These TS 10th Class Telugu Bits with Answers 4th Lesson కొత్తబాట will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 4th Lesson కొత్తబాట
బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు (1 మార్కు)
ప్రశ్న 1.
నీళ్ళు వదలు ………………………..
జవాబు:
బ్యాంకు దివాళా తీయడంతో, మా డిపాజిట్టు సొమ్ముకు నీళ్ళు వదులుకున్నాము.
ప్రశ్న 2.
అనిదం పూర్వము ……………………
జవాబు:
మోడీ ప్రధాని కావడంతో, భారతదేశానికి (పూర్వమందు లేని) అనిదంపూర్వమైన విఖ్యాతి వచ్చింది.
ప్రశ్న 3.
కొంపముంచు ………………………….
జవాబు:
గ్రామంలో సారా దుకాణం తెరచి, ప్రభుత్వం మా ప్రజల కొంపముంచింది.
ప్రశ్న 4.
వరుసవావి ……………………………
జవాబు:
వరుసవావి లేకుండా, అందరితో వేళాకోళాలు పనికిరావు.
ప్రశ్న 5.
కళకళలాడు ………………………
జవాబు:
దీపాల వెలుగులో దేవాలయం, తళతళ మెరుస్తూ కళకళలాడుతోంది.
ప్రశ్న 6.
వసదాగిన పిట్ట ………………………….
జవాబు:
మా అక్క కూతురు వసదాగిన పిట్టలా తెగ వాగుతుంది.
ప్రశ్న 7.
చెక్కు చెదరకుండ ………………………….
జవాబు:
నేటికీ తాజ్మహల్ అందాలు, చెక్కుచెదరకుండా ఉన్నాయి.
ప్రశ్న 8.
తుమ్మబంక అంటుకున్నట్లు ………………………
జవాబు:
తనకు అప్పు ఇవ్వమని మా రైతు, మా నాన్న గారి వెంట తుమ్మబంక అంటుకున్నట్లు తిరుగుతున్నాడు.
2. అర్థాలు
ప్రశ్న 1.
కీచురాలు రొద చేస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నది
B) గండి
C) చప్పుడు
D) అందం
జవాబు:
C) చప్పుడు
ప్రశ్న 2.
కిన్నెరసాని సొంపుతో ప్రవహిస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) అందం
B) గుర్తు
C) నెల
D) చెవ్వు
జవాబు:
A) అందం
ప్రశ్న 3.
సింహం పౌరుషానికి గుర్తు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) పాలి
B) పాలిపెర
C) అందం
D) నెల
జవాబు:
B) పాలిపెర
ప్రశ్న 4.
పోషాకులు తొగ్గిన సీతక్క చూడముచ్చటగా ఉంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ఆభరణాలు
B) పెళ్ళిగాజులు
C) పెళ్ళి బట్టలు
D) పూలు
జవాబు:
A) ఆభరణాలు
ప్రశ్న 5.
ముచ్చెలు వేసుకుని ఆలయాలలోకి వెళ్ళగూడదు (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నగలు
B) చెప్పులు
C) ఆయుధాలు
D) రంగులు
జవాబు:
B) చెప్పులు
ప్రశ్న 6.
మోతుబరి అనగా
A) బీదవాడు
B) వైద్యులు
C) ఊరిపెద్ద
D) పోలీసు
జవాబు:
C) ఊరిపెద్ద
ప్రశ్న 7.
మద్దూరు అనగా
A) ప్రభుత్వం
B) గ్రామం
C) అధికారి
D) నియమం
జవాబు:
D) నియమం
ప్రశ్న 8.
కుటిలవాజి యైన రంగయ్యను పోలీసులు అరెస్టు చేసారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) జూదగాడు
B) మోసగాడు
C) అందగాడు
D) విదూషకుడు
జవాబు:
B) మోసగాడు
ప్రశ్న 9.
మోతుబరి కింద పాలోండ్లు చాలామంది ఉంటారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) పాలు అమ్మేవారు
B) మోసగాళ్ళు
C) సేవకులు
D) పాలివాళ్ళు
జవాబు:
A) పాలు అమ్మేవారు
ప్రశ్న 10.
పోట్లాటలు – అనే అర్థం వచ్చే పదం ఏది?
A) విరోధం
B) కయ్యాలు
C) కరవాలం
D) వియ్యాలు
జవాబు:
B) కయ్యాలు
ప్రశ్న 11.
కుశాలు అంటే అర్థం
A) ఉద్దేశం
B) ఉరుకులాడు
C) ఉత్సాహవంతుడు
D) చదువుకున్నవాడు
జవాబు:
C) ఉత్సాహవంతుడు
3. పర్యాయపదాలు
ప్రశ్న 1.
దేహం నిండా ఈగలు ముసురుతున్నాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. )
A) తావు, చోటు
B) కన్ను, మెయి
C) పెయి, మేను
D) తావులు, తాయిలు
జవాబు:
C) పెయి, మేను
ప్రశ్న 2.
సరుకులు అమ్మే చోటును అంగడి అంటారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.)
A) కన్ను, అక్షి
B) మేను, శరీరం
C) ఆజ్ఞ, ఆన
D) తావు, ప్రదేశం
జవాబు:
D) తావు, ప్రదేశం
ప్రశ్న 3.
ప్రదేశం, తావు – అనే పదాలకు సమానమైన పదం ఏది?
A) ప్రయాణం
B) సంద్రం
C) సిగ
D) చోటు
జవాబు:
D) చోటు
ప్రశ్న 4.
బాట, దారి – అనే పదాలకు సమానార్థక పదం ఏది ?
A) మార్గం
B) యుద్ధం
C) సోయగం
D) ఏనుగ
జవాబు:
A) మార్గం
ప్రశ్న 5.
ఆధునిక యుగం సంస్కరణల యుగం అని చెప్ప వచ్చును. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి)
A) బాధ, దుఃఖం
B) సంతోషం, ఆనందం
C) సంవత్సరం, ఏడాది
D) బాగుచేయడం, చెడును రూపుమాపడం
జవాబు:
D) బాగుచేయడం, చెడును రూపుమాపడం
ప్రశ్న 6.
తావు, చోటు – అనే అర్థాలు వచ్చే పర్యాయపదం ఏది ?
A) వాసన
B) ప్రదేశం
C) చొప్పున
D) బావి.
జవాబు:
B) ప్రదేశం
ప్రశ్న 7.
గవి, కొండబిలము – అనే అర్థం వచ్చు పదం
A) గోవు
B) గుహ
C) గుళిక
D) గడుసు
జవాబు:
B) గుహ
ప్రశ్న 8.
పచ్చరం (డం) – అనే పదానికి పర్యాయపదాలు
A) వస్త్రం, అంబరం
B) వలువ, విలువ
C) పచ్చడం, దుప్పటి
D) దుప్పటి, కొంగు
జవాబు:
A) వస్త్రం, అంబరం
ప్రశ్న 9.
సవారి, పల్లకి – అనే పర్యాయపదాలు గల పదం
A) బండి
B) శకటం
C) మేనా
D) బోయలు
జవాబు:
C) మేనా
4. వ్యుత్పత్త్యర్థాలు
ప్రశ్న 1.
తెలంగాణ భాష యాసతో సినిమాలు తీసిండ్రు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)
A) భాషించునది
B) మరణించినది
C) కనిపెట్టుటలేదు.
D) శరీరం గలది
జవాబు:
A) భాషించునది
ప్రశ్న 2.
వ్రేళ్ళతో నీరు త్రాగునది. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) గుఱ్ఱము
B) మనిషి
C) పాదపము
D) నేలపాము
జవాబు:
C) పాదపము
ప్రశ్న 3.
వెంబడి పీడించేవాడు – దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) విశ్వామిత్రుడు
B) నారాయణుడు
C) బ్రహ్మ
D) నక్షత్రకుడు
జవాబు:
D) నక్షత్రకుడు
ప్రశ్న 4.
చర్యలను కనిపెట్టి చూసేవాడు – వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) గురువు
B) పారాశర్యుడు
C) అధ్యక్షుడు
D) వేదవ్యాసుడు
జవాబు:
C) అధ్యక్షుడు
ప్రశ్న 5.
గురువు పదానికి వ్యుత్పత్తి పదం ఏది?
A) అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు
B) నల్లనివాడు
C) పద్మనయనములవాడు
D) తాపాన్ని పోగొట్టేవాడు
జవాబు:
A) అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు
5. నానార్థాలు
ప్రశ్న 1.
తెలంగాణ సంబరాలు జరుపుకున్నది. (గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.)
A) సూర్యుడు, శివుడు
B) జాతర, సేవ
C) నేల, తల్లి
D) శరీరం, మేను
జవాబు:
B) జాతర, సేవ
ప్రశ్న 2.
వేసవిలో భానుని ప్రతాపం ఎక్కువ. (గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.)
A) సూర్యుడు, శివుడు
B) దాది, ఉసిరిక
C) జలము, చేప
D) ఆశ, కోరిక
జవాబు:
A) సూర్యుడు, శివుడు
ప్రశ్న 3.
జయజయము ఈ ధాత్రికి. (గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.)
A) నేల, కన్ను
B) నేల, దాది
C) నేల, సూర్యుడు
D) నేల, సేవ
జవాబు:
B) నేల, దాది
ప్రశ్న 4.
“అంబరం” పదానికి నానార్థ పదాలు గుర్తించండి.
A) కోరిక, దిక్కు
B) వస్త్రం, ఆకాశం
C) వంశం, జాతి
D) పందెం, కూలి
జవాబు:
B) వస్త్రం, ఆకాశం
ప్రశ్న 5.
ఆశయాలు, ఆశలు – అనే నానార్థాలనిచ్చే పదం ఏది?
A) కోరిక
B) ఏనుగు
C) సంపెంగ
D) బ్రతుకు
జవాబు:
A) కోరిక
ప్రశ్న 6.
పండితులు, శుక్రుడు – అనే అర్థాలనిచ్చే నానార్థ పదం
A) కవులు
B) బ్రతుకు
C) పందెం
D) కోరిక
జవాబు:
A) కవులు
ప్రశ్న 7.
కనకం – పదానికి నానార్థాలు
A) వంశం, జాతి
B) కోరిక, వస్త్రం
C) దిక్కు, ఆకాశం
D) బంగారం, ఉమ్మెత్త
జవాబు:
D) బంగారం, ఉమ్మెత్త
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
పెద్దలు పిల్లల్ని నిద్రపుచ్చటానికి కథలు చెబుతారు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
A) కన్నె
B) గీము
C) గృహము
D) కత
జవాబు:
D) కత
ప్రశ్న 2.
మా చిన్న తమ్ముణ్ణి పట్టుకుంటే పాదరసం లాగా జారిపోతాడు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) శారద
B) నీరద
C) పారద
D) మారద
జవాబు:
C) పారద
ప్రశ్న 3.
యేసు గొజ్జెల కాపరి. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
A) కురరీ
B) గొర్రెల
C) గేదెల
D) గొడ్డు
జవాబు:
A) కురరీ
ప్రశ్న 4.
మృత్యువు పదానికి వికృతి పదం ఏది?
A) మృతుడు
B) మురుతువు
C) మిత్తి
D) మైతిరి
జవాబు:
C) మిత్తి
ప్రశ్న 5.
“రేయి” అనే పదానికి ప్రకృతి పదం ఏది?
A) రాత్రి
B) రాయి
C) రాతిరి
D) రేలు
జవాబు:
A) రాత్రి
ప్రశ్న 6.
చెడ్డవాడికి నిలువెల్ల విషము – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) విషువు
B) విసము
C) విసుగు
D) నిసువు
జవాబు:
B) విసము
ప్రశ్న 7.
దీపం – అనే పదానికి వికృతి పదం ఏది?
A) దీపు
B) దివ్వె
C) దీవెన
D) వెలుతురు
జవాబు:
B) దివ్వె
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
అప్టైశ్వర్యాలు – ఏ సంధి?
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) వృద్ధిసంధి
జవాబు:
D) వృద్ధిసంధి
ప్రశ్న 2.
పొత్తు విల్లు – ఏ సంధి?
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి
జవాబు:
C) ఉత్వసంధి
ప్రశ్న 3.
ఇదెక్కడి – ఏ సంధి?
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) రుగాగమసంధి
D) ఉత్వసంధి
జవాబు:
C) రుగాగమసంధి
ప్రశ్న 4.
పసరాకు – ఏ సంధి?
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి
జవాబు:
A) అత్వసంధి
ప్రశ్న 5.
పుణ్యాన – ఏ సంధి?
A) అత్వసంధి
B) గుణసంధి
C) రుగాగమసంధి
D) లులనలసంధి
జవాబు:
A) అత్వసంధి
ప్రశ్న 6.
మొగ్గ దొడిగి – ఏ సంధి?
A) గసడదవాదేశ సంధి
B) అత్వసంధి
C) ఇత్వసంధి
D) లులనలసంధి
జవాబు:
A) గసడదవాదేశ సంధి
ప్రశ్న 7.
ఇప్పుడిప్పుడు – ఏ సంధి?
A) లులనలసంధి
B) ఆమ్రేడితసంధి
C) రుగాగమసంధి
D) త్రికసంధి
జవాబు:
B) ఆమ్రేడితసంధి
ప్రశ్న 8.
ఏకైక – ఏ సంధి?
A) గసడదవాదేశ సంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) అకారసంధి
జవాబు:
C) వృద్ధిసంధి
ప్రశ్న 9.
ముందడుగు – ఇది ఏ సంధి ?
A) అకార సంధి
B) ఇకార సంధి
C) ఉకార సంధి
D) గుణ సంధి
జవాబు:
C) ఉకార సంధి
ప్రశ్న 10.
కండ్లవడు – ఏ సంధి ?
A) అకార సంధి
B) గసడదవాదేశ సంధి
C) ఇత్వ సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
B) గసడదవాదేశ సంధి
2. సమాసాలు
ప్రశ్న 1.
కొత్తబాట – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) షష్ఠీ తత్పురుష
C) తృతీయ తత్పురుష
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
జవాబు:
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ప్రశ్న 2.
రెండు చేతులు – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) తృతీయా తత్పురుష
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
A) ద్విగు సమాసం
ప్రశ్న 3.
గజ్జెల చప్పుడు – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) షష్ఠీ తత్పురుష
C) తృతీయా తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
B) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 4.
రాగి చెట్టు – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) అవ్యయీభావం సమాసం
C) సంభావన పూర్వపద కర్మధారయము
D) బహువ్రీహి సమాసం
జవాబు:
D) బహువ్రీహి సమాసం
ప్రశ్న 5.
పెద్దత్త – ఏ సమాసం ?
A) బహువ్రీహి సమాసం
B) తృతీయా తత్పురుష సమాసం
C) షష్ఠీ తత్పురుష సమాసం
D) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
D) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ప్రశ్న 6.
రావిచెట్టు నీడ కంటె మట్టిచెట్టు నీడ ఎక్కువ – గీత గీసిన పదము ఏ సమాసము ?
A) రూపక సమాసము
B) సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
C) షష్ఠీ తత్పురుష సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
ప్రశ్న 7.
రెండంతస్తులు – ఇది ఏ సమాసము ?
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
D) బహుపద ద్వంద్వ సమాసము
జవాబు:
B) ద్విగు సమాసము
ప్రశ్న 8.
అన్య పదార్థము ప్రధానముగా గల సమాసము
A) ద్విగు సమాసము
B) రూపక సమాసము
C) బహువ్రీహి సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసము
జవాబు:
C) బహువ్రీహి సమాసము
ప్రశ్న 9.
నక్కతంతు ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) ద్వితీయా తత్పురుష సమాసం
C) తృతీయా తత్పురుష సమాసం
D) నఇతత్పురుష సమాసం
జవాబు:
A) షష్ఠీ తత్పురుష సమాసం
ప్రశ్న 10.
ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది ?
A) అవ్యయీభావం
B) ద్వంద్వం
C) బహువ్రీహి
D) కర్మధారయం
జవాబు:
B) ద్వంద్వం
3. గణవిభజన
ప్రశ్న 1.
‘స-భ-ర-న-మ-య-వ’ అనుగణాలు పద్యపాదానికి చెందినవో గుర్తించండి.
A) శార్దూలము
B) చంపకమాల
C) మత్తేభము
D) ఉత్పలమాల
జవాబు:
C) మత్తేభము
ప్రశ్న 2.
‘న-జ-భ-జ-జ-జ-ర’ అనుగణాలు పద్యపాదానికి చెందినవో గుర్తించండి.
A) ఉత్పలమాల
B) మత్తేభము
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల
ప్రశ్న 3.
‘మ -స -జ-స-త- త – గ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవో గుర్తించండి.
A) సీసం
B) శార్దూలం
C) చంపకమాల
D) మత్తేభము
జవాబు:
B) శార్దూలం
ప్రశ్న 4.
‘భ-ర-న-భ-భ-ర-వ’ అనుగణాలు ఏ పద్య పాదానికి చెందినవో గుర్తించండి.
A) చంపకమాల
B) కందం
C) శార్దూలము
D) ఉత్పలమాల
జవాబు:
D) ఉత్పలమాల
ప్రశ్న 5.
“5 సూర్యగణాలు” ఏ పద్యములో ఉంటాయో గుర్తించండి.
A) ఆటవెలది
B) తేటగీతి
C) ద్విపద
D) సీసం
జవాబు:
A) ఆటవెలది
4. అలంకారాలు
ప్రశ్న 1.
కాకి కోకిల కాదు కదా ! – అలంకారం గుర్తించండి.
A) అంత్యానుప్రాసాలంకారం
B) వృత్త్యనుప్రాసాలంకారం
C) లాటానుప్రాసాలంకారం
D) యమకం
జవాబు:
B) వృత్త్యనుప్రాసాలంకారం
ప్రశ్న 2.
“తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవో దయం” – అలంకారం గుర్తించండి.
A) అంత్యానుప్రాసాలంకారం
B) లాటానుప్రాసాలంకారం
C) యమకం
D) ఛేకానుప్రాసాలంకారం
జవాబు:
A) అంత్యానుప్రాసాలంకారం
ప్రశ్న 3.
యమకాలంకార లక్షణాన్ని గుర్తించండి.
A) పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే
B) ఉపమాన, ఉపమేయములకు రమ్యమైన పోలిక
C) ఉపమేయమునకు, ఉపమానమునకు భేదం లేదని చెప్పు
D)వస్తువు యొక్క స్వభావాన్ని ఎక్కువ చేసి చెప్పు
జవాబు:
A) పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే
ప్రశ్న 4.
ఉత్ప్రేక్షాలంకార లక్షణాన్ని గుర్తించండి.
A) పదాలు తిరిగి అర్థభేదం కల్గి ఉండడం
B) ఎక్కువ చేసి చెప్పడం
C) ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం
D) భేదం ఉన్నా లేనట్లు చెప్పడం
జవాబు:
C) ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
పల్లెలు ప్రశాంతముగనుండె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) పల్లెలు ప్రశాంతంబున నుండవలె
B) పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి.
C) నుండవలె ప్రశాంతంబుగ పల్లెలు
D) పల్లెలు పచ్చగనుండవలె
జవాబు:
B) పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి.
ప్రశ్న 2.
జగతిన గ్రామంబులు వర్థిల్లవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) జగతిలో గ్రామాలు వర్ధిల్లాలి
B) జగతియందు గ్రామంబులు వర్థిల్లవలె
C) గ్రామంబులు వర్థిల్లవలె జగతిన
D) వర్ధిల్లవలె జగతిన గ్రామాలు
జవాబు:
A) జగతిలో గ్రామాలు వర్ధిల్లాలి
ప్రశ్న 3.
రైతులు సుఖంబుగ నుండవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) రైతులు సుఖంగా ఉండాలి
B) సుఖంబుగానుండాలి రైతన్నలు
C) నుండవలె రైతులు సుఖంబుగ
D) రైతులు నుండవలె సుఖముగ
జవాబు:
A) రైతులు సుఖంగా ఉండాలి
ప్రశ్న 4.
పల్లెలందు కష్టములున్నవి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) కష్టాలు పల్లెలకు ఉన్నవి
B) పల్లెల్లో కష్టాలు ఉన్నాయి
C) పల్లెలతో కష్టములు ఉన్నవి
D) పల్లెలలోను కష్టాలు ఉన్నవి.
జవాబు:
B) పల్లెల్లో కష్టాలు ఉన్నాయి
ప్రశ్న 5.
పల్లెలందు పంటలు పండినవి. – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) పంటలు పల్లెల్లో పండుతాయి
B) పండుతవి పంటలు పల్లెలందు
C) పల్లెల్లో పంటలు పండుతాయి
D) పల్లెల్లో పంటలు పండును
జవాబు:
C) పల్లెల్లో పంటలు పండుతాయి
ప్రశ్న 6.
రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పంటలతో రైతులు పండించారు.
B) రైతులచే పంటలు పండించబడినాయి
C) పండించబడినవి పంటలు రైతులవల్ల
D) రైతులకు పంటలు పండినాయి
జవాబు:
B) రైతులచే పంటలు పండించబడినాయి
ప్రశ్న 7.
ప్రజలచే మొక్కలు నాటబడినాయి. దీనిలో కర్తరి వాక్యం గుర్తించండి.
A) ప్రజలు మొక్కలను నాటారు
B) ప్రజలవల్ల మొక్కలు నాటబడ్డాయి
C) ప్రజలతో మొక్కలు నాటబడియుండవచ్చు
D) ప్రజలకు మొక్కలు నాటబడింది
జవాబు:
A) ప్రజలు మొక్కలను నాటారు
ప్రశ్న 8.
సుమతి సూర్యోదయమును ఆపినది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) సుమతి సూర్యోదయం ఆపింది
B) సూర్యోదయము సుమతిచేత ఆపబడినది.
C) సూర్యోదయంచేత సుమతి ఆపబడినది
D) సుమతికూడా సూర్యోదయం ఆపింది.
జవాబు:
B) సూర్యోదయము సుమతిచేత ఆపబడినది.
ప్రశ్న 9.
శ్రీరామ్చే జాబు రాయబడెను – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) శ్రీరామ్ యొక్క జవాబు రాయబడెను
B) శ్రీరామ్ జవాబు రాయించెను
C) రాయించెను జాబు శ్రీరామ్
D) శ్రీరామ్ జాబు రాశాడు
జవాబు:
D) శ్రీరామ్ జాబు రాశాడు
ప్రశ్న 10.
పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రచించాడు భాగవతాన్ని పోతనచేత
B) రచించాడు పోతన భాగవతంతో
C) పోతనచే భాగవతం రచింపబడెను
D) పోతనకు భాగవతం రచించాడు
జవాబు:
C) పోతనచే భాగవతం రచింపబడెను
ప్రశ్న 11.
తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు
B) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు
C) “అతనికి పల్లెలంటేనే ఇష్టం” అని సోము చెప్పాడు
D) “నేను పల్లెలంటే ఇష్టపడతాను” అని సోము అన్నాడు.
జవాబు:
B) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు
ప్రశ్న 12.
“నాకు జీవితంపై ఆశ మెండు” అని కవి అన్నాడు. దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) కవి తనకు ఆశ మెండు జీవితం అని అన్నాడు.
B) వానికి జీవితంపై మెండు ఆశయని కవియన్నాడు.
C) తనకు జీవితంపై ఆశ మెండని కవి అన్నాడు
D) అతనికి జీవితంపై ఆశ అధికమని చెప్పాడు
జవాబు:
C) తనకు జీవితంపై ఆశ మెండని కవి అన్నాడు
ప్రశ్న 13.
“మా నాన్న గ్రామంలో లేడు” రాజా చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) రాజా మా నాన్న గ్రామంలో లేడని చెప్పాడు
B) తమ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
C) తమ నాన్న గ్రామంలో ఉండడని రాజా చెప్పాడు
D) వాళ్ళ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
జవాబు:
D) వాళ్ళ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
ప్రశ్న 14.
నాకు పల్లెలంటే ఇష్టం అని రైతు అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) రైతు పల్లెయందు ఇష్టం లేదన్నాడు
B) తనకు పల్లెలంటే ఇష్టమని రైతు అన్నాడు
C) అతనికి పల్లె యిష్టంగాలేదని రైతు పలికాడు
D) వానికి పల్లెయిష్టం అని రైతు పలికాడు
జవాబు:
B) తనకు పల్లెలంటే ఇష్టమని రైతు అన్నాడు
ప్రశ్న 15.
తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు.
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు
C) “నాకు చాలా ముఖ్యమైనపని ఉంది” అని రాము అన్నాడు.
D) “నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు
జవాబు:
C) “నాకు చాలా ముఖ్యమైనపని ఉంది” అని రాము అన్నాడు.
ప్రశ్న 16.
పల్లెలు వృద్ధి సాధించాయి. దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) పల్లెలు వృద్ధి సాధించితీరాలి
B) పల్లెలు వృద్ధి సాధించలేదు
C) పల్లెలు వృద్ధి చెందకూడదు
D) పల్లెలు వృద్ధి చెందకపోవచ్చు
జవాబు:
B) పల్లెలు వృద్ధి సాధించలేదు
ప్రశ్న 17.
అందరు పల్లెల్లో ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) అందరు పల్లెల్లో ఉండకూడదు
B) అందరు పల్లెల్లో ఉండకపోవచ్చు
C) కొందరు పల్లెల్లో ఉండకూడదు
D) కొందరు పల్లెల్లో ఉండాలి
జవాబు:
A) అందరు పల్లెల్లో ఉండకూడదు
ప్రశ్న 18.
ఇవన్నీ నాకు అద్భుత మనిపిస్తాయి – వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) ఇవన్నీ నాకు అద్భుతాలు కావు.
B) ఇవన్నీ నాకు అద్భుతం అనిపించడం లేదు.
C) ఇవన్నీ నాకు అద్భుతాలు అనిపించవు.
D) ఇవన్నీ అద్భుతాలు కావని నాకనిపిస్తుంది.
జవాబు:
B) ఇవన్నీ నాకు అద్భుతం అనిపించడం లేదు.
ప్రశ్న 19.
పల్లెలో వర్షం కురిసింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) పల్లెల్లో వర్షం తప్పక కురవకూడదు
B) పల్లెల్లో వర్షం కురవలేదు
C) పల్లెల్లో వర్షం కురవాలి
D) పల్లెల్లో వర్షం కురవకపోవచ్చు
జవాబు:
B) పల్లెల్లో వర్షం కురవలేదు
ప్రశ్న 20.
మురళి జాబు రాశాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) మురళి జాబు వ్రాయించుకొనెను
B) మురళి జాబు వ్రాసుకొనలేదు
C) జాబు వ్రాయించుకొనలేదు ఎవరితోను మురళి
D) మురళి జాబు రాయలేదు
జవాబు:
D) మురళి జాబు రాయలేదు
ప్రశ్న 21.
రైతులు నాట్లు వేశారు – పంటలు పండలేదు దీనికి సంయుక్త వాక్యం ఏది ?
A) రైతులు నాట్లు వేయడంతో పంటలు పండలేదు
B) రైతులు నాట్లు వేశారుగాని పంటలు పండలేదు
C) పంటలు పండక పోవడానికి కారణం నాట్లు వేయడమే
D) నాట్లు రైతులు వేయకపోవడంతో పంటలు పండలేదు
జవాబు:
B) రైతులు నాట్లు వేశారుగాని పంటలు పండలేదు
ప్రశ్న 22.
వర్షాలు కురిశాయి చెరువులు నిండలేదు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
A) వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండలేదు
B) చెరువులు నిండడం కోసం వర్షం రావాలి
C) చెరువులు నిండాయిగాని వర్షాలు రాలేదు.
D) వర్షాలు కురిశాయిగాని చెరువులు నిండలేదు
జవాబు:
D) వర్షాలు కురిశాయిగాని చెరువులు నిండలేదు
ప్రశ్న 23.
‘నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు’ – ఇది ఏరకమైన వాక్యము ?
A) అనుమత్యర్థక వాక్యం
B) ప్రార్థనాద్యర్థక వాక్యం
C) ఆశీర్వాద్యర్థక వాక్యం
D) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
C) ఆశీర్వాద్యర్థక వాక్యం
ప్రశ్న 24.
‘గోపాల్ చెట్టు ఎక్కగలడు’- ఇది ఏరకమైన సామాన్య వాక్యము ?
A) సామర్థ్యార్థక వాక్యం
B) శత్రర్థక వాక్యం
C) ప్రార్థనాద్యర్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
జవాబు:
A) సామర్థ్యార్థక వాక్యం
ప్రశ్న 25.
‘రవి రేపు వస్తాడో ! రాడో!’-ఇది ఏరకమైన వాక్యము?
A) అనుమత్యర్థక వాక్యం
B) సందేహార్థక వాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) అప్యర్థక వాక్యం
జవాబు:
B) సందేహార్థక వాక్యం
ప్రశ్న 26.
‘వర్షాలు కురిసినా పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యము ?
A) చేదర్థక వాక్యం
B) సందేహార్థక వాక్యం
C) నిషేధార్థక వాక్యం
D) అప్యర్థక వాక్యం
జవాబు:
D) అప్యర్థక వాక్యం
ప్రశ్న 27.
‘మీరు బడికి రావద్దు’ – ఇది ఏరకమైన వాక్యము ?
A) నిషేధార్థక వాక్యం
B) ప్రశ్నార్థక వాక్యం
C) నిశ్చయార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
జవాబు:
A) నిషేధార్థక వాక్యం
ప్రశ్న 28.
ప్రజలందరు వర్ధిల్లుదురుగాక! ఇది ఏరకమైన వాక్యం?
A) అప్యర్థకం
B) ఆశీర్వచనార్థకం
C) హేత్వర్థకం
D) ధాత్వర్థకం
జవాబు:
B) ఆశీర్వచనార్థకం
ప్రశ్న 29.
చదువులు పూర్తయి ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదల యింది. – ఇది ఏరకమైన వాక్యము ?
A) సంయుక్త వాక్యము
B) సంక్లిష్టవాక్యము
C) సామాన్యవాక్యము
D) కర్తరి వాక్యము
జవాబు:
B) సంక్లిష్టవాక్యము
ప్రశ్న 30.
చిరకాల వాంఛ తీరింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) చిరకాల వాంఛ తీరలేదు
B) చిరకాల వాంఛ తీరకూడదు
C) చిరకాల వాంఛ తీరకుండదు
D) చిరకాల వాంఛ తీరకపోవచ్చు
జవాబు:
A) చిరకాల వాంఛ తీరలేదు
ప్రశ్న 31.
రైతులు పంటలు పండించగలరు. ఇది ఏ వాక్యం ?
A) సామర్థ్యార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) భావార్థక వాక్యం
జవాబు:
A) సామర్థ్యార్థక వాక్యం