TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 12th Lesson బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 12th Lesson బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గిరిజనులు, రైతుల తొలి తిరుగుబాట్లపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
గిరిజనుల తిరుగుబాట్లు : గిరిజనులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. బ్రిటీష్ వారు తమ పాలనను క్రమంగా గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించి, వారి భూములను, అధికారాన్ని స్వాధీన పరచుకొన్నారు. దీంతో 19వ శతాబ్దంలో గిరిజనులు లెక్కలేనన్ని తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లు సాయుధపోరాట స్వభావం కలిగి ఉన్నాయి.

వలస పాలన వల్ల గిరిజనుల ఏకాంత జీవనం అంతమైంది. వారు పూర్తిగా వలసపాలన నియంత్రణలోకి వచ్చారు. వారికి భూములపై, అడవిపై గల సమిష్టి యాజమాన్య సంప్రదాయం తుడిచిపెట్టుకు పోయింది. గిరిజనుల సామాజిక జీవనంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రోత్సహించింది. దీన్ని గిరిజనులు వ్యతిరేకించారు. బ్రిటీష్ పాలన వడ్డీ వ్యాపారస్థులు, రెవెన్యూ రైతులు లాంటి దళారులను ఏర్పరచింది. ఈ దళారులు గిరిజనుల భూములను స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా గిరిజనులు తమ భూములను కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

భిల్లుల తిరుగుబాటు : పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్ ప్రాంతంలో జీవించే ఆదివాసి తెగకు చెందిన వారు బిల్లులు. వీరు ఉత్తర, దక్కన్ మధ్యగల కొండ ప్రాంతంలోని మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరువు పరిస్థితులు, దుష్పరిపాలన మూలంగా అసంతృప్తితో 1817 – 1819 మధ్య తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం అతి పాశవికంగా ఈ తిరుగుబాటును అణచివేసింది.

కోలుల తిరుగుబాటు : ఛోటా నాగపూర్ లోని గిరిజన నివాస స్థలాల్లో కోలులు, భిల్లులు, హౌస్లు, ముండాలు, ఓరాన్లు అనే గిరిజన తెగలుండేవి. 1820లో పొర్హత్ రాజు ప్రతి సంవత్సరం శిస్తును చెల్లిస్తూ బ్రిటీష్వారికి విధేయుడిగా ఉండడానికి ఒప్పందం చేసుకొన్నాడు. తన సరిహద్దులో గల కోల్ ప్రాంతం కూడా తనకే చెందుతుందని, అందువల్ల కోలులు తనకు పన్నులు చెల్లించాలని ప్రకటించాడు. దీన్ని వ్యతిరేకించి కోలులు 1831-1832లో తిరుగుబాటు చేశారు.

అహోమ్ల తిరుగుబాటు : అహోమ్లు అస్సాంలో నివసించే గిరిజనులు. బర్మా యుద్ధం తరువాత తమ భూభాగం నుంచి సైన్యాలను ఉపసంహరించుకొంటామని ఇచ్చిన హామీని బ్రిటీష్ వారు నిలబెట్టుకోలేదు. అహోమ్ల భూభాగాన్ని ఆక్రమించడానికి కంపెనీ ప్రయత్నించడంతో అహోమ్ల తిరుగుబాటు ప్రారంభమైంది. 1828లో అహోమ్లు గోంధార్ కోన్వరు తమ పాలకునిగా ప్రకటించుకొని రంగపూర్పై దాడికి ఉపక్రమించారు. కాని బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచి వేసింది.

ఖాసీల తిరుగుబాటు : బర్మా యుద్ధం తరువాత అస్సోంలోని సిల్హట్ను ఖాసీ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం గుండా ఆక్రమించాలనే దురాలోచన బ్రిటీష్ వారిలో కలిగింది. ఖాసీల రాజు ఉటిరాట్సింగ్ ఆదేశాలను కంపెనీ రక్షక దళాలు బేఖాతరు చేయడంతో ఘర్షణ మొదలైంది. ఈ పోరాటం 1829లో ప్రారంభమై బ్రిటీష్ వారు ఖాసీలను 1833లో ఓడించే వరకు కొనసాగింది.

గోండుల తిరుగుబాటు : 1857 – 60 మధ్యలో నిర్మల్, ఉట్నూర్, చెన్నూర్, అసిఫాబాద్ ప్రాంతం రాంజీగోండు ఆధీనంలోకి వచ్చింది. బ్రిటీష్వారు గోండు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో 1860లో రాంజీ పోరాటాన్ని ప్రారంభించాడు. ఇతడి సైన్యంలో రోహిల్లాలు, గోండులున్నారు. నిజాం, బ్రిటీష్ సైన్యాలను రాంజీ ఓడించి పారదోలాడు. బ్రిటీష్ వారిని తమ భూభాగంలోకి రాకుండా బలంగా ప్రతిఘటించాడు. కాని రాంజీ చివరకు పట్టుబడ్డాడు. అతనితో పాటు వెయ్యిమంది సైనికులను నిర్మల్లో ఉరితీశారు.

రైతుల తిరుగుబాట్లు : బ్రిటీష్ వారి భూమిశిస్తు విధానాలు, అధిక పన్నుల విధింపు మూలంగా రైతుల్లో అశాంతి ఏర్పడింది. భూయజమానులైన రైతులు చాలామంది కౌలుదారులుగా మారారు. తమ ప్రాంతంలోని రైతులను కూడగట్టుకొని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఈ క్రింది తిరుగుబాట్లు వీటిలో ప్రధానమైనవి.

రంగపూర్లో తిరుగుబాటు : 1783లో బెంగాల్లోని రంగపూర్, దింగపూర్ జిల్లాల్లో రైతులు రెవెన్యూ కాంట్రాక్టర్ దేవిసింగ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవిసింగ్ రైతుల పట్ల కఠోరంగా వ్యవహరించాడు. కొరడాలతో కొట్టడం లాంటి భయానక పరిస్థితులను సృష్టించాడు. రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దినజ్ఞారిన్ నాయకత్వంలో రైతులు బ్రిటీష్ వారిపై తిరగబడ్డారు.

మోప్లా తిరుగుబాటు (మలబార్ ప్రాంతం) : అక్రమ పన్నులు, బలవంతంగా తమ భూముల నుంచి వెళ్ళగొట్టడం, రైతుల పట్ల బ్రిటీష్ వ్యతిరేక వైఖరి మోప్లా తిరుగుబాటుకు కారణాలు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

పాగల్పంథీల తిరుగుబాటు : తూర్పు బెంగాల్లోని షెర్పూర్ పరగణాలో జమిందారులు అక్రమ పన్నులకు, శాశ్వత భూశిస్తు విధానానికి వ్యతిరేకంగా కరషా తరువాత అతని వారసుడు టిపూషా నాయకత్వంలో పాగల్పంథీలనే రైతులు తిరుగుబాటు చేశారు. రైతులు ధైర్య సాహసాలతో తిరుగుబాటు చేసినప్పటికి ప్రభుత్వం 1833లో దీన్ని అణచివేసింది.

మైసూర్ తిరుగుబాటు : మైసూర్ పాలకుడు ఒడయార్పై కంపెనీ ఆర్థిక ఒత్తిడి ఎక్కువైంది. పరోక్షంగా ఈ భారం రైతులపై పడింది. స్థానిక ఉద్యోగులు అవినీతితో అక్రమ పన్నుల వసూళ్ళకు పూనుకొన్నారు. రైతుల జీవితం దుర్భరం అయింది. నగర్ రాష్ట్రంలోని సర్దార్ మల్ల నాయకత్వంలో రైతులు 1800, 1831లలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేసింది.

ప్రశ్న 2.
1857 తిరుగుబాటుకు గల కారణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్రలో సిపాయిల తిరుగుబాటు విశిష్ట ఘట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాలలో వచ్చిన అసంతృప్తి సిపాయిల తిరుగుబాటు రూపంలో ప్రతిఫలించింది. తిరుగుబాటు కారణాలను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు : భారతదేశంలో బ్రిటిష్ రాజ్యవిస్తరణకై ఆంగ్లేయులు యుద్ధాలు చేయటం, కుట్రలు, కుతంత్రాలు, సైన్య సహకార పద్ధతి డల్హౌసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగపూర్, ఝాన్సీ సంస్థానాలు విలీనం చేసుకున్నాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబు ‘భరణాన్ని నిరాకరించాడు. రాజుల బిరుదులు రద్దు చేశారు. దీనితో స్వదేశీ రాజులు అసంతృప్తికి లోనై తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు : బ్రిటీష్ వారి రాజ్యసంక్రమణ విధానం వలన అనేక రాజ్యాలలోని ప్రభుత్వ ఉద్యోగులు, కవులు, గాయకులు, విద్వాంసులు నిరుద్యోగులయ్యారు. వారి విధానాలతో దేశంలోని చేతివృత్తులవారు, రైతులు దెబ్బతిన్నారు. కుటీర పరిశ్రమలు క్షీణించాయి. ఎందరో ప్రజలు తిండిలేక, పనిలేక అలమటించారు. వారికి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు : బ్రిటీష్ వారు లార్డ్ బెంటింక్ కాలం నుంచి డల్హౌసీ కాలం వరకు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలైన సతీసహగమన నిషేధ చట్టం, మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తిహక్కు, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటివి డల్హౌసి హయాంలో ప్రవేశపెట్టిన తంతి, తపాల, రైల్వేలు, పాశ్చాత్య తరహా న్యాయవ్యవస్థ ఇంగ్లీష్ విద్య సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు : కంపెనీ ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మిషనరీలు మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. క్రైస్తవులైన ‘ఆంగ్లేయులు అందరినీ క్రైస్తవులుగా మార్చుతారనే భయం ప్రజల్లో ఏర్పడింది. మిషనరీవారు హిందూ, ముస్లిం సంప్రదాయాలను అవహేళన చేస్తూ ప్రచారం చేసేవారు. భారతీయ ఆచారాలను నిషేధించి కొత్త చట్టాలు చేయడం, పాఠశాలలో మత బోధన చేయడం వంటివి ప్రజల్లో భయాందోళలనలకు తావిచ్చాయి.

5) సైనిక కారణాలు : బ్రిటీష్ సైన్యంలో బ్రతుకు తెరువుకు పనిచేసే భారతీయ సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు జీతాలలో తేడా ఉండేది. భారతీయ సిపాయిలకు ప్రమోషన్లు కూడా లభించేవి కావు. కుల మత చిహ్నాలను సూచించే గుర్తులు తీసివేయమనడం, సముద్ర ప్రయాణం వీరిని మరింత కష్టపెట్టాయి.

6) తక్షణ కారణం : 1856లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వదంతితో హిందూ, ముస్లిం సైనికులలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయి తిరుగుబాటు ఆరంభమయింది. ఇది బ్రిటీష్ సామ్రాజ్య పునాదులనే కదిపివేసింది.

ప్రశ్న 3.
1857 తిరుగుబాటు గమనం గురించి రాయండి.
జవాబు.
తిరుగుబాటు గమనం : బారక్పూర్ రెజిమెంటుకు చెందిన మంగళ్పాండే 29 మార్చి 1857న కోపంతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సార్జంట్ మేజర్ న్ను కాల్చి చంపాడు. మంగళ్పాండేను ఉరితీశారు. ఏప్రిల్ నెలలో మీరట్ బెటాలియన్కు చెందిన సిపాయిలు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించారు. ప్రభుత్వం వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. మే 10న మీరట్లో మూడు రెజిమెంట్లు తిరుగుబాటు చేసి బ్రిటీష్ అధికార్లను కాల్చి చంపారు. జైల్లోని ఖైదీలను విడుదల చేసి ఢిల్లీకి వెళ్ళారు. మే 12న మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్గాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ తిరుగుబాటు కొద్ది సమయంలోనే ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఢిల్లీ నుంచి తూర్పున బీహారు వ్యాపించింది. జూన్ నెలలో లక్నో, ఝాన్సీ, కాన్పూర్లకు వ్యాపించింది. కాన్పూర్లో పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. నానాసాహెబ్ బ్రిటీష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. కాన్పూర్ను ఆక్రమించి బ్రిటీష్ వాళ్ళను తరిమేశాడు. ఝాన్సీలో తాంతియాతోపే, లక్ష్మీబాయి బ్రిటీష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించి యుద్ధం సాగించారు. బీహార్లో కున్వర్ సింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అవధ్ తొలగించబడిన నవాబు భార్య బేగం హజ్రత్ .. మహల్ నాయకత్వంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. అవధ్ను బ్రిటీష్వారు ఆక్రమించడాన్ని సిపాయిలు వ్యతిరేకించారు. అందుకే వారు భీకరమైన పోరాటం చేశారు. దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు ప్రభావం లేదు. స్వదేశీ పాలకులెవ్వరూ ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో స్వదేశీ పాలకులు తిరుగుబాటును అణచడంలో బ్రిటీష్ వారికి సహకరించారు.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

ఈ విధంగా తిరుగుబాటు మొత్తం ఉత్తర భారతదేశానికి వ్యాపించింది. ప్రారంభంలో తిరుగుబాటు కొంతవరకు విజయం సాధించింది. ఢిల్లీ, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, ఝాన్సీ, బీహార్ మొదలైన ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు. మహమ్మదీయ నాయకులు, మౌల్వీలు మొఘల్ పాలనను పునఃస్థాపన చేయడానికి ఇదే మంచి అవకాశమని భావించారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1857 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు ఏవి ?
జవాబు.

  1. తిరుగుబాటు కేవలం ఉత్తర, మధ్య భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ఇతర ప్రాంతాలకు వ్యాపించకపోవడం.
  2. తిరుగుబాటు ప్రభావం పంజాబ్, సింధ్, రాజస్తాన్, దక్షిణ భారతదేశంలో లేకపోవడం.
  3. గ్వాలియర్, సింథియా, హైద్రాబాద్ నిజాం, కాశ్మీర్ గులాబ్సింగ్ మొదలైనవారు బ్రిటీష్ వారికి విధేయులుగా
    మారడం.
  4. తిరుగుబాటుదారుల్లో నాయకత్వలోపం, అవగాహన రాహిత్యం, ప్రణాళిక ప్రకారం తిరుగుబాటు చేయకపోవడం, దేశం అంతా ఒకేసారి తిరుగుబాటు జరపకపోవడం, సైనికులలో క్రమశిక్షణ లేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలు.
  5. బ్రిటీష్ వారికి సమర్ధులైన సైనిక అధికారులున్నారు. కాంబెల్, లారెన్, హ్యురోస్, హమ్లాన్ మొదలైనవారు తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేసారు. తిరుగుబాటుదారులు బ్రిటీష్ వారి ఆధునిక ఆయుధాలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం కూడా తిరుగుబాటు విఫలానికి కారణం అయింది.
  6. ఆధునిక సాధనాలైన టెలిగ్రాఫ్, పోస్టల్ విధానాలు, రైళ్ళు తిరుగుబాటును సులభంగా అణచివేయడానికి బ్రిటీష్వారికి తోడ్పడ్డాయి. సైన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి త్వరగా తరలించి త్వరితగతిన తిరుగుబాటును అణచివేయడం జరిగింది.

ఈ కారణాల వలన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనబడిన సిపాయిల తిరుగుబాటును బ్రిటీష్వారు అతికష్టంమీద అణచివేయగలిగారు.

ప్రశ్న 2.
1857 తిరుగుబాటు ఫలితాలను వివరించండి.
జవాబు.
సుమారు ఒక సంవత్సర కాలంపాటు విభిన్న ప్రాంతాలలో జరిగిన సిపాయిల తిరుగుబాటును బ్రిటీషువారు అతికష్టం మీద అణచగలిగారు. ఈ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా పాలనలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. తీవ్ర అసహనంగా ఉన్న భారతీయులను బుజ్జగించేందుకు కొన్ని చర్యలు చేపట్టారు.

ఫలితాలు :

  1. 1858లో విక్టోరియా రాణి ప్రకటనతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాణికి బదిలీ చేయబడింది.
  2. గవర్నర్ జనరల్ రద్దు చేయబడి, భారతదేశ ప్రాంతాలకు బ్రిటిష్ రాజప్రతినిధులు నియమించబడ్డారు. గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ తొలి రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. 1858 నుంచి 1947 వరకు రాజప్రతినిధుల యుగంగా నడిచింది.
  3. రాణి ప్రకటన ప్రకారం కంపెనీ స్వదేశీ సంస్థానాలతో చేసుకున్న సంధి షరతుల ప్రకారం సంస్థానాధీశుల హక్కులను, మర్యాదలను కాపాడడానికి హామీ ఇచ్చింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడింది. దత్త స్వీకరణకు వారికి అనుమతి హక్కు ఇవ్వబడింది.
  4. రైతుల సంక్షేమం కోసం వారికి కొన్ని అనుకూలమైన చట్టాలు చేయబడ్డాయి.
  5. తిరుగుబాటు తర్వాత మూడు దశాబ్దాలలోపే బ్రిటిష్ పాలకుల వైఖరి వలన ప్రజలలో రేగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు 1885లో బ్రిటీషు వారిచే “సేఫ్టీ వాల్వ్”గా భావించబడి స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ తరువాత భారత స్వాతంత్రోద్యమానికి పోరాటం చేసింది.

ఈ విధంగా సిపాయి తిరుగుబాటు రాబోయే కాలంలోని జాతీయోద్యమానికి కావలసిన బీజాలు దేశ ప్రజలలో నాటింది.

ప్రశ్న 3.
1857 తిరుగుబాటు స్వభావాన్ని పరిశీలించండి.
జవాబు.
తిరుగుబాటు స్వభావం: 1857 తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారుల్లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్నాయి. 1857 సంఘటనను ఒక వర్గం చరిత్రకారులు ‘సిపాయిల పితూరి’ లేదా కొద్దిమంది సిపాయిల, సామాన్య ప్రజల అసంతృప్తిగా పేర్కొన్నారు. ఇంకొక వర్గం చరిత్రకారులు, దేశభక్తులు దీనిని “భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం” అని వర్ణించారు. మొదట సిపాయిల పితూరిగా ప్రారంభమై మెల్లమెల్లగా ప్రజా తిరుగుబాటు స్వభావం సంతరించుకుంది. లార్డ్కనింగ్ దీన్ని “జాతీయ సమరం” గా వర్ణించాడు. కొందరు దీన్ని మత భావాలను కాపాడుకునే ప్రయత్నంగా అభిప్రాయపడ్డారు. ఇంకొందరు దీన్ని బ్రిటీష్వారి జాతి విక్షతకు వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుగా పేర్కొన్నారు. 1857 తిరుగుబాటు ఒక సిపాయిల పితూరికాదు, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం కాదు. ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన మాత్రమే. అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాడేటట్లు చేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది ?
జవాబు.
తక్షణ కారణం : 1856లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వదంతితో హిందూ, ముస్లిం సైనికులలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయి తిరుగుబాటు ఆరంభమయింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిపివేసింది.

ప్రశ్న 2.
ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటులో పాల్గొనడానికి కారణం ఏమిటి ?
జవాబు.
లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె ఝాన్సీ పాలకుడు గంగాధరరావు రెండో భార్య. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. తన దత్త కుమారుడు ఝాన్సీ రాజుగా గుర్తించడానికి నిరాకరించడంతో, మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది.

1858లో సర్ హ్యూరీస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్వారితో యుద్ధాన్ని సాగించింది. 1858 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 3.
విక్టోరియా మహారాణి ప్రకటనపై స్వల్ప సమాధానం రాయండి.
జవాబు.
నవంబర్ 1858లో మొదటి వైస్రాయ్ చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్కనింగ్ అలహాబాద్లో ఒక దర్బార్ను నిర్వహించి మహారాణి ప్రకటనను చదివి వినిపించాడు.

  1. 1858 చట్టం భారతదేశంలో కంపెనీ పాలనను రద్దు చేసింది. భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటీష్ రాజరికంలోకి మారింది. భారతదేశ వ్యవహారాలను చూడటానికి లండన్లో భారత రాజ్యకార్యదర్శి, ఇండియా కౌన్సిల్న ఏర్పాటు
    చేసింది.
  2. సంతానంలేని స్వదేశీ పాలకులు ఇక నుంచి దత్తత తీసుకోవచ్చు. బ్రిటీష్వారు రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి పలికారు.
  3. బ్రిటీష్వారిని హత్య చేసిన నేరస్థులకు లేదా హత్యతో ప్రత్యక్ష సంబంధమున్న వారిని మినహాయించి తిరుగుబాటుదారులు అందరికి క్షమాభిక్ష పెట్టింది. ప్రజల మత, సాంఘిక విషయాల్లో జోక్యం చేసుకోమని హామీ ఇచ్చారు. తిరుగుబాటును అణచడంలో సహాయమందించిన పాలకులకు రక్షణ కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ప్రశ్న 4.
1857 తిరుగుబాటులో బహదూర్షా – II పాత్రను రాయండి.
జవాబు.
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్గా చివరివాడు. 1857 మే లో మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్వారు, బహదూరాను బందీగా చేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 5.
1857 తిరుగుబాటులో మంగళ్పాండే పాత్రను విశదీకరించండి.
జవాబు.
మంగళ్పండే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ ని సిపాయి. కలకత్తా దగ్గర బారక్పూర్లో మార్చి 29, 1857న బ్రిటీష్ అధికారిని కాల్చి చంపాడు. కారణం బ్రిటీష్ వారు ఆవుకొవ్వు, పందికొవ్వుతో చేసిన తూటాలు వాడమని ఇవ్వడమే. ఈ తిరుగుబాటు చేసినందుకు పాండేని ఉరితీసారు. అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రం వైపు మళ్ళించిన ఘనత మంగళ్ పాండేదే.

TS Inter 1st Year History Study Material Chapter 12 బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తిరుగుబాట్లు

ప్రశ్న 6.
బేగం హజ్రత్ మహల్ గురించి రాయండి.
జవాబు.
బేగం హజ్రత్ మహల్ అవద్ నవాబు వాజిత్ అలీషా యొక్క భార్య. అవద్ నవాబును పదవి నుండి తొలగించడాన్ని అక్కడి సిపాయిలు వ్యతిరేకించారు. 1857 సైనిక తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించింది.

Leave a Comment