Reviewing AP Inter 2nd Year Telugu Study Material గద్యభాగం 2nd Lesson ఆదర్శ గురువు నాయుడుగారు Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu ఆదర్శ గురువు నాయుడుగారు Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్న
ప్రశ్న 1.
ఆదర్శగురువుగా నాయుడు గారి వ్యక్తిత్వం, గుణగణాలు ఎలాంటివి ?
జవాబు:
కవి పరిచయం : ఈ ప్రశ్న ఆదర్శ గురువు నాయుడు గారు అనే పాఠ్యాంశం లోనిది. దీని రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఈ వ్యాసంలో వారి గురుభక్తిని, గురువు పట్ల అచంచలమైన విశ్వాసాన్ని, గౌరవాన్ని ప్రకటించారు.
నాయుడుగారు గురుదేవుడు : దేవులపల్లివారు నాయుడుగారిని గురుదేవుడిగా, అధ్యాపకుడిగా, సోక్రటీసుగా భావించారు. యాభై సంవత్సరాలు తెలుగుదేశంలో నాయుడుగారంటే వొక్కరే. రఘుపతి వేంకటరత్నం నాయడుగారే. ఆంధ్రయువకులను ఉత్తేజపరిచిన గుండెవారిది.
భావనాశక్తి : నాయుడిగారి ‘భావనాశక్తి’ అవధులు లేనిది. వారు చెబుతూ వారి భావనల రెక్కలను అనేక తీరాలకు విసిరేవారు. పాఠం వింటున్న శిష్యులు వారితో పాటే గంగాతీరం నుండి పారశీక సాహిత్యం అనే `మధువనంలోకి ప్రయాణించేవారు. షేక్స్పియర్, వర్డ్స్ వర్త్, కేరైల్ వంటి పాశ్చాత్యుల రచనలను పరిచయం చేస్తూ, వారి మనస్సు విహారం చేసేది.
వాక్ ప్రతిభ : వారిది అనన్య సామాన్యమైన వాక్శక్తి. ఆయన కావ్యం చదువుతూ ఉంటే, ప్రతి మాట ప్రతి శిష్యుణ్ణి ప్రత్యేకంగా పలకరించినట్టే ఉండేది. వారి వాణి గంభీరమైనది. ఆ స్వరంలో నుంచి మాటలు మెల్లగా కొండవాగులా సాగి చల్లని నిండునదిలా ప్రవహించి, ఆ గంభీరమైన స్వరం గది అంతా ”నిండిపోయేది. ఎంతో మంది మహానుభావులు ఎదురుగా నిల్చొని, నాయుడు గారి రూపంలో సాక్ష్కాత్కరించేవారు. హాస్యప్రియుడు కూడా. ఉపన్యాసంలో పరిహాసం ఆకర్షించేది.
వ్యక్తిత్వం : నాయుడుగారు కైలాసశిఖరం నుంచి దిగినట్లు కనిపించేవారు కాదు. నిజానికి ఆయన గోపురం లాంటివారు. ఆయన పాదాలు భూమిలో నిలబెట్టి, మనస్సు ఉన్నతంగా, ఉజ్వలంగా వెలుగుల వైపు ప్రయాణించేది. వారు మిక్కిలి జ్ఞానవంతులు. ఋషి వంటివారు. నాయుడుగారి గుండె ఆవుపాలు, వెన్న, శరత్ కాలపు వెన్నెలతో చేసినది. అందుకే వారిది తల్లి హృదయం.
ఆయన విద్యార్థులను దండించేవారు కాదు. పాపం అనేది దండింపదగిన నేరం కాదు, కుదుర్చుకోవలసిన రోగం అనే మాటను నమ్మిన వ్యక్తి. విద్యార్థులలో నిరాశ, నిస్పృహలను దూరం చేసి, వారిలోని ఆంతరంగిక శక్తులను మేలు కొలిపేవారు. అనురాగమూర్తి. సౌశీల్యం గలిగిన వ్యక్తి. ఆయన పాండిత్యశక్తి అనన్యసామాన్యం. అయినప్పటికీ అహంకారం ఉండదు. అహంకారం కలిగిన వారిని గౌరవించడు. అణకువ ముఖ్యమని నిరూపించాడు. ఆచార్యుడు – మిత్రుడు – మాతృమూర్తి : ఆయన శిష్యులకు హితం చేస్తాడు. సద్గుణాలను ప్రోత్సహిస్తాడు. మిత్రుడిలా ఆదరిస్తాడు. అమ్మ, నాన్నలా పిల్లలను పొదువుకుంటాడు. పాపకార్యాల నుండి శిష్యులను మరల్చేవాడు. మాతృ హృదయమూర్తి.
నిరాడంబరత : ఆయన ఎన్ని పదవులు అలంకరించినా, శిష్యులకు ఆప్త మిత్రుడిలా అనిపించేవారు. కాలేజి ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయ కులపతి, డాక్టర్, సర్, పార్టీ నాయకుడు ఇలా ఏ పదవిలో ఉన్నా, శిష్యులతో చనువుగా ఉండేవారు. శిష్యులు భక్తిగా, గౌరవంగా ఉండేవారు. ఆయన చేతి స్పర్శ, శిష్యుల శరీరాలను విద్యున్మయం చేసేది.
నాయుడుగారి వరాలు : నాయుడుగారు ఆంధ్రయువతకు రెండు వరాలు ప్రసాదించారు.
- లక్ష్యశీలం
- తత్వదృష్టి అలాగే వారు సంఘసంస్కరణకు పూనుకున్నారు. దీనులను ఆదుకున్నారు.
ముగింపు : అఖండవైదుష్యమూ, అమృత హృదయమూ, ఈశ్వరభక్తి, దీనజనసేవ, సంస్కరోత్సాహమూ, ఆంధ్రమహాజనులలో ఉన్నంత కాలం నాయుడుగారి దివ్యమైన జీవితం, అదృశ్యంగా, అమరజ్యోతివలె, స్వర్ణవాణి వలె తరతరాలకు ప్రబోధకంగా వెలుస్తుంది.
II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి రాయండి.
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవితా చక్రవర్తి. ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో తనదైన రీతిని, అపూర్వభావ వైశిష్ట్యాన్ని సాధించుకున్న మహాకవి. ఆయన ఆంధ్రాషెల్లీగా ప్రసిద్ధి పొందారు. భావకవులకు ప్రతినిధి.
జన్మవిశేషాలు : కృష్ణశాస్త్రిగారు 1897 నవంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని రామచంద్రంపాలెంలో జన్మించారు. సీతమ్మ, తమ్మన్న శాస్త్రి వారి తల్లిదండ్రులు.
విద్య – ఉద్యోగం : ఆయన పిఠాపురం, విజయనగరాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. పెద్దాపురం మిషన్ హైస్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. అయితే ఆయన బ్రహ్మసమాజం పట్ల ఆసక్తి కలిగి, తన ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రోత్సాహంతో సంఘసంస్కరణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వారు గొప్ప వక్త కూడా.
రచనలు :
- కృష్ణపక్షం
- ప్రవాసం
- ఊర్వశి
- పల్లకి
- 170కి పైగా సినిమా పాటలు
- లలిత గీతాలు
- నాటికలు
పురస్కారాలు : ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వంచే పద్మభూషణ పురస్కారాలు పొందారు. ఆయన కవిత్వంలో ఏకేశ్వరోపాసనం, సంస్కరణ ప్రియత్వం, ఆత్మాశ్రయ రీతి, ప్రకృతి పట్ల ఆరాధన కనిపిస్తాయి.
మరణం : ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి’ అంటూ వారే రాసినట్లుగా 24.02.1980లో ఈ లోకాన్ని విడిచి, స్వర్గానికి చేరుకున్నారు.
ప్రశ్న 2.
నాయుడుగారి భావనాశక్తి ఎలా ఉండేది ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి వారు గురువు గారైన నాయుడు గారి గురించి చెబుతూ, ఆయన సోక్రటీసు లాంటి వారు అన్నారు. ఆయనలో కవికి ఉండే తన్మయత్వం, భావన నిండుగా ఉండేవి. శిష్యులకు, నాయుడు గారితో గొప్ప అనుబంధం ఉండేది. శిష్యుల మనస్సులను ఉర్రూతలూగించేవారు. ఆయనలోని భావనాశక్తికి హద్దులు ఉండేవికావు. వారు పాఠం చెబుతూ ఉంటే విద్యార్థులలోని ఆలోచనాశక్తి, ఊహాశక్తి రెక్కలు విప్పేది.
వారు వైదిక యోగులనాటి గంగాతీరానికి, బదరికా వనానికి తీసుకెళ్ళగలిగేవారు. పారశీక కవిత్వ సౌందర్యాన్ని చెబుతూ వారి హృదయం సేదతీరేది. ప్రసిద్ధ ఆంగ్ల కవులైన షేక్ స్పియర్, వర్డ్స్వర్త్, కేరైల్ వంటి పాశ్చాత్యుల విజ్ఞాన వీధుల్లో వారి మనస్సు విహారం చేసేది. వారు పాఠాన్ని హృదయంతో చెప్తూ, విద్యార్థుల హృదయాల్లోకి ప్రయాణం చేసేవారు.
ప్రశ్న 3.
నాయుడుగారి ఆహార్యం ఎలా ఉండేది ?
జవాబు:
దేవులపల్లి, నాయుడుగారి ఆహార్యాన్ని మన కంటి ముందు నిలుపుతారు. కృష్ణశాస్త్రిగారికి గురుదేవుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, సోక్రటీసు నాయుడు నాయుడుగారు తెల్లటి దుస్తులు వేసుకొనేవారు. తెల్ల చెప్పులు ధరించేవారు’ తలమీద తెల్లటి తలపాగా (పగిడి) పెట్టుకొనేవారు. ఇక తెల్ల షల్వార్, తెల్ల షేర్వాణిలను దుస్తులుగా వేసుకొనేవారు. షల్వార్ నడుము నుండి పాదాల వరకు వేసుకునే పైజామా అన్నమాట.
ఇక షేర్వాణి మోకాళ్ళ వరకు ఉండే పొడుగు చేతుల చొక్కా, తలపాగాలో నుంచి వారి తెల్లని జుట్టు తొంగిచూసేది. తెల్లని మీసాలతో, చుట్టూ నల్లని కాటుక ఛాయ వుండే చల్లని చురుకైన కళ్ళు వారివి. వారిది మేఘ గర్జన వంటి గంభీరమైన కంఠధ్వని.
III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
దేవులపల్లి కృష్ణశాస్త్రి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
సీతమ్మ, తమ్మన్న శాస్త్రి దేవులపల్లి వారి తల్లిదండ్రులు.
ప్రశ్న 2.
దేవులపల్లి ఏ చిత్రంతో గేయరచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు ?
జవాబు:
దేవులపల్లి ‘మల్లీశ్వరి’ చిత్రంతో గేయ రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
ప్రశ్న 3.
నాయుడుగారు ఏ సంవత్సరంలో పుట్టారు ?
జవాబు:
నాయుడుగారు 1861వ సంవత్సరంలో పుట్టారు.
ప్రశ్న 4.
నాయుడుగారు ఆంధ్రాయువతకు ప్రసాదించిన రెండు వరాలు ఏవి ?
జవాబు:
నాయుడుగారు ఆంధ్రాయువతకు ప్రసాదించిన రెండు వరాలు
- లక్ష్య శీలం
- తత్వదృష్టి.
ప్రశ్న 5.
“తన విద్యార్థుల జీవితములను సంస్కరించి ఉత్తేజపరచలేని గురువు గురువు కాడు” అని అన్నదెవరు ?
జవాబు:
తన విద్యార్థుల జీవితములను సంస్కరించి ఉత్తేజపరచలేని గురువు గురువు కాదని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు.
తెలుగులో అన్యదేశ్యాలు Summary in Telugu
రచయిత పరిచయం
పాఠ్యాంశం పేరు : ఆదర్శగురువు నాయుడు గారు
రచయిత : దేవులపల్లి కృష్ణశాస్త్రి
జననం : 1-11-1897
జన్మస్థలము : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని రామచంద్రపాలెం
తల్లిదండ్రులు : సీతమ్మ, తమ్మన్న శాస్త్రి
విద్యాభ్యాసం : పిఠాపురం, విజయనగరాలలో
ఉద్యోగం : పెద్దాపురం మిషన్ హైస్కూల్లో ఉపాధ్యాయవృత్తి
రచనలు : కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, పల్లకి ఇవన్నీ ఖండ కావ్యాలు. అలాగే వారు నాటికలు, లలితగీతాలు, సినిమాపాటలు రాశారు. మల్లీశ్వరి సినిమా నుండి దాదాపు 170 చలన చిత్రాలకు పాటలు రాశారు.
పురస్కారాలు : కళాప్రపూర్ణ, పద్మభూషణ
ప్రత్యేకత : కృష్ణశాస్త్రి గారు భావకవిగా, ఆంధ్రషెల్లీగా ప్రసిద్ధి పొందారు. గొప్ప వక్త, రచయిత, భావకవుల ప్రతినిధిగా పేరుగాంచారు.
కవిత్వంలో కనిపించే లక్షణాలు : బ్రహ్మ సమాజ ప్రభావం వలన వారి రచనలలో ఏకేశ్వరోపాసన, సంస్కరణ ప్రియత్వం కనిపిస్తాయి.
మరణం : 24-02-1980లో శాశ్వతస్వర్గానికి చేరారు.
పాఠ్యభాగ నేపథ్యం
తెలుగు సాహిత్యంలో భావ కవిత్వోద్యమానికి మార్గదర్శిగా నిలిచిన గొప్ప మేధావి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన కవితా శైలి ఎందరో కవులకు స్ఫూర్తి నిచ్చింది. కృష్ణశాస్త్రిగారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి, ఆయనను సరైన మార్గంలో నడిపించిన గురువు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. తన ఎదుగుదలకు కారణమైన గురువు గారి పట్ల ఉన్న భక్తిని, కృతజ్ఞతను చాటుకుంటూ కృష్ణశాస్త్రిగారు మద్రాసు ఆకాశవాణి కేంద్రం ద్వారా ఒక ప్రసంగాన్ని చేశారు. “తెలుగు వ్యాస మండలి” అనే వ్యాస సంకలనం నుండి గ్రహించిన ఆ ప్రసంగ పాఠమే ఈ ప్రస్తుత పాఠ్యభాగం.
పాఠ్యభాగ ఉద్దేశం
అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగు వైపుకు నడిపించే వాడే నిజమైన గురువు. లోకంలో ప్రసిద్ధి గాంచిన గురుశిష్యుల మధ్య ఉండే ప్రేరణాత్మక బంధాన్ని విద్యార్థులకు వివరించడమే ఈ పాఠం ఉద్దేశ్యం. ఉత్తమమైన గురువు లభించినప్పుడు శిష్యులు ఎలా గొప్పవారవుతారో, అలాగే జిజ్ఞాస కలిగిన శిష్యులు దొరికినప్పుడు ఆ గురువు ఎంతటి ఆనందాన్ని పొందుతారో ఈ పాఠం తెలియజేస్తుంది. ఒక ఆదర్శవంతమైన గురువు, శిష్యుని సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారో వివరించడమే ఈ పాఠ్యాంశం ముఖ్య లక్ష్యం.
కఠిన పదాలకు అర్థాలు
66వ పేజి :
మనః = మనస్సు
పేటి = పేటిక, పెట్టె
సంస్కరించి = బాగుచేసి
గురువు = ఆచార్యులు, ఉపాధ్యాయుడు
ఉత్తేజం = ఉత్సాహం
వికాసము = అభివృద్ధి, ప్రగతి
సరుకు = వస్తువులు, సామాను
నిరవధిక = కాలపరిమితి లేని
చైతన్యము = ఉత్సాహం, ప్రేరణ
మనస్సు = మది
మ్యూజియం = పురాతన వస్తువులు భద్రపరుచునది
మన్ననలు = మెచ్చుకోళ్ళు
స్నేహితుడు = మిత్రుడు
తండ్రి = నాన్న, పిత
ఆంధ్ర = = తెలుగు
రంగం = క్షేత్రం
నవ్య = నూతన, కొత్త
నిర్మాత = నిర్మాణం చేసేవాడు
కృషి = సేవ, కష్టం
వెలుగు = కాంతి
బలం = శక్తి
ఆప్యాయం = ప్రేమ, అనురాగం
స్మరణీయులు = గుర్తుపెట్టుకో తగినవారు
యూనివర్సిటీ = విశ్వవిద్యాలయ
వైస్ ఛాన్సలర్ = ఉపకులపతి
ముప్పాతిక = 75% (75 శాతం)
చరణం = కాళ్ళు
సన్నిధి = సమీపం, దగ్గర
ప్రముఖులు = ప్రధానమైనవారు
కులపతి = విశ్వవిద్యాలయానికి పెద్ద
68వ పేజి :
అధ్యాపకుడు = గురువు, అధ్యయనం చేయించువాడు
తన్మయత్వం = ఉద్వేగం
భావన = ఊహా
కావ్యం = రచన
శిష్యుడు = అంతేవాసి
నందనం = ఉద్యానవనం
అనిలం = గాలి
ఉర్రూత = అమితమైన ఉత్సాహం
అవధి = హద్దు
భావనాశక్తి = ఆలోచనా సామర్థ్యం
హృదయం = గుండె, ఎడద
పక్షాలు = రెక్కలు
వైదిక = వేదం తెలిసినవాడు
యోగులు = ఉపాయాలను పాటించేవారు
భాగీరథి = గంగానది
తీరం = ఒడ్డు
మధు = తేనె
వనం = అడవి
పాశ్చాత్యులు = పడమర దేశాలకు చెందిన వాళ్ళు
విహారం = వేడుకగా తిరగటం
ప్రబోధం = మేల్కొలుపుట, మేలుకోలు
వాక్ = మాట
భాషణం = మాట
షల్వార్= లాగు
పగిడి = తలపాగా
గిరజాలు = జుట్టు
కంఠం = స్వరం, గొంతు
కార్యం = పని
మునిమాపు = రాత్రికి ముందు, ప్రదోషకాలం, సంధ్యాకాలం
పాదుషా = సుల్తాను
వాణి = మాట
ఘట్టం = సందర్భం
గాథ = కథ
ప్రణయం = ప్రేమ
శీలం = గుణం, ప్రవర్తన
దృష్టి = చూపు
విశ్వం = లోకం
ఘడియ = 24 ని॥లు (రోజులో 60వ భాగం)
శిఖరం = పర్వతం
గోపురం = ఎత్తుగా కట్టిన ద్వారం
పాదాలు = కాళ్లు
ఉజ్వలం = వెలుగు, అగ్ని
సీమ = ప్రదేశం, ప్రాంతం
ఆర్జనము = సంపాదన
తపస్సు = కృషి
అర్థ శతాబ్ది = యాభై సంవత్సరాలు
69వ పేజి :
ఏకపత్ని = ఒకే భార్య
గురపత్ని = గురువు గారి సతీమణి
గోక్షీరం = ఆవుపాలు
నవనీతం = వెన్న
శరజ్యోత్స్న = శరత్ కాల వెన్నెల
నిష్కళంక = మచ్చలేని
దండధరుడు = యముడు, రాజు
చండశాసనం = కఠినమైన శిక్ష
బహిర్వివేకం = వెల్లడి చేయగల ఆలోచన
రోగం = జబ్బు
సౌహార్థం = మైత్రి, స్నేహం
ప్రథముడు = మొదటివాడు
ప్రకృతులు = మనఃస్థితి, పరిస్థితి
అమరులు = మరణం లేనివారు
అణకువ = వినయం
అహంకారం = గర్వం
పాండిత్య౦ = జ్ఞానం
పాషాణం = బండ
తపస్వి = ముని
అదృశ్యం పితృమూర్తి
అనలం = అగ్ని
పటిమ = శక్తి, నైపుణ్యం
శోధన = వెదుకులాట
హితం = మంచి చేయడం
అదృశ్యం = కనిపించకుండా పోవడం
పితృమూర్తి = తండ్రి
70వ పేజి :
మహావక్త = గొప్ప మాటకారి
దీనబాంధవుడు = దీనులకు బంధువు
యోధుడు = వీరుడు
ప్రసంగం = ఉపన్యాసం
సంకులం = వ్యాపించిన
సచివుడు = స్నేహితుడు, మంత్రి
నమ్రత = వినయం
బాంధవ్యం = బందుత్వ౦
వాత్సల్యం = ప్రేమ
సఖ్యం = స్నేహం
పూజ్యత = గౌరవం
కరం = చేయి
స్పర్శ = తాకిడి
దేహం = శరీర౦
సానువులు = ఆవాలు
మందహాసం = చిరునవ్వు
చిత్తం = మనస్సు
నైర్మల్యం = మలినం
వక్తృత్వం= మాట
శిలావిగ్రహం = రాతి ప్రతిమ
వశం = స్వాధీనం, లోకువ
చిత్తరువు = చిత్రపటం
అఖండ = గొప్ప
జీవనము = జీవితం
అమరజ్యోతి = ఆరని వెలుగు