దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material గద్యభాగం 5th Lesson దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అనాగరపు రోజులలో మానవ సామూహిక జీవన విధానం ఎలాంటిది ?
జవాబు:
ప్రకృతిలోని అన్ని ప్రాణులూ సమానమనే సత్యాన్ని బోధించే ప్రస్తుత పాఠం “దొంగ ఎవడు ? దొర ఎవడు ?” తాపీ ధర్మారావు గారి ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ” గ్రంథం నుండి స్వీకరించబడింది.

ప్రకృతిలోని సంపద ఏ ఒక్కరి సొత్తూ కాదు. జీవమున్న ప్రతి ప్రాణికి అందులో హక్కు ఉంది. అనాగరికపు రోజుల్లో జంతువులను చంపుకొని తినేవారు. సృష్టిలోని సూత్రమే అది. ఒకడు ఒక జంతువును చంపినా, పదిమంది పది జంతువులను చంపినా, అందరూ ఒక్క లాగానే తినేవారు. చంపిన కీర్తి వారిది. స్వాదు భోజనం అందరిదీని.

అడవులలో చెట్టుపళ్ళు తినేవారైనా, అప్పుడు కూడా ఇదే సిద్ధాంతం. ఒకడు చెట్టు పళ్ళు రాల్చినా, పదిమంది రాల్చినా దొరికిన పళ్ళు అందరికీని. అంతేగాని, నేను రాల్చాను, నేనే తినాలి అని అనుకుంటే ఆ క్షణంలో పక్కవాణ్ణి హతమార్చేవాడు. కుంటీ, గుడ్డీ, బలహీనుడు, ఆడది, శిశువు అందరూ ఆ ఫలాలను తినడానికి అర్హులే. ఆ ప్రతిఫలం ఒకడి సొత్తు కాదు. సంఘానిది, అందరిదీ కూడా.

ఇప్పటికీ అనాగరిక జాతులలో ఇంకా అలాంటి అభ్యాసం ఉంది. చెట్టు దులిపినా, చేపలు పట్టినా, తెచ్చిన కీర్తి ఒక్కడికే. కాని, తినే అధికారం అందరిదీ. అనుభవంలో ఆవంతయినా వ్యత్యాసం లేదు.

దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 2.
మానవ స్వార్థ స్వభావాన్ని వివరించండి.
జవాబు:
సమస్త జీవావరణంలో భాగమైన మానవుడు బుద్ధి వికాసం వల్ల కలిగిన ఆధిపత్యంతో మిగిలిన అన్ని ప్రాణుల కంటే అధికుడయ్యాడు. మెల్లగా ఆ ఆధిపత్యం ధోరణి తనలాంటి తోటి మానవుల మీద కూడా చెలాయించడం మొదలుపెట్టాడు. స్వార్థం, అదుపులేని కోరికలు మానవుణ్ణి ఆథోగతిపాలు చేశాయి. అందరి కోసం రావలసిన ప్రతిఫలం కొందరి కోసమే అయింది. అందరికి చెందవలసిన సొత్తును తన సొత్తుగా మనిషి భావిస్తున్నాడు. తన స్వార్థంతో మానవుడు సుభిక్షంగా ఉండవలసిన సంఘంలో దుర్భిక్షాన్ని జొప్పిస్తున్నాడు.

ఈ ఆరంభం అలా అల్లుకుపోయింది. కూసే గాడిదను చూసి మేసే గాడిదంటారు. అలాగనే ఒకణ్ణి చూచి ఇంకొకడు. ఈ అన్యాయం, ఈ అధర్మం, ఈ ఘోరం వ్యాపించిపోయింది. అందరూ అనుభవించవలసిన దానిని అంతా నాదేనంటాడు స్వార్ధపరుడు. ఇచ్చేటప్పుడయినా ఇవ్వాల్సినంత ఇవ్వడు. తక్కువే ఇస్తాడు. అదే తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటాడు. అవసరం కంటే అధికంగా ఆక్రమించుకున్నారు. ఇచ్చేటప్పుడు పిడికిలి మరింత బిగబడతారు స్వార్థపరులు.

దొరికిన పండ్లను తాను తినినంతవరకు తిని, తక్కినవి విడిచిపెడితే, తక్కినవాళ్ళు కూడా తిని పొట్టపోసుకుంటారు కదా ! అనే ఆలోచన చేయడు స్వార్థపరుడు. ఇతరులకు పెట్టే ఆలోచన లేకపోగా, “రేపు, ఎల్లుండి …. ముందు ముందు నేను తింటాను, మీకు ఇవ్వను” అని అన్నింటినీ మూటకడతాడు.

నెలపొడుగునా కష్టపడి ఓనమాలు నేర్పిన వాడికి ఒక్క రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తాడు. అదే దస్తావేజు రిజిష్టరు చేయడానికి ఏదో సాయం చేసిన బంట్రోతుకు మూడు రూపాయలు బక్టీసు ఇస్తాడు. క్షణికమైన సుఖాల కోసం వందలు, వేలు ఖర్చు పెట్టే మనిషి రాత్రనక పగలనక కష్టపడేవారికి దమ్మిడీలు లెక్కపెట్టి, తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. వికలాంగులైన పేదవారికి దమ్మిడీ ధర్మం చేయనివాడు, వేడుక కోసం డబ్బును నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తాడు.

ఇతరులకు చెందాల్సినది, తాను అపహరించి తనది అని అన్యాయంగా అంటున్నానని ఎవరూ అనుకోరు. మరి ఏమనుకుంటారు. ప్రతిదీ తమ కష్టార్జితమే అని అనుకుంటారు. ఇతరులను మోసం చేశామని అనుకోరు. తాను పోగు చేశానని ఆనందిస్తాడే కాని, తన స్వార్థంతో ఎన్ని కొంపలను ధ్వంసం చేశానో అని ఆ మాట తలచుకోడు. ఇదంతా వట్టి దోపిడీ. ఇప్పటి శిక్షాస్మృతికి చిక్కని దోపిడి.

II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దొర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
పూర్వపు నాయకులు ఎంత పరాక్రమం ఉండేవాడైనా, ఎంత మహాధీరుడైనా, దొరైనా నలుగురితో పాటు తానూ ఉన్నటువంటి ఆ జొన్న రొట్టే తినేవాడు.

ఆ కటిక నేలపైనే పడుకొనేవాడు. దొరగా ఉన్నప్పటికీ నలుగురితో సమానంగా ఉండేవాడు. యుద్ధంలో దొరికిన వస్తువులను అందరూ అనుభవించేవారు. ఏదైనా ఎక్కువ ఉంటే కత్తుల కోసం, కటారుల కోసం, పశువుల కోసం, బండ్ల కోసం అంటే సంఘానికి పనికి వచ్చినట్టు ఉపయోగించేవారు. ప్రత్యేక భావం అన్నది దొరకు ఉండేది కాదు. అంతా నాదే అన్నది అసలే లేదు. అలెగ్జాండరు వంటి నాయకులు దిగ్విజయ యాత్రలు చేసినప్పుడు ప్రతి భటునికి తగినట్టు గొప్ప గొప్ప పారితోషికాలిచ్చారు. పేరు నాయకుడిది. లాభం అందరిదీ. అదే న్యాయబుద్ధి. ఆ బుద్ధి ఉన్నవాడే దొర.

ప్రశ్న 2.
మానవుని దుబారా, పిసినారి తత్త్వాలను తెలపండి.
జవాబు:
నెల పొడుగునా ఓనమాలు నేర్చినవాడికి ఒక్క రూపాయి ఇస్తారు. దస్తావేజు రిజిష్టరు చేయడానికి ఏదో సాయం చేసిన బంట్రోతుకు మూడు రూపాయలు బక్షీసు (బహుమానం) ఇస్తారు. క్షణ సౌఖ్యానికి వందలు, వేలు ఖర్చు పెడతారు. రాత్రనక, పగలనక కష్టపడేవారికి దమ్మిడీలు లెక్కపెట్టి తగ్గించి ఇస్తారు. కరివేపాకూ, తోటకూరా కొన్నప్పుడు మూడు దమ్మిడీలకు ………….. పరమ పట్టుదలతో బేరమాడతారు. పట్టుచీరలు కొన్నప్పుడు వేలైనా, లక్షలైనా లక్ష్యం చేయక బడాయికి పోతారు. వేడుక కోసం రూపాయలు ఖర్చు పెడతారు. వీధిలో అడుక్కునే వాడికి ఒక దమ్మిడీ ఇవ్వరు. ఇవే నేటి మానవుల దుబారా, పిసినారి తత్త్వానికి ఉదాహరణలు.

దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
తాపీ ధర్మారావుగారి గురించి రాయండి.
జవాబు:
పాఠ్యభాగం : దొంగ ఎవడు ? దొర ఎవడు ?
రచయిత : తాపీ ధర్మారావు
కాలం : 19.09.1887 నుండి 08.05.1973 వరకు
తల్లిదండ్రులు : నరసమ్మ, అప్పన్న
జన్మస్థలం : బరంపురం, ఒరిస్సా

విద్యాభ్యాసం : విజయనగరంలో ప్రాథమిక విద్య, విజయవాడ, మద్రాసులలో ఉన్నత విద్య బి.ఏ.
వృత్తి : రచయిత పండితుడు, హేతువాది, నాస్తికుడు, గణిత ఉపాధ్యాయుడు, సినీ రచయిత.

రచనలు : ఆంధ్రుల కొక మనవి, రాలూ-రప్పలు, పాతపాళీ, కొత్తపాళీ, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, సాహిత్య మొర్మరాలు మొ॥. చేమకూరి వేంకట కవి రచించిన ‘విజయవిలాసం’ గ్రంథానికి వీరు రాసిన ‘హృదయోల్లాసం’ వ్యాఖ్య.

బిరుదులు, పురస్కారాలు : శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ఆంధ్ర విశారద బిరుదు, హృదయోల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
గురువు : గిడుగు రామ్మూర్తి గారు, కోడి రామ్మూర్తి నాయుడు.
శిష్యులు : నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వర రావు, పి. శ్రీరాములు.

III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బసు అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
బసు అంటే ఉచితంగా పొందినది లేదా సంతోషంగా ఇచ్చేది.

ప్రశ్న 2.
తాపీ ధర్మారావుగారి ఆత్మకథ పేరు ఏమిటి ?
జవాబు:
తాపీ ధర్మారావు గారి ఆత్మకథ పేరు “రాలూ – రప్పలు”.

దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
ఎంతమంది ధనికులున్నా దేశానికి ఏది తప్పడం లేదు ?
జవాబు:
ఎంతమంది ధనికులున్నా దేశానికి దారిద్ర్యం తప్పడం లేదు.

దొంగ ఎవడు? దొర ఎవడు? Summary in Telugu

రచయిత పరిచయం

పాఠ్యభాగం : దొంగ ఎవడు ? దొర ఎవడు ?
రచయిత : తాపీ ధర్మారావు
కాలం : 19.09.1887 నుండి 08.05.1973 వరకు
తల్లిదండ్రులు : నరసమ్మ, అప్పన్న
జన్మస్థలం : బరంపురం, ఒరిస్సా
విద్యాభ్యాసం : విజయనగరంలో ప్రాథమిక విద్య, విజయవాడ, మద్రాసులలో ఉన్నత విద్య బి.ఏ.
వృత్తి : రచయిత పండితుడు, హేతువాది, నాస్తికుడు, గణిత ఉపాధ్యాయుడు, సినీ రచయిత.

రచనలు : ఆంధ్రులకొక మనవి, రాలూ-రప్పలు, పాతపాళీ, కొత్తపాళీ, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, సాహిత్య మొర్మరాలు మొ॥.
చేమకూరి వేంకట కవి రచించిన ‘విజయవిలాసం’ గ్రంథానికి వీరు రాసిన ‘హృదయోల్లాసం’ వ్యాఖ్య.

బిరుదులు, పురస్కారాలు: శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ఆంధ్ర విశారద బిరుదు, హృదయోల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
గురువు : గిడుగు రామ్మూర్తి గారు, కోడి రామ్మూర్తి నాయుడు.
శిష్యులు : నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి. శ్రీరాములు.

విశేషాలు : బరంపురంలో ‘వేగుచుక్క’ గ్రంథమాలను స్థాపించారు. కొండెగాడు, జనవాణి, ప్రజాతంత్ర, సమదర్శిని, కాగడా మొదలైన పత్రికలను నిర్వహించారు. వీరి జయంతి (సెప్టెంబరు 19)ని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుతారు. రాలూ-రప్పలు (1887 నుండి 1908) ఆయన రాసిన ఆత్మకథ.

పాఠ్యభాగ నేపథ్యం

ప్రకృతిలోని సంపద ఏ ఒక్కరి సొత్తూ కాదు. జీవమున్న ప్రతి ప్రాణికి అందులో హక్కు ఉంది. సమస్త జీవావరణంలో భాగమైన మానవుడు బుద్ధివికాసం వల్ల కలిగిన ఆధిపత్యంతో మిగిలిన అన్ని ప్రాణుల కంటే అధికుడయ్యాడు. మెల్లగా ఆ ఆధిపత్య ధోరణి తనలాంటి తోటి మానవులమీద కూడా చెలాయించడం మొదలుపెట్టాడు. స్వార్థం, అదుపులేని కోరికలు మానవుణ్ణి అధోగతిపాలు చేశాయి. ఈ పాఠ్యాంశంలోని విషయాలు మానవుల అంతఃకరణ పరిశీలనకు దోహదం చేసి సమానత్వం వైపు నడిపిస్తాయి. ప్రకృతిలోని అన్ని ప్రాణులూ సమానమనే సత్యాన్ని బోధించే ప్రస్తుత వ్యాసం “ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ” గ్రంథం నుండి స్వీకరించబడింది.

దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary Inter 1st Year Telugu

కఠిన పదాలకు అర్థాలు

83వ పేజి :

అవస్థ = ఇబ్బంది
దాత = దానం చేసేవాడు
ధర్మాత్ముడు = మంచి గుణాలు ఉన్నవాడు
సోలు = అనుకొను
కటువు = కఠినం
స్వాదు = ఆస్వాదించుటకు యోగ్యమైనది, ఇంపైన
సొత్తు = సొమ్ము
ఆవంత = కొంచెమైనా
వ్యత్యాసం = తేడా
పరమయోగ్యుడు = మిక్కిలి సరైనవాడు
పరిణమించు = మార్పుచెందు

84వ పేజి :

ప్రతిఫలం = బహుమతి
సుభిక్షం = సమృద్ధి
దుర్భిక్షం = కరువు
అల్లుకొను = చుట్టుకొను

“కూసే గాడిదను చూచి మేసే గాడిద” …………………… ఇది ఒక సామెత.
వివరణ : గాడిదను సామాన్యంగా బరువులు మోయడానికి వాడతారు. ఏ బరువూ మోయకుండా ఊరికే కూసే గాడిదను చూసి, మోసే గాడిద కూడా చెడిపోయి తాను చేసే పని మానేసిందని భావం. పనీ పాటా లేకుండా తిరుగుతూ, చక్కగా పని చేసుకుంటున్న వారిని చెడ్డగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు.

ఘోరం = అమానుషం, భయంకరం
బిగపట్టు = ఇవ్వకుండా చేయు
పొట్టపోసుకొను = కడుపు నింపుకొను
ఆగడం = దుడుకుపని, చెడ్డపని
ముష్కరుడు = చెడ్డవాడు, మొండివాడు
మెత్తనివాడు = నెమ్మదైనవాడు
లేనివాడు = దరిద్రుడు
అంతస్థు = స్తోమత
కటికనేల = కేవలం నేలపై
కటారు = బాకు

దొంగ ఎవడు? దొర ఎవడు? Questions and Answers Summary Inter 1st Year Telugu

85వ పేజి:

విపర్యాసం = తారుమారు
అంతరించు = చచ్చు, నశించు
దమ్మిడీ = ఐదుకాసుల నాణెం, తక్కువ డబ్బు
చెక్కు చేయు = కత్తిరించు
బేరమాడు = ధరలు తగ్గించి అడుగు
లక్ష్యం చేయక = లెక్క చేయక
బడాయించు = బడాయికొట్టు, అతిశయంగా మాట్లాడు
కష్టార్జితం = శ్రమ చేసి సంపాదించినది
ధ్వంసం = నాశనం
పైకం = డబ్బు
ఉపోష్యం = ఉపవాసం
ఉబ్బు = పొంగు, సంతోషం, అహంకారం
దోపిడి = దోచుకొనుట
శిక్షాస్మృతి = నేరానికి తగిన దండన వివరణలు, నియమ నిబంధనలు తెలుపు న్యాయశాస్త్రం
చిక్కని = దొరకని
దిగ్విజయ = దిక్కుల వరకు ఉన్న ప్రాంతాలను జయించుట
పారితోషికం = గౌరవ బహుమానం
దొర = గొప్పవాడు
ప్రయోజకత్వం = పనిని సాధించే లక్షణం
నొల్లుకొను = అత్యాశతో పోగు చేయు
అదును = సమయం