Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 9 Final Accounts of Sole Trading Concerns to prepare for their exam.
TS Inter 1st Year Accountancy Notes Chapter 9 Final Accounts of Sole Trading Concerns
→ To know the business results and financial position at the end of the period, the business prepares various statements which are called as final accounts.
→ Final accounts consist of two accounts and a balance sheet. The two accounts are
- Trading account
- Profit and Loss account
→ The expenses and incomes are three types :
- Capital nature
- Revenue nature
- Deferred nature.
Revenue expenses and income appear in either trading account of profit and loss a/c. The capital nature appears in the balance sheet. The revenue part of the deferred part appears in Trading and Profit and Loss a/c, where he as the capital part of deferred nature expenditure and incomes appear in the Balance Sheet.
→ Trading account reveals either gross profit or gross loss. This is transferred to the profit and loss account.
→ Profit and loss account reveals either net profit or a net loss.
→ Balance Sheet is divided into two sides namely the assets side and the liabilities side. Assets are current assets, fixed assets, closing stock etc.
→ Liabilities are creditors, bank loans, bills payable, and net capital.
TS Inter 1st Year Accountancy Notes Chapter 9 సొంతవ్యాపార సంస్థల ముగింపు లెక్కలు
→ సంవత్సరాంతానికి వ్యాపార సంస్థ ఫలితాలు, ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి తయారుచేసే నివేదికలను ముగింపు లెక్కలు అంటారు.
→ ముగింపు లెక్కలు రెండు ఖాతాలు మరియు ఆస్తి – అప్పుల పట్టీ సమూహము. ఆ రెండు ఖాతాలు
- వర్తకపు ఖాతా
- లాభనష్టాల ఖాతా
→ వ్యయాలను, ఆదాయాలను మూడు రకాలుగా విభజించవచ్చును.
- మూలధన స్వభావము గలవి
- రాబడి స్వభావము గలవి
- విలంబిత స్వభావము గలవి
రాబడి వ్యయాలు, ఆదాయాలు, వర్తకపు లాభనష్టాల ఖాతాలలోను, మూలధన స్వభావము గలవి, ఆస్తి అప్పుల పట్టీలో చూపాలి. విలంబిత అంశాలు రాబడి స్వభావము గలవి, వర్తక లాభనష్టాల ఖాతాకు, మూలధన స్వభావము గల దానిని ఆస్తి – అప్పుల పట్టీలోను నమోదు చేయాలి.
→ వర్తకపు ఖాతా స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని సూచిస్తుంది. దీనిని లాభనష్టాల ఖాతాకు మళ్ళించాలి.
→ లాభనష్టాల ఖాతా నికర లాభము లేదా నికర నష్టమును తెలుపుతుంది.
→ ఆస్తి – అప్పుల పట్టీని రెండు భాగాలుగా విభజన చేసి అప్పులను ఎడమవైపు, ఆస్తులను కుడివైపు చూపాలి. ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు, ముగింపు సరుకు మొ||నవి. అప్పులు, ఋణదాతలు, బాంకు అప్పు, చెల్లింపు బిల్లులు మొ||నవి.