TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 11th Lesson యూరోపియన్ల రాక

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
బేగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనను వర్ణించండి.
జవాబు.
కో కర్ణాటక యుద్ధం సందర్భంగా క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు యుద్ధ నిర్వహణలో చూపిన చురకుతనం, ఇంగ్లీష్ విజయానికి కారణమైంది. కర్ణాటక రాజ్య రాజధానియైన ఆర్కాట్ను ఆక్రమించాడు. ఈ విజయం రెండో కర్ణాటక యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచి వారి పరాజయానికి నాంది పలికింది. ఫ్రెంచివారి భవిష్యత్కు, డూప్లేకు ఈ యుద్ధం తీరని నష్టం కలిగించింది. బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది.

ఫ్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757, 23 జూన్) : భారతదేశంలో ఆంగ్లేయుల లేదా తూర్పు ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటక విజయాలు ఎంత దోహదం చేసాయో, భవిష్యత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు, పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీయుద్ధం (క్రీ.శ. 1757) అంత కంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని చరిత్రకారుల వాదన. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్గాలా (అలీవర్దీఖాన్ మనవడు), బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. ఈ యుద్ధానికి ముఖ్య కారణాలు (1) బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, (2) ఫ్రెంచి వారితో బెంగాల్ నవాబ్లకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, (3) బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, (4) సిరాజ్ ఉదౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబుగా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక.

సిరాజ్ ఉదౌలా సేనాధిపతియైన మీర్ జాఫర్, అమీర్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహులను తమ వైపు త్రిప్పుకున్న రాబర్ట్క్లెవ్ యుద్ధానికి సిద్ధమైనాడు. పైన పేర్కొన్న వారితోపాటు మాణిక్ చంద్ (బ్యాంకరు) జగత్ సేవ్, రాయుర్లబ్లు సిరాజ్న మోసగించి, రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. చివరికి సిరాజ్ ఉదౌలా సేనాని మీర్ కాసీం కూడా క్లైవ్ పక్షం చేరాడు. ఇరుపక్షాల సేనలకు, జూన్ 23, 1757న, ప్లాసీ వద్ద నామమాత్రం యుద్ధం జరిగింది. నమ్మకద్రోహం చేసిన మీరాఫర్ క్లైవు విజయం చేకూర్చారు. సిరాజ్ ఉద్దెల ఓడింపబడి వధింపబడ్డాడు. మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఫ్రెంచి వారి స్థావరమైన చంద్రనగర్ను బ్రిటిష్వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచివారి ప్రాభల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీకి స్వేచ్ఛ రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారీని పొందింది.

బక్సార్ యుద్ధం (22 అక్టోబర్ 1764) : మీర్ జాఫర్ నేతృత్వంలోని, బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దోపిడి చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలు నష్టపోయారు. మద్రాస్, బొంబాయిలలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చులు కూడా బెంగాల్పై రుద్దారు. మీరజాఫర్కు బెంగాల్ నవాబగిరి ముల్లకంచెగా మారింది. క్లైవ్ అ భారతదేశంలో బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించబడిన వాని ్సత్తార్ మీర్జాఫర్ను నవాబ్ పదవి నుంచి తొలగించి, అతని అల్లుడైన మీర్ ఖాసింను చేశాడు. దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్ ఆంగ్లేయులకు బర్ద్వాన్, మిడాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను అప్పగించాడు. కంపెనీ అధికారులకు మీరఖాసిం 29 లక్షలు చెల్లించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

మీరాసిం కొంతకాలం తరువాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటీష్ వారికి నచ్చలేదు. దీనితో ఆగ్రహించిన కంపెనీ అధికారులు అతడిని పదవి నుంచి తొలగించారు. మళ్ళీ మీర్జాఫర్ను బెంగాల్ నవాబ్ చేశారు.

చివరికి పదవికోల్పోయిన మీర్ ఖాసిం, మొగల్ చక్రవర్తి షాఆలం, అవద్ నవాబ్ షుజా ఉద్దేలా మొదలైనవారి సహకారం, సేనలతో బక్సార్ వద్ద క్రీ.శ. 1764 అక్టోబర్ 22న, బ్రిటీష్ సేనలతో యుద్ధం చేశాడు. బ్రిటీష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. చివరికి యుద్ధంలో మొగల్ చక్రవర్తి షా ఆలం, అవద్ నవాబ్లు ఓడిపోయారు. క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారులు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా క్రీ.శ. 1757, 1764లలో జరిగిన ఫ్లాసీ, బక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబ్ పరాజయం, భవిష్యత్లో బ్రిటీష్ అధికార విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపైనాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతను తెలియజేసింది. ఈ యుద్ధంలో మొగల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం
జరిగింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిశిస్తు విధానాలను వివరించండి.
జవాబు.
1785కు పూర్వం బెంగాల్లో ప్రతి ఏటా భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం పాట ద్వారా అత్యధిక రేటు చెల్లించడానికి సిద్ధమైన వారికి ఇచ్చేవారు. వీరినే జమీందార్లు అనేవారు. దీనివల్ల కంపెనీకి అనేక నష్టాలుండేవి. ఈ సమస్య పరిష్కారానికి ‘వారన్ హేస్టింగ్స్’ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ‘ఐదు సంవత్సరాల ఒడంబడిక’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాని ఇంగ్లాండ్లోని గృహ ప్రభుత్వం ‘వార్షిక రెవిన్యూ ఒడంబడిక పద్దతినే సమర్థించింది. క్రీ.శ. 1786వ సంవత్సరంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్గా భారతదేశం వచ్చిన లార్డ్ కారన్ వాలీస్ బెంగాల్లో అమలులో ఉన్న భూమిశిస్తు విధానాన్ని సరిదిద్దడానికి కొత్త విధానాన్ని రూపొందించాడు.

క్రీ.శ. 1768లో ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ కారన్ వాలీస్ ను, పదిఏండ్ల భూమిశిస్తు ఒడంబడిక చేసుకోవల్సిందిగా సూచించింది. దీన్నే తరువాత కాలంలో ‘శాశ్వత భూమిశిస్తు’ విధానంగా వర్ణించారు. సరానార్ సహకారంతో క్రీ.శ. 1786-1789 మధ్యకాలంలో కారన్ వాలీస్ బెంగాల్లో భూమి సర్వే, రికార్డుల పరిశీలన, అంతవరకు అమలులో ఉన్న పద్దతులు మొదలైనవి అధ్యయనం చేశాడు. 1793లో శాశ్వత భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో కారన్ వాలీస్ గతంలో కేవలం భూమిశిస్తు వసూలు అధికారాలు పొందిన జమీందార్లను, సమాజంలో అత్యంత ప్రభావవంతులైన వారిగా మార్చాడు. వారిని బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిరక్షణకు, వలసవాడ పరిరక్షణకు భారతదేశంలో సరైన ఏజెంటులుగా మార్చాడు. ప్రతి జమీందారు ప్రభుత్వానికి నిర్ధారించిన భూమిశిస్తు మొత్తాన్ని పదేండ్లకాలానికి ముందుగానే నిర్ణయించిన కాలానికే చెల్లించేట్లు అంగీకరింపచేశాడు. దీనివల్ల భూమిపై జమిందార్కు గతంలో కంటే తక్కువ యాజమాన్యపు హక్కు చేకూరింది. అన్ని రకాలుగా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. రైతాంగం జమీందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చింది. వారి కష్టనష్టాలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశాలు అంతరించాయి. బ్రిటీష్వారికి వినయంగా, విధేయులుగా ఉన్నంతకాలం ఈ జమీందార్లు తమ ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. క్రమంగా ఈ జమీందార్లు వంశపారంపర్యపు హక్కులు పొందారు. కంపెనీకి ఈ కొత్త భూమి శిస్తు విధానం వల్ల అన్ని రకాల లాభాలు సమకూరాయి. భారతదేశంలో బ్రిటీష్ అధికార రక్షకులుగా ఈ జమిందార్లు ఎదిగారు. 1857 తిరుగుబాటుకాలంలో వారు చేసిన సహాయాన్ని బ్రిటీష్ అధికారులు స్వయంగా ప్రశంసించారు.

కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమిశిస్తు విధానం రైతాంగం పాలిట శాపంగా మారింది. వారిపై పన్ను భారం పెరిగింది. భూమిపై ఎలాంటి హక్కు లేకుండాపోయింది. కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి కాలాల్లో కూడా రైతాంగం తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయం భారంగా, లాభహీనంగా మారింది. రైతులు, రైతుకూలీలు నష్టపోయారు.

రైత్వారీ విధానం : ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన భూమిశిస్తు (రెండో) విధానం రైత్వారీ పద్ధతి. దీన్ని సరాథామస్మన్రో, మద్రాస్ ప్రసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. దీనికి ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ అంగీకరించాడు. రైతుతో ప్రత్యక్ష ఒడంబడిక చేసుకోవాలన్నది రైత్వారీ పద్ధతి అతి ముఖ్య లక్ష్యం. క్రీ.శ. 1792లో ముందుగా ఈ పద్ధతిని బారాముల్లా (సేలం)లో ప్రవేశపెట్టారు. దీనికి కెప్టెన్ రీడ్ మూలసూత్రధారి. కెప్టెన్ రీడ్ అనుచరుల్లో ఒకడైన థామస మన్రో 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాల (దత్తమండలాల) కలెక్టర్గా నియమించబడ్డాడు. అక్కడ దీన్ని మన్రో విజయవంతంగా అమలుచేశాడు. రైత్వారీ పద్దతిని మన్రో రైతు సంక్షేమ దృష్టితో అమలు చేశాడు. దీని వల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. పండించిన పంటలో 1/3 వంతు ప్రభుత్వం శిస్తు రేటుగా నిర్ణయించింది. రైతులందరికీ ‘పట్టాలు’ ఇప్పించాడు. దీనివల్ల వారికి రక్షణ చేకూరింది. ఆ తరువాత కాలంలో దక్షిణ భారతదేశంలోని తంజావూర్, ఆర్కాట్, కోయంబత్తూర్, మలబార్ మొదలైన ప్రాంతాల్లో ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. క్రీ.శ. 1818 నాటి మూడో మరాఠా ఆంగ్లో యుద్ధం తరువాత బొంబాయి ప్రసిడెన్సీలోని అత్యధిక ప్రాంతాలపై కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. ఇక్కడ కూడా ‘రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ పండిన పంటలో 55% ప్రభుత్వ వాటాగా (శిస్తు రేటుగా) నిర్ణయించారు.

వాస్తవానికి ఈ రైత్వారీ భూమిశిస్తు పద్ధతి జమీందారీ వ్యవస్థ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ప్రతిరైతు, గ్రామాలు లాభపడ్డాయి. సామాజిక చైతన్యానికి రైత్వారీ పద్ధతి పునాదులు వేసింది. సమాజంలో అంతవరకు కొనసాగిన భూమి ఆధారిత యాజమాన్యపు హక్కు, సామాజిక హోదా తగ్గింది. కాని గవర్నమెంట్ ఏజెంట్లు రైతాంగాన్ని మళ్ళీ పీడించారు. ఫలితంగా ఆర్థికంగా రైతులు పూర్తిస్థాయిలో పేదరిక చక్రం నుంచి విముక్తి పొందలేరు. సీడెడ్ జిల్లాలో మన్రో ప్రయత్నం గొప్ప విజయాలు సాధించినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యవర్తుల, ఏజెంట్లు స్వార్థం, లంచగొండతనం వల్ల విఫలమైంది.

ప్రశ్న 3.
కర్ణాటక యుద్ధాలకు దారితీసిన కారణాలు, ఫలితాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాల – క్రమంలో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచి వారి మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచి వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. నాటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు ఎదురులేకపోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744 – 48) : 1742లో ‘డూప్లే’ ఫ్రెంచ్ గవర్నర్ గా నియమించబడ్డాడు. భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారి స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఫ్రెంచి వారు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనితో ఆంగ్లేయులు యుద్ధవిరమణ చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ఫ్రెంచి సైన్యం లాబొర్డినాయి నాయకత్వంలో భారతదేశం వచ్చింది. ఆ ధైర్యంతో 1746లో ఫ్రెంచివారు ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. దాంతో నవాబు ఫ్రెంచి వారిని వైదొలగమని హెచ్చరించాడు. ‘శింధోమ్’ వద్ద నవాబు సైన్యం ఫ్రెంచి సైన్యానికి జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ఓటమి పాలయ్యాడు. ఈలోగా యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. దానితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించారు. రెండవ కర్ణాటక యుద్ధం (1749 – 1754) : 1748లో హైదరాబాద్ నిజాం ఉలుల్క్ మరణించటంతో, సింహాసనం కోసం కుమారుడు నాజర్ంగ్, మనుమడు ముజఫర్లాంగ్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అలాగే కర్ణాటక సింహాసనం కోసం చందాసాహెబ్కు అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్, ముజఫర్లాంగ్లు ఫ్రెంచి గవర్నర్ డూప్లే సాయాన్ని కోరారు. వీరికి సహాయం చేసి దక్కన్లో తమ ప్రాభవాన్ని పెంచుకుందామని డూప్లే భావించాడు. 1749లో ఆయూర్ వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. నాజర్డింగ్ ఆంగ్లేయుల సాయంతో ముజఫర్ జంగ్ను ఓడించాడు, కానీ ఫ్రెంచి వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచివారు ముజఫర్ంగ్ను నవాబును చేసారు. ‘బుస్సీ’ హైదరాబాద్లో రక్షణగా ఉన్నాడు. 1751లో జరిగిన యుద్ధంలో ఫ్రెంచివారు ఓడారు. తరువాత 1752లో రాబర్ట్ క్లైవ్ కర్ణాటకలో చందాసాహెబ్ను ఓడించి వధించాడు. ఈ స్థితిలో డూప్లే స్థానంలో గాడెహ్యును నియమించారు. దీంతో కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం (1756 61) : ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. ఫ్రెంచి గవర్నర్గా కౌంట్జిలాలి నియమితుడయ్యాడు. ఇతడు కడలూర్ ఆంగ్లేయుల కోటను ఆక్రమించి మద్రాసు ఆక్రమించడానికి విఫలయత్నం చేశాడు. ఆంగ్లేయులకు సర్ ఐర్ర కూట్ నాయకత్వం వహించాడు. బుస్సీని సాయం రమ్మని ఆజ్ఞాపించాడు. దాంతో ఆంగ్లేయులు నైజాంతో ఒప్పందం చేసుకున్నారు. 1760లో ‘వందవాసి’ వద్ద జరిగిన యుద్ధంలో ఫ్రెంచి సైన్యాన్ని ఓడించి పుదుచ్చేరిని ఆక్రమించి ‘డిలాలి’నిబందీగా ఇంగ్లాండ్ పంపాడు. 1763లో సప్తవర్ష సంగ్రామం ముగియడంతో మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మైసూర్ యుద్ధాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలో క్రీ.శ. 1766 నుంచి 1799 మధ్య నాలుగు యుద్ధాల్లో ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధం క్రీ.శ. 1766 – 1769 మధ్యకాలంలో హైదర్అలీ సేనలకు, ఈస్ట్ ఇండియా సేనలకు జరిగింది. హైదర్ కంపెనీ సేనలను వారి మిత్ర రాజ్యాల సేనలు ఓడించాడు. మద్రాస్ సంధి షరతులను కంపెనీ అంగీకరించింది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780 – 1784) : రెండోసారి 1780వ సంవత్సరంలో మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్వారు ఉల్లంఘించినందువల్ల, మైసూర్ పాలకుడైన హైదర్అ లీ యుద్ధానికి సిద్ధమైనాడు. ఇదే కాలంలో మరాఠా సేనలతో హైదర్ నిమగ్నమై ఉండగా,, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి సహాయం అందించలేదు. మద్రాస్ సంధి షరతులను ఉల్లంఘించింది. అందువల్ల, హైదరాలీ, తన కుమారుడై టిప్పుతో కలిసి రెండోసారి యుద్ధానికి సిద్ధమైనాడు. యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే హైదరాలీ కాన్సర్ వ్యాధితో మరణించాడు. టిప్పు సుల్తాన్ బాధ్యతలు స్వీకరించాడు. చివరికి మంగళూరు సంధితో టిప్పు యుద్ధాన్ని విరవించాడు. ఇరువర్గాలవారు మరాఠాలతో, నిజాంతో స్నేహం చేయమనీ, శ్రీరంగపట్టనాన్ని టిప్పుకు ఇవ్వడానికి అంగీకరించాయి. మూడో మైసూర్ యుద్ధం : మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి. లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్థభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

నాల్గో మైసూర్ యుద్ధం (క్రీ.శ 1798 – 1799) : ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్లకు మధ్య శ్రీరంగపట్టణం సంధి శాశ్వత శాంతిని ప్రసాదించలేదు. 1798 – 1799లో చివరిసారిగా టిప్పుసుల్తాన్ సైన్యం, ఆంగ్ల సేనలతో తలపడింది. దీన్నే నాల్గో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వపు ఒడియార్ వంశానికి చెందిన ఒక మైనర్ బాలున్ని కంపెనీ మైసూర్ పాలకునిగా నియమించింది. మైసూర్ రాజ్యం సైన్యసహాకార ఒప్పందంలో చేరింది.

ప్రశ్న 2.
ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి న్యాయవ్యవస్థను వివరించండి.
జవాబు.
బ్రిటీష్ వారు, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నూతన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. రాబర్ట్ క్లెవ్, వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్ సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి అనేక స్థాయిల్లో కోర్టులను ఏర్పాటు చేశారు. 1772 – 73 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్లో సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1781 నాటికి సుప్రీంకోర్టు అధికారులు, పనితీరు మొదలైన అంశాలు నిర్ధారించారు. వారన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లాస్థాయిలో దివాన్ – ఇ – అదాలత్, ఫౌజ్ దారీ ఇ – అదాలత్ను ఏర్పాటు చేశారు. దివాన్ అదాలత్ సివిల్ కేసులను, కలెక్టర్ నేతృత్వంలో విచారించేది. ఫౌజ్రీ ఇ – అదాలత్ భారతీయ సంతతి అధికారుల ఆధ్వర్యంలో ముస్తీలు, ఖాజీల సలహాలతో పనిచేసేది.

లార్డ్ కారన్ వాలీస్ కాలంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విషయంలో గ్రేడింగ్లను ఏర్పాటు చేశారు. మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయనిపుణులను మున్సిఫ్ కోర్టు అధికారులుగా నియమించారు. కారన్ వాలీస్ బెంగాల్, బీహార్లలో సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. ఇతడు కార్యనిర్వాహక శాఖ అధికారాలను, న్యాయశాఖ అధికారాలను విభజించాడు. క్రిమినల్ కేసులు నవాబ్ బాధ్యత. గవర్నర్ జనరల్ క్రిమినల్ కేసుల తీర్పుల విషయంలో అత్యున్నత న్యాయాధికారి. ‘కారన్ వాలీస్ న్యాయస్మృతి’గా పేరుగాంచిన కోడ్ (సివిల్, క్రిమినల్ సూత్రాలు) ఇతని కాలంలోనే భారతీయ (హిందూ – ఇస్లామిక్) న్యాయసూత్రాలను అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. న్యాయశాఖలో చాలా వరకు విచక్షణ లేకుండా చేశాడు కారన్వాలీస్.

లార్డ్వెల్లస్లీ కాలంలో సదర్ – నిజామత్ అదాలత్లో రెగ్యులర్ జడ్జీలను నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. విలియం బెంటింక్ కాలంలో బెంగాల్లో లార్డ్కరన్ వాలీస్ నెలకొల్పిన నాలుగు సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు. అతడు బెంగాల్ను 20 డివిజన్లుగా విభజించాడు. ప్రతి విడిజన్కు ఒక న్యాయాధికారిని నియమించాడు. వీరందరిపై అధికారి కమీషనర్. ప్రజాసంక్షేమానికి వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. జమిందార్ల, భూస్వాముల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలహాబాద్ సంధి షరతులు.
జవాబు.
క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్ సంధి (1765) బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారాలు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 2.
శ్రీ రంగపట్టణం సంధి షరతులు.
జవాబు.
మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790వ సంవత్సరంలో మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధం ప్రకటించాయి.
లార్డ్ కారన్ వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్ధభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

ప్రశ్న 3.
డూప్లే విజయాలు.
జవాబు.
క్రీ.శ. 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త. తండ్రి ప్రభావంతో ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచి ప్రభుత్వం తరపున పాండిచ్ఛేరికి చేరాడు. తన శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు.

డ్యూమస్ తరువాత డూప్లే ఫ్రెంచి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక, యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16, 17వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు స్థిరపడ్డాయి.

క్రీ.శ. 1741 నాటికి గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించాడు. రెండో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి సేనల పరాజయం ఇతని పతనానికి దారి తీసింది.

ప్రశ్న 4.
రాబర్ట్ క్లైవ్ సేవలు.
జవాబు.
భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్టెవ్. క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య స్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రలో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానం.

ప్రశ్న 5.
కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారి ఓటమికి కారణాలు.
జవాబు.

  1. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడిన కంపెనీ.
  2. ఆంగ్లేయులు మాతృదేశం నుంచి శీఘ్రగతిలో అన్ని రకాల సహాయం పొందారు. ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారం అందించలేదు.
  3. ఆంగ్లేయుల వద్ద సమర్థవంతమైన సేనాధిపతులు ఐర్ కూట్, రాబర్కైవ్, లారెన్స్లు ఉండేవారు, డూప్లే, బుస్సీలు వీరికి ఏ విధంగా పోలికలేదు.
  4. ఆంగ్లేయులకు మూడు కేంద్రాలు (మద్రాస్, కలకత్తా, బొంబాయి) ఉండగా, ఫ్రెంచి వారికి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంది. మూడో కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఫ్రెంచి వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది.

TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

ప్రశ్న 6.
చీకటిగది ఉదంతం.
జవాబు.
కలకత్తాలోని ఫోర్ట్ విలియంలోని ఒక చిన్న జైలు గది. జూన్ 20, 1756న సిరాజ్ ఉద్ దౌలా అనుచరులు బ్రిటీష్ సైనికులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను దాదాపు 146 మందిని చిన్న గదిలో కుక్కారు. వీరిలో దాదాపు 123 మంది ఊపిరి ఆడక మరణించారు. దీనినే చీకటి గది ఉదంతం అంటారు.

Leave a Comment