TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 7th Lesson చెలిమి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 7th Lesson Questions and Answers Telangana చెలిమి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 68)

పాలకులు, పండితులు, శిష్టులు నిత్యజీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత, తెలుగు కావ్యభాషలో మూడువంతులు సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనాథుని కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే, పద్యాలన్నింటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండాపోయే స్థితి ఏర్పడ్డది. సంస్కృతాన్ని ఉపయోగించి, ఎంత గొప్పగా పద్యరచన చేసినా, కవులు తమ కావ్యాల్లో ఒక్కటైనా అచ్చతెనుగు పద్యాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పద్యానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు, ఒక కావ్యాన్ని అంతా, అచ్చంగా తెనుగు పదాలతో రచించిన కవి పొన్నికంటి తెలగన.

ప్రశ్నలు

ప్రశ్న 1.
సంస్కృత పదాలు కావ్యభాషలో ఎక్కువగా ఎందుకు ఉండేవి ?
జవాబు:
పాలకులు, పండితులు, శిష్టులు, నిత్యజీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత, కావ్యభాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉండేవి.

ప్రశ్న 2.
తెనుగు పద్యాన్ని ప్రజలెందుకు మెచ్చుకునేవాళ్ళు ?
జవాబు:
శ్రీనాథుని కాలం నాటికి కావ్యాలన్నీ, సంస్కృత సమాసాలతో నిండిన పద్యాలతో నిండిపోయాయి. క్రమంగా తెలుగుమాటలు, కనిపించని స్థితి వచ్చింది. దానితో అచ్చతెనుగు పద్యాన్ని చూస్తే ప్రజలు, ఆనందంతో మెచ్చుకొనేవారు.

ప్రశ్న 3.
పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండటం వలన లాభమా ? నష్టమా ? ఎందుకు?
జవాబు:
పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండడం వల్ల, సామాన్యులకు పద్యం తేలికగా అర్థం కాదు. సంస్కృత భాషా జ్ఞానం సంపూర్ణంగా లేని తెలుగువారు, ఆ సుదీర్ఘ సంస్కృత సమాసాల పద్యాలను అర్థం చేసుకొని ఆనందించలేరు. కాబట్టి సుదీర్ఘ సంస్కృత సమాసాల వల్ల, సామాన్య పాఠకులకు కష్టం. తెలుగు భాష క్రమంగా మరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
అచ్చతెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి ఎవరని మీరనుకుంటున్నారు ?
జవాబు:
అచ్చతెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి పేరు “పొన్నికంటి తెలగన”.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 70)

ప్రశ్న 1.
వృషపర్వుడు గర్వంతో ఉండడానికి కారణాలు చెప్పండి.
జవాబు:
వృషపర్వుడు రాక్షసులందరికీ రాజు. వృషపర్వుడిని యుద్ధంలో ఎదిరించగల శత్రువులు ఎక్కడా లేరు. ఆ వృషపర్వుడు అనంతమైన ఐశ్వర్యంతో రాక్షస రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే, వృషపర్వుడు గర్వంగా ఉన్నాడు.

ప్రశ్న 2.
అరమరికలు లేని స్నేహం అంటే, ఎట్లా ఉంటుందో చెప్పండి.
జవాబు:
ఇద్దరి స్నేహితుల మధ్య స్నేహంలో భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలులేని స్నేహాన్ని అరమరికలు లేని స్నేహం అంటారు. కర్ణుడికి, దుర్యోధనుడికి మధ్య ఉన్న స్నేహం, అరమరికలు లేని స్నేహం. వారు ఎప్పుడూ ఒకరిని ఒకరు సందేహించలేదు. వారు తగవులాడలేదు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 71)

ప్రశ్న 1.
సురకరువలి (సుడిగాలి) మీరెప్పుడైనా చూశారా? అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ?
జవాబు:
నేను సురకరువలిని అనగా సుడిగాలిని చూశాను. అది వస్తే, తేలిక వస్తువులన్నీ చుట్టచుట్టుకొని, గాలిలో గుండ్రంగా తిరుగుతాయి. అట్టముక్కలు వంటివి గాలిలో బొంగరంలా తిరుగుతాయి.

ప్రశ్న 2.
శర్మిష్ఠ గర్వంతో మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె. ఆ వృషపర్వుడు, ఎక్కడ తమను తప్పుపడతాడో అని భయపడి, రాత్రింబగళ్ళు దేవతలు ఆ వృషపర్వుడికి సేవలు చేస్తూ ఉంటారు. వృషపర్వుడు మంచి భుజబలంతో రాక్షస రాజ్యాన్ని పట్టంకట్టుకున్నాడు. అటువంటి వాడికి కూతురుకాడం వల్ల, శర్మిష్ఠ గర్వంతో మాట్లాడి యుంటుంది.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 72)

ప్రశ్న 1.
“ఉసులొక్కటియై బొందులు వెసరెండుగనుండు” అంటే అర్థమేమి ? ఈ మాటలు దేవయాని ఎందుకన్నది ?
జవాబు:
శరీరాలు రెండూ వేరుగా నున్నా, ఆ రెండు శరీరాలలో ఉండే ప్రాణం ఒకటే అని దాని అర్థము. అంటే శర్మిష్ఠా దేవయానుల స్నేహం, ప్రాణస్నేహం అన్నమాట. వారిలో ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరన్న మాట. వారిద్దరి మైత్రి గొప్పమైత్రి అని చెప్పడానికి, దేవయాని ఆ మాటలు చెప్పింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇవి చేయండి

I. అవగాహన- ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఒకరివస్తువులు మరొకరు వాడుకుంటే కీడు తలపెట్టడం సరైనదేనా ? చర్చించండి.
జవాబు:
ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం సరయిన పద్ధతి కాదు. పొరపాటున ఎవరైనా అట్లా వాడుకుంటే, వారికి కీడు తలపెట్టడం సరయిన పద్ధతి కాదు.

సామాన్యంగా హాస్టళ్ళలో, ఇళ్ళల్లో ఒకరి వస్తువులు మరొకరు పొరపాటున కాని, కావాలని కాని, తీసి వాడుతూ ఉంటారు. హాస్టళ్ళలో మిత్రుల సబ్బుబిళ్ళలు, తువ్వాళ్ళు, టూత్పేస్టులు, తినే పదార్థములు పొరపాటున కాని, కావాలని కాని, ఒకరివి మరొకరు వాడుతూ ఉంటారు.

తాము వాడుకొనే సబ్బులు, టూత్పేస్టులు తమవి కనబడకపోయినా, లేక తమ వస్తువులు ఖర్చయిపోయినా, ప్రక్కవారి వస్తువులు, ప్రక్కవారితో చెప్పి కాని, చెప్పకుండా కాని, తీసి వాడుతారు. ఇంటిలో సహితమూ, అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్రు ఇలాగే ఒకరి వస్తువులు మరొకరు వాడుతారు. ఒకప్పుడు పొరపాటున ఇతరుల వస్తువులు తమ వస్తువులలాగే ఉండడం ‘వల్ల, వాటిని తమ వస్తువులని భ్రాంతిపడి, వాడవచ్చు.

ఏమయినా ప్రక్కవారు మన వస్తువులను తీశారనే కోపంతో, అహంకారంతో వారికి కీడు తలపెట్టడం సరయినది కాదు.

ప్రశ్న 2.
స్నేహితులంటే ఎట్లా ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
స్నేహితుడన్నా, మిత్రుడన్నా ఒకటే. మిత్రుడు ఎలా ఉండాలో భర్తృహరి నీతి శతకములో ఇలా చెప్పాడు.
శ్లో॥ – పాపా న్నివారయతి, యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రకటీ కరోతి,
ఆపద్గతంచ న జహాతి, దదాతి కాలే,
సన్మిత్ర లక్షణ మిదం, ప్రవదన్తి సన్తః.

దీనికి తాత్పర్యం ఇలా చెప్పవచ్చు. “పాపకార్యాల నుండి మిత్రులను నివారిస్తాడు. హితాన్ని కలుగజేసే మంచిపనులు చేసేటట్లు చేస్తాడు. రహస్యాలను రహస్యంగా ఉంచుతాడు. మంచి గుణాలను ప్రశంసిస్తాడు. ఆపదలలో విడువకుండా ఆదుకుంటాడు.

లేని సమయంలో సకాలంలో ఇస్తాడు. అదే మంచి మిత్రుడి లక్షణం”. కాబట్టి పై విధమైన గుణాలు గలవారిని మంచి స్నేహితులని చెప్పవచ్చు. స్నేహం, త్యాగాన్ని కోరుతుంది. ప్రేమను వర్షిస్తుంది. సంతోషాన్నీ, సంతృప్తినీ కలిగిస్తుంది. అసంతృప్తిని పోగొడుతుంది.

స్నేహము స్వార్థాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. స్నేహము సద్బుద్ధిని కలిగిస్తుంది. ఆశలను చిగురింపజేస్తుంది. “స్నేహమేరా శాశ్వతం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదు” స్నేహితుడు అన్నవాడు పైన చెప్పినట్లు ఉండాలి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా శర్మిష్ఠ, దేవయానిల స్వభావాలు ఎట్లా ఉన్నాయో కింది పట్టికలో రాయండి.
TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 2
జవాబు:
శర్మిష్ఠ

  1. రాక్షసరాజు కూతురుననే గర్వం, అహంకారం, కలిగియుండడం.
  2. దేవయాని తనకు మంచి మిత్రురాలయినా, ఆమె కట్టిన మైల కోకను ధరించనని పట్టుదల.
  3. తన తండ్రికి దేవతలు సేవలు చేస్తూ ఉంటారనీ, తన తండ్రి రాక్షస రాజ్యాధిపతి అనీ అహంకారం కల్గియుండడం.
  4. స్నేహితురాలు అనునయించి మాట్లాడుతున్నా, నచ్చచెప్పిన ఆమె మాట వినని ధూర్తత్వం.
  5. స్నేహితురాలు దేవయానిని అహంకారంతో నూతిలోకి త్రోసివేసిన దౌష్ట్యం.

దేవయాని

  1. రాక్షస వంశానికి గురువయిన శుక్రాచార్యుని కుమార్తెననే కొద్దిపాటి అహంభావము.
  2. శర్మిష్ఠ వంటి రాజకన్యతో గట్టి స్నేహం. శర్మిష్ఠ, దేవయానుల శరీరాలు వేరు అయినా, ప్రాణం ఒకటే అన్నంతగా రాజకుమార్తె శర్మిష్ఠతో మైత్రి చేయడం.
  3. ఓరిమితో, పొరపాటున బట్టలు తారుమారయినందుకు కోపపడడం తగదని, స్నేహితురాలికి హితబోధ చేయడం.
  4. శర్మిష్ఠ ఎగతాళి మాటలకు చివరకు అసహనంతో, తాను రాక్షస రాజగురువు కుమార్తెనని, స్నేహితురాలికి గుర్తుచేయడం.
  5. శర్మిష్ఠ తొందరపాటుతనానికి బలియై, నూతిలోకి త్రోయబడడం.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రశ్న 4.
కింది పేరా చదువండి – జవాబులివ్వండి.

2014 జూన్ 8న హిమాచల్ ప్రదేశ్లోని మండిజిల్లాలోని బియాస్ నది అందాలు వీక్షించడంలో లీనమైపోయారు 48 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు. ముగ్గురు అధ్యాపకులతో కలిసి తెలంగాణ రాష్ట్రం నుండి విజ్ఞానయాత్రకు బయలుదేరారు. ఆ విద్యార్థులు, సన్నసన్నగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో మధ్య బండరాళ్ళ మీద, మోకాలిలోతుదాకా వెళ్ళి, ఆ నది అందాలను ఆనాటి సాయంత్రం సుమారు ఆరుగంటల ముప్పై నిమిషాలవేళ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.

పైనున్న రిజర్వాయరు గేట్లు ఎత్తిన సంగతి గురించి పరిసరాల్లో ఉన్న హెచ్చరికలను వీళ్ళు గమనించలేదు. నదిలో హఠాత్తుగా నీటిమట్టం పెరగడం గమనించిన కొందరు ప్రమాదాన్ని శంకించి బయట పడటానికి ప్రయత్నం చేసారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. మరికొందరు ఇతరులను కాపాడటానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో కొందరు విజయం సాధిస్తే ఒకరిద్దరు ప్రాణాలనే పణంగా అర్పించారు. మొత్తంమీద సగం మంది విద్యార్థుల నిండు ప్రాణాలు, అందరూ చూస్తుండగానే ఆ నీటి ఉధృతికి గాల్లో కలిసిపోయాయి. ప్రపంచ మానవాళి హృదయాలను కలచివేసిన సంఘటన ఇది.

ఇటువంటి సంఘటనలు తరచూ మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆకతాయితనంతో ఈత రానివాళ్ళను నీళ్ళలోకి తోసివేయడం, ఈత రాకున్నా మిత్రులను చూసి ఉత్సాహంతో నీళ్ళలో దూకి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, నీటిలోతును తప్పుగా అంచనావేసి, ప్రాణాలు పోగొట్టుకోవడం….. తీర్థయాత్రల్లో, పికినిక్ లో, విహారయాత్రల్లో, ఈతకొలనుల్లో, చెరువుల్లో, దిగుడుబావుల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.

ఆరోగ్యం కోసం, శరీర దారుఢ్యం కోసం జిమ్లకు వెళ్ళడానికి, కరాటే, కుంగ్ఫూ లాంటి రక్షణ విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే – ‘ఈతనేర్చుకోవడం’ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇది ఆత్మరక్షణకే గాక, నీటి ప్రమాదాల నివారణకూ దోహదపడుతుంది.

ప్రశ్నలు :

అ) సాధారణంగా నీటి ప్రమాదాలు ఎట్లాంటి సందర్భాల్లో జరుగుతాయి ?
జవాబు:

  1. చెరువులు, కాలువలు, నదులలో స్నానానికి వెళ్ళినపుడు, అందులో ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీటి ప్రమాదాలు జరుగుతాయి.
  2. వాగులు, వంకలు దాటి ప్రయాణం చేస్తున్నప్పుడు, అమాంతంగా ఆ వాగుకు వరదవస్తే, ఆ ప్రవాహ వేగంలో కొట్టుకొనిపోయే ప్రమాదం ఉంది.
  3. నదులలో, సముద్రాలలో పడవలపై, లాంచీలపై, ఓడలపై ప్రయాణిస్తున్నప్పుడు, ఆ పడవలకూ, ఓడలకూ ప్రమాదాలు వస్తే, అవి నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారికి నీటిప్రమాదం రావచ్చు.
  4. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వరదనీటిని సాహసంగా దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినపుడు దానిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
  5. తీర్థస్నానాలకు వెళ్ళి, కొత్తచోట్ల నదులవంటి వాటిలో స్నానానికి దిగినపుడు, అక్కడ ఉండే లోతు తెలియక, మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఆ) నీళ్ళవద్ద ఆకతాయితనం ప్రదర్శించడం మంచిదేనా ? ఎందుకో తెలుపండి.
జవాబు:
ఆకతాయితనం అంటే తుంటరితనం. అల్లరిచిల్లరిగా తిరగడం అని భావం. నీళ్ళల్లో దిగి స్నానాలు చేసేటప్పుడు అక్కడ లోతు ఎంతగా ఉంటుందో తెలిసికొని జాగ్రత్తగా ప్రక్కన ఉన్న ఏ కఱ్ఱనో, గొలుసునో ఆధారం చేసుకొని స్నానం చేయాలి.

మంచి వేగంగా ప్రవాహం ఉన్న నీటిలో ఒంటరిగా తోడులేకుండా దిగరాదు. స్నానాలు చేయరాదు. స్నానాలు చేసేటప్పుడు ఆకతాయితనంగా ప్రవర్తించి మునగడం, ఈతకొట్టడం, ప్రక్కవారిపై నీళ్ళుచల్లడం, ప్రక్కవారిని బలవంతంగా నీళ్ళలోకి లాగడం, గెంటడం వంటి అల్లరిపనులు చేయరాదు.

ప్రక్కవారికి ఈతరాకపోతే, వారిని నీటిలోకి గెంటితే వారు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈత రాకుండా, నీటిలో లోతులోకి దిగితే, ప్రవాహంలో తాము కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వరదలు వచ్చిన నదులలో, ఈతలు, స్నానాలు చేస్తే ప్రమాదాలు సంభవింపవచ్చు.

ఇ) ఈత నేర్చుకోవడం వల్ల ఏయే ప్రయోజనాలుంటాయి ?
జవాబు:

  1. ఈత మంచి వ్యాయామము. ఈత ఈదేవారి, శరీరము మంచి తేలికగా పటుత్వంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈతను మించిన వ్యాయామం లేదని ఆరోగ్య శాస్త్రజ్ఞులు చెపుతారు.
  2. ఈత వస్తే నీటి ప్రమాదాలు సంభవించినపుడు తేలికగా తప్పించుకోవచ్చు. ఈత ఈదుకొని గట్టు ఎక్కవచ్చు. ఈత వస్తే ప్రమాదాలు వచ్చినపుడు ప్రక్కవారిని సహితమూ రక్షింపవచ్చు.
  3. ఈత వస్తే కాలువల్లో, ఏరుల్లో, నదుల్లో హాయిగా స్నానం చేయవచ్చు. కాలువలలో ఈది, అవతలి తీరాలకు చేరవచ్చు. ఈత వల్ల మంచి వ్యాయామము సిద్ధిస్తుంది. నీటిప్రమాదాలు వస్తే సురక్షితంగా తాము బయటపడవచ్చు. పక్కవారికి సాయపడవచ్చు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఈ) బియాస్ నది ప్రమాదానికి కారణమేమిటి ?
జవాబు:
విద్యార్థులు నదిలో తక్కువగా నీరు ఉన్నప్పుడు చక్కగా ఉల్లాసంగా విహరించారు. నది అందాలను తమ కెమేరాలలో బంధించారు. అయితే అనుకోకుండా నది యొక్క రిజర్వాయరు గేట్లు ఎత్తడం వల్ల నీరు ఒక్కసారిగా ముందుకు వచ్చింది. ప్రమాదకరమైన హెచ్చరికలను కూడా విద్యార్థులు గమనించలేదు.

కొందరికి ఈత కూడా రాదు. ఈ కారణాలతో నదీ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయారు. తమ ప్రాణాలను కోల్పోయారు. కొందరు తమ మిత్రులను కాపాడబోయి వారు కూడా ప్రాణాలను పోగొట్టుకున్నారు. రిజర్వాయరు గేట్లు ఎత్తడం వల్ల, నీరు అధికమొత్తంలో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ప్రశ్న 5.
కింది గద్యాన్ని చదువండి.

భీమకవి జన్మస్థలము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ. కానీ ఆతడెన్నడునూ. ఒక్కచోటనున్నవాడు కాదు. మహేశ్వర వరప్రసాద కవితాఖడ్గమును ధరించి, తన్నెదిరించిన వారినెల్ల ఆ ఖడ్గప్రహారముతో భయపెడుతూ, ఆగ్రహానంతర మనుగ్రహవృష్టిని కురిపిస్తూ నిరంతరం సంచరించే అనంత శక్తిమంతుడా మహాకవి. సుమారు వేయిఏండ్ల కిందటి వాడైనా, అతని కావ్యసంపద లభించకపోయినా, ఆయన పద్యప్రసూనాలు వాడిపోక, ఇప్పటికీ నవ్య సుగంధాలను వెదజల్లుతూనే ఉన్నాయి. బహుభాషాకోవిదుడు, మహోగ్రుడుగా పేరుగన్న భీమన్న శాపం, అనుగ్రహం వేగంగా పనిచేసేవి. ఈయన 11వ శతాబ్దానికి చెందిన కవి అని కొందరి అభిప్రాయం.

కింది వాక్యాల్లోని తప్పొప్పులను గుర్తించండి.
అ) భీమకవి ‘ఖడ్గం ధరించి తిరిగేవాడు.   (✓)
ఆ) వేములవాడ .భీమకవి బహుభాషాకోవిదుడు.   (✓ )
ఇ) భీమకవి 11వ శతాబ్దికి చెందినవాడని కొందరంటారు.   (✗)
ఈ) భీమకవి ఎన్నడూ ఒక్కచోట ఉండలేదు.  (✓ )

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) స్నేహితుల మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో వివరించండి.
జవాబు:

  1. సామాన్యంగా ఆటలు ఆడుకొనేటపుడు స్నేహితుల మధ్య వివాదాలు వస్తూ ఉంటాయి.
  2. స్నేహితులకు ఎవరైనా ఏదైనా బహుమతులు ఇచ్చినపుడు, అవి వారికి సమానంగా ఇవ్వలేదనే విషయం దగ్గర తగాదాలు వస్తాయి.
  3. చదువులలో పోటీలు ఏర్పడినపుడు నోట్సులు, పుస్తకాలు దగ్గర తమకున్న బట్టలు వగైరా దగ్గర తగాదాలు వస్తాయి.
  4. తల్లిదండ్రులు కాని, ఇతరులు కాని ఏవైనా బహుమతులు, స్నేహితులలో ఒకరికి ఇచ్చి, రెండవవారికి అవి ఇవ్వనపుడు, తమకు ఎక్కువ తక్కువలు ఉన్నాయనే విషయం దగ్గర వివాదాలు వస్తూ ఉంటాయి.
  5. తమకు ఇంటివద్ద ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కువ తక్కువలు ఆరోపించుకోవడం, అందులో ఎక్కువ ఉన్నవారికి గర్వం, అహంకారం వచ్చిందనే కారణంగా, రెండవవాడు తగాదా పెట్టడం వల్ల వివాదాలు వస్తాయి.

ఆ) “కుల, మత, వర్గ, పేద, ధనిక తేడా లేనిది స్నేహం ఒక్కటే” దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
స్నేహానికి హద్దులు లేవు. పరిమితులు లేవు. బడిలో చదువుకొనేటపుడు, ఆటలు ఆడుకొనేటప్పుడు, ఎందరో మనకు స్నేహితులవుతారు. అందులో వివిధ కులాలవారు, మతాలవారు, వర్గాలవారు, పేదలు, ధనికులు కూడా ఉంటారు. స్నేహానికి మనస్సులు రెండూ కలవడమే ముఖ్యం. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోడంలోనే స్నేహం ఉంది.

లోకంలో ఎందరో వివిధ మతస్థులయిన, వివిధ కులాలవారయిన స్నేహితులు ఉన్నారు. వారు ఒకరికోసం మరొకరు తమ ప్రాణాలు ఇస్తారు. సుగ్రీవుడు వానరుడు. రామలక్ష్మణులతో స్నేహం చేసి అతడు, సీతను తిరిగి పొందడంలో రామునికి ఎంతో సాయం చేశాడు. అలాగే విభీషణుడు రాక్షసుడు. రాముని ఆశ్రయాన్ని పొందిన విభీషణుడు యుద్ధంలో రామునికెంతో సాయం చేశాడు. దీనినిబట్టి స్నేహానికి, కులమత వర్గ భేదాలు ఉండవని గ్రహించాలి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇ) అచ్చతెలుగు భాషలో రాయబడిన ఈ పాఠం చదివారు కదా ! దీనిపై మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
అచ్చతెనుగు పద్యం ఒకటి కావ్యంలో ఉంటేనే, అది ఎంతో గొప్ప విషయం అని కావ్యరసజ్ఞులు మెచ్చుకుంటారు. అలాంటిది నేను ఈ ‘చెలిమి’ పాఠంలో 12 అచ్చతెలుగు పద్యాలు చదువుకున్నాను. అయితే సంస్కృత సమాసాలతో పద్యాలు వినడానికి కమ్మగా, గంభీరంగా, ఇంపుగా ఉంటాయి. ఈ అచ్చతెలుగు పద్యాలు, ముద్దులు మూటలు కడుతూ ఉన్నాయి. శ్రవణ పర్వంగా ఉన్నాయి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు” ఎందుకు వివరించండి.
జవాబు:
‘చెలిమి’ పాఠంలో రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ, తన స్నేహితురాలైన దేవయానిని, చిన్న తప్పు కోసం అసహనంతో నూతిలోకి త్రోసివేసి, ఇంటికి వెళ్ళిపోయింది. దేవయానిని ఎవరూ ఆదుకోలేదు. శర్మిష్ఠ రాజు కూతురు కాబట్టి, ఆమె వెంట వేయిమంది చెలికత్తెలూ కూడా వెళ్ళిపోయారు.

దేవయాని చెలికత్తె ‘ఘూర్ణిక’ దేవయానిని విడువకుండా ఆమెకు సాయం చేద్దామని చూస్తూ, తాను ఒక్కతే ఏమీ చేయలేక సాయంచేసే వారికోసం ఎదురు చూసింది. ఇంతలో ప్రతిష్ఠానపురము ప్రభువైన యయాతి మహారాజు జాబాలి మహర్షి ఆశ్రమం నుండి తిరిగి వెడుతూ, దాహంతో దేవయాని ఉన్న నూతి దగ్గరకు వచ్చాడు. తన్ను రక్షించుమని దేవయాని చెలికత్తె కోరగా దేవయానిని రక్షించాడు.

దేవయానికి ఘూర్ణిక నిజమైన చెలికత్తె. అందుకే ఘూర్ణిక, దేవయానిని అడవిలో నూతిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు. దేవయానికి వచ్చిన కష్టాన్ని యయాతి మహారాజుకు చెప్పింది. యయాతి మహారాజుచే దేవయానిని రక్షింపజేసింది. అందుకే ఆపదలో ఆదుకొన్నవారే నిజమైన స్నేహితులు అని చెప్పాలి. ఈ కథలో ఘూర్ణికయే, దేవయానికి నిజమైన స్నేహితురాలు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

(లేదా)

ఆ) మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి ? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి ?
జవాబు:
మంచి స్నేహితులే మనకు నిజమైన సంపదలు. కాబట్టి మనకోసం ప్రాణం ఇచ్చే స్నేహితులను సంపాదించుకోవాలి. స్నేహితులకు అవసరం అయినపుడు, తన ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పంచి ఇవ్వాలి. స్నేహితుల అవసరాలు మనం తెలుసుకొని, వారికి మనం సాయపడాలి. స్నేహితుడు కష్టాల్లో ఉంటే, మన శక్తిని అంతా ధారపోసి వారికి మనం సాయపడాలి.

వారి అవసరం కోసం మనతో స్నేహం చేసేవారు, మంచి స్నేహితులు అనిపించుకోరు. ఎవరైతే మనం ఆపదలో ఉన్నపుడు, లేనిస్థితిలో ఉన్నపుడు ఆదుకొంటారో వారే మంచి స్నేహితులు. మనం తప్పుదారిలో నడిచేటప్పుడు అది మంచిదికాదని, దానివల్ల కలిగే లాభనష్టాలను వివరంగా మనకు తెలియపరచి, మంచిదారి చూపించేవారే మంచి స్నేహితులు.

మంచి స్నేహం త్యాగాన్ని కోరుతుంది. మంచి స్నేహితుల కోసం మనం ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వేయకూడదు. మంచి స్నేహం, కలకాలం నిలవాలంటే మిత్రులు చిన్న చిన్న విషయాలపై తగువులు పెట్టుకోరాదు. ఒకరి మనస్సులను మరొకరు బాగా అర్థం చేసుకోవాలి.

స్నేహితులకు అవసరమైతే తననూ, తన ఆస్తినీ, తన బంధువులనూ వినియోగించి తోడ్పడాలి. ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

శర్మిష్ఠ తన స్నేహితురాలైన దేవయానిని తిట్టి, బావిలో తోసింది కదా ! తర్వాత తన తప్పు తెలుసుకొని చింతిస్తే, ఎట్లా ఉంటుందో ఊహించి, “ఏక పాత్రాభినయా”నికి అనువుగా మాటలు రాయండి.
జవాబు:
శర్మిష్ట ఏకపాత్రాభినయము
“అయ్యో ! ఎంతపని చేశాను ? దేవయాని నాకు ఎంతో మంచి స్నేహితురాలు కదా ! దాన్ని నూతిలోకి తోశాను. పాపం ఏమయ్యిందో ! చచ్చిపోయిందేమో ! ఎంత పాపానికి ఒడిగట్టాను. నేను మిత్రద్రోహురాలిని. పాపం దేవయాని నాకు ఎంతో నచ్చచెప్పింది. అవును. సుడిగాలి వస్తే దేవయాని ఏం చేస్తుంది ? బట్టలు మారిపోడానికి దేవయాని నిజంగా కారణం కాదు కదా !

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

మరి నేను మాత్రం తప్పు చేయలేదా ? నేను దేవయాని బట్టలు కట్టుకున్నాను కదా ! నేను మాత్రం నా బట్టలు సరిగ్గా గుర్తించగల్గానా ? లేదు కదా ! నేను చేసిన తప్పే, దేవయానీ చేసింది. తప్పు మా ఇద్దరిదీ ఒక్కటే, కాని శిక్ష దేవయాని అనుభవిస్తోంది. ఇది అన్యాయం.

నేను రాజకుమార్తెననే అహంకారంతో ఈ తప్పుచేశా. ఇది నిజం. దేవయాని తండ్రిగారు మా రాక్షస వంశానికి గురువుగా మాకు, ముఖ్యంగా మా నాన్నగారికి, ఎంత ఉపకారం చేస్తున్నారు ? రాక్షసుల క్షేమానికి కారణం దేవయాని తండ్రి శుక్రాచార్యులు గారే !

నేను ఎంత తెలివితక్కువగా వ్యవహరించాను. ఎంత చెడ్డపని చేశాను. వెంటనే దేవయానిని రక్షించమని భటుల్ని పంపిస్తా. దేవయానిని రక్షింపజేసి, ఆమె దగ్గర నా తప్పు అంగీకరిస్తా. క్షమించమని కోరుతా ! (ఎవరక్కడ !)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) మన ఇరుగు పొరుగు వాళ్ళతో అనగి పెనగి ఉండాలి.
జవాబు:
అనగిపెనగి = మిక్కిలి స్నేహముతో కలిసియుండి
వాక్యప్రయోగం : మా తరగతిలోని బాలబాలికలందరం అనగి పెనగి సరదాగా ఉంటాము.

ఆ) చెలువలు బంగారు ఆభరణాలను చాలా ఇష్టపడతారు.
జవాబు:
చెలువలు = స్త్రీలు
వాక్యప్రయోగం : అట్లతద్దినాడు మా వీధిలో చెలువలు కుందెనగుడి ఆట ఆడారు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇ) మా పాఠశాలలో తరగతికి వందమంది చొప్పున పది తరగతుల్లో వేవురు విద్యార్థులు చదువుతున్నారు.
జవాబు:
వేవురు = వేయిమంది
వాక్యప్రయోగం : మా గ్రామ జనాభాలో వేవురు పురుషులు, తొమ్మిదివందల మంది స్త్రీలు ఉన్నారు.

ఈ) అమ్మనాన్నలు మనమంచికై కఠినంగా మాట్లాడినా నెగులు పడకూడదు.
జవాబు:
నెగులు = విచారము
వాక్యప్రయోగం : మా ఇంట్లో దొంగలు పడి, బంగారము దొంగిలించారని, మేమంతా నెగులుపడ్డాము.

2. కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

అ) ఆళి ( ) ఎ) సకి
ఆ) గర్వం ( ) బి) అబ్బురం
ఇ) అద్భుతం ( ) సి) ఓలి
ఈ) సఖి ( ) డి) కావరం
జవాబు:
అ) ఆళి ( సి ) ఎ) సకి
ఆ) గర్వం ( డి ) బి) అబ్బురం
ఇ) అద్భుతం ( బి ) సి) ఓలి
ఈ) సఖి ( ఎ ) డి) కావరం

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రకృతి – వికృతి
అ) ఆళి – ఓలి
ఆ) గర్వము – కావరం
ఇ) అద్భుతము – అబ్బురం
ఈ) సఖి – సకి

వ్యాకరణాంశాలు

1. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.

అ) జగములేలు = …………………………..
జవాబు:
జగములు + ఏలు – ఉత్వసంధి

ఆ) అలరుఁబోఁడి = …………………………….
జవాబు:
అలరు + మేను – పోడ్యాదేశ సంధి

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఇ) నీరాట = …………………………
జవాబు:
నీరు + ఆట – ఉత్వసంధి

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

అ) రక్కసిణేడు = …………………………
జవాబు:
రక్కసులకు తేడు = షష్ఠీ తత్పురుష సమాసం

ఆ) నీరాట = …………………….
జవాబు:
నీటి యందలి ఆట = `సప్తమీ తత్పురుష సమాసం

ఇ) పసిబిడ్డ = ……………………….
జవాబు:
పసిన బిడ్డ = విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

గసడదవాదేశ సంధి:

కింది పదాలను కలిపినప్పుడు, ఏర్పడిన రూపాలను గమనించండి.
అ) వాడు + కొట్టె = వాడుగొట్టె
ఆ) మీరు + చనుడు = మీరుసనుడు
ఇ) నీవు + టక్కరి = నీవుడక్కరి
ఈ) నిజము + తెలిసి = నిజముదెలిసి
ఉ) పాలు + పోక = పాలువొక

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

గమనిక:
పై ఉదాహరణలు గమనించారు కదా! పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట, క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు, క, చ, ట, త, ప, లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) ‘క’ → ‘గ’ గా మారుతుంది.
2) ‘చ’ → ‘స’ గా మారుతుంది.
2) ‘ట’ → ‘డ’ గా మారుతుంది.
4) ‘త’ → ‘ద’ గా మారుతుంది.
5) ‘ప’ → ‘వ’ గా మారుతుంది.

ప్రథమ మీది పరుషాలకు
గ, స, డ, ద, వ లు బహుళముగానగు

అనగా క, చ, ట, త, ప లకు వరుసగా గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి.

3. అభ్యాసం : కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.

అ) రావణుడు గొనిపోయె
ఆ) రాముడు సనుదెంచు
ఇ) వారు దనిసిరి
ఈ) వాడు వోయె
జవాబు:
అ) రావణుడు = గొనిపోయె = రావణుడు +
ఆ) రాముడు సనుదెంచె = రాముడు + చనుదెంచె
ఇ) వారు దనిసిరి = వారు + దనిసిరి
ఈ) వాడు వోయె = వాడు + వోయె

వివరణ :

  1. రావణుడు
  2. రాముడు
  3. వారు
  4. వాడు

– అనే పదాల చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదముల మొదట క, చ, ప లు ఉన్నాయి.
ప్రథమా విభక్తి ప్రత్యయాలకు క, చ, ట, త, ప లు పరమైతే గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. కాబట్టి క, చ, ప లు – గ, స, వ లుగా మారాయి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

కింది పదాలను గమనించండి.

అ) కూరగాయలు – కూర + కాయ
ఆ) కాలుసేతులు – కాలు + చేయి
ఇ) టక్కుడెక్కులు – టక్కు + టెక్కు
ఈ) తల్లిదండ్రులు – తల్లి + తండ్రి
ఉ) ఊరువల్లెలు – ఊరు + పల్లె

పై పదాలు అన్నీ ద్వంద్వ సమాసానికి ఉదాహరణలే.

వివరణ : ద్వంద్వ సమాసంలో ‘కూర + కాయ’ అన్నపుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా ద్వంద్వ సమాసపదాల్లో క, చ, ట, త, ప, లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా రావడాన్ని, “గసడదవాదేశం” అంటారు. అనగా ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చ ట ప లకు, గ స డ ద వ లు క్రమంగా వస్తాయి. దీన్నే ద్వంద్వ సమాసంలో, ‘గసడదవాదేశ సంధి’ అంటారు.

4. అభ్యాసం : కింది పదాలను కలుపండి. సంధి కార్యం తెలుపండి.

అ) అక్క + చెల్లి = …………………….
జవాబు:
అక్కాసెల్లెండ్రు (ద్వంద్వ సమాసంలో గసడదవాదేశం)

ఆ) అన్న + తమ్ముడు = ……………………….
జవాబు:
అన్నాదమ్ములు (ద్వంద్వ సమాసంలో గసడదవాదేశం)
సూత్రం : ద్వంద్వంబుపై పరుషములకు గ, స, డ, ద, వ లగు.

తేటగీతి

గమనిక : ‘తేటగీతి’ పద్యం సూర్య, ఇంద్ర గణాలతో ఏర్పడుతుంది. ఈ తేటగీతి పద్యలక్షణాలు తెలుసుకోబోయే ముందు సూర్యగణాలు, ఇంద్రగణాలు అంటే ఏవేవో చూద్దాం.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఎ) సూర్యగణాలు (2)

  1. న గణం I I I
  2. హ గణం (గలము) – U I

బి) ఇంద్రగణాలు (6)

  1. భ గణం – U I I
  2. ర గణం – U I U
  3. త గణం – U U I
  4. న గము – I I I U
  5. న లము – I I I I
  6. స లము – I I U I

ఇప్పుడు కింది ఉదాహరణమును పరిశీలించండి.
ఉదా :
TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 3
పై ఉదాహరణ ఆధారంగా, తేటగీతి పద్యలక్షణాలను కింది విధంగా చెప్పవచ్చు.
తేటగీతి పద్య లక్షణాలు :

  • ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  • ప్రతి పాదానికి, వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  • నాలుగో గణం మొదటి అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాసయతి చెల్లుతుంది.
  • ప్రాస నియమం లేదు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ప్రాసయతి :

  1. ప్రాసస్థాన అక్షరానికి, యతిని, పాటించడాన్ని ‘ప్రాసయతి’ అంటారు.
  2. పద్యపాదంలో రెండవ అక్షరానికి, సాధారణ యతిమైత్రి స్థానంలోని తరువాతి అక్షరానికి, యతిని పాటించడం ‘ప్రాసయతి’ అంటారు.

5. పై పద్యానికి సంబంధించి మిగతా పాదాలకు గణవిభజన చేసి లక్షణాలను సరిపోల్చండి.

జవాబు:
2వ పాదం
TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 4
లక్షణాలు సరిపోల్చడం :
1) పై పాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వచ్చాయి. కాబట్టి ఇది ‘తేటగీతి” పద్యపాదము.
2) మొదటి అక్షరం ‘గూ’ కు ను, నాలుగో గణం మొదటి అక్షరం ‘గో’ కు యతిమైత్రి.
ప్రాజెక్టు పని

స్నేహం గొప్పతనాన్ని తెలిపే కథలను / పాటలను సేకరించి, నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) పాట : “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం”

2) కథ : ‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వల మీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలను ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

పావురాలు అప్పుడు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I.

1వ పద్యం

చ. కనుఁగొని నెమ్మది న్నెగులు గ్రమ్మఁగ రక్కసియొజ్జయంచుఁ బే
ర్కొనఁ దగునట్టి శుక్రునకుఁ గూరిమి కూఁతురు దేవయాని నాఁ
దవరిన యిన్నెలంత నొక తప్పునకై వృషపర్వుపట్టి నూ
తమ బడఁద్రోచి పోయెనని దాని తెఱం గది విన్నవించివన్.

ప్రతిపదార్థం :
కనుగొని = చూచి ;
నెమ్మదిన్ = తన మనస్సులో
నెగులు = దుఃఖము
క్రమ్మగన్ = వ్యాపించగా
రక్కసియొజ్జయంచున్;
రక్షసి = రాక్షసులకు
ఒజ్జ = గురువు
అంచున్ = అని
పేర్కొనన్ = చెప్పడానికి
తగునట్టి = తగిన
శుక్రునకున్ = శుక్రుడు అనే వానికి
కూరిమి కూతురు = ప్రియమైన బిడ్డ
దేవయానినాన్ = దేవయాని అనే పేరుతో
తనరిన = ఒప్పిన
ఇన్నెలంతన్ (ఈ + నెలంతన్) = ఈ స్త్రీని (ఈ దేవయానిని)
ఒక తప్పునకై = ఒక్క తప్పుకోసం ;
వృషపర్వుపట్టి = వృషపర్వుడు అనే రాక్షసరాజు కూతురు ; శర్మిష్ఠ
నూతను = నూతిలో
పడఁదోచి (పడన్ + త్రోచి) = పడేటట్లు తోసి
పోయెన్ = వెళ్ళిపోయింది ;
అని = అని
దాని తెఱంగు = ఆమె విషయము (ఆ శర్మిష్ఠ విషయమును)
అది విన్నవించినన్ = ఆ ఘూర్ణిక అనే దేవయాని చెలికత్తె, యమాతి మహారాజుకు తెలుపగా,

భావం :
దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక అనే ఆమె, యయాతి మహారాజును చూసి, తన మనస్సులో దుఃఖము నిండగా, ఆమె “ఓ మహారాజా! ఈమె దానవగురువు అని చెప్పబడే, శుక్రాచార్యుని కుమార్తె. ఈమె పేరు దేవయాని. ఈమెను ఒక తప్పుకొఱకు వృషపర్వుని కూతురు, ఈ బావిలో త్రోసిపోయింది” అని ఆ దేవయాని విషయమును, యయాతి మహారాజుకు చెప్పింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

2వ పద్యం

తే. ‘అతివ, వృషపర్వుఁడన నెవ్వఁ? డతని యనుఁగుఁ
గూఁతుపేరేమి? తనుఁబట్టినూతఁద్రోయు
నంతపని యేమి చేసె నీయలరుఁబోఁడి?’
యనుడు నవ్వాలుగంటి యయాతిఁ జూచి

ప్రతిపదార్థం :
అతివ = ఓ యువతీ ! (ఓ ఘూర్ణికా!)
వృషపర్వుడు = వృషపర్వుడు
అనన్ = అనగా (అంటే)
ఎవ్వడు = ఎవడు ?
అతని = అతని యొక్క (ఆ వృషపర్వుని యొక్క)
అనుగు కూతురు = గారాబమైన బిడ్డ
పేరేమి (పేరు + ఏమి) = పేరు, ఏమిటి ?
తనుఁబట్టి (తనున్ + పట్టి) = తనను పట్టుకొని (ఈ దేవయానిని పట్టుకొని)
నూతన్ = బావిలో
త్రోయు = పడద్రోయవలసిన
అంతపని = అంత తప్పుపని;
ఈ అరుఁబోడి = ఈ పూవువంటి శరీరముగల ఈ సుకుమారి (దేవయాని)
ఏమి చేసె = ఏమి చేసింది ?
అనుడున్ = అని యయాతి ఘూర్ణికతో అనగా ;
అవ్వాలు గంటి (ఆ + వాలుగంటి) = ఆ దీర్ఘములైన కన్నులుగల ఘూర్ణిక
యయాతిన్ = యయాతి మహారాజును ;
చూచి = చూసి

భావం :
ఆ యయాతి మహారాజు ఘూర్ణికను చూసి, “ఓ యువతీ! వృషపర్వుడంటే ఎవరు ? అతని కూతురు పేరేమిటి? ఈ దేవయాని, తనను పట్టుకొని నూతిలో పడద్రోయవలసినంత దోషము ఏమి చేసింది ?” అని అడుగగా, ఆ ఘూర్ణిక ఆ మహారాజుతో.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

3వ పద్యం

క. విను వృషపర్వుఁ డనంగాఁ
దనరున్ రక్కసులతేఁడు తన కనిలోనం
బెనఁగఁదగు మార్తు నెందుం
గని యెఱుఁగక జగము లేలుఁగడ లేని సిరిన్

ప్రతిపదార్థం:
విను = వినుము ; (ఓ మహారాజా! వినుము)
వృషపర్వుడు = వృషపర్వుడు.
అనంగాన్ = అనే
రక్కసులఱేడు = రాక్షసరాజు
తనరున్ = ఒప్పుచుండును (ఉన్నాడు)
తనకున్ = ఆ మహారాజునకు (ఆ మహారాజుతో)
అనిలోనన్ = యుద్ధంలో ;
పెనగందగు (పెనగన్ + తగు) = యుద్ధం చేయగల
మార్తున్ = శత్రువును
ఎందున్ = ఎక్కడనూ
కని = చూచి ;
ఎఱుగక = తెలియక
సిరిన్ = ఐశ్వర్యంతో
జగ = లోకాలు
ఏలున్ = పాలిస్తాడు.

భావం:
ఓ మహారాజా ! చెపుతాను విను. వృషపర్వుడనే పేరుగల ఒక రాక్షసరాజు ఉన్నాడు. ఆయనతో సాటిగా యుద్ధం చేయగల రాజు ఎవ్వరూ లేరు. అతడు అంతులేని ఐశ్వర్యంతో, లోకములను ఏలుతున్నాడు.

విశేషం : వృషపర్వుని సభానిర్మాణము రాక్షసులలో 1) దైత్యులు, 2) దానవులు, 3) అసురులు అని మూడు తెగలు ఉన్నాయని, రాజశేఖరుడు ‘కావ్యమీమాంస’లో చెప్పాడు. 1) హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, బలి – మొదలగువారు, దైత్యులు. అనగా వీరు దితి కుమారులు. విప్రచిత్తి, శంబరుడు, నముచి మొదలయినవారు దానవులు. అనగా వారు దనువు కుమారులు. బలి, వృత్రాసురుడు, వృషపర్వుడు మొదలయినవారు, అసురులు.

ఇందులో వృషపర్వుడు, కశ్యపప్రజాపతి కుమారుడు. ఇతని తల్లిపేరు దనుజ. “మయబ్రహ్మ”, వృషపర్వుడికి సభాభవనం నిర్మించాడు. ఈ సభాభవనం కోసం తెచ్చిన వాటిలో మిగిలిన సామాగ్రితోనే, మయుడు ధర్మరాజుకు ‘మయసభ’ను కట్టి ఇచ్చాడు. ఆనాటి సభాభవనాల్లో, మయసభకు ఉన్న ఖ్యాతి చాలా గొప్పది.

వృషపర్వుని సభ కట్టగా మిగిలిన సామాగ్రితో కట్టిన మయసభయే అంత అందంగా ఉందంటే, ఇక వృషపర్వుడి సభ ఎంత అందమో ఊహించాల్సిందే.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

4వ పద్యం

తే. అతని కూఁతురు శర్మిష్ఠ యనఁగ నొప్పుఁ
గూర్మి సకియలు వేగురు గొల్వనెపుడు
నా చెలియఁగూడి యీ కొమ్మయాడుకొనుచు
నరమరలు లేని చెలుముల ననఁగి పెనఁగి.

ప్రతిపదార్థం :
అతని కూతురు = ఆ వృషపర్వుడనే రాక్షసరాజు కూతురు,
శర్మిష్ఠయనఁగన్ (శర్మిష్ఠ + అనగన్) = శర్మిష్ఠ అనే పేరు గలది ;
ఒప్పున్ = ఒప్పుతోంది ; (ఉంది)
కూర్మిసకియలు = ప్రియమైన చెలులు ; (ఆమెను)
ఎపుడున్ = ఎప్పుడూ
వేగురు కొల్వన్ = వేయిమంది సేవిస్తుండగా ;
ఒప్పున్ = ఒప్పుతుంది ; (ఆమె ఉంటుంది)
ఆ చెలియన్ = ఆ శర్మిష్ఠను ;
కూడి = కలసి ;
ఈ కొమ్మ = ఈ దేవయాని ;
అరమరలు లేని = పొరపొచ్చెములులేని ;
చెలుములన్ = స్నేహాంతో
అనగి పెనగి = కలసిమెలసి
ఆడుకొనుచున్ = ఆడుకుంటూ

భావం :
ఆ వృషపర్వునికి శర్మిష్ఠ అను పేరు కల కూతురు ఉంది. ఆమెకు వేయిమంది చెలులు. ఎప్పుడూ సేవలు చేస్తూ ఉంటారు. ఆ శర్మిష్ఠతో ఈ దేవయాని పొరపొచ్చెములు లేని స్నేహంతో కలసిమెలసి ఆడుకుంటూ తిరుగుతుంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

II.

5వ వచనం.

వచనం : తిరుగుచు నొక్కనాడు నీరాట సల్పునట్టియెడ.

ప్రతిపదార్థం :
తిరుగుచున్ = ఈ విధంగా వారు స్నేహంగా తిరుగుతూ;
ఒక్కనాడు = ఒకరోజున
నీరాట సల్పునట్టియెడన్ (నీరాట + చల్పు + అట్టి + ఎడన్) ;
నీరాట = జలక్రీడ
చల్పు + అట్టి + ఎడన్ = చేసేటటువంటి సమయంలో

భావం :
అలా తిరుగుతూ, ఒకరోజు వారు జలక్రీడ చేస్తున్న సమయంలో

36వ పద్యం

క. సురకరువలి చనుదెంచిన
దరిఁబెట్టినకోక లెల్లఁదడఁబడి పోఁగా
నరిగి యవి దెచ్చి చెలు ల
బ్బుర మగు తమ చీర లెల్లఁ బూనిన, నందున్

ప్రతిపదార్థం:
సురకరువలి = సుడిగాలి
చనుదెంచినన్ = రాగా
దరిన్ = ఒడ్డునందు (గట్టున)
పెట్టిన = తాము పెట్టినటువంటి (తాము పెట్టుకున్న)
కోకలు = కోకలు (చీరలు)
ఎల్లన్ = అన్నీ
తడబడిపోగాన్ = తారుమారు కాగా (చెల్లాచెదరు కాగా):
అరిగి = వెళ్ళి (వారందరూ గట్టుమీదికి వెళ్ళి)
అవి = ఆ తారుమారయిన చీరలు ;
తెచ్చి = తీసుకొనివచ్చి ;
చెలులు = ఆ శర్మిష్ఠ. చెలికత్తెలు
అబ్బురమగు = ఆశ్చర్యకరమైన
తమ చీరలు + ఎల్లన్ = తమ చీరలనన్నింటినీ
పూనినన్ = ధరింపగా
అందున్ = ఆ చీరల లోపల

భావం :
సుడిగాలిరాగా, గట్టుమీద వారు పెట్టుకున్న చీరలన్నీ తారుమారు అయ్యాయి (చెల్లాచెదరయ్యాయి). దానితో ఆ చెలికత్తెలు అపుడు పైకి వెళ్ళి, వారి బట్టలు తెచ్చుకొని ధరించారు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

7వ పద్యం

క. లలి నీ నెలఁతయుఁ దానును
వలువలు వీడ్వడఁగ దాల్చి, వైళమె చెలువల్
దలఁపింప నెఱిఁగి కినుకం
గులుకుచు రక్కసుల తేని కూఁతురు తెగువన్.

ప్రతిపదార్థం :
లలిన్ = ఒప్పునట్లుగా
ఈ నెలతయున్ = ఈ దేవయానియునూ ;
తానును = ఆ శర్మిష్ఠయునూ
వలువలు = చీరలు
వీడ్వడఁగఁ దాల్చి (వీడ్వడగన్ + తాల్చి) = తారుమారుగా ధరించి; (ఒకరి చీర మరొకరు కట్టుకొని)
వైళమ = ఆ వెంటనే
చెలువల్ = రాజకుమార్తె చెలికత్తెలు
తలపింపన్ = వారికి తమ పొరపాటును తెలియబరచగా
ఎఱిగి = అది తెలిసికొని (ఆ పొరపాటును తెలిసి)
కినుకన్ = కోపంతో
కులుకుచున్ = (తుళ్ళిపడుతూ) (పోట్లాడుతూ)
రక్కసుల లేని కూతురు = రాక్షసరాజు వృషపర్వుని కూతురు ; (శర్మిష్ఠ)
తెగువన్ = సాహసంతో

భావం :
అప్పుడు ఈమెయు, ఆమెయు ఒకరి చీరలు మరొకరు కట్టుకున్నారు. అది చూసి, చెలులు వారికి తెలియబరచారు. అపుడు రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ ఆ విషయం తెలిసికొని, కోపంతో త్రుళ్ళిపడుతూ, సాహసంతో ఇలా అంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

8వ పద్యం : (కంఠస్థ పద్యం)

* ఉ. ‘నెట్టన రేయినిం బగలు నేరమి వెట్టునటంచు వేలుపు
ల్వెట్టియుఁ గొట్నముల్చలుప వ్రీలని చేబలు వొప్పు పోఁకుడుం
బట్టము గట్టుకొన్న వృషపర్వుని కూఁతుర, నట్టి నేను నీ
కట్టిన మైలఁ గట్టుదునె కావరమేటికి వచ్చెనీ’ కనన్.

ప్రతిపదార్థం:
నెట్టన = మిక్కిలిగా
రేయినిన్ = రాత్రియునూ
పగలున్ = పగలునూ
నేరమీ వెట్టునటంచున్ (నేరమి + పెట్టును + అటంచున్) ;
నేరమి = దోషము
పెట్టు వేలుపుల్ = ఆరోపిస్తాడని ;
వెట్టియున్ = దేవతలు
కొట్నముల్ = ఊడిగములును (సేవలును)
చలుపన్ = చేస్తుండగా
వ్రీలని = భంగపడని
చేబలు వొప్పు (చేబలువు + ఒప్పు) = భుజబలము ఒప్పుతుండగా
సోకుడుంబట్టము (సోకుడు + పట్టము) = రాక్షసరాజ్యానికి పట్టాభిషేకము
కట్టుకున్న = చేసికొన్న
వృషపర్వుని కూతురన్ = వృషపర్వునికి కూతురిని
అట్టినేను = అటువంటి నేను
నీ కట్టిన మైలన్ = నీవు కట్టి విడిచిన మైలకోకను;
కట్టుదు = కట్టుకుంటానా ?
నీకున్ = నీకు
కావరము = గర్వము
ఏటికిన్ = ఎందుకు
వచ్చెన్ = వచ్చింది
అనన్ = అనగా

భావం :
“దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారో అని, రాత్రింబగళ్ళు తప్పకుండా వెట్టినీ, ఊడిగాన్నీ చేస్తుండగా, తిరుగులేని భుజబలంతో రాక్షసరాజ్యానికి పట్టాభిషేకం చేసికొన్న వృషపర్వుడి కూతురిని. అటువంటి నేను, నీవు కట్టుకున్న మైల చీరను కట్టుకుంటానా ? నీకు ఇంత పొగరు ఎందుకు వచ్చింది” అని శర్మిష్ఠ దేవయానిని అడిగింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

III.

9. వచనం విని యయ్యెలనాఁగకు దేవయాని యిట్లనియె.

ప్రతిపదార్థం :
విని = ఆ శర్మిష్ఠ మాటలు విని
అయ్యెలనాగకున్ = ఆ యువతియైన శర్మిష్ఠకు
దేవయాని = ఈ దేవయాని
ఇట్లనియె (ఇట్లు + అనియె) = ఇలా చెప్పింది.

భావం :
అది విని, శర్మిష్ఠతో దేవయాని ఇలా అన్నది.

10వ పద్యం

క. ‘ఉసు తొక్కటియై బొందులు
వెస రెండుగ నుండి, వల్వవీడ్వడుటకుఁ గాఁ
గస రెద, విధి తగ వగునా ?
పసిబిడ్డవె ? వాయి తెఱచి పల్కెదవు చెలీ !

ప్రతిపదార్థం:
చెలీ = ఓ చెలియా ! శర్మిష్ఠా !
ఉసురు = ప్రాణము (మన ఇద్దరి ప్రాణము)
ఒక్కటియై = ఒకటే అయి
బొందులు = శరీరాలు ;
వెసన్ = క్రమముగా ;
రెండుగన్ + ఉండి = రెండుగా ఉండి ;
వల్వ = చీర
వీడ్వడుటకుగాన్ = తారుమారైనందుకుగాను ;
కసరెదు = (నన్ను) కసరుకొంటున్నావు ; (విసుగుకుంటున్నావు)
ఇది = ఇలా కసరుకోడం
తగునా (తగవు + అగునా) = న్యాయమేనా ?
వాయి = నోరు
తెఱచి = తెరిచి
పల్కెదవు = మాట్లాడుతున్నావు.
పసిబిడ్డవె (పసిబిడ్డవు + ఎ) – నీవు పసిపిల్లవా ? ; (అంత తెలియని దానివా ?)

భావం :
ఓ చెలీ ! మనం ఇద్దరమూ ప్రాణం ఒకటియై, శరీరాలు రెండుగా బ్రతుకుతున్నాము. నీవు చీర తారుమారై నందుకే, ఇంతగా కసరుతున్నావు. ఇది న్యాయమేనా ? నోరుచేసి మాట్లాడుతున్నావు. నీవేమి పసిదానవా ?

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

11వ పద్యం

క. అనవుడు మడుగకఁ మిక్కిలి
కినుకం గేరడము లాడ గేలిగఁ గొనుచు
న్విని విని వేసరి యోర్వక
యెనసిన వగతోడఁ గూడ నీ పడుచనియెన్

ప్రతిపదార్థం :
అనవుడున్ = అని దేవయాని అనగా
ఉడుగక = మానక
మిక్కిలి కినుకన్ = మిగుల కోపంతో
కేరములు = నిష్ఠూరములు
ఆడన్ = పలుకగా (శర్మిష్ఠ మాట్లాడగా)
కేలిగన్ = పరిహాసముగా
కొనుచున్ = తీసుకుంటూ (శర్మిష్ఠ మాటలను)
విని విని = ఆ మాటలు విని విని ;
వేసరి = విసిగి, (దేవయాని విసిగి)
ఓర్వక = ఓర్చుకోలేక
ఎనసిన = పొందిన
వగతోడఁ గూడన్ (వగతోడన్ + కూడన్) = ఆ మాటలకు కలిగిన దుఃఖముతో కూడా
ఈ పడుచు = ఈ దేవయాని ;
అనియెన్ = ఇలా చెప్పింది

భావం :
ఈ దేవయాని అలా అన్నప్పటికీ, శర్మిష్ఠ మానక, కోపంతో అలాగే నిష్ఠూరములు మాట్లాడగా, ఈ దేవయాని వాటిని పరిహాసంగా భావించి విని విని, విసిగిపోయి, చివరకు వాటిని ఓర్చుకోలేక, మనస్సులో కలిగిన దుఃఖముతో ఇలా అంది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

12వ పద్యం : (కంఠస్థ పద్యం)

మత్తకోకిల.
‘ఓలి రక్కసి వంగడంబున కొజ్జకూరిమి కూఁతుర
వేలవేలుపుఁగన్నియం దగనీపు గట్టినపుట్టముం
దాలుపందగునమ్మ నా’ కని దాని కర్మిలిఁ బల్కఁ దా
నాలకింపక నూతఁద్రోచి గయాళి యై చనియెవ్వడిన్.

ప్రతిపదార్థం :
ఓలి = చెలీ !
రక్కసివంగ డంబునకున్ = రాక్షస వంశానికి
ఒజ్జ = గురువైన (శుక్రునకు)
కూరిమి కూతురన్ = గారాపు బిడ్డను;
నేలవేలుపు కన్నియన్= బ్రాహ్మణ కన్యను
తగన్ = ఒప్పునట్లుగా
నీవు = నీవు
కట్టినపుట్టమున్ = ధరించిన వస్త్రాన్ని
నాకున్ = నాకు ;
తాలుపన్ = ధరించడానికి
తగునమ్మ = తగునా తల్లీ !
అని = అని
దానికిన్ = ఆమెకు (శర్మిష్ఠకు)
అర్మిలిన్ + పల్కన్ = ప్రేమతో బదులు చెప్పగా
తాన్ = ఆమె (శర్మిష్ఠ)
ఆలకింపక = ఆ మాటలు వినక ;
గయాళియై = గయ్యాళిదై
వడిన్ = వేగముగా (దేవయానిని)
నూతన్ + త్రోచి = బావిలోకి తోసి
చనియెన్ = వెళ్ళింది.

భావం :
ఓసీ శర్మిష్ఠా ! నేను మీ రాక్షస వంశానికి తగినట్టి గురువైన శుక్రాచార్యుని గారాబు బిడ్డను. బ్రాహ్మణ కన్యను. కనుక నాకు మాత్రము, నీవు కట్టిన వస్త్రమును కట్టవచ్చునా? అని, ఆమె మాటలకు ప్రేమగా బదులు పలుకగా, శర్మిష్ఠ ఆ మాటలను వినిపించుకోకుండా, గయ్యాళితనముతో ఈమెను బావిలోకి త్రోసి వెళ్ళింది.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

13. వచనం
అని యక్కలికి తెఱం గెఱింగించిన విని
కటకటంబడుచు మగిడి పొగడందగు తేజినెక్కి
మక్కువతో యయాతి తన ప్రోలికిం జనియె.

ప్రతిపదార్థం :
అని = దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక
అక్కలికి (ఆ + కలికి) = ఆ శర్మిష్ఠ యొక్క
తెఱంగు = విధమును
ఎఱింగించినన్ = తెలుపగా
విని = (యయాతి) ఆ మాటలు విని ;
కటకటం బడుచున్ = బాధపడుతూ
మగిడి = తిరిగి
పొగడంగ (పొగడన్ + తగు) = పొగడదగిన
తేజిన్ = గుఱ్ఱాన్న
ఎక్కి = ఎక్కి
మక్కువతోన్ = ప్రేమతో
యయాతి = యయాతి
తన ప్రోలికిన్ = తన పట్టణానికి
చనియెన్ = వెళ్ళాడు.

భావం :
అని దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక ఆ సంగతంతా చెప్పగా విని, జాలిపడుతూ, ‘తిరిగి శ్రేష్ఠమైన గుఱ్ఱాన్ని ఎక్కి, యయాతి మహారాజు తన పట్టణానికి వెళ్ళాడు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

పాఠం నేపథ్యం

ప్రతిష్ఠానపురానికి రాజు యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినపుడు దారితప్పి, జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి, ఒంటరిగా అడవిలో తిరుగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యయాతి దప్పికగొని ఒక నూతి దగ్గరకు పోయాడు. ఆ నూతిలో నున్న ఒక స్త్రీ తనను రక్షించుమని ఏడుస్తుంటే అతడు కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా, కేవలం అచ్చతెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చతెనుగు పదాలు, అనగా దేశ్యపదాలు, మఱియు వికృతి పదాలు కలిసిన భాష. యయాతి చరిత్ర, తెలుగులో మొదటి అచ్చతెనుగు కావ్యం.

‘యయాతి చరిత్ర’ అనే ఈ అచ్చతెనుగు కావ్యాన్ని “పొన్నికంటి తెలగన” రచించాడు.
ఈ పాఠం, ‘యయాతి చరిత్ర’ కావ్యంలోని తృతీయాశ్వాసములోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి 1
పాఠం పేరు : ‘చెలిమి’

కవి పేర : ‘పొన్నికంటి తెలగన’

కవి కాలం : 16వ శతాబ్దం

పొన్నికంటి తెలగన ప్రసిద్ధి : పొన్నికంటి తెలగన, అచ్చతెనుగులో నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న “అచ్చ తెనుగు ఆదికవిగా” ప్రసిద్ధుడు.

నివాస స్థలము : గోలకొండ పరిసరాలలోని ‘పొట్లచెరువు’ (సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు).

తండ్రి : తెలగన తండ్రిపేరు, “భావనామాత్యుడు”.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

మార్గదర్శకుడు : అచ్చతెనుగు కావ్యరచనకు, తెలగనయే నియమాలను ఏర్పరచి, అచ్చతెనుగు కావ్యరచనకు “మార్గదర్శకుడు”గా నిలిచాడు.

యయాతి చరిత్ర : ‘యయాతి చరిత్ర’ కావ్యం, తెలుగు సాహిత్యంలో అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిది. మరియు అత్యుత్తమమైనది.

కావ్య విశిష్టత అంకితము : ఈ యయాతి చరిత్రను తెలగన, “అమీన్ ఖాన్” అనే మహ్మదీయ సర్దారుకు, అంకితం చేశాడు.

ప్రవేశిక

సృష్టిలో స్నేహం తీయనిది. మనం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనివీ, తోడబుట్టిన వారితో కూడా చెప్పుకోలేనివీ, అయిన` విషయాలను, స్నేహితులకు చెప్పుకుంటాం. మిత్రుడు మన తప్పులను ఎత్తి చూపిస్తాడు. మన మంచిని మెచ్చుకుంటాడు. మనకు అవసరమైతే సాయము చేస్తాడు. ఆపదలు వచ్చినపుడు మనలను విడిచిపెట్టడు. రహస్యాలను దాస్తాడు.

TS 9th Class Telugu Guide 7th Lesson చెలిమి

ఈ విధంగా ఎంతోమంది కలిసిమెలిసి ఉండే స్నేహితులు కూడా, ఒక్కొక్కసారి అనుకోకుండా శత్రువులుగా మారిపోతుంటారు. అలా మిత్రులు ఎందుకు శత్రువులుగా మారతారో తెలిసికోడానికి దానిలోగల మంచిని, చెడునూ విశ్లేషించి చూసుకోడానికి, ఈ పాఠం చదువుదాం.

Leave a Comment