీ, మాంసం, చేపల ఉత్పత్తులు.
- ఆటోమొబైల్స్, రవాణా వాహనాలు, ఆటో విడి పరికరాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు.
- వస్త్రాలు, దుస్తుల తయారీ, తోళ్ళ పరిశ్రమలు.
- ప్లాస్టిక్స్, పాలిమర్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, గ్లాస్ మరియు సెరమిక్స్.
- త్వరితగతిని కదలిక కలిగిన వినియోగదారుల వస్తువులు, గృహోపకరణాలు.
- ఇంజనీరింగ్ మరియు మూలధన వస్తువులు.
- రత్నాలు, వజ్రాలు.
- నిరర్ధకాలైన వస్తువుల నిర్వహణ, పచ్చదన సాంకేతిక పరిజ్ఞానాలు.
- రెనివబుల్ ఎనర్జీ మరియు సోలార్ పార్కులు.
- మినరల్ ఆధారిత మరియు కొయ్య సంబంధిత పరిశ్రమలు.
- రవాణా సౌకర్యాలు.
ప్రశ్న 10.
సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ రూపొందించిన ప్రత్యేక నిబంధనలు ఏమిటో తెలపండి.
జవాబు.
తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్నతరహా మరియు మధ్యతరహా పరిశ్రమలకు క్రింది ప్రత్యేక నిబంధనలను . పారిశ్రామిక విధానంలో రూపొందించింది.
- సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల కోసం పారిశ్రామిక వాడలలో సరిపడే స్థాయిలో చిన్న చిన్న ప్లాట్ల ఏర్పాటు, సూక్ష్మ యూనిట్లలో అభివృద్ధి పరచబడిన షెడ్స్ కేటాయింపు.
- ఇబ్బందులకు గురి అయినా పరిశ్రమలను ప్రారంభదశలోనే మెరుగుపరచడానికి ప్రత్యేకమయిన నిధిని ఏర్పరచడం.
- మేధోసంపత్తి నమోదుకు సహాయాన్ని అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు.
- అధికారిక అనుమతి లేకుండా చౌర్యానికి పాలుపడే వారినుంచి ఔత్సాహికులకు రక్షణకు ప్రత్యేక నిధి ఏర్పాటు.
- సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలను ఆధునీకరించడం, సాంకేతిక పరిజ్ఞానం కొరకు నిధి ఏర్పాటు చేయడం.
- జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు, అమ్మకాలదారులు పాల్గొనడానికి మార్కెటింగ్ చేయూతను ప్రభుత్వం అందించును.
- స్వంత స్థలంలో ఎంట్రప్రిన్యూర్లకు పరిశ్రమలను నెలకొల్పడంనకు ప్రభుత్వం సహాయం చేస్తుంది.
- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఎంట్రప్రిన్యుర్లకు సహాయక పానల్ ఏర్పరుస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా, రాష్ట్రస్థాయి బాంకర్స్ కమిటీని ఏర్పరుస్తుంది.
- సూక్ష్మ సంస్థలకు అనుమతులు, లైసెన్స్లు జారీ చేయడానికి అధికార వికేంద్రీకరణ చేయడమైనది.
- సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు భద్రత వలయం కల్పించడం.
- స్త్రీ అభ్యుదయానికి కృషి చేసే సంస్థలు దీనిలో పాల్గొనడానికి, ప్రభుత్వ భాగస్వామిగా ఉండమని ఆహ్వానిస్తుంది.
ప్రశ్న 11.
మన రాష్ట్రంలోని SC/ST ఔత్సాహికులకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక చేయూతలు ఏమిటి?
జవాబు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం SC/ST ఎంట్రప్రిన్యూర్లకు ఈ క్రింది చేయూతను కల్పిస్తుంది:
- SC/ST ఎంట్రప్రిన్యూర్లకు ఒక ప్రత్యేక నిధి కార్యక్రమంద్వారా ఆర్థిక సహాయం అందించడం.
- రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ రిఫండ్ స్కీమును ఏర్పరచి 5 కోట్లు కల్పించడం.
- పారిశ్రామిక పార్కులలో SC/ST ఎంట్రప్రిన్యూర్లకు ప్లాట్లు కేటాయింపులో ప్రాముఖ్యత, పార్కులలో 22% రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం.
- పెద్ద పరిశ్రమలలో వైవిధ్యభరితమైన సప్లయిదారుల అవకాశాలు కల్పించడం.
- కేంద్ర ప్రభుత్వం యొక్క SME ప్రొక్యూర్మెంట్ పాలసీకి అనుసంధానంగా రాష్ట్రప్రభుత్వం 20% ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇచ్చును.
- SC/ST అభ్యర్థులకు ఇంటెన్సివ్ ఎంట్రప్రిన్యూర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్న నిర్వహించడం.
- నాన్ బాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా రేటింగ్, ఫండింగ్ చేయబడితే సబ్సిడీకి అర్హత లభిస్తుంది.
- రవాణారంగం కాకుండా, ఇతర సేవారంగ యూనిట్లపై ఎంట్రప్రిన్యూర్ల ఆసక్తి కనపరిస్తే, వడ్డీ సబ్సిడీని కల్పిస్తుంది.
- దళిత్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంటి సంస్థలు చేపట్టి, వారి ఔత్సాహిక కార్యక్రమాల ప్రణాళికా, అమలుపరచడం, నియంత్రించడంలో సహాయం ఇవ్వడం.
- అన్ని జిల్లా మరియు రాష్ట్రస్థాయి కమిటీలలో SC/ST ఎంట్రప్రిన్యూర్లకు ప్రాతినిధ్యం కల్పించడం.
ప్రశ్న 12.
మన రాష్ట్రంలోని సాంప్రదాయక కళలు, హస్త కళల ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటో విశదీకరించండి.
జవాబు.
కళాత్మక, హస్తకళల వస్తువుల ఉత్పాదకతను ఆదాయాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను తెలంగాణ స్టేట్ హండిక్రాఫ్ట్ అండ్ ఆర్డినెన్స్ రివైవల్ విత్ టెక్నాలజీ ప్రోగ్రామ్ (T-HART) వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ ఉపయుక్తమైన చర్యలు ఏమిటి అంటే ఈ క్రింది విధంగా తెల్పబడింది.
- నిర్థిష్టమైన కళలు లేదా హస్తకళలను గుర్తించే ఒకే తీరును కలిగి ఉన్న వాటిని వర్గాలుగా చేయడం.
- కళలు, హస్తకళలను గుర్తించి వాటిని సంబంధించిన పత్రాలను రూపొందించడం.
- సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మార్చడం, డిజైన్ చేయూత కేంద్రాలు ఏర్పాటు చేయడం.
- నైపుణ్యాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించడం, నాణ్యతను పెంచడం.
- ఒకే విధమైన సౌకర్యాల కేంద్రాలు ఏర్పాటు చేయడం.
- కళలు, హస్తకళల యూనిట్ల రిజిస్ట్రేషన్లో చేయూతనివ్వడం.
- ఒక మూలగానీ, ఖాళీ ప్రదేశంలోగాని అమ్మే కళాత్మక వస్తువులు వృద్ధిపరచడం.
- మార్కెటింగ్లో చేయూతనివ్వడం.
ప్రశ్న 13.
Telangana State Industrial Development and Entrepreneurs Advancement Incentive Scheme ద్వారా ఔత్సాహికులకు సమకూర్చే ప్రోత్సాహకాలు ఏమిటి?
జవాబు.
తెలంగాణ ప్రభుత్వం ఎంట్రప్రిన్యూర్లకు Telangana State Industrial Development and Entrepreneurs Advancement Incentive Scheme ద్వారా క్రింద పేర్కొన్న ప్రోత్సాహకాలు లభిస్తుంది.
- స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు
- భూమి వ్యయంపై రిబేట్
- భూమిని పారిశ్రామిక అవసరాలు అనుగుణంగా మార్చుకోవడంలో అయ్యే వ్యయం
- విద్యుచ్ఛక్తి వ్యయం తిరిగి చెల్లింపు
- పెట్టుబడి సబ్సిడీ
- VAT ను తిరిగి చెల్లించడం.
- వడ్డీ సబ్సిడీ
- మొదటి తరం ఔత్సాహికులకు సీడ్ క్యాపిటల్ సౌకర్యం..
- శిక్షణ నైపుణ్యం వృద్ధి వ్యయాలు తిరిగి చెల్లింపు
- నాణ్యత, పేటంట్ల చేయూత
- శుభ్రమైన ఉత్పత్తి చర్యలు
- మౌళిక వసతుల కల్పనలో అయ్యే వ్యయాలు తిరిగి చెల్లింపు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అంకుర సంస్థ.
జవాబు.
- వ్యాపార కార్యకలాపాలను ఆరంభించే క్రమాలలో మొదటిదశలో ఉన్న సంస్థలను అంకుర సంస్థలు అంటారు.
- అంకుర సంస్థగా గుర్తింపు పొందడానికి కొన్ని ఆవశ్యకాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంకుర సంస్థ నమోదు పూర్తి అయినప్పుడు మాత్రమే ప్రయోజనాలను పొందగలుగుతుంది.
ప్రశ్న 2.
ప్రాజెక్టు నివేదిక.
జవాబు.
- వస్తువును, వ్యాపార వ్యవస్థ అనే నిర్ణయించుకున్న తర్వాత వ్యవస్థాపకుడు అతని ఆలోచనలను కాగితంపై పెట్టి వివరించాలి. దీనినే ప్రాజెక్టు రిపోర్టు అంటారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు సంతృప్తికరంగా అందులో నిక్షిప్తం చేయాలి.
- తదనుగుణంగా ప్రాజెక్టు రిపోర్టు తయారీలో అనేక శీర్షిక కింద వివరాలను విశదీకరించాలి. అవసరమైన డాక్యుమెంట్లు, కొటేషన్లు, ఎంక్వైరీలు ఇచ్చిన శీర్షిక కింద ప్రాజెక్టు రిపోర్టుకు జతపరచాలి.
ప్రశ్న 3.
ప్రాజెక్టు సమీక్ష.
జవాబు.
- ప్రతిపాదన యొక్క తుది నిర్ణయాన్ని సాంకేతిక, ఆర్థిక, వాణిజ్య నిర్వాహక మరియు ఆపరేటింగ్ కార్యకలాపాలను అన్నింటినీ అంచనా వేసి తీసుకోవడమవుతుంది.
- ప్రాజెక్టులోని లోటుపాట్లను కనిష్టం చేయడానికిగాను వ్యవస్థాపకులు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. సలహాలను, సూచనలను తగిన మేరకు తప్పక నిర్వర్తించాలి.
ప్రశ్న 4.
తాత్కాలిక రిజిస్ట్రేషన్.
జవాబు.
- తాత్కాలిక నమోదు, సంస్థను వెలుగులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సహాయపడుతుంది. తాత్కాలిక నమోదు కోసం పారిశ్రామిక కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలి.
- తాత్కాలిక నమోదు పత్రాన్ని అంటే దరఖాస్తు చేసిన ఏడురోజులలోగా ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలిక నమోదు యొక్క వ్యవధి కాలం సాధారణంగా ఆరు మాసాలు ఉంటుంది. ఈ వ్యవధి కాలిన్ని తగినంత ఆధారల చూపి అభ్యర్ధిస్తే మరొక ఆరు మాసాలను పొడిగించడం జరుగుతుంది.
ప్రశ్న 5.
పారిశ్రామిక లైసెన్స్.
జవాబు.
1) మూలధన ఎక్విప్మెంట్ల దిగుమతి, విదేశీ ఒడంబడికలు మొదలైనవన్నీ పర్యవేక్షించడానికి అనేక నిర్వహణా బోర్డులను స్థాపించడం జరిగింది. ఈ బోర్డులు అనుమతించిన కాలపరిధిలోపు వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి లైసెన్సులను జారీ చేయాలి.
2) పారిశ్రామిక అభివృద్ధి, క్రమబద్ధీకరణ చట్టం 1951లో గల షెడ్యూల్ ప్రకారం జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తికి లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి. ఉదా: లోహానికి సంబంధించిన పరిశ్రమలు, ఇంధనాలు, బాయిలర్లు మరియు ఆవిరి ఉత్పత్తి చేసే ప్లాంట్లు, విద్యుచ్ఛక్తి పరికరాలు, టెలికమ్యూనికేషన్స్, రవాణా, పారిశ్రామిక యంత్రాలు, ఎరువులు రసాయనాలు మొదలైనవి.
ప్రశ్న 6.
దీర్ఘకాలిక రుణాలు.
జవాబు.
స్థిరాస్తులైన ప్లాంటు, యంత్రాలు, భూమి, భవనాలు సెక్యురిటీ డిపాజిట్లు మొదలైన వాటి సేకరణ కోసం నిధులను సమకూర్చుకోవడానికి పొందే రుణాలను దీర్ఘకాలిక రుణాలు అంటారు.
ప్రశ్న 7.
బ్రిడ్జ్ రుణాలు.
జవాబు.
దీర్ఘకాలిక రుణం మంజూరు అయ్యేవరకు ప్రాజెక్టు నడిపించడానికి అయ్యే ఖర్చులను చెల్లించుకునేందుకు తీసుకునే రుణాన్ని బ్రిడ్జి రుణాలు అంటారు. ఈ రుణాన్ని పొందడానికి ఆర్థిక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి, మంజూరును పొందాలి.
ప్రశ్న 8.
నిర్వహణ మూలధనం.
జవాబు.
తనఖా, కుదవ, క్యాష్ క్రెడిట్ బిల్లు, సౌకర్యంతో తీసుకునే అతి స్వల్పకాలిక అడ్వాన్సులను నిర్వహణ మూలధనం అంటారు. వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన మూలధనాన్ని నిర్వహణ మూలధనం అంటారు.
ప్రశ్న 9.
అంకుర సంస్థ సమర్పించాల్సిన పత్రాలు.
జవాబు.
అంకుర సంస్థ సమర్పించాల్సిన పత్రాలు:
- సిఫారసు లేఖ
- సంస్థను నమోదు చేసినట్టు జారీ అయిన ధ్రువపత్రం
- భాగస్వామ్య సంస్థ అయినట్టయితే, నమోదు కాబడినట్టు జారీ అయిన ధ్రువపత్రం
- సంస్థ చేపట్టబోయే వ్యాపార లక్షణాల గురించి వివరణ భవిష్యత్తులో వృద్ధి చెందగల అవకాశాల వివరణ / అంచనాలు.