TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 5th Lesson ఎంట్రప్రిన్యూర్షిప్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 5th Lesson ఎంట్రప్రిన్యూర్షిప్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ను నిర్వచించి, వారి లక్షణాలను వివరించండి.
జవాబు.
ఎంట్రప్రిమ్యార్ అర్థం: ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entrependre” అనే పదం నుండి ఆవిర్భవించింది. దాని అర్థం ఒక కొత్తపనిని చేపట్టడం. అనగా నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్.

ఎంట్రప్రిన్యూర్ నిర్వచనాలు:
1) రిచర్డ్ కాంటిల్లన్ ప్రకారం “నిశ్చితమైన ఖరీదుకు కొన్న ఒక వస్తువును అనిశ్చితమైన ధరకు అమ్మడం, ఈ విధంగా అమ్మడంలో గల లాభ నష్టాలకు సంబంధించిన సమంజసమైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా వనరులను వినియోగంలోకి తెచ్చే వ్యక్తిని ఎంట్రప్రిన్యూర్ గా నిర్వచించవచ్చు.

2) జె.బి. సే ప్రకారం ఎంట్రప్రిన్యూర్ అనేవాడు ఒక ఆర్థిక ఏజెంట్. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఉత్పత్తి కారకాలను సంఘటీకృత పరిచి, వాటికి ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువను నిర్ధారించి దానిలో వేతనాలు, అద్దె, వడ్డీ, లాభాలు అనే భాడీలను విడివిడిగా గుర్తించడమే గాకుండా, తన పెట్టుబడికి పునరుపయోగం కలిగే విధంగా నిర్వహించేవాడు”.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ఎంట్రప్రిన్యూర్ లక్షణాలు:
1. నవకల్పన: నవకల్పన అనగా కొత్త పనులను చేయడం లేదా పాత పనులను కొత్త పద్ధతిలో చేయడం. ఎంట్రప్రిన్యూర్ ప్రస్తుతం లేని ఒక అంశాన్ని ఊహించి, దాన్ని విశ్లేషించి అమలుపరుస్తాడు. పాత భావాలకు స్వస్తి చెప్పడం, కొత్త పద్ధతులకు నాంది పలకడం అతని ముఖ్య లక్షణం.

2. రిస్కు భరించడం: కొత్త వ్యాపారాలేవైనా రిస్కు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ కొత్త వ్యాపారాలలో ఎంట్రప్రిన్యూర్లు విజయం పొందవచ్చు లేదా ఓటిమి చవిచూడవచ్చు. రెండింటికి సిద్ధం కావడమే రిస్కును భరించడం.

3. ఆత్మవిశ్వాసం: ఎంట్రప్రిన్యూర్లకు ఆత్మవిశ్వాసమే మొదటిమెట్టు. వారు తమశక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి పోటీని, అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడమే కాకుండా, పరిస్థితులను తమకనుకూలంగా మార్చుకోగలమనే ధీమా కలిగి ఉంటారు.

4. కఠిన శ్రమ: ఎంట్రప్రిన్యూర్లు కఠిన శ్రమ చేస్తారు. ఇంతకంటే ఎక్కువ శ్రమ చేసేవారు ఉండరనడం అతిశయోక్తి కాదు. అవసరమైన పరిజ్ఞానం, చొరవ, చాకచక్యం కలిగి కఠిన శ్రమ చేయడం వల్ల, వీరి శ్రమకు అత్యధిక విలువ సమకూరుతుంది. లక్ష్యసాధన కోసం వారు ఎన్ని గంటలైనా వరుసగా శ్రమ చేస్తారు.

5. లక్ష్య స్థాపన: లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించడానికి కృషి చేసయడంలోనే ఎంట్రప్రిన్యూర్ నిజమైన సంతృప్తిని పొందుతాడు. కానీ అన్ని లక్ష్యాలను అతడు పరిపూర్ణంగా సాధించలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో వారు తమ లక్ష్యాలను లేదా వాటి సాధనకు అవలంభించే పద్ధతులను పనర్నిర్మించుకొని తిరిగి కృషి చేయడం మొదలుపెడతారు. అంతేకాకుండా ఒక లక్ష్యాన్ని సాధించగలిగిన ఒక ఎంట్రప్రిన్యూర్ వెంటనే మరొక లక్ష్యాన్ని రూపొందించుకోవడం పరిపాటి.

6. జవాబుదారీతనం: ఎంట్రప్రిన్యూర్లు జయాపజయాలను సమానంగా స్వీకరిస్తారు. లక్ష్యాలను సాధించగలిగిన వారికి ప్రశంసలు, ఓడినవారికి నిందలు పరిపాటి. నిజమైన ఎంట్రప్రిన్యూర్ ఓటమిని విజయానికి మెట్టుగా భావించి కొనసాగించవలసి ఉంటుంది. వారు సంపాదించిన లాభాలే వారు సాధించిన విజయాన్ని సూచిస్తాయి.

7. నాయకత్వం:
1) మనిషి యొక్క ఆదర్శవంతమైన గుణానికి ప్రాతినిధ్యం వహించేదే నాయకత్వం ప్రకారం నాయకత్వం అంటే మేనేజర్ తన ఆధీనాధికారులను ఉత్ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉండటం.

2) ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులను ఉపయోగించడానికి నాయకుడు తనను అనుసరించే వారికి నిర్దేశకతను, మార్గదర్శకాన్ని చూపిస్తూ, వారిని ప్రభావితం చేస్తాడు. సమిష్టికృషికి ఔత్సాహికుని నాయకత్వం ఒక శక్తిగా పనిచేస్తుంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి నాయకత్వం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఔత్సాహికుడు విజయవంతమైన ఔత్సాహికుడిగా రాణించాలంటే, అతను తప్పకుండా మంచి నాయకత్వపు గుణాలను కలిగి ఉండాలి.

8. నిర్వహణ నైపుణ్యాలు: ఔత్సాహికునికి నిర్వహణ నైపుణ్యాల అవసరం చాలా ఉంది. నిర్వహణ నైపుణ్యంలో విత్త నిర్వహణ, కార్యాలయ నిర్వహణ, ఉత్పత్తి నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ, ఫ్యాక్టరీ నిర్వహణ మొదలయిన వ్యాపకాలన్నీ ఇమిడి ఉంటాయి. ఇందుకుగాను ఔత్సాహికులు నిర్వహణ నైపుణ్యాల కింద వివిధ అంశాలను పెంపొందించుకోవాలి. స్పష్టమైన విధానాన్ని బాగా ఆలోచించి, నిర్ణయించి రూపొందించాలి, వివిధ విభాగాలలో పనిచేసే సిబ్బందియొక్క విధులు, బాధ్యతలు, అధికారాలు మరియు హక్కుల మధ్య సమతౌల్యతను సాధించాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ విధులను వివరించండి.
జవాబు.
1. నవకల్పన:

  1. ఎంట్రప్రిన్యూర్ అనే పదం ‘నవకల్పన’తో ముడిపడి ఉంటుంది. “నవకల్పన” అంటే కొత్తపనులను చేయడం, లేదా పాతపనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం.
  2. ఇందులో కొత్త వస్తువుల ఉత్పత్తి, కొత్త మార్కెట్లు సృష్టి, కొత్త ఉత్పత్తి పద్ధతులను అమలులోకి తేవడం, ముడిసరుకుల సప్లైలో కొత్త మార్గాలను అన్వేషించడం, ఒక కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని రూపొందించడం మొదలయినవి కలసి ఉంటాయి.

2. రిస్కు భరించడం:

  1. వినియోగదారుల అభిరుచులలో, ఉత్పత్తి పద్ధతులలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు రావడం వల్ల, కొత్త వస్తువులు కనుగొనడం వల్ల చేస్తున్న వ్యాపారాలకు నష్టాలు ఏర్పడవచ్చు. ఈ నష్టాలను భరించడానికి ఎంట్రప్రిన్యూర్ సిద్ధంగా ఉండాలి.
  2. పై మార్పులవల్ల ప్రయోజనాలు కలిగితే వీటిని ఎంట్రప్రిన్యూర్ అనుభవిస్తాడు. కాబట్టి నష్టాన్ని కూడా అతనే భరించాలి.
  3. జె.బి.సే ప్రకారం రిస్ను భరించడమనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి.

3. వ్యవస్థీకరణ, నిర్వహణ:

  1. ఎంట్రప్రిన్యూర్ తాను అందించదలచిన వస్తుసేవల రకాలు, వాటి స్వభావాలు ముందుగా నిర్ణయించవలసి ఉంటుంది. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఈ ఉత్పత్తి కారకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి. ఎంట్రప్రిన్యూర్ వాటిని సేకరించి వస్తువు సేవల ఉత్పత్తికి వీలుగా వాటిని మలచుకొనవలసి ఉంటుంది.
  2. వ్యాపార సంస్థ పరిమాణంలో గానీ, స్థల నిర్ణయంలోగానీ, ఉత్పత్తి పద్ధతులలోగానీ అవసరమైన మార్పులు చేయడమేగాక, రోజువారీ నిర్వహణకు అవసరమైన ఉత్పత్తి ప్రణాళికలు, అమ్మకాల ‘నిర్వహణ, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన విధులను కూడా అతడు చేపట్టవలసి ఉంటుంది.
  3. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వ్యవస్థీకరణ, నిర్వహణ అనేవి ఎంట్రప్రిన్యూర్ ముఖ్య విధులు.

4. వ్యాపార ప్రణాళికలు:
1) ఔత్సాహికుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని రూపొందించి, వాస్తవ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి పరిణామాలను ఊహిస్తూ భవిష్యత్ను అంచనా వేయాలి.

2) వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికీకరణ చేయడానికి, ముడిసరుకు అవసరాన్ని గుర్తించడం, సిబ్బంది అవసరాలను అంచనావేయడం, ఉత్పత్తి షెడ్యూళ్ళను నిర్ణయించడం, అమ్మకాలు, ఇన్వెంటరీ, వ్యాపార ప్రకటనలు, బడ్జెట్ల కేటాయింపు వినియోగదారుల అవసరాలు, పోటీదారులు బలాలు, బలహీనతలు మొదలయినవి అధ్యయనం చేయాలి.

3) క్రమబద్ధమైన వ్యాపార ప్రణాళికీకరణను రూపొందించాలంటే, ఔత్సాహికుడు తప్పకుండా వ్యాపార లక్ష్యాలను, విధానాలను, వ్యాపార సరళిని, కార్యక్రమాలను, బడ్జెట్లను దృష్టిలో ఉంచుకోవాలి.

4) సరైన ప్రణాళికను రూపొందించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా, క్రమరీతిలో వ్యాపార కార్యకలాపాలను చేపట్టవచ్చు. ముందుగా నిర్ణయించిన విధంగా వ్యాపారానికి మార్గదర్శకం ఏర్పడుతుంది. తద్వారా ఇతర నిర్వహణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించబడతాయి. కాబట్టి ఔత్సాహికులు ఈ వ్యాపార ప్రణాళికీకరణ విధులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది.

5. నిర్ణయాలు తీసుకోవడం:

  1. ఔత్సాహికుడు నిర్వర్తించాల్సిన మరొక ముఖ్యమైన విధి, నిర్ణయాలు తీసుకోవడం.
  2. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వ్యాపార సంస్థను కొనసాగించడానికి లేదా నిర్వహించడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి.
  3. ఏ వ్యాపారసంస్థ అయినా విజయవంతం కావాలంటే, పురోగతిని సాధించాలంటే ఔత్సాహికుని నిర్ణయాలు ఎక్కువగా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 3.
వివిధ రకాల ఎంట్రప్రిన్యూర్ల గురించి వివరంగా తెలపండి.
జవాబు.
L డానఫ్ ప్రకారం ఎంట్రప్రిన్యూర్ల వర్గీకరణ: అమెరికాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో డాన్హాఫ్ ఎంట్రప్రిన్యుర్లు నాలుగు రకాలుగా విభజించినాడు.

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రపిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు: నవకల్పన కర్త ఘంపీటర్ దృష్టిలో ఎంట్రప్రిన్యూర్ అంటే కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడం, కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంభించడం, కొత్తమార్కెట్లను రూపొందించే వ్యక్తి. కొత్తగా ప్రయోగాలు చేసి, విజయవంతమైన వాటిని విస్తరింపజేసి, ఆకర్షణీయ అవకాశాలన్నింటిని అమలుపరచడం ఇతడికి నిత్యకృత్యం.

2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు: వీరు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులను ఉత్పత్తి చేస్తారు.

3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు రెండు రకాలకు చెందరు. వీరు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు, వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు. వారి పూర్వికులు, సీనియర్లు అవలంభించిన మార్గాలను సులభంగా వాడతారు. కొత్త పద్ధతులు, కొత్తభావాలు, ఒకే మారు కాకుండా నిదానంగా అమలు పరుస్తారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజవేస్తారు.

4. స్థిరచిత్తపు ఎంట్రప్రిన్యూర్లు వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్లు కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు.

II. ఇతర రకాల ఎంట్రప్రిన్యూర్లు:
1. వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్లు: వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్లు ఎక్కువగా చిన్న తరహా వ్యాపార సంస్థను నిర్వహిస్తూ ఉంటారు. ఒక వ్యాపారసంస్థను స్థాపించి, దానికవసరమైన మూలధనాన్ని సమకూర్చి దానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి, అందులో ఉన్న రిస్కును భరించేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తిని వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్ అంటారు.

2. సంస్థాగత ఎంట్రప్రిన్యూర్లు: సంక్లిష్టమైన వ్యవస్థ కలిగిన భారీతరహా సంస్థలను, పరిశ్రమలను స్థాపించడానికి ఒక వ్యక్తి యొక్క శక్తి సరిపోనప్పుడు కొంతమంది వ్యక్తుల సమూహంగానీ, ఒక సంస్థగానీ ఈ పనిని చేపట్టవచ్చు. ఈ విధమైన సంస్థాగత ఎంట్రప్రిన్యూర్లకు సాంకేతిక పరిజ్ఞానం, మూలధనం సేకరించడం సులభం. అంతేగాక ఎంత ఎక్కువ రిస్కునైనా భరించి, మార్పులను అమలుపరచడం కూడా వీరికి సాధ్యం.

3. వారసత్వపు ఎంట్రప్రిన్యూర్లు: వారసత్వపు ఎంట్రప్రిన్యూర్లు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తారు. వారి కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించి నడిపిస్తుంటారు. వీరిని రెండవతరపు ఎంట్రప్రిన్యూర్లు అని కూడా అంటారు.

4. నిర్బంధపు ఎంట్రప్రిన్యూర్లు: కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎంట్రప్రిన్యూర్లుగా మారిన వారిని “నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు” అంటారు. సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగ వ్యక్తులు, వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలపట్ల ఆకర్షితులైన వారు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఈ వర్గానికి చెందుతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

5. వ్యాపార ఎంట్రప్రిన్యూర్లు: వారికున్న గత అనుభవంవల్ల గానీ, శిక్షణద్వారా గానీ ఒక కొత్త వస్తువునుగానీ, సేవనుగానీ, అందించాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తిని వ్యాపార ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఇతడు తనకు కలిగిన భావం ఆధారంగా ఒక చిన్న సంస్థనైనా ప్రారంభించి, తన భావానికి కార్యరూపం ఇచ్చేందుకు కృషి చేస్తాడు.

6. పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు: ఇతడు ఉత్పత్తిదారు పరిశోధన ద్వారాగానీ, ఇతర రకాలుగాగానీ వినియోగదారుల అవసరాలను, కోరికలను అంచనావేసి, తదనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవాడిని పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్ అంటారు.

7. స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు: స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్ తన లక్ష్యసాధనకై, తన సామర్ధ్య నిరూపణకై కృషి చేస్తాడు. తనకంటూ ఒక గుర్తింపు, హోదా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ అందుకు తన శాయశక్తులా కృషిచేస్తాడు.

8. ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు: ప్రభుత్వంగానీ, ప్రభుత్వేతర సంస్థలుగానీ అందించే ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని రాయితీలను, సబ్సిడీలను, శిక్షణలను, ఇతర ప్రయోజనాలను పొందడానికై ప్రేరేపించబడి ఎంట్రప్రిన్యూర్గా అవతరించే వ్యక్తిని ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్, అంటారు.

ప్రశ్న 4.
ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్ల మధ్య వ్యత్యాసాలు తెలుపండి.
జవాబు.
ఎంట్రప్రిన్యూర్

  1. ఎంట్రప్రిన్యూర్ ఒక వ్యక్తి.
  2. ఎంట్రప్రిన్యూర్ పరిపాలనాకర్త.
  3. ఎంట్రప్రిన్యూర్ రిస్క్ ను భరిస్తాడు.
  4. ఎంట్రప్రిన్యూర్ నవకల్పన కర్త.
  5. ఎంట్రప్రిన్యూర్ ఉత్పత్తికారకాల సమ్మేళన పరుస్తాడు.
  6. ఎంట్రప్రిన్యూర్ ప్రారంభకుడు, చొరవ తీసుకునే వ్యక్తి.
  7. ఎంట్రప్రిన్యూర్ నాయకుడు.

ఎంట్రప్రిన్యూర్ షిప్

  1. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక కార్యాచరణ ప్రణాళిక.
  2. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక పరిపాలనాంశం.
  3. ఎంట్రప్రిన్యూర్షిప్ రిష్తో కూడిన చర్య.
  4. ఎంట్రప్రిన్యూర్షిప్ నవకల్పన ప్రక్రియ.
  5. ఎంట్రప్రిన్యూర్షిప్ ఉత్పత్తికారకాల వినియోగ ప్రక్రియ.
  6. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది సంస్థను ప్రారంభం చేయడం, చొరవతీసుకునే చర్య.
  7. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది నాయకత్వమే.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార ప్రణాళికీకరణ అంటే ఏమిటి ?
జవాబు.
1) ఔత్సాహికుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని రూపొందించి, వాస్తవ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి పరిణామాలను ఊహిస్తూ..భవిష్యత్ను అంచనా వేయాలి.

2) వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికీకరణ చేయడానికి, ముడిసరుకు అవసరాన్ని గుర్తించడం, సిబ్బంది అవసరాలను అంచనావేయడం, ఉత్పత్తి షెడ్యూళ్ళను నిర్ణయించడం, అమ్మకాలు, ఇన్వెంటరీ, వ్యాపార ప్రకటనలు, బడ్జెట్ల కేటాయింపు వినియోగదారుల అవసరాలు, పోటీదారులు బలాలు, బలహీనతలు మొదలయినవి అధ్యయనం చేయాలి.

3) క్రమబద్ధమైన వ్యాపార ప్రణాళికీకరణను రూపొందించాలంటే, ఔత్సాహికుడు తప్పకుండా వ్యాపార లక్ష్యాలను, విధానాలను, వ్యాపార సరళిని, కార్యక్రమాలను, బడ్జెట్లను దృష్ఠిలో ఉంచుకోవాలి.

4) సరైన ప్రణాళికను రూపొందించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా, క్రమరీతిలో వ్యాపార కార్యకలాపాలను చేపట్టవచ్చు. ముందుగా నిర్ణయించిన విధంగా వ్యాపారానికి మార్గదర్శకం ఏర్పడుతుంది. తద్వారా ఇతర నిర్వహణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించబడతాయి. కాబట్టి ఔత్సాహికులు ఈ వ్యాపార ప్రణాళికీకరణ విధులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ రిస్కున్ను భరించే విధులు ఏమిటి ?
జవాబు.

  1. వినియోగదారుల అభిరుచులలో, ఉత్పత్తి పద్ధతులలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు రావడం వల్ల, కొత్త వస్తువులు కనుగొనడం వల్ల చేస్తున్న వ్యాపారాలకు నష్టాలు ఏర్పడవచ్చు. ఈ నష్టాలను భరించడానికి ఎంట్రప్రిన్యూర్ సిద్ధంగా ఉండాలి.
  2. పై మార్పులవల్ల ప్రయోజనాలు కలిగితే వీటిని ఎంట్రప్రిన్యూర్ అనుభవిస్తాడు. కాబట్టి నష్టాన్ని కూడా అతనే
    భరించాలి.
  3. జె.బి.సే ప్రకారం రిస్ను భరించడమనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి.

ప్రశ్న 3.
నవకల్పన అనే విధితో ఏ విధంగా సృష్టించడం విభేదిస్తుందో తెలపండి.
జవాబు.

  1. నవకల్పన అంటే కొత్త పనులను చేయడం, లేదా పాత పనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం ఇందులో కొత్త వస్తువులు ఉత్పత్తి, కొత్త మార్కెట్ల సృష్టి, కొత్త ఉత్పత్తి పద్దతులను అమలులోకి తేవడం మొదలైనవి ఇమిడి ఉంటాయి.
  2. సృష్టించడం అంటే కొత్త భావాలు, సిద్ధాంతాలను రూపొందించడం, కొత్త పద్ధతులు కనుగొనడం.
  3. సృష్టించడంలో కొత్త పద్ధతులను, సిద్ధాంతాలను కనుగొంటే నవకల్పనలో ఆ కనుగొన్న కొత్త సిద్ధాంతాలను, పద్ధతులను వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడం జరుగుతుంది.

ప్రశ్న 4.
డానఫ్ ఔత్సాహికులను ఏ విధంగా వర్గీకరించాడో తెలియజేయండి.
జవాబు.
అమెరికాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో డాన్హాఫ్ ఎంట్రప్రిన్యూర్లు నాలుగు రకాలుగా విభజించినాడు.

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రపిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

ఎ. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు:

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్ అంటే కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడం. కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం, కొత్త మార్కెట్లను రూపొందించే వ్యక్తి.
  2. కొత్తగా ప్రయోగాలు చేసి, విజయవంతమైన వాటిని విస్తరింపజేసి, ఆకర్షణీయ అవకాశాలన్నింటినీ అమలుపరచడం ఇతడికి నిత్యకృత్యం.

బి. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు:

  1. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులనే ఉత్పత్తి చేస్తుంటారు.
  2. ఇతర దేశాలలో, ఇతర మార్కెట్లటో విజయవంతమైన వస్తువులు, అభివృద్ధి చెందని దేశాలలో పూర్తిగా వినియోగించే అవకాశం లేనపుడు అలాంటి వస్తువులలో స్వల్పమైన మార్పులను చేసి ఈ ఎంట్రప్రిన్యూర్లు తమ దేశాలలో తమ మార్కెట్లలో ప్రవేశపెడతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

సి. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు:

  1. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. వేగవంమైన మార్పులను వీరు అంగీకరించరు.
  2. వారి పూర్వీకులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వీడలేరు. కొత్త పద్ధతులు, కొత్త భావాలను ఒకేమారు కాకుండా నిదానంగా అమలుపరుస్తుంటారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

డి. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు:

  1. వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు.
  2. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు. కానీ మార్పులకు అంగీకరించరు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entrependre” అనే పదం నుండి ఆవిర్భవించింది. అంటే ఒక కొత్త పనిని చేపట్టడం అని అర్థం. అనగా నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టే వాడే ఎంట్రప్రిన్యూర్.
  2. జె.బి. సే ప్రకారం ఎంట్రప్రిన్యూర్ అనేవాడు ఒక ఆర్థిక ఏజెంట్. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఉత్పత్తి కారకాలను సంఘటీకృతపరిచి, వాటిని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువను నిర్థారించి దానిలో వేతనాలు, అద్దె, వడ్డీ, లాభాలు అనే భాగాలను విడివిడిగా గుర్తించడమే గాకుండా, తన పెట్టుబడికి పునరుపయోగం కలిగే విధంగా నిర్వహించేవాడినే ఎంట్రప్రిన్యూర్ గా పేర్కొనవచ్చు.

ప్రశ్న 2.
సంస్థ నిర్వచనం.
జవాబు.

  1. నష్టభయంతో కూడిన, సంక్లిష్టమైన, కష్టతరమైన పనిని అనేక మంది చేపట్టే వ్యాపకాన్ని లేదా ప్రాజెక్టును, ఎంట్రప్రెస్’గా నిర్వచించవచ్చు.
  2. సాహసంతో కూడిన వ్యాపారాన్ని చేయడానికి సృష్టించబడిన వ్యవస్థనే ‘ఎంటర్ప్రైస్’ అంటారు. వ్యాపార వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేకమైన వ్యాపకం లేదా ఆర్థిక సంబంధం కలిగిన వ్యవహారంగా పేర్కొంటారు.
  3. ఔత్సాహికుడు చేపట్టే వ్యాపారాన్నే ‘ఎంటర్ప్రైస్’ లేదా “వ్యాపార సంస్థగా” పేర్కొంటారు.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్షిప్.

  1. ఉత్పత్తికారకాలను అత్యల్పస్థాయిలో వినియోగించి, వాటివల్ల ప్రయోజనాలను అత్యధిక స్థాయిలో పొందగలడమనే శక్తి లేదా సామర్థ్యమే ఎంట్రప్రిన్యూర్షిప్ అని పేర్కొనవచ్చు.
  2. ఎ.హెచ్.కోల్ ప్రకారం “ఎంట్రప్రిన్యూర్షిప్. అంటే ఒక వ్యక్తిగానీ, వ్యక్తుల సముదాయం గానీ చేపట్టిన ఒక అర్థవంతమైన చర్య. ఆర్థిక వస్తుసేవల ఉత్పత్తి లేదా పంపిణీలను ప్రారంభించడం లేదా నిర్వహించడం ద్వారా లాభార్జన కోసం, ఉద్దేశించినదే “ఎంట్రప్రిన్యూర్”.
  3. దేశ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం, రిస్క్ ను భరించడం, ఏదో ఒక కొత్తదనాన్ని సృష్టించడం, వనరులను సమీకృతం చేసి వాటి మధ్య సమన్వయాన్ని సాధించడమనేది ఎంట్రప్రిన్యూర్షిప్ ముఖ్య విధులు.

ప్రశ్న 4.
సమతుల్య ప్రాంతీయాభివృద్ధి.
జవాబు.
అభివృద్ధి చెందని వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్నే సమతుల్య ప్రాంతీయాభివృద్ధి అంటారు.
ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశ సమతుల్య ప్రాంతీయాభివృద్ధి ఎంతో అవసరం.

ప్రశ్న 5.
నాయకత్వం.
జవాబు.

  1. మనిషి యొక్క ఆదర్శవంతమైన గుణానికి ప్రాతినిధ్యం వహించేదే నాయకత్వం, ప్రకారం నాయకత్వం అంటే మేనేజర్ తన ఆధీనాధికారులను ఉత్ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉండటం.
  2. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులను ఉపయోగించడానికి నాయకుడు తనను అనుసరించే వారికి నిర్దేశకతను, మార్గదర్శకాన్ని చూపిస్తూ, వారిని ప్రభావితం చేస్తాడు. సమిష్టికృషికి ఔత్సాహికుని నాయకత్వం ఒక శక్తిగా పనిచేస్తుంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి నాయకత్వం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 6.
నవకల్పన.
జవాబు.

  1. “నవకల్పన” అంటే కొత్తపనులను చేయడం, లేదా పాతపనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం.
  2. ఇందులో కొత్త వస్తువుల ఉత్పత్తి, కొత్త మార్కెట్లు సృష్టి, కొత్త ఉత్పత్తి పద్ధతులను అమలులోకి తేవడం, ముడిసరుకుల సప్లైలో కొత్త మార్గాలను అన్వేషించడం, ఒక కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని రూపొందించడం మొదలయినవి కలసి ఉంటాయి.

ప్రశ్న 7.
అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులనే ఉత్పత్తి చేస్తుంటారు.
  2. ఇతర దేశాలలో, ఇతర మార్కెట్లటో విజయవంతమైన వస్తువులు, అభివృద్ధి చెందని దేశాలలో పూర్తిగా వినియోగించే అవకాశం లేనపుడు అలాంటి వస్తువులలో స్వల్పమైన మార్పులను చేసి ఈ ఎంట్రప్రిన్యూర్లు తమ దేశాలలో తమ మార్కెట్లలో ప్రవేశపెడతారు.

ప్రశ్న 8.
నిదానపు ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు.
  2. వారి పూర్వీకులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వీడలేరు. కొత్త పద్ధతులు, కొత్త భావాలను ‘ఒకేమారు కాకుండా నిదానంగా అమలుపరుస్తుంటారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

ప్రశ్న 9.
స్థిరచిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు.
  2. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూనివేయడానికైనా సిద్ధపడతారు. కానీ మార్పులకు అంగీకరించరు.

ప్రశ్న 10.
నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎంట్రప్రిన్యూర్లుగా మారిన వారిని “నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు’ అంటారు.
  2. సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగ వ్యక్తులు, వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలపట్ల ఆకర్షితులైన వారు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఈ వర్గానికి చెందుతారు.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు ఉత్పత్తిదారులు.
  2. పరిశోధన ద్వారా గాని, ఇతర రకాలుగా వినియోగదారుల అవసరాలను, కోరికలను అంచనావేసి, తదనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవారిని పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు అంటారు.

ప్రశ్న 12.
స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు..
జవాబు.

  1. స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు తమ నమ్మకాన్ని సామర్ధ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
  2. వీరు ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లకు భిన్నమైన వారు. స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు ఇతరులచే ప్రేరేపించబడరు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 13.
స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు తమ లక్ష్యసాధనకై, తమ సామర్ధ్య నిరూపణకై కృషి చేస్తారు.
  2. తమకంటూ ఒక గుర్తింపు, హోదా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ అందుకు తమ శాయశక్తులా కృషి చేస్తారు.

ప్రశ్న 14.
కార్పోరేట్ ఎంట్రప్రిన్యూర్లు.

  1. ఒక కంపెనీని ప్రారంభించే వ్యక్తిని కార్పొరేట్ ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఇతడినే వ్యవస్థాపకుడు అని కూడా
    అంటారు.
  2. ఇతడు కంపెనీల చట్టం కింద ఒక కంపెనీని రూపొందించి, నమోదుచేయించి, దానికి న్యాయబద్ధమైన అస్తిత్వాన్ని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 15.
ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.
ప్రభుత్వంగాని, ప్రభుత్వేతర సంస్థలు గానీ అందించే ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని, రాయితీలు, సబ్సిడీలను, శిక్షణలను, ఇతర ప్రయోజనాలను పొందడానికై ప్రేరేపించబడి ఎంట్రప్రిన్యూర్గా అవతరించే వ్యక్తిని ప్రేరిపిత ఎంట్రప్రిన్యూర్ అంటారు.

ప్రశ్న 16.
వృత్తిరీత్యా ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.
వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమే వృత్తిగా కలిగి ఉంటారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని మరొకరికి అమ్మివేసి, మరొక వ్యాపారాన్ని ప్రారంభించే సన్నాహాలు మొదలుపెడతారు. స్వయంగా స్థాపించిన వ్యాపారాన్నైనా నిర్వహణ చేసే ఆసక్తి వీరికి ఉండదు.

ప్రశ్న 17.
పాత తరం ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.
వీరు తమకు రావలసిన ఆర్ధిక లాభాలను గురించి తప్ప, సంస్థ వృద్ధిని కూడా పట్టించుకోరు. సంస్థలో వృద్ధి లేకున్న తమకు గరిష్ఠ లాభాలుంటే చాలని కోరుకుంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 18.
చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహికులు.
జవాబు.
పరిశ్రమ వర్గీకరణ ఆధారంగా ఔత్సాహికులను భారీ తరహా, మధ్యతరహా, చిన్నతరహా పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లుగా విభజించారు. వారికున్న గత అనుభవం వల్లగాని, శిక్షణద్వారా గారి ఒక కొత్త వస్తువునుగాని సేవనుగానీ అందించాలనే ఉద్దేశం కలిగి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులను చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహికులు అంటారు.

Leave a Comment