These TS 10th Class Telugu Important Questions 4th Lesson కొత్తబాట will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 4th Lesson Important Questions కొత్తబాట
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు జార్యులు (3 మార్కులు)
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పాకాల యశోదారెడ్డిగారి గ్రామ జనులు పట్టిన కొత్తబాట ఏమిటో చర్చించండి. (T.S Mar. ’15)
జవాబు:
- గ్రామపెద్దల పెత్తనాన్ని అక్కడి ప్రజలు ధిక్క రించారు. పెత్తందార్లు దానితో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు.
- పోలీసు పటేళ్ళ పెత్తనం గ్రామాల్లో తగ్గిపోయింది. పోలీసు పటేళ్ళకు ప్రజలు లంచాలు ఇవ్వడం మానివేశారు.
- గ్రామ ప్రజలు, గ్రామపెద్దల చెప్పులు కింద తేళ్ళలా అణగియుండడం మానివేశారు.
- ప్రజలు చీటికీ మాటికీ, తగవులూ, కొట్లాటలూ, మానివేశారు. పంచాయితీలు, జరిమానాలు పోయాయి. ప్రజలకు శిక్షలు లేవు.
- ప్రజలు అడుక్కుతినడం మానివేశారు. మంచి బట్టలు కట్టుకుంటున్నారు.
- పెద్దవారి ఇళ్ళ స్త్రీలలో ఘోషా పద్ధతి, మేనాలు, పల్లకీలు పోయాయి.
ప్రశ్న 2.
కొత్తబాట రచయిత్రి కథ చెప్పిన తీరులో నీకు నచ్చిన విశేషాలేవి ? (T.S Mar. ’15)
జవాబు:
కొత్తబాట రచయిత్రి చెప్పిన కథను ప్రాంతీయ భాషలో చెప్పింది. వ్యావహారిక భాషలో చెప్పడం వలన విన సొంపుగా ఉంది. నాటి తెలంగాణ సామాజిక జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. తెలంగాణ మాండ లికాలు ఎక్కువగా ప్రయోగించారు.
నక్షత్రకుడు, వసదాగిన పిట్ట, దీపాలు వెలగడం, బండ జింకలు చేరడం మొదలైన జాతీయాలను, పదబంధాలను సందర్భోచితంగా ప్రయోగించి, కథకు కొత్త సొగసులు అద్దారు.
కథలోని పాత్రలు, స్వభావాలు మనకు నిత్య జీవితంలో కనిపించేవే, సన్నివేశాలు కూడా తెలిసినవే. అందుచేత ‘కొత్తబాట’ కథ నచ్చింది.
ప్రశ్న 3.
‘మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి’ అంటే మీకేమర్థ మయింది ? విశ్లేషించండి.
జవాబు:
‘మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి’ అంటే సమాధుల మీద భవంతులు కట్టి’ అని అర్థం. అంటే ఇతరుల మరణాన్ని కూడా లాభంగా మార్చుకోవడం. దానిలో కూడా సంపాదనే ధ్యేయంగా ఉండడం.
సాధారణంగా దోపిడీదారులు, వడ్డీ వ్యాపారులు డబ్బుకిచ్చిన ప్రాముఖ్యం దేనికీ ఇవ్వరు. అప్పు చేసిన వాడి దగ్గర వడ్డీల రూపంలో అసలు కంటే చాలా ఎక్కువ వసూలు చేస్తారు. అప్పు తీర్చలేక అప్పు తీసుకొన్నవాడు మరణించినా బాకీ విడిచిపెట్టరు. అటువంటి దుర్మార్గులు తమ సంపాదనతో పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని దర్జాగా బతుకుతారు. అటువంటి వారి గురించి రచయిత్రి ఈ వాక్యం చెప్పారు.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కొత్తబాట కథలో రచయిత్రి తెలంగాణా గ్రామాల్లో వచ్చిన మార్పులను గూర్చి ప్రజలు పట్టిన కొత్తబాటను గూర్చి చెప్పిన విషయాన్ని 10 పంక్తుల్లో రాయండి. (T.S Mar. ’15)
జవాబు:
1) గ్రామాల్లో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు, సామాన్యుల కంటపడకుండా వారి బండ్లకు తెరలు కట్టే ఆచారం ఉండేది. అది నేడు అంతరించింది.
2) రచ్చబండపై గ్రామపెద్దతో పాటు, గ్రామస్థులు అందరూ కలిసి మెలిసి నేడు కూర్చుంటున్నారు.
3) గ్రామపెద్ద రంగరాయని వంటి వారి పెత్తనాన్ని గ్రామాల్లో ప్రజలు నేడు ధిక్కరించారు. రంగ రాయడు వంటివారు గ్రామాలు విడిచివెళ్ళారు.
4) పోలీసు పటేళ్ళ పెత్తనం గ్రామాల్లో తగ్గిపోయింది. పటేళ్ళకు లంచాలిచ్చే గ్రామ ప్రజలు నేడు లేరు. అందువల్ల పోలీసు పటేళ్ళకు సాగుబాటు లేకుండా పోయింది.
5) ప్రజలు గ్రామపెద్దల చెప్పుల కింద తేళ్ళలా అణిగి యుండడం మానివేశారు. ప్రజలు చీటికి మాటికి తగవులూ, కొట్లాటలూ మానారు. పంచాయితీలు, జరిమానాలు, గ్రామాల్లో ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే తీర్పులు ఇస్తున్నారు. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు అడుక్కు తినడం లేదు. ప్రజలు చక్కగా వేషాలు వేసుకుంటున్నారు.
6) పెద్దల పెళ్ళిళ్ళకు సహితం, ఇప్పుడు మేనాలూ పల్లకీలూ ప్రజలు మోయడం లేదు. గ్రామాల్లో ఇండ్లలో పని మనుషులను సైతం, తమ తోటి వారుగా ప్రజలు చూస్తున్నారు. ఈ విధంగా ప్రజలు గ్రామాల్లో కొత్తబాట పట్టారని, రచయిత్రి తన కొత్తబాట కథలో వెల్లడించారు.
ప్రశ్న 2.
కొత్తబాట పాఠం ఆధారంగా తెలంగాణ పల్లెలలో ఏయే మార్పులు వచ్చాయో విశ్లేషించండి. (T.S June ’16)
జవాబు:
“కొత్తబాట” అనే ఈ పాఠంలో “అక్కా తమ్ముళ్ళిద్దరూ” బస్సు దిగి అక్కడి నుండి ఎద్దులబండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. పల్లెలో అనేకరకాల మార్పులను చూస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
- కొత్తబాట (రోడ్లు) నిర్మించారు.
- మోరుగవనం వేశారు. అందమైన ప్రకృతికి మారు పేరది.
- రోడ్డుకిరువైపులా చెట్లు నాటారు. పూల తోటలో వేశారు. పొంటిమాన్లు చిగురించాయి.
- చెరువును పూడిక తీసి అందంగా చేశారు. దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికి అదరువైంది.
- జారుడు బండలు ఏర్పాటు చేశారు.
- మెచ్చుకొనితీరవలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్డు.
- ఇదివరకు కాళ్ళకు బురద అంటుకునేది.
- స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు.
- కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి.
- ఎల్లమ్మ గుడిని బాగుచేయించారు.
- ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది.
ఈ విధంగా ఈ పాఠంలో అనేక మార్పులను రచయిత్రి తెలిపింది.
ప్రశ్న 3.
‘కొత్తబాట’ పాఠం ఆధారంగా ప్రకృతి వర్ణనను విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
ఈ తరం సాధించిన సామాజిక మార్పును ప్రకృతి అందాలకూ అన్వయిస్తూ తమ్ముడు, అక్కతో చెబుతూ ఉంటాడు.
ఎక్కడ చూసినా కమ్మటి వాసన, వినసొంపైన సంగీతం, అడవంతా చిగురు తొడిగి పచ్చని తివాచీలా ఉంది. ఒళ్ళు పులకరించే విధంగా దారి వెంబడి మోదుగు చెట్ల వనం మొగ్గదొడిగి ఎర్రని పూలతో కొత్తబాటకు స్వాగతం పలుకుతున్న ముత్తైదువుల్లా ఇరువైపులా వరుసగా నిలబడివున్నాయి. ఎత్తైన చెట్ల చిటారు కొమ్మన తేనెపట్లు నిండుగా ఉన్నాయి. కోకిల పాటలు ఏకతాగీతాల్లా వినిపిస్తున్నాయి.
మామిడి చెట్లు నవయవ్వనంతో సింగారించుకున్న ఆడపిల్లల్లా కని పిస్తున్నాయి. చింతలు చిగురిస్తున్నాయి. యాపలు మొగ్గలు విచ్చుకుంటున్నాయి. పొలిమేరలోని చెట్లు మగ పెళ్ళి వారికి మర్యాదలు చేయడానికి వచ్చిన గుంపులా గుబురుగా ఉన్నాయి. ఈ తరం ‘కొత్త బాట’ లో ప్రయాణిస్తుందన్న దృక్పథానికి సంకేతంగా రచయిత్రి ఈ వర్ణనను చేశారు.
PAPER – II : PART – A
1. అపరిచిత గద్యాలు (5 మార్కులు)
ప్రశ్న 1.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
మంచిపని ఏ రూపంలోనైనా ఉండవచ్చు. తాను చదువుకున్నవాడైతే పదిమందికి చదువును పంచిపెట్టవచ్చు. తన ధనాన్ని పదిమందికి విని యోగించవచ్చు. ధర్మ కార్యాలకు, సమాజ కల్యాణ కార్యక్రమాలకు ఇతోధికంగా సాయపడవచ్చు. అధికారి తన పరిధిని దాటకుండా ప్రజలకు ఉప యోగపడే పనులు చేసి ప్రజల మన్ననలు పొంద వచ్చు. తనకు మంచిపేరు వస్తుంది. ప్రజలకు మేలు కల్గు తుంది. ధనికులు పరిశ్రమలను స్థాపించి, పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. అధిక లాభాన్ని ఆపేక్షించకుండా తక్కువ ధరలకే వస్తువుల నమ్మవచ్చు. ఇలా సమాజంలోని వారంతా తమ తమ పరిధుల్లో ప్రజలకు మేలు కల్పించే పనులు చేసినపుడు, దేశంలో సమస్యలే ఉండవు. ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారు.
జవాబు:
ప్రశ్నలు
- ధనం ఉన్నవాడు ఆ ధనాన్ని ఎలా సద్వినియోగం చేయవచ్చు?
- ఒక అధికారి ఏ విధంగా మంచిపని చేయవచ్చు ?
- ధనికులు ఏ విధంగా మంచిపని చేయవచ్చు ?
- వర్తకులు ఏ విధంగా మంచిపని చేయవచ్చు ?
- సమాజంలోని వారంతా ప్రజలకు మేలు కల్గించే పనులు చేస్తే ఏమవుతుంది ?
ప్రశ్న 2.
క్రింది గద్యం చదివి ఖాళీలను పూరించండి.
వ్యవసాయ భూముల్ని ఎలా ఉపయోగించు కుంటామో, జీవనోపాధికోసం బీడుభూముల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలూ ఉన్నాయి. గుజరాత్లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తి కులాల వాళ్ళు అనేకమంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇస్తే పెత్తందారులకు, దళారులకు, కులపెద్దలకూ లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్య పరచవలసిన ప్రభుత్వాలు కూడా చురుకైన పాత్ర నిర్వహించక పోవడం దుర దృష్టకరం !
ఖాళీలు – సమాధానాలు
ప్రశ్న 1.
బీడు భూములంటే …………………….
జవాబు:
పంటలు పండనివి.
ప్రశ్న 2.
జీవనోపాధి కోసం రైతులు ఆధారపడేది …………………….
జవాబు:
వ్యవసాయ భూములు.
ప్రశ్న 3.
విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగని వాళ్ళు ……………………….
జవాబు:
పేదవాళ్ళు.
ప్రశ్న 4.
దళారులు చేసే పని …………………….
జవాబు:
భూములను లీజుకు తీసుకొని పండించుకోవటం.
ప్రశ్న 5.
ప్రభుత్వాలు చేయవలసిన పని …………………….
జవాబు:
పేదలను చైతన్యపరచుటలో చురుకైన పాత్ర నిర్వ హించాలి.
ప్రశ్న 3.
క్రింది పేరా చదవండి. క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“జీవావరణం మీద, పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో ? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలే దేమిటి ? అయినా ఇప్పటికే అను భవిస్తున్నారు కదా ! ………………………. ఆమ్ల గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ.. దర్పాలనీ. ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవమేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.
ప్రశ్నలు – సమాధానాలు
1. కాలుష్యానికి కారణం ఏమిటి ?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.
2. మానవులు చెప్పేదే చేస్తున్నారా ?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.
3. మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా ?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.
4. చెట్లు లేకపోతే ఏమౌతుంది ?
జవాబు:
చెట్లు లేకపోతే
- గ్రీన్ హౌజ్ ఎఫెక్టు
- ఆమ్ల దర్పాలు కలుగుతాయి.
5. పై పేరా దేనిని బోధిస్తోంది ?
జవాబు:
పై పేరా పర్యావరణ పరిరక్షణను గురించి చెపుతోంది.
ప్రశ్న 4.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
సమాజానికి టీచర్ల పట్ల ఉన్న దృక్పథం చాలా విచిత్ర మైంది. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా పరస్పర విరుద్ధంగా ఇది ఉంటుంది. సాంప్రదాయకంగా చూస్తే మన సమాజంలో టీచరంటే దేవుడి తర్వాత దేవు డంతటివాడు. నిస్వార్థ, నిరాడంబర ఆదర్శజీవి. జ్ఞాన ప్రసారం తప్ప అతనికి మరో వ్యాపకం ఉండదు. భిన్న సంస్కృతుల నుండి, వాతావరణాల నుండి, ఆర్థిక స్థితిగతుల నుండి వచ్చిన పిల్లలందర్నీ ఒకే స్థాయికి తీసికొని రావాలి.
జవాబు:
ప్రశ్నలు
- సమాజం టీచర్ గురించి ఏమనుకుంటుంది ?
- “నిస్వార్థం” పదానికి వ్యతిరేక పదం ఏమిటి ?
- నిరాడంబరత అంటే ఏమిటి ?
- ఎలాంటి పిల్లలు బడికి వస్తారు ?
- టీచరు బాధ్యత ఏమిటి ?
2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)
ప్రశ్న 1.
మీ గ్రామ అభివృద్ధిని వివరిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ
బాసర,
X X X.
ప్రియమైన సురేషు,
నీ మిత్రుడు వ్రాయు లేఖ,
ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.
మా గ్రామం ఈ మధ్య చాలా అభివృద్ధి చెందింది. ఇదివరకు రోడ్లు గోతులతో నిండి ఉండేది. ఇప్పుడు ప్రతి వీధిలోనూ సిమెంటు రోడ్డు వేశారు. ఇదివరకు వీధి దీపాలు వెలిగేవి కావు. ఈ మధ్య వీధి దీపాలతో మా వీధులన్నీ తళతళా మెరిసిపోతున్నాయి.
ఇప్పుడు ప్రతి 3 ఇళ్ళకు ఒక వీధి కొళాయి వేశారు. వాటిలో ఉదయం, సాయంత్రం మంచినీరు వస్తోంది. ఇప్పుడు మా ఊరికి 3 సార్లు బస్సు వస్తోంది. హాస్పిటల్ కడుతున్నారు. పాఠశాల కడతారుట. ఉంటాను. తిరిగి ఉత్తరం రాయి.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X.
చిరునామా :
ఎమ్. సురేష్, నెం. – 8,
10వ తరగతి, సమతా హైస్కూల్,
ప్రగతి నగర్, సికింద్రాబాద్.
ప్రశ్న 2.
పల్లెలను పట్టించుకోమని కరపత్రం తయారు చేయండి.
జవాబు:
పల్లె
మనకు అన్నం పెట్టే కల్పవల్లి లాంటి పల్లెను పట్టించు కోండి.
పనులు లేక కూలీలు వలస వెళ్ళిపోతున్నారు.
అప్పులు భరించలేక రైతులు మరణిస్తున్నారు.
పంటలు లేక పొలాలు బీడు బారుతున్నాయి.
మన పల్లెను మనమే కాపాడుకోవాలి.
మేధావులారా ! ధనవంతులారా ! నాయకులారా !
మీ పల్లెని దత్తత చేసుకోంది. ఆదుకోండి. అభివృద్ధి చేయండి. పల్లె ఋణం తీర్చుకోండి.
ఇట్ల
గ్రామాభివృద్ది కమిటీ.
ప్రశ్న 3.
పల్లె అందాలను వివరిస్తూ వ్యాసం రాయండి. (March. ’17)
జవాబు:
పల్లె అందాలు
ఒయ్యారంగా తలలూపే పైరుపచ్చలతో కలకలలాడే పల్లెటూరు సౌఖ్యాల నిలయం. ఆనందాల లోగిలి. కల్తీ లేని చిరునామా.
ఆరోగ్యానికి హాయిగా నవ్వుతూ పలకరించే జనం. కల్మషం లేని మనుషులు. ఎప్పుడూ తోడుగా నిలిచే మనుషులు వరసలు పెట్టి పిలుచుకొనే జనం. ఇరుగుపొరుగు వారి మమతానురాగాలు.
పాడిపంటలకు లోటు లేకుండా ఉండే బంగారు లోగిలి పల్లెటూరు. పక్షుల కిలకిలలు. జంతువుల అరుపులు, గెంతులతో సందడిగా ఉంటుంది. సెలయేళ్ళ గలగలలు, పూలచెట్ల సొగసులు పల్లెలకు అలంకారాలు. ఆదరణ, అనురాగం ఆభరణాలు.
ప్రశ్న 4.
పల్లెటూరి ఆత్మకథ రాయండి.
జవాబు:
నేను, మీ పల్లెను. ఆనాడు ఎంత అందంగా ఉండే దాన్ని, పచ్చగా మిసమిసా మెరిసిపోతూ ఉండేదానిని. నిండుకుండ లాంటి చెరువులతో గలగల లాడుతూ ఉండేదానిని.
నా పిల్లలు ఎంతమంది ఉండేవారో ! అబ్బో ! చాలామంది ఉండేవారు. ఇప్పుడెవరూ లేరు. బిక్కుబిక్కు మంటున్నాను. అన్యాయంగా చచ్చిపోతున్నారు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
చెరువులు చాలా వరకు ఆక్రమించేశారు. మళ్ళీ ఈ మధ్యనే చెరువులవీ బాగు చేస్తున్నారు. పూర్వపు కళ వస్తోంది. చక్కగా మీరంతా వచ్చేయండి. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోవచ్చు. మళ్ళీ నా ఇల్లు పిల్లలతో కలకలలాడాలి. అదే నా కోరిక, నా వేదనను అర్థం చేసుకోండి.
ప్రశ్న 5.
పల్లె పట్నం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణలు రాయండి.
జవాబు:
రామన్న : బాబూ ! తమరిదే ఊరు ?
అఖిల్ : సికింద్రాబాద్, నీది ?
రామన్న : ఆదిలాబాద్ జిల్లాలో పల్లెటూరు.
అఖిల్ : మీరు పల్లెల్లో ఎలా బతుకుతారు ?
రామన్న : కల్తీ లేని ఆహారం తింటూ బతుకుతాం.
అఖిల్ : మీకు కరెంటు ఉండదు. వేసవికాలం ఉక్కపోత కదా !
రామన్న : హాయిగా ఆరు బయట మంచాలు వేసుకొని మా వీధి వాళ్ళందరం కబుర్లు చెప్పుకొంటూ పడుకొంటాం. చల్లగా ఉంటుంది.
అఖిల్ : హోటల్స్ ఉండవు కదా !
రామన్న : కొత్తవారిని ఆదరించి కడుపు నిండా తిండి పెడతాం. వసతి కల్పిస్తాం. ఇంక హోటల్స్ ఎందుకు ?
అఖిల్ : హాస్పటల్స్ ఉండవు కదా !
రామన్న : కష్టపడి పనులు చేసుకొంటాం. సాధారణంగా ఏ జబ్బూ రాదు. వచ్చినా చిన్న డాక్టరు ఉంటాడు. పెద్ద జబ్బయితే పట్నం వస్తాం.
అఖిల్ : అయితే మా పట్నం కంటే మీ పల్లెటూరే బాగుంటుందా ?
రామన్న : ఒకసారి వస్తే మళ్ళీ విడిచిపెట్టరు. ఈ రణగొణ ధ్వనులు, కాలుష్యం ఇవేమీ ఉండవు. హాయిగా ఉంటుంది. నా చిరునామా ఇస్తాను, తప్పకుండా రండి ! మా ఇంట్లో ఉందురుగాని.
అఖిల్ : మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పక వస్తా ! నా బస్సొచ్చేసింది. బై.
రామన్న: మంచిది బాబూ ! జాగ్రత్తగా ఎక్కు
ప్రశ్న 6.
‘విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, స్వంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే ఆవార్డులను కూడా పొందాడు.’ అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
ఆధునిక సమాజంలో శాస్త్రసాంకేతిక రంగ ప్రభావం తీవ్రంగా ఉంది. విజ్ఞానశాస్త్ర ప్రభావంతో మానవుడు సమున్నత స్థాయికి చేరుకుంటున్నాడు. సాధారణంగా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వెంపర్లా డుతారు. స్వయం ఉపాధి మార్గాలకై అన్వేషింపరు.
కాని ఈ యువకుడు విద్యావంతుడై కూడా ప్రభుత్వ ఉద్యోగాలకోసం పాకులాడలేదు. స్వయం శక్తితో ఎదగాలనుకున్నాడు. తాను బ్రతుకుతూ మరికొందరికి ఉపాధిని కల్పించాలనుకున్నాడు.
వ్యవసాయంలో ప్రవేశించాడు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించాడు. అధిక దిగుబడులను పొందాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందాడు. అందువల్ల అతడు నిజంగా అభినందనీయుడు. అందరికి మార్గదర్శకంగా నిలిచాడు. నేటయువతర మంతా నిరుత్సాహ పడకుండా స్వయంఉపాధి మార్గాలను అన్వేషించాలి.
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
- చెప్పు కింద తేళ్ళతీర్గ: పూర్వం గ్రామాల్లో ప్రజలు కరణం పటేళ్ళ పెత్తనంలో, చెప్పుకింద తేళ్ళతీర్గ అణిగిమణిగి యుండేవారు.
- కొరివితోటి నెత్తిగోక్కొను దుర్మార్గులతో తగవు పెట్టుకోవడం, కొరివితోటి నెత్తిగోక్కున్నట్లే అవుతుంది.
- ఏకలవ్య శిష్యుడు : సామల సదాశివగారు కప్పగంతుల వారి ఏకలవ్య శిష్యుడిగా పేరు పొందారు.
2. పర్యాయపదాలు
బాట = దారి, మార్గం
సంబురం = సంతోషం, ఆనందం
దిశ = దిక్కు, కాష్ట
గుడి = ఆలయం, కోయిల, కోవెల, దేవళం
గురిగింజ = గురివెంద, గుంజ, కాకణి, కాంభోజి
సన్యాసి = భిక్షువు, పరివ్రాట్టు, పారాశరి, మస్కరి
నక్క = శివ, గోమాయువు, జంబుకము
గొట్టె = అది, ఉరణము, పొట్టేలు, తగరు
ಇಲ್ಲ = గృహము, గేహము, నికేతనము, తావు
నెత్తురు = నెత్రు, ఎఱ్ఱ, రక్తము, రుధిరము, కీలాలము
3. నానార్థాలు
సంబరము = సంతోషం, జాతర, సేవ, జలము, చేప
భానువు = సూర్యుడు, శివుడు, వృద్ధుడు, మబ్బు
ధాత్రి = నేల, తల్లి, దాది, ఉసిరిక
4. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
కథ – కత
దిశ – దెస
పాదరసము – పారద
గొట్టె (గొతియ) – కురరీ
గురింజ – గుంజా
ప్రీతి – బాతి
ప్రయాణం – పయనం
కుడ్యము – గోడ
రాత్రి – రాతిరి
విద్య – విద్దె
స్తంభం – కంబం
సముద్రం – సంద్రం
పుణ్య – పన్నెం
ఆధారము – ఆదరువు
మనిషి – మనిసి
అర్ధరాత్రి – అద్దమరేయి
మర్యాద – మరియాద
దీపము – దివ్వె
మృత్యువు – మిత్తి
ఆర్య – అయ్య
తంత్రము – తంపు
5. వ్యుత్పత్త్యర్థాలు
భాష = భాషింపబడునది (భాష)
పాదపము = వ్రేళ్ళతో నీరు త్రాగునది (చెట్టు)
PAPER – II : PART – B
1. సంధులు
తెలుగు సంధులు
1. ఉకార సంధి
సూత్రాలు : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగు.
ఉదా :
ఎప్పుడేసిందో = ఎప్పుడు + ఏసిందో
కాదక్కా = కాదు + అక్కా
బాగైందా = బాగు + అయిందా
పిల్లలం = పిల్లలు + అంత
భుజాలెక్కి = భుజాలు + ఎక్కి
2. అకార సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా :
మనూరికో = మన + ఊరికో
పిట్ఠోలె = పిట్ట + ఓలె
పెద్దత్త = పెద్ద + అత్త
3. ఇకార సంధి
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము గానగు.
ఉదా :
బండెక్కి = బండి + ఎక్కి
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకాదేశమగును. –
ఉదా :
పుణ్యాన = పుణ్య + ఆన
2. లు, ల, నల సంధి
సూత్రం : లు, ల, న, లు పరంబగునపుడొకానొకచోట ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా :
దీపాలు = దీపము + లు
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
వాన వొరదలకు – వానలకు వొరదలకు – ద్వంద్వ సమాసం
అణిగి మణిగి – అణిగియును, మణిగియును – ద్వంద్వ సమాసం
పండాకు – పండైన ఆకు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పెద్ద పులి – పెద్ద పులి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నీలసముద్రం – నీలమైన సముద్రం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
గున్నమామిళ్ళు – గున్న అయిన మామిళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మనూరి పొలిమేర – మనూరి యొక్క పొలిమేర – షష్ఠీ తత్పురుష సమాసం
ఊరి చెరువు – ఊరి యొక్క చెరువు – షష్ఠీ తత్పురుష సమాసం
ఈతలొట్టి – ఈత (కల్లు) కొరకు లొట్టి – చతుర్థీ తత్పురుష సమాసం
రచ్చబండ – రచ్చ కొరకు బండ – చతుర్థీ తత్పురుష సమాసం
రెండతస్తులు – రెండు సంఖ్యగల అంతస్తులు – ద్విగు సమాసం
తుమ్మ బంక – తుమ్మ అను పేరుగల బంక – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
కర్ణప్పటేండ్లు – కర్ణములు, పటేండ్లు – ద్వంద్వ సమాసం
పసుపు బండార్లు – పసుపును, బండారును – ద్వంద్వ సమాసం
ముంతపొగ – ముంతతో పొగ – తృతీయా తత్పురుష సమాసం
గడ్డివాము – గడ్డితో వాము – తృతీయా తత్పురుష సమాసం
3. వాక్య పరిజ్ఞానం
అ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.
ప్రశ్న 1.
లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి లింగయ్య చేత నాయకునికి ఇవ్వ బడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 2.
నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుప బడింది. (కర్మణి వాక్యం)
ప్రశ్న 3.
వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)
ఆ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా రాయండి.
ప్రశ్న 1.
శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యం)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 2.
మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యం)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)
ప్రశ్న 3.
నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యం)
జవాబు:
నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)