TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
ఆర్థికాభివృద్ధికి (Economic Development) మరియు జనన మరణాల రేట్లకు సంబంధాన్ని బట్టి జనాభా పరిణామ సిద్ధాంతంలోని మూడు దశలు ప్రతి దేశంలో ఉంటాయి.

మొదటి దశ :
ఈ దశలో జనన, మరణాల రేట్లు అధికంగా ఉంటాయి. అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు రెండూ కూడా దాదాపుగా సమానంగా వుంటాయి. కావున జనాభా దాదాపుగా స్తబ్ధంగా వుంటుంది. ఈ దశలో వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థలో సరైన ఆహారం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, అధిక జీవన ప్రమాణస్థాయి, తగినటువంటి గృహసదుపాయం, విద్యావకాశాలు లేకపోవడం వల్ల అశాస్త్రీయ మరియు అహేతుబద్ధ దృక్పథం వల్ల మరణాల రేట్లు అధికంగా వుంటాయి.

అంతేకాకుండా విద్యలేనందువల్ల మూఢనమ్మకాలు, కుటుంబ పరిమాణం, బాల్య వివాహాల విషయంలో ప్రజల సాంఘిక ఆచారాలు, కట్టుబాట్లు మొదలైన కారణాలవల్ల ఈ దశలో జననాల రేట్లు కూడా అధికంగానే వుంటాయి. కుటుంబ నియంత్రణ పట్ల ప్రజలు ఉదాసీనంగా వుంటారు. ఈ దశలో అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు సమానంగా వుంటాయి. కాబట్టి జనాభా వృద్ధిరేటు అధికంగా వుండదు. 1921కి పూర్వం భారతదేశంలో ఈ దశ వుంది.

రెండవ దశ :
ఈ దశలో మరణాలరేటు గణనీయంగా తగ్గుతుంది. అయితే దీనికి అనుగుణంగా జననాల రేటు మాత్రం బాగా తగ్గదు. అభివృద్ధి ప్రక్రియ ప్రారంభంవల్ల జీవన ప్రమాణం, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు పెరుగుతాయి. ప్రభుత్వం అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల మరణాల రేటు తగ్గుతుంది. అయితే వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ అయినందువల్ల, ప్రజలందరికీ విద్య లేనందువల్ల కుటుంబ పరిమాణం విషయంలో ప్రజల దృక్పథంలో విప్లవాత్మక మార్పు రాదు.

అందుకే జననాలరేటు అధికంగా ఉంటుంది. అధిక జననాల రేటు, బాగా తగ్గుతున్న మరణాలరేటు రెండూ అధిక జనాభా వృద్ధిరేటుకు దారితీస్తుంటాయి. ఈ దశలో జనాభా వృద్ధిరేటు అత్యధికంగా వుంటుంది. దీనినే ఆర్థికవేత్తలు “జనాభా విస్ఫోటనం” అని అంటారు. 1951-91 మధ్యకాలంలో భారతదేశం ఈ పరిస్థితిని ఎదుర్కొంది.

మూడవ దశ :
ఆర్థికాభివృద్ధి వేగవంతం అయినందువల్ల ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. పారిశ్రామికీకరణ పెరగడంవల్ల నగరీకరణ కూడా అధికమవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో పిల్లలను ఆస్తిగా కాక భారంగా ప్రజలు ఊహించుకుంటున్నారు. చిన్న కుటుంబాల వల్ల స్త్రీలు వారి ఆర్థిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమనుకొంటారు.

పారిశ్రామికీకరణ ఫలితంగా కుటుంబ పరిమాణం పట్ల ప్రజల దృక్పథం మారడమేకాక చిన్న కుటుంబం వల్ల వుండే ప్రయోజనాలను గుర్తిస్తారు. ప్రజలు సక్రమ దిశలో ఆలోచించటానికి విద్య తోడ్పడుతుంది. కాబట్టి జననాలరేటు గణనీయంగా తగ్గుతుంది. అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు, చిన్న కుటుంబం, అల్ప జనాభా వృద్ధిరేటు అనేవి ఈ మూడవ దశ లక్షణాలు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 1

అధిక జనన, మరణాల రేట్లు వుండే ఆర్థిక వ్యవస్థ అల్ప జనన మరణాల రేట్లు వుండే స్థితికి మారడాన్ని ఈ మూడు దశలు వివరిస్తాయి. రెండవ దశను “జనాభా విస్ఫోటనంగా పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఈ దశ సంక్లిష్టతరమైంది. పటంలో క్షితిజ అక్షరం (OX) పైన కాలాన్ని ఊర్థ్వ (OY), అక్షంపైన 1,000 జనాభాకు వార్షిక జనన మరణాల రేట్లను కొలుస్తున్నాం.

O నుంచి T వరకు వున్న మొదటి దశలో జనన మరణాల రేట్లు అధికంగాను, జనాభావృద్ధి రేటు అత్యంత అల్పంగా వుంటాయి. T నుంచి T1 వరకు వున్న రెండవ దశలో మరణాలరేటు క్షీణిస్తున్నప్పటికీ, జననాలరేటు అధికంగా వుంటున్నందువల్ల జనాభా వృద్ధిరేటు అధికంగా వుండి “జనాభా విస్ఫోటనం” ఏర్పడుతుంది. T1 తర్వాత మూడవ దశలో జనన మరణాల రేట్లు రెండూ తగ్గుతున్నందువల్ల కూడా జనాభా వృద్ధిరేటు తక్కువగా వుండి జనాభా నెమ్మదిగా పెరుగుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 2.
భారదేశంలోని జనాభా పెరుగుదల ధోరణులను పరిశీలించండి.
జవాబు.
ప్రపంచ భూమి వైశాల్యంలో భారతదేశం 2.4% వాటాను కలిగి ఉంటే ప్రపంచ జనాభాలో 17.5% వాటాను కలిగి ఉంది. జనాభా పరిమాణం విషయంలో చైనా తరువాత భారతదేశం రెండవ స్థానాన్ని పొందింది. ప్రపంచ ఆదాయంలో భారతదేశ జాతీయాదాయం 1.2% కంటే తక్కువ. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 236 మిలియన్లు ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 1210 మిలియన్లు.

మొదటి 30 సంవత్సరాలలో (1891-1921) భారతదేశ జనాభా 1891లో 236 మిలియన్ల నుంచి 1921లో 251 మిలియన్లకు పెరిగింది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు సగటున సంవత్సరానికి 0.9% నమోదు అయ్యింది. జననాల రేటు అధికంగా ఉన్నప్పటికీ, అధిక మరణాల రేటు వల్ల జనాభా వృద్ధి రేటు నిరోధించబడింది. 1891 నుంచి 1921 వరకు భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని మొదటి దశలో ఉంది. ఈ కాలంలో జనాభా స్తబ్ధంగా ఉంది.

రెండవ 30 సంవత్సరాల కాలంలో (1921-1951) 1921లో భారతదేశ జనాభా 251 మిలియన్ల నుంచి 1951లో 361 మిలియన్లకు పెరిగింది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు సగటున సంవత్సరానికి 1.22%. దీనిని ఒక మోస్తరు వృద్ధి రేటుగా పరిగణించాం. దీనికి కారణం మరణాల రేటు 1000 49 నుంచి 1000 కి 27 వరకు బాగా తగ్గడం మరియు జననాల రేటు 1000కి -49 నుంచి 1000 కి 40 వరకు అల్పంగా తగ్గడమే.

1921 నుంచి 1951 వరకు భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలో ఉంది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు అల్పంగా ఉన్నప్పటికీ క్రమంగా పెరిగింది. 1921లో జనాభా తగ్గినందువల్ల 1921 సంవత్సరాన్ని జనాభా విభాజిక సంవత్సరంగా పరిగణిస్తున్నాం. అప్పటి నుంచి జనాభా వృద్ధి రేటు క్రమేణా పెరగడం జరిగింది.

1950 నుంచి 1981 వరకు ఉన్న 30 సంవత్సరాల కాలంలో 1951లో 361 మిలియన్లగా ఉన్న జనాభా 1981నాటికి 683 మిలియన్లకు పెరిగింది. జనాభా వార్షిక సగటు వృద్ధి రేటు 2.14%. ఇది ఇంతకు పూర్వం 30 సంవత్సరాల కాలంలోని వార్షిక సగటు వృద్ధి రేటు కంటే సుమారుగా రెట్టింపు. ప్రణాళికల అమలువల్ల మరణాలను తగ్గించే అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. ఫలితంగా మరణాల రేటు బాగా తగ్గి 15కి చేరింది. కాని జననాల రేటు మాత్రం 40 నుంచి 37కి మాత్రమే తగ్గింది. కాబట్టి ఈ కాలంలో జనాభా విస్ఫోటనం ఏర్పడింది.

1981 నుంచి 2011 వరకు ఉన్న 30 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా 683 మిలియన్ల నుంచి 1,210 మిలియన్లకు పెరిగి 77% జనాభా పెరుగుదల నమోదయింది. ఫలితంగా, భారతదేశం ప్రస్తుతం జనాభా పరిణామ సిద్ధాంతంలోని 2వ దశలోనే ఉన్నప్పటికీ, ఈ సిద్ధాంతంలోని 3వ దశలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా వేగంగా పెరగడానికి గల కారణాలు ఏమిటి ?
జవాబు.
అధిక జననాల రేటు, అల్ప మరణాల రేటు : ఒక దేశ జనాభా వేగంగా పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవి:

  1. అధిక జననాల రేటు,
  2. సాపేక్ష అల్ప మరణాల రేటు,
  3. వలసరావడం.

భారతదేశ జనాభా వృద్ధిపై వలసరావడం ప్రభావం ఏమీ లేదు. మరణాల రేటు క్రమేణా తగ్గుతున్నా, జననాల రేటు అధికంగా ఉన్నందువల్ల భారతదేశంలో జనాభా వేగంగా పెరిగి జనాభా విస్ఫోటనానికి దారి తీసింది.

ఎ) మరణాల రేటు తగ్గుదలకు కారణాలు :
1. క్షామాలను (Famines) నివారించడం :
భారతదేశంలో బ్రిటీష్ పాలనా కాలంలో తరచుగా కరువు కాటకాలు ఏర్పడటం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉండేది. స్వాతంత్ర్యం పొందిన తరువాత కరువు కాటకాలు భారీ స్థాయిలో రాకపోవడం, కరువుల వల్ల ఏర్పడిన సమస్యల నివారణకు అనేక చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితులు బాగా మెరుగయ్యాయి.

2. రోగాల నియంత్రణ :
స్వాతంత్ర్యానికి పూర్వం కలరా, మశూచి, మలేరియా వ్యాధులు భారీ మరణాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం మశూచిని పూర్తిగా నివారించడం, కలరా, మలేరియా వ్యాధులు బాగా నియంత్రణలో ఉండటం జరిగింది. క్షయ కొంతవరకు తగ్గినప్పటికీ భారతదేశంలో ఇదే అధిక మరణాలకు కారణంగా ఉంది.

3. ఇతర కారణాలు :
తాగునీటి సరఫరా, పరిశుభ్రత, ఆరోగ్యం, విద్యావ్యాప్తి, వైద్య సౌకర్యాల విస్తరణ, రోగ నిరోధక శక్తి మెరుగవ్వడం, పేదరిక నిర్మూలనా పథకాలు, జీవన ప్రమాణాల పెంపుదల లాంటి అంశాల ప్రభావం కూడా మరణాల రేటుపై ఉంటుంది.

బి) అధిక జననాల రేటుకు కారణాలు :

I. ఆర్థిక కారణాలు :

1. వ్యవసాయం అధిక ప్రాధాన్యతను కలిగి ఉండటం :
వ్యవసాయ సంబంధిత సమాజంలో పిల్లలను ఆర్థిక భారంగా పరిగణించలేదు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కార్యక్రమాలు ఉధృతంగా ఉన్న కాలంలో శ్రామికులు అధికంగా అవసరం. అందుకే వ్యవసాయ ప్రాధాన్యత గల భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుటుంబాలు ఉంటున్నాయి.

2. నగరీకరణ :
భారతదేశంలో పారిశ్రామికీకరణ నిర్విరామంగా, వేగంగా జరగకపోవడం వల్ల నగరీకరణ ప్రక్రియ కూడా నెమ్మదిగా ఉంది. మన దేశంలో జరిగిన నగరీకరణ జననాల రేటును తగ్గించే సాంఘిక మార్పును తీసుకురాలేదు.

3. పేదరికం :
అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం కారణంగా జననాల రేటు అధికంగా ఉంది. పేదవారికి తమ శ్రమ తప్ప ఇతర ఆర్థిక ఆస్తులు ఏమీ లేవు. కాబట్టి కుటుంబంలో ఎక్కువ మంది ఆర్జించే వాళ్ళు ఉంటే కుటుంబ ఆర్జనలు ఎక్కువ అని భావిస్తారు. పుట్టిన శిశువులు జీవించే అవకాశం తక్కువగా ఉంటే కూడా ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రాధాన్యత ఉంటుంది. పేద వర్గాల వారు కుటుంబ నియంత్రణ పథకాలను అంగీకరించకపోవడానికి పేదరికం ముఖ్య కారణం.

II. సాంఘిక కారణాలు :
వివాహానికి సర్వజన అంగీకారం (universality) ఉండటం, తక్కువ వయస్సులో వివాహం, మతపరమైన, సాంఘిక మూఢ నమ్మకాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, విద్యారాహిత్యం, గర్భ నిరోధక పద్ధతులను పరిమితంగా ఉపయోగించడం మొదలైన కొన్ని సాంఘిక కారణాల వల్ల జననాల రేటు తగ్గుదల స్థాయి ప్రభావితం అవుతుంది. అనగా పై కారణాల వల్ల జననాల రేటు ఆశించిన స్థాయికి తగ్గకపోవచ్చు.

1. వివాహానికి సర్వజన అంగీకారం :
వివాహం మతపరంగా, సామాజికంగా తప్పనిసరి. విద్యావ్యాప్తి వల్ల వివాహం పట్ల ప్రజల దృక్పథం మారి తక్కువ వయస్సులో వివాహం చేసుకోవద్దనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అయితే విద్యావ్యాప్తి వేగంగా జరగకుండా, నెమ్మదిగా మారుతున్న సమాజంలో ఈ ఫలితాన్ని ఆశించలేము.

2. తక్కువ వయస్సులో వివాహం :
తక్కువ వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది. భారతదేశంలో 2001లో సగటు వివాహ వయస్సు స్త్రీలకు 18.3 సంవత్సరాలు ఉంటే పురుషులకు 22.6 సంవత్సరాలుగా ఉంది. సగటు వివాహ వయస్సు పెరగడానికి, సామాజిక స్పృహ, విద్యావ్యాప్తి తోడ్పడతాయి. వివాహ వయస్సు అధికంగా ఉంటే ప్రసూతి రేటు తగ్గి జననాల రేటు కూడా తగ్గుతుంది.

3. మతపరమైన సాంఘిక మూఢ నమ్మకాలు :
మతపరమైన సాంఘిక మూఢ నమ్మకాల వల్ల ఎక్కువ మంది ప్రజలు తమ ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లలను కనడానికి ప్రాధాన్యతను ఇస్తారు.

4. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ :
యుక్త వయస్సులోని భార్యాభర్తలకు తమ పిల్లలను పోషించే ఆర్థిక స్థోమత లేకపోయినా వీరు పిల్లల్ని కనడాన్ని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వీరి ఆర్థిక భారాన్ని ఆదాయాన్ని ఆర్జించే కుటుంబ సభ్యులు భరిస్తారు. అయితే ఈ వ్యవస్థ క్రమేణా విచ్ఛిన్నం అవ్వడం జరిగింది.

5. విద్యా రాహిత్యం :
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు 74% స్త్రీల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. పురుష అక్షరాస్యత 82.14% ఉంటే స్త్రీల అక్షరాస్యత 65.46% గా ఉంది. కుటుంబం, వివాహం, పిల్లల జననాల విషయంలో .ప్రజల దృక్పథం కేవలం విద్యతోనే మారుతుంది. విద్యకు, ప్రసూతి రేటుకు మధ్య విలోమ సంబంధం ఉంది.

గర్భ నిరోధక పద్ధతులను (Contraceptives) పరిమితంగా ఉపయోగించడం :
ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆలోచనను కొనసాగిస్తున్నా, గర్భ నిరోధక పద్ధతులను అందుబాటులో ఉంచినా, విద్యా రాహిత్యం వల్ల, మూఢనమ్మకాల వల్ల కొన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన ప్రోత్సాహకరంగా లేదు. విద్యావ్యాప్తి బాగా జరిగినట్లయితే ప్రజలు తప్పకుండా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 4.
జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి గల చర్యలు ఏమిటి ?
జవాబు.
భారతదేశపు ప్రస్తుత జనాభా ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉంది. అయితే కొందరు జనాభా వృద్ధి ఆటంకం కాదని వాదిస్తున్నారు. జనాభా చాలా నెమ్మదిగా పెరగడం చాలా మంచిదని అందరూ అంగీకరించారు. జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కోవడానికి మూడు రకాల చర్యలు అవసరం. అవి : ఆర్థిక చర్యలు, సాంఘిక చర్యలు, కుటుంబ నియంత్రణ పథకం.

I. ఆర్థిక చర్యలు :

1. పారిశ్రామిక రంగ విస్తరణ :
ఉద్యోగాలను పొందటంలో ఉన్న సమస్యలు పారిశ్రామిక శ్రామికులకు తెలుసు కాబట్టి కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు. జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవడానికి కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవలసిన అవససరాన్ని వీరు గుర్తిస్తారు. కాబట్టి పారిశ్రామికీకరణ వేగవంతం కావల్సిన అవసరం ఉంది.

2. ఉద్యోగావకాశాల కల్పన :
నగరీకరణ, పారిశ్రామీకీకరణ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పట్టణాలలో, గ్రామాలలో అధిక ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. జనాభా వృద్ధిని అరికట్టడంలో ఇది శక్తివంతమైన నిరోధకంగా పనిచేస్తుంది. నగరాల్లో గృహ సమస్య, పిల్లల పెంపకం సమస్యలు సహజంగానే ప్రజలకు పెద్ద కుటుంబాలు ఉండటాన్ని నిషేధిస్తాయి.

3. సమత్వంతో కూడుకొన్న ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన :
పేద ప్రజలకు కనీస జీవన సదుపాయాలు లభిస్తే ఎక్కువ పిల్లలను పొందే ఆర్థిక నిర్బంధం ఉండదు. కుటుంబ పరిమాణం విషయంలో ప్రజల దృక్పథం కూడా మారుతుంది. ఎంతమంది పిల్లలను కలిగి ఉండాలో ఆలోచించడమేకాక, పిల్లలకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పుల కోసం సమత్వంతో కూడుకొన్న ఆదాయ పంపిణీ, జీవనానికి తగిన వేతనంతో కూడిన పని హక్కు ఉండాలి.

II. సాంఘిక చర్యలు :
జనాభా విస్ఫోటనం ఆర్థిక సమస్యే కాకుండా ఇది సాంఘిక సమస్య కూడా. విస్ఫోటనానికి ఉన్న అనేక కారణాలు సామాజికంగా బలమైనవి. జననాల రేటును తగ్గించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపాలి.

1) విద్య :
కుటుంబం, వివాహం, పిల్లల సంఖ్య విషయానికొస్తే విద్య వ్యక్తి ఆలోచనా సరళిని మారుస్తుంది. విద్యావంతులలో అధికులు వివాహాలు ఆలస్యంగా చేసుకొని చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు. సంప్రదాయాలను, మూఢ నమ్మకాలను విద్య మార్చివేసి ప్రజలను కుటుంబ నియంత్రణ వైపు ప్రేరేపిస్తుంది.

బాల బాలికలు పాఠశాలలకు కళాశాలలకు వెళ్తే వివాహాలు ఆలస్యంగా జరిగి తద్వారా స్త్రీలలో పునరుత్పత్తి కాలం తగ్గుతుంది. స్త్రీల అక్షరాస్యతా రేటును బాగా పెంపొందించాలి. అందుకే జనాభా త్వరిత వృద్ధిని అరికట్టడానికి బాలికల విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి..

2) స్త్రీల హోదా :
భారత రాజ్యాంగం పురుషులకు, స్త్రీలకు సమానత్వాన్ని కల్పించినా, సామాజిక జీవనంలో వివక్షత ఉంది. సామాజికార్థికంగా పురుషుల స్థాయి కంటే స్త్రీల స్థాయి తక్కువగా ఉంది. అయితే స్త్రీలలో విద్య తక్కువ ఉండి వారు కుటుంబ నియంత్రణ పట్ల ఉదాసీనంగా ఉన్నారు. వెనుకబడిన సమాజంలో స్త్రీలకు తమ పిల్లల విషయంలో ఎంపిక అవకాశం లేదు.

3) వివాహ వయస్సు :
ప్రసూతి రేటు స్త్రీల వివాహ వయస్సుపై ఆధారపడుతుంది. కాబట్టి వివాహ వయస్సు పెంచడానికి సాధ్యమయిన ప్రతీ సామాజిక, చట్టపర, విద్యాపర చర్యలను తీసుకోవాలి. భారతదేశంలో సగటు వివాహ వయస్సు తక్కువ. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషుల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలయితే స్త్రీలకు ఇది 15 సంవత్సరాలు. 1978లో ఈ చట్టాన్ని సవరించి కనీస వివాహ వయస్సు పురుషులకు 21 సంవత్సరాలయితే, స్త్రీలకు 18 సంవత్సరాలని నిర్ణయించారు.

III. కుటుంబ నియంత్రణ పథకం :
ప్రపంచ వ్యాప్తంగా జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించే సాధనంగా కుటుంబ నియంత్రణ పథకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించారు. ఉదాహరణకు, చైనాలో ఒక్క శిశువు విధానాన్ని సమర్థించి జననాల రేటు భారతదేశంలో 2009లో 1000కి 22 వుంటే చైనాలో దీనిని 1000కి 12 వరకు తగ్గించడంలో విజయాన్ని సాధించారు.

1. ప్రభుత్వ సమాచార పథకం :
పునరుత్పత్తి దశలో ఉన్న వివాహిత జంటలకు కుటుంబ నియంత్రణ పథకం వల్ల ఉపయోగాలను తెలియచేసి వారి సామాజిక స్పృహ స్థాయిని పెంచాలి. కుటుంబ నియంత్రణకున్న ప్రాధాన్యతను తెలియపరచడానికి ప్రభుత్వం అన్నిరకాల సమాచార సాధనాలను ఉపయోగిస్తోంది. ఒక్కసారి ప్రజల ఆలోచనలు కుటుంబ నియంత్రణవైపు మళ్ళితే వారే స్వచ్ఛందంగా దీనిని పాటిస్తారు.

2. ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు :
కుటుంబ నియంత్రణను అంగీకరించిన వారికి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహకాలను ఇస్తుంది. ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి నగదు బహుమతులు ప్రోత్సాహకాలుగా ఉంటున్నాయి. చిన్న కుటుంబ విధానాన్ని పాటించిన ప్రజలకు అవసరమైతే ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ నియంత్రణను తిరస్కరించిన వారికి కొన్ని సదుపాయాలను కల్పించకుండా వుండాలి. వాస్తవానికి నిర్బంధ కుటుంబ నియంత్రణ అవసరం.

3. కుటుంబ నియంత్రణ కేంద్రాలు:
కుటుంబ నియంత్రణ పథకంలో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరిగా ఒకభాగం. కుటుంబ నియంత్రణ అవసరమయ్యే వివిధ వైద్య సదుపాయాలను ఈ కేంద్రాలు కల్పిస్తాయి. గర్భ నిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలు కూడా ముఖ్యపాత్రను వహిస్తున్నాయి.

4. పరిశోధన :
జనన, మరణాల రేట్లు, సమాచార ప్రేరణ, పునరుత్పత్తి, ప్రసూతి నియంత్రణ మొదలైన అంశాల పరిశోధనకు . ప్రాధాన్యత ఇవ్వాలి. భారత ప్రభుత్వం ఈ పరిశోధనల ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చని గుర్తించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 5.
భారతదేశంలో వృత్తుల వారీ జనాభా పంపిణీని విశదీకరించండి.
జవాబు.
శ్రమ ప్రాథమిక ఉత్పత్తి కారకమే కాకుండా ఇతర కారకాలను చురుకుదనాన్ని ఏర్పరచి ఉత్పత్తి కోసం అవి ఉపయోగపడేలాగా చేస్తుంది. ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజించబడటాన్ని వృత్తులవారీ జనాభా విభజన అంటారు. వృత్తులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. వ్యవసాయం, పశు పోషణ మొదలైన వాటిని సమిష్టిగా ప్రాథమిక వృత్తులంటారు. ఈ రంగం ప్రకృతిపై అధికంగా ఆధారపడి ఉంటుంది.
  2. చిన్న, భారీ తరహా వస్తు తయారీ పరిశ్రమలను ద్వితీయ వృత్తులు అంటారు.
  3. రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, విత్తం మొదలైన సేవలను సేవా వృత్తులు అంటారు. ఇవి ప్రాథమిక, ద్వితీయ రంగాలకు అత్యంత సహాయాన్ని అందిస్తాయి.

ఆర్థికాభివృద్ధి – వృత్తులవారీ విభజన :
వ్యవసాయ రంగం నుంచి జనాభా పరిశ్రమ రంగానికి, ఆ తరువాత సేవల రంగానికి బదిలీ కావడాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా పరిగణించడం జరిగింది. కోలిన్ క్లార్క్ ప్రకారం అధిక శాతం శ్రామిక జనాభా సేవల రంగంలో పనిచేస్తుంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎ.జి.బి. ఫిషర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

అభివృద్ధి పంథాలో వున్న ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం నుంచి ఉద్యోగితా, పెట్టుబడి క్రమంగా ద్వితీయ రంగానికి, ఇంకా అధికంగా సేవల రంగానికి మారతాయన్నారు. సైమన్ కుజ్నెట్స్ కూడా ఇదే విషయాన్ని పరిశీలించారు. హాన్స్ సింగార్ ప్రకారం ఒక దేశ జనాభా 85% వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితి నుంచి 15% మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితికి మారినప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు.

భారతదేశంలో వృత్తుల వారీ శ్రమ విభజన (శాతాలు):

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి 2

ఆధారాలు :
Indian Economy, Misra & Puri, 2012 Edition;
Indian Economy, Datt & Sundharam, 2012 Edition.

1951 నుంచి 2010 వరకు వ్యవసాయమే ప్రజల ప్రధాన వృత్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. 1951-1971 కాలంలో ప్రాథమిక రంగంలో పనిచేస్తున్న శ్రామికుల శాతం ఏ మాత్రం మారకుండా 72% ఉంది. 1991-2010 మధ్య కాలంలో గణనీయ మార్పు ఏర్పడింది. అది 1991లో 67% శ్రామికులు ప్రాథమిక రంగంలో పనిచేస్తుంటే 2010 నాటికి ఇది 51 శాతానికి తగ్గింది.

స్వాతంత్ర్యానంతరం పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతమై ద్వితీయ రంగంలో ఉద్యోగితను పొందిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1951లో 11% శ్రామికులు ద్వితీయ రంగంలో పనిచేస్తే 2010 నాటికి ఈ శాతం 22గా పెరిగింది. అయితే 1991-2010 మధ్య కాలంలో ద్వితీయ రంగంలో శ్రామికుల శాతం గణనీయంగా పెరిగింది. 1991లో ఈ శాతం 13 ఉంటే 2010లో ఇది 22. 1951 – 2010 వరకు ఉన్న 60 సంవత్సరాల కాలంలో సేవా రంగంలో పనిచేస్తున్న శ్రామికుల శాతం పెరిగింది. 1951లో -17% శ్రామికులు సేవా రంగంలో పనిచేస్తే 2010 నాటికి ఇది 27% వరకు పెరిగింది.

1951-1991 వరకు వున్న నాలుగు దశాబ్దల ప్రణాళికా కాలంలో భారతదేశంలోని వృత్తులవారీ శ్రమ విభజన దాదాపుగా మారలేదు అనేది స్పష్టం. 1991-2010 వరకు ఉన్న రెండు దశాబ్దాల కాలంలో వృత్తులవారీ శ్రమ విభజనలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించాయి. భారతదేశంలో జనాభా త్వరితగతిన పెరుగుదల, శ్రామిక అల్ప ఉత్పాదక శక్తితో కూడుకున్న సంప్రదాయ వ్యవసాయం, నెమ్మదిగా కొనసాగిన పారిశ్రామికీకరణ అనే కారణాల వల్ల వృత్తులవారీ శ్రమ విభజనలో గణనీయమైన మార్పులు ఏర్పడలేదు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 6.
జాతీయ జనాభా విధానం, 2000 ను వివరించండి.
జవాబు.
జాతీయ జనాభా విధానం 2000 తక్షణమే సాధించవలసిన ఆశయాలను, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆశయాలను నిర్ణయించింది. తక్షణ ఆశయాలలో గర్భ నిరోధక అవసరాలను ఏర్పాటుచేయడం, వైద్య వ్యవస్థాపన సౌకర్యాలను ఏర్పరచడం, వైద్య సిబ్బందిని ఏర్పాటుచేయడం, పునరుత్పత్తి, శిశు ఆరోగ్య సంరక్షణకు సమగ్ర సేవలను అందించడం ప్రధానమైనవి.

2010 నాటికి ప్రసూతి రేటును సాధ్యమైనంత స్థాయికి తగ్గించడం మధ్యకాలిక లక్ష్యంగా, 2046 నాటికి జనాభాను స్థిరీకరించడం దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది. 2046 నాటికి జనాభాను స్థిరపరచడానికి జాతీయ జనాభా విధానం క్రింది చర్యలను ప్రకటించింది.

  1. 1000 జననాలకు శిశు మరణాల రేటును 30కి దిగువగా తగ్గించడం.
  2. 1 లక్ష జననాలకు ప్రసవ మరణాల రేటును 100కి దిగువగా తగ్గించడం.
  3. అందరికీ రోగనిరోధక శక్తిని పెంచే చర్యలు.
  4. శిక్షణ పొందిన సిబ్బంది వున్న వైద్యాలయాలు, వైద్య సంస్థలో 80% ప్రసవాలు జరిగేలా చూడటం.
  5. సమాచారం, ఎయిడ్స్ నివారణ, అంటువ్యాధుల నిరోధన, నియంత్రణ అందుబాటులో ఉండటం.
  6. ఇద్దరు సంతానంలో చిన్న కుటుంబ విధానాన్ని అనుసరించడానికి ప్రోత్సాహకాలు ప్రకటించడం.
  7. సురక్షిత గర్భస్రావాలకు సౌకర్యాలను పెంపొందించడం.
  8. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, ప్రసవపూర్వం పరీక్ష పద్ధతులు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయడం.
  9. బాలిక వివాహ వయస్సును 18 సంవత్సరాలకు పెంచడం, మరియు దీనిని 20 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు పెంచడానికి ప్రాధాన్యతను ఇవ్వడం.
  10. 21 సంవత్సరాల వయస్సు తర్వాత వివాహం చేసుకొని ఇద్దరు పిల్లల తర్వాత గర్భనిరోధక పద్ధతులను పాటించే స్త్రీలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం.
  11. పేదవారుగా వుండి ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించడం.
  12. జననాలను క్రమబద్ధీకరించడం, గర్భనిరోధకాలకు సంబంధించి సమాచారం, సలహాలు, సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం.
  13. కుటుంబ సంక్షేమాన్ని ప్రజాలక్ష్య పథకంగా రూపొందించడానికి సంబంధించిన సామాజిక రంగ పథకాలన్నింటిని అమలుచేయడానికి ఒక తాటిపైకి తీసుకురావడం.

ప్రశ్న 7.
ఆర్థికాభివృద్ధిలో విద్యకున్న పాత్రను పరిశీలించండి.
జవాబు.
మానవ వనరుల అభివృద్ధికి విద్య, నైపుణ్య శిక్షణ ముఖ్యం.

1. విద్య, ఆర్థికాభివృద్ధి:
విద్యపై పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. టోడారో, స్మిత్ ప్రకారం విద్యనల్ల పరిజ్ఞానం, నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఉత్పాదక శ్రామికులను సృష్టించవచ్చు. విద్య వల్ల ఉద్యోగ, ఆదాయ ఆర్జన అవకాశాలు మెరుగవుతాయి. విద్యావంతులైన నాయకులు సృష్టించబడతారు. విద్య నైపుణ్యాన్ని అందిస్తుంది. ఆధునిక ధృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది.

2. ఆదాయ అసమానతల తగ్గింపు:
సంపూర్ణ విద్య ద్వారా ప్రజల సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఇది వారి ఆదాయాల పెంపుకు సహకరిస్తుంది.

3. గ్రామీణ అభివృద్ధి :
గ్రామీణ ప్రజలకు విద్య ద్వారా పరిజ్ఞానం అందుతుంది. కాబట్టి ప్రజలు వారి అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను అధిగమిస్తారు. రైతులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తారు. కుటీర పరిశ్రమలను స్థాపించడానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని విద్య అందిస్తుంది. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గుతుంది.

4. కుటుంబ నియంత్రణ :
జీవన ప్రమాణాల స్థాయిని పెంచుకోవలసిన అవసరాన్ని, అందుకు కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు విద్య ద్వారా తెలుసుకొంటారు. దీర్ఘకాలంలో కుటుంబ నియంత్రణకు విద్య ఉత్తమ సాధనంగా పనిచేస్తుంది. ఇది నిరూపించబడింది కూడా. స్త్రీలలో ఎక్కువమంది విద్యావంతులైతే వారు ఉద్యోగాలు కోరుకుంటారు. ఉద్యోగితా స్త్రీలకు పిల్లల పోషణ కష్టమవుతుంది. కాబట్టి ప్రసూతి రేటు తగ్గుతుంది.

5. ఉద్యోగ శిక్షణ :
అనేక సంస్థలు వాటి ఉద్యోగ శిక్షణను అందిస్తాయి. ఎందుకంటే మానవ మూలధనంలో మెరుగుదల ఉంటే భౌతిక మూలధనం ఉత్పాదకత పెరుగుతుంది. ఉద్యోగ శిక్షణ వల్ల శ్రామికుల నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పాదకత, ఉత్పత్తి పెరుగుతాయి.

విద్య బాగా పెరిగితే ప్రస్తుత, భావితరాలకు సశేష (spill over) ఆదాయాలు అందడం, నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరాలను తీర్చడం, విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన, బాధ్యతాయుత ప్రవర్తన పెరగడం, రాజకీయ సుస్థిరత రావడం, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం లాంటి ప్రయోజనాలు సమాజంలో ఏర్పడతాయి. ప్రజలు తగిన విద్యను పొందకపోతే, వాళ్ళు ప్రస్తుత కాలంలోనేకాక భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువగా కోల్పోతారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
భారతదేశంలో అనుసరించిన ఆరోగ్య విధానాలను, పథకాలను విపులీకరించండి.
జవాబు.
భారతదేశంలో 1946లో ఏర్పాటుచేసిన ఆరోగ్య సర్వే, అభివృద్ధి కమిటీ, 1961లో ఏర్పడిన ఆరోగ్య సర్వే, ప్రణాళికా కమిటీల సూచనల మేరకు ప్రభుత్వం ఆరోగ్య ప్రమాణాలను పెంచడానికి ఒక పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ఆశయాలను క్రింద తెలియచేయటం జరిగింది.

  1. అంటువ్యాధుల నియంత్రణకు ఏర్పాట్లు.
  2. ఆరోగ్య సేవలను కల్పించడం..
  3. ఆరోగ్య శాఖల్లోని ఉద్యోగులకు శిక్షణను కల్పించడం, గ్రామీణ రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడం.

అయిదవ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య అభివృద్ధి పథకాలను కుటుంబ సంక్షేమం, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బిడ్డ తల్లుల పౌష్టికాహార పథకాలతో సమగ్ర పరిచారు. ఆరవ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలను సమాజ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టారు. 9వ, 10వ పంచవర్ష ప్రణాళికలలో ఆరోగ్య సంరక్షణ నాణ్యతను పెంచి, దీనిని బాగా అందుబాటులోకి తెచ్చి, ప్రజల ఆరోగ్య స్థాయిని పెంచడానికి తీవ్ర ప్రయత్నం చేశారు.

11వ పంచవర్ష ప్రణాళిక వైయుక్తిక ఆరోగ్య సంరక్షణ, ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగు నీరు, ఆహారం, పరిశుభ్రత, పోషణ పరిజ్ఞానం మొదలైన అనేక అంశాలను కలిపి సర్వతోముఖ విధానాన్ని రూపొందించింది. ఈ ప్రణాళికా అంతానికి (2011-12) క్రింది లక్ష్యాలను సాధించాలని ఏర్పరచుకొంది.

  1. ప్రసూతి మరణ రేటును 1 లక్ష జననాలకు 100 వరకు తగ్గించడం.
  2. శిశు మరణాల రేటును 1000 జననాలకు 28 వరకు తగ్గించడం.
  3. మొత్తం ప్రసూతి రేటును 2:1కి తగ్గించడం.
  4. 2009 నాటికి అందరికీ పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడం.
  5. పౌష్టికాహార లోపాన్ని 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 50% తగ్గించడం.
  6. స్త్రీలలో, బాలికల్లో రక్త హీనతను 50% తగ్గించడం.
  7. 0 నుంచి 6 సంవత్సరాల వయస్సుగల వారిలో లింగ నిష్పత్తిని 2011-12 నాటికి 1000 కి 935 వరకు 2016-17 నాటికి 950 వరకు పెంచడం.

2001 – 03 కాలంలో ప్రసూతి మరణ రేటు 1 లక్ష జననాలకు 301 అయితే 2010 నాటికి ఇది 200కి తగ్గింది. జననాలు, ప్రసవాలు శిక్షణ పొందిన వారి పర్యవేక్షణలో జరగడానికి కావలసిన సదుపాయాలు వేగంగా మెరుగయితే భారతదేశంలో ప్రసూతి మరణాల రేటును తగ్గించవచ్చు.

భారతదేశంలో ఆరోగ్య పథకాలు :
2001 – 02 సంవత్సరంలో ఆరోగ్యంపైన చేసిన మొత్తం వ్యయ శాతం స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.6. ఇందులో ఆరోగ్యంపైన చేసిన ప్రభుత్వ వ్యయం స్థూలదేశీయ ఉత్పత్తిలో 0.94% అయితే ప్రైవేటు వ్యయశాతం 3.58 విదేశీ సహాయం 0.11%. 11వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను, జాతీయ నగర ఆరోగ్యమిషన్ ను ప్రవేశపెట్టి సమ్మిళిత వృద్ధిపైన దృష్టి పెట్టింది.

1. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ :
ఆరోగ్య అవస్థాపనా సౌకర్యాలను బలపరచి, నాణ్యతాపరమైన ఆరోగ్యాన్ని అందుబాటులోకి బాగా తీసుకురావడంతో పాటుగా దాని ఉపయోగాన్ని కూడా పెంచడం ఈ మిషన్ లక్ష్యం.

2. జననీ సురక్షా యోజన :
సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ ప్రసూతి మరణాలను శిశు మరణాలను తగ్గించడం ఈ పథకానికి ఉన్న లక్ష్యాలు. ఈ పథకాన్ని 100% కేంద్రం స్పాన్సర్ చేసింది. అంతేకాకుండా నగదు సహాయం, వైద్య సంరక్షణ రెంటిని సమగ్రపరుస్తుంది. అంచెలంచెలుగా పెరిగే విధానంలో సంస్థల సామర్థ్య స్థాయిని పెంచడం వల్ల సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహించడం వల్ల పథకానికి విజయాన్ని చేకూర్చవచ్చు.

3. జాతీయ నగర ఆరోగ్యమిషన్ :
దీని ముఖ్య లక్ష్యం నగరాల్లోని పేదవారి, మురికివాడలో నివసించేవారి మురికి వాడల్లో లేదా పని స్థలాల్లోని అత్యల్ప ఆదాయ స్థాయికల నివాసితుల ఆరోగ్య అవసరాలను తీర్చడం. కనీసం ఒక లక్ష జనాభా వున్న అన్ని పట్టణ ప్రాంతాలకు ఈ పథకం వర్తిస్తుంది.

4. స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశుభ్రత :
కలుషిత నీరు త్రాగడం వల్ల రోగాల బారిన పడటం పౌష్టికాహార లోపం, నీటి సంబంధ రోగాలు వచ్చి అనారోగ్యానికి గురిఅవుతారు. అందుకే స్వచ్ఛమైన త్రాగునీరు ముఖ్య అవసరం. అనేక నీటి సంబంధ రోగాలకు అపరిశుభ్రతే ప్రత్యక్ష కారణమవుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 9.
మానవ అభివృద్ధిని కొలవడానికి ఉన్న వివిధ సూచికలు ఏమిటి ? వాటిని వివరించండి.
జవాబు.
మానవ అభివృద్ధి సూచిక (Human Development Index) :
పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్-ఉల్-హక్ నాయకత్వంలో 1990 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (UNDP) తయారుచేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్టులో (Human Development Report) మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది. తరువాత మానవ అభివృద్ధిని పద్ధతులను కనుగొనే మరియు సంస్కరించే ప్రయత్నం జరిగింది.

1. లింగ సంబంధిత సూచికలు (Gender Related Indexes) :
1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా రెండు లింగ సూచికలను ప్రవేశ పెట్టింది.

a) మానవ అభివృద్ధి సూచికలో చేర్చబడిన ఆయుర్దాయం, విద్యా సంపాదన, ఆదాయం అనే ప్రాథమిక సామర్థ్యాల ఆధారంగా అభివృద్ధిని కొలిచే ప్రయత్నాన్ని ‘లింగ సంబంధిత అభివృద్ధి సూచిక’ (Gender Related Devel- opment Index) చేసింది. మానవ అభివృద్ధి సూచికను లింగ అసమానత్వంతో సర్దుబాటు చేస్తారు.

b) ఆర్థిక రాజకీయ జీవితంలో స్త్రీల భాగస్వామ్యం చురుకుగా ఉందా లేదా అనే దానిని లింగ సాధికార కొలమానం (GEM) తెలుపుతుంది. రాజకీయాలలో పాల్గొనడం (పార్లమెంటు సీట్లలో స్త్రీల వాటా), ఆర్థిక అంశాలలో పాల్గొనడం (ఉన్నత స్థానాల్లో, వృత్తిపరమైన స్థానాల్లో వాటా), ఆర్థిక వనరులపై స్త్రీలకున్న పట్టు (ఆదాయాల్లోని తేడాలు) అనే అంశాలపై లింగ సాధికార కొలమానం దృష్టిని సారిస్తుంది.

2. మానవ పేదరిక సూచిక (Human Poverty Index) :
మానవ పేదరిక సూచిక అనే భావనను మానవ అభివృద్ధి రిపోర్టు (Human Development Report), 1997 ప్రవేశపెట్టింది. ఇది మానవ అభివృద్ధి సూచికలో ఉన్న మానవ జీవనానికి అవసరమైన అంశాలు దీర్ఘాయువు (Iongevity), పరిజ్ఞానం (Knowledge), ఉన్నత జీవన ప్రమాణాలలో (decent living standards) మానవులు కోల్పోయిన దానిపై లేదా పొందలేకపోయిన (deprivation) దానిపై అధిక శ్రద్ధ వహిస్తుంది.

3. స్థూల జాతీయ ఆనంద సూచిక (Gross National Happiness Index) :
భూటాన్ లాంటి దేశాలు వాటి అభివృద్ధిని స్థూల జాతీయ ఆనంద సూచికల ద్వారా కొలుస్తున్నారు. అభివృద్ధిని కొలుస్తున్న ప్రస్తుత పద్ధతిలో మార్పును తేవలసిన అవసరం ఉంది. ప్రగతి లేదా అభివృద్ధిని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తి ప్రత్యామ్నాయ సూచికగా స్థూల జాతీయ ఆనందాన్ని (సంతోషాన్ని ) భూటాన్ రూపొందించింది. స్థూల జాతీయ ఆనందం భావనను భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగుక్ (Jigme Singye Wangchuck) 1970 తర్వాతి దశాబ్దిలో వాడారు.

ప్రశ్న 10.
మానవ అభివృద్ధిపై అమర్త్య సేన్ ఆలోచనలను వివరించండి.
జవాబు.
అమర్త్యసేన్ గ్రంథం “Development as Freedom” 1999లో ప్రచురించబడింది. అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఒకే ఒక్క భారతీయుడు ఇతనే. ప్రజలు అనుభవించే వాస్తవ స్వేచ్ఛలను (real freedom) విస్తరించే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి అని అమర్త్యసేన్ వాదన.

అభివృద్ధి లక్ష్యం స్వేచ్ఛ అని అభివృద్ధిని సాధించడానికి ప్రాథమిక సాధనంగా స్వేచ్ఛ ఉంటుందనేది సేన్ వాదన. ఎందుకంటే,

  1. మానవ ప్రగతిని మదింపు చేయడానికి ఆమోదింపదగ్గ ఒకే ఒక్క అంశం స్వేచ్ఛను పెంపొందించడం.
  2. అభివృద్ధిని సాధించడం ప్రజల స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంది.

ప్రజలు అనుభవించే స్వేచ్ఛను విస్తరించాలంటే స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల లేదా వైయుక్తిక ఆదాయాల పెరుగుదల ముఖ్య సాధనాలుగా ఉంటాయి. స్వేచ్ఛ సామాజిక ఆర్థిక ఏర్పాట్లు, రాజకీయ, పౌరహక్కులు పైన కూడా ఆధారపడుతుంది. వ్యక్తులు తమకు తామే సహాయం చేసుకోవడానికి కావలసిన వారి సామర్థ్యాన్ని స్వేచ్ఛ పెంచుతుంది. సామాజిక అవకాశాలలో పాల్గొనే స్వేచ్ఛవల్ల, నిర్ణయాలను చేయడంలో పాల్గొనే స్వేచ్ఛవల్ల సంస్థాగత ఏర్పాట్లు కూడా ప్రభావితమవుతాయి.

అమర్త్యసేన్ అయిదు రకాల స్వేచ్ఛలను వివరించాడు. అవి :
రాజకీయ స్వేచ్ఛలు, ఆర్థిక సదుపాయాలు, సామాజిక అవకాశాలు, పారదర్శకత హామీలు మరియు కాపాడే రక్షణ. రాజకీయ స్వేచ్ఛలు ఆర్థిక భద్రతను పెంచుతాయి. ఆర్థిక సదుపాయాలు వ్యక్తులు సంపన్నవంతులు కావడానికి వనరులు సామాజిక సదుపాయాలు కల్పించడానికి సహాయపడతాయి. సామాజిక అవకాశాలు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనేటట్లు తోడ్పడతాయి.

అన్ని రకాల స్వేచ్ఛలు ఒకదానిని మరొకటి బలోపేతం చేసుకొంటాయి. అభివృద్ధిని సాధించాలంటే స్వేచ్ఛలు లేకపోవడానికి ఉన్న కారణాలను తొలగించాలి. అంటే పేదరికం, పీడించడం (Hyranny) తక్కువ ఆర్థిక అవకాశాలు, ఒక పద్ధతి ప్రకారం జరిగిన సామాజిక నష్టం (Social deprivation) ప్రజా సౌకర్యాలను ఉపేక్షించడం, సమ్మతించకపోవడం (intalerance) అణచే ధోరణి వున్న ప్రభుత్వాల (repressive states) అతి కార్యక్రమాలు మొదలైన వాటిని తొలగించాలి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలోని జనన మరణాల రేట్ల ధోరణులను వివరించండి.
జవాబు.
జనాభా వృద్ధి అనేది జనన, మరణాల రేట్లను బట్టి, వలసల స్థాయి దిశను బట్టి నిర్ణయించబడుతుంది. భారతదేశానికి సంబంధించి వలసలకు ప్రాధాన్యత లేనందున దానిని పరిగణనలోకి తీసుకోనవసరం లేదు. జనన-మరణాల రేట్లలోని తేడాల వల్ల జనాభా వృద్ధి వివరించబడుతుంది. పట్టికలో భారతదేశ జనన-మరణాల రేట్లను ఇవ్వడం జరిగింది.

1921కి పూర్వం భారతదేశంలోని అధిక జనన మరణాల రేట్లు జనాభా పెరుగుదలను నిరోధించాయి. 1901-1921 మధ్య కాలంలో జననాల రేటు 1000కి 46 నుంచి 49 వరకు ఉంటే మరణాల రేటు 44 నుంచి 49 వరకు ఉన్నందువల్ల జనాభా పెరుగుదల చాలా అల్పంగా ఉంది లేదా చెప్పుకోతగినంతగా లేదు. 1921 తరువాత మరణాల రేటు స్పష్టంగా తగ్గింది. 1911- 20లో మరణాల రేటు 48.6 ఉంటే 2010-11లో 1000కి 7.2 వరకు తగ్గింది.

అయితే ప్రారంభంలో జననాల రేటు అల్పంగా తగ్గినా తరువాత కాలంలో కుటుంబ నియంత్రణ పథకాల వల్ల 2010-11లో ఇది 1000కి 22.1కి తగ్గింది. గత 60 సంవత్సరాలలో శిశు మరణాల రేటు క్రమంగా తగ్గింది. 20వ శతాబ్దంలోని రెండవ దశాబ్దంలో ప్రతి 1000 జననాలకు 28గా నమోదయిన శిశు మరణాల రేటు 2010లో 1000 జననాలకు 47గా ఉంది. ప్రసూతి మరణాల సంఖ్య కూడా క్రమేణా తగ్గుతూ ఇది 2007- 2009లో 1 లక్ష జననాలకు 2010గా నమోదయింది.

భారతదేశంలో వార్షిక సగటు జనన మరణాల రేట్లు:

1891 – 1900 45.8 44.4
1901 – 1910 48.1 42.6
1911 – 1920 49.2 48.6
1921 – 1930 46.4 36.3
1931 – 1940 45.2 31.2
1941 – 1950 39.9 27.4
1951 – 1960 40.0 18.0
1961 – 1970 41.2 19.2
1971 – 1980 37.2 15.0
1981 – 1990 29.5 9.8
1991 – 2001 25.4 8.4
2010 – 2011 322.1 7.2

అధిక జననాల రేటు, ‘వేగంగా క్షీణిస్తున్న మరణాల రేట్ల ద్వారా అధిక జనాభా వృద్ధి రేటును పై విధంగా వివరించవచ్చు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు 1000కి జననాల రేటు కంటే తక్కువ స్థాయిలో ఉండే విధంగానే సాధించాయి. ఈ రాష్ట్రాలన్నీ జనాభా పరిణామ సిద్ధాంతంలోని 3వ దశలో ఉన్నాయి. అయితే తలసరి ఆదాయంలో ఉచ్ఛస్థాయిలో ఉన్న హర్యానా, గుజరాత్ రాష్ట్రాలు జననాల రేటును తగ్గించడంలో బాగా వెనుకబడినాయి.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, రాష్ట్రాలలో జననాల రేటు చాలా అధికంగా 1000కి 25 నుంచి 31 వరకు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలో ఉన్నాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉన్నప్పుడు జననాల రేటును బాగా తగ్గించడం అంత సులభం కాదు. ఇంకా చాలా మంది ప్రజలు కుటుంబ నియంత్రణ పథకాల పట్ల ఆసక్తి కనబర్చడంలేదు. వివాహం, కుటుంబం, కుటుంబ నియంత్రణ పథకాల విషయంలో ప్రజల దృక్పథం మారాలి. అప్పుడు మాత్రమే జననాల రేట్లు గణనీయంగా తగ్గుతాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 2.
భారతదేశంలోని లింగ నిష్పత్తిని వివరించండి.
జవాబు.
1,000 పురుష జనాభాకు స్త్రీ జనాభా ఎంత అనేది లింగ నిష్పత్తిని లేదా స్త్రీ పురుష నిష్పత్తిని తెలియజేస్తుంది. భారతదేశంలోని లింగ నిష్పత్తిని పట్టిక వివరిస్తుంది. 1901లో లింగ నిష్పత్తి 972 ఉంటే 1951 నాటికి 946కి తగ్గి, 1991 నాటికి బాగా తగ్గి 927గా ఉంది. ఇది కలవరపెట్టే అంశమే. తరవాత కాలంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగి 2001లో 933గాను 2011లో 940గాను నమోదయింది. కేరళ రాష్ట్రంలో మాత్రమే స్త్రీల అనుపాతం పెరిగి 2011లో 1,000 మంది పురుష జనాభాకు 1,084 స్త్రీ జనాభా ఉంది.

పంజాబ్ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో స్త్రీ – పురుష జనాభా నిష్పత్తి చాలా అల్పంగా ఉంది. 2011లో పంజాబ్లో లింగ నిష్పత్తి 893గాను, హర్యానాలో 877గాను ఉండి అడుగున ఉన్నాయి. బీదరికం, ఆడ శిశువుల మరణాల రేటు అధికంగా ఉండటం, పునరుత్పత్తి వయస్సులోని స్త్రీలలో అధిక మరణాలరేటు, సామాజిక కారణాలు లింగ నిష్పత్తి తగ్గడానికి దోహదపడుతున్నాయి.

భారతదేశంలో లింగ నిష్పత్తి:

సంత్సరం 1,000 పరుషులకు స్త్రీలు
1901 972
1911 964
1921 955
1931 950
1941 945
1951 946
1961 941
1971 930
1981 934
1991 927
2001 933
2011 940

ప్రశ్న 3.
భారతదేశంలోని కుటుంబ నియంత్రణ పథకాన్ని విశదీకరించడి.
జవాబు.
కుటుంబ నియంత్రణ పథకం : ప్రపంచ వ్యాప్తంగా జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించే సాధనంగా కుటుంబ నియంత్రణ పథకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించారు. ఉదాహరణకు, చైనాలో ఒక్క శిశువు విధానాన్ని సమర్థించి జననాల రేటు భారతదేశంలో 2009లో 1000కి 22 వుంటే చైనాలో దీనిని 1000కి 12 వరకు తగ్గించడంలో విజయాన్ని సాగించారు.

1. ప్రభుత్వ సమాచార పథకం :
పునరుత్పత్తి దశలో ఉన్న వివాహిత జంటలకు కుటుంబ నియంత్రణ పథకం వల్ల ఉపయోగాలను తెలియచేసి వారి సామాజిక స్పృహ స్థాయిని పెంచాలి. కుటుంబ నియంత్రణకున్న ప్రాధాన్యతను తెలియపరచడానికి ప్రభుత్వం అన్నిరకాల సమాచార సాధనాలను ఉపయోగిస్తోంది. ఒక్కసారి ప్రజల ఆలోచనలు కుటుంబ నియంత్రణవైపు మళ్ళితే వారే స్వచ్ఛందంగా దీనిని పాటిస్తారు.

2. ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు :
కుటుంబ నియంత్రణను అంగీకరించిన వారికి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహకాలను ఇస్తుంది. ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి నగదు బహుమతులు ప్రోత్సాహకాలుగా ఉంటున్నాయి. చిన్న కుటుంబ విధానాన్ని పాటించిన ప్రజలకు అవసరమైతే ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ నియంత్రణను తిరస్కరించిన వారికి కొన్ని సదుపాయాలను కల్పించకుండా వుండాలి. వాస్తవానికి నిర్బంధ కుటుంబ నియంత్రణ అవసరం.

3. కుటుంబ నియంత్రణ కేంద్రాలు:
కుటుంబ నియంత్రణ పథకంలో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరిగా ఒకభాగం. కుటుంబ నియంత్రణ అవసరమయ్యే వివిధ వైద్య సదుపాయాలను ఈ కేంద్రాలు కల్పిస్తాయి. గర్భ నిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలు కూడా ముఖ్యపాత్రను వహిస్తున్నాయి.

4. పరిశోధన :
జనన, మరణాల రేట్లు, సమాచార ప్రేరణ, పునరుత్పత్తి, ప్రసూతి నియంత్రణ మొదలైన అంశాల పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. భారత ప్రభుత్వం ఈ పరిశోధనల ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చని గుర్తించింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 4.
ఆర్థికాభివృద్ధికి, వృత్తుల వారీ విభజనకు మధ్యగల సంబంధం ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో వృత్తులవారీ, రంగాల వారీ జనాభా విభజన :
శ్రమ ప్రాథమిక ఉత్పత్తి కారకమే కాకుండా ఇతర కారకాలకు చురుకుదనాన్ని ఏర్పరచి ఉత్పత్తి కోసం అవి ఉపయోగపడేలాగా చేస్తుంది. ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజించటాన్ని ‘వృత్తులవారీ జనాభా విభజన’ అంటారు. వృత్తులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. వ్యవసాయం, పశుపోషణ, అడవులు, చేపల పెంపకం మొదలైన వాటిని సమిష్టిగా ప్రాథమిక కార్యకలాపాలు అంటారు. (Primary activities) ఈ ఉత్పత్తులు మానవ మనుగడకు చాలా అవసరం. ఈ రంగం ప్రకృతిపై అధికంగా ఆధారపడి ఉంటుంది.
  2. చిన్నతరహా, భారీ తరహా వస్తు తయారీ పరిశ్రమలను ద్వితీయ (Secondary activities) కార్యకలాపాలు అంటారు.
  3. రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, విత్తం మొదలైన సేవలను సేవా కార్యకలాపాలు అని అంటారు. ఇవి ప్రాథమిక, ద్వితీయ రంగాలకు అత్యంత సహాయాన్ని అందిస్తాయి.

వ్యవసాయ రంగం నుంచి జనాభా పరిశ్రమ రంగానికి, ఆ తరువాత సేవల రంగానికి బదిలీ కావడాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా పరిగణించడం జరిగింది. కోలిన్ క్లార్క్ ప్రకారం అధిక శాతం శ్రామిక జనాభా సేవల రంగంలో పనిచేస్తుంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. తక్కువ శాతం గ్రామీణ జనాభా సేవల రంగంలో పనిచేస్తూ, ఎక్కువ శాతం ప్రాథమిక రంగంలో పనిచేస్తుంటే ప్రజల వాస్తవిక తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది.

ఎ.జి.జి. ఫిషర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అభివృద్ధి పంథాలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం నుంచి ఉద్యోగితా, పెట్టుబడి క్రమంగా ద్వితీయ రంగానికి, ఇంకా అధికంగా సేవల రంగానికి మారతాయన్నారు. సైమన్ కుజ్నెట్స్ కూడా ఇదే విషయాన్ని పరిశీలించారు. హాన్స్ సింగార్ ప్రకారం ఒక దేశ జనాభా 85% వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితి నుంచి 15% మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడే స్థితికి మారినప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు.

ప్రశ్న 5.
మానవ వనరుల అభివృద్ధి భావనను, దాని ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భౌతిక కారకాలయిన శ్రమ, మూలధనంలోని పెరుగుదల అనే కారణంవల్ల వివరించలేనంత అధిక రేటులో ఉత్పత్తి పెరిగిందని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే, విద్య, నైపుణ్యంలోని పెరుగుదల వల్ల, వైద్య సదుపాయాలు మొదలైనవి లభించడం వల్ల ఉత్పాదక సాధనంగా మానవుల నాణ్యత పెరిగింది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, భౌతిక మూలధన సమీకరణతోపాటుగా మానవ వనరుల అభివృద్ధి కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది.

మానవ వనరుల అభివృద్ధి భావన :
విద్యపై పెట్టుబడి పెడితే మానవ మూలధన సమీకరణ (human capital forma- tion) పెరుగుతుందని థియోడోక్ డబ్ల్యు. షుల్జ్ వాదించాడు. మానవుడి ఉత్పాదక శక్తిని పెంచే ఏ చర్య అయినా సరే మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇటువంటి అయిదు చర్యలను షుల్జ్ వివరించాడు అవి :

  1. ఆరోగ్య సదుపాయాలు, సేవలు, ప్రజల ఆయుర్ధాయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ప్రభావితంచేసే వ్యయాలు.
  2. సంస్థలు నిర్వహించే అప్రెంటిస్ షిప్, ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ.
  3. ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత స్థాయిలో లాంఛనప్రాయంగా నిర్వహించే విద్య.
  4. సంస్థలు నిర్వహించని వయోజన విద్యా పథకాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు.
  5. మారుతున్న ఉద్యోగ అవకాశాలకు సర్దుబాటు కావడానికి వ్యక్తుల, కుటుంబ వలస.

మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యత :
మానవ వనరుల అభివృద్ధికి విద్య అధికంగా తోడ్పడుతుంది కాబట్టి విద్య చాలా ముఖ్యం. ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యపాత్రను పోషిస్తుంది. భౌతిక వనరులను సమర్థవంతంగా వాడాలంటే సాంకేతిక, వృత్తి సంబంధ, పరిపాలనా సంబంధ నిపుణులు అవసరం.

అందుకే వనరుల కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. మానవ వనరుల అభివృద్ధి చెందకపోవడంవల్ల దేశాలు అభివృద్ధి చెందలేదు. ఈ దేశాల్లోని సాధారణ ప్రజలు నిరక్షరాస్యులుగా లేదా తక్కువగా చదువుకున్న వారుగా, నైపుణ్యం, శిక్షణ లేకుండా లేదా అనారోగ్యంతో ఉన్నారు. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రక్రియ రెండూ జంటగా పనిచేయడమేగాక ఒకదానిని మరొకటి ప్రభావితం చేసుకుంటాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 6.
జాతీయ ఆరోగ్య విధానం (NHP), 2017ని వివరించండి.
జవాబు.
జాతీయ ఆరోగ్య విధానం, 2017 :
జాతీయ ఆరోగ్య విధానం, 2017 ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ద్వారా భారీ ప్యాకేజిగా హామీతో కూడిన సర్వతోముఖ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాలని లక్షంగా పెట్టుకుంది. అందరూ సాధ్యమైన అధిక స్థాయిలో ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పొందేలా చూడడం ఈ విధాన లక్ష్యం.

దీనికోసం ఎవరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన కుండానే, నివారణా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ ఉన్నతీకరణ, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందరికి అందుబాటులో ఉండటం అనే సాధనాలను ఎన్నుకొన్నారు. ఈ లక్ష్యాన్ని, ఆరోగ్య సంరక్షణ ఎక్కువగా అందుబాటులో ఉండేలా చూడటం, దీని నాణ్యతను పెంచడం, వ్యయాన్ని తగ్గించడం ద్వారా సాధించడం జరుగుతుంది.

ఈ విధాన ప్రధానాంశాలు :

  1. హామీ ఆధార విధానం
  2. సూక్ష్మ పోషకాల లోపం
  3. భారత్లో తయారి ఆరంభ యత్నం
  4. డిజిటల్ ఆరోగ్య వర్తింపు.
    విధానంలోకి ఒక ఆజ్ఞ ఏమంటే, ఆరోగ్య సంరక్షణలో సమాచార సాంకేతికతను వాడటం.

జాతీయో ఆరోగ్య విధానం, 2017కి సంబంధించిన ముఖ్య లక్ష్యాలను కింద ఇవ్వడం జరిగింది.

  1. స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 1.15 శాతం ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని 2025 నాటికి 2.5 శాతానికి పెంచాలి.
  2. ఆయుః ప్రమాణాన్ని 67.5 సంవత్సరాల నుంచి 2025 నాటికి 70 సంవత్సరాలకు పెంచడం.
  3. జాతీయ స్థాయిలోను, దిగువ స్థాయిలోను 2025 నాటికి మొత్తం ప్రసూతి రేటును 2.1కి తగ్గించడం.
  4. 2019 వాటికి శిశు మరణాల రేటును 28కి తగ్గించడం. శిశు మరణాల రేటు 2016లో 1000 జననాలకు 34గా ఉంది.
  5. అంధత్వాన్ని 2025 నాటికి వెయ్యికి 0.25 కి తగ్గించడం, అట్లాగే రోగ భారాన్ని ప్రస్తుత స్థాయిలో 1/3 తగ్గించాలి.
  6. ప్రస్తుత స్థాయి నుంచి 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాల ఉపయోగాన్ని 50 శాతం వరకు పెంచడం.
  7. 2025 నాటికి అప్పుడే పుట్టిన శిశువులలో 90 శాతానికి మించి ఒక సంవత్సరం వయస్సులోపునే పూర్తిగా వ్యాధి నిరోధకాలను పొందాలి.
  8. 2025 నాటికి 90 శాతం మించి ప్రసవాలు నైపుణ్యుల సమక్షంలో జరగాలి.
  9. ప్రస్తుత పొగాకు వినియోగాన్ని 2020 నాటికి 15 శాతం తగ్గించాలి. అట్లాగే 2025 నాటికి 30 శాతం తగ్గించాలి.
  10. 2020 నాటికి అందరికి రక్షిత నీటి సౌకర్యం, పారిశుద్ధ్యం అందుబాటులో ఉండాలి.
  11. 2020 నాటికి ఆరోగ్యం కోసం రాష్ట్ర వాటాను దాని బడ్జెట్ లో 8 శాతానికి మించి పెంచాలి.

ప్రశ్న 7.
మానవ అభివృద్ధి సూచికను నిర్మించే పద్ధతిని వివరించండి.
జవాబు.
మావన అభివృద్ధికి సంబంధించిన మూడు అంశాల అభివృద్ధి సగటును మానవ అభివృద్ధి సూచిక కొలుస్తుంది. అవి :

  • దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం : దీనిని ఆయుర్ధాయం ద్వారా కొలుస్తారు.
  • పరిజ్ఞానం : దీనిని వయోజన అక్షరాస్యత రేటు, విద్యారంగంలోని ఉమ్మడి స్థూల విద్యార్థుల నమోదు నిష్పత్తి ద్వారా లెక్కిస్తారు.
  • ఉన్నత జీవన ప్రమాణం : దీనిని తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ద్వారా లెక్కిస్తారు.

మానవ అభివృద్ధి సూచికను లెక్కించే ముందు మూడు అంశాలలో ఒక్కొక్క అంశానికి సూచికను తయారుచేస్తారు. దీనికోసం ఒక్కొక్క సూచికకు కింద తెలియచేసినట్లుగా గరిష్ఠ, కనిష్ఠ విలువలను కల్పిస్తారు.

సూచికలు గరిష్ఠ విలువ కనిష్ఠ విలువ
1. ఆయుర్ధాయం 85 25
2. వయోజన అక్షరాస్యత రేటు 100 0
3. స్థూల నమోదు నిష్పత్తి 100 0
4. తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి కొనుగోలు శక్తి సమానత ఆధారంగా – US ($) 40,000 100

ప్రతి అంశం పనితీరును 0 నుంచి 1 మధ్య విలువలను ఇచ్చి క్రింది సూత్రం ద్వారా అంచనా వేస్తారు.
అంశపు సూచిక = వాస్తవ విలువ – కనిష్ట విలువ / గరిష్ట విలువ – కనిష్ట విలువ
పైన వివరించిన అంశాల సూచికల సాధారణ సగటు విలువనే మానవ అభివృద్ధి సూచికగా లెక్కిస్తారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
లింగ సంబంధిత అభివృద్ధి సూచికను, మానవ పేదరిక సూచికను గురించి ఏమి అనుకుంటున్నావు ?
జవాబు.
1. లింగ సంబంధిత సూచికలు (Gender Related Indices):
1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా రెండు లింగ సూచికలను ప్రవేశపెట్టింది. అవి :

a) లింగ సంబంధిత సూచిక (Gender Related Development Index) :
మానవ అభివృద్ధి సూచికలో చేర్చబడిన ఆయుర్దాయం, విద్యా సంపాదన, ఆదాయం అనే ప్రాథమిక సామర్థ్యాల ఆధారంగా అభివృద్ధిని కొలిచే ప్రయత్నాన్ని ‘లింగ సంబంధీత అభివృద్ధి సూచిక’ చేసింది. మానవ అభివృద్ధి సూచికను లింగ అసమానత్వంతో సర్దుబాటు చేస్తారు.

ప్రాథమిక మానవ అభివృద్ధిలో లింగపరమైన అసమానతలు అధికంగా ఉంటే లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI) మానవ అభివృద్ధి సూచిక కంటే తక్కువగా ఉంటుంది. మానవ అభివృద్ధి సూచికకు, లింగ సంబంధిత అభివృద్ధి సూచికకు మధ్య తేడా అధికంగా ఉంటే అసమానతలు ఎక్కువగా ఉంటాయి.

b) లింగ సాధికార కొలమానం (Gender Empowerment Measure) :
ఆర్థిక రాజకీయ జీవితంలో స్త్రీల భాగస్వామ్యం చురుకుగా ఉందా లేదా అనే దానిని లింగ సాధికార కొలమానం (GEM) తెలుపుతుంది. రాజకీయాలలో పాల్గొనడం (పార్లమెంటు సీట్లలో స్త్రీల వాటా), ఆర్థిక అంశాలలో పాల్గొనడం (ఉన్నత స్థానాల్లో, వృత్తిపరమైన స్థానాల్లో వాటా), ఆర్థిక వనరులపై స్త్రీలకున్న పట్టు (ఆదాయాల్లోని తేడాలు) అనే అంశాలపై లింగ సాధికార కొలమానం దృష్టిని సారిస్తుంది.

2. మానవ పేదరిక సూచిక (Human Poverty Index) :
మానవ పేదరిక సూచిక అనే భావనను మానవ అభివృద్ధి రిపోర్టు (Human Development Report), 1997 ప్రవేశపెట్టింది. ఇది మానవ అభివృద్ధి సూచికలో ఉన్న మానవ జీవనానికి అవసరమైన అంశాలు దీర్ఘాయువు (longevity), పరిజ్ఞానం (Knowledge), ఉన్నత జీవన ప్రమాణాలలో (decent living standards) మానవులు కోల్పోయిన దానిపై లేదా పొందలేకపోయిన (deprivation) దానిపై అధిక శ్రద్ధ వహిస్తుంది. మానవ పేదరిక సూచికను లెక్కించడానికి మానవ అభివృద్ధి రిపోర్టు, 2009 కింద వివరించిన చలన రాసులను ఉపయోగించింది.

  1. 40 సంవత్సరాల వయస్సు కంటే ముందుగా చనిపోయే వారి శాతం
  2. వయోజనులలో నిరక్షరాస్యుల శాతం
  3. ఆరోగ్య సేవలు, రక్షిత మంచి నీరు అందుబాటులో ఉన్న ప్రజల శాతం
  4. పౌష్టికాహార లోపం ఉన్న అయిదు సంవత్సరాలలోపు పిల్లల శాతం.

ప్రశ్న 9.
స్థూల జాతీయ ఆనంద సూచిక భావనను వివరించండి.
జవాబు.
స్థూల జాతీయ ఆనంద సూచిక (Gross National Happiness Index):
భూటాన్ లాంటి దేశాలు వాటి అభివృద్ధిని స్థూల జాతీయ ఆనంద సూచిక ద్వారా కొలుస్తున్నారు. అభివృద్ధిని కొలుస్తున్న ప్రస్తుత పద్ధతిలో మార్పును తేవలసిన అవసరం ఉంది. ప్రగతి లేదా అభివృద్ధిని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తి ప్రత్యామ్నాయ సూచికగా స్థూల జాతీయ ఆనందాన్ని (సంతోషాన్ని) భూటాన్ రూపొందించింది. స్థూల జాతీయ ఆనందం భావనను భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగుక్ (Jigme Singye Wangchuck) 1970 తర్వాతి దశాబ్దిలో వాడారు.

సుస్థిర అభివృద్ధి ప్రగతి భావాలకు సంబంధించి సంపూర్ణ విధానాన్ని పాటించాలని, ఈ సంక్షేమానికి చెందిన ఆర్థికేతర అంశాలకు సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని స్థూల జాతీయ ఆనందం భావన తెలుపుతుంది. బహుకోణ పద్ధతిని ఆధారంగా చేసుకొని స్థూల జాతీయ ఆనంద సూచికను నిర్మించడం జరుగుతుంది. ఈ పద్ధతిని (Alkire-Foster) పద్ధతి అని అంటారు.

స్థూల జాతీయ ఆనందం భావనను నాలుగు ఆధారాలతో వివరించవచ్చు. అవి : సుపరిపాలన, సుస్థిర, సామాజికార్థిక . అభివృద్ధి, సంస్కృతిని కాపాడుట, పర్యావరణ పరిరక్షణ. పై నాలుగు ఆధారాలను తిరిగి తొమ్మిది భాగాలుగా (domains) వర్గీకరించడమైంది. అవి, మానసిక సంక్షేమం, ఆరోగ్యం, విద్య, కాలాన్ని ఉపయోగించుట, సాంస్కృతిక భిన్నత్వం మరియు నిలదొక్కుకొనుట (resilence), సుపరిపాలన, సమాజ సజీవత్వము (vitality) జీవావరణ భిన్నత్వం మరియు నిలదొక్కుకొనుట, “జీవన ప్రమాణాలు.

అన్ని భాగాలకు సమాన భారితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని భాగాలు సంక్షేమానికి సంబంధించిన 33. సూచికలకు లేదా చలన రాసులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. ఒక భాగం (domain) లో ఉండే వివిధ చలన రాసుల భారితాలు సమానంగా ఉండవు. సాధారణంగా ఆత్మాశ్రయ సూచికలకు పరాశ్రయ సూచికల కంటే తక్కువ భారితాలను ఇస్తారు.

ఆనందం విషయంలో సగటులు లెక్కలోకి రావు. అందుచేతనే ప్రతి సూచికలో “కావలసినంత” (sufficiency) అనే ఒక లక్ష్యాన్ని పెద్దారు. ఒక సూచిక విషయంలో వ్యక్తి ఎప్పుడైతే “కావలసినంత” స్థాయిని సాధిస్తాడో అప్పుడు ఆ సూచికకు సంబంధించి వ్యక్తి ‘ఆనందంగా’ ఉన్నట్లు పరిగణిస్తాం. ఈ విధంగా 33 సూచికలకు సంబంధించి వ్యక్తి తెలిపే స్పందనల ఆధారంగా వ్యక్తి ఏ మేరకు ఆనందంగా ఉన్నాడో కింద తెలిపిన పద్దతిలో తీర్పునివ్వడం జరుగుతుంది.

77% – 100% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – మిక్కిలి సంతోషం (deeply happy)
66% – 76% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – అధిక సంతోషం (extensively happy)
50% – 65% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – తక్కువ సంతోషం (narrowly happy)
0% – 49% సూచికలలో కావలసినంత స్థాయి ఉంటే – సంతోషం లేదు లేదా ఇంకా సంతోషం లేదు (unhappy or not yet happy)

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జననాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1,000 మంది జనాభాకు ఉన్న జననాల నిష్పత్తి, కుటుంబ నియంత్రణ పథకాలను పాటించినప్పుడే జననాలరేటు తగ్గటానికి వీలు ఉంటుంది. ప్రతి 1000 మందికి 1901-1921 మధ్య కాలంలో జననాల రేటు 46 నుంచి 49గా ఉండగా, 2010-11 సం॥ నాటికి ఈ రేటు ప్రతి 1000 మందికి 2.18గా ఉంది.

ప్రశ్న 2.
మరణాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1,000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి. 1901-1921 మధ్య కాలంలో మరణాల రేటు ప్రతి 1000 మందికి 44 నుంచి 49గా ఉండగా, ఈ రేటు 2010-11 సం॥ నాటికి ప్రతి 1000కి 7.1గా ఉంది.

ప్రశ్న 3.
శిశు మరణాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1,000 జననాలకు మరణించిన శిశువుల నిష్పత్తి. 20వ శతాబ్దం రెండవ దశకంలో ఈ రేటు ప్రతి 1000కి 218గా ఉండగా, అది 2010-11 నాటికి ప్రతి 1000కి 47గా ఉంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 4.
ప్రసూతి మరణాల రేటు.
జవాబు.
ఒక సంవత్సర కాలంలో 1 లక్షమంది స్త్రీలలో ప్రసవం వల్ల మరణించిన వారి నిష్పత్తి. 2007-09 సం॥ నాటికి 1 లక్ష మంది స్త్రీలలో ప్రసవం వలన మరణించిన స్త్రీల నిష్పత్తి 210గా నిర్ణయించబడినది.

ప్రశ్న 5.
లింగ నిష్పత్తి / స్త్రీ పురుష నిష్పత్తి.
జవాబు.
1,000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య. ప్రస్తుతం అనగా 2011 లెక్కల ప్రకారం 1,000 కు 940గా స్త్రీల సంఖ్య నమోదు అయింది. 1901 సం॥లో ఈ రేటు 972 రేటు ఉండగా అది 1951 సం॥లో 946కు తగ్గింది. మరల 1991 సం॥లో 927కి తగ్గింది. ఈ రేటు 2001 సం॥లో 933గా ఉంది. పేదరికం, స్త్రీ, శిశు మరణాల రేటు ఈ రేటుకి కారణంగా చెప్పవచ్చు.

ప్రశ్న 6.
జనాభా విస్పోటనం.
జవాబు.
ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడటం, విద్య పరిమితంగా ఉండటం మొదలైన కారణాలవల్ల జననాలరేటు అధికంగా ఉండి జనాభా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ దశను జనాభా విస్ఫోటన దశగా పేర్కొంటారు. మన దేశంలో 1921 సం॥ నుండి ఈ దశ ప్రారంభమైంది.

ప్రశ్న 7.
గర్భ నిరోధకాలు.
జవాబు.
కుటుంబ నియంత్రణకు ఉపకరించే సాధనాలు, గర్భ నిరోధకాలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలు గర్భ నిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలు కూడా ముఖ్యపాత్ర నిర్వహిస్తాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 8.
అక్షరాస్యత రేటు.
జవాబు.
చదవడం, రాయటంలో మనిషికున్న సామర్థ్యమే అక్షరాస్యత.
అక్షరాస్యత రేటు = ఏడు సంవత్సరాల వయస్సు పైబడిన జనాభాలో అక్షరాస్యత / మొత్తం జనాభా × 100

ప్రశ్న 9.
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్.
జవాబు.
దీని ప్రధాన లక్ష్యం నగరాలలోని మురికివాడల ప్రజలకు, పేదవారికి అత్యవసర ప్రాథమిక ఆరోగ్య సేవలను కల్పించడం. ఈ పథకాన్ని 1,00,000 మంది జనాభా ఉన్న అన్ని నగరాలలో అమలుచేస్తారు. ఇది నగరాలలోని ఉపాంత కూలీలు, మురికివాడల ప్రజలు, బస్సు, రైల్వే కూలీలు మొదలైన శ్రామికులకు ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తుంది.

ప్రశ్న 10.
జననీ సురక్ష యోజన.
జవాబు.
2005-06 సం॥లో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది. ఇది సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ శిశు మరణాల రేటును తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో కాన్పులు జరిగేటట్లు గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించి ప్రసూతి, శిశు మరణ రేట్లను తగ్గించడం దీని ఆశయం.

ప్రశ్న 11.
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్.
జవాబు.
దీనిని 12-6-2005లో ప్రవేశపెట్టారు. ఆరోగ్య, భౌతిక మరియు మానవ అవస్థాపనా సౌకర్యాలను బలపరచి ఆరోగ్య నైపుణ్యతలను ఉపయోగించుకోవడానికి దీనిని రూపొందించారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

ప్రశ్న 12.
లింగ సాధికారత కొలమానం (GEM).
జవాబు.
ఇది స్త్రీ-పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి.

  1. స్త్రీల ఆయుర్దాయము
  2. వయోజన స్త్రీల అక్షరాస్యత
  3. స్త్రీల తలసరి ఆదాయం.

ప్రశ్న 13.
మానవ పేదరిక సూచిక (HPI).
జవాబు.
మానవ అభివృద్ధి రిపోర్టు 1997 సం॥లో దీనిని ప్రవేశపెట్టింది. ఇది మానవ అభివృద్ధిలో ఉన్న దీర్ఘాయువు, పరిజ్ఞానం, జీవన ప్రయాణం మొదలైన వాటిపై అధిక శ్రద్ధ వహిస్తుంది. దీనిలో కూడా మూడు అంశాలు పరిగణనలోనికి తీసుకుంటారు.

  1. ఆరోగ్య సేవలు పొందుతున్న ప్రజలు
  2. రక్షిత మంచినీరు పొందుతున్న ప్రజలు
  3. పౌష్టిక ఆహార లోపంలో ఉన్న 5 సం॥లోపు వయస్సు పిల్లలు.

Leave a Comment