Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ Textbook Questions and Answers.
TS Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి విశ్లేషణ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.
ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.
చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి ఆ తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.
ప్రమేయాలు :
- ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
- సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
- ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
- శ్రమ మాత్రమే చర ఉత్పత్తి కారకం, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
- ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
- శ్రమ సజాతీయంగా ఉంటుంది.
క్షీణ ప్రతిఫల సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగు తున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది.
7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్య మైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. ‘E’ బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.
- పెరుగుతున్న ప్రతిఫలాలు
- క్షీణ ప్రతిఫలాలు
- రుణాత్మక ప్రతిఫలాలు
1. పెరుగుతున్న ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.
2. క్షీణ ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.
3. రుణాత్మక ప్రతిఫలాలు :
ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.
ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు.
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.
- తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు,
- తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు,
- తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు.
ప్రమేయాలు :
- ఉత్పత్తి కారకాలన్నీ చరం.
- సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
- ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
- సంపూర్ణ పోటీ ఉంటుంది.
- శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.
పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది.
దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది.
దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.
పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.
ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు :
- శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి..
- సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత; అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.
ప్రశ్న 3.
అంతర్గత ఆదాలను, బహిర్గత ఆదాలను విశదీకరించండి.
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.
అంతర్గత ఆదాలు :
1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.
3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.
4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.
5. నష్టాన్ని భరించే ఆదాలు:
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.
6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.
7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.
బహిర్గత ఆదాలు :
పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి..
1. కేంద్రీకరణ ఆదాలు :
ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి.
నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.
2. సమాచార ఆదాలు :
ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.
3. ప్రత్యేకీకరణ ఆదాలు :
పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.
4. సంక్షేమ ఆదాలు :
సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.
ప్రశ్న 4.
సంస్థలోని స్వల్ప కాలిక వ్యయాలను తగిన పటాల సహాయంతో సోదాహరణంగా వివరించండి.
జవాబు.
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.
అవి : 1. స్వల్పకాలం
2. దీర్ఘకాలం.
స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడి పదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.
1. స్థిర వ్యయాలు :
ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.
2. చర వ్యయాలు :
శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.
మొత్తం వ్యయం :
స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.
పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు | ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
ప్రక్క రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికీ, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC). ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంది.
స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్య మౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.
సగటు వ్యయం :
మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం. AC TC/Q ఉపాంత వ్యయం : ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ∆TC/∆Q
ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.
పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గు తున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది.
ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.
ప్రశ్న 5.
రాబడి విశ్లేషణపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
రాబడి అంటే ఒక సంస్థ వివిధ ధరలకు వస్తువును అమ్మగా పొందిన ఆదాయం. అమ్మకం చేసిన వస్తువు పరిమాణాన్ని దాని ధరతో హెచ్చించడం ద్వారా మొత్తం రాబడిని లెక్కించవచ్చు. అంటే TR = P.Q. రాబడికి సంబంధించి మూడు భావనలున్నాయి. అవి :
- మొత్తం రాబడి
- సగటు రాబడి
- ఉపాంత రాబడి.
(i) మొత్తం రాబడి (Total Revenue – TR) :
సంస్థ మార్కెట్లో ఉన్న ధరకు అమ్మిన వస్తు రాశి వల్ల పొందే ఆదాయాన్ని మొత్తం రాబడి అంటారు.
మొత్తం రాబడి = వస్తువు ధర × ఉత్పత్తి (అమ్మిన వస్తువుల పరిమాణం).
Total Revenue (TR) = Price (P) × Quantity sold (Q)
TR = P.Q.
వినియోగదారులు వస్తువుపై చేసిన మొత్తం వ్యయం సంస్థకు మొత్తం రాబడి అవుతుంది.
(ii) సగటు రాబడి (Average Revenue – AR) :
సగటున ఒక యూనిట్ వస్తువుకు లభించే రాబడిని. సగటు రాబడి అంటారు. అమ్మిన వస్తువు యూనిట్లతో రాబడిని భాగిస్తే సగటు రాబడి తెలుస్తుంది. అసలు ధరే సగటు రాబడి.
అంటే సగటు రాబడి ధరకు సమానంగా ఉంటుంది. ‘డిమాండ్ లేదా ధర రేఖను సగటు రాబడి రేఖ అంటారు.
(iii) ఉపాంత రాబడి (Marginal Revenue – MR) :
మరొక యూనిట్ వస్తువును అదనంగా అమ్మడం వల్ల మొత్తం రాబడిలో వచ్చే పెరుగుదలను అంటే అదనపు రాబడిని ఉపాంత రాబడి అంటారు.
MRn = TRn – TRn-1 లేదా MR = \(\frac{\mathrm{dTR}}{\mathrm{dQ}}\), d అనేది మార్పు.
సంపూర్ణ పోటీలో AR, MR రేఖలు (AR and MR Curves under Perfect Competition) :
సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదార్ల సంఖ్య, అమ్మకందార్ల సంఖ్య చాలా అధికం. ఏ ఒక్కరూ వస్తువు ధరను నిర్ణయించలేరు. సజాతీయ వస్తువులుంటాయి. వస్తువు ధర దాని సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.
పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది. సంస్థలన్నీ ఈ ధరను అంగీకరించి ఎంత పరిమాణంలోనైనా వస్తువులను అమ్ముకోవచ్చు. కాబట్టి సంస్థ ఉత్పత్తికుండే డిమాండ్ రేఖ సంపూర్ణ వ్యాకోచాన్ని కలిగి ఉంటుంది. సంస్థ ఉత్పత్తికున్న డిమాండ్ రేఖే దాని సగటు రాబడి రేఖ. ఈ సగటు రాబడి రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
సంపూర్ణ పోటీలో ధర స్థిరం. అందువల్ల సగటు రాబడి (AR) ఉపాంత రాబడి (MR) కి సమానంగా ఉండటమే కాకుండా వస్తువు ధర కూడా సమానంగా ఉంటాయి. అంటే P = AR = MR. ఉపాంత రాబడి రేఖ కూడా OX అక్షానికి సమాంతరంగా ఉండటమే కాకుండా సగటు రాబడి రేఖతో కలిసిపోతుంది. అందువల్ల AR రేఖ MR రేఖగా ఉంటుంది. పట్టిక, పటంల ద్వారా AR, MRల మధ్య ఉన్న సంబంధం తెలుపుతుంది.
సంపూర్ణ పోటీ మార్కెట్ అయినందువల్ల వస్తువు ధర స్థిరంగా ఉంటుంది. ₹ 10 ధర ఉన్నప్పుడు సంస్థ ఎంత పరిమాణాన్ని అయినా అమ్ముకోవచ్చు. మొత్తం రాబడి స్థిరమైన రేటులో పెరుగుతుంది. ధర మారనందువల్ల సగటు రాబడి, ఉపాంత రాబడులు కూడా 3 10గా ఉన్నాయి.
అంటే P = AR = MR. ధర, సగటు రాబడి, ఉపాంత రాబడులు సమానంగా ఉండటంతోపాటుగా స్థిరంగా ఉన్నాయి. ఈ కారణంగా P, AR, MR రేఖ పటంలో చూపిన విధంగా OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly): ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారు డుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.
ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది.
సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలోని తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.
పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి గౌ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి 32 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR.
ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు. OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను కొలుస్తున్నాం.
పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భూమి, శ్రమ అనే ఉత్పత్తి కారకాల ప్రధాన లక్షణాలను విశదీకరించండి.
జవాబు.
భూమి : భూమి అంటే కేవలం నేల లేదా ఉపరితలం మాత్రమే కాకుండా అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం, మొదలైన ప్రకృతి వనరులన్నీ భూమిలో భాగమే.
భూమి లక్షణాలు : ఒక ఉత్పత్తి కారకంగా భూమికి ఉండే లక్షణాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి :
- భూమి ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక.
- భూమి సప్లయ్ పరిమితం. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే భూమి సప్లయ్ స్థిరం. అంటే భూమి సప్లయ్ సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది.
- భూమికి గమనశీలత లేదు. భూమిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించలేం.
- భూమిని ఇతర కారకాలతో కలిపి ఉపయోగిస్తూ పోతే క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.
- భూమి సారంలో తేడాలుంటాయి.
- భూమి తనంతట తానుగా దేనినీ ఉత్పత్తి చేయదు. మానవ ప్రయత్నం తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది.
శ్రమ (Labour – L) :
అర్థశాస్త్రంలో శ్రమ అంటే ఆదాయాన్ని సంపాందించడానికి వస్తుసేవల ఉత్పత్తిలో అందించే భౌతిక, మానసిక కారకం. శ్రమ చురుకైన ఉత్పత్తి కారకం. శ్రమతో కలిసినప్పుడే భూమి, మూలధనం ఉపయోగంలోకి వస్తాయి.
శ్రమ లక్షణాలు : శ్రమకు కింది లక్షణాలుంటాయి.
- శ్రమను శ్రామికుడి నుంచి విడదీయలేం. శ్రామికుడు శ్రమనే అమ్ముతాడు తప్ప తానుగా అమ్ముడుపోడు.
- శ్రమ నశ్వరం (perishable), అంటే శ్రామికుడు ఒక రోజు పనిచేయకపోతే ఆ రోజు శ్రమ వృథా అయినట్లు. శ్రమను నిల్వచేయలేం. శ్రమకు రిజర్వు ధర (reserve price) లేదు.
- శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువగా ఉంటుంది.
- శ్రామికుల సామర్థ్యం వేరు వేరుగా ఉంటుంది. శ్రమను (a) నైపుణ్యంలేని శ్రమ, (b) పాక్షిక నైపుణ్యం ఉన్న శ్రమ, (c) నైపుణ్యం ఉన్న శ్రమ అని విభజిస్తారు.
- శ్రమ సప్లయ్ రేఖ ప్రారంభంలో ఎడమ నుంచి కుడికి పైకి వాలి అత్యధిక వేతనాల వద్ద వెనుకకు వాలుతుంది (backward bending).
ప్రశ్న 2.
శ్రమ విభజన వల్ల ఉండే లాభాలు, నష్టాలు ఏమిటి ?
జవాబు.
శ్రమ విభజన (Division of Labour) :
ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలో శ్రమ విభజన ముఖ్యమైంది. ఒక వస్తూత్పత్తి ప్రక్రియను వివిధ భాగాలుగా విభజించి వీటిని శ్రామికులకు కేటాయించడాన్నే శ్రమ విభజన అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారు చేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు.
ఈ శ్రమ విభజనను ఆడమ్స్మత్ గుర్తించి వివరించాడు. అధిక సామర్థ్యపు స్థాయి మరియు ప్రత్యేక నైపుణ్యం వల్ల శ్రమ విభజన తలసరి శ్రామిక ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.
శ్రమ విభజన వల్ల లాభాలు :
- ఒక పనిని నిర్విరామంగా శ్రామికుడు చేస్తున్నందువల్ల అతని నైపుణ్యం, సామర్థ్యం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది.
- నవకల్పనలకు, ఆవిష్కరణలకు (discovery) దోహదపడుతుంది.
- కాలం ఆదా అవుతుంది.
- యాంత్రికీకరణకు అవకాశం ఏర్పడుతుంది.
- వివిధ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- శ్రామికుల నైపుణ్యం ఆధారంగా తగిన పని లభిస్తుంది.
- పెద్ద తరహాలో ఉత్పత్తికి వీలు కలుగుతుంది.
శ్రమ విభజన వల్ల నష్టాలు :
- ఒకే రకం పని వల్ల శ్రామికులు ఆసక్తిని కోల్పోతారు.
- మానవాభివృద్ధికి నిరోధకం.
- నైపుణ్యాన్ని కోల్పోతాడు.
- నిరుద్యోగత ఏర్పడవచ్చు.
- శ్రామికుల గమనశీలతకు అవరోధం ఏర్పడుతుంది.
ప్రశ్న 3.
క్షీణ ప్రతిఫలాలను వివరించండి.
జవాబు.
పెరుగుతున్న ప్రతిఫలాల దశ అనంతరం క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది. దీనినే క్షీణ ప్రతిఫలాల సూత్రమని అంటాం. క్షీణ ప్రతిఫలాల దశ సగటు ఉత్పత్తి గరిష్ఠమైనప్పుడు ప్రారంభమై ఉపాంత ఉత్పత్తి శూన్యం. మొత్తం ఉత్పత్తి గరిష్ఠమయ్యేంత వరకు ఉంటుంది. పట్టిక ప్రకారం శ్రామికుల సంఖ్య 4 నుంచి 7 వరకున్నప్పుడు క్షీణ ప్రతిఫలాల దశ ఏర్పడుతుంది.
OX – అక్షంపై Q నుంచి Q1 వరకు ఉన్న దశే క్షీణ ప్రతిఫలాల దశ. ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తుంటాయి. ఈ దశలో సగటు ఉత్పత్తి కంటే మొత్తం ఉత్పత్తి అధికంగాను, ఉపాంత ఉత్పత్తికంటే సగటు ఉత్పత్తి అధికంగాను ఉంటాయి. TP > AP > MP. క్షీణ ప్రతిఫలాల దశలోనే ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుంది.
ప్రశ్న 4.
తరహాననుసరించి ప్రతిఫలాల భావనను వివరించండి.
జవాబు.
తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలానికి సంబంధించింది. ఉత్పత్తి తరహాలో వచ్చే మార్పు వల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఇది తెలుపుతుంది. దీర్ఘకాలంలోని (చర) ఉత్పత్తి కారకాలన్నిటినీ ఒకే అనుపాతంలో పెంచినప్పుడు ఉత్పత్తి కారకాల తరహాలో వచ్చే అనుపాతపు మార్పును ఈ ప్రతిఫలాల సూత్రం వివరిస్తుంది. ఉత్పత్తి కారకాల అనుపాతపు మార్పు వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పు మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంది. అవి :
- పెరుగుతున్న ప్రతిఫలాలు
- స్థిర ప్రతిఫలాలు
- తగ్గుతున్న ప్రతిఫలాలు.
ప్రమేయాలు : ఈ సూత్రం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది :
- ఉత్పత్తి కారకాలన్నీ చరం అయితే ఉద్యమిత్వం మాత్రం స్థిరం.
- సాంకేతిక ప్రగతి స్థిరం.
- మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది.
- ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలుస్తాం.
- శ్రామికునికి లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వడమైంది.
తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం :
పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. పైన వివరించిన విధంగా ఉత్పత్తిపై ఉండే ప్రభావాన్ని మూడు దశలుగా చూడవచ్చు. మొదటి దశ పెరుగుతున్న ప్రతిఫలాలు లేదా క్షీణ వ్యయాలు.
ఈ దశలో ఉత్పాదకాల పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని’ పెరుగుదల రేటు ఎక్కువ. రెండవ దశ స్థిర ప్రతిఫలాలు లేదా స్థిర వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తిలోని పెరుగుదల రేటు, ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు సమానంగా ఉంటాయి. మూడవ దశ క్షీణ ప్రతిఫలాలు లేదా పెరుగుతున్న వ్యయాలు. ఈ దశలో ఉత్పత్తి కారకాలలోని పెరుగుదల రేటు కంటే ఉత్పత్తిలోని పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది.
ప్రశ్న 5.
మూలధనంను గురించి ఒక వ్యాఖ్యను వ్రాయండి.
జవాబు.
సాధారణంగా మూలధనం అంటే ద్రవ్యం అనే భావిస్తాం. యంత్ర పరికరాలు, ముడి పదార్థాలు, భవనాలు మొదలైన వాటి పై వెచ్చించే ద్రవ్యాన్ని మూలధనం అంటారు. ప్రస్తుత సంపదలోని కొంత భాగాన్ని భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగిస్తే అదే మూలధనం.
మూలధనాన్ని (నిల్వ భావన) ఉపయోగించి ఆదాయాన్ని (ప్రవాహం భావన) పొందుతారు. మూలధనాన్ని మానవ నిర్మిత ఉత్పత్తి కారకమని కూడా అంటారు. మూలధనం సప్లయ్లో మార్పులుంటాయి. దీనికి గమనశీలత ఉంటుంది.
మూలధన వర్గీకరణ :
మూలధనాన్ని ఈ కింద పేర్కొన్న రకాలుగా విభజించవచ్చు.
(i) నిజ మూలధనం – మానవ మూలధనం :
భవనాలు, యంత్రాలు, ఫ్యాక్టరీలు మొదలైన భౌతికమైన వాటిని నిజ లేదా వాస్తవిక మూలధనం. (real capital) అంటారు. మానవుల నైపుణ్యం, వారి సామర్థ్యం మొదలైన వాటిని మానవ మూలధనంగా (human capital) పిలుస్తారు.
(ii) వైయక్తిక, సామాజిక మూలధనం :
వైయక్తిక మూలధనం ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందింది. సామాజిక మూలధనం మొత్తం సమాజానికి చెందుతుంది. ఉదా : రోడ్లు, వంతెనలు మొదలైనవి.
(iii) స్థిర మూలధనం, చర మూలధనం :
మన్నిక కలిగి ఉత్పత్తిలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలలాంటివి స్థిర మూలధనం (fixed capital). ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన శ్రామికుల రోజువారీ వేతనాలు, ముడి పదార్థాలు, విద్యుచ్ఛక్తి చార్జీలు చర మూలధనం (variable capital).
(iv) స్పర్శనీయ మూలధనం, అస్పర్శనీయ మూలధనం (Tangible Capital and Intangible Capital) :
భౌతిక రూపంలో ఉండే మూలధనం స్పర్శనీయం. గుడ్విల్, పేటెంట్ రైట్స్ లాంటి వాటిని అస్పర్శనీయ మూలధనంగా పరిగణిస్తారు.
మూలధన ప్రాధాన్యత :
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.
- మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
- మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
- మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
- ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.
ప్రశ్న 6.
అంతర్గత ఆదాలు అంటే ఏమిటి ?
జవాబు.
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.
1. సాంకేతిక ఆదాలు :
మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్ప కాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
2. మార్కెటింగ్ ఆదాలు :
పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.
3. నిర్వహణ ఆదాలు :
పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.
4. విత్తపరమైన ఆదాలు :
పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.
5. నష్టాన్ని భరించే ఆదాలు :
పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ‘ఒకరకం’ వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు.
6. పరిశోధన ఆదాలు :
చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.
7. సంక్షేమ ఆదాలు :
సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.
ప్రశ్న 7.
సప్లయ్ అంటే ఏమిటి ? సప్లయ్ నిర్ణాయకాలను వివరించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయను చూడాలి.
నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ (stock) కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.
సప్లయ్ని నిర్ణయించే అంశాలు (Determinants of Supply) :
ఒక వస్తువు సప్లయికి దాని సప్లయ్ నిర్ణయకాలకు మధ్యగల భౌతిక సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలుపుతుంది. అయితే సప్లయ్ని నిర్ణయించే అంశాలను ఇప్పుడు తెలుసుకొందాం.
(i) వస్తు ధర :
ఉత్పత్తిదారుడు వస్తువు సప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తువు ధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తువు ధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తువు ధర తగ్గితే వస్తువు సప్లయ్ తగ్గుతుంది.
(ii) ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు :
ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. లేదా అధిక ధర ఉన్న ప్రత్యామ్నాయ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న వస్తువు సప్లయ్ పెంచవచ్చు.
అలాగే పూరక వస్తువుల ధరలు, వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తువు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.
(iii) ఉత్పత్తి కారకాల ధరలు :
ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అందువల్ల కారకాల ధరలు ఎక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ తక్కువగాను, కారకాల ధరలు తక్కువగా ఉంటే వస్తువు సప్లయ్ ఎక్కువగాను ఉంటుంది.
(iv) సాంకేతిక పరిజ్ఞానపు స్థాయి:
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల వల్ల ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే, వస్తువు సప్లయ్లో మార్పులుంటాయి. నవ్యకల్పనలు (discoveries), నవకల్పనల (innovations) వల్ల కారకాలను పొదుపు చేయడంతో పాటుగా వ్యయాన్ని, సమయాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంలోని మార్పులవల్ల వస్తువు సప్లయ్ పెరుగుతుంది.
(v) ప్రభుత్వ విధానాలు :
ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తువు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.
(vi) ఇతర అంశాలు :
సంస్థ లక్ష్యం రవాణా, కమ్యూనికేషన్, సహజ వనరుల లభ్యత మొదలైనటువంటి అంశాలు కూడా వస్తువు సప్లయ్ ప్రభావితం చేస్తాయి.
ప్రశ్న 8.
సప్లయ్ లోని మార్పులను గురించి చర్చించండి.
జవాబు.
మార్కెట్లో అమ్మకందారుడు ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధపడతాడో దానిని వస్తువు సప్లయ్ గా నిర్వచించవచ్చు. మొత్తం వస్తూత్పత్తిని స్టాక్ గాను, అమ్మడానికి ఇష్టపడే మొత్తాన్ని సప్లయ్గాను చూడాలి.
నిశితంగా పరిశీలిస్తే సప్లయ్క, నిలువ Stock కు తేడా ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని మార్కెట్కు తరలించడాన్ని నిలువ తెలుపగా వివిధ ధరల వద్ద అమ్మకందారుడు అమ్మజూపే వస్తువు పరిమాణాన్ని సప్లయ్ తెలుపుతుంది.
సప్లయ్ పెరుగుదల, తగ్గుదల :
వస్తువు ధర కాకుండా, ఇతర చలాంకాలలో మార్పు వస్తే సప్లయ్లో వచ్చే మార్పులను పెరుగుదల లేదా తగ్గుదల అంటారు. అంటే సప్లయ్ రేఖ పూర్తిగా బదిలీ అవుతుంది. దీనిని పటంలో చూడవచ్చు.
OX – అక్షంపై వస్తువు సప్లయ్ పరిమాణం, OY – అక్షంపై వస్తువు ధరను కొలుస్తున్నాం. ప్రారంభంలో ‘SS’ సప్లయ్ రేఖ ఉంటే OP ధరకు 0Q వస్తు పరిమాణాన్ని అమ్మకందారుడు సప్లయ్ చేస్తాడు. ఇతర పరిస్థితులలో (వస్తువు ధర మినహా) మార్పు వచ్చి ఈ సప్లయ్ పెరిగితే సప్లయ్ రేఖ కిందకు లేదా కుడికి S1S1 గా బగిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు OP ధరకే అధిక సప్లయ్ని అంటే OQ ని సప్లయ్ చేయడం లేదా పూర్వపు సప్లయ్ OQ1 ని తక్కువ ధరకు OP, కి అమ్మకం చేయడం జరుగుతుంది.
ఇతర పరిస్థితులు మారి సప్లయ్ తగ్గితే సప్లయ్ రేఖ పైకి లేదా ఎడమ వైపుకు S2S2 గా బదిలీ అవుతుంది. అప్పుడు పూర్వపు ధర OP దగ్గర OQ2 సప్లయ్ చేయడం లేదా, పూర్వపు సప్లయ్ OQ2 ని OP2 ధరకు అమ్మకం చేయడం జరుగుతుంది. అంటే సప్లయ్ పెరిగితే పూర్వపు ధరకు అధిక సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను తక్కువ ధరకు చేస్తారు. అదే సప్లయ్ తగ్గితే పూర్వపు తక్కువ సప్లయ్ లేదా పూర్వపు సప్లయ్ను అధిక ధరకు చేస్తారు.
ప్రశ్న 9.
వ్యయాల రకాలను చర్చించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది.
ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి. ధరల ప్రక్రియను, సప్లయ్ వెనక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.
వ్యయాలలోని రకాలు :
1. ద్రవ్య వ్యయాలు (Money Costs) :
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు. అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలు అంటారు.
ఈ ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు’ చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.
2. వాస్తవ వ్యయాలు (Real Costs) :
ఆల్ ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వస్తువును తయారుచేయడానికి ఉత్పత్తి కారకాల యజమానులు చేసిన త్యాగాలను ఉత్పత్తికయ్యే వాస్తవిక వ్యయాలంటారు. భూస్వామి భూమి ఇచ్చినప్పుడు తాను కోల్పోయిన పంటే అతని త్యాగం.
శ్రామికుడు పని చేసే శ్రమలో ఇమిడి ఉన్న శారీరక శ్రమ, బాధ, అతడు కోల్పోయే విశ్రాంతి అతని త్యాగం. పెట్టుబడిదారులు తాము పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలంటే వినియోగాన్ని కోల్పోతారు. అది వారి త్యాగం.
వ్యవస్థాపకులు వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు అనిశ్చితను, నష్ట భయాన్ని భరించడం, విశ్రాంతిని కోల్పోవడం జరుగుతుంది. అది వారి త్యాగం. వీటినన్నిటిని వాస్తవిక వ్యయాలంటారు. ద్రవ్య వ్యయాలు, వాస్తవిక వ్యయాలు ఒకదానితో ఒకటి సమానం కావు.
3. అవకాశ వ్యయాలు (Opportunity Costs) :
ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి, కొరతగా ఉన్న వనరులను ఒకే సమయంలో అనేక రకాల వస్తూత్పత్తికి ఉపయోగించలేరు. ఒక రకం వస్తూత్పత్తికి సాధనాలను వినియోగించాలంటే వాటిని ఇతర ఉపయోగాల నుంచి ఉపసంహరించవలసి ఉంటుంది. ఒక వస్తూత్పత్తికి బదులుగా మరొక వస్తూత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువే అవకాశ వ్యయం.
Y వస్తువులకు బదులుగా X వస్తువును తయారు చేయడానికి వనరులను వాడితే ఒక యూనిట్ X వస్తూత్పత్తికి త్యాగం చేయాల్సిన Y వస్తూత్పత్తి పరిమాణమే ప్రత్యామ్నాయ లేదా అవకాశ వ్యయం. ఒక ఉత్పత్తి కారకం అవకాశ వ్యయం ప్రస్తుత ఉపయోగంలో కాకుండా దాని తరువాత అత్యుత్తమ ఉపయోగంలో వాడితే ఆర్జించగలిగే మొత్తానికి సమానం. భూమిని గోధుమ పంట పండించడానికి విడితే అదే భూమిలో పండించగలిగి ఉండే వేరొక పంట విలువే అవకాశ వ్యయం.
4. స్థిర వ్యయాలు (Supplementary Costs) :
ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం. స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.
5. చర వ్యయాలు (Direct Costs) :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉ పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి. అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి.
ఉత్పత్తి ఏ వాతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.
ప్రశ్న 10.
మొత్తం వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం స్థిర వ్యయాల సంబంధాన్ని వివరించండి.
జవాబు.
ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు మొదలైనటువంటి ఆర్థిక చలాంకాలలో వచ్చే మార్పువల్ల ఉత్పత్తి వ్యయంలో మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విధంగా ఉత్పత్తి వ్యయాలు ద్రవ్యపరమైన అంశాలను తెలుపగా, ఉత్పత్తి ఫలం భౌతిక పరమైన అంశాలను తెలుపుతుంది. ఒక సంస్థలో వస్తువు సప్లయ్ వ్యయాలపై ఆధారపడుతుంది. ఒక వస్తువుకున్న డిమాండ్, దాని సప్లయ్లు కలిపి దాని ధరను నిర్ణయిస్తాయి.
ధరల ప్రక్రియను, సప్లయ్ వెనుక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. వస్తూత్పత్తికయ్యే ఖర్చే ఉత్పత్తి వ్యయం.
స్వల్ప కాలంలో ఒక సంస్థ చేసే వ్యయాలు రెండు రకాలుగా ఉంటాయి. వీటిని స్థిర వ్యయాలు, చర వ్యయాలుగా వర్గీకరించవచ్చు.
స్థిర వ్యయాలు, చర వ్యయాలు :
అధిక మొత్తంలో ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో చర ఉత్పత్తి కారకాలైన శ్రమ, ముడి సరుకులు, విద్యుచ్ఛక్తి, ఇంధనం మొదలైనవి కావాలి. అందువల్ల ఈ ఉత్పత్తి వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తి పెంచినప్పుడు ఇవి పెరుగుతాయి.
అలాగే ఉత్పత్తిని తగ్గించినప్పుడు చర వ్యయాలు కూడా క్షీణిస్తాయి. ఉత్పత్తి ఏమీ ఉండకపోతే చర వ్యయాలు కూడా ఉండవు. చర వ్యయాలనే ప్రత్యక్ష వ్యయాలు (direct costs) అంటారు. వీటిని మార్షల్ ప్రధాన వ్యయాలు (prime costs) అన్నాడు.
ఉత్పత్తిలోని మార్పులతోపాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలంటారు. స్థిర కారకాలకు చెల్లించే భాటకం, వడ్డీ, తరుగుదల వ్యయం, శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు మొదలైన రూపంలో ఉంటాయి. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలను భరించవలసి ఉంటుంది. మార్షల్ స్థిర వ్యయాలను అనుబంధ వ్యయాలని (supplementary costs) లేదా వ్యవస్థాపరమైన వ్యయాలని (overhead costs) అన్నాడు.
మొత్తం ఉత్పత్తి (TP) | మొత్తం స్థిర వ్యయం (TFC) | మొత్తం చర వ్యయం (TVC) | మొత్తం వ్యయం (TC) |
0 | 300 | 0 | 300 |
1 | 300 | 300 | 600 |
2 | 300 | 400 | 700 |
3 | 300 | 450 | 750 |
4 | 300 | 500 | 800 |
5 | 300 | 600 | 900 |
6 | 300 | 720 | 1020 |
7 | 300 | 890 | 1090 |
8 | 300 | 1100 | 1400 |
9 | 300 | 1350 | 1650 |
10 | 300 | 2000 | 2300 |
పైన తెలిపిన విధంగా, స్వల్ప కాలంలో ఉత్పత్తిదారుడు చర ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా మాత్రమే వస్పూత్పత్తిని పెంచగలడు. స్థిర కారకాలైనటువంటి భవనాలు, మూలధనం, శాశ్వత ఉద్యోగులు వంటి వాటిని మార్చుటకు వీలుకాదు.
అందువల్ల స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలు ఉంటాయి. ఇవి మొత్తం వ్యయం (TC), మొత్తం చర వ్యయం (TVC), మొత్తం స్థిర వ్యయం (TFC), మొత్తం చర, స్థిర వ్యయాలకు మొత్తం వ్యయం సమానం కాబట్టి (TC = TFC + TVC).
పట్టికలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడం జరిగింది. ఉత్పత్తి పరిమాణం శూన్యమైనా, పెరిగినా, తగ్గినా, ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం ? 300 లుగా ఉంది. ఉత్పత్తి శూన్యమైతే మొత్తం చర వ్యయం శూన్యం.
ఉత్పత్తి పెరుగుతుంటే చర వ్యయం ప్రారంభంలో తరహాననుసరించిన ఆదాల వల్ల తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. ఆ తరువాత నష్టదాయకాల కారణంగా మొత్తం చర వ్యయం స్థిర రేటులో పెరిగి చివరగా అది పెరుగుతున్న రేటులో పెరుగుతుంది.
పై పటంలో మొత్తం స్థిర వ్యయం, మొత్తం చర వ్యయం, మొత్తం వ్యయాలకు ఉన్న సంబంధం వివరించబడింది. TFC క్షితిజ రేఖ (horizontal) మొత్తం స్థిర వ్యయాన్ని, TVC రేఖ మొత్తం చర వ్యయాన్ని, TC రేఖ మొత్తం వ్యయాన్ని చూపిస్తున్నాయి. ఉత్పత్తి ఎంత ఉన్నా మొత్తం స్థిర వ్యయం మారదు. అందువల్ల TFC రేఖ OX – అక్షానికి సమాంతరంగా ఉంది. TVC రేఖ మూల బిందువు ‘0’ దగ్గర ప్రారంభమౌతుంది. ఎందుకంటే ఉత్పత్తి శూన్యమైతే TVC కూడా శూన్యం. తరువాత ఉత్పత్తి పెరుగుతుంటే TVC కూడా పెరుగుతుంది.
స్థిర కారకాలతో పోల్చినప్పుడు తక్కువ పరిమాణంలో చర ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొన్నంత కాలం మొత్తం చర వ్యయం తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. కారణం తరహా ఆదాలు ఉండటమే. ఒక స్థాయి దాటిన తరువాత స్థిర కారకాలతో పోల్చినప్పుడు చర కారకాలను అధికంగా వాడటం జరుగుతుంది.
అప్పుడు TVC నష్టదాయకాల కారణంగా పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంటే మొత్తం వ్యయం నిర్విరామంగా పెరుగుతుంది. మొత్తం వ్యయ రేఖ OY – అక్షంపై మూల బిందువుకు పైన TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గర ప్రారంభమై ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది.
ఉత్పత్తి శూన్యమైనా TFC ఉంటుంది. ఈ కారణంగా TFC = TC అవుతుంది. అందువల్ల TC రేఖ TFC రేఖ ప్రారంభమైన బిందువు దగ్గరే ప్రారంభమౌతుంది. TFC రేఖ క్షితిజ సరళ రేఖ. అందుకే TC రేఖ TVC రేఖలాగానే ఉండి TVC రేఖకు పైన సమాంతరంగా ఉంటుంది. TC రేఖకు TFC రేఖకు మధ్య ఉన్న తేడానే TVC కాబట్టి TVC = TC – TFC.
ప్రశ్న 11.
సగటు వ్యయం, ఉపాంత వ్యయ సంబంధాన్ని తెలపండి.
జవాబు.
వస్తువు ఉత్పత్తికై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.
సగటు వ్యయము :
మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
సగటు వ్యయము = మొత్తం వ్యయం / వస్తురాశి
ఉపాంత వ్యయము :
మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
ఉపాంత వ్యయం = మొత్తం వ్యయంలో మార్పు / వస్తు పరిమాణంలో మార్పు
ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు.
రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y- అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.
SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయం కన్నా తక్కువగా ఉంటుంది.
ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.
- సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
- సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
- సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.
ప్రశ్న 12.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యంలలో సగటు, ఉపాంత రాబడుల స్వభావాన్ని పటాల సహాయంతో వివరించండి.
జవాబు.
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు కౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.
పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y- అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD -డిమాండ్ రేఖ, SS – సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించి కున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర | ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X – అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.
ఏకస్వామ్యంలో AR, MR రేఖలు (AR and MR Curves under Monopoly) :
ఏకస్వామ్యంలో ఒకే అమ్మకందారుడుంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా అల్పంగా ఉంటుంది. ధరను లేదా వస్తురాశిని ఏదో ఒక్కదానిని ఏకస్వామ్యదారుడు నిర్ణయిస్తే మరొకటి మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి నిర్ణయించబడుతుంది. అంతేగాని రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.
ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవడానికి ధరను తగ్గిస్తాడు. ధరే సగటు రాబడి కాబట్టి, సగటు రాబడి కూడా క్రమేణ క్షీణిస్తుంది. అందువల్ల డిమాండ్ రేఖ అంటే సగటు రాబడి రేఖ ఎడమ నుంచి కుడి వైపుకు కిందికి వాలుతుంది. ఉపాంత రాబడి కూడా తగ్గుతుంది. సగటు రాబడి కంటే ఉపాంత రాబడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సగటు రాబడి రేఖకు ఉపాంత రాబడి రేఖ కింద ఉంటుంది. సగటు రాబడిలో తగ్గుదల రేటుకంటే ఉపాంత రాబడిలోని తగ్గుదల రేటు ఎక్కువగా ఉంటుంది.
పట్టికలో ధర లేదా సగటు రాబడి ప్రతిసారి ₹ 1 చొప్పున తగ్గుతుంటే ఉపాంత రాబడి ప్రతిసారి ₹ 2 చొప్పున తగ్గుతుంది. ధర, సగటు రాబడులు సమానంగా ఉన్నాయి. ఇవి ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే P = AR > MR. ధర తగ్గినప్పుడు అమ్మకాలు పెరిగి మొత్తం రాబడి పెరుగుతున్నట్లుగా పట్టికలో చూడవచ్చు. సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలను పటంలో పరిశీలించవచ్చు.
OX – అక్షంపైన వస్తువు పరిమాణాన్ని, OY అక్షంపైన రాబడులను P కొలుస్తున్నాం.
పటంలో AR – సగటు రాబడి రేఖ, MR – ఉపాంత రాబడి రేఖ రెండూ సరళ రేఖలుగా ఉండి ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతున్నాయి. AR రేఖకు MR రేఖ కింద ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో AR, MR రేఖలు మిగతా మార్కెట్లలో కంటే అధిక వ్యాకోచంగా ఉంటాయి.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భూమి లక్షణాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో భూమి అనగా భూమి ఉపరితలంతో పాటు అడవులు, నీరు, వాతావరణం, ఖనిజాలు, ఇంధనం మొదలగునవి. భూమికి క్రింది లక్షణాలు ఉన్నాయి :
- భూమి ప్రకృతి ప్రసాదితం.
- భూమి సప్లయ్ పూర్తి అవ్యాకోచం.
- భూమికి సప్లయ్ ధర లేదు.
- భూమికి గమనశీలత లేదు.
- భూమి సారాలలో తేడాలు ఉంటాయి.
ప్రశ్న 2.
శ్రమ విభజన అంటే ఏమిటి ?
జవాబు.
ఒక వస్తువు ఉత్పత్తి ప్రక్రియ వివిధ భాగాలుగా విభజించి వీటిని వివిధ నైపుణ్యం గల శ్రామికులకు కేటాయించడాన్ని శ్రమ విభజన అని అంటారు. ఏ శ్రామికుడు ఒక వస్తువును పూర్తిగా తయారుచేయడు. ప్రతి శ్రామికుడు వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే తయారు చేస్తాడు. ఈ భావనను ఆడమ్ స్మిత్ వివరించినాడు. అధిక సామర్థ్యం, ప్రత్యేక నైపుణ్యం వలన శ్రమ విభజన ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది.
ప్రశ్న 3.
ఉత్పత్తి ఫలం నిర్వచించండి.
జవాబు.
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాల రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్టిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు :
Q = f (N, L, C, O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి.
ప్రశ్న 4.
సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి భావనలను వివరించండి.
జవాబు.
ఉపాంత ఉత్పత్తి (Marginal Product – MP) : చర సాధనాన్ని L అదనంగా ఉపయోగించినందువల్ల మొత్తం ఉత్పత్తిలో వచ్చిన అదనపు పెరుగుదలను ఉపాంత ఉత్పత్తి అంటారు. అంటే
MPn = TPn – TPn-1 లేదా MP = \(\frac{\mathrm{dTP}}{\mathrm{dL}}\)
ఇక్కడ, MPn = nవ కారక ఉపాంత ఉత్పత్తి
TPn = ప్రస్తుత మొత్తం ఉత్పత్తి
TPn – 1 = పూర్వపు మొత్తం ఉత్పత్తి
dTP = మొత్తం ఉత్పత్తిలో మార్పు
dL = చర కారకం ఉపయోగంలో మార్పు
సగటు ఉత్పత్తి (Average Product – AP) :
మొత్తం ఉత్పత్తిని చర ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగించగా ‘సగటు ఉత్పత్తి’ లభిస్తుంది. అంటే
AP = \(\frac{\mathrm{TP}}{\mathrm{L}}\)
= మొత్తం ఉత్పత్తి / శ్రామికుల సంఖ్య
ప్రశ్న 5.
ఉత్పత్తి కారకాలు వర్గీకరణను వివరించండి.
జవాబు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తి ప్రక్రియ చాలా క్లిష్టతరంగా మారింది. ఒక వస్తువు అనేక దశలు దాటి అంతిమ రూపంలో వినియోగదారునికి చేరుతుంది. వస్తుసేవల ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఈ ఉత్పత్తి కారకాలు సహజ కారకాలు కావచ్చు లేదా మానవ నిర్మిత కారకాలైనా కావచ్చు.
ఉత్పత్తి కారకాలు నాలుగు రకాలు అవి : భూమి (land), శ్రమ (labour), మూలధనం (capital), వ్యవస్థాపన (organization). ఒక దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల పరిమాణం, వాటి నాణ్యతపై ఆధారపడుతుంది.
ప్రశ్న 6.
సాంకేతిక ఆదాలు వివరించండి.
జవాబు.
శ్రమ విభజన వలన ఉత్పత్తి పెరిగినపుడు ఉత్పత్తికి అయ్యే సగటు శ్రమ వ్యయం తగ్గుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద సంస్థ ఎక్కువ సామర్థ్యం గల మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
సాంకేతిక ఆదాలను, కెర్న్ క్రాస్ మేలు రకం పద్ధతులు, విస్తారం, అనుసంధాన ప్రక్రియ, ఉప ఉత్పత్తులు, ప్రత్యేకీకరణ అని విభజించారు.
ప్రశ్న 7.
మూలధన ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు.
మూలధన ప్రాధాన్యత గురించి క్లుప్తంగా తెలుసుకొందాం :
- మూలధనం లేకుండా ఉత్పత్తి జరగదు. ఆర్థికాభివృద్ధిలో దీని పాత్ర ముఖ్యం.
- మూలధనం శ్రామికులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు అందించి వారి సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
- మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
- ఉద్యోగ అవకాశాలను పెంచడానికి దోహదపడుతుంది.
ప్రశ్న 8.
బహిర్గత ఆదాలు వివరించండి.
జవాబు.
ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య లేదా ఆ పరిశ్రమ పరిమాణం పెరిగినపుడు వచ్చే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినపుడు నవ కల్పనలు ప్రవేశపెట్టడం వలన, ప్రత్యేకీకరణను ప్రవేశ పెట్టడం వలన ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. అవి :
- (a) కేంద్రీకరణ ఆదాలు
- సమాచార ఆదాలు
- ప్రత్యేకీకరణ ఆదాలు
- శ్రేయస్సు సంబంధించి ఆదాలు
ప్రశ్న 9.
మూలధన సంచయనం అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సంచయనం (Capital Formation) : దేశంలో వాస్తవిక మూలధనం పెరిగితే, అంటే వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడానికి వాడే మూలధన వస్తువులైన యంత్రాలు, యంత్ర పరికరాలు, రవాణా పనిముట్లు, శక్తి వనరులు వంటివి పెరిగితే మూలధన సంచయనం జరిగినట్లు. మూలధన సంచయనం జరగాలంటే పొదుపు చేయాలి. ఈ పొదుపును పెట్టుబడిగా మార్చాలి.
ప్రశ్న 10.
సప్లయ్ ఫలంను నిర్వచించండి.
జవాబు.
ఒక వస్తువు ధరకు, సప్లయ్కు, సప్లయ్న నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని సప్లయ్ ఫలం తెలియచేస్తుంది. దీనిని క్రింది విధంగా వివరించవచ్చు: ..
Sx = f (Px, Py, Pf, T, Gp, Gf)
Sx = X వస్తువు సప్లయ్
f = ప్రమేయ సంబంధం
Px = X వస్తువు ధర
Py = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
T = సాంకేతిక స్థాయి
Gf = సంస్థ లక్ష్యాలు
Gp = ప్రభుత్వ విధానాలు
ప్రశ్న 11.
సప్లయ్ సూత్రం నిర్వచించండి.
జవాబు.
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తు ధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.
ప్రశ్న 12.
సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖలను వివరించండి.
జవాబు.
ఒక మార్కెట్లో అమ్మకందారుడు, ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత ధరకు ఎంత పరిమాణం వస్తువులను అమ్మడానికి సిద్ధంగా ఉంటాడో దానిని ఆ వస్తువు సప్లయ్ అంటారు. దీనిని ఒక పట్టిక రూపంలో చెబితే అది సప్లయ్ పట్టిక అవుతుంది. సప్లయ్ పట్టిక ఆధారంగా సప్లయ్ రేఖను గీయవచ్చు.
పట్టిక ప్రకారం ధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. సప్లయ్ రేఖ పటం ప్రకారం, ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ, ధనాత్మక సంబంధాన్ని చూపుతుంది.
ప్రశ్న 13.
ద్రవ్య వ్యయాలు అంటే ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ద్రవ్య రూపంలోని ప్రతిఫలాలైన భవనాలకున్న అద్దె, వేతనాలు, మూలధనానికి చెల్లించే వడ్డీ, ముడి సరుకులు, యంత్రాలు, పరికరాలపై అయ్యే వ్యయాలు, యంత్రాలు, భవనాలు, ఇతర మూలధన వస్తువులపై జరిగే తరుగుదల వ్యయం, విద్యుచ్ఛక్తి, ప్రకటనలు, రవాణా, బీమా ప్రీమియం, పన్నుల కోసం చేసే చెల్లింపులు మొదలైన వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు.
అంటే వస్తూత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్య ఖర్చులను ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలు (explicit costs), అప్రకటిత వ్యయాలు (implicit costs) అని విభజిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి దారుడు చెల్లించే ద్రవ్య వ్యయాలను ప్రకటిత వ్యయాలంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి దారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలు అంటారు.
ప్రశ్న 14.
అవకాశ వ్యయం అంటే ఏమిటి ?
జవాబు.
ఒక ఉత్పాదకాన్ని ఒక ప్రయోజనానికి బదులుగా మరొక ప్రయోజనానికి వాడితే కోల్పోయిన ఉత్పత్తిని అవకాశవ్యయం అంటారు.
ప్రశ్న 15.
మొత్తం స్థిర వ్యయరేఖను విశదీకరించండి.
జవాబు.
ఉత్పత్తితో పాటు మారకుండా స్థిరంగా ఉండే వ్యయాలను మొత్తం స్థిర వ్యయాలు అంటారు. సంస్థ ఉత్పత్తిని ఆపినా స్థిర వ్యయాలు భరించవలసి ఉంటుంది. మొత్తం స్థిర వ్యయరేఖ X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఉత్పత్తి ఎంత ఉన్నా స్థిర వ్యయం మారదు. పటంలో వ్యయాన్ని Y- అక్షంపైనా, ఉత్పత్తిని X – అక్షంపైనా చూపినాము.
ప్రశ్న 16.
సగటు ఉపాంత వ్యయాల మధ్య సంబంధంను వివరించండి.
జవాబు.
సగటు ఉపాంత వ్యయ రేఖలు రెండూ ‘U’ ఆకారంలో ఉంటాయి. ఉత్పత్తి స్థాయి పెరుగుతున్నపుడు ప్రారంభంలో సగటు వ్యయం, ఉపాంత వ్యయం రెండూ తగ్గుతూ ఉంటాయి. సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ ఖండిస్తుంది. ఉత్పత్తిలో పెరుగుదల ఒక దశ దాటిన తరువాత సగటు, ఉపాంత వ్యయాలు రెండూ కూడా పెరుగుతాయి. దీనిని ఇచ్చిన రేఖా పటంలో చూపవచ్చు.
ప్రశ్న 17.
సంపూర్ణ పోటీలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఒక సంస్థ వివిధ ధరల వద్ద వస్తువులను అమ్మగా పొందిన ఆదాయంను రాబడి అంటారు. అనగా TR = Price × Quantity sold. సంపూర్ణ పోటిలో అమ్మకందార్లు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉంటారు. వస్తువులు సజాతీయంగా ఉంటాయి. పరిశ్రమలో ఒకే ధర ఉంటుంది.
ఈ ధర వద్ద సంస్థలన్ని ఎంత పరిమాణ్ణానైనా అమ్ముతాయి. సంస్థ డిమాండు రేఖయే, ధర రేఖ లేదా సగటు రాబడి రేఖ. లేదా ఉపాంత రాబడి రేఖ. ఈ రేఖ (P = AR = MR) X – అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
ప్రశ్న 18.
ఏకస్వామ్యంలో AR, MR రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు.
ఏకస్వామ్యంలో ఒకే ఒక అమ్మకందారుడు ఉంటాడు. సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. ఏకస్వామ్యదారుడు అమ్మకాలను పెంచుకోవటానికి ధరను తగ్గిస్తాడు. ‘ధరే సగటు రాబడి, కాబట్టి సగటు రాబడి రేఖ క్రమేణా క్షీణిస్తుంది.
అందువలన ధర రేఖ లేదా డిమాండు రేఖ లేదా సగటు రాబడి (AR) రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఉపాంత రాబడి (MR) కూడా తగ్గుతుంది. AR కంటే MR తక్కువగా ఉంటుంది. అందువలన సగటు రాబడి రేఖకు దిగువన ఉపాంత రాబడి రేఖ ఉంటుంది. AR లోని తగ్గుదల కంటే MR లోని తగ్గుదల ఎక్కువ.