TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 4th Lesson భాగస్వామ్య సంస్థ Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 4th Lesson భాగస్వామ్య సంస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, దాని ప్రయోజనాలను, లోపాలను చర్చించండి.
జవాబు.
1) కొంత మంది వ్యక్తులు కలిసి ఉమ్మడిగా చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారము అని చెప్పవచ్చును.
2) 1932 భారత భాగస్వామ్య చట్టం ప్రకారం భాగస్వామ్యాన్ని ఈ విధముగా నిర్వచించినారు.

“అందరుగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారం నిర్వహిస్తూ, అందులోని లాభాలు పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య సంబంధమే భాగస్వామ్యము”.
భాగస్వామ్య సంస్థ ప్రయోజనాలు:
1) స్థాపన సులభం: భాగస్వామ్య వ్యాపారాన్ని స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. నమోదు తప్పని సరికాదు. దీనిని స్థాపించడానికి వ్రాత పూర్వకమైన లేదా నోటిమాటల ద్వారా ఏర్పరచుకున్న సాధారణ ఒప్పందము సరిపోతుంది.

2) అధిక వనరుల లభ్యము: భాగస్తులందరూ పెట్టుబడి పెడతారు కాబట్టి, సొంత వ్యాపారానికంటే భాగస్వామ్యానికి ఎక్కువ నిధులు లభిస్తాయి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

3) సత్వర మరియు మంచి నిర్ణయాలు: ప్రతి భాగస్తునికి వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ఉంటుంది. అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు అందరి అనుమతి తీసుకుంటారు. భాగస్తులందరూ స్థానికులే కాబట్టి తరచూ కలుసుకుంటూ ఉంటారు. వ్యాపార నిర్ణయాలు జాప్యము లేకుండా తీసుకోవచ్చు. త్వరిత నిర్ణయాల వలన వ్యాపార లాభాలు పెరుగుతాయి.

4) ప్రత్యేకీకరణ ప్రయోజనాలు: అందరు భాగస్తులు వారికి వ్యక్తిగతంగా ఉన్న ప్రత్యేక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని అనుసరించి వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్యములో మూలధనము, నిర్వహణా సామర్థ్యము, సాంకేతిక నైపుణ్యము తదితర లక్షణాలు గల భాగస్తుల కలయిక వలన ప్రత్యేకమైన సేవలను ఉపయోగించుకొని సంస్థ రాణిస్తుంది.

5) మార్పునకు అనుకూలము: అవసరాన్ని బట్టి వ్యాపారములో మార్పులు చేయడానికి న్యాయపరమైన అవరోధాలు తక్కువ. వ్యాపారస్వభావాన్ని, ప్రదేశాన్ని సులభముగా మార్చుకోవచ్చును.

6) నష్టాల పంపిణీ: భాగస్వామ్య వ్యాపారములో వచ్చిన నష్టాలను భాగస్తులందరూ సమానంగా గాని లేదా అంగీకరించిన నిష్పత్తిలో గాని పంచుకుంటారు. విడివిడిగా ఒక్కొక్క భాగస్తుడు భరించే నష్టము తక్కువ.

7) అధిక శ్రద్ధ: వ్యాపార లాభనష్టాలను భాగస్తులు భరిస్తారు. అందువల్ల భాగస్తులు వ్యాపారాన్ని ప్రత్యక్షముగాను, అతి సన్నిహితముగాను పర్యవేక్షణ చేస్తారు. అందువలన వృథాలు తగ్గి, వ్యాపారము విజయవంతము అవుతుంది.

8) ఆసక్తుల పరిరక్షణ: భాగస్వామ్యములో ప్రతిభాగస్తుని హక్కులు, ఆసక్తులు పూర్తిగా కాపాడబడతాయి. ఏ భాగస్తుడైనా ఒక నిర్ణయం పట్ల అసంతృప్తి చెందితే, అతడు రద్దును కోరవచ్చు లేదా వైదొలగవచ్చు.

9) వ్యాపార రహస్యాలు: వ్యాపార రహస్యాలు భాగస్తులకు మాత్రమే తెలిసి ఉంటుంది. లాభనష్టాలను, ఆస్తి అప్పుల వివరాలను బయటకు వెల్లడిచేయరు. రహస్యాలను జాగ్రత్తగా కాపాడతారు.

పరిమితులు / లోపాలు: భాగస్వామ్య సంస్థలకు క్రింది పరిమితులున్నవి:
1) అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణ బాధ్యత అపరిమితము. సంస్థ నష్టాలపాలై వ్యాపార అప్పులను సంస్థ.. ఆస్తుల నుంచే కాక భాగస్తుల సొంత ఆస్తుల నుంచి తీర్చవలసి ఉంటుంది.

2) అస్థిరత్వము: భాగస్తులలో ఎవరు మరణించినా, విరమించినా లేదా దివాలా తీసినా భాగస్వామ్యము రద్దు అవుతుంది. అసంతృప్తి చెందిన ఏ భాగస్తుడైనా సంస్థను రద్దుపరచడానికి ఏ సమయములోనైనా నోటీసు ఇవ్వవచ్చును.

3) పరిమిత మూలధనము: వాటాదారుల సంఖ్యకు పరిమితిలేని జాయింట్ స్టాకు కంపెనీలతో పోలిస్తే భాగస్వామ్య సంస్థ నిధులను సేకరించే శక్తి తక్కువ. భాగస్వామ్యములో 20 మందికి మించి భాగస్తులు ఉండరాదు.

4) ఉద్దేశిత అధికార భారం: సంస్థ తరపున లావాదేవీలు జరపడానికి ప్రతిభాగస్తునకు హక్కు ఉంటుంది. ఇది ఆసరాగా తీసుకొని కొంతమంది భాగస్తులు నిర్లక్ష్యముగాను, దురుద్దేశముతో వ్యవహరిస్తే సంస్థ నష్టాలపాలయ్యే అవకాశమున్నది. అవిశ్వాస భాగస్తుని చర్యల వలన భాగస్వామ్య సంస్థ ఇబ్బందులపాలు కావచ్చు. అందరు భాగస్తులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

5) వాటాను బదిలీ చేయరాదు: ఏ భాగస్తుడు సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయడానికి వీలులేదు. దీనికి ప్రత్యామ్నాయం సంస్థను రద్దు పరచడమే.

6) తగాదాలకు అవకాశం: ప్రతి భాగస్తుడు నిర్వహణలో పాల్గొనవచ్చు. ఏ విషయములోనైనా తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. ఇది కొన్నిసార్లు భాగస్తుల మధ్య అభిప్రాయభేదాలు, తగాదాలకు దారితీయవచ్చును.

7) ప్రజలకు విశ్వాసము లేకపోవడం: భాగస్వామ్యములో లెక్కలను ప్రచురించరు. అంతా గోప్యముగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు వీటిపై విశ్వాసము ఉండదు.

ప్రశ్న 2.
భారత భాగస్వామ్య చట్టం, 1932 ప్రకారం భాగస్వామ్య నమోదు తప్పనిసరియా? సంస్థ నమోదుకు సంబంధించిన విధానాన్ని వివరించండి.
జవాబు.
భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి అని భారత భాగస్వామ్య చట్టము, 1932లో చెప్పలేదు. కాని సంస్థ నమోదు పోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువలన నమోదు ఆవశ్యకము అవుతుంది. నమోదును ఏ సమయములోనైనా చేయించవచ్చును. సంస్థను నమోదు చేయడానికి క్రింది విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది.
1. నమోదు పద్ధతి: భాగస్వామ్య సంస్థ నమోదు కొరకు భాగస్తులు దిగువ సమాచారముతో ఒక నివేదికను తయారుచేసి, రిజిస్టార్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

  • భాగస్వామ్య సంస్థ పేరు.
  • సంస్థ వ్యాపారము చేసే ప్రదేశము లేదా ప్రదేశాలు.
  • భాగస్తుల పూర్తి పేర్లు, చిరునామాలు.
  • ప్రతి భాగస్తుడు సంస్థలో చేరిన తేది.
  • సంస్థ ప్రారంభమైన తేది, వ్యాపారస్వభావము.
  • భాగస్వామ్య వ్యాపార సంస్థ కాలపరిమితి.
  • భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఇతర అంశాలు.

2) భాగస్తులు ఈ దరఖాస్తు పత్రముపై సంతకాలు చేసి, నిర్ణీత రుసుము చెల్లించి రిజిష్ట్రారుకు దాఖలు చేయాలి.

3) చట్ట ప్రకారము ఉన్న నియమ నిబంధనలతో దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రిజిష్ట్రారు సంతృప్తిపడితే, సంస్థ పేరును, భాగస్తుల పేర్లను రిజిష్టరులో నమోదు చేసి, అధికార ముద్రవేసిన నమోదు పత్రాన్ని రిజిష్టారు సంబంధిత సంస్థకు జారీ చేస్తాడు.

ప్రశ్న 3.
భాగస్తులలో వివిధ రకాలను వివరించండి.
జవాబు.
భాగస్తులకు భాగస్వామ్యములో ఉండే ఆసక్తిని బట్టి వారి బాధ్యతలు, విధులనుబట్టి, నిర్వహణలో వారికున్న హక్కులనుబట్టి భాగస్తులను అనేక రకాలుగా వర్గీకరిస్తారు.
I. సంస్థ రోజువారి నిర్వహణ కార్యకలాపాల్లో పాల్గొనే విధానం ఆధారంగా:
1) సక్రియ భాగస్తుడు: భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు.

2) నిష్క్రియ భాగస్తుడు: భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని ‘నిష్క్రియ భాగస్తుడు’ అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.

II. సంస్థ లాభాలను పంచుకునే విధానం ఆధారంగా:
1) నామమాత్రపు భాగస్తుడు: యదార్థముగా భాగస్వామ్య సంస్థలో భాగస్తుడు కాకపోయినా తన పేరును, పరపతిని వినియోగించడానికి అంగీకరిస్తే అటువంటి భాగస్తుని నామమాత్రపు భాగస్తుడు అంటారు. ఇతడు మూలధనాన్ని సమకూర్చడు. నిర్వహణలో పాలుపంచుకోడు. లాభాలను పంచుకోడు. అయినప్పటికీ సంస్థ బయటవారితో చేసే కార్యకలాపాలకు ఇతను కూడా బాధ్యత వహిస్తాడు.

2) లాభాలలో భాగస్తుడు: సంస్థ నష్టాలతో సంబంధము లేకుండా లాభాలలో మాత్రమే వాటా పొందే భాగస్తుని లాభాలలో భాగస్తుడు అంటారు. ఇది మైనర్లకు మాత్రమే వర్తిస్తుంది. కారణము మైనర్లు సంస్థ లాభాలలోని భాగాన్ని పొందుతారు. వారి ఋణ బాధ్యత వారి మూలధనానికి మాత్రమే పరిమితము అవుతుంది.

III. ఋణబాధ్యత ఆధారంగా:
1) పరిమిత భాగస్తుడు: భాగస్వామ్యములో భాగస్తుని ఋణబాధ్యత సాధారణముగా అపరిమితముగా, సమిష్టిగా, వ్యక్తిగతముగా ఉంటుంది. కాని భాగస్తుని ఋణబాధ్యత అతడు సమకూర్చిన మూలధనానికే పరిమితము అయితే అతనిని పరిమిత భాగస్తుడు అంటారు. భారతదేశంలో పరిమిత ఋణబాధ్యత చట్టం 2008లో రూపొందించబడి 31 మార్చి 2009న ప్రకటించబడింది.

2) సాధారణ భాగస్తుడు: అపరిమిత ఋణ బాధ్యత ఉన్న భాగస్తులను సాధారణ భాగస్తులు అంటారు.

IV. భాగస్తుల ప్రవర్తన, వ్యవహరించే ఆధారంగా:
1) భావిత భాగస్తుడు: ఒక వ్యక్తి తన మాటల ద్వారాగాని, చేష్టల ద్వారాగాని ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోయినా భావిత భాగస్తుడే బాధ్యత వహించాలి.

2) మౌన నిర్ణీత భాగస్తుడు: ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా ఉండే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు కాని సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యత వహించాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

ప్రశ్న 4.
భాగస్వామ్య ఒప్పందం అంటే ఏమిటి? అందులోని ముఖ్యాంశాలను తెలపండి.
జవాబు.
భాగస్వామ్యం యొక్క నియమ నిబంధనలతో కూడిన పత్రాన్ని భాగస్వామ్య ఒప్పందం అంటారు. హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటి మాటలద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అయితే ఇది వ్రాత పూర్వకముగా ఉంటే మంచిది. దీని మీద భాగస్తులందరూ సంతకాలు చేయాలి. దీనిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు. సంస్థ వ్యాపార నిర్వహణలో భాగస్తుల మధ్య సంబంధము, వారి హక్కులు, విధులు, బాధ్యతలను ఈ ఒప్పందము నిర్వచిస్తుంది. దీనితో బయట వ్యక్తులకు సంబంధము లేదు. ఇందులో పేర్కొన్న అంశాలు భాగస్వామ్య చట్టములోని అంశాలకు విరుద్ధముగా ఉండరాదు. భారత స్టాంపుల చట్టము 1989 ప్రకారము తగిన స్టాంపులను ఈ పత్రముపై అతికించవలసి ఉంటుంది. ప్రతి భాగస్తుని వద్ద ఒప్పందపు నకలు ఉంటుంది. సాధారణముగా ఒప్పందములో దిగువ పేర్కొనబడిన అంశాలు ఉంటాయి:

  1. వ్యాపార సంస్థ పేరు.
  2. వ్యాపార స్వభావము.
  3. వ్యాపార కాలపరిమితి.
  4. భాగస్తుల పేర్లు, చిరునామాలు.
  5. వ్యాపార ప్రదేశము.
  6. భాగస్తులు సమకూర్చవలసిన మూలధనము.
  7. లాభనష్టాల పంపిణీ నిష్పత్తి.
  8. భాగస్తుల పెట్టుబడిపై చెల్లించవలసిన వడ్డీ.
  9. భాగస్తుల సొంతవాడకాలు, అట్టి సొంతవాడకాలపై భాగస్తుడు చెల్లించవలసిన వడ్డీ.
  10. భాగస్తులకు చెల్లించే జీతాలు, పారితోషికము.
  11. భాగస్తుల హక్కులు, విధులు, బాధ్యతలు.
  12. సంస్థ ఖాతాలను తయారు చేసే పద్ధతి, ఆడిట్ చేయించుట.
  13. భాగస్వామ్య సంస్థ రద్దుపరిచే విధానము.
  14. భాగస్తుల మధ్య తగాదాలు ఏర్పడినపుడు మధ్యవర్తుల ద్వారా పరిష్కార పద్ధతి.

ప్రశ్న 5.
భాగస్తుల హక్కులను, విధులను తెలపండి.
జవాబు.
భాగసుని హక్కులు:

  1. ప్రతి భాగస్తునకు వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ఉంటుంది.
  2. వ్యాపార నిర్ణయాలు చేయడంలో ప్రతి భాగస్వామికి తన అభిప్రాయాలను యథేచ్చగా వెలిబుచ్చు హక్కు కలదు.
  3. ప్రతి భాగస్తుడు సంస్థ లెక్కలను తనిఖీ చేసే హక్కు ఉన్నది. అవసరమైన నకళ్ళు తీసుకునే హక్కు కూడా ఉన్నది.
  4. వ్యాపారములో వచ్చే లాభనష్టాల పంపిణీ గురించి పై ఒప్పందములో లేకపోతే, సమానముగా పంచుకోవడానికి హక్కు ఉన్నది.
  5. భాగస్వామ్యసంస్థకు ఏ భాగస్తుడైనా అప్పు ఇచ్చినట్లయితే దానిపై వడ్డీని పొందే హక్కు ఉంటుంది.
  6. సాధారణ వ్యాపార నిర్వహణలో ప్రతి భాగస్తుడు తాను చేసిన ఖర్చులను లేదా తనకు సంభవించిన నష్టాలను సంస్థ నుంచి రాబట్టుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు.
  7. భాగస్తులకు సంస్థ యొక్క ఆస్తులపై సమిష్టి హక్కు ఉన్నది.
  8. సంస్థ కొరకు ప్రతి భాగస్తుడు సంస్థ ప్రతినిధిగా పనిచేసి తన చర్యలచే సంస్థకు బాధ్యత వహింపజేయు హక్కు ఉన్నది.
  9. అత్యవసర సమయంలో భాగస్వామ్య సంస్థను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రతి భాగస్తునికి ఉంటుంది.
  10. ఇతర భాగస్తుల అనుమతి లేకుండా జరిగే నూతన భాగస్తుని ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు.

భాగస్తుని విధులు:

  1. అందరూ భాగస్తుల ప్రయోజనార్థమై ప్రతి భాగస్తుడు తన విధులను నీతిగాను, నిజాయితీగాను నిర్వహించవలెను.
  2. ఇతర భాగస్తులతో అత్యంత విశ్వాసముగా వ్యవహరించాలి.
  3. వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభనష్టాలను సమానంగా గాని లేదా భాగస్వామ్య ఒప్పందములో పేర్కొనబడిన నిష్పత్తిలో గాని పంచుకోవాలి.
  4. ఒక భాగస్వామి యొక్క అశ్రద్ధ వలన సంభవించిన నష్టమును ఆ భాగస్వామియే పూర్తిగా భరించవలెను.
  5. ప్రతి భాగస్తుడు వ్యాపారము తాలూకు లెక్కలను నిజాయితీగా వ్రాయవలెను.
  6. భాగస్తుడు తన సంస్థకు పోటీ వ్యాపారము చేయరాదు.
  7. ఏ భాగస్వామి వ్యాపార ఆస్తులను, పేరును ఉపయోగించి రహస్య లాభాలు లేదా కమీషన్ పొందరాదు.
  8. భాగస్తుల లిఖిత పూర్వకమైన అంగీకారము లేకుండా కొత్త వారిని భాగస్తునిగా చేర్చుకోరాదు.
  9. సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు.
  10. ప్రతి భాగస్తుడు తన అధికార పరిధిలోనే నడుచుకోవాలి.

ప్రశ్న 6.
పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యాన్ని నిర్వచించి, దాని లక్షణాలను తెలపండి.
జవాబు.
అర్థం: భారత ప్రభుత్వం పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్య చట్టం, 2008లో రూపొందించి, 31 మార్చి 2009లో ప్రకటించటం జరిగింది. ఈ చట్టం ప్రకారం పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం ఒక కార్పొరేట్ సంస్థ మాదిరిగా ప్రత్యేక న్యాయసత్వాన్ని కలిగి ఉంటుంది. పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం స్థాపించడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది లాభాన్ని ఆర్జించే ఉద్దేశ్యంతో చట్టపరమైన వ్యాపారాన్ని కొనసాగించాలనే వారు తమ పేర్లను ఒక పత్రంలో నమోదు చేసి సంబంధిత రిజిస్టార్కు సమర్పించాలి.

నిర్వచనం: పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్య చట్టం, 2008 సెక్షన్ 3 ప్రకారం “పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం అనేది ఒక చట్టం ప్రకారం నమోదు కాబడి, ఏర్పాటు చేయబడిన ఒక కార్పొరేట్ సంస్థ. ఇది భాగస్తుల నుండి ప్రత్యేక న్యాయసత్వాన్ని కలిగి ఉంటుంది”.

పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం లక్షణాలు:
1) పరిమిత ఋణబాధ్యత: పరిమిత బాధ్యత ఈ భాగస్వామ్యం యొక్క అతి ముఖ్యమైన లక్షణం. భాగస్తుల యొక్క ఋణబాధ్యత వారి వాటా విలువ మేరకు పరిమితంగా ఉంటుంది. సంస్థ యొక్క అప్పులను తీర్చడానికి భాగస్తుల యొక్క వ్యక్తిగత ఆస్తులను ఉపయోగించడం జరగదు.

2) ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం: ఒక కంపెనీ ూదిరిగా పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. భాగస్వామ్య సంస్థ మరియు భాగస్తులు ఒక్కటి కాదు, రెండు వేర్వేరు. ఈ సంస్థ పేరు మీద ఆస్తులను నమోదు చేసుకోవచ్చు, బయట వ్యక్తులతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.

3) సభ్యుల సంఖ్య: పరిమిత బాధ్యత భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఏదైనా సమయంలో, ఈ ఇద్దరిలో ఒకరు తప్పకుండా భారతీయ నివాసి అయి ఉండాలి. ఈ వ్యాపారంలో గరిష్ఠ సంఖ్య పరిమితి ఏమీ లేదు.

4) శాశ్వత పారంపర్యం: భాగస్వామ్య సంస్థ మాదిరిగా కాకుండా పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం భాగస్తుల మరణం, విరమణ, మతిస్థిమితం కోల్పోవడం వల్ల లేదా దివాలా తీయడం వల్ల గాని రద్దు కాదు. ఇది నిరంతరం కొనసాగుతుంది. ఇది ఆస్తులను కొనవచ్చు, ఇతరులతో ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. కాబట్టి ఇది శాశ్వత పారంపర్యం కలిగి ఉంటుంది.

5) పరస్పర హక్కులు మరియు విధులు: పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యంలో భాగస్తుల యొక్క పరస్పర హక్కులు, విధులు భాగస్తుల మధ్య ఒప్పందం ద్వారా గాని, లేదా భాగస్తులకు, సంస్థకు మధ్య ఒప్పందం ద్వారా గాని నియంత్రించబడతాయి. అయితే ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం కలిగిన సంస్థగా పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థ తన ఋణ బాధ్యతల నుండి తప్పించుకోరాదు.

6) అనధికార చర్యలకు బాధ్యత లేదు: ఇతర భాగస్తుల వ్యక్తిగత లేదా అనధికార కార్యకలాపాలకు ఒక భాగస్తుడు బాధ్యత వహించనవసరం లేదు. అందువల్ల వ్యక్తిగతంగా భాగస్తులు ఇతర భాగస్తుల తప్పుడు వ్యాపార నిర్ణయాల వల్ల మరియు తప్పుడు నడవడిక వల్ల ఏర్పడే ఉమ్మడి బాధ్యత నుండి రక్షింపబడతారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

ప్రశ్న 7.
భాగస్వామ్య సంస్థ రద్దు అంటే ఏమిటి? వివిధ భాగస్వామ్య సంస్థ రద్దు విధానాలను చర్చించండి.
జవాబు.
భాగస్వామ్యము రద్దు, భాగస్వామ్య సంస్థ రద్దుకు తేడా ఉన్నది. భాగస్తుని మరణము, విరమణ, మతిభ్రమించడం, దివాలా తీయడం వలన భాగస్వామ్యము రద్దు అవుతుంది. కాని భాగస్వామ్య సంస్థ రద్దుకానవసరము లేదు. సంస్థను పునర్వవస్థీకరణ చెంది అదే పేరు మీద వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. కాబట్టి భాగస్వామ్య రద్దులో సంస్థ రద్దు కావచ్చును లేదా కాకపోవచ్చును. కాని భాగస్వామ్య సంస్థ రద్దయితే, భాగస్తుల మధ్య ఒప్పందం రద్దు అవుతుంది. వ్యాపారమును కొనసాగించే ప్రశ్న ఉండదు. సంస్థ ఆస్తులను అమ్మి, ఋణదాతలకు చెల్లించగా ఏమైనా మిగిలితే మిగిలిన భాగస్తులు పంచుకుంటారు.

భాగస్వామ్య సంస్థ రద్దు దిగువ పద్ధతుల ద్వారా జరుగుతుంది:
1) ఒప్పందము ద్వారా రద్దు: భాగస్వామ్య సంస్థను భాగస్తుల పరస్పర అంగీకారముతో లేదా ఒప్పందములో పేర్కొన్న షరతుల ప్రకారము రద్దు చేయవచ్చును.

2) నోటీసు ద్వారా రద్దు: ఏ భాగస్తుడైనా సంస్థను రద్దు చేయాలని వ్రాతపూర్వకముగా ఇతర భాగస్తులకు నోటీసు పంపడం ద్వారా కూడా రద్దు పరచవచ్చును.

3) ఆగంతుక రద్దు: ఒక భాగస్తుడు మరణించినా, మతిభ్రమించినా లేదా దివాలా తీసిన ఆ సంస్థను రద్దు చేయవచ్చును.

4) అనివార్య రద్దు: ఒక భాగస్తుడు లేదా భాగస్తులందరూ దివాలాదారుగా ప్రకటించబడినపుడు లేదా సంస్థ వ్యాపారము చట్ట వ్యతిరేకము అయినపుడు సంస్థ రద్దవుతుంది.

5) కోర్టు ద్వారా రద్దు: సంస్థలో ఏ భాగస్తుడైనా శాశ్వతముగా అశక్తుడు అయినా, అనుచితముగా ప్రవర్తించినా, ఉద్దేశ్యపూర్వకముగా ఒప్పందాన్ని అతిక్రమించినా, ఇతరుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేసినా కోర్టు సంస్థను రద్దు చేయవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు.
1) భాగస్వామ్యం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఆర్థిక, నిర్వహణ వనరులను సమకూర్చుతూ, వ్యాపారాన్ని నిర్వహిస్తూ, లాభనష్టాలను పంచుకోవడానికి అంగీకరించిన వారి మధ్య కుదిరిన ఒప్పందాన్ని భాగస్వామ్యం అంటారు. స్థాపించే వ్యక్తులను ‘భాగస్తులు’ అని, సమిష్టిగా ‘సంస్థ’ లేదా ‘భాగస్వామ్య సంస్థ’
అంటారు.

2) భారత భాగస్వామ్య చట్టం, 1932, సెక్షన్ 4 ప్రకారం ‘అందరుగాని, అందరి తరపున కొందరు గాని వ్యాపారం నిర్వహిస్తూ, అందులోని లాభాలు పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యం’.

3) ఆచార్య ఎల్. హెచ్.హనీ ప్రకారం – “లాభం ఆర్జించే నిమిత్తం చట్టబద్ధమైన వ్యాపారం చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యం”.

భాగస్వామ్య సంస్థ లక్షణాలు:
భాగస్వామ్య వ్యాపార సంస్థల లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
ఎ) స్థాపన: భాగస్వామ్య వ్యాపార సంస్థలు భారత భాగస్వామ్య చట్టం, 1932 నియమాలను అనుసరించి నియంత్రించబడతాయి. లాభాన్ని ఆర్జించే ఉద్దేశంతో చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిర్వహిస్తూ, లాభనష్టాలను పంచుకోవడానికి, వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కావలసిన నియమ నిబంధనలను పొందుపరచబడిన ‘న్యాయాత్మక ఒప్పందం’ ద్వారా భాగస్వామ్య సంస్థలు అమలులోకి వస్తాయి.

బి) సభ్యుల సంఖ్య: భాగస్వామ్య వ్యాపారంలో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. గరిష్ఠ సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారంలో 10 మంది, ఇతర వ్యాపారాలలో 20 మందికి మించకుండా ఉండాలి. భాగస్తులుగా చేరే వ్యక్తులు ఒప్పందం చేసుకోవడానికి అర్హులై ఉండాలి. మైనర్లు ఒప్పందం చేసుకోవడానికి అనర్హులు. కాబట్టి వారు భాగస్తులుగా చేరరాదు.

సి) అపరిమిత ఋణబాధ్యత: భాగస్తులు అపరిమిత ఋణబాధ్యత కలిగి ఉంటారు. అప్పులను చెల్లింపు చేయడానికి వ్యాపార ఆస్తులు సరిపోని పక్షంలో భాగస్తుల వ్యక్తిగత ఆస్తులను ఉపయోగించాలి. అప్పు చెల్లింపు విషయంలో భాగస్తులు వ్యక్తిగతంగా, సమిష్టిగా బాధ్యత వహించాలి.

డి) ఉద్దేశిత అధికారం: భాగస్వామ్య సంస్థ తరుపున వ్యవహరించే అధికారం ప్రతి ఒక్క భాగస్తుడికి ఉంటుంది. భాగస్తులు నిర్వహించిన కార్యకలాపాలకు సంస్థ బాధ్యత వహిస్తుంది.

ఇ) చట్ట సమ్మతమైన వ్యాపారం లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తులు చేసే భాగస్వామ్య వ్యాపారం చట్ట సమ్మతమై ఉండాలి. చట్టం దృష్టిలో దొంగ వ్యాపారం, నల్లబజారు వ్యవహారాల నిర్వహణకు కుదుర్చుకొన్న ఒప్పందాలు భాగస్వామ్య వ్యాపారంలో చట్టబద్ధమైనవి కావు.

ఎఫ్) పరస్పర విశ్వాసం: భాగస్వామ్య వ్యాపారానికి పునాది భాగస్తుల మధ్య మంచి విశ్వాసం మరియు పరస్పర నమ్మకం. ప్రతి భాగస్తుడు నిజాయితీగా వ్యవహరించి, ఇతర భాగస్తులకు వాస్తవ ఖాతాలను తెలియపరచాలి. భాగస్తుల మధ్య అవిశ్వాసం, అనుమానాలు సంస్థ నష్టాలకు దారితీస్తుంది.

జి) యజమాని – ప్రతినిధి సంబంధం: భాగస్వామ్య సంస్థలో భాగస్తుల మధ్య ప్రాతినిధ్య సంబంధం ఉంటుంది. ప్రతి భాగస్తుడు సంస్థ యజమానిగా అదే విధంగా ఇతర భాగస్తుల ప్రతినిధిగా వ్యవహరించాలి.

హెచ్) వాటాల బదిలీపై పరిమితులు: భాగస్వామ్య వ్యాపారంలో ఇతర భాగస్తుల సమ్మతిలేనిదే ఏ భాగస్తుడు తన వాటాను ఇతరులకు బదిలీ చేయరాదు. ఎవరైనా భాగస్తుడు తన సంస్థలో కొనసాగడం ఇష్టం లేనట్లయితే ఒక నోటీసు ఇవ్వడం ద్వారా భాగస్వామ్యం రద్దు కోరుకోవచ్చు.

ఐ) స్వచ్ఛంద నమోదు: భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి కాదు. కానీ నమోదు కాని సంస్థ కొన్ని రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల నమోదు చేయించడం మంచిది.
అందరి చేత నిర్వహణ: భాగస్వామ్యంలో ప్రతి భాగస్తుడు వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కును కలిగి ఉంటాడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరు భాగస్తుల అనుమతి తప్పనిసరిగా పొందాలి.

ప్రశ్న 2.
భాగస్వామ్యం నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు.
నమోదు పద్ధతి:
1) భాగస్వామ్య సంస్థ నమోదు కొరకు భాగస్తులు దిగువ సమాచారముతో ఒక నివేదికను తయారుచేసి, రిజిస్టార్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

  • భాగస్వామ్య సంస్థ పేరు.
  • సంస్థ వ్యాపారము చేసే ప్రదేశము లేదా ప్రదేశాలు.
  • భాగస్తుల పూర్తి పేర్లు, చిరునామాలు.
  • ప్రతి భాగస్తుడు సంస్థలో చేరిన తేది.
  • సంస్థ ప్రారంభమైన తేది, వ్యాపారస్వభావము.
  • భాగస్వామ్య వ్యాపార సంస్థ కాలపరిమితి.
  • భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఇతర అంశాలు.

2) భాగస్తులు ఈ దరఖాస్తు పత్రముపై సంతకాలు చేసి, నిర్ణీత రుసుము చెల్లించి రిజిష్ట్రారుకు దాఖలు చేయాలి. 3) చట్ట ప్రకారము ఉన్న నియమ నిబంధనలతో దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రిజిస్ట్రారు సంతృప్తిపడితే, సంస్థ పేరును, భాగస్తుల పేర్లను రిజిష్టరులో నమోదు చేసి, అధికార ముద్రవేసిన నమోదు పత్రాన్ని రిజిష్టారు సంబంధిత సంస్థకు జారీ చేస్తాడు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

ప్రశ్న 3.
భాగస్వామ్య ఒప్పందంలోని ముఖ్యాంశాలను తెలపండి.
జవాబు.
సాధారణముగా ఒప్పందములో దిగువ పేర్కొనబడిన అంశాలు ఉంటాయి.

  1. వ్యాపార సంస్థ పేరు.
  2. వ్యాపార స్వభావము.
  3. వ్యాపార కాలపరిమితి.
  4. భాగస్తుల పేర్లు, చిరునామాలు.
  5. వ్యాపార ప్రదేశము.
  6. భాగస్తులు సమకూర్చవలసిన మూలధనము.
  7. లాభనష్టాల పంపిణీ నిష్పత్తి.
  8. భాగస్తుల పెట్టుబడిపై చెల్లించవలసిన వడ్డీ.
  9. భాగస్తుల సొంతవాడకాలు, అట్టి సొంతవాడకాలపై భాగస్తుడు చెల్లించవలసిన వడ్డీ.
  10. భాగస్తులకు చెల్లించే జీతాలు, పారితోషికము.
  11. భాగస్తుల హక్కులు, విధులు, బాధ్యతలు.
  12. సంస్థ ఖాతాలను తయారు చేసే పద్ధతి, ఆడిట్ చేయించుట.
  13. భాగస్వామ్య సంస్థ రద్దుపరిచే విధానము.
  14. భాగస్తుల మధ్య తగాదాలు ఏర్పడినపుడు మధ్యవర్తుల ద్వారా పరిష్కార పద్ధతి.

ప్రశ్న 4.
భాగస్వామ్య సంస్థను రద్దు చేసే విధానాలను వివరించండి.
జవాబు.
భాగస్వామ్య సంస్థ రద్దు దిగువ పద్ధతుల ద్వారా జరుగుతుంది:
1) ఒప్పందము ద్వారా రద్దు: భాగస్వామ్య సంస్థను భాగస్తుల పరస్పర అంగీకారముతో లేదా ఒప్పందములో పేర్కొన్న షరతుల ప్రకారము రద్దు చేయవచ్చును.

2) నోటీసు ద్వారా రద్దు: ఏ భాగస్తుడైనా సంస్థను రద్దు చేయాలని వ్రాతపూర్వకముగా ఇతర భాగస్తులకు నోటీసు పంపడం ద్వారా కూడా రద్దు పరచవచ్చును.

3) ఆగంతుక రద్దు: ఒక భాగస్తుడు మరణించినా, మతిభ్రమించినా లేదా దివాలా తీసిన ఆ సంస్థను రద్దు చేయవచ్చును.

4) అనివార్య రద్దు: ఒక భాగస్తుడు లేదా భాగస్తులందరూ దివాలాదారుగా ప్రకటించబడినపుడు లేదా సంస్థ వ్యాపారము చట్ట వ్యతిరేకము అయినపుడు సంస్థ రద్దవుతుంది.

5) కోర్టు ద్వారా రద్దు: సంస్థలో ఏ భాగస్తుడైనా శాశ్వతముగా అశక్తుడు అయినా, అనుచితముగా ప్రవర్తించినా, ఉద్దేశ్యపూర్వకముగా ఒప్పందాన్ని అతిక్రమించినా, ఇతరుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేసినా కోర్టు సంస్థను రద్దు చేయవచ్చును. .

ప్రశ్న 5.
వివిధ భాగస్వామ్య రకాలను రాయండి.
జవాబు.
భాగస్వామ్యాన్ని కాలం, ఋణబాధ్యత, పరిమిత ఋణబాధ్యత ఆధారంగా వర్గీకరించవచ్చు.
TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ 1
I. కాలం ఆధారంగా భాగస్వామ్యం: కాలం ఆధారంగా భాగస్వామ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1) స్వేచ్ఛా / ఇష్టానుసార భాగస్వామ్యం: ఒక నిరవధిక కాలానికి ఏర్పాటు చేసిన భాగస్వామ్యాన్ని “స్వేచ్ఛా భాగస్వామ్యం” లేదా “ఇష్టానుసార భాగస్వామ్యం” అంటారు. ఈ భాగస్వామ్యం భాగస్తులు కోరుకున్నంత కాలం కొనసాగుతుంది. భాగస్తులు రద్దు చేయాలని నిర్ణయించినప్పుడు ఈ భాగస్వామ్యం ముగుస్తుంది. అందువల్ల భాగస్తుల ఇష్టానుసారంగా భాగస్వామ్యం మనుగడలో ఉంటుంది.

2) ప్రత్యేక భాగస్వామ్యం: ఒక ప్రత్యేక పని నిమిత్తం ఏర్పరచుకున్న భాగస్వామ్యాన్ని “ప్రత్యేక భాగస్వామ్యం” అంటారు. ఆ ప్రత్యేక పని పూర్తయిన వెంటనే ఈ రకమైన భాగస్వామ్యం ముగుస్తుంది.

II. ఋణబాధ్యత ఆధారంగా భాగస్వామ్యం: ఋణబాధ్యత ఆధారంగా భాగస్వామ్యాన్ని తిరిగి రెండు రకాలుగా చెప్పవచ్చు.
1) సాధారణ భాగస్వామ్యం: అందరు భాగస్తులూ నిర్వహణలో పాల్గొనే అవకాశం ఉండి, వారి ఋణబాధ్యత అపరిమితంగా ఉండే భాగస్వామ్యాన్ని సాధారణ భాగస్వామ్యం” అంటారు. భాగస్వామ్య సంస్థ అప్పులకు భాగస్తులందరు వ్యక్తిగతంగాను, సమిష్టిగాను బాధ్యులవుతారు. అప్పులు చెల్లించడానికి సంస్థ యొక్క ఆస్తులు సరిపోనట్లయితే భాగస్తుల యొక్క వ్యక్తిగత ఆస్తులను ఈ అప్పులు చెల్లించడానికి ఉపయోగిస్తారు. ఈ భాగస్వామ్య నిర్వహణలో అందరు భాగస్తులు పాల్గొనే హక్కు ఉంటుంది.

2) పరిమిత భాగస్వామ్యం: ఏ భాగస్వామ్యంలోనైతే కనీసం ఒక భాగస్తుని ఋణబాధ్యత పరిమితంగా ఉండి, ఇతర భాగస్తుల ఋణబాధ్యత అపరిమితంగా ఉంటుందో దానిని పరిమిత భాగస్వామ్యం అంటారు. పరిమిత బాధ్యత కలిగిన భాగస్తులను ప్రత్యేక భాగస్తులు అని, అపరిమిత ఋణబాధ్యత కలిగిన భాగస్తులను “సాధారణ భాగస్తులు” లేదా “సక్రియ భాగస్తులు” అంటారు. ప్రత్యేక భాగస్తుల ఋణబాధ్యత వారి వాటా విలువకే పరిమితం కాగా, సాధారణ భాగస్తుల ఋణబాధ్యత వారి వాటా విలువలకు మించి ఉంటుంది.

పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం:
పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం అంటే భాగస్వామ్య వ్యాపారంలోని స్వేచ్ఛా మరియు కంపెనీ వ్యాపారంలోని పరిమిత ఋణబాధ్యత ప్రయోజనాలను అందించే ప్రత్యామ్నాయ వ్యవస్థ. అపరిమిత ఋణబాధ్యత, అధిక నష్టభయం కారణం చేత భాగస్వామ్య వ్యాపార సంస్థ తన కార్యకలాపాలను ఎక్కువగా విస్తరించలేదు. అపరిమిత ఋణబాధ్యత వల్ల సంస్థ అప్పులను చెల్లించడానికి తమ సొంత ఆస్తులను ఉపయోగించడం వల్ల భాగస్తులు ఒక పరిమితికి మించి వ్యాపారాన్ని విస్తరించలేరు. మరోవైపు జాయింట్ స్టాక్ కంపెనీలో వాటాదారుల ఋణబాధ్యత పరిమితంగా ఉంటుంది. కానీ కంపెనీ నిర్వహణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందువల్ల భాగస్వామ్య మరియు జాయింట్ స్టాక్ కంపెనీలోని పరిమితులను, లోపాలను అధిగమించడానికి ఏర్పాటు చేయబడిన వ్యాపార వ్యవస్థే “పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం”.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

ప్రశ్న 6.
పరిమిత ఋణబాధ్యత గల భాగస్వామ్యం యొక్క లక్షణాలు ఏవి?
జవాబు.
పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం లక్షణాలు:
1) పరిమిత ఋణబాధ్యత: పరిమిత బాధ్యత ఈ భాగస్వామ్యం యొక్క అతి ముఖ్యమైన లక్షణం. భాగస్తుల యొక్క ఋణబాధ్యత వారి వాటా విలువ మేరకు పరిమితంగా ఉంటుంది. సంస్థ యొక్క అప్పులను తీర్చడానికి భాగస్తుల యొక్క వ్యక్తిగత ఆస్తులను ఉపయోగించడం జరగదు.

2) ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం: ఒక కంపెనీ మాదిరిగా పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. భాగస్వామ్య సంస్థ మరియు భాగస్తులు ఒక్కటి కాదు, రెండు వేర్వేరు. ఈ సంస్థ పేరు మీద ఆస్తులను నమోదు చేసుకోవచ్చు, బయట వ్యక్తులతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.

3) సభ్యుల సంఖ్య: పరిమిత బాధ్యత భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఏదైనా “సమయంలో, ఈ ఇద్దరిలో ఒకరు తప్పకుండా భారతీయ నివాసి అయి ఉండాలి. ఈ వ్యాపారంలో గరిష్ఠ సంఖ్య పరిమితి ఏమీ లేదు.

4) శాశ్వత పారంపర్యం: భాగస్వామ్య సంస్థ మాదిరిగా కాకుండా పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం భాగస్తుల మరణం, విరమణ, మతిస్థిమితం కోల్పోవడం వల్ల లేదా దివాలా తీయడం వల్ల గాని రద్దు కాదు. ఇది నిరంతరం కొనసాగుతుంది. ఇది ఆస్తులను కొనవచ్చు, ఇతరులతో ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. కాబట్టి ఇది శాశ్వత పారంపర్యం కలిగి ఉంటుంది.

5) పరస్పర హక్కులు మరియు విధులు: పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యంలో భాగస్తుల యొక్క పరస్పర హక్కులు, విధులు భాగస్తుల మధ్య ఒప్పందం ద్వారా గాని, లేదా భాగస్తులకు, సంస్థకు మధ్య ఒప్పందం ద్వారా గాని నియంత్రించబడతాయి. అయితే ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం కలిగిన సంస్థగా పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థ తన ఋణ బాధ్యతల నుండి తప్పించుకోరాదు.

6) అనధికార చర్యలకు బాధ్యత లేదు: ఇతర భాగస్తుల వ్యక్తిగత లేదా అనధికార కార్యకలాపాలకు ఒక భాగస్తుడు బాధ్యత వహించనవసరం లేదు. అందువల్ల వ్యక్తిగతంగా భాగస్తులు ఇతర భాగస్తుల తప్పుడు వ్యాపార నిర్ణయాల వల్ల మరియు తప్పుడు నడవడిక వల్ల ఏర్పడే ఉమ్మడి బాధ్యత నుండి రక్షింపబడతారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్య సంస్థ అంటే ఏమిటి?
జవాబు.
1) కింబల్ నిర్వచనము ప్రకారము “ఒక వ్యాపారము నడపడానికి కొంతమంది వ్యక్తులు కలసి మూలధనాన్ని లేదా సేవలను సేకరించుకునే సంస్థను భాగస్వామ్య సంస్థ అనవచ్చు”.

2) “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము” అని హాని నిర్వచించినాడు.

3) 1932 భారత భాగస్వామ్య చట్టము భాగస్వామ్యాన్ని ఈ విధముగా నిర్వచించినది “అందరుగాని అందరి తరపున కొందరుగాని వ్యాపారం నిర్వహిస్తూ, అందులోని లాభాలు పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.

ప్రశ్న 2.
భాగస్వామ్య ఒప్పందం గురించి వ్రాయండి.
జవాబు.
1) భాగస్వామ్యం యొక్క నిబంధనలతో కూడిన పత్రాన్ని భాగస్వామ్య ఒప్పందం అంటారు. హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది.

2) వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి, సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటిమాటల ద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అది వ్రాతపూర్వకముగా ఉంటేనే శ్రేయస్కరము. భాగస్వామ్య ఒప్పందము వ్రాతపూర్వకముగా ఉంటే దానిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు.

ప్రశ్న 3.
సక్రియ భాగస్తుడు అంటే ఎవరు?
జవాబు.

  1. భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు.
  2. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

ప్రశ్న 4.
నిష్క్రియ భాగస్తుని గురించి వివరించండి.
జవాబు.

  1. భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని నిష్క్రియ భాగస్తుడు అంటారు.
  2. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు. ఇతనినే “నిష్క్రియ భాగస్తుడు అని కూడా అంటారు.

ప్రశ్న 5.
భావిత భాగస్తుడిని నిర్వచించండి.
జవాబు.

  1. ఒక వ్యక్తి తన మాటలద్వారాగాని, చేష్టలద్వారాగాని, ఎదుటి వ్యక్తికి తాను సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు.
  2. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోతే భావిత భాగస్తుడే అందుకు బాధ్యత వహించాలి.

ప్రశ్న 6.
మౌన నిర్ణీత భాగస్తుడి గురించి తెలపండి.
జవాబు.

  1. ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా ఉంటే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు.
  2. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు. కాని, సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యతను వహించాలి.

ప్రశ్న 7.
స్వేచ్ఛా / ఇష్టానుసార భాగస్వామ్యం అంటే ఏమిటి?
జవాబు.

  1. ఒక నిరవధిక కాలానికి ఏర్పాటు చేసిన భాగస్వామ్యాన్ని “స్వేచ్ఛా భాగస్వామ్యం” లేదా “ఇష్టానుసార భాగస్వామ్యం” అంటారు.
  2. ఈ భాగస్వామ్యం భాగస్తులు కోరుకున్నంత కాలం కొనసాగుతుంది. భాగస్తులు రద్దు చేయాలని నిర్ణయించినప్పుడు ఈ భాగస్వామ్యం ముగుస్తుంది. అందువల్ల భాగస్తుల ఇష్టానుసారంగా ఈ భాగస్వామ్యం మనుగడలో ఉంటుంది.

ప్రశ్న 8.
పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం అంటే ఏమిటి?
జవాబు.

  1. వ్యాపారంలోని స్వేచ్ఛ మరియు కంపెనీ వ్యాపారంలోని పరిమిత ఋణబాధ్యత ప్రయోజనాలను అందించే కార్పొరేట్ వ్యాపారానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన వ్యవస్థను “పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్యం” అంటారు.
  2. భాగస్వామ్య వ్యాపారం, కంపెనీ వ్యాపారంలోని పరిమితులను అధిగమించే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. దీనిని భారతదేశంలో 2009 మార్చి 31న ప్రకటించడం జరిగింది.

ప్రశ్న 9.
భాగస్వామ్య రద్దు అంటే ఏమిటి?
జవాబు.

  1. భాగస్వామ్య రద్దు అంటే భాగస్తుల మధ్య ఒప్పందంలో మార్పు రావడం లేదా భాగస్వామ్య ఒప్పందం రద్దు కావడం.
  2. భాగస్తులలో ఎవరైనా దివాలా తీసినా, విరమించినా, అశక్తుడైనా, మరణించినా లేదా సంస్థ కాలపరిమితి పూర్తయిన భాగస్వామ్యం రద్దు అవుతుంది.

ప్రశ్న 10.
భాగస్వామ్య సంస్థ రద్దు అంటే ఏమిటి?
జవాబు.

  1. భాగస్వామ్య సంస్థ రద్దు అయితే భాగస్తుల మధ్య ఒప్పందం రద్దు అవుతుంది. దీనివల్ల భాగస్వామ్య సంస్థ వ్యాపారం ముగిసిపోతుంది.
  2. ఆస్తులను పరిష్కారం చేసి ఋణదాతలకు చెల్లింపు చేస్తారు. అందువలన భాగస్వామ్య సంస్థ రద్దు వల్ల భాగస్వామ్యం రద్దు అవుతుంది. కాని భాగస్వామ్యం రద్దు కావడం వల్ల భాగస్వామ్య సంస్థ రద్దు కానవసరం లేదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల తేడాలు:
సొంత వ్యాపార సంస్థ

  1. వ్యక్తుల సంఖ్య: దీనిలో ఒకే వ్యక్తి ఉండును.
  2. స్థాపన: దీనిని స్థాపించుట చాలా సులభం.
  3. ఋణ బాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము.
  4. నమోదు: వ్యాపార సంస్థ నమోదు తప్పని సరికాదు.
  5. మూలధనము: ఒకే వ్యక్తి మూలధనాన్ని సమ కూరుస్తాడు, కాబట్టి మూలధనము తక్కువ.
  6. ఒప్పందము: ఒప్పందము అవసరము లేదు.
  7. వ్యాపార రహస్యాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన వ్యాపార రహస్యాలు కాపాడుకోవచ్చు.
  8. శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు.
  9. శ్రమ విభజన: ఒకే వ్యక్తి ఉండటము వలన శ్రమ విభజనకు అవకాశము లేదు.
  10. మంచి నిర్ణయాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు.

భాగస్వామ్య వ్యాపార సంస్థ

  1. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారమయితే 10, ఇతర వ్యాపారమైతే 20.
  2. వ్యాపార స్థాపనకు భాగస్తుల మధ్య అంగీకారము కావ
  3. భాగస్తుల ఋణ భాధ్యత అపరిమితం, వ్యక్తిగతం, సమిష్టిగతము.
  4. నమోదు తప్పనిసరి కాకపోయినా అవసరము.
  5. ఎక్కువ మంది భాగస్తులు ఉండటము వలన ఎక్కువ మూలధనము ఉంటుంది.
  6. ఒప్పందము లేకుండా భాగస్వామ్యము ఏర్పడదు.
  7. ఎక్కువ మంది వ్యక్తులు ఉండటము వలన వ్యాపార రహస్యాలు కాపాడలేరు.
  8. నిర్ణయాలు తీసుకోవడములో ఆలస్యము జరుగుతుంది.
  9. ఎక్కువ మంది ఉండటము వలన శ్రమ విభజనను ప్రవేశపెట్టవచ్చును. .
  10. భాగస్తులందరూ సమిష్టిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమున్నది

ప్రశ్న 6.
భాగస్వామ్య వ్యాపారము, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాలకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు.
సమిష్టి హిందూ కుటుంబానికి, భాగస్వామ్యానికి మధ్య గల తేడాలు:

భాగస్వామ్య వ్యాపార సంస్థ

  1. స్థాపన: భాగస్తుల మధ్య ఒప్పందము.
  2. సభ్యుల సంఖ్య: కనిష్ట సభ్యుల సంఖ్య 2 గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలయితే 10, ఇతర వ్యాపారాలయితే 20
  3. నిర్వహణ: భాగస్తులందరూ లేదా అందరు తరపున కొందరు వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
  4. ఋణబాధ్యత: భాగస్తుల ఋణభాధ్యత వ్యక్తిగతం, సమిష్టిగతము, అపరిమితము.
  5. లాభాల పంపిణీ: ఒప్పందము ప్రకారము లాభనష్టాలను పంపిణీ చేస్తారు.
  6. రద్దు: భాగస్తుని విరమణ, మరణం లేదా దివాలా తీయడం వలన భాగస్వామ్య ఒప్పందము రద్దవుతుంది.
  7. మైనర్ భాగస్తుడు: చట్టము ప్రకారము మైనరు భాగస్తుడు కాలేడు.
  8. సభ్యులను భాగస్తులు అంటారు.
  9. అధికారము: సంస్థ తరపున వ్యవహరించడానికి భాగస్తులకు ప్రచ్ఛన్న అధికారము ఉంటుంది.
  10. నూతన సభ్యులు: సహభాగస్తుల అంగీకారముతో కొత్త వారిని భాగస్తులుగా చేర్చుకోవచ్చు

సమిష్టి హిందూ కుటుంబం

  1. హిందూ చట్టము ద్వారా ఏర్పడుతుంది.
  2. కనిష్ట సభ్యుల సంఖ్య లేదు. సహవారసుల సంఖ్యకు పరిమితి లేదు.
  3. కర్త మాత్రమే నిర్వహణను చేపడతాడు.
  4. కర్త ఋణబాధ్యత అపరిమితము. సహవారసుల ఋణబాధ్యత వారి వాటాలకే పరిమితము.
  5. సహవారసుల జనన, మరణాల ద్వారా లాభ నష్టాల వాటా మారుతూ ఉంటుంది.
  6. ఎవరు మరణించినా వ్యవస్థ రద్దు కాదు. కుటుంబము విడిపోతే వాటాలను పంచడం జరుగుతుంది
  7. మైనరు అయినా ఉమ్మడి కుటుంబములో సహవారసుడు అవుతాడు.
  8. సభ్యులను సహవారసులు అంటారు.
  9. సహవారసులకు ప్రచ్ఛన్న అధికారము ఉండదు.
  10. సహవారసులు అంగీకరించినా బయటి వారిని సహవారసులుగా చేర్చుకొనడానికి వీలులేదు.

ప్రశ్న 7.
సహకార సంస్థలకు, భాగస్వామ్యానికి మధ్య గల వ్యత్యాసములేవి?
జవాబు.
సహకార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు గల తేడాలు:

సహకార సంస్థ:

  1. స్థాపన: సహకార సంస్థల చట్టం 1912 క్రింద ఇవి స్థాపించబడతాయి.
  2. సభ్యత్వము: కనిష్ట సభ్యుల సంఖ్య 10, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  3. ముఖ్య ఉద్దేశ్యము: సేవాశయము.
  4. ఋణ బాధ్యత: పరిమితము.
  5. నిర్వహణ: ప్రజాస్వామ్యబద్ధముగా సంస్థ నిర్వహించబడుతుంది.
  6. మినహాయింపులు, సౌకర్యములు: ఆదాయపు పన్ను చెల్లింపులో, స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది.
  7. మిగులు లాభాల పంపిణీ: లాభాలలో కొంత శాతము మాత్రమే సభ్యులకు డివిడెండ్లుగా పంచుతారు.
  8. మూలధనము: మొత్తము వాటాలలో 10%నకు మించిన వాటాలను ఏ వ్యక్తి కొనరాదు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 4 భాగస్వామ్య సంస్థ

భాగస్వామ్య సంస్థ

  1. భారత భాగస్వామ్య చట్టం 1932 క్రింద ఇవి ఏర్పడతాయి.
  2. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారము అయితే 10, ఇతర వ్యాపారాలలో 20.
  3. ముఖ్య ఉద్దేశ్యము లాభాశయము.
  4. ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టిగతము.
  5. భాగస్వామ్య ఒప్పందము సంస్థ నిర్వహణలో పాల్గొనవచ్చు.
  6. ఎలాంటి సౌకర్యాలు, మినహాయింపులు ఉండవు.
  7. మొత్తము లాభాలను ఒప్పందము ప్రకారం భాగస్తులకు పంపిణీ చేస్తారు.
  8. ఒప్పందము ప్రకారము మూలధనాన్ని తేవడం తుంది.

Leave a Comment