Telangana SCERT 10th Class Telugu Grammar Telangana వ్యాసాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar వ్యాసాలు
ప్రశ్న 1.
సమాజంలోని మూఢనమ్మకాల్ని నిర్మూలించ డానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా చేసుకుని వ్యాసం వ్రాయండి. (March 2018)
జవాబు:
సమాజం అంటే సమూహం అని అర్థం. మానవ సమాజమనగా మానవుల సమూహమని అర్థం. అనూచానంగా మనదేశంలో మానవుల మనుగడ కల్పించేందుకై మహర్షులు కొన్ని నీతి నియమాల్ని ఏర్పాటుచేశారు. అలాగే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు నెలకొని యున్నాయి. అయితే మానవాళి ఆ మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మటం వల్ల పతనానికి దారితీశాయి. మానవాళి వృద్ధి చెందలేదు.
కాలానుగతంగా నేడు మానవ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు, సతీసహగమనాలు, జీవహింస చెయ్యటం, ప్రకృతి వైద్యమంటూ మానవుల్ని వల్లకాటికి పంపడం, చేతబడులు చెయ్యటం, దుష్టశక్తుల్ని వశం చేసుకొనుట మున్నగు దురాచారాలు ఎన్నో నెలకొని యున్నాయి. అయితే వీటిని గ్రహించి కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చేయుటకు కొంతమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించారు.
వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహన రాయ్ వంటి పెద్దలు ముందుగా స్త్రీలకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆ తర్వాత బాల్య వివాహాల్ని రద్దుచేసి శాసనాలతో చట్టం చేశారు. వితంతు వివాహాల్ని పునరుద్ధ రించారు. సమాజంలో దయ్యాలు, భూతాలు లేవని నిరూపించి ప్రజల్ని జాగృతులు చేశారు. అదేవిధంగా భూతవైద్యాన్ని, చేతబడుల్ని నిర్మూలించారు. శకునాల్ని నమ్మవద్దని, అవి కేవలం మానవుల చిత్రభ్రమలని తెలియజేశారు.
ముఖ్యంగా మానవుల్లో నెలకొనియున్న అంటరానితనాన్ని నిర్మూలించారు. భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకటేయనీ, మూఢ నమ్మకాల్ని తరిమి తరిమి కొట్టండనీ హెచ్చరించారు.
కనుక మానవులందరు పరమత సహనాన్ని పాటిస్తూ, మంచిని గ్రహించాలి. సమాజంలో నెలకొనియున్న మూఢనమ్మకాల్ని తరిమికొట్టాలి.
ప్రశ్న 2.
‘విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, స్వంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే ఆవార్డులను కూడా పొందాడు.’ అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం రాయండి. (March 2017)
జవాబు:
ఆధునిక సమాజంలో శాస్త్రసాంకేతిక రంగ ప్రభావం తీవ్రంగా ఉంది. విజ్ఞానశాస్త్ర ప్రభావంతో మానవుడు సమున్నత స్థాయికి చేరుకుంటున్నాడు. సాధారణం గా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వెంపర్లాడుతారు. స్వయం ఉపాధి మార్గాలకై అన్వేషింపరు.
కాని ఈ యువకుడు విద్యావంతుడై కూడా ప్రభుత్వ ఉద్యోగాలకోసం పాకులాడలేదు. స్వయంశక్తితో ఎదగాలనుకున్నాడు. తాను బ్రతుకుతూ మరికొందరికి ఉపాధిని కల్పించాలను కున్నాడు.
వ్యవసాయంలో ప్రవేశించాడు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించాడు. అధిక దిగుబడులను పొందాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందాడు. అందువల్ల అతడు నిజంగా అభినంద నీయుడు. అందరికి మార్గదర్శకంగా నిలిచాడు. నేటియువతరమంతా నిరుత్సాహ పడకుండా స్వయంఉపాధి మార్గాలను అన్వేషించాలి.
ప్రశ్న 3.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి. (June 2015)
జవాబు:
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు.
పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగి పోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగి పోతున్నాయి.
సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు, లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగి పోతున్నాయి.
నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేక పోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేక పోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.
ప్రశ్న 4.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే, ఆ పత్రిక ఆలోచనా ధోరణులనూ, దృక్పథాన్నీ అర్థం చేసుకో వచ్చు” దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వ్రాయండి. (March 2015)
జవాబు:
సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప చేసుకోవచ్చును.
పత్రికల్లోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణిని, ధృక్పథాన్ని తెలుసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సంపాదకీయం ఆ ప్రభుత్వానికి అద్దం పట్టి ప్రతి పనినీ, సమర్థిస్తూ వ్రాయబడుతుంది.
అదే ఈనాడు పత్రికైతే అందులోని సంపాద కీయాలు కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంపాదకీయాలుంటాయి. కాని ఈనాడు పత్రికలో సంపాదకీయాలు మంచిని ప్రశంసిస్తూ, చెడును విమరిస్తూ వ్రాయబడతాయి. నిజానికి సంక్షేమ పథకాలు, ప్రకటనలు, కొత్తవేవీ కావు. గత ప్రభుత్వాలు పాలించిన కాలంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి.
అయితే పత్రికలన్నీ సామాజిక బాధ్యతతో, నిజాయితీతో మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా విశ్లేషిస్తూ సంపాదకీయాలు వ్రాస్తే జగతి జాగృతం అవుతుంది.
ప్రశ్న 5.
పెద్దనోట్ల రద్దువల్ల కలిగే పరిణామాలను గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్వాతంత్య్రం వచ్చి దేశానికి 65 సం॥ దాటినా అవినీతి మాత్రం ఎక్కడా తగ్గలేదు. కొంతమంది గొప్ప ధనవంతులు అవినీతి మార్గంలో సాధించిన డబ్బును గుప్తంగా దాచుకుంటున్నారు. దేశవిదేశాల్లో నల్లకుబేరులు పెరిగిపోయారు. దొంగనోట్ల చెలామణి ఎక్కువగా ఉంది. దీంతో దేశ ఆర్థిక ప్రగతి తీవ్రంగా మందగించింది.
దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, నల్లధనాన్ని వెలికితీయడానికి మన ప్రధానమంత్రిగారు పెద్ద నోట్లను రద్దు చేశారు. అవినీతిపరుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. పారిశ్రామిక, రాజకీయ, వ్యాపారస్థుల దగ్గర మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీయడానికి ఈ చర్య సహకరిస్తుంది. అయితే కొంత ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంవల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చిల్లర నోట్లు దొరక్క ఇబ్బందులు పడ్డారు.
ప్రజలు కూడా ప్రధానమంత్రి తీసుకున్న సాహ సోపేత నిర్ణయాన్ని సమర్థించారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలు భావించారు. రాజకీయ పార్టీలు సంకుచిత విధానాలను వీడి ప్రభుత్వానికి సహకరించాలి. అవినీతి సొమ్మును బయటకు తీసుకొనిరావడానికి సహకరించాలి.
ప్రశ్న 6.
నవసమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశంమీద వ్యాసం రాయండి.
జవాబు:
విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండ వలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకుని రాగలరు.
సంఘసేవలో విద్యార్థుల విధులు – పాత్ర :
విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి. వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలల యందు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహవంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చును. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.
విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవ చేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అచ్చటి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.
ముగింపు :
ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.
ప్రశ్న 7.
‘పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు’ అనే అంశంపై వ్యాసాన్ని రాయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ భూగోళానికి ఎంతో ప్రముఖ మైంది. పర్యావరణ పరిరక్షణలో చెట్ల ప్రాధాన్యం విలువైంది. పచ్చని చెట్లు ప్రకృతికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. పచ్చని చెట్లని ప్రగతికి మెట్లగా భావిస్తారు.
ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత, మనకు చాలా కాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.
ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్లు – నీరు పుష్కలంగా లభించేలా
చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.
సూచనలు :
ఈ కార్యక్రమాన్ని మొక్కుబడితోకాక, చిత్తశుద్ధితో అమలు చేయాలి. నాటిన మొక్కలను పెంచి పోషించే గురుతర బాధ్యతను కూడా మనమే స్వీకరించాలి. మొక్కల సంరక్షణ మన కర్తవ్యంగా భావించాలి. “వృక్షో రక్షతి రక్షితః”. అని అంటారు. అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనందరిని రక్షిస్తాయి అని చెట్లను విచక్షణా రహితంగా నరికేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఆ రోజే ఈ కార్యక్రమ రూపకల్పనకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అంతేకాదు మనం కలలుకంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఆచరణరూపం దాలుస్తుంది.
ప్రశ్న 8.
ప్రభుత్వాలకు – ప్రజలకు మధ్య అనుసంధానంగా వ్యవహరించే వార్తాపత్రికల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ప్రచారసాధనాల్లో ప్రముఖ పాత్ర వహించేవి వార్తాపత్రికలు. ఒక్కపత్రిక పదివేల సైన్యంతో సమానమని మన పెద్దలు భావించారు. ఈనాడు వార్తాపత్రికలు గొప్పగా జాతికి ఉపయోగపడు తున్నాయి. ప్రపంచంలో గల అన్ని దేశాలలోని వింతలు, విశేషాలను మనకు వెంట వెంటనే తెలియజేసేందుకు వార్తాపత్రికలు బాగా ఉపయోగ పడతాయి. వీటినే ఆంగ్లంలో “న్యూస్ పేపర్స్” అంటారు. నాలుగు దిక్కుల మధ్యగల ప్రదేశాలకు సంబంధించిన విశేషాలను వార్తలని కొందరు చమత్కరించారు.
“వెనిస్” నగరంలో 16వ శతాబ్దంలో వార్తాపత్రికలు మొదలు పెట్టబడినాయి. భారతదేశంలో తొలి వార్తాపత్రిక ఇండియా గెజిట్ అని కొంతమంది, బెంగాల్ గెజిట్ అని కొంతమంది అంటారు. వంగదేశంలో రాజారామ్మోహన్రాయ్, ఆంధ్రదేశంలో ముట్నూరి కృష్ణారావుగారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు పత్రికలను మొదట స్థాపించారు. పత్రికలను నడుపుటకు సంపాదకులు, వార్తలను సేకరించుటకు విలేకరులు పనిచేస్తూ ఉంటారు. రోదసిలోని ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో చాలా వేగంగా వార్తలు సేకరించబడు తున్నాయి. వెలువడే సమయాన్ని బట్టి దిన, వార, పక్ష భేదములతో ఇవి నడుస్తున్నాయి.
పత్రికలను నిత్యం చదవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. చదివేవారికి ప్రపంచజ్ఞానం తెలుస్తుంది. మనుష్యుల దృష్టి విశాలమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, వాటిలోని మంచి చెడులను గురించి, అవి అమలు జరుగుతున్న తీరును గురించి. ఈ పత్రికలు వివరిస్తాయి. ఇవి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధుల వంటివి. వీటివల్ల భాష మెరుగులు దిద్దుకుంటుంది. అయితే ఈ పత్రికలు అబద్ధపు వార్తలను, వక్రీకరించబడిన వార్తలను ప్రచురించకూడదు. ప్రజలకు సేవచేసే ఉద్దేశంతోనే వెలువడాలి. కనుక వారిని మభ్యపెట్టే రచనలు చేయకూడదు.
పత్రికలు సక్రమంగా నిర్వహించబడి, సేవా దృక్పథంతో ప్రచురించబడితే చాలా ఉపయోగకరంగా నిలిచి శాశ్వత కీర్తిని సంపాదించుకోగలవు.
ప్రశ్న 9.
నేటి ఆధునిక సమాజంలో కంప్యూటర్ల పాత్రపై ఒక వ్యాసమును వ్రాయండి.
జవాబు:
నిరంతర అన్వేషియగు మానవుడు విజ్ఞానశాస్త్ర అభివృద్ధితో టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో, దూరదర్శన్ వంటి అనేక సాధనాలు కనుగొన్నాడు. ఆధునిక ఆవిష్కరణల్లో “కంప్యూటర్” ఒకటి. నిత్య జీవితంలో అది ఒక భాగమయింది. కంప్యూటర్ అంటే కూడటం అని అర్థం. అన్ని రకాల గణిత సమస్యలను సాధించే యంత్రమునే కంప్యూటర్ అనవచ్చును. కంప్యూటర్లో కీబోర్డు, టెలివిజన్ స్క్రీన్ ముఖ్యమైనవి.
మనం ఏం చెపితే అది చేసే ఎలక్ట్రానిక్ యంత్రం కంప్యూటర్. అంకెలకు సంబంధించినవి డిజిటల్ కంప్యూటర్లు కాగా, పరిమాణాలకు రాసులకు చెందినవి ఎనలాగ్ కంప్యూటర్లు. ఇవి సమాచారాన్ని గ్రహిస్తాయి, నిల్వ చేస్తాయి, మనకు చెబుతాయి. చైనాలో వాడిన అబాకస్ అనే పలక కంప్యూటరుకు ఆధారం. బాబేజ్ అనే శాస్త్రవేత్త 1880లో తయారుచేసిన పలక రూపాంతరం చెంది నేటి కంప్యూటరయింది. వీటి తయారీలో అమెరికా, జపాన్ దేశాలు పోటీపడు తున్నాయి.
సున్నితమైన వీటిని దుమ్ము చేరడానికి వీలులేని ఎయిర్ కండిషన్ గదుల్లో ఉంచి వాడతారు. ఇది సమాచారాన్ని ఖచ్చితంగాను, త్వరగాను అందిస్తుంది. ఇది 1, 0 లను మాత్రమే గ్రహిస్తుంది. మనం చెప్పే విషయాన్ని 1, 0 లలోకి మార్చేందుకు ట్రాన్స్ లేటర్స్ ఉంటాయి. అవి విషయాన్ని మార్చి కంప్యూటర్ భాషలో అందిస్తాయి. జవాబును మనకు అర్థమయ్యే భాషలో అందిస్తాయి. సాధారణంగా కంప్యూటర్లు అనగానే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని వింటుంటాము. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ నడిపే విధానానికి చెందింది. హార్డ్వేర్ అనగా కంప్యూటర్కు కావలసిన సాధనాలు.
కంప్యూటర్ల ఉపయోగాలు నేడు అనేకం ఉన్నాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు వీటి వాడకంలో చాలా ముందున్నాయి. కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగం, గమనములకే గాక అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా వాడడానికి సిద్ధమవుతున్నాయి.
వీటివలన నిరుద్యోగ సమస్య పెరుగుతుందనే కారణం కొంత సమంజసమే అయినా ఆధునిక విజ్ఞానాభివృద్ధిని త్రోసిపుచ్చలేము కనుక కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మంచిది.
ప్రశ్న 10.
విద్యార్థికి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే అంశం గురించి నీ అభిప్రాయాన్ని ఒక వ్యాస రూపంలో వ్రాయండి.
జవాబు:
తల్లి నుండి బిడ్డ నేర్చుకొనెడి భాషే మాతృభాష. తల్లి ఒడిలోని శిశువు మాతృస్తన్యముతో పాటే మాతృ భాషామృతాన్ని కూడా పానం చేస్తుంది. మానసిక మైన భావపరంపరను వ్యక్తులు పరస్పరం తెలియ జేసుకోవడానికి ఉపయోగించే వాగ్రూపమైన సాధనమే భాష.
తన జాతి ఆచార వ్యవహారాలను, తనవారి తీరు తెన్నులను, కట్టుబొట్టు మున్నగు సంప్రదాయాలవంటి అనేక విశేషాలను బాల్యం నుండియే తెలుసుకోవడానికి అనువైనది మాతృభాష, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి తొలి ఆధారం మాతృభాష. అయిదేండ్ల ప్రాయంగల విద్యార్థికి మాతృభాషలోనే విద్యాభ్యాసం ప్రారంభించడం మన సంప్రదాయం. విద్యను బాల బాలికలు మాటలు వచ్చినది మొదలు ఏ భాషను ఉపయోగించు కొనుటకు అలవాటుపడతారో దానిలోనే నేర్చు కోవడం సులభం.
ప్రాచీన కాలము నుండి మన విజ్ఞానమంతయు సంస్కృతమునందే కలదు. మెకాలే విద్యావిధానం అమలు జరగడంతో ఆంగ్లభాష దేశంలో నిర్బంధ విద్య అయింది. అది ప్రపంచ భాష అయినందున, దాన్ని నేర్చుకోవాలనే తపన స్వదేశీయులలో కూడా పెరిగింది. ఆంగ్లభాష ప్రాబల్యం పెరిగి మాతృభాష నిర్లక్ష్యం కావడం జరిగింది. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలలోని “స్వభాష” అనే వ్యాసంలో జంఘాల శాస్త్రి మాతృభాష మాట్లాడలేని వారిని వ్యంగ్యంగా పరిహసించాడు. బోధన, పరిపాలన మాతృభాషలోనే జరగడం తల్లిపాలవంటిది అని, పరాయిభాషలో జరగడం పోతపాలవంటిదని 1913లో దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు అన్న మాటలు మనం జ్ఞప్తియందుంచుకోవాలి.
1947లో దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి విద్య గ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే. రష్యా వంటి పెద్ద దేశములలో భాషలనేకం ఉన్నను రష్యన్ భాషకే ప్రాధాన్యత. చైనా, జర్మన్, ఫ్రాన్సు దేశాలు ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిస్తూ మాతృభాషలోనే బోధనా, పాలనలు జరుపుకొంటున్నందున అవి పురోగతిని సాధిస్తున్నా యనే సత్యాన్ని మనం గుర్తించాలి.
మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులభమగును. ఎక్కువ శ్రద్ధతో నేర్చుకోవచ్చును. సంభాషణ, విషయ విశ్లేషణ చేయడం తేలిక. జ్ఞానార్జన, అవగాహన, మూర్తిమత్వ వికాసాలకు మాతృభాషా బోధన తోడ్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో మాతృభాషా విద్యాబోధన, పాలనలకు ఎక్కువ స్థానం కలిగించి, నేర్చినవారికి ఉద్యోగావకాశాలు రాష్ట్రస్థాయిలో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.
అధికార భాషా సంఘం, ప్రభుత్వం, విద్యాధికులు మాతృ భాషలో విద్యాబోధనకు మరింతగా కృషి చేయాలి. మాతృభాషలో విద్యాబోధన చేయడం, ఇంగ్లీషును నిర్భందంగా ఒక స్థాయి వరకు నేర్పించడం చాలా అవసరం. మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చే విద్యార్థికి సమాధానాలు వ్రాసే భాషను ఎన్నుకొనే స్వేచ్ఛను కల్పించాలి.
ప్రశ్న 11.
సత్వరమే ప్రపంచమంతా సమాచారాన్ని అందించుటలో దూరదర్శన్ పోషిస్తున్న పాత్రను తెలపండి.
జవాబు:
వింతలకు పుట్టినిల్లయిన 20వ శతాబ్దములో మానవుడు విద్యుత్తును, దానితో పనిచేసే వార్తా ప్రసార సాధనాలను ఎన్నింటినో తయారుచేశాడు. నిత్యజీవితములో టెలిఫోన్, టెలిగ్రాఫ్, టెలిప్రింటరు, వైర్ లెస్ రేడియో వంటి సాధనాల వాడకాన్ని గూర్చి తెలియని వారుండరు.
1925లో బ్రిటిష్ శాస్త్రవేత్తలైన జె.యల్. బయర్డు, జెనిన్సు అనేవారు దూరదర్శన్ను కనుగొన్నారు. దూరదర్శన్ లో మాట వినిపించడంతో పాటు అది పలికే వ్యక్తి కూడా మనకు కనిపించడం విశేషం. బ్రిటిష్ శాస్త్రజ్ఞులు లండనులో తొలిసారి దీనిని ప్రదర్శించారు. దూరదర్శన్ ప్రసార కేంద్రం లోని ట్రాన్స్ మిషన్ శబ్ద, చిత్ర తరంగాలను విద్యుత్త రంగాలుగా మార్చి అంతరిక్షంలోకి వదులుతుంది. ఇండ్లలోని దూరదర్శన్ల యందున్న రిసీవర్ యంత్రము వాటిని ఆకర్షిస్తుంది. అవి తిరిగి శబ్ద, చిత్ర తరంగాలుగా మార్పు చెంది మన కనుల ముందు ప్రత్యక్షమగును.
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి) వారు 1936లో దూరదర్శన్ కార్యక్రమాలను ప్రచారంలోకి తెచ్చారు. దూరదర్శన్ మన దేశంలో తొలిసారిగా 1957లో ఢిల్లీలో ప్రారంభమైంది. పిదప ముంబాయి (బొంబాయి), చెన్నై (మద్రాసు), కోల్కతా (కలకత్తా) లలోను క్రమంగా రాష్ట్ర రాజధానులలోను ఏర్పాటయింది. మన రాష్ట్రంలో హైదరాబాదులో ప్రసార కేంద్రం ఉంది. నేడు మన దేశంలో ప్రసార కేంద్రాలు 200లకు పైగా పనిచేస్తున్నాయి. “దూరదర్శన్” అనే పేరుతో ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించింది.
దూరదర్శన్ వీనులకు విందును, కనులకు పండుగను కల్పిస్తున్నది. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా ప్రజలకు పంచిపెట్టే సాధనం టెలివిజన్. చిత్ర గీతాలు – చలనచిత్రాలు ఇల్లు కదలకుండానే ఆబాలగోపాలం చూచి ఆనందించుటకు వీలు కలిగింది. క్రీడలు నేరుగా జరుగుతుండగానే ఇంటియందు మనం చూడవచ్చును. పిల్లలకు బాల వినోదిని, వార్తా ప్రసారములు, ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతున్నాయి. వ్యవసాయ, ఆరోగ్య, వైద్య, సాహిత్య, సంగీత, క్రీడాకార్యక్రమాల వంటివి ఆయా రంగాలలో అభిరుచి గలవారికి ఆనందాన్ని – విజ్ఞానాన్ని కలిగిస్తాయి.
చాలా కేంద్రాలు విద్యాబోధనకు కూడా దూరదర్శనన్ను వినియోగిస్తున్నాయి. పొదుపు – పెట్టుబడులు, షేర్ మార్కెట్టు మొదలైనవన్నీ దూరదర్శన్లో ప్రసారం అవుతున్నాయి. దూరదర్శన్ ప్రసారాలకై వివిధ ఛానల్స్ పనిచేస్తున్నాయి. అందువలన కార్యక్రమాల్లో వైవిధ్యము, పోటీ కనబడుతున్నాయి. మంచి విలువగల్గి ఉపయోగ కరములైన కార్యక్రమాలు మాత్రమే వచ్చేట్లు ప్రభుత్వం చూడాలి.
ప్రశ్న 12.
సంఘసేవలో విద్యార్థులు ఆచరించవలసిన విధి విధానాలను విశ్లేషణాత్మకంగా వ్యాసరూపకంగా వ్రాయండి.
జవాబు:
విద్యను అర్థించువారు విద్యార్థులు. సంఘమునకు చేయు సేవ సంఘసేవ. విద్యార్థులు బాల్యము నుండే సంఘమునకు సేవచేయు అలవాటును కలిగియుండ వలెను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక సంఘసేవ పట్ల ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో ప్రజానాయకులై దేశమును అన్ని రంగములలోనూ అభివృద్ధిలోనికి తీసుకుని రాగలరు.
సంఘసేవలో విద్యార్థుల విధులు పాత్ర :
విద్యార్థులలో సేవాభావమును అభివృద్ధి చేయుటకై పాఠశాలలో స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్.సి.సి. వంటి పథకములు ప్రవేశపెట్టబడినవి. ఇవేకాక కళాశాలల యందు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అను దానిని ప్రవేశపెట్టారు. వీటిలో ఉత్సాహ వంతులు అయిన విద్యార్థులు సభ్యులుగా చేరవచ్చును. ఆ విద్యార్థుల్ని సేవా పథకంలో పాల్గొనచేయుటకు ఒక ఉపాధ్యాయుడు నాయకత్వము వహించును.
విద్యార్థులు అనేక విధాలుగా సంఘసేవచేస్తూ జాతీయాభ్యుదయానికి సహకరించవచ్చును. తామున్న ప్రాంతములోను, మురికివాడలకును పోయి అక్కడివారికి పరిశుభ్రత యొక్క అవసరమును వివరించి అందరూ శుభ్రముగా ఉండునట్లు చూడవచ్చును. చదువురాని వయోజనులకు విద్య నేర్పవచ్చును. పట్టణాలలో రహదారి నిబంధనలను తప్పకుండా ఉండునట్లు చేయుటలో పోలీసువారికి విద్యార్థులు సహకరించవచ్చును. ఉత్సవాలు, సభలు జరుగునపుడు విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొని అచ్చటి జనులకు అవసరమైన సేవలు చేయవచ్చును.
ముగింపు :
ఈ విధంగా విద్యార్థులు బాల్యం నుండి తమ యింటిలో అమ్మ నాన్నలకు వారు చేయు పనిలో సహకరించడంతో పాటు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనుట వలన మంచి పనులు చేయుచున్నాము అన్న తృప్తి వారికి కలుగుతుంది. దేశానికి సేవ చేసినట్లు అవుతుంది.
ప్రశ్న 13.
పర్యావరణ పరిరక్షణలో ప్రజలపాత్రపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
భూమి, గాలి, నీరు మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. అందువల్ల పర్యావరణం అంటే పరిసరాల ‘వాతావరణం’ అని అంటారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్లే మనం ఆరోగ్యంగా బతుకుతున్నాము. పరిసరాల వాతావరణం కలుషితంకాకుండా కాపాడు కోవటమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.
విషయ ప్రస్తావన :
నీరు ప్రాణాధారతకు, దాహాన్ని తీర్చడానికి, పంటలు పండటానికి ఉపయోగపడు తోంది. చెట్లు శుభ్రమైన గాలినిస్తూ, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తున్నాయి. అయితే రాను రాను జనాభా పెరుగుదల మూలంగాను, నాగరికత మోజు వల్లను, మన పరిసరాలను మనమే పాడు చేసు కుంటున్నాము. కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు పెరిగి’ వాతావరణం కాలుష్యంతో నిండిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి అనావృష్టి లేక అతివృష్టిని కల్గించేలా దురదృష్టకర మార్పులు ఏర్పడుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల వరదలేర్పడి జన నష్టం, పంటనష్టం ఏర్పడుతోంది.
రక్షణ చర్యలు :
పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ సంస్థలు, మన ప్రభుత్వాలు ఎన్నో తీవ్ర చర్యలు తీసుకుంటున్నాయి. జన్మభూమి పథకం క్రింద మన ఇళ్ళను, గ్రామాలను, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటిలోని చెత్తను ఇంటియందు పారవేయకుండా, వీధి చివర కుండీ ఏర్పాటు చేసుకొని అందులో పారవేయాలి. కుళాయి వద్ద, మురికి కాల్వల వద్ద చెత్త ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మలేరియా, టైఫాయిడ్, రోగ కారకమైన దోమలు విజృంభించ కుండా డి.డి.టి. వంటి మందులు చల్లుకోవాలి. మురికివాడల వాసులకు శుభ్రత గూర్చి తెలియ జేయాలి. చెట్లను నాటాలి. పారిశుధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గాలి, వెలుతురులు వచ్చేలా ఇళ్ళు నిర్మించుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి. దీనికై అందరూ ఉద్యమించాలి. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థ లోని సమతౌల్యాన్ని కాపాడు కోవడానికి అందరూ కృషి చేయాలి.
ప్రశ్న 14.
అవయవదానంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ఉపోద్ఘాతం : పుట్టుకతోనే అవయవ లోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే.
విషయ విశ్లేషణ :
మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు చేతులు తప్పనిసరి. ఇవేకాదు మూత్రపిండాలు ఊపిరితిత్తులు వంటి అవయవ భాగాలు ముఖ్యమైనవే. రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్య మున్నదే.
కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తం వంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండటానికి మార్గం అవయవదానం.
తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందు కొస్తున్నారు. అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం.
అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ, మరొక యువకుడు దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరివి జీవించగలిగేటట్లు చేశాయి.
ముగింపు :
ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు.
ప్రశ్న 15.
విజ్ఞానశాస్త్ర ప్రయోజనాలు
జవాబు:
పరిచయం :
మానవుడు భూమిపై అవతరించి నప్పటి నుంచీ పంచభూతాలతో నిండిన ప్రకృతిని నిశితంగా పరిశీలించి తన సుఖజీవనానికి మలచుకొన సాగారు. జిజ్ఞాస పెరిగేకొద్దీ కాలక్రమేణ మనిషి నేల, నిప్పు, నీరు, గాలి, నింగిని పరిశోధించి వాటి తత్త్వాన్ని ఆకళింపు చేసుకున్నాడు.
ఖగోళ విజ్ఞానం, గృహ సంచారం, భూగోళ స్వరూప స్వభావాలు, పంచభూతాల శక్తులు మనిషికి లొంగసాగాయి. తాను గ్రహించిన విజ్ఞానాన్ని శాస్త్ర రూపంలో రచించి తరువాతి తరాల వాళ్ళకు అందించాడు విజ్ఞానియైన మానవుడు. క్రమంగా ఆ విజ్ఞానం పెరిగి విస్తరించి శాఖోపశాఖలైంది. దీనినే విజ్ఞానశాస్త్రం అంటున్నాం.
ఉద్దేశ్యం :
ఆధునిక యుగంలో పదార్థ విజ్ఞా ప్రధానమైంది భౌతికశాస్త్రం. ఇందులో శబ్దం, కాంతి దర్శనం వంటి అంశాల మీద విశేష పరిశోధన జరిగింది. ఇంకా జరుగుతోంది. దీని ఫలితంగా భూమి పైన, విశ్వాంతరాళంలో ఎక్కడికైనా రేడియో ప్రసారావకాశాలు, దూరదర్శన్ ప్రసారాలు, ఛాయాచిత్ర సేకరణ వంటివి సాధ్యమయ్యాయి. అణువిచ్ఛిత్తి వలన విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, ఐసోటోపులు సాధ్యమై అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.
వైద్య రంగంలో ఎక్స్, లేజర్ కిరణాల వలన, వ్యాధి నిర్ణయ విధానంలో కొత్తరీతులు సాధ్య మయ్యాయి. రకరకాల రాడార్లు తుఫాను రాకడ, వర్షా గమనం వంటి వాటిని ముందే తెలుపుతున్నాయి. యుద్ధ పరికరాలు, అస్త్రశాస్త్రాలు, ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబు, సుదూర లక్ష్యఛేదనం మరింత అభివృద్ధి చెందాయి. రసాయనశాస్త్ర పరిశోధనల వలన రకరకాల రసాయనాలు తయారై మందులకు, పరిశ్రమలకు ప్రజలకు ఉపయోగ పడుతున్నాయి.
వృక్షశాస్త్ర రంగంలో పరిశోధనల వలన రక రకాల కొత్త వంగడాలు, అధిక దిగుబడి సాధ్యమైంది. ఆహార పదార్థాల ఉత్పత్తి హెచ్చింది. ఇంజనీరింగు, సాంకేతిక శాస్త్ర రంగంలో జరుగుతున్న కృషి ఫలితంగా ఎన్నో ఖనిజాలను, సంపదను వెలికి తీయటం, రకరకాల యంత్ర, వస్తు నిర్మాణం, శీఘ్రగమనం సులభసాధ్యమైంది.
సృష్టిలో పనికిమాలినది లేదని, ప్రతిదీ ఏదో ఒక పరమ ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం నిరూపిస్తున్నది. చెత్తనుంచి, పేడనుంచి విద్యుదుత్పత్తి, తవుడు నుంచి నూనె, మురుగునీటి నుంచి మంచినీరు వంటివాటిని ఉత్పత్తి చేయటం.
సూర్యరశ్మి నుంచి విద్యుత్తును గ్రహించి మానవో పయోగానికి తేవటం, యంత్ర మానవులను సృష్టించటం, వాటితో పెద్ద పెద్ద పరిశ్రమల్ని నిర్వహించటం ఈనాడు జరుగుతున్నది. గగనంలో చాలా ఎత్తుగా, వేగంగా పయనించటం, గ్రహాంత రాలకు రాకెట్లు, ఉపగ్రహాలు పంపటం, నేలమీద గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో పోయే రైళ్ళను నడపటం విజ్ఞానశాస్త్రం సాధించిన ఘన కార్యాలుగా పరిగణింపబడుతున్నాయి.
ముగింపు :
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విజ్ఞానశాస్త్రం మానవ జీవితంలో అనూహ్యమైన మార్పుల్ని తెస్తున్నది. మృత్యుముఖంలో ఉన్న మనుష్యుణ్ణి మృత్యువు నుంచి కాపాడి ప్రాణం పోస్తున్నది. దీనికి విరుద్ధంగా ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఖండాంతర వేధులు, మృత్యుకిరణాలు, విషవా యువులు వంటివి మానవజాతి మనుగడకే సవాలుగా పరిణమించాయి. ఊపిరిపోస్తున్న విజ్ఞాన శాస్త్రమే ఊపిరి తీసివేస్తున్నది. ఇది అత్యంత విషాదకరం. మనుష్యుడు వివేకంతో విజ్ఞాన శాస్త్రాన్ని మానవాభ్యుదయానికి మాత్రమే వినియోగిస్తే సర్వ మానవాళి సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది.
ప్రశ్న 16.
దేశభక్తుల వల్ల దేశ ప్రజలకు కలిగే ప్రయోజనాలు వ్యాసంగా రాయండి.
జవాబు:
దేశమును ప్రేమించుమన్నా – మంచి అన్నది పెంచమన్నా
సొంతలాభం కొంత మానుక – పొరుగువారికి తోడుపడవోయ్.
ఇది దేశభక్తుని లక్షణం. తాను, తన కుటుంబం బాగుంటే చాలనుకోడు దేశభక్తుడు. తన చుట్టూ ఉన్న వారి క్షేమంలోనే తన క్షేమం ఉందని భావిస్తాడు.
చుట్టూ ఉన్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ సామాన్యుడు తలదించుకొని వెళతాడు. నా ఒక్కడితో ఏమౌతుంది అనే నిర్వేదంలో ఉంటాడు. అలాంటి సామాన్యులను ఒక్కతాటి మీదకు తెచ్చి వారి వెనక తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇస్తాడు దేశభక్తుడు. అవినీతిపై మడమతిప్పని పోరాటం చేస్తున్న అన్నా హజారే దీనికి మంచి ఉదాహరణ.
దేశభక్తుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాడు. ప్రజలు కూడా తనలాగే నిరాడంబరంగా జీవించేలా ప్రేరేపిస్తాడు. గాంధీజీ నిరాడంబర జీవనం చూసి, అలాగే నిరాడంబర జీవనం గడిపిన పొట్టి శ్రీరాములు, బులుసు సాంబమూర్తి మనకు తెలుసు.
దేశభక్తుడు క్రమశిక్షణకు, పనిపట్ల నిబద్దతకు ప్రాముఖ్యమిస్తాడు. పొదుపును పాటిస్తాడు. ప్రజల కోసం తన సుఖాన్ని త్యాగం చేస్తాడు. జాతిని నిర్వీర్యం చేసే కులమత వైషమ్యాలను పక్కన పెడతాడు. మానవతే తన మతమని చాటుతాడు.
ఇలాంటి దేశభక్తుల మూలంగా దేశప్రజలు చైతన్యవంతులౌతారు. వారి బాటలో సామాన్యులు కూడా మాన్యులవుతారు.
ప్రఖ్యాత ఇంజనీర్లు కె.యల్. రావు, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య దేశ సాంకేతిక అభివృద్ధికి కృషి చేసిన దేశభక్తులు. వారానాడు నిర్మించిన ఆనకట్టల వల్ల దేశ ప్రజల ఆహార సమస్యతీరింది.
కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, కొమఱ్ఱాజు లక్ష్మణరావు వంటి సంఘసంస్కర్తల వల్ల సంఘంలోని మూఢాచారాలు తగ్గాయి.
స్త్రీలలో స్వేచ్ఛాకాంక్షను పెంచి, తమ స్థితిని బాగు చేసుకోవాలనే తపన పెంచి, స్త్రీలను చైతన్య పరచిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాళ్ళెందరో!
తమ ధన, మాన, ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా దేశం కోసం త్యాగం చేసే దేశభక్తుల వల్ల ప్రజల్లో విద్య, ధర్మం, నీతి, సంఘంపట్ల చైతన్యం ఏర్పడతాయి.
ప్రశ్న 17.
సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు కృషి చేస్తున్న శతక కవులను అభినందిస్తూ వ్యాసం రాయండి. (May 2022) (March 2019)
జవాబు:
“లావుగల వాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ” అని సుమతీ శతకకారుడు నీతి గల వానిని గురించి చెప్పాడు. చిన్న చిన్న నీతివాక్యాలే మనిషికి ప్రవర్తనా పద్ధతులు నేర్పుతాయి. స్వార్ధరహితంగా ఉండడమే అన్ని నీతులలో కెల్లా గొప్ప నీతి, నీతిని కలిగి ఉండుటే నైతికత. నీతి అంటే ఏమిటి ? ఓ సంఘటన తర్వాత నీవు ఆనందంగా, హాయిగా భావిస్తే అదే నైతికత. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదగా నడుచుకోవడం నైతికతలో భాగం. తోటివారి పట్ల స్నేహంగా మెలగడం కూడా దీనిలో భాగమే. అసత్యం, కులగర్వం, పరుల సొమ్ము ఆశించడం, వరుస, వావి లేకుండడం, మోసం, స్వార్థం, కుటిలత్వం మొదలైనవి లేకుండా జీవించేవారు నైతిక విలువలు పాటిస్తున్నట్లే.
ఈ నైతికతకు ఆధ్యాత్మికత తోడైతే బంగారానికి తావి అబ్బినట్లే. మనం ఈ తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు – అనే భావన తప్పు చేయనీదు. అందుకే పెద్దలు తప్పు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని చెబుతారు. భయం, భక్తి లేకపోతే సమాజం సజావుగా సాగదు. తప్పు చేద్దామనే భావం హెచ్చుమీరుతుంది. ఇక తెగించినవాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం. చదువుకునేవారికి కేవలం పోటీతత్త్వమే కాకుండా తన చదువు మరొకరికి దారి చూపేదిగా ఉండాలని చెప్పినప్పుడే అతనికి, సమాజానికి మేలు జరుగుతుంది. అందుకే పెద్దలు “శీలేన శోభతే విద్యా అన్నారు.
చేసేపనిని శ్రద్ధా భక్తులతో చేయడం వల్ల పనితనం, పనిలో విజయం చేకూరతాయి. మనం సంపాదించే ధనంలో కొంత పేదా బీదలకు ఇవ్వడం నీ ఉన్నతికి కారణమౌతుంది. నైతిక విలువలు కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. సమాజంలోని మనిషి తన నిత్య జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకకూడదో తెలియజెప్పే నైతిక విలువలు పాటించడం అత్యావశ్యకం. వీటిలో సత్యం, ధర్మం, న్యాయం, మానవీయతలు ప్రకాశిస్తుంటాయి.
మన గత చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో, దేవాలయాలలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రబోధించే, పెంపొందించే కార్యక్రమాలు జరుగుతుంటాయని తెలుస్తుంది. వీటి పరిరక్షణయే లక్ష్యంగా సాహిత్యం మొదలైన కళలన్నీ ఆవిర్భవించాయి. ఎందరో మహనీయులు ఈ విలువలను సుస్థాపితం చేయడానికి తమ జీవితాలు ధారపోశారు. ఈ విలువలను మనం పాటించడం వారి శ్రమను గుర్తించడమే అవుతుంది.
శతకం బ్రతుకుకు మార్గం
శతక కవులు అభినందనీయులు వారి మార్గం ఆచరణీయం
శతక కవులకు సమర్పిద్దాం ప్రణామాలు.
ప్రశ్న 18.
సమాజంలోని మూఢనమ్మకాల్ని నిర్మూలించడానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా చేసుకుని వ్యాసం వ్రాయండి. (March 2018)
జవాబు:
సమాజం అంటే సమూహం అని అర్థం. మానవ సమాజమనగా మానవుల సమూహమని అర్థం. అనూచానంగా మనదేశంలో ‘మానవుల మనుగడ కల్పించేందుకై మహర్షులు కొన్ని నీతి నియమాల్ని ఏర్పాటుచేశారు. అలాగే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు నెలకొనియున్నాయి. అయితే మానవాళి ఆ మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మటం వల్ల పతనానికి దారితీశాయి. మానవాళి వృద్ధి చెందలేదు.
కాలానుగతంగా నేడు మానవ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు, సతీసహగమనాలు, జీవహింస చెయ్యటం, ప్రకృతి వైద్యమంటూ మానవుల్ని వల్లకాటికి పంపడం, చేతబడులు చెయ్యటం, దుష్టశక్తుల్ని వశం చేసుకొనుట మున్నగు దురాచారాలు ఎన్నో నెలకొనియున్నాయి. అయితే వీటిని గ్రహించి కూకటి వ్రేళ్ళతో సమూలంగా నాశనం చేయుటకు కొంతమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించారు.
వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామమోహనరాయ్ వంటి పెద్దలు ముందుగా స్త్రీలకు ప్రత్యేక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆ తర్వాత బాల్య వివాహాల్ని రద్దు చేసి శాసనాలతో ‘చట్టం చేశారు. వితంతు వివాహాల్ని పునరుద్ధరించారు. సమాజంలో దయ్యాలు, భూతాలు లేవని నిరూపించి ప్రజల్ని జాగృతులు చేశారు. అదేవిధంగా భూతవైద్యాన్ని, చేతబడుల్ని నిర్మూలించారు. శకునాల్ని నమ్మవద్దనీ, అవి కేవలం మానవుల చిత్తభ్రమలని తెలియజేశారు.
ముఖ్యంగా మానవుల్లో నెలకొనియున్న అంటరానితనాన్ని నిర్మూలించారు. భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకటేయనీ, మూఢనమ్మకాల్ని తరిమి తరిమి కొట్టండనీ హెచ్చరించారు.
కనుక మానవులందరు పరమత సహనాన్ని పాటిస్తూ, మంచిని గ్రహించాలి. సమాజంలో నెలకొనియున్న మూఢనమ్మకాల్ని తరిమికొట్టాలి.
ప్రశ్న 19.
విద్యావంతుడైన ఒక యువకుడు ఉద్యోగాల కోసం పాకులాడకుండా, సొంతంగా వ్యవసాయం చేస్తూ, చక్కగా పంటలు పండిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వంచే అవార్డులను కూడా పొందాడు. అటువంటి యువకుణ్ణి పొగుడుతూ అభినందన వ్యాసం వ్రాయండి. (March 2017)
జవాబు:
ప్రియ మిత్రమా ! రామచంద్రా ! నీకు నా ప్రత్యేక అభినందనల్ని తెల్పుచున్నాను. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించడం చాలా కష్టతరమైంది. కాని పై చదువులకు ఎక్కడకు వెళ్ళకుండా, చదివి అగ్రికల్చరల్ B.Sc. ని చదివి ఆపేశావు.
నీవు నీ గ్రామానికి వెళ్ళి, నీ తండ్రికి తోడుగా నిల్చావు. ‘గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని’ గాంధీగారు చెప్పినట్లు వ్యవసాయానికే నీ చదువునుపయోగించావు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి పదిమంది రైతులకు మార్గదర్శకు డవయ్యావు. వ్యవసాయం చేయుటలో మెళుకువలన్నీ సాటి రైతులకు చెప్పావు.
అధిక దిగుబడుల నిచ్చే వరి వంగడాల్ని ఎన్నుకొని నీ పొలాన్ని సాగుచేసి, సస్యశ్యామలం చేశావు. క్రిమిసంహారక మందుల్ని వాడకుండా, కంపోస్టు ఎరువుల్ని ఉపయోగించావు. రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాల్ని నీ గ్రామ ప్రజలకి తెలియజేశావు. ఎకరానికి 50 నుండి 60 బస్తాలు (క్వింటాళ్ళు) ధాన్యాన్ని పండించావు.
వ్యవసాయానికి తోడుగా పాడిపరిశ్రమను చేపట్టావు. నీ వల్ల పలు నగరాలకు నాణ్యమైన పాలను సరఫరా చేశావు. గోసంరక్షణ చేసి, పలు సంస్థల నుండి గౌరవ పురస్కారాన్ని పొందావు.
నీటి సమస్య లేకుండా నీ పొలంలోనే చెరువును త్రవ్వించి నీటిని నిల్వచేశావు. త్రాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేశావు. దీనికి తోడు కోళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేశావు. నీవు నీ కాళ్ళపై నిలబడటమే కాకుండా దాదాపు చాలామందికి ఉపాధిని కల్పించావు.
నేడు నీవు చదివిన చదువు సార్థకమైంది. ఇంత పరిశ్రమ చేసిన నిన్ను రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించుట నీ గ్రామానికే గర్వకారణం. నిజంగా తెలుగుతల్లి ముద్దుబిడ్డవు.. నీకు నా తరఫున, నా మిత్రుల తరఫున అభినందన మందారాలనందిస్తున్నాను. ఇంకా నీవు అభివృద్ధి చెంది మరికొంతమందికి ఉపాధి కల్పిస్తావని ఆశిస్తూ. సెలవు.
ఇట్ల
నీ ప్రియమిత్రుడు,
యన్. బాలకృష్ణ.
ప్రశ్న 20.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి. (June 2015)
జవాబు:
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు.
పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం. లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి.
సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగిపోతున్నాయి.
నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేకపోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.
ప్రశ్న 21.
ఏదైనా పూర్వ పరిపాలకులు పాలించిన పట్టణం యొక్క చారిత్రక సాంస్కృతిక విశేషాల్ని వ్రాయండి. (June 2015)
జవాబు:
గోల్కొండ దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని నవాబులు హైదరాబాదు రాజ్యాన్ని పాలించారు. గోల్కొండ దుర్గమంటే మూడు కోటలు. ఈ కోటలు ఒకదానిని మరొకటి చుట్టుకొని ఉంటాయి. ఈ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు. పట్టణంలోని భాగాల్ని ‘మొహల్లాలు’ అని పిలుస్తారు. వీరికి జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా వంటి పేర్లు ఉండేవి.
‘గోల్కొండ పట్టణాన్ని అందంగా కులీకుతుబ్షా, అబ్దుల్లా కుతుబ్షా తీర్చిదిద్దారు. గోల్కొండలో ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం ఉండేది. ‘దిల్కుషా’ వంటి అందమైన భవనాలు ఉండేవి. గోల్కొండలో మిద్దెలతోటలు (Roof Gardence) ఉండేవి. ఈ ఉద్యానవనానికి నీరు అందించే నీటి కాలువలు జలాశయాలు ఉండేవి.
గోల్కొండలో విదేశీ వర్తకులు వర్తకం చేసేవారు. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లు. కులీకుతుబ్షా కాలంలో తెలంగాణ ప్రపంచపు అంగడిగా ఉండేది.
గోల్కొండలో ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ, ఆయుధ పరిశ్రమ సాగుతుండేది. ఇబ్రహీం కుతుబ్షా తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడు. 1589 సంవత్సరంలో గోల్కొండలో మహామారీ పీడ వచ్చింది. ఎందరో మరణించారు. పీర్ల పంజాలు, సాధువులు భజనలతో ఊరేగారు. అప్పుడు మహామారి తగ్గింది. దానికి గుర్తుగానే హైదరాబాదులో తాబూతు ఆకారంలో నేటి చార్మినార్ నిర్మాణం జరిగింది.
ప్రశ్న 22.
“ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే, ఆ పత్రిక ఆలోచనా ధోరణులనూ, దృక్పథాన్నీ అర్థం చేసుకోవచ్చు” దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వ్రాయండి. (March 2015)
జవాబు:
సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప చేసుకోవచ్చును.
పత్రికల్లోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణిని, ధృక్పథాన్ని తెలుసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సంపాదకీయం ఆ ప్రభుత్వానికి అద్దం పట్టి ప్రతి పనినీ, సమర్థిస్తూ వ్రాయబడుతుంది.
అదే ఈనాడు పత్రికైతే అందులోని సంపాదకీయాలు కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంపాదకీయాలుంటాయి. కాని ఈనాడు పత్రికలో సంపాదకీయాలు మంచిని ప్రశంసిస్తూ, చెడును విమర్శిస్తూ వ్రాయబడతాయి.
నిజానికి సంక్షేమ పథకాలు, ప్రకటనలు, కొత్తవేవీకావు. గత ప్రభుత్వాలు పాలించిన కాలంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి.
అయితే పత్రికలన్నీ సామాజిక బాధ్యతతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా విశ్లేషిస్తూ సంపాదకీయాలు వ్రాస్తే జగతి జాగృతం అవుతుంది.
ప్రశ్న 23.
సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సెయింట్ మదర్ థెరీసా
దీనజన బంధువు, కరుణామయి, విశ్వశాంతి నోబెల్ బహుమతి గ్రహీత, అయిన మదర్ థెరీసా పూర్తిపేరు, “ఆగ్నస్ గోన్షా బొజాక్షువా”. ఈమె యుగోస్లోవియాలో 1910 లో జన్మించింది.
మదర్ థెరీసాకు వాటికన్ సిటీలో పోప్ పునీత (సెయింట్) అనే హోదాను ఇచ్చారు. కలకత్తాలో ఎంటలీ ప్రాంతంలో ఈమె ఒక కాన్వెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉండేది.
ఆ పాఠశాల ప్రక్కన ఉన్న ‘మోతీజీన్’ మురికివాడలో పాకీవారు, కూలిజనం, కార్మికులు నివసించేవారు. అక్కడ అంతా దరిద్రం తాండవించేది. ఆ ప్రజల సముద్ధరణకు, థెరీసా కంకణం కట్టుకొంది.
థెరీసా, తినడానికి తిండిలేక, కట్టుకోడానికి బట్టలు లేక, బాధపడే అన్నార్తులకు, అసహాయులను ఆదుకోడానికి, అవతరించిన మాతృమూర్తి. ఈమె, అనురాగమయి. ఈమె అనాథ పసిపాపలను ఆదరించి, పెంచి, ప్రేమను అందించిన కరుణామయి. నిస్వార్థంగా పేదలకు సేవ చేసిన త్యాగమయి.
థెరీసా, మానవసేవయే మాధవసేవగా తలచి, పేదలకు మనశ్శాంతినీ, ప్రేమనూ అందజేసిన మానవతా మూర్తి. ప్రపంచ దేశాల నుండి, అనేక విరాళాలు, బహుమతులు ఈమె స్వీకరించి, భారతదేశంలోని అనాథలకు ఖర్చు చేసిన కరుణామయి. ఈమె అభాగ్యులకు, అనాథలకు అభయహస్తం అందించిన అమృత హృదయ.
మదర్ థెరీసా అందరికీ మాత. ఈమె విశ్వమాత. నిర్మల హృదయ్, నిర్మల శిశుసదన్, శిశుసదనాలు, శాంతినగర్, ప్రేమదాన్, వంటి సంస్థల ద్వారా అనాథలకు, వృద్ధులకు, కుష్ఠు రోగులకు, శరణార్థులకు, సేవలందించి నేడు సెయింట్ అయిన మదర్ థెరీసాకు నా అభినందనలు.
ప్రశ్న 24.
‘పరిసరాల కాలుష్యం’ – అనే అంశంపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
పరిసరమనగా మనచుట్టూ ఉన్నదే పరిసరమంటారు. మనచుట్టూ గాలి, నీరు, నిప్పు, నింగి, నేల మున్నగునవి ఉన్నాయి కదా ! మన ఆరోగ్యానికి ఆహారం, శరీర వ్యాయామం, పోషక పదార్థాలు ముఖ్యమైనవి. ఇవి అన్నియు పరిశుభ్రంగా ఉంటేనే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మానవుల చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మానవుల ఆరోగ్యం మరింత ద్విగుణీకృత ఆరోగ్యం కలుగుతుంది.
పరిసరాలు కాలుష్యానికి గురి కాకుండా చూడాలి. ముఖ్యంగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, జల కాలుష్యం ఏర్పడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వీనివల్ల ప్రాణవాయువు (ఆక్సిజన్) తగ్గిపోతుంది. విషవాయువులు పెరుగుతున్నాయి. వీనివల్ల మానవాళికే కాక, ఇతర ప్రాణిజాలం యొక్క మనుగడకు ముప్పు ఏర్పడుతోంది.
పరిశ్రమల నుండి బయటకు వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల నీరు కలుషితమౌతోంది. మురుగునీటిని శుద్ధిచేసి చెట్లకు వాడాలి. భూమి వేడెక్కకుండా రక్షించేది చెట్లు మాత్రమే. కనుక చెట్లను నరకకూడదు. చెట్ల వల్ల వర్షపాతం అధికమౌతుంది. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. భావితరాల వారికి కూడా పుష్కలంగా త్రాగునీరు, సాగునీరు లభ్యమౌతుంది.
నదీ జలాల్ని రక్షించాలి. ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసి, అమలు చేయడంలో నిర్దాక్షిణ్యంగా, కఠినంగా వ్యవహరిస్తే తప్ప లేకపోతే మానవ మనుగడకు ముప్పువాటిల్లుతుంది. ప్రజలు కూడా వీని ఆవశ్యకతను గుర్తించి కాలుష్యాల నివారణకు నివారణ చర్యలు చేసుకొన్నచో లోకకల్యాణం జరుగుతుంది. పరిసరాలు ఆరోగ్యవంతంగా ఉంటేనే జీవకోటి సురక్షితంగా
ఉంటాయి.
ప్రశ్న 25.
‘స్వచ్ఛభారత్’ ఉద్యమంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకతను తెల్పుతూ ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్వచ్ఛము అనగా నిర్మలము, ఆరోగ్యవంతమైన, తెల్లనైన అనే అర్థాలున్నాయి. స్వచ్ఛభారత్ అనగా భారతదేశమంతా నిర్మలమైన ఆరోగ్యవంతమైన దేశమని అర్థం.
దేశమంతా ఆరోగ్యవంతమైన వాతావరణం కలగాలంటే ఏం చెయ్యాలి. ప్రజలందరు వారి వారి గ్రామాల్లోను, పట్టణాల్లోను వీధులన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారాన్ని ఎత్తి ఒక కుండీలో వేయుట, వారానికి రెండు పర్యాయాలు తగులబెట్టుట వంటి పనులు చెయ్యాలి. ముఖ్యంగా డ్రైనేజివ్యవస్థను మెరుగుపరచి ప్రత్యేక కాలువల్లోకి మళ్ళించుట ఆ తర్వాత – ఆ మురుగునీరంతా సముద్రంలోకి వెళ్ళేదట్లు ఏర్పాటుచేయాలి.
దోమల బెడద లేకుండా క్రిమిసంహారక మందుల్ని పిచికారి చేయుట, ఫినాయిల్ ఎప్పటికప్పుడు చల్లుట వంటివి చేయాలి. చెట్లను నరకకుండా రక్షించాలి. ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటాలి. పర్యావరణ పరిరక్షణకుద్యుక్తులవ్వాలి.
ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను ప్రత్యేక ఖాళీస్థలాల్లో వేసి ఎప్పటికప్పుడు కాల్చివేయాలి. పరిశ్రమలనుంచి వెలువడు మురుగునీటిని శుద్ధిచేసి తర్వాత చెట్లకు వాడాలి.
భారతదేశమంతా పరిశుభ్రంగా ఉంచుటకై కోట్లాదిరూపాయల్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని నిజం చేసి, దేశం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుట ప్రజల కర్తవ్యము. అపుడే ‘స్వచ్ఛభారత్’కు నిజమైన ఆకృతి సాకారమవుతుంది.
ప్రశ్న 26.
‘మిషన్ భగీరథ’ పథకాన్ని గురించి, సొంతంగా ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ త్రాగునీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ అందించడానికి నడుం బిగించింది. ఈ పథకానికి ‘మిషన్ భగీరథ’ అని నామకరణం చేసింది.
పూర్వం ఇక్ష్వాకువంశంలో పుట్టిన దిలీపుని కుమారుడు భగీరథుడు. ఇతడు తన పితృదేవతల్ని ఉద్దరించడానికి, ఆకాశంలోనున్న గంగను నేలకు దింపి పాతాళానికి గంగాజలాన్ని తీసుకువెళ్ళే గొప్ప ప్రయత్నం చేసి, ఆ కృషిలో సఫలం అయ్యాడు. భగీరథునిలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో దూరంలో నున్న మంచినీటి గొట్టాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా మనిషికి 135 లీటర్లు చొప్పున అందించాలని ఈ ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామల్లో నేడు త్రాగునీరు దొరకక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు ఫ్లోరైడ్తో కలిసి, అనారోగ్యానికి దారితీస్తున్నాయి. ఇవన్నీ గమనించి, ఎంత ఖర్చు అయినా, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా, మంచినీటిని అందించారు, ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు పుష్కలంగా లభిస్తుందని ఆశిద్దాం.
ప్రశ్న 27.
‘మిషన్ కాకతీయ’ పవిత్ర యజ్ఞం గురించి సొంతంగా ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యేండ్ల క్రితం కాకతీయుల కాలంలో గణపతిదేవుడు తవ్వించిన 46,445 చెరువులు నీరులేక, పూడిక తీసేవారులేక అలానే ఉండిపోయినాయి. ఆ చెరువుల్ని పునరుద్ధరించినది తెలంగాణ ప్రభుత్వం. కనుక ఈ పథకానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.
ఈ చెరువులన్నింటిలో పూడికతీయుట, నీటితో నింపుట, చెరువుకట్లన్ని బలవంతం చేయుట ముఖ్యఉద్దేశ్యం. తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక సంకల్పం చేసింది. ఆయువుపట్టయిన ఈ చెరువుల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయుటకు నడుంబిగించింది. 46 వేలకు పైగా ఉన్న చెరువులన్నీ మళ్ళీ జలకళ లాడించేందుకు కంకణం కట్టుకున్నది. సదాశివ నగర్లోని పాతచెరువులో పూడిక తీయడంలో ప్రారంభం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చెరువుపై ఆధారపడిన సకల సామాజిక వర్గాల బతుకు చిత్రాన్ని మార్చేసింది. దీన్ని పవిత్ర యజ్ఞంగా భావించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు దీనిలో భాగస్వాములయ్యారు. ఆర్థికంగా అనేకమంది దాతలు లక్షలాది రూపాయల్ని మిషన్ కాకతీయకు దానమిచ్చారు. అనేకమంది శ్రమదానం చేశారు.
వర్షాధార పంటలకు నీటికొరత లేకుండా చెరువులు సాగునీటినిచ్చాయి. ప్రతి వర్షపుచుక్కను ఒడిసిపట్టి చెరువుల్ని నింపారు. ఈ చెరువుల క్రింద వేల ఎకరాలు సాగులోనికి వచ్చాయి. పంటలు అనుకున్నదానికంటే అధికంగా పండాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాదిరూపాయల్ని ఖర్చు చేస్తోంది. రాష్ట్రమంతా సస్యశ్యామలమై దరిద్రాన్ని పోగొట్టారు.
ప్రశ్న 28.
“అన్నం మెతుకును చూచి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అలాగే పుస్తక పరిచయ వ్యాసాన్ని (లేదా) పుస్తక సమీక్షను చదివితే, ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రమంగా తెలుసుకోవచ్చు” ఎట్లాగో వ్రాయండి.
జవాబు:
ఒక పుస్తకం యొక్క లక్షణం, శైలి, రచనా విధానం, దాని తత్త్వం, పుస్తకం ద్వారా రచయిత లేక కవి చెప్పదలచిన అంతరార్థం, వాని దృక్పథాన్ని, వానిలో నిబిడీకృతమైయున్న సారాంశాన్ని పుస్తక పరిచయ వ్యాసం ద్వారా పాఠకులకు తెలియజేస్తాడు. దీనికే ముందుమాట, పీఠిక, తొలిపలుకు, ఆముఖం, ప్రస్తావన, మున్నుడి మున్నగు పేర్లు కలవు.
ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాల్ని పుస్తక పరిచయకర్త పాఠకులకు తెలియజేస్తాడు. అంతేకాక ఆ పుస్తకంలో రచయిత లేక కవి వివరించిన తీరు, అందులోని మంచిచెడ్డలు, పుస్తక పరిచయకర్త లేక సమీక్షకుడు తెలియచేస్తాడు.
ఉదాహరణకు ‘భూమిక’ అను ప్రస్తుత పాఠాన్ని చదివితే కేశవస్వామి తన కథల్ని రెండు భాగాలుగా 1969, 1981 సంవత్సరాలలో విడుదల చేశాడని తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి, భారత్లో విలీనం అయ్యేవరకు హైదరాబాదు రాజ్యం చరిత్ర, ఈ కథలు తెలుపుతాయని తెలుస్తోంది. హైదరాబాదులోని సామాజిక పరిణామాలు, ఈ పుస్తకంలో ఉన్నట్లు తెలిసింది.
కేశవస్వామి రచనల్లో హైదరాబాదు జీవభాషను చిత్రించినట్లు కూడా తెలుస్తోంది. కేశవస్వామి కథలు చదివితే, కేశవస్వామి హృదయం వెల్లడవుతుందని తెలుస్తోంది. కేశవస్వామి కథలలోని సారాంశం, దీనివల్ల టూకీగా తెలుస్తుంది.
అందుచేత గూడూరి సీతారాం రాసిన పుస్తక పరిచయాన్ని చదవడం వల్ల, నెల్లూరి కేశవస్వామి గురించి, ఆయన రచనల గురించి, ఆ రచనలలోని కథాంశాల వైవిధ్యం గురించి, రచయిత హృదయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు.
ప్రశ్న 29.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారో వ్యాసంగా రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు గల సంపన్న రాష్ట్రము. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడం, తెలంగాణ ప్రజలకు అలవాటు. అలాంటి రాష్ట్రం చాలాకాలం నుండి పరాయివారి పాలనలో అణగారిపోయింది. నైజాం కాలంలో ప్రజలు ఎన్నో కడకండ్లు అనుభవించారు. సామాజిక జీవనం ఛిన్నాభిన్నమయ్యింది. 1948లో పటేల్ చొరవతో తెలంగాణ ప్రాంతము ఇండియన్ యూనియన్లో ఏకమై స్వాతంత్య్రం పొందింది.
1956లో తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రాంతంతో కలిసింది. ఆంధ్రప్రాంత పాలకులు, తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. దానితో ప్రజలకు తెలంగాణ వేరు రాష్ట్రం కావాలనే ప్రగాఢమైన కోరిక కల్గింది.
అందుకే. కవులు, కళాకారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. 1969 డా॥ మర్రి చెన్నారెడ్డిగారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు మహోద్యమం నడిచింది. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలు వదిలారు.
తరువాత కె.సి.ఆర్ నాయకత్వంలో సుమారు దశాబ్దంపాటు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. సకలజనుల సమ్మె జరిగింది. చివరకు 2014 జూన్ 2న, ప్రత్యేక రాష్ట్రం ప్రజల కోరిక మేరకు సిద్ధించింది. చిరకాల వాంఛ నెరవేరినందున, జాతిచరిత్రలో, దీనిని అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.
ప్రశ్న 30.
నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెల్పండి.
జవాబు:
సమాజం అనగా సమూహమని అర్థం. మానవ సమాజం అనగా మానవాళి సమూహమని అర్థం. “పరోపకారార్థమిదం శరీరం” – అన్నట్లుగా ఈ శరీరం ఉన్నది తోటివారికి సహాయం చేయుట కొఱకేనని అర్థం. సమాజంలో నున్న మానవులు ఒకరికొకరు సహాయసహకారాలందించు కొన్నప్పుడు సమాజాభివృద్ధి జరుగుతుంది. దరిద్రం అన్న మాటలు ఆ సమాజంలో ఉండవు.
ఈనాటి సమాజంలో ధనవంతులు – దరిద్రులు ఉన్నారు. దరిద్రునికి కావలసింది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కావాలి. త్రాగడానికి సరియైన నీరు కూడా లభించని ప్రాంతాలనేకం ఉన్నాయి.
ధనవంతులు తమ శక్త్యానుసారం దాతృత్వం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు పేదవానికి ఇతోధికంగా సహాయం అందించాలి. నేడు చాలామంది ధనవంతులు తమ డబ్బును ఇతర దేశాల్లో దాచుకుంటున్నారు. ప్రభుత్వానికి కట్టవలసిన ఆదాయం పన్ను ఎగకొడుతున్నారు. కాని ఒక్క విషయం ధనవంతులు గుర్తుంచుకోవాలి.
ఏ వ్యక్తి అయినా ప్రాణం పోయిన తర్వాత దాచుకొన్న ధనం అక్కరకు రాదు కదా ! ఎంతటి ధనవంతుడైన తినేది లవణమూ, అన్నమే కదా ! బంగారాన్ని, ధనాన్ని తినలేడు. ఈ నగ్న సత్యాన్ని గ్రహించి దాతృత్వాన్ని అలవాటు చేసుకొన్న యెడల ఒకరికి సహాయం చేసిన పుణ్యమే తాను మరణించిన తదుపరి వెంట వస్తుంది.
మన భారతదేశంలో చాలామంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులున్నారు. వారు కనక ధర్మకార్యాలు చేస్తే మనదేశ ప్రగతి సాధిస్తుంది. బిల్ గేట్స్, విప్రో అధిపతి ప్రేమ్జీలా, తాతా బిర్లాల వలె తమ సొమ్ములో కొంత భాగాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి. దీనివల్ల ఆత్మ సంతృప్తి, పుణ్యం లభిస్తాయి. పుణ్యం కంటికి కనిపించదు. మరణించిన తదుపరి ఆ పుణ్యం గొప్పదనం కన్పిస్తుంది. పేదవాళ్ళ ముఖాల్లో నవ్వుల పువ్వులు విరబూస్తాయి.
ప్రశ్న 31.
స్త్రీ విద్యా ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తూ నీ సొంతమాటలతో వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. పిల్లల్ని కని, పెంచి పెద్దవారిగా చేసి తీర్చిదిద్దెడి తల్లులు విద్యావంతులైనచో సంఘానికి కలిగే ప్రయోజనం ఇంతింతయని చెప్పుటకు వీలులేదు.
అత్యంత ప్రాచీనకాలంలో స్త్రీలు బ్రహ్మ విద్యా వివరణ చేసినట్లు తెలియుచున్నది. బ్రహ్మచారిణులై ఉపనిషత్తులపై చర్చలు జరిపారు. తర్వాతి కాలమందు కవయిత్రులై పలు భాషల్లో గ్రంథాల్ని రచించారు. లీలావతి వంటి గణిత శాస్త్రజ్ఞురాలు, విదుషీమణి మనకు చరిత్ర చెబుతున్నది.
ప్రస్తుతం స్త్రీలకు అనేక సౌకర్యాలు కలిగాయి. స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విద్యాలయాలు వెలిశాయి. స్త్రీలు చాలా ఉద్యోగాల్ని సంపాదించుకొని వన్నెకెక్కుచున్నారు.
మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకై గాంధీ మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయమే ప్రధానంగా చేర్చాడు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యమిచ్చాడు. ఆధునికయుగంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యకై మొట్టమొదట ఒక పాఠశాలను స్థాపించి కృషి చేశారు. ఆ కారణంగా క్రమక్రమంగా స్త్రీ విద్య వ్యాప్తిలోనికి వచ్చింది.
విద్యావంతురాలైన భారత మహిళ ‘విజయలక్ష్మి పండిట్’ ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలై వన్నెకెక్కింది. శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా చేసి కీర్తిని సంపాదించింది. నేటి కాలంలో అనేకమంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా, స్పీకర్లు, రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా, శాస్త్రజ్ఞులుగా, క్రీడాకారులుగా వివిధ పదవుల్ని అలంకరించి ఖ్యాతిని పొందారు.
స్త్రీలు తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుచున్నారు. నేడు అధిక సంఖ్యలో స్త్రీలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సమర్థతతో నిర్వహించుచున్నారు. పాఠశాలల్లో N.C.C మున్నగు యుద్ధ విద్యా శిక్షణాన్ని కూడా పొంది అబలలు సబలలని నిరూపించుచున్నారు. కనుక స్త్రీ విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కలుగుతుందనుటలో అతిశయోక్తి లేదు.
ప్రశ్న 32.
ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా సామాజికాంశం / సంఘటనలు ఆధారంగా, సంపాదకీయ వ్యాసం రాయండి.
జవాబు:
“సెల్ఫీల పిచ్చి”
ఇటీవల మన ప్రధాని నరేంద్రమోడీ, చైనాను సందర్శించినపుడు ఆ దేశ ప్రధానితో సెల్ఫీ తీసుకున్నట్లు వార్త వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ వ్యామోహంలో, ఈ సెల్ఫీలు తీసుకొనే ధోరణి, నేడు ఒక వైరస్ వ్యాపించింది. మనదేశ ప్రధానికి, సెల్ఫీ వ్యామోహం ఉండడం ఒక విచిత్రం.
నిజానికి సెల్ఫీ తీసుకోడం, తప్పుకాదు. కొత్తరకం ఫోన్లో కెమెరా సౌకర్యం ఉండడం వరకు బాగుంది. కాని నేటి యువత, ఈ సెల్ఫీల మోజులో ఎంతో సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. సెల్ఫీ తీసుకోవడం, దాన్ని నెట్వర్క్ పోస్టు చేయడం, దానిపై వచ్చే వ్యాఖ్యలను చూసి మురిసిపోవడం లేదా బాధపడడం జరుగుతోంది. ఒకొక్కప్పుడు కొంతమంది, ఆ బాధతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.
ఈ పిచ్చి ఇలా ముదిరిపోయింది. ఒకడు వచ్చే రైలుముందు నిలబడి, ఫోటో తీసుకోవాలని, పట్టాల మీద నిలబడి ప్రాణం పోగొట్టుకున్నాడు. మరొకడు మంటలముందు హీరోయిజాన్ని ప్రదర్శించబోయి సజీవదహనం అయ్యేడు. మరొకడు కొండ ఎక్కి సెల్ఫీ తీసుకోబోయి, కొండ నుండి జారి తల పగిలి చచ్చాడు. ఒకడు ఇళ్ళు కాలి, గుండె పగిలి ఏడుస్తూంటే, సెల్ఫీ తీసుకున్నాడు.
ఇవన్నీ మనిషిలోని మనిషి మాయమయ్యాడని చెపుతున్నాయి. అతనికి ఫోటో తప్ప, మరేమి ముఖ్యం కాదు. ఈ మానసిక జాడ్యాన్ని అరికట్టాలి. సెల్ఫీ అంటే మనని మనం, సమీక్షించుకోవడం. అంతేకాని ‘సెల్ఫీ’ అంటే ఫోటో కాదని యువత గుర్తించాలి. ఆ రోజు త్వరగా రావాలని ఆకాంక్షిద్దాం.
ప్రశ్న 33.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్రను గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాప్రతినిధులు, అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ, రాజకీయ వేదికలపైనా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతను గొంతెత్తి చాటారు. ఎన్నో పర్యాయాలు అసెంబ్లీని, పార్లమెంటునూ, స్తంభింపచేశారు. సామాన్యంగా రాజకీయ నాయకులకు పదవీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. కాని తెలంగాణ రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్ర సాధనకై తమ పదవులను తృణప్రాయంగా, చాలాసార్లు విడిచి పెట్టారు. అన్ని పార్టీల వారు తమకు వేరు రాష్ట్రం కావాలని కేంద్రానికి లేఖలు ఇచ్చారు.
వివిధ పార్టీల వారికి తమలో తమకు, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్న, రాష్ట్ర సాధన విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తపరచారు. టి.ఆర్.యస్ పార్టీ తరఫున కె. చంద్రశేఖరరావుగారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి, అహింసా పద్ధతులలో ఉద్యమాన్ని ముందుకు నడిపించి, విజయం సాధించారు.
కె.సి.ఆర్ గారు రెండుసార్లు తమ యమ్.పి. పదవులకు రాజీనామా ఇచ్చారు. కేంద్రమంత్రి పదవిని సైతం త్యాగం చేశారు. 1969లో డా॥ మర్రి చెన్నారెడ్డిగారు తెలంగాణ ప్రజాసమితి పేరున మహోద్యమాన్ని చేపట్టారు. ఆయన నగరంలో విద్యార్థుల సహకారంతో, కేంద్రప్రభుత్వాన్ని కదలించారు. ఆనాడు ఇందిరాగాంధీకి ఎదురుగా నిలిచి ఆయన 10 మంది ఎమ్.పి.లను నెగ్గించుకున్నారు.
ఈ విధంగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో, రాజకీయ నాయకులే, ప్రధానపాత్ర వహించి విజయాన్ని సాధించారు.
ప్రశ్న 34.
‘తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతం, చాలాకాలం సుల్తానుల పాలనలో ఉంది. తరువాత ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను ధ్వంసం చేసి, తాను ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
చివరి నైజాం నవాబు కాలంలో సుల్తాను రజాకార్లను పంపి తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు. ఆ నవాబు కాలంలో ప్రజలు నైజాం పాలన నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున విముక్తి పోరాటం సాగించారు. తెలంగాణలోని గడ్డిపోచ కూడా కత్తి పట్టి నిజాం పాలనను ఎదిరించింది. చివరకు ఆనాటి మన ఉపప్రధాని పటేలు పోలీసు యాక్షన్తో నైజాం నవాబు తోక ముడిచాడు. అప్పుడే తెలంగాణము భారత యూనియన్లో కలిసి 1948లో స్వతంత్ర రాష్ట్రమయ్యింది.
తరువాత హైదరాబాదులోని తెలుగువారు, ఆంధ్ర ప్రాంతంలోని తెలుగువారితో కలిసి ‘మహాంధ్ర’ ఏర్పడాలని “మహాంధ్ర” ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలించి, 1956లో హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
తరువాత తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విడదీయాలని మర్రి చెన్నారెడ్డి గారు 1969లో పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. 9 నెలలపాటు పాఠశాలలు, కళాశాలలు ‘బందు’ అయ్యాయి. తిరిగి 1973 లో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. తరువాత మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున పొంగింది. ఉద్యోగులు, విద్యార్థులు, సకలజనుల సమ్మె చేశారు. వంటావార్పు రోడ్డు ఎక్కింది.
చివరకు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పై చరిత్రను చూస్తే తెలంగాణ ‘పోరాటాల పురిటిగడ్డ’ అని చెప్పవచ్చు.
ప్రశ్న 35.
‘సత్యమేవ జయతే’ అన్న మాటను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
“ధర్మాత్ములైన వారిని సత్యం అనే నావ ఎటువంటి విపత్తుల నుంచి అయినా దరిచేర్చగలుగుతుంది.” – అని ఋగ్వేదం చెబుతోంది. అసలు సత్యం అంటే – ఏది శాశ్వతమో అదే సత్యం. “సత్పురుషుల యందు పుట్టునది సత్యము” అని శబ్ద రత్నాకరం తెలుపుతోంది. సత్యం ఒక మహావృక్షం. దానిని మనం ఎంతగా పోషిస్తే అది అంతగా ఫలాలనిస్తుంది. లోకంలో అందరూ సత్యాన్ని గురించి మాట్లాడేవారే కాని కొందరే దానిని పాటించేది. ఇది బాధాకరమైన విషయం. ప్రస్తుత సమాజంలో సత్యం ఉరికంబంపైన ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అసత్యం సింహాసనంపైన కులుకుతోంది. సంతోషానికి సద్గుణాలే ఆధారం కావాలి. సత్యం దానికి విధిగా పునాది అవ్వాలి. అప్పుడే భూమి స్వర్గం అవుతుంది. సత్యం కరదీపిక. దానిని కదిపేకొద్దీ ప్రకాశవంతమవుతుంది.
సత్యాన్ని అనుసరించడానికి కావలసింది సాహసం ఒక్కటే అంటారు గాంధీజీ. సత్యం కోసం అన్నీ త్యాగం చేయవచ్చు. కాని, సత్యాన్ని దేనికోసమూ త్యాగం చేయకూడదు. నిజం చేదుగా ఉంటుంది. అబద్దం అతిమధురంగా ఉంటుంది. కాని శాశ్వతత్వం ఉండేది నిజంతోనే.
తాత్కాలిక సుఖాలకోసం శాశ్వత కష్టాలను కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కష్టంగా కనిపించినా సుఖాన్నిచ్చేది, భూమిపై శాశ్వత కీర్తినిచ్చేది మాత్రం సత్యమే. ‘సత్యం వద – ధర్మం చర’ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సత్యమార్గం వీడక హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడనే కీర్తి పొందాడు.
సత్యం ఆధ్యాత్మికత యొక్క అతి ముఖ్య లక్షణం. నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అంతకుమించిన ధైర్యం ఉండాలి. అలాగే సత్యాన్వేషి అయిన మానవుని మనస్సు భూమిపైన స్వర్గం వంటిది. “సత్యంచే సకలార్ధ సాధకమగున్…..” అని చెప్పిన బలిజేపల్లి వారి మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడే లోకం కృతయుగాన్ని తలపిస్తుంది. సత్యమే ఎప్పటికి యిస్తుంది. జయాన్నిస్తుంది.
ప్రశ్న 36.
భాషకు అలంకారాలు పలుకుబడులు, నుడికారాలు అని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మనోగత హావభావాలను తెలియజేసేది భాష, భాష వల్ల మానవుని సభ్యత, సంస్కారం, సంస్కృతి తేటతెల్లం అవుతాయి. మాట్లాడే భాష ప్రజల భావాలకు అద్దంపట్టాలి. సునిశిత హాస్యం, వ్యంగ్యోక్తి, లాలిత్యం, లోకానుభావం, విమర్శనా వైశిష్ట్యం, మార్గదర్శకత్వం మొదలైన అన్ని అంగాలనూ కలిగి ఉండి, నిత్య జీవితంలో జరిగే అతి చిన్న సంఘటననూ, సాంఘీక జీవనంలోని లోతులనూ సంపూర్తిగా ఎత్తి చూపిస్తుండాలి.
ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి స్వభావాన్ని గానీ, మరేదైనా గానీ ముఖాముఖీ విమర్శించలేనప్పుడు నర్మ గర్భంగా, అన్యోపదేశంగా ఆ వ్యక్తి తప్పొప్పుల్ని, స్వభావాన్ని విమర్శించడం జరుగుతుంది. చెప్పదలచుకున్న భావాన్ని మనసుకు హత్తుకొనే విధంగా చెప్పడానికి మనం ‘నుడికారాలు’ ప్రయోగిస్తాం. పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాన్నిస్తుంది.
పలుకుబడి అంటే ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే ‘యాస’ అంటారు. యాసలో మాట్లాడితే, ఆ ప్రాంతం వారికి వినసొంపుగా ఉంటుంది. మాండలిక యాసతో కూడిన పలుకుబడి, వినడానికి అందంగా, అలంకారంగా ఉంటుంది. నుడికారం అంటే ‘మాట చమత్కారం’. ఈ నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి,
ఆచార వ్యవహారాల్లోంచి పుడుతుంది. చెప్పదల్చుకున్న భావం మనస్సుకు హత్తుకుంటుంది. నుడికారాలు జాతీయాలుగా, సామెతలుగా ఉంటాయి. నుడికారం వల్ల చమత్కారం, దాని వల్ల ఆనందం కలుగుతాయి. అందుకే అది అలంకారం. ఇక జాతీయం అంటే విశిష్ట పదబంధం. జాతీయాలను పలుకుబళ్ళు, నుడికారాలు అని కూడా అంటాం. నుడికారం, పలుకుబడి అన్నవి ఆ భాషకు మాత్రమే సాధ్యం.
జాతీయం ఆ జాతి వాడుకలో రూపుదిద్దుకుంటుంది. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో మరో అర్థం వస్తుంది. ‘చేతికి ఎముక లేదు’ అనే జాతీయం బాగా దానాలు చేస్తాడనే భావాన్నిస్తుంది. అలాగే ‘కళ్ళలో కారం పోసుకుంటాడు”.
సామెతల విషయానికొస్తే మాట్లాడే భాషకు నవ్యత్వం, పురిపుష్టిని కల్గించేవి సామెతలు. సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే. అనుభవించిన అనుభవానికీ, అనుభూతికి అక్షరరూపం సామెత. జీవితాన్ని కాచివడపోసిన సత్యం సామెత. అనుభవం గడించిన భావావేశంలో వెలువడినవి కాబట్టే సామెతలలో ఒక విధమైన ప్రాస, లయ ఉన్నాయి. కొండంత భావం సంక్షిప్త రూపంతో వీటిలో ఇమిడి ఉంది.
అందుకే ‘తేట తేనెల ఊట తెలుగు సామెత’ అన్నారు. సామెతలను రచించిందీ, పోషించిందీ ప్రజలే. అనంతమైన భావాన్ని ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పగలిగే సామాన్య ప్రజా భాషా . ప్రక్రియ సామెత. అందుకే “సామెత లేని మాట – ఆమెత లేని యిల్లు” అనే సామెత పుట్టింది. సామెతలు చిన్నవైనా, పెద్దవైనా అర్థాన్ని విశ్లేషించి చూస్తే సూటిగా ప్రజల మనసు లోతుల్ని తాకి, ఆలోచనా స్రవంతిని కదిలించి చైతన్యవంతుల్నిగా చేసే విజ్ఞాన భాండాగారాలు. “అయిదు శిఖలున్నా ఇబ్బంది లేదు కానీ మూడు కొప్పులు చేరాయంటే ముదనష్టమే”, “అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు”, “పిట్ట కొంచెము – కూత ఘనము” వంటివి ఎన్నో తెలుగుభాషను సుసంపన్నం చేస్తున్నాయి.
పలుకుబడి, నుడికారం, జాతీయం అనేవి భాషకు అలంకారాల వంటివి అని చెప్పడంలో సందేహం లేదు.
ప్రశ్న 37.
చదువు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
జవాబు:
“దేనివల్ల శీల నిర్మాణం జరుగుతుందో, దేనివల్ల వ్యక్తి వికాసం పెంపొందుతుందో, మానసిక శక్తి విస్తృతమౌతుందో, సాంస్కృతిక చైతన్యం ఎక్కడైతే కలుగుతుందో, మానవుడు తన కాళ్ళపై తాను ఎప్పుడైతే నిలబడగలుగుతాడో అదే విద్య పరమావధి కావాలి” అన్న స్వామీ వివేకానంద మాటలను మనం గుర్తుచేసుకోవాలి.
చదువుకోవడం వల్ల సమాజం చైతన్యవంతం అవుతుంది. విచక్షణ కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనం చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.. మూఢాచారాలు నశిస్తాయి. ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా ఆలోచిస్తాము. దురలవాట్ల వల్ల కలిగే అనర్థాలు తెలిసి, మానివేస్తాము. ఉపాధి దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది. ఈ భావాలనే….
శ్లో॥ “విద్యాదదాతి వినయం – వినయం ద్యాతి పాత్రతామ్ |
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖమ్ || (హితోపదేశం)
పోతన తన భాగవతంలో “చదువని వాడజ్ఞుండగు” అంటూ చదువు యొక్క పరమార్థాన్ని వివరించారు. దేశం అభివృద్ధి సాధించాలంటే, అక్షరాస్యత శాతం పెరగాలన్న గాంధీజీ మాటలను వేదవాక్కుగా భావిద్దాం.
“విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళిన్” అని ఏనుగు లక్ష్మణ కవి ; దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు ; భ్రాతృజనము వచ్చి పంచుకోరు ; విశ్వవర్ధనంబు విద్యాధనంబురా” అని కరుణశ్రీ విద్య విశిష్టతను తెలిపారు.
మనోధైర్యాభివృద్ధితో బుద్ధి వికాసం పొంది, మానవుడు తన కాళ్ళపై నిలువగల శీలాన్ని నిర్మించుకోగల విద్య మనకు అవసరం. విద్య అనే వృక్షంలో వేళ్ళు చేదుగా అనిపించొచ్చేమో గానీ అది అందించే ఫలాలు మాత్రం చాలా మధురం.
ప్రశ్న 38.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాటను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘శ్రీశైలం, కాళేశ్వరం, దాక్షారామం’ ఈ మూడు దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించారు. ఈ ప్రాంతం త్రిలింగదేశంగా పిలువబడింది. ఇదే కాలగమనంలో ‘తెలంగాణ’ అనే పదంగా మారింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఎందరో మహనీయుల కృషితో పాటుగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పనిచేసి విజయం సాధించారు.
ప్రాచీన కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. 10వ శతాబ్దంలో మంథాన భైరవుడు భైరవతంత్రం, 13వ శ॥ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఇలా ప్రారంభమై పోతన, దాశరథి, సి.నా.రె వంటివారు గొప్పకవిత్వం ఈ నేలలో పండించారు. రామప్పగుడి, కాకతీయ శిల్పం, చార్మినార్ వంటి అపురూప కట్టడాలతోను, భద్రాద్రి, మెదక్ చర్చి, ఎన్నో ప్రాచీన దర్గాలతో సర్వమత సమానత్వాన్ని ఈ నేల చాటుతున్నది.
అన్ని సంస్కృతులకు సంగమమైన భాగమతి ప్రేమ కానుకగా నిర్మించిన భాగ్యనగరం భారతదేశంలోనే గొప్ప నగరాలలో గొప్పది. రామదాసాది భక్తాగ్రగణ్యులు వాగ్గేయకారులుగా వెలుగొందారు. గోలకొండ కోట మన ఘనచరిత్రకు తార్కాణం. గోదావరి, కృష్ణ, మంజీరా, ప్రాణహిత, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు మున్నగు నదులు ప్రవహించి ఈ నేలను సస్యశ్యామలం చేశాయి.
విప్లవ వీరులకూ, కళలకూ, ఘన సంస్కృతికీ, అపురూప శిల్పాలకూ, ప్రఖ్యాతి వహించిన సరస్వతీ దేవాలయం గల బాసర వంటి పుణ్యక్షేత్రాలకూ, తీర్థాలకూ నిలయం ఈ గడ్డ. నీలగిరి, గోలకొండ, హితబోధిని లాంటి పత్రికలు రాకతో సాహిత్యం మరింత వృద్ధి చెందింది. హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరొందిన భాగ్యరెడ్డివర్మ ఇక్కడివాడే.
సరోజినీనాయుడు, మిద్దెరాములు, కొండా లక్ష్మణ్ బాపూజీ, దేవులపల్లి రామానుజరావు, పి.వి. నరసింహారావు, బిరుదురాజు రామరాజు, జమలాపురం కేశవరావు, టి.యస్.సదాలక్ష్మి, రాంజీ గోండు, సురవరం ప్రతాపరెడ్డి మొ||వారు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.
వచ్చింది వచ్చింది నా తెలంగాణ తెచ్చింది తెచ్చింది బంగారు నజరానా.
ఏనాటికలలో ఫలించిన శుభతరుణంలో – మురిసింది మురిసింది తెలంగాణ.
ప్రశ్న 39.
‘సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలడం’ అనే అంశాన్ని వ్యాసంగా రాయండి.
జవాబు:
మన సంఘంలో ఎన్నో నమ్మకాలు ఆచారంగా వస్తున్నాయి. వాటిలో కొన్ని నమ్మకాలు దురాచారాలై పీడిస్తున్నాయి. ఇవే మూఢనమ్మకాలు. అంటే తోటి మానవులను, కొన్నిసార్లు వారినే బాధించేవి. మూఢనమ్మకాలు ఏవంటే దెయ్యాలు, చేతబడులు, శకునాలు వంటివి నమ్మడమే. ఇంకా పురుడు, మైల, పూజ, మడి, అంటు, కఠినమైన ప్రమాణాలు వంటివి కూడా మూఢనమ్మకాల జాబితాలో చేరతాయి.
పూర్వం బాల్య వివాహాలు, సతీ సహగమనం దురాచారాలు ఉండేవి. తర్వాత కాలంలో భర్త చనిపోయిన స్త్రీలకు తలవెంట్రుకలు తీయించి, తెల్లచీర కట్టించి, మంగళద్రవ్యాలు వాడనీయకుండా మూలన కూర్చోబెట్టారు. అంతేకాక వీరు ఎదురొస్తే వెళ్ళే పనికాదని, వీళ్ళు శుభకార్యాలకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇప్పటికి అవి అమలవుతూనే ఉన్నాయి.
దెయ్యాలున్నాయని కొందరు భయపడుతుంటే, చేతబడులున్నాయని మరికొందరు భయపెడుతున్నారు. పిల్లలు లేని తల్లులను లక్ష్యంగా చేసుకొని కొందరు బురిడీ బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. రాగి, ఇత్తడి, ఇనుము వంటి వాటిని బంగారం చేస్తామని ప్రజలకు ఆశ కలిగించి మోసం చేస్తున్నారు. పై వాటిలో మనం గమనించుకొంటే మనోధైర్యం లేకపోవడం అతిగా నమ్మడం, అత్యాశకు పోవడం అనేవి మనలోని బలహీనతలు. వాటిని ఆధారం చేసుకొని నమ్మకాన్ని కల్గించి వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు.
ఎందరో సంఘసంస్కర్తలు రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులుగారు, గురజాడ, చిలకమర్తి వంటి మహాత్ములు, ఈ మూఢ నమ్మకాలు తొలిగించడానికి కృషి చేశారు.
మంత్రాలకు చింతకాయలు రాలడం, పూజలు చేస్తే పిల్లలు పుట్టడం ఇవన్నీ వట్టి పిచ్చి నమ్మకాలు. నేటి యువత అభ్యుదయ దృష్టితో ముందుకు సాగాలి. ‘కష్టేఫలీ’ అని గుర్తించి, శ్రమ చేస్తేనే ఫలితం అన్న సంగతి మరువకూడదు. మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఎవరైనా మోసం చేయడానికి అవకాశం. కనుక దేనికోసం ఎదురు చూడకుండా ధర్మంగా, న్యాయంగా పని చేసుకుంటూ ముందుకు నడవాలి.
ప్రశ్న 40.
భిక్షాటన ఎంతవరకు సమంజసమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో ‘భిక్ష’ అనే మాట ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది. నిజానికి ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి చెందాడు. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవారు. గౌతమబుద్ధుడు భిక్షా వృత్తితోనే జీవనం సాగించాడు. గురుకులంలో చదువుకొనే రాజకుమారులు సైతం, భిక్షాటనతోనే విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్షపెట్టడం అన్నది, ఒక మహాపుణ్యకార్యంగా భావించేవారు. ఎవరికి భిక్ష ఇవ్వాలో మనుచరిత్రలో ఇలా చెప్పబడింది – “బధిర పగ్వంధ, భిక్షుక, బ్రహ్మచారి జటి పరివ్రాజకా తిథి క్షపణ కావధూత కాపాలి కాద్యనాథులకు” అని.
శంకరాచార్యులు భిక్షాటనతోనే జీవించారు. భాగవతంలో రంతిదేవుని కథలో రంతిదేవుడు ఉంఛ వృత్తితో అన్నాన్ని సేకరించాడు. భారతంలో కౌశికుడు మాధుకరీయం చేసుకొని జీవించినట్లు ఉంది. ఎవరికైనా బీదలకు దానధర్మాలు చెయ్యడం కర్తవ్యమనీ మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఎవరైనా గతిలేనప్పుడు భిక్షకి బయలుదేరతాడు. అటువంటి వారికి భిక్షమెయ్యడం సబబు. అంగవైకల్యం, వృద్ధ, బాల, స్త్రీలకు భిక్ష వేయడం ధర్మం. వారు కష్టించి పనిచేయలేరు కనుక.
ప్రస్తుతం సమాజంలో అడుక్కోవడం ఒక వృత్తి అయ్యింది. ఆఖరికి ఆరోగ్యంగా, వయసులో ఉన్న వ్యక్తులు అయ్యప్పమాల ధరించామనో, ఇంకేదో అనో ఊరూరా, ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుతున్నారు. ఇవ్వకపోతే సాక్షాత్ దేవుడే వచ్చి శపిస్తాడన్న ఫీలింగ్ చూపిస్తాడు. ఇంకొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తిరుగుతూ లేని రోగాలను నటిస్తూ, పిల్లకు పెళ్ళి చేయాలని, ఇల్లు కాలిపోయిందని, చెబుతూ డబ్బులు దండుకోవాలని చూస్తుంటారు. వీరిలో కొందరు నిజం చెప్పవచ్చు కూడా. ఇవన్నీ ఆధునికులైన చాలామందికి నచ్చకపోవచ్చు.
కుంటి, గ్రుడ్డి వికలాంగులై అడుక్కునే అర్హత గల బిచ్చగాళ్ళను ఒకచోటికి చేర్చి వారికి దాతలు భోజనం ఏర్పాటు చేయాలి. వారికి విరాళాలు ఇచ్చి, అన్న సత్రాల నిర్వహణను సంఘంగా ఏర్పరచి నిర్వహించాలి. నిజమైన బిచ్చగాళ్ళకు ఆదరణతో పెట్టాల్సిందే. వృత్తిగా చేసేవారికి వేయకపోవడమే మంచిది.
ఒకసారి గాంధీగారు శరీరం బాగున్న బిచ్చగాడితో “నీవు ముట్టెత్తుకోపోతే పని చేసుకోరాదా ?” అన్నారట, వెంటనే వాడు తన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి, అడుక్కోవడం ‘నా వృత్తి. ఇష్టమైతే పెట్టు, లేకపోతే మాను, అన్నాడట. ఇట్లాంటి వారిని చూస్తే పెట్టేవాళ్ళకి కూడా పెట్టుయ్యటం లేదు.
ప్రశ్న 41.
“అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది” అని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని పెద్దలమాట. ఆకలితో ఉన్నవానికి గుప్పెడు అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకొంటాడు. అదీ అన్నం విలువ. దానాలు అనేక రూపాల్లో చేయవచ్చు. విద్య, ధనం ఇలా ఏదొక రూపంలో దానాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువమంది అన్నదానాన్ని ఇష్టపడతారు. కారణం మనవల్ల ఒక పేదవాడు ఒక్కపూటైనా కడుపునిండా తినగల్గుతున్నాడనే సంతృప్తి. కనుకనే “అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న” అనే భావన లోకంలో ఉంది.
దేశంలో ఏ సమస్యనైనా ఒకనాటికి కాకపోతే మరొక నాటికైనా తొలిగించవచ్చునేమో గాని ఆకలి సమస్యను ఎవరూ తీర్చలేడు. ఉన్నవాడు అజీర్తితో బాధపడుతుంటే లేనివాడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు “అన్నమో రామచంద్ర” అన్న మాటలు మన చెవులలో మారు మ్రోగుతున్నాయంటే ఆకలి ఎంతగా బాధిస్తుందో కదా ! అందుకే పెద్దలు ఎక్కడ అన్నదానం జరుగుతున్నా దానిలో వారు భాగస్వాములౌతారు. కారణం వారికి అన్నం విలువ, ఆకలి విలువ తెలుసు.
“దానం చేసే అవకాశం దక్కడం మన భాగ్యం అది తెలుసుకోవడం వల్లనే మనం పురోభివృద్ధి చెందుతున్నాం” అని స్వామి వివేకానంద దానమహిమను తెలియజేశారు. “ఆ కొన్నఁగూడెయమృతము” అన్న బద్దెన మాటలు అక్షరసత్యాలు. అన్నదానం తానే స్వయంగా స్వహస్తాలతో చేయడానికి ప్రతి ఒక్కరికీ వీలైనది. మిగతా దానాల్లో ఈ విధానం ఉండకపోవచ్చు. ఆకలిగొన్నవానికి మనం పెట్టె గుప్పెడు అన్నం వాడి గుండె చప్పుళ్ళలో మన పట్ల వాని కృతజ్ఞత వినిపిస్తుంది.
కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమలలో నిత్యాన్నదానంలో ఎంతోమంది కడుపునింపు కుంటున్నారు. అట్లాగే జిల్లెళ్ళమూడి అమ్మ ‘అందరిల్లు’లోని అన్నపూర్ణాలయంలోను అన్న వితరణ నిత్యము జరుగుతోంది. “కోటి విద్యలు కూటి కొరకే” అని వినలేదా ! ఎవరెన్ని పనులు చేసినా ఆకలి బాధ తీర్చుకోవడానికే. అందుకే “అన్ని దానాలలోకి అన్నదానమే మిన్న” అని చెప్పవచ్చు.
ప్రశ్న 42.
పల్లె, నగర / పట్టణ ప్రాంతాలలో ఉండే ఇబ్బందులను వ్యాసంగా రాయండి.
జవాబు:
‘పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు’, పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు, ‘పల్లె తల్లి వంటిది’ – ఇలా పెద్దలు చెప్పిన మాటలు చద్దిమూటలు. బిడ్డల ఆనందమే తల్లికి పరమానందం. పల్లె ప్రజలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక చెమటోడ్చి కష్టపడతారు. ‘రెక్కాడితేగాని డొక్కాడని’ జీవితాలు వాళ్ళవి. పల్లెలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటాయి. వ్యవసాయానికి పశువులను ఉపయోగిస్తూ, ఇటు వ్యవసాయం, అటు పశువులను ఒక క్రమపద్ధతిలో పోషించుకుంటూ జీవనం సాగిస్తారు.
ప్రస్తుత కాలంలో మనిషి ఆధునికతకు ఆకర్షితుడై, వ్యవసాయం పనిముట్లు వీడి, యంత్రాలను ఉపయోగిస్తున్నాడు. అలాగే సేంద్రియ ఎరువులు కన్నా రసాయనిక ఎరువులు సత్వర ఫలితం ఇస్తున్నాయని వాటిని వాడి నేలను, శరీరాన్ని గుల్ల చేస్తున్నాడు. నాగరికతకు అలవాటుపడి ‘కష్టేఫలి’ అన్నమాట మరచాడు. పల్లెల్లో సరైన విద్య, వైద్య సదుపాయాలు ఉండవు.
సరైన రవాణా వసతి, కరెంటు ఇత్యాది నిత్యావసర సదుపాయాలు ఉండవు. గ్రామోద్ధరణంటూ పత్రికల్లో రాస్తేనో, ఉపన్యాసాలిస్తేనో పనికాదు. చదువులేని పల్లె ప్రజల కష్టాన్ని దళారులు, మధ్యవర్తులు, స్వార్థపరులు దోచుకుంటున్నారు. ఇవన్నీ పక్కనబెడితే ఆప్యాయతలు, అనుబంధాలు కలగలిపి ప్రశాంత జీవితాన్ని, ప్రకృతి రమణీయతను పల్లెలు ప్రసాదిస్తాయి.
నాగరికత వృద్ధి చెందిన ప్రాంతాలను నగరాలని, పట్టణాలని అంటారు. ఆధునికమైన వస్తు వినియోగంతో విలాసవంతమైన జీవితాలు నగర, పట్టణాల్లో మనకు కానవస్తాయి. సుఖవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ పట్న వాసాలలో తెలియని అభద్రతాభావం ఉంటుంది.
మనుష్యుల మధ్య, మనసులలో దూరాలు పెరిగి, స్వార్థపు ఆలోచనలు నిండి, “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్లు వారి బ్రతుకులుంటాయి. విద్యా, ఆరోగ్యం ఇలా వివిధాంశాలలో అభివృద్ధి పట్న వాసాలలో ఎక్కువగా ఉంటాయి. పట్నాల్లో ఒక రూపాయి ఒక దమ్మిడీలాగ ఖర్చు పెడతారు. ఉద్యోగాలకై దేవులాట, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకొంటారు. సంఘం గురించి ఆలోచన చేయరు. నేను బాగుంటే చాలు. ఎవరెలా పోతే నాకెందుకు అనే ఆలోచనలు ఎక్కువమందిలో ఉంటాయి. పక్కవాడి గురించి ఆలోచించే మనసు, సమయం వారికి ఉండదు.
ఇలా భిన్న ధ్రువాల వలె పల్లె, నగర/పట్టణవాస ప్రజలు ప్రక్క ప్రక్కనే ఉన్నా దూరంగా బతుకుతుంటారు.
ప్రశ్న 43.
నేటి కాలంలో ‘కంప్యూటర్’ మన జీవితంలో ఒక భాగమైంది. అలాంటి కంప్యూటర్ను అభినందిస్తూ ఒక వ్యాసం: వ్రాయండి.
జవాబు:
కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్లో ‘డేటా’ (Data)ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా ఖచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.
కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది. కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది.
కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లు ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్ నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.
అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందనీ కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.
ప్రశ్న 44.
మీకు నచ్చిన కవిని గురించి మీ స్వంత మాటలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
డా॥ అందెశ్రీగారు పోతనగారు పుట్టిన వరంగల్లు జిల్లాలోని ‘రేబర్తి’ గ్రామంలో జన్మించారు. ఆయన అతి సాధారణ నిరక్షరాస్య కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రత్యేకించి ఏ పాఠశాలలోను, కళాశాలలోను చదువపోయినా, సహజ సాహితీజ్ఞాన సుగంధాన్ని సంపాదించాడు.
డా॥ అందెశ్రీగారు తన పాటలతో సభలలో లక్షలాది ప్రజలను పరవశింపజేశారు. ఆయన ‘వాక్కులమ్మ’ అంటే సరస్వతికి వరపుత్రుడు. ఆయన 1995లో ‘పాటల పూదోట’ అనే లలిత గీతాల సంపుటిని వెలువరించి సాహితీ లోకంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. ఆయన ‘స్వర్ణకంకణ సత్కారాన్ని పొందారు.
డా॥ అందెశ్రీగారు 21 సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. కేవలం సినిమా కవిగానేకాక, అభిమాన ప్రేక్షక గుండెల్లో నిలిచిన కవిగా సుస్థిర స్థానాన్ని పొందారు.
డా॥ అందెశ్రీగారు వందలాది కవి సమ్మేళనాలలో పాల్గొని, శ్రోతన మెప్పుపొందారు. సింగపూర్, దుబాయి వంటి విదేశాల్లో పర్యటించి, తన కవితా వాణిని అక్కడి తెలుగువారికి వినిపించి, వారి ప్రశంసలు అందుకున్నారు.
డా॥ అందెశ్రీగారిని కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. విజయవాడ ఆంధ్రా ఆర్ట్స్ వారు ‘జానపద వాగ్గేయబ్రహ్మ’ అనే బిరుదుతో సత్కరించారు. భాగ్యనగర్ కల్చరల్ అసోసియేషన్వారు ‘సహజ కవికోకిల’ అన్న బిరుదుతో సత్కరించారు.
డా॥ అందెశ్రీగారు తెలంగాణ ఉద్యమగీతాన్ని రచించి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాకవిగా, ‘అభినవ పోతన’గా ప్రశంసలు పొందారు. వీరు రచించిన ‘మనిషి’ అన్న గేయం వేలాది సభల్లో లక్షలాది ప్రజల మనస్సులను కదిలించింది.