TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ అంటే ఏమిటి ? వివిధ రకాలైన పరిశ్రమలను సోదాహరణంగా వివరించండి.
జవాబు.
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్ నిర్మాణము మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాలనే పరిశ్రమగా నిర్వచించవచ్చు.

మూలధన తయారయ్యే వస్తువులు వినియోగ వస్తువులు లేదా మూలధన వస్తువులు కావచ్చు. వినియోగదారులు ఉపయోగించే వస్తువులు అనగా ఆహార పదార్థాలు, నూలు మొదలైనవి వినియోగిత వస్తువులు. మూలధన వస్తువులు అనగా ఉత్పత్తిదారులు వాటిని మరల ఉత్పత్తికి ఉపయోగించేవి. ఉదా: యంత్రాలు, పరికరాలు, ఎక్విప్మెంట్
మొ||నవి.

పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.
1) ప్రాథమిక పరిశ్రమ: ఈ పరిశ్రమ ప్రకృతి సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మానవుని శ్రమ చాలా తక్కువ. ఇది ప్రకృతిపై ఆధారపడినది. ఉదా: వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొ||నవి.

2) ప్రజనన పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందుతాయి. కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమలు అంటారు. నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకము మొ||నవి ఈ పరిశ్రమల క్రిందకు వస్తాయి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు ఖనిజము, నూనె, ఇనుప ఖనిజము, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడము ఉద్గ్రహణ పరిశ్రమకు ఉదాహరణలు.

4) వస్తు తయారీ పరిశ్రమలు: ముడి పదార్థాలు లేదా సగము తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తి చేసేవాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఈ వస్తు తయారీ పరిశ్రమ ప్రధానముగా కర్మాగారాలలో సాగుతూ ఉంటుంది. ఇనుము-ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన పరిశ్రమలను వస్తు తయారీ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. వస్తు తయారీ పరిశ్రమలను మరల వర్గీకరించవచ్చును.

  1. విశ్లేషణాత్మక పరిశ్రమలు
  2. ప్రక్రియాత్మక పరిశ్రమలు
  3. మిశ్రమ పరిశ్రమలు
  4. జోడింపు పరిశ్రమలు.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు: రోడ్లు, వంతెనలు, భవనాలు, కాలువలు, ప్రాజెక్టులు మొదలైన నిర్మాణాలను చేపట్టేవాటిని వస్తు నిర్మాణ పరిశ్రమలుగా పేర్కొనవచ్చును. ఉద్గ్రహణ మరియు వస్తు తయారీ పరిశ్రమలలో తయారైన వస్తువులలో అధిక భాగము ఈ రకమైన పరిశ్రమలలో ముడిపదార్థముగా వాడతారు.

6) సేవారంగ పరిశ్రమలు: ప్రస్తుతము సేవారంగము ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది కాబట్టి దీనిని సేవారంగ పరిశ్రమగా పేర్కొంటారు. సేవారంగ పరిశ్రమలకు చెందిన ఉదాహరణలు – హోటల్ పరిశ్రమ, టూరిజం పరిశ్రమ, వినోద పరిశ్రమ, ఆసుపత్రులు, కళాశాలలు మొదలైనవి.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి ? వాణిజ్యంలోని వివిధ భాగాలను వివరించండి.
జవాబు.
వాణిజ్యం – శాఖలు లేదా వాణిజ్య భాగాలు:
వాణిజ్యంలో చోటుచేసుకునే వ్యవహారాలను క్రింది రెండు శాఖలుగా విభజించవచ్చు. అవి:

  1. వర్తకం.
  2. వర్తక సదుపాయాలు.

1. వర్తకం: వాణిజ్యంలో ఒక ప్రధాన భాగం వర్తకం. ఇది కొనుగోలుదారులను, అమ్మకందారులను కలుపుతుంది.
ఈ వర్తకం చేసే వ్యక్తిని వర్తకుడు అంటారు. ఈ వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి వస్తువులను సేకరించి వినియోగదారులకు బదలాయింపు చేస్తాడు. ఈ వర్తకాన్ని

  1. స్వదేశీ వర్తకం,
  2. విదేశీ వర్తకం అని రెండు విధాలుగా విభజించవచ్చు.

1. స్వదేశీ వర్తకం:
1) ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అంటారు. దీన్ని అంతర్గత వర్తకం అని కూడా పిలుస్తారు.

2) ఇందులో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరూ ఒకే దేశానికి చెంది ఉంటారు. ఈ స్వదేశీ వర్తకం తిరిగి రెండు రకాలు: అవి a) టోకు వర్తకం b) చిల్లర వర్తకం.
a) టోకు వర్తకం: పెద్ద పెద్ద పరిమాణాలలో వస్తువులను కొనుగోలు, అమ్మకం చేయడాన్ని టోకు వర్తకం అంటారు. ఈ వర్తకాన్ని చేసే వ్యక్తిని ‘టోకు వర్తకుడు’ అంటారు.
b) చిల్లర వర్తకులు: చిన్న, చిన్న పరిమాణాలలో వస్తువులను కొనుగోలు, అమ్మకం చేయడాన్ని చిల్లర వర్తకం అంటారు. ఈ వర్తకాన్ని చేసే వ్యక్తిని ‘చిల్లర వర్తకుడు’ అంటారు. ఈ చిల్లర వర్తకులు టోకు వర్తకులకు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు.

2. విదేశీ వర్తకం: అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా, సముద్ర రవాణాల ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ · దేశాల మధ్య వస్తుసేవల క్రయ, విక్రయాలు జరిగితే దానిని ‘విదేశీ వర్తకం’ అంటారు. దీనిని బహిర్గత వర్తకం లేదా అంతర్జాతీయ వర్తకం అని కూడా అంటారు. ఈ విదేశీ వర్తకాన్ని తిరిగి మూడు విభాగాలుగా క్రింద పేర్కొన్న విధంగా ఉపవిభజన చేయవచ్చు.

ఎ) ఎగుమతి వర్తకం: విదేశాలకు సరుకులను అమ్మకం చేయడాన్ని ఎగుమతి వర్తకం అంటారు. ఉదాహరణకు భారతదేశం యునైటెడ్ కింగ్డమ్కు తేయాకు ఎగుమతి చేస్తుంది.
బి) దిగుమతి వర్తకం: ఇతర దేశాల నుంచి సరుకులను కొనుగోలు చేయడాన్ని దిగుమతి వర్తకం అంటారు. ఉదాహరణకు భారతదేశం ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది.
సి) ఎంట్రిపో వర్తకం: ఒక దేశం నుంచి సరుకులను దిగుమతి చేసుకొని వేరొక దేశానికి ఎగుమతి చేసే వ్యాపారాన్ని ఎంట్రిపో వర్తకం అంటారు. దీన్ని ‘మారు వర్తకం’ అని కూడా పిలుస్తారు. అలాగే తిరిగి ఎగుమతి చేసే వర్తకం అని కూడా అంటారు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

2. వర్తక సదుపాయాలు: వర్తకం లేదా వస్తుసేవల పంపిణీ అనేక రకాల ఇబ్బందులను ఎదురుకొంటుంది. వాటిని తొలగించడానికి సహాయపడే అంశాలను వర్తక సదుపాయాలు అంటారు. ఇవి వస్తువులు, ఉత్పత్తిదారులు నుంచి వినియోగదారులకు సులభంగా చేరడానికి దోహదపడతాయి. కాబట్టి వర్తకం ఎటువంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా నిరాటంకంగా కొనసాగడానికి సహాయపడు సదుపాయాలను వర్తక సదుపాయాలు అంటారు.

ఈ వర్తక సదుపాయాలలో రవాణా, బీమా, గిడ్డంగులు, బాంకింగ్, వ్యాపార ప్రకటనలు మరియు సమాచారం ప్రధానమైనవి.
1. రవాణా: వస్తువుల ఉత్పత్తి కేంద్రాలకు మరియు వస్తువుల వినియోగ కేంద్రాలకు మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుసేవల పంపిణీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి దోహదపడే వర్తక సదుపాయమే రవాణా. ఇది వస్తు-సేవలకు స్థల ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఈ రవాణాలో ముఖ్యమైనవి భూమార్గ రవాణా, జలమార్గ రవాణా మరియు వాయు మార్గం.

2. కమ్యూనికేషన్: ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారాన్ని పంపడం లేదా వినిమయం చేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఇది మౌఖికంగా గాని, లిఖితపూర్వకంగా గాని ఉండవచ్చు. ఆధునిక కమ్యూనికేషన్ పరిస్థితుల్లో టెలిఫోన్, టెలీ కాన్ఫరెన్స్, ఈ-మెయిల్, వీడియో కాన్ఫరెన్స్ మొదలైనవి ప్రముఖ పాత్రను పోషిస్తూ, ఉత్పత్తిదారులకు వినియోగ దారులకు మధ్య మంచి అనుబంధం ఏర్పడడానికి ఎంతో దోహదపడుతున్నాయి.

3. గిడ్డంగులు: ఉత్పత్తికీ, వినియోగానికీ మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఒక సమయంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అదే సమయంలో వినియోగింపబడవు. కాబట్టి నిల్వ ఉంచే సదుపాయాల అవసరం ఏర్పడింది. ఉదా: వ్యవసాయ వస్తువులైన గోధుమలు, బియ్యం ఒక కాలంలోనే ఉత్పత్తి అవుతాయి, కానీ సంవత్సరం పొడవునా వినియోగించబడతాయి. వినియోగదారులకు సకాలంలో వస్తువులను అందించడం ద్వారా గిడ్డంగులు ఆ వస్తువుకు ‘కాలప్రయోజనాన్ని’ సృష్టిస్తాయి.

4. బాంకింగ్: సరుకుల ఉత్పత్తి లేదా కొనుగోలుకూ, అమ్మకానికి మధ్య సామాన్యంగా కాలవ్యవధి ఉంటుంది. అరువుపై సరుకులను అమ్మకం చేసినప్పుడు నగదు వసూలు కావడానికి సమయం పడుతుంది. ఈ వ్యవధిలో వ్యాపారస్తునికి ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఇలాంటి ఆర్థిక అవరోధాన్ని బాంకులు తొలగిస్తాయి. ద్రవ్య సహాయక సంస్థలు, రుణాలు మంజూరు లేదా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నిధులను కల్పిస్తాయి.

5. బీమా: నష్ట భయాలను బీమా తగ్గిస్తుంది. ఇది ముఖ్యమైన వర్తక సదుపాయం. ప్రతి వ్యాపారంలోను అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. భారీ నష్టాలు రాకుండా హామీలాగా ఇది పనిచేస్తుంది. నష్ట భయాలు, అగ్ని ప్రమాదం, దొంగతనం ఇతర ప్రకృతి వైపరీత్యాలకు చెందినవి కావచ్చు. బీమా అనేక మందిపై విస్తరింపచేయడం ద్వారా నష్ట భయాలను బీమా సంస్థ తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

6. ప్రకటనలు: మార్కెట్లోని వివిధ వస్తువుల ఉపయోగాలు, లభించే ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు అందజేస్తాయి. సమాచార లోపం అనే అవరోధాన్ని తొలగించడానికి ప్రకటనలు తోడ్పడతాయి. గెగియో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, టి.వి., ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వారా ప్రకటనలు జారీ అవుతాయి.

ప్రశ్న 3.
ప్రస్తుత తరుణంలో వాణిజ్యం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి.
జవాబు.
1. వస్తుసేవల వినిమయాన్ని వాణిజ్యం అంటారు. వస్తువులను అవి ఉత్పత్తి అయ్యే ప్రదేశాల నుంచి అంతిమంగా వినియోగించే ప్రదేశాలకు చేర్చే ప్రక్రియలో చేపట్టే కార్యకలాపాలన్నింటిని స్థూలంగా ‘వాణిజ్యం’ అని పిలుస్తారు. వినియోగదారుల అవసరాలు తీర్చడం కోసం సకాలంలో సక్రమంగా వస్తుసేవలను పంపిణీ చేయడమే వాణిజ్యం యొక్క ప్రధాన అంశం.

2. ‘వాణిజ్యం’ అనే పదం పరిధిలోకి వర్తకం, వర్తక సదుపాయాలు చేరుతాయి. వాణిజ్యం అనేది చాలా విస్తృతమైన పదం. వస్తువుల కొనుగోలు, అమ్మకానికి మధ్య ఉండే అన్ని పనులు దీని పరిధిలోకి వస్తాయి.

3. జేమ్స్ స్టీఫెన్సన్ అభిప్రాయం ప్రకారం “వస్తువుల వినియోగంలో వ్యక్తులకు, ప్రదేశానికి, కాలానికి సంబంధించిన అవరోధాలను తొలగించడం కోసం చేసే పనుల సముదాయమే వాణిజ్యం”. పారిశ్రామిక ప్రపంచంలోని సభ్యుల మధ్య వస్తువుల వినియోగ నిమిత్తం ఏర్పాటు చేసే వ్యవస్థీకృత విధానాన్నే వాణిజ్యం అంటారు.

వాణిజ్యం – ప్రాముఖ్యత:
వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను క్రింది పేర్కొన్న అంశాల ద్వారా వివరించవచ్చు.
1. పెరుగుతూ ఉండే మానవ కోర్కెలను వాణిజ్యం సంతృప్తిపరచే ప్రయత్నం చేస్తుంది: మానవుల యొక్క కోరికలకు అంతులేదు. వాణిజ్యంలో ఉండే పంపిణీ ప్రక్రియ వల్ల ప్రపంచంలో ఒక మూల నుంచి వస్తువులు వేరొక చోటికి ప్రయాణం అవుతున్నాయి. కావున వాణిజ్యం తనతో ఇమిడివున్న వివిధ అంశాల సహాయంతో మానవ కొర్కెలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది.

2. జీవన ప్రమాణాల పెరుగుదలకు వాణిజ్యం సహాయపడుతుంది: సమాజంలోని వ్యక్తులు పొందే నాణ్యమైన జీవన తీరుతెన్నులను జీవన ప్రమాణం అంటారు. ఒకప్పటి కంటే ఎక్కువ వస్తువులను మానవుడు వినియోగిస్తుంటే అతని జీవన ప్రమాణం వృద్ధి చెందినట్లే. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన ధరకు మనం కోరుకొనేవాటిని అందజేయడం ద్వారా వాణిజ్యం మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

3. ఉత్పిత్తిదారులను, వినియోగదారులను అనుసంధానం చేస్తుంది: తుది వినియోగం కోసమే ఉత్పత్తి జరుగుతుంది. చిల్లర వర్తకులు, టోకు వర్తకులు, వర్తక సదుపాయాల ద్వారా వాణిజ్యం, ఉత్పత్తిదారులను, వినియోగదారులను కలుపుతుంది. తద్వారా ఉత్పత్తి కేంద్రాలకు, వినియోగానికి మధ్య సంబంధాలను సృష్టించి వాణిజ్యం వాటిని నిరంతరం కొనసాగేటట్లు చేస్తుంది.

4. ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది: వాణిజ్యం, పరిశ్రమ, వర్తకం ప్రగతి చెందితే దాని ప్రభావం వర్తక ఏజెన్సీలలోని బాంకింగ్, రవాణా, గిడ్డంగులు, బీమా, ప్రకటనల లాంటి వాటిపై పడుతుంది. ఇవన్నీ సరిగా పనిచేయాలంటే వ్యక్తులు అవసరం. అందువల్ల వాణిజ్యం ఉద్యోగ అవకాశాలను మెండుగా సృష్టిస్తుంది.

5. జాతీయాదాయాన్ని, సంపదను పెంచుతుంది: ఉత్పత్తి పెరిగితే జాతీయాదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల వల్ల సుంకాల రూపంలో విదేశీమారక ద్రవ్యం లభిస్తుంది.

6. వర్తక సదుపాయాల విస్తరణకు తోడ్పడుతుంది: వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందినప్పుడు, వర్తక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ అనివార్యం. వాణిజ్యం మెరుగైనప్పుడు వర్తక సదుపాయాలైన బాంకింగ్, కమ్యూనికేషన్, రవాణా, ప్రకటనలు, బీమా మొదలైనవి విస్తరిస్తాయి మరియు ఆధునీకరించబడుతాయి.

7. అంతర్జాతీయ వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది: రవాణా, సమాచార రంగాలు అభివృద్ధి చెందడం వల్ల వివిధ దేశాలు తమ మిగులు వస్తువులను ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతాయి. ఆ విధంగా వాణిజ్యం దేశ సత్వర ఆర్థిక ప్రగతికి కారణమవుతుంది.

8. వెనుకబడిన దేశాలకు ఇది ప్రయోజనకారి: తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యం ఉన్న కార్మికులను ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు అవసరమైన ముడిపదార్థాలను వెనుకబడిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఈ విధమైన పరిణామాలు తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామికీకరణకు తోడ్పడుతాయి.

9. అత్యవసర సమయాలలో సహాయపడుతుంది: వరదలు, భూకంపాలు, యుద్ధాలు లాంటి అత్యవసర సమయాలలో అవసరమైన ప్రాంతాలకు అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, ఇతర సహాయక చర్యలు అందించడంలో వాణిజ్యం సహాయపడుతుంది.

ప్రశ్న 4.
వర్తకాన్ని నిర్వచించి, వివిధ రకాల వర్తక సదుపాయాల గురించి వివరించండి.
జవాబు.
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారిమధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది.’ అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ
తిరుగుతాయి.

వర్తక సదుపాయాలు: వర్తకము అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. దీనిలో అనేక అడ్డంకులు ఉంటాయి. వీటిని తొలగించి వస్తు సరఫరాను సులభతరము చేయడానికి ఉన్న సదుపాయాలే వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలలో రవాణా, సమాచారము, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా, వ్యాపార ప్రకటనలు ఉంటాయి.

1) రవాణా: ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుచున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుచున్నది. ఆధునిక రోడ్డు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగా, భద్రముగా జరుగుతున్నది.

2) కమ్యూనికేషన్: కమ్యూనికేషన్ అనగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సమాచార మార్పిడి. ఇది నోటిమాటల రూపములో లేదా వ్రాతపూర్వకముగా ఉండవచ్చు. వ్యాపారములో ఉన్న షరతులు పరిష్కరించుకోవడానికి, సమాచారం ఒకరి నుండి మరొకరికి స్పష్టంగా చేరాలి. ఉదా: వస్తువుల ధర, డిస్కౌంట్, పరపతి సౌకర్యము మొదలైన సమాచారమును కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. టెలిఫోన్, టెలెక్స్, టెలిగ్రాం, ఈ-మెయిల్, టెలీకాన్ఫరెన్స్ మొదలైనవి వ్యాపారస్తులు, వినియోగదారుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి తోడ్పడుచున్నవి.

3) గిడ్డంగులు: ఉత్పత్తి అయిన వస్తువులన్నీ వెంటనే అమ్ముడు కాకపోవచ్చు. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వచేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసములలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరము పొడవునా ఉంటాయి. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలములలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చేవరకు గిడ్డంగులలో నిల్వచేయవలసి ఉంటుంది. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

4) బీమా: సరుకులు గిడ్డంగులలో ఉన్నప్పుడు, రవాణా చేస్తున్నప్పుడు అనేక కారణాల వలన సరుకు చెడిపోవడం, ప్రమాదానికి గురికావడము జరుగుతుంది. వర్తకులకు ఇలాంటి నష్టములు కలిగినపుడు బీమా సంస్థలు రక్షణ కల్పించి, వర్తకాభివృద్ధికి తోడ్పడతాయి.

5) బ్యాంకింగ్: వాణిజ్యము అభివృద్ధి చెందేటందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి, అడ్వాన్సులను అందించే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుటలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి. ఇది ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

6) ప్రకటనలు: ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తిచేసిన వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటనల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తారు. ప్రకటనలు వస్తువులను కొనుగోలు చేయాలి అనే భావనను వినియోగ దారులలో కలుగజేస్తుంది. టి.వి., రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హోర్డింగులు, ఇంటర్ నెట్ ద్వారా ప్రకటనలను అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 5.
వర్తకం, వాణిజ్యం మరియు పరిశ్రమల మధ్య గల అంతర్గత సంబంధాన్ని వివరించండి.
జవాబు.
1. వ్యాపారం, పరిశ్రమ మరియు వాణిజ్యం అని రెండు రకాలుగా విభజించబడుతుంది. వాణిజ్యం తిరిగి వర్తకం మరియు వర్తక సదుపాయాలుగా ఉపవిభజన చేయడం జరుగుతుంది. వాస్తవానికి అవన్నీ ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిని వేరువేరుగా విభజించలేము. అవన్నీ కూడా స్థూలంగా వ్యాపార వ్యవస్థలోని భాగాలే. పరిశ్రమ లేకుండా వాణిజ్యం, వాణిజ్యం లేకుండా పరిశ్రమకు మనుగడలేదు. ఎందుకంటే ప్రతి ఉత్పత్తిదారుకు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మడానికి మార్కెట్ కావాలి. కానీ ఉత్పత్తిదారు నేరుగా కొనుగోలుదారులతోగాని, వినియోగదారులతో కానీ సంబంధం కలిగి ఉండకపోవచ్చు. కాబట్టి పరిశ్రమకు ఎల్లప్పుడు వాణిజ్యం అవసరం.

2. వాణిజ్యం వస్తు – సేవల అమ్మకం, బదిలీ మరియు వినిమయానికి చెందినది. కాబట్టి ఈ వస్తు – సేవల ఉత్పత్తికి పరిశ్రమ అవసరం. అలాగే వాణిజ్యం ఉత్పత్తిదారులకు మరియు తుది వినియోగదారులకు మధ్య బంధంను ఏర్పాటు చేయడానికి కావలసిన యంత్రాంగాన్ని రూపొందిస్తుంది. ఇందులో కొనుగోలు, అమ్మకాలు, రవాణా చేయడం, బాంకింగ్ సరుకులను బీమా చేయడం, గిడ్డంగులలో ఉంచడం లాంటివి ఇమిడి ఉంటాయి.

3. వర్తకం అనేది వస్తు – సేవల యొక్క కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపం. ఇది పరిశ్రమకు కావలసిన మద్దతును అందిస్తూ, వాణిజ్యం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగడానికి దోహదపడుతుంది. అలాగే వర్తక సదుపాయాలు లేకుండా కూడా వర్తకం కొనసాగలేదు.

4. కాబట్టి పరిశ్రమ, వాణిజ్యం, వర్తకం చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండటంతో పాటు వాటి విజయానికి గాను ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. పరిశ్రమ వస్తుసేవలను ఉత్పత్తి చేస్తే వాణిజ్యం వాటి అమ్మకాలకు కావాల్సిన పరిస్థితులను కల్పిస్తుంది. కాగా వర్తకం వాస్తవ అమ్మకాలను చేపడుతుంది.

5. ఈ మూడు అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడడమే కాకుండా, ఒకదానితో ఒకటి పరస్పరంగా ఆధారపడి ఉండును. క్లుప్తంగా వాటి మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని క్రింది పటం ద్వారా చక్కగ అర్థం చేసుకోవచ్చు.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమను నిర్వచించండి.
జవాబు.
వస్తుసేవల ఉత్పత్తికి చెందిన కార్యకలాపాల సమూహాన్ని స్థూలముగా పరిశ్రమ అని నిర్వచించవచ్చును. అందుబాటులో ఉన్న భౌతిక వనరులను వివిధ ప్రక్రియల ద్వారా తుది వినియోగదారుల కోర్కెలను సంతృప్తిపరచడానికి గాను వస్తు సేవల రూపములో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వస్తుసేవలను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సౌకర్యవంతముగా ఆమోదయోగ్యముగా అందించడమే పారిశ్రామిక ప్రక్రియలో ఇమిడివున్న అంశము. ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలు, ప్రజోపయోగ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైనవి ఎన్నో వస్తుసేవలను అందిస్తున్నవి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

పరిశ్రమ ఆకార ప్రయోజనాన్ని సృష్టిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా తుది వినియోగదారునకు పనికివచ్చేటట్లు లభ్యమైన వనరులను వివిధ రూపాలలో అందజేస్తుంది.
పారిశ్రామిక సంస్థలు వివిధ ప్రయోజనాల నిమిత్తము రకరకాల వస్తువులను ఉత్పత్తిచేస్తాయి. వాటిని స్థూలముగా ప్రాథమిక వస్తువులు, తయారీలో ఉన్న వస్తువులు, తయారైన వస్తువులు అని విభజించవచ్చును. తయారైన వస్తువులను ఉత్పత్తి వస్తువులు, వినియోగదారు వస్తువులని కూడా విభజించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తుసేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసం ఏర్పరచిన క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ స్టీఫెన్ సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరము చేస్తుంది.

ప్రశ్న 3.
వర్తకం అంటే ఏమిటి ?
జవాబు.
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అని అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారి మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. అంటే ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి. వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తికి, విజయానికి వర్తకము తోడ్పడుతుంది. వర్తకమును రెండు విధాలుగా విభజించవచ్చును.

  1. స్వదేశీ వర్తకము
  2. విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము: ఒక దేశ సరిహద్దులలో జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అమ్మకం, కొనుగోలు ఒకే దేశములో జరుగుతాయి. స్వదేశీ వర్తకాన్ని అది చేపట్టే కార్యకలాపాల ప్రాతిపదికతనుబట్టి టోకు వర్తకమని, చిల్లర వర్తకమని విభజించవచ్చును.

2) విదేశీ వర్తకము: ఇతర దేశాలతో వర్తకాన్ని కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అని అంటారు. దేశ సరిహద్దులు దాటి కొనసాగించే వర్తకమే విదేశీ వర్తకము. విదేశీ వర్తకాన్ని మరల మూడు విధాలుగా విభజించవచ్చును.

  • దిగుమతి వర్తకము
  • ఎగుమతి వర్తకము
  • మారు వర్తకము.

ప్రశ్న 4.
విదేశీ వర్తకంలోని రకాలను వివరించండి.
జవాబు.
ఇతర దేశాలతో వర్తకమును కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అంటారు. దేశ సరిహద్దులు దాటే వర్తకమును విదేశీ వర్తకము అనవచ్చు. అనగా అమ్మకపుదారు ఒక దేశములోను, కొనుగోలుదారు మరొక దేశములోను ఉంటారు.

కొనుగోలుదారు విదేశీ మారకపు ద్రవ్యాన్ని పొంది, అమ్మకపుదారుకు పంపవలెను. విదేశీ వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అని కూడా వ్యవహరిస్తారు. విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చును.

  • దిగుమతి వర్తకము
  • ఎగుమతి వర్తకము
  • మారు వర్తకము.

a) దిగుమతి వర్తకము: ఒక దేశము మరొక దేశము నుంచి సరుకు కొనుగోలు చేయడాన్ని లేదా తెప్పించుకోవడాన్ని దిగుమతి వర్తకము అని అంటారు. ఇండియా అమెరికా నుంచి యంత్రాలను కొనుగోలు చేస్తే అది ఇండియా దృష్ట్యా దిగుమతి వర్తకము అవుతుంది.

b) ఎగుమతి వర్తకము: ఒక దేశము ఇంకొక దేశానికి సరుకును అమ్మడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఈ రకమైన వర్తకములో వస్తువులను విదేశీయుల అవసరాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇండియా అమెరికాకు తేయాకును అమ్మితే అది మనదేశము దృష్ట్యా ఎగుమతి వర్తకము అవుతుంది.

c) మారు వర్తకము: దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

ప్రశ్న 5.
పరిశ్రమల వర్గీకరణ వివరించండి.
జవాబు.
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చు.
1) ప్రాథమిక పరిశ్రమలు: ఈ పరిశ్రమ ప్రకృతిపై ఆధారపడి, ప్రకృతి సహాయముతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఉదా: వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొదలైనవి.

2) ప్రజనన పరిశ్రమలు: ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందిన కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జిస్తాయి. ఉదా: నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పరిశ్రమ.

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉదా: ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, ఇనుప ఖనిజము మొదలైనవి గనుల నుంచి వెలికితీయడము మొదలైనవి.

4) వస్తు తయారీ పరిశ్రమలు: ముడిపదార్థాలు లేదా సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులుగా ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఉదా: ఇనుము -, ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు మొదలైనవి.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు: రోడ్లు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు మొదలైనవాటి నిర్మాణాన్ని చేపట్టే పరిశ్రమలను వస్తు నిర్మాణ పరిశ్రమలుగా చెప్పవచ్చును.

6) సేవారంగ పరిశ్రమలు: ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ప్రజలకు ఆవశ్యకమైన సేవలను అందజేసే ప్రజోపయోగ సంస్థలను సేవా పరిశ్రమలు అంటారు. ఉదా: హోటల్ పరిశ్రమ, టూరిజమ్ పరిశ్రమ మొదలైనవి.

ప్రశ్న 6.
ఎంట్రిపో వర్తకంను సోదాహరణగా నిర్వచించండి.
జవాబు.
1. ఇంకో దేశానికి ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో మరో దేశం నుండి సరుకులను దిగుమతి చేసుకోవడాన్ని ‘ఎంట్రిపో వర్తకం’ అంటారు. దీనినే మారువర్తకం అని కూడా అంటారు.
2. ఇందులో సరుకులను దిగుమతి చేసుకునే దేశం ఇతర రెండు దేశాల మధ్య ‘మధ్యవర్తిగా’ వ్యవహరిస్తుంది.
3. ఉదా: భారతదేశం ఇరాన్ దేశం నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకొని నేపాల్ దేశానికి ఎగుమతి చేస్తుంది.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ.
జవాబు.
1. సహజ, మానవ, వనరులను ఉపయోగించి, వస్తుసేవలను ఉత్పత్తి చేయడం మరియు తయారు చేయడాన్ని “పరిశ్రమ” అంటారు.
2. వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిర్మాణము మొదలైనవాటికి సంబంధించిన కార్యకలాపాలను పరిశ్రమగా నిర్వచించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం.
జవాబు. వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి జరిగే ప్రదేశము నుంచి తుది వినియోగదారునకు చేరే వరకు జరిగే అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. జేమ్స్ ఫెన్సన్ అభిప్రాయం ప్రకారము, వాణిజ్యము అనగా “వస్తుసేవల మార్పిడిలో వ్యక్తులకు, స్థలానికి, కాలానికి సంబంధించి తలెత్తే అవరోధాలను తొలగించడానికి సహాయపడే కార్యకలాపాల సముదాయమే వాణిజ్యము”.

ప్రశ్న 3.
వర్తకం.
జవాబు.

  1. లాభోద్దేశంతో వస్తుసేవలను కొనుగోలు చేసి తిరిగి అమ్మే నిరంతర ప్రక్రియను వర్తకం అంటారు.
  2. ఇది వాణిజ్యంలోని ఒక భాగం. వర్తకంను నిర్వహించే వ్యక్తిని ‘వర్తకుడు’ అంటారు.
  3. వర్తకాన్ని స్వదేశీ వర్తకం మరియు విదేశీ వర్తకంగా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 4.
స్వదేశీ వర్తకం.
జవాబు.

  1. ఒక దేశ సరిహద్దులకు లోబడి జరిపే వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను స్వదేశీ వర్తకము అంటారు.
  2. స్వదేశీ వర్తకాన్ని “అంతర్గత వర్తకం” అని కూడా అంటారు.
  3. స్వదేశీ వర్తకాన్ని టోకు వర్తకం మరియు చిల్లర వర్తకంగా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 5.
ఎంట్రిపో వర్తకం.
జవాబు.
1. ఒక దేశము నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని మరొక దేశానికి ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము లేదా మారు వర్తకము అంటారు.

2. ఉదా: తైవాన్లో తయారైన కాలిక్యులేటర్లను భారతదేశము దిగుమతి చేసుకొని, వాటిని ఆఫ్రికా దేశాలకు మళ్ళీ ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

3. ఈ వర్తకమును ఆయా దేశాల మధ్య మంచి సంబంధాలు లేనప్పుడు, కొన్ని రవాణా తదితర సౌలభ్యాల వలన కూడా జరుగుతుంది.

ప్రశ్న 6.
రవాణా.
జవాబు.

  1. వస్తు సేవలను రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరవేయడానికి సహాయపడే వర్తక సదుపాయమే రవాణా.
  2. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుతున్నది.
  3. ఆధునిక రోడ్లు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగాను, భద్రముగా
    జరుగుతుంది.

ప్రశ్న 7.
గిడ్డంగులు.
జవాబు.
1. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వ చేయాలి. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

2. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసాలలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరమంతా ఉంటుంది. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలాలలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చే వరకు గిడ్డంగులలో నిల్వ చేయాలి.

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 6.
ప్రజనన పరిశ్రమలు.
జవాబు.

  1. ఈ పరిశ్రమలు వంశక్రమానికి చెందుతాయి. కొన్ని జాతుల మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు.
  2. నర్సరీలు, చేపల పెంపకము, కోళ్ళ పరిశ్రమ ఇందుకు ఉదాహరణలు.

ప్రశ్న 7.
ఉద్గ్రహణ పరిశ్రమలు.
జవాబు.

  1. ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు.
  2. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, నూనె, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడం ఉద్గ్రహణ పరిశ్రమలకు
    ఉదాహరణలు.

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు తయారీ పరిశ్రమలలో గల రకాలను తెల్పండి.
జవాబు.
ముడిపదార్థాలు, సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఇనుము-ఉక్కు, యంత్రపరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవి ఈ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును.

వస్తు తయారీ పరిశ్రమలో గల రకాలు:
1) విశ్లేషణాత్మక పరిశ్రమ: ముఖ్యమైన ముడిపదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా విశ్లేషణ చేసి, విడదీసి వివిధ వస్తువులను ఈ పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా: ముడిచమురును నూనె బావుల నుంచి తీసి, శుభ్రపరిచి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైనవి తయారు చేయుట.

2) ప్రక్రియాత్మక పరిశ్రమలు: ముడిపదార్థాలను వివిధ దశలలో, వివిధ ప్రక్రియలను జరపడం ద్వారా నూతన వస్తువులను తయారుచేయడం ఈ పరిశ్రమల ద్వారా జరుగుతుంది.
ఉదా: వస్త్రపరిశ్రమ, కాగితం, పంచదార పరిశ్రమలు.

3) మిశ్రమ పరిశ్రమలు: వివిధ రకాల ముడిపదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో వివిధ నిష్పత్తులలో మిశ్రమము చేసి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను మిశ్రమ పరిశ్రమలు అంటారు.
ఉదా: కాంక్రీట్, జిప్సమ్, బొగ్గు కలిపి సిమెంటు తయారుచేయుట.

4) జోడింపు పరిశ్రమలు: వివిధ పరిశ్రమలలో తయారైన వస్తువులను నిర్దిష్ట పద్ధతిలో, క్రమములో జతపరిచి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను జోడింపు పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా: టెలివిజన్, స్కూటర్, సైకిల్ మొదలైన వస్తువులను తయారుచేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
వాణిజ్యం యొక్క అవరోధాలను వివరించండి.
జవాబు.
1) వ్యక్తులకు సంబంధించిన అవరోధాలు: ఉత్పత్తిదారులు దేశము నలుమూలలా వ్యాపించివున్న వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొనలేరు. ఉత్పత్తిదారునకు, వినియోగదారునకు మధ్య అనేకమంది మధ్యవర్తులు ఉండి వాణిజ్య కార్యకలాపాలు సులభముగా జరగడానికి సహాయపడతారు. వారు ఉత్పత్తిదారుల నుంచి సరుకును కొని, వినియోగదారులకు అమ్ముతారు.

2) స్థలానికి సంబంధించిన అవరోధాలు: వస్తువులు ఒక ప్రదేశములో ఉత్పత్తి అయితే వాటిని వివిధ ప్రదేశాలకు, ఇతర దేశాలకు పంపిణీ చేయవలెను. ఉత్పత్తి ప్రదేశాలకు, వినియోగ కేంద్రాలకు దూరము పెరుగుచున్నది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారునకు చేరవేయడానికి రవాణా తోడ్పడుతుంది.

3) కాలానికి సంబంధించిన అవరోధాలు ఉత్పత్తిదారులు వస్తువుల ఉత్పత్తిని డిమాండునుబట్టి చేస్తారు. కొన్ని వస్తువులను డిమాండు లేని కాలములో ఉత్పత్తిచేసి, డిమాండును అనుసరించి అమ్ముతారు. కాబట్టి అవి వినియోగమయ్యే వరకు నిల్వ చేయవలసి ఉంటుంది. గిడ్డంగుల సౌకర్యాల ద్వారా ఈ అవరోధాన్ని అధిగమించ వచ్చును.

4) ద్రవ్యమునకు సంబంధించిన అవరోధాలు: వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. కొన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. వీటికి ద్రవ్యము అవసరము. వాణిజ్య బ్యాంకులు వీరికి ఋణాలిచ్చి ద్రవ్యానికి సంబంధించిన అవరోధాలను తొలగిస్తాయి.

5) రిస్కుకు సంబంధించిన అవరోధాలు: ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి సరుకును రవాణా చేసేటప్పుడు నష్టభయము ఉంటుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు సంభవించవచ్చును. ఈ నష్టాలను, ఆస్తులను సంరక్షించు కోవడానికి బీమా కంపెనీలు తోడ్పడతాయి.

6) సమాచారానికి సంబంధించిన అవరోధాలు: వినియోగదారులకు తమకు కావలసిన వస్తువులు ఎక్కడ ఏ విధముగా లభిస్తాయో తెలియకపోవచ్చు. వస్తువుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయటానికి వ్యాపార ప్రకటనలు ఉత్తమ సాధనాలు. వస్తువుల విక్రయానికి వ్యాపార ప్రకటనలు దోహదము చేస్తాయి.

ప్రశ్న 3.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్య గల తేడాలను రాయండి.
జవాబు.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్యగల తేడాలు:
TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 2

TS Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 4.
బ్యాంకింగ్.
జవాబు.

  1. వాణిజ్యము అభివృద్ధి చెందేందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి అడ్వాన్సులను అందజేసే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్.
  2. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడములో బ్యాంకులు ముఖ్యపాత్ర వహిస్తున్నవి. బ్యాంకింగ్ ఒక ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

ప్రశ్న 5.
టోకు వర్తకం.
జవాబు.

  1. వస్తు, సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు పెద్ద మొత్తములో జరిగితే దానిని టోకు వర్తకము అంటారు.
  2. టోకు వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో చిల్లర వర్తకులకు అమ్ముతారు.

Leave a Comment