Regular practice with AP Inter 1st Year English Study Material and Chief Seattle’s Letter Annotations Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year English Chief Seattle’s Letter Questions and Answers Annotations
The Chief Seattle’s Letter Annotations
Contextual Questions
Question 1.
If we do not own the freshness of the air and the sparkle of the water, how can you buy them?
Answer:
Reference: This line is taken from ‘Chief Seattle’s Letter’, a powerful speech attributed to the Native American leader Chief Seattle in response to the U.S. government’s proposal to buy tribal lands.
Context: Chief Seattle raises a philosophical and moral question about the absurdity of selling elements of nature. He argues that since nature is not a possession, it cannot be treated like property. For his people, air and water are sacred and life-sustaining, not commodities to be bought and sold.
Appreciation: The rhetorical question is deeply philosophical and emotional. The vivid imagery of ‘freshness of the air’ and ‘sparkle of the water’ brings to life the purity and beauty of nature. It reflects a worldview that regards nature as sacred and shared. The line critiques the exploitative mindset of settlers who view land and resources as economic assets. This perspective encourages the reader to consider ecological ethics and the spiritual value of the environment.
Conclusion: Chief Seattle emphasizes that land and nature belong to no one and should be revered rather than traded. His words are a timeless reminder of the need to respect the environment as a shared and sacred gift, not a possession.
ప్రస్తావన : ఈ వాక్యము ‘Chief Seattle’s Letter’ అను పాఠము నుండి తీసికొనబడినది. అమెరికా ప్రభుత్వము గిరిజన భూములు కొను ప్రతిపాదనపై, సియాటిల్ అధిపతిదిగా చెప్పబడు శక్తివంతమైన ఉపన్యాసము.
సందర్భము : సియాటిల్ అధిపతి ఒక ప్రశ్న లేవనెత్తుచున్నారు. ఇది తాత్విక మైనది మరియు నైతికమైనది. ప్రకృతి వనరులను అమ్ముట అసంబద్ధమైనది. . ఇది ఒక మూర్ఖపు పని. ప్రకృతి ఒకరి సొత్తుకాదు. దానిని ఆస్తిలాగా చూడ కూడదు. తమ ప్రజలకు గాలి, నీరు పవిత్రమైనవి, ప్రాణమును నిలుపునవి. అమ్ముట, కొనుట చేయుటకు ఇవి వ్యాపార వస్తువులు కాదు.
ప్రశంస : ఈ అలంకారిక ప్రశ్న లోతైన తాత్విక, భావోద్వేగములతో కూడినది. ‘గాలి పరిశుభ్రత’ ‘నీటి మెరుపు’ వంటి స్పష్టమైన మాటల చిత్రాలు ప్రకృతి పరిశుభ్రతకు, అందమునకు ప్రాణము పోసినవి. (ఇదే ప్రకృతి ప్రేమ). ప్రకృతి పవిత్రమైనది, అందరు సమానంగా పొందదగినది అన్న ప్రపంచపు అభిప్రాయమును ప్రతిబింబించుచున్నది. స్థిరనివాసులు భూమిని, సహజ వనరులను ఆస్తులుగా పరిగణిస్తారు. వారి ఈ దోపిడీ భావనను ఈ పంక్తి విమర్శించుచున్నది. అనగా రచయిత ఇక్కడ విమర్శించుచున్నాడు. ఈ దృక్పథము, పర్యావరణ నీతి, ఆధ్యాత్మిక విలువల, వాతావరణము యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి చదువరులను ప్రోత్సహించుచున్నది. అనగా ఈ వ్యాసము చదివిన ప్రతి ఒక్కరు పర్యావరణము, దాని గొప్పదనము తెలిసికొనవలెనని రచయిత కోరిక.
ముగింపు : భూమి, ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదు. వాటిని గౌరవించాలి. వ్యాపారము చేయరాదు. ఈ విషయమును సియాటిల్ అధిపతి నొక్కి చెప్పుచున్నారు. అతని మాటలు కాలాతీతమైనవి. అన్ని కాలములకు, అందరికి వర్తించును. వాతావరణము మనమందరము పంచుకొనవలసిన పవిత్రమైన బహుమతి.
![]()
Question 2.
The earth does not belong to man; man belongs to the earth.
Answer:
Reference: This line is taken from Chief Seattle’s Letter, an iconic speech that outlines the deep spiritual connection between Native Americans and nature.
Context: Chief Seattle speaks to counter the colonial mindset that views land as property to be acquired and exploited. He offers a counter-philosophy – man is not above nature, but a part of it, subject to its laws and balance.
Appreciation: The sentence is beautifully structured and delivers a profound message in just a few words. The use of inversion here (“does not belong to man, man belongs…”) effectively reverses dominant ideologies and reminds us of our humble place in the ecological system. It promotes environmental consciousness and humility. This line also has a spiritual resonance; it aligns human beings with nature, encouraging reverence rather than dominion. The line has been quoted in many environmental campaigns because of its timeless relevance.
Conclusion: Chief Seattle’s statement teaches that true wisdom lies in recognizing the earth not as a possession, but as our sacred home. The earth gives us life; therefore, we owe it respect, protection, and gratitude.
ప్రస్తావన : ఈ వాక్యము ‘Chief Seattle’s Letter’ అను పాఠము నుండి తీసికొనబడినది. ఇది ఆ ప్రాంత అమెరికా ప్రజలకు (గిరిజనులకు), ప్రకృతికి మధ్యగల లోతైన ఆధ్యాత్మిక విలువలను క్లుప్తముగా తెలియజేయు ఒక గొప్ప ప్రసంగము.
సందర్భము : సియాటిల్ అధిపతి వలసవాదుల భావనను వ్యతిరేకించుతూ మాట్లాడుచున్నారు. వారి దృష్టిలో భూమి ఒక ఆస్తి. దానిని పొందవచ్చును, కావలసిన విధముగా స్వప్రయోజనములకు వాడవచ్చును, దోపిడీ చేయ వచ్చును. ఆయన దానిని వ్యతిరేకించుతూ తాత్విక వాదన చేయుచున్నారు. మానవుడు ప్రకృతికి అతీతుడు కాడు. అనగా ప్రకృతిని శాసించలేడు. అతడు ప్రకృతిలో ఒక భాగము. ప్రకృతి నియమములకు, సమతుల్యతకు కట్టుబడి వుండాలి.
ప్రశంస: ఈ వాక్య నిర్మాణము చాల చక్కగా వున్నది. గొప్ప సందేశమును కొద్ది మాటలలో ఇచ్చుచున్నది. పదములను చాల శక్తివంతముగా తిప్పి వ్రాశారు (does not belong to man, man belongs to). గొప్ప సిద్ధాంతములు తిరిగి వ్రాయటం ద్వారా, పర్యావరణంలో మన వినయ పూర్వక స్థానము (ఎంతవరకో, అంతవరకు ఉండుట; అతి చేయరాదు) గుర్తు చేయుచున్నది.
పర్యావరణ స్పృహను, వినయమును ప్రోత్సహించుచున్నది. అది మానవులను, ప్రకృతిని ఒక వరుసలోకి తెస్తుంది. అనగా దగ్గరకు చేరుస్తుంది. గౌరవమును పెంచుతుంది, రాజ్యమును కాదు. అంటే రాజ్యభావము కంటే గౌరవభావము హెచ్చు. ఈ వాక్యమునకు కాలాతీత సంబంధము కలదు. అనగా అన్ని కాలములకు, అందరికి వర్తించును. అనేక పర్యావరణ ప్రచారములలో ఈ వాక్యము ఉదహరించబడినది.
ముగింపు : భూమి మన సొత్తు కాదు; పవిత్రమైన ఇల్లు. ఈ విషయమును గుర్తించుటలో నిజమైన వివేకము వున్నది. ఈ విషయమును సియాటిల్ అధిపతి ప్రకటన బోధించుచున్నది. భూమి మనకు జీవితము ఇచ్చును. కావున మనము భూమిపట్ల గౌరవము, రక్షణ, కృతజ్ఞత కలిగివుండాలి.
Question 3.
The earth is precious to him, and to harm the earth is to heap contempt on its Creator.
Answer:
Reference: This line is found in Chief Seattle’s Letter, a reflection on the spiritual and environmental values of Native American culture.
Context: Chief Seattle warns the settlers that harming the earth is not just a physical or environmental offense, but a spiritual one. Since the earth was created by God, damaging it shows disrespect toward the divine.
Appreciation: The phrase ‘heap contempt’ is striking and powerful. It evokes an image of willful disrespect. By equating. environmental destruction with spiritual insult, the line challenges not only political and economic actions but also moral values. This line serves as a call for moral accountability. It bridges indigenous beliefs and Christian doctrine, reinforcing the idea that reverence for nature is not exclusive to any one culture. It deepens the reader’s understanding of stewardship and shared responsibility for the planet.
Conclusion: Chief Seattle’s line urges humanity to treat nature as a sacred creation. It warns that exploitation of the environment is an affront to God and that true faith must include care for the natural world.
ప్రస్తావన : ఈ వాక్యము ‘Chief Seattle’s Letter’ అను పాఠము నుండి తీసికొనబడినది. ఆ ప్రాంత అమెరికా వాసుల ఆధ్యాత్మిక, పర్యావరణ విలువలకు ఇది ప్రతిబింబము.
సందర్భము : భూమికి హాని చేయుట కేవలము శారీరక లేదా వాతావరణ నేరము కాదు. ఇది ఆధ్యాత్మిక విలువలకు సంబంధించిన నేరము. ఈ విధముగా సియాటిల్ అధిపతి వలసదారులను హెచ్చరించుచున్నారు. భూమి భగవంతుని సృష్టి. దానిని నాశనము చేసినచో భగవంతుని అగౌరవపరచినట్లే.
ప్రశంస : ‘Heap contempt’ అనునది అందరిని ఆకట్టుకొను శక్తివంతమైన సమాసము. ఉద్దేశపూర్వకమైన అగౌరవమును ప్రేరేపించు చిత్రీకరణ. అనగా ఈ మాటల చిత్రముద్వారా మానవుని ఉద్దేశపూరితమైన అగౌరవము తెలియజేయబడుచున్నది.
పర్యావరణ నాశనము ఆధ్యాత్మిక అగౌరవముతో సమానము. ఈ వాక్యము రాజకీయ, ఆర్థిక చర్యలను, మరియు నైతిక విలువలను సవాలు చేయుచున్నది. ఈ వాక్యము నైతిక జవాబుదారీతనమును కోరుచున్నది. స్థానికుల నమ్మకములను, క్రైస్తవ సిద్ధాంతములను వారథివలె కలుపుచున్నది. ప్రకృతిపట్ల గౌరవము ఏ ఒక్క సంస్కృతి యొక్క ప్రత్యేక లక్షణము కాదు; అది అందరిది అను అభిప్రాయమును బలోపేతము చేయుచున్నది. ఈ వాక్యము ఈ గ్రహము (భూమి) పట్ల పాఠకుని నిర్వహణను, సమష్టి బాధ్యతను లోతుగా పాఠకుడు అర్థము చేసికొనునట్లు చేయుచున్నది.
ముగింపు : ప్రకృతిని ఒక పవిత్ర సృష్టిగా చూడమని, సియాటిల్ అధిపతి, మానవులకు ప్రేరణ చేయుచున్నారు. ప్రకృతిని దోపిడీ చేయుట దేవుని అవమానించినట్లే. నిజమైన విశ్వాసము గలవారు ప్రకృతి ప్రపంచము పట్ల శ్రద్ధ వహించాలి. ఈ విధముగా ఒక హెచ్చరికను ఈ వాక్యము జారీ చేయుచున్నది.
![]()
Question 4.
One thing we know – there is only one God. No man, be he Red man or White man, can be apart. We are all brothers after all.
Answer:
Reference: These lines appear near the end of Chief Seattle’s Letter and serves as a plea for unity and understanding between different races and cultures.
Context: In response to the division between Native Americans and white settlers, Chief Seattle emphasizes a shared humanity and belief in a single divine presence. Despite cultural differences, all people are united by a common spiritual origin and dependence on the earth. Appreciation: The sentence structure, especially the phrase ‘be he Red man or White man,’ clearly addresses racial division and promotes inclusion. The message of unity and brotherhood is both spiritual and humanitarian.
It rejects racial superiority and promotes peace, coexistence, and mutual respect. By acknowledging ‘only one God,’ the speaker bridges belief systems, appealing to both Native spirituality and Christian sensibility. It serves as a moral compass, urging all people to live as equals under the same divine authority. Conclusion: These lines remind us that all human beings are connected – by nature, by God, and by shared destiny. Chief Seattle calls for universal brotherhood, tolerance, and mutual care, regardless of race or culture.
ప్రస్తావన : ఈ వాక్యములు ‘Chief Seattle’s Letter’ అను పాఠము యొక్క దాదాపు చివరన వున్నవి. వివిధ రకములైన జాతుల, సంస్కృతుల మధ్య ఐక్యత, అవగాహన వుండాలని విజ్ఞప్తి చేయుచున్నవి. అనగా ఇవి ఒక విజ్ఞాపనవలె పనిచేయుచున్నవి.
సందర్భము : స్థానిక అమెరికా వాసులకు, వలసదారులకు మధ్య విభజన వచ్చినది. మానవత్వమును పంచుకొనుట, ఒక దేవునిపై నమ్మకము – దీని యొక్క ఆవశ్యకతను ఈ సందర్భముగా సియాటిల్ అధిపతి నొక్కి చెప్పుచున్నారు. ఎన్ని భేదములున్నప్పటికీ, ప్రజలందరు ఒక సాధారణ (అందరికీ వర్తించు) ఆధ్యాత్మిక మూలము మరియు భూమిపై ఆధారపడి, కలసి జీవించుచున్నారు.
ప్రశంస : ఈ వాక్య నిర్మాణము, ముఖ్యముగా సమాసము ‘be the Red man or White man’ జాతుల భేదమును, ఐక్యతను సంబోధించుచున్నది (పరిష్కార మార్గమును సూచించుచున్నది). ఐక్యత, సోదరభావము అను సందేశము ఆధ్యాత్మిక, మానవత్వ సంబంధాలను తెలియజేయును. ఒక జాతి ఆధిపత్యమును తిరస్కరించుచున్నది. శాంతి, సహజీవనము, ఒకరి పట్ల మరొకరికి గౌరవము (పరస్పర గౌరవము) ను పెంపొందించుచున్నది.
ఈ వక్త ఒకే ఒక దేవుడు అను సిద్ధాంతమును అంగీకరించుచున్నారు. దీని ద్వారా ప్రజల నమ్మక విధానములకు వారధి కట్టుచున్నారు. స్థానికుల ఆధ్యాత్మికత, క్రైస్తవ సున్నితత్వమును గూర్చి విన్నపము చేయుచున్నారు. ఇది ఒక నైతిక దిక్సూచి వలె పనిచేయును. ప్రజలను ఒకే దేవుని అధికారము క్రింద సమానులుగా జీవించమని బలముగా కోరుతున్నారు.
ముగింపు : మానవులంతా ప్రకృతి, భగవంతుడు, సమష్టి విధితో కలుప బడివున్నారు. ఈ విషయమును ఈ పంక్తులు గుర్తు చేయుచున్నవి. జాతి, సంస్కృతులతో సంబంధము లేకుండా ప్రపంచ సోదరభావము, సహనము, పరస్పర సంరక్షణలను సియాటిల్ అధిపతి కోరుచున్నారు.
The Chief Seattle’s Letter Questions and Answers
Question 1.
How does Chief Seattle describe the relationship between Native Americans and Nature?
Answer:
Chief Seattle describes the relationship between Native Americans and nature as deeply spiritual, intimate, and familial. He emphasizes that every element of the natural world- the air, water, animals, trees, and land – is sacred to his people. Nature is not seen as a resource to be owned or exploited but as a living relative. He refers to animals as brothers and flowers as sisters, showing the Native American belief in the interconnectedness of all life forms.
The earth is their mother, and harming it is like harming one’s own fam- ily. He asserts that the land is not just soil or territory, but the memory, life, and identity of his people. This deep reverence for nature forms the foundation of their culture and way of life. His message promotes respect, gratitude, and responsibility towards the environment, contrasting sharply with the materialistic and exploitative attitudes of the colonizers.
స్థానిక అమెరికా వాసుల (గిరిజనులు)కు, ప్రకృతికి మధ్యగల సంబంధము లోతైన ఆధ్యాత్మికత, సన్నిహితత్వము, సుపరిచయముతో కూడినదని సియాటిల్ అధిపతి వివరించుచున్నారు. ప్రకృతిలోని ప్రతి మూలకము (సంపద) గాలి, నీరు, జంతువులు, చెట్లు, భూమి – తన ప్రజలకు పవిత్రమైనవి. ప్రకృతిని స్వంతము చేసికొనదగిన, లేదా దోపిడి చేయదగిన ఒక ప్రాణముగల బంధువు వంటి వనరుగా చూడరాదు. జంతువులను సోదరులుగాను, పూలను సోదరీమణులుగాను సూచించుచున్నారు.
స్థానిక అమెరికా వాసుల నమ్మకమైన అన్యోన్య కలయికను, అన్ని రూపాలలో చూపుతున్నారు. భూమి వారి తల్లి. భూమికి హానిచేయుట తమ కుటుంబమునకు హాని చేసికొన్నట్లే. ఈ భూమి కేవలము మట్టి లేదా ఒక భూభాగము కాదు; ఇది వారి జ్ఞాపకము, జీవితము, గుర్తింపు. ప్రకృతిపట్ల ఈ గాఢమైన గౌరవము వారి సంస్కృతికి, జీవన విధానమునకు పునాది. ఆయన సందేశము, గౌరవము, కృతజ్ఞత, పర్యావరణ బాధ్యతను పెంపొందించును. ఇది వలసవాదుల భౌతికవాదన, దోపిడి స్వభావమునకు పూర్తి భిన్నమైనది.
![]()
Question 2.
Chief Seattle mentions that “all things are connected.” How does this concept apply to environmental issues today?
Answer:
Chief Seattle’s belief that ‘all things are connected’ is highly relevant to modern environmental issues. This idea reflects ecological interdependence – how the survival of one species or ecosystem depends on the health of the whole. Today, human activities such as deforestation, pollution, overuse of natural resources, and carbon emissions disrupt the balance of nature.
These actions not only harm plants and animals but also affect weather patterns, cause global warming, and increase natural disasters. When rivers are polluted, humans suffer too. When forests are destroyed, wildlife and the climate are impacted.
This interconnectedness also shows how environmental damage in one region can affect the entire planet. Chief Seattle’s words remind us that harming the earth is ultimately harming ourselves. Recognizing the unity between humans and nature encourages responsible actions, sustainable living, and cooperation to protect the planet for future generations.
నేటి పర్యావరణ సమస్యలకు సియాటిల్ అధిపతి నమ్మకము ‘all things are connected’ ఎక్కువగా సంబంధము కలిగివున్నది (బాగా తగియున్నది). ఈ భావన పర్యావరణ పరస్పర ఆధారతను ప్రతిబింబించుచున్నది. అందరి ఆరోగ్యముపై ఒక జాతి మనుగడ లేదా పర్యావరణ వ్యవస్థ ఆధారపడుచున్నది. ఈ రోజు మానవులు అడవులు నరకుట, కాలుష్యము, సహజ వనరులను అతిగా వాడుట, కర్బనమును వదలుట చేసి ప్రకృతి సమతౌల్యమును దెబ్బతీయుచున్నారు. ఈ పనుల వల్ల మొక్కలు, జంతువులకు హానికల్గును. అంతేకాక వాతావరణ నమూనాలు దెబ్బతిని, వేడిమి పెరిగి ప్రకృతి విపత్తులు పెరుగును.
నదుల కాలుష్యము వలన మానవులు కూడ బాధకు గురి అవుతారు. అడవులు నాశనమైతే వన్యప్రాణులు, వాతావరణము దెబ్బతినును. ఈ విధమైన పరస్పర అనుసంధానము వలన, ఒక ప్రాంతములోని వాతావరణ నష్టము భూగ్రహము మొత్తమును దెబ్బతీయును. భూమికి హాని చేసిన, చివరకు మనలను మనము హాని చేసికొన్నట్లే – ఈ విషయమును సియాటిల్ అధిపతి మాటలు గుర్తుచేయుచున్నవి. మానవులకు, ప్రకృతికి మధ్యగల ఐక్యతను గుర్తించాలి. బాధ్యతాయుతమైన పనులను ప్రోత్సహించాలి. స్థిరమైన జీవనం వుండాలి. రాబోయే తరముల వారికోసం భూగ్రహమును రక్షించుకొనుటకు సహాయ సహకారములు అందించాలి.
Question 3.
How are Chief Seattle’s words relevant to current discussions about climate change and environmental responsibility?
Answer:
Chief Seattle’s words are strikingly relevant in today’s global conversations about climate change and environmental responsibility. He warned against the exploitation of nature long before industrialization had fully begun. His message about the sacredness of the earth and the dangers of greed resonates with current concerns about pollution, global warming, deforestation, and biodiversity loss.
His assertion that “the earth does not belong to man; man belongs to the earth” challenges the modern consumerist mindset and advocates for sustainable, respectful interaction with the environment. Today, we face rising temperatures, melting glaciers, and extreme weather – consequences of our disregard for natural limits. Chief Seattle’s plea to treat the land with love and responsibility urges governments, corporations, and individuals to take collective action. His words serve as a moral compass, reminding us that the Earth is a shared home and caring for it is a sacred duty.
వాతావరణ మార్పు, పర్యావరణ బాధ్యత గురించిన ప్రపంచ సంభాషణలకు సియాటిల్ అధిపతి మాటలు అద్భుతంగా సంబంధించియున్నవి. పారిశ్రామికీ కరణ మొదలగుటకు చాలా కాలం ముందే ఆయన ప్రకృతి దోపిడి గురించి హెచ్చరించారు. ఆయన భూమి పవిత్రతను గూర్చి ఇచ్చిన సందేశము ప్రజల దురాశను ప్రతిధ్వనించుచున్నది. కాలుష్యము, భూ వేడిమి. అడవులు నరకి వేయుట, జీవ వైవిధ్య నష్టము – ఇవి నేటి సమస్యలు. ‘భూమి మానవునికి చెందినది కాదు. మానవుడు భూమికి చెందినవాడు’ – ఇది ఆయన గట్టిగా చెప్పిన మాట. ఇది ఆధునిక వినియోగదారుని భావనను సవాలు చేయుచున్నది.
ప్రకృతితో స్థిరమైన, గౌరవప్రదమైన పరస్పర చర్య అవసరమని తెలియజేయు చున్నది. ఈ రోజున మనము ఎదుర్కొను సమస్యలు – పెరుగుతున్న వేడి, కరుగుతున్న మంచు పర్వతాలు, తీవ్రమైన వాతావరణ చెడు ఫలితాలు, ప్రకృతి హద్దులను లెక్క చేయకపోవుట. సియాటిల్ అధిపతి భూమిని ప్రేమగా చూడమని విన్నపము చేయుచున్నారు. అందరు కలసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమును, కార్పొరేషన్లను, వ్యక్తులను కలసికట్టుగా చర్య తీసికొనవలసినదని కోరుచున్నారు. ఆయన మాటలు నీతి దిక్సూచివలె పనిచేయును. భూమి ఒక సమష్టి గృహము. దానిని జాగ్రత్తగా చూచుట మన పవిత్ర కర్తవ్యము.
![]()
The Chief Seattle’s Letter Summary in English & Telugu
The Chief Seattle’s Letter Summary in English
‘Chief Seattle’s Letter’ is a powerful message from a Native American leader to the U.S. government during the 1850s. At that time, the American government wanted to buy Native land for settlers. Chief Seattle responds with deep emotion, showing how different the Native view of nature is from that of the settlers.
Chief Seattle says that his people do not understand how anyone can buy or sell the sky, air, or land. For Native Americans, every part of nature is sacred-trees, rivers, animals, flowers, air, and even the wind. They believe that the earth is like a family. The rivers are their brothers, the animals are their relatives, and the land is their mother. Everything in nature is connected and full of life and spirit.
He explains that selling the land does not mean the buyers can disrespect it. The water is like the blood of their ancestors, and the air gives life to their children. He tells the white people to treat the land, rivers, and air with the same love and care that the Native people have shown for generations.
Chief Seattle also warns that harming nature means harming ourselves. He believes that all humans are part of the web of life. If man destroys nature, he destroys himself. He reminds the settlers that there is only one God, and that God made the earth for all people – Red or White. We are all brothers and must share and protect the land. In the end, Chief Seattle says that if they do sell the land, he hopes the white people will love and care for it like his people did. He asks them to preserve its beauty for their children, because nature is sacred and should never be forgotten or destroyed.
The Chief Seattle’s Letter Summary in Telugu
సారాంశం
అమెరికా ప్రభుత్వమునకు, ఆ ప్రాంత అమెరికన్ నాయకుడు 1850లలో వ్రాసిన శక్తివంతమైన సందేశము ‘Chief Seatle’s Letter’. ఆ సమయములో అమెరికా ప్రభుత్వము స్థిరనివాసుల కొరకు స్వదేశీ భూమి (ఆ ప్రాంతము) కొనదలచెను. తీవ్రమైన భావోద్వేగముతో సియాటిల్ అధిపతి స్పందించెను. స్వదేశస్థుల భావములు స్థిరనివాసుల కంటే ఎంత భిన్నమైనవో తెలియజేసెను.
ఆకాశము, గాలి, భూమి ఎవరైనా ఏ విధముగా అమ్ముట, కొనుట చేయుదురో తన ప్రజలకు అర్థము కావట్లేదని సియాటిల్ అధిపతి చెప్పు చున్నాడు. స్థానికులైన అమెరికా వాసులకు ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ పవిత్రమైనది – చెట్లు, నదులు, జంతువులు, పూలు, గాలి చివరకు వాయువు (వీచుచున్న గాలి) కూడ. భూమి ఒక కుటుంబమని వారి నమ్మకము. నదులు వారి సోదరులు, జంతువులు వారి బంధువులు, భూమి వారి తల్లి. ప్రకృతిలోని ప్రతిదీ ఒకదానికొకటి సంబంధము కలిగివుండి ప్రాణము, ఉత్సాహముతో నిండియుండును.
‘భూమి అమ్మటమంటే కొనేవారు దానిని గౌరవముగా చూడరని కాదు’ అని ఆయన వివరించుచున్నారు. నీరు వారి పూర్వీకుల రక్తము వంటిది. గాలి వారి పిల్లలకు ప్రాణమును ఇచ్చును. స్థానికులు కొన్ని తరముల నుంచి భూమి, నదులు, గాలిని ప్రేమగా చూసుకొనుచున్నారు. అదే ప్రేమతో వుండమని ఆయన తెల్లవారికి చెప్పుచున్నారు.
‘ప్రకృతికి హాని చేసిన మనకు మనమే హాని చేసుకున్నట్లు’ అని సియాటిల్ అధిపతి హెచ్చరించుచున్నాడు. జీవితము ఒక వల వంటిది. మానవులంతా అందులో భాగము. ప్రకృతిని మానవుడు నాశనము చేసిన, తనను తాను నాశనము చేసికొన్నట్లే. భగవంతుడు ఒక్కడే అని స్థిరపడిన వారికి ఆయన గుర్తు చేయుచున్నాడు. భగవంతుడు భూమిని, ప్రజలను సృష్టించాడు – ఎర్ర వారైనా, తెల్లవారైనా, ఆయన సృష్టించినవారే. మనమంతా సోదరులము. ప్రతి విషయములో మనము భాగము పంచుకొని మన భూమిని రక్షించుకోవాలి.
![]()
తమ ప్రజలు ఏ విధముగా భూమిని ప్రేమించారో, అదే విధంగా తెల్లవారు ఉండగలరని ఆయన ఆశిస్తున్నారు. తాము భూమిని అమ్మినా, వారు ఆ విధంగా ప్రవర్తించాలని, చివరగా సియాటిల్ అధిపతి చెప్పుచున్నారు. వారు దాని అందమును కాపాడమని కోరుచున్నారు. భూమిని మరువవద్దు, నాశనము చేయవద్దు. ఎందుకంటే ప్రకృతి పవిత్రమైనది.
Glossary:
1. relinquish: /ɹɪˈlɪŋkwɪʃ/ (verb) to voluntarily give up or let go of something; వదులుకొను
2. sacred: /’seɪkɹəd/ (adj): regarded with reverence; holy; పవిత్రమైన
3. sparkle : /’spɑrkəl/ (noun): a shining or glittering light; మినుకు
4. perfumed : /’pə˞ˈfjumd/ (adj) having a pleasant fragrance; సువాసన కలిగిన
5. crest : /kɹɛs/(noun): the top of a mountain or hill;శిఖరం
6. quench: /kwɛntʃ/ (verb): to satisfy thirst; దాహం తీర్చు
7. murmur: /’mɜ˞mə˞/ (noun): a soft, indistinct sound; గుసగుస
8. dew: /du:/ (noun): tiny drops of moisture on surfaces in the morning; తుషారం
9. befalls: /bɪˈfɔːlz/ (verb): happens to someone, especially something bad; సంభవించు
10. contempt: /kənˈtɛmpt/ (noun): disrespect or scorn; అవమానం
11. destiny: /ˈdɛstəni/ (noun): a predetermined course of events; విధి
12. slaughtered: /slˈɔːɾɚd/ (verb): killed brutally, especially animals; వధించెను
13. blotted : /blˈɑːɾᵻd/ (verb) obscured or stained; మరుగునపడెను
14. thicket: /θˈɪkɪt/ (noun): a dense group of bushes or trees; పొదలు
![]()
15. vanish: /ˈvænɪʃ/ (verb) disappear suddenly; అదృశ్యమవు
16. prairie: /pɹˈɛɹi/ (noun) a large open grassland; గడ్డిభూమి
17. swift : /swˈɪft/ (adj): fast or quick; వేగవంతమైన
18. preserve: /pɹɪzˈɜːv/ (verb): protect from harm; సంరక్షించు
19. ancestors : /’ænsɛsta(r)z/ (noun) forefathers or predecessors; పూర్వీకులు
20. humming : /hˈʌmɪŋ/ (adj): making a low, continuous sound; ఝుమ్మనే ధ్వని చేయునట్టి
21. glossy : /ɡlˈɔsi/ (adj): shiny and smooth; మెరుస్తున్న
22. meadow : /mˈɛdoʊ/ (noun): a grassy field; గడ్డి మైదానం
23. tamed : /tˈeɪmd/ (verb): domesticated or controlled; పెంపుడు చేయబడెను
24. strand: /stɹˈænd/ (noun): a single thread or part of a web; దారం
25. heap: /hˈiːp/ (verb): to pile up or accumulate; చేయు
26. perceive: /pɚsˈiːv/ (verb): to become aware of something through the senses; గ్రహించు
27. misty: /mˈɪsti/ (adj): filled with or covered by mist; పొగమంచుతో కూడిన
28. scent: /sˈɛnt/ (noun): a distinctive smell; వాసన
29. ripe: /ɹˈaɪp/ (adj): fully matured or developed; పండిన
30. web: /wˈɛb/ (noun): a complex, interconnected structure; జాలం
31. contempt: /kəntˈɛmpt/ (noun) disrespect or scorn; అవమానం
32. mystery: /mˈɪstɚɹi/ noun) something difficult to understand or explain; రహాస్యం
33. sacredness: /sˈeɪkɹɪdnəs/ (noun): the quality of being holy or revered; పవిత్రత
![]()
34. kindness: /kˈaɪndnəs/ (noun): the quality of being friendly and considerate; దయ