TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 13th Lesson భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 13th Lesson భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయ పునరుజ్జీవనానికి గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో 19వ శతాబ్దంలో భారతీయ పునరుజ్జీవనం ఒక ముఖ్యఘట్టం. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ సంస్కృతి పై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండేది. భారతీయులు పాశ్చాత్యులు వేషభాషలు, అలవాట్లతోపాటు సాహిత్యం, ఆలోచనలను అనుకరించడం ఆరంభించారు. ఇదే సమయంలో విద్యాధికులైన భారతీయులు కొత్త ఆలోచనలచేత ప్రభావితులయ్యారు. ఈ ఆలోచనలే భారతీయుల సాంఘిక, మత, సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేశాయి. ఈ కొత్త ఆలోచనా విధానం, ప్రేరణ, భావోద్రేకం ఫలితమే భారతీయ పునరుజ్జీవనం. 16వ శతాబ్దం నాటి ఐరోపా పునరుజ్జీవనం లాగానే భారతీయ పునరుజ్జీవనం కూడా భారతీయుల జీవనంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసింది.

భారతీయ పునరుజ్జీవనానికి కారణాలు: కింద పేర్కొన్న అనేక కారకాల మూలంగా భారతీయ పునరుజ్జీవనం
1) రాజకీయ ఐక్యత : బ్రిటీష్ పాలనలో భారతదేశం రాజకీయంగా, పాలనాపరంగా ఏకీకరణ సాధించింది. దేశంలో శాంతిభద్రతలు నెలకొనడం వల్ల భారతీయులకు తమ గురించి ఆలోచించడానికి కావలసిన సమయం దొరికింది. అంతేకాకుండా బ్రిటీష్ పాలనలో తమ పేదరికానికి, దైన్యస్థితికి కారణాలను నిశితంగా పరిశీలించడం ఆరంభించారు.

2) విదేశాలతో సంబంధాలు: భారతదేశానికి ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి యూరప్, ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ దేశాలు పారిశ్రామిక, సాంఘిక, రాజకీయ రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఇది భారతీయులను ఎంతగానో ప్రభావితం చేసింది. తమ మాతృదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారిలో కలిగింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

3) క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు : 1813 నుంచి క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ప్రవేశించడం ప్రారంభమైంది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు లాంటివి స్థాపించి అన్ని రకాలైన మార్గాల ద్వారా భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉండేవి. ఇది భారతీయుల్లో అశాంతిని కలిగించింది. ఫలితంగా భారతదేశంలో అనేక సాంఘిక, మత సంస్కరణోద్యమాలు వచ్చాయి.

4) విదేశీ పండితుల రచనలు : మాక్స్ ముల్లర్, విలియం జోన్స్ వంటి విదేశీ పండితులు అనేక భారతీయ సాహిత్య, మత గ్రంథాలను అనువదించారు. దీని మూలంగా భారతీయులు తమ దేశ సంస్కృతి, వారసత్వం, గత కీర్తిని తెలుసుకోవడానికి వీలైంది. విదేశీయులు మన దేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసించడంతో, భారతీయులకు కూడా గత వైభవం పట్ల ఆత్మవిశ్వాసం కలిగి దాన్ని పునరుద్ధరించడానికి కృషి చేశారు. ఇవన్నీ భారతీయులకు నైతిక బలాన్ని ఇచ్చాయి. పాశ్చాత్య సంస్కృతిపై భారతీయ సంస్కృతి ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భారతీయులు భావించారు.

5) భారతీయ పత్రికలు : ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో భారతదేశ పత్రికలు కూడా కృషిచేశాయి. వివిధ దేశీయ భాషల్లో అనేకమైన వార్తా పత్రికలు, గ్రంథాలు ముద్రితమయ్యాయి. పత్రికలు బ్రిటీష్ వారిని విమర్శిస్తూ భారతీయులకు అనుకూలంగా రాసాయి. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఈ పత్రికలు తోడ్పడ్డాయి. ఈ జాతి గౌరవాన్ని, కీర్తిని పునరుద్ధరించుకోవడానికి తోడ్పడ్డాయి.

6) పాశ్చాత్య విద్య : ప్రభుత్వం ఆంగ్లాన్ని బోధనాభాషగా ప్రవేశపెట్టింది. భారతీయులకు పాశ్చాత్య భావాలైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైన సిద్ధాంతాలతో పరిచయమైంది. విద్యాధికులైన భారతీయులు విదేశాలకు వెళ్ళి అక్కడ అమలవుతున్న సిద్ధాంతాల పనితీరును గమనించారు. ఈ సిద్ధాంతాలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని కోరుకున్నారు.

7) పాశ్చాత్య సంస్కృతి : బ్రిటిష్ పాలనలో భారతీయులకు పాశ్చాత్య సంస్కృతితో పరిచయమైంది. వారి వస్త్రధారణ, అలవాట్లు, సమాజం లాంటి వాటినెన్నింటినో భారతీయులు గమనించారు. విద్యావంతులైన భారతీయులు కొందరు పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితమయ్యారు. మరొక వర్గం దీన్ని వ్యతిరేకించి మన సంస్కృతిని, కీర్తిని పునర్విమర్శ చేశారు. ఈ విధంగా పాశ్చాత్య సంస్కృతి స్థానంలో భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి కృషి చేశారు. 2. సాంఘిక, మత సంస్కరణోద్యమానికి రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషిని గురించి రాయండి. 19వ శతాబ్దంనాటి సంఘ సంస్కరణోద్యమంలో రాజా రామ్మోహన్రాయ్ అగ్రగణ్యుడు. ఇతడు పాశ్చాత్య భావాల ద్వారా ప్రభావితుడయ్యాడు. ఇతడిని భారతదేశంలో “మొదటి ఆధునిక మానవుడు” అఁ.. పశ్చిమ బెంగాల్లోని భరద్వాన్ జిల్లాలో రాధానగర్ గ్రామంలో జన్మించాడు. 16వ ఏట నుం తం, అరబిక్ భాషల్లో పాండిత్యం సాధించాడు. ఇతనిపై సూఫీమతం, ఖురాన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. హిబ్రూ, గ్రీకు, ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవడం వల్ల క్రైస్తవ మత సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవడానికి వీలైంది. రాయ్ ఏకేశ్వరోపాసనను సమర్థించి విగ్రహారాధనను వ్యతిరేకించాడు. రాయ్ 1803లో పర్షియన్ భాషలో “ఏకదేవతా రాధకులకు ఒక కానుక” అనే గ్రంథం (A Gift to Monothiests) ప్రచురించాడు.

ఇతడు 1772లో రాజా రామ్మోహన్రాయ్ 1815లో కలకత్తాలో “ఆత్మీయ సభ” అనే సంస్థను స్థాపించాడు. ఏకేశ్వరోపాసనను సమర్థించడం, హిందూమతంలోని చెడుసంప్రదాయాలను, ఆచారాలను వ్యతిరేకించడం దీని లక్ష్యాలు. మానవతావాదిగా, సంస్కర్తగా రాయ్ మూఢవిశ్వాసాల బురదనుంచి, నిరాశ నుంచి హిందూ సమాజాన్ని విముక్తి చేసి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు.

ఈ లక్ష్యసాధనకోసమే రాయ్ ‘బ్రహ్మసమాజాన్ని’ స్థాపించాడు. కులం, మతం, వంటి వివక్ష లేకుండా అందరికీ ఇందులో ప్రవేశం ఉంది. ఈ సంస్థ విద్యావ్యాప్తికి, ఇతర సంస్కరణలకు ఒక వేదికగా మారింది.

రాజా రామ్మోహన్రాయ్ గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక భారతదేశంలో రాయ్ మొదటి స్త్రీవాది. ఇతడు మహిళలపై నిర్బంధాలను వ్యతిరేకించాడు. సతీసహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి రాయ్ గొప్ప పోరాటాన్ని నిర్వహించాడు. చివరకు, గవర్నర్-జనరల్ విలియం బెంటింక్ సహాయంతో సతీసహగమనాన్ని నిర్మూలించడంలో విజయం సాధించాడు. సతీ సహగమనాన్ని పాటించేవారు శిక్షార్హులని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1829లో చట్టం చేసింది. స్త్రీలకు వారసత్వ హక్కుల కృషి చేశాడు. దేశంలోని అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, సాంఘిక, సాంస్కృతిక పతనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ విధంగా రాయ్ను సార్వత్రికవాదానికి ప్రవక్తగా, స్వేచ్ఛాపిపాసిగా, రాజకీయ ఉద్యమకారుడిగా పేర్కొనవచ్చు. రాయ్ పత్రికా స్వేచ్ఛకోసం, రైతుల హక్కుల కోసం పోరాడాడు.

రామ్మోహన్రాయ్ ప్రారంభించిన కృషిని అతని మరణానంతరం దేవేంద్రనాథ్ టాగూర్ (రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి), కేశవ చంద్రసేన్ కొనసాగించారు. కేశవ చంద్రసేన్ శ్రద్ధ, వాగ్ధాటి, మిషనరీ ఉత్సాహం మూలంగా బ్రహ్మ సమాజం బెంగాల్ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది.

ప్రశ్న 3.
సాంఘిక సంస్కరణోద్యమానికి కందుకూరి వీరేశలింగం చేసిన కృషిని వివరించండి.
జవాబు.
ఆంధ్రదేశంలోని బ్రహ్మసమాజ నాయకులలో వీరేశలింగం అగ్రగణ్యుడు. ఇతడు స్త్రీవిద్య, వితంతు పునర్వివాహాల కోసం తన జీవితమంతా కృషి చేశాడు. ఇతడు 1848లో రాజమండ్రిలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ వరకు విద్యాభ్యాసం చేసి తరువాత తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. రాజమండ్రి, ధవళేశ్వరంలో ఉపాధ్యాయుడిగా తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. వీరేశలింగం విద్యార్థి దశ నుంచి కూడా హేతువాది. ఇతడు ఉపాధ్యాయ ఉద్యోగంలో నిండు పున్నమి రోజున చేరాడు. ఆ రోజును శుభప్రదమైందిగా భావించేవారు కాదు. వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం స్త్రీల అభ్యున్నతి కోసం “వివేకవర్ధిని” పత్రికను స్థాపించడంతో ప్రారంభమైంది. ఈ పత్రికను సంఘ సంస్కరణను ప్రచారం చేయడానికి, సనాతనులను ఎదుర్కోవడానికి స్థాపించాడు. వివేకవర్ధిని పత్రికకు పూర్వమే కొన్ని పత్రికలున్నప్పటికీ, ఆంధ్రలో పునరుజ్జీవనానికి కృషి చేసిన మొదటి పత్రిక ఇదే. వీరేశలింగం 1874లో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించాడు. 1878లో రాజమండ్రిలో “సంఘసంస్కరణ సంఘం” స్థాపించాడు. ఇతడు డిసెంబర్ 11, 1881న రాజమండ్రిలో మొదటి వితంతు వివాహాన్ని జరిపించాడు. నాలుగు రోజుల తరువాత ఇక్కడే రెండవ వితంతు పునర్వివాహం జరిపించాడు. సనాతనులు వీరేశలింగం కార్యక్రమాలను వ్యతిరేకించి ఇందులో పాల్గొన్న వారందరినీ సాంఘిక బహిష్కరణ చేశారు. వీరేశలింగం రాజమండ్రిలో 1904లో వితంతు శరణాలయాన్ని, 1908లో ‘హితకారిణి’ సమాజాన్ని స్థాపించాడు. ఈ రెండు సంస్థల నిర్వహణ కోసం తన మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. ఇతడి సంఘసంస్కరణోద్యమ కార్యక్రమాలకు వీరేశలింగం భార్య రాజ్యలక్ష్మి సహాయ సహాకారాలు అందించింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

వీరేశలింగం సంఘసంస్కరణకు తన సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించాడు. తెలుగు సాహిత్యంలో అనేక రకమైన ప్రక్రియల్లో వీరేశలింగం మొదటివాడు. తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్ర’ను రాశాడు. ఆంధ్రకవుల చరిత్రను సంకలనం చేశాడు. తన ఆత్మకథను ‘స్వీయ చరిత్రం’ అనే పేరుతో రాశాడు. సంఘంలోని మూఢవిశ్వాసాలను విమర్శిస్తూ అనేక ప్రహసనాలు (skits) రచించాడు. ఇతడికి “గద్య తిక్కన” అనే బిరుదు ఉంది. తన జీవితాన్ని సమాజం కోసం ధారపోసిన వీరేశలింగం మే 27, 1919న తుదిశ్వాస విడిచారు. “తన శరీరాన్ని, తన కాలాన్ని, తన ధనాన్ని, తన మేధస్సును సమాజం కోసం త్యాగం చేసిన ఘనుడు వీరేశలింగం” అని చిలకమర్తి లక్ష్మీనర్సింహం పంతులు శ్లాషించాడు.

ప్రశ్న 4.
దళితుల కోసం డా॥ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని వివరించండి.
జవాబు.
డా॥ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలోని దళితుల నాయకుడు. దళితులకు మెస్సయ్య లాంటివాడు. ఇతడి పూర్తి పేరు భీమ్రావు రాంజీ అంబేద్కర్. ఇతడు ఏప్రిల్ 14, 1891న మహారాష్ట్రలోని మహావ్ గ్రామంలో మహర్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రాంజీ భారతసైన్యంలో సుబేదార్గా మహావ్ కంటోన్మెంట్లో పనిచేసేవాడు. విద్యార్థిదశలో కులవివక్షను స్వయంగా అనుభవించాడు. మెట్రిక్యులేషన్ పూర్తికాగానే బరోడ మహారాజు ఉపకార వేతనంతో ఉన్నత విద్యనభ్యసించాడు. ఇతడు అమెరికా వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి ఎం.ఎ. పూర్తి చేశాడు. తర్వాత పిహెచ్.డి (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టాను పొందాడు.

విదేశాల నుంచి తిరిగివచ్చిన అంబేద్కర్ న్యాయవాదిగా బొంబాయిలో స్థిరపడ్డాడు. ఇతడు సంఘసంస్కర్తగా, దళితులనాయకుడిగా ఆవిర్భవించాడు. దళితులు సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించేటట్లు కృషి చేయడం ఇతని లక్ష్యం. ఇతడు దళితులకోసం అనేక గ్రంథాలను రాశాడు, పత్రికలను నడిపాడు. అనేక సంస్థలను స్థాపించాడు. 1920లో “మూక్ నాయక్” అనే పత్రికను ప్రారంభించాడు. దళితుల విద్య, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం 1924లో “భహిష్కృత్ హితకారిణి సభ” అనే సంస్థను స్థాపించాడు. మరాఠీలో “బహిష్కృత్ భారత్” అనే మరొక పత్రికను ప్రారంభించాడు.

డా॥ బి.ఆర్. అంబేద్కర్ 1927లో మహద్ సత్యగ్రహం చేసి మహర్ కు చెరువునీటిని వాడుకునే హక్కును సాధించాడు. 1930లో కాలరామ్ సత్యాగ్రహం చేసి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. అస్పృస్యులకు సమాన హక్కులున్నాయని చాటాడు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు దళితుల ప్రతినిధిగా హజరై దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని డిమాండ్ చేశాడు. బ్రాహ్మణవాద, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ 1936లో “ఇండిపెండెంట్ లేబర్ పార్టీ” (ILP) ని ప్రారంభించాడు. 1942లో దళితులకోసం ‘షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్’ అనే మరో పార్టీని స్థాపించాడు. ఇతడు దళితుల్లో విద్యావ్యాప్తికై ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని’ ఏర్పాటుచేసి 1945 నుంచి అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, హాస్టళ్ళు నెలకొల్పి దళితుల్లో విద్యావ్యాప్తికి తద్వారా వారిలో చైతన్యానికి కారణమయ్యాడు. 1950లలో అంబేద్కర్ హిందూమతాన్ని విడిచి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఆధునిక యుగంలో భారత సమాజాన్ని పునర్నిర్మించాలంటే బౌద్ధధర్మం ఒక్కటే మార్గమని తలచాడు. ‘నూతన’ బౌద్ధమతంలో ప్రధానంగా కులనిర్మూలనను అంబేద్కర్ ప్రతిపాదించాడు. దళితులను బౌద్ధమతం స్వీకరించాలని ప్రోత్సహించాడు.

అంబేద్కర్ గొప్ప జాతీయవాది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. రాజ్యాంగ నిర్మాణపరిషత్తులో, రాజ్యాంగరచనా సంఘానికి అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగరచన చేశారు. దళితులకోసం అస్పృశ్యత నిషేధం, దేవదాసీ నిర్మూలన వంటి నిబంధనలు.. రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.

ప్రశ్న 5.
అలీఘర్ ఉద్యమం గురించి రాయండి.
జవాబు.
సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదీయులలో సంఘ సంస్కరణ బీజాలు నాటాడు. ఇతడు ఆధునిక శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా ఇస్లాం మతాన్ని వ్యాఖ్యానించాలని, సంస్కరించాలని అన్నాడు. కాలానుగుణంగా మతాన్ని సంస్కరించుకో నట్లయితే మతం పురోగమించదన్నాడు. కాబట్టి మహమ్మదీయులు గుడ్డిగా సంప్రదాయాలను ఆచరించకుండా ఆలోచనా స్వేచ్ఛ, విమర్శనాత్మకవైఖరిని అలవర్చుకోవాలని కోరాడు. కేవలం పాశ్చాత్య శాస్త్రీయ విజ్ఞానం, సంస్కృతిని అలవర్చుకోవడం ద్వారానే మహమ్మదీయుల మత, సాంఘిక జీవనంలో మార్పులు సాధ్యమని అహ్మదాఖాన్ పేర్కొన్నాడు. ఒక అధికారిగా ఇతడు అనేక పట్టణాలలో పాఠశాలలను స్థాపించాడు. పాశ్చాత్యగ్రంథాలను ఉర్దూలోకి అనువదింప చేశాడు. 1875లో అహ్మద్ ఖాన్ అలీఘర్లో మహ్మదన్-ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. 1920 నాటికి ఇది అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఎందరో మహమ్మదీయ విద్యార్థులు అలీఘర్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి ఆధునిక ఆలోచనా విధానానికి మూలమయ్యారు. అహ్మదాన్ తన సంస్కరణోద్యమానికి అలీఘర్ను కేంద్రంగా చేసుకోవడంవల్ల ఈ ఉద్యమానికి అలీఘర్ ఉద్యమం అనే పేరొచ్చింది.

అహ్మదాన్ సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా మహమ్మదీయులలో పర్దాపద్ధతిని, బహుభార్యత్వాన్ని, విడాకులను ఖండించి స్త్రీలు కూడా పాశ్చాత్య విద్యను అభ్యసించాలన్నాడు. అహ్మద్ ఖాన్ కృషి ఫలితంగా మహమ్మదీయులలో ఆధునిక ఆలోచనా విధానం ఆవిర్భవించింది. అహ్మద్ ఖాన్ మొదట హిందూ ముస్లిం ఐక్యతను బోధించినప్పటికీ తరువాత కాలంలో అధిక సంఖ్యలో హిందువులున్న భారతదేశంలో మహమ్మదీయులు తమ ప్రయోజనాలు కాపాడుకోవాలని ప్రకటించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రార్థనా సమాజం కృషిని పేర్కొనండి.
జవాబు.
మహారాష్ట్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. 1867లో ప్రార్థనా సమాజాన్ని డా॥ ఆత్మారాం పాండురంగ్, కేశవ చంద్రసేన్ ప్రోద్బలంతో స్థాపించాడు. దీని ప్రధాన కేంద్ర కార్యాలయం బొంబాయిలో ఉండేది. ప్రార్థనా సమాజంలో జస్టిస్ మహాదేవ గోవింద రానడే (1842-1901), సర్ ఆర్.జి. భండార్కర్లు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రార్థనా సమాజం మత సంస్కరణ కంటే సంఘ సంస్కరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రార్థనా . సమాజం జస్టిస్ రానడే నాయకత్వంలో పశ్చిమ భారతదేశ సంఘ సంస్కరణోద్యమానికి కేంద్రం అయింది. రానడే 1861లో వితంతు వివాహ సంఘాన్ని (Widow Marriage Association) స్థాపించాడు. విద్యావ్యాప్తి కోసం ‘దక్కన్ విద్యాసంఘం (Deccan Education Society) స్థాపించిన వారిలో ముఖ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో రానడే ఒకరు. రానడే కృషి వల్ల ప్రతి సంవత్సరం జరిగే జాతీయ కాంగ్రెస్ సమావేశంతోపాటు, అఖిల భారత సంఘ సంస్కరణ సమావేశం కూడా జరిగేది.

ప్రశ్న 2.
స్వామి వివేకానందుని కృషిని గురించి రాయండి.
జవాబు.
భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో వివేకానందుడు ప్రముఖుడు. ఇతడు 1863లో కలకత్తాలో జన్మించాడు. వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. తండ్రి మరణానంతరం ఇతడు కడుపేదరికంలో జీవించాడు. అసలు భగవంతుడున్నాడా లేదా అనే సందేహం వివేకానందునిలో కలిగింది. ఈ దశలోనే ఆయనకు రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడింది. వివేకానందుడి జీవితాన్ని రామకృష్ణుడు ప్రభావితం చేశాడు. వివేకానందుడు ఆస్తికుడుగా, తర్వాత గొప్ప వేదాంతిగా మారిపోయాడు. రామకృష్ణుడిని వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. నరేంద్రుడు వివేకానందుడిగా పేరుపొందాడు. తన జీవితమంతా రామకృష్ణ పరమహంస తత్త్వాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి వినియోగించాడు. వివేకానందుడు 1893లో చికాగో ప్రపంచ మత సమావేశానికి (Parliament of World Religions) భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యారు. సుమారు 5000 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో హిందూమత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాలను సమానంగా చూసే హిందూమత ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించాడు. వివేకానందుని ఉపన్యాసం పాశ్చాత్య, తూర్పుదేశాల వారిని దిగ్భ్రాంతులకు గురిచేసింది. తమ దేశాల్లో ప్రసంగించమని వివేకానందుడిని అనేక దేశాలవారు ఆహ్వానించారు. మూడు సంవత్సరాలు విదేశాలలో పర్యటించి మన జాతి ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.

ప్రశ్న 3.
19వ శతాబ్దం సంస్కరణోద్యమం ఫలితాలను వివరించండి.
జవాబు.
సాంఘిక, మత సంస్కరణోద్యమం వల్ల కింద పేర్కొన్న ముఖ్యమైన ఫలితాలు సంభవించాయి.
1) పాతకాలంనాటి సంప్రదాయాలు, మూఢ విశ్వాసాల్లో నమ్మకం సన్నగిల్లింది. విద్యావ్యాప్తి మూలంగా ప్రజలు చైతన్యవంతమయ్యారు. విద్యాధికులైన భారతీయులు సంఘంలోని అనవసరమైన కర్మకాండలను, మూఢ విశ్వాసాలను తొలగించుకోవడానికి కృషి చేశారు.

2) సంఘసంస్కర్తలందరూ మానవుల సంక్షేమం కోసం కృషి చేశారు. అన్ని మతాలు మానవ సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పాయి. సంస్కర్తలందరూ మానవతా వాదాన్ని సమర్థించారు.

3) సంస్కర్తలందరూ సతీసహగమనం, బాల్యవివాహాలు వంటి మహిళా సమస్యలను, అంటరానితనం, సాంఘిక వివక్షత మొదలైన అణగారిన వర్గాల సమస్యలను ఖండించారు. ప్రభుత్వం ఈ దురాచారాలను రద్దుచేయడానికి సంస్కర్తల సహాయ సహకారాలను తీసుకొన్నది.

4) స్త్రీ విద్యావ్యాప్తి జరిగింది. మహిళలకోసం పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. సమాజంలోని సంప్రదాయాలు, వివక్షలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమని గుర్తించారు.

5) ప్రజల్లో త్యాగగుణం, సేవాభావం, హేతువాదం కలిగాయి.

6) తమ ప్రాచీన భారతదేశ సంస్కృతి, వైభవాన్ని గురించి తెలుసుకోవడంవల్ల తాము పాశ్చాత్యులకు ఏవిధంగా తీసిపోమనే ఆత్మస్థైర్యం భారతీయులలో కలిగింది.

7) సాంఘిక సమానత్వభావనను, వివిధ సంస్కృతులు, మతాలమధ్య సహజీవనం అవసరాన్ని గుర్తించేటట్లు చేశాయి. ఈ సంఘసంస్కరణోద్యమాలు సమాజంలో చాలా మార్పులను కలిగించాయి. సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి, విద్యావంతులు వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి వీలైంది. ప్రజల్లో సార్వజనీన సోదరభావాన్ని తామంతా ఒక్కటే అనే భావనను కలిగించడం వల్ల భారతీయుల్లో జాతీయ భావం ఏర్పడింది.

ప్రశ్న 4.
అనీబిసెంట్ కృషిని అంచనా వేయండి.
జవాబు.
దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్ స్థాపించారు. థియోసఫీ అనే పదం ‘థియోస్’ మరియు ‘సోఫియా’ అనే రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది. థియోస్ అంటే ‘దైవం’. సోఫియా అంటే ‘జ్ఞానం’ మత, తత్వవిజ్ఞానం అధ్యయనాన్ని ప్రోత్సహించడం, అవ్యక్తంగా ఉన్న ప్రకృతి అని అర్థం. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, సర్వమత సామరస్యాన్ని కల్పించడం, ధర్మాలను, మానవులలో నిగూఢంగా ఉన్న శక్తులను పరిశోధించడం దివ్యజ్ఞాన సమాజం లక్ష్యాలు.

1879లో బ్లావట్క్సీ ఆల్కట్లు భారతదేశం పర్యటించి ఈ దేశ ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. తమ సంస్థ కార్యకలాపాలకు భారతదేశమే అనువైందని గ్రహించి 1886లో ఈ సంస్థ ప్రధాన కేంద్రకార్యాలయాన్ని మద్రాస్ సమీపంలోని అడయార్కు మార్చారు. అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ శాఖలను భారతదేశమంతటా విస్తరించింది. ఈమె ఐరిష్ వనిత. 1893లో ఈమె భారతదేశానికి వచ్చి 1907లో ఆల్కాట్ మరణించిన తర్వాత దానికి అధ్యక్షురాలై ఇక్కడే స్థిరపడింది. హిందూమత పునరుజ్జీవనం కోసం అనీబిసెంట్ కృషి చేసింది. భారతదేశంలో జాతీయ విద్యవ్యాప్తికోసం బెనారస్, అడయార్, మదనపల్లిలో పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. అనీబిసెంట్ బెనారస్లో స్థాపించిన కేంద్ర హిందూపాఠశాల తరువాత కాలంలో ‘బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం’గా అభివృద్ధి చెందింది. అనీబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్లో, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహించింది.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

ప్రశ్న 5.
పార్శీ సంస్కరణోద్యమాన్ని వివరించండి.
జవాబు.
హిందువులు, మహమ్మదీయులలాగానే పార్శీలలోకూడా మతచైతన్యం కలిగింది. పార్శీలు తమ మతాన్ని ప్రక్షాళనచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1851లో పార్శీలలో మేధావులైన దాదాభాయి నౌరోజి, యస్.యస్. బెంగాలీ మొదలైనవారు “రెహ్నుమాయి మల్దయాసన్ సభ” అనే సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకోవడానికి కృషిచేసింది. పార్శీలలో సంఘ, మత సంస్కరణలను ప్రచారం చేయడానికి ‘రాస్తఫర్’ అనే వారపత్రికను ప్రారంభించారు. పార్శీ సంస్కర్తలలో దాదాభాయి నౌరోజి, యస్. యస్. బెంగాలీ ముఖ్యమైనవారు. జొరాస్టర్ బోధనల ప్రాధాన్యతను పార్శీలకు వివరించడానికి ప్రయత్నించారు. కె.ఆర్. కామా పార్శీల మత గ్రంథం ‘అవెస్తా’ను శాస్త్రీయపద్దతిలో వ్యాఖ్యానించడం జరిగింది. పార్శీలు ఆంగ్లో-బ్రిటీష్ జీవన విధానాన్ని, అలవాట్లను, విద్యను అనుకరించనారంభించారు. తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకొంటూనే భారతీయపునరుజ్జీవనానికి పాటుబడ్డారు. బి.యం. మలబారి అనే ప్రముఖ పార్శీ సంస్కర్త స్త్రీలకు, పిల్లలకు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకై ‘సేవాసదన్’ను ప్రారంభించాడు. దాదాభాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, శ్రీదినా ఇదుల్జీలు భారతదేశం సాంఘిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి ఎంతో కృషిచేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రామకృష్ణ మిషన్ కృషిని గురించి రాయండి.
జవాబు.
స్వామి వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస పేరు మీద 1897లో ‘రామకృష్ణ మిషన్’ అనే సంస్థను బేలూరు (పశ్చిమ బెంగాల్)లో స్థాపించాడు. వివేకానందుడు అంటరానితనాన్ని, కులవ్యవస్థను ఖండించాడు. తన బోధనలతో భారతీయుల్లో జాతీయ భావాన్ని కలిగించాడు. పేదల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, ఉచిత వైద్యశాలలు వంటి వాటిని నెలకొల్పాడు. మానవుడు దేవుని ప్రతిరూపం. కాబట్టి “మానవ సేవే మాధవ సేవ” అనేది దీని లక్ష్యం. అణగారిన వర్గాల, పేదల సర్వతోముఖాభివృద్ధికి రామకృష్ణ మిషన్ సభ్యులు ఎంతో కృషిచేశారు. భూకంపాలు, వరదలు, తుఫానులు సంభవించినప్పుడు అహోరాత్రులు సేవ చేశారు. వివేకానందుడు వ్యక్తి శీల నిర్మాణానికి, క్రమశిక్షణకు, మాతృదేశాభిమానం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. భారతీయులలో జాతీయ భావం పెంపొందించడంలో రామకృష్ణ మిషన్ గణనీయమైన పాత్ర పోషించింది.

ప్రశ్న 2.
జోతిబాఫూలే కృషిని గురించి రాయండి.
జవాబు.
మహిళా విమోచనకు, అంటరానితనం నిర్మూలనకు, దళితుల పునరుద్ధరణకై ఫూలే బ్రాహ్మణేతర ఉద్యమం నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్, దాని నాయకులు అణగారిన వర్గాల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే తీవ్రంగా విమర్శించాడు. 1873లో పూలే సత్యశోధన సమాజం (సత్యాన్ని శోధించే సమాజం) స్థాపించాడు. దళితులకు, బలహీన వర్గాలవారికి సామాజిక న్యాయం సాధించే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించాడు. ఫూలే అన్ని కులాల పిల్లలకు పాఠశాలలను, అనాథ శరణాలయాలను స్థాపించాడు. స్త్రీలకోసం పూనేలో,ఒక ప్రత్యేక పాఠశాలను నెలకొల్పాడు.

ప్రశ్న 3.
దేవాలయ ప్రవేశ ఉద్యమంలో నారాయణగురు పాత్రను తెలియజేయండి.
జవాబు.
శ్రీనారాయణ గురు దేవాలయ ప్రవేశ ఉద్యమ నాయకుడు. ఇతడు 1854లో ఎజవ కుటుంబంలో జన్మించాడు. కేరళలో ఎజవలతో పాటు మరికొన్ని కులాలను ఉన్నతకులాలకు చెందిన హిందువులు అంటరానివారిగా చూసేవారు.

దక్షిణభారతదేశంలో, ముఖ్యంగా కేరళలో వీరిని అనేక అవమానాలకు గురిచేశారు. వీరికి దేవాలయ ప్రవేశంలేదు. దళితులకు 1924లో దేవాలయ ప్రవేశం అవకాశం దక్కింది. 1924 తరువాత గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఓకటిగా అస్పృస్యతా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై ప్రజా ఉద్యమంగా మారింది. దీని ఫలితంగా నవంబర్ 1936లో ట్రావెంకోర్ మహారాజు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఎటువంటి వివక్ష చూపకుండా హిందువులందరిని అనుమతించడం జరుగుతుందని ఒక ప్రకటన చేశాడు.

ప్రశ్న 4.
పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ కృషిపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
ఇ.వి. రామస్వామి నాయకర్ కులవ్యతిరేక, మతవ్యతిరేక, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్వహించాడు. ఇతడు ‘పెరియార్’ (గొప్పఋషి)గా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు తమిళనాడులోని ఈరోడ్ వద్ద ఒక బలిజకుటుంబంలో జన్మించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. నాయకర్ మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి 1924లో బ్రాహ్మణేతరులకు దేవాలయం ప్రవేశం కోసం వైక్కోం సత్యాగ్రహం చేశాడు. మహాత్మాగాంధీతో విభేదాలకారణంగా కాంగ్రెస్ను వీడి జస్టిస్ పార్టీలో చేరాడు. 1938లో జస్టిస్పార్టీకి అధ్యక్షుడయ్యాడు. 1925లో నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి మనుస్మృతిని తగలబెట్టే కార్యక్రమం చేపట్టాడు. ఇతడు అనేక ఆత్మగౌరవ వివాహాలు జరిపించాడు. ఈ వివాహాల్లో పురోహితుడు, కులం, మతం, మంత్రతంత్రాలకు తావులేదు. నాయకర్ సామాజిక న్యాయం కోసం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడాడు. నాయకర్ బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండే హిందూమతాన్ని త్యజించాడు. ఇతడు హిందూ దేవుళ్ళను, దేవతలను అపహాస్యం చేశాడు. నాయకర్ నాస్తికుడు, హేతువాది. తమిళనాడులో “దేవుడులేడు” అనే ఉద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ళముందు బోర్డులపై ఉన్న కులాల పేర్లను చెరిపే ఉద్యమం లేవదీశాడు.

TS Inter 1st Year History Study Material Chapter 13 భారతదేశంలో సాంఘిక, మతసంస్కరణోద్యమాలు

ప్రశ్న 5.
దియోబండ్ ఉద్యమం గురించి రాయండి ?
జవాబు.
దియోబండ్లో దార్-ఉల్-ఇస్లాం స్థాపనతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది వహాబీ ఉద్యమంలో ఒక శాఖ. ఇది ప్రపంచంలోని చాలా దేశాల విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. 1867లో ఇద్దరు మతనాయకులు మహమ్మద్ ఖాసిం నానౌతరి, రషీద్ అహ్మద్ గంగోలి ప్రారంభించారు. దియోబండ్ ఉద్యమం ఒక పేదవాడి విద్యాలయం. దీని విద్యార్థులు, ఉపాధ్యాయులు బీదరికంలో జీవించేవారు. దియోబండ్ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ మహమ్మదీయు లందరూ కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో పాల్గొని సహకరించాలని రషీద్ అహ్మద్ గంగోలి విజ్ఞప్తి చేశాడు. వివిధ మతాల ఐక్యతపైనే జాతీయత ఏర్పడుతుందని దియోబండ్ ఉద్యమం ప్రకటించింది.

ప్రశ్న 6.
ఆర్యసమాజం ముఖ్య సిద్ధాంతాలను రాయండి.
జవాబు.
స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్యసమాజాన్ని స్థాపించాడు. ఇతడు వేదాలను అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి కృషి చేశాడు. ఆర్యసమాజం కులవ్యవస్థ, అంటరానితనం, విగ్రహారాధన, జంతుబలి, బహుభార్యత్వం, బాల్య వివాహాలను ఖండించింది. దయానందుని అనుచరులు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దయానంద – ఆంగ్లో వేదిక్ (DAV) పాఠశాలలను స్థాపించారు. ఆర్యసమాజం దురాచారాలు, మూఢవిశ్వాసాల నుంచి హిందూ మతాన్ని విముక్తి చేసింది. వారి మత విలువను వారే గుర్తించేటట్లు చేసింది. భారతదేశాన్ని మతపరంగా, సాంఘికంగా, జాతిపరంగా ఏకం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ‘స్వదేశీ’ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి భారతీయుడు దయానందుడు. దయానందుని అనుచరులు దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, స్వావలంభనను, ఆత్మాభిమానాన్ని కలిగించారు.

Leave a Comment