TS Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయపు వివిధ నిర్వచనాలు ఏవి ? జాతీయాదాయ నిర్ణాయకాలను విశదీకరించండి.
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాల వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి :

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

2. పిగూ నిర్వచనం :
పిగూ నిర్వచనం ప్రకారం ‘ద్రవ్య రూపంలో కొలవడానికి వీలయ్యి విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయాదాయం’ అంటారు.

3. ఫిషర్ నిర్వచనం :
ఫిషర్ నిర్వచనం ప్రకారం “తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం”. మార్షల్, పిగూ నిర్వచనాల కంటే ఫిషర్ నిర్వచనం మెరుగైందని చెప్పవచ్చు.

ఎందుకంటే ఫిషర్ నిర్వచనం వినియోగంపై ఆధారపడ్డ ఆర్థిక సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటుంది. అంతేకాక మార్షల్, పిగూ నిర్వచనాల కంటే ఫిషర్ ప్రతిపాదించిన నిర్వచనం దోషరహితమైనది. జాతీయాదాయ విశ్లేషణలో ఆర్థిక సంక్షేమ కారణాలను ఆర్థిక సంక్షేమ స్థాయిని పోల్చడానికి ఫిషర్ నిర్వచనం ఉపకరిస్తుంది.

4. కుజ్నెట్స్ నిర్వచనం :
‘ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ మూలధన వస్తువులను నికరంగా చేరే వస్తు సేవలను జాతీయాదాయం అంటారు. దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థలు వారి ఆర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయాదాయం’.

జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు :
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయాదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైన వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) సహజ వనరులు :
సహజ వనరులు, శీతోష్ణస్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగాను, అనుకూలంగాను లభ్యమయ్యే దేశాలలో, అన్ని రంగాలలో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయాదాయం పెరుగుతుంది.

బి) ఉత్పత్తికారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయాదాయ పరిమాణం నిర్ణయింపబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి · దిగుమతి విధానాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని నిర్వచించి, దాని వివిధ భావనలను వివరించండి.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో ఉత్పత్తయ్యే వస్తుసేవల ద్రవ్యరూపం జాతీయాదా యంగా భావించవచ్చు. ఆధునిక అర్థశాస్త్రంలో ‘జాతీయాదాయం’ అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది.

జాతీయాదాయ భావనలు :
1. స్థూల జాతీయోత్పత్తి :
ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ద్రవ్యరూపాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి విదేశీ వ్యాపారం వలన లభించే ఆదాయం కలపాలి. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడంలో

  1. ప్రతి అంతిమ వస్తువు లేదా సేవల విలువలను ద్రవ్యరూపంలో చెప్పాలి.
  2. ఏ వస్తువు విలువను రెండుసార్లు లెక్కపెట్టకుండా జాగ్రత్తపడాలి.
  3. ముడిపదార్థాలను పూర్తిగా తయారు కాని వస్తువుల విలువను జాతీయోత్పత్తిలో కలపాలి. వీటిని

ఇన్వంటరీస్ అంటారు. వీటిలో తరుగుదల ఉంటే ఆ సంవత్సరపు జాతీయోత్పత్తి నుండి తీసివేయాలి.
స్థూల జాతీయోత్పత్తిని ఈ క్రింది విధముగా చెప్పవచ్చు.
GNP లేదా GNI = C + I + G + (X – M)

2. స్థూల దేశీయోత్పత్తి :
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్యరూపం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగము, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ ఆదాయం’ కలిసి ఉంటాయి.

స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం మాత్రమే ఉంటాయి.
స్థూల దేశీయోత్పత్తి లేదా GDP = C + I + G.

3. నికర జాతీయోత్పత్తి – నికర దేశీయోత్పత్తి :
వస్తూత్పత్తిలో ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలను ఇతర సామాగ్రిని వినియోగిస్తాయి. వీటిని అవిచ్ఛిన్నంగా ఉపయోగించడం వలన అవి తరుగుదలకు లోనవుతాయి. దీనినే మూలధనం తరుగుదల అంటారు.

ఈ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో జాతీయాదాయం అని కూడా అంటారు. నికర జాతీయాదాయాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ‘జాతీయాదాయం’ అంటారు.

నికర జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి – మూలధనం పెరుగుదల
NNP = GNP – Depreciation

నికర దేశీయోత్పత్తి = స్థూలదేశీయోత్పత్తి – మూలధనం తరుగుదల
NDP = GDP – Depreciation

నికర జాతీయాదాయాన్ని మదింపు చేయటంలో ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను.

a) అంతర్జాతీయ వ్యాపారం వలన సంభవించే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.
b) ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలను స్థూల, నికర జాతీయోత్పత్తులలోను, స్థూల, నికర దేశీయోత్పత్తులలోను భాగంగా పరిగణించాలి. సిబ్బందికి ప్రభుత్వం చేసే వ్యయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4. వ్యష్టి ఆదాయం :
ఒక సంవత్సర కాలంలో దేశంలోని వివిధ వ్యక్తులకు, సంస్థలకు లభించే ఆదాయం. మొత్తము వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయం, నికర జాతీయోత్పత్తి సమానం కాదు. సంస్థలు తమ లాభంలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి.

కొంత భాగాన్ని పంపిణీ కాని లాభాల రూపంలో “రిజర్వ్ డ్ ఫండ్”గా ఉంచుతారు. మిగిలిన భాగాన్ని డివిడెండ్గా వాటాదార్లకు పంపిణీ చేస్తారు. డివిడెండ్లు మాత్రమే వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. కనుక సాంఘిక భద్రతా విరాళాలు, కార్పొరేట్ పన్నులు, పంపిణీ కాని లాభాలు నికర జాతీయోత్పత్తి నుండి మినహాయించాలి.

కొంతమంది వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి ఆదాయం లభిస్తుంది. వీటిని జాతీయాదాయంలో చేర్చరాదు. వృద్ధాప్యపు పింఛనులు సిద్యోగ భృతి, వడ్డీలు మొదలైనవాటిని బదిలీ చెల్లింపులంటారు. ఇవి వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. ఈ బదిలీ చెల్లింపులను జాతీయాదాయంలో చేర్చరాదు.

వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – పంపిణీ కాని సంస్థల లాభాలు + బదిలీ చెల్లింపులు – సాంఘిక భద్రతా విరాళాలు – కార్పొరేట్ పన్నులు

5. వ్యయార్హ ఆదాయం :
వ్యక్తుల వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యక్తులకు వివిధ రూపాలలో లభించే ఆదాయాలన్నింటిని ఖర్చు చేయడానికి వీలుండదు. ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి ఉంటుంది. కనుక వ్యష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయంలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటే దానిని పొదుపు అంటారు.

దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చును.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం – వ్యష్టి పన్నులు
వ్యయార్హ ఆదాయం = వినియోగము + పొదుపు

6. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం :
వస్తూత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ఉత్పత్తి సాధనాలకు ప్రతిఫలాలను చెల్లిస్తారు. వాటి మొత్తాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తికి, నికర జాతీయోత్పత్తికి తేడా ఉంది. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు.

నికర జాతీయోత్పత్తి నుండి పన్నులను తీసివేస్తే మిగిలేదే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయ్యేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ” ఇస్తుంది. అప్పుడు వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. కనుక సబ్సిడీలను నికర జాతీయోత్పత్తికి కలపాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయము = నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు – పరోక్ష పన్నులు
National Income at Factor Cost = Net National Income + Subsidies – Indirect Taxes.

7. తలసరి ఆదాయం : జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తలసరి ఆదాయం నిర్ణయిస్తుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
జాతీయాదాయాన్ని లెక్కించడానికి గల వివిధ పద్ధతులు ఏమిటి ? వాటిని వివరించండి.
జవాబు.
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి :

  • ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  • వ్యయాల పద్ధతి
  • ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం పిల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం వల్ల, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు”.

1. ఉత్పత్తి మదింపు పద్ధతి:
దీనిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.
మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి = (P1Q1 + P2Q2 + …………….. + PnQn)
P = ధర
Q = పరిమాణం
1, 2, n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు

జాతీయాదాయం :
ఈ పద్ధతిలో కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. ముడిసరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు.
“దీనిలో మదింపు చేసిన విలువలను వివిధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయాడెడ్ పద్ధతి అని కూడా అంటారు.

2. వ్యయాల మదింపు పద్ధతి:
ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.

NI = EH + EF + EG + Net exports + Net income from abroad
ఇచ్చట, EH గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం
కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

3. ఆదాయ మదింపు పద్ధతి :
ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర విదేశీ ఆదాయం

ఉద్యోగిత ఆదాయం :
– స్వయం ఉద్యోగిత ఆదాయం
+ కంపెనీల స్థూల వ్యాపార లాభాలు
+ జాతీయం చేయబడిన పరిశ్రమల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ సాధారణ ప్రభుత్వ సంస్థల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ భాటకం
+ వ్యాపారంలో ఉపయోగించని మూలధన వినియోగానికి ఆపాదించిన ఛార్జీ
= మొత్తం గృహరంగ ఆదాయం
– స్టాక్ ఆప్రిసియేషన్
+ శేషించిన పొరపాటు
= ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి
ఈ పద్ధతిలో జాతీయాదాయం గణించడానికి వివిధ ఆధారాల నుంచి వేల సంస్థలో దత్తాంశ సేకరణ అవసరం. ఆచరణలో ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి ?
జవాబు.
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.

ఎ) సహజ వనరులు :
సహజ వనరులు, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు మొ||నవి అధికంగా, అనుకూలంగాను లభ్యమై దేశాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయాదాయంను పెంచుకోవచ్చు.

బి) ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశ సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, జాతీయాదాయమును నిర్ణయిస్తుంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించుకొనుటకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపకరిస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 2.
మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తికి మధ్య గల తేడాలను వివరించండి.
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి:

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి (Gross National Product GNP):
స్థూల జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అని కూడా అంటారు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన “అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటారు.

ఇందులోని ప్రధాన భాగాలు :

  1. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులు, సేవలు (C)
  2. మూలధన వస్తువులపై స్థూల దేశీయ ప్రైవేటు పెట్టుబడి (I)
  3. ప్రజోపయోగ సేవలపై ప్రభుత్వ వ్యయం (G)
  4. అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఆర్జించిన ఆదాయాలు : (ఎగుమతుల విలువ దిగుమతుల విలువ X – M)
  5. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి C + I + G + (X – M).
    మార్కెట్ ధరలలో GNP = వినియోగం + పెట్టుబడి/ఉత్పాదక వస్తువులు + ప్రభుత్వం మొత్తం వ్యయం + (ఎగుమతుల విలువ – దిగుమతుల విలువ).
    ఈ భావనలో వస్తువులు, సేవలు ఎవరు ఉత్పత్తి చేశారనేది ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కానీ ఎక్కడ ఉత్పత్తయినది ముఖ్యం కాదు.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి (GNP at Factor Cost) :
ఉత్పత్తి కారకాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల ద్రవ్య విలువల మొత్తాన్ని తెలిపేది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తిలో వేతనాలు, భాటకం, వడ్డీ, డివిడెండ్లు, చేయబడని కార్పొరేటు లాభాలు, మిశ్రమ ఆదాయం (చిల్లర వర్తకపు లాభాలు), ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల తరుగుదల, విదేశీ వ్యాపార నికర మిగులు కలిసి ఉంటాయి.

అయితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ త్పత్తిలో పరోక్ష పన్నులు మినహా మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తిలో గల అన్ని అంశాలు ఉంటాయి. అందువల్ల మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయ విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉత్పత్తిదారులకు సబ్సిడీలు కల్పించినచో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయాన్ని లెక్కించుటకు, మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తికి సబ్సిడీలను కలపాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
మార్కెట్ ధరలలో జాతీయాదాయం, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ భావనలను క్రింది విధంగా వివరించవచ్చు.
మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి (Net National Product – NNP) :
వస్తు సేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్రపరికరాలు కొంత కాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు లేదా కొంత కాలం తరువాత అవి నిరుపయోగం కావచ్చు. ఈ కారణం వల్ల స్థూల జాతీయోత్పత్తి నుంచి కొంత భాగం తరుగుదల, అరుగుదలను పూరించడానికి ఉపయోగించాల్సి ఉంటుంది.

అందువల్ల స్థూల జాతీయోత్పత్తి అంతా ఆ సంవత్సర ఆదాయంగా పరిగణించడానికి వీలుండదు. అందువల్ల స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలకు, అరుగుదలకు కావలసిన మొత్తాన్ని మినహాయించగా మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి వస్తుంది.

మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి – మూలధన తరుగుదల.
మూలధన తరుగుదలను ‘user cost’ అని అంటారు.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం :
ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు.

దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. దీనిలో ఉద్యోగులు పొందే వేతనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర భాటకం అన్ని రకాల వ్యాపార లాభాలు ఇమిడి ఉంటాయి. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు.

ఉదా : ఎక్సైజ్, అమ్మకం పన్ను చెల్లిస్తారు. కాని ఉత్పత్తికారకాలకు కాదు. అదేమాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తుసేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే వస్తు ఉత్పత్తికారకాలకు కాదు. అందువల్ల వాస్తవ ఉత్పత్తి వ్యయాల కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయింపబడతాయి.

అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయాదాయానికి కలపాలి. ఈ రోజులలో ప్రభుత్వ రంగం విస్తరించుటయే కాకుండా అనేక పరిశ్రమలను, సంస్థలను నిర్వహిస్తున్నందువల్ల అది పొందుతున్న లాభాలు ఉత్పత్తి కారకాలకు పంపిణీ కావు. అందువల్ల ప్రభుత్వ సంస్థల లాభాలను నికర జాతీయాదాయం నుంచి తీసివేయాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీలు – ప్రభుత్వ సంస్థల లాభాలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 4.
ఏవేని మూడు జాతీయాదాయ నిర్వచనాలను చర్చించండి.
జవాబు.
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం నికర విలువను జాతీయా దాయంగా భావించవచ్చు. జాతీయాదాయం ఆ దేశంలోని ప్రజల జీవన స్థితిగతులకు, ప్రజల సంక్షేమానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది.

1. పిగూ నిర్వచనం :
ఆచార్య పిగూ నిర్వచనం ప్రకారం ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తి అనవచ్చు.

2. ఫిషర్ నిర్వచనం :
తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.

3. మార్షల్ నిర్వచనం :
ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడుకున్న నికర వస్తుసేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం.

ప్రశ్న 5.
తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు ? జనాభా, తలసరి ఆదాయం మధ్య గల సంబంధం ఎలాంటిది ?
జవాబు.
ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం తెలుపుతుంది. ప్రస్తుత సంవత్సరపు జాతీయాదాయాన్ని ప్రస్తుత సంవత్సర జనాభాచే భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తాం.
2010-11 సంవత్సరానికి తలసరి ఆదాయం = 2010-11 సం॥ మార్కెట్ ధరల్లో జాతీయాదాయం / 2010-11 సంవత్సరంలో జనాభా

తలసరి ఆదాయపు భావన దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుపుతుంది. కాని ఇది సగటు రూపంలో ఉండటం వల్ల దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని గమనించాలి. వాస్తవానికి సగటు ఆదాయం కంటే ఎక్కువ లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు అధిక సంఖ్యలో ఉంటే ఇది నమ్మదగిన ఫలితాన్ని ఇవ్వదు.

తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరలలోనే కాకుండా ఆధార సంవత్సర ధరల ద్వారా కూడా లెక్కించవచ్చు. తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం దిగువ తెలిపిన సూత్రాన్ని వాడతాం.
నిజ తలసరి ఆదాయం = నిజ జాతీయాదాయం / జనాభా

ఒక దేశంలో ఒక నిర్దేశిత సంవత్సర కాలంలో (అంటే ఒక విత్త సంవత్సరంలో నిజ (జాతీయాదాయాన్ని) ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే నిజ తలసరి ఆదాయం.

తలసరి ఆదాయానికి, జనాభాకు మధ్య గల సంబంధం :
జాతీయాదాయానికి, జనాభాకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. ఈ రెండు భావనల ద్వారా తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. జాతీయాదాయంలో పెరుగుదల రేటు 6 శాతం కాగా, జనాభా వృద్ధిలోని పెరుగుదల రేటు 3% అయితే, తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 3 శాతం అవుతుంది.

దీనిని ఈ విధంగా పేర్కొనవచ్చు.
gpc = gni – gp
gpc = తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు
gni = జాతీయాదాయంలో పెరుగుదల రేటు
gp = జనాభా పెరుగుదల రేటు

తలసరి ఆదాయంలో పెరుగుదల ప్రజల జీవన ప్రమాణంలో పెరుగుదలను సూచిస్తుంది. అయితే జాతీయా దాయంలోని పెరుగుదల రేటు, జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. క్రింది పటం స్థూల ఆర్థిక చలాంకాల మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 7th Lesson జాతీయాదాయ విశ్లేషణ 1

ఇచ్చట,
NIA = నికర విదేశీ ఆదాయాలు
D = తరుగుదల
ID = పరోక్ష పన్నులు
SUB =
UP = పంపిణీ కాని లాభాలు
CT = కార్పొరేటు పన్నులు
TrH = వ్యక్తులకు లభించే బదిలీ చెల్లింపులు
PTP = ప్రత్యక్ష పన్నులు
GDP = స్థూల దేశీయోత్పత్తి
GNP = స్థూల జాతీయోత్పత్తి
NNP = నికర జాతీయోత్పత్తి
NI = జాతీయాదాయం
PI = వ్యష్టి ఆదాయం
DI = వ్యయార్హ ఆదాయం

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 6.
ఏవేని రెండు జాతీయాదాయ మదింపు పద్ధతులను విశ్లేషించండి.
జవాబు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి

  1. ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  2. వ్యయాల పద్ధతి
  3. ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం ద్వారా, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం ద్వారా, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను, వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు.”

1. ఉత్పత్తి మదింపు పద్ధతి (Product Method) :
దీన్ని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.

స్థూల జాతీయోత్పత్తి (GNP) = (P1Q1 + P2Q2 + ………….. + PnQn)

విదేశీ నికర ఆదాయం .
GNP = స్థూల జాతీయోత్పత్తి
P = ధర
Q = పరిమాణం
1, 2, ………….. n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు. ఈ పద్ధతిలో ముడిసరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు. ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన కేవలం అంతిమ వస్తు సేవల విలువలను మాత్రమే లెక్కించాలి.

2. ఆదాయ మదింపు పద్ధతి (Income Method) :
ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం.

జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం.
ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయంలో ఉత్పత్తి కారకాల వాటాలను పంపిణీ పద్ధతి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

3. వ్యయాల మదింపు పద్ధతి (Expenditure Method) :
ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.

NI = EH + EF + EG + Net exports.
ఇచ్చట, NI = జాతీయాదాయం
EH = గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = వస్తు సేవలపై ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం.

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం.
కాబట్టి జాతీయ వ్యయానికి జాతీయాదాయం సమానమనే ప్రమేయం ద్వారా ఈ మదింపు జరుగుతుంది. కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయం అంటే ఏమిటి ?
జవాబు.
జాతీయాదాయం అనే భావన అనేక రకాలుగా నిర్వచింపబడ్డది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరే ఆదాయమే జాతీయాదాయం.

వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలైన భాటకం, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు వంటివి ఇందులో కలిసి ఉంటాయి. జాతీయాదాయ నిర్వచనాలను స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి :

  1. మార్షల్, పిగూ, ఫిషర్ ప్రతిపాదించిన సంప్రదాయ నిర్వచనాలు
  2. ఆధునిక నిర్వచనాలు.

1. మార్షల్ నిర్వచనం :
“ఒక దేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక
ఆదాయం”.

2. పిగూ నిర్వచనం :
పిగూ నిర్వచనం ప్రకారం ‘ద్రవ్య రూపంలో కొలవడానికి వీలయ్యి విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయాదాయం’ అంటారు.

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలను పేర్కొనండి.
జవాబు.
జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు :
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయాదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైన వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

ఎ) సహజ వనరులు : సహజ వనరులు, శీతోష్ణస్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగాను, అనుకూలంగాను లభ్యమయ్యే దేశాలలో, అన్ని రంగాలలో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయాదాయం పెరుగుతుంది.

బి) ఉత్పత్తికారకాల నాణ్యత, లభ్యత :
ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి :
ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయాదాయ పరిమాణం నిర్ణయింపబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం :
ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు, మానవ
వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 3.
స్థూల జాతీయోత్పత్తి (GNP) భావనను వివరించండి.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
(GNP) = C + I + G + (X – M).

ప్రశ్న 4.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ఏమిటి ?
జవాబు.
నికర జాతీయోత్పత్తి అంతా మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు చెల్లిస్తాయి. అదే విధంగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తు సేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అందువలన వాస్తవ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయించబడతాయి.

ప్రభుత్వ సంస్థల లాభాలు నికర జాతీయాదాయం నుంచి మినహాయించాలి.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీ.

ప్రశ్న 5.
వ్యష్టి ఆదాయం అంటే ఏమిటి ?
జవాబు.
వ్యష్టి ఆదాయం (Personal Income):
ప్రత్యక్ష పన్నుల చెల్లింపుకు పూర్వం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరులు పొందే మొత్తం ఆదాయాన్ని ఇది తెలుపుతుంది. జాతీయాదాయం పూర్తిగా వీరికి లభించదు. ఈ విధమైన ఆదాయం నుంచి సంస్థలు ప్రభుత్వానికి కార్పొరేట్ పన్నును చెల్లించాలి.

అలాగే సంస్థలు అవి పొందిన లాభాల మొత్తాన్ని వాటాదారులకు పంచకుండా సంస్థల విస్తరణకు లేదా అనుకోని పరిస్థితులను ఎదుర్కొనుటకు కొంత మొత్తం పంపిణీ చేయని కార్పొరేట్ లాభాల రూపంలో ఉంచుతాయి. కాగా వేతనం పొందే ఉద్యోగస్తులు సాంఘిక భద్రత కోసం కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.

ప్రభుత్వం ఏ విధమైన ఉత్పాదక సేవలనందించని వారికి సాంఘిక భద్రతను కల్పించడానికి పెన్షన్లు, నిరుద్యోగభృతి, స్కాలర్షిప్స్, ఉపశమన చెల్లింపులు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ చెల్లింపులు మొదలైనవి చెల్లిస్తుంది. వీటినే బదిలీ చెల్లింపులు (transfer payments) అంటారు.

వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం (ఉత్పత్తి కారకాల వ్యయం దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి) – పంపిణీ చేయబడని కార్పొరేటు లాభాలు – కార్పొరేట్ పన్నులు – సాంఘిక భద్రత విరాళాలు + బదిలీ చెల్లింపులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 6.
సబ్సిడీలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు అమ్మితే నష్టం వస్తుంది. దీని సర్దుబాటుకోసం ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సబ్సిడీలు అంటారు.

ప్రశ్న 7.
వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఏమిటి ?
జవాబు.
తలసరి ఆదాయాన్ని స్థిరమైన ధరలలో కూడా లెక్కించి తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేక సంవత్సర నిజ జాతీయాదాయాన్ని ఆ సంవత్సరపు జనాభాచే భాగించుట వల్ల ఆ సంవత్సర నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకొనుట.
నిజ తలసరి ఆదాయం = నిజ జాతీయాదాయం / జనాభా.

ప్రశ్న 8.
జాతీయాదాయం నందలి భాగాలను తెలపండి.
జవాబు.
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల నికర విలువను జాతీయాదాయం అంటారు.

జాతీయాదాయం-భాగాలు : జాతీయాదాయంలో 5 ప్రధాన భాగాలున్నాయి. అవి :
ఎ) వినియోగం – C
బి) స్థూల దేశీయ పెట్టుబడి – I
సి) ప్రభుత్వ వ్యయం – G
డి) నికర విదేశీ పెట్టుబడి – (X – M)
ఇ) నికర విదేశీ ఆదాయం.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 9.
జాతీయాదాయ గణనలో ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్దతిలో కారకాల స్వయం ఉపాధి వలన వచ్చే ఆదాయాలను కలపాలి. అలాగే బదిలీ చెల్లింపులను జాతీయాదాయానికి కలుపకూడదు.
జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం.

ప్రశ్న 10.
భారతదేశంలో జాతీయాదాయ అంచనాను ఏవిధంగా చేస్తారు ?
జవాబు.
స్వాతంత్ర్యానంతరం 1949వ సంవత్సరంలో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. ప్రస్తుతం జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యత CSO చూస్తుంది. భారతదేశంలో జాతీయాదాయం ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, రవాణా సమాచారం, విత్తం, రియల్ ఎస్టేట్, సామాజిక వ్యష్టి సేవలు.

ప్రశ్న 11.
తలసరి ఆదాయం (Per Capita Income) మరియు జాతీయాదాయాలను విభేదించండి.
జవాబు.
ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం తెలుపుతుంది. ప్రస్తుత సంవత్సరపు జాతీయాదాయాన్ని ప్రస్తుత సంవత్సర జనాభాచే భాగించడం ద్వారా దీనిని లెక్కిస్తాం.

2017 – 18 సంవత్సరానికి తలసరి ఆదాయం = 2017 – 2018 సం||లో ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం / 2017 – 18 సంవత్సరంలో జనాభా.

ఇది ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని కొలవడాన్ని సూచిస్తుంది. ఈ భావన ఒక దేశ ప్రజల సగటు ఆదాయం మరియు వారి జీవన ప్రమాణాన్ని వివరించే ఒక మంచి సూచిక. కాని ఇది విశ్వసించదగినది కాదు. ఎందుకంటే, సగటు ఆదాయంతో పోల్చినపుడు వాస్తవ ఆదాయం సగటు కంటే అధికంగానో లేదా తక్కువగానో ఉండవచ్చు.

తలసరి ఆదాయాన్ని స్థిరమైన ధరలలో కూడా లెక్కించి తద్వారా నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేక సంవత్సర నిజ జాతీయాదాయాన్ని ఆ సంవత్సరపు జనాభాచే భాగించుట వల్ల ఆ సంవత్సర నిజ తలసరి ఆదాయాన్ని తెలుసుకోగలం. ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 12.
బదిలీ చెల్లింపులు అంటే ఏమిటి ? ఉదాహరణలిమ్ము.
జవాబు.
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.

ప్రశ్న 13.
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
స్వాతంత్య్రానంతరం 1949వ సంవత్సరంలో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. ప్రస్తుతం జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యత CSO చూస్తుంది. భారతదేశంలో జాతీయాదాయం ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించబడుతుంది.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, రవాణా సమాచారం, విత్తం, రియల్ ఎస్టేట్, సామాజిక వ్యష్టి సేవలు.

ప్రశ్న 14.
సి.ఎస్.ఓ (C.S.O)ను విస్తరించండి. దాని బాధ్యత ఏమిటి ?
జవాబు.
స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం 1949 సంవత్సరంలో P.C. మహలనోబిస్, గాద్గిల్, వి.కె.ఆర్. రావులతో జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. భారతదేశంలో జాతీయాదాయాన్ని మదింపు చేయడం దీని లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర గణాంక సంస్థకు (CSO) జాతీయాదాయాన్ని లెక్కించే బాధ్యతను అప్పగించారు.

భారతదేశంలో జాతీయాదాయం రెండు పద్ధతులలో లెక్కింపబడుతుంది. అవి :

  • ఆదాయ మదింపు పద్ధతి
  • ఉత్పత్తి మదింపు పద్ధతి.

కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రకాలుగా విభజించి, వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి :

  1. ప్రాథమిక రంగం : వ్యవసాయం, అడవులు, లాగింగ్, (Logging) చేపలు పట్టడం, గనుల తవ్వకం.
  2. ద్వితీయ రంగం : తయారీ సంస్థలు (రిజిస్టరయినవి, రిజిస్టరు కానివి), నిర్మాణం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా.
  3. రవాణా, సమాచారం, వ్యాపారం : రైల్వేలు, ఇతర పద్ధతుల ద్వారా రవాణా, నిలవ (storage), కమ్యూనికేషన్స్, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు.
  4. విత్తం, రియల్ ఎస్టేట్: బాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాల ఆధిపత్యం, వ్యాపార సేవాలు.
  5. సామాజిక, వ్యష్టి సేవలు : రక్షణ, ప్రభుత్వ పరిపాలన, ఇతర సేవలు.

TS Board Inter First Year Economics Study Material Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

ప్రశ్న 15.
తరుగుదల అంటే ఏమిటి ?
జవాబు.
యంత్రాలు నిరంతరం ఉపయోగించినప్పుడు అవి అరిగిపోయే అవకాశం ఉంది. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చును తరుగుదల అంటారు.

Leave a Comment