Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బహుళ జాతి సంస్థను నిర్వచించి, వాటి లక్షణాలను వివరించండి.
జవాబు.
ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, ఇతర దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినట్లయితే ఆ సంస్థలను బహుళ జాతీయ సంస్థలు ‘అంటారు. ఈ బహుళ జాతి సంస్థలు మల్టీనేషనల్ సంస్థలని, గ్లోబల్ సంస్థలని లేదా అంతర్జాతీయ సంస్థలని వేరు వేరు పేర్లతో పిలవబడతాయి. పెప్సీ, హుండాయి, నైక్, రీబాక్, ఎల్.జి, సామ్సంగ్ బహుళ జాతి సంస్థలకు ఉదాహరణలు.
నిర్వచనాలు: ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాలను తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళ జాతి సంస్థ’ అంటారు. విదేశీమారక నియంత్రణ చట్టము 1973 ప్రకారము,
- రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థగాని, శాఖగాని ఉన్న సంస్థ.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపార కార్యకలాపములను కొనసాగించే సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. పెద్ద పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు అధిక పరిమాణము కలిగి ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.
2. అంతర్జాతీయ కార్యకలాపాలు: ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతీయ సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచ వ్యాప్తముగా విస్తరించినవి.
3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళ జాతి సంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ‘ ప్రధాన కార్యాలయము యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వము, నియంత్రణలో పనిచేస్తాయి.
4. నిర్వహణలో నైపుణ్యము: బహుళ జాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లను, అనుభవము ఉన్నవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన నిర్వహణ ద్వారా తమ కార్యకలాపములను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తారు.
5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండటము వలన వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించటం జరుగుతుంది.
6. వనరుల కదలిక: బహుళ జాతి సంస్థల కార్యకలాపాలు మూలధన, సాంకేతిక, వ్యవస్థాపకత మరియు ఇతర ఉత్పత్తి కారకాల కదలికలపై ఆధారపడి ఉంటుంది.
7. పరిమితస్వామ్య అధికారం: కొన్ని సంస్థల చేతిలో మాత్రమే అధికారం ఉంటే దాన్ని పరిమితస్వామ్యం అంటారు. బహుళ జాతి సంస్థలు వాటి పరిమాణం దృష్ట్యా మార్కెట్లో అధికారం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద సంస్థలతో చేతులు కలిపి ఏకస్వామ్యంగా మార్పు చెందుతున్నాయి. అదేవిధంగా, పోటీ సంస్థలను అధిగమించి అధికారాన్ని, మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి.
8. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళ జాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంస్థలు వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కెట్ను నియంత్రించడమే కాక ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.
9. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశము: బహుళ జాతి సంస్థలకు ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్యాల బదిలీ ద్వారా సులభముగా అంతర్జాతీయ మార్కెట్లోనికి చొచ్చుకొనిపోతాయి.
ప్రశ్న 2.
ప్రపంచీకరణ ఆవశ్యకతను క్లుప్తంగా వివరించండి.
జవాబు.
1. ప్రపంచము స్వయం పోషక జాతీయ ఆర్థిక వ్యవస్థల నుంచి క్రమముగా పరస్పరం ఆధారపడిన సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్నది. దీనినే ప్రపంచీకరణగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధి విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఉత్పత్తి కారకాలకు ప్రపంచవ్యాప్తముగా సంపూర్ణమైన గమనశీలతను ఏర్పరచడమే ప్రపంచీకరణ.
2. ఒకదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో అనుసంధానము చేసి ప్రపంచాన్ని ఏకైక అంతర్జాతీయ మార్కెట్ రూపొందించడమే ప్రపంచీకరణ లక్ష్యము. దీనివలన ప్రపంచ దేశాల మధ్య దూరము తగ్గి ప్రపంచమంతా ఒక గ్రామముగా మారే అవకాశము ఉన్నది.
అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధంగా నిర్వచించినారు. “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత”.
ప్రపంచీకరణ ఆవశ్యకత:
1. ఆర్థిక సరళీకరణ: నియంత్రణ మరియు సుంకాల నిర్మాణం పరంగా ఆర్థిక సరళీకరణ విధానాలు, వర్తక మరియు పెట్టుబడులకు ప్రపంచీకరణ దోహదపడుతుంది.
2. సాంకేతిక పురోగతి: ప్రపంచీకరణ ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాలలో వచ్చిన పురోగతి ముఖ్యంగా ఉత్పత్తి, రవాణా, సమాచారం మరియు కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని ఒక ‘గ్లోబల్ గ్రామం’గా మార్చివేశాయి.
3. ఉద్యోగ అవకాశాల కల్పన: ప్రపంచీకరణ పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తోడ్పడింది. బహుళ జాతి సంస్థలు కాల్ సెంటర్లుగా పిలువబడే BPO ల ద్వారా ఎక్కువ సంఖ్యలో, అధిక జీతం మరియు ఇతర సదుపాయాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
4. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల విస్తరణ: దేశాల్లో పెరుగుతున్న మార్కెట్లు మరియు మూలధన ప్రవాహాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల విస్తరణకు దోహదపడ్డాయి.
5. బహుపాక్షిక సంస్థలు: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎన్నో బహుపాక్షిక సంస్థలు దేశాల మధ్య వర్తక మార్పిడిని ప్రపంచీకరణ నేపథ్యంలో సులభతరం చేశాయి. వాణిజ్యం మరియు సుంకంపై సాధారణ ఒప్పందం (GATT), మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రపంచీకరణ ప్రక్రియకు దోహదపడ్డాయి.
6. ప్రపంచ వినియోగదారుల సెగ్మెంటు ఆవిర్భావం: ప్రపంచీకరణ, ప్రపంచవ్యాప్తంగా సముచితమైన మరియు ఆహ్లాదకరమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల వ్యాపార సంస్థలు నాణ్యమైన వస్తువులను, సరసమైన ధరలకు అందచేస్తున్నాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా వస్తు సరఫరాదారులు ఉండటం వలన వినియోగదారులకు ఎక్కువ ఎంపిక అవకాశాలు ఉన్నాయి.
7. ఆర్థిక సామర్థ్యాల గరిష్టీకరణ: సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల వస్తు సేవలు, మూలధనం మరియు కార్మిక శక్తులలో వేగవంతమైన పెరుగుదలను ప్రపంచవ్యాప్తంగా ప్రేరేపించబడినాయి. ఇది సమర్థవంతంగా వనరులను ఉపయోగించడం ద్వారా ఆర్థిక సామర్థ్యాల గరిష్ఠీకరణకు తోడ్పడింది.
8. మెరుగైన వాణిజ్యం: ప్రపంచీకరణ ఫలితంగా అన్ని దేశాలలో వర్తకం వృద్ధి చెందింది, వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రపంచ మార్కెట్ ఫలితాలను సంస్థలు పొందుతున్నాయి, తద్వారా వీటి ఆదాయాలు కూడా పెంపొందాయి.
ప్రశ్న 3.
బహుళ జాతి సంస్థను నిర్వచించి, వాటి ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
బహుళ జాతి సంస్థల యొక్క నిర్వచనాలు:
1. బహుళ జాతి సంస్థ అనే పదం వివిధ రకాలుగా నిర్వచించబడింది. ఏదైనా సంస్థ తమ ఉత్పత్తి కార్యకలాపాలను మాతృదేశంతో పాటు ఇతర దేశాలకు విస్తరింపచేస్తే అలాంటి సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
2. “ఏవైతే సంస్థలు వాటి నిర్వహణ, యాజమాన్యం మరియు నియంత్రణ ఒకటి కన్నా ఎక్కువ దేశాలకు వ్యాపింపచేసినట్లయితే వాటిని బహుళ జాతి సంస్థలు అంటారు”.
– డబ్ల్యు. హెచ్. మోర్ లాండ్
3. “వ్యాపార సంస్థకు ఒక దేశంలో తమ మాతృ సంస్థ ఉండి, ఇతర దేశాల చట్టాలు మరియు సాంప్రదాయాల ప్రకారం కూడా నడుచుకుంటున్న సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు”. – డేవిడ్ ఇ. లిలింటాల్
4. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ILO) ప్రకారం, “తమ నిర్వహణ కార్యాలయం ఒక దేశంలో ఉండి అనేక దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళ జాతి సంస్థ అంటారు.”
బహుళ జాతి సంస్థల ప్రయోజనాలు: బహుళ జాతి సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, స్వదేశానికి, అతిధి దేశానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. బహుళ జాతి సంస్థల వల్ల కలిగే ప్రయోజనాలను క్రింద చర్చించడం జరిగింది.
1. ఆర్థికాభివృద్ధి: ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి సాధించటం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని విదేశీ మూలధనం, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. బహుళ జాతి సంస్థలు ఆర్థిక లాభాలు పొందటం కోసం, ఆర్థిక, సాంకేతిక మరియు ఇతర వనరులను అవసరమైన దేశాలకు అందిస్తూ ఉంటాయి.
2. సాంకేతిక అంతరం: బహుళ జాతి సంస్థలు ఆతిధ్య దేశాలకు సాంకేతికతను బదిలీ చేసే సాధనాలుగా ఉన్నాయి. వస్తు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, పెద్దమొత్తంలో నాణ్యమైన వస్తువులను తయారుచేయుటకు సాంకేతికత చాలా అవసరం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సాంకేతిక అంతరాలను తొలగించటానికి బహుళ జాతి సంస్థల సేవలు చాలా అవసరం.
3. పారిశ్రామిక వృద్ధి: బహుళ జాతి సంస్థలు దేశీయ పరిశ్రమలకు చాలా రకాలుగా వృద్ధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ సంస్థలు, స్థానిక ఉత్పత్తిదారులకు వారి అంతర్జాతీయ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ నెట్వర్క్స్ ద్వారా ప్రపంచ మార్కెట్లలో ప్రవేశించడానికి కావలసిన సహాయ సహకారాలు అందజేస్తాయి.
4. మార్కెటింగ్ అవకాశాలు: బహుళ జాతి సంస్థలు చాలా దేశాలలోని మార్కెట్లకు తమ వస్తువులను సప్లయ్ చేస్తూ ఉంటాయి. ఈ సంస్థలు తమ వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అమ్మటానికి కావలసిన అన్ని నైపుణ్యాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకి భారతీయ కంపెనీ తమ వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మటం కోసం విదేశీ కంపెనీలతో ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకొంటున్నాయి.
5. ఎగుమతుల ప్రోత్సాహం: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ మారక ద్రవ్యం చేకూర్చడానికి చాలా సహాయపడతాయి. ఎగుమతులను ప్రోత్సహిస్తూ, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా దీనిని సాధించవచ్చును.
6. పరిశోధన మరియు అభివృద్ధి: పరిశోధన రంగంలో ఈ బహుళ జాతి సంస్థలకు ఉన్న వనరులు మరియు అనుభవం వల్ల అతిథ్య దేశాలు సమర్థవంతమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలుగుతాయి. తమ పరిశోధన విభాగాలకు ద్రవ్యత్వ ప్రోత్సాహకాలు మరియు చవకైన శ్రామికుల లభ్యత కారణంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్చుకుంటున్నాయి.
7. పని సంస్కృతి: బహుళ జాతి సంస్థలు తమ పనిలో సమర్థత, నైపుణ్యత మరియు పారదర్శకతను పెంపొందించే సంస్కృతిని అవలంబిస్తున్నాయి. బహుళ జాతి సంస్థల ముఖ్య ఉద్దేశ్యము లాభాల గరిష్ఠీకరణ మరియు మార్కెట్ వాటాని పెంపొందించుకోవటం. దీనిని సాధించుకొనుటకు బహుళజాతి సంస్థలు ఉత్పత్తి నవకల్పన, సాంకేతిక నవీకరణ, నైపుణ్యతతో కూడిన నిర్వహణ లాంటి వ్యూహాలను ఉపయోగిస్తున్నాయి.
ప్రశ్న 4.
బహుళ జాతి సంస్థను నిర్వచించి వాటి లోపాలను వివరించండి.
జవాబు.
బహుళ జాతి సంస్థల యొక్క నిర్వచనాలు:
1. బహుళ జాతి సంస్థ అనే పదం వివిధ రకాలుగా నిర్వచించబడింది. ఏదైనా సంస్థ తమ ఉత్పత్తి కార్యకలాపాలను మాతృదేశంతో పాటు ఇతర దేశాలకు విస్తరింపచేస్తే అలాంటి సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
2. “ఏవైతే సంస్థలు వాటి నిర్వహణ, యాజమాన్యం మరియు నియంత్రణ ఒకటి కన్నా ఎక్కువ దేశాలకు వ్యాపింపచేసినట్లయితే వాటిని బహుళ జాతి సంస్థలు అంటారు”.
– డబ్ల్యు. హెచ్. మోర్ లాండ్
3. “వ్యాపార సంస్థకు ఒక దేశంలో తమ మాతృ సంస్థ ఉండి, ఇతర దేశాల చట్టాలు మరియు సాంప్రదాయాల – డేవిడ్ ఇ. లిలింటాల్ ప్రకారం కూడా నడుచుకుంటున్న సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు”.
4. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ILO) ప్రకారం, “తమ నిర్వహణ కార్యాలయం ఒక దేశంలో ఉండి అనేక దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళ జాతి సంస్థ అంటారు.”
బహుళ జాతి సంస్థల వల్ల కలిగే లోపాలు:
1. సాంకేతికత ఇబ్బంది: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందిన దేశాల సహాయంతో తయారు చేయబడిన సాంకేతికత, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు సరిపోవటంలేదు. ఈ సాంకేతికత పూర్తిగా మూలధన ఆధారితమైనందున చాలా ఖర్చుతో కూడుకున్నది.
2. రాజకీయ జోక్యం: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రాజకీయ అంశాలలో జోక్యం చేసుకుంటాయనే విమర్శ చాలా ఉంది. ఈ సంస్థలు ఆర్థిక, ఇతర వనరుల పరిపుష్టి వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రభుత్వ నిర్ణయాల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి.
3. స్వీయ ఆసక్తి: చాలా వరకు బహుళ జాతి సంస్థలు దేశ ప్రయోజనాల కన్నా ఎక్కువగా వారి స్వంత ఆసక్తిపై శ్రద్ధ చూపుతున్నాయి. ఈ సంస్థలు పూర్తిగా లాభాపేక్షమీదనే దృష్టి పెడుతున్నాయి.
4. విదేశీ మారక ద్రవ్య ప్రవాహం: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క పరిమిత వనరులపై ఆధారపడుతాయి. ఈ సంస్థలు రాయల్టీ, కమీషన్ రూపంలో ఎక్కువ ధరలను తమ అనుబంధ సంస్థల నుండి వసూలు చేస్తున్నాయి. తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఇతర దేశాలకు భారీగా తరలిపోతుంది.
5. దోపిడి:
1. ఈ సంస్థలు ఆర్థికంగా చాలా బలంగా ఉండటం వల్ల వాటి వస్తువులను అమ్మటానికి, పోటీని లేకుండా చేయటానికి దూకుడు మార్కెటింగ్ వ్యూహాలను అవలంబిస్తున్నాయి.
2. బహుళ జాతి సంస్థలు ఆతిథ్య దేశంలోని సంస్థలను మరియు అక్కడి వినియోగదారులను దోపిడి చేస్తున్నాయి అనే విమర్శను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.
6. పెట్టుబడి: బహుళ జాతి సంస్థలు తక్కువ నష్టభయం, ఎక్కువ లాభదాయకత ఉన్న రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. సామాజిక సంక్షేమము, జాతీయ అవసరాలు లాంటివి పూర్తిగా విస్మరిస్తున్నాయి.
7. కృత్రిమ డిమాండు: బహుళ జాతి సంస్థలు వ్యాపార ప్రకటనలు, అమ్మకాల ప్రోత్సాహక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా తమ వస్తువులకు కృత్రిమ డిమాండ్ని సృష్టిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి అనే అపవాదు ఉంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బహుళ జాతి సంస్థ అర్థాన్ని వివరించండి.
జవాబు.
అర్థము:
1. ‘బహుళ జాతి సంస్థ’ అనే పదం ‘బహుళ’, ‘జాతీయం’ అనే రెండు పదాల సమ్మేళనం. ఒకటి కంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపార వ్యవహారాలను కొనసాగిస్తున్న సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
2. ఏదైనా ఒక సంస్థ తమ వ్యాపార కార్యకలాపాలను సంస్థ నమోదు అయిన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా కొనసాగించినట్లయితే దానిని ‘బహుళ జాతి సంస్థ’ అంటారు. ఈ బహుళ జాతి సంస్థలు ‘అంతర్జాతీయ సంస్థ’ లేదా ‘గ్లోబల్ సంస్థ’ లేదా ‘ట్రాన్స్నేషనల్ సంస్థ’ అని వేరు వేరు పేర్లతో పిలువబడుతున్నాయి.
బహుళ జాతి సంస్థల యొక్క నిర్వచనాలు:
1.-బహుళ జాతి సంస్థ అనే పదం వివిధ రకాలుగా నిర్వచించబడింది. ఏదైనా సంస్థ తమ ఉత్పత్తి కార్యకలాపాలను మాతృదేశంతో పాటు ఇతర దేశాలకు విస్తరింపచేస్తే అలాంటి సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
2. “ఏవైతే సంస్థలు వాటి నిర్వహణ, యాజమాన్యం మరియు నియంత్రణ ఒకటి కన్నా ఎక్కువ దేశాలకు వ్యాపింపచేసినట్లయితే వాటిని బహుళ జాతి సంస్థలు అంటారు”. .డబ్ల్యు. హెచ్. మోర్ లాండ్
3. “వ్యాపార సంస్థకు ఒక దేశంలో తమ మాతృ సంస్థ ఉండి, ఇతర దేశాల చట్టాలు మరియు సాంప్రదాయాల ప్రకారం కూడా నడుచుకుంటున్న సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు”. – డేవిడ్ ఇ. లిలింటాల్
4. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ILO) ప్రకారం, “తమ నిర్వహణ కార్యాలయం ఒక దేశంలో ఉండి అనేక దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళ జాతి సంస్థ అంటారు.”
ప్రశ్న 2.
బహుళ జాతి సంస్థ లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
బహుళ జాతి సంస్థల లక్షణాలు:
1. పెద్ద పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు అధిక పరిమాణము కలిగి ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.
2. అంతర్జాతీయ కార్యకలాపాలు: ప్రపంచములో వివిధ దేశాలలో బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచ వ్యాప్తముగా విస్తరించినవి.
3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళ జాతి సంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయము యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వము, నియంత్రణలో పనిచేస్తాయి.
4. నిర్వహణలో నైపుణ్యము: బహుళ జాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లను, అనుభవము ఉన్నవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన నిర్వహణ ద్వారా తమ కార్యకలాపములను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తారు.
5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళ జాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండటము వలన వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించటం జరుగుతుంది.
6. వనరుల కదలిక: బహుళ జాతి సంస్థల కార్యకలాపాలు మూలధన, సాంకేతిక, వ్యవస్థాపకత మరియు ఇతర ఉత్పత్తి కారకాల కదలికలపై ఆధారపడి ఉంటుంది.
7. పరిమితస్వామ్య అధికారం: కొన్ని సంస్థల చేతిలో మాత్రమే అధికారం ఉంటే దాన్ని పరిమితస్వామ్యం అంటారు. బహుళ జాతి సంస్థలు వాటి పరిమాణం దృష్ట్యా మార్కెట్లో అధికారం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద సంస్థలతో చేతులు కలిపి ఏకస్వామ్యంగా మార్పు చెందుతున్నాయి. అదేవిధంగా, పోటీ సంస్థలను అధిగమించి అధికారాన్ని, మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి.
8. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళ జాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంస్థలు వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కెట్ను నియంత్రించడమే కాక ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.
9. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశము బహుళ జాతి సంస్థలకు ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్యాల బదిలీ ద్వారా సులభముగా అంతర్జాతీయ మార్కెట్లోనికి చొచ్చుకొనిపోతాయి.
ప్రశ్న 3.
బహుళ జాతి సంస్థల ఏవేని నాలుగు ప్రయోజనాలు తెలపండి.
జవాబు.
బహుళ జాతి సంస్థల ప్రయోజనాలు: బహుళ జాతి సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, స్వదేశానికి, అతిధి దేశానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. బహుళ జాతి సంస్థల వల్ల కలిగే ప్రయోజనాలను క్రింద చర్చించడం జరిగింది.
1. ఆర్థికాభివృద్ధి: ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి సాధించటం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని విదేశీ మూలధనం, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. బహుళ జాతి సంస్థలు ఆర్థిక లాభాలు పొందటం కోసం, ఆర్థిక, సాంకేతిక మరియు ఇతర వనరులను అవసరమైన దేశాలకు అందిస్తూ ఉంటాయి.
2. సాంకేతిక అంతరం: బహుళ జాతి సంస్థలు ఆతిధ్య దేశాలకు సాంకేతికతను బదిలీ చేసే సాధనాలుగా ఉన్నాయి. వస్తు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, పెద్దమొత్తంలో నాణ్యమైన వస్తువులను తయారుచేయుటకు సాంకేతికత చాలా అవసరం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సాంకేతిక అంతరాలను తొలగించటానికి బహుళ జాతి సంస్థల సేవలు చాలా అవసరం.
3. పారిశ్రామిక వృద్ధి: బహుళ జాతి సంస్థలు దేశీయ పరిశ్రమలకు చాలా రకాలుగా వృద్ధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ సంస్థలు, స్థానిక ఉత్పత్తిదారులకు వారి అంతర్జాతీయ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ నెట్వర్క్ ద్వారా ప్రపంచ మార్కెట్లలో ప్రవేశించడానికి కావలసిన సహాయ సహకారాలు అందజేస్తాయి.
4. మార్కెటింగ్ అవకాశాలు: బహుళ జాతి సంస్థలు చాలా దేశాలలోని మార్కెట్లకు తమ వస్తువులను సప్లయ్ చేస్తూ ఉంటాయి. ఈ సంస్థలు తమ వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అమ్మటానికి కావలసిన అన్ని నైపుణ్యాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకి భారతీయ కంపెనీ తమ వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మటం కోసం విదేశీ కంపెనీలతో ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకొంటున్నాయి.
5. ఎగుమతుల ప్రోత్సాహం: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ మారక ద్రవ్యం చేకూర్చడానికి చాలా సహాయపడతాయి. ఎగుమతులను ప్రోత్సహిస్తూ, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా దీనిని సాధించవచ్చును.
ప్రశ్న 4.
బహుళ జాతి సంస్థల నాలుగు లోపాలను తెలపండి.
జవాబు.
బహుళ జాతి సంస్థల వల్ల కలిగే లోపాలు:
1. సాంకేతికత ఇబ్బంది: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందిన దేశాల సహాయంతో తయారు చేయబడిన సాంకేతికత, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు సరిపోవటంలేదు. ఈ సాంకేతికత పూర్తిగా మూలధన ఆధారితమైనందున చాలా ఖర్చుతో కూడుకున్నది.
2. రాజకీయ జోక్యం: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రాజకీయ అంశాలలో జోక్యం చేసుకుంటాయనే విమర్శ చాలా ఉంది. ఈ సంస్థలు ఆర్థిక, ఇతర వనరుల పరిపుష్టి వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రభుత్వ నిర్ణయాల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి.
3. స్వీయ ఆసక్తి: చాలా వరకు బహుళ జాతి సంస్థలు దేశ ప్రయోజనాల కన్నా ఎక్కువగా వారి స్వంత ఆసక్తిపై శ్రద్ధ చూపుతున్నాయి. ఈ సంస్థలు పూర్తిగా లాభాపేక్షమీదనే దృష్టి పెడుతున్నాయి.
4. విదేశీ మారక ద్రవ్య ప్రవాహం: బహుళ జాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క పరిమిత వనరులపై ఆధారపడుతాయి. ఈ సంస్థలు రాయల్టీ, కమిషన్ రూపంలో ఎక్కువ ధరలను తమ అనుబంధ సంస్థల నుండి వసూలు చేస్తున్నాయి. తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఇతర దేశాలకు భారీగా తరలిపోతుంది.
5. దోపిడి:
- ఈ సంస్థలు ఆర్థికంగా చాలా బలంగా ఉండటం వల్ల వాటి వస్తువులను అమ్మటానికి, పోటీని లేకుండా చేయటానికి దూకుడు మార్కెటింగ్ వ్యూహాలను అవలంబిస్తున్నాయి.
- బహుళ జాతి సంస్థలు ఆతిథ్య దేశంలోని సంస్థలను మరియు అక్కడి వినియోగదారులను దోపిడి చేస్తున్నాయి అనే విమర్శను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రపంచీకరణ అంటే ఏమిటి?
జవాబు.
1) ప్రపంచీకరణ అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం వరకు మారుతున్న వనరులను (మూలధనం, శ్రామికులు, వ్యవస్థాపన, మేధోసంపద) కలుపుకుంటూ, పెరుగుతున్న మార్కెట్లను, ఉత్పత్తులకు అనుసంధానం చేయడం.
2) ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు విస్తరింపజేయడమే ప్రపంచీకరణ. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత. ఈ నిర్వచనము ప్రకారము ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి.
- ఆటంకాలు లేని వర్తక ప్రవాహము
- మూలధన ప్రవాహాలు
- సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము
- ఆటంకములేని శ్రామికుల గమనశీలత.
ప్రశ్న 2.
బహుళ జాతి సంస్థ అంటే ఏమిటి?
జవాబు.
- అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో -వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళ జాతి సంస్థ’ అంటారు.
- విదేశ మారక నియంత్రణ చట్టం 1973 ప్రకారము 1) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థగాని, శాఖ గాని ఉన్న సంస్థ. 2) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ కార్యకలాపాలను కొనసాగించే సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు.
ప్రశ్న 3.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఏమిటి?
జవాబు.
- ఒక దేశములోని (అతిథి దేశము) ఉత్పత్తులను మరొక దేశానికి (స్వదేశానికి) సంబంధించిన సంస్థ నియంత్రించడాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (F.D.I.) అంటారు.
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది బహుళ జాతి సంస్థల నిర్వచనాత్మక లక్షణము. స్వదేశము బయట ఉన్న వ్యాపార సంస్థ కార్యకలాపాలలో, ఏదైనా సంస్థ పెట్టుబడి పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి జరిగినట్లుగా భావిస్తారు.
ప్రశ్న 4.
అంతర్జాతీయ వర్తకం అంటే ఏమిటి?
జవాబు.
- వివిధ దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకం అంటారు. దీనినే ‘విదేశీ వర్తకం’ అని కూడా అంటారు.
- ఏదైనా సంస్థ ఇతర దేశాలలోని వినియోగదారులకు వస్తు, సేవలను ఎగుమతి చేస్తే, అంతర్జాతీయ వర్తకం జరిగినట్లుగా భావిస్తాం.