TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ Questions and Answers.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

కిష్కింధా కాండం

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ 1
లక్ష్మణుడు అన్నను ఓదార్చాడు. ప్రయత్నిస్తే వదినెగారి జాడ తప్పక తెలుస్తుందని ధైర్యం చెప్పాడు. వారిని వాలి పంపాడేమో అని సుగ్రీవుడు మొదట భయపడ్డాడు. హనుమంతుణ్ణి వెళ్లి వాళ్లెవరో తెలుసుకొని రమ్మని పంపాడు. సన్యాసి రూపంలో ఆంజనేయుడు వెళ్లి తనను పరిచయం గావించు కున్నాడు. హనుమంతుని మాట తీరునుబట్టి అతడు పండితుడని రాముడు గుర్తించాడు. లక్ష్మణుడు తమ వృత్తాంతాన్ని హనుమంతునికి తెలియజేశాడు. హనుమంతుడు సుగ్రీవుని వెంటబెట్టుకు వచ్చాడు.

శ్రీరామసుగ్రీవులు మిత్రులయ్యారు. శ్రీరాముడు సుగ్రీవునికి అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తాము కొండపై ఉన్నపుడు ఒక స్త్రీ ‘రామా లక్ష్మణా’ అరిచిందని, నగలమూట జారవిడిచిందని చెప్పి, ఆ మూటను చూపాడు. లక్ష్మణుడు సీతాదేవి కాలి అందెలను గుర్తించాడు. సుగ్రీవుడు రాముని ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు.. అందుకు ప్రతిగా రాముడుతో “సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతాను” అన్నాడు. సుగ్రీవుడు తమ వైరం కారణాన్ని తెలియజేశాడు.

వాలి పెద్దవాడు. కనుక కిష్కింధకు రాజయ్యాడు. మాయావి అనేవాడు వాలిని యుద్ధానికి ఆహ్వానించి, ఒక భూగృహంలో దూరాడు. సుగ్రీవుడు బిలం ద్వారం వద్ద ఉండగా, వాలి లోపలికి వెళ్లాడు. సంవత్సరం తరువాత రక్తం బయటకు ప్రవహించింది. వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించాడు. రాక్షసుడు బయటకు రాకుండా బిల ద్వారానికి రాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. మంత్రులు సుగ్రీవుణ్ని రాజును చేశారు. వాలి తిరిగి వచ్చి సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుడిని గావించి, అతడి భార్య రుమను అపహరించాడు.

సుగ్రీవుడు ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించాడు. మతంగమహర్షి శాపం వలన వాలి అక్కడకు రాడు. శ్రీరాముడు దుందుభి అస్థిపంజరాన్ని కాలిబొటన వ్రేలితో ఎగరగొట్టాడు. ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను చీల్చాడు. సుగ్రీవుడు రామునితో కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు ఒకే రకంగా ఉండటంతో రాముడు వాలిని గుర్తుపట్టలేక పోయాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో పరుగెత్తాడు. రాముడు సుగ్రీవుని గుర్తించడానికి నాగ కేసరపు లతను మెడలో వేయమని లక్ష్మణునికి చెప్పాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

తార మాటలు వినకుండా వాలి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేసేటప్పుడు రాముడు వాలిపై బాణం వేశాడు. “ఎందుకు దొంగదెబ్బ తీశావు” అన్నాడు వాలి.

వానరుడిని చాటు నుండి చంపడం తప్పుగాదని, తమ్ముడి భార్యను చెరబట్టినందుకు మరణదండన విధించానని రాముడు జవాబిచ్చాడు. వాలి క్షమాపణ కోరాడు. వాలి, తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పజెప్పాడు. అంగదునికి హితం చెప్పి మరణించాడు. తాను ప్రసవణగిరి యందు ఉంటానని, వర్షాకాలం తరువాత సీతాన్వేషణ గావించమనీ రాముడు సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు.

శరత్కాలం వచ్చినా సుగ్రీవుడు సీతాన్వేషణకు పూనుకోలేదు. లక్ష్మణుడు కోపించాడు. సుగ్రీవుడు తనని మన్నించమని వేడుకున్నాడు. వానర వీరులను అతడు పిలిపించాడు. నలుదిక్కులకు వారిని పంపాడు. హనుమంతునికి రాముడు తన ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చాడు. అంగదుని నాయ కత్వంలో హనుమంతుడు దక్షిణదిక్కులో సీతను వెతకడానికి సిద్ధమయ్యాడు.

హనుమంతుడు ఋక్షబిలంలోకి ప్రవేశించాడు. అక్కడ స్వయంప్రభ యోగిని వానరులను అనుగ్రహించింది. అందరూ సముద్ర తీరం చేరారు. అక్కడ జటాయువు అన్న అయిన సంపాతిని కలిశారు. సంపాతి సీత ఉనికిని గూర్చి చెప్పాడు. లంకకు మార్గం తెలిపాడు. వందయోజనాల ఎగరగలవాడు హనుమంతుడొక్కడే. హనుమంతుడిని జాంబవంతుడు ఇతర వానరులు ప్రశంసించి, సముద్ర లంఘనానికి ప్రోత్సహించారు. తన బలానికి భూమి కంపిస్తుందని, మహేంద్ర పర్వతమైతే తనను భరించగలదని చెప్పి హనుమంతుడు మహేంద్రగిరికి చేరాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 

ప్రశ్న 1.
ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించడం వల్ల ఎలా సముద్ర లంఘనానికి సిద్ధపడ్డాడో రాయండి.
జవాబు:
అంగదుని నాయకత్వంలో దక్షిణ దిక్కు వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమవాళ్ళు నిరాశ పడకుండా జాగ్రత్తపడ్డాడు అంగదుడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రాన్ని ‘మహోదధి’ అంటారు. ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది.

సముద్రతీరంలో వానరులంతా సమావేశ మయ్యారు. ఏం చెయ్యాలో తీవ్రంగా చర్చించు కుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేర రాదనుకున్నారు.

వానర వీరులు బలపరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమౌ తుందన్న నిశ్చయానికి వచ్చారు. కాని వంద యోజనాల దూరం ఉన్న లంకకు వెళ్ళి రాగల వారెవ్వరని తర్కించు కుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతు డొక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబ వంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒకచోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు.

జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి అతడి శక్తి యుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరే పించాడు. దానికి వానరుల ప్రశంసలు తోడైనాయి. హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. వానరులతో తాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలననీ, గ్రహ నక్షత్రాలను అధిగమించగలనని, పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలనని, మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు. ఈ విధంగా హనుమంతునిలో శక్తిని జాంబవంతుడు ప్రేరేపించాడు. తద్వారా హనుమంతుడు సముద్రలం ఘనానికి సిద్ధపడేలా చేశాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 2.
ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు. మరొకడు ఉపకారం చేశాడు. వారెవరు ? వాటి ఫలితాలేమిటి?
జవాబు:
రావణుడు అనే రాక్షసుడు, సన్యాసి వేషంలో వచ్చి పంచవటిలో పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకు పోయాడు. ఈ విధంగా సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామ లక్ష్మణులకు అపకారం చేశాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి అన్న వాలి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు. రామలక్ష్మణుల వివరాలు తెలిసికోమని, ఆంజనేయుడు అనే తన మంత్రిని సన్యాసి వేషంలో సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చి, రామ లక్ష్మణులను గూర్చి తెలిసికొని, రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు. వానర సహాయంతో రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకువచ్చాడు.

ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని సాయం తోనే సీతను అపహరించిన రావణుడిని సంహరించి, రాముడు సీతను తిరిగి తీసుకు వచ్చాడు.

ప్రశ్న 3.
శ్రీరామ సుగ్రీవుల స్నేహం గూర్చి విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమి, సుగ్రీవుని భార్య రుమను వాలి చేపట్టాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు. హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి. సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు ధనుర్ధారులయిన రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి వాలి పంపించిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని రమ్మని తన మంత్రి హనుమంతుడిని సుగ్రీవుడు పంపాడు.

హనుమంతుడు సన్యాసి రూపంలో రామ లక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడిని గూర్చి చెప్పి తాను సుగ్రీవుని మంత్రిననీ, పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమంతుని మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలన్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాలి నుండి అభయం కావాలని కోరాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు సీత విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రామునికి సాయం చేస్తానన్నాడు. రాముడు తన కాలి బొటనవ్రేలితో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం విసరివేశాడు. ఒక బాణంతో ఏడు తాడిచెట్లను పడగొట్టాడు. దానితో సుగ్రీవునికి రాముడి బలంపై నమ్మకం కుదిరింది. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 4.
వాలి సుగ్రీవుల యుద్ధానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి, తండ్రి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు, వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి ఒక గుహలో ప్రవేశించాడు. వాలి, తన తమ్ముడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర కాపలా ఉండమని, తాను బిలంలోకి వెళ్ళి, మాయావితో సంవత్సరకాలం పోరాడాడు.

ఆ గుహద్వారం నుండి రక్తం బయటకు వచ్చింది. గుహలో వాలి, మాయావి యొక్క అరపులు వినిపించాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకొని, మాయావి పైకి రాకుండా గుహద్వారం మూసివేసి, కిష్కింధకు తిరిగి వచ్చాడు.

మంత్రులు వాలి చచ్చిపోయాడనుకొని, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి మాయావిని చంపి, గుహద్వారాన్ని తెరిచి, కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు వాలి కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభయంతో పారిపోయి, భూ మండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. మతంగముని శాపం వల్ల వాలి, ఆ పర్వతానికి రాలేడని, సుగ్రీవుడు ఆ పర్వతంపై ఉన్నాడు. ఈ విధంగా అన్నదమ్ములయిన వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది. సుగ్రీవుడు రాముని సహాయంతో వెళ్ళి, వాలితో యుద్ధం చేశాడు.

ప్రశ్న 5.
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా ? కాదా ? చర్చించండి.
జవాబు:
రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది. సుగ్రీవుడు తనకు తన అన్న వాలి వల్ల భయం ఉందనీ, రాముడి అభయం కావాలనీ రాముడిని అడిగాడు. రాముడు సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని, తప్పక వధిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు.

వాలిసుగ్రీవుల యుద్ధం భయంకరంగా సాగింది. సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు వాలి మీదికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి వాలి తెలివి తప్పాడు. తరువాత వాలి తెలివి తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పు పట్టాడు.

రామునికి కాని, రాముని దేశానికి కాని వాలి అపచారం చేయలేదు. అదీగాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిని దొంగదెబ్బ తీశాడు. అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని, వాలి రాముడిని తప్పుపట్టాడు.

వాలి మాటలకు రాముడు జవాబు చెప్పాడు. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి మరణదండన విధించానన్నాడు. వాలి, వానరుడు కాబట్టి తాను చెట్టు చాటున ఉండి కొట్టడం, తప్పు కాదన్నాడు. రాముడు మహారాజు కాబట్టి, తప్పు చేసిన వాలిని చంపడం ధర్మమే అవుతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 6.
‘ఉపకారం జరుగడమే మిత్రుని వల్ల ఫలం’. – రామ సుగ్రీవుల స్నేహం ఆధారంగా దీనిని వివరించండి. (March 2019)
(లేదా)
రామాయణంలోని స్నేహధర్మాన్ని గురించి సొంతమాటల్లో రాయండి. (March 2016)
జవాబు:
రామాయణంలో స్నేహ ధర్మాన్ని గురించి తెలిపే వృత్తాంతము, ‘రామ సుగ్రీవుల’ వృత్తాంతము. సుగ్రీవుడి అన్న వాలి. వాలి సుగ్రీవుడి భార్యను అపహరించి సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి దూరంగా తరిమివేశాడు. సుగ్రీవుడు ప్రాణభయంతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు.

శ్రీరాముడి భార్యను రావణుడు అపహరించాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతున్నారు. కబంధుడు, రాముణ్ణి సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి మొదట సుగ్రీవుడు భయపడి హనుమంతుడిని సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు పంపాడు.

హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరకు రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడు. శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. సుగ్రీవుడు తనకు అన్న వాలి నుండి భయం లేకుండా అభయం ఇమ్మని రాముడిని అడిగాడు. వాలిని తాను చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సీతను తాను వెదికిస్తానని, రావణుడితో యుద్ధంలో తాను సాయం చేస్తానని, సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు.

రామ సుగ్రీవుల స్నేహం ఫలించింది. రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి రాజును చేశాడు. సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చినట్లు, సీతాదేవిని వెదికించడానికి వానరులను పంపాడు. హనుమంతుడు, సుగ్రీవుడికి మంత్రి. అతడు సీత జాడను తెలుసుకు వచ్చాడు. సుగ్రీవుడు తన వానర సైన్యంతో లంకకు వెళ్ళి రావణుడిని చంపడంలో రాముడికి మంచి సాయం చేశాడు.

ఈ విధంగా స్నేహితులు ఒకరి కొకరు, మంచి సాయం చేసుకున్నారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 7.
వాలి-శ్రీరాముని మధ్య జరిగిన సంవాదం సారాంశం రాయండి. (March 2017)
జవాబు:
వాలి-సుగ్రీవుల సంవాదము : వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా, శ్రీరాముడు విషసర్పం వంటి బాణాన్ని వాలి మీదికి వదిలాడు. వాలి నేలమీదికి వాలిపోయాడు దానితో వాలి స్పృహ కోల్పోయాడు. వాలి కొంతసేపటికి తేరుకొని రాముడితో ఇలా అన్నాడు.

వాలి మాటలు : “ఓ రామా” ఉత్తముడివి అని పేరు పొందిన నీవు, ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు ? నేను నీకు గాని, నీ దేశానికి గాని, ఎప్పుడూ అపకారం చేయ తలపెట్టలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు చంపవలసి వచ్చింది? నిన్ను ఎదిరించి నీతో నేను యుద్ధం చేయనే లేదు. నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుండగా, నీవు నాపై ఎందుకు దొంగదెబ్బ తీశావు ?

సీతాదేవి కోసం నీవు సుగ్రీవుడిని ఆశ్రయించడం కన్న, నన్నే కోరి ఉంటే బాగుండేది. ఒక్క రోజులోనే సీతాదేవిని తెచ్చి, నీకు నేను అప్ప జెప్పేవాడిని. రావణుడిని బంధించి తెచ్చి నీ ముందు ఉంచేవాడిని.” అని వాలి రాముడితో అన్నాను. వాలి మాటలు విని, రాముడు వాలితో ఇలా చెప్పాడు.

రాముని మాటలు : “వాలీ ! నీవు చెప్పినది సరిగా లేదు. నీవు నీ తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మకార్యాలు చేసినందువల్ల, నేను నీకు మరణదండన విధించాను. నీవు వానరుడిని కనుక నేను చాటుగా ఉండి నిన్ను కొట్టి చంపడం తప్పుకాదు” అని రాముడు వాలికి చెప్పాడు.

ప్రశ్న 8.
వాలి, సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
జవాబు:
వాలి, సుగ్రీవులు వానరులు. వీరు అన్నదమ్ములు. అందులో వాలి పెద్దవాడు. గొప్ప బలశాలి. తండ్రి తరువాత వాలి కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటబడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి సుగ్రీవుడిని గుహద్వారం వద్ద ఉండమని చెప్పి తాను గుహలోకి వెళ్ళి మాయావితో యుద్ధం చేశాడు.

సంవత్సరం తర్వాత గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. మాయావి అరుపులు వినిపించాయి. దానితో వాలి చనిపోయాడని భావించి, సుగ్రీవుడు బిలద్వారం మూసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని రాజును చేశారు. తరువాత వాలి వచ్చి, సుగ్రీవునిపై కోపించి, సుగ్రీవుడిని తరిమి, అతని భార్య రుమను అపహరించాడు.

సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉండేవాడు. మతంగ మహర్షి శాపం వల్ల వాలి అక్కడకు రాలేడు. హనుమంతుడు రామసుగ్రీవులకు మైత్రిని కూర్చాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేస్తానన్నాడు.

రాముడు సహాయంతో సుగ్రీవుడు వాలిపై యుద్ధానికి వెళ్ళాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలిక. అందువల్ల రాముడు వాలిపై బాణం వేయలేదు. సుగ్రీవుడు యుద్ధంలో ఓడిపోయాడు.

రాముడు సుగ్రీవుని మెడలో గుర్తుగా నాగకేసరపు లతను వేయించి తిరిగి వాలిపై యుద్ధానికి సుగ్రీవుని పంపాడు. వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా రాముడు వాలిని బాణంతో కొట్టి చంపాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చాడు. వాలి తారా అంగదులను సుగ్రీవునకు అప్పగించాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 9.
రామసుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
జవాబు:
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గురించి తెలుసుకోమని తన మంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు.

హనుమ సన్న్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గూర్చి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు. హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నాననీ చెప్పి ఆమె జారవిడిచిన నగల మూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు.

సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామ సుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.

రాముడు, సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత”ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణ కోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు
మొదలయిన వానరులను పంపాడు.

దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలోని సీత జాడను తెలుసుకుంటానని మహేంద్రగిరిపైకి చేరాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 10.
హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది ?
జవాబు:
సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకూ పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరివచ్చిన వానర వీరులు అణువణువూ వెదకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెలపూర్తి అయ్యింది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదలుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో, వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.

వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరివల్ల ఔతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు.

జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు.

హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి యున్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.

హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 11.
వాలి, సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి. వాలి వధ న్యాయమా ? కాదా ? వివరించండి.
జవాబు:
సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళాడు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. రాముడు వాలిని చంపుతానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. వాలి, సుగ్రీవులు ఒకే పోలికలో ఉండడం వల్ల రాముడు వాలిని గుర్తించలేకపోయాడు. సుగ్రీవుడు వాలి పరాక్రమాన్ని తట్టుకోలేక రాముడివైపు చూశాడు. రాముడు కనబడలేదు. సుగ్రీవుడు ప్రాణభయంతో పరుగుదీశాడు.

శ్రీరాముడు సుగ్రీవుడి వద్దకు వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుపడి, రాముడు తనకు సాయం చేయలేదని నిలదీశాడు. రాముడు సుగ్రీవుడికి అసలు విషయం చెప్పి, సుగ్రీవుడి మెడలో “నాగ కేసరపులత”ను లక్ష్మణుడిచే వేయించాడు. తిరిగి సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య తార వాలిని యుద్ధానికి వెళ్ళవద్దని హెచ్చరించింది. వాలి సుగ్రీవులు పోరాడారు.

శ్రీరాముడు విషసర్పంతో సమానమైన బాణంతో వాలిని కొట్టాడు. వాలి స్పృహ కోల్పోయి, తరువాత తేరుకొన్నాడు. తన్ను అధర్మంగా చంపాడని వాలి రాముని నిందించాడు.
వాలి వధ న్యాయమా ?

  1. వాలి వానరుడు అనగా జంతువు. జంతువును చెట్టు చాటునుండి రాముడు బాణంతో కొట్టడంలో తప్పులేదు.
  2. వాలి, తన తమ్ముడు సుగ్రీవుని భార్య రుమను చెరబట్టాడు. వాలి అధర్మాలకు ఒడిగట్టడం వల్ల రాజయిన రాముడు వాలికి మరణదండన విధించాడు.

కాన రాముడు వాలిని చంపడంలో తప్పులేదు.

ప్రశ్న 12.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి కలిపిందెవరు ? ఎలా కలిపేడో వివరించండి.
జవాబు:
పంపాసరోవర ప్రాంతంలో రామలక్ష్మణులు ఉన్నారు. వారిని సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై నుండి చూశాడు. తన అన్న అయిన వాలి తనను చంపడానికి వారిని పంపాడేమోనని భయపడ్డాడు.

హనుమంతుని చూసి రమ్మన్నాడు. హనుమ సన్యాసి వేషంలో వెళ్ళి వారిని సమీపించాడు. తనను తాను చక్కని మాటలతో పరిచయం చేసుకొన్నాడు. సుగ్రీవుని గుణగణాలను చాలా చక్కగా వివరించాడు. తన మాటల చాకచక్యంతో శ్రీరాముని మనసును గెలిచాడు.

లక్ష్మణుడు సీతాపహరణ వృత్తాంతం చెప్పాడు. సుగ్రీవుని స్నేహం కావాలన్నాడు. రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొన్నాడు. సుగ్రీవుని వద్దకు చేర్చాడు. అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవులు మిత్రులయ్యారు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 13.
లక్ష్మణుడు కిష్కింధకు ఎందుకు వెళ్ళాడు ? అక్కడ ఏమైంది ?
జవాబు:
వాలిని శ్రీరాముడు సంహరించాడు. కిష్కింధకు సుగ్రీవుని రాజుకమ్మని రాముడు ఆజ్ఞాపించాడు. వానాకాలం వెళ్ళాక సీతాన్వేషణ ప్రారంభించమన్నాడు. శరత్కాలం వచ్చినా సీతాన్వేషణ ప్రారంభించలేదు. అప్పుడు హనుమ గుర్తుచేశాడు. నీలుడిని సైన్యసమీకరణ చేయమని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఇది రామునికి తెలియదు. లక్ష్మణుణ్ణి పిలిచి సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు.

అందుకు లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. అక్కడ సుగ్రీవుడు రాజభోగాలనుభవిస్తున్నాడు. అది చూశాడు లక్ష్మణుడు. తన అన్నగారు దీనస్థితిలో ఉంటే, భోగాలనుభవిస్తున్న సుగ్రీవుడిని చూసిన లక్ష్మణునికి చాలా కోపం వచ్చింది. “ఆ కోపానికి సుగ్రీవుడు కూడా చాలా భయపడ్డాడు. మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడటానికి తార వెళ్లింది. సీతాన్వేషణకు ప్రయత్నాలు ప్రారంభించేడని ఆమె చెప్పింది. దానితో లక్ష్మణుడు శాంతించాడు. అప్పుడు సుగ్రీవుడు క్షమార్పణ కోరాడు. లక్ష్మణుడు తనతో రమ్మని సుగ్రీవుని రాముని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.

ప్రశ్న 14.
సీతాన్వేషణా వ్యూహాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముని సూచనలను అనుసరించి వానరులను సుగ్రీవుడు నాలుగు దిక్కులకు పంపాడు. సీతాన్వేషణ పదిరోజులలో పూర్తి చేయాలని సుగ్రీవుడు గడువు విధించాడు.

తూర్పు దిక్కుకు ‘వినతు’ని నాయకత్వంలో వానరులు వెళ్ళారు. దక్షిణ దిక్కుకు ‘అంగదుడు’ నాయకుడు. అందులో హనుమంతుడు, జాంబవంతుడు వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరానికి శతబలి, పడమరకు సుషేణుడు నాయకత్వం వహించారు.

ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసిన మార్గాలు, అక్కడి విశేషాలు వివరంగా సుగ్రీవుడు చెప్పాడు. ఎంతమందిని ఎన్నిదిక్కులకు పంపినా హనుమంతునిపైనే సుగ్రీవునకు నమ్మకం. అతడే సీతాన్వేషణ సమర్థవంతంగా చేయగలడని శ్రీరామునకు కూడా నమ్మకం. అందుకే అత్యంత క్లిష్టమైన దక్షిణ దిక్కుకు హనుమను పంపారు. ఆయా దిక్కులతో పరిచయం గల వారిని, శక్తిసామర్థ్యాలను బట్టి ఆయా దిక్కులకు పంపారు. ఇదే సీతాన్వేషణలో సుగ్రీవుడు అనుసరించిన వ్యూహం.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 15.
సీతాన్వేషణలో కీలకమైన విషయం ఎవరు చెప్పారు ? ఆ క్రమం వివరించండి.
జవాబు:
అన్ని దిక్కులనుండీ వానరులు నిరాశతో తిరిగి వచ్చారు. సీతాన్వేషణ సఫలం కాలేదని వివరించారు. రావణుడు సీతను దక్షిణం వైపే తీసుకెళ్ళాడు. కనుక అటువైపే ఉండవచ్చని ఆశ. కాని, ఎంత వెతికినా సీతాదేవి జాడ తెలియలేదు. అందరికీ నిరాశ కల్గింది.

ఈ పరిస్థితులలో ‘ఋక్షబిలం’ చేరారు. అక్కడ ‘స్వయంప్రభ’ అనుగ్రహంతో ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె తపః ప్రభావం వలన పెద్దసముద్రం ఒడ్డుకు చేరారు.

అక్కడ సంపాతిని చూశారు. సంపాతి తన దివ్యదృష్టితో చూసి, సీతాదేవి లంకలో ఉన్నట్లు చెప్పాడు. దానితో సీతాన్వేషణలో కీలకమైన విషయం తెలిసింది. ఈ మంచిపని చేసినందుకు సంపాతికి విరిగిపోయిన రెక్కలు తిరిగి వచ్చాయి.

పరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదువండి. (March 2017)

సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో గాని, నగరంలో గాని, తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీదే ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. కాలం గడుస్తూన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు.

కింది కీలక పదాల అర్థాలను ఒక్క వాక్యంలో వివరించండి.
1. శుభం పలుకడం : ………………….
జవాబు:
శుభము కలగాలని ఆశీర్వదించాడు.

2. ప్రస్తావన : ………………….
జవాబు:
ముచ్చటించుట

3. పితృవాక్య పరిపాలన : ……………………….
జవాబు:
తండ్రి చెప్పిన మాటను పాటించడం.

4. అన్వేషణ : ……………………
జవాబు:
వెదకడం

5. కార్యభారం : ……………………….
జవాబు:
పని యొక్క బరువు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 2.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2015)

జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేముంది ? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో “నేను మహా సముద్రాలను అవలీలగా దాటగలనని” ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు
జాంబవంతుడు ఆనందించాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు ?
జవాబు:
జాంబవంతుడు హనుమంతుడిని చేరి, హనుమంతుడి శక్తియుక్తులు ఎటువంటివో ఆయనకు తెలుపుతూ, హనుమంతుడిని ప్రేరేపించాడు.

2. ప్రేరణ వలన ఏమి బయటపడుతుంది ?
జవాబు:
ప్రేరణ వలన వ్యక్తిలోని శక్తి వెలికి వస్తుంది.

3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు?
జవాబు:
హనుమంతుడు తాను మహాసముద్రాలను అవలీలగా దాటగలనని వానరులతో అన్నాడు.

4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి ?
జవాబు:
హనుమంతుడి మాటలు, ఆతని ఆత్మశక్తిని, ఉత్సాహంతో కూడిన అతని బలాన్నీ, తేజస్సునూ తెలియజేస్తున్నాయి.

5. పై పేరాకు తగిన శీర్షికను సూచించండి.
జవాబు:
“సముద్ర లంఘనానికి సిద్ధపడ్డ హనుమంతుడు” అనే శీర్షిక సరిపడుతుంది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 3.
ఈ క్రింది పేరాను చదివి దిగువ నిచ్చిన పదాలకు వివరణ వ్రాయండి.

“సీతాన్వేషణకు బయలుదేరి నెలరోజులు కావస్తున్నది. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళినవాళ్ళు, తీవ్రంగా వెదకి రిక్త హస్తాలతో వెనుదిరిగారు. గడువు ముగిసే నాటికి ప్రస్రవణగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నాడు. సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడు ఔతాడని ధీమా వ్యక్తం చేశారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైనవాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమవాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్తపడ్డాడు. అంగదుడు విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే, విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందు కదిలారు.

1. రిక్తహస్తాలతో
జవాబు:
అనగా వట్టి చేతులతో, అంటే వెళ్ళిన పని జరుగకాకుండానే అని భావము.

2. విన్నవించుకున్నారు
జవాబు:
అంటే మనవి చేసుకున్నారు, అనగా చెప్పారు అని భావము.

3. కృతకృత్యుడు
జవాబు:
అంటే కృతార్థుడు – అనగా చేయవలసిన పని పూర్తి చేసినవాడని భావము.

4. ధీమా వ్యక్తం చేశారు
జవాబు:
అంటే ధైర్యాన్ని వెలిబుచ్చారు.

5. అణువణువునా
జవాబు:
ప్రతి చిన్న ప్రదేశమందూ అని

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి, క్రింద ఇచ్చిన పదాలను ఒక్క వాక్యంలో వివరించండి.

శ్రీరామం “లక్ష్మణుడు కిష్కింధకు పయనమయ్యాడు. సుగ్రీవుడు రాజభోగాలతో ఓలలాడుతున్నాడు. సీతాదేవి ఎడబాటువల్ల నిలువునా నీరవుతున్న అన్నగారు, నిర్లక్ష్యంతో సుగ్రీవుడు – లక్ష్మణుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుసలు కొడుతున్నాడు. అతని ముందుకు రావడానికి ఎవరికీ కాళ్ళాడడం లేదు. వానరులూ, మంత్రులే కాదు. సుగ్రీవుడి పరిస్థితి అంతే. మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడడానికి తార వెళ్ళింది. స్త్రీల పట్ల కోపం ప్రదర్శించగూడదని శాంతించాడు. లక్ష్మణుడు శ్రీరాముని దయవల్లనే తానీ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు. మహాపరాక్రమశాలి శ్రీరామునికి తన సహాయం నిమిత్త మాత్రమేనన్నాడు. తనవైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు.

1. ఓలలాడుతున్నాడు.
జవాబు:
అంటే ఓల, ఓల అంటూ నీటిలో ఆడుతున్నాడని అర్థం, మునిగి తేలుతున్నాడని భావం.

2. నిలువునా నీరవుతున్న
జవాబు:
పూర్తిగా నాశనము అవుతున్న అని అర్ధము. పూర్తిగా అధైర్యపడుతున్నాడని భావం.

3. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
జవాబు:
కోపం లాగా ఎక్కువగా పొంగి ప్రవహించిందని భావం.

4. కాళ్ళాడడం లేదు
జవాబు:
కాళ్ళు కదలడంలేదు. అంటే ముందుకు అడుగుపడలేదని భావము.

5. కృతజ్ఞత ప్రకటించాడు.
జవాబు:
చేసిన మేలును వెల్లడించాడని చేసిన ఉపకారాన్ని గుర్తు చేశాడని భావము.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 5.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వాలి వధకు ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలిసుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. శ్రీరాముడి కొరకు చూశాడు. కనిపించలేదు. గుండె గుభేలుమంది. ప్రాణభయంతో ఋష్యమూకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో ‘బతికావు పో’ అని మరలిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలి, సుగ్రీవులు ఎవరు ?
జవాబు:
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు.

2. ఇద్దరిలో బలవంతుడు ఎవరు ?
జవాబు:
వాలి

3. శ్రీరాముని శరణువేడినదెవరు ?
జవాబు:
సుగ్రీవుడు

4. యుద్ధంలో ఎవరు ఓడిపోయారు ?
జవాబు:
సుగ్రీవుడు

5. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం పైకి ఎందుకు వెళ్ళిపోయాడు ?.
జవాబు:
అక్కడకు తన అన్న వాలి రాడని సుగ్రీవునకు తెలుసు.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 6.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తన వంతు సాయం చేస్తానన్నాడు. రావణుణ్ణి సపరివారంగా హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించేవారికి సుఖముండదు. ‘తేజస్సు క్షీణిస్తుంది. ప్రాణాలు నిలపడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరాముడు ఎందుకు శోకించాడు?
జవాబు:
తన భార్య సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళాడని తెలిసి రాముడు శోకించాడు.

2. సుగ్రీవుడు దేని కొఱకు తన శక్తిని వినియోగిస్తానన్నాడు ?
జవాబు:
సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటినీ వినియోగిస్తానన్నాడు.

3. దుఃఖం వలన ఏం కలుగుతుంది?
జవాబు:
దుఃఖం వలన సుఖము ఉండదు. తేజస్సు క్షీణిస్తుంది. దుఃఖించే వారి ప్రాణాలు నిలవడం కూడా కష్టంగా ఉంటుంది.

4. శ్రీరాముడిని ఓదార్చినవారెవరు ?
జవాబు:
శ్రీరాముడిని సుగ్రీవుడు ఓదార్చాడు.

5. ఈ భాగం ఏ కాండంలోనిది?
జవాబు:
ఈ భాగం ‘కిష్కింధాకాండం’ లోనిది.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 7.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ. సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కాని అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. వాలి క్షేమం కోరేవారెవరు?
జవాబు:
వాలి క్షేమాన్ని అతని భార్య తార కోరుతుంది.

2. వాలి విరోధి ఎవరు?
జవాబు:
వాలి విరోధి అతని తమ్ముడు సుగ్రీవుడు.

3. పై పేరాను బట్టి జరగబోయే యుద్ధంలో ఎవరు ఓడిపోవచ్చును?
జవాబు:
పై పేరాను బట్టి జరుగబోయే యుద్ధంలో వాలి ఓడిపోవచ్చు.

4. వాలి తన భార్య మాటను పాటించాడా ?
జవాబు:
వాలి తన భార్య మాటను పాటించలేదు.

5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.
జవాబు:
‘హితోపదేశాన్ని తిరస్కరించడం’ అనేది ఈ పేరాకు తగిన శీర్షిక.

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

ప్రశ్న 8.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించేవారికి సుఖముండదు. తేజస్సు క్షీణిస్తుంది. | ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుంచి బయట పడమని ధైర్యవచనాలను చెప్పాడు.

ప్రశ్నలు – జవాబులు :
1. శ్రీరాముడు ఎందుకు శోకించాడు ?
జవాబు:
సీతాదేవి కోసం

2. సీతాదేవిని ఎవరు తీసుకుపోయారు ?
జవాబు:
రావణాసురుడు

3. దుఃఖాన్ని పోగొట్టేవేవి ?
జవాబు:
ధైర్యవచనాలు

4. శ్రీరాముని స్నేహితుడెవరు ?
జవాబు:
సుగ్రీవుడు

TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం కిష్కింధాకాండ

5. దుఃఖం వలన నష్టమేమిటి ?
జవాబు:
సుఖముండదు, తేజస్సు ఉండదు.

Leave a Comment