Here students can locate TS Inter 1st Year Physics Notes 14th Lesson అణుచలన సిద్ధాంతం to prepare for their exam.
TS Inter 1st Year Physics Notes 14th Lesson అణుచలన సిద్ధాంతం
→ అవగాడ్రో నియమము : సమాన ఉష్ణోగ్రతా పీడనాల వద్ద సమాన ఘన పరిమాణం ఉన్న అన్ని వాయువులలో అణువుల సంఖ్య సమానము,
→ స్వేచ్ఛా పథమధ్యమము : వాయువులలో అభిఘాతానికి లోనుగాకుండా అణువులు ప్రయాణించగలిగే సగటు దూరాన్ని స్వేచ్ఛా పధమధ్యమము అంటారు.
→ పరమాణువులు కొద్ది అంగ్జామ్ల దూరంలో ఉన్నపుడు ఆకర్షించుకుంటాయి. ఇంకా దగ్గరకు వస్తే వికర్షించుకుంటాయి.
→ గతిక సమతాస్థితిలో అణువులు అభిఘాతం చెందుతూ, అభిఘాత సమయంలో వాటి వడిని మార్చుకుంటాయి.
→ వాయువులలో P, V మరియు T ల మధ్య సంబంధము PV – KT = μRT
→ వాయు అణువుల సంఖ్య లెక్కలోనికి తీసుకుంటే
\(\frac{\mathrm{P}_1 \mathrm{~V}_1}{\mathrm{~N}_1 \mathrm{~T}_1}=\frac{\mathrm{P}_2 \mathrm{~V}_2}{\mathrm{~N}_2 \mathrm{~T}_2}\) = KB
ఇందులో K. బోల్ట్స్ మన్ స్థిరాంకము. KB = R/NA – 1.38 × 1023 JK-1
→ అణుచలన సిద్ధాంతంలోని ఊహాగానాలు
- అణువులు నిరంతరం క్రమరహితంగా చలనంలో ఉంటాయి.
- అణువుల మధ్య అన్యోన్య చర్యను ఉపేక్షించవచ్చు.
- అణువులు సరళ రేఖలలో స్వేచ్ఛగా చలిస్తాయి.
- అణువులు నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల మరియు పాత్ర గోడలతో ఢీకొనడం వల్ల వాటి దిశలను వేగాలను మార్చుకుంటాయి.
- వాయు అణువుల మధ్య అభిఘాతాలు స్థితిస్థాపక అభిఘాతాలు.
→ ఆదర్శ వాయు పీడనము : అణుచలన సిద్ధాంత ప్రకారము ఆదర్శవాయు పీడనము, P = \(\frac{1}{3}\)nmv2
→ వాయువులలో ఒక్కొక్క స్వతంత్ర చలన దిశకు గతిజశక్తి KE = \(\frac{1}{2}\)KBT
స్వతంత్ర చలన దిశలు లేదా స్వతంత్ర చలన పరిమితులు :
→ ఒక సరళ రేఖపై చలించే అణువుకు ఒక స్వతంత్ర పరిమితి ఉంటుంది.
→ ఒక తలంలో చలించే అణువుకు రెండు స్వతంత్ర పరిమితులు ఉంటాయి.
→ అంతరాళంలో చలించే అణువుకు మూడు స్వతంత్ర పరిమితులు ఉంటాయి.
→ ఏకపరమాణుక అణువు (హీలియం, ఆర్గాన్ వంటివి) కు స్వతంత్ర పరిమితులు మూడు.
→ ద్విపరమాణుక వాయువులకు మూడు స్థానాంతరణ స్వతంత్ర పరిమితులు, రెండు భ్రమణ పరిమితులు మొత్తం ఐదు స్వతంత్ర పరిమితులు ఉంటాయి.
→ బహు పరమాణుక అణువులకు మూడు స్థానాంతరణ, మూడు భ్రమణ స్వతంత్ర పరిమితులు మరియు కనీసం ఒక్కటి లేదా అంతకన్న ఎక్కువ కంపన పరిమితులు ఉంటాయి.
→ విశిష్టోష్టముల నిష్పత్తి: వాయువులలో స్థిర పీడన విశిష్టోష్టము Cp, మరియు స్థిర ఘనపరిమాణ విశిష్టోష్ణము Cvల నిష్పత్తిని విశిష్టోష్టముల నిష్పత్తి ‘γ’ అంటారు. γ = Cp/Cv
→ ఏకపరమాణుక వాయువులకు γ = 5/3 = 1.67
ద్విపరమాణుక వాయువులకు γ = 7/5 = 1.4
త్రిపరమాణుక లేదా బహుళ పరమాణుక వాయువులకు r = 1.33.
→ పీడనం (P), ఘనపరిమాణం (V), పరమ ఉష్ణోగ్రత (T) లను కలిపే ఆదర్శ వాయు సమీకరణం PV = μRT = KBNT
ఇచ్చట మోల్ల సంఖ్య, N అణువుల సంఖ్య, R మరియు KB లు సార్వత్రిక స్థిరాంకాలు.
R = 8.314 J mol-1K-1; KB = \(\frac{\mathrm{R}}{\mathrm{N}_{\mathrm{A}}}\) = 1.38 × 10-23JK-1
→ ఆదర్శ వాయువుకు అణుచలన సిద్ధాంతము ప్రకారము,
P = \(\frac{1}{3}\)nmv2
ఇచ్చట n అణువుల సంఖ్యా సాంద్రత, m అణువు ద్రవ్యరాశి, v2 సగటు వడి వర్గం
→ ఉష్ణోగ్రతకు గతిక వివరణ, \(\frac{1}{3}\)mv = \(\frac{3}{2}\)KBT
vrms = (v2)\(\frac{1}{2}\) = \(\sqrt{\frac{3 \mathrm{~K}_{\mathrm{B}} \mathrm{T}}{\mathrm{m}}}\)
→ స్థానాంతరణ గతిజశక్తి, E = \(\frac{3}{2}\)KBNT
→ స్వేచ్ఛా పథమధ్యమం, l = \(\frac{1}{\sqrt{2} \mathrm{n} \pi \mathrm{d}^2}\) ఇచ్చట n సంఖ్యా సాంద్రత, d అణువు వ్యాసం
→ “T” ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువులోని అణువుల సగటు వర్గ మధ్యమ మూల వడి (rms), Crms = \(\sqrt{\frac{3 R T}{M}}\) ఇచ్చట ‘M’ అణువుల ద్రవ్యరాశి.
→ ఒక వాయువులోని ‘n’ అణువులు వరుసగా C1, C2, C3…………… Cn వడులు కలిగి ఉన్న, ఆ వాయు అణువుల (rms) వడి,
Crms = \(\sqrt{\frac{c_1^2+c_2^2+c_3^2+\ldots \ldots \ldots \ldots+c_n^2}{n}}\)
→ ఒక వాయువుకు ‘f’ స్వతంత్ర పరిమితులు ఉంటే, Cp, Cv, ల నిష్పత్తి, γ = \(\) = 1 + \(\)
→ ఒక వాయువు యొక్క అణువుల rms వడికి, వాయువు పరమ ఉష్ణోగ్రతకు సంబంధం, c ∝ √T