TS 10th Class Telugu Grammar లేఖలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana లేఖలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 1.
కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుపుతూ సోదరి / సోదరుడికి లేఖ రాయండి.
జవాబు:

నల్గొండ,
ది. 10-10-2018.

ప్రియమైన సోదరి / సోదరుడు,

నీ సోదరి / సోదరుడు వ్రాయునది. ముందుగా నీకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా వ్రాయునది అరిషడ్వర్గాలలో కోపం అత్యంత ప్రమాదకరమైనది. కోపం మానవునికి అంతర్గతమైన శత్రువు. కోపం ప్రశాంతతను దెబ్బతీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనీయదు. విచక్షణా జ్ఞానం క్రమంగా తొలగుతుంది. ఆప్తులు, స్నేహితులు దూరమౌతారు. సంపదలు తొలగిపోతాయి. సంస్కారం చెడిపోతుంది. ప్రేమాభిమానాలకు దూరమౌతారు. అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. కోపం వల్ల ఎన్నో దుర్గుణాలు కూడా కలుగుతాయి. అందువల్ల మనం కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనం సుఖమయ జీవితాన్ని గడుపుతాము. అందరికి ఆదర్శంగా ఉండగలుగుతాము.

ఇట్లు,
నీ ప్రియ సోదరి / సోదరుడు,
xxxx

చిరునామా:
XXXXXX,
10వ తరగతి, నిర్మల ఉన్నత పాఠశాల,
పాల్వంచ,
ఖమ్మంజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరిగిన స్వయం పాలనా దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

వరంగల్,
X X X X

మిత్రుడు శేఖర్కు,

నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.1.2017న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా ఎమ్.పి. గారు, మా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మా ఎన్.సి.సి. విద్యార్థులు వందనం చేశారు. మేమంతా ఒకే కంఠంతో జెండా పాట పాడాము.

తరువాత సభ జరిగింది. ఆ సభకు స్థానిక ఎమ్.ఎల్.ఏ గారు అధ్యక్షత వహించారు. ఎమ్.పి. గారు, ఎమ్.ఎల్.ఏ. గారు, మా ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచారు. నా నాయకత్వంలోని క్రికెట్ టీముకు, మొదటి బహుమతి వచ్చింది. డా. బి.ఆర్. అంబేద్కర్, పండిట్ నెహ్రూజీ, పటేల్ వంటి దేశనాయకుల సేవలను మేము గుర్తు చేసుకున్నాము.

విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
XXXXXXX

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 3.
మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

నిజామాబాద్,
16-2-2018.

ప్రియమైన మిత్రునకు,

నేను కులాసాగా ఉన్నాను. నీవు క్షేమమని అనుకుంటాను. ప్రతి సంవత్సరం లాగానే మా పాఠశాల వార్షికోత్సవం 14వ తేదీన చాలా ఘనంగా జరుపుకున్నాము. వార్షికోత్సవానికి ముందే వ్యాస రచన, వక్తృత్వము, ఆటల పోటీలు జరుపబడ్డాయి. వార్షికోత్సవానికి మా పాఠశాలకు తనిఖీకి వచ్చు ఉప విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వార్షికోత్సవం పిల్లలకు ఆనందం ఇచ్చే అంశం. కనుక మేము పాఠశాల ఆవరణను, తరగతి గదులను అందంగా అలంకరించాము.

పాఠశాల కమిటీ కార్యదర్శిగారు జాతీయ జెండాను ఎగురవేశారు. రాబోయే పరీక్షలలో మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు అయి పాఠశాలకు పేరు తేవాలని ముఖ్య అతిథి సందేశమిచ్చారు. సభకు ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. పోటీలలో విజేతలకు విద్యాశాఖాధికారిగారు బహుమతులిచ్చారు. నాకు వ్యాసరచనలో ప్రథమ బహుమతిగా తెలుగు నిఘంటువు ఇచ్చారు. తర్వాత విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మీ పాఠశాలలో వార్షికోత్సవం జరిగినదా ? జరిగినచో ఆ విశేషాలు నాకు తెలుపగలవు.

ఇట్లు,
నీ స్నేహితుడు,
X X X X X.

చిరునామా:
ఎ. సుబ్రహ్మణ్య శర్మ,
10వ తరగతి – ‘ఏ’ సెక్షన్,
రామలింగేశ్వరరావు హైస్కూల్,
శాంతినగర్, కరీంనగర్ – 12.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 4.
మీకు నచ్చిన పుస్తకాన్ని గూర్చి సోదరునికి లేఖ వ్రాయండి.
జవాబు:

చేవెళ్ళ,
10-8-2018.

ప్రియమైన సోదరుడు సాంబశివరావుకు,

నేను బాగానే చదువుతున్నాను. ఈ మధ్య నాన్నగారు బారిష్టరు పార్వతీశం అనే పుస్తకాన్ని ఎగ్జిబిషన్లో కొని తెచ్చారు. నేను దాన్ని చదివాను. పార్వతీశంలోని పల్లెటూరితనమూ, పుట్టినరోజుకు అతని మిత్రులు చేసిన హంగామా భలే బాగున్నాయి. పార్వతీశం ఆవకాయజాడీ, గొడుగు, ట్రంకు పెట్టెలతో విదేశీ ప్రయాణానికి వెళ్ళడం చదివి కడుపుబ్బ నవ్వుకున్నాను. తివాచీ తొక్కకూడదని అనుకొని ప్రక్కగా నడిచి పడటము చదువుతుంటే ఇలాంటివారు ఆ కాలంలో నిజంగా ఉన్నారా అనిపించింది. మొత్తం మీద మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి ఈ నవల చదివేవారిని ఆకర్షిస్తుందనడం సత్యము. నీవు కూడా సెలవుల్లో గ్రంథాలయానికి వెళ్ళి ఈ పుస్తకం తప్పక చదవగలవు.

ఇట్లు,
నీ అన్నయ్య,
X X X X X.

చిరునామా:
ఐ. సాంబశివరావు,
10వ తరగతి,
రామకృష్ణ ఉన్నత పాఠశాల,
నల్గొండ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 5.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

రంగారెడ్డి,
28-9-2018.

ప్రియమైన మిత్రునకు,

నీ మిత్రుడు వ్రాయునది. రక్తం యొక్క ఉపయోగాలు నీకు కూడా తెలుసుగదా ! రోగులకు రక్తం ప్రాణదాత. అనారోగ్యవంతునకు శరీరంలో రక్తం తగ్గిపోతోంది. ఆపరేషన్ల సమయంలో రోగి చాలా రక్తాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో శరీరంలోకి పంపేందుకు రక్తం చాలా అవసరం. ఎవరో ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే రోగి మరల బ్రతుకుతాడు. అంటే రక్తదానం చాలా గొప్పది. ఒక జీవికి ప్రాణం పోస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా రక్తదానం చేయడం అవసరం అని పెద్దలు చెబుతారు. రెడ్ క్రాస్ సంస్థ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఉంచి, అవసరమైన రోగులకు ఉపయోగిస్తున్నాయి. విద్యార్థులమైన మనం ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఆచరించాలని నీకు వ్రాస్తున్నాను.

పరీక్షలు కాగానే సెలవులకు ఇక్కడకు రాగలవు.

నీ మిత్రుడు,
XXXXX.

చిరునామా:
ఎ. జగదీష్ కుమార్,
10వ తరగతి,
వివేకానంద మెమోరియల్ హైస్కూల్,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 6.
నీవు చూసిన యాత్రాస్థలమును వివరిస్తూ, ఇతర ప్రాంతములో చదువుతున్న నీ సోదరికొక లేఖ వ్రాయండి.
జవాబు:

మహబూబ్నగర్,
16-2-2018.

ప్రియమైన సోదరికి,

నీ అన్నయ్య వ్రాయునది. సంక్రాంతి సెలవులకు మా పాఠశాల ఉపాధ్యాయులు మమ్మల్ని విహార యాత్రకు తీసుకొని వెళ్ళారు. మన రాష్ట్రంలో విహారయాత్రా స్థలంగా పేరుపొందిన నాగార్జున సాగర్కు వెళ్ళాము. పూర్వము బౌద్ధ పండితుడైన నాగార్జునుడు ఇక్కడే నివసించెనట. ఈయన తత్త్వవేత్తయేగాక, ఆయుర్వేద పండితుడు కూడా. కృష్ణానదిపై ఇక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టబడింది. రెండు కొండల మధ్య ఇది నిర్మితము.

ఆనకట్ట వెనుక సరోవరం కలదు. సరోవరం నీటిలో చారిత్రక శిథిలాలు మునిగిపోకుండా వాటిని కొండపై నిర్మించిన మ్యూజియంలో ప్రభుత్వం భద్రపరిచింది. మ్యూజియంలో అనేక పాలరాతి శిల్పాలు, బౌద్ధవిగ్రహాలు, పనిముట్లు మొదలైనవి చాలా చూశాము. చుట్టూ గల ప్రకృతి దృశ్యాలు కూడా రమణీయంగా ఉన్నాయి. మా ఉపాధ్యాయులు అన్ని వివరాలు తెలియజేశారు. ప్రకృతి దృశ్యాలు – చారిత్రక ప్రసిద్ధి గల ఈ స్థలాన్ని నీవు కూడా తప్పక చూడాలని కోరుతున్నాను. అమ్మా, నాన్నలకు నా నమస్కారాలు చెప్పగలవు.

ఇట్లు,
నీ ప్రియమైన అన్నయ్య,
XXXX.

చిరునామా:
కె. సుజాత,
10వ తరగతి,
రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్,
ఖమ్మం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 7.
గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

మెదక్,
10-9-2018.

ప్రియమిత్రుడు ఆనంద్కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురు పూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు డా ॥ రాధాకృష్ణగారి జీవిత విషయాలను, మాకు తెలిపినారు. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయు లందరిని ఆరోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాము. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు,
XXXXX.

చిరునామా:
ఎస్. ఆనంద్,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖైరతాబాద్,
హైదరాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 8.
మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాద్,
తేది : 10-7-2018.

ఈనాడు పత్రికా సంపాదకులకు,

ఆర్యా,

మన హైదరాబాద్ నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి.

ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహ కరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరు తున్నాము.

ఇట్లు
తమ విధేయుడు,
పి. శ్రీరాం.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 9.
కుటుంబంలో సమాజంలో స్త్రీల పాత్ర గురించి నీ స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు:

వరంగల్,
తేది : 10-8-2018.

ప్రియ స్నేహితురాలు జానకికి,

నీ మిత్రురాలు రాయునది. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు ఎలా చదువుతున్నావు ? నేను ఈ లేఖలో ‘కుటుంబంలో సమాజంలో స్త్రీల పాత్ర’ గురించి తెలుపుతాను.

భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒకనాడు మనదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దగా తల్లి నిర్ణయాలు తీసుకొనేది. తల్లి విద్యావంతురాలైతే కుటుంబమంతా తీర్చిదిద్దబడుతుంది. చరిత్రలో ఎందరో తల్లులు బిడ్డలను ఉత్తములుగా తయారు చేశారు. అందుకే ‘ఇల్లాలు చదువు – ఇంటికి వెలుగు’ అని సూక్తి. తల్లిగా, భార్యగా, సోదరిగా కుటుంబాన్ని సక్రమంగా ఉంచడంలో స్త్రీల ప్రాధాన్యత ఎంతైనా ఉంది. చిన్నప్పుడే తమ పిల్లలకు నీతి పద్యాలు, పురాణ, ఇతిహాసాలు గురించి చెప్పినట్లైతే వారు సంస్కార వంతులుగా రూపొందుతారు.

సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దురా చారాలను, అవినీతిని రూపుమాపడానికి ఎందరో స్త్రీలు కృషిచేశారు. నేటికాలంలో కూడా అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో స్త్రీలు సమర్థవంతంగా తమ బాధ్యతను నిర్వహించాలి. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం కూడా విద్యా వంతులైన స్త్రీలు కృషి చేయాలి. మొత్తానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో స్త్రీలు ప్రధానపాత్ర వహించి దేశాభివృద్ధికి దోహద పడతారని ఆశిస్తున్నాను.

ఇట్లు
నీ ప్రియమిత్రురాలు,
X X X X X.

చిరునామా:
బి. జానకి,
10వ తరగతి,
రామకృష్ణ స్కూల్,
మణుగూరు, ఖమ్మంజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 10.
మీ వీధిలో పారిశుద్ధ్య పరిస్థితిని గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

జగిత్యాల,
తేది : 10-11-2018.

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి వ్రాయు విన్నపము.

అయ్యా,

నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను.. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి కనిపిస్తున్నాయి. చెత్త వెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికివల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మా వీధి పారిశుద్ధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
X X X X X X X.

చిరునామా:
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
జగిత్యాల, కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 11.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లా కలెక్టరుకు ఒక వినతిపత్రం రాయండి.
జవాబు:

ఉట్నూరు,
తేది : 10-07-2018.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరుగారి దివ్యసముఖమునకు,
ఉట్నూరు గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు గ్రామం. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివ సిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు కాయకష్టం చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగు దొడ్ల సౌకర్యంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం వల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవు తున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది. కాబట్టి మా గ్రామంలో హడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
X X X X X.

చిరునామా:
జిల్లా కలెక్టరుగారు,
జిల్లా కలెక్టరు గారి కార్యాలయం,
ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 12.
స్వచ్ఛభారత్ కార్యక్రమం గూర్చి మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:

భద్రాచలం,
23-3-2018.

ప్రియ స్నేహితుడు రవికి,

ఇచ్చట నేను క్షేమం. అచ్చట నీవు క్షేమమని తలుస్తాను. ముఖ్యముగా మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం. ముఖ్య అతిథిగా మా ప్రాంత యం.యల్.ఎ.గారు విచ్చేసారు. మా పాఠశాల ఆవరణ పరిశుభ్రం చేసాము.

ఈ ఉద్యమం దేశమంతా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి స్ఫూర్తితో విజయవంతమైంది. ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురించి తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X.

చిరునామా:
పి. రవి,
10 వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల,
మిర్యాలగూడ,
నల్గొండజిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 13.
పెద్దనోట్ల రద్దుపై నీ అభిప్రాయాన్ని తెలుపుతూ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

నిజామాబాద్,
23-3-2018.

ప్రియమైన మిత్రుడు రామచంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది, నేను బాగా చదువు తున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయునది ఇటీవల మన ప్రధానమంత్రిగారు పెద్ద నోట్లను రద్దు చేశారు. అవినీతిపరులపై సింహస్వప్నంగా నిలిచారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ చర్య దోహదం చేస్తుంది. కొద్దిరోజులు ప్రజలు అసౌకర్యాలు పొందినది, దీర్ఘకాలికంగా ఈ చర్య సత్ఫలితాలను అందించగలదని ఆశిస్తున్నాను. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X.

చిరునామా:
పి. రామచంద్ర,
10 వ తరగతి,
నెహ్రూ ఉన్నతపాఠశాల,
కరీంనగర్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 14.
కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ, మిత్రుడికి లేఖ రాయండి. (June 2016) (June 2015)
జవాబు:

హైదరాబాదు,
X X X.

మిత్రుడు రఘునందను,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులు క్షేమం. నీవు రాసిన లేఖలో నీ ప్రియమిత్రుడైన సీతారామ్తో, నీకు తగవు వచ్చిందనీ, మీరు కొట్లాడుకున్నారనీ రాశావు.

నీ ఉత్తరం చూసి, నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలేటంతగా మీ మిత్రులు దెబ్బలాడుకోవడం ఏమీ బాగాలేదు.

‘తన కోపమె తన శత్రువు’ అని సుమతీ శతక కర్త రాశాడు. “క్రోధము మనకు శత్రువు” అని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కోపంతో మన వివేకం నశిస్తుంది. మనం మూర్ఖులం అయిపోతాము. పశువులవలె అయిపోతాము. కాబట్టి నీవు కోపం తగ్గించుకో. నీ మిత్రుడితో నీ విరోధం విషయం, మీ తల్లిదండ్రులకు చెప్పు. వారే మీ తగవు తీరుస్తారు. కోపం తగ్గించుకొని, శాంతంగా ఉండమని నిన్ను నేను కోరుతున్నా.

త్వరలో నీవు, సీతారామ్, తిరిగి మిత్రులవుతారని నాకు నమ్మకం. ఉంటా…

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
అవసరాల యుగంధర్,
10వ తరగతి,
భాష్యం హైస్కూలు, అమీర్పేట.

చిరునామా :
కె. రఘునందన్,
S/o. కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4-1-101,
వరంగల్లు, తెలంగాణ,

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 15.
మీ పాఠశాలలో జరిగిన స్వయంపాలన దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి. (March 2016)
జవాబు:
మిత్రునికి లేఖ

కరీంనగర్,
X X X X X.

మిత్రుడు శేఖర్కు, / మిత్రురాలు కవితకు,

నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.1.2017న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన ‘దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా MP గారు, మా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మా NCC విద్యార్థులు వందనం చేశారు. మేమంతా ఒకే కంఠంతో జెండా పాట పాడాము.

తరువాత సభ జరిగింది. ఆ సభకు స్థానిక MLA గారు అధ్యక్షత వహించారు. MP గారు, MLA గారు, మా ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచారు. నా నాయకత్వంలోని క్రికెట్ టీముకు, మొదటి బహుమతి వచ్చింది. డా.బి.ఆర్ అంబేద్కర్, పండిట్ నెహ్రూజీ, పటేల్ వంటి దేశనాయకుల సేవలను మేము గుర్తు చేసుకున్నాము.

విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
కె. రవి / పి. నీరజ,

చిరునామా :
S. శేఖర్, / P. కవిత,
పదవ తరగతి,
నెహ్రూజీ కాన్వెంట్,
ఖమ్మం, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 16.
పుస్తకంలోని ‘ముందుమాట’ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మీ మిత్రుడికి / మిత్రురాలికి ‘లేఖ’ రాయండి. (June 2019)
జవాబు:

వరంగల్లు,
X X X X X,

ప్రియమైన మణికి,

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. నేను మొన్న ఒక పుస్తకం చదివాను. అది చాలా బాగుంది. దాని ముందుమాట చాలా గొప్పగా రాశారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం, వివేచనాశక్తి, ఉత్సాహం, ఆనందం, పరిశీలనా దృష్టి, జిజ్ఞాస కలుగుతాయి. పుస్తకాన్ని చదవాలంటే ఆ పుస్తక పరిచయ వాక్యాలు చదవాలి. అవి ఆసక్తిని కల్గిస్తాయి. వాటిని ముందుగా చదవాలి. పుస్తకం ఆశయం గురించి, దాని అంతస్సారాన్ని గురించి, గ్రంథనేపథ్యాన్ని గురించి రచయితగానీ, మరొకరు గానీ, విమర్శకులు గానీ రాసే పరిచయవాక్యాలు, పుస్తకాన్ని చదువాలనే ఆసక్తిని కల్గిస్తాయి.

ఉదాహరణకు బారిష్టరు పార్వతీశం, మహాప్రస్థానం, భారత రామాయణ కథలు వంటి పుస్తకాల ముందుమాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. దీనినే పీఠికని, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లతో పిలుస్తారు.

మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అట్లే “పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ‘ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చని” చెప్పవచ్చు.
పుస్తకం ద్వారా మనం ఏ విషయాలు తెలిసికోగలమో, ఇంకా ఏయే విషయాలు ఆ గ్రంథంలో తెలియచేస్తే బాగుండేదో, పుస్తక పరిచయంలో రాయబడుతుంది. కాబట్టి పుస్తక పరిచయ వ్యాసం, ఆ గ్రంథాన్ని మనకు చక్కగా పరిచయం చేస్తుంది. పుస్తక పరిచయం చదివితే రేఖా మాత్రంగానైనా ఆ పుస్తకాన్ని గురించి తెలుసుకోవచ్చు.

కాబట్టి పుస్తకంలోని ముందుమాట యొక్క ప్రాముఖ్యతను, దాని ప్రాధాన్యతను గురించి నాకు తెలిసిన విషయాలు తెలియచేసాను. నీకు తెలిసిన విషయాలు నీవు తెలియచేయగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
బి.యన్. రాజు.

చిరునామా :
కె. మణి
నెం : 6, 10వ తరగతి..
జిల్లా పరిషత్ హైస్కూల్, లోనికలాన్,
మెదక్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 17.
ప్రభుత్వోద్యోగముల కోసం వెంపర్లాడకుండా, సొంతకాళ్ళపై నిలవాల్సిన ఆవవ్యకతను తెల్పుతూ మిత్రునకు లేఖ.
జవాబు:

నిజామాబాద్,
X X X X X.

మిత్రమా రాజశేఖరా !
నమస్కారం !!

నీ లేఖ చేరింది. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదని వ్రాశావు. నీవు ఇప్పటికే B.Sc. అగ్రికల్చరల్ డిగ్రీ పట్టాను పొందావు. మీకు ఉమ్మడి వ్యవసాయం ఉందికదా ! పైగా 50 ఎకరాల భూస్వాములు మీరు. మీ నాన్నగారు. పెద్దవారు అవుతున్నారు.

ఆధునిక పద్ధతులు తెలిసిన నీవు వ్యవసాయం చేయించడంలో అనేక మెలకువలను పాటించు. ట్రాక్టర్లను తీసుకో. నీరు లేని పొలాల్లో బోర్లు వేయించు. నీటి సౌకర్యం ఉన్నచోట అంతర పంటలుగా కూరగాయల్ని పండించు. వాణిజ్యపు పంటలు పండించు. ఇపుడు మన ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది. కనుక పండిన కూరగాయల్ని రైతు బజార్లలో అమ్మి మంచి ఫలసాయం పొందవచ్చును కదా !

వ్యవసాయానికి తోడు పాడిపరిశ్రమను కూడా ఏర్పాటు చెయ్యి. నీతో మరికొందరి యువకుల్ని ప్రోత్సహించు. నీ కాళ్ళపై నీవు నిలబడటమే కాక మరికొంతమందికి ఆశ్రయం కల్పించు. చదువుకున్నవాళ్ళు ముఖ్యంగా సిరిసంపదలు కల్గిన వాళ్ళు తమ తమ సొంతకాళ్ళపై నిలబడి కుటీర పరిశ్రమల్ని, ప్రోత్సహించే పరిస్థితిని కల్పించు. నీ కారణంగా మీ గ్రామంలోనున్న యువకులకు ఆదర్శప్రాయుడివై మార్గదర్శకుడవుతావు. అంతేకాక నీ గ్రామమే ఆదర్శవంతమవుతుంది. మన ప్రభుత్వాలు నిన్ను గుర్తించి, అనేక అవార్డులతో నిన్ను సత్కరిస్తారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
X X X X X.

చిరునామా :
పొన్నం రాజశేఖర్,
S/O పొన్నం వెంకటేష్,
బెల్లంపల్లి (PO), ఆదిలాబాదు జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 18.
నీవు చూచిన ఒక నగరంలోని విశేషాలను వర్ణిస్తూ నీ మిత్రునకు లేఖ.
జవాబు:

నాగార్జున సాగర్,
X X X X X,

ప్రియమిత్రునకు నమస్కారం !
ఉభయకుశలోపరి !

నీ వద్దనుండి ఎటువంటి సమాచారం లేదు. నేను గడచిన సంక్రాంతి సెలవులకు భాగ్యనగరమైన మన రాష్ట్ర రాజధాని హైదరాబాదు వెళ్ళాను. అక్కడ గడిపిన సెలవుల రోజులలో ఎంతో విజ్ఞాన దాయకంగా గడిచింది.

హైదరాబాదు, సికింద్రాబాద్లను కలిపే ట్యాంక్ బండ్ మరింతగా అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం. హుస్సేన్ సాగర్, అందులో నిలబెట్టిన బుద్ధ విగ్రహం అత్యంత మనోహరంగా ఉంది. బోటు షికారు చేశాను.

సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, అక్కడే ఉన్న అసెంబ్లీ భవనం, రవీంద్రభారతి చూశాను. మన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రగతి భవనం చాలా బాగుంది. జంట నగరాల్లో ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన మెట్రోరైలు ప్రారంభించబడింది. అందులో విహరించాను. ఆ మెట్రో రైలును స్త్రీలే నడుపుతున్నారు. ఇదే ఆశ్చర్యకర విషయం.

సినిమా షూటింగ్స్, రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ, రామకృష్ణా స్టూడియోలు, రామానాయుడు స్టూడియోలు, సినీ తారలు నివసించే కాలనీలు, హైటెక్ సిటీలు అన్నీ చూశాను. చాలా ఆనందంగా, విజ్ఞానదాయకంగా గడిచాయి. తప్పక నీవు కూడా మన రాజధాని నగరం చూడవలసింది.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X

చిరునామా :
బి. రామారావు, S/O దశరథుడు,
వాహనాల వీధి, భద్రాచలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణరాష్ట్రం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 19.
నగర జీవితంలోని కష్టాల్ని వివరిస్తూ నీ మిత్రురాలికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

నా ప్రియ మిత్రురాలికి,
నమస్కారం !

నీ లేఖ అందింది. నేను హైదరాబాదులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ చదువు విషయంలో ఎటువంటి సమస్యలు లేవు. కాని స్కూలు ఫీజులు ఎక్కువ. ఇకపోతే ఈ నగరజీవితం చాలా కష్టంగా ఉంది. నగరంలో రోడ్లన్నీ వాహనాలతో నిండి యుంటాయి. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. భయంకరమైన రణగొణధ్వనులుంటాయి. వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వాహనాలు వదలే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై యాక్సైడ్ వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. చాలామందికి ఎలర్జీ ఆస్తమా ఉంటోంది.

నగరానికి వలస వచ్చిన పేదవాళ్ళు చిన్నచిన్న ఇరుకు ఇళ్ళల్లో, మురికివాడల్లో ఉంటూ ఉంటారు. ఎవరిగోలవారిది. ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా ఉంటుంది. పరస్పర సహకార సహాయాలుండవు. చాలీచాలని బ్రతుకులు. దారిద్ర్యరేఖలతో పేదవారు సతమతమవుతూంటారు. జబ్బులు చేస్తే నయం అయ్యే మార్గాలు లేవు. ఖరీదైన హాస్పటల్స్ సామాన్య మానవునికి అందుబాటులో ఉండవు.

ఎప్పుడూ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మమతానురాగాలుండవు. ఈ నగరం చూస్తే అర్థంకాని, రసాయనశాల వంటిది. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
నువ్వు బాగా చదువుతావని తలుస్తూ ……………

ఇట్లు,
నీ ప్రియమిత్రురాలు,
X X X X X.

చిరునామా :
ఎస్. ఉష, 10వ తరగతి,
D/O వేంకటేశ్వరరావు,
ఢిల్లీ పబ్లిక్స్కూలు,
మంచిర్యాల, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 20.
“శతక మధురిమ” పాఠం ఆధారంగా, మనం అలవర్చుకోవలసిన మంచి గుణాలను, ఉండకూడని గుణాలను, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
మిత్రునకు లేఖ

వరంగల్లు,
X X X X X.

మిత్రుడు రాజారెడ్డికి / మిత్రురాలు రమ్యకు,

ఇక్కడ కుశలం. అక్కడ కుశలమే కదా !

మా గురువుగారు శతక మధురిమ పద్యాలు చెప్పారు. వాటిలో మనం అలవాటు చేసుకోవలసిన మంచి గుణాలూ, మనకు ఉండకూడని గుణాలనూ గూర్చి చెప్పారు.

అలవరచుకోవలసిన గుణాలు : సత్యమునే చెప్పాలి. దయ కలిగి ఉండాలి. మనము చేసే పనిలో ఏకాగ్రత కలిగి ఉండాలి. గురుభక్తి, మనస్సులో సౌజన్యమూ ఉండాలి. త్యాగదీక్ష కలిగి, దీనుల దైన్యాన్ని పోగొట్టాలి. దేశమాత గౌరవాన్ని కాపాడాలి. పెంచాలి. మంచి మిత్రులను సంపాదించాలి.

ఉండకూడని గుణాలు : భక్తులను నిందించకూడదు. దాతలను చెడగొట్టకూడదు. స్వార్థం ఉండకూడదు. మంచివారిని మోసగించకూడదు. మాయమాటలు చెప్పి, పరుల ధనాన్ని అపహరించకూడదు. లంచాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటకూడదు. ఇతరుల కొంపలు ముంచకూడదు. కులగర్వం పనికిరాదు.

నీవు కూడా నీవు నేర్చిన విషయాలు, నాకు రాయి. మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు చెప్పు.

ఇట్లు,
నీ, మిత్రుడు, / నీ మిత్రురాలు,
రవికాంత్, / జ్యోత్స్న.

చిరునామా :
కె. రాజారెడ్డి, / కె. రమ్య,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వేములవాడ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 21.
మీరు చూచిన గోలకొండ కోట విశేషాలను గూర్చి, నీ మిత్రుడికి ఒక లేఖ రాయండి.
జవాబు:
లేఖ

హైదరాబాదు,
X X X X X.

మిత్రుడు నిర్మల్క,

మిత్రమా ! ఈ లేఖలో నీకు గోల్కొండ కోటను గూర్చి రాస్తున్నా. ఈ మధ్యనే నేను, విహారయాత్రకు వెళ్ళి మిత్రులతో కలిసి గోల్కొండకోట చూసివచ్చాను.

దక్షిణభారతంలో గోలకొండ పట్టణం ప్రసిద్ధిచెందింది. గోలకొండ దుర్గం అంటే, మూడు కోటలు. ఈ దుర్గానికి ఏడుమైళ్ళ కైవారం 87 బురుజులు ఉన్నాయి. ఆజంఖాన్ అనే ఇంజనీరు ఈ గోలకొండ పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణంలో వీధులను, మొహల్లాలు అని పిలిచేవారు.

ఈ పట్టణంలో ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం ఉంది. షాహిమహలు, దిల్కషా అనే అందమైన రాజభవనాలు ఉన్నాయి. రెండు బారకాసులు ఉన్నాయి. అందమైన మిద్దెల మీద తోటలున్నాయి. పట్టణ ప్రజలకు ‘కటోరాహువుజు’ ద్వారా నీర సరఫరా చేసేవారు.

గోల్కొండ కోటను బండరాళ్ళతో కట్టారు. మొగలాయీ సైన్యం 9 నెలలు శ్రమపడి, గోల్కొండకోటలో ఒక్క బురుజును మాత్రమే కూల్చగలిగిందట. ఆ బురుజు బదులుగా మరో బురుజును ఒక్క రాత్రిలో సైనికాధికారులు కట్టారట. గోల్కొండ కోటలో కొండపై ‘బాలహిస్సారు’ అనే ప్రాసాదము ఉంది. దానికి వెళ్ళేదారిలో ద్వారం దగ్గర, ఒక రాతి గుండు ఉంది. ఆ రాతిపై నిలిచి, చప్పట్లు కొడితే ఆ శబ్దం బాలహిస్సారు భవనంలోకి వినబడేదట.

గోల్కొండ కోటను తప్పక చూడాలి. సెలవులకు నీవు వస్తే నేను చూపిస్తా. శుభాకాంక్షలు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X X X.

చిరునామా :
పి. నిర్మల్, 10వ తరగతి,
జవహర్ కాన్వెంటు,
ఖమ్మం.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 22.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలయిన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెలుపుతూ నీ మిత్రునికి / స్నేహితురాలికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ

భద్రాచలం,
X X X X X.

మిత్రుడు రామ్ పాల్కు, / మిత్రురాలు రాధికకు,

నీ లేఖ చేరింది. నిత్య జీవితంలో మనం ఎలా నడచుకోవాలో తెలుపుతూ మా రామాలయంలో ఓ సాధువుగారు మాట్లాడారు. ఆయన జీవితంలో సత్యవాక్కు, దానగుణము ఉండాలని చెప్పారు. ఆయన మాటలు నాకు నచ్చాయి.

పురాణాల్లో కర్ణుడుని దానకర్ణుడు అంటారు. తన ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా కర్ణుడు తన సహజ కవచకుండలాలను దానం చేశాడు. అలాగే మనం చదివిన దానశీలము పాఠంలో బలిచక్రవర్తి, గురువు గారు వద్దంటున్న మానకుండా వామనుడికి మూడు అడుగుల నేలను సంతోషంగా ధారపోశాడు. ఆ దానం వల్ల బలి చక్రవర్తి పాతాళలోకంలోకి తొక్కి వేయబడ్డాడు. అయినా ఈ భూమండలం ఉన్నంతవరకు బలిచక్రవర్తి కీర్తి శాశ్వతంగా నిలిచింది.

అలాగే శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. మనం కూడా చీటికీ మాటికీ అబద్ధాలు ఆడడం మాని వేయాలి. సత్యవాక్యాన్ని నిలబెట్టాలి. మన మిత్రులకు అవసరం అయినప్పుడు దానం చెయ్యాలి.

నేను సత్యమే మాట్లాడతానని, ఉన్నమేరకు ఇతరులకు దానధర్మాలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నీవు కూడ తప్పక ఈ మంచి గుణాలను పాటించు.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శివరావు. / సరోజ.

చిరునామా :
పి. రామ్ గోపాల్, / పి. రాధిక,
S/o వెంకట్రావు, / D/o వెంకట్రావు,
10వ తరగతి, బాపూజీ నగర్,
ఖమ్మం, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 23.
మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవాన్ని గూర్చి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ

ఆదిలాబాదు,
X X X X X.

మిత్రుడు ప్రశాంత్ కు, / మిత్రురాలు మాధురికి,

నీ లేఖ చేరింది. ఈ మధ్య మా పాఠశాలలో వార్షికోత్సవం జరిగింది. మా జిల్లా విద్యాశాఖాధికారి గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఉదయము మా ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను, పాఠశాల పతాకాన్ని ఎగురవేశారు.

పాఠశాలలో ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతిక పోటీలు, ఆటలు పోటీలు’ జరిగాయి. నాకు ఇంగ్లీషు, తెలుగు వ్యాసరచనలలో ప్రథమ బహుమతి వచ్చింది. సాయంత్రము 5 గంటలకు వార్షికోత్సవ సభ జరిగింది. మా పాఠశాల అన్ని రంగాలలో ముందున్నదని మా DEO గారు మెచ్చుకున్నారు. పబ్లిక్ పరీక్షలలో నూటికి నూరు శాతం కృతార్థులు కావాలని చెప్పారు.

DEO గారు మాకు బహుమతులు పంచారు. విచిత్రవేషాలు, నాటికలు ప్రదర్శించారు. బాలికలు నృత్యం చేశారు. పాటలు పాడారు. తెలంగాణ తల్లిపై మంచి పాటలు పాడారు. మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గురించి తప్పక రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
రవిబాబు. / నీరజ.

చిరునామా :
K. ప్రశాంత్, / P. మాధురి,
– S/o K. రాజా, D/o P. రమణకుమార్,
వరంగల్లు, తెలంగాణ.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 24.
విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ.
జవాబు:

రామగుండం,
X X X X X.

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం రామగుండంలో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మీనార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళభండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళబండి శ్రీనివాస్ గారు,
మంథని,
కరీంనగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 25.
మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

కరీంనగర్,
X X X X X.

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,

నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
కరీంనగర్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 26.
పుట్టినరోజుకు ఆహ్వానిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

సిద్ధిపేట,
X X X X X.

ప్రియమిత్రుడు శ్రీనివాసు,

నేను బాగుగానే చదువుచున్నాను. నీవు కూడ బాగుగా చదువుచున్నావని తలచెదను.

వచ్చే బుధవారము నా పుట్టినరోజు. ఆ రోజున మిత్రులందరిని ఆహ్వానించి అందరి సమక్షంలో నా పుట్టినరోజు పండుగను బ్రహ్మాండముగా జరుపుకొనవలెనని నిశ్చయించుకొంటిని. నీవు ఎన్ని పనులున్నను తప్పక నా పుట్టినరోజు పండుగకు హాజరు కావలసినదిగా కోరుచున్నాను. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలము వరకు వివిధ కార్యక్రమములు నిర్వహింపబడును. కనుక నీవు ఒక రోజు ముందుగానే రావలసినదిగా తెలియజేయుచున్నాను.

నీ తల్లిదండ్రులకు నా నమస్కారములు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
వి. ప్రసాద్.

చిరునామా :
పి. శ్రీనివాస్,
10వ తరగతి,
గవర్నమెంట్ హైస్కూలు,
సికింద్రాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 27.
నీ మాతృదేశాన్ని (భారతదేశం) గురించి పరిచయం చేస్తూ విదేశంలోని కలం స్నేహితునికి లేఖ.
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

ప్రియ కలం స్నేహితుడు జాన్ డేవిడ్ పాల్కు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో మా భారతదేశ విశేషాలు తెలియజేస్తున్నాను.

ఆసియా ఖండంలోగల పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. దీనినే ‘ఇండియా’ అని పిలుస్తారు. మా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం ఎల్లలుగా ఉన్నాయి. మా దేశంలో సింధు, గంగ, యమున, కృష్ణ, గోదావరి వంటి జీవనదులెన్నో ఉన్నాయి.

భారతదేశంలో వివిధ జాతులవారు, మతాలవారు ఉన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనటానికి మా దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సత్యం, అహింసయే ఆయుధాలుగా భావించెడి దేశం మాది. సర్వమానవులను సౌభ్రాతృత్వ దృష్టితో చూస్తూ అందరి సుఖశాంతులను కాంక్షించేదే మా భారతదేశం.

ఇట్లు,
నీ కలం స్నేహితుడు,
డి. వి. శ్యామసుందర్.

చిరునామా :
జాన్ డేవిడ్ పాల్,
డోర్ నెం. 4/159,
కెనడీ రోడ్, వాషింగ్టన్,
అమెరికా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 28.
మంచి పుస్తకాన్ని గూర్చి స్నేహితునికి లేఖ .
(లేదా)
నచ్చిన పుస్తకాన్ని పరిచయం చేస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

నిజామాబాదు,
X X X X X.

ప్రియ మిత్రుడు శేఖర్ బాబుకు,

నీ ప్రియ మిత్రుడు శశిధర్ అనేక శుభాకాంక్షలతో వ్రాయునది. ఉభయకుశలోపరి. నేను ఈ మధ్య కందుకూరి వీరేశలింగం పంతులుగారు రచించిన “రాజశేఖర చరిత్ర” చదివాను. ఈ గ్రంథములో రాజశేఖరుడు అనే బ్రాహ్మణుడు నాయకుడు. ఈ గ్రంథము ఆంధ్రభాషలో రచించిన తొలి తెలుగు నవలయని తెలిసింది. ఈ నవలను వీరేశలింగంగారు తన కాలములో ఉన్న సాంఘిక దురాచారాలను ఖండించడానికి వ్రాశారు.

ఆనాడు సంఘంలో పొగడ్తలకు లొంగి గొప్పగా కుమార్తెల పెండ్లిండ్లు చేసి అప్పుల పాలైన రాజశేఖరుడుగారి వంటి సంపన్నులు ఉన్నారు. దయ్యములు, భూతవైద్యము, జ్యోతిషం మొదలైన వానిపై ప్రజలకు నమ్మకముండేది. దానితో ఆ పేరు చెప్పుకొని సిద్ధాంతులు, దామోదరయ్య వంటి వారు తమ పొట్టపోసుకొనేవారు. పెద్దాపురం రాజా వంటి మంచి రాజాధికారులు కూడ ఉండేవారని తెలుస్తుంది. గ్రాంథిక భాషలో ఈ నవల చక్కగా వ్రాయబడినది. తెలుగు భాషలో మొదటి నవలయైన రాజశేఖరచరిత్ర తెలుగు నవలా సాహిత్యంలో మణిపూస.

నీవు కూడా ఈ మధ్య చదివిన పుస్తకం గూర్చి వ్రాస్తావని ఆశిస్తున్నాను. శుభాకాంక్షలతో.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. శశిధర్.

చిరునామా :
కె. శేఖర్ బాబు,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
నిజామాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 29.
మీ వీధిలో మంచినీటి సమస్య గురించి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

నిర్మల్,
X X X X X.

మంచినీటి సరఫరాశాఖ చీఫ్ ఇంజనీర్ గారికి నమస్కరించి
గోపాలకృష్ణ వ్రాయు విన్నపము.

అయ్యా,

మా ప్రాంతంలోని ప్రజలు మంచినీటి సరఫరా సక్రమంగా లేనందువల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజులుగా మా ప్రాంతంలో, అందులోను ముఖ్యంగా మా వీధిలో మంచినీటి పంపులు పనిచేయడంలేదు. ప్రజలు త్రాగేటందుకు చుక్క నీరు దొరకక అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం బావినీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని పంపులు సరిగా పనిచేయునట్లు చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి. గోపాలకృష్ణ.

చిరునామా :
చీఫ్ ఇంజనీర్,
మంచినీటి సరఫరాశాఖ కార్యాలయం,
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 30.
ఉపకార వేతనాన్ని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు.
జవాబు:

వరంగల్,
X X X X X.

వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

అయ్యా,

నేను జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థిక శక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నాయందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గారికి,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 31.
పుస్తక విక్రేతకు లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

శ్రీయుతులు వి.జి.యస్. పబ్లిషర్స్
మేనేజర్ గారికి నమస్కారములు.

ఆర్యా!

ఈ దిగువ తెలియజేయబడిన పుస్తకాలను శ్రీ రామదాసు మోటారు ట్రాన్సుపోర్టు ద్వారా పార్శిలులో పంపించ ప్రార్థన. మీకు అడ్వాన్సుగా రూ.100/- (వంద రూపాయలు) పంపుచున్నాను. మిగిలిన పైకమును చెల్లించి పుస్తకముల పార్శిలు విడిపించుకొనగలవాడను. పుస్తకములపై తగిన కమీషన్ ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
పుస్తకముల వివరములు :

  1. పదో తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంకులు – 10 కాపీలు
  2. పదో తరగతి ఇంగ్లీషు క్వశ్చన్ బ్యాంకులు – 20 కాపీలు
  3. పదో తరగతి హిందీ క్వశ్చన్ బ్యాంకులు – 15 కాపీలు
  4. పదో తరగతి గణితశాస్త్రం క్వశ్చన్ బ్యాంకులు – 20 కాపీలు

ఇట్లు,
మీ విశ్వాసపాత్రుడు,
ఐ.వి. గణేష్కుమార్.

చిరునామా :
మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
నింబోలి అడ్డ, కాచిగూడ,
హైదరాబాదు.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 32.
దొంగిలింపబడిన సైకిలును గూర్చి సంబంధిత అధికారికి లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

స్టేషను హౌసు ఆఫీసరుగార్కి,
ఒకటవ టౌను పోలీసు స్టేషను,
వరంగల్.

ఆర్యా,

నేను మహాత్మాగాంధీజీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను. నేను నిన్న స్కూల్ విడిచిపెట్టిన తరువాత రవీంద్ర కేఫ్ టిఫిను తినడానికి వెడుతూ నా సైకిలు హోటల్ ఎదుట పెట్టి తాళం వేశాను. నా సైకిలు హేండిల్బారుపై “కె. రవి” అని పేరు ఉంది. నాది హీరో సైకిలు. రెండేళ్ళ క్రిందట కొన్నది. ఇంకా క్రొత్త సైకిలువలె రంగు మాయకుండ ఉన్నది. నలుపురంగు, సైకిలు నెంబరు 186281. స్టీలు ఊసలుగల చక్రాలు ఉన్నాయి.

దయతో నా సైకిలును గూర్చి దర్యాప్తుచేసి నాకు దానిని నా స్కూల్ వద్ద అప్పచెప్పవలసినదిగా కోరుచున్నాను.

ఇట్లు,
కాగితాల రవి,
‘పదవ తరగతి,
మహాత్మాగాంధీజీ హైస్కూల్,
వరంగల్.

చిరునామా:
స్టేషన్ హౌస్ ఆఫీసర్,
I టౌన్ పోలీస్ స్టేషన్,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 33.
నగరంలో మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి పత్రికా సంపాదకునికి లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకులకు,

ఆర్యా,

మన హైదరాబాదు నగరం వివిధ కాలుష్యాలకు లోనవుతూ ప్రజాజీవనం చాలా దుర్భరంగా తయారయింది. పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల అనేక కారణాలు ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తున్నాయి. మంచిగాలి, మంచి వాతావరణం రోజురోజుకూ కరువైపోతున్నాయి. ప్రకృతిలోని పచ్చనిచెట్లు మనిషికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విషయాన్ని గ్రహించి అందరు తమ ఇండ్లలోను, పరిసర ప్రాంతాలలోను, రోడ్ల ప్రక్కన మొక్కలను పెంచి నగర కాలుష్యం నుండి బయటపడునట్లు సహకరించవలసిందిగా మీ పత్రికా ముఖమున కోరుతున్నాము.

ఇట్లు,
తమ విధేయుడు,
పి. శ్రీనివాస్.

చిరునామా:
పత్రికా సంపాదకుడు,
ఈనాడు దినపత్రిక,
సోమాజిగూడ, హైదరాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 34.
నేత్రదానం చేయవలసిందిగా అందరిని ప్రోత్సహిస్తూ పత్రికలో ప్రచురించవలసిందిగా సంపాదకునికి లేఖ. (లేదా) నేత్రదానం ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికా సంపాదకుడికి లేఖ.
జవాబు:

వరంగల్,
X X X X X.

ఈనాడు పత్రికా సంపాదకునకు,

అయ్యా,

మన దేశంలో గ్రుడ్డితనంతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేనివారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వారి జీవితాలలో వెలుగు ప్రసాదింపజేయటం సాటి మానవులుగా మన కర్తవ్యం. అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి అన్ని దానాలలోకి నేత్రదానం చాలా గొప్పది. దీన్ని ప్రోత్సహిస్తూ మీ పత్రికలో ప్రచురించి ప్రజలు చైతన్యవంతులగునట్లు చేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఐ. గణేష్ కుమార్.

చిరునామా :
పత్రికా సంపాదకుడు,
‘ఈనాడు’ కార్యాలయం,
వరంగల్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 35.
రక్తదానం అవసరాన్ని తెలియజేస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ప్రియ మిత్రుడు నరేంద్రకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో రక్తదానం అవసరాన్ని గూర్చి తెలియజేస్తున్నాను.

కొన్ని పరిస్థితులలో తోటి మానవుని ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం ఎంతైనా అవసరం. అలాంటప్పుడు ఆ వ్యక్తియొక్క రక్త గ్రూపునకు సంబంధించిన రక్తాన్నే దానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు సంభవించవచ్చు. అప్పటికప్పుడు ఆయా రక్త గ్రూపు కలవారు దొరకటం చాలా కష్టం. కాబట్టి ముందుగానే రక్తదానం చేస్తే బ్లడ్ బ్యాంకులలో నిల్వచేసి అవసరం వచ్చినపుడు ఆయా వ్యక్తులకు ఉపయోగిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను రక్తదానం చేశాను. నీవు కూడా నాలాగే రక్తదానం అవసరాన్ని గుర్తించి అందుకు సహకరించగలవని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
ఆర్. నరేంద్ర, 10వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 36.
గురుపూజోత్సవం గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

పాల్వంచ,
X X X X X.

ప్రియమిత్రుడు ఆనందు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా ! మేము . మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నా కెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజారాం.

చిరునామా :
ఎస్. ఆనంద్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ఖమ్మం, ఖమ్మం జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 37.
ఉగ్రవాదం వల్ల సంభవిస్తున్న నష్టాలను వివరిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

ఆసిఫాబాద్,
X X X X X.

ప్రియ మిత్రురాలు సాయిచంద్రికకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. ఈ మధ్య దేశంలో ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నాయి. వాటిని గురించి ఈ లేఖలో తెలియజేయదలచాను.

ఉగ్రవాదం మన జాతీయ సమైక్యతకు తీవ్రభంగాన్ని, అశాంతిని కలిగిస్తున్నది. వారి పాశవిక చర్యలకు అనేకమంది తమ ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. అంతేకాక వారు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు నష్టపరుస్తున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏమీలేదు. కాబట్టి ఉగ్రవాదులు తమ దుష్టమైన మార్గాన్ని విడిచిపెట్టి దేశశ్రేయస్సుకు పాటుపడాలని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ మిత్రురాలు,
హరి అపర్ణ.

చిరునామా :
గార్లపాటి సాయిచంద్రిక,
10వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
మంచిర్యాల,
ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 38.
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి జిల్లాకలెక్టరుకు వినతిపత్రం :
జవాబు:

జోగిపేట,
X X X X X.

మెదక్ జిల్లా కలెక్టరుగారి దివ్యసముఖమునకు
జోగిపేట గ్రామ నివాసి వ్రాయు విన్నపం.

అయ్యా,

మాది ఆంథోల్ మండలంలోని జోగిపేట. మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు నివసిస్తున్నారు. ఏ రోజునకు ఆ రోజు కాయకష్టం చేసుకొని జీవిస్తున్నారు. మా గ్రామ ప్రజలు మరుగుదొడ్ల సౌకర్యంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడంవల్ల గ్రామంలోని వారంతా అనారోగ్యం పాలవుతున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను చేపట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. కాబట్టి మా గ్రామంలో హాడ్కో పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం జరుగునట్లు చూడవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
అక్క పెద్ద నర్సయ్య.

చిరునామా :
జిల్లాధికారి,
జిల్లాధికారి కార్యాలయం,
మెదక్, మెదక్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 39.
పాఠశాలలో కావలసిన సౌకర్యాలను కోరుతూ విద్యాశాఖాధికారికి లేఖ.
జవాబు:

ఉట్నూరు,
X X X X X.

ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి గారి దివ్యసముఖమునకు,

అయ్యా,

నేను ఉట్నూరు ఎస్.ఆర్.యం. హైస్కూలులో పదవతరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులందరికి సరిపడ తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. అలాగే మా పాఠశాలకు గ్రంథాలయ వసతి కాని, లేబరేటరి వసతికాని లేదు. వీటికి తోడు ఉపాధ్యాయుల కొరత కూడా కలదు. అందువల్ల మా కెంతో అసౌకర్యంగా ఉంది. తమరు దయయుంచి పై విషయాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేసి మా విద్యాభివృద్ధికి సహాయపడవలసినదిగా ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఆర్. రమేష్.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 40.
వ్యాయామశాల స్థాపనకై పత్రికా సంపాదకునకు లేఖ.
జవాబు:

వనపర్తి,
X X X X X.

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులకు,
వనపర్తి గ్రామ నివాసి వ్రాయు విన్నపం –

ఆర్యా

మానవుని మనుగడకు ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. శరీర ఆరోగ్యం బాగా ఉండాలంటే అందరూ తప్పక వ్యాయామం చేయాల్సిందే.

కుస్తీలు పట్టుట, బస్కీలు, దండెములు తీయుట, బరువైన వస్తువులు పైకెత్తుట మొదలైన వ్యాయామ సాధనకు ఒక వ్యాయామ శాల ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు కదా ! అలాంటి ఆరోగ్యానికి మూలం శరీర వ్యాయామం. ఈ వ్యాయామం చేయటానికి మా గ్రామంలో ఒక వ్యాయామశాలను ప్రభుత్వం స్థాపించే విధంగా తమ పత్రికాముఖంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
హరి బుచ్చికోటయ్య.

చిరునామా :
సంపాదకుడు,
‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక,
మహబూబ్నగర్,
మహబూబ్నగర్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 41.
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాలను గురించి మిత్రునకు లేఖ (ఆటల పోటీలు).
జవాబు:

హైదరాబాద్,
X X X X X.

ప్రియమిత్రుడు రాజేషు,

నేను క్షేమంగా ఉన్నాను. నీవుకూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ లేఖలో మా పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాలను గురించి తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం మా పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఈ క్రీడోత్సవాలలో జిల్లా నాల్గు మూలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. మా జిల్లాధికారి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కబాడి, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ మొదలైన ఆటల పోటీలు రెండురోజులపాటు జరిగాయి. మా పాఠశాల జట్టు బాస్కెట్బాల్ పోటీలో పాల్గొని విజయం సాధించింది. మీ పాఠశాలలో జరిగిన ఆటల పోటీలను గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కోట రవికుమార్.

చిరునామా :
పి. రాజేష్,
10వ తరగతి,
సెంట్రల్ పబ్లిక్ స్కూల్,
వరంగల్, వరంగల్ జిల్లా.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 42.
వేసవి సెలవులను గడిపే విధానాన్ని గురించి మిత్రునికి లేఖ.
జవాబు:

సంగారెడ్డి,
X X X X X.

ప్రియమిత్రుడు ఆనంద్కు,

నేను పబ్లిక్ పరీక్షలు బాగానే రాస్తున్నాను. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడను కావాలనే పట్టుదలతో బాగా చదివి పరీక్షలు ఎంతో శ్రద్ధగా రాస్తున్నాను.

పరీక్షలు అయిపోయిన తరువాత వేసవి సెలవులలో నేను కంప్యూటర్ విద్య నేర్చుకోవాలనుకొంటున్నాను. ఇంటర్మీడియట్లో కూడా నేను కంప్యూటర్ కోర్సు చదువతలచాను. అందువల్ల సెలవులు వృధా కాకుండా కంప్యూటర్ నేర్చుకోదలచాను. భవిష్యత్తులో కంప్యూటర్ ఇంజనీరు కావాలనేది నా ఆకాంక్ష. అందుకు ఎంతైనా శ్రమపడి చదవాలనుకొంటున్నాను. దీనికి తోడు ఇంగ్లీషు గ్రామర్ నేర్పే ‘కోచింగ్ సెంటర్’లో చేరి ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలనుకొంటున్నాను. ఈ విధంగా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకొంటున్నాను. నీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ మిత్రుడు,
చంద్రకాంత్.

చిరునామా :
పి. ఆనంద్, 10వ తరగతి,
విజ్ఞానభారతి విద్యాలయం,
ఆదిలాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 43.
నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను వివరిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

భీమ్గల్,
X X X X X.

ప్రియ మిత్రురాలు పద్మకు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను గురించి తెలియజేస్తున్నాను.

పిల్లలందరిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టాలి. బాల కార్మికులను గుర్తించి వారిని కూడా బడిలో చేర్పించాలి. నిరక్షరాస్యులైన వయోజనులను ప్రోత్సహించిన చదువు నేర్చేటట్లు చేయాలి. కనీసం చదవడం, వ్రాయడం, లెక్కలు చూడటమైనా వచ్చేలా చేయాలి. పాఠ్య గ్రంథాలు అందమైన చిత్రాలతో ఆకర్షణీయంగా ఉండేలా చూడాలి. పాఠ్యగ్రంథాలను అందరికీ ఉచితంగా అందజేయాలి. గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట రాత్రి పాఠశాలలు నెలకొల్పాలి.

ఈ విధంగా నిరక్షరాస్యతా నిర్మూలనకు నేను కొన్ని ప్రణాళికలను వేసుకున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇట్లు,

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
అగ్గిరాజు శ్రీవిద్య.

చిరునామా :
జి. పద్మ. 10వ తరగతి,
శ్రీగీత కాన్వెంట్ హైస్కూల్,
నందిపేట్, నిజామాబాద్.

TS 10th Class Telugu Grammar లేఖలు

ప్రశ్న 44.
పాఠ్య పుస్తకాలను త్వరగా విడుదల చెయ్యాలని డి.ఇ.ఓ. (జిల్లా విద్యాశాఖాధికారి) గారికి లేఖ.
జవాబు:

నిర్మల్,
X X X X X.

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి గారికి,

అయ్యా,

నేను నిర్మల్ మున్సిపల్ హైస్కూలులో పదవ తరగతి చదువుతున్నాను. పాఠశాలలు తెరచి రెండు నెలలు గడచినా మా నిర్మల్లో 10వ తరగతి పాఠ్యపుస్తకాలు ఒక్కటి కూడా లభించడం లేదు. మా పదవ తరగతి విద్యార్థులం ఎలా చదువుకోవాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నాం.

పైగా క్వార్టర్లీ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. కాబట్టి మీరు దయయుంచి ప్రభుత్వం ప్రచురించిన పదవ తరగతి పాఠ్యపుస్తకాలను త్వరలో మా పాఠశాలకు అందునట్లు చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
కోట రవి కుమార్.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గారు,
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,
ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.

Leave a Comment