Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 4th Poem गायत्री नीतिगीतावलिः Textbook Questions and Answers.
TS Inter 2nd Year Sanskrit Study Material 4th Poem गायत्री नीतिगीतावलिः
लघुसमाधान प्रश्नाः (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)
पश्न 1.
पाषाणैः प्रहरतोऽपि कः न कुप्यति ?
समादान:
पाषाणैः प्रहरतोऽपि सहकारः न कुप्यति ।
पश्न 2.
कः तमः हन्ति ?
समादान:
एकः दीपः तमः हन्ति ।
पश्न 3.
कस्मै दानं मोघं स्यात् ?
समादान:
धनिनः दानं मोघं स्यात् ।
एकपद समाधान प्रश्नाः (One Word Questions)
पश्न 1.
नीचः पुरः किं वक्ति ?
समादान:
नीचः पुरः प्रियं वक्ति |
पश्न 2.
कस्य गुणः अवर्ण्यः ?
समादान:
सांगत्यस्य गुणः अवर्ण्यः ।
पश्न 3.
कैः संगतं न कुर्यात् ?
समादान:
कुजनैः संगतं न कुर्यात् ।
विशेषतो ज्ञेयाः (విశేషాంశాలు)
कठिनशब्दार्थाः (కఠిన పదాలు అర్ధాలు)
1. सहकारः = आम्रवृक्षः ; మామిడి చెట్టు
2. मोघम् = व्यर्थम् ; వ్యర్ధమైనది
3. भूरुहः = वृक्षः ; చెట్టు
4. भुजगाश्लिष्टः = सर्पेण आश्लिष्टः ; పాముతో కూడియున్నది
5. खद्योतः = प्रकाशयुक्तः कीटविशेषः ; ప్రకాశించే మిణుగురు పురుగు
6. क्षेपणी = पक्षिणां विद्रावणाय उपयुज्यमानं साधनम् ; పక్షులను రాకుండా చేయడానికి ఉపయోగించే సాధనం
व्याकरणांशः – వ్యాకరణాంశాలు
सन्धयः సంధులు
1. मार्ग: + अनूरुः = मार्गोऽनूरुः – विसर्गसन्धिः
2. अनूरुः + च = अनूरुश्च – श्रुत्वसन्धिः
3. पुनः + ग्राह्यः = पुनर्ग्राह्यः – विसर्गसन्धिः
4. सत् + जनः = सज्जनः – श्श्रुत्वसन्धिः
5. जलैः + वृक्षम् = जलैर्वृक्षम् – विसर्गसन्धिः
6. पातयेत् + नदी = पातयेन्नदी – अनुनासिकसन्धिः
7. स्यात् + न = स्यान्न – अनुनासिकसन्धिः
8. यत् + चारुताहेतुः = यच्चारुताहेतुः – श्रुत्वसन्धिः
9. स्यात् + धनिने = स्याद्वन – जश्त्वसन्धिः
10. गुजनैः + सह = सुजनैस्सह – विसर्गसन्धिः
11. शमयेत् + वीरः = शमयेद्वीरः – जश्त्वसन्धिः
12. एकः + तमः = एकस्तमः – विसर्गसन्धिः
13. परः + शता: = परश्शता – श्श्रुत्वसन्धिः
14. स्यात् + मलिनम् = स्यान्मलिनम् – अनुनासिकसन्धिः
15. स्यात् + च = स्याच्च – श्रुत्वसन्धिः
समासाः (సమాసములు)
1. निर्गतः आलम्बः यस्य सः – निरालम्बः – वहुव्रीहिसमासः
2. न विद्येते ऊरु यस्य सः – अनूरुः – बहुव्रीहिसमासः
3. सत् च असौ जनश्च सज्जनः – विशेषणपुर्वपदकर्मधारयः
4. मुक्तानां हार: – मुक्ताहारः – षष्ठीतत्पुरुषः
5. न श्रान्तम् – अश्रान्तम् – नञ्तत्पुरुषः
6. सत् च असत् च – सदसतौ तयोः सदसतोः – द्वन्द्वसमासः
7. चारुतायाः हेतुः – चारुताहेतुः – षष्ठीतत्पुरुषसमासः
8. नेत्रे अञ्चनम् – नेत्राञ्चनम् – सप्तमीतत्पुरुषः
9. सुष्ठु फलम् – सुफलम् – प्रादितत्पुरुषसमासः
10. शोभनः जनः – सुजनः – प्रादितत्पुरुषसमासः
11. कुत्सितः जनः – कुजन: – प्रादितत्पुरुषसमासः
12. न गम्यः – अगम्यः – नञ्तत्पुरुषसमासः
13. भुवि रोहते भूरुहः – उपपदतत्पुरुषसमासः
14. मूर्धनि जायन्ते इति मूर्धजाः – उपपदतत्पुरुषसमासः
15. वृक्षस्य मूलम् – वृक्षमूलम् – षष्ठीतत्पुरुषसमासः
अर्थतात्पर्याणि (Meanings & Substances) (తాత్పర్యములు)
★ 1. चक्रमेकं निरालम्बो मार्गोऽनूरुश्च सारथिः ।
तथाप्येति सदा भानुः महतां किं नु दुष्करम् ||
చక్రమేకం నిరాలంబో మార్గోకూరుశ్చ సారథిః |
తథాప్యేతి సదా భానుః మహతాం కింను దుష్కరమ్ ॥
पदच्छेदः – चक्रं, एकं, निरालम्बः मार्गः, अनूरुः, च, सारथिः, तथा, अपि, एति, सदा, भानुः, महतां, किं, नु, दुष्करम् ।
अन्वयक्रमः – एकं, चक्रं, निरालम्बः मार्गः, च, अनूरुः, सारथि:, तथा, अपि, सदा, भानुः एति, महताम्, किं नु, दुष्करम् ।
अर्थाः-
एकं = ఒక,
चक्रं = చక్రము,
निरालम्बः = ఆధారములేని,
मार्गः = మార్గము;
च = మరియు;
अनूरुः = తొడలులేని;
सारथि: = రధసారథి;
तथा + अपि = అయినప్పటికీ;
सदा = ఎల్లప్పుడు;
भानुः = సూర్యుడు;
एति = ప్రమాణం చేయుచున్నాడు;
महताम् = గొప్పవారికి;
किं नु = ఏది;
दुष्करम् = అసాధ్యము
भावः-
తన రథమునకు ఒకటే చక్రము. మార్గము నిరాధారము. రథాన్ని నడిపే సారధి కేవలం నడుము వరకే శరీరం కలిగి కాళ్ళు లేనివాడు. అయినప్పటికి సూర్యుడు తన ప్రమాణాన్ని చేస్తూనే ఉన్నాడు. మహాత్ములకు సాధ్యము కానిది ఏమున్నది?
There is only one wheel to the chariot, the path has no support, and the driver has no legs. Still, the sun always goes round. What is impossible to the great ?
2. पाषाणैः प्रहरते स्वं सहकारो न कुप्यति ।
फलं च मधुरं दत्ते तादृशः खलु सज्जनः ॥
పాషాణైః ప్రహరతే స్వం సహకారో న కుప్యతి |
ఫలం చ మధురం దత్తే తాదృశః ఖలు సజ్జనః |
पदच्छेदः – पाषाणैः प्रहरते, स्वं, सहकारः, न कुप्यति, फलं, च, मधुरं, दत्ते, तादृशः, खलु, सज्जनः ।
अन्वयक्रमः – सहकारः, स्वं, पाषाणैः, प्रहरते, न कुप्यति, च, मधुरं, फलं, दत्ते तादृशः सज्जनः खलु ।
अर्थाः-
सहकारः = తీయమామిడి చెట్టు,
स्वं = తనను,
पाषाणैः = రాళ్ళతో;
प्रहरते = కొట్టినప్పటికీ;
न कुप्यति = కోపగించదు;
च = మరియు;
मधुरं = తీయనైన;
फलं = పండును;
दत्ते = ఇచ్చును;
तादृशः = అట్టివాడే;
सज्जनः खलु = సజ్జనుడు కూడా ఉండును.
भावः-
తీయమామిడి చెట్టు తనను రాళ్ళతో కొట్టినప్పటికినీ, అతనిపై కోపగించదు. పైగా తీయని పండ్లను ఇస్తుంది. అట్లే సజ్జనుడు కూడా తనను ఎవరు విమర్శించినా అతడిని కోపగించడు. పైగా ఉపకారము చేస్తాడు.
The mango tree does not get angry when people throw stones at it. Moreover, it offers sweet fruits. Good people are like that.
3. अनुनीय पुनर्ग्राह्यः क्रुद्धोऽपेतश्च सज्जनः ।
मुक्ताहारे विशीर्णेऽपि मुक्ताः सङ्गथते पुनः ॥
అనునీయ పునర్రాహ్యః కృద్ధోకాపేతశ్చ సజ్జనః ।
ముక్తాహారే విశీర్దేకపి ముక్తాః సంగ్రథతే పునః ॥
पदच्छेदः – अनुनीय, पुनः, ग्राह्यः कृद्धोपेतः, च, सज्जनः, मुक्ताहारे, विशीर्णः, अपि, मुक्ताः, संग्रथते, पुनः ।
अन्वयक्रमः कृद्धोपेतः, सज्जनः, अनुनीय, पुनः, ग्राह्यः, मुक्ताहारे, विशीर्णे अपि, पुनः, मुक्ताः संग्रथते ।
अर्थाः-
कृद्धोपेतः = మిక్కిలి కోపముతో కూడిన
सज्जनः = సజ్జనుడు
अनुनीय, = బ్రతిమలాడబడి;
पुनः = తిరిగి;
ग्राह्यः = స్వీకరింపబడినవాడు;
मुक्ताहारे = ముత్యాలహారం;
विशीर्णे अपि = విడిపోయినను;
पुनः = తిరిగి;
मुक्ताः = ముత్యాలు;
संग्रथते = కూర్చబడతాయి.
भावः-
సజ్జనుడు మిక్కిలి కోపంతో ఉన్నా అతడిని బ్రతిమలాడి తిరిగి స్వీకరింప తగినవాడు ముత్యాలహారం తెగిపోయినను, జారిన ముత్యాలు తిరిగి కూర్చబడతాయి గదా !
Even when a good person goes away, getting angry, he can still be pacified, and brought back. Even though the pearl necklace is broken, still the pearls can be strung together again.
4. प्रियं वक्ति पुरो नीचः पृष्ठतः खनते बिलम् ।
मृदुस्पर्शैर्जलैर्वृक्षं तीरस्थं पातयेन्नदी |
ప్రియం వక్తి పురో నీచః పృష్టతః ఖనతే బిలమ్ |
మృదుస్పర్శైర్జలైః వృక్షం తీరస్థం పాతయేన్నదీ
पदच्छेदः – प्रियं, वक्ति, पुरः, नीचः, पृष्टतः खनते, बिलम्, मृदुस्पर्शैः, जलैः, वृक्षं तीरस्थं, पातयेत्, नदी ।
अन्वयक्रमः – नीचः, पुरः, प्रियं, वक्ति, पृष्टतः, बिलम्, खनते, मृदुस्पर्शेः, जलै तीरस्थं, वृक्षं, नदी पातयेत् ।
अर्थाः-
नीचः = నీచుడు;
पुरः = ఎదుట;
प्रियं = ప్రియముగా;
वक्ति = మాట్లాడును;
पृष्टतः = వెనుక;
बिलम् = కన్నాన్ని;
खनते = త్రవ్వుచున్నాడు;
मृदुस्पर्शैः = చల్లని స్పర్శను కల్గించునట్టి;
जलै = నీళ్ళతో;
तीरस्थं = ఒడ్డున ఉన్నట్టి;
वृक्षं = చెట్టును;
नदी = నది;
पातयेत् = పడవేస్తుంది.
भावः-
నీచుడు ఎదుట ప్రియంగా మాట్లాడుతాడు. వెనుక కన్నం త్రవ్వుతాడు. నది తన చల్లని నీటితో చెట్టును తడుపుతూనే దానిని పడవేస్తుంది.
An evil person speaks sweetly in front of us, but digs a ditch behind. A river fells a tree on the bank with softly touching waters.
★ 5. सर्वं सुसाधं सततात्कर्मणो मर्मवेदितुः ।
सिकतात्वं शिला यान्ति स्त्रोतसोऽश्रान्तघर्षणात् ॥
సర్వం సుసాధం సతతాత్కర్మణో మర్మవేదితుః ।
సికతాత్వం శిలా యాంతి స్త్రోతసో శ్రాంతఘర్షణాత్ ॥
पदच्छेदः – सर्व सुसाधं, सततात् कर्मणः, मर्मवेदितुः सिकतात्वम्, शिलाः, यान्ति, स्रोतसः, आश्रान्तघर्षणात् ।
अन्वयक्रमः कर्मणः, मर्म, वेदितुं, सततात, सर्वं, सुसाधं, स्रोतसः, आश्रान्तघर्षणात्, शिलाः सिकतात्वम् यान्ति ।
अर्थाः –
कर्मणा = చేయుపని యొక్క ;
मर्म = రహస్యమును;
वेदितुं = తెలిసినవానికి;
स्रोतसः = ఎల్లప్పుడు;
सर्वं = సమస్తము;
सुसाधं = సులభమగును;
स्रोतसः = నీటి యొక్క ప్రవాహము యొక్క ;
आश्रान्तघर्षणात्, = నిరంతరాయముగా జరుగు రాపిడి చేత;
शिलाः = రాళ్ళు;
सिकतात्वम् = సన్నని ఇసుకరేణువులుగా;
यान्ति = (మార్పును) పొందుచున్నాయి.
भावः-
మానవుడు తను చేయు పని గురించి చక్కగా ఆలోచన చేసి దాని విధానమును తెలుసుకొని పని చేసినచో ఆ పని బాగుగా పూర్తియగును. నిరంతర ప్రవాహము యొక్క రాపిడిచేత పెద్ద రాళ్ళు కూడా ఇసుక రేణువులవలె చిన్నదిగా మారుచున్నవి.
Everything is easily attainable by con-tinuous work of one who knows the weak points. Even rocks be-come sand when the river strikes against them continuously with-out rest.
6. कर्पूरक्षारयोस्साम्यं रूपे स्यान्न तु तद्रसे ।
बाह्याकृतिर्भवेदेको नान्तः सदसतोर्गुणः ||
కర్పూరక్షారయోస్సామ్యం రూపే స్యాన్న తు తద్రసే |
బాహ్యాకృతిర్భవేదేకో నాంతః సదసతోర్గుణః
पदच्छेदः – कर्पूरक्षारयोः, साम्यं, रूपे, स्यात्, न, तु, तद्रसे, बाह्याकृतिः, भवेत्, एकः, न, अन्तः, सदसतोः, गुणः ।
अन्वयक्रमः – कर्पूरक्षारयोः, रूपे, साम्यं, स्यात्, तु-तद्रसे, न, सदसतोः बाह्याकृतिः, एकः, भवेत्, न, अन्तः गुणः ।
अर्थाः –
कर्पूरक्षारयोः = కర్పూరం, ఉప్పుల యొక్క;
रूपे = రూపమునందు;
साम्यं = సమానత్వము;
स्यात् = ఉండును;
तु = అయితే;
तद्रसे = తాటి రసమునందు;
न स्यात् = ఉండదు;
सदसतोः = సజ్జనదుర్జనుల యొక్క;
बाह्याकृतिः = బయటకు కనిపించే ఆకారము;
एकः = ఒకటి;
अन्तः = లోపలనుండు;
गुणः = గుణము;
न स्यात् = ఉండదు;
भावः-
ఉప్పు, కర్పూరము బయటకు చూడటానికి ఒకేవిధంగా ఉంటాయి. వాటి రుచులు మాత్రం వేరుగా ఉంటాయి. సజ్జనులు, దుర్జనులు బయటకు ఒకేవిధంగా ఉంటారు. వారి మనసులోని గుణం మాత్రం వేరుగా ఉంటుంది.
Resemblance of camphor and salt will be in appearance only, not in taste. Of the noble and the ignoble, the outer form may be the same, bur not the inner virtues.
★ 7. यत्र यच्चारुताहेतुः तत्तु तत्रैव निक्षिपेत् ।
नार्यं नेत्राञ्चनं पादे नेत्रे वाधरवर्णकम् ||
కొ యత్ర యచ్చారుతాహేతుః తత్తు తత్రైవ నిక్షిపేత్ |
నార్ప్యం నేత్రాంజనం పాదే నేత్రే వాధరవర్ణకమ్ |
पदच्छेदः – यत्र यत्, चारुताहेतुः, तत्, तु, तत्र, एव, निक्षिपेत्, न, अपर्यं, नेत्रांजनं, पादे, नेत्रे, वा, अधरवर्णकंम् ।
अन्वयक्रमः – यत्, यत्, चारुताहेतुः, तत्, तु, तत्, एव, वा, अधरवर्णकम्,
अर्थाः –
यत्र = ఎక్కడ ;
यत् = ఏది;
चारुताहेतुः = సౌందర్యమునకు కారణమో ;
तत् तु = దానినైతే;
तत् एव = అక్కడనే;
वा = లేక;
अधरवर्णकम् = పెదవులకు పూయబడిన రంగును;
नेत्रे = కనుల యందు;
पादे = పాదాలకు;
न अपर्यं = ఉంచకూడదడు గదా !
भावः-
ఎక్కడ ఏది అందమునకు కారణమో అక్కడే ఉంచవలెను. కాటుక కనుల అందమునకు కారణము. అట్లే పెదవులకు వేయు రంగు పెదవుల అందమునకు కారణము. ఐతే పెదవులకు వేయవలసిన రంగు కళ్ళకు, కళ్ళకు వేయవలసిన కాటుకను పాదాలకు వేయకూడదు.
That which is the cause of beauty at a place should be placed at that place only. Collyrium should not be applied to the foot nor lipstick to the eyes.
8. मोघं स्याद्धनिने दानं रिक्ताय सुफलं भवेत् ।
कुचेलानुग्रहात्कृष्णः दीनगोप्तेति कीर्त्यते ॥
మోఘం స్యాద్ధనినే దానం రిక్తాయ సుఫలం భవేత్ ॥
కుచేలానుగ్రహాత్కృష్ణః దీనగోప్తేతి కీర్త్యతే ||
पदच्छेदः – मोघं स्यात् धनिने, दानं रिक्ताय, सुफलं भवेत्, कुलानुग्रहात्, कृष्णः, दीनगोप्तः, इति, कीर्त्यते ।
अन्वयक्रमः – धनिने, दानं, मोघं, स्यात्, रिक्ताय, सुफलं भवेत्, कुचेलानुग्रहात्, कृष्णः, दीनगोप्त, इति, कीर्त्यते ।
अर्थाः –
धनिने = ధనవంతుని కొరకు చేయు;
दानं = దానము;
मोघं स्यात् = వ్యర్థమగును;
रिक्ताय = నిర్ధనునికి చేయు;
दानं = దానము;
सुफलं भवेत् = సఫలం అవుతుంది;
कुचेलानुग्रहात् = కుచేలుడిని అనుగ్రహించడం వలన;
कृष्णः = కృష్ణుడు;
दीनगोप्त इति = దీనరక్షకుడని;
कीर्त्यते = కీర్తింపబడుతున్నది.
भावः-
ధనవంతునికి చేసిన దానము వ్యర్థము. అదే దానము ధనములేని దరిద్రునికి చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఎట్లనగా పేదవాడైన కుచేలునికి దానం చేయడంవల్లనే శ్రీకృష్ణుడు దీనరక్షకునిగా కీర్తింపబడుతున్నాడు.
Charity to a rich man is useless, but to a poor one is useful. Because of his gracing Kuchela, Krishna is praised as the protector of the poor.
9. नोपेयात्सुजनं कश्चित् कुजनैस्सह सङ्गत्तम् ।
अगम्यो भुजगाश्लिष्टो भूरुहः फलवानपि ॥
నోపేయాత్సుజనం కశ్చిత్ కుజనైస్సహ సంగతమ్ |
అగమ్యో భుజగాక్లిష్టో భూరుహఃఫలవానపి ॥
पदच्छेदः – न, उपेयात्, सुजनं, कश्चित्, कुजनैः, सह, संगतम्, अगम्यः, भुजगाश्लिष्टः, भूरुहः, फलवानपि ।
अन्वयक्रमः – कुजनैः, सह, संगतम्, कश्चित्, सुजनः, न, उपेयात्, भुजगाश्लिष्टः, भूरुहः, फलवान् + अपि, अगम्यः |
अर्थाः –
कुजनैः सह = దుర్జనులతో కూడిన;
संगतम् = కలయికను (స్నేహాన్ని);
कश्चित् सुजनः = ఒక సజ్జనుడు;
न उपेयात् = పొందకూడదు;
भुजगाश्लिष्टः = పాముతో చుట్టబడియున్న;
भूरुहः = చెట్టు;
फलवान् + अपि = పండ్లతో కూడియున్నను;
अगम्यः = పొందరానిది.
भावः-
సజ్జనుడు దుర్జనులతో కలసి సహవాసం ఎన్నటికి చేయకూడదు. మంచి ఫలములతో కూడిన చెట్టు పాముతో చుట్టబడియుంటే ఆ చెట్టును సమీపించలేము గదా !
One should not approach a good man who is associated with a bad man. Even though full of fruits, a tree, embraced by a serpent becomes unapproachable.
10. एकोऽशमयेद्वीरः बहवो न तु भीरवः ।
दीप एकस्तमो हन्ति खद्योता न परश्शताः ॥
ఏకోకరీన్శమయేద్వీరః బహవో న తు భీరవః |
దీప ఏకస్తమో హంతి ఖద్యోతా న పరశ్శతాః ॥
पदच्छेदः – एकः, अरीन्, शमयेत्, धीरः, बहवः, न तु भीरवः, पीपः, एक:, तमः, हन्ति, खद्योताः, परश्शताः, न, हन्ति ।
अन्वयक्रमः – एकः, धीरः अरीन्, शमयेत्, भीरवः, बहवः, न, शमयेत्, दीपः एकः, तमः, हन्ति, खद्योताः, परश्शताः, न, हन्ति ।
अर्थाः –
एकः धीरः = ఒక్క ధీరుడు;
अरीन् = శత్రువులను;
शमयेत् = అణచివేయును;
बहवः भीरवः = పిరికివారు చాలామంది ఉన్నను;
अरीन् = శత్రువులను;
न शमयेरन् = అణచివేయలేదు;
दीपः = దీపము;
एकः = ఒక్కటైనను;
तमः = చీకటిని;
हन्ति = తొలగించును;
खद्योताः = మిణుగురు పురుగులు;
परश्शताः = వందలాదిగా ఉన్నను;
तमः = చీకటిని;
न हन्ति = తొలగించలేవు.
भावः-
లోకంలో ధీరుడైనవాడు ఒక్కడు ఉన్నను అతడు శత్రువులను అణచివేయ గలడు. భయస్తులు ఎంతమంది ఉన్నను శత్రువులను అణచివేయలేరు. ఒక్క దీపం చీకటిని తొలగిస్తుంది. వందలాది మిణుగురు పురుగులు చీకటిని తొలగించలేవు కదా !
One single warrior, not many cowards, defeats the enemy. One lamp dispels darkness, not the hundreds of fireflies.
* 11. तुल्ये रूपे पिकः काकः ध्वनिना ज्ञायते मधौ ।
विवृते हि मुखे वेद्यः सुजनो दुर्जनात्पृथक् ॥
తుల్యే రూపే పికః కాకః ధ్వనినా జ్ఞాయతే మధౌ |
వివృతే హి ముఖే వైద్యః సుజనో దుర్జనాతృథక్ ॥
पदच्छेदः – तुल्ये, रूपे, पिकः, ध्वनिना, ज्ञायते, मधौ, विवृते, हि, मुखे, वेद्यः, सुजनः, दुर्जनात् पृथक् ।
अन्वयक्रमः – पिकः, काकः, रूपे, तुल्ये, मधौ, ध्वनिना, ज्ञायते, मुखे, विवृते, सुजनः, दुर्जनात् पृथक्, वेद्यः ।
अर्थाः –
पिकः = కోయిల;
काकः = కాకి;
रूपे = రూపంలో;
तुल्ये = ఒకేవిధంగా ఉంటాయి;
मधौ = చైత్రమాసంలో;
ध्वनिना = వాటి అరుపులచేత;
ज्ञायते : = తెలుస్తుంది;
मुखे = నోరు;
विवृते = తెరచినపుడు;
सुजनः = మంచివాడు;
दुर्जनात् = దుర్జనుని నుండి;
पृथक् = వేరుగా;
वेद्यः = గుర్తింపబడతాడు.
भावः-
కోయిల, కాకి రెండూ నల్లగా ఒకే విధంగా ఉంటాయి. వాటి మధ్య ఉన్న తేడా తెలియాలంటే చైత్రమాసం రావాలి. ఆ కాలంలో కోయిల మధురంగా కూస్తుంది.’ కాకి కోయిల వలె కూయలేదు. అదేవిధంగా సుజన, దుర్జనుల మధ్య ఉన్న తేడా తెలియాలంటే నోరు తెరిచినప్పుడే వారిద్దరి మధ్య ఉన్న భేదం తెలుస్తుంది.
Though cuckoo and crow are similar in appearance, their difference is known in the spring by their cry. A good man is known from a bad man by his speech.
12. साङ्गत्यस्य गुणोऽवर्ण्यः स्वात्यां वर्षाम्बु सङ्गतम् ।
पङ्केन पङ्किलं जातं शुक्त्या मुक्तात्मतां गतम् ॥
సాంగత్యస్య గుణోకవర్ణ్యః స్వాత్యాం వర్షంబు సంగతమ్ |
పంకేన పంకిలం జాతం శుక్త్యాముక్తాత్మతాం గతమ్ ॥
पदच्छेदः – सांगत्यस्य गुणः, अवर्ण्यः, स्वात्याम्, वर्षांबु, सङ्गतम्, पङ्केन, पङ्किलं जातं, शुक्त्या, भुक्तात्मतां गतम् ।
अन्वयक्रमः – सांगत्यस्य, गुणः, अवर्ण्यः, वर्षांबु, पंकेन, संगतम्, पंकिलं, जातम्, स्वात्यां, मुक्त्या, संगतम्, मुक्तात्मतां जातम्
अर्थाः –
सांगत्यस्य, गुणः = సాంగత్యము యొక్క;
गुणः = గుణము;
अवर्ण्यः = వర్ణింపరానిది;
वर्षांबु = వర్షపునీరు;
पंकेन = బురదతో;
संगतं = కలసినచో;
पंकिलं = బురదగా;
जातम् = కూడియుంటుండి;
स्वात्यां = స్వాతీనక్షత్ర కాలమందు;
शुक्त्या = ముత్యపు చిప్పతో;
संगतम् = కూడినచో;
मुक्तात्मतां = ముత్యపు రూపాన్ని;
गतम् = పొందుతుంది.
भावः-
సత్సాంగత్యము వలన కలిగే గుణము మాటలతో చెప్పనలవికానిది. వర్షపునీరు బురదతో కలిస్తే మురికిగా మారి కనిపిస్తాయి. అదే వర్షపునీరు స్వాతీనక్షత్రయుక్త కాలంలో ముత్యపు చిప్పలో కూడినట్లయితే ముత్యముగా మారుతుంది.
Indescribable indeed is the merit of as-sociation. The association of rainwater in the season of Swathi with mud makes it muddy, but with oyster turns it into a pearl.
13. नाद्रियेरन्ननर्हाः स्वेऽप्यर्हा अर्ध्याः परे पुनः ।
मूर्धजाः पृष्ठतो बन्ध्याः हारो धार्यो भुजान्तरे ॥
నాద్రియేరన్ననర్హాః స్వేక్ప్యర్హా అర్చ్యాః పరే పునః |
మూర్ధజాః పృష్టతో బంధ్యాః హారో ధార్యో భుజాంతరే ||
पदच्छेदः – न, आद्रियेरन्, अर्हाः, स्वे, अपि, अर्हाः, परे, पुनः, मूर्धजाः, पृष्टतः, बन्ध्याः, हारः, धार्य:, भुजान्तरे, आन्दियेरन् ।
अन्वयक्रमः – अनर्हा, स्वे, अपि, न, आन्दियेरन्, पुनः, अर्थाः, परे, अपि, अर्हाः, मूर्धजाः, पृष्टताः, बन्ध्याः, हारः, भुजान्तरे, धार्यः ।
अर्थाः –
अनर्हा: = పూజింపదగనివారు;
स्वे अपि = తనవారైనను;
न आन्दियेरन् = ఆదరింపదగినవారు కాదు;
पुनः = అయితే;
अर्हाः = అర్హులైనవారు;
परे अपि = ఇతరులైనను;
अर्चाः = పూజింపదగినవారు;
मूर्धजाः = తల వెంట్రుకలు;
पृष्टताः = వెనుకభాగంవైపు;
बन्ध्याः = బంధింపబడియుంటాయి;
हारः = హారము;
भुजान्तरे = కంఠమునందు;
धार्यः = ధరింపదగినది.
भावः-
లోకంలో అర్హులుకానివారు తన వారైనను పూజింపదగినవారు కాదు. అర్హులు ఇతరులైనను పూజింపదగినవారు శిరోజాలను వెనుకవైపు కట్టబడియుంటాయి. ముత్యాలహారం కంఠమునందు ధరింపబడి యుంటుంది గదా !
One should not respect the unworthy even when they are our kith and kin. A worthy one should be honoured even if he is an enemy. The hair is tied behind, but the necklace is worn in the front.
14. येनेदं ससृजे विश्वं स्रष्टासौ न हि दृश्यते ।
वीक्षामहे यतो लोकं नेत्रे दुःशकदर्शने ॥
యేనేదం ససృజే విశ్వం స్రష్టాసౌ న హి దృశ్యతే |
వీక్షామహే యతో లోకం నేత్రే దుఃశకదర్శనే !
पदच्छेदः – येन, इदं, ससृजे, विश्वं, स्रष्टा, असौ, न, हि दृश्यते, वीक्षामहे, यतः, लोकम्, नेत्रे, दुःशकदर्शने ।
अन्वयक्रमः – येन, इदं विश्वं, सृजते, असौ, स्रष्टा न हि दृश्यते, यतः नेत्रे लोकं वीक्षामहे, दुःशकदर्शने ।
अर्थाः –
येन = ఎవనిచేత;
इदं विश्वं = ఈ ప్రపంచం;
सृजते = సృష్టింపబడుతున్నదో;
असौ स्रष्टा = అట్టి సృష్టికర్త;
न दृश्यते = కనిపించడంలేదు;
यतः = ఎట్లనగా;
वयं = మనము;
लोकं = లోకాన్ని;
वीक्षामहे = చూస్తున్నాము;
नेत्रे = కన్నును (మన);
दुःशकदर्शने = చూడలేకున్నాము.
भावः-
ఈ ప్రపంచాన్ని ఎవడు సృష్టించాడు అట్టి సృష్టి కర్త మనకు కనిపించడం లేదు. మనం ఏ కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నామో ఆ కళ్ళను మనం చూడ లేకున్నాము
కదా !
He, who has created this universe, is not seen. We cannot see the eyes with which we see the world.
15. विज्ञाते ब्रह्मणस्तत्वे न ज्ञेयमवशिष्यते ।
वृक्षमूले पयस्सेकः प्रतिशाखं न दृश्यते ”
విజ్ఞాతే బ్రహ్మణస్తత్వే న జ్ఞేయమవశిష్యతే ‘
వృక్షమూలే పయస్సేకః ప్రతిశాఖం న దృశ్యతే ॥
पदच्छेदः – विज्ञाते, ब्रह्मण: तत्वे, न, ज्ञेयम्, अवशिष्यते, वृक्षमूले, पयसः, सेकः, प्रतिशाखं न दृश्यते ।
अन्वयक्रमः ब्रह्मणः, तत्वे, विज्ञातं, अवशिष्यते, न ज्ञेयम् वृक्षमूले, पयसः, सेकः, प्रतिशाखं, न दृश्यते ।
अर्थाः –
ब्रह्मणः = బ్రహ్మనుగూర్చిన;
तत्वं = తత్వము;
विज्ञाते = తెలిసినట్లైతే;
अवशिष्यते = మిగిలిన దానిని;
न ज्ञेयम् = తెలుసుకొనవలసింది లేదు;
वृक्षमूले = చెట్టు మొదటిలో;
पयसः = నీరు యొక్క;
सेकः = తడుపుట;
प्रतिशाखं = ప్రతి కొమ్మయందు;
न दृश्यते = కన్పించడంలేదు.
भावः- మానవుడు బ్రహ్మను గూర్చి తెలుసుకున్నట్లైతే, ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. చెట్టు మొదట్లో నీటితో తడుపుటను ప్రతి కొమ్మలో కనిపించదు.
When the nature of the Brahman is known, there will be nothing left that is to be known. Pouring of water at the root of the tree is not seen in every branch.
16. प्रविहाय प्रधानांशं मुधाऽमुख्यविचारणा ।
वृक्षमूलं विना व्यर्थ: सेकः पल्लवशाखयोः ॥
ప్రవిహాయ ప్రధానాంశం ముధ్యా ముఖ్యవిచారణా |
వృక్షమూలం వినా వ్యర్థః సేకః పల్లవశాఖయోః ॥
पदच्छेदः – प्रविहाय, प्रधानांशं, मुधा, अमुख्यविचारणा, वृक्षमूलं, विना व्यर्थः, सेकः पल्लवशाखयोः ।
अन्वयक्रमः – प्रधानांशं, प्रविहाय, अमुख्यविचारणा, मुधा, वृक्षमूलं विना, पल्लवशाखयोः, सेकः, व्यर्थः ।
अर्थाः –
प्रधानांशं = ప్రధానమైన అంశాన్ని;
प्रविहाय = విడిచిపెట్టి;
अमुख्यविचारणा = ముఖ్యముకాని దానిని గురించి ఆలోచించడం;
मुधा = వ్యర్థము;
वृक्षमूलं = చెట్టు యొక్క మొదలు భాగాన్ని;
विना = లేకుండా;
पल्लव = ఆకులను;
शाखयोः = కొమ్మలను;
सेकः = తడుపుట;
व्यर्थः = నిష్ప్రయోజనము.
भावः-
ముఖ్యమైన అంశాన్ని విడిచిపెట్టి అనవసరమైన అంశాన్ని గురించి ఆలోచించడము వ్యర్థము. చెట్టు క్క మొదటి భాగాన్ని నీటితో ముందుగా తడపకుండా ఆకులను,కొమ్మలను తడపడం వలన ప్రయోజనం ఉండదు.
It is in vain to deliberate on the non-essentials, leaving out the essential. Watering the leaves and branches of the tree, leaving out the root is futile.
17. धौतवस्त्रं मृदा स्तोकं स्पृष्टं स्यान्मलिनं यथा ।
स्नेहस्तद्वत् ऋणादानात् क्षीयते स्याच्च विग्रहः ||
ధౌతవస్త్రం మృదా స్త్రోకం స్పృష్టం స్యాన్మలినం యథా |
స్నేహస్తద్వత్ ఋణదానాత్ క్షీయతే స్యాచ్చవిగ్రహః ||
पदच्छेदः – धौतवस्त्रं, मृदा, स्तोकं स्पृष्टं स्यात्, मलिनं यथा, स्नेहः, तद्वत्, ऋणदानात्, क्षीयते, स्यात्,च, विग्रहः ।
अन्वयक्रमः – यथा, धौतवस्त्रं, मृदा स्तोकं, मलिनं, स्पृष्टं स्यात्, तद्वत्, स्नेहः, ऋणदानात्, क्षीयते, च, विग्रहः, स्यात् ।
अर्थाः –
यथा = ఎట్లు;
धौतवस्त्रं, = తెల్లని వస్త్రము;
मृदा = మట్టితో;
स्तोकं = తాకబడినదై;
मलिनं = మలినమైనదిగా;
स्पृष्टं स्यात्, = స్పష్టమౌతుంది;
तद्वत् = అదేవిధంగా;
स्नेहः = మైత్రి;
ऋणदानात् = అప్పు ఇవ్వడంవల్ల ;
क्षीयते = తగ్గుతుంది;
च = మరియు;
विग्रहः = వైరము;
स्यात् = కలుగుతుంది.
भावः-
తెల్లని వస్త్రము ఒక మట్టిమరకతో మలినమైనదిగా కన్పిస్తుంది. అదే విధంగా స్నేహం కూడా అప్పు ఇవ్వడం ద్వారా తరగిపోతుంది. పైగా వైరం కలుగుతుంది.
Just as a washed cloth becomes dirty just by being smeared with a little dirt, so also friendship will be lost by giving loan, and there will be enmity too.
★ 18. अब्धौ निमग्न एवार्हः प्राप्तुं रत्नानि साहसी ।
न तीरस्थः तदाकाङ्क्षी न प्रयत्नादृते फलम् ॥
అభౌ నిమగ్న ఏవార్హః ప్రాప్తుం రత్నాని సాహసీ।
న తీరస్థః తదాకాంక్షీ న ప్రయత్నాదృతే ఫలమ్ ||
पदच्छेदः – अब्धौ निमग्नाः, अर्हः प्राप्तुं रत्नानि, साहसी, न, तीरस्थः, तत्,आकांक्षी, न, प्रयत्नात्, ते, फलम् ।
अन्वयक्रमः अब्धौ, निमग्नाः, साहसी, एव रत्नानि प्राप्तुं, अर्हः, तीरस्थः, न, तत्, आकांक्षी, प्रयत्नात्, फलम्, न ऋते ।
अर्थाः –
अब्धौ = సముద్రమందు;
निमग्नाः = మునగగల;
साहसी = ధైర్యమున్నవాడు;
एव = మాత్రమే;
रत्नानि = రత్నాలను;
प्राप्तुं = పొందుటకు;
अर्हः = తగినవాడు;
तीरस्थः न = సముద్రము ఒడ్డున ఉన్నవాడు కాదు;
ततः = ఆ రత్నమును;
आकांक्षी = కోరుకొనువాడు;
प्रयत्नात् = ప్రయత్నము వలన;
फलम् = ఫలమును;
न ऋते = పోగొట్టుకొనడు.
भावः-
సముద్రంలో మునగగలిగి, తిరిగి బయటకు రాగలిగిన వాడు మాత్రమే సముద్రపు అడుగున ఉన్న రత్నములను పొందడానికి సమర్థుడుగానీ సముద్రపు ఒడ్డున ఉన్నవాడు కాదు. ప్రయత్నము చేసి ఫలితమును పొందవచ్చును. ప్రయత్నము వలన ఫలితం పొందలేకపోవడమన్నది లేదు.
The courageous explorer who dives into the ocean alone is worthy to get the gems, and not the one who sits on the shore desiring them. There will be no fruit without effort.
19. अप्रमत्तः पुरैव स्यान्न लाभो गतशोचनात् ।
ध्वस्तेषु व्रीहिषु क्षेत्रे पक्षिभिः क्षेपणी वृथा ॥
అప్రమత్తః పురైవ స్యాన్న లాభో గతశోచనమ్ |
ధ్వస్తేషు వ్రీహిషు క్షేత్రే పక్షిభిః క్షేపణీ వృథా ॥
पदच्छेदः – अप्रमत्तः, पुरैव, स्यात्, न, लाभः, गतशोचनात् ध्वस्तेषु, व्रीहिषु, क्षेत्रे, पक्षिभिः, क्षेपणी, वृथा ।
अन्वयक्रमः – पुरैव, अप्रमत्तः स्यात्, गतशोचनात्, न, लाभः, क्षेत्रे, पक्षिभिः, व्रीहिषु ध्वस्तेषु क्षिपणी, वृथा ।
अर्थाः –
पुरैव = ముందుగా;
अप्रमत्तः = జాగరూకతగా;
लाभः स्यात् = లాభం ఉంటుంది;
गतशोचनात् = నష్టం జరిగిన తర్వాత;
न लाभः = లాభం ఉండదు;
क्षेत्रे = పొలమందు;
पक्षिभिः = పక్షులతో;
व्रीहिषु = ధార్జన్యము;
early &= &fù:
ध्वस्तेषु = నశించగా;
क्षिपणी = పక్షులను నివారించుటకు ఉపయోగించు సాధనము;
वृथा = వ్యర్థము.
भावः-
మానవుడు నష్టం జరగడానికి ముందే జాగ్రత్తపడవలయును. నష్టం జరిగిన తరువాత అప్రమత్తంగా ఉన్నా లాభం ఉండదు పొలంలోని పక్షులు పంటను నాశనం చేసిన తర్వాత పక్షులను నివారించుటకు ఉపయోగపడే సాధనంతో ఏమి ప్రయోజనం ?
One must be careful beforehand, there is no use in lamenting afterwards. After the crop is destroyed by the birds in the field, there is no use in spreading a net or using a sling.
★20. पुष्पवत् सौरभं ब्रह्म लीनमात्मनि नो विदुः ।
कस्तूरीं किं विजानाति स्वीयां कस्तूरिकामृगः ॥
పుష్పవత్ సౌరభం బ్రహ్మ లీనమాత్మని నో విదుః |
కస్తూరీ కిం విజానాతి స్వీయాం కస్తూరికామృగః ॥
पदच्छेदः – पुष्पवत्, सौरभं, ब्रह्म, लीनं, आत्मनि, नः, विदुः, कस्तूरी, किं, विजानाति, स्वीयां, कस्तूरिकामृगः ।
अन्वयक्रमः – सौरभं, पुष्पवत्, आत्मनि, ब्रह्म, लीनं, न, विदुः, स्वीयां, कस्तूरीम्, कस्तूरीमृगः, किं, विजानाति ।
अर्थाः –
सौरभम् = సుగంధముగల;
पुष्पवत् = పూవువలె;
आत्मनि = ఆత్మయందు;
ब्रह्म = బ్రహ్మ ;
लीनं = లీనమైయున్నాడని;
न विदुः = తెలుసుకొనలేము;
स्वीयां = తనయొక్క (తనలోఉన్న);
कस्तूरी = కస్తూరిని;
कस्तूरीमृगः = కస్తూరి మృగము;
किं = ఏమి;
विजानाति = తెలిసికొనగలడు ?
भावः-
తమలోని సుగంధమును పూవులు తెలుసుకోలేనట్లు, మనయందు లీనమైన పరబ్రహ్మను మనం తెలుసుకొనలేము. తనయందున్న కస్తూరిని కస్తూరీ మృగము ఏ విధముగా తెలిసికొనగలడు ?
Like a flower its fragrance, one does not realize the Brahman hidden within oneself. Does a musk deer know about her musk ?
गायत्री नीतिगीतावलिः Summary in Sanskrit
कवि परिचयः
महामहोपाध्याय श्रीमान् तिरुमल गुदिमल्ल वरदाचार्यः नन्दननाम संवत्सरे (१८९२ वर्षे आगस्तमासस्य तृतीये दिनाङ्के) स्वजनं लेभे । सुधीरयम् आन्ध्रप्रदेशस्थ मचिलीपत्तनम् इत्याख्यस्य प्रसिद्धनगरस्य समीपे स्थितस्य चिट्टिगूडूरु ग्रामस्य निवासी आसीत् । श्रीमन्तः नरसिंहाचार्याः अस्य पितृपादाः । बाल्ये मचिलीपत्तने विद्याम् अभ्यस्य ततः चेन्नै नगरं गत्वा बि. ए. एम्. ए. इत्याद्यभ्यस्य उत्तीर्णताम् अध्यगच्छत् । अपि चायं बुधाग्रणीः श्रीमतः ताण्डवकृष्णमाचार्यस्य एवं श्रीशिष्ट्ला नरसिंह शास्त्रिणः सकाशे तर्क-व्याकरण-साहित्यादिशास्त्राणि अभ्यस्तवान् । अयं मचिलीपत्तनस्थायां आन्ध्रजातीयकलाशालायां, विजयनगर संस्कृतकलाशालायां च संस्कृतशास्त्राणि अध्यापितवान् ।
ततः सर्वकारस्य प्राच्य कलासालानां सर्वासां पर्यवेक्षणाधिकारपदं निरुह्य श्रामान् वरदाचार्य पण्डितः स्वग्रामे नारसिंहसंस्कृतकलाशालां संस्थाप्य छात्राणां कृते भोजनावासादीन् स्वयं परिकल्प्य शास्त्राणि च बोधयन् संस्कृतम् असेवत । अपि चायं विद्वान् तेलुगुभाषायां प्रसिद्धानि सुमति वेमन नरसिंह इत्यादीनि सप्तशतकानि संस्कृतेन अनूद्य तेलुगुकवीनां वर्णननैपुण्यं संस्कृतलोकम्प्रत्यवगमयितुं प्रायतत, अपि च सत्यविजयम्, सुषुप्तिकृत्तम् इति लघुकाव्यद्वयं गायत्रीनीतिगीतावलिं भाषाशास्त्रसंग्रहं च व्यरचयत् । १९३१ तमे वर्षे आन्ध्रसारस्वतपरिषत् सुधियमेनं महामहोपाध्याय इत्युपाधिना सम्मान यामास ।
कथा सारांश
वैदिकसाहित्यादारभ्य संस्कृतवाङ्मये नीतिबोधकाः श्लोकाः सर्वत्र दृश्यन्त एव । केवलां नीतिमेव बोधयितुं भर्तृहरिप्रभृतयः नीतिकाव्यानि रचितवन्तः । संस्कृतवाङ्मये उपनिबद्धानि नैकानि नीतिकाव्यानि नैकासु भारतीयभाषासु वैदेशिक भाषासु च अनेके कवयः अनूदितवन्तः । अपि च बहवो विद्वांसः भारते विदेशेषु च स्वीयभाषासु नीतिकाव्यानि रचयामासुः ।
एवं संस्कृतेतरभाषासु तत्तत्कविभिः लिखितानि काव्यान्यपि केचन विद्वन्मणयः संस्कृतेन अनूद्य संस्कृतज्ञान् उपकृतवन्तः । एनां रीतिमनुसृत्य श्रीमान् अद्देपल्लि लक्ष्मणस्वामिकविवरः हिन्दीभाषया लिखितान् अंशान् तेलुगुभाषया अनूदितवान् तस्य काव्यस्य पठनेन प्रीतः श्रीमान् तिरुमल गुदिमल्ल वरदाचार्यपण्डितः सरलसंस्कृतभाषया गायत्रीनीतिगीतावलिः इति नाम्ना अनूदितवान् । तस्मादेव काव्यात् केचन श्लोकाः अत्र पाठ्यांशे उद्धृताः ।
सूचना : अत्र नक्षत्राङ्कितानां श्लोकानां प्रतिपदार्थः भावः च लेखनीयः ।
गायत्री नीतिगीतावलिः Summary in Telugu
కవి పరిచయం
మహామహోపాధ్యాయులు శ్రీ తిరుమల గుదిమల్ల వరదాచార్యులు నందననామ
సంవత్సరంలో 1892వ సంవత్సరంలో ఆగస్టు 3వ తేదీన జన్మించారు. ఈ మహనీయుడు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం నగరానికి సమీపంలోని చిట్టిగూడూరు ప్రాంతంలో నివాసం ఉన్నారు. వీరి తండ్రి నరసింహాచార్యులు చిన్నతనంలో మచిలీమట్నంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. తర్వాత చెన్నై నగరంలో బి.ఎ. మరియు ఎమ్.ఎ. డిగ్రీలను పొందారు.
వీరు తాండవ కృష్ణమాచార్యులు, మరియు శ్రీశిష్ట్లా నరసింహశాస్త్రిగార్ల సమీపంలో తర్క వ్యాకరణ, సాహిత్య మొదలైన శాస్త్రాలను చదివారు. వీరు మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలలోను, విజయనగరం సంస్కృత కళాశాలలోను సంస్కృత శాస్త్రాలను చదివాడు. పిమ్మట ప్రభుత్వ సంస్కృత కళాశాలలో పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. శ్రీవరదాచార్యులు తన స్వగ్రామంలో నారసింహ సంస్కృత కళాశాలను ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా వసతిభోజన సదుపాయాలను కల్పించారు.
అక్కడే సకల శాస్త్రాలను బోధిస్తూ నివసించారు. మరియు ఈ విద్వాంసుడు తెలుగు భాష లోని సుమతి, వేమన మొదలైన శతకాలను సంస్కృతంలో అనువదించారు. తెలుగు కవుల గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు. మరియు సత్య విజయం, సుషుప్తివృత్తం అనే రెండు లఘు కావ్యాలను, గాయత్రీ నీతి గీతావళిని భాషాశాస్త్ర సంగ్రహం అనే గ్రంథాలను రచించారు. 1939వ సంవత్సరంలో ఆంధ్ర సారస్వత పరిషత్ వీరిని మహామహోపాధ్యాయ బిరుదులతో సత్కరించింది.
కథా సారాంశము
వైదిక సాహిత్యం ఆరంభం నుండి సంస్కృత సాహిత్యంలో నీతిబోధకములైన శ్లోకాలు అన్నిచోట్ల కనిపిస్తుంటాయి. కేవలం నీతిని మాత్రమే బోధించడానికి భర్తృహరి మొదలైన కవులు నీతి కావ్యాలను రచించారు. సంస్కృత వాఙ్మయంలో ఉన్న అనేక నీతి కావ్యాలను అనేకమంది కవులు తమ తమ భాషల్లో అనువదించారు మరియు ఎంతో మంది విద్యాంసులు ఇతర దేశంలోను, విదేశాల్లోను నీతి కావ్యాలను రచించారు.
ఈ రీతిగా సంస్కృతము కాకుండా ఇతర భాషలందు రచించబడిన నీతి కావ్యాలను కొంతమంది మహాకవులు సంస్కృత భాషలోనికి అనువదించారు. ఈ పద్ధతిని అనుసరించి శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామిగారు హిందీ భాషలో రచింపబడిన అంశాలను తెలుగు భాషలో అనువదింపబడినాయి. ఆ కావ్యాన్ని చదివి ఆనందపడిన శ్రీ తిరుమల గుదిమళ్ళ వరదాచార్యులుగారు సంస్కృత భాషలో గాయత్రీ నీతిగీతావళి అనే పేరుతో అనువ దించాడు. ఆ కావ్యం నుండే కొన్ని శ్లోకాలు ఇక్కడ పాఠ్యభాగంలో స్వీకరింపబడినాయి. ”
సూచన: ఇక్కడ. * గుర్తు గల శ్లోకాలకు ప్రతిపదార్థ భావాలను చదవాలి.
गायत्री नीतिगीतावलिः Summary in English
Introduction of the Poet
Mahamahopadhyaya T. G. Varadacharya was born in Machilipatnam, Andhra Pradesh. He studied at Machilipatnam and Chennai. He was a great scholar in Tarka, Vyakarana and Sahitya. He taught at National College, Machilipatnam and Government Sanskrit College, Vijayanagaram. He was a prolific author. His works included Sushuptivrittam, Satyavijayam, and translation of Vemana and other satakas from Telugu to Sanskrit.
Summary
The present lesson Gayatri nitigitavali was translation of subhashitas from Telugu to Sanskrit. The Telugu poems were translated from Hindi.