TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

Telangana SCERT TS 6th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 1st Lesson సోమనాద్రి Textbook Questions and Answers.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson సోమనాద్రి

కింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సోమనాద్రి పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు.

పరిచయం: సురవరం ప్రతాపరెడ్డి గారి ‘హైందవ ధర్మవీరులు’ అనే గ్రంథం ఆధారంగా రచించిన సోమనాద్రి పాఠ్యభాగంలో గద్వాల సంస్థానపు రాజులలో ప్రముఖుడు, వీరుడు అయిన సోమనాద్రి గురించి వివరించారు.

తల్లిదండ్రులు : క్రీ.శ. 1750 ప్రాంతంలో జీవించిన సోమనాద్రి తల్లి బక్కమ్మ, తండ్రి పెద్దారెడ్డి, భార్య లింగమ్మ. గద్వాల కోట నిర్మాత ఇతడే.

స్వరూపం : సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల గంభీర విగ్రహం. దృఢమైన నల్లని శరీరం కలవాడు. సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు.

కళాపోషణ : సోమనాద్రి తనకు దైవవశాత్తూ దొరికిన గొప్ప నిక్షేపం (ధనం) తో నగరాన్ని, దేవాలయాలనూ అభివృద్ధి చేశాడు. కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల నుంచి వచ్చిన అనేకమంది కవులకూ, కళాకారులకూ బహుమానాలను ఇచ్చాడు.

యుద్ధ విజయాలు : గొప్ప పరాక్రమవంతుడైన సోమనాద్రి యుద్ధాలలో ఎన్నో విజయాలు సాధించాడు. రాయచూరు నవాబును, ప్రాగటూరు పాలకుణ్ణి తోడుతెచ్చుకున్నప్పటికీ సయ్యద్ దావూర్మియాను సోమనాద్రి యుద్ధంలో ఓడించాడు. సైన్యంతో వచ్చిన నిజాం నవాబు కూడా సోమనాద్రి ధాటికి తట్టుకోలేక సంధి చేసుకున్నాడు.

ముగింపు : ఈ విధంగా గద్వాల సంస్థానాన్ని ఏలిన సోమనాద్రి తన కాలంలో చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఎదురులేని వీరునిగా కీర్తి సాధించాడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

ప్రశ్న 2.
తుంగభద్రా నదీ తీరంలో సోమనాద్రి సాధించిన యుద్ధ విజయాన్ని వివరించండి.
జవాబు.
పరిచయం : సురవరం ప్రతాపరెడ్డి రచించిన ‘హైందవ ధర్మవీరులు’ అనే గ్రంథం ఆధారంగా రచించిన సోమనాద్రి పాఠ్యభాగంలో గద్వాల పాలించిన సోమనాద్రి అనే రాజు పరాక్రమం వర్ణించబడింది. సోమనాద్రి చేతిలో ఒకసారి ఓడిపోయి పరిహారం చెల్లించిన ఉప్పేడు పాలకుడు సయ్యద్ దావూద్ మియా నిజాం నవాబు సైన్యం సాయంతో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు.

శత్రువుల కూడిక : దావూద్మియా నిజాం నవాబు సైన్యంతో యుద్ధానికి సిద్ధం కావడంతో అంతకు ముందు సోమనాద్రి చేతిలో ఓడిపోయిన రాయచూరు, ప్రాగటూరు నవాబులు కూడా కక్ష తీర్చుకోవాలని నిజాం సైన్యంలో చేరారు. ఇంకా గుత్తి దుర్గాధిపతి, కర్నూలు నవాబు, బళ్ళారి నవాబులు కూడా నిజాం నవాబు సైన్యంలో వచ్చి చేరారు.

సోమనాద్రి పరాక్రమం : సోమనాద్రి తెల్లవారక ముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. ఆ రోజంతా నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు.

నవాబు ఉపాయం : సోమనాద్రి పరాక్రమానికి కలవరపడిన నిజాం నవాబు సోమనాద్రి శక్తికి కారణమైన అతని గుర్రాన్ని వశం చేసుకున్నాడు.

సోమనాద్రి తన గుర్రాన్ని తిరిగి రప్పించడం : గుర్రం లేకపోయినా ఆ రోజు సోమనాద్రి ధైర్యంగా యుద్ధం చేశాడు. బొచ్చెంగన్నపల్లి గ్రామానికి చెందిన బోయ సర్దారు అయిన హనుమప్ప నాయుడు ప్రాణాలకు తెగించి నిజాం డేరాలలో ఉన్న గుర్రాన్ని తెచ్చి సోమనాద్రికి అప్పజెప్పాడు.

కర్నూలు కోట ముట్టడి : తిరిగి వచ్చిన తన గుర్రంపై స్వారీ చేస్తూ సోమనాద్రి నిజాం సేనను కర్నూలు కోట వరకూ తరిమికొట్టాడు. తలుపులు మూసుకొని పోయిన కోటలో కొద్దిపాటి సైన్యంతోనే పోరాడి సోమనాద్రి కర్నూలు కోటను వశం చేసుకున్నాడు.

ముగింపు : సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన నిజాం నవాబు సోమనాద్రితో సంధి చేసుకున్నాడు.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానం రాయండి.

శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటి వాడు, ప్రసిద్ధి వహించిన వాడు సోమనాద్రి. సోమనాద్రికి “పెద్ద సోమభూపాలుడు’ అనే ప్రసిద్ధనామం కూడా ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతం వాడు. బక్కమ్మ, పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను పొందిన వాడు. దైవ సహాయం చేత ఈయనకు గొప్ప నిక్షేపం దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల నుంచి వచ్చిన అనేక మంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని, గద్వాల సంస్థానంలో కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
సోమనాద్రి ఏ కాలం వాడు?
జవాబు.
సోమనాద్రి క్రీ.శ. 1750 ప్రాంతం వాడు.

ప్రశ్న 2.
లింగమ్మ ఎవరు ?
జవాబు.
లింగమ్మ సోమనాద్రి భార్య

ప్రశ్న 3.
సోమనాద్రి ఏ పేరుతో ప్రసిద్ధుడు.
జవాబు.
సోమనాద్రి పెద్ద సోమభూపాలుడు’ అనే పేరుతో ప్రసిద్ధుడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

ప్రశ్న 4.
సోమనాద్రి నగరాన్ని, దేవాలయాలను ఏ ధనంతో అభివృద్ధి చేశాడు ?
జవాబు.
సోమనాద్రి దైవసహాయం చేత దొరికిన నిక్షేపంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేశాడు.

ప్రశ్న 5.
గద్వాల సంస్థానంలో ఉండి గ్రంథాలు రచించిన కవి ఎవరు ?
జవాబు.
గద్వాల సంస్థానంలో ఉండి కాణాదం పెద్దన రామాయాణాది గ్రంథాలు రాశారు.

2. కింది పేరాను చదవండి. ఖాళీలు పూరించండి.

తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ‘నిడుదూరు’ కు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న ‘కలుగోట్ల’ గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టం లేని సోమనాద్రే మొదట తన సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకూ భయంకరంగా యుద్ధం చేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దాటి కలుగోట్లను చేరి విశ్రమించాడు.

ఖాళీలు

1. నిడుదూరు తుంగభద్రానదికి ………………….. దిక్కున ఉన్నది
జవాబు.
దక్షిణ

2. సోమనాద్రి సైన్యం. ………………….. గ్రామంలో విడిది చేసింది.
జవాబు.
కలుగోట్ల

3. నిడుదూరు, కలుగోట్ల గ్రామాలలో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్ళు ………………….. దర్శనమిస్తాయి.
జవాబు.
బురుజులు, మిట్టలు

4. సోమనాద్రి తెల్లవారకముందే ………………….. సైన్యాన్ని ముట్టడించాడు.
జవాబు.
నిజాం

5. చీకటి పడ్డాక ………………….. తన సైన్యాన్ని మరల్చి నదిని దాటి కలుగోట్లను చేరాడు.
జవాబు.
సోమనాద్రి

3. క్రింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

గద్వాలకు పది మైళ్ళ దూరంలో ‘బొచ్చెంగన్నపల్లి’ అనే గ్రామం ఉన్నది. అక్కడి నుంచి వచ్చిన బోయసర్దారు హనుమప్పనాయుడు ఈ విషయం తెలుసుకున్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్న చొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు.

ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేనే కానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రం కోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనబడింది. గుర్రం కూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళల్లో కాంతి, నిక్కించిన చెవులు, తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్ప నాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రందంటు పుల్లల కోసం ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

ప్రశ్నలు:

ప్రశ్న 1.
గద్వాలకు పదిమైళ్ళ దూరంలో ఉన్న గ్రామం ఏది ?
జవాబు.
బొచ్చెంగన్న పల్లి

ప్రశ్న 2.
గుర్రాన్ని తేవడానికి సిద్ధపడింది ఎవరు ?
జవాబు.
హనుమప్ప నాయుడు

ప్రశ్న 3.
హనుమప్ప నాయుడు జొన్న చొప్పను మోపుగా కట్టి ఎక్కడికి సమీపించాడు ?
జవాబు.
నిజాం డెరాలను

ప్రశ్న 4.
హనుమప్ప నాయున్ని చూసి గుర్రం ఎలా స్పందించింది ?
జవాబు.
గుర్రం సకిలించింది.

ప్రశ్న 5.
హనుమప్ప నాయుడు జొన్న చొప్పను ఎంతకు బేరం పెట్టాడు ?
జవాబు.
ఐదు రూపాయలకు.

4. ఈ క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిజాం నవాబు సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు. సమయస్ఫూర్తి గల సోమనాద్రి కూడా సంధికి అంగీకరించాడు. యుద్ధ పరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజులో వున్న ‘ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో వున్న రామ, లక్ష్మణ అనే పేర్లు గల రెండు ఫిరంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంత భాగాన్ని సోమనాద్రికి ఇచ్చాడు. ఈ ప్రకారం సోమ భూపాలుడు సంధి చేసుకొని, యుద్ధపరిహారం పొంది విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
సోమనాద్రి గద్వాల కోటకు ఎలా తిరిగి వచ్చాడు ?
జవాబు.
విజయోత్సాహంతో

ప్రశ్న 2.
సంధి కారణంగా సోమనాద్రి నవాబు నుండి ఏమి పొందాడు ?
జవాబు.
ఎల్లమ్మ ఫిరంగిని, రామలక్ష్మణ అనే పేరు గల ఫిరంగులు.

ప్రశ్న 3.
నిజాం నవాబు సోమనాద్రి వద్దకు రాయబారిని ఎందుకు పంపాడు ?
జవాబు.
సంధికొరకు

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

ప్రశ్న 4.
కర్నూలులోని బురుజు పేరు ఏమి ?
జవాబు.
కొండా రెడ్డి బురుజు

ప్రశ్న 5.
సోమనాద్రికి గల గుణగణాలేమిటి ?
జవాబు.
సమయస్ఫూర్తి

5. ఈ క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

హనుమప్ప నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామి కార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు. అర్ధరాత్రి అయింది. సైనికులు అంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తన మీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడిచేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమచేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడిచేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగాలో చుట్టి గుర్రాన్ని తీసుకుని డేరాలు దాటాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
హనుమప్ప నొప్పిని భరించడానికి కారణం?
జవాబు.
స్వామి కార్యం

ప్రశ్న 2.
సైనికులంతా ఏం చేస్తున్నారు ?
జవాబు.
నిద్రిస్తున్నారు

ప్రశ్న 3.
హనుమప్ప దేనిని పక్కకు నెట్టి కూర్చున్నాడు ?
జవాబు.
తన మీద ఉన్న గడ్డిని

ప్రశ్న 4.
హనుమప్ప కత్తితో ఏ చేయిని నరుక్కున్నాడు ?
జవాబు.
కుడి చేతిని నరుక్కున్నాడు.

ప్రశ్న 5.
హనుమప్ప మొండిచేతిని దేనిలో చుట్టాడు ?
జవాబు.
తలపాగాలో చుట్టాడు.

6. క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి “సోమనాద్రిని లొంగదీసుకునే ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడొక సర్దారు సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది, దాన్ని వశం చేసుకుంటే గాని అతడు వశం కాడు” అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించి, అతన్ని వంచాలని ఆలోచించాడు, “తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు ఇస్తను” అని ప్రకటించాడు.

చూస్తూ చూస్తు మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు ? చివరకు ఒక సైసు సిద్ధమయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి, ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ఎట్లాగో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగానుంచి తప్పించాడు. గుర్రం మీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. గుర్రాన్ని చూడగానే నిజాము ఆనందానికి అంతులేకుండా పోయింది. వెంటనే ఆసైసుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడా బహుమానంగా ఇచ్చాడు.

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

ఖాళీలు:
1. సోమనాద్రి పరాక్రమానికి కారణం ……………………………
జవాబు.
సోమనాద్రి గుర్రం

2. మృత్యుముఖం అంటే ……………………………
జవాబు.
చావు నోట్లోకి వెళ్ళడం

3. నిజాం కలవరపడ్డాడు ఎందుకంటే ……………………………
జవాబు.
సోమనాద్రి పరాక్రమాన్ని చూసి

4. నవాబు దర్బారు చేయడానికి కారణం ……………………………
జవాబు.
సోమనాద్రిని లొంగదీసుకునే ఉపాయం కోసం.

5. సైసుకు నిజాం బహుమతులు ఇవ్వడానికి కారణం ……………………………
జవాబు.
సోమనాద్రి గుర్రాన్ని తీసుకువచ్చినందుకు.

7. క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కోటలోపల కొద్దిమంది సైన్యంతోనే ఉన్న సోమనాద్రి వీరోచితంగా పోరాడుతున్నాడు. తన సైన్యం చాలా వరకు హతమైంది. ఈలోగా బయట ఉన్న తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగ నిలిచింది. నిజాం సైన్యంలో అలజడి హెచ్చింది. పిడికెడు మందితోనే సోమనాద్రి కోట లోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే ఇంకేం చేస్తాడో అని భయపడ్డారు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధ విముఖులయ్యారు. ఈ స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్త కంఠంతో నచ్చజెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడయిన సయ్యద్ దావూద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
నిజాం సైన్యంతో పోరాడుతున్న రాజు ఎవరు ?
జవాబు.
సోమనాద్రి

ప్రశ్న 2.
యుద్ధం వద్దని ఎవరెవరు అనుకున్నారు ?
జవాబు.
గుత్తి, రాయచూరు నవాబులు

ప్రశ్న 3.
మంత్రులు నవాబుకు ఇచ్చిన సలహా ఏమి ?
జవాబు.
సోమనాద్రితో సంధి చేసుకోమని

TS 6th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana సోమనాద్రి

ప్రశ్న 4.
యుద్ధానికి ప్రధాన కారకుడెవరు ?
జవాబు.
సయ్యద్ దావూద్ మియా

ప్రశ్న 5.
సోమనాద్రికి తోడుగా ఉన్న సైనికుల సంఖ్య ఎంత ?
జవాబు.
పిడికెడు మంది సైన్యం.

Leave a Comment