Telangana SCERT 10th Class Telugu Grammar Telangana నినాదాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar నినాదాలు
ప్రశ్న 1.
‘స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా ఐదు నినాదాలు రాయండి. (June 2017)
జవాబు:
- ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
- స్త్రీవిద్యను ప్రోత్సహించు – ప్రగతిబాట పయనించు
- మహిళలు చదవాలి – స్వావలంబన సాధించాలి
- మహిళా చైతన్యం – సాధికారితకు సాకారం
- ఇల్లంతా చదివినట్లే – ఇల్లంతా చదివితే
ప్రశ్న 2.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు తయారుచేయండి. (June 2016)
జవాబు:
- దురాచారాలను తొలగించు – సమానతను పంచు.
- అంటరానితనం వద్దు – సంకుచితంగా మసలవద్దు.
- వరకట్నాన్ని నిర్మూలిద్దాం – ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుదాం.
- కులంకన్న గుణంమిన్న.
- అసమానతలకు దూరంగా ఉండు – అందరికి ఆదర్శంగా జీవించు.
- కులమతాలను దూరం చేయి – సమసమాజాన్ని అందించు.
ప్రశ్న 3.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి. (March 2015)
జవాబు:
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు
సూక్తులు:
మాటకు ప్రాణం సత్యం
అభాగ్యతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ
ప్రశ్న 4.
నగర జీవనంపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
- “నగరంలో మనిషి జీవితం – చదవదగ్గ ఒక గ్రంథం”.
- “నగరజీవికి తీరిక దక్కదు – నగరజీవికి కోరిక తీరదు”.
- “నగరంలో మనిషివి మెర్క్యూరి నవ్వులు – నగరంలో మనిషివి పాదరసం నడకలు”.
- “నగరంలో వాహనాల రద్దీ – అవుతాడు మనిషి రోగాల బందీ”.
- “నగరంలో కొందరికి సుఖాల నెలవు – కొందరికి కష్టాల కొలువు”.
- “విద్యా – వైద్య కేంద్రం నగరం – విలాసాల సంద్రం నగరం”.
- “సాంకేతికతకు పెద్దన్న నగరం – వ్యాపారాలు దండిగున్నది నగరం”.
- “పల్లె తల్లివంటిది – నగరం ప్రియరాలివంటిది”.
ప్రశ్న 5.
ఆడపిల్లను సమానంగా చూడాలన్న అంశంపై ఐదు నినాదాలు రాయండి.
జవాబు:
- ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్థిల్లాలి.
- ఆడపిల్ల – ఆ ఇంటి మహాలక్ష్మి.
- ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
- ఆడపిల్ల చదువు – దేశానికది మలుపు.
- అమ్మాయైనా, అబ్బాయైనా ఇద్దరూ సమానమే.
ప్రశ్న 6.
తెలుగుభాష గొప్పతనంపై స్వంతంగా 5 నినాదాలు తయారుచేయండి. (June 2019)
జవాబు:
- దేశ భాషలందు తెలుగు లెస్స
- తెలుగుతేట, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్నం
- ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ – తెలుగు
- జన్మజన్మల తపస్సు ఫలం – తెలుగు వారిగా జన్మించడం.
- కమ్మనైన భాష – తెలుగు భాష
ప్రశ్న 7.
స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా 5 నినాదాలు వ్రాయండి. (June 2017)
జవాబు:
ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
మహిళల చదువు – ప్రగతికి మదుపు
విద్య నేర్చిన స్త్రీ – వివేకానికి చుక్కాని
నేడు చదువుకున్న స్త్రీలు – రేపటి దేశనాయికామణులు
ఇంట్లో చదువురాని స్త్రీ ఉంటే – కళ్ళున్నా చూడలేని గ్రుడ్డివాళ్ళు.
విద్యావతియైన తల్లి – ఆయింట వెలసిన కల్పవల్లి.
ప్రశ్న 8.
సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 5 నినాదాలు వ్రాయండి. (June 2016)
జవాబు:
వైధవ్య వివాహాలు – భావిభారతకు సౌభాగ్యాలు
మత పిశాచాలను చంపు – మమతానుబంధాల్ని పెంచు
అంటరానితనము – సమాజాన్ని కూల్చే అణుబాంబు
మూఢవిశ్వాసాన్ని త్యజించు – నూత్న సత్యాన్ని ఆహ్వానించు
శకునాలు చూడడం – పిఱికితనాన్ని గౌరవించడం.
ప్రశ్న 9.
ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెల్పుతూ నినాదాలు, సూక్తులు వ్రాయండి. (March 2015)
జవాబు:
నినాదాలు :
ఆడి తప్పకూడదు – పలికి బొంక కూడదు.
ఆడితప్పకు – ఇచ్చిదెప్పకు
ఇచ్చిన మాట నిలబెట్టండి – నీతిగా జీవించండి
రక్తదానం – ప్రాణత్యాగానికి ప్రతీక
అవయవదానం చెయ్యండి – మరణమొందిన జీవిస్తారు.
సూక్తులు :
మాటకు ప్రాణం సత్యం
అభ్యాగతులకు దానం – అందిపుచ్చుకున్న మోక్షధనం.
కుడి చేత్తో ఇచ్చింది – ఎడమచేతికి తెలియనిది
సత్యం వంటి సుకృతం – అసత్యం వంటి పాతకం సృష్టిలో లేవు
మానవసేవయే – మాధవసేవ
దాతలేని ఊరు – దరిద్రానికి మరోపేరు
అభిమానధనులు – మాట తప్పని ఘనులు
దానం చెయ్యని చెయ్యి – అడవిలో పెరిగిన కొయ్య
దాతలేని కొంప – దయ్యాల పెనువాడ
ప్రశ్న 10.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు – సూక్తులు రాయండి.
జవాబు:
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా – ప్రతి మానవుడు తల్లికి బిడ్డే
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో – అక్కడ దేవతలు పూజలందుకుంటారు.
సృష్టికి మూలం స్త్రీ – ప్రేమకు పెన్నిధి స్త్రీ
స్త్రీ లేని ಇಲ್ಲು – గుండెలేని శరీరం
ఇంటిని ఇల్లాలు – కంటిని రెప్పలు కాపాడుతాయి ఇంటికి దీపం ఇల్లాలు
స్త్రీలే జాతికి మణిదీపాలు – స్త్రీలే జగతికి ఆణిముత్యాలు
స్త్రీ సమాజానికి వెన్నుముక – పల్లె సీమలు దేశానికి వెన్నుముక
అమ్మలేని జీవితం – కన్నతల్లి, తల్లిని కన్న దేశం – స్వర్గాని కన్నా గొప్పది.
ప్రశ్న 11.
నీకు తెలిసిన పల్లెసీమల అందాల్ని గూర్చి సూక్తులు రాయండి.
జవాబు:
పల్లెసీమల అందం – పసిడి పంటల నిలయం
పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు
పాడిపంటలతో పల్లెలు – పసిడి నవ్వులతో పిల్లలు
సమాజానికి మూలనిధులు
పల్లెల సీమల జగతి – దేశాభివృద్ధుల ప్రగతి.
పల్లె సీమలే మన దేశపుధాన్యాగారాలు.
రణగొణ ధ్వనులు లేని పల్లెటూళ్ళు – ప్రశాంతమైన పరుకటిళ్ళు
దేశానికి పట్టుగొమ్మలు – మన పల్లెటూళ్ళు.
ప్రశ్న 12.
తెలుగు తియ్యదనాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తేనెలొలుకు తెలుగు పలుకు.
యాభై ఆరు రెక్కలున్న పులుగు తెలుగు.
‘కొమ్ము’ లుండి పొగరు లేని నెమ్మదైన తెలుగు.
తేనె తేటల ఊట తెలుగుమాట.
కూతకు రాతకు భేదం లేని భాష తెలుగు.
చెఱకు గడలకు లేదు తెలుగుల తియ్యదనము.
దేశభాషలందు తెలుగు లెస్స.
ప్రశ్న 13.
తెలంగాణ వైభవాన్ని తెలిపే నినాదాలు రాయండి.
జవాబు:
తెలంగాణ వీరుల గడ్డ – త్యాగాలకు అడ్డ.
కాకతీయుల కదనరంగం తెలంగాణ
కళలకు మూలస్తంభం తెలంగాణ
సర్వమానవ సమానత్వం అది తెలంగాణ తత్త్వం.
దాశరథి పద్యాలు వరద గోదావరి పరవళ్ళు.
తెలంగాణ కోటి రత్నాల వీణ.
భిన్న సంస్కృతుల సంగమం తెలంగాణ.
కలం పట్టిన కవులెందరికో కన్నతల్లి తెలంగాణ.
గలగలమని నదులు నడయాడిన నేల తెలంగాణ.
ప్రశ్న 14.
పల్లె గొప్పదనాన్ని తెలిపే సూక్తులు రాయండి.
జవాబు:
దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు.
పల్లెలు తల్లి వంటిది. పట్నం ప్రియురాలి వంటిది
పల్లె రమ్మంటుంది. పట్నం తెమ్మంటుంది.
పల్లెను దైవం సృష్టిస్తే, పట్నం మానవుడు నిర్మించాడు.
పల్లె గేయం, పట్నం నాటకీయం.
పల్లెల్లో దైవత్వం నిండి ఉంటుంది.
ప్రశ్న 15.
ప్రకృతి వైభవాన్ని చాటే సూక్తులు తెలపండి.
జవాబు:
ప్రకృతి మన మాతృమూర్తి.
పుస్తకాల కన్నా ప్రకృతి ఎక్కువ విషయాలను నేర్పుతుంది.
ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు.
తనను ప్రేమించే హృదయాన్ని ప్రకృతి ఎన్నడూ మోసగించదు.
ప్రకృతి ఒడిలో పూల హృదయం వికసిస్తుంది.
ప్రకృతి సౌందర్యానికి పర్వతాలే సర్వస్వం.
ప్రకృతి హక్కులనివ్వదు, బాధ్యతలను గుర్తు చేస్తుంది.
ప్రకృతి పుస్తకానికి రచయిత దేవుడే.
ప్రకృతికి విధేయులమై ఉన్నప్పుడే దానిని మనం ఆజ్ఞాపించగలం.
ప్రకృతిలో బహుమతులు గాని, శిక్షలు గాని లేవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి.
ప్రకృతిని అధ్యయనం చేయి, ప్రకృతి సత్యానికి స్నేహితురాలు.
ప్రశ్న 16.
పట్టణం / నగరం గూర్చి సూక్తులు :
జవాబు:
పట్టణాలు మనుషుల ఎదుగుదలకు దోహదపడి,
సంభాషణా చతురులుగా మారుస్తాయి.
గొప్పవారైన స్త్రీ పురుషులకు నిలయం పట్టణం.
విద్యలకు ఆటపట్టు నగరం.
కొత్తపాతల కలయిక పట్టణం..
నవ్య సంప్రదాయాలు, నూత్న ధోరణలు, విలాసవంతమైన
జీవితాలు పట్టణాలు, భిన్నత్వంలో ఏకత్వం ప్రతి పాదిస్తుంది నగరం.
ధనశక్తిని శ్రమశక్తిని బదలాయింపు చేసుకొనే నిలయాలు నగరాలు.
ప్రశ్న 17.
పద్యం, కవి విశిష్టతలను తెలిపే సూక్తులు రాయండి :
జవాబు:
శతక పద్యాలు ద్రాక్షా గుత్తుల వంటివి, దేని రుచి దానిదే.
రాజుకు కిరీటం, పద్యానికి మకుటం, దేని అందం దానిదే.
పద్య కవి ప్రజల నాల్కులపై ఆడుతుంటాడు.
శృతి, లయ ప్రధానమైన పద్యం ఎప్పుడూ హృద్యమే.
కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి.
రవి గాంచని చోటు కవి గాంచును.
అల్పాక్షరాలతో అనల్పార్థానిచ్చేదే పద్యం.
తక్కువ పదాలతో ఎక్కువ విషయాలు చెప్పేది పద్యం.
ఛందస్సు కాదు ఛందోబద్ధమైన వాదన పద్యాన్ని తయారుచేస్తుంది.
పద్యం ఒక ఔషధం వంటిది.
గన్ను పేలితే నాశనం. పెన్ను కదిలితే ప్రేరణ, చైతన్యమే.
పద్యం కొన్ని సమయాల్లో తత్త్వశాస్త్రంలా ఉంటుంది.
చరిత్ర కన్నా గంభీరంగా ఉంటుంది.
పద్యం శబ్ద, అర్థ, ఛందస్సుల త్రివేణి సంగమం.
ప్రశ్న 18.
పత్రిక విశిష్టతను తెలుపుతూ సూక్తులు రాయండి.
జవాబు:
సమాజంలోని సంఘటనలను మన ముందరుంచేవి. పత్రికలు.
North + East + West + South ల కలయికయే వార్త.
వార్తల కదంబమే పత్రిక
ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చేది పత్రికలు.
పత్రికా హృదయమే సంపాదకీయం.
అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు మెరుపుల కదలిక.
ప్రశ్న 19.
నిస్వార్థ త్యాగం మనిషిని చరిత్రలో శాశ్వతంగా నిలుపుతుంది కదా ! ‘త్యాగం’ ఆధారంగా చేసుకొని కొన్ని సూక్తులు రాయండి.
జవాబు:
తన కోసం చేసేది స్వార్థం. ఇతరుల కోసం చేసేది త్యాగం.
ఏ దేశంలో త్యాగమనే గుణం అపారంగా ఉంటుందో,
ఆ దేశం ఉన్నత లక్ష్యాలను అందుకోవడం ఖాయం.
త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.
స్వర్గ ద్వారాన్ని తెరిచే బంగారు తాళపు చెవి త్యాగం.
చిన్న చిన్న త్యాగాల ద్వారానే మనిషికి మంచితనం అబ్బుతుంది.
గొప్ప కార్యాలెప్పుడూ గొప్ప త్యాగాల వల్లనే సాధించ బడతాయి.
త్యాగం వల్ల శాంతి కలుగుతుంది.
త్యాగానికి పట్టం కడితేనే ప్రేమకు స్వాగతం పలకడానికి వీలవుతుంది.
కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయడమే త్యాగం.
‘తప్పులు అందరూ చేయగలిగితే, త్యాగాలు కొందరే చేయగలుగుతారు.
త్యాగధనులకు ఆదర్శాలుంటాయి. ఇతరులకు కోరికలుంటాయి..
ప్రశ్న 20.
కోపం అనర్థదాయకం అని చెప్పే సూక్తులు రాయండి.
జవాబు:
తన కోపమే తన శత్రువు.
కోపమున ఘనత కొంచమై పోవును.
బుద్ధిగల వాళ్ళకు కోపం కొనియాడదగింది కాదు.
కోపం ఆవహిస్తే వివేకం విడాకులిస్తుంది.
క్రోధం తమోగుణ లక్షణం, క్రోధ పరవశుడైన వ్యక్తి వివేకాన్ని కోల్పోతాడు.
కోపం శాపానికి ధూపం.
కోపిష్టి నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.
కోపంలో చేసిన పనులకు తీరికగా పశ్చాత్తాపపడతాం.
క్రోధాన్ని అణచడమే మానవత్వం.
కంఠస్వరం పెద్దదయ్యేకొద్దీ బుద్ధి చిన్నదవుతుంది.
కోపం ధర్మకార్యాలకు ఆటంకం అవుతుంది.
క్రోధాన్ని అణగద్రొక్కిననాడే ఆనందం ప్రాప్తిస్తుంది.
ప్రశ్న 21.
సమాజం గురించి నినాదాలు రాయండి.:
జవాబు:
మనిషి నిజమైన జీవితం సమాజంలోనే ఉంది.
సమాజమే సమస్త శక్తికి మూల సదస్సు.
సమాజాన్ని కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడవద్దు,
దానిలో ఇమడలేని వాళ్ళే అలా మాట్లాడతారు.
సమాజంలో ఇమడలేని వాడికి సమాజం ద్వారా సుఖం లభించదు.
సమాజంలోని జీవించలేనివాడు పశువైనా అయి
ఉండాలి లేదా దేవుడైనా అయి ఉండాలి..
చీమలు మంచి పౌరులు. క్రమశిక్షణ కల అవి సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తాయి.
హిందూ సంస్కృతికి మూలం సమాజం. రాజకీయాలు కాదు.
ప్రశ్న 22.
సమస్యలను చూసి భయపడేవారికి ధైర్యాన్ని కలిగించే సూక్తులను రాయండి.
జవాబు:
భయపడకు నేస్తం. ఉంటుంది ఆదుకొనే హస్తం.
సమస్యల వల్ల కష్టాలు రావు.
కష్టాలే ఉంటాయనుకొంటే సమస్యలు పెరుగుతాయి.
ప్రతి సమస్యనూ కాలం పరిష్కరిస్తుంది.
సమస్యలు ఏర్పడినపుడే బుర్ర చురుకుగా పనిచేస్తుంది.
సమస్యలు లేని జీవితం పందిరి లేని పాదు వంటిది.
సమస్యలు మనుషులకు కాక మానులకొస్తాయా ?
సాధన చేస్తే సాధ్యం కానిది లేదు.
ప్రయత్నిస్తే పరమాత్మైనా కనిపిస్తాడు.
ధైర్యమే విజయం.