Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Poem శతక సుధ Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 3rd Poem శతక సుధ
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు
ప్రశ్న 1.
ఏనుగు లక్ష్మణకవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణకవి సంస్కృతంలో భర్తృహరి రచించిన, సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి నీతి, శృంగార, వైరాగ్య, శతకాలని మూడు భాగములు. రత్నావళిల పద్యాలు అవి మనోహరంగా, యథామూలంగా, సందర్భోచితంగా ఉంటాయని విమర్శకుల భావన.
లక్ష్మణకవి నీతి శతకంలో అనేక విషయాలు తెలియచేసాడు. కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముత్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.
క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని . తగ్గించుకుని ఉండుట ఉత్తమము.
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదాల విందాలను శిరస్సున దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.
ఇలా ఏనుగు లక్ష్మణకవి తెలుగులో అనువదించిన నీతి శతకాలలోని నీతి అన్ని కాలాలకూ వర్తిస్తుంది. విద్యార్థులకు పెద్దలకు అందరికీ వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఎలా మసలుకోవాలో అనేక ఉపమానాలు సుమధురంగా నీతిని ప్రబోధించారు.
ప్రశ్న 2.
పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తితత్త్వాన్ని తెలపండి?
జవాబు:
శేషప్పకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం వాడు. ధర్మపురిలోని నరసింహస్వామిపై రాసిన శతకం నరసింహ శతకం. ఇది సీస పద్యాలలో రచింపబడిన ద్విపాద మకుట శతకం. శతకం లేని పద్యాలలో నరసింహస్వామిని సంబోధించడంలో ప్రేమ, మృదుత్వం, కాఠిన్యం, కోపం ఇంకా అనేక విధాలుగా తన భక్తిని ప్రదర్శించాడు.
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!
భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.
గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవులు పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!
నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.
భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.
ఈ విధంగా మృదు మధుర, సులభమైన ఉపమానాలలో శేషప్ప కవి నరసింహస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.
II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
సజ్జనుడి మాట తీరును తెలపండి?
జవాబు:
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుమారి రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోర వచన మును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.
ప్రశ్న 2.
అధమ, మద్యమ, ఉత్తములను కొలిచేవారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు?
జవాబు:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.
ప్రశ్న 3.
బలిష్ఠునికే బంధుసహాయం అందుతుందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.
ప్రశ్న 4.
ఏనుగు లక్ష్మణకవిని గురించి తెలపండి
జవాబు:
భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతం వంటి మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.
IV. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
మనిషికి శత్రువు ఎవరు?
జవాబు:
కోపము
ప్రశ్న 2.
దివ్యమైన ధనం ఏది?
జవాబు:
విద్య
ప్రశ్న 3.
దుర్జనులు ఎలాంటి ఆలోచనలను చేస్తారు ?
జవాబు:
చెడ్డ ఆలోచనలు
ప్రశ్న 4.
నృసింహ శతక కర్త ఎవరు?
జవాబు:
శేషప్పకవి
ప్రశ్న 5.
ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు?
జవాబు:
ధర్మపురి నరసింహస్వామి భజన చేసేవారు
ప్రశ్న 6.
భాస్కర శతకకర్త ఎవరు?
జవాబు:
మారద వెంకయ్య
ప్రశ్న 7.
సజ్జనుడి పలుకులు ఎలాంటివి?
జవాబు:
మంచి మాటలు
ప్రశ్న 8.
చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి?
జవాబు:
దుర్మార్గులకు దేవుని గురించి తెలిపి వారిని మంచివారుగా చేయలేరు.
V. సందర్భ సహిత వాఖ్యలు
ప్రశ్న 1.
గర్వము మానుటొప్పగున్
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము ఏనుగు లక్ష్మణకవిచే రచింపబడిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :-
విద్యను ఆర్జించిన పండితులతో ఎలా ప్రవర్తించాలో రాజులకు, డబ్బున్నవారికి కవి తెలియచేస్తున్న సందర్భంలోనిది.
భావము :-
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయ కాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.
ప్రశ్న 2.
నిన్ను భాజన చేసెడి వారికి పరమ సుఖము
జవాబు:
పరిచయము :-
శేషప్పకవిచే రచింపబడిన నృసింహ శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :-
శరీరం, సంతానం, బంధుగణం, బలపరాక్రమాలు, సంపదలు శాశ్వతం కాదని నరసింహస్వామి భజన చేయటే శాంతకరణమని చెప్పిన సందర్భంలోనిది.
భావము :-
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.
ప్రశ్న 3.
సజ్జనుల జేయులేడెంత చతురుడైన
జవాబు:
పరిచయం :-
శేషప్ప కవిచే రచింపబడిన నృసింహశతకం నుండి గ్రహించిన
సందర్భము :
క్రూరజీవులనైన అదుపు చేయవచ్చుగానీ, దుర్మార్గుల మనసును ఎంతటితెలివిగల వాడైనను, మార్చలేడని కవి చెబుతున్న సందర్భంలోనిది.
భావము :-
భుజముల శక్తిచే పెద్దపులుల చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్టవచ్చును. బ్రహ్మరాక్షసులు ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్పవచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును.
కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.
ప్రశ్న 4.
వెల్తికుండ తొఁదొలుకుచునుండు
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యం మారద వెంకయ్యచే రచింపబడిన భాస్కర శతకం నుండి గ్రహించిన పద్యంలోనిది.
సందర్భము :-
నీచుడికి, గుణవంతుడికి ఉన్న లక్షణాలను కవి తెలిపిన సందర్భం
భావము :-
వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.
VI. సంధులు
1. చరణాభివాదన :
చరణ + అభివాదన = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :-
2. అభిలార్థి
అఖిల + అధి = సవర్ణదీర్ఘసంధి
సూత్రము :-
3. నిష్ఠురో
నిష్టుర + ఉక్తి = గుణసంధి
సూత్రము :-
4. కురియకుండునే
కురియక + ఉండునే = ఉకారసంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.
5. భాగ్యంబెంత
భాగ్యంబు +ఎంత = ఉకారసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.
6. భ్రమలన్నీ
భ్రమలు + అన్ని = ఉకార సంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగును.
7. ముత్యము
ముత్యము + అట్లు = ఉకారసంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.
8. సూకరంబునకేల
సూకరంబునకు + ఏల = ఉకరా సంధి
సూత్రము :- అత్తునకు సంధి బహుళమగును.
9. అదెట్లు
అదెట్లు = అది + ఎట్లు = ఇకారసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పకముగాను.
10. ముద్దుసేయగ
ముద్దు + చేయగ = గసడదవాదేశ
సూత్రము :- కళలైన క్రియా పదములపై పరుషములకు గసడడవలు వైకల్పికముగానగు.
VII. సమాసాలు
1. వేయేండ్లు = వేయి సంఖ్యల గల సంవత్సరాలు – ద్విగు సమాసం
2. దారాసుతాదులు = భార్య మరియు పిల్లలు – ద్వంద్వ సమాసం
3. తల్లిదండ్రులు = తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం
4. ప్రియభాషలు = ప్రియమైన భాషలు – విశేషణ పూర్వపద క్మరధాయ సమాసం
5. దివ్యధనం = దివ్యమైన ధనం – విశేషణపూర్వపద క్మరధాయ సమాసం
6. శర్కరాపూపంబు = శర్కరము (చక్కెర)తో చేసి అపూకము (పిండివంట) – తృతీయా తత్పురుష సమాసం
7. చూతఫలము = చూతము (మామిడి) అనెడి ఫలము – రూపక సమాసము
8. భుజబలము = భుజముల యొక్క బలము – షష్ఠీ తత్పురుష సమాసము
9. లోకరక్షణ = లోకమునకు రక్షణ – షష్ఠీ తత్పురుష సమాసము
10. భూషణ వికాస = భూషణముతో ప్రకాశించబడేవాడు – బహువ్రీహి సమాసం
11. అనామకం = పేరులేనిది – నఇ+త్పురుష సమాసం
12. శీతల నీరము = శీతలమైన నీరము – విశేషణ పూర్వపద కర్మధారయ – సమాసం
పద్యాలు – ప్రతిపదార్థాలు- తాత్పర్యాలు
1వ పద్యం :
ఉ. నీరము భక్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తసర్చు, నా
నీరమె శక్తిలోఁబడి మణిత్వముంగాంచు సమంచితప్రభం;
వాదనవృత్తు లిట్లధము మధ్యము సుత్తముఁగొల్చువారికిన్,
అర్థాలు :
నీరము = నీరు
తప్తలోహము = కాలిన ఇనుముపై
నిల్చి = పడితే
అనామకమై = ఊరు, పేరు లేక
నశించునే = నశించిపోవును
ఆ నీరమే = ఆ నీరే
నళినీదళ = తామరాకు మీద
సంస్థితమై = పడితే
ముత్యము + అట్లు = ముత్యము వలె
తసర్చు = కనిపించను
ఆనీరమే = ఆ నీరే
సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశంలో
శుక్తిలోపడి = ముత్యపు చిప్పలో పడి
మణిత్వము = ముత్యం
గాంచు = అవుతుంది
అధముడు = నీచుడు
మధ్యము = మధ్యములు
ఉత్తములు = ఉత్తములు
పౌరుష = పురుషునకు సంబంధించి
వృత్తులు = నడవడులు
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.
భావము :
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, మధ్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.
2వ పద్యం :
చ. క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జాతి హుతాశనుందు, మీ
“త్రము దగుమందు, దుర్జనులు దారుణపన్నగముల్, సువిద్య వి.
త, ముచిత లబ్ది భూషణముదాత్తకవిత్వము రాజ్యమి క్షమా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టునందత్కవచాదు లేటికిన్,
అర్థాలు :
క్షమ = ఓర్పు
కవచము = ఆయుధాల దాడి నుండి కాపాడేది.
క్రోధము + అది = కోపం అనేది
శత్రువు = శత్రువు (పగవాడు)
హూతాశనుడు = నిప్పు
తగుమందు = సరైన ఔషధం
దుర్జనులు = చెడ్డవారు
దారుణ = భయంకరమైన
పన్నగముల్ = సర్పములు
సువిద్య = మంచి విద్య
విత్తము = ధనము
ఉచిత లజ్జ = తగినంత సిగ్గు
భూషణము = అలంకారము
ఉదాత్త = గొప్ప
కవిత్వం = కవిత్వం
రాజ్యము = రాజ్యం
క్షమా = ఓర్పు వంటి
ప్రముఖ = ప్రముఖ
పదార్థముల్ = గుణములు
కలుగుపట్టున = కలిగి ఉంటే
తత్ = ఆ
కవచాదులు = కవచాల వంటివి
ఏటకిన్ = ఎందుకు (అవసరం లేదు)
భావము :
క్షమ కలిగియున్నచో బాధలు తప్పించుకొనుటకు వేరే కవచం అక్కరలేదు. క్రోధమును మించిన శత్రువులేదు. సమస్తము నిర్మూలించకు దాయాది ఉంటే చాలు. వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుని మించిన ఔషధం లేదు. ప్రాణాలు తీయుటకు దుష్టజనాలు చాలు, వేరే సర్పాలు అవసరం లేదు. విద్యయే ధనము, తగినంత సిగ్గు కలిగివుండుట అలంకారము. లోకులను వశం చేసుకొనుటకు మంచి పాండిత్యంగాని, కవిత్వం గాని ఉంటే చాలు రాజ్యమక్కరలేదు.
3వ పద్యం :
ఉ. హర్తకుఁగాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టిఁ జేయు స
శ్రీశ్మీర్షి ఘటించు విద్య యనుదివ్యధనం బఖిలార్డికోటికిం
బూర్తిగనిచ్చినన్ బెరుఁగుఁ బోదు యుగాంతపు వేళ నైన భూ
బర్తలు తర్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్.
అర్థాలు :
హర్త = దొంగకు (చోరునకు)
గోచరము = కనిపించుట
లేదు = కనిపించదు
అహర్నిశము = ఎల్లప్పుడూ
సుఖపుష్ట+చేయు = సుఖమునే కలిగించును.
సత్ + కీర్తి = మంచి పేరు
ఘటించు = తెస్తుంది (కలిగిస్తుంది)
విద్య + అసు = చదువు అనే
దివ్యధనం = పవిత్రమైన సంపద
అఖిల + అర్ధ = ఆశించిన
కోటికి = జనులందరికీ
పూర్తిగ = దానం
ఇచ్చినన్ = చేసిననూ
పెరుగున్ = వృద్ధి చెందుతుంది (నశించదు)
యుగాంతసవేళను+ఐన = ప్రళయకాలంలో కూడా
పోదు = నశించదు
భూ భర్తలు = రాజులు
తత్ + ధన + అధికులు = ఆ విద్యాధికుల
పట్టున = వృద్ధి
గర్వము = గర్వం
మానుట = తగ్గించుకొనుట
ఒప్పగున్ = మంచిది
భావం :
విద్యాధనాన్ని దొంగలు హరించలేరు. అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగ జేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిననూ మరింత వృద్ధి చెందును. ప్రళయకాలంలో కూడా నశించదు. ఇట్టి విద్యాధనము గలవారితో సామాన్యధనము గల రాజులు తమ గర్వాన్ని తగ్గించుకుని ఉండుట ఉత్తమము.
4వ పద్యం :
చ. కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠితవీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తనమంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబులివి శూరులకున్ సిరి లేనియప్పుడున్.
అర్ధాలు :
కరమున = చేతులతో
నిత్యదానము = సదాదానము చేయుట
ముఖంబున = నోటి నుంచి
సూనృతవాణి = సత్యవాక్కు
గురుచరణ = గురువు పాదాలను
అభివాదన = నమస్కరించి
ఔదలన్ = శిరస్సున దాల్చుట
డోర్యుగము = భుజయుగమునకు
అకుంఠిత = తీవ్రమైన
వీర్యము = పరాక్రమము
వరహృదయంబునన్ = హృదయమునకు
విశదవర్తన = సత్ప్రవర్తన
వీనులు = చెవులు
అంచిత విద్య = శాస్త్ర శ్రవణము
సురుచిర = సుందరమైన
సూరులకున్ = సత్పురుషులకు
సిరిలేని = ధనంలేని
అప్పుడున్ = ఆ సమయంలోను
ఇవి = ఇవి
భూషణములు = అలంకారములు
భావము :
చేతులతో సదా దానం చేయుట, సదా సత్యమునే పలుకుట, గురుపాదార విందాలకు శిరస్సు దాల్చుట, భుజయుగమునకు జయమునిచ్చే పరాక్రమాన్ని, నిర్మలమైన మనస్సును, చెవులకు శాస్త్ర శ్రవణం – ఇవి సత్పురుషులకు ఐశ్వర్యము లేకపోయినను గొప్ప అలంకారములు.
5వ పద్యం :
తే. వెట్టి కుక్కల భ్రమలన్ని విడిచి నన్ను
భజన జేసెడివారికిఁ బరమసుఖము
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
అర్థాలు :
భూషణ వికాస = ఆభరణాలతో ప్రకాశించేవాడా
శ్రీధర్మపుర నివాసా = సంపత్కరమైన ధర్మపురములో నివసించేవాడు.
దురితదూర = పాపములకు దూరమైనవాడా
దుష్ట సంహార = పాపులను సంహరించేవాడా
నరసింహ = ఓ నరసింహ స్వామి!
ధరణిలో = భూమిలో
వేయేండ్లు = వేయి సంవత్సరాలు
తనువు = శరీరం
నిల్వగబోదు = జీవించ ఉండలేము
ధనము = సంపద
ఎన్నటికీ = ఎప్పటికీ
శాశ్వతంగాదు = స్థిరంకాదు
దార = భార్య
సుతాదులు = పిల్లలు
తనవెంట = తనతోపాటు
రాలేరు = చావులో రాలేరు
భృత్యులు = సేవకులు
మృతిని = చావును
తప్పింపలేరు = తప్పించలేరు
బంధజలము = చుట్టముల గుంపు
తన్ను = తనని (అతనిని)
బ్రతికించుకోలేరు = బతికించలేరు
బలపరాక్రమము = శక్తి శౌర్యము
ఏమీ పనికిరాదు = ఏమీ ఉపయోగపడలేవు
ఘనమైన = గొప్పవైన
సకలభాగ్యంబు = సమస్త ఐశ్వర్యాలు
ఎంత గల్లియున్ = ఎంత కలిగి వున్నా
గోచిమాత్రంబు = గోచిపాతంత
ఐన = అయిన
కొనుచుఁబోడు = తీసుకుపోలేడు
వెట్టి కుక్కల = పిచ్చికుక్కల
భ్రమల + అన్ని = ఆలోచనలన్నీ
కుక్కల భ్రమల + అన్ని
విడచి = వదలి
నిన్ను= నిన్ను (నరసింహస్వామిని)
భజన = భజన (కీర్తించుట)
చేసెడివారికి = చేయువారికి
పరమసుఖము = మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.
భావం :
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాములకు దూరమైనవాడా! ధర్మపురము నందు నివసించే ఓ నరసింహస్వామీ!
భూమిలో వేయేండ్లు దేహం నిలవదు. ధనమెప్పటికీ స్థిరం కాదు. ఆలుబిడ్డలు తన వెంటరాలేరు. సేవకులు చావును తప్పింపలేరు. చుట్టముల గుంపు తనను బ్రతికించు కోలేదు. శక్తి శౌర్యమేమి పనికిరాదు. గొప్పగ సకల సంపదలున్నను గోచి పాతంతైన తీసుకొని పోలేడు. పిచ్చికుక్కలలాంటి ఆలోచనలను ఆలోచించక నిన్ను కొలిచే వారికి మిక్కిలి సౌఖ్యం కలుగుతుంది.
6వ పద్యం :
తే. ద్రోహచింతన జేసెడు దుర్జనులకు
మధురమైనట్టి నీనామ మంత్రమేల?
శ్రీ భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిదదూర!
అర్ధాలు :
గార్దబము = గాడిదకు
కస్తూరి తిలకము = కస్తూరి బొట్టు
ఏల = ఎందుకు
మలయజంబు = గంధము
మర్కటమునకు = కోతికి
ఏల = ఎందుకు
శర్కర + అపూపంబు= చక్కెరతోఁ చేసిన పిండి వంటలు
శార్దూలమునకు = పులికి
ఏల = ఎందుకు
చూతఫలము = మామిడిపండు
సూకరమునకు + ఏల = పందికెందుకు
మల్లెపువ్వుల బంతి = మల్లెపూలతో చేసిన బంతి
మార్జాలమునకు + ఏల = పిల్లికెందుకు
గుడ్లగూబలకు + ఏల = గుడ్లగూబలకెందుకు
కుండలములు = చెవుల పోగులు
మహిషంబునకు = దున్నపోతునకు
నిర్మల వస్త్రము అదియేల = పరిశుభ్ర వస్త్రం ఎందుకు
ఒకసంతతికిన్+ఏల = కొంగలకెందుకు
పంజరము = చిలుకల నుంచే పంజరము
ద్రోహచింతనన్ = చెడ్డ ఆలోచనను
చేసెడు = చేసే
దుర్మార్గులకు = దుర్జనులకు
మధురము + ఐనట్టి = తియ్యనైన
నీనామమంత్రము = నీ పేరనే మంత్రము
ఏల = ఎందుకు( అక్కరలేదు అనుట)
భావం:
కాలిన ఇనుముపై పడిన నీటిచుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరఆకు మీద పడితే ముత్యంలాగా ప్రకాశించును. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. కావున ఆశ్రయించిన వారిననుసరించి నీచులు, ముద్యములు, ఉత్తములు అనే పేరు వచ్చును.
గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, పులికి చక్కెరపిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబకు చెవులు పోగులు, దున్నపోతునకు పరిశుభ్రవస్త్రము, కొంగలకు పంజరము ఎలా అవసరంలేదో అలాగే చెడ్డ ఆలోచనలుచేసే దుర్మార్గులకు తియ్యనైన నీ నామం అనే మంత్రం (దైవభక్తి) అవసరం లేదు అని భావము.
7వ పద్యం :
తల్లిదండ్రులు భార్య తనయులాపులు బావ
మఱిఁదులన్నలు మేనమామగారు.
ఘనముగా బంధువుల్ మేనమామగారు.
దానుదర్లగ వెంటఁ దగిలిరారు.
యముని దూతలు ప్రాణముపహరించుక పోలవ
మమతతోఁ బోరాడి మాన్పలేరు.
బలగముందఱు దుఃఖపడుట మాత్రమే కాని
యించుక నాయుష్యమియ్యలేరు.
తే చుట్టములమీఁది భ్రమదీసి చూరఁబెట్టి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
అర్ధాలు :
తల్లిదండ్రుల = తల్లిదండ్రులు
భార్య. = భార్య
తనయులు = కుమారులు
ఆప్తులు = స్నేహితుల
ఘనముగా = ఎక్కువగా
తర్లగ = వెడcగ (చనిపోతే)
వెంటఁదగిలిరారు = అనుసరించి రారు
యముని దూతలు = మృత్యుదేవత దూతలు
అపహరించుకుపోవ = ఎత్తుకుపోతుంటే
మామతో = ప్రేమతో
పోరాడి = పోరాటం చేసి
మాన్పలేరు = ఆపలేరు
బలగము+అందరు = చుట్టూ అందరూ
దుఃఖపడుట = దుఃఖిస్తారు.
ఇంచుక = కొంచెమైనను
ఆయుష్యము = ఆయువు
ఈయలేరు = ఇవ్వలేరు
చుట్టములు = బంధువుల
మీది = మీద
భ్రమన్ = ఆపేక్ష
తీసిచూరిన్ + చెక్క = ఇంటి యొక్క చూరులో చెక్క
సంతతము = ఎల్లప్పుడు
మిమ్ము = మిమ్ములను (నరసింహస్వామి)
నమ్ముట = నమ్ముట
సార్థకంబు = ఉపయోగము
భావం:
ఆభరణములతో మిక్కిలి ప్రకాశించువారా! దుష్టులకు సంహరించువారా! పాములకు దూరమైనవారా! ధర్మపురమునందు నివసించే ఓ నరసింహస్వామీ!
నరసింహస్వామి! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావము అందులు, అన్నాలు, మేనమామలు, ఇంకా పెద్ద చుట్టుములున్నాను. తాను వెడలగ వెంటరాదు. యమదూతలు ప్రాణము తీసుకుని పోవునపుడు వారు ప్రేమతో పోరాడి గెలవలేరు. చుట్టుములందరూ దుఃఖపడుదురే గాని ఆయువునివ్వలేదు. కావున చుట్టుముల మీద ప్రేమ చూరున చెక్కి, ఎప్పుడూ నిన్ను నమ్ముకొనుటే ఉపయోగము.
8వ పద్యం :
తే, బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనులఁ జేయలేండేంత చతురుఁడైన
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!
అర్ధాలు :
భుజబలంబునన్ = భుజముల యొక్క శక్తిలో
పెద్దపులుల = పెద్దపులులను
చంపగవచ్చు = చంపవచ్చు
పాము = సర్పము
కంఠము = గొంతును
చేట = చేతితో
పట్టవచ్చు = పట్టుకోవచ్చు
బ్రహ్మరాక్షసకట్ల = బ్రహ్మరాక్షసుల కోట్లలో ఉన్నాను
పాలంఁద్రోగలవచ్చు = తరిమి వేయవచ్చు
మనుజుల = మనుష్యుల
రోగముల్ = రోగాలను
మాన్పవచ్చు = తగ్గించవచ్చు
జిహ్వకు = నాలుకకు
ఇష్టముగాని = రుచికరం కాని
చేదు = చేదైనవి
మ్రింగగ వచ్చుఁ = మింగవచ్చు
పదను = పదునైన
ఖడ్గము = కత్తి
చేతను = చేతిలో
అదునువచ్చును = ఒత్తవచ్చును
కష్టము + అందుచు = కష్టపడుచు
ముండ్ల కంపలో = ముళ్ళకంపలో
చొరవచ్చున్ = ప్రవేశించవచ్చును
తిట్టుబోతుల = తిడుతూ ఉండేవారిని
నోళ్ళుకట్టవచ్చుఁ = నోళ్లను మూయించవచ్చును
పుడమిలో = భూమియందు
దుష్టులకు = దుర్మార్గులకు
జ్ఞానబోధ = దేవుని గురించి ఉపదేశము
తెలిపి = ఎఱిఁగించి
సజ్జనులన్ = మంచివారలకు
ఎంతచతురుఁడ + ఐ = ఎంత సమర్థుడయిన చేయలేఁడు
భావము :
భుజముల శక్తిచే పెద్దపులులు చంపవచ్చు. పాము కంఠమును చేతితో పట్ట వచ్చును. బ్రహ్మరాక్షసుల ఎందరినైనా తరిమివేయవచ్చు. మనుష్యుల రోగమును మాన్ప వచ్చును. నాలుకకు చేదైనవి మింగవచ్చును. పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును. కష్టముతో ముండ్లకంపలోనికి ప్రవేశించవచ్చును. తిట్టుబోతుల నోళ్ళను మూయించవచ్చును. బోధియందు దుర్మార్గులకు దేవుని గూర్చిన ఉపదేశం తెలిపి, వారిని ఎంతటి సమర్ధుడైనను మంచివానిగా చేయలేడు.
9వ పద్యం :
చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలెవల్కు ఁగఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁ డొక జాడను దా వడగండ్ల రాల్ఫినన్’
శిలలగునోటు వేగిరమె శీతల నీరముగాక భాస్కరా!
అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా
సజ్జనుడు = మంచి మనిషి
పలుమాఱులు = అనేకసార్లు
ప్రియభాషులు+ఏ = మంచి మాటలే
పల్కు = పలికిన
కంఠవాక్యముల్ = చెడ్డమాటలు
పలుకడు = పలుకడు
ఒకొనొక్కప్పుడు = ఒక్కొక్కసారి
పల్కినన్ = మాట్లాడినా
కీడునుకాదు = కీడుకాదు
నిజం + ఏ = నిజమే
ఎట్లనిన = ఎలాగంటే
చలువకున్ = చల్లదనమునకు
వచ్చి = వచ్చి
మేఘుఁ డు= మబ్బు
తాన్ = తాన్
వడగండ్లన్ = వడగళ్ళను
రాల్చినన్ = కురిపించినను
వేగిరమే = వెంటనే
శీతలము = చల్లని
నీరము కాక = నీళ్ళుకాక
శిలలగుటు = రాళ్ళగునా (లేవు)
భావము :
మేఘుడు నీటి బిందువులనే వర్షించును. ఒకానొకప్పుడు చలువ కొరమే వడగండ్లను కురిపించినను, అవి వెంటనే చల్లని నీళ్ళగునుగాని రాళ్ళుగా ఉండవు. అదే విధంగా మంచివాడు మంచి మాటలనే పల్కును. ఒకానొక సమయమందున కఠోరవచనమును పలికినను మేలుగానే ఉంటుంది కీడుగా ఉండవు.
10వ పద్యం :
చ. పలుచని నీచమానవుఁదు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం.
బలుకుచు నందుఁగాని మతిభాసురుఁజైఁన గుణ ప్రపూర్ణుఁద
ప్పులకులుఁపల్కఁబోవడు నిబద్ధిగ, నెట్లన వెల్తికుంద తాం
లంకుచు నందుఁగాని మట్టిదొల్కునై నిందుఘటంబు భాస్కరా!
అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా!
పలుచని = బలహీనుడైన
హీనమానవుడు = నీచ మానవుడు
పాటి = న్యాయం ఆలోచించక
నిష్టర + ఉక్తులను = కఠినమైన మాటలను
పలుకుచు ఉండు+కని = పలుకుతూనే ఉంటాడు
మతి భాసురుడు = బుది & ప్రకాశించేవాడు.
ఐన = అయిన
గుణ ప్రపూర్ణుడు = మంచి గుణములతో నిండినవాడు
ఆ+పలుకులను = అటువంటి మాటలను
నిబద్ధిగ = నిజముగ
పల్కన్ + పోవఁడు = మాట్లాడబోడు
ఎట్లన = ఎలాగంటే
వైల్తైకుండ = నీరు తక్కువగా ఉన్నా కుండ
తాన్ = తాసు
తొణకుచుండునుగాని = తొణకు చుండునుగాని
మఱి = మది
నిండుఘటంబు = నీటిలో నిండుగా గల కుండ
తొల్కున్ = తొణకునా? (తొణకడు)
భావము :
వెలితి కుండ తొణకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే గుణములేని నీచుఁడు న్యాయమునెంచక కఠినపు పలుకులను మాట్లాడును. సద్గుణములలో ప్రకాశించే గుణవంతుడు. అటువంటి కఠినపు మాటలను మాట్లాడడు.
11వ పద్యం :
చ. బలయుతుఁడైన వేళ నిజబంధుఁడు తోడ్పడుఁగాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁదు కానఁగాల్చు తఱి సఖ్యముఁ జూవును వాయుదేవుఁదా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!
అర్ధాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా!
బలయుతుఁడు = బలము కలవాడు
ఒళవేళన్ = ఒకవేళ
నిజబంధుడు = తన చుట్టము
తోడ్పడుఁ + కాని = తోడ్పడడుగాని
అతడే = అతడే (ఆ చుట్టుమే)
బలము తొలంగనేని = బలము పోయినచో
తనపాలిట = తనకు
శత్రువు = పగవాడు అగును
అది = అది
ఏట్లు = ఏ విధంగా అంటే
జ్వాలనుడు = అగ్నిదేవుడు
పూర్ణుఁడై = నిండినవాడై (వ్యాపించి)
కానును = అడవిని
కాల్చుతంతిన్ = కాల్చే సమయంలో
వాయుదేవుడు = గాలి
సఖ్యము = స్నేహం
చూపును = చూపును
ఆ బలియుడు = ఆ బలవంతుడైన అగ్నిదేవుడు
సూక్ష్మదీపము = చిన్న దీపము
అగుపట్టునన్ = అయిన సమయంలో
గాలి = గాలి (వాయుదేవుడు)
ఆర్పదు + ఏ = ఆర్పదా! (ఆర్పును)
భావము :
అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును.
12వ పద్యం :
చ. ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా
క్పరుషతం జూఫినన్ ఫలముగల్గుట తథ్యముగాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వరము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున సశేషజనంబు లెఱుంగ భాస్కరా!
అర్థాలు :
భాస్కరా = ఓ సూర్యదేవా
ఉరు = గొప్ప
కరుణాయుతుడు = దయతో కూడినవాడు
సమయోచితము = కాలమునకు తగిన ఆలోచన
ఆత్మన్ = మనసులో
తలంచి = ఆలోచించి
ఉగ్ర+పాక్+పరుషత = భయంకరమైన మాటల కాఠిన్యము
చూపినన్ = చూపిన
ఫలము = లాభము
కల్గుట = కలుగుట
తధ్యము +కాదె = నిజమే కదా
ఎట్లనిన్ = ఎలాగంటే
అంబుదంబు = మేఘము
ఉరిమినయంతనే = గర్జించిన వెంటనే
లోక = జనులను
రక్షణ = రక్షించుటయందు
స్థిరతర = మిక్కిలి స్థిరమై
పౌరుషంబునన్ = శౌర్యమచేత
అశేషజనంబులు = జనులందరూ
ఎరుంగన్ = తెలియునట్లుగా
వర్షము = వర్షహు (వాననీరు)
కురియక + ఉండునె = కురియకుండా ఉంటుందా? (ఉండదు)
భావము :
మేఘుడు ప్రాణానికి భయం కలిగేటట్లు ఉరిమినను వెంటనే జనులను రక్షించు పట్టుదలతో అందరికీ ఆనందం కల్గునట్లు వర్షించును. అటులనే గొప్పదయకలవాడు. సమయానుకూలముగా కఠినవాక్యము మాట్లాడినను తరువాత తప్పక మేలు కలిగిస్తాడు.
శతక సుధ Summary in Telugu
కవుల కాలాదులు
ఏనుగు లక్ష్మణ కవి : భర్తృహరి సుభాషిత త్రిశలు అనే పేరుతో సంస్కృతంలో మూడు శతకాలు రచించాడు. అవి నీతి, వైరాగ్య శృంగార శతకాలు. ఈ సుభాషిత త్రిశతిని తెలుగులో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు తెలుగులోకి అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి రచన ప్రాచుర్యం పొందింది.
కాలం : 18వ శతాబ్ధం
ఇతర రచనలు : రామేశ్వర మహత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగామహాత్మ్యం, రామ విలాసం రచించాడు.
ధర్మపురి శేషప్ప : తెలంగాణాలోని గోదావరి తీర్థక్షేత్రం ధర్మపురి.
కాలం : క్రీ.శ. 1800 ప్రాంతంలో జీవించాడు.
విశేషం : నరసింహస్వామి భక్తుడు. నరసింహ శతకం రచించాడు.
ఇతర రచనలు : న్నకేసరి శతకం
మారద వెంకయ్య : తెలుగు శతకాలలో ప్రచారం పొందినవాటిలో భాస్కర శతకం ఒకటి.
విశేషం : ఉత్పలమాల, చంపకమాల వృత్తాలతో సాగిన ఈ శతకం ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి చెందింది.
కాలం : క్రీ.శ. 1560-1660 మధ్య వాడని అభిప్రాయం.
ప్రాంతం : శబ్ధ ప్రయోగాలను బట్టి ఈ కవి గోదావరికి ఉత్తర దిక్కు వాడని ఊహించారు.
పాఠ్యభాగ ప్రాధాన్యం
శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ శతకానికి మకుటము ఉంటుంది. మకుటం అనగా కిరీటం అని సామాన్యార్థం. కానీ శతకాలలో ప్రతి పద్యం చివరన పునరుక్తమయ్యే పదాన్నిగాని, పాదాన్ని గాని మకుటం అంటారు. ఆంధ్ర సాహిత్యంలో శతక ప్రక్రియకు విశిష్ట స్థానముంది.
శతకములు పురాణములు వలె కథా ప్రాధాన్యం కలవికావు. అయినా తెలుగునాట పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పండితులు, పామరులు ఇలా అందరిలోనూ బహుళ ప్రచారం పొందింది. శతకాలలో కవి హృదయం స్వేచ్ఛగా ఆవిష్కరింపబడుతుంది. మానవ మనస్తత్వాన్ని తెలపాలన్నా, సంఘంలోని దురాచారాలను విమర్శించాలన్నా, నీతి బోధించాలన్నా, భక్తికి, ముక్తికి, రక్తికి శతకాలు అద్భుతంగా కవులకు ఉపకరించాయి.
పాఠ్యభాగ సారాంశం
విద్యార్ధి దశ ఎంతో కీలకమైన దశ. ఈ దశలో ఉత్తములతో స్నేహం చేస్తే ఎలా అభివృద్ధి చెందుతామో, దుష్టులతో స్నేహం వలన ఎలా చెడిపోతామో గ్రహించాలి.
మానవుడు ఏ దశలోనైనా క్షమాగుణం కలిగి ఓర్పు కలిగి వుండాలి. మంచి మిత్రుడుంటే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.
విద్య యొక్క ప్రాధాన్యాన్ని విద్యార్ధి గమనిస్తే విద్యాధనాన్ని మరింతగా సంపాదించుకొంటాడు,. అది ఎల్లవేళలా ఉపయోగపడేది, దొంగిలింపబడనిది. దానగుణం, సత్యంపలకడం, ధైర్యంగా ఉండటం వంటి సద్గుణాలను అలవరచుకోవాలి.
మానవుడు చిరకాలం జీవించడు. ధనం, వేషం, ఏదీ శాశ్వతం కాదు. మృత్యువు ను ఎవరూ ఆపలేరు. కావున అత్యాశ ఉండకూడదు. గాడిద కస్తూరిబొట్లులాగా, కోతికి గంధంలాగా, చెడ్డ ఆలోచనలతో ఉండే దుర్మార్గులకు, దివ్యమైన భగవంతుని నామం రుచించదు. తల్లిదండ్రులు, భార్యా, సంతానం, బంధువులు ఎవరూ చనిపోయినపుడు తోడుగా చనిపోరు. దుఃఖిస్తారేగాని ఆయువునివ్వలేరు. కావున భగవంతుని నమ్ముటే మానవుడికి శ్రేయస్సు అని గ్రహించాలి.
మంచివారు కఠినంగా మాట్లాడిన అంతా మన మంచికోసమే అని గ్రహించవలెను. నిండుకుండలాగా, తొణకకుండా స్థిరంగా ఉంటూ మానవుడు మంచి లక్షణాలు అలవరచుకోవాలి. ఎంతటి శక్తివంతుడైనను మంచి స్నేహము ఉంటే అది వ్యక్తికి అదనపు బలం అవుతుంది. ఒకరి మేలు కోసం కఠినంగా మాట్లాడినప్పటికీ వారికి దయతో మనం సమయానుకూలంగా సహాయం చేయవలెను.