TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 10th Lesson మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మరాఠాల విజృంభణకు దారితీసిన పరిస్థితులను వివరించండి.
జవాబు.
మరాఠా ప్రజల శీలమును, వారి చరిత్ర గతిని నిర్ణయించడంలో ఆ ప్రాంతపు భౌగోళిక అంశాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మహారాష్ట్ర ప్రాంతానికి రెండువైపుల నుంచి సహ్యాద్రి, వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా, నర్మదా, తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణానికి కారణమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అత్యంత, వ్యూహాత్మక, సహజ రక్షణలకు అనువై, శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించబడి, శత్రువులు వశపరచుకోవడానికి అంతగా సాధ్యపడలేదు. అత్యల్ప వర్షపాతం పైగా సారవంతం కాని భూములు వల్ల మరాఠాలు ధృడ శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహారాష్ట్రులలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొనే లక్షణాలు స్వతహాగా ఏర్పడ్డాయి.

పైన పేర్కొన్న భౌగోళిక అంశాల ప్రభావంతోపాటుగా, మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులైన తుకారాం, రామదాస్, వామన పండితుల బోధనలు మరాఠాలను చైతన్యపరిచాయి. ఫలితంగా, భగవంతుని ముందు అందరూ సమానులేనన్న భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది. వారు విభేదాలు మరిచిపోయి, ఏక జాతిగా రూపొందేందుకు దోహదపడ్డాయి. ఈ భావనను మహారాష్ట్ర సాహిత్యం మరింత పెంపొందించింది. సమర్థరామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం శివాజీని మాత్రమే ఉత్తేజపరచకుండా, యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

అంతేకాకుండా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాల్లో మరాఠా నాయకులు వివిధ హోదాల్లో పనిచేసి సైనిక, పాలనానుభవాన్ని గడించారు. మరాఠా సర్దారులు అందించిన సేవలకు గాను దక్కన్ సుల్తానులు వారిని నాయక్, రావ్ లాంటి బిరుదులతో సత్కరించారు. చందర్రావ్ మోరే, యశ్వంత్ రావ్, నాయక్ నింబాల్కర్, లోక్ జాదవ్వ్, షాజీ భోంస్లే లాంటి మరాఠా సర్దారులు దక్కన్ రాజ్యాల్లో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదించుకొన్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర జాతి రాజ్య నిర్మాణానికి దోహదపడ్డాయి.

ప్రశ్న 2.
శివాజి సాధించిన విజయాలు, ఘనతలు చర్చించండి.
జవాబు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ 1627లో షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు పూనాకు సుమారు యాభైమైళ్ల దూరంలోని ‘శివనేర్’ దుర్గంలో జన్మించాడు. షాజీభోంస్లే మేవార్ను పాలించిన సిసోడియా వంశానికి `చెందినవాడు. తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. 1636లో షాజీ భోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో, దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలసి పూనాకు మకాం మార్చడం జరిగింది. శివాజీ పూనాలో అతని తల్లి పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా హిందూ మత పరిరక్షణపై శివాజీకి అపరిమితమైన ఉత్సాహాన్ని కలిగించింది. సమర్థుడు, ప్రజ్ఞాశాలి అయిన దాదాజీ కొండదేవ్ శిక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడుగా, దక్షుడైన పరిపాలకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తనకు నమ్మకమైన మావళీ తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకొన్నాడు. మావళీలే తర్వాత కాలంలో శివాజీ సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

శివాజీ తన పంతొమ్మిదో ఏట నుంచి తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. మొదటగా 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. తదనంతరం వరుసగా చాకనా, కొండన, రాయఘడ్, పురంధర్ మొదలైన దుర్గాలను వశపరచుకొన్నాడు. రాయగడ్ వద్ద నూతన దుర్గాన్ని నిర్మించి, దాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకొన్నాడు. శివాజీ కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ అప్రమత్తమయ్యాడు. శివాజీని లొంగదీసుకోవాలని అతని తండ్రి షాజీ భోంస్లేను బందీగా పట్టుకొన్నాడు. చివరకు శివాజీ బెంగుళూరు, కొండన దుర్గాలను బీజాపూర్ సుల్తాన్కు ఇచ్చి తన తండ్రిని విడిపించుకొన్నాడు. తర్వాత శివాజీ ఆరు సంవత్సరాలపాటు (1649-1655) తన దండయాత్రలు మానివేసి, తాను గెలిచిన ప్రాంతాలను సాధన సంపత్తిని సుస్థిర పరచుకొనే ప్రయత్నం చేశాడు.

శివాజీ బీజాపూర్ ప్రాంతంపై 1656 నుంచి మళ్లీ తన దండయాత్రలను ప్రారంభించాడు. 1656లో మొదటగా చంద్రరావ్ మోర్ను ఓడించి జావళీ దుర్గాన్ని వశపరుచుకొన్నాడు. నాటి నుంచి జావళి దుర్గం, శివాజీ సైనిక చర్యలకు కీలక స్థావరమైంది. తర్వాత ఉత్తర కొంకణ తీరాన్ని, కళ్యాణ్ దుర్గాన్ని జయించాడు. పోర్చుగీసు వారి స్థావరమైన డామన్ ఓడ రేవును దోచుకున్నాడు. శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ. శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్టలానన్ను పంపించాడు.

ఎలాగైనా రెచ్చగొట్టి శివాజీని పర్వత ప్రాంతం (ప్రతాపర్) నుంచి మైదానాల వైపుకు తీసుకురావాలనేదే అల్ఫాన్ వ్యూహం. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు, అతన్ని లొంగదీసుకోవడం చాలా కష్టం. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అఫ్ఘలాఖాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అలాన్తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు. అలాఖాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాలను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంభమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్ నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అఫ్ఘలాన్ను హతమార్చాడు. తదనంతరం శత్రుసైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా ఓడించాడు. భారీస్థాయిలో ధనాన్ని కొల్లగొట్టాడు. ఈ ఘనవిజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి, మరాఠా ప్రజానీకంలో గొప్ప పరాక్రమవంతుడిగా, పురాణ పురుషుడిగా పేరు సంపాదించుకొన్నాడు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన మేనమామ షాయిస్తఖాన్ను 1659లో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. శివాజీని ఎలాగైనా అణచాలని ఔరంగజేబ్ షాయిస్తఖాన న్ను ఆజ్ఞాపించాడు. దీంతో షాయిస్తఖాన్ తన దండయాత్రను ప్రారంభించి చకాన్, ఉత్తర కొంకణ తీరాన్ని (1661) ఆక్రమించాడు. శివాజీ 1663 ఏప్రిల్ నెలలో పూనే చేరుకొని షాయిస్తఖాన్పై మెరుపుదాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. తన సైనిక అవసరాల కోసం శివాజీ 1664లో అతి సంపన్నమైన సూరత్ రేవు పట్టణాన్ని కొల్లగొట్టాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

నానాటికీ పెరుగుతున్న శివాజీ ప్రాబల్యాన్ని, షాయిస్తఖాన్ సంఘటనతో భీతి చెందిన ఔరంగజేబ్ పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించాడు. జైసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి. శివాజీపై ఒత్తిడి పెంచాడు. జైసింగ్ పురంధర్ వద్ద శివాజీని ఓడించి, పురంధర్ సింధి (1665)కి ఒప్పించాడు. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటల్లో ఇరవై మూడు కోటలను మొగులుల వశం చేశాడు. మొగల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాలనే సంధి షరతును కూడా శివాజీ అంగీకరించాడు.

పురంధర్ సంధిని అనుసరించి శివాజీ 1666లో ఆగ్రాకు వెళ్లి మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ను కలిశాడు. అయితే అక్కడ శివాజీ అమర్యాదకు లోనయ్యాడు. దీంతో శివాజీ ఆగ్రహించడంతో, ఔరంగజేబ్ అతన్ని నిర్బంధించాడు. 1670లో సూరత్ పట్టణంపై రెండోసారి దాడి జరిపి అరవై లక్షల రూపాయల ధనాన్ని దోచుకున్నాడు.
శివాజీ పట్టాభిషేకం 1674 జూన్ 16న రాజ్గఢ్ మిక్కిలి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ పట్టాభిషేకాన్ని వారణాసికి చెందిన వేద పండితుడైన (విశ్వేశ్వర్) గాగ భట్టు నిర్వహించాడు. మేవార్ రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘శివాజీ ఛత్రపతి’, “హైందవ ధర్మోద్ధారక” అనే బిరుదులు ధరించాడు.

ప్రశ్న 3.
శివాజీ పరిపాలన గురించి రాయండి.
జవాబు.
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పేరు పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను నియమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు.

అష్ట ప్రధానులు:
a) పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
b) అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
c) మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
d) సచివ: సమాచారశాఖా మంత్రి.
e) సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
f) పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
g) సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
h) న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్య రూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.

సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగాగల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది. జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు …. మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం కారణాలు, గమనం, ఫలితాలను వివరించండి.
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్ధభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది.

యుద్ద విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఫలితాలు:

  1. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి కొంతవరకు మహారాష్ట్రుల అధికారాన్ని, ప్రాభవాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం నెరవేరలేదు.
  2. మహారాష్ట్రులు, ముస్లింలు బలహీనమైనందున, ఆంగ్లేయులకు తమ అధికారాన్ని విస్తరించుకొనే అవకాశం కలిగింది. పరోక్షంగా బ్రిటిష్ వారు ఈ యుద్ధం వల్ల లాభపడినట్లయింది.
  3. ఈ యుద్ధంవల్ల శిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకొనేందుకు మార్గం సులభమైంది. శిక్కులు పఠానులను తరిమివేయడంతో వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.

మహారాష్ట్రుల ఓటమికి కారణాలు: మహారాష్ట్రులు ఓటమికి ప్రధాన కారణాలు ఇవి:

  1. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతని సైన్యం ఆయుధాలలో, క్రమశిక్షణలో మహారాష్ట్రుల కంటే ఉత్తమమైంది.
  2. భావో గర్విష్టి. అతడు ఇతరుల సలహాలను లక్ష్యపెట్టలేదు. మహారాష్ట్రులు జాట్ల సలహాలు విననందున వారి అభిమానాన్ని, సహాయాన్ని కోల్పోయారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.
  3. మహారాష్ట్రులు వారికి పట్టున్న గెరిల్లా యుద్ధాన్ని ఎంచుకోకుండా, అంతగా అభ్యాసనం లేని బహిరంగ యుద్ధం చేయడం.
  4. అబ్దాలి మహారాష్ట్రుల సైన్యానికి ఆహార పదార్థాలు అందకుండా చేయడంతో, వారు పస్తులు ఉండాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
పీష్వాల గురించి సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు.
శివాజీ తన పట్టాభిషేక సమయంలో ఎనిమిది మంది సభ్యులు గల మంత్రి మండలి (అష్టప్రధానులు) బాధ్యతలు, విధుల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఛత్రపతి తర్వాత పీష్వా చాలా ప్రధానమైన వ్యక్తి. పరిపాలనలో ఇతనిదే అగ్రస్థానం. శివాజీ కాలంలో మోరోపంత్ త్రయంబక్ మొదటి పీష్వాగా నియమించబడ్డాడు. శివాజీ వారసులు కూడా పరిపాలనలో పీష్వాలపైనే చాలా ఎక్కువగా ఆధారపడ్డారు. తారాబాయితో జరిగిన అంతర్యుద్ధంలో సాహూ విజయం సాధించి ఛత్రపతిగా సింహాసనం అధిష్టించడంలో నాటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించాడు. ఇతని కాలం నుంచే పీష్వాలు మరాఠా సర్దారులందరిలోకి అగ్రగణ్యులయ్యారు. అష్టప్రధానులందరిపైనే కాకుండా ఛత్రపతి కంటే కూడా పీష్వా అధికుడనే భావనను బలపరిచే విధంగా పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ తీర్చిదిద్దాడు. మొత్తం మీద మరాఠా చరిత్రలో 1713 నుంచి 1818 వరకు ఏడుగురు పీష్వాలు పాలించారు. బాలాజీ విశ్వనాథ్ (1713 – 20): బాలాజీ విశ్వనాథ్ కొంకణ్ తీరంలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను మరాఠా సర్దారుల దగ్గర గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ‘తదనంతరం కాలంలో పూనా, దౌలతాబాద్లకు సర్ సుబేదార్ గా పనిచేసాడు. ఈ కాలంలో బాలాజీ విశ్వనాథ్ మొగల్ చక్రవర్తితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల సాహూకి దగ్గరయ్యాడు. సాహూని ఛత్రపతి చేసే విషయమై మరాఠా సర్దారులతో దౌత్యం నెరపడంలోనూ, వారిని లొంగదీసుకోవడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. అతని సేవలకు గుర్తింపుగా సాహూ అతన్ని 16 నవంబర్, 1713లో పీష్వాగా నియమించాడు. తన అత్యుత్తమ ప్రతిభా పాటవాలచే బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వానే వాస్తవాధినేతగా మార్చాడు. పూనాను రాజకీయ కేంద్రంగా మార్చి, పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. అందుకనే బాలాజీ విశ్వనాథన్ను పీష్వా వంశ స్థాపకుడని అంటారు. మొగల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని మరాఠాల ప్రాబల్యాన్ని పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ తీరంలోని నావికాదళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకొన్న ‘లోనావాలా సంధి’ ఇతని తొలి దౌత్యవిజయం. దీని ద్వారా కన్హోజీ సాహూని ఛత్రపతిగా అంగీకరించాడు. మొదటి బాజీరావ్ (1720 40): బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీగాన్ కీ ష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రంలో ప్రతిభాశాలి. తన తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెంల్లా యుద్ధ తంత్రంలో శివాజీ తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం దృష్ట్యా అతడు పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పద్ షాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషివగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మదాఖాన్ భంగాష్ 1727లో బుందేల్ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేల్ఫండ్కు పంపి మహ్మదఖాన్ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

బాలాజీ బాజీరావ్ (1740-61): మొదటి బాజీరావు మరణం తర్వాత అతని పద్దెనిమిది సంవత్సరాల కుమారుడు బాలాజీ బాజీరావు (నానాసాహెబ్) పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. ఇతను తండ్రి అంతటి సమర్థుడు కాడు. ఇతను ఎల్లపుడూ తన బంధువైన సదాశివరావ్ బావో సలహాలపైనే ఆధారపడేవాడు. బాలాజీ బాజీరావు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయదలిచాడు. బాలాజీ బాజీరావు నాయకత్వంలోని మరాఠా సర్దారులు అనేక కొత్త ప్రాంతాలను జయించారు. రఘోజీ భోంస్లే మధ్య భారతాన్ని జయించి, బెంగాల్పై దండయాత్రలు జరిపాడు. దీంతో బెంగాల్ నవాబ్ అలీవర్ధనాఖాన్ ఒరిస్సాను దత్తం చేసి బెంగాల్ బీహార్ తో కూడిన రాష్ట్రానికి చౌత్, సర్దేశముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకొన్నాడు.

మహారాష్ట్రులు 1757లో అహ్మద్ అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీ ప్రాంతాన్ని జయించారు. 1758లో పీష్వా తమ్ముడైన రఘునాథరావు (రఘోబా) పంజాబు వశం చేసుకొని, అక్కడి నుంచి అహ్మద్ అబ్దాలీ రాజప్రతినిధిని తరిమివేశాడు. ఈ విధంగా మూడో పీష్వా హయాంలో మరాఠాల అధికారం, భారతదేశం ఒక కొన నుంచి మరో కొన వరకు విస్తరించింది. తమ ఆధీనంలో లేని ప్రాంతాల నుంచి కూడా మరాఠాలు చౌత్, సర్దేశముఖి పన్నులను వసూలు చేశారు. ఇలాంటి సమయంలో అహ్మదా అబ్దాలీ మరాఠాలను మూడో పానిపట్ యుద్ధంలో ఓడించాడు. ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి, ప్రాభవానికి తీవ్ర విఘాతమైంది. ఈ పరాజయంతో కృంగిపోయిన పీష్వా కొద్ది కాలానికే 1761లో మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 6.
రంజిత్సింగ్ ఘనతను చర్చించండి.
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్కార్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో ) జన్మించాడు. మహాన్ సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబ్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదీగాడు.

రంజిత్ సింగ్ తనకు అందించిన సేవలకు ప్రతిఫలంగా, తన ప్రతినిధిగా లాహోర్ను పాలించమని జమాన్షా 1789లో ప్రకటించాడు. రంజిత్ సింగ్ 12, ఏప్రిల్ 1801 నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకొన్నాడు. 1802లో ఇతను తన రాజధానిని గుజ్రన్వాలా నుంచి లాహోరు మార్చాడు. 1799 నుంచి 1805 మధ్యకాలంలో రంజిత్ సింగ్ లాహోర్, అమృత్సర్ ప్రాంతాలను బంగీ మిజిల్ సర్దారుల నుంచి కైవసం చేసుకొన్నాడు. తదనంతర కాలంలో లూధియానా (1806), కాంగ్రా (1809), అటక్ (1813), ముల్తాన్ (1818), కాశ్మీర్ (1819), పెషావర్ (1823)లను ఆక్రమించాడు. ఫలితంగా రంజిత్సింగ్ సట్లెజ్, జీలం నదుల మధ్య ప్రాంతంలో తన అధికారాన్ని నెలకొల్పాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు. అహ్మద్ షా అబ్దాలీ మనుమడైన షాషుజా అతని సోదరుడి వల్ల పదవీచ్యుతుడైనప్పుడు, రంజిత్ సింగ్ సహకారంతో అతను సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. దీనికి ప్రతిఫలంగా రంజిత్ సింగ్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ సామ్రాజ్యం లౌకికమైంది. పాలనలో మతపరమైన వివక్ష ఎక్కడా చూపలేదు. అమృత్సర్లోని శిక్కుల పవిత్ర దేవాలయాన్ని అతనే బంగారు పూతతో, చలువరాళ్లతో సుందరీకరించాడు. అప్పటి నుంచి అది స్వర్ణదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే వారణాశిలోని కాశీ విశ్వనాథుని దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసమని 820 కిలోల బంగారాన్ని రంజిత్ సింగ్ 1839లో బహుకరించాడు. రంజిత్ సింగ్ ఏనాడూ కూడా సిక్కుమత విశ్వాసాలను పాలనలో చొప్పించలేదు. శాంతి భద్రతలను అదుపులో ఉంచి, కఠిన శిక్షలను రద్దు చేశాడు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అష్ట ప్రధానులు.
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  1. పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  2. అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  3. మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  4. సచివ: సమాచారశాఖా మంత్రి.
  5. సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  6. పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  7. సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  8. న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 2.
బాలాజీ విశ్వనాథ్
జవాబు.
మహారాష్ట్రలో పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాథన్ను మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. శివాజీ మరణానంతరం మహారాష్ట్ర రాజ్యం అంతర్యుద్ధంలో మునిగి పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల సమయంలో శివాజీ వదిలి వెళ్ళిన బాధ్యతలను, ఆశయాలను నెరవేర్చి, మహారాష్ట్ర సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలది.

ఆ పీష్వాల వంశ మూలపురుషుడు బాలాజీ విశ్వనాథ్. ఛత్రపతి సాహూచే వంశపారంపర్య పీష్వాగా నియమింపబడ్డాడు. మరాఠా నౌకాదళాధిపతి కన్హోజీతో ఒప్పందం కుదుర్చుకుని పోర్చుగీస్, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒప్పందం కుదర్చుకొని ఒకప్పటి శివాజీ భూములన్నీ స్వాధీనం చేసుకున్నాడు. మహారాష్ట్రులు కూటమిని ఏర్పాటు చేసి మరాఠాలలో ఐక్యత సాధించాడు. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు బాలాజీ విశ్వనాథ్.

ప్రశ్న 3.
మొదటి బాజీరావు
జవాబు.
బాలాజీ విశ్వనాథ్ తరువాత అతని 20 సంవత్సరాల కుమారుడు మొదటి బాజీరావ్ పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. అతడు విజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు, మిక్కిలి వివేకం కలవాడు. చక్కని యోధుడు. యుద్ధ తంత్రం ‘ప్రతిభాశాలి. తన శివాజీ తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో తరువాత అంతగా ఆరితేరినవాడుగా ప్రసిద్ధి చెందాడు. ధైర్యసాహసాలు, రాజతంత్రం పీష్వాలలో కడు సమర్థుడిగా పరిగణింపబడ్డాడు.

అఖిల భారత హిందూ సామ్రాజ్యం (హింద్పద్ పదాహీ) స్థాపన అనేది బాజీరావు మహోన్నత ఆశయం. మొగల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, “చెట్టు కాండాన్ని ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని”, అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధూ నుంచి కృష్ణా వరకు ఎగురవేయవచ్చని భావించాడు. బాజీరావు నిజాం సైన్యాలను మర్చి 6, 1728లో పాల్టేడ్ వద్ద ఓడించి అతన్ని మునిషిగావ్ సంధికి ఒప్పించాడు. దీని ప్రకారం సాహూకి వ్యతిరేకంగా రెండో శంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదనీ, దక్కన్లో పన్నులు వసూలు చేసుకొనేందుకు అధికారాన్ని ఇచ్చాడు.

మొగల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయిన మహ్మద్భన్ భంగాష్ 1727లో బుందేల్ ఖండ్ పై దాడి జరిపాడు. అక్కడి రాజుని, అతని కుటుంబ సభ్యులని బందీలుగా పట్టుకొన్నాడు. రాజా అభ్యర్థన మేరకు 1729లో బాజీరావు మరాఠా సైన్యాలను బుందేలఖండ్కు పంపి మహ్మదఖాన్ ను ఓడించి రాజాను తిరిగి సింహాసనంపై నిలిపాడు. దీంతో ఈ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ బంధాలు బలపడ్డాయి.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

బాజీరావును కట్టడి చేసేందుకు మొగల్ చక్రవర్తి నిజాంను ప్రోత్సహించాడు. దీంతో నిజాంను మరాఠా సైన్యాలు రెండోసారి భోపాల్ యుద్ధంలో (1737) ఓడించి దురైసరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద యాభై లక్షలు చెల్లించడమే కాకుండా నర్మద, చంబల్ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

బాజీరావ్ సిద్దీలకు (జింజీ) వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పోర్చుగీసు వారిని 1739లో ఓడించి సాల్సెట్టి, బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పెరిగింది.

ప్రశ్న 4.
మూడోపానిపట్టు యుద్ధం
జవాబు.
ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాల్లో మూడో పానిపట్ యుద్ధం ఒకటి. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథ రావు (రఘోబా), అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించి, అతని రాజ్య ప్రతినిధిని తరిమివేశాడు. దీంతో అహ్మర్షి అబ్దాలీ మహారాష్ట్రులపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైన పానిపట్ యుద్దభూమిలో 14 జనవరి, 1761వ తేదిన ఇరు సైన్యాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. యుద్ధ విశేషాలు: మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడుగా సదాశివరావు (బావో సాహెబ్), మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉపసైన్యాధ్యక్షుడుగా వ్యవహరించారు. బావో సమర్థుడైన వ్యక్తి, కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం (బహిరంగ యుద్ధం) వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లభిస్తుందని చెప్పినా వినలేదు. తన మాటలు లెక్క చేయనందుకు సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు.

అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహారపదార్థాలు అందకుండా వ్యూహం పన్నాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశాడు. రెండునెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం మరణించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ప్రశ్న 5.
రంజిత్ సింగ్
జవాబు.
రంజిత్ సింగ్ (1792-1839): సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతను 13 నవంబరు, 1780లో మహాన్సింగ్, రాజ్ ్కర్ దంపతులకు గుజ్రన్వాలాలో (ప్రస్తుతం ఆధునిక పాకిస్తాన్లో) జన్మించాడు. మహాన్సింగ్ ‘సుకరెకియా మిజిల్కు’ అధిపతి. పంజాబు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఇతని ఆధీనంలోనే ఉండేది. ఇతని రాజధాని గుజ్రన్ వాలా. చిన్నతనంలో మశూచి సోకడంతో ఇతను ఎడమ కన్నును కోల్పోయాడు. పది సంవత్సరాల చిన్న వయస్సులోనే ఇతను తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతని తండ్రి 1792లో మరణించడంతో మిజిల్ నాయకత్వ బాధ్యతలు 12 సంవత్సరాల రంజిత్ సింగ్కు దక్కాయి. 1797 వరకు అతను తల్లి సంరక్షణలో పాలనాబాధ్యతలు నిర్వహించినా, తరువాత స్వతంత్రంగా వ్యవహరించాడు. నాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్ని రంజిత్ సింగ్ తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదిగాడు.

రంజిత్ సింగ్ ఖాల్సా (సైన్యం)ను ఆధునీకరించాడు. అధునాతన ఆయుధాలను సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఐరోపావాసుల చేత, ముఖ్యంగా నెపోలియన్ దగ్గర పనిచేసిన సైనికాధికారులచే తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా రంజిత్ సింగ్ సైన్యం భారతదేశంలోనే మొట్టమొదటి సుశిక్షుతులైన సైన్యంగా తీర్చిదిద్దబడింది. ఆయుధ కర్మాగారాలను ఫిరంగుల తయారీ కేంద్రాలను, మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారాలను రంజిత్ సింగ్ ఏర్పాటు చేశాడు.

రంజిత్ సింగ్ 27, జూన్ 1839లో మరణించాడు. అతని వారసుడిగా కరక్సింగ్ పదవీబాధ్యతలు చేపట్టాడు. అతని మరణం తర్వాత పంజాబ్ రాజ్యంలో రాజకీయ అస్థిర పరిస్థితులు, అంతర్యుద్ధం ఏర్పడింది. దీన్ని అదనుగా తీసుకొని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆంగ్లో – సిక్కు యుద్ధాలకు తెరలేపింది. రెండో ఆంగ్లో – సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ వారు దులీపింగ్ నుంచి పంజాబ్ను ఆక్రమించారు.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దాదాజి కొండదేవ్
జవాబు.
క్రీ.శ. 1636లో ఫాజీభోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలిసి మకాం మార్చాడు. దాదాజీ కొండదేవ్ పర్యవేక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడిగా, దక్షుడైన పరిపాలకుడిగా తీర్చిదిద్ద బడ్డాడు. శివాజీ సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో, శివాజీ పూనా జాగీరు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాడు.

ప్రశ్న 2.
సమర్థ రామదాసు
జవాబు.
మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడైన సమర్థరామదాస్ క్రీ.శ. 1608 సంవత్సరంలో జన్మించారు. అణగారిపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో ప్రత్యేకమయిన వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేసాడు. శివాజీకి మత గురువు. ఛత్రపతి శివాజీ హైందవ స్వరాజ్యాన్ని ఏర్పరచడంలో వీరిది గురుతుల్య పాత్ర. సమర్థ రామదాసు రచించిన ‘దశబోధ’ గ్రంథం ‘శివాజీని ఉత్తేజపరిచింది. యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్యస్థాపన ఆవశ్యకతను తెలియజేసింది.

ప్రశ్న 3.
తోరణదుర్గం
జవాబు.
తోరణ దుర్గం పూనె నగరానికి సమీపంలో ఉంది. ఈ దుర్గాన్ని ‘ప్రచండ గఢ్’ అని కూడా అంటారు. ఈ కోట చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఛత్రపతి శివాజీ తన పందొమ్మిదో ఏట అనగా క్రీ.శ. 1646లో ఈ తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. శివాజీ యొక్క విజయపదానికి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి తొలి అడుగుగా తోరణ దుర్గ విజయం ప్రసిద్ధికెక్కింది.

ప్రశ్న 4.
అన్జలాఖాన్
జవాబు.
శివాజీ దాడులతో అప్రమత్తమైన బీజాపూర్ సుల్తాన్ క్రీ.శ. 1659లో శివాజీని పట్టుకొని రావలిసిందిగా తన సేనాని అఫ్ఘలానన్ను పంపించాడు. శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైన అల్ఫాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. అఫ్టలాఖాన్ తో జరుపబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరుగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించాడు అఫ్ఘల్ఫాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన శివాజీ రక్షణ కవచాన్ని ధరించి, తగిన ఆయుధాల ను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంమయింది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్నఖ్ (పులిగోళ్లు) అనే మారణాయుధంతో అల్ఫాన్ ను హతమార్చాడు.

ప్రశ్న 5.
పురందర్ సంధి
జవాబు.
క్రీ.శ. 1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్కు, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజాపూర్ మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజాపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు.

ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించింది.

ప్రశ్న 6.
అష్ట ప్రధానులు
జవాబు.
శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంట సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. మంత్రులకు వివిధ శాఖలు కేటాయించాడు.

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖా మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు: దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

ప్రశ్న 7.
మూడో పానిపట్టు యుద్ధం
జవాబు.
మూడవ పానిపట్టు యుద్ధం అహ్మదా అబ్దాలీ సామ్రాజ్య కాంక్ష ఫలితం. 1761 జనవరి 14న చారిత్రాత్మక పానిపట్టు వద్ద మహారాష్ట్ర, అబ్దాలీ సైనికులు తలపడ్డారు. ఈ యుద్ధంలో ఆఫ్గన్లు విజయం సాధించారు. సదాశివరావు, విశ్వాసరావు అంతటి వీరులు సైతం నేలకొరిగారు. వేలాది సైనికులు చనిపోయారు. ఈ యుద్ధం వలన నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదు. ఈ పరాజయ వార్త విన్న పీ+3 బాలాజీ బాజీరావు కృంగి మరణించాడు.
రోహిల్లాలు, అయోధ్య నవాబు ంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, మహరాష్ట్రులకు ఎటువంటి సహాయం అందకపోవడం మరాఠాల పరాజయానికి కారణాలయ్యాయి. దీనితో పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైంది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది.

TS Inter 1st Year History Study Material Chapter 10 మరాఠాల విజృంభణ – ప్రాంతీయ రాజ్యాలు

ప్రశ్న 8.
అమృత్సర్ సంధి
జవాబు.
భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు బ్రిటిష్ వారు 1809లో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధిని చేసుకొన్నారు. ఈ సంధి ప్రకారం సట్లెజ్ నదికి ఉత్తరాన ఉన్న భూభాగంపై రంజిత్ సింగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటిష్వారు గుర్తించారు.

Leave a Comment