TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 12th Lesson కాపాడుకుందాం Textbook Questions and Answers.

కాపాడుకుందాం TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి 

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 2

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో ఒక కట్టెలు కొట్టేవాడున్నాడు.

ప్రశ్న 2.
బొమ్మలోని వ్యక్తి ఏమి చేసి ఉండవచ్చు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి కట్టెల కోసం చెట్లన్నింటినీ నరికేసి ఉండవచ్చు.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

ప్రశ్న 3.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని మీరు అంగీకరిస్తారా ? ఎందుకు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని నేను అంగీకరించను. ఎందుకంటే చెట్లు మనకు ప్రాణాధారం. చెట్లను కొట్టేస్తే వాతావరణంలో సమతౌల్యం లోపిస్తుంది.

ప్రశ్న 4.
ప్రకృతిని కాపాడాలంటే ఏమి చేయాలి ?
జవాబు.
ప్రకృతిని కాపాడాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
“అడవి జంతువులు – పల్లె బాట పట్టాయి” దీనికి గల కారణాలు చెప్పండి.
జవాబు.
మనిషి తన అవసరాల కోసం, నివాసం కోసం అడవులను నరికేస్తున్నాడు. దానితో అడవులు అంతరించి పోతుంటే అక్కడ నివసించే జంతువులకు ఉండటానికి చోటు లేకుండా పోతోంది. అందుకే అడవి జంతువులు పల్లెబాట పట్టాయి.

ప్రశ్న 2.
“చెరువులే గ్రామాలకు మూలాధారాలు” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
గ్రామాలలో నదులు ప్రవహించే ప్రాంతాలు చాలా తక్కువ. అందుకే ప్రతి ఊరిలోనూ చెరువులు తవ్వేవారు. వానలు పడ్డప్పుడు చెరువులు నిండి గ్రామానికి నీటివసతి కలిగేది. పశువులకు, నీటిలో ఉండే జంతువులకూ కూడ నీటి కొరత లేకుండా ఉండేది. అందుకే చెరువులే గ్రామాలకు మూలాధారాలు.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

ప్రశ్న 3.
మనిషి ఆశే అనర్థాలకు కారణం. దీనిని సమర్థిస్తూ నాలుగు వాక్యాలను చెప్పండి.
జవాబు.
మనిషి ఆశే అనర్థాలకు మూలకారణం. మనిషికి ఆశ ఎక్కువై ప్రకృతి సంపదనంతా పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లను పెంచటం లేదు. చెరువులను ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారు. చెరువుల స్థలాన్ని కూడ కబ్జా చేస్తున్నాడు. కర్మాగారాలలోని రసాయనాలు కలిసిన మురుగు నీటిని నదులూ, చెరువుల్లో కలుపుతూ నీటిని కలుషితం చేస్తున్నాడు. తన ఆనందంకోసం పెద్ద సౌండు బాక్సులూ, టి.వి.లు, టేప్ రికార్డర్లనుండి పెద్ద శబ్దాలు చేస్తూ శబ్దకాలుష్యాన్ని కలిగిస్తున్నాడు.

ప్రశ్న 4.
“సెల్వర్లు పక్షులకే కాక మానవులకు కూడా శాపమే” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు.
సెలవర్లనుండి వచ్చే సిగ్నల్స్లో ఉన్న రేడియేషన్ వల్ల చాలామటుకు పక్షుల జాతులు అంతరించిపోతున్నాయి. మనుషులకు కూడా ఈ రేడియేషన్ వల్ల రకరకాల రోగాలు అంటుకుని ప్రాణాలు తీస్తున్నాయి. అందుకే సెల్ఫోన్లు వచ్చాక జీవులకు, మనుషులకూ ప్రమాదము, అనారోగ్యము ఏర్పడుతున్నాయి.

ప్రశ్న5.
వివిధరకాల పొగలను పీల్చడం వలన మానవుడు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు?
జవాబు.
ఇంట్లోంచి కాలు బయట పెడితే చాలు ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతున్నది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చిన పొగ, బీడీ సిగరెట్ల పొగ మొదలైనవి. ఈ పొగ ఊపిరితిత్తులలోకి పోయి దగ్గు, క్షయ, క్యాన్సర్ వంటి అనేకమైన భయంకర రోగాలను కలుగజేస్తున్నది. మనుషుల ఆయుర్దాయాన్ని హరించి వేస్తున్నది.

ప్రశ్న 6.
శబ్దకాలుష్యం ఎన్ని విధాలుగా జరుగుతున్నది ?
జవాబు.
శబ్దకాలుష్యానికి అనేక కారణాలు. బయట వాహనాలరద్దీ ఎక్కువై అవి చేసే శబ్దాలు, విద్యుత్తు పరికరాలు, ఏ.సి.లు, కూలర్లు, ఫ్యాన్లనుండి వచ్చే శబ్దాలు భరించలేకపోతున్నాము. దానికి తోడు సరదాకొద్దీ టి.వి., రేడియోలు పెద్ద శబ్దంతో పెట్టటం, ఫ్యాక్టరీలనుండి వచ్చే శబ్దాలు, ప్రతి చిన్నాపెద్దా సంతోషాలకూ పేల్చే బాంబులు, టపాకాయల శబ్దాలు. ఇలా అనేక విధాలుగా శబ్ద కాలుష్యం జరుగుతున్నది.

ప్రశ్న 7.
తేళ్ళు, పాములు భయంతో ఎందుకు అల్లాడుతున్నాయి ?
జవాబు.
తేళ్ళు, పాములు భూమిలోపల నివసిస్తాయి. అనేక రకాలైన రసాయనిక పదార్థాలతోనూ, బాణసంచా సామగ్రితోను భూమి కలుషితమై పోతున్నది. ఫీట్లకు ఫీట్లు లోతున మిషన్లను భూమిలోకి దింపి బావులు తవ్వుతుంటే భూమి అదిరిపోతున్నది. తేళ్ళు, పాములు భయంతో అల్లాడుతున్నాయి.

ప్రశ్న 8.
పర్యావరణ పరిరక్షణకై మీ పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ?
జవాబు.
పర్యావరణ పరిరక్షణ గురించి మా బడిలో సమావేశాలు నిర్వహించి అందరికి అవగాహన కలిగిస్తాము. విద్యార్థులందరం కలిసి స్వచ్ఛందంగా తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రం చేస్తాము. బడి ముందర మొక్కలు పెంచి రోజూ తోట పని చేస్తాము. జట్లుగా ఏర్పడి ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తాము.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

ప్రశ్న 9.
చెరువులు, బావులు నీళ్లతో కళకళలాడటం కోసం ఊరి ప్రజలకు ఎట్లాంటి సలహాలను ఇస్తావు?
జవాబు.
బావులలో, చెరువులలో ఎప్పుడూ నీళ్ళు ఉండాలంటే నీళ్ళు భూమిలో నుంచి ఊరుతూ ఉండాలి. అందుకోసం మనం మట్టినేలను కూడా ఉంచుకోవాలి. ఇళ్ళమధ్య కొంచెమైనా ఖాళీస్థలం వదలాలి, అది కూడా సిమెంటు చేయకుండా. అందువల్ల నేల తడిసి నీటిని పీల్చుకుంటుంది. ఇంకుడు నీటి గుంటలు, చెరువులు, కోనేర్లు తవ్వాలి. ఆ విధంగా భూమిలోపలి పొరల్లోకి నీరు చేరితే బావుల్లోకి నీరు ఊరుతుంది. ఇదే నేను ఊరి ప్రజలకు ఇచ్చే సలహా.

ఇవి చేయండి

1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ పాఠం ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పండి?
జవాబు.
పెరిగిపోతున్న జనాభా వల్ల, వాళ్ల అవసరాలు తీర్చటానికి, మనుషుల్లో పెరిగిపోతున్న అంతులేని ఆశల వల్ల, స్వార్థంవల్ల అడవులు నాశనమైపోతున్నాయి. వాతావరణం, ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి. జంతువులకు, పక్షులకు గూడు కరువైపోతోంది అని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది.

ప్రశ్న 2.
“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి ?
జవాబు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతి సంపద మనకు దేవుడిచ్చిన వరం. అది ఏ ఒక్కరి సొంతం కాదు. అందరికీ దాని మీద అధికారం ఉంది. అధికారం గురించి మాట్లాడినప్పుడు బాధ్యత గురించి కూడా మాట్లాడాలిగదా! మనం ఇంత సంపద సొంతం చేసుకున్నప్పుడు దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదేనని మర్చిపోకూడదు. మనం దానిని జాగ్రత్తగా వాడుకుంటూ మన తరువాత తరాల వారికోసం జాగ్రత్త చెయ్యాలి. అప్పుడే అందరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. పాఠం చదివి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి.

(అ) పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోలేదట గదా! అయితే ఈ సారి ఎందుకు ఎండిపోయింది ?
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. గోపాల్ అన్నమ్మతో ఈ మాటలు అన్నాడు.

(ఆ) జనం మధ్యలో సెల్వర్లాయె. ఇక ఎట్లా బతుకుతయ్ ?
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠలోనివి. అన్నమ్మ లక్ష్మితో అన్న మాటలివి.

(ఇ) బావులు, నదులు ఇవన్నీ నీళ్లతోటి కళకళలాడితే నీళ్లకేం కష్టం.
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. లక్ష్మి గోపాల్తో అన్నది.

(ఈ) తేళ్లు, పాములు భయంతోటి అల్లాడవట్టె.
జవాబు.
ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. నరసయ్య అన్నమ్మతో అన్న మాటలివి.

2. కింది పేరాను చదివి పట్టికను పూరించండి.

నేను చెట్టును. మీకు తల్లివంటిదాన్ని. నన్ను నరికి కరువు కోరల్లో చిక్కుకోవద్దు. మానవుల్లారా ! అమ్మలాంటి నన్ను కొట్టకండి. కాసుల కోసం అమ్మకండి. పండ్లను, నీడను, ప్రాణవాయువులను ఇచ్చే త్యాగజాతి మాది. చచ్చిన మీ మనుషులకై బతికిన మమ్ములను నరికే జాతి మీది. చేతనైతే మీ పుట్టిన రోజున పది మొక్కలను నాటి నీరు పోసి కాపాడండి. కానీ దయచేసి తుంచకండి.

చేయకూడనివిచెట్లను నరకకూడదు. కొట్టకూడదు. డబ్బుకోసం అమ్మకూడదు. తుంచకూడదు.
చేయవలసినవిమొక్కలను నాటాలి. నీరు పోసి కాపాడాలి.
త్యాగజీవులు అందించేవిపండ్లు, నీడ, ప్రాణవాయువులు
శీర్షికచెట్టు తల్లి వంటిది.

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ) “చెరపకురా చెరువులను, చెడిపోతావు” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి?
జవాబు.
చెరువులను చెరపకూడదు. అంటే పాడుచేయకూడదు. స్వార్థం కోసం ఆక్రమించుకోకూడదు. పశువులను కడిగి, చెత్తాచెదారం పడేసి, రసాయనిక వ్యర్థాలను కలిపి అనేక విధాలుగా చెరువులను కలుషితం చేయకూడదు. చుట్టుపక్కల ఉండే నీటిగుంటలను మూసేయటం, నేలంతా గచ్చు చేయటం వల్ల భూమిలోకి నీరు ఇంకక చెరువులు ఎండిపోతాయి. కనుక అలాంటి ప్రమాదం లేకుండా చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నీటికి కొరత ఏర్పడి మనుషులే గాక పశువులు, పక్షులు,ఇతర జీవాలు కూడా బాధపడవలసి వస్తుంది.

(ఆ) “అడవులను నాశనం చేసుకుంటపోతే ఇంకా భయపడే కాలం వస్తది” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు.
అడవులను నాశనం చేస్తుంటే ప్రకృతి సంపద హరించి పోతుంది. వానలు పడవు. ఎండలు పెరిగిపోతాయి. జంతువులకు నివాసాలు లేకుండా పోతాయి. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. అడవుల్లో జంతువులు వచ్చి ఊళ్ళమీదపడి అన్నీ నాశనం చేస్తాయి. కొన్ని జంతువులు ప్రజల ప్రాణాలు తీస్తాయి. ఎండల తీవ్రత వల్ల వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని భయంకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావానికి లోనై అనేక వ్యాధులపాల పడతారు. అందుకే అడవులను నాశనం చెయ్యకూడదు.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

(ఇ) “మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” దీనితో మీరు ఏకీభవిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
జవాబు.
“మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” ఈ మాటలు చాలా సరైనవి. నేను దీనితో ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం ప్రకృతిలో సృష్టిస్తున్న భయంకరమైన మార్పుల వల్ల మన ఆరోగ్యాలూ పాడౌతున్నాయి. జీవరాసులూ అంతరించిపోతున్నాయి. మన అనుకూలం కోసం సెల్ఫోన్లు తయారు చేసుకొని సెట్టవర్లు నిర్మిస్తే ఆ టవర్ల నుంచి వచ్చే తరంగశక్తిని తట్టుకోలేక పక్షి జాతులు చనిపోతున్నాయి. ఇలాగే భూకాలుష్యం, శబ్దకాలుష్యం, జలకాలుష్యం, వాయుకాలుష్యం మనమే సృష్టిస్తున్నాం. మనమే రోగాలపాలిట పడుతున్నాం.

(ఈ) “వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయె” ఇది ఎటువంటి నష్టాలను కలిగిస్తుందో వివరించండి?
జవాబు.
కాళ్ళకు మట్టి అంటకుండా ఇంటిముందు, ఇంటివెనుక అంతా గచ్చు చేస్తున్నాం. ఇంటిమీద ఇల్లు కట్టేసి ఇళ్ళమధ్య కాస్తకూడ జాగా వదలటం లేదు. రోడ్లన్నీ కాంక్రీటు వేస్తున్నాం. ఇలా ఎక్కడా నేల అనేదే కనబడకుండా అంతా కాంక్రీటు గచ్చులే. చివరికి నీళ్ళు పోయే మోరీలు కూడా సిమెంటు చేస్తున్నాం. దీనివల్ల ఎక్కడా భూమిలోకి నీళ్ళు దిగడం లేదు. నేలలో తేమలేకుండా పోతోంది. ఎన్ని అడుగులు తవ్వినా నీళ్ళు పడవు. బావుల్లోకి, చెరువుల్లోకి ఎటునుంచి ఊట దిగదు. ఇలా అనేక విధాలుగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది.

(ఉ) మీ ప్రాంతంలో ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి.
జవాబు.
మా ప్రాంతంలో పూర్వకాలం నుంచి ఇళ్ళలోనూ, ఇళ్ల బయటా కూడా పచ్చనిచెట్లు కనిపించేవి. చల్లని గాలి ఇళ్ళకు అందం, ఎంతో హాయిగా ఉండేది. ఇప్పుడు చెట్లు కొట్టేసి రోడ్లు, కాలువలు వేశారు. ఇంట్లో చెట్లుకూడా పోషణ అందక ఎండిపోతున్నాయ్. ఇళ్ళలో చెత్తంతా వీధుల్లోనూ, కాలువల్లోనూ విసిరేస్తున్నారు. ఇంత బాధ్యత లేకుండా ఉంటే ఆరోగ్యాలు ఎక్కడి నుండి వస్తాయి. నిలబడిపోయిన మురుగు, పేరుకు పోయిన చెత్త వల్ల ఈగలూ, దోమలూ చేరి మనుషులు రోగాలపాలౌతున్నారు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు” దీనిని విశ్లేషిస్తూ రాయండి.
జవాబు.
ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. పూర్వకాలంలో ఈ కొండలు, నదులు, అడవులు, సెలయేళ్ళు, అడవి జంతువులు, అడవులలోని ఉత్పత్తులు సమృద్ధిగా లభించేవి. ప్రకృతి ఆనందకరంగా, హాయిగా ఉండేది. సకాలంలో వర్షాలు కురిసేవి. వాతావరణంలో ఋతువుల మార్పులు మంచి సుఖాన్నిచ్చేవి. రాను రాను జనాభా పెరిగిపోతున్నది. అవసరాలు పెరిగిపోతున్నాయి. అడవులు నరికేస్తున్నారు. అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రకృతి సంపదను కరిగించేస్తున్నారు.

తమ తరువాత వచ్చే వారికి ఏమివ్వాలని ఆలోచించటం లేదు. సాంకేతికంగా అభివృద్ధి సాధించారు. ఆధునిక పరికరాలు వాడుతున్నారు. కర్మాగారాలు, పరిశ్రమలు అధికంగా స్థాపించి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నీళ్ళలోకి వదిలి నీళ్ళను కలుషితం చేస్తున్నారు. పొగతో గాలి కలుషితమైపోతున్నది. ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు. ఇది తప్పు. మానవులు తమ తప్పు తెలుసుకొని పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో కాలుష్యం తప్ప ఏమీ మిగలదు. భావితరాలకు భవిష్యత్తే లేదు.

ప్రశ్న 2.
మానవులు, పక్షులు, పశువులు …………… సుఖంగా జీవించాలంటే ప్రకృతి పట్ల మన ఆచరణ ఎట్లా వుండాలి ?
జవాబు.
మానవులు, పశువులు, పక్షులు, ఇతర జలచరాలు ప్రకృతిలోని జీవులన్నీ సుఖంగా జీవించాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి.

నీరు : నీటిని వృథా చేయకూడదు. వర్షపు నీటిని నిలవ చేయడానికి ఇంకుడు నీటి గుంటలు తవ్వాలి. నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీటిని కలుషితం చెయ్యకూడదు. పశువులను కడగటం, బట్టలుతకటం వంటి పనులు జలాశయాల్లో చెయ్యకూడదు. మురుగునీరు, ఫ్యాక్టరీల నీరు పోవడానికి వేరే ఏర్పాట్లు చెయ్యాలి. వాడుకునే నీటిలోకి వదలకూడదు.

గాలి : ఫ్యాక్టరీలను ఊరికి దూరంగా నిర్మించుకోవాలి. జనావాసాల మధ్య ఉంటే ఆ పొగ, దుమ్ము, ధూళి వలన కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల ఆరోగ్యం పాడౌతుంది. మురికి ఇల్లంతా నిండిపోతుంది.

శబ్దం : ఆ శబ్దాల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇంట్లో మనం ఉపయోగించే టి.వి.లు, రేడియోలు వంటివి కూడా తక్కువ శబ్దంతో ఉపయోగించాలి. సెల్ఫోన్ల వాడకం తగ్గించటం వల్ల మనకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా ప్రమాదం తప్పుతుంది. వాహనాల వినియోగం నియంత్రించాలి. దానివల్ల గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గుతుంది. ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలి. చెట్లను అధికంగా పెంచాలి. ఒక చెట్టునరికే ముందు పది చెట్లను పెంచాలి. ఇలా చేయటం వల్ల ప్రకృతిని కొంతవరకు కాపాడగలుగుతాం.

IV. సృజనాత్మకత/ప్రశంస

ప్రశ్న 1.
“పర్యావరణ పరిరక్షణ”లో అందరూ పాలు పంచుకోవాలని ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు.
ప్రకటన
TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 3
అందరం చేయి చేయి కలుపుదాం. కాలుష్యాలకు మూలాలు తెలుసుకుందాం. వాటిని నిర్మూలిద్దాం. ప్రపంచాన్ని కాలుష్యరహితమైన స్వర్గంగా తీర్చిదిద్దుతాం. ముందడుగేయండి. పర్యావరణ పరిరక్షణలో అందరూ పాలు పంచుకోండి.

2. కింది బొమ్మను చూడండి. బొమ్మ ఆధారంగా సంభాషణలు రాయండి.

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 4
అక్కా తమ్ముళ్ళు ఆడుకుంటూ ఒక చెట్టు కిందికి చేరారు.

తమ్ముడు : అక్కా! అదిగో నువ్వు పట్టుకోవాలన్న సీతాకోకచిలుక.

అక్క : ఔను. ఉండు ఇప్పుడే పట్టుకుంటా……… దొరకలేదురా.

తమ్ముడు : పోనీలే అక్కా! హాయిగా ఎగరనీ.

చెట్టు : పిల్లలూ ఆడుకుంటున్నారా ?

అక్క : ఎవరది ? చెట్టుతల్లా!

తమ్ముడు : అవునమ్మా! ఆడుకుంటున్నాం.

అక్క : అమ్మా! ఈ దెబ్బలేంటి ?

చెట్టు : ఇందాక కొంతమంది అల్లరి పిల్లలు నామీద రాళ్ళు విసిరారు.

తమ్ముడు : అయ్యో! నొప్పిగా ఉందా ?

చెట్టు : లేదులే. మీరు చాలా మంచివాళ్ళు. మీకు నేనంటే చాలా ఇష్టం. ఇవిగో ఈ పళ్ళు తీసుకోండి.

అక్క : ఇప్పుడెందుకులేమ్మా!

చెట్టు : తీసుకోండమ్మా! ఫరవాలేదు. నేను వీటిని మోసేది మీలాంటి వాళ్ళకోసమే. మీకు కావలసినన్ని తినండి. మిగతావి ఇంటికి తీసుకుపోండి.

అక్క, తమ్ముడు : ధన్యవాదాలు చెట్టుతల్లీ! వస్తాము. టాటా.

V. పదజాల వినియోగం

1. కింది పదాలు చూడండి. వీటికి అదే అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి.

(అ) తొందరగా – జల్ది
(ఆ) దురాక్రమణ – కబ్జా
(ఇ) శబ్దాలు – చప్పుళ్ళు
(ఈ) సంతోషం – సంబరం
(ఉ) కాలువలు – నదులు
(ఊ) ఇంతకుముందు కాలం – తాతలనాడు, మునుపు
(ఋ) ప్రాణులు – జీవులు
(ౠ) పిల్లవాళ్లు – పోరగాళ్ళు
(ఎ) వాహనాలు – మోటార్లు
(ఏ) వేగంగా పోవడం – బర్రుబర్రున పోవటం

2. కింది పదాలలో భిన్నమైన పదాన్ని గుర్తించి గీతగీయండి.

(అ) పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క
(ఆ) బావులు, నదులు, సముద్రాలు, చెరువులు
(ఇ) కారు, స్కూటర్, సైకిలు, లారీ
(ఈ) బీడిపొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ

3. కింది పట్టికను చదివి అందులోని ప్రకృతి – వికృతులను రాయం

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం 5

ప్రకృతి – వికృతి
అడవి – అటవి
ఆశ – ఆస
శబ్దం – సద్దు
రాత్రి – రాతిరి
సింహం – సింగం
శక్తి – సత్తువ
కుంభము – కుండ

4. పాఠంలోగల ఆంగ్ల పదాలను, వాటి అర్థాలను రాయండి.

  • డాక్టర్ – వైద్యుడు
  • ఫీట్లకు ఫీట్లు – అడుగులకు అడుగులు
  • మోటర్లు – వాహనాలు
  • రోడ్లు – వీధులు
  • సిమెంట్ – సిమెంట
  • ఫ్యాక్టరీలు – కర్మాగారాలు
  • ప్లాస్టిక్ – ప్లాస్టిక్
  • సిగరెట్సు- పొగ పీల్చేకాడ
  • టి.వి. – దూరదర్శిని
  • సౌండ్ – శబ్దం
  • బోర్లు – పంపులు
  • డి.జె. సౌండ్సు – స్పీకర్ల శబ్దాలు
  • సెల్ – సెల్ఫోన్
  • రింగవటం – మోగటం
  • సిగ్నల్స్ – తరంగాలు
  • సెల్టవర్లు – సెల్ తరంగాల కోసం కట్టిన స్తంభాలు
  • పేపర్లు – వార్తాపత్రికలు
  • ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ – రసాయనాలు కలిపిన సున్నం లాంటిది

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది ఖాళీలను విభక్తులతో పూరించండి. విభక్తుల పేర్లు రాయండి.

(అ) రాజు సేనలతో వచ్చాడు. (తృతీయా విభక్తి)
(ఆ) దొంగతనం చేయడం కంటె పేదవానిగా ఉండటం మేలు. (పంచమీ విభక్తి)
(ఇ) వృద్ధులను ఆదరించాలి. (ద్వితీయా విభక్తి)
(ఈ) దొంగల కొరకు పోలీసులు గాలిస్తున్నారు. (చతుర్థీ విభక్తి)

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

(అ) కృష్ణార్జునులు = కృష్ణుడును, అర్జునుడు – ద్వంద్వ సమాసం
(ఆ) శివకేశవులు =శివుడును, కేశవుడును – ద్వంద్వ సమాసం
(ఇ) నిరాశానిస్పృహలు = నిరాశయును, నిస్పృహయును – ద్వంద్వ సమాసం
(ఈ) భయాందోళనలు = భయమును, ఆందోళనయును – ద్వంద్వ సమాసం
(ఉ) న్యాయాన్యాయాలు = న్యాయమును, అన్యాయుమును – ద్వంద్వ సమాసం

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

3. కింది పదాలను విడదీసి రాయండి.

(అ) నీవెక్కడ = నీవు + ఎక్కడ
(ఆ) లేకుంటె = లేక + ఉంటె
(ఇ) మరేమి = మరి + ఏమి
(ఈ) రామాలయం = రామ + ఆలయం

4. కింది పదాలను కలిపి రాయండి.

(అ) మేన + అత్త = మేనత్త
(ఆ) మనసు + ఐన = మనసైన
(ఇ) ఏమి + అంటివి = ఏమంటివి
(ఈ) దేవ + ఇంద్రుడ = దేవేంద్రుడు

5. కింద ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి. భాషాభాగాల పేర్లను రాయండి.

(అతను, కమ్మగా, కొబ్బరికాయ, వెళ్ళి, అబ్బా)
ఉదా : శంకర్ పామును చూసి అమ్మో! అంటూ పరుగెత్తాడు. (అవ్యయం)

(అ) రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. (నామవాచకం)
(ఆ) అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉన్నది. (విశేషణం )
(ఇ) గోపాలు డాక్టరే కాదు, అతను యాక్టరు కూడా. (సర్వనామం)
(ఈ) నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతీ దేవిని దర్శించుకున్నాడు. (క్రియ)
ఉ. రవి ఉరుకుతూ కిందపడి అబ్బా! అని అరిచాడు. (అవ్యయం)

ప్రాజెక్టు పని:

పర్యావరణానికి సంబంధించిన పాటలను, కవితలను లేదా గేయాలను సేకరించండి. తరగతిలో ప్రదర్శించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : పర్యావరణానికి సంబంధించిన పాటలను, కవితలను, గేయాలను సేకరించి, నివేదిక రాసి ప్రదర్శించడం.
2. సమాచార సేకరణ

అ) సమాచారం సేకరించిన తేది : XXX
ఆ) సమాచార వనరు : వివిధ వార్తా పత్రికలు.

3. సేకరించిన విధానం : వివిధ వార్తా పత్రికలను చదివి వాటిలో పర్యావరణానికి సంబంధించిన కవితలు సేకరించడం జరిగింది
4. నివేదిక :

నీరు : జలకన్యను నేను జీవ జల రమ్యను నేను
స్వచ్ఛ వారి ధారలతో జగతికి జీవనమిచ్చే
మీరు వాడిన మురికి నీటికి, వేరుదారులు చూపకుండా
స్వచ్ఛమగు నా ప్రవాహమ్మును, కలుషితమొనరించుచుంటిరి
ప్రాణములు నిలబెట్టు జలము, ప్రాణములనే తీయుచుండిన
జలచరములకు చలన మెక్కడ, మనుషులకు మనుగడ అదెక్కడ.

చెట్లు : ఇంటికి చుట్టూ మొక్కలు పెంచిన, పచ్చదనమదే పచ్చని ధనము
బాటల ప్రక్కన మొక్కలు నాటండి, నీడనిచ్చును హాయిని గొలుపును
ఒక్క చెట్టును నరుకగోరిన, ముందుగనే పది మొక్కలు నాటుడు
వనములను నువ్వు పరిరక్షింపుము, వనములే నిన్ను పరిరక్షించును

గాలి : అయ్యయ్యో! ఏమిటి ఈ విపరీతం ?, కుప్పలు తెప్పలుగ కూలు జనసందోహం
అంతులేని ఈ పొగతో ఊపిరాడటం లేదు, దుర్వాసనలకు అబ్బా! వికారమ్ము కలుగుతోంది
శాస్త్రజ్ఞులందరూ జట్లుగా చేరి, వారి మేధస్సును మధనము చేసి
కాలుష్యమును బాప కంకణము గట్టి, జీవజలముల కలుషరహితముగ జేసి
ప్రాణవాయువులను రక్షింపగలుగు, పర్యావరణ సమతౌల్యమును గాచి
ఎల్లజీవులు సౌఖ్యమును గాంచునట్టి, పథకాల నాలోచనము చేయవలయు
ప్రకృతి సంపదలను పెంపొందజేసి పూర్వ శోభను మరల చేకూర్చవలయు.
అప్పుడే మన ప్రకృతి సురక్షితమౌతుంది.

5. ముగింపు : పై కవితల ద్వారా పర్యావరణానికి మనం చేస్తున్న హాని గురించి తెలుసుకున్నాను. ప్రకృతిని మనం రక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యం అని అర్థం చేసుకున్నాను.

(లేదా)

అడవులు/పశువులు/పక్షులు/చెరువులు/నేలతల్లి/బావుల గొప్పతనాన్ని తెలిపే వ్యాసాలను సేకరించండి.

పశువులు

పశువులు మన నిత్యజీవితంలో ఒక భాగం. గొడ్డూగోదా పిల్లామేకా తో ఇళ్ళు కళకళలాడుతాయి అంటారు. వెనుకటి రోజులలో పశువులను కొట్టంలో కట్టేసి దూడలను తాము పడుకొనే మంచం కోడుకి కట్టేసుకొని దానికి ఊసులు చెబుతూ పడుకొనేవారు. పిల్లలతో సమంగా కుటుంబ సభ్యులలాగా ప్రేమగా చూసుకొనేవారు. పశువులు కూడా ఆ ప్రేమకు తగ్గట్టే మనుషులకు ఉపయోగపడుతూ సేవ చేసేవి. పసిపిల్లలు పశువుల చుట్టూ తిరుగుతున్నా వాళ్ళనేమీచెయ్యవు. అలా మంచిమనసుతో యజమానులకు సహాయపడుతుండేవి.

వ్యవసాయంలోనూ బండ్లను లాగడంలోనూ బరువులు లాగటానికి ఎడ్లు సహాయపడేవి. పాడి పశువులు పెట్టిన మేత తింటూ పాలు ఇచ్చేవి. ఆవు ఇంట్లో ఉందంటే ఆరోగ్యం. అష్టశ్వర్యాలూ ఉన్నట్లే. ఈ పశువుల పేడ పొలాలకు ఎరువుగాను, పొయ్యిలోకి పిడకలు గాను పనికి వచ్చేది. పాలు పాల పదార్థాలు మనకు బలమైన ఆహారం కదా! ఇలా పశువులు మనకెంతో ప్రయోజనకరమైన స్నేహితులు.

TS 6th Class Telugu 12th Lesson Important Questions కాపాడుకుందాం

ప్రశ్న 1.
జీవరాసులు ఎందుకు అంతరించిపోతున్నాయి?
జవాబు.
సెల్టవర్ల నుండి ఫోన్లకు వచ్చే సిగ్నల్స్ వల్ల ఆ తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నాయి. మనిషి తన అవసరాల కోసం, నివాసాల కోసం అడవులు నరికేయడం వల్ల జంతువులు, పక్షులు నీడను కోల్పోయి క్రమంగా మాయమౌతున్నాయి. చెరువుల్లో, బావుల్లో నీరు లేకపోవడం వల్ల, ఉన్న నీరు కలుషితం కావడం వల్ల కొన్ని జలచరాలు పూర్తిగా కనబడకుండా పోయాయి. వీటి నాశనానికి మూలకారణం మానవులే.

ప్రశ్న 2.
శబ్ద కాలుష్యం వల్ల ప్రమాదాలేమిటి ?
జవాబు.
శబ్ద కాలుష్యం వల్ల ప్రధానంగా వినే శక్తి నశిస్తుంది. మెదడు మీద ఈ శబ్దాలు ప్రభావం చూపించి ఎక్కువగా చిరాకు, కోపం వస్తుంది. చేసే పనిమీద ధ్యాస ఉండదు. నరాల్లో వణుకు, గుండెల్లో దడ లాంటివి కూడా వస్తాయి. పెద్ద పెద్ద శబ్దాలకు తట్టుకోలేక చిన్న ప్రాణులు, ముసలివారు ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంటుంది. బోరు దింపే శబ్దానికి తేళ్ళు, పాములు అదిరిపడి బైటికొచ్చేస్తాయి. ఇలా అనేక ప్రమాదాలు శబ్ద కాలుష్యం వల్ల ఎదురౌతాయి.

ప్రశ్న 3.
చెట్లు మనకు చేసే మేలును గురించి వివరించండి
జవాబు.
చెట్టు మనకు తల్లి వంటిది. తల్లి మనకు ఊపిరి ఊదుతుంది. మన సంరక్షణ చూస్తుంది. మనకు కావలసినవన్నీ ఇస్తుంది. కడుపు నింపుతుంది. సేదతీరుస్తుంది. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఔషధం ఇస్తుంది. పైన చెప్పిన సేవలన్నీ మనకు చెట్ల వల్ల లభిస్తాయి. చెట్లవల్ల ప్రాణవాయువు లభిస్తుంది. చెడు వాయువులను కాలుష్యాన్ని చెట్లు పీల్చుకొని మనను బతికిస్తాయి.

ఇంటికి కావలసిన కలప, వంటకు కావలసిన కట్టె సమస్తం చెట్ల నుండి లభిస్తాయి. తినడానికి కాయలు, పండ్లు, ఆకులు మొదలైనవన్నీ ప్రేమగా అందిస్తాయి. మన కడుపునింపి ఆకలి తీరుస్తాయి. చల్లని నీడనిచ్చి, గాలినిచ్చి సేదతీరుస్తాయి. ఎన్నో చెట్లలో ఔషధగుణాలుంటాయి. వాటివల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతాయి. వరదలను ఆపుతాయి. వానలను కురిపిస్తాయి. పశువులకు నీడను, గూడును ఇస్తాయి. ఆహారాన్నిస్తాయి. ఇలా ఎన్నో విధాలుగా చెట్లు మనకు మేలు చేస్తున్నాయి.

అర్ధాలు:

  • సంబురం = ఆనందం
  • మజా = సంతోషం
  • మలుపుట = మళ్ళించుట
  • ఏండ్ల = సంవత్సరాలు
  • ఉరుకు = పరుగెత్తు
  • జల్ది = తొందరగా
  • దోస్తు = స్నేహితుడు
  • ధర = వెల

పర్యాయపదాలు

  • అడవి = వనం, కాన, అరణ్యం
  • చెరువు = తటాకం, కొలను, మడుగు
  • పులి = పుండరీకం, వ్యాఘ్రం, శార్దూలం
  • భూమి = అవని, పృథ్వి, వసుంధర
  • సింహం = కేసరి, మృగరాజు, పంచాస్యం
  • కోతులు = కపులు, వానరాలు
  • సంబురం = సంతోషం మజా

ప్రకృతి – వికృతులు

  • అటవి – అడవి
  • అంబ – అమ్మ
  • రాత్రి – రాతిరి, రేతిరి
  • సింహం – సింగం
  • స్నానం – తానం
  • పశువులు – పసరాలు, పసులు
  • ఆశ – ఆస
  • లక్ష్మి – లచ్చి
  • శక్తి – సత్తి
  • శబ్దం – సద్దు

పదజాలం:

I. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. పండుగ సంబురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతగీచిన పదానికి అర్థం …………………..
(A) చుక్కలు
(B) ధరలు
(C) మేడలు
(D) సంతోషాలు
జవాబు.
(D) సంతోషాలు

2. ఎన్నో వేల ఏండ్ల చరిత్ర మనది. ‘ఏండ్లు’ అంటే ………………..
(A) ఏడు రోజులు
(B) సంవత్సరాలు
(C) పాత
(D) కొత్త
జవాబు.
(B) సంవత్సరాలు

3. వాన పడగానే పిల్లలు బయటికి ఉరికారు. ‘ఉరికారు’ అర్థం
(A) తడిశారు
(B) ఎగిరారు
(C) పరుగెత్తారు
(D) చూశారు
జవాబు.
(C) పరుగెత్తారు

4. ఇవాళ మా దోస్తు వస్తున్నాడు. ‘దోస్తు’ అనే పదానికి అర్థం ………….
(A) తమ్ముడు
(B) మిత్రుడు
(C) బంధువు
(D) పిల్లవాడు
జవాబు.
(B) మిత్రుడు

5. సంబురాలు, సంతోషాలు అనే మాటలకు సమానార్థక పదం ………..
(A) ఆనందాలు
(B) ఊరేగింపులు
(C) పెండ్లిళ్ళు
(D) సంతలు
జవాబు.
(A) ఆనందాలు

6. సింహాన్ని మృగరాజు అంటారు. కేసరి అంటే అందరికీ భయం ఈ వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే మాటలు ……………….
(A) సింహం, కేసరి, భయం
(B) మృగరాజు, అందరు, భయం
(C) సింహం, మృగరాజు, కేసరి
(D) కేసరి, భయం
జవాబు.
(C) సింహం, మృగరాజు, కేసరి

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

7. రామప్ప చెరువు పెద్దది. ఆ కోనేరు అందమైంది గీతగీచిన పదాలకు సమానమైన అర్థాన్నిచ్చే పదం ………………..
(A) సముద్రం
(B) వాగు
(C) మడుగు
(D) గుడి
జవాబు.
(C) మడుగు

8. ‘పశువు’ అనే పదానికి వికృతి.
(A) పసువు / పసరం
(B) పాషాణం
(C) పస
(D) మృగం
జవాబు.
(A) పసువు / పసరం

9. ‘ఆస’ అనే వికృతి పదానికి తగిన ప్రకృతి ………………..
(A) కోరిక
(B) ఆశ
(C) ఆకసం
(D) ఆశయం
జవాబు.
(B) ఆశ

10. గ్రంథాలయంలో శబ్దం చేయకూడదు. శబ్దానికి వికృతి …………..
(A) సద్గు
(B) శబుదం
(C) సబ్బుదం
(D) సబ్బు
జవాబు.
(A) సద్గు

II. వ్యాకరణం 

11. ‘అచ్చులు’ అంటే
(A) ‘క’ నుండి ‘ఱ’ వరకు గల అక్షరాలు
(B) ఊష్మాలు
(C) య, ర, ల వ లు
(D) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు
జవాబు.
(D) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు

12. ‘క’ నుండి ‘ఱ’ వరకుండే అక్షరాలను ఏమంటారు ?
(A) అచ్చులు
(B) హల్లులు
(C) ఉభయాక్షరాలు
(D) వర్ణాక్షరాలు
జవాబు.
(B) హల్లులు

13. ఒక హల్లు అదే హల్లు ఒత్తుతో కలిస్తే అది …………………
(A) సంయుక్తాక్షరం
(B) ద్విత్వాక్షరం
(C) ద్వంద్వం
(D) సమాసం
జవాబు.
(B) ద్విత్వాక్షరం

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

14. సంయుక్తాక్షరంలో ఉండే రెండు హల్లులు ……………
(A) ఒక్కటే
(B) వేర్వేరు
(C) సమానం
(D) ఒకే ధ్వని
జవాబు.
(B) వేర్వేరు

15. క్రిందివానిలో ‘త’ వర్గాక్షరాలు
(A) క,చ, ట, త, ప
(B) గ, జ, డ, ద, బ
(C) త, థ, ద, ధ, న
(D) త, ద, న, ప, బ
జవాబు.
(C) త, థ, ద, ధ, న

16. ఒక మాత్ర కాలంలో పలికే అక్షరాలు
(A) హ్రస్వాలు
(B) దీర్ఘాలు
(C) ఉభయబక్షాలు
(D) శ్లేషాలు
జవాబు.
(A) హ్రస్వాలు

17. దీర్ఘాక్షరాలు పలకడానికి పట్టేకాలం
(A) ఒక మాత్రకాలం
(B) రెండు మాత్రల కాలం
(C) మూడు మాత్రల కాలం
(D) 4 మాత్రల కాలం
జవాబు.
(B) రెండు మాత్రల కాలం

18. క్రింది వాటిలో మహా ప్రాణాలు ……………..
(A) క, చ, ట, త, ప
(B) గ, జ, డ, ద, బ
(C) ఖ, ఛ, ఠ, థ, ఫ
(D) ఙ, ఞ, ణ, న, మ
జవాబు.
(C) ఖ, ఛ, ఠ, థ, ఫ

19. య, ర, ల, వ లను అంటారు. …………….
(A) ఊష్మాలు
(B) వర్ణాక్షరాలు
(C) అచ్చులు
(D) అంతస్థాలు
జవాబు.
(D) అంతస్థాలు

20. గ, జ, డ, ద, బ లను ……….. అంటారు.
(A) పరుషాలు
(B) సరళాలు
(C) అంతస్థాలు
(D) ‘గ’ వర్ణాక్షరాలు
జవాబు.
(B) సరళాలు

21. క, చ, ట, త, ప లు
(A) కఠినాలు
(B) సులభాలు
(C) పరుషాలు
(D) సరళాలు
జవాబు.
(C) పరుషాలు

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

22. పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసేవి
(A) అక్షరాలు
(B) వాక్యాలు
(C) విభక్తులు
(D) అవ్యయాలు
జవాబు.
(C) విభక్తులు

23. ప్రతి విభక్తికీ ………. ఉంటుంది.
(A) ప్రత్యయం
(B) పరుషం
(C) క్రియ
(D) అవ్యయం
జవాబు.
(A) ప్రత్యయం

24. పండ్లు బలాన్నిస్తాయి. గీతగీసిన అక్షరంలోని ధ్వనులు
(A) డ, ల
(B) డు, ల
(C) డు, లు
(D) డ్, ల్, ఉ
జవాబు.
(D) డ్, ల్, ఉ

25. అమ్మమ్మ. ‘మ్మ’ లోని హల్లులు
(A) మ, మ
(B) మ్, మ్
(C) మ, అ
(D) మ్, మ్, అ
జవాబు.
(D) మ్, మ్, అ

26. వద్దు + అంటూ ……………. కలిపి రాస్తే
(A)వద్దుంటూ
(B) వద్దంటూ
(C) వద్దింటి
(D) వద్దని
జవాబు.
(B) వద్దంటూ

27. ‘పోతున్నవట’ విడదీస్తే ……….
(A) పోత + ఉన్నవట
(B) పోతన్న + అట
(C) పోతున్నవు + అట
(D) పోతు + ఉన్నది + అట
జవాబు.
(C) పోతున్నవు + అట

28. ‘మరిప్పుడు’ సంధి విడదీస్తే …………….
(A) మరి + ప్పుడు
(B) మరి + ఇప్పుడు
(C) మరి + ఎప్పుడు
(D) మరి + అప్పుడు
జవాబు.
(B) మరి + ఇప్పుడు

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

29. తిప్పన్న పోతన్నలు ………….సమాసానికి విగ్రహ వాక్యం
(A) తిప్పన్న అనెడి పోతన్న
(B) తిప్పన్న మరియు పోతన్న
(C) తిప్పన్న తమ్ముడు పోతన్న
(D) ఇద్దరు అన్నదమ్ములు
జవాబు.
(B) తిప్పన్న మరియు పోతన్న

30. ‘కాళ్ళు చేతులు’ అనే పదానికి విగ్రహ వాక్యం
(A) కాలు, చేయి
(B) కాళ్ళ వంటి చేతులు
(C) కింద కాళ్ళు, పైన చేతులు
(D) కాళ్ళు అనెడి చేతులు
జవాబు.
(A) కాలు, చేయి

31. ‘సాధువులు మరియు సజ్జనులు’ – సమాసంగా కూరిస్తే
(A) సాధువు వెంట సజ్జనుడు
(B) సాధువు యొక్క సజ్జనుడు
(C) సాధుసజ్జనులు
(D) సాధువుల్లో సజ్జనులు
జవాబు.
(C) సాధుసజ్జనులు

III. కింది పేరాను చదివి వాక్యాలలోని తప్పు/ ఒప్పులను గుర్తించండి.

1. కుతుబ్షాహి వంశంలోని నాలుగోరాజు మహమ్మద్ కులీకుతుబ్షా కాలంలోనే నేటి హైదరాబాదు నగరం నిర్మితమయింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా ఎంతో ఉత్తముడై తన ప్రజలందర్నీ చక్కగా పాలించి తానాషా అనే బిరుదు పొందాడు. తానాషా అంటే మంచి రాజు అని అర్థం. తానాషానే తానీషా అని కూడా అంటారు.
1. కుతుబ్షాహి వంశంలోని నాల్గవరాజు తానాషా.
2. కులీకుతుబ్షా కాలంలోనే హైదరాబాదు నిర్మితమయింది.
3. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరిరాజు అబుల్ హసన్ కుతుబ్షా.
4. తానాషా అంటే దుర్మార్గుడైన రాజు.
5. కులీ కుతుబ్షా తానాషా బిరుదు పొందాడు.
జవాబు.
1. కుతుబ్షాహి వంశంలోని నాల్గవరాజు తానాషా. ( తప్పు)
2. కులీకుతుబ్షా కాలంలోనే హైదరాబాదు నిర్మితమయింది. (ఒప్పు)
3. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరిరాజు అబుల్ హసన్ కుతుబ్షా. (ఒప్పు)
4. తానాషా అంటే దుర్మార్గుడైన రాజు. ( తప్పు)
5. కులీ కుతుబ్షా తానాషా బిరుదు పొందాడు. ( తప్పు)

IV. క్రింది పేరాను చదవండి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

2. అన్ని దానములను నన్న దానమె గొప్ప
కన్న తల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ!

ప్రశ్నలు:
1. అన్నింటి కంటే గొప్ప దానమేది ?
జవాబు.
అన్నింటి కంటే గొప్పదానం – అన్నదానం.

2. జ్ఞానం ప్రసాదించేది ఎవరు ?
జవాబు.
జ్ఞానం ప్రసాదించేది – గురువు

3. కవి ఉన్నత స్థానం ఎవరికిచ్చారు ?
జవాబు.
కన్న తల్లికి

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

4. పై పద్యం ద్వారా ఏమి తెలుస్తున్నది ?
జవాబు.
అన్నదానము కంటే, కన్నతల్లి కంటే, గురువు కంటే ఎవరూ ఎక్కువ కాదు.

5. పై పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
వేమన శతకం లోనిది.

V. క్రింది పద్యాన్ని చదివి సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. “చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని –
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు”

ప్రశ్నలు:

1. “కడుపు చేటు” అనే మాటకు అర్థం ……………
(A) చెడ్డ కడుపు
(B) పుట్టుక దండగ
(C) తల్లులకు బాధ
జవాబు.
(B) పుట్టుక దండగ

2. శివ పూజ ఎలా చేయాలి ?
(A) చేతులు ఆనించి
(B) చేతులు పట్టుకుంటూ
(C) చేతులతో తృప్తి కలిగేటట్లు
జవాబు.
(C) చేతులతో తృప్తి కలిగేటట్లు

3. దయను, సత్యాన్ని ఎట్లా తలచాలి
(A) మనసులో
(B) లోపల
(C) బయట
జవాబు.
(A) మనసులో

4. నోరారా హరి కీర్తిని …………..
(A) పాడాలి
(B) పలకాలి
(c) అరవాలి
జవాబు.
(A) పాడాలి

TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

5. పద్యానికి శీర్షిక ………
(A) శివభక్తి
(B) కీర్తన
(C) కడుపు చేటు
జవాబు.
(C) కడుపు చేటు

పాఠం ఉద్దేశం:

మన చుట్టూ ఉన్న చెట్లూ చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి.

ప్రవేశిక:

చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్ని ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మరచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా! అయితే ఈ పాఠం చదవండి.

Leave a Comment