TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 4th Lesson కొత్తబాట Textbook Questions and Answers.

TS 10th Class Telugu 4th Lesson Questions and Answers Telangana కొత్తబాట

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 36)

మార్కెట్కు వెళ్ళే మార్గం పక్కన ఇళ్ళున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ళు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్ళకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది. చిన్న, పెద్ద ఇళ్ళలోను, పేదల, ధనికుల ఇళ్ళలోను, అన్ని ఇళ్ళలోను ప్రవేశద్వారం ప్రక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు, ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ, ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో దేనిని గురించి ఉన్నది ?
జవాబు:
ఒక ప్రాంతం గురించి ఉన్నది (ఒక పేద బస్తీ గురించి).

ప్రశ్న 2.
ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
అపరిశుభ్ర కాలనీలో ఉంటుంది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి.
జవాబు:
నేను చూసిన పల్లె రామాపురం. పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంది. స్వచ్ఛమైన పైరు గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఊరి పక్కన గలగల పారే సెలయేరు నా మనస్సును ఆకట్టుకుంది. కల్మషం లేని పల్లె ప్రజల శ్రమ జీవన సౌందర్యం ఆదర్శ నీయం.

ప్రశ్న 4.
పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏయే మార్పులు చోటుచేసుకున్నాయి ?
జవాబు:
ఆనాడు పల్లెలు దరిద్రానికి, అనారోగ్యానికి, అవిద్యకు ప్రతిరూపాలుగా ఉండేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా సౌభాగ్యం ఉంది. ప్రతి ఇంటికీ విద్యుత్తు, టివి ఉన్నాయి. ఇంచుమించు చాలామందికి మోటారు బైకులున్నాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బాగా చదువుకొంటున్నారు. కొన్ని విషయాలలో కొంత వెనుకబడి ఉన్నారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 39)

నేను రాన్రా తమ్ముడు! ………….. గండ్లవడ్తనె ఉంది.

ప్రశ్న 1.
“సెవ్వు మీద పేను వార్తెనా?” అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
‘పేను’ తలలో ఉంటుంది. పేను పాకుతుంటే దురద పెడుతుంది. అందుచేత తెలుస్తుంది. అంటే చెవి మీద పేనుపాకితే తెలుస్తుంది. కాని, అక్క చెప్పే మాటలను తమ్ముడు అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే కనీసం చెవి మీద పేను పాకినట్లు కూడా లేదతనికి. ఇంక చెవిలోకి ఆ మాటలు వెళ్ళే అవకాశం లేదు. వాటి గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. అందుచేత అక్క చెప్పే మాటలను కనీసం పట్టించుకోవట్లేదని అర్థమయింది.

ప్రశ్న 2.
మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా ? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి.
జవాబు:
మేము ఎప్పుడైనా ఎక్కడికైనా దగ్గర్లో ఉన్న చోట్లకు నడుచుకొంటూనే పోతాము. పోయేటప్పుడు గోడలపై రాతలు, సినిమా పోస్టర్లు మొదలైనవి గమనిస్తాం. పక్షులు, జంతువులు, వాహనాలు, ఇళ్ళను చూస్తాం.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి.
జవాబు:
మా ఊరి పొలిమేర పచ్చని పంటపొలాలు, పచ్చని చేలు పావడకట్టి, పంట కాలువలతో ప్రకృతి రమణీయం, వాగులూ, వంకలతో, పక్షుల కిలకిలారావాలతో చూడముచ్చటగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 40)

మరి! మా తిక్క సన్నాసి…………. సంబురాన ముందుకు సాగిన

ప్రశ్న 1.
“తన కాళ్ళమీద తను నిలబడటం” అంటే ఏమిటి ? చర్చించండి.
జవాబు:
తన కాళ్ళమీద తను నిలబడటం అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా తిండికి, బట్టకూ లోటు లేకుండా స్వశక్తితో సంపాదించుకోవడం. అంటే తన ప్రతిభకు తగిన ఉపాధిని పొందుతూ జీవనాన్ని సాగించటం.

ప్రశ్న 2.
నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా ?
జవాబు:
పూర్వం పెండ్లిళ్లు, పండుగలు మొదలైనవి వస్తే అందరూ కలిసి పనులు చేసుకొనేవారు. సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకొనేవారు. ఏ వ్యవహారం లోనూ మోసం, దగా ఉండేవి కావు. ఆడంబరాలు లేవు.

ఈనాడు ఆడంబరాలు ఎక్కువ. మోసం చేసే లక్షణాలు పెరిగిపోయాయి. ఎవరింట్లో వాళ్ళు టివిలు చూస్తూ గడుపుతున్నారు. పిలిచినా పెళ్ళిళ్ళకు, పండుగలకు వచ్చేవారు తగ్గిపోయారు. వచ్చినా ఒక పూటకు మించి ఎవ్వరూ ఉండటం లేదు.

ప్రశ్న 3.
మీ ఊర్లో రచ్చబండ / గ్రామ సచివాలయం ఉన్నదా ? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడతారు ?
జవాబు:
మా ఊర్లో ఒకప్పుడు రచ్చబండ ఉండేదట. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉంది. అక్కడ గ్రామ సర్పంచ్, పంచాయితీ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించి ప్రణాళికలు రూపొందిస్తారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 41)

బండి సాగిపోతనే ఉండది ……… అడుక్కు తిండ్లు లేవు.

ప్రశ్న 1.
‘కడ్పుల ఇసం నాల్కెన తీపి’ అంటే మీరేం అర్థం చేసుకున్నారు?
జవాబు:
కడ్పుల ఇసం నాల్కలతీపి – అంటే కడుపులో విషం. నాలుక చివర తీపి, కడుపులో అన్నీ చెడు ఆలోచనలు విషపూరితమైన భావాలు ఉన్నా పైకి మాత్రం తియ్యగా మాట్లాడడం. కొంతమందికి లోపల చాలా కోపం ఉంటుంది. ఉదాహరణకు ధృతరాష్ట్రుడికి భీముడంటే చాలా కోపం. భీముడిని ఎప్పుడు చంపేద్దామా అని ఉండేది. భీముడు చచ్చిపోవాలని నిరంతరం కోరుకొనేవాడు. కాని, ఎదురుపడితే మాత్రం “నాయనా ! భీమసేనా ! అన్నం తిన్నావా బాబూ ?” అంటూ ప్రేమగా అమృతం కురిపిస్తూ మాట్లాడేవాడు. అందుచేత ధృతరాష్ట్రుడి వంటి వారికి కడ్పుల ఇసం నాల్కల తీపి ఉంటుంది.

ప్రశ్న 2.
పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి ? పంచా యితీలను ఎట్లా జరుపుతారు ?
జవాబు:
న్యాయం చెప్పడం అని అర్థం. తగవులు తీర్చడం అని అర్థం. ఒకరు, ఇద్దరు పెద్దలు రచ్చబండపై కూర్చొని ఫిర్యాదీదారుడు, ఇతర వ్యక్తులను వేర్వేరుగా పిలిచి మాట్లాడి పరిష్కారం చూపుతారు. దొంగతనాలు మున్న గునవి పరిష్కరింపబడతాయి.
పంచాయితీని గ్రామసచివాలయం లేదా రచ్చ బండ లేదా ఒక పెద్దమనిషి ఇంట్లోనూ నిర్వహిస్తారు. పంచాయితీకి గ్రామపెద్దలంతా వస్తారు.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 3.
“కళదప్పిన ఇల్లు” ఎట్లా ఉంటుంది ?
జవాబు:
కళదప్పిన ఇల్లు అనగా దానికి జీవం లేదు. జీవకళ లేదు. ఆ ఇంట్లో సుఖసంతోషాలు లేవు. నిత్యం కష్టాల మయం అని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 42)

బండి మా ఇంటి దిక్కు మూలమల్పు ……….. నల్గురు నడిసిందె బాట.

ప్రశ్న 1.
రాత్రిబడి అంటే ఏమిటి ? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు ?
జవాబు:
పగలంతా పొలం పనులు, ఇతర పనులు చేసుకొని, రాత్రిపూట చదువుకోవాలనుకునే వారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయమే రాత్రి బడి. రాత్రి బళ్ళను ప్రతి ఊరిలో నిర్వహిస్తారు. (వ్యవసాయదారులకు) నిరక్షరాస్యులకు విద్యను నేర్పి, వారి వారి వృత్తులలో నైపుణ్యం పొందటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
“నల్గురు నడిసిందె బాట”లోని అంతరార్థం ఏమిటి ? చర్చించండి.
జవాబు:
“పదుగురు ఆడు మాట పాడియై ధరచెల్లు” అని వేమన ఎప్పుడో చెప్పారు. అట్లే నలుగురు నడిచినదే బాట. ఒక్కడి మార్గాన్ని ఎవరూ అనుసరించరని దీని అర్థం.

ప్రశ్న 3.
మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేష ధారణ ఎట్లా ఉంటాయి?
జవాబు:
మా పరిసర ప్రాంతంలో పిల్లలు పరిశుభ్రంగా, దృఢంగా ఉంటారు. ఉన్నంతలో పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ కథకు ‘కొత్తబాట’ అనే పేరు తగినదని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి. (T.S Mar. ’16)
జవాబు:
పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు ‘కొత్తబాట’ అని పేరు పెట్టారు.

‘కొత్తబాట’ అంటే కొత్తదారి అని అర్థము. యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తదారి పట్టారు. అందువల్ల ఈ కథకు ఆ పేరు సరిపోతుంది. ఆ గ్రామ ప్రజలు పట్టిన కొత్తదారి ఇది.

  1. గ్రామంలో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా బండ్లకు తెరలు కట్టే ఆచారం, నేడు పోయింది.
  2. రచ్చబండపై గ్రామపెద్దతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు.
  3. గ్రామపెద్ద రంగరాయడి వంటి పెత్తనాన్ని నేడు గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు.
  4. పోలీసు పటేళ్ళ పెత్తనం, ప్రజలు పోలీసులకు లంచా లివ్వడం, పోయింది.
  5. ప్రజలు చీటికిమాటికీ తగవులు, కొట్లాటలు మానారు. పంచాయితీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు.
  6. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోడం మానివేశారు. వారు మంచి వేషాలు వేసుకుంటున్నారు.
  7. పెళ్ళిళ్ళలో కూడా మేనాలు, పల్లకీలు, ప్రజలు నేడు మోయడం లేదు.
  8. పనిమనుషులను తమతోడి వారుగా చూస్తున్నారు.

ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్తబాట పట్టారు. అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపడింది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 2.
పాఠం చదువండి. క్రింది పేరాల ఆధారంగా పట్టిక నింపండి.
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 1
జవాబు:
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 2
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 3

ప్రశ్న 3.
క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ (రూరల్) కాకతీయ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది.

వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసు కున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరిని బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది.

ప్రశ్నలు

అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది ?
జవాబు:
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కి.మీ. దూరంలో కొండాపూర్ ఉన్నది.

ఆ) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది ?
జవాబు:
1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది.

ఇ) గ్రామసర్పంచ్ ఎవరు ?
జవాబు:
గ్రామసర్పంచ్ వాసం కన్నయ్య.

ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో, ఎవరు నిర్మించారు?
జవాబు:
లోడి సంస్థ సహకారంతో, గ్రామస్తుల శ్రమదానంతో. మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించారు.

ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలేవి ?
జవాబు:
పక్కా రోడ్డు నిర్మాణం, వందశాతం అక్షరాస్యత సాధించటం, గ్రామజనాభాకు సరిపడా మినరల్ ప్లాంటు ఏర్పాటు, గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేయటం, పిల్ల లందరిని బళ్ళలో చేర్చటం మొదలగునవి గ్రామ ప్రజలు సాధించిన విజయాలు.

ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు? ఎందుకు ?
జవాబు:
ఉత్తమ గ్రామం, నల్లబెల్లి (లేదా) ఉత్తమ గ్రామ పురస్కార్కు ఎంపికైన నల్లబెల్లి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు” అన్న అక్కమాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
స్వతంత్ర్య ప్రవృత్తి గురించి రచయిత్రి చెప్పిన మాటలివి. రెండుకళ్ళు తెరిచి నిదానంగా ఆలోచించాలి. మర్చిపో కూడదు. బాట మారింది. కాళ్ళకు బురద అంటు కునేది. మనిషికి మనం చూడవలసిందే స్వతంత్రంగా జీవించడం. అంతేగాని ఒకరిమీద ఆధారపడి జీవించ కూడదు.

ఇంకొకరి మీద ఆధారపడటం దారుణం. ఒకళ్ళ భుజాల మీద ఎక్కి ప్రయాణించడం అనే లక్షణం మంచిది కాదని అర్థం.

ఆ) “అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కన బడ్తున్నవి” అంటే మీకేం అర్థమైంది ?
జవాబు:
నక్కలు మోసానికి ప్రతి రూపాలు. మోసం చేయడానికి అదను కోసం చూస్తుంటాయి. ఎంతసేపైనా నిరీక్షిస్తాయి. వేటాడకుండా ఆహారాన్ని సంపాదించగల దిట్టలు. పొదల్లో నక్కి ఉంటాయి. బలహీనమైన కోడి, మేకపిల్ల వంటి వాటిని చంపి తింటాయి. బలమైన ఏనుగు వంటి వాటిని ఏ సింహమో వేటాడేదాకా చూస్తుంది.

వేటాడి, అది తినగా మిగిలిన మాంసం తినేస్తుంది. గ్రామంలో రంగారాయుడు లాంటి మనుషులు లాగానే జంతులోకంలో నక్కలూ ఉంటాయని అక్క ఆంతర్యం అయి ఉంటుందని మాకు అర్థమైంది.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జవాబు:
మా ఊరు చాలా బాగుంటుంది. పొలాలు, మామిడి తోటలతో, చక్కని వరిపొలాలతో, గోదావరి (పోలవరం) కాలువతో చూడముచ్చటైన ఊరు మా ఊరు. ఊరి చివర బడి, ఊరి మధ్యలో గుడి, మడులు, పిల్లల అరుపులు, పక్షుల కిలకిలారావాలతో, నీళ్ళతో నిండిన చెరువులు, చక్కని రోడ్లు, మా ఊరికే సొంతం.

అందుకే “పల్లె తల్లిలాంటిది, పట్టణం ప్రియురాలి వంటిదని” దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు. మా గ్రామం ఆదర్శగ్రామంగా ఎంపిక కాబడింది. మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే, మా ఊరు ఎవరు వచ్చినా మా ఊరి అందాలను ఫోటో తీయందే వెళ్లరు. చాలా సినిమాల షూటింగులు మా ఊళ్ళో జరిగాయి. మా ఊళ్ళో గోదావరి అందాలు మా ఊరికే వన్నెతెస్తున్నాయి.

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాత వాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయా భివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరువుపీడిత గ్రామాలుగా మారాయి.

ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస పోయారు. తెలంగాణలో చెరువుల పునర్మిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించ డానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ (T.S June ’16)
జవాబు:
“కొత్తబాట” అనే ఈ పాఠంలో “అక్కా తమ్ముళ్ళిద్దరూ” బస్సు దిగి అక్కడ నుండి ఎద్దులబండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. పల్లెలో అనేకరకాల మార్పు లను చూస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి.

  1. కొత్తబాట (రోడ్లు) నిర్మించారు.
  2. మోరుగవనం వేశారు. అందమైన ప్రకృతికి మారు పేరది.
  3. రోడ్డుకిరువైపులా చెట్లు నాటారు. పూల తోటలు వేశారు. పొంటిమాన్లు చిగురించాయి.
  4. చెరువును పూడిక తీసి అందంగా చేశారు. దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికి ఆదరువైంది.
  5. జారుడు బండలు ఏర్పాటు చేశారు.
  6. మెచ్చుకొని తీరవలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్డు.
  7. ఇదివరకు కాళ్ళకు బురద అంటుకునేది.
  8. స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు.
  9. కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి.
  10. ఎల్లమ్మ గుడిని బాగుచేయించారు.
  11. ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది.
  12. దొంగతనాలు, దోపిడీలు, పంచాయితీ శిక్షలు పోయాయి.
  13. పని మనిషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు.
  14. మిత్తి పూజ పేరుతో ప్రజల మూఢనమ్మకాల్ని సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరొదిలి పోయేలా తరిమికొట్టారు.

ఈ విధంగా ఈ పాఠంలో అనేక మార్పులను రచయిత్రి తెలిపింది.

ప్రశ్న 3.
క్రింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.

అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
పల్లె తాకనంటా (వచన కవిత)
– కృష్ణప్రసాద్

కోడికూతతోనే కళ్ళుతెరచి
పల్లె ఒళ్ళు విరుచుకుంది
చల్లగాలుల్లోనే స్నానమాడి
చక్కగా కూర్చుంది
చూడచక్కగా తానుంది

చిట్టి గువ్వలన్నీ గూటిని వీడి గంతులు వేయగా యేటిలో చేపలే గువ్వల సాటిగా ఎగరగా చూడంగా చిన్నారి పాదాలు సందులలోన పరుగులు తీయంగా
ఆ చప్పుడు వింటూ
బంతులు – చేమంతులూ
మల్లెలు – మందారాలు
ముద్దుముద్దుగా విచ్చుకుంటున్నాయా
మొద్దు నిదురవీడి
– కోడి కూతతోనే

పల్లె తనదంటూ వదిలెల్లనంటూ మొండికేసే చంద్రుడే
కాదు నాదంటూ నువ్వెళ్ళి పొమ్మంటూ ఎర్రబారే సూరీడే
తగవు తీర్చలేక మబ్బు చల్లంగచేరి ఝల్లె కురిసింది
నే పల్లెన తాకానంటూ
ఆ సూరీడుకు, చంద్రుడుకు
ఆకాశాన చుక్కలకు
కన్నెగరేసిందీ
– కోడి కూతతోనే

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.

అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
అర్థం : శ్రద్ధగావిను
జవాబు:
ప్రహ్లాదుడు చండామార్కులు (గురువు గారు) చెప్పిన పాఠాలను చెవివారిచ్చి వినేవాడు.

ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి. అర్థం : గుహలు
జవాబు:
అజంతా, ఎల్లోరా గవిన్లలో చిత్రకళా సంపద దాగి ఉన్నది.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
అర్థం : కపట బుద్ధికలవాడు, మోసగాడు
జవాబు:
నక్క కుటిలవాజితనం కలిగి ఉంటుంది.

ఈ) మా ఊరి పొలిమేర లో పంటపొలాలున్నాయి.
అర్థం : ఊరిచివర (ఊరిచివర హద్దు)
జవాబు:
మా ఊరి పొలిమేర ఇప్పుడు చెరిగిపోయి నగరం కలిసి పోయింది.

2. క్రింది వాక్యాల్లో పర్యాయపదాల క్రింద గీత గీయండి.

అ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.
జవాబు:
రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.

ఆ) మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
జవాబు:
మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.

3. క్రింది పట్టిక నుండి ప్రకృతి, వికృతులను వేరుచేసి రాయండి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 4
జవాబు:
1) సముద్రం – సంద్రం
2) ఆధారం – అదెరువు
3) శిఖ – సిగ
4) విద్య – విద్దె
5) ప్రయాణం – పైన

4. క్రింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలపండి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 5
జవాబు:
TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట 6

వ్యాకరణాంశాలు

1. క్రింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు + కోల్పోవు (గసడదవాదేశ సంధి)
ఆ) మూటఁగట్టు = మూటన్ + కట్టు (సరళాదేశ సంధి)
ఇ) ఆసువోయుట = ఆసు + పోయుట (గసడదవాదేశ సంధి)
ఈ) కాలుసేతులు = కాలు + చేతులు (గసడదవాదేశ సంధి)
ఉ) పూచెనుగలువలు = పూచెను + కలువలు (సరళాదేశ సంధి)

వృద్ధి సంధి :

క్రింది పదాలను విడదీయండి.

ఉదా : రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)

అ) ఏకైక = ఏక + ఏక = (అ + ఏ = ఐ)
ఆ) వసుధైక = వసుధ + ఏక = (అ + ఏ = ఐ)
ఉదా : దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)

అ) దేశైశ్వర్యం = దేశ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఆ) అప్లైశ్వర్యాలు = అష్ట + ఐశ్వర్యాలు = (అ + ఐ = ఐ)
ఉదా : ఘనౌషధి = ఘన + ఓషధి = (అ + ఓ = ఔ)

అ) వనౌషధి = వన + ఓషధి (అ + ఓ = ఔ)
ఆ) మహౌషధి = మహా + ఓషధి (అ + ఓ = ఔ)
ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ అ)

అ) దివ్యౌషధం = దివ్య + ఔషధం: (అ + ఔ = ఔ)
ఆ) నాటకౌచిత్యం = నాటక + ఔచిత్యం = (అ + ఔ = ఔ)

పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించిన విషయాలు సరిచూడండి.

అ) ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ‘అ, ఆ’ లలో ఒకటి వచ్చింది.
(ఐ,ఔ లను ‘వృద్ధులు’ అంటారు.)
ఆ) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లున్నాయి.
ఇ) ‘అ’ కారానికి ఏ, ఐ లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది.
ఈ) ‘అ’ కారానికి ఓ, ఔ లు కలిసినప్పుడు ‘ఔ’ వచ్చింది.
అంటే ….

i) ‘అ’ కారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ వస్తుంది.
ii) ‘అ’ కారానికి ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ వస్తుంది.
‘వృద్ధుల’ వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి.

సూత్రం : అకారానికి (అ, ఆ లకు) ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారం, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారం ఏకాదేశంగా వస్తాయి.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత / పాట సేకరించి ప్రదర్శించండి. మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి.
జవాబు:
పల్లెకు సంబంధించిన తెలంగాణ గీతం
(అత్యంత ప్రజాదరణ పొందిన గీతం)

పల్లెపల్లెనా పల్లేరు మొలచె పాలమూరులోన నా తెలంగాలోన
పాతగోడలు పందిరిగుంజలు సిన్నబోయినాయి
ఇండల్ల దుమ్మురేపినాయి ||పాత||

చెట్టుమీద ఆ పిట్టలెగురగా సేదబావిలో ఊటలూరుగా
పచ్చా పచ్చా నూళ్ళు పలుగురాళ్ళు తేలినాయి
అయ్యో పనిపాట లేక ప్రజలు తల్లడిల్లినారో ||పల్లె పల్లెనా||

దండీ గడాలు వెండి గాజులు మొలతాడులు కొనగ పోగులు
ఉన్నాదంతా నమ్మి కనిపెంచి నూరు విడిచి
పొట్టచేతపట్టి బతుకు బయలెల్లినాడో ||పల్లె పల్లె||

విశేషాంశాలు

1. నక్షత్రకుడు : విశ్వామిత్రుని శిష్యుడు. హరిశ్చంద్రుని వద్ద అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రునిచే నియమింపబడ్డాడు. ఈ విషయమై హరిశ్చంద్రుణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడుతారు. మూలంలోలేని ఈ పాత్రను తెలంగాణ కవి అయిన గౌరన తన హరిశ్చంద్రోపాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు. ఈ పాత్ర తెలుగునాట చాలా ఆదరణ పొందింది.

2. వసతాగిన పిట్ట : ‘వస’ ఒక మొక్క. చిన్న పిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెం మోతాదులో దీని రసాన్ని తాగిస్తారు. మోతాదు ఎక్కువైతే మాటలెక్కువైతాయి. ఎక్కువగా మాట్లాడేవారి గురించి ఈ పదబంధాన్నివాడుతారు.

3. వెన్నెల మాసం : శరదృతువు విశేషంగా వెన్నెలను కురిపించే కాలం. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు ఈ ఋతువుకు చెందినవి. ప్రత్యేకంగా కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరుంది.

4. ఆసుపోయు : బట్టలు నేసేవారు వొడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తరువాత నేయవలసిన బట్ట పొడుగును అనుసరించి దారాలన్నీ వరుసలుగా అమర్చవలసి ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక కొన నుండి మరో కొనకు తప్పక తిరగవలసి ఉంటుంది. ఈ పనికి ‘ఆసుపోయడం’ అని పేరు. ఇట్లా విరామం లేకుండా తిరిగిన తోవనే మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

5. అలుగు : చెరువు నిండిన తరువాత మత్తడి అవుతుంది. ఆ తరువాత ఉబికి బయటికి వచ్చే నీళ్ళు కాలువ అవుతుంది. దీనిని ‘అలుగు’ అంటారు. ఈ క్రమాన్నే చెరువు నిండింది, మత్తడి దూకింది, అలుగు పారుతుంది అని అంటారు. అలుగు చెరువుకట్టకు రక్షణ. ఎక్కువైన నీళ్ళు దీని గుండా బయటికి పోవడంవల్ల చెరువుకట్ట తెగకుండా రక్షింపబడుతుంది.

సూక్తి : పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి. అవి బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలి. మారుతున్న ప్రపంచంతో పాటు మనమూ మారాలి.

పదాలు – అర్ధాలు

I

నక్షత్రకుడు = హరిశ్చంద్రుని బాకీ కోసం వెంట పడినవాడు, విశ్వామిత్రుని శిష్యుడు
ఊకున్నాడా ? = ఊరుకొన్నాడా ?
ఈగకాలం = ఆషాఢమాసం
జనిగెపట్టు = మూర్ఖత్వపు పట్టుదల
సోద = గొడవ, వాగుడు
కయ్య = చిన్న కాలువ
పొంటి = దారివెంట
పేను వారైనా = పేను పాకితే
గండ్లు = నీళ్ళు ఎక్కువగా వచ్చుటచేత తెగిన గట్టులు
పట్టు = పంతం
నడుములిర్గె = నడుములు విరుగుతున్నాయి
మెచ్చిందాక = మెచ్చుకొనేదాక
బంక = జిగురు
వార్రెలు = బీటలు, పగుళ్ళు
పూలకాలం = వసంతకాలం
గని = కాని
ఎన్నెల మాసం = వెన్నెల రోజులు
సోకు = అందం
పెయి = శరీరం
సాళ్ళు = వరుసలు
ముత్తైదలోలె = ముత్తైదువుల వలె
కొటారి కొమ్మల్లల్ల = చిట్టచివరి కొమ్మలు
శికె = చివర
పోషాకులు = వేషధారణ
వస = వాక్కును శుద్ధి చేసే ఔషధమూలిక
రొద = చప్పుడు
ఏరు = నది, ప్రవాహం
సెవ్వు = చెవ్వు
బాట = దారి
ఇడిస్తెన = విడిస్తేనా !
మాసం = నెల
సొంపు = అందం
పాలిపేర = గుర్తు, చిహ్నం, జాడ

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

II

పదం = పాట
బాడ్తండేంది = పాడుతున్నాడేమిటి
ఇందుట్ల = ఇందులో
పురాగ = పూర్తిగ
గని = కాని
పచ్చరం = బట్ట, వస్త్రం
రొండు = రెండు
దెర్సి = తెరిచి
తావు = చోటు
సంబురం = సంతోషం, సంబరం
యోగం = అదృష్టం
ఒగరో = ఒకరో
వాళ్ళల్ల = వాళ్ళలో
బండారి = కుంకుమ
మత్తడి = రేగడిపొలం
బంగుల = బంగ్లా
ఇగి = ప్రవేశం, అతిశయం
యావి = ఏ
ఆడ = అక్కడ
రచ్చకట్ట = రచ్చబండ
మణుసులు = మనుషులు
ఇంగోటి = ఇంకొకటి
తీర్గ = తీరుగా
వోరగ = చివరగ
గూ సండె = కూర్చొనే
కాన్రాలేదు = కనబడలేదు
పయినం = ప్రయాణం
రాగిచెట్టు = రావిచెట్టు
తొక్కుడువడ్డ = అలవాటు పడ్డ
ఎలుతురు = వెలుతురు
రొంపి = బురద
ఆసరా = తోడు, సహాయం, అండ
యాదికి = గుర్తుకు
మోతెబరి = ఊరి పెద్ద
సూడిగములు = గాజులు, కడియములు
చిత్రము = సిత్రము
సంబురాము = వేడుకలు

III

పొద్దుమాపు పూట = రాత్రిపూట
మళ్ళెపడి = తిరగబడి
పచ్చపూస గన్కనా ? = సత్యవంతుడు కనుకనా ?
పాడు గొట్లాడినట్లు = పాడుపడినట్లు
పంగనామం బెట్టిన్రు = మోసం చేసారు
కుటిలవాజి = మోసగాడు
మిత్తి = మృత్యుదేవత, పీడ
సాగువాటు = ఇల్లు గడవడం
గత్తరిచ్చే = కత్తిరించే
పొలండ్ల = పాలివాళ్ళు, వాటాదార్లు
అయిన = ఆయన
దోసక = తోచక
ఇంగ = ఇంక
వాడ = వీధి
దీస్కొని = తీసుకొని
పసికారు = కుర్రాళ్ళు
లొగులతొండలు = చిత్రవధలు
సాగిపోతనే ఉండది = సాగిపోతూనే ఉంది
నక్కతంతుల సింగోటం = నక్క వ్యవహారంలాంటి ఎత్తులు
దప్తురం = పద్దు పుస్తకం
గట్టుకం = కట్టడం, చెల్లించడం
మిత్తి = మృత్యువు (చావు), వడ్డీ
సుట్టాల = చుట్టాల
ఉద్ది = జత, జట్టు
ఇసం = విషం
జూస్కోని = చూస్కొని

IV

ఇంగ = ఇక
మగ్దూరు = నియమం
నడుత = ప్రవర్తన
తామసం = కోపం
పణమీది = మెడమీది
నడ్సిన = నడిచేను
బంకులు = సందులు
సింపులు = పీలికలు(చింపులు)
బద్ధురం = భద్రంగ
సవారి = పల్లకి, ప్రయాణసాధనం
మెరిచ్చిన మెరియ్యని = మెరిపించి మెరియ్య
ఇంది = అయ్యింది
ఇనిపిచ్చింది = వినిపించింది
పొత్తువిల్లు = ఉమ్మడి ఇల్లు
మెరిమెణ = ఊరేగించు (మెరిచ్చు)
ముంగల = ముందు
సప్పుడు = చప్పుడు
సెంబు = చెంబు
అమాంతం = ఒక్కసారిగా
వొల్లనంటదా ? = ఒప్పుకోనంటుందా
బాయికాడి = బావికాడి
పేకల లేదు = పెగలలేదు

పాఠం ఉద్దేశం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేగంగా చోటుచేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్యశక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుందీ కథ. ప్రాంతీయ, భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వచైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్తబాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాలమధ్య కాలాను గుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డా॥ పి. యశోదారెడ్డి తమ ‘కొత్తబాట’లో తెలియపరిచింది. నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన ‘యశోదారెడ్డి ఉత్తమ కథలు’ గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత్రి పరిచయం

రచయిత్రి : డా॥ పాకాల యశోదారెడ్డి
జననం : 8.8.1929
మరణం : 7.10.2007
జన్మస్థలం : నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి గ్రామం.
పరిశోధనాంశం : “తెలుగులో హరివంశాలు”
నిర్వహించిన పదవులు : తెలుగు ప్రొఫెసర్గా ‘ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. రాష్ట్ర అధికారభాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ.
రచనలు : ఆంధ్ర సాహిత్య వికాసము, పారి జాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రెగడ, కథాచరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను రచించారు. మావూరిముచ్చట్లు, ఎచ్చమ్మకథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను రాశారు.
ఇతర అంశాలు : వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం “మహాలక్ష్మి ముచ్చట్లు” ఎంతో ప్రజాదరణ పొందింది.
శైలి : అందమైన తెలంగాణా మాండలికంలో కథలు రాసి తెలంగాణ భాషా సౌందర్యాన్ని, నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తమ కథల ద్వారా తెలియజేశారు.

TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

ప్రవేశిక

ఈ ‘కొత్తబాట’ గురించి డా|| పి. యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్కాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమ బడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని” చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ -కథానిక

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథానిక ఒకటి. నేడు కథ, కథానిక అనే పదాలను పర్యాయ పదాలుగా వాడుతున్నాము. ఇది ఒక వచన సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నిగాని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము కథనము, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలోని ముఖ్య బాణీలు.

Leave a Comment