TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం యుద్ధకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

యుద్ధ కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ 1
శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసించాడు. తన గుండెలకు హత్తుకున్నాడు. రాముడు సూచించిన మార్గంలో వానర సైన్యం సముద్ర తీరాన్ని చేరింది. లంకలో రావణుడు మంత్రులతో లంకను కాపాడుకునే పద్ధతి గూర్చి సమాలోచన గావించాడు. విభీషణుడు హితోక్తులు పలికాడు. సీతాపహరణం పాపకార్యం అన్నాడు. సీతను తిరిగి రామునికి అప్పగించాలన్నాడు. రావణుడు విభీషణునిపై కోపించాడు. నిందించాడు. విభీషణుడు రావణుని వీడి శ్రీరాముడిని శరణు వేడాడు.

రావణుని సంహరించి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని రాముడు ప్రతిజ్ఞ గావించాడు. సముద్ర జలాలతో లంకారాజుగా విభీషణుని పట్టాభిషిక్తుని చేయమని లక్ష్మణునికి రాముడు ఆజ్ఞ ఇచ్చాడు. లక్ష్మణుడు ఆ విధంగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని గావించాడు. శ్రీరాముడు సముద్రుని ప్రార్థించాడు. సముద్రుడు అనుగ్రహించలేదు. శ్రీరాముడు ఆగ్రహించాడు. బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు స్మరించాడు. సముద్రుడు భయపడ్డాడు. లంకకు దారినివ్వడానికి సముద్రుడు అంగీకరించాడు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణానికి పూనుకున్నాడు.

వానరులందరూ నిరంతరాయంగా కృషిచేసి వందయోజనాల పొడవు, పదియోజనాల వెడల్పు గల సేతువును ఐదురోజుల్లో నిర్మించారు. కోలాహలంగా సేతువుపై ప్రయాణించి అవతలి తీరం చేరారు. శుక సారణులనే రాక్షసులు రావణుని వద్ద నుండి వచ్చి వానర సైన్యంలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించాడు. సీతను అప్పగించక పోతే రావణునికి చావు తప్పదని చెప్పి రాముడు వారిని పంపివేశాడు. రావణుడు అనేక మాయో పాయాలతో సీతను వంచించడానికి ప్రయత్నం చేశాడు. విభీషణుని భార్యసరమఇదంతా రాక్షసమాయ అని సీతకు చెప్పి ఓదార్చింది. రాముడు సువేల పర్వతం పై నుండి రావణుని చూశాడు. సుగ్రీవుడు కోపంతో వెళ్ళి రావణునితో తలపడి, తిరిగి రివ్వున సువేల పర్వతంపై వాలాడు.

అంగదుడు రాయబారం నడిపాడు. సీతను అప్పగించకపోతే రావణునికి శ్రీరాముని చేతిలో చావు తప్పదన్నాడు. తన పైకి వచ్చిన రాక్షసులను విసిరికొట్టి అంగదుడు ఆకాశమార్గంలో తిరిగి రామునివద్దకు చేరాడు. లంకపై దండయాత్ర ప్రారంభమైంది. ఇరుసైన్యాలూ తీవ్రంగా పోరాడాయి, హనుమంతుడు ఎందరో రాక్షసులను చంపాడు. అంగదుడు ఇంద్రజిత్తును ఓడించాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను మూర్ఛితుల్ని గావించాడు. రావణుడు సుగ్రీవుడిని మూర్ఛలో ముంచాడు. హనుమంతుడు రావణుని కొట్టాడు.

రావణుడు హనుమంతుని బలాన్ని మెచ్చుకున్నాడు. రావణుడు వేసిన ‘శక్తి’ అనే ఆయుధం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. హనుమంతుడు రాముడిని భుజాలమీద కూర్చోబెట్టుకున్నాడు. రాముడి బాణాల దెబ్బకు రావణుడు అలసిపోయాడు. అవమానంతో రావణుడు అంతఃపురానికి చేరాడు. కుంభకర్ణుడు అన్నను ఓదార్చి యుద్ధానికి వచ్చాడు. రాముడు ఇంద్రాస్త్రంతో కుంభకర్ణుని వధించాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

రామలక్ష్మణులు పడిపోగా వారు మరణించారను కున్నాడు ఇంద్రజిత్తు. విభీషణుడు వానర సైన్యానికి ధైర్యం చెప్పాడు. హనుమంతుడు జీవించివుంటే అందరం జీవించివున్నట్లే అన్నాడు జాంబవంతుడు. హనుమంతుడు హిమాలయాల్లోని సర్వౌషధి పర్వతాన్ని తెచ్చాడు. ఓషధుల వాసనకు రామ లక్ష్మణుల గాయాలు మానాయి. ఇంద్రజిత్తు మాయలు కొన్ని చేశాడు. అభిచార హోమాన్ని చేశాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ని ప్రయోగించాడు. లక్ష్మణుడు నేలపై పడిపోయాడు. శ్రీరాముడు విలపించాడు.

సుషేణుని సలహాతో హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చాడు. లక్ష్మణుడు పునర్జీవితుడయ్యాడు. ఇంద్రుడు పంపిన రథంపై ఉండి రాముడు యుద్ధం చేశాడు. అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. రామరావణ యుద్ధం ఘోరంగా సాగింది. శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతో రావణాసురుని వధించాడు. రాముని అనుమతితో విభీషణుడు అన్నకు దహన సంస్కారాలు గావించాడు. లక్ష్మణుడు విభీషణుని లంకారాజుగా పట్టాభిషేకం గావించాడు. హనుమంతుడు శ్రీరాముని విజయాన్ని సీతకు తెలియజేశాడు.

సీత రాముని వద్దకు వచ్చింది. రాముడు ఆమె తన ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చునన్నాడు. సీత అగ్నిప్రవేశం గావించింది. అగ్నిదేవుడు సీతాదేవి పరిశుద్ధతను వెల్లడిస్తూ ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామునికి తిరిగి అప్పజెప్పాడు. ముల్లోకాలకు ఆమె గొప్పతనాన్ని తెలియజేయడానికే ఇలా చేశానన్నాడు రాముడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. పుష్పక విమానంలో అందరూ తిరిగి బయలు దేరారు. నందిగ్రామంలో భరతుడు సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలికాడు. సీతారామ లక్ష్మణులు పెద్దలందరికీ నమస్కరించారు. భరతుడు పాదుకలను రాముని పాదాలకు తొడిగాడు. శ్రీరామపట్టాభిషేకం జరిగింది. భరతుని యువ రాజుగా చేశాడు. శ్రీరాముడు ప్రజలను సుఖంగా పాలించాడు. రామరాజ్యం ఆదర్శవంతంగా నేటికీ నిలిచివుంది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాంబవంతుడు విభీషణుని ‘హనుమంతుడు క్షేమమేనా ?” అని అడగడంలోని అంతరార్థం ఏమిటి?
జవాబు:
ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావానికి రామలక్ష్మణులతో సహా అందరూ స్పృహ కోల్పోయారు. బ్రహ్మాస్త్ర ప్రభావం విభీషణునిపైనా, హనుమంతునిపైనా, జాంబవంతునిపైనా పడలేదు. తనను వెతుకుతూ వచ్చిన విభీషణుని ‘హను మంతుడు క్షేమమేనా ?’ అని జాంబవంతుడు అడిగాడు.

రామలక్ష్మణుల గురించి కాక, హను మంతుని గురించి అడగడంలోని జాంబవంతుని ఆంతర్యం విభీషణునికి అర్థం కాలేదు. హను మంతుడు బతికి ఉంటే, రామలక్ష్మణులతో సహా వానరసైన్యం మొత్తం క్షేమంగా ఉంటుందని జాంబవంతుడు అన్నాడు. ఈ మాటలను బట్టి ఆంజనేయుని శక్తి సామర్థ్యాలు అర్థమవుతున్నాయి.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 2.
‘రామ రావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి’ దీన్ని గురించి వివరించండి.
జవాబు:
రావణుడు కపటోపాయంతో సీతను అపహరించుకు పోయి, లంకలో అశోకవనంలో బంధించాడు. హను మంతుని ద్వారా ఎట్టకేలకు సీత జాడ తెలుసుకొని వానర సైన్యాన్ని తోడుతీసుకొని లంకను ముట్ట డించాడు.

శ్రీరాముడు ముందుగా సీతనప్పగించి ప్రాణాలు దక్కించుకోమని రావణునికి కబురంపాడు. రావణుడు తిరస్కరించాడు. వానరవీరుల చేతిలో రాక్షసవీరులు నిహతులౌతున్నారు. రావణుడు సుగ్రీవునిపై బాణాలేసాడు. లక్ష్మణుడు రావణుని ఎదుర్కొన్నాడు. రావణుని దెబ్బకు హనుమంతుడు, హనుమంతుని దెబ్బకు రావణుడు ఉలికిపడి సర్దుకున్నారు. రావణుడి ‘శక్తి’ ప్రయోగంచే లక్ష్మణుడు మూర్ఛపోయాడు. హనుమంతుడు రావణుని పిడికిళ్ళతో నొప్పించి శ్రీరాముని తన భుజాలపై ఎక్కించుకున్నాడు. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేశాడు. రావణుని ధనుస్సు, కిరీటం పడగొట్టి అలసట తీర్చుకొని రమ్మని పంపేశాడు.

కుంభకర్ణుడు విజృంభించగా రాముడు అతణ్ణి అంతం చేశాడు. రావణుడు విభీషణునిపై బల్లెం ఎత్తాడు. లక్ష్మణుడు అడ్డుకున్నాడు. రాముడు రావణునిపై బాణాలు గుప్పించాడు. తట్టుకోలేక రావణుడు పరుగులు తీశాడు. ఇంద్రుడు మాతలితో రథాన్ని పంపాడు. రామరావణులు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. రావణుని తలలు .ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మొలుస్తూ ఉండడంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాముడు రావణుని అంతమొందించాడు.

‘ఈ రకంగా రామరావణుల యుద్ధానికి రామరావణుల యుద్ధమే సాటి’ అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధ పడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలని, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలని రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్రమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమ కుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించ డానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 4.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికి పోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదంచేసి ఆకాశ మార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 5.
రావణుని ‘శక్తి’ ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు.

హనుమంతుడు రావణుడి వక్షస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హను మంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు. ‘విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 6.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరా క్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచిపెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు.
రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 7.
రామాయణంలో విభీషణుడి పాత్ర గురించి రాయండి. (March 2018)
జవాబు:
విభీషణుడు రావణాసురుని తమ్ముడు. శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదనే ఆలోచన కలవాడు. రావణుడు సీతను అపహరించడం మహాపాపమని, ఆయన కీర్తి ప్రతిష్ఠలు మంటగలుస్తాయని, సంపదలు నశిస్తాయని భావించినట్టివాడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు విభీషణుడు.

లంకలో ప్రవేశించిన హనుమంతుని చంపమని రావణాసురుడు ఆజ్ఞాపించినపుడు, దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చని రాజనీతిని ప్రదర్శించిన విజ్ఞుడు విభీషణుడు.

విభీషణుడు తన అన్నయగు రావణునితో అనవసరంగా కోపం మంచిది కాదని, అది ధర్మానికి ఆటంకమౌతుందని, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికినవాడు. రావణుని అధర్మ మార్గాన్ని వ్యతిరేకించినవాడు.

విభీషణుడు ధర్మరక్షణ కోసం శ్రీరాముని పక్షంలో చేరినవాడు. రావణ సంహారం తరువాత లంకా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడైనాడు.

ప్రశ్న 8.
రామాయణం కథ ఆధారంగా రావణుని వ్యక్తిత్వాన్ని గురించి తెలపండి. (June 2015)
జవాబు:
రావణుడు మహా తేజశ్శాలి. హనుమంతుడు మొట్టమొదటిసారి రావణుని చూసి రావణుని తేజస్సుకు ఆశ్చర్యపడ్డాడు. అకంపనుడు, సీతను అపహరించి తెమ్మని, అలా చేస్తే రాముడు సీతావియోగంతో మరణిస్తాడని చెప్పాడు. శూర్పణఖ సీత అందాన్ని వర్ణించి చెప్పి రావణునిలోని స్త్రీ వ్యామోహాన్ని రెచ్చగొట్టింది. మారీచుడు, అకంపనుడు ఎంత చెప్పినా వినకుండా రావణుడు మూర్ఖత్వంతో సీతను అపహరించి తెచ్చాడు.

విభీషణుడు ఎంత హితవు చెప్పినా రావణుడు వినలేదు. రావణుడు పరాక్రమవంతుడు. జటాయువును సంహరించాడు. లక్ష్మణుడిని శక్తి ఆయుధంతో మూర్ఛపోయేలా చేశాడు. రాముడి పరాక్రమం ముందు మాత్రం రావణుడు నిలబడలేకపోయాడు. రావణుడు రామునితో సమంగా యుద్ధం చేశాడు. చివరకు రాముని బ్రహ్మాస్త్రానికి హతుడయ్యాడు.

రావణుడు కపటి. శ్రీరాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను సీతకు చూపించి రాముడు తన చేతిలో మరణించాడని అబద్ధం ఆడాడు. రావణుడు అవివేకి. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటివచ్చి ఎంతో మంది రాక్షసుల్ని చంపి లంకాదహనం చేసిన రాముని బలాన్ని గూర్చి అంచనా వేయలేకపోయాడు. తన కుమారుడు మహాశక్తివంతుడైన ఇంద్రజిత్తు, తమ్ముడు కుంభకర్ణుడు మరణించినా రావణుడు. తెలివి తెచ్చుకోలేదు. మహాపతివ్రత అయిన సీతను బంధించి తెచ్చి తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు.

లంకారాజ్యాధిపతి అయిన రావణుడు, స్త్రీ వ్యామోహంతో, అవివేకంతో, తనవారి యొక్క తమ్ముల యొక్క హితవచనాలు వినక రాముని చేతిలో మరణించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 9.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము “అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటుకు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు.

రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు.

సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు తాను ఎక్కుపెట్టిన అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం”పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 10.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించి పంపాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్ధం చెప్పాడు. విద్యుజ్జిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపటయుద్ధానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు స్పృహకోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మని పంపాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 11.
రామరావణయుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం లక్ష్మణుడి గుండెపై నాటుకుంది. లక్ష్మణుడు స్పృహ తప్పాడు. హనుమంతుడు రావణుడి వక్షస్థలంపై గుద్ది క్రింద పడేటట్లు చేశాడు. రాముడు హనుమ భుజాలపై కూర్చొని, రావణునితో చేసి, యుద్ధ రావణుని ధనుస్సును విరిచాడు. రావణుని కిరీటం నేలపై పడింది. రాముడు రావణునితో “యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రా. నా బలం చూపిస్తా” అన్నాడు.

రాముడు కుంభకర్ణుని చంపాడు. లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తును చంపాడు. రావణుడు శక్తిని ప్రయోగించాడు. రాముడు దాన్ని ప్రార్థించాడు. లక్ష్మణుడు పడిపోయాడు. రాముని విలువిద్య ముందు రావణుడు నిలువ లేక పరుగు తీశాడు. హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుడిని బ్రతికించాడు.

ఇంద్రుడు రామునకు దివ్యరథాన్ని పంపాడు. రాముడు ఆ రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. క్రమంగా రాముని ‘ముందు రావణుడు నిలువలేకపోయాడు. రావణుని సారథి రథాన్ని ప్రక్కకు మళ్ళించాడు. రావణుడు సారథిపై కోపించాడు. అగస్త్యమహర్షి రామునికి, ఆదిత్య హృదయం ఉపదేశించాడు. రాముడి బాణాలు తగిలి రావణుని తలలు తెగిపడ్డాయి. కాని తిరిగి మొలుస్తున్నాయి.

రామరావణ యుద్ధానికి సాటి రామ, రావణ యుద్ధమే. మాతలి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి సూచించాడు. రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 12.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చుననీ అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని ‘సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానని చెప్పి. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే ‘రామరాజ్యం’ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 13.
విభీషణుని నీతిని వివరించండి.
జవాబు:
లంకలో రావణుడు మంత్రులతో సమావేశం అయ్యాడు. తామొక్కరే లంకను కాపాడగలమని అందరూ గొప్పలు చెబుతున్నారు. శత్రువును తుదముట్టిస్తామంటున్నారు.

విభీషణుడు మాత్రం శత్రువుల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకూడదన్నాడు. మనరాజే సీతను అపహరించాడు. అది పాపం. కీర్తిప్రతిష్ఠలు పోతాయి. ఆయుష్షు తగ్గుతుందన్నాడు. సంపదలు నశిస్తాయి అన్నాడు. సీతను శ్రీరామునికి అప్పగించడమే మంచిదన్నాడు. శ్రీరాముని వంటి మహావీరునితో విరోధం తగదన్నాడు. అనవసరంగా కోపించకూడదు. అది ధర్మానికి ఆటంకం కల్గిస్తుంది. సుఖాలను దూరం చేస్తుంది అని రావణునికి అనేక విధాల హితబోధ చేశాడు. అనవసరమైన యుద్ధాన్ని నివారించడమే విభీషణుని నీతి.

ప్రశ్న 14.
అంగద రాయబారం గురించి రాయండి.
జవాబు:
అంగదుడిని శ్రీరాముడు రాయబారిగా పంపాడు. రావణుడి దగ్గరకు వెళ్ళాడు అంగదుడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తప్పదన్నాడు. లంకకు విభీషణుడు రాజు అవుతాడన్నాడు. దానితో సభ అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదునిపై బడ్డారు. అంగదుడు వారిని తన చంకలలో ఇరికించుకొన్నాడు. రాజప్రాసాదం పైకి ఎగిరాడు. అక్కడి నుండి బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశమార్గంలో శ్రీరాముని చేరాడు.

అంటే, అంగదుడు రాయబారిగా తాను చెప్పదలచుకొన్నది సూటిగా చెప్పాడు. తనపై దాడికి దిగిన వారిని మట్టుబెట్టాడు. తను చెప్పినది చేయగల సమర్థత తమకు ఉందని నిరూపించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 15.
శ్రీరాముని యుద్ధనీతిని వివరించండి.
జవాబు:
రావణుడిది తప్పని తెలిసినా రాయబారిని పంపాడు. సీతను ఇచ్చివేస్తే యుద్ధం ఉండదని చెప్పించాడు. తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చేశాడు. రావణుని సకుటుంబంగా చంపాడు. రావణుని మరణంతో అతనిపై వైరం పోయిందన్నాడు. రావణుడు తనకు కూడా గౌరవించదగిన వాడే అన్నాడు. ఎంతవరకు విరోధం పాటించాలో అంతవరకే రామునకు విరోధం ఉంటుంది. అది శ్రీరాముని యుద్ధనీతి.

“నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై”
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ 2

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2019)

రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్రస్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానమని అతని నిందలను సహించాడు విభీషణుడు. కాని రావణుని అధర్మమార్గాన్ని మాత్రం సమర్థించలేదు. ధర్మం వీడిన రావణుని వీడడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు. తన నలుగురు అనుచరులతో కలిసి రామలక్ష్మణులున్న చోటికి చేరాడు. శ్రీరాముడిని శరణు కోరాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. అనుగ్రహించిన శ్రీరాముడు విభీషణునితో నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని చెప్పాడు. ఆ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుడిని ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుడిని పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

ప్రశ్నలు – జవాబులు :
1. ఎవరు ధర్మమార్గమును విడిచిపెట్టారు ?
జవాబు:
రావణుడు ధర్మమార్గమును విడిచిపెట్టాడు.

2. రావణుని నిందలను విభీషణుడు ఎందుకు సహించాడు ?
జవాబు:
అన్న తండ్రితో సమానమని అతని నిందలను సహించాడు విభీషణుడు.

3. విభీషణుడు ఎవరితో కలిసి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు ?
జవాబు:
విభీషణుడు నలుగురి అనుచరులతో కలిసి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు.

4. ఆచరణ రూపం దాల్చిన శ్రీరాముని ఆజ్ఞ ఏమిటి ?
జవాబు:
లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకా రాజుగా విభీషణుడిని పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది.

5. విభీషణునితో శ్రీరాముడు ఏమన్నాడు ?
జవాబు:
నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని చెప్పాడు. ఆ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 2.
కింది గద్యాన్ని చదువండి. (March 2018)

పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి, విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు.

క్రింది ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించి రాయండి.
1. లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముని అభ్యర్థించినది.
అ) శివుడు
ఆ) విభీషణుడు
ఇ) గుహుడు
జవాబు:
ఆ) విభీషణుడు

2. భరద్వాజ ఆశ్రమాన్ని చూసినవారు.
అ) శ్రీరాముడు
ఆ) సీతారాములు
ఇ) సీత
జవాబు:
ఆ) సీతారాములు

3. వానరులను బతికించినది.
అ) భరద్వాజుడు
ఆ) ఇంద్రుడు.
ఇ) శ్రీరాముడు
జవాబు:
ఆ) ఇంద్రుడు

4. శ్రీరాముడు సంహరించినది.
అ) శిష్టులను
ఆ) ఇష్టులను
ఇ) దుష్టులను
జవాబు:
ఇ) దుష్టులను

5. శ్రీరాముని రాకను ముందుగా భరతునికి తెలియజేసినది.
అ) హనుమంతుడు
ఆ) గుహుడు
ఇ) విభీషణుడు
జవాబు:
అ) హనుమంతుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదివి, ఖాళీలు పూరించండి. (June 2017)

రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా ! భళా !, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు.

ప్రశ్నలు – జవాబులు :
1) రావణుడు ………………… మీద శరవర్ష ధార కురిపిస్తున్నాడు.
జవాబు:
వానరసేన మీద

2) రావణుని దెబ్బకు చలించిపోయినవాడు ……………..
జవాబు:
మారుతి (హనుమంతుడు)

3) రావణుడు …………….. దెబ్బతో చలించిపోయాడు.
జవాబు:
హనుమంతుని ఒక్క అరచేతి

4) మారుతి ………………….. చేత మెచ్చుకోబడ్డాడు.
జవాబు:
రావణుని

5) లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి …………………. ను వారించాడు.
జవాబు:
అన్న

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 4.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు రాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవడలేదు. శ్రీరాముడి కన్నులు ఎఱ్ఱబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగద్రొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకి పోయేటట్లు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమౌతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు.

ప్రశ్నలు – జవాబులు :
1. సముద్రం దాటే ఉపాయాన్ని విభీషణుడు ఏమి చెప్పాడు ?
జవాబు:
సముద్రాన్ని ప్రార్థించడం వల్ల సముద్రాన్ని దాటగలమని విభీషణుడు ఉపాయం చెప్పాడు.

2. శ్రీరాముడు సముద్రుణ్ణి ఎలా ఉపాసించాడు ?
జవాబు:
శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.

3. శ్రీరాముడు సముద్రుని గర్వం అణగద్రొక్కడానికి స్మరించిన అస్త్రం ఏది ?
జవాబు:
శ్రీరాముడు సముద్రుని గర్వం అణగదొక్కడానికి స్మరించిన అస్త్రము ‘బ్రహ్మాస్త్రము’.

4. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తే ఏమయింది ?
జవాబు:
శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తే ప్రకృతంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోయాడు.

5. పై పేరాకు తగిన శీర్షికను స్మరించండి.
జవాబు:
‘సముద్రుడిపై శ్రీరాముడి బ్రహ్మాస్త్ర ప్రయోగం’ అన్న శీర్షిక, దీనికి సరిపోతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 5.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగించారథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉందీనాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు. రానురాను రాముడిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్ళించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది. యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు. శ్రీరాముడికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాలతాకిడికి రావణుడి తలలు నేలరాలుతున్నాయి. కాని వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి.

ప్రశ్నలు – జవాబులు :
1. మాతలి ఎవరి రథసారథి ?
జవాబు:
ఇంద్రుని రథ సారథి.

2. అగస్త్యుడు ఎవరి విజయాన్ని కోరుకున్నాడు ?
జవాబు:
అగస్త్యుడు శ్రీరాముని విజయాన్ని కోరుకున్నాడు.

3. రావణుడు పొందిన వరం ఏమిటి ?
జవాబు:
తెగిన తలలు మళ్ళీ మొలవాలని వరం పొందాడు.

4. రావణుని సారథి ఎందుకు రథాన్ని పక్కకు మళ్ళించాడు ?
జవాబు:
రాముని బాణాల నుండి రావణుని కాపాడడానికి.

5. రావణుడు నిజమైన వీరుడని ఎలా చెప్పగలవు ?
జవాబు:
యుద్ధరంగంలో పక్కకు వెళ్ళడానికి ఇష్టపడలేదు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 6.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని, సీతతో పలికాడు. ఆమె నమ్మలేదు. మాయావియైన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచాడు. అతడు శ్రీరామునిదే అనిపించే మాయా శిరస్సును, ధనుర్బాణాలను తీసుకొని వచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన్నాశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య ‘సరమ’ సీతను ఊరడించింది. ఇదంతా రాక్షసమాయ అని చెప్పింది. శ్రీరాముడు క్షేమమే అని తెలిపింది.

ప్రశ్నలు – జవాబులు :
1. సరమ ఎవరు? ఆమె సీతకు ఏమి చెప్పింది ?
జవాబు:
‘సరమ’ విభీషణుని భార్య. సరమ అది రాక్షసమాయ అని, రాముడు క్షేమమని సీతకు చెప్పింది.

2. రావణుడు సీత విషయంలో వేసిన ఎత్తుగడ ఏమిటి?
జవాబు:
రాముడు తన చేతిలో హతుడైనాడని, రాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను రావణుడు సీతకు చూపించాడు. ఇప్పటికైనా తన్నాశ్రయించమని కోరాడు.

3. శ్రీరాముని మాయ శిరస్సును తెచ్చి సీతకు చూపినవాడు ఎవరు?
జవాబు:
విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుడు సీతకు రాముని మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు.

4. సీత ఎందుకు కుమిలిపోయింది?
జవాబు:
రాముడు నిజంగానే మరణించి ఉంటాడని నమ్మి సీత కుమిలిపోయింది.

5. ఇది ఏ కాండం లోనిది? దీనికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఇది యుద్ధకాండం లోనిది. దీనికి “రావణుని ఎత్తుగడ” అనే శీర్షిక తగియుంటుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

ప్రశ్న 7.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణుకోరాడు విభీషణుడు, అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణునితో నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకొన్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

ప్రశ్నలు – జవాబులు :
1. దాశరథి ఎవరిని అనుగ్రహించాడు ?
జవాబు:
దాశరథి విభీషణుణ్ణి అనుగ్రహించాడు.

2. రాముడు ఒట్టేసి విభీషణునితో ఏమని చెప్పాడు ?
జవాబు:
రావణుని బంధుమిత్ర సమేతంగా చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ఒట్టేసి చెప్పాడు.

3. విభీషణుడు రామునకు ఏమని మాట ఇచ్చాడు ?
జవాబు:
రావణుని చంపే పనిలో తాను యథాశక్తిగా సాయం చేస్తానని విభీషణుడు రామునకు మాట ఇచ్చాడు.

4. విభీషణుని లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసింది ఎవరు ?
జవాబు:
విభీషణుని లంకారాజుగా పట్టాభిషక్తుణ్ణి చేసింది లక్ష్మణుడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం యుద్ధకాండ

5. ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి. ఇది ఏ కాండం లోనిది ?
జవాబు:
‘విభీషణుని శరణాగతి’ అన్నది శీర్షిక. ఇది యుద్ధకాండం లోనిది.

Leave a Comment