జాయసేనాపతి Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material గద్యభాగం 2nd Lesson జాయసేనాపతి Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu జాయసేనాపతి Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయసేనాపతి బాల్యం, విద్యాభ్యాసం, రాజ బంధువు కావడాన్ని గురించి వివరించండి.
జవాబు:
బాల్యం : సామాన్యులచే జాయప్పగా, మాన్యులైన రాజులచే జాయ సేనాపతిగా, వీరులచే గజ సాహిణిగా, పండితులచే జాయనగా, సన్నిహితులచే జాయగా పిలువబడ్డ ధీర గంభీర మూర్తి జాయన. గజ సాధకునిగా కదన రంగంలోను, జగతిమెచ్చిన నాట్యకళా రథసారథిగా కవనరంగంలోను విశేష ప్రతిభ చూపిన వాడు జాయ సేనాపతి. అయ్య పినచోడి నాయకుడు, వామాంబల కడపటి సంతానంగా 11వ శతాబ్దపు చివరి దశకంలో కృష్ణాజిల్లా దివి సీమలోని నేటి తలగడ దీవిలో పుట్టాడు జాయన.

జాయప్ప చురుకైనవాడు. జాయనకు పది సంవత్సరాల వయసులో కాకతీయ సైన్యం ద్వీపంపై విరుచుకుపడింది. ఆ యుద్ధంలో పినచోడి ఓడిపోయాడు. జాయప్ప జీవగ్రాహంగా పట్టుబడి ఓరుగల్లుకు చేర్చబడ్డాడు. యుద్ధ బంధితునిగా తేబడిన జాయప్పను కొంగల మధ్యలో ఉన్న హంసగా గుర్తించిన కాకతి గణపతిదేవ చక్రవర్తి తన ప్రాపకంలోకి తీసుకున్నాడు.

విద్యాభ్యాసం : జాయప్ప క్షత్రియోచిత విద్యలు నేర్చుకునే సమయంలోనే (బాల్యంలోనే) కాకతి గణపతిదేవ చక్రవర్తి ప్రాపకంలోకి వచ్చాడు. అతని స్వామి భక్తి, సౌందర్యం, మర్యాద, ఉత్తమపురుష లక్షణాలను గుర్తించిన గణపతి దేవుడు; – ఇంద్రుడు, జయంతునికి విద్యాబుద్ధులు నేర్పమని దేవ గురువు బృహస్పతికి అప్పజెప్పినట్లుగా, తన ఆస్థాన నాట్యాచార్యుడైన గుండామాత్యునికి జాయప్పను అప్పగించాడు. వారి వద్ద ఒక పక్క అశ్వగజ సాధనిక యుద్ధ విద్యలు, మరో పక్క భరతనాట్య శాస్త్ర రహస్యాలు జాయప్ప అభ్యసించాడు.

కయ్యం – నెయ్యం – వియ్యం : ద్వీప సీమపై జరిగిన యుద్ధంలో అమిత శౌర్య బలపరాక్రమాలు చూపిన అయ్యపినచోడి నాయకునికే తిరిగి ఆ సీమను ఇచ్చేశాడు గణపతిదేవుడు. అంతేకాక జాయప్ప ప్రతిభా విశేషాలపై మక్కువ పెంచుకుని అతడి అక్కలైన నారమ్మ, పేరమ్మలను కూడా చక్రవర్తి వివాహం చేసుకున్నాడు. నాటి నుండి జాయప్ప రాజాశ్రితుడుగా కాక రాజబంధువై వెలుగొందాడు.

ప్రశ్న 2.
నృత్త రత్నావళి గురించి వివరించండి.
జవాబు:
జాయ సేనాపతి రచించిన సంస్కృత నృత్త రత్నావళికి తెలుగులో అనితర సాధ్యంగా యథాతథానువాదం చేశారు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ.

కాకతి గణపతిదేవుని ఆస్థాన నాట్యాచార్యుడైన గుండామాత్యుని వద్ద ఒక పక్క అశ్వగజ సాధనిక యుద్ధ విద్యలు, మరోపక్క భరతనాట్య శాస్త్ర రహస్యాలు జాయప్ప అభ్యసించాడు. భరతముని నాట్యశాస్త్రం, నందికేశ్వరుని అభినయ దర్పణం తర్వాత ఎన్నదగినది, సర్వ లక్షణ సమన్వితంగా ఉన్నది, నృత్త లీలలకు రత్నదర్పణం లాంటిది అయిన నాట్యశాస్త్రాన్ని రచించింది జాయసేనాపతేనని దేశంలో పండితులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు.

భారతీదేవి ముందు ‘నృత్త రత్నావళి’ని నందా దీపంలా వెలిగించిన ఆ తేజోమూర్తి పదహారణాల ఆంధ్రుడు అవ్వడం మనందరికీ గర్వకారణం. జాయన భరతముని నాట్య రీతులను పలుమార్లు చదువుకున్నాడు. దానిపై వచ్చిన ఎన్నో వ్యాఖ్యానాలను పరిశీలించాడు. గురుముఖతః విద్య నేర్చిన మిత్రులను సంప్రదించాడు. పరమశివుని అనుగ్రహం కలిగి శాస్త్ర రహస్యాలను తెలుసుకున్నాడు. అలా కలిగిన జ్ఞానంతో శాశ్వత కీర్తిని కలిగించే ‘నృత్త రత్నావళి’ రచనకు పూనుకున్నాడు. (నృత్త రత్నావళి – ప్రథమోధ్యాయం 12వ శ్లోకం.)

పార్వతీ పరమేశ్వరులను, గోపికా గోపాలకృష్ణులను, వాణీ చతుర్ముఖులను తలచి ప్రారంభించిన ఈ గ్రంథం సంస్కృతంలో 8 అధ్యాయాలుగా ఉంది. ఇందులో మొదటి నాలుగు అధ్యాయాలు మార్గ పద్ధతిలో ఉన్న నాట్యాలను, చివరి 4 అధ్యాయాలు దేశి పద్ధతిలో ఉన్న నృత్తాలను వర్ణిస్తాయి. సందర్భోచితంగా జాయన భరతముని, కోహలుడు, తుంబురుడు, నారదుడు మొదలైన వారిని స్మరించాడు.

ప్రళయం తర్వాత రాబోయే కృతయుగారంభంలో మరల బ్రహ్మలోకం నుండి భూమి మీదకు వచ్చిన భరతముని నా ఈ గ్రంథాన్ని చూచి ఎంతో సంతోషపడి ఈ జాయసేనాపతి నా ఆశయాన్ని ఎంత చక్కగా గ్రహించాడో కదా అని మునులకు చెబుతాడని జాయన నృత్త రత్నావళి ప్రథమోధ్యాయం, 16వ శ్లోకంలో చెప్పాడు. తన గ్రంథం ప్రళయానంతరం కూడా నిలిచి ఉంటుందని ప్రకటించిన ధీశాలి జాయన.

మేవాడ్ రాజైన రాణా కుంభ తన “సంగీత రాజము” అనే గ్రంథంలోనూ, కొండవీటి రెడ్డి రాజు పెదకోమటి వేమారెడ్డి తన “సంగీత చింతామణి”లోనూ, తంజావూరును పాలించిన మరాఠీ పాలకుడు తుల్జాజి తన “సంగీత సారామృతము”లోనూ నృత్త రత్నావళిని అనుకరించారు. జాయన గ్రంథం “నృత్త రత్నావళి” ఇటు నాట్యానికే కాక అటు సంగీతానికి కూడా కల్పతరువై ఉందని దీని ద్వారా మనకు తేటతెల్లమవుతున్నది. దేశంలో నలుమూలలా వెతికితే మరిన్ని గ్రంథాలలో మరెన్నో అనుకరణలు, ఉట్టంకింపులు లభించగలవు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జాయసేనాపతి Questions and Answers Summary Inter 1st Year Telugu

II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయసేనాపతి కళింగ యుద్ధం గురించి రాయండి.
జవాబు:
ఆంధ్ర దేశంలోని గోదావరి నదికి ఉత్తరంగా ఒడిస్సాలోని మహానదికి దక్షిణంగా ఉన్న తీరాంధ్ర ప్రాంతమే కళింగం. యుద్ధతంత్ర నిపుణుడు, యువకుడు అయిన జాయప్ప కాకతీయ గజ సైన్యాధ్యక్షుడు అయ్యాడు. ఇందులూరి సోమయ్య మంత్రి, రాజనాయకుడు వెంటరాగా సాధారణ శక సం॥ 1212లో గజసాహిణి జాయన “శత్రువులనే గోధుమలను పిండి ఆడించే విసురురాయి లేదా తిరుగలి” అని పేరు పొందిన గొప్ప యోధుడిని చంపాడు. కళింగను జయించాడు. జాయన ‘వైరి గోధూమఘరట్ట’ అనే బిరుదు పొందాడు.

ప్రశ్న 2.
జాయన వ్యక్తిత్వం గురించి రాయండి.
జవాబు:
మనిషిని పశుత్వం నుండి దివ్యత్వం వైపు నడిపించే సోపానాలు లలితకళలు. ఈ లలితకళలలో అగ్రస్థానమలంకరించినవి సంగీత నాట్యాలు. వీటి వలన మానసికోల్లాసం, భౌతిక ఆనందం కలుగుతాయి. వీటితో తృప్తి చెందక మనవారు వాటి సాయంతో పరమాత్మను అన్వేషించారు. ఆ కోవకే చెందిన ఒక పుణ్యపురుషుడు జాయప్ప. ఇతను చురుకైనవాడు. చిన్నవయసులోనే క్షత్రియోచిత విద్యలు, మరోపక్క భరతనాట్య శాస్త్ర రహస్యాలు అభ్యసించాడు. జాయప్ప తన ప్రతిభా విశేషాలతో చక్రవర్తి మనసు చూరగొన్నాడు. వీరత్వం, గొప్ప వ్యక్తిత్వం, అద్భుత మూర్తిమత్వం కలిగిన గొప్ప యోధుడు జాయన.

బుద్ధి వికసించని ప్రాయంలోనే యుద్ధ బంధీగా చిక్కి, శత్రువు ఇంట తన ప్రతిభతో మెప్పు పొంది తన కుటుంబాన్ని, రాజ్యాన్ని ఉద్ధరించిన ధీశాలి జాయన.

ప్రశ్న 3.
నృత్తం ప్రదర్శించే సందర్భాలు ఏమిటి ?
జవాబు:
నృత్తం ప్రదర్శించే సందర్భాలు : యజ్ఞం జరిగినప్పుడు, పెండ్లి వేడుకలలోనూ, రాజ పట్టాభిషేకం, చక్రవర్తి నగర ప్రవేశం, గృహపతి గృహప్రవేశం, జలక్రీడల వేళ, వ్రతం, మహాదానాలు చేసేటప్పుడు, పుత్రజననం, తీర్థయాత్రకు బయలుదేరే వేళ, విద్యాపరీక్షల ముగింపు, యుద్ధ విజయం, దేవ ప్రతిష్ఠ, ప్రియమైన వారు కలిసినపుడు, దేవతా పూజ మొదలైన సందర్భాలలో తప్పక నృత్త ప్రదర్శన జరగవలెనని జాయన నృత్త రత్నావళి ప్రథమోధ్యాయం, 18వ శ్లోకంలో పేర్కొన్నాడు.

ప్రశ్న 4.
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి జీవిత విశేషాలు రాయండి
జాయన.
పరమేశ్వర కల్పితమైన ఈ ప్రపంచంలో గొప్ప జ్ఞానతృష్ణ, మంచి సాహిత్యాభి నివేశం, కళాదృష్టి కలవారు చాలా అరుదుగా పుడతారు. అలాంటి మహనీయులలో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఒకరు. ఈయన అనంతపురం జిల్లా రాళ్ళపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులైన మంగమ్మ, కృష్ణమాచార్యులు శర్మ గారికి ఉగ్గుపాలతోనే సంగీత సాహిత్యాలను రంగరించి పోశారు, బహుభాషా కోవిదులైన శర్మగారి ఖండకావ్యాలు, వ్యాసాలు పాఠకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లాగే వీరి అనువాదాలు, వ్యాఖ్యానాలు, విమర్శనా గ్రంథాలు ప్రసిద్ధి పొందాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమకు అప్పగించినంతవరకు అన్నమాచార్యుల కీర్తనలకు స్వరకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సంగీత నాటక అకాడమీలు శర్మగారికి విశిష్ట సభ్యత్వమిచ్చి వీరి సేవలను వినియోగించుకున్నాయి. ‘గాన కళాప్రపూర్ణ’, ‘గాన కళాసింధు’ మొదలైన బిరుదులు వీరిని వరించాయి. జాయ సేనాపతి రచించిన సంస్కృత ‘నృత్త రత్నావళి’కి ‘గోవత్స న్యాయం’గా శర్మగారు తెలుగులో అనువాదం చేశారు. తిరుపతిలో వీరి కాంస్య విగ్రహావిష్కరణ 2008లో జరిగింది.

జాయసేనాపతి Questions and Answers Summary Inter 1st Year Telugu

III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయసేనాపతి రాసిన ప్రసిద్ధ గ్రంథం పేరేమిటి ?
జాయన.
జాయ సేనాపతి రాసిన ప్రసిద్ధ గ్రంథం ‘నృత్త రత్నావళి’.

ప్రశ్న 2.
జాయప్పకు నాయకరంగా ఇవ్వబడిన ఊరు ఏది ?
జాయన.
జాయప్పకు నాయకరంగా ఇవ్వబడిన ఊరు చేబ్రోలు (తామ్రపురి).

ప్రశ్న 3.
జాయన అక్కల పేర్లు ఏమిటి ?
జాయన.
జాయన అక్కల పేర్లు నారమ్మ, పేరమ్మ.

ప్రశ్న 4. సంస్కృతంలో తొలి నాట్యశాస్త్రం ఎవరు రాశారు ?
జాయన.
సంస్కృతంలో తొలి నాట్యశాస్త్రం భరతముని రాశారు.

జాయసేనాపతి Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 5.
నందికేశ్వరుడు పేరుతో ఉన్న గ్రంథం ఏమిటి ?
జాయన.
నందికేశ్వరుడు పేరుతో ఉన్న గ్రంథం అభినయ దర్పణం.

జాయసేనాపతి Summary in Telugu

రచయిత పరిచయం

పాఠ్యభాగం : జాయ సేనాపతి
రచయిత : రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ
కాలం : 23.01.1893 నుండి 11.03.1979 వరకు
జన్మస్థలం : రాళ్ళపల్లి, అనంతపురం జిల్లా
వృత్తి : రచయిత, విమర్శకుడు, అధ్యాపకుడు
తల్లిదండ్రులు : కృష్ణమాచార్యులు, అలివేలు మంగమ్మ

విద్యాభ్యాసం : తండ్రి వద్ద సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యత, మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. తల్లి వద్ద సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోల పాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే నేర్చుకున్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు.

రచనలు : మీరాబాయి, తారాబాయి, లీల (ఖండకావ్యాలు), నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, నిగమశర్మ అక్క, రాయలనాటి రసికత (వ్యాసాలు), వేమన (ఉపన్యాసాలు), సారస్వతా లోకం, నాటకోపన్యాసాలు (విమర్శనాత్మక వ్యాసాలు), శాలివాహన గాథా సప్తసారం (అనువాదం), జటావర్మ సుందరపాండ్యుని ‘ఆర్య’ (తెలుగు అనువాదం), కాళిదాసు రఘువంశ కావ్య ఆంధ్రీకరణ, జాయసేనాపతి సంస్కృత నృత్త రత్నావళికి యథాతథానువాదం, స్పర్థా కావ్యం, మహీశూర రాజాభ్యుదయ దర్శనం (సంస్కృత రచనలు), గానకలే, జీవనముత్తుకలే (కన్నడ రచనలు)

సేవ : తిరుమల తిరుపతి దేవస్థానం వారు అప్పగించిన అన్నమాచార్యుల కీర్తనలకు స్వరకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర, సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వం.
బిరుదులు : గాన కళాప్రపూర్ణ (ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ) గానకళా సింధు (మైసూరు సంగీత పరిషత్తు).
లక్షణాలు : సునిశితమైన సద్విమర్శ, నిజాన్ని నిర్భీతిగా ప్రకటించడం, నిగూఢమైన విషయాలను సైతం దర్శించి వచించగలగడం.

ప్రస్తుత పాఠ్యభాగం ‘జాయసేనాపతి’ 1969లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ప్రచురించిన “నృత్త రత్నావళి” అను గ్రంథం నుండి స్వీకరించబడింది.

పాఠ్యభాగ నేపథ్యం

రాజ్యం సుభిక్షంగా శాంతి సౌఖ్యాలతో ఉన్నప్పుడే కళలు వర్ధిల్లుతాయి. మనకు కవిరాజులున్నారు. రాజ కవులున్నారు. బమ్మెర పోతరాజు వంటి మహనీయులు ఉన్నారు. చరిత్ర సాహిత్యానికి ప్రేరణ అయితే, సాహిత్యం చరిత్రలో ప్రతిఫలిస్తుంది. ఈ రెండు విడదీయరానివి. 12వ శతాబ్దం నాటికి ఆంధ్రదేశంలో పెద్దరాజ్యం కాకతీయులదే అయినా తీరాంధ్ర దేశం మీద వారికి పట్టు లేదు. అక్కడ వెలనాటి దుర్జయులు చోళ – చాళుక్య సామంతం నుండి స్వతంత్రులై పాలన సాగిస్తూ బలపడ్డారు.

అటు ఓరుగల్లులో కాకతీయ గణపతి దేవుడు ఇటు ధనదుప్రోలు (నేటి బాపట్ల జిల్లా చందోలు)లో వెలనాటి పృథ్వీశ్వరుడు సింహాసనాలు అధిష్టించారు. ఎవరి బలాలు వారికున్నాయి. ఆ పృథ్వీశ్వరుని ముత్తాత రెండవ గొంకరాజును అయ్య వంశానికి చెందిన నారన మెప్పించి కృష్ణవేణీ నది పాయలై సముద్రంలో కలిసేచోట ఏర్పడిన “ద్వీపము కేంద్రంగా ఉన్న సీమను” పొందాడు. నారనకు నలుగురు కొడుకులు.

వారిలో పినచోడి నాయకుడు తండ్రి తరువాత ద్వీప పాలకుడయ్యాడు. పినచోడయ్యకు పృథ్వీశ్వరుడు, నారప్ప, నారమ్మ, పేరమ్మ, జాయప్ప అనే ఐదుగురు సంతానం. పినచోడి నాయకుడు అప్పటి తమ పాలకుడైన వెలనాటి పృథ్వీశ్వరుని పట్ల అమితమైన రాజభక్తి కలవాడు, మహావీరుడు కావడంతో రాజ్య కోశాగారం ద్వీపంలో రక్షించబడేది. ఈ నేపథ్యంలో కాకతి గణపతి దేవుడు మల్యాల చౌండ సేనాపతి, కాటచమూపతుల నాయకత్వంలో ప్రబలమైన సేనను ద్వీపసీమ మీదకు దాడికి పంపాడు.

జాయసేనాపతి Questions and Answers Summary Inter 1st Year Telugu

కఠిన పదాలకు అర్థాలు

59వ పేజి :

సోపానం = మెట్టు
రెమ్మ = చెట్టు యొక్క చిన్న కొమ్మ, పూవు రేకు
గుబాళింపు = సువాసన
తృప్తి = సంతోషం
ద్వీపం = నాలుగువైపుల నీటిచే చుట్టబడిన భూమి, దీవి, లంక, దిబ్బ
మణుగు = ఎనిమిది వీసెలు
అనర్ఘ = అమూల్యమైన
జీవగ్రాహ = ప్రాణమున్న వాడిని పట్టుకొనుట
ప్రాపకం = రక్షణ

61వ పేజి :

మక్కువ = ఇష్టం, ప్రేమ
తంత్రము = ఉపాయం
సాహిణి = రౌతు
ఘరట్ట = తిరుగలి, విసురురాయి
వైరి = శత్రువు
రీతి = పద్ధతి
లక్షణ గ్రంథం = శాస్త్ర గ్రంథం
మూలం = ఆధారం
అవలోకం = చూచుట
దాక్షిణాత్యులు = దక్షిణాది ప్రజలు
ప్రశంస = పొగడ్త
ఎన్నదగిన = గౌరవించదగిన, లెక్కించతగిన

62వ పేజి :

ఏకగ్రీవం = ఒకేమాట, ఏకవాక్కు
నందాదీపం = అఖండ దీపం
పదహారణాల = నిండైన
ప్రళయం = యుగాంతం, నాశనం
కృతయుగం = నాలుగు యుగాలలో మొదటిది, సత్యయుగం
ధీశాలి = బుద్ధి కలవాడు
నాట్యం = నాటకీయ ప్రాతినిధ్యం
నృత్తం = నర్తనం
నృత్యం = శరీర హస్త నేత్రాభినయములచే భావాలను తెలుపుచు ఆడే ఆట

జాయసేనాపతి Questions and Answers Summary Inter 1st Year Telugu

63వ పేజి :

భరతవర్షం = భారతదేశం (పూర్వపు పేరు)
మన్వంతరం = కాలం
అంచనా = సుమారు, ఒక విషయం స్థితిగతులను పరిశీలించి నిర్ణయించటం
గొండ్లి = వలయాకారంగా బాలికలు చేసే నృత్యము
పేరణి = కడవ మీద చేసే నృత్యం
రాసకం = ఒక రకమైన నాటకీయ వినోదం
చిందు = మాతంగనాట్యం
చెండాట = బంతి ఆట
రత్నాకరం = రత్నాలకు నివాసం (సముద్రం)
అలభ్యం = పొందలేని, దొరకనిది
తేటతెల్లం = మిక్కిలి స్పష్టం
ఉట్టంకింపు = ఉదహరింపు, ఎత్తిరాయు, పేర్కొను
తటాకం = చెరువు
అంగరంగభోగాలు అంగభోగం = శరీరానికి అలంకరణలు చేయడం
రంగభోగం = వివాహాది వేడుకల కోసం గాని, నాట్యాది కార్యక్రమాల కోసం గాని రంగస్థలాన్ని వైభవోపేతంగా అలంకరించడం.
గుడిసాని = దేవదాసి, ఆటవెలది
భవ్యం = శుభకరం
అలరారు = ప్రకాశించు, ఒప్పు
వైదికము = వేదములో చెప్పబడినది
శిఖామణి = శ్రేష్ఠుడు
మంత్రాంగం = తంత్రం, రహస్యాలోచన, మంత్రిత్వం

64వ పేజి :

మెప్పు = మెచ్చు, పొగడ్త
కదనం = యుద్ధం
స్ఫూర్తి = పరిపూర్ణత