TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 7th Lesson తృతీయ రంగం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 7th Lesson తృతీయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
తృతీయ రంగం అంటే ఏమిటి ? భారత ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం అంతర్భాగాలు (components) :
వ్యాపారం, మరమ్మత్తు సేవలు, ఆతిథ్య (hospitality) సేవలు (హోటళ్ళు, భోజనాలయాలు), రవాణా (రైలు, రోడ్డు, వాయు, జల రవాణా), సమాచారం, గిడ్డంగి, స్థిరాస్తి వ్యాపారం (real estate), విత్త సేవలు, బాంకింగ్, ఇన్సూరెన్సు, వాణిజ్య సేవలు, ఐటి సేవలు, కన్సల్టెన్సీ సేవలు, ప్రభుత్వ పాలన, వైయక్తిక, గృహ రంగ సేవలు, మొదలైనవి ఆధునిక ఆర్ధిక వ్యవస్థలో ప్రధాన ఉపరంగాలుగా కొనసాగుతున్నవి.

తృతీయ రంగ ప్రాధాన్యత :
సాధారణంగా ఆర్ధిక వ్యవస్థలో ఒక రంగపు ప్రాధాన్యతను అనేక అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. అనగా స్థూల దేశీయోత్పత్తిలో వాటా, ఉపాధి కల్పనలో వాటా, ఎగుమతులలో వాటా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మొదలైనవి.

భారతదేశంలో సేవల రంగపు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నది. సేవల రంగం ప్రస్తుతం (2019 సం.) భారతదేశ జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) లో 55 శాతం వాటాను, మనదేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో మూడింట రెండొంతుల వాటాను, దేశ ఎగుమతులలో 38 శాతం వాటాను కలిగి ఉన్నది.

భారతదేశంలో గల 33 రాష్ట్రాలలో దాదాపు 15 రాష్ట్రాలతో బాటు కేంద్రపాలిత ప్రాంతాలలో సేవల రంగం వాటి స్థూల ఉత్పత్తిలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటం గమనార్హం.

i) జోడించిన స్థూల ఉత్పత్తి విలువ (GVA) లో సేవల రంగం వాటా :
సేవల రంగం భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రధానంగా ప్రభావితం చేస్తున్న రంగంగా పరిగణించబడుతుంది. జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో సేవల రంగం వాటా 2013-14 సంవత్సరంలో 49.4 శాతం ఉండగా 2019-20 (AE) లో 57.8 శాతం ఉంది.

గత కొంత కాలం నుండి కూడా GVA కు సేవల రంగం సగటున ప్రతి సంవత్సరం 58 శాతం సమకూర్చుతున్నది. ద్వితీయ రంగం సగటున 28 శాతం సమకూర్చుతుండగా ప్రాథమిక రంగం 14 శాతం సమకూర్చుతుండటం గమనార్హం.

2019-20 సంవత్సరంలో ద్వితీయ రంగం 28.3 శాతం, ప్రాథమిక రంగం 13.9 శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ, ఈ రెండు రంగాల వాటా గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతున్నది. భారత ఆర్థిక సర్వే – 2019 ప్రకారం 2019-20 సంవత్సరంలో సేవల రంగంలోని ప్రధాన ఉపరంగాలైన వ్యాపార, హోటళ్ళు, రవాణా, గిడ్డంగి, సమాచారం, ప్రసార మాధ్యమం సేవలు కలిసి 18.1 శాతం వాటాను, ద్రవ్యరంగం, రియల్ ఎస్టేట్, వృత్తి పరమైన సేవలు 24.5 శాతం వాటాను, ప్రభుత్వ పాలన, రక్షణ ఇతర సేవలు 15.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ii) ఉపాధికి సేవల రంగం తోడ్పాటు :
ప్రస్తుతం సేవల రంగంలో ఉపాధి చాలా నాణ్యతతో కూడుకొని ఉండడమే గాకుండా తులనాత్మకంగా ఎక్కువ ప్రతిఫలం పొందగల రంగం, సమాచార విప్లవం (IT) తరువాత ఈ ధోరణి మరింత వేగాన్ని సంతరించుకుంది.

సేవల రంగంలో ఉపాధి పొందుతున్న వారి నగటు ఆదాయం ఇతర రంగాలలో పనిచేస్తున్న వారి సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. 1950-51 సంవత్సరంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కల్పిస్తున్న ఉపాధిలో 17.3 శాతం సేవల రంగం కల్పించగా 2010 సంవత్సరం నాటికి 26.5 శాతం, 2018 సంవత్సరంలో 31.45 శాతం సేవల రంగం కల్పించింది.

iii) ఎగుమతులు :
భారతదేశ అంతర్జాతీయ చెల్లింపుల శేషంలోని అదృశ్య అంశాల ఖాతాలో సాధారణంగా మిగులు లేదా అనుకూల వ్యాపార శేషం ఉంటుంది. దీనిని బట్టి సేవల రంగ ఎగుమతులు, సేవల రంగ దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటున్నాయన్నది అర్థమవుతుంది.

ప్రత్యేకించి సమాచార సాంకేతిక పరిజ్ఞాన విప్లవానంతరం సాఫ్ట్వేర్ ఎగుమతుల వాటా మొత్తం సేవల రంగ ఎగుమతులలో ఎక్కువగా ఉంటున్నది. భారతదేశ సేవల ఎగుమతుల విలువ 2017-18 లో 195.1 బిలియన్ డాలర్లు కాగా 2018-19 లో 205.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ మొత్తం సేవల ఎగుమతుల విలువలో సాఫ్ట్వేర్ 40 శాతం, రవాణా 23 శాతం, వ్యాపార సేవలు 19 శాతం, ద్రవ్య సేవలు 2 శాతం, సమాచారం 1 శాతం, బీమా సేవలు 1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2018-19 లో భారతదేశ నికర ఎగుమతుల విలువ (ఎగుమతుల విలువల నుండి దిగుమతుల విలువను తీసివేసిన తర్వాత) 81.9 బిలియన్ డాలర్లు.

iv) సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు :
2018-19 లో భారతదేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 28,264 మిలియన్ అమెరికన్ డాలర్లు. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో సేవల రంగంలోకి వచ్చినవి 2018-19లో 64.6 శాతం కాగా 2017-18 లో 63.7 శాతం.

నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో పెరుగుదల ఏర్పడితే అంతర్జాతీయ చెల్లింపుల శేషంపై అనుకూల ప్రభావం ఉంటుంది. 2009-19 మధ్య కాలంలో భారతదేశంలో రెండింతలుగా నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినందు వల్లనే మనదేశంలో 2014, మార్చి నుండి 2019 మార్చి మధ్య కాలంలో, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో చెప్పుకోదగ్గ మెరుగుదల సంభంవించింది.

స్థూల దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా 60 శాతం పైగా ఉన్నందున, ఈ రంగంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత గలదు. 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2019 సంవత్సరం సెప్టెంబర్ వరకు భారతదేశంలోకి 4.46 లక్షల మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా అందులో 50 శాతం సేవల రంగంలోకి వచ్చాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 2.
భారతదేశ పర్యాటక రంగం సేవలను వివరించండి.
జవాబు.
“విశ్రాంతి కోసం కానీ వ్యాపారం నిమిత్తం గానీ, ఇతర అవసరాల నిమిత్తం కానీ సంవత్సరం కంటే తక్కువ కాలం తమ సాధారణ నివాస స్థలంలో గాకుండా ఇతర ప్రాంతాలలో గడపటంను పర్యాటకం” అని ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వచించింది.

భారత ప్రభుత్వ నిర్వచనం ప్రకారం “ఒకరోజు కంటే ఎక్కువ మరియు ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పాస్పోర్ట్ సౌకర్యం కలిగి ఉన్న విదేశీయులు విశ్రాంతి, వినోదం, వ్యాపారం ఆరోగ్య చికిత్స, మతం, ఆటలు, సభలు, సమావేశాలు మొదలైన వాటికోసం భారతదేశంలో ఉండడం” ను పర్యాటకం అని పేర్కొంది. యాత్రికులకు సంబంధించిన ఆర్థిక, సాంఘిక కార్యకలాపాల సమాహారమే పర్యాటక రంగం, పర్యాటక రంగంను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  • దేశీయ టూరిజం
  • విదేశీ టూరిజం.

i) దేశీయ టూరిజం :
మన దేశవాసులు మన దేశంలోని ప్రాంతాలను సందర్శించడాన్ని దేశీయ టూరిజం అంటారు. సంప్రదాయంగా ప్రజలు మత ప్రాధాన్యత గల స్థలాలను, పర్యాటక ప్రాధాన్యత గల స్థలాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ప్రస్తుత తరం వన్య ప్రాణుల రక్షణ కేంద్రాలను, సముద్ర తీరాలను, పర్వత ప్రాంతాలను, వినోదపు పార్క్ ను, రిసార్ట్న సందర్శిస్తున్నారు.

ii) అంతర్జాతీయ టూరిజం :
పాస్పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు వ్యాపారం, విశ్రాంతి, ఆరోగ్యం, చికిత్స, మతం, ఆధ్యాత్మికం, పురాతన కట్టడాల సందర్శన, ఆటలు, సభలు, సమావేశాల కోసం విదేశాలను సందర్శించుటను అంతర్జాతీయ టూరిజం అంటారు. భారతదేశంలో ఆగ్రా, ఢిల్లీ, రాజస్థాన్, కాశ్మీర్, గోవా, కేరళ, తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రధాన పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.

పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని పెంచడంలో, GVA కూర్పులో, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో, ఉద్యోగ కల్పనలో తగినంత పాత్ర వహిస్తున్నది. పర్యాటక రంగం 2015 నుండి 2017 సంవత్సరం వరకు విదేశీ పర్యాటకుల సందర్శనలో మంచి వృద్ధిని కనబరిచింది. అయితే 2018 లో 5.2 శాతం ఉన్న విదేశీ పర్యాటకుల ఆగమన వృద్ధిరేటు 2019 (జనవరి – అక్టోబర్)లో కేవలం 2.7 శాతం వృద్ధికి పరిమితమైంది. అయితే ఈ కాలంలో ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ పార్యటక వ్యవస్థ మొత్తం ఇలాంటి మందగమనంలోనే ఉంది.

2017 లో 7.1 శాతం వృద్ధిని నమోదు చేసిన ప్రపంచ పార్యటక రంగం 2018 లో కేవలం 5.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. అందుకు అనుగుణంగానే విదేశీ మారక ద్రవ్య నిల్వలలో కూడా 2017 సంవత్సరం వరకు మంచి వృద్ధి ఉండగా 2018, 2019 సంవత్సరాలలో తక్కువ వృద్ధి నమోదయింది. భారతదేశం 2019 జనవరి నుండి 2019 అక్టోబర్ మధ్య 24 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలను 2 శాతం వృద్ధితో ఆర్జించింది.

2014 నుండి 2018 మధ్య కాలంలో ప్రపంచ పర్యాటకుల సందర్శనలో భారతదేశం స్థితిని పరిశీలించినట్లయితే 2014లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీయుల సంఖ్య 7.68 మిలియన్లు కాగా 2018లో 10.66 మిలియన్లుగా ఉంది. అదే కాలంలో భారతదేశంలోకి వచ్చిన అంతర్జాతీయ యాత్రికుల సంఖ్య (విదేశీయులు మరియు విదేశాలలో ఉండే స్వదేశీయులు కలుపుకుని) 2014 లో 13.11 మిలియన్ల నుండి 17.42 మిలియన్లకు పెరిగింది.

ఇదే కాలంలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 1137 మిలియన్ల నుండి 1401 మిలియన్లకు పెరిగింది. ప్రపంచ వ్యాప్త అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యలో భారతదేశాన్ని సందర్శించిన వారి సంఖ్య 2014 లో 1.15 శాతం ఉండగా 2018 నాటికి 1.24 శాతంకు పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాలలో ఇండియా స్థానం 2014 లో 24 కాగా 2018 లో 22గా ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంను సందర్శించిన వారిలో ఇండియాను సందర్శించిన వారు 2014 లో 4.86 శాతం ఉండగా 2018లో 5.01 శాతం ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇండియా స్థానం 2014 లో 8 కాగా 2018 లో 7గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారత్ వాటా 2014 లో 1.57 శాతం ఉండగా 2018లో 1.97 శాతంగా ఉంది.

అంతర్జాతీయ సందర్శకుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న దేశాలలో ఇండియా స్థానం 2014 లో 15 ఉండగా 2018 లో 13గా ఉంది. అదే విధంగా అంతర్జాతీయ సందర్శకుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న ఆసియా-పసిఫిక్ దేశాలలో ఇండియా 7వ స్థానంలోనే స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సందర్శకుల ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతం పొందిన ఆదాయంలో ఇండియా ఆదాయం 2014 లో 5.49 శాతం ఉండగా 2018 లో 6.54 శాతంకు పెరిగింది.

జోడించిన స్థూల విలువ, ఉద్యోగితలో వివిధ రాష్ట్రాలలో పర్యాటక రంగం వాటా :
పర్యాటక రంగంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల స్థితిని పరిశీలించినప్పుడు దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు ముందు వరుసలో ఉండి 2018 లో దేశంలో సందర్శించిన మొత్తం దేశీయ సందర్శకులలో 65 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల జోడించిన స్థూల ఉత్పత్తి విలువలో పర్యాటక రంగం వాటా 1.36 శాతం నుండి 11.55 శాతం వరకు కలదు. ఈ విషయంలో గోవా ముందుండగా డామన్ డయ్యు చివరి స్థానంలో ఉంది. వివిధ రాష్ట్రాల మొత్తం ఉద్యోగితలో పర్యాటక రంగం వాటా 4.76 శాతం నుండి 56.24 శాతం వరకు ఉంది. ఈ విషయంలో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.

పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు :
అంతర్జాతీయ పర్యాటకాన్ని సులభతరం చేయడంలో భాగంగా 2014 సంవత్సరం సెప్టెంబర్ లో 46 దేశాలకు ఇండియా ఈ-పర్యాటక వీసా’ ను ప్రవేశపెట్టింది. అంతకు పూర్వం ఈ సౌకర్యం 12 దేశాలకే పరిమితమై ఉంది.

భారత ప్రభుత్వం 2016 లో వీసా పద్ధతిని మరింత సరళీకరించింది. అందులో భాగంగా ఈ-వీసాను అయిదు ఉప వర్గాలుగా విభజించింది. అవి :

  1. ఈ-పర్యాటక వీసా
  2. ఈ వ్యాపార వీసా
  3. ఈ-విద్య వీసా
  4. ఈ-సమావేశ వీసా
  5. ఈ-వైద్య సహాయకుల వీసా (రోగికి సహాయం చేయడానికి వచ్చేవారికి).

ప్రస్తుతం ఈ వీసా 169 దేశాలకు వర్తిస్తుంది. దేశంలోని 28 విమానాశ్రయాల ద్వారా, ప్రకటింపబడిన అయిదు ఓడ రేవుల ద్వారా వచ్చే విదేశీయులకు ఈ-వీసా సౌకర్యంను వర్తింపజేస్తున్నారు. ఫలితంగా ఈ వీసా సౌకర్యం ద్వారా దేశం సందర్శనకు వచ్చిన వారి సంఖ్య 2015 లో 4.45 లక్షలు ఉండగా 2018 నాటికి 23. 69 లక్షలకు పెరిగింది. ఆ విధంగా విదేశీ పర్యాటకుల సంఖ్యలో ప్రతి సంవత్సరం దాదాపు 21 శాతం వృద్ధి నమోదయింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 3.
IT-BPM రంగం సేవలను వివరించండి.
జవాబు.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ (ITBPM) : సంస్థల నిర్మాణం, నిర్వహణ, నియంత్రణ అంచనా అభిలషణీయ రాబడి ప్రవాహం, సంస్థల లక్ష్యాలు, ఉద్యోగులు, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వాటికి సంబంధించిన సంస్థలో, సంస్థ బయట ఉండి సేవలు అందించే ప్రక్రియయే వ్యాపార సంబంధిత సేవల నిర్వహణ లేదా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్. గత రెండు దశాబ్దాల నుండి భారతదేశ సేసల ఎగుమతులలో IT-BPM ప్రధాన భూమికను పోషిస్తున్నది.

2019 ఆర్థిక సర్వే ప్రకారం 2019 మార్చిలో ఈ పరిశ్రము ద్వారా జరిగిన ఎగుమతుల విలువ 177 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో, అదనపు విలువను చేకూర్చడంలో IT-BPM పరిశ్రమ ప్రధాన పాత్ర నహిస్తున్నది. 2018-19 లో జరిగిన మొత్తం IT-BPM సేవలలో IT సేవలు 51 శాతం, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ సేవలు 20.6 శాతం, BPM సేవలు 19.7 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం IT సేనల ద్వారా వచ్చింది. IT సేవలలో డిజిటల్ సేవలు సాలీనా 30 శాతం వృద్ధితో ఉండి 33 బిలియన్ల అమెరికన్ డాలర్ల పిలువకు చేరింది.

IT-BPM సేవలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. IT సేవలు
  2. సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్,
  3. హార్డ్వేర్. నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ కంపనీస్) ప్రకారం మొత్తం IT-BPM సేవలలో 2018- 19 లో IT సేవలు 51.2 శాతం, సాఫ్ట్వేర్ మరియు ఇంజనీరింగ్ సేవలు 20.6 శాతం, BPM సేవలు 19.7 శాతం, హార్డ్ వేర్ 8.5 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

IT-BPMరంగ ఎగుమతులు :
హార్డ్ వేర్ను మినహాయించి IT-BPM సేవలు ప్రధానంగా ఎగుమతుల ప్రాధాన్యత (83 శాతం)ను కలిగినవి. IT-BPM సేవలలో ఎగుమతుల ద్వారా 2018-19లో భారతదేశం 135 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆర్జించింది. IT-BPM ఆదాయంలో 2017-18 లో 8.2 శాతం వృద్ధి ఉండగా 2018-19 లో కొంత తగ్గి 6.8 శాతం వృద్ధి ఉంది.

మొత్తం IT-BPM సేవల ఎగుమతుల విలువ 135.5 బిలియన్ డాలర్లలో IT సేవలు 55 శాతం కాగా మిగతా 45 శాతంను సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, BPM సేవలు కలిగి ఉన్నాయి. ‘2018-19లో IT-BPM ఎగుమతులలో IT సేవలు 7.3 శాతం, BPM సేవలు .8.3 శాతం, సాఫ్ట్ వేర్ మరియు ఇంజనీరింగ్ సేవలు 11.2 శాతం వృద్ధిని సాధించాయి.

దేశాల వారీగా IT-BPM సేవల, ఎగుఘితులను పరిశీలించినప్పుడు అమెరికా మనదేశ IT-BPM ఎగుమతులలో ప్రధాన వాటాను కలిగి ఉంది. 2018-19లో మనదేశం చేసిన IT-BPM ఎగుమతులలో అమెరికా వాటా 62 శాతం. ఇండియా, అమెరికాకు ఎగుమతి చేసిన IT-BPM సేవల ద్వారా వచ్చిన ఆదాయం 2018-19 లో 84 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇండియా IT-BPM ఎగుమతులలో అధిక వాటా కలిగిన రెండవ దేశం ఇంగ్లాండ్. ఇది 17 శాతం వాటాను కలిగి ఉండగా మిగతా యూరప్ దేశాలు (ఇంగ్లాండ్ మినహా) 11.1 శాతం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం 7.6 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

ప్రభుత్వ చర్యలు :
IT-BPM రంగంలో నవకల్పనలు, సాంకేతికత అభివృద్ధికి తీసుకున్న చర్యలలో స్టార్ట్ ఆప్ ఇండియా, జాతీయ సాఫ్ట్ వేర్ ఉత్పత్తి విధానం, ఆంజల్ పన్నుకు సంబంధించి సమస్యల నిర్మూలన ముఖ్యమైనవి. నాస్కామ్ అధ్యయనం ప్రకారం ఇండియా స్టార్ట్ – అప్ వ్యాపారంలో ప్రపంచంలో చైనా (206), అమెరికా (203) తరువాత 24 యూనికార్న్ (స్టార్ట్-అప్ సంఖ్యలు)లతో మూడవ స్థానంలో ఉంది. ఇండియా యూనికార్న్ సంస్థలలో 55 శాతం బెంగుళూర్, ఢిల్లీ, ముంబాయిలో ఉన్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 4.
మనదేశంలో వివిధ రకాల రవాణా సౌకర్యాలను వివరించండి.
జవాబు.
రవాణా వ్యవస్థ : మానవ శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ నిర్వహించే పాత్రను ఆర్థికవ్యవస్థలో రవాణా వ్యవస్థ నిర్వహిస్తుంది. రవాణా వ్యవస్థ నాలుగు సాధనాల ద్వారా నడుస్తున్నది.

1. రోడ్డు రవాణా :
భారతదేశంలో స్థూల దేశీయోత్పగికి ఆదాయలను నసుకూర్చడంలో, ప్రయాణికులు, సరుకుల రవాణాలో రోడ్డు రవాణాదే ప్రధాన పాత్ర, 2017-18లో స్థూల దేశీయోత్పత్తిలో రవాణా రంగం వాటా 4.77 శాతం కాగా ఇందులో రోడ్డు రవాణా 3.06 శాతం, రైల్వేలు 0.75 శాతం, వాయు రవాణా 0.15 శాతం, జల రవాణా 0.06 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ నివేదిక ప్రకారం మొత్తం ప్రయాణికుల రవాణాలో 69 శాతం, మొత్తం సరుకుల రవాణాలో 90 శాతం రోడ్డు రవాణా ద్వారా జరుగుతున్నది. దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నాహనాల చట్టం అమలుసు పర్యవేక్షిస్తూ సంబంధిత విధానాల రూపకల్పన బాధ్యతను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది.

2. రైల్వేలు :
రైల్వేలు 1950 సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి. ఒకే యాజమాన్యం కింద ఉన్న భారతీయ రైల్వేలు 68 వేల కి.మీ. మార్గంతో ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద స్థానాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ రైల్వే 2018-19 లో 840 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రపంచంలో మొదటి స్థానాన్ని, 120 కోట్ల టన్నుల సరుకును తరలించి ప్రపంచంలో నాల్గవ స్థానాన్ని కలిగి ఉన్నది. ప్రస్తుతం రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తున్నది.

స్టేషన్ల ఆధునీకీకరణ :
రైల్వేస్టేషన్ల ఆదునికీకరణ నిరంతర అభివృద్ధి ప్రక్రియలో భాగం. 2019-20 నాటికి ఆదర్శ రైల్వే స్టేషన్’ పథకం కింద 1253 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక కార్యక్రమం (స్పెషల్ పర్పస్ వెహికల్) క్రింద భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ది కార్పోరేషన్ (IRSDC) ను ఏర్పాటు వేసి ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (PPP) తో రేల్వే స్టేషన్ల ఆధునీకీకరణ జరుగుచున్నది.

3. వాయు రవాణా :
దేశీయంగా జరిగే పౌర విమానయానాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇండియా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. భారతీయ వాయు రవాణా సంస్థ (ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా – AAI) ఆధ్వర్యంలో 136 విమానాశ్రయాలు వాణిజ్య సరంగా నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పబ్లిక్, ప్రయివేట్ పార్టనర్షిప్ – PPP) లో ఆరు విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి.

ఇండియాలో వాయు రవాణాను 1953 సంవత్సరంలో జాతీయం చేసి ఇండియన్ ఎయిర్ లైన్స్ మరియు ఎయిర్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇండియాకు చెందిన వాయు రవాణా సంస్థల తలసరి సీట్ల పెరుగుదల 2013 లో 0.07 ఉండగా 2018 లో 0.12 గా ఉంది. కాగా దేశీయ విమానయానంలో రెండవ స్థానంలో ఉన్న చైనాలో తలసరి సీట్ల పెరుగుదల 2013లో 0.33 ఉండగా 2018లో 0.49గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 2013 లో 2.59 ఉండగా 2018లో 2.96 గా ఉంది.

2019-20లో ఇండియాలో వినూనయానంను పునఃనిర్మాణం చేయడం జరిగింది. వినియోగంలో లేని పట్టణాల విమానాశ్రయాలను ఆరంభించే పథకం క్రింద ఆరంభమైన 43 విమానాశ్రయాలలో 4 విమానాశ్రయాలు 2019-20లో ఆరంభమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరం) 2019 నివేదిక ప్రకారం విమానాశ్రయాల అనుబంధం (ఎయిర్ పోర్ట్ కనెక్టివిటి) విషయంలో ప్రపంచంలో ఇతర ఏడు దేశాలతో (అమెరికా, చైనా, జపాన్, ఇంగ్లాడ్…) భారతదేశం మొదటిస్థానంలో ఉంది.

2019 లో దేశీయ విమానయాన సంస్థలు కలిగి ఉన్న 680 విమానాల సంఖ్యను 2023-24 సంవత్సరానికి 1200కు పెంచడానికి అవసరమయిన అవస్థాపన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తున్నది.

4 జల రవాణా :
దేశంలోని కాలువలు, కొలనులు, నదులు, సముద్రాల వెనుక జలాల ద్వారా దేశీయ జల రవాణా జరుగగా దేశంలోని ఓడరేవులను ప్రపంచ ఓడ రేవులతో కలుపుతూ అంతర్జాతీయ జల రవాణా జరుగుతుంది. మన దేశంలో 5,000 కి.మీ. మేర తీర ప్రాంతాలున్నాయి. అంతర్గత నీటి రవాణా అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. అంతర్గత నీటి రవాణాలో కొంత భాగం చిన్న పడవలతో కొనసాగగా కొంత భాగం డీజిల్ బోట్లు, స్టీమర్లతో కొనసాగుతుంది.

అతి తక్కువ నిర్వహణ వ్యయాలతో, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ అంతర్గత జల రవాణా. ఈ రవాణా వ్యవస్థ అభివృద్ధి తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించి, ఆదాయాన్ని, వ్యాపారాన్ని పెంపొందిస్తుంది. భారతదేశం 7,156 కి.మీ. సముద్ర తీరంతో 13 భారీ, 200 చిన్న నౌకాశ్రయాలు కలిగి ఉన్నది. మొత్తం రవాణా రంగంలో జల రవాణా వాటా 29%. ఓడల ద్వారా ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులను, బొగ్గును రవాణా చేస్తారు.

2019 భారతీయ ఆర్థిక సర్వే ప్రకారం 2019 జనవరి నాటికి ప్రపంచ దేశాలు కలిగి ఉన్న ఓడల సంఖ్యలో 0.9 శాతంను భారతదేశం కలిగి ఉంది. 2019 మార్చి నాటికి భారతదేశంలో ఓడ రేవులు సాలీనా 1452.64 మిలియన్ టన్నుల సరుకును నిల్వ చేసే సామర్థ్యంసు కలిగి ఉన్నాయి.

2010 లో ఈ సామర్థ్యం 628.03 మిలియన్ టన్నులుగా ఉంది. దేశంలోని ఓడరేవులలో పారదీప్, చైనా, విశాఖపట్నం, దీనదయాల్ (కాంట్లో), నవశేవగా కూడా పిలవబడే జవహర్ లాల్ నెహ్రూ ఓడ రేవులు పేరొందిన పెద్ద ఓడ రేవులు.

జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు భారతదేశంలో అతి ఎక్కువ సరుకు రవాణా, నిల్వ సామర్థ్యం గల ఓడరేవు. భారతీయ ఓడల యజమానులు కల్గి ఉన్న ఓడల సంఖ్య 2010 లో 1,040 కాగా 2019 ఆగస్టు నాటికి 1414గా ఉంది. 2013– 14 నుండి 2016-17 మధ్యకాలంలో భారతీయ జలరవాణా వేగంగా వృద్ధి చెందినప్పటికీ 2017-18 నుండి వృద్ధి మందగించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 5.
భారతదేశంలో గల ఇందన వనరులపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు.
ఇంధన రంగం :
మానవాభివృద్ధి పరిణామ క్రమంలో, ఇంధనం ప్రధాన అభివృద్ధి కారకాలలో ఒకటిగా మారి కీలక పాత్రను పోషిస్తుంది. ఆర్థికాభివృద్ధికి ఇంధన వనరుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంది. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం, 2017 లో అమెరికా, చైనాల తరువాత భారతదేశం విద్యుత్తు వినియోగంలో మూడవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగం అవుతున్న విద్యుత్తులో భారతదేశం 5.8 శాతం వినియోగిస్తున్నది.

ఇంధన వనరులు :
వేడిచేసే ప్రక్రియలో గానీ, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో గానీ, శక్తి మార్పిడి ప్రక్రియలో గానీ వినియోగపడుతున్న అన్ని రకాల ఇంధనాలను ఇంధన వనరుల మూలాధారాలు లేదా ఇంధన వనరులు అనవచ్చు. ఇంధన వనరులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

I. పునఃస్థాపిత ఇంధన వనరులు :
ప్రకృతి నుండి లభించి వినియోగించిన తరువాత పునరుత్పత్తికి అవకాశం ఉన్న ఇంధనాన్ని పునఃస్థాపిత ఇంధన వనరులు అంటారు. పునఃస్థాపిత ఇంధన వనరులు ఆర్థిక ప్రయోజనం కలిగి ఉండి ఇంధన భద్రతను కల్పించడమే కాకుండా ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలలో తక్కువ మోతాదులో పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయి. పునఃస్థాపిత ఇంధన వనరుల రకాలు :

1. సౌర విద్యుత్ :
సూర్య కిరణాలను, వేడిని విద్యుత్ గా మలచడమే సౌర శక్తి. సౌర శక్తిని వెలుగు కోసం, వేడి కోసం, ఇతర రకాల విద్యుత్ కోసం వినియోగించవచ్చు.

2. పవన శక్తి :
పవనాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని పవన విద్యుత్తు అంటారు. చాలా సంవత్సరాల నుంచి మనం పవన యంత్రాలను నీటిని ఎత్తిపోయడానికి వినియోగిస్తున్నాం. పెద్ద పెద్ద పవన టర్బన్లను పవన విద్యుత్తు ఉత్పత్తికి వినియోగిస్తారు. టర్బన్లను సహజంగా భూమిపై వచ్చే గాలి (పవనాలు) ద్వారా తిప్పుతారు. నిరంతరం పవనాలు ఉండే ఎత్తైన ప్రాంతాలు టర్బైన్ల ఏర్పాటుకు అనుకూలం.

3. జల విద్యుత్తు :
ప్రవహించే నీటికి అడ్డుగా కట్టే జల ప్రాజెక్టులు లేదా రిజర్వాయర్లు జల విద్యుత్తుకు ఆధారాలు. ప్రవహించే నీటిని టర్బైన్లను తిప్పడానికి గతిశక్తిని వినియోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. సముద్రాలలో వచ్చే ఆటుపోటుల నుంచి అలల శక్తిని, తరంగాల నుండి తరంగపు శక్తిని కూడా ఉత్పత్తి చేస్తారు.

4. భూగర్భ శక్తి :
భూగర్భంలో వేడి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తిని భూగర్భ (జియోధర్మల్) శక్తి అంటారు. భూమి పై ఉండే వేడి నీటి బుగ్గలు, అగ్నిపర్వతాల నుంచి విద్యుత్ శక్తి తీసి నేరుగా పరిశ్రమల వినియోగానికి సరఫరా చేస్తారు.

5. జీవ సంబంధిత ఇంధనం (బయోఎనర్జీ) :
జీవుల నుండి వచ్చే జీవ వ్యర్థ పదార్థాల నుంచి తీసే శక్తిని జీవ సంబంధిత ఇంధనం అంటారు. జీవ పదార్థంను ప్రత్యక్షంగా వేడిని ఉత్పత్తి చేయడానికి గానీ, పరోక్షంగా ఇంధనాల ఉత్పత్తికి గాని వినియోగించవచ్చు. రవాణా ఇంధనాలు ఎతనాల్, మీథేన్, బయో డీజిలు కూడా జీవ సంబంధిత ఇంధనాలలో భాగం.

2019 మార్చి 31 నాటికి ఇండియాలో పునఃస్థాపిత ఇంధన వనరుల ద్వారా లభించగల శక్తి 1097465 మిలియన్ వాట్లు. ఇందులో సౌర విద్యుత్ 68.25 శాతం, పవన విద్యుత్ 27.54 శాతం కాగా సూక్ష్మ జల విద్యుత్తు, జీవ వ్యర్థాల ఇంధనం మొదలైనవి మిగతా వాటాను కలిగి ఉన్నాయి. ఇండియా పునఃస్థాపిత శక్తికి సంబంధించిన వివరాలను కింద చూడవచ్చు.

ప్రాంతాలు వారిగా పునఃస్థాపిత శక్తి వనరుల పంపిణీని చూసినప్పుడు మొత్తం పునఃస్థాపిత ఇంధన వనరులలో 2019 మార్చి 31 నాటికి రాజస్థాన్ రాష్ట్రం అతి ఎక్కువగా 15 శాతం (1,62,223 మి.వా), గుజరాస్ 11 శాతం (1,22,086 మి.వా) మహారాష్ట్ర (1,13,925 మి.వా), జమ్ము, కాశ్మీర్ (1,12,800) 10 శాతం వాటాను సౌర విద్యుత్ కారణంగా ప్రధాన నాటాను కల్గి ఉండగా గుజరాత్ మాత్రం పవన విద్యుత్ కారణంగా అధిక వాటాను కలిగి ఉంది.

II. అంతరించిపోయే ఇంధన వనరులు :
సమీప అవిష్యత్తులో తిరిగి పునఃస్థాపితం అయ్యే అవకాశం లేని ఇంధన వనరులను అంతరించిపోయే ఇంధన వనరులు అంటారు. శిలాజ ఇంధనాల నుండి వచ్చే బొగ్గు, క్రూడాయిల్, సహజవాయువు మరియు కేంద్రీయ ఇంధనాలైన యురేనియంలను అంతరించి పోయే ఇంధన వనరులుగా చెప్పవచ్చు.

శిలాజ ఇంధనాలు ప్రధానంగా కార్బన్ నుంచి తయారవుతాయి. ఆ రకంగా అంతరించిపోయే ఇంధన వనరులు రెండు రకాలు. అవి:
(ఎ) శిలాజ ఇంధనాలు,
(బి) కేంద్రీయ ఇంధనాలు.

A) శిలాజ ఇంధనాలు :
జంతువులు, వృక్షాల అవశేషాలు రూపాంతరం పొందే శిలాజం నుంచి వచ్చే ఇంధనాలు శిలాజ ఇంధనాలు. వీటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. బొగ్గు :
దాదాపు 98 శాతం కంటే ఎక్కువ బొగ్గు నిల్వలు జార్ఖండ్, ఒడిషా, చత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం దేశంలోని బొగ్గు నిల్వలలో 2019 మార్చి 31 నాటికి 25.88 శాతం జార్ఖండ్లో ఉండగా, ఒడిషాలో 24.76 శాతం నిల్వలు ఉన్నాయి. 2018-19లో దేశంలో 8.1 శాతం వృద్ధితో 730.4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.

2. క్రూడాయిల్ :
2019 మార్చి 31 నాటికి భారతదేశ చమురు నిల్వలు 618. 95 మిలియన్ టన్నులు. 2018 మార్చి 31న ఇది 594. 69 మిలియన్ టన్నులు. దేశంలో చమురు నిల్వలు పంపిణీని చూసినప్పుడు మొత్తం చమురు నిల్వలలో పశ్చిమ తీరంలో 38 శాతం ఉండగా అస్సాంలో 25.6 శాతం ఉన్నవి. అదేవిధంగా మొత్తం సహజ వాయువు నిల్వలలో తూర్పు తీరంలో 41 శాతం, పశ్చిమ తీరంలో 23.4 శాతం ఉన్నవి.

3. సహజ వాయువు :
2019 మార్చి 31 నాటికి దేశంలో ఉన్న సహజ వాయువు నిల్వలు 1380.63 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM) ఉండగా 2018 మార్చి 31 నాటికి అవి 1339.57 BCM లుగా ఉన్నవి.

B) కేంద్రీయ ఇంధనాలు :
అణు విచ్ఛిత్తి ప్రక్రియలో ఉపయోగపడే ఇంధనాలనే అణు ఇంధనాలు లేదా కేంద్రీయ ఇంధనాలు అంటారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే శక్తిని అణు శక్తి, అణు విద్యుత్తు అంటారు. మొత్తం ప్రపంచ శక్తి ఉత్పత్తిలో అణుశక్తి 6 శాతం ఉండగా ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా 13-14 శాతంగా ఉంది.

అంతరించి పోయే ఇంధన వనరుల అనుకూల అంశాలు :

  1. అంతరించి పోయే ఇంధన వనరులు తులనాత్మకంగా తక్కువ వ్యయానికి లభ్యమవుతాయి.
    ఉదా : డీజిల్, ఇతర చమురు
  2. వీటిని సులభంగా వెలికి తీసే అవకాశం ఉంటుంది.
  3. అంతరించి పోయే ఇంధన వనరులను నిల్వ చేయడం సులభం.

అంతరించిపోయే ఇంధన వనరుల లోపాలు :

  1. అంతరించిపోయే ఇంధన వనరులు ఒకసారి వినియోగిస్తే పునస్థాపితానికి సమీప భవిష్యత్ లో అవకాశం ఉండదు.
  2. అంతరించిపోయే ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగం ప్రక్రియలో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది.
  3. అంతరించి పోయే వనరుల వినియోగ ప్రక్రియలో గ్రీన్ హౌస్ వాయువుల తీవ్రత పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 6.
టెలికం రంగం సేవలను వివరించండి.
జవాబు.
టెలికం రంగం :
టెలిఫోన్, రేడియో, దూరదర్శిని లేదా కంప్యూటర్ నెట్ వర్క్ ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాల సహాయంతో దూర ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేసే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని కలిపి టెలికం రంగం అని పిలుస్తున్నారు.

భారతదేశంలో తెలిఫోన్ సౌకర్యం కల్గి ఉన్నవారి సంఖ్య 2014-15 లో 9,961 లక్షలు ఉండగా 2018-19 నాటికి 11,834 లకు పెరిగింది. అంటే 2014-15, 2018-19ల మధ్య కాలంలో టెలిఫోన్ సౌకర్యం గల వారి సంఖ్యలో 18.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

2019 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశంలో టెలిఫోన్ సౌకర్యం గల వారి సంఖ్య 11,943 లక్షలు. అందులో 5,147 లక్షలు గ్రామీణ ప్రాంతానిని కాగా మిగతా 6, 796 లక్షలు పట్టణ ప్రాంతాలవి. 2019 సెప్టెంబర్ నాటికి మొత్తం 11,736 లక్షలు వైర్లెస్ కనెక్షన్లు ఉండగా 206 లక్షలు మాత్రమే ల్యాండ్ లైన్ కనెక్షన్లు. మొత్తం కనెక్షన్లలో 98.27 శాతం వైర్లెస్ కనెక్షన్లు కాగా 1.73 శాతం మాత్రమే ల్యాండ్ లైన్ కనెక్షన్లు.

భారతదేశంలో టెలిసాంద్రతను చూసినపుడు 2019 సెప్టెంబర్ నాటికి మొత్తం మీద 90.45 శాతం కాగా గ్రామాలలో ఇది 57.35 శాతంగా, పట్టణాలలో 160.71 శాతంగా ఉంది. ప్రయివేటు రంగం 10,606 లక్షల కనెక్షన్లతో ఉండి 88.81 శాతం వాటాను ఆక్రమించగా 1,336 లక్షల కనెక్షన్లతో ప్రభుత్వం రంగం 11.19 శాతం వాటాకు పరిమితమైంది.

ఇక అంతర్జాల (ఇంటర్నెట్) సౌకర్యాన్ని పరిశీలిస్తే మొత్తం అంతర్జాల సౌకర్యం గల వారి సంఖ్య 2014 లో 2,516 లక్షలు ఉండగా 2019 జూన్ నాటికి 6,653 లక్షలకు పెరిగింది. అందులో 217 లక్షలు వైర్ లైన్లో అంతర్జాల సౌకర్యం కలిగి ఉన్నారు.

మొత్తం అంతర్జాల సౌకర్యాలలో బ్రాడ్ బాండ్ సౌకర్యం గల వారి సంఖ్య 2014 లో 610 లక్షలు ఉండగా 2019 జూన్ నాటికి 5,946 లక్షలకు పెరిగింది. దీనితో అంతర్జాల సౌకర్యంలో అంతకు పూర్వం ఎన్నడూ లేనంతగా, వేగం పెరిగి 2019 సంవత్సరంలో 462 లక్షల టెర్రాబైట్స్ (terabytes)కు చేరింది.

టెలికాం రంగ సవాళ్ళు :
దేశంలో ప్రసుత్తం టెలికం రంగంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) లు ప్రభుత్వ రంగంలో ఉండగా ప్రయివేటు రంగంలో మూడు ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు తమ తమ ప్రత్యేక పరిధిలో పనిచేస్తున్నాయి. 2016 నుండి ఈ రంగంలో తీవ్రమయిన పోటీ ఏర్పడి టెలికం సేవల ధరలు తగ్గించబడి, ద్రవ్యపరమైన ఒత్తిడిని ఈ రంగం ఎదుర్కొంటుంది.

ఫలితంగా సంస్థల బలోపేతం కోసం ఒక సంస్థ మరో సంస్థతో కలిసిపోయే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుండగా కొన్ని సంస్థలు ద్రవ్యపరంగా దివాళా తీశామని తెలియజేశాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరలకు టెలికం సేవలు అందుతున్న దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.

మొబైల్ సేనల ద్వారా సగటున ఒక వినియోగదారుని నుంచి పొందే ఆదాయం 2016 జూన్లో రూ. 126గా ఉండగా 2019 జూన్లో అది రూ. 74.30గా ఉంది. BSNL, MTNL లు ధరల నిర్ణయంలో పోటీపడి తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. ఫలితంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.

అందులో ఈ సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి ఉద్యోగుల పై వ్యయాన్ని తగ్గించడం, 4G సేవల పంపిణీ, సంస్థలకున్న భూములు, భవనాలు, టవర్లు, ఫైబర్ ఆస్తులను అమ్మివేసి ద్రవ్యం రూపంలోకి మార్చడం, సార్వభౌమ హామీ పత్రాల ద్వారా రుణాల పునఃనిర్మాణం, సూత్రబద్ధంగా ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన లాంటివి ఉన్నాయి.

టెలికం రంగ అవస్థాపన మరియు సేవలు :
శాటిలైట్ సేవల ద్వారా
i) భారత్ నెట్ :
దేశంలోని 2.5 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్, రేడియో, బహుళ అంతర్జాల (బ్రాడ్ బాంబ్) సేవలను అందుబాటులోకి తేవడానికి భారత్ నెట్ అనే కార్యక్రమం క్రింద డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా బహుళ అంతర్జాల వ్యవస్థలను నిర్మిస్తున్నది.

ii) ప్రజా వైఫై సేవలు :
నూతన మొబైల్ టవర్ల నిర్మాణాలకు బదులు ప్రజా వైఫై హాట్ స్పాట్ కేంద్రాలను నెలకొల్పి ప్రజలకు బహుళ అంతర్జాల సేవలు కల్పిస్తున్నారు.

iii) టవర్లు మరియు మొబైల్ స్టేషన్లు :
2014లో మొబైల్ ఆధారిత ట్రాన్స్వర్ స్టేషన్లు (BTS) 7.9 లక్షలు ఉండగా 2019 జూలై నాటికి 21.8 లక్షలకు పెరిగాయి. అదే కాలంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ళ సంఖ్య 7 లక్షల నుండి 14 లక్షలకు పెరిగాయి.

iv) వామ పక్ష తీవ్రవాద ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళిక :
వామపక్ష తీవ్రవాదం ప్రభావంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లోని 2,335 ప్రాంతాలలో చరవాణి (మొబైల్) సేవలను అందించడం కోసం రూ.4,781 కోట్లతో .ప్రత్యేక ప్రణాళికను టెలికాం శాఖ అమలు పరుస్తున్నది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
మనదేశంలో తృతీయ రంగం వృద్ధిని వివరించండి.
జవాబు.
వ్యాపారం, మరమ్మత్తు, ఆతిధ్య సేవలు (హోటళ్ళు), రవాణా (రైలు, రోడ్డు, వాయు, జల రవాణా), సమాచారం గిడ్డంగి, స్థిరాస్తి, వ్యాపారం, విత్తసేవలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వాణిజ్య సేవలు, IT సేవలు, కన్సల్టెన్సీ సేవలు, ప్రభుత్వ పాలన, వైయక్తిక, గృహరంగ సేవలు మొదలగునవి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఉపరంగాలుగా కొనసాగుతుతున్నాయి.

సేవల రంగం వృద్ధి :
నిర్ణీత కాలంలో వస్తు, సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను వృద్ధి అంటారు. ఇక్కడ మనం సేవల రంగంలో వచ్చిన పెరుగుదలను గూర్చి మాట్లాడుతున్నాము. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిమిత కాలపు మందగమనంను వదిలేస్తే జోడించిన స్థూల ఉత్పత్తి విలువ వృద్ధికి సేవల రంగమే 58 శాతం సమకూర్చుతున్నది.

క్రింది పట్టికలో మనం సేవల రంగ వృద్ధి తీరును చూడవచ్చు.

భారతదేశంలో సేవల రంగ వృద్ధి – 2011-12 స్థిర ధరలలో (%):

రంగం 2017 – 18 2018 – 19 2019 – 20 (AE)
వ్యాపారం, హోటళ్ళు, రవాణా, సమాచారం – ప్రసార సంబంధిత సేవలు 7.8 6.9 5.9
ద్రవ్య, రియల్ ఎస్టేట్, వృత్తి పరమైన సేవలు 6.2 7.4 6.4
ప్రభుత్వపాలన, రక్షణ, ఇతర సేవలు 11.9 8.6 9.1
మొత్తం సేవల రంగం 7.5 6.9 7.5

 

వట్టిక ప్రకారం స్థిరమైన ధరలలో 2017-18 నుండి 2019-20 వరకు భారతదేశంలో సేవల రంగం సగటున ప్రతి సంవత్సరం 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. సేవల రంగం 2017-18 లో 7.5 శాతం, 2018-19 లో 6.9 శాతం, 2019 – 20 లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2017-18 లో వ్యాపారం, హోటళ్లు, రవాణా, సమాచారం, ప్రసార సేవలు 7.8 శాతం వృద్ధిని నమోదు చేయగా 2019-20 లో 5.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అదే కాలంలో ద్రవ్య సేవలు, రియల్ ఎస్టేట్, వృత్తిపర సేవల వృద్ధి రేటు 6.2 శాతం నుండి 6.4 శాతం వరకు పెరిగింది. కాగా ప్రభుత్వ సేవలు, రక్షణ మరియు ఇతర సేవలు 2017-18 లో. .11.9 శాతం వృద్ధిని నమోదు చేయగా 2019-20 లో 9.1 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.

ప్రశ్న 2.
సేవల రంగపు ఉపరంగాల పనితీరు, వృద్ధిరేట్లను విశ్లేషించండి.
జవాబు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సేవల రంగం – పనితీరు :
2018-19 లో GVA లో సేవల రంగం వాటా కేంద్రపాలిత ప్రాంతమైన చంఢీఘర్ లో అధికంగా ఉండగా రెండవ స్థానంలో ఢిల్లీ ఉంది. సేవల రంగం వాటాను రాష్ట్రాల వారీగా పరిశీలించినప్పుడు కర్ణాటక ప్రథను స్థానంలో ఉండగా మణిపూర్ రెండవ స్థానంలో ఉంది. తరువాత స్థానాలలో వరుసగా తెలంగాణ, కేరళలు ఉన్నాయి. కాగా సేవల రంగం వాటా సిక్కిం రాష్ట్రంలో అతి తక్కువగా ఉండగా కింది నుండి తరువాత స్థానాలలో గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు చత్తీస్గడ్ వరుసగా ఉన్నాయి.

సేవల రంగం వృద్ధిని పరిశీలించనప్పుడు 2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో 11.2 శాతం అత్యధిక సగటు వార్షిక వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ముందుండగా తరువాత స్థానంలో 10.5 శాతంలో కర్ణాటక, 9.8 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా త్రిపుర రాష్ట్రం 3.0 శాతం సగటు వార్షిక వృద్ధితో చివరి స్థానంలో ఉండగా కింది నుండి తరువాత స్థానంలో 4.4 శాతంలో సిక్కిం, 4.9 శాతంతో నాగాలాండ్ ఉన్నాయి.

భారతదేశ సేవల రంగంలోని ప్రధాన ఉపరంగాల పనితీరు :
భారతదేశ సేవల రంగంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM), విమానయాం, టెలికం, పర్యాటక రంగం, సముద్ర రవాణా (షిప్పింగ్)లు ఉప-రంగాలుగా ఉన్నాయి.

2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో బి.పి.ఎమ్ సేవల ద్వారా వచ్చిన ఆదాయం 118.6 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి 161.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో బి.పి.ఎమ్ సేవల ఎగుమతుల విలువ 97.7 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి 135.5 మిలియన్ డాలర్లకు చేరింది. ఇదే కాలంలో విమానయానాన్ని పరిశీలించినప్పుడు విమానయానం చేసిన వారి సంఖ్య 115.8 మిలియన్ల నుండి 135.5 మిలియన్లకు పెరిగింది. అందులో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 45.7 మిలియన్ల నుండి 63.9 మిలియన్లకు పెరిగింది.

టెలికం రంగంను చూసినప్పుడు వైర్ లెస్ ఫోన్ చందాదారుల సంఖ్య 969. 9 మిలియన్ల నుండి 1161.8 మిలియన్లకు పెరిగింది. అలాగే వైర్ లెస్ ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 283.3 మిలియన్ల నుండి 615 మిలియన్ లకు పెరిగింది. అంతర్జాతీయ యాత్రికుల సంఖ్య 7.7 మిలియన్లు నుండి 10.6 మిలియన్లకు పెరిగింది.

ఫలితంగా విదేశీ యాత్రికుల ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 19.7 బిలియన్ డాలర్ల నుండి 28.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఓడరేవుల ద్వారా జరిగిన వస్తు రవాణా 581.3 మిలియన్ టన్నుల నుండి 699.1 మిలియన్ టన్నులకు పెరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 3.
భారతదేశ జోడించిన స్థూల ఉత్పత్తి విలువ, ఉద్యోగితలలో సేవల రంగం పాత్రను తెలపండి.
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న 1 చూడుము.

ప్రశ్న 4.
జాతీయ అవస్థాపనా పెట్టుబడి ప్రవాహ కార్యక్రమం 2020-25 అనగానేమి ?
జవాబు.
అవస్థాపన సౌకర్యాలు :
ప్రత్యక్ష ఉత్పత్తి కార్యకలాపాల అభివృద్ధికి దోహదపడే సౌకర్యాలను అవస్థాపన సౌకర్యాలు అంటారు. వాటిలో రవాణా, విద్యుత్తు, నీరు, సమాచారం మొదలైన వాటిని ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అని విద్య, వైద్య సౌకర్యాలను సాంఘిక అవస్థాపన సౌకర్యాలు అని అంటారు.

అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడి ఆర్థిక వృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తుంది. విద్యుత్తు కొరత అధిక వ్యయ విద్యుత్తు సరఫరాకు కారణమై ఉత్పత్తిలో అధిక వ్యయాలకు దారి తీస్తుంది. ఫలితంగా పోటీని ఇవ్వలేని స్థితి వస్తుంది.

రవాణా సౌకర్యాల కొరత వలన ముడిపదార్థాల సప్లయ్, పూర్తిగా తయారైన వస్తూత్పత్తిని మార్కెట్ కు తరలించడం కష్టతరమవుతుంది. ఫలితంగా రైతులు తమ గిట్టుబాటు ధరలు పొందలేరు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలు వృద్ధి ప్రతిఫలాలను పొందలేక తక్కువ స్థాయి ఆదాయంతో ఉండి పోయే అవకాశం ఉంటుంది.

అందువలన సమ్మిళిత వృద్ధి సాధనకు కూడా తగినంత అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి అవసరం. అవస్థాపన రంగంలో పెట్టుబడులు పెంపు నిరంతరం కొనసాగడం కోసం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం “జాతీయ అవస్థాపన సౌకర్యాల పెట్టుబడి ప్రవాహ కార్యక్రమం, 2020-25” ను ఆరంభించింది.

జాతీయ అవస్థాపన పెట్టుబడి ప్రవాహ కార్యక్రమం 2020-2025 (National Infrastructure Pipeline):
ఆర్థిక వృద్ధికి అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడి తప్పనిసరి. భారతదేశం 2024-25 సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తిని కలిగి ఉండాలంటే ఈ కాలంలో 1.4 ట్రిలియన్ డాలర్ల (రూ. లక్ష కోట్లు) పెట్టుబడిని అవస్థాపనా రంగంలో చేయాలి. ప్రతి సంవత్సరం అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడిని పెంచి ఆర్థికాభివృద్ధి అడ్డంకులను తొలగించుకోవాలి.

అందుకోసం తగిన పథకాలను రూపొందించి అమలు పరచాలి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం జాతీయ అవస్థాపన సౌకర్యాలలో పెట్టుబడి ప్రవాహం (NIP) ను రూపొందించడానికి 2019 సెప్టెంబర్ లో వివిధ మంత్రిత్వ శాఖలతో టాస్క్ పోర్సు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

NIP, 2020-2025 సంవత్సరాల మధ్య కాలానికి భారతదేశంలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడి అవసరాన్ని గుర్తించింది. ఈ పెట్టుబడిలో కేంద్రం 39 శాతం, రాష్ట్రం 39 శాతం, ప్రయివేటు రంగం 22 శాతం చేయవలసి ఉంటుంది.

భారతదేశంలో ఇలాంటి అవస్థాపన కార్యక్రమం మొదటిసారి రూపొందించబడింది. అయితే ఈ కార్యక్రమాన్ని అమలు పరచడం NIP కి ఒక సవాలు లాంటిది. ఆకర్షణీయ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకులు, విత్త సంస్థలు, స్వదేశీ, విదేశీ ప్రయివేటు పెట్టుబడిదారుల నుండి NIP పెట్టుబడిని ఆకర్షించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 5.
పునఃస్థాపిత ఇంధన వనరులు ఏవి ?
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న 5 చూడుము.

ప్రశ్న 6.
అంతరించిపోయే ఇందన వనరుల ఆధారాలు ఏవి ?
జవాబు.
వ్యాసరూప సమాధాన ప్రశ్న 5 చూడుము.

ప్రశ్న 7.
భారతదేశంలో బాంకింగ్ వ్యవస్థ నిర్మాణాన్ని విశదీకరించండి.
జవాబు.
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ :
వ్యవస్థీకృత భారత బ్యాంకింగ్ వ్యవస్థ (organised banking sector) అంతర్భాగాలు :

  1. భారతీయ రిజర్వ్ బ్యాంకు
  2. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
  3. షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు.

బ్యాంకింగ్ వ్యవస్థలో శిఖరాగ్ర బ్యాంకు (apex bank) కేంద్ర బ్యాంకు, షెడ్యూల్డ్ బ్యాంకులు రూ. 5 లక్షలు చెల్లించిన మూలధనంతో కేంద్ర బ్యాంకు రెండవ అధికార సూచిక (second schedule) లో చేర్చబడిన బాంకులు.

వాణిజ్య బ్యాంకులు లాభార్జన లక్ష్యంతో ద్రవ్య వ్యాపారం చేస్తాయి. డిపాజిటర్ల శ్రేయస్సుకి భంగం కలగకుండా పెట్టుబడులు చేస్తాయి. సహకార బ్యాంకులు సభ్యుల సౌలభ్యం లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తాయి. ప్రజల, సంస్థల పొదుపును వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లుగా సేకరిస్తాయి. సేకరించిన పొదుపును స్వల్ప కాల ఋణాలుగా మంజూరు చేస్తాయి. మన దేశంలో వాణిజ్య బ్యాంకులన్నింటిని ప్రయివేటు రంగం స్థాపించింది. 1969, 1980 సంవత్సరాలలో గరిష్ట డిపాజిట్లు గల 20 బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (Regional Rural Banks-RRBs) 1975లో స్థాపించారు. ఈ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులన్నిటినీ నిర్వహిస్తాయి. కాని ఈ బ్యాంకుల కార్యకలాపాల పరిధి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సేకరించి చిన్న, ఉపాంత వ్యవసాయదార్లకు, వ్యవసాయ కూలీలకు, గ్రామీణ కుటీర పరిశ్రమలకు ఋణాలను అందిస్తాయి.

సహకార బ్యాంకుల వ్యవస్థలో రాష్ట్ర సహకార బ్యాంకుల అధ్వర్యంలో జిల్లా సహకార బ్యాంకులు విధులను నిర్వహిస్తాయి. జిల్లా సహకార బ్యాంకుల అధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామ ప్రాథమిక సహకార సంఘాలు (Primary Co-operative societ- ies) పనిచేస్తాయి.

2. భారతీయ రిజర్వ్ బ్యాంకు (Reserve Bank of India-RBI) :
భారతీయ రిజర్వు బ్యాంకు 1936 సంవత్సరంలో స్థాపించబడి 1949లో జాతీయం చేయబడినది. భారతీయు రిజర్వ్ బ్యాంకు (RBI) మన కేంద్ర బ్యాంకు.

కరెన్సీ నోట్లు జారీ చేయడం, ప్రభుత్వానికి బ్యాంకరు, ఏజెంటు, సలహాదారుగా వ్యవహరించడం, విదేశీ మారక ద్రవ్య నిధులు, బంగారం నిల్వల పరిరక్షణ, బ్యాంకులకు బ్యాంకరుగా, అంతిమ రుణదాతగా ద్రవ్య సహాయం అందించడం, చెక్కుల క్లియరింగ్ సేవలందించడం, పరపతి నియంత్రణ, మారకం రేటు నియంత్రణ వంటి విధులతో బాటు కేంద్ర బ్యాంకు ఆర్థికాభివృద్ధి, సాంఘిక సంక్షేమాన్ని పెంపొందించే అనేక ఇతర విధులు కూడా నిర్వహిస్తుంది. ద్రవ్యోల్బణ నివారణకు రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకొంటుంది.

3. వాణిజ్య బ్యాంకులు (Commercial Banks) :
1950-51 భారతదేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకుల సంఖ్య 430. 2007 లో అవి 172గా ఉండగా అందులో 27 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. భారతీయ రాష్ట్ర బ్యాంకు (SBI) 6 అనుబంధ బ్యాంకులతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా ఉండింది.

2017 ఏప్రిల్ 1న SBI తనకు అనుబంధంగా ఉన్న అయిదు బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకుంది. 2020 ఏప్రిల్ 1న 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చారు.

వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి, రుణాలను ఇవ్వటం. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని రిజర్వుబ్యాంకు దగ్గర నిల్వగా ఉంచుతాయి. నిల్వను మినహాయించి ఉన్న డిపాజిట్లను రుణాలుగా ఇస్తాయి. ఈ ప్రక్రియలో వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి చేస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 8.
జీవిత భీమా సంస్థ (LIC) ప్రధాన లక్ష్యాలు ఏవి ?
జవాబు.
జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India- LIC) : జీవిత బీమా సంస్థ ధ్యేయం ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన పొదుపును ప్రోత్సహించడం. జీవిత బీమా సంస్థ లక్ష్యం. ఇతర పొదుపు పథకాల కంటే లాభదాయకంగా ఉండి మార్కెట్ పోటీ తట్టుకొనే పథకాలను, పాలసీలను, స్కీములను బీమాదార్లకు అందించడం, ఈ లక్ష్యంతో పాటుగా ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడం.

జీవిత బీమా సంస్థ విక్రయించే పాలసీలు, వ్యక్తులు వారి కుటుంబాలకు హఠాత్తుగా సంభవించే ఆపదలకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. జీవిత బీమా సంస్థ అందించే కొన్ని పథకాలు: జీవిత బీమా, ఆరోగ్య బీమా, గ్రూప్ ఇస్సూరెన్సు, చిల్డ్రన్స్ గ్రోత్ ఫండ్, యూనిట్ లిండీ ఇస్సూరెన్సు మొదలైనవి.

జీవిత బీమా సంస్థ ముఖ్య లక్ష్యాలు :

  1. జీవిత బీమా సదుపాయాన్ని గ్రామీణ ప్రజలకు, సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వాయిదా చెల్లింపులను (premium) నిర్ణయించడం.
  2. బీమాతో కూడిన పొదుపును గరిష్టం చేయడం.
  3. బీమా పాలసీదార్లకు భద్రత, గరిష్ట బోనస్ లను అందించడం,
  4. ఆర్థికాభివృద్ధి, సోమాజిక ప్రయోజనం చేకూర్చే విధంగా బీమా చేసిన వ్యక్తుల పొదుపు మొత్తాలను పెట్టుబడి’ చేయడం.
  5. పెట్టుబడి చేసిన వారి ద్రవ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడటం.

ప్రశ్న 9.
అంతరిక్ష రంగం యొక్క ప్రాధాన్యతను మదింపు చేయండి.
జవాబు.
అంతరిక్ష రంగం :
అంతరిక్ష పరిశోధన కోసం ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడి చేస్తున్నాయి. భారతదేశం కూడా ఈ ప్రస్థానంలో ఉంది.

ఇండియా అంతరిక్ష వాహక నౌకల రూపకల్పన, అభివృద్ధి, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ రూపకల్పన, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, భూగోళ పరిశీలన సంబంధిత సాంకేతిక పరిజ్ఞాసం, టెలి కమ్యూనికేషన్లు, బహుళ అంతర్జాలం, నావిగేషన్, వాతావరణ శాస్త్ర సాంకేతికత, అంతరిక్ష సంబంధిత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిశోధన శాస్త్రం, వివిధ గ్రహాల పరిజ్ఞానం అన్వేషణ మొదలైన వాటిపై చేసే వ్యయం అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం చేసే వ్యయంలో భాగం.

2018 లో ఇండియా అంతరిక్ష కార్యక్రమాలపై 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. అయితే ఈ మొత్తం అదే సంవత్సరంలో అమెరికా చేసిన 19.5 బిలియన్ డాలర్లు, చైనా చేసిన 11 బిలియన్ డాలర్లు, రష్యా చేసిన 3.3 బిలియన్ డాలర్ల కంటే చాలా తక్కువ.

ఇండియా అంతరిక్ష రంగ కార్యక్రమాలలో ప్రముఖమైనవి :

  1. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (INSAT) వ్యవస్థ జీసాట్ (జియో సింక్రోనస్ శాటిలైట్) వ్యవస్థ సహాయంతో సమాచారం. దీని ద్వారా టెలి కమ్యూనికేషన్లు, ప్రసార వ్యవస్థ, బహుళ అంతర్జాల వ్యవస్థ మొదలైనవి ప్రయోజనం పొందుతాయి.
  2. అంతరిక్ష ఆధారిత సమాచారం ఆధారంగా భూగోళంను పరిశీలిస్తూ చేసే వాతావరణ సమాచారం, విపత్తుల నిర్వహణ, జాతీయ వనరుల చిత్రణ, పాలన,
  3.  శాటిలైట్ ఆధారంగా గగన్ (GAGAN), నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్-NAVIC) లాంటి నావిగేషన్. గగన్ కార్యక్రమంను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారతీయ విమానాశ్రయాల సంస్థ (AAI)లు ఉమ్మడిగా నిర్వహిస్తాయి.

గగన్ ద్వారా జీపీఎస్ (GPS) ఆధారంతో పౌర విమానయానపు దారి ఖచ్చితత్వం, సమగ్రత విమానాల ట్రాఫిక్ మొదలగు వాటి అంతరిక్ష పాలనను మరింత సమర్థవంతంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నావిక్ కార్యక్రమం ద్వారా కూడా విమానాల స్థానం, సమయానికి సంబంధించిన పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష రంగంలో నిరంతరం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు, ప్రవేటు రంగాల అంతరిక్ష కార్యక్రమాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు అంతరిక్ష పరిజ్ఞానాలను జాతీయ అవసరాలు దేశ భద్రతకు వినియోగిస్తుంటే ప్రయివేటు రంగం అంతరిక్షంలో దొరికే పదార్థాలపై దృష్టి పెట్టింది.

ఇస్రో కూడా ప్రయివేటు పెట్టుబడిని అంతరిక్ష రంగంలోకి ఆకర్షించడానికి కొన్ని రంగాలను గుర్తించింది. అవి :

  1. పి.ఎస్.ఎల్.వి. (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) (PSLV)
  2. శాటిలైట్ నిర్మాణ ప్రక్రియ, అసెంబ్లింగ్ ;
  3. వివిధ కూర్పులతో కూడిన ముడి పరికరాల తయారీ
  4. ఘన, ద్రవ, క్రయోజనిక్, సెమి-క్రియోజనిక్ చోధకాలు (ప్రొపెల్లాంట్స్) ఉత్పత్తి,
  5. ఎలక్ట్రానిక్ ప్యాకేజీలు, విమానాలు, శాటిలైట్ ఉప-వ్యవస్థల సాంకేతిక పరికరాల పరీక్ష, నిర్వహణ.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
తృతీయ రంగం
జవాబు.
ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలను అందించే సేవల రంగం. దీనినే సేవరంగమని అంటారు. అవస్థాపన సౌకర్యాలైన శక్తి, రవాణా, సమాచారం, బ్యాంకింగ్, బీమా మొదలైనవి ఈ రంగం క్రిందకు వస్తాయి.

ప్రశ్న 2.
అవస్థాపన.
జవాబు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సాగునీరు, శక్తి, రవాణా, గిడ్డంగి, మార్కెట్ సౌకర్యాలు, పరిశ్రమ, రవాణా సమాచారం, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ॥ సౌకర్యాలు అవస్థాపనా రంగం అందిస్తుంది. ప్రాథమిక, ద్వితీయ రంగాల అభివృద్ధి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై ఆధారపడుతుంది. ఇది రెండు రకాలు. 1. ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు, 2. సాంఘీక అవస్థాపన సౌకర్యాలు.

ప్రశ్న 3.
జలరవాణా.
జవాబు.
అధిక పరిమాణం, బరువుగల సరుకులను రవాణా చేయడంతో జలరవాణా దోహదపడుతుంది. ఇది రెండు రకాలు

  • దేశీయ జల రవాణా
  • అంతర్జాతీయ జలరవాణా.

అంతర్జాతీయ నౌక రవాణా మరల రెండు రకాలు :

  • కోస్టల్ షిప్పింగ్
  • ఓవర్సీస్ షిప్పింగ్.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 4.
ఇంధన వనరులు.
జవాబు.
వేడిచేసే ప్రక్రియలో గాని, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో గాని, శక్తి పూర్పిడి ప్రక్రియలో గాని నీటి వినియోగం పడుతున్న అన్ని రకాల ఇంధనాలను ఇంధన వనరుల మూలాధారాలు లేదా ఇంధన వనరులు అనవచ్చు. నీటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :
a) పునఃస్థాపిత ఇంధన వనరులు, అంతరించిపోయే ఇంధన వనరులు
b) సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన వనరులు.

ప్రశ్న 5.
శిలాజ ఇంధనాలు.
జవాబు.
జంతువుల, వృక్షాల అవశేషాలు రూపాంతరం పొందే శిలాజం నుంచి వచ్చే ఇంధనాలు శిలాజ ఇంధనాలు. వీటిని మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు. శిలాజ ఇంధనాలు ప్రధానంగా కార్బన్ నుంచి తయారు అవుతాయి. వీటినే అంతరించిపోయే ఇంధన వనరులుగా చెప్పవచ్చు.

ప్రశ్న 6.
భారత్ నెట్
జవాబు.
దేశంలోని 2.5 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్, రేడియో, శాటిలైట్ సేవల ద్వారా దిహుక అంతర్జాల (బ్రాడ్ బాంబ్) . సేవలను అందుబాటులోకి తేవడానికి భారత్ నెట్ అనే కార్యక్రమం క్రింద డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా బహుళ అంతర్జాల వ్యవస్థలను నిర్మిస్తున్నది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 7.
వాణిజ్య బ్యాంకులు
జవాబు.
ప్రజల నుంచి, సంస్థల నుండి పొదుపును, డిపాజిట్లుగా స్వీకరించడం, స్వీకరించిన డిపాజిట్లలో అధిక భాగం రుణాలుగా మంజూరు చేయడం వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులు. మనదేశంలో 172 వాణిజ్య బ్యాంకులున్నాయి. అందులో 27 ప్రభుత్వ రంగంలో 145, ప్రైవేటు రంగంలో ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద పబ్లిక్ వాణిజ్య బ్యాంకు S.B.I ప్రైవేటు బ్యాంకు ICICI బ్యాంకు.

ప్రశ్న 8.
IRDA.
జవాబు.
దీనిని 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ చట్టం ప్రవేశ పెట్టారు. ఆర్థిక సంస్కరణలో భాగంగా బీమా రంగంలో కార్పొరేట్ విదేశీ సంస్థలను అనుమతించాలని నిర్ణయించారు. 2000 సం॥లో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి క్రమబద్ధీకరణ, పునఃభీమా సదుపాయాలు కల్పించే అధికారం ఇచ్చింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 7 తృతీయ రంగం

ప్రశ్న 9.
సాధారణ భీమా సంస్థ.
జవాబు.
G.I.C దీనిని 1973 సం॥లో ప్రారంభించారు. ఇది అన్ని ప్రమాదాలు, వరదలు, సముద్ర ప్రయాణాలు, విమానయానం, విదేశీ ప్రయాణాలు రోడ్డు ప్రమాదాలు, పంటల నష్టాలకు బీమా సదుపాయాన్ని అందిస్తాయి.

Leave a Comment