సి.పి.బ్రౌన్ Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material గద్యభాగం 3rd Lesson సి.పి.బ్రౌన్ Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu సి.పి.బ్రౌన్ Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సి.పి. బ్రౌన్ తెలుగు సాహిత్యానికి చేసిన సేవను వివరించండి.
జవాబు:
సి.పి.బ్రౌన్ పాఠ్యభాగం జానుమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన “సుప్రసిద్ధుల జీవిత విశేషాలు” అనే గ్రంథం నుండి గ్రహించబడింది.

మినుకుమినుకుమంటున్న తెలుగు వాఙ్మయ దీపాన్ని స్నేహసిక్తం చేసి ప్రజ్వలింప చేసిన ఆంధ్రభాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్. తెలుగుభాష సాహితీ సంపదను వెలికితీయడంలో సి.పి. బ్రౌన్ చేసిన కృషి అనన్యమైనది. 1820 ఆగష్టులో బ్రౌన్ కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పాడు. తన సొంత బంగళాలో పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేసి, సొంతడబ్బుతో పండితులను నియమించాడు. బంగళాను ‘సాహిత్య కర్మాగారం’గా రూపొందించాడు.

1824లో అబేదుబాయ్ రాసిన “హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్” పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది. వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. దాదాపు 2వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 693 పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి, అచ్చు వేయించాడు. అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విస్తృత ప్రచారం కావించాడు.

అగ్గి పురుగులకు (నిప్పుకు) ఆహుతి కానున్న తెలుగుకావ్యాల రాత ప్రతులను సేకరించాడు. కొంత డబ్బుతో పండితులను, వ్రాయసగాళ్ళను పెట్టి కావ్య పరిష్కరణ, శుద్ధ ప్రతులు తయారు చేయించాడు. ఆంధ్ర మహాభారతాన్ని, భాగవతాన్ని పరిష్కరింప చేసి అచ్చు వేయించినవాడు బ్రౌన్. ‘నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్’ అన్నాడు పరిశోధక సాహసి బంగోరె.

1835-38 మధ్య సెలవుపై లండన్ వెళ్ళాడు. బ్రౌన్ అక్కడ కూడా విశ్రాంతి లేకుండా తెలుగు భాష కొరకు శ్రమించాడు. ‘ఇండియ హౌస్ లైబ్రరి’లో గుట్టలుగా పడివుండిన దక్షిణ భారత భాషల గ్రంథాలు (లిఖిత ప్రతులు) 2,106ను మద్రాసు గ్రంథాలయానికి పంపాడు. కళాపూర్ణోదయం, పల్నాటి వీర చరిత్ర మున్నగు 25 ప్రబంధాలను పరిష్కరింప చేశాడు. సంస్కృత గ్రంథాల సేకరణ, పరిష్కరణ చేశాడు.

ఇదంతా పండిత భాషకు సంబంధించిన కృషి. ప్రజాభాషకు మరింత ఎక్కువ కృషి చేశాడు. ప్రజల నోళ్ళలో నానుతూ వచ్చిన చాటువులు, సామెతలు, కథలు, గాథలు, పలుకుబడులను సేకరించాడు. తెలుగు నేర్చుకోదలచిన ఆంగ్లేయుల కోసం ఎన్నో వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాశాడు. అన్నిటికన్నా మిన్నగా చెప్పవలసిన పని, నిఘంటు నిర్మాణం. తెనుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు- తెలుగు నిఘంటువులు రాశాడు. జిల్లా నిఘంటువు రాశాడు. తెలుగు సాహిత్యం గురించి శిల్పం, జ్యోతిష్యం, కలిశకం, హిజరి శకం మున్నగు వాటిపై పెక్కు వ్యాసాలు రాశాడు. రాజుల యుద్ధం అనే అనంతపురం చరిత్ర, తాతాచారి కథలు, పంచతంత్ర కథలు ఇలా ఎన్నింటినో సేకరించి ముద్రించారు.

ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింప చేసిన బ్రౌన్ దొర సేవను ప్రశంసిస్తూ, నాటి పండితుడు అద్వైత బ్రహ్మశాస్త్రి ఇలా అన్నాడు. “సరస్వతికి ప్రస్తుత మందు తమరు ఒకరే నివాసస్థానముగా కనబడుతున్నారు. ఎక్కడ ఏఏ విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి. తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్ను తమ యొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి”.

ప్రశ్న 2.
సి.పి. బ్రౌన్ దానధర్మాలను గురించి వివరించండి.
జవాబు:
సి.పి.బ్రౌన్ మానవతావాది. ప్రతినెలా 100-130 మంది గుడ్డి, కుంటి వారికి సాయం చేసేవాడు. అప్పులు చేసి జైలు పాలైన పదకొండుమందికి 355 రూపాయలిచ్చి విడిపించాడు. ఒక దశలో నెలకు సగటున 500 రూపాయలు దానధర్మాలకు ఖర్చు చేసేవాడు.

అవిద్య అకాండ తాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా ఉన్న కాలమది. 1821లో కడపలో రెండు బళ్ళు పెట్టాడు. ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించాడు. ఆ బళ్ళలో దేశీయ ఉపాధ్యాయులను నియమించాడు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు. మచిలీపట్నంలో కూడా రెండు పాఠశాలలను ప్రారంభించాడు. అక్కడ కూడా ఉచిత భోజన వసతి కల్పించాడు.

ఆంధ్రదేశాన్ని ముఖ్యంగా రాయలసీమను కుంగదీసిన కరువులెన్నో. వాటిలో ధాత కరువు (1876-77), అంతకు ముందు వచ్చిన నందన కరువు (గుంటూరు కరువు) 1832-33 మహా ఘోరమైనవి. ఈ కరువు కాలంలో గుంటూరు జిల్లాలో ఎన్నో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రజలను ఆదుకున్నాడు బ్రౌన్. బ్రౌన్ దాతృత్వం గురించి మరొక విశేషం – బీదరికం గడుపుతున్న ఒక ఆంధ్ర పండితుడు సి.పి. బ్రౌన్ కి భాగవతమందలి ఈ పద్యానికి” నూరార్లు లెక్క సేయక చార్లెసు ఫీలిప్సు బ్రౌన్ సాహెబు కరుణన్. బ్రౌన్ ఉదారతను చేర్చి, తనకు ధన సహాయం చేయమని వేడుకొన్నాడు.

పూలు ఏ విధంగా అయితే తమ వద్దకు వచ్చిన తుమ్మెదలకు మకరందం పంచి, వాటికి తృప్తిని కలిగిస్తాయో, అలాగే బ్రౌన్ వంటి దాతలు తమ వద్దకు వచ్చిన అర్థులకు కోరినవి ఇచ్చి సంతోషాన్ని కలిగిస్తారు.

సి.పి.బ్రౌన్ Questions and Answers Summary Inter 1st Year Telugu

II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు.

ప్రశ్న 1.
సి.పి. బ్రౌన్ బాల్యం గురించి రాయండి.
జవాబు:
డేవిడ్ బ్రౌన్, కౌలే దంపతుల రెండవ కుమారుడిగా సి.పి. బ్రౌన్ 1798 నవంబరు 10వ తేదీన కలకత్తాలో జన్మించాడు. తండ్రి మరణం తర్వాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండుకు వెళ్లిపోయింది. ఇండియాలో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగానికి మొదటి మెట్టుగా బ్రౌన్ను లండన్ (హెర్ట్ఫర్డ్) లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్చించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతంలో ఉత్తీర్ణుడైన బ్రౌన్ బంగారు పతకాన్ని పొందాడు.

ప్రశ్న 2.
సి.పి. బ్రౌన్ ఉద్యోగ జీవితాన్ని గురించి రాయండి.
జవాబు:
కంపెనీ ప్రభుత్వం చేత సి.పి. బ్రౌన్ మద్రాసుకు కేటాయించబడ్డాడు. 1820 ఆగష్టులో బ్రౌన్ ఉద్యోగ జీవితం (కడపలో) ప్రారంభమైంది. కడప కలెక్టరుకు అసిస్టెంటుగా ఉండేవాడు. 1820-22 చివరి వరకు కడపలో పని చేశాడు. కొంతకాలం మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి, రాజమండ్రి మొదలైనచోట్ల పనిచేశాడు. 1826-29 మధ్య కడపలో మరోసారి ఉద్యోగం చేశాడు.

ప్రశ్న 3.
నందన (లేదా) గుంటూరు కరువు గురించి రాయండి.
జవాబు:
1832-1833 గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును నందన కరువు, గుంటూరు కరువు లేదా డొక్కల కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తర్వాత సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాదిమంది బలయ్యారు.

కేవలం గుంటూరు జిల్లాలోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దాదాపు 20 సంవత్సరాల వరకు ప్రజలు, పొలాలు సాధారణ స్థితికి రాలేకపోయారు. కరువు బీభత్సం గుంటూరు జిలాల్లో మరీ ఎక్కువగా ఉండడం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అంటారు. కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి తిండి దొరక్క, శరీరంలో కండ మొత్తం పోయి డొక్కలు మాత్రమే కనబడేవి. ఇలా అందరికి డొక్కలు (ఎముకలు) కనబడడం వల్ల దీనిని డొక్కల కరువు అని కూడా పిలిచేవారు.

సి.పి.బ్రౌన్ Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 4.
జానుమద్ది హనుమచ్ఛాస్త్రి గారి గురించి తెలియజేయండి.
జవాబు:
పాఠ్యభాగం : సి.పి. బ్రౌన్
రచయిత : డా॥ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి
కాలం : 1925-2014 (జూన్ 5, 1925 నుండి ఫిబ్రవరి 28, 2014 వరకు)
జన్మస్థలం : రాయదుర్గం, అనంతపురం జిల్లా
వృత్తి : ఉపాధ్యాయుడు, కవి, రచయిత, పాత్రికేయ విమర్శకుడు
తల్లిదండ్రులు : జానకమ్మ, సుబ్బన్న

రచనలు : సి.పి.బ్రౌన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, బళ్ళారి రాఘవ చరిత్రలు, సుప్రసిద్ధుల జీవిత విశేషాలు, కూలిన నీడలు (కథ) ఇంకా 2,500 వ్యాసాలు, 16 పుస్తకాలు, ఆంగ్లభాషలో అనేక పుస్తకాలు రాశారు.

సేవ : కడప రచయితల సంఘానికి నాలుగు దశాబ్దాల పాటు సేవలందించారు.

అవార్డులు, పురస్కారాలు: అయ్యంకి వెంకట రమణయ్య అవార్డు, అనంతపురం లలిత కళాపరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి సిరిసి ఆంజనేయులు అవార్డు, కడప సవేరా ఆర్ట్స్ సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బెంగుళూరు అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం అందు కున్నారు.

విశేషాలు : కడపలో సి.పి.బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీని స్థాపించారు శాస్త్రిగారు. సినారె, శాస్త్రి గారిని ‘బ్రౌన్ శాస్త్రి’ అని ముద్దుగా పిలిచేవారు.

ప్రస్తుత పాఠ్యభాగం జానుమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది.

III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సి.పి. బ్రౌన్ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
సి.పి. బ్రౌన్ పాఠ్యభాగ రచయిత జానుమద్ది హనుమచ్ఛాస్త్రి.

ప్రశ్న 2.
జానుమద్ది తల్లిదండ్రులు ఎవరు ?
జవాబు:
జానుమద్ది తల్లిదండ్రులు జానకమ్మ, సుబ్బన్న.

ప్రశ్న 3.
జానుమద్దిని ‘బ్రౌన్ శాస్త్రి’ అని ముద్దుగా ఎవరు పిలిచేవారు ?
జవాబు:
జానుమద్దిని ‘బ్రౌన్ శాస్త్రి’ అని డా. సి. నారాయణరెడ్డి పిలిచేవారు.

ప్రశ్న 4.
ఆంధ్ర భాషోద్ధారకుడు ఎవరు ?
జవాబు:
ఆంధ్ర భాషోద్ధారకుడు సి.పి.బ్రౌన్.

ప్రశ్న 5.
‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ గ్రంథకర్త ఎవరు ?
జవాబు:
హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథకర్త అబేదుబాయ్.

ప్రశ్న 6.
రాయలసీమను కృంగదీసిన కరువులు ఏవి ?
జవాబు:
రాయలసీమను నందన, థాత కరువులు కుంగదీశాయి.

సి.పి.బ్రౌన్ Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 7.
తెనుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెనుగు నిఘంటువులను కూర్చినది ఎవరు ?
జవాబు:
తెనుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెనుగు నిఘంటువులను సి.పి. బ్రౌన్ కూర్చారు.

సి.పి.బ్రౌన్ Summary in Telugu

రచయిత పరిచయం

పాఠ్యభాగం : సి.పి.బ్రౌన్
రచయిత పేరు : డా॥ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి
కాలం : 1925-2014 (జూన్ 5, 1925 నుండి ఫిబ్రవరి 28, 2014 వరకు)
జన్మస్థలం : రాయదుర్గం, అనంతపురం జిల్లా
వృత్తి : ఉపాధ్యాయుడు, కవి, రచయిత, పాత్రికేయ విమర్శకుడు
తల్లిదండ్రులు : జానకమ్మ, సుబ్బన్న

రచనలు : సి.పి.బ్రౌన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, బళ్ళారి రాఘవ చరిత్రలు, సుప్రసిద్ధుల జీవిత విశేషాలు, కూలిన నీడలు (కథ) ఇంకా 2,500 వ్యాసాలు, 16 పుస్తకాలు, ఆంగ్లభాషలో అనేక పుస్తకాలు రాశారు.
సేవ : కడప రచయితల సంఘానికి నాలుగు దశాబ్దాల పాటు సేవలందించారు.

అవార్డులు, పురస్కారాలు : అయ్యంకి వెంకట రమణయ్య అవార్డు, అనంతపురం లలిత కళాపరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి సిరిసి ఆంజనేయులు అవార్డు, కడప సవేరా ఆర్ట్స్ సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బెంగు ళూరు అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం అందుకున్నారు.

విశేషాలు : కడపలో సి.పి.బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీని స్థాపించారు శాస్త్రిగారు. సినారె, శాస్త్రి గారిని ‘బ్రౌన్ శాస్త్రి’ అని ముద్దుగా పిలిచేవారు.

ప్రస్తుత పాఠ్యభాగం జానుమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ నేపథ్యం

సాధారణ శకం 16వ శతాబ్దంలో వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన విదేశీయులలో చాలావరకు మన దేశ సంపదలను దోచుకొని వెళ్ళిన వారేకాని మన దేశానికి, అందులో మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు చిరస్మరణీయులు నలుగురు. వారే సర్ థామస్ మన్రో, కల్నల్ కాలిన్స్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సి.పి.బ్రౌన్. తెలుగు భాష సాహితీ సంపదను వెలికి తీయడంలో సి.పి.బ్రౌన్ చేసిన కృషి అనన్యమైనది. అలాంటి మహనీయుడి సాహిత్య పిపాసను విద్యార్థులకు తెలియచేస్తూ, సాహితీ సంపదను కాపాడుకోవడం తమ కర్తవ్యమని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

కఠిన పదాలకు అర్థాలు

69వ పేజి :

సమంజసం = న్యాయం
మరుభూమి = ఎడారి
చిరస్మరణీయం = గుర్తుంచుకోదగినది
పాలెగాడు = చిన్న జమీందారు
ముడిసరుకు = పరిశ్రమలలో వస్తువులు తయారు చేయుటకు వాడు మూలపదార్థం
కైఫియత్తు = ఒక గ్రామం లేదా ప్రాంతం గురించి చారిత్రక రికార్డ్, స్థానిక చరిత్ర
అపారం = అధికం
ఆనకట్ట = వంతెన, ఏటి అడ్డుకట్ట, నదికి అడ్డంగా ఉన్న కట్ట
వాఙ్మయం = సాహిత్యం
సిక్తం = తడిసినది
అవగతం = తెలిసినది
ప్రాచ్య = తూర్పు దిక్కు నందలిది
తత్ సుఖం సాత్వికం ప్రోక్తం అత్మబుద్ధి ప్రసాదజం = ఆత్మ సాక్షాత్కారం అనే మనస్సు యొక్క స్వచ్ఛత నుండి పుట్టిన ఆ ఆనందం సాత్విక మని చెప్పబడింది
సూక్తి = మంచిమాట

సి.పి.బ్రౌన్ Questions and Answers Summary Inter 1st Year Telugu

70వ పేజి :

కాన్వొకేషన్ = పట్టా ప్రధానోత్సవం
ప్రబోధం = మేల్కొలుపు, వాస్తవికత, జ్ఞానం
ఉపదేశం = మంచిమాట
నాటుకొను = లగ్నం చేయు
అనర్గళం = స్వేచ్ఛగా, అడ్డులేని
నిశ్చయం = తీర్మానం, నిర్ధారణ
స్థిరాస్త = ఒక చోట నుండి మరొక చోటికి తీసుకొని పోవుటకు వీలు లేని ఆస్తి (భూమి, ఇల్లు, తోటలు మొ॥)
కర్మాగారం = ఫ్యాక్టరీ, పరిశ్రమాలయం
అకాండ = కారణం లేకుండా
తాండవం = ఉద్ధతమైన నృత్యం
ఉచితం = వెలదిలేనిది, ఊరకే వచ్చునది
విశ్వాసపాత్రుడు = నమ్మకస్థుడు
జాబు = ఉత్తరం
మూలం = కారణం

71వ పేజి:

వసతి = సౌకర్యం, ఇల్లు
బదిలీ = ఉద్యోగులను ఒక చోటు నుండి మరొక చోటుకి మార్చుట
జీర్ణించు = ఒంటబట్టు, అర్థం చేసుకొను
ముమ్మరం = అధిక వేగం
అగ్గి పురుగు = నిప్పుపుల్ల, మిణుగురు పురుగు
ఆహుతి = అగ్నిలో వేసినది
వ్రాత ప్రతి = చేతితో వ్రాసిన గ్రంథం
వ్రాయసగాడు = లేఖకుడు, రాతగాడు
పరిష్కరింపు = చక్కబెట్టుట
వాగ్దేవి = సరస్వతి
ముత్తైదువ = సుమంగళి, పుణ్యస్త్రీ
నడయాడు = తిరుగు
బంగోరె = బండి గోపాలరెడ్డి
కుంగదీయు = నష్టాలకు గురై అసంతృప్తి చెందు
కరువు = క్షామం
గంజి = అన్నరసం, అంబలి, జావ
కొరత = వెలితి, తక్కువ
విస్తృత = విశాలము, మిక్కిలి

72వ పేజి :

చాటువు = ప్రియమైన మాట
సామెత = లోకోక్తి
పలుకుబడి = ఉచ్చారణ
మిన్న = శ్రేష్ఠము
నిఘంటువు = పదము యొక్క అర్ధములను తెలిపే గ్రంథము, శబ్దకోశము
ప్రామాణికం = శాస్త్ర సిద్ధం, యథార్థమైనది
హిజరి = మహమ్మదు ప్రవక్త మక్కాను వదిలిపెట్టిన తిథి నుండి ప్రారంభమైన శకం (హిజరీ శకం)
పెక్కు = అనేక
సంపుటం = సంచిక, అనేక భాగాలుగా ముద్రితమైన గ్రంథములోని భాగం
కటకటలాడు = బాధపడు
సన్నిధి = ఎదుట ఉండుట, సమీపం
ప్రయాస = శ్రమ, కష్టం
స్మృతి చిహ్నం = చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం
విరాళం = చందా

సి.పి.బ్రౌన్ Questions and Answers Summary Inter 1st Year Telugu

73వ పేజి :

ఆదాయపు పన్ను = ప్రభుత్వానికి చెల్లించే సుంకం
రాయితీ = తగ్గింపు
సముద్ధరణ = పైకి లేపుట
నిర్విరామం = ఎల్లప్పుడు
నూరార్లు లెక్క సేయక …………….
చార్లేసు ఫిలిప్స్ బ్రౌన్ సాహెబు కరుణన్ ……………….
నూరార్లు లెక్కసేయక = (ఇది ఒక సామెత) “ఎన్నిసార్లు లెక్కించినా, ఆ పని చేయడం లేదా ఆ పేరు పొందడం చాలా కష్టం”
(ఇక్కడ సి.పి.బ్రౌన్ గొప్ప వ్యక్తి అని చెప్పడానికి, ఆయన పేరు తెలుగు సాహిత్యంలో చాలా బాగా ప్రచారంలో ఉందని సూచిస్తోంది ఈ వాక్యం)
అంతటి బ్రౌన్ పేర్లందిన విబుధ జనులన్ = పేరున్న గొప్ప పండితులను
పిలిపించుచు = పిలిపిస్తూ
వేమార్లు = చాలాసార్లు
కరుణ = దయతో
అర్థము + ఇచ్చు = సంపదలు ఇచ్చే
వితరణి = దానగుణం కలవాడు
చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ సాహెబ్ = సి. పి. బ్రౌన్ దొర