TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 4th Lesson లేఖ Textbook Questions and Answers.

లేఖ TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ 1
ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏం చేస్తున్నారు ?
జవాబు.
బామ్మ (మామ్మ)గారు, ఒక విద్యార్థిని ఉన్నారు. ఆ అమ్మాయి ఉత్తరం చదువుతోంది. బామ్మ వింటోంది.

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

ప్రశ్న 2.
ఉత్తరంలో ఏమి ఉండవచ్చు ?
జవాబు.
మామ్మ బంధువులు రాసిన క్షేమ సమాచారాలు, విశేషాలు ఉత్తరంలో ఉండవచ్చును.

ప్రశ్న 3.
మీరెప్పుడైన ఉత్తరాలు రాయడం, చదవడం చేశారా ?
జవాబు.
నేను మా పాఠశాల గురించి నా స్నేహితురాలికి ఉత్తరం రాశాను. నా మిత్రులు, మా పెద్దలు నుండి నాకు వచ్చిన ఉత్తరాలు చదువుతూ ఉంటాను.

ప్రశ్న 4.
మీ ఊరి గురించి లేదా మీరు చూసిన ప్రాంతం గురించి ఎవరికైనా ఉత్తరాలు రాశారా ?
జవాబు.
నేను మా ఊరి గురించి (ఖమ్మం జిల్లా మధిర) నా స్నేహితునికి ఉత్తరం రాశాను. నేను చూసి వచ్చిన నాగార్జున సాగర్ గురించి మా మామయ్యకు ఉత్తరం రాశాను.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.33)

ప్రశ్న 1.
శైలజకు తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పి ఉంటారో ఊహించి చెప్పండి.
జవాబు.

  1. బస్సు ఎక్కేటప్పుడు ఒకరిని ఒకరు తోసుకోరాదని,
  2. చేతులు బయటపెట్టరాదని (బస్సులో)
  3. నీళ్ళలోకి దిగవద్దని,
  4. డబ్బులు జాగ్రత్తని – శైలజకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి ఉంటారు.

ప్రశ్న 2.
ఇంత గొప్ప నిర్మాణం ఎట్లా కట్టారా! అనడం వెనుక ఆంతర్యం ఏమిటి ?
జవాబు.
నాగార్జునసాగర్ డ్యాం చాలా పొడవుగా ఉంటుంది. చాలా పెద్ద నిర్మాణం. ఎంతోమంది పనిచేసుంటారని, ఎంతో నేర్పుతో, ఓర్పుతో కట్టి ఉంటారని అనిపించి, ఈ మాటలు సరళ అన్నది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.35)

ప్రశ్న 1.
ఆనాటి విగ్రహాలకు శిలలను వాడినారు కదా! మరి ఈ రోజుల్లో విగ్రహాల తయారీకి వేటిని వాడుతున్నారు ?
జవాబు.
ఆనాటి విగ్రహాలకు శిలలను వాడారు. ఈ రోజుల్లో విగ్రహాల తయారీకి సిమెంటు, ఇనుము, ఇసుక కలిపి వాడుతున్నారు.

ప్రశ్న 2.
” సింగరేణి కార్మికుల కష్టం మన ఇండ్లకు కాంతిగా మారింది” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు.
సింగరేణి కార్మికులు చాలా శ్రమపడతారు. భూమి లోపలి బొగ్గు గనుల్లోకి వెళ్ళి ప్రమాదాలను లెక్కచేయకుండా బొగ్గు తవ్వుతారు. ఆ బొగ్గుతో విద్యుత్ తయారై మనకు విద్యుత్ లభిస్తోంది. మన ఇండ్లలో బలు వెలుగుతో విద్యుత్ కాంతి వస్తోంది. అంటే వారి కష్టం కరెంటు (విద్యుత్) రూపంలో మన ఇండ్లలో విద్యుత్ కాంతిగా మారిందని అర్థం. ఆ కార్మికులకు ఎంతో ధన్యవాదాలని కూడా అర్థం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.37)

ప్రశ్న 1.
ప్రాచీన వస్తువులు భద్రపరచడం వల్ల కలిగే ఉపయోగాలేమిటి ?
జవాబు.
1. ప్రాచీన వస్తువులను భద్రపరచడంవల్ల రాబోయే తరాలవారికి మన సంస్కృతి తెలుస్తుంది.
2. మన ఆచార వ్యవహారాలు తెలుస్తాయి.
3. అప్పటి ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది.
4. ఆనాటి వస్తువుల నేర్పరితనం తెలుస్తుంది.

ప్రశ్న 2.
మధుర జ్ఞాపకాలను డైరీలలో ఎందుకు రాస్తారు ?
జవాబు.
మనిషి ఏ విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకోలేడు. కాబట్టి మధుర జ్ఞాపకాలను డైరీలో (దినచర్యలో) రాసుకుంటాడు. వాటిని అప్పుడప్పుడు చూసుకుంటే ఆ తియ్యటి జ్ఞాపకాలు ఆనందాన్నిస్తాయి.

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

ప్రశ్న 3.
యాత్ర ముగించుకొని ఇంటికి వస్తుంటే శైలజకు ఎందుకు బాధ కలిగియుండవచ్చు?
జవాబు.
ఆహ్లాదకరమైన, ఆనందకరమైన యాత్ర అప్పుడే ముగిసినందుకు శైలజకు బాధ కలిగి ఉండవచ్చును.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. హైదరాబాద్, వరంగల్ వంటి దర్శనీయ స్థలాల గురించి తెలుసుకున్నారు కదా! మరి మీ ప్రాంతంలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి చెప్పండి.
జవాబు.
మాది నల్గొండ జిల్లా ఆకుపాముల. మా జిల్లాలో పానగల్, భువనగిరి కోట, భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట లాంటి చూడదగ్గ స్థలాలు ఉన్నాయి. సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు చదివి వాటికి సంబంధించిన స్థలాల పేర్లను పాఠంలో వెతికి రాయండి.

అ. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా! అని ఆశ్చర్యం వేసింది.
జవాబు.
ఇది నాగార్జునసాగర్కకు సంబంధించినది. సాగర్ ఆనకట్ట నిర్మాణం గురించి చెప్పిన మాటలు.

ఆ. తొలి కందపద్యాలు ఇక్కడ శిలపై చెక్కబడి ఉన్నవి.
జవాబు.
బొమ్మల గుట్ట గురించి చెప్పిన సందర్భంలో చెప్పిన విషయాలు.

ఇ. మమ్మల్ని మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా! అని అనిపించింది.
జవాబు.
వరంగల్ కోట.

ఈ. అక్కడున్న బొగ్గు బావులను చూసినం.
జవాబు.
సింగరేణి బొగ్గు గనులు.

ఉ. అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు.
జవాబు.
చార్మినార్ గురించి.

2. కింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మందమర్రి,
తేది : x x x x.

పత్రికా సంపాదకునికి,
నమస్కారం!

దేశంలో అడవులు బాగా తగ్గిపోతున్నాయి. బహుళ అంతస్తుల భవన నిర్మాణాల కోసం, రహదారుల విస్తరణ కోసం చెట్లను విచక్షణారహితంగా నరుకుతున్నారు. రాబోయే తరాల శ్రేయస్సు పట్టకుండా పర్యావరణానికి ముప్పుతెస్తున్నారు. దీనివల్ల వర్షాలు సరిగా పడక రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది. వృక్షజాలంతోపాటు జంతుజాలం కూడా నశిస్తున్నది. ఈ విధ్వంసాన్ని ఇప్పటికైనా ఆపాలి. పర్యావరణ పరిరక్షణ అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. ఈ విషయంపై పత్రికాముఖంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరుతున్నాను. కృతజ్ఞతలతో….

ఇట్లు,
ఆర్. వెంకట్

ప్రశ్నలు

అ. లేఖను ఎవరు, ఎక్కడినుంచి రాశారు ?
జవాబు.
మందమర్రి నుంచి ఆర్. వెంకట్ రాశారు.

ఆ. రైతుల పరిస్థితి దిగజారడానికి ముఖ్య కారణం ఏమిటి ?
జవాబు.
వర్షాలు సరిగ్గా పడక రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది.

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

ఇ. చెట్లను ఎందుకు నరికి వేస్తున్నారు ?
జవాబు.
భవన నిర్మాణాల కోసం, రహదారుల విస్తరణ కోసం చెట్లను విచక్షణారహితంగా నరుకుతున్నారు.

ఈ. పర్యావరణ పరిరక్షణ కోసం మనమేం చేయాలి ?
జవాబు.
చెట్లను నరకకూడదు. చెత్త, మురికితో కాలుష్యం పెంచకూడదు. వీలైనన్ని చెట్లు పెంచాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను, రసాయనాలను ఉపయోగించడం తగ్గించాలి.

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఉత్తరాల ద్వారానే కాకుండా నేటి కాలంలో సమాచారాన్ని పంపడానికి వేటిని ఉపయోగిస్తున్నారు ?
జవాబు.

  1. నేటికాలంలో సమాచారాన్ని పంపడానికి, సెల్ఫోన్లలో సంక్షిప్త సమాచారం (మెసేజ్) పంపుతున్నారు.
  2. కొరియర్ ద్వారా పంపుతున్నారు.
  3. (ఈ.మెయిల్) పంపుతున్నారు.
  4. యాప్స్ (వాట్సప్) ద్వారా సమాచారం పంపుతున్నారు.
  5. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా సమాచారాన్ని పంపుతున్నారు.
    ఈ విధంగా ఆధునిక సాంకేతిక ప్రగతిని వినియోగించుకొని సమాచారాన్ని పంపుతున్నారు.

ఆ. యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏయే జాగ్రత్తలు పాటించాలి ?
(లేదా)
కొత్తప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?
జవాబు.

  1. ముందుగా పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన విషయాలను తెల్సుకోవాలి.
  2. వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి.
  3. నీరు, ఆహారం లభ్యత గురించి తెలుసుకోవాలి.
  4. అవసరమైన మందులు (ఔషధాలు) తీసుకువెళ్ళాలి.
  5. వైద్యుని ఫోన్ నెం. (సలహాల కొరకు) తెలుసుకోవాలి.
  6. మంచినీటిని తీసుకువెళ్ళాలి లేదా స్వచ్ఛమైన నీటిని వాడాలి.
  7. తేలికగా (సులువుగా) జీర్ణం అయ్యే ఆహారాన్ని, తాజా ఆహారాన్ని తినాలి.

ఇ. పురాతన కట్టడాలు, నదులు, దేవాలయాలు మొదలైనవాటిని చూడటానికి పోయినపుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఎందుకు ? (లేదా) చారిత్రక ప్రదేశాల సందర్శనలో మనమెలా ప్రవర్తించాలి ?
జవాబు.

  1. క్రమశిక్షణ పాటించాలి.
  2. పురాతన కట్టడాలను చేతితో తాకి, పేర్లు రాసి, బొమ్మలు గీసి పాడు చేయరాదు.
  3. నదులలో తొందరపడి ఈతకు దిగరాదు. (సూచనలను పాటించకుండా)
  4. దేవాలయాలకు సంబంధించిన పద్ధతులను, నియమావళిని పాటించాలి.
  5. సిబ్బంది, అధికారులు చెప్పిన సూచనలను తప్పక పాటించాలి.
  6. ఫోటోలు, వీడియోలు చిత్రించుటకు అనుమతిని తీసుకోవాలి.
  7. పరిశుభ్రత పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఉమ్ములు వేయడం, మలమూత్ర విసర్జన చేయడం పనికి రాదు.

ఈ. శైలజ తన స్నేహితురాలికి రాసిన లేఖను చదివారుకదా! మీరైతే శైలజకు మళ్ళీ ఏమని ఉత్తరం రాస్తారు ?
జవాబు.

పోచంపల్లి,
ది. x x x x x x

ప్రియమైన శైలజకు,

ఎలా ఉన్నావ్ ? నేను కులాసాగా ఉన్నాను. నీవు రాసిన ఉత్తరం అందినది. చాలా సంతోషం. నీవు చూసిన నాగార్జునసాగర్, హనుమకొండ, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, సింగరేణి గనులు, హైదరాబాద్ గద్వాల్ కోట మొదలయినవి నేను కూడా చూశాను. మా నాన్నగారు ఎండాకాలం సెలవులలో కుటుంబంతో కలిసి ఈ ప్రదేశాలకు తీసుకువెళ్ళారు. ఎంతో చూడదగ్గ ప్రదేశాలు. మన తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైనవి, దర్శించదగినవి. నేను బాగానే చదువుచున్నాను. ఇంకా విశేషాలు ఉంటే జాబు (ఉత్తరం) రాయి.

ఇట్లు,
బి. సాయిశ్రావ్య,
రంగాపురం.

చిరునామా :
ఎస్. శైలజ,
6వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
వేముల, కరీంనగర్ జిల్లా.

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. “విజ్ఞానయాత్రల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంది.” దీనిని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
విద్యార్ధులలో విజ్ఞానాన్ని పెంపొందించుటకు విజ్ఞాన యాత్రలు తోడ్పడతాయని లేఖ పాఠం ఆధారంగా రాయండి.
జవాబు.
విజ్ఞానం కొరకు చేసే యాత్రలు విజ్ఞానయాత్రలు :

  1. అనేక ప్రదేశాలు తిరగటం వల్ల విషయావగాహన పెరుగుతుంది.
  2. ఆయా ప్రదేశాలలోని భాష, అక్కడి ప్రజల ఆచారాలు, ఆహార అలవాట్లు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి.
  3. చారిత్రక విషయాలు అవగతం అవుతాయి.
  4. నిర్మాణాలు, కట్టడాలవల్ల ఆనాటి వాస్తు, శిల్పకళ మున్నగు విషయాలు తెలుస్తాయి.
  5. ఆనాటి పండుగలు, జన జీవనం తేటతెల్లం అవుతాయి.
  6. నదులు’ వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తాయి.
  7. దేవాలయాలలో వాస్తుకళ, సాంకేతిక పరిజ్ఞానం, కట్టడ నిర్మాణాలు (తెలుస్తాయి) ప్రత్యక్షంగా దర్శిస్తారు.
  8. పాతకాలం నాటి నీరుపారుదల విధానం, చెరువుల నిర్మాణం సాగు, తాగునీటి విధానాలు తెలుస్తాయి.
  9. క్రమశిక్షణ పెరుగుతుంది. స్నేహభావం, సోదర భావం, సర్దుబాటు ధోరణి పెరుగుతాయి.

IV. సృజనాత్మకత/ప్రశంస

మీరు చూసిన యాత్రా విశేషాలను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు.

కోదాడ,
ది. x x x x x x

ప్రియమైన స్నేహితురాలు సాయిశృతికి,

నీ మిత్రురాలు రాయునది. నేను క్షేమం. ఈ మధ్య మా పాఠశాల విద్యార్థులను మా ‘సార్లు’ భద్రాచలం తీసుకువెళ్ళారు. భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి రామాలయం చాలా ప్రసిద్ధి పొందింది. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న దీనిని నిర్మించాడు. చుట్టూ దండకారణ్యం ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పర్ణశాల ఉన్నది. భద్రగిరిపై నిర్మించబడిన దేవాలయం ఇది. జటాయువుపాక, దమ్ముగూడెం, శబరిగిరి మొదలైనవి దర్శనీయ స్థలాలు. ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మేమందరం గోదావరిలో స్నానం చేసి, అన్నీ చూసి వచ్చాము. అక్కడి వాతావరణం ఎంతో బాగుంది. నీవు చూసిన యాత్రను గురించి రాయకోర్తాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
బి. శ్రావ్య, కోదాడ.

చిరునామా :
వి. సాయిశృతి,
6వ తరగతి,
రంగాపురం,
మంచాల మండలం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

V. పదజాల వినియోగం:

1. కింది పదాలు చదువండి. వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి.

అ. గుడి = __________
జవాబు.
దేవాలయం, కోవెల

ఆ. ఆనవాళ్ళు = __________
జవాబు.
గుర్తులు, జాడలు, చిహ్నములు

ఇ. ఆనందం = __________
జవాబు.
సంతోషం, హర్షం.

ఈ. ప్రథమ = __________
జవాబు.
మొదటి, ఆది

ఉ. సందర్శించుట = __________
జవాబు.
చూచుట

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

2. కింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. అనుభూతి
జవాబు.
విహారయాత్రలలో పొందే అనుభూతులు మరచిపోలేనివి.

ఆ. ఆకర్షణ
జవాబు.
రామప్పగుడిలో నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

ఇ. కమ్మగా
జవాబు.
కమ్మగా వండిన గారెలు నోరు ఊరిస్తాయి.

ఈ. జ్ఞాపకం
జవాబు.
ఇష్టపడి చదివిన విషయం జ్ఞాపకం ఉండిపోతుంది.

ఉ. దర్శనం
జవాబు.
పురాతన కట్టడాలు, ఆలయాల దర్శనం మనసుకు ఆనందం.

ఊ. ప్రాచీనం
జవాబు.
గోల్కొండ కోట చాలా ప్రాచీన కట్టడం

ఋ. యాత్ర
జవాబు.
మా విహారయాత్ర సుఖంగా సాగింది.

ౠ. మహనీయుడు
జవాబు.
గాంధీ వంటి మహనీయుడు పుట్టిన దేశం మనది.

3. కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి.

అ. దుర్గం, కోట, ఖిల్లా, జాగ
జవాబు.
జాగ అనేది స్థలం.
దుర్గం, కోట, ఖిల్లా – పర్యాయపదాలు

ఆ. గుడి, బడి, దేవాలయం, మందిరం
జవాబు.
బడి చదువు నేర్పేది బడి.
గుడి, దేవాలయం, మందిరం – పర్యాయపదాలు

ఇ. శిల, రాయి, దండ, బండ
జవాబు.
దండ శిల, రాయి, బండ – పర్యాయపదాలు

ఈ. గాలం, నీరు, జలం, సలిలం
జవాబు.
గాలం గాలం చేపలు పట్టడానికి ఉపయోగం
నీరు, జలం, సలిలం – పర్యాయపదాలు

ఉ. కన్ను, నేత్రం, రెప్ప, నయనం
జవాబు.
రెప్ప రెప్ప కంటిలో భాగం. మిగతా
కన్ను, నేత్రం, నయనం – పర్యాయపదాలు

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. మీకు తెలిసిన స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలను రాయండి.

అ. స్త్రీలింగ పదాలు
జవాబు.
అంజన, గిరిజ, వనజ, లక్ష్మి, హేమ, నాగమణి

ఆ. పుంలింగ పదాలు
జవాబు.
వినాయకుడు, చక్రపాణి, విష్ణువు, హరి, చెన్నయ్య, రమణ.

ఇ. నపుంసకలింగ పదాలు
జవాబు.
పుస్తకం, గోడ, చెట్టు

విభక్తి ప్రత్యయాలు :

కింది వాక్యాలను గమనించండి.

అ. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి, బతుకమ్మ పండుగ ప్రతీక.
ఆ. హోళి పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఇ. పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు.
ఈ. వాణి పూజ కొరకు పూలను కోసింది.
ఉ. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం.

పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదువండి.
ఉదా : పీర్ల ఇత్తడి వెండి తయారుచేస్తారు.
పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తున్నది. ‘పీర్ల ఇత్తడి వెండి’ అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదువండి.
“పీర్లను ఇత్తడితో, వెండితో తయారుచేస్తారు”. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని “విభక్తి ప్రత్యయాలు” అంటారు.

విభక్తి ప్రత్యయాలు:

ప్రత్యయాలు  విభక్తులు
అ. డు, ము, వు, లు  ప్రథమా విభక్తి
ఆ. ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి  ద్వితీయా విభక్తి
ఇ. చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)  తృతీయా విభక్తి
ఈ. కొఱకు(న్), కై (కోసం)  చతుర్థీ విభక్తి
ఉ. వలన(న్), కంటె(న్), పట్టి  పంచమీ విభక్తి
ఊ. కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్)  షష్ఠీ విభక్తి
ఋ. అందు(న్), న(న్)  సప్తమీ విభక్తి
ౠ. ఓ, ఓరి, ఓయి, ఓసి  సంబోధన ప్రథమా విభక్తి

2. పాఠంలోని 5, 6, 7 పేరాలు చదివి వివిధ విభక్తులున్న పదాలను వెతికి రాయండి.

విద్యార్థి కృత్యం

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

ప్రాజెక్టు పని

పాఠంలో రామప్పగుడి, గద్వాలకోట, వరంగల్ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మొదలైన వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా! వీటిలో ఏదైనా ఒకదాని గురించి పూర్తి వివరాలు సేకరించండి. రాసి, చదివి వినిపించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : చార్మినార్ గురించి వివరాలు సేకరించి, నివేదిక రాయడం.

2. సమాచార సేకరణ : అ) సమాచారం సేకరించిన తేది : ఆ) సమాచార వనరు : అంతర్జాలం

3. సేకరించిన విధానం : ఇంటర్నెట్ కు వెళ్ళి చార్మినార్ గురించిన వివరాలు సేకరించడం జరిగింది.

4. నివేదక చార్మినార్ :
చార్మినార్ మూసీనదికి దక్షిణాన ఉంది. 1591-92 సంవత్సరాలలో కులీకుతుబ్షా దీనిని నిర్మించాడు. దీని ఎత్తు56 మీటర్లు. ఈ కట్టడాన్ని సున్నంతో నిర్మించారు. చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నాయి. హిందీలో స్తంభాన్ని మినార్ అంటారు. చార్ అంటే నాలుగు. నాలుగు స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఆ కట్టడాన్ని చార్మినార్ అని అంటారు. ఒక్కొక్క మినార్ ఎత్తు 30 మీటర్లు, 148 మెట్లు వలయాకారంలో ఉన్నాయి. రెండవ అంతస్థులో నిర్మించిన మసీదులో ఒకేసారి 240 మంది నమాజు చేసుకునే వీలుంది. కింది అంతస్థులో నీటి ఫౌంటెన్ ఉంది.

చార్మినార్ను భాగమతికి ప్రేమ కానుకగా నిర్మించారని కొందరు చరిత్రకారులు చెపుతారు. మరికొందరు ఆ కాలంలో కలరా జబ్బు వ్యాపించిందట. ఎంతోమంది చనిపోయారట. దాని నివారణకు గుర్తుగా నాలుగు రోడ్ల కూడలిలో చార్మినార్ నిర్మించాడని మరికొందరు చెపుతారు. చార్మినార్కి నాలుగువైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. వీటి మధ్యలో రకరకాల అంగళ్ళు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గాజులు, నగలు, బట్టలు మొదలైనవి దొరుకుతాయి. ఈ ప్రాంతం మంచి ముత్యాల అమ్మకానికి ప్రసిద్ధి. 5. ముగింపు : చార్మినార్ నిర్మాణం గొప్పదనం తెలుసుకోవడం జరిగింది.

TS 6th Class Telugu 4th Lesson Important Questions లేఖ

ప్రశ్న 1.
రామప్ప దేవాలయం గురించి రాయండి.
జవాబు.
రామప్ప గుడి వరంగల్ జిల్లాలో పాలంపేట గ్రామంలో ఉన్నది. రామప్పగుడిని కాకతీయరాజు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇక్కడి శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఏ దిక్కునుండి చూసినా, అది వారినే చూస్తున్నట్లు ఉంటుంది. ఈ గుడికి దగ్గర రామప్ప చెరువు ఉంది.

అర్ధాలు

  • పండుగ = ఉత్సవం
  • సంబురం = సంతోషం
  • పులకరించు = పులకితమగు, గగుర్పొడుచు
  • తుంపర = నీటి బొట్టు
  • ఝల్లు = జల్లు పదంలో వచ్చిన మార్పు
  • అవశేషాలు = మిగిలినవి

పర్యాయపదాలు

  • పండుగ = పబ్బం, ఉత్సవం, వేడుక
  • నింగి = మిన్ను, ఆకాశం, గగనం
  • కొండ = గుట్ట, పర్వతం, గిరి, నగం
  • గుడి = కోవెల, దేవళం, దేవాలయం
  • యుద్ధం = రణం, సమరం, సంగరం

I. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి.

చాలా మంది పిల్లలు, పెద్దలు, టి.వి. చూస్తూ తినడం చేస్తారు. దాని వల్ల ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియదు. సమయానుకూలంగా కూడా తినరు. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండడం మొదలైనవన్నీ కూడా ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. ఈ విధంగా ఆహార నియమాలు, అలవాట్లను లేనివారు తరుచుగా ఎన్నో జబ్బులకు గురవుతారు. తినేటప్పుడు మాట్లాడడం, సరిగా నమలకపోవడం వంటి వాటివల్ల తేన్పులు, పొట్ట ఉబ్బరం కలుగుతుంది. వేగంగా తినడం నైపుణ్యం కాదు. నెమ్మదిగా నమిలి తినాలి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
టి.వి చూస్తూ తినడం అనేది
a) మంచి అలవాటు
b) చెడ్డ అలవాటు
c)చాలా మంచి అలవాటు
జవాబు.
b) చెడ్డ అలవాటు

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

ప్రశ్న 2.
త్వరగా పడుకోకపోవడం వలన
a) ఆరోగ్యంగా ఉంటారు
b) అనారోగ్యంగా ఉంటారు
c) ఆనందంగా ఉంటారు
జవాబు.
b) అనారోగ్యంగా ఉంటారు

ప్రశ్న 3.
తినేటపుడు మాట్లాడడం, సరిగ్గా నమిలి తినకపోవడం
a) అనారోగ్యానికి కారణాలు
b) ఆరోగ్య కారణాలు
c) మానసిక కారణాలు
జవాబు.
a) అనారోగ్యానికి కారణాలు

ప్రశ్న 4.
తినేటపుడు సాధారణంగా అందరూ చేస్తున్న పని
a) ఆడుతూ తినడం
b) మాట్లాడుతూ తినడం
c) టి.వి. చూస్తూ తినడం
జవాబు.
b) మాట్లాడుతూ తినడం

ప్రశ్న 5.
తినడంలో ఆచరించదగిన పద్ధతి
a) మాట్లాడుతూ తినడం
b) గబగబాతినడం
c) బాగా నమిలి తినడం
జవాబు.
c) బాగా నమిలి తినడం

II. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు తప్పు, ఒప్పులను గుర్తించండి.

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ

ప్రశ్నలు:

ప్రశ్న1.
కూరిమితో ఉన్నపుడు గొడవులు జరుగుతాయి
జవాబు.
(తప్పు)

ప్రశ్న 2.
కూరిమి అనగా ద్వేషము అని అర్థము
జవాబు.
(తప్పు)

ప్రశ్న 3.
పై పద్యము సుమతీ శతకం లోనిది
జవాబు.
(ఒప్పు)

ప్రశ్న 4.
ప్రేమ, మైత్రి చెడిపోతే గొడవలు జరుగవు
జవాబు.
(ఒప్పు)

ప్రశ్న 5.
పై పద్యం స్నేహం గురించి చెబుతుంది
జవాబు.
(ఒప్పు)

పదజాలం/ వ్యాకరణం

III. కింది వాటికి సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. మన కుటుంబ సభ్యులంతా కలిస్తే ఆనందంగా ఉంటుంది. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
a) దుఃఖం
b) విచారం
c) సంతోషం
d) సరదా
జవాబు.
c) సంతోషం

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

2. ఏకలవ్యుడు విలువిద్యలో నేర్పును ప్రదర్శించాడు. గీతగీసిన పదానికి అర్థం రాయండి.
a) నైపుణ్య
b) నాణ్యత
c) క్రమశిక్షణ
d) బుద్ధి
జవాబు.
a) నైపుణ్య

3. కింది పదాల వరుస చూడండి. వరుసలో లేని పదం రాయండి.
a) వేయి స్తంభాల గుడి
b) భద్రకాళి గుడి
c) వరంగల్ కోట
d) నాగార్జునసాగర్
జవాబు.
d) నాగార్జునసాగర్

4. వరుసలో లేని పదం రాయండి.
a) చార్మినార్
b) సాలార్జంగ్ మ్యూజియం
c) గోలుకొండ కోట
d) రామప్ప చెరువు
జవాబు.
d) రామప్ప చెరువు

5. “అంజన” ఇది ఏ లింగ పదం ?
a) పుంలింగం
b) స్త్రీ లింగం
c) నపుంసకలింగం
d) ఏదీకాదు
జవాబు.
b) స్త్రీ లింగం

6. ‘విష్ణువు’ ఇది ఏ లింగ పదం ?
a) నపుంసక లింగం
b) స్త్రీ లింగం
c) పుంలింగం
d) ఏదీకాదు
జవాబు.
c) పుంలింగం

7. నపుంసక లింగ పదానికి ఉదాహరణ.
a) పుస్తకం
b) చక్రపాణి
c) అభిసారిక
d) తరుణి
జవాబు.
a) పుస్తకం

8. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక (గీత గీసినవి ఏ విభక్తులు?)
a) ప్రథమా విభక్తి
b) సప్తమీ విభక్తి
c) షష్ఠీ విభక్తి
d) చతుర్థీ విభక్తి
జవాబు.
c) షష్ఠీ విభక్తి

9. వాణి పూజ కొరకు పూలను కోసింది. (ఏ విభక్తి ?)
a) చతుర్థీ విభక్తి
b) షష్ఠీ విభక్తి
c) సప్తమీ విభక్తి
d) పంచమీ విభక్తి
జవాబు.
a) చతుర్థీ విభక్తి

10. ‘నిన్, నున్, లన్, కూర్చి, గురించి” ఇవి ఏ విభక్తులు ?
a) ద్వితీయా
b) ప్రథమా
c) సప్తమీ
d) చతుర్థీ విభక్తి
జవాబు.
a) ద్వితీయా

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

11. సప్తమీ విభక్తిలో వచ్చు ప్రత్యయాలు.
a) ఓయి, ఓరి, ఓసి
b) డు, ము, వు, లు
c) అందు (న్), న (న్)
d) వలన (న్), కంటె (న్)
జవాబు.
c) అందు (న్), న (న్)

12. ‘పూర్వపు రాజులు వాడిన వస్తువులు చక్కగా భద్రపరిచారు.’ ఈ వాక్యంలోని సంయుక్తాక్షరాలు
a) క్క వా, పు
b) పూ, పు, చ, క్క, ప, చా
c) ర్వ, స్తు, ద్ర
d) వా, వ, వు, లు, రా, రి, రు
జవాబు.
c) ర్వ, స్తు, ద్ర

13. ‘అక్కడున్న వాటిలో గంటకొట్టే బొమ్మ బాగున్నది’ – ఈ వాక్యంలోని ద్విత్వాక్షరాలు ….
a) గ, బొ, బా , గు, ది
b) క్క న్న, ట్టే, మ్మ, న్న
c) క్క, ట, కొ, ట్టే
d) గంట, కొట్టే ..
జవాబు.
b) క్క న్న, ట్టే, మ్మ, న్న

14. ‘జ్ఞానం మేలు చేస్తుందన్నాడు కణాదుడు.’ ఈ వాక్యంలోని అనునాసికాలు
a) జ్ఞానం, మేలు, చేస్తుంది
b) జ్ఞా, న, మే, న్నా, ణా
c) జ్ఞా, దు
d) చేస్తుంది, అన్నాడు.
జవాబు.
b) జ్ఞా, న, మే, న్నా, ణా

15. శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుడు’. ఈ వాక్యంలోని ఊష్మాలు
a) శా, వా, వం, తొ
b) త, న, తొ
c) వా, వ, రా, ల
d) శా, హ, శ్రీ
జవాబు.
d) శా, హ, శ్రీ

పాఠం ఉద్దేశం

లేఖా రచనను పరిచయం చేస్తూ తెలంగాణాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం “లేఖారచన” ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలుంటాయి.

TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

ప్రవేశిక

వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధోవికాసానికి బాటలు వేస్తుంది. మానసిక చైతన్యాన్ని కల్గిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువల్ల అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖా రూపంలో ఉన్న ఈ పాఠం చదువండి.

నేనివి చేయగలనా?

  • నాకు ఇష్టమైన కాలం గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచితమైన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • నాకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయగలను. – అవును/ కాదు

Leave a Comment