These TS 10th Class Telugu Bits with Answers 3rd Lesson వీర తెలంగాణ will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 3rd Lesson వీర తెలంగాణ
బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – I : PART- B
1. సొంత వా వాక్యాలు (1 మార్కు)
ప్రశ్న 1.
కల్లోలం : ………………………
జవాబు:
తుఫాను సమయంలో సముద్రం కల్లోలంగా మారింది.
ప్రశ్న 2.
దిక్కుతోచక : …………………….
జవాబు:
ఆపదలు వస్తే అసమర్థులు దిక్కుతోచక ప్రవర్తిస్తారు.
2. అర్ధాలు
ప్రశ్న 1.
తుపాన్కు చెట్లుడుల్లెన్. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) పడిపోయినవి
B) నిలబడ్డాయి
C) ఏమీకాలేదు
D) పైవేమీకావు
జవాబు:
A) పడిపోయినవి
ప్రశ్న 2.
తెలంగాణకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) చీకటి
B) ప్రకాశవంతమైన
C) ఏమీకాదు
D) నల్లని
జవాబు:
B) ప్రకాశవంతమైన
ప్రశ్న 3.
నిజాం రాజుల గుండెల్లో తెలంగాణ వీరులు కల్లోలం రేపినారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) భయం
B) కోపం
C) అలుక
D) పెద్దఅల
జవాబు:
D) పెద్దఅల
ప్రశ్న 4.
వీరులు కృపాణం ధరించుతారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) బాంబులు
B) దుప్పట్లు
C) తాళాలు
D) కత్తి
జవాబు:
D) కత్తి
ప్రశ్న 5.
తెలంగాణ వీరుల విజృంభణ ఏపుగా ఉంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) గొప్ప
B) తక్కువ
C) పరాక్రమం
D) అతిశయం
జవాబు:
D) అతిశయం
ప్రశ్న 6.
రేగడి పదానికి అర్థం
A) నల్లమన్ను
B) రెల్లు గడ్డి
C) బంకమన్ను
D) చిత్తడినేల
జవాబు:
A) నల్లమన్ను
ప్రశ్న 7.
ఆకాశములో శక్రధనువేర్పడింది. “శక్రధనువు” అనగా అర్థం
A) ఇంద్రధనుస్సు
B) సూర్యధనుస్సు
C) పాలపుంత
D) ఉల్కలు
జవాబు:
A) ఇంద్రధనుస్సు
ప్రశ్న 8.
బొబ్బలుపెట్టి అబద్ధాలు కప్పిపుచ్చలేరు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గుంటలు పెట్టు
B) కేకలు పెట్టు
C) వాతలు పెట్టు
D) బుడిపెలు పెట్టు
జవాబు:
B) కేకలు పెట్టు
ప్రశ్న 9.
ఉదయాన అర్కరుక్కులు కాషాయం రంగులో ఉంటాయి (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ఉదయ కిరణాలు
B) పూల రంగులు
C) సూర్యకిరణాలు
D) చంద్ర కిరణాలు
జవాబు:
C) సూర్యకిరణాలు
ప్రశ్న 10.
పథము – అనే పదానికి అర్థం
A) అడుగు
B) మార్గము
C) మొదట
D) రోజు
జవాబు:
C) మొదట
ప్రశ్న 11.
భూమండలం – అనే అర్థం గల పదము
A) రథ చక్రము
B) బండి చక్రము
C) రాజ్యము
D) వసుధా చక్రము
జవాబు:
D) వసుధా చక్రము
ప్రశ్న 12.
వయస్సు – అనే అర్థం గల పదము
A) వాయసము
B) మనస్సు
C) ప్రాయము
D) సంఘము
జవాబు:
C) ప్రాయము
ప్రశ్న 13.
ఆకాసంలో మేఘాలతో పాటు సౌదామని కాంతులు కనబడుతున్నాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) (June ’15)
A) చంద్రుడు
B) నక్షత్రము
C) మెరుపు
D) సూర్యుడు
జవాబు:
C) మెరుపు
3. పర్యాయపదాలు
ప్రశ్న 1.
“అకూపారము, పారావారము”కు సరిపోవు పర్యాయపదం ఏది ?
A) ఖడ్గము
B) సముద్రం
C) రణము
D) అర్కుడు
జవాబు:
B) సముద్రం
ప్రశ్న 2.
“రణము, భండనము” ఈ పదాలకు సరిపోవు పర్యాయపదం ఏది ?
A) యుద్ధం
B) వార్ధి
C) ఇచ్ఛ
D) అబ్ధి
జవాబు:
A) యుద్ధం
ప్రశ్న 3.
భూమిపై మూడు వంతులు నీరుతో నిండి ఉన్నది. నీరుకు పర్యాయపదాలు గుర్తించండి.
A) పానీయం, వార్థి, కాలం
B) జలం, బంగారం, అందం
C) జలం, వారి, అంబు
D) ఏవీకావు
జవాబు:
C) జలం, వారి, అంబు
ప్రశ్న 4.
ఎలాగైతే చివరకు నా స్నేహితుడు గెలుపొందాడు. చివరకు పర్యాయపదాలు గుర్తించండి.
A) తుద, గజం, బాధ
B) కడ, తుద, అంత
C) అంత్యం, చంద్రిక, దుఃఖం
D) ఏవీకావు
జవాబు:
B) కడ, తుద, అంత
ప్రశ్న 5.
మువ్వన్నెల జెండా ఎవరెస్టు శిఖరం పై రెపరెప లాడింది. జెండాకు పర్యాయపదాలు
A) కేతనం, పతాకం, ధ్వజం
B) ధ్వజం, శిఖరం, పైడి
C) పతాకం, అధికం, హారం
D) ఏవీకావు
జవాబు:
A) కేతనం, పతాకం, ధ్వజం
ప్రశ్న 6.
శంఖము – అనే పదానికి పర్యాయపదాలు
A) కంబు, చెంబు
B) కంబు, బుగ్గ
C) కంబుకము, అంబుజము
D) అంబుజము, భూజము
జవాబు:
A) కంబు, చెంబు
ప్రశ్న 7.
చంద్రుడు – సూర్యుడు అన్నదమ్ములని వాడుక గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) రవి, చంద్రుడు
B) సూర్యుడు, శశాంకుడు
C) ఇనుడు, భానుడు
D) ఇనుడు, చంద్రుడు
జవాబు:
C) ఇనుడు, భానుడు
ప్రశ్న 8.
భంగము, కెరటము – అను పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) కోటరము
B) కదలిక
C) అల
D) జలము
జవాబు:
C) అల
ప్రశ్న 9.
కృపాణము – అనే పదానికి పర్యాయపదాలు
A) కత్తి, ప్రాణము
B) ఖడ్గము, దయ
C) అసి, కరవాలము
D) కర్ర, కోదండము.
జవాబు:
C) అసి, కరవాలము
ప్రశ్న 10.
అంబునము, జీమూతము, అభ్రము – అనే పర్యాయ పదాలు గల పదం
A) అంబుధి
B) మేఘము
C) వారధి
D) దేవనది
జవాబు:
B) మేఘము
ప్రశ్న 11.
హస్తము, కరము, కేలు – పర్యాయపదాలు గల పదము
A) ఏనుగు
B) చేయి
C) మోచేయి
D) అసి
జవాబు:
B) చేయి
ప్రశ్న 12.
దేవతల వైరి శ్రీహరి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు
A) విరోధి, క్రోధి
B) వైరి, కరి
C) పగతుడు, స్నేహితుడు
D) విరోధి, అరి
జవాబు:
D) విరోధి, అరి
4. వ్యుత్పత్త్యర్థాలు
ప్రశ్న 1.
దండవలె దీర్ఘాకారము కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) సౌదామని
B) కోరిక
C) శంఖము
D) జలథి
జవాబు:
A) సౌదామని
ప్రశ్న 2.
కోఱలు ఆయుధముగా కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) రూపము
B) సేన
C) దంష్ట్రిక
D) సౌదామని
జవాబు:
C) దంష్ట్రిక
ప్రశ్న 3.
ఉదకమును భరించునది
A) సరస్సు
B) కాలువ
C) అభ్రము
D) ఏవీకావు
జవాబు:
C) అభ్రము
ప్రశ్న 4.
ప్రకాశించువాడు
A) భానుడు
B) ఈశ్వరుడు
C) సౌదామనీ
D) ఏవీకావు
జవాబు:
A) భానుడు
ప్రశ్న 5.
జలం నుండి పుట్టినది
A) జలధరం
B) జలజం
C) జలాశయం
D) ఏవీకావు
జవాబు:
B) జలజం
ప్రశ్న 6.
రుద్రులు అనగా
A) అసురులను కాపాడువారు
B) అసురులను రోదనం చేయువాడు
C) సురలను రోదనం చేయువారు
D) ఏవీకావు
జవాబు:
B) అసురులను రోదనం చేయువాడు
ప్రశ్న 7.
జలధి అనగా
A) జలచరాలు ఉన్నట్టిది
B) జలాలపై పోవునది
C) జలములు దేనిచే ధరింపబడును
D) ఏవీకావు
జవాబు:
C) జలములు దేనిచే ధరింపబడును
ప్రశ్న 8.
సంద్రం అనగా
A) చంద్రోదయంచే వృద్ధి పొందునది
B) రత్నాలు కల్గినట్టిది
C) పెద్దపెద్ద చేపలు కలది
D) ఏవీకావు
జవాబు:
A) చంద్రోదయంచే వృద్ధి పొందునది
ప్రశ్న 9.
“జలములు దీనిచే ధరించబడును” – దీనికి వ్యుత్పత్తి పదం
A) జలధి
B) వారధి
C) తామర
D) తీరము
జవాబు:
A) జలధి
ప్రశ్న 10.
“వసుధ” – వ్యుత్పత్తి పదం
A) ఆకాశము నందు గలది
B) మెదడు నందు కలది
C) బంగారం గర్భమందు గలది
D) భూమి నందు గలదు
జవాబు:
C) బంగారం గర్భమందు గలది
ప్రశ్న 11.
“సమస్తమును ధరించునది” – దీనికి వ్యుత్పత్తి పదం
A) ఆశ
B) దివి
C) హస్తము
D) ధర
జవాబు:
D) ధర
ప్రశ్న 12.
అశుభములను శమింప చేయునది – అనే వ్యుత్పత్తి అర్థం గల పదం
A) శమము
B) శంఖము
C) అశుభము
D) శాంతి
జవాబు:
A) శమము
ప్రశ్న 13.
అర్కుడు – అను పదానికి వ్యుత్పత్త్యర్థం
A) పూజింపబడువాడు
B) అరిగి పోయినవాడు
C) తూర్పు నుండి పడమరకు పోవువాడు
D) తపింప చేయువాడు
జవాబు:
A) పూజింపబడువాడు
5. నానార్థాలు
ప్రశ్న 1.
రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం అన్నాడో కవి. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) అంచు, వింటికొన
B) సంకు, ఒకపాము
C) ఇచ్ఛ, కోరిక
D) ప్రభువు, ఇంద్రుడు
జవాబు:
D) ప్రభువు, ఇంద్రుడు
ప్రశ్న 2.
తెలంగాణ వీరులు బలవంతులు. (గీత గీసిన పదానికి నానార్థపదాలు గుర్తించండి.)
A) అంచు, రణము
B) ఇచ్ఛ, కోరిక
C) రూపము, సేన
D) కాంక్ష, కత్తి
జవాబు:
C) రూపము, సేన
ప్రశ్న 3.
నామం, హారం – అనే వేరు వేరు అర్థాలు కలిగిన పదం
A) వేరు
B) హరం
C) నవరసు
D) పేరు
జవాబు:
D) పేరు
ప్రశ్న 4.
మృదంగ రవము అంటే నాకు ఇష్టం . (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) ధ్వని, కంఠధ్వని
B) రవము, సాగరము
C) రవము, దరువు
D) ధ్వని, దరువు
జవాబు:
A) ధ్వని, కంఠధ్వని
ప్రశ్న 5.
సంకు, నొసటి ఎముక, నిధి విశేషము – అనే నానార్థాలు కలిగిన పదం
A) సంకెల
B) ఎమ్ము
C) శంఖము
D) శంక
జవాబు:
C) శంఖము
ప్రశ్న 6.
దిక్కులేని వారికి దేవుడే దిక్కు – (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) శరణము, తూర్పు
B) మార్గము, శరణము
C) నెలవు, తూర్పు
D) నెలవు, ఆదర్శము
జవాబు:
B) మార్గము, శరణము
ప్రశ్న 7.
పిల్లవాడు పొక్కులు రేగి కేకలు పెట్టి ఏడుస్తున్నాడు, పెద్ద అరుపు విని ఏడుపు ఆపాడు – (గీత గీసిన పదాలకు నానార్థం గల పదం గుర్తించండి.)
A) ఏడుపు
B) పిల్లవాడు
C) బొబ్బలు
D) పెద్ద అరుపు
జవాబు:
C) బొబ్బలు
ప్రశ్న 8.
తొండము, చేయి – అనే నానార్థం గల పదం గుర్తించండి.
A) ఏనుగు
B) హస్తము
C) చేయి
D) గజము
జవాబు:
C) చేయి
ప్రశ్న 9.
అంబిక – అను పదమునకు నానార్థాలు
A) తల్లి, ధృతరాష్ట్రుని తల్లి, పార్వతి
B) ధృతరాష్ట్రుని తల్లి, లక్ష్మి, పార్వతి
C) తల్లి, పినతల్లి, ఒక సుగంధము
D) తల్లి, మేనత్త, రాజు తల్లి
జవాబు:
A) తల్లి, ధృతరాష్ట్రుని తల్లి, పార్వతి
ప్రశ్న 10.
“దివి” అనే పదానికి నానార్థం కాని పదాన్ని
A) ఆకాశము
B) స్వర్గము
C) దీవిడి
D) పగలు
జవాబు:
B) స్వర్గము
ప్రశ్న 11.
వసుంధరకు ధర ఎక్కువ – (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) మామిడి, చౌక
B) ధర, ధరాధరం
C) భూమి, చౌక
D) భూమి, వెల
జవాబు:
D) భూమి, వెల
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
“పరువము” అనే పదానికి ప్రకృతి
A) పాయము
B) పయస్సు
C) ప్రాయము
D) పరువు
జవాబు:
C) ప్రాయము
ప్రశ్న 2.
“ఘంట” అనే పదానికి వికృతి
A) గడియ
B) ఘటిక
C) గణగణ
D) గంట
జవాబు:
D) గంట
ప్రశ్న 3.
భూతము అనే భయం వద్దు – (గీత గీసిన పదానికి వికృతి పదము)
A) బూమి
B) బూచి
C) భయము
D) బూరెలు
జవాబు:
B) బూచి
ప్రశ్న 4.
“సముద్రము” అనే పదానికి వికృతి
A) సంద్రము
B) సాగరము
C) సమందరము
D) సాంద్రము
జవాబు:
A) సంద్రము
ప్రశ్న 5.
“సొచ్చెం” అనే పదానికి ప్రకృతి
A) సాచ్చెం
B) శుచి
C) స్వచ్ఛము
D) సోచాయించు
జవాబు:
C) స్వచ్ఛము
ప్రశ్న 6.
బూమికి – ప్రకృతి పదం
A) భూరి
B) భువి
C) భూమి
D) భూతం
జవాబు:
C) భూమి
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
అత్వ సంధికి ఉదాహరణ
A) ఒక్క + ఒక్క
B) జగము + అంతా
C) వచ్చిన + అంత
D) అడ్డుల్ + పోయె
జవాబు:
C) వచ్చిన + అంత
ప్రశ్న 2.
యడాగమ సంధికి ఉదాహరణ
A) ఏమియగునో
B) అత్యాశ
C) అయ్యవసరము
D) వదనము
జవాబు:
B) అత్యాశ
ప్రశ్న 3.
శ్రీమంత + ఆలు – ఏ సంధి ? .
A) యణాదేశ సంధి
B) అకార సంధి
C) లులనల సంధి
D) రుగాగమ సంధి
జవాబు:
C) లులనల సంధి
ప్రశ్న 4.
నవోదయము – విడదీసి రాయండి.
A) నవ + ఓదయము
B) నవ + ఉదయము
C) నవో + దయము
D) నవ్య + ఉదయము
జవాబు:
B) నవ + ఉదయము
ప్రశ్న 5.
త్రిక సంధిలో వచ్చు త్రికములు
A) అక్క అవ్యి, అచ్చో మొ||నవి
B) ఆ, ఈ, ఏ
C) అ, ఇ, ఉ, ఋ
D) ఏ, ఓ, అర్ లు
జవాబు:
B) ఆ, ఈ, ఏ
ప్రశ్న 6.
ఈ కింది వానిలో విసర్గ సంధికి ఉదాహరణ
A) స్వచ్ఛతరోజ్వల
B) గాండీవంబిది
C) ధనుఃపరంపర
D) అడ్డులోవోయె
జవాబు:
C) ధనుఃపరంపర
ప్రశ్న 7.
“శ్రావణాభ్రము” సంధి
A) అత్వ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశ సంధి
D) విసర్గ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 8.
వచ్చినంతనె – సంధి పేరు గుర్తించండి.
A) అకార సంధి
C) ఇకార సంధి
B) యడాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) అకార సంధి
ప్రశ్న 9.
నాల్కలు సాచు – సంధి పేరు గుర్తించండి.
A) అత్వ సంధి
B) ఇత్వ సంధి
C) ఉకార సంధి
D) గసడదవాదేశ సంధి
జవాబు:
C) ఉకార సంధి
ప్రశ్న 10.
పీచమడచెన్ – సంధి పేరు గుర్తించండి.
A) అకార సంధి
B) ఉత్వ సంధి
C) ఇత్వ సంధి
D) గుణ సంధి
జవాబు:
B) ఉత్వ సంధి
ప్రశ్న 11.
స్వచ్ఛతరోజ్జ్వల – సంధి పేరు గుర్తించండి.
A) గుణ సంధి
B) అకార సంధి
C) ఇకార సంధి
D) ఉకార సంధి
జవాబు:
A) గుణ సంధి
ప్రశ్న 12.
తరోజ్జ్వల పదం విడదీయగా
A) తర్వో + ఉజ్వల
B) తరువు + ఉజ్వల
C) తరు + యుజ్జ్వల
D) తరు + ఉజ్జ్వల
జవాబు:
D) తరు + ఉజ్జ్వల
ప్రశ్న 13.
దారినిచ్చిరి – సంధి పేరు గుర్తించండి.
A) ఇకార సంధి
B) గుణ సంధి
C) అకార సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
A) ఇకార సంధి
ప్రశ్న 14.
పరార్థుల్ – సంధి పేరు గుర్తించండి.
A) గుణ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) అకార సంధి
D) ఇకార సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
2. సమాసాలు
ప్రశ్న 1.
తెలంగాణను ఆవరించిన భూతప్రేతములు వదిలినవి. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) ద్వంద్వ సమాసం
B) ద్విగువు
C) బహువ్రీహి
D) నఞ తత్పురుష
జవాబు:
A) ద్వంద్వ సమాసం
ప్రశ్న 2.
తెలంగాణ తల్లిఒడిలో కోటి తెలుగు కుర్రలు పెరిగినారు. (గీత గీసిన పదం ఏ సమాసం?)
A) ద్వంద్వం
B) బహువ్రీహి
C) ద్విగువు
D) నఞ తత్పురుష
జవాబు:
C) ద్విగువు
ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్రము బహు చక్కని రాష్ట్రం. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) ద్వంద్వం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) షష్ఠీ తత్పురుష
D) సప్తమీ తత్పురుష
జవాబు:
B) సంభావనా పూర్వపద కర్మధారయం
ప్రశ్న 4.
ప్రజలను మతపిశాచి నేడు పట్టి పీడిస్తున్నది. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) రూపకం
D) ద్విగువు
జవాబు:
C) రూపకం
ప్రశ్న 5.
నాలుగు దిక్కులు మబ్బులు కమ్మినవి – గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి.
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపదము
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
D) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 6.
కాపయ నాయకుడు సమాసము పేరు గుర్తించండి.
A) సంభావనా పూర్వపద కర్మధారయము
B) రూపక సమాసము
C) విశేషణ పూర్వపద కర్మధారయము
D) విశేషణ ఉత్తరపద కర్మధారయము
జవాబు:
A) సంభావనా పూర్వపద కర్మధారయము
ప్రశ్న 7.
ఉభయ పదాలకు ప్రాధాన్యము ఉన్న సమాసము
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) బహువ్రీహి
D) రూపక సమాసము
జవాబు:
A) ద్వంద్వ సమాసము
ప్రశ్న 8.
తృతీయా తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) కాంతి వార్ధులు
B) కంచు ఘంట
C) దిశాంచలములు
D) పశ్చిమాన
జవాబు:
B) కంచు ఘంట
ప్రశ్న 9.
షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) వసుధైక చక్రము
B) శక్రధనువు
C) నాల్గువైపుల
D) మహారవము
జవాబు:
B) శక్రధనువు
ప్రశ్న 10.
బహువ్రీహి సమాసమునకు ఉదాహరణ
A) పరార్థులు
B) మతపిశాచి
C) నాల్గుదిక్కులు
D) దేవనది
జవాబు:
A) పరార్థులు
3. గణ విభజన
ప్రశ్న 1.
“నాడు నేడును తెలంగాణ మోడలేదు” – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) కందం
B) తేటగీతి
C) ఆటవెలది
D) మత్తేభం
జవాబు:
B) తేటగీతి
ప్రశ్న 2.
కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టె – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) కందం
B) తేటగీతి
C) సీసం
D) ఆటవెలది
జవాబు:
C) సీసం
ప్రశ్న 3.
చేయు మటంచి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో – ఏ పద్యపాదమో తెల్పడి.
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) తేటగీతి
D) ఆటవెలది
జవాబు:
B) ఉత్పలమాల
ప్రశ్న 4.
వార్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా ! – ఏ పద్యపాదమో తెల్పండి.
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) సీసపద్యం
జవాబు:
C) మత్తేభం
ప్రశ్న 5.
భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఇది – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) మత్తేభం
B) ఉత్పలమాల
C) చంపకమాల
D) శార్దూలం
జవాబు:
B) ఉత్పలమాల
ప్రశ్న 6.
మళ్ళెన్ ! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమము సంధ్యాభానువే తెంచెడిన్ – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) శార్దూలం
B) ఉత్పలమాల
C) చంపకమాల
D) మత్తేభం
జవాబు:
A) శార్దూలం
ప్రశ్న 7.
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) చంపకమాల
B) మత్తేభం
C) ఉత్పలమాల
D) శార్దూలం
జవాబు:
B) మత్తేభం
4. అలంకారాలు
ప్రశ్న 1.
నీటిలో పడిన తేలు తేలుతదా ! ఇది ఏ అలంకారం ?
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం
జవాబు:
D) ఛేకానుప్రాసాలంకారం
ప్రశ్న 2.
హల్లుల జంట అర్థ భేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఏ అలంకారమంటారు ?
A) వృత్త్యానుప్రాస
B) అంత్యానుప్రాస
C) ఛేకానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
C) ఛేకానుప్రాస
ప్రశ్న 3.
“అరటితొక్క తొక్కరాదు” – ఇందలి అలంకారం గుర్తించండి.
A) ఛేకానుప్రాసాలంకారం
B) అంత్యానుప్రాసాలంకారం
C) లాటానుప్రాసాలంకారం
D) ముక్తపదగ్రస్థం
జవాబు:
A) ఛేకానుప్రాసాలంకారం
ప్రశ్న 4.
తల్లిఒడి వలె పల్లెసీమ లాలిస్తుంది – దీనిలో అలంకారం ఏది?
A) రూపకాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) వృత్త్యనుప్రాసాలంకారం
D) ఉపమాలంకారం
జవాబు:
D) ఉపమాలంకారం
ప్రశ్న 5.
బుడుతడు నడచిన నడకలు తడబడు – దీనిలోని అలంకారం ఏది ?
A) అంత్యానుప్రాస
B) యమకము
C) వృత్త్యనుప్రాస
D) ఛేకానుప్రాస
జవాబు:
C) వృత్త్యనుప్రాస
ప్రశ్న 6.
కింది వానిలో రూపకాలంకారానికి ఉదాహరణ
A) అజ్ఞానం చీకటి వంటిది. దానిని గురువు పోగొడ్తాడు.
B) అజ్ఞానం అనే అంథకారం గురువు వల్ల తొలుగు తుంది.
C) అజ్ఞానాంధకారాన్ని గురువు తొలగిస్తాడు.
D) అజ్ఞానం అంథకారం వలే ఉంటే గురువు తొలగించ గలడు.
జవాబు:
C) అజ్ఞానాంధకారాన్ని గురువు తొలగిస్తాడు.
ప్రశ్న 7.
“రాజు రివాజులు బూజు పట్టగన్ ” – ఇది ఏ అలంకారానికి చెందిందో గుర్తించండి.
A) వృత్త్యనుప్రాసాలంకారం
B) లాటానుప్రాసాలంకారం
C) రూపకాలంకారం
D) ఉపమాలంకారం
జవాబు:
A) వృత్త్యనుప్రాసాలంకారం
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
సూర్యుడు తూర్పున ఉదయించును. ఇది ఏ రకమైన వాక్యం ?
A) విధ్యర్థకం
B) తద్ధర్మార్థకం
C) అప్యర్థకం
D) నిశ్చయాత్మకం
జవాబు:
B) తద్ధర్మార్థకం
ప్రశ్న 2.
మీరందరు వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) తద్ధర్మార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) ప్రార్థనార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
జవాబు:
B) అనుమత్యర్థక వాక్యం
ప్రశ్న 3.
నా ఆజ్ఞను పాటించాలి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రార్థనార్థకం
B) ఆశీర్వార్థకం
C) హేత్వర్థకం
D) విధ్యర్థకం
జవాబు:
D) విధ్యర్థకం
ప్రశ్న 4.
మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇది ఏ రకమైన వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) భావార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
C) ప్రశ్నార్థక వాక్యం
ప్రశ్న 5.
లత, శ్రీజలు అక్కాచెల్లెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సామాన్య వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
D) సంయుక్త వాక్యం
ప్రశ్న 6.
మీకు శుభం కలగాలి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ఆశీర్వార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) ప్రార్థనార్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
A) ఆశీర్వార్థక వాక్యం
ప్రశ్న 7.
‘రామాయణము వాల్మీకిచే వ్రాయబడింది’ – ఈ కర్మణి వాక్యానికి, కర్తరి వాక్యాన్ని గుర్తించండి.
A) రామాయణము వాల్మీకిచే వ్రాయబడింది
B) వాల్మీకి రామాయణమును వ్రాశాడు
C) రామాయణమును వాల్మీకి వ్రాశాడు
D) వాల్మీకి వలన రామాయణము వ్రాయబడింది
జవాబు:
B) వాల్మీకి రామాయణమును వ్రాశాడు
ప్రశ్న 8.
‘ప్రతీ సలహాను పరిశీలిస్తారు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) ప్రతీ విషయం చేత పరిశీలిస్తాము
B) ప్రతి సలహా పరిశీలింపబడుతుంది.
C) ప్రతి సలహా పరిశీలించారు.
D) ప్రతి సలహా పరిశీలిస్తారు
జవాబు:
B) ప్రతి సలహా పరిశీలింపబడుతుంది.
ప్రశ్న 9.
నాగార్జునుడు విద్యలను బోధించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) నాగార్జునుడు విద్యలచే బోధించబడినాయి
B) నాగార్జునునిచే విద్యలు బోధించబడెను
C) విద్యలను బోధించాడు నాగార్జునుడు
D) నాగార్జునుని వల్ల విద్యలు చెప్పబడినాయి
జవాబు:
B) నాగార్జునునిచే విద్యలు బోధించబడెను
ప్రశ్న 10.
ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రాశాను పుస్తకాలు నేనెన్నో
B) పుస్తకాలు నేను రాశాను ఎన్నెన్నో
C) పుస్తకాలచే రాయబడ్డాను నేను
D) నేను ఎన్నో పుస్తకాలు రాశాను
జవాబు:
D) నేను ఎన్నో పుస్తకాలు రాశాను
ప్రశ్న 11.
“నీకు ఏమి కావాలి ?” అని అతడు ఆమెను అడిగాడు. ఈ ప్రత్యక్ష కథనానికి, పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) ఆమెకు ఏమి కావాలని, అతడు ఆమెను అడిగాడు.
B) నాకు ఏమి కావాలని అతడు నన్ను అడిగాడు.
C) ‘ఆమెకు ఏమి కావాలి’ అతడు నిన్ను అడిగాడు
D) నీకు ఏమి కావాలని అతడు వానిని అడిగాడు
జవాబు:
A) ఆమెకు ఏమి కావాలని, అతడు ఆమెను అడిగాడు.
ప్రశ్న 12.
“నీవు నాతో ఇంటికి వస్తున్నావా ?” అతడు అతనిని అడిగాడు – దీని పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) నీవు నాతో ఇంటికి వస్తున్నావని అతడు చెప్పాడు
B) తనతో అతడు ఇంటికి వస్తున్నాడా ? అని అతడు అతనిని అడిగాడు.
C) అతడు ప్రశ్నించాడు “నీవు నాతో ఇంటికి రా” అని
D) నేను నీతో ఇంటికి వస్తున్నానా ? అని అతడు ప్రశ్నించాడు
జవాబు:
B) తనతో అతడు ఇంటికి వస్తున్నాడా ? అని అతడు అతనిని అడిగాడు.
ప్రశ్న 13.
శ్రీకాంత్ అన్నం తిన్నాడు. శ్రీకాంత్ బడికి వచ్చాడు. -సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి.
A) శ్రీకాంత్ అన్నం తిన్నాడు, తిని బడికి రాలేదు.
B) శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు.
C) శ్రీకాంత్ అన్నం తిన్నాడు, బడికి వచ్చాడు.
D) శ్రీకాంత్ బడికి వచ్చి అన్న తిన్నాడు.
జవాబు:
B) శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు.
ప్రశ్న 14.
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు – సంక్లిష్ట వాక్యం ఏదో గుర్తించండి.
A) పూనాలోని పర్షియన్ చదివి ఫెర్గూసన్ కాలేజీకి వచ్చాడు.
B) ఫెర్గూసన్లో పర్షియన్ చదివాడు.
C) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివాడు.
D) పట్టభద్రుడై ఫెర్గూసన్లో చేరాడు.
జవాబు:
C) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివాడు.
ప్రశ్న 15.
గాంధీ విధానాలను ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి – సంయుక్త వాక్యం ఏదో గుర్తించండి.
A) గాంధీ మంచిని సాధించలేదు
B) గాంధీ విధానాల ద్వారా చెడ్డను సాధించారు
C) గాంధీ విధానాల్లో మంచి లేదు
D) గాంధీ విధానాలను ఆచరించడం ద్వారా మంచిని సాధించాలి.
జవాబు:
D) గాంధీ విధానాలను ఆచరించడం ద్వారా మంచిని సాధించాలి.
ప్రశ్న 16.
ఆహా ! ఎంత అద్భుతం ! – ఇది ఏ రకమైన వాక్యం ?
A) అనుమత్యర్థక వాక్యం
B) ఆశ్చర్యార్థక వాక్యం
C) నిషేధార్థక వాక్యం
D) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
B) ఆశ్చర్యార్థక వాక్యం
ప్రశ్న 17.
వ్యాసుడు భారతం రాశాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) భారతం రచించింపబడియె వ్యాసుడు
B) భారతం వల్ల వ్యాసుడు రచింపబడినాడు
C) వ్యాసునిచే భారతం రాయబడింది
D) రచించాడు వ్యాసుడు భారతం
జవాబు:
C) వ్యాసునిచే భారతం రాయబడింది