TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

Telangana SCERT 10th Class Telugu Grammar Telangana ఇంటర్వ్యూలు Questions and Answers.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
మీ గ్రామానికి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తను చేయడానికి పది ప్రశ్నలు ఇంటర్వ్యూ తయారుచేయండి. (June 2018)
జవాబు:
ప్రశ్నావళి (ఇంటర్వ్యూ): మా గ్రామానికి విచ్చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తకు నమస్కారములు.
ప్రశ్నలు:

  1. మీ పేరు మా అందరికీ తెలుసు. అయినా మీ నోటితో మీ పేరు వినాలని మా కుతూహలం. మీ పేరు చెప్పండి.
  2. మీ స్వగ్రామం ఏది ?
  3. మీరు మీ విద్యాభ్యాసం మీ గ్రామంలోనే కొనసాగించారా ?
  4. మీ తండ్రి గారి వృత్తి ఏమిటి ?
  5. వ్యవసాయం అంటే మీకు ఎప్పటి నుండి ఆసక్తి కలిగింది ?
  6. వ్యవసాయ శాస్త్రవేత్త కావాలన్నది మీ కోరికా ? ఆశయమా ?
  7. మీకు ప్రేరణ ఎవరు ? వివరించండి.
  8. మీ ఈ శాస్త్రజ్ఞానం వలన సమాజానికి ఉపయోగం ఏమిటి ?
  9. మీరు వ్యవసాయ శాస్త్రవేత్తగా సాధించిన విజయాలు ఏమిటి ? వివరించండి.
  10. నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి ?

మీ వంటి వ్యవసాయ శాస్త్రవేత్త మా గ్రామానికి వచ్చి, మాకు సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

OR

  1. సర్ ! భూసార పరీక్ష ద్వారా నేల ఏ పంటకు అనుకూలమో చెప్పడం దేని ద్వారా తెలుస్తుంది ?
  2. మెట్ట పంటలు, మాగాణి పంటలు నేలను బట్టి వేరు చేస్తారా ? లేక నీటి వసతిని బట్టి వేరు చేస్తారా ?
  3. వ్యవసాయ శాస్త్రవేత్త కావడానికి ఏ చదువు చదవాలి ?
  4. భూసార పరీక్షలు సత్ఫలితాలే ఇస్తాయా ?
  5. రసాయన ఎరువులు నష్టాన్ని కలిగిస్తాయని ఇప్పుడు చెబుతున్నారు ? అలాంటి వాటిని తయారు చేసి రైతులకు ఎందుకు ఇస్తున్నారు ?
  6. సేంద్రియ ఎరువుల వాడకం మీద ప్రచారం ప్రభుత్వమే బాధ్యతగా చేయవచ్చు కదా ?
  7. వరి పంటలలో రకరకాల పేర్లతో (సన్నాలు, BPTL, 92 ….. ఇలా) ఎలా తయారు చేస్తారు ?
  8. మీరు ఏదైనా ప్రయోగం చేశారా ?
  9. యువకులకు, విద్యార్థులకు, రైతులకు మీరిచ్చే సందేశం ?

ప్రశ్న 2.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ వస్తున్నాడు. అతనిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి.
జవాబు:

  1. ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్ గార్కి మా ఆహ్వానము.
  2. మీకు నచ్చిన నేటి క్రికెటర్ ఎవరు ?
  3. విరాట్ కోహ్లి మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని మీరనుకుంటున్నారా ?
  4. మీకు క్రికెట్పై ఆసక్తి కల్పించిన వారు ఎవరు ?
  5. మీరు మొదటగా జాతీయ క్రికెట్ జట్టులో చేరాక ఏ దేశంలో క్రికెట్ ఆడారు ?
  6. మీకు ‘వన్డే క్రికెట్’, ‘ఇరవై ఓవర్ల క్రికెట్, టెస్టులు’ – వీటిలో ఏవంటే ఇష్టం ?
  7. ఎమ్.పి.గా అయ్యాక మీరు చేసిన దేశసేవ ఏమిటి ?
  8. మీరు అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో ఎన్ని శతకాలు చేశారు ?
  9. పాఠశాల దశలో మీ క్రికెట్ జీవితం గూర్చి తెలుపండి.
  10. మీకు నచ్చిన ప్రముఖ క్రికెట్ వీరుడు ఎవరు ?
  11. మీరు మెచ్చే ఇతర ఆటలు ఏవి ?
  12. మీరు మీ పిల్లలకు ఇచ్చే సందేశం ఏమిటి ?
  13. నేటి కాన్వెంటులలో చదువుకు ఇచ్చే ప్రాముఖ్యత, ఆటలకు ఇవ్వడం లేదని మీరు అనుకుంటున్నారా ?
  14. మీకు పిల్లలు ఎందరు ? వాళ్ళు క్రికెట్ ఆడతారా ? మీ అబ్బాయి పేరు చెప్పండి.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
మీ పాఠశాలలకు విద్యార్థుల్ని పరీక్షచేయుటకు ‘పిల్లల డాక్టరు’ వచ్చారు. వారిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరించండి.
జవాబు:

  1. నమస్కారం డాక్టరు గారూ !
  2. నాతోటి బాలబాలికల్ని ఎప్పుడెప్పుడు వచ్చి పరీక్షిస్తారు ?
  3. సర్వ సాధారణంగా విద్యార్థుల్లో వచ్చే వ్యాధులేమిటి ? వాటికి నివారణోపాయాలేమిటి ?
  4. కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థుల్లో ‘డిస్లెక్సియా’ వ్యాధి వస్తూంటుంది అని నేను విన్నాను. దాని లక్షణాలేంటి ? ఆ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలి ?
  5. పేద విద్యార్థులకు మందులు కొనే పరిస్థితి లేదు. వారికి మందులిప్పించే ఏర్పాటు చేయగలరా ?
  6. మేం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన సలహాల్ని ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.

ప్రశ్న 4.
మీ పాఠశాలకు ఒక ప్రసిద్ధ సినిమా నాయకుడు వచ్చాడు. ఆ నాయకుణ్ని చూసి మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు చెప్పండి.
జవాబు:

  1. నమస్కారం ప్రసిద్ధ సినిమా హీరోగారికి !
  2. అగ్రనటులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  3. ఈ స్థాయికి రావడానికి కారకులెవరు ? ఎలా కష్టపడ్డారు?
  4. మీరేమైనా సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారా ?
  5. అవయవదానాలపై మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు చలనచిత్ర రంగానికి రావడానికి కారకు లెవరు ? మిమ్మల్ని ప్రోత్సహించినదెవరు ?
  7. ఈనాటి సినిమాల్లో స్త్రీని అర్ధనగ్న వేషధారణలో చూపిస్తున్నారు కదా ! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  8. “యత్ర నార్యన్తు పూజ్యన్తో తత్రరమన్తి దేవతాః” అని కూడా ఆర్యోక్తి. దీనిపై మీ స్పందన ఎలా తెలియజేస్తారు ?
  9. సినిమా జీవితంలో మీ వారసత్వం ఉంటుందా ?
  10. విద్యార్థులకు మీరిచ్చే సందేశమేమిటి ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 5.
మీకు చదువు చెప్పిన గురువులు మీ పాఠశాలకు ఆహ్వానంపై వచ్చారు. ఎలా స్పందించి ఇంటర్వ్యూ చేస్తారో తెల్పండి.
జవాబు:

  1. నమోనమః గురువుగారు !
  2. చాలా కాలానికి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది గురువు గారూ?
  3. ఇంకా మీరు కావ్యాల్ని రాస్తున్నారా ?
  4. మీకేమైనా అవార్డులు వచ్చాయా ?
  5. ఈనాడున్న విద్యా వ్యవస్థపై ఎలా స్పందిస్తారు స్వామీ ?
  6. గురువుగారు, అమ్మగారు బాగున్నారా ? ఏం చేస్తున్నారు ?
  7. ‘చిన్ని’ ఎలాగున్నాడు ? ఉద్యోగం చేస్తున్నాడా ?
  8. గురువుగారూ ! మా పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని. గురించి సందేశం ఇవ్వమని కోరుచున్నాను ?

ప్రశ్న 6.
మీ పాఠశాలలో జరుగబోయే అష్టావధానంలో నీవే అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడవైతే ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:

  1. రాజకీయ పక్షాన్ని, విందును ఆంగ్లంలో ఒకటే పదం వాడతాం. అది ఏమిటి ?
  2. మోతరాని డోలు ఏది ?
  3. గుడ్డ నెత్తి మీద ఉంటే ఏమంటారు ?
  4. పావుసేరు పాలల్లో పాలెన్ని ?
  5. పళ్ళూడిన రానిదెవరికి ?
  6. తినలేని తీపి ఏది ?
  7. హైదరాబాదులో ప్రశాంతంగా జీవించాలంటే ఎక్కడ నివసించాలి ?
  8. ‘నిదానమే ప్రధానం’ అని పెద్దలు ఎందుకు అన్నారు ?
  9. ఎన్ని తిన్నా లావు కానిదెప్పుడు ?
  10. వెలుగులేని మెరుపు ఏది ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
దానశీలం పాఠం విన్న తర్వాత నీకు ఏవైనా అనుమానాలు వచ్చాయా? వాటిని గూర్చి మీ గురువు గారిని ఏమని అడిగావు ?
జవాబు:

  1. మంచివాడైనా బలిని వామనుడు ఎందుకు దానం అడిగాడు ?
  2. బలి చేసిన పనిని బట్టి గురువుల మాట వినాలా ? వద్దా ?
  3. ‘ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా భరిస్తాను’ అన్న భూదేవి మాటలకు అర్థం ఏమిటి ?
  4. వింధ్యావళి లాగా ఈ నాటి స్త్రీలు ఉండగలరా ?
  5. చిన్నవాడు, రాక్షస జాతికి పరమవిరోధి అయిన వామనుని కాళ్ళు బలి చక్రవర్తి ఎందుకు కడగాలనుకున్నాడు ?
  6. నీటిని ధారపోసినంత మాత్రంతోనే హక్కులు పోగొట్టుకుంటామా ?

ప్రశ్న 8.
మీ పాఠశాలకు దాశరథి కృష్ణమాచార్యుల వారసులు (పిల్లలు) వస్తే వారిని మీరు ఏమి అడుగుతారు ?
జవాబు:

  1. దాశరథివారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం నుండి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ?
  2. దాశరథి గారికి నచ్చిన కవి, స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు ?
  3. తన భావాలను మీలో ఎవరితో ఎక్కువగా పంచుకొనేవారు ?
  4. దాశరథి గారిని జైలులో పెట్టినప్పుడు మీకు భయం వేసి, కవితలు రాయొద్దని చెప్పలేదా ?
  5. దాశరథిగారి స్నేహితుల్లో కవులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినపుడు మీ భావన ఎలా ఉంటుంది ?
  6. ఖాళీ సమయాన్ని ఆయన ఎలా గడిపేవారు ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 9.
సమాజసేవ చేసే పెద్దలెవరైనా మీ పాఠశాలకు వస్తే వారిని మీరేమి అడుగుతారు ?
జవాబు:

  1. సమాజసేవ చేయాలనే భావన మీకు ఏ వయసులో కలిగింది ?
  2. ఈ భావన ఎందుకు కలిగింది ?
  3. తొలిగా దేనితో ఈ సేవ ప్రారంభించారు ?
  4. ఇలా చేయడంలో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు ?
  5. మీరు ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో అంతర్యం ఏమిటి ?
  6. ఈ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ?
  7. ఎప్పుడైనా సేవ చేయడం విషయంలో మనసు మార్చుకున్నారా ?
  8. ఈపనిలో మీకుటుంబసభ్యులు సహకరించారా ?

ప్రశ్న 10.
మీ కళాశాల రజతోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు కదా ! మీ కళాశాలకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో తెల్పండి.
జవాబు:

  1. అయ్యా ! ముఖ్యమంత్రి గారూ ! నమస్కారం !
  2. మీ రాజకీయ జీవితం బాగుందా ?
  3. మీరు ఉపాధ్యాయవృత్తిని వదలి రాజకీయాల్లోకి ఎందుకువచ్చారు ?
  4. ఉపాధ్యాయ వృత్తిలో మనశ్శాంతి కల్గలేదా ?
  5. మీరు రాజకీయాల్లోకి రావడానికి స్వాగతించినది ఎవరు ?
  6. రాజకీయాల్లోనికి రావడానికి ప్రోత్సహించినదెవరు ?
  7. ముఖ్యమంత్రిగా ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ? వాటిని ఎలా పరిష్కరిస్తారు ?
  8. విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయమేంటి ?
  9. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో 5 + 5 + 2 + 3 విధానం ఉంది కదా ! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  10. ఇటీవలే C.G.E మెథడ్ను అమలుపర్చారు కదా ! కాని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలవారు వ్యతిరేకిస్తున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు ?
  11. మీకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయా ? మీ అభిప్రాయాన్ని కేంద్రం వారు స్వాగతిస్తున్నారా ?
  12. రాజకీయంలో మీ వారసత్వం సంప్రదాయాన్ని పాటిస్తారా ?
  13. విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశమేమిటి ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
మీరు 100 పద్యాలు ధారణ చేశారు. ఈ విషయంలో నేర్చుకొనేవారికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:

  1. ఏ శతకం అయితే ధారణ చేయబోతున్నారో దానిలో పద్యాలకు భావాలు తెల్సి ఉండాలి.
  2. ముందు ఒక పద్యం, తర్వాత రెండవ పద్యం, తర్వాత ఒకటి, రెండు పద్యాలు, తర్వాత మూడవ పద్యం, తర్వాత ఒకటి, రెండు, మూడు పద్యాలు ఇలా ప్రతిసారీ ముందు పద్యాలను కలుపుకుంటూ ధారణ చేయాలి.
  3. ఇలా ధారణ చేస్తూ, ఇరవై ఐదు పద్యాలు ఒక భాగంగా శతకాన్ని భావిస్తూ యాభై, డెబ్భైఐదు, నూటయెనిమిది పద్యాలు (మూడుభాగాలు) మొత్తం నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.
  4. నూటయెనిమిది పద్యాలు ధారణ చేయడంతో పాటు ఎక్కడ అడిగినా చెప్పేటట్లుగా నిన్ను నీవు తీర్చిదిద్దుకోవాలి.
  5. పద్యాలను చూడకుండా రాయడం కూడా మేలే.
  6. గర్వం ఎక్కడా, రాకుండా చూసుకోవాలి.

ప్రశ్న 12.
నిరుత్సాహం, జీవితంపై విరక్తి కల్గినవారు మీకు ఎదురైతే వారితో మీరు ఏం మాట్లాడతారు ?
జవాబు:

  1. దేనికి నీవు ఇలా ఉన్నావు ?
  2. అంతమాత్రాన అలా అయిపోతావా ?
  3. జీవితం మీద నీకు ఆశ లేదా ?
  4. నీవు ఇలా ఉంటే నీ వాళ్ళు ఎంత బాధపడతారో కదా !
  5. ఒక్కసారి మళ్ళీ ఆలోచించు, ఎక్కడ లోపం జరిగింది ?
  6. ఎంత కష్టమొచ్చినా స్థిరంగా ఉండడం నేర్చుకో, అప్పుడు భయం ఉండదు.
  7. ఏదో చూసి భయపడితే, ప్రతిదీ నిన్ను భయపెడుతుంది.
  8. చాలా సంతోషంగా ఉంది. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండు. మళ్ళీ కలుద్దాం.

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 13.
మీ పాఠశాల తరుఫున చూసిన పర్యాటక ప్రదేశంలో నీకు కల్గిన అనుమానాలను మీ గురువుతో ఏమని అడుగుతావు ?
జవాబు:

  1. గోలకొండ కోటలో మిద్దెల మీద రూఫ్గ గార్డెన్స్ ఏర్పాటు ఆ రోజుల్లోనే ఎలా చేయగలిగారు ? ఈ ఆలోచన ఎలా వచ్చింది ?
  2. ఒక వృక్షాన్ని ఇతర దేశాల నుండి తెప్పించుకొనే ఆలోచన ఎలా కల్గింది
  3. ఒక ముస్లిం రాజు బ్రాహ్మణ భక్తి కలవాడై మత సామరస్యాన్ని చాటాడు. తర్వాత కాలంలో వచ్చిన నైజాం నవాబు తెలంగాణ నేలపై హింసను ప్రజ్వరిల్ల చేశాడు. ఎందుకు ఈ తేడా ?
  4. మహామారీ పీడ తొలగించడానికి సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలు చేశారని, దాని ఫలితంగా ఆ పీడ పోయిందంటారు. ఆ రోజుల్లో జన విజ్ఞాన కేంద్రాలు లేవా ?
  5. ఉమ్రావు విహారానికి రావడంలోని ఆర్భాటం నేటి నాయకుల వృథా ప్రయాణాలను తలపిస్తోంది. ప్రజల సొమ్ము దుబారా కావడం లేదా ?

TS 10th Class Telugu Grammar ఇంటర్వ్యూలు

ప్రశ్న 14.
మీ పాఠశాలకు సినీ యాక్టర్ వస్తే అతనిని ఎటువంటి ప్రశ్నలను అడుగుతావు ?
జవాబు:

  1. సినిమారంగం వైపు రావడానికి గల కారణం ఏమిటి ?
  2. సినిమారంగం అంటేనే విలాసాల జీవితం అంటారు. మీరూ ఇంతేనా ! లేక మీ ఆదాయంలో కొంత దానధర్మాలు వంటివి చేస్తారా ?
  3. మీ దృష్టిలో హీరోయిజం అంటే ఏమిటి ?
  4. హీరో, హీరోయిన్ పైన కిందా పడితే పాట, హీరో, విలన్ పైనా కిందా పడితే పాట ! ఇదేనా సినిమా అంటే ?
  5. సంగీతం అంటే డబ్బాలో రాళ్ళు వేసినట్టు మోతేనా ? మీ సినిమాల్లో మెలోడీస్ తక్కువ ఉన్నాయి ఎందుకు ?
  6. కథలో భాగంగా హాస్యం మీ సినిమాల్లో ఉంటే బాగుంటుందేమో ?
  7. మాతో మీ విలువైన సమయం, అభిప్రాయాలు పంచుకున్నందుకు థ్యాంక్స్.

Leave a Comment