TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 12th Lesson తీయని పలకరింపు Textbook Questions and Answers.

TS 9th Class Telugu 12th Lesson Questions and Answers Telangana తీయని పలకరింపు

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 123)

“అరే రాజన్నా ! ఈ బతకుమీద విరక్తి గలుగుతుందిరా! రెక్కలు ముక్కలు జేసుకోని పిల్లలను బెంచిన. విదేశాల్లో జదువుకుంటే గొప్ప ప్రయోజకులైతరు, మాకు మంచి పేరొస్తదనుకున్న. పెండ్లిల్లు జేసిన. రెక్కలొచ్చిన పక్షులు గూడువదలిపోయినట్లు, మల్ల సూడకుండా ఎల్లిపొయ్యిన్రురా. అప్పుల సంగతి సరే. ఆయాసమొచ్చినప్పుడు నరాలు దెగిపొయ్యేటట్లు ఏడిచినా వాళ్ళకు యినవడదు. ఇనవడ్డా, నేనొచ్చి ఏం జేస్త నాయినా, డాక్టరుకు జూపిచ్చుకో, కావాల్నంటె పైసలు పంపిస్తం’ అని ఫోన్ పెట్టేస్తారు. ఈ బంగ్లలు, కార్లు, సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడ్తాయా? మనసులోని బాధను పంచుకుంటయా? మనుమండ్లు, మనుమరాండ్ల స్పర్శను గలిగిస్తయా ? తియ్యగ ఒక్కసారి పలుకరిస్తయా?”

ప్రశ్నలు
ప్రశ్న 1.
ఈ మాటలు ఎవ్వరంటుండవచ్చు?
జవాబు:
ఈ మాటలు విదేశాల్లో తమ పిల్లలు ఉంటున్న ముసలి తల్లిదండ్రులు అంటూ ఉండవచ్చు.

ప్రశ్న 2.
పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ?
జవాబు:
పిల్లలు దగ్గరలో లేకపోవడం వల్ల, వారికి ఆలనాపాలనా చూసే దిక్కు ఉండదు. వారిని డాక్టరు వద్దకు తీసుకువెళ్ళే దిక్కు ఎవరూ ఉండరు. వారికి కావలసిన వారు ఎవరూ దగ్గరలేక, వారు బెంగతో బాధపడుతూ ఉంటారు. వారు కమ్మని తమ బిడ్డల పలుకరింపుకై, ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రశ్న 3.
మీరు ఇటువంటి వాళ్ళను ఎవరినైనా చూశారా ?
జవాబు:
మా ప్రక్క ఇంటి తాతగారు, బామ్మగారు ఇలాగే ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారి అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరు. వారి అమ్మాయి జపాన్లో ఒక పెద్ద డాక్టరుకు భార్య. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 4.
వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ?
జవాబు:
వారి పట్ల మనం జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. వారిని తీయగా తాతగారూ, బామ్మగారూ అంటూ పలకరించాలి. అప్పుడప్పుడు వారితో తీయగా కబుర్లు చెప్పాలి. వారి యోగక్షేమాలు తెలిసికోవాలి. వారి అవసరాలను తెలుసుకొని, వాటిని వారికి తెచ్చి పెట్టాలి. ముఖ్యంగా వారిని ప్రేమగా వరుసలు పెట్టి పిలువాలి.

ఆలోచించండి – చెప్పిండి (Textbook Page No. 127)

ప్రశ్న 1.
టి.వి. ప్రకటన చూపి, గంగాధరరావు ఎందుకు ఉలిక్కిపడ్డాడు?
జవాబు:
తాను కనబడడం లేదనీ, ఎవరికైనా కనబడితే తమకు తెలియజేయమనీ, గంగాధరరావు గురించి టి.వి.లో ప్రకటన వచ్చింది. గంగాధరరావు ఇంటి నుండి భజన్లాల్ నిలయానికి వచ్చి చాలారోజులయ్యింది. తన గురించి తనవారు, చాలాకాలం వరకూ విచారణ చేయించకుండా ఉండడం, గంగాధరరావుకు ఆశ్చర్యం కల్గింది. తనవారు తనపై చూపించే నిర్లక్ష్యానికి, గంగాధరరావు ఉలిక్కిపడ్డాడు.

ప్రశ్న 2.
ఆఫీసరు అంటే ఎట్లా ఉండాలి ?
జవాబు:
ఆఫీసర్లు సామాన్యంగా అధికారదర్పంతో ఉంటారు. ఆ అధికారదర్పంతో వారు న్యాయాన్యాయాలను గమనింపరు. వారి కళ్ళు పై చూపులేకాని, క్రిందికి చూడవు – కాని గంగాధరరావు వంటి అధికారులు, వారి క్రింది ఉద్యోగులను ఆదరాభిమానాలతో చూసే వారు. వారి కిందివారికి ఎవరికీ అన్యాయం జరుగ కుండా చూసేవారు.

ప్రశ్న 3.
గంగాధరరావు చేసిన పనులను బట్టి అతని వ్యక్తిత్వాన్ని గురించి చెప్పండి.
జవాబు:
గంగాధరరావు గారు యోగ్యుడు. అధికారదర్పం లేనివాడు. తన కింది ఉద్యోగులను ఆదరాభిమానాలతో చూసేవాడు. ఆయన న్యాయమూర్తి. తన కిందివారికి ఎవరికీ అన్యాయం జరుగనిచ్చేవాడు కాదు. గంగాధరరావు దానశీలి. సజ్జనుడు. ఎంతో మందికి సాయం చేశాడు. వారి ఉద్యోగాలు నిలబెట్టాడు.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

బంధుప్రియుడు. బావమరది కూతురు పెళ్ళికి కట్నాన్ని తాను ఇచ్చాడు. బీదవాడైన స్నేహితుడి కూతురుని, కోడలుగా చేసుకున్నాడు. ఉభయ ఖర్చులూ పెట్టి ఆ పెళ్ళి చేయించాడు. గంగాధరరావు స్నేహశీలి. మిత్రులకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఈయన సజ్జనుడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 129)

ప్రశ్న 1.
గంగాధరరావు ఆశ్రమానికి ఎందుకు ఫోన్ చేశాడు ?
జవాబు:
గంగాధరరావు పదవీ విరమణ చేసిన ఎక్సైజు కమిషనరు. ఈయన రిటైరయిన తరువాత, ఆయనను ఇంట్లో ఎవరూ పట్టించుకోడం మానివేశారు. కొడుకు, కోడలు, చివరకు భార్య సహితం ఆయనను నిర్లక్ష్యంగా చూసింది. ఆయనకు సమయానికి కాఫీ కూడా వారు ఇవ్వలేదు. దానితో గంగధరరావు “భజన్లాల్ నిలయం” అనే అనాథాశ్రమంలో చేరిపోదామని నిశ్చయించు కున్నాడు. వివరాలు తెలిసికొనేందుకు, గంగాధరరావు ఆశ్రమానికి ఫోన్ చేశాడు.

ప్రశ్న 2.
“ఇక స్వంతిల్లేమిటి? స్వజనమేమిటి?” అని గంగాధర రావు అనడంలో ఉద్దేశమేమిటి?
జవాబు:
గంగాధరరావు ఎక్సైజు కమిషనరుగా పనిచేశాడు. ఉద్యోగం చేసే రోజుల్లో ఆయనకు ఏది కావలసినా, క్షణాల్లో తనవారు ఆయనకు అందిచ్చేవారు. ఇప్పుడు ఆయన పదవీవిరమణ చేశాడు.

ఇప్పుడు వేళకు ఆయనకు కాఫీ లేదు. ఇంటి వాళ్ళకు తీరిక ఉన్నప్పుడే భోజనం పెడుతున్నారు. ఒక్కొక్క రోజు స్నానానికి వేడినీళ్ళు కూడా పెట్టడం లేదు. ఆయనకు దాహం వేస్తున్నా మంచినీళ్ళు సమయానికి తెచ్చి ఇవ్వడం మానివేశారు. ఇంట్లో తనవారందరూ ఉన్నా, ఆయనకు జబ్బు చేస్తే డాక్టర్ని పిలవడానికి వెనుకాడుతున్నారు.

పై పరిస్థితులు చూసి విసుగు వచ్చిన గంగాధరరావు తాను ఉండేది స్వంత ఇల్లు అయినా, తనవారు అందరూ ఇంట్లోనే ఉన్నా ప్రయోజనం లేకపోయిందని బాధతో, నిరుత్సాహంతో ఈమాట అన్నారు.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఆలోచించండి – చెప్పండి. (Textbook Page No. 131)

ప్రశ్న 1.
“ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణించడానికి ఎవరి తరంకా”దని గంగాధరరావు ఎందుకన్నాడు?
జవాబు:
గంగాధరరావు ఆవరణలో తిరగాలని బయటికి వచ్చాడు. నల్లటి మబ్బు ఆకాశమంతా కప్పివేసింది. అంతట్లో గాలికి ఆ నల్లని మబ్బులు విచ్చిపోయి, తెలతెల్లగా, లేత నీలం రంగులో తునాతునకలై పరుగులు తీశాయి. మబ్బులు ప్రళయం ముంచుకు వస్తుందా అన్నట్లు కమ్మి, ఇట్టే తేలిపోయాయి. ఆ ప్రకృతిని, దాని అందాన్ని చూసిన గంగాధరరావు, ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణించడం, ఎవరితరం కాదన్నాడు.

ప్రశ్న 2.
“నిజంగా మనిషికి కావలసింది ఏమిటి?” ఆలోచించి చెప్పండి.
జవాబు:
అప్యాయంగా పిలిచి మాట్లాడేవారు, నిజంగా మనిషికి కావాలి. ‘తీయటి పలకరింపు’ మనిషికి కావాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ముసలివారు వృద్ధాశ్రమాలకు వెళ్ళడానికి గల కారణాలు చర్చించండి.
జవాబు:
నేడు కన్న కొడుకులు, కూతుళ్ళు ముసలివారిని పట్టించుకోడం మానివేశారు. కోడళ్ళూ, కొడుకులూ వారిని సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు. ముసలివారు తమ ఆస్తిలో భాగం తమకు సరిగా పంచి ఇవ్వలేదనీ, ముసలివారు, ఆస్తులు కూడబెట్టలేదనీ, ముసలివారిని పిల్లలు తప్పుపడుతున్నారు. మనుమలు, మనుమరాండ్రు సహితం, ముసలివారికి చాదస్తం ఎక్కువని, వారివి ఛాందసాచారాలనీ ఈసడిస్తున్నారు.

వారి పిల్లలు విదేశాల్లోనూ, దూరప్రాంతాల్లోనూ. ఉద్యోగాలు చేస్తున్నారు. ముసలివారు శక్తిలేక, తమ పనులు తాము చేసికోలేకపోతున్నారు. కొడుకులూ, కోడళ్ళూ వారికి సాయపడడంలేదు. వేళకు కొంచెం కాఫీ, భోజనం కూడా వారికి ఇవ్వడం లేదు. ముసలివారిని డాక్టర్ల వద్దకు పిల్లలు తీసుకువెళ్ళడం లేదు. వారికి కావలసిన మందులు తెచ్చి ఇవ్వడం లేదు. అందువల్లనే ముసలివారు వృద్ధాశ్రమాలకు వెడుతున్నారు.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరి గురించి చెప్పినవో గుర్తించి, రాయండి.
అ) చెట్టు కింద ఒక్కరూ కూర్చున్నారేం ?
జవాబు:
గంగాధరరావు

ఆ) సంసార బాధ్యతలు లేవు.
జవాబు:
విమల

ఇ) ఆ చీరలూ, ఆ నగలూ ఎంత వైభోగంగా బతికింది.
జవాబు:
సావిత్రమ్మ

ఈ) ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలన్న పట్టుదల.
జవాబు:
కోడలు

ఉ) ఫిక్స్డ్ డిపాజిట్ తనకిస్తే పండుగకు వస్తా.
జవాబు:
కూతురు

ఊ) మంచి బట్టలు కూడా కుట్టించుకోవాలి.
జవాబు:
మనువడు

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఎ) ఈ జబ్బువస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు ?
జవాబు:
పుత్రరత్నం

ప్రశ్న 3.
కింది వచనకవిత చదివి ప్రశ్నలకు జవాబు లివ్వండి.
ఇల్లంటే ………………..
అమ్మఒడి
ఇల్లంటే
మమతలు పల్లవించే యెద సడి
ఇల్లంటే
ఆత్మీయతల సందడి
ఇల్లంటే
మనల్ని మనం పునశ్చరణ చేసుకునే బడి
ఇల్లంటే
ప్రేమాభిమానాల సెలయేళ్ళ అలజడి
ఇల్లంటే
ఊరడింపుల రాబడి
స్వార్థం ఎండమావులవెంట పరుగులు
పెడ్తు
చలిచెలిమె వంటి
ఇల్లును దూరం చేసుకుంటే
తల్లివంటి ఇల్లు
మనసు చిన్నబుచ్చుకుంటుంది
అక్కడ నీళ్ళింకిపోతే –
తరతరాలకు ఆ తడిలేని జీవితం
శాపంగా పరిణమిస్తుంది కొడుకా !

ప్రశ్నలు :
అ) ఇచ్చిన వచన కవితలోని ‘అంత్యానుప్రాస’ పదాలను గుర్తించండి.
జవాబు:
అంత్యానుప్రాసలు :

  1. అమ్మబడి
  2. యెదసడి
  3. సందడి
  4. బడి
  5. అలజడి
  6. రాబడి

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఆ) ఇల్లు ఆత్మీయతల సందడి అంటే…
జవాబు:
‘ఇల్లు ఆత్మీయతల సందడి’ అంటే, ఇంట్లో ఒకరంటే మరొకరికి అంతులేని అభిమానం, ప్రేమ, వాత్సల్యము, ఆర్ద్రత, ఉంటాయని అర్థం.

ఇ) ‘ఇల్లు పునశ్చరణ చేసుకునే బడి’ – ఎందుకంటే ?
జవాబు:
‘పునశ్చరణ’ అంటే, మళ్ళీ మళ్ళీ చేయడం అని అర్ధము. మనం చేసే తప్పొప్పులను తిరిగి సవరించుకొనే బడివంటిది ఇల్లు. బడిలో మనం గురువు ద్వారా, మన తప్పులను సరిదిద్దుకుంటాము. ఇంట్లో కూడా పెద్దల మాటలను విని, మన తప్పులను మనం దిద్దుకొంటామని భావం.

ఈ) చలిచెలిమెకు, ఎండమావికీ భేదం
జవాబు:
ఇల్లు చలిచెలిమె వంటిది. చలిచెలిమేలో నీరు ఎంత తోడినా, తిరిగి ఊరుతుంది. ‘ఎండమావిలో నీరు ఉన్నట్లు భ్రాంతియే కాని, అసలు నీరు ఉండదు. చలిచెలిమెలో నీరు ఊరినట్లు, ఇంట్లో వారికి పరస్పర ప్రేమ ఊరుతుంది.

ఉ) మనసు చిన్నబుచ్చుకునేది ఎప్పుడు ?
జవాబు:
మానవజీవితంలో చెలిమి ఎంతో ముఖ్యమైనది. చెలిమికి ప్రాణాలు ఇచ్చే సమయ సందర్భాలు ఉంటాయి. అలాంటి చెలిమిని దూరం చేసుకుంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది.

II. వ్యక్తీకరణ- సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) గంగాధరరావు ఉద్యోగం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ప్రవర్తించి ఉంటారో, ఊహించి రాయండి.
జవాబు:
గంగాధరరావు గారు ఉద్యోగం చేసే రోజుల్లో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బంట్రోతులు ఉండేవారు. కొడుకు, నాన్నగారూ! అంటూ ప్రేమగా పలుకరించి, కావలసిన డబ్బు పట్టుకెళ్ళేవాడు. ఇక, కోడలు ఎంతో ప్రేమను నటిస్తూ, సమయానికి ఆయనకు టిఫిన్లు, కాఫీ వగైరా సమకూర్చేది. మనవడు ఆయన వెంట షికారుకు తోడుగా వెళ్ళేవాడు. కూతురు ఆయన పూజకు కావలసిన పూవులు వగైరా తెచ్చి, పూజాద్రవ్యములు సమకూర్చేది.

భార్య సావిత్రమ్మ భర్తపై ప్రేమ కురిపించేది. ‘హొయలు ఒలకపోస్తూ పట్టు చీరలూ, నగలూ ధరించి భర్తకు సకల సౌఖ్యాలూ అందించేది. ఇంట్లో నౌకర్లు ఆయన కనుసన్నల్లో నడుచుకుంటూ, ఆయనకు కావలసిన సమస్త సౌకర్యాలూ సమకూర్చేవారు. సావిత్రమ్మగారు భర్తకు కావలసిన మందులు దగ్గర ఉండి ఇచ్చేది. ఆయన ధరించే బట్టలు, బూట్లు ఒకరోజు ముందే ఆమె సిద్ధంగా ఉంచేది. ఇంట్లో ఆయనకు ఇష్టమైన కూరలే వండేవారు. ఆయనకు నచ్చే టిఫిన్లు మాత్రమే తయారుచేసేవారు. ఇంటివారు అంతా గంగాధరరావు చుట్టూ తిరిగేవారు.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఆ) ఇల్లు వదిలి, ఆశ్రమానికి చేరిన విధాన్ని బట్టి గంగాధరరావు ఎలాంటివాడో రాయండి.
జవాబు:
గంగాధరరావు వ్యక్తిత్వమున్న వ్యక్తి. ఆయనకు గృహస్థ సభ్యుల ప్రేమాదరాలు కావాలి. ఇంటిలో అందరూ ఆయన మంచి, చెడ్డలను చూడాలని ఆయన కోరుకొనేవాడు.

తాను సంపాదించిన ధనాన్ని ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన ఎందరికో సాయం చేశాడు. ఉద్యోగానంతరం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా డిపాజిట్టు చేశాడు. తన డబ్బు తాను దాచుకున్నాడు. కట్టుకున్న భార్య కూడా తన మంచి, చెడ్డలను చూసుకోకపోవడం, ఆయనకు కోపాన్ని తెప్పించింది. కొడుకూ, కోడలూ తాను బ్రతికి ఉండగానే తాను కట్టించిన ఇంటిని వారిపేర రాయమని ఒత్తిడి చేయడం, ఆయనకు బాధ కల్గించింది.

ఆయనను అందరూ పట్టించుకోవాలి కాని ఆయన వారిని పట్టించుకొనేవాడు కాడు. గంగాధరరావు పట్టుదల మనిషి. అందుకే తనవారందరినీ విడిచిపెట్టి, తాను ఆశ్రమానికి చేరాడు. గంగధారరావుకు తీయని పలకరింపు కావాలి. అది ఆశ్రమంలో ఆయనకు దొరికింది. తనకు వైద్యం అనవసరం అన్న కొడుకు మాట, ఆయనకు నొప్పి కల్గించింది. మొత్తం మీద గంగాధరరావు కాస్త మొండి మనిషి. తాను అనుకున్న పనిని తాను చేసేవాడు. తన ఇంటివారు తనపై చూపిన అనాదరణను, ఆయన సహించలేకపోయాడు.

ఇ) పెంచి, పెద్దచేసి, బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోకపోవటం సమంజసమేనా ? మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
తల్లిదండ్రులు తమపిల్లలను ఎంతో ప్రేమతో తమ గుండెలపై పెట్టుకొని పెంచుతారు. తమ కడుపు కట్టుకొని పిల్లలకు కావలసినది సమకూరుస్తారు. పిల్లల చదువులకై, పెళ్ళిళ్ళకై, తమకు ఉన్న ఆస్తులను అమ్ముకొని ఖర్చు చేస్తారు. వారికి శక్తి శరీరంలో ఉన్నంత కాలం బిడ్డల అభివృద్ధికే, తమ సర్వస్వాన్ని ధార పోస్తారు.

అటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోడం, వారికి తిండిపెట్టకపోడం చాలా అన్యాయము. దుర్మార్గము. తమ వృద్ధాప్యంలో పిల్లలు తమను ఆదుకుంటారనే ఉద్దేశ్యంతోనే, తల్లిదండ్రులు తమ సర్వస్వాన్నీ బిడ్డల చదువులకూ, వారి అభివృద్ధికీ వినియోగిస్తారు. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్ధమైనది. అవ్యాజమైనది. అటువంటి ప్రేమజీవులను నిర్లక్ష్యం చేయడం, ముసలితనంలో వారిని పట్టించుకోకపోడం మహాపాపం.

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులను కఠినంగా శిక్షించాలని నా అభిప్రాయం. తాను తిన్నదే, తల్లిదండ్రులకూ పెట్టాలి. ప్రేమగా వారిని పలుకరించాలి. తల్లిదండ్రులకు తిండికన్న తీయని పలుకరింపు, వాత్సల్యం ముఖ్యమని నా అభిప్రాయం.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఈ) పాఠం ఆధారంగా ఇల్లిందల సరస్వతీదేవి రచనా విధానం ఎట్లా ఉన్నదో తెలుపండి.
జవాబు:
ఇల్లిందల సరస్వతీదేవిగారు సరళమైన, నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో రచనలు సాగించేవారు. ‘ఈమె తన రచనలో ‘మానవ మనస్తత్వ ధోరణులను చక్కగా విశ్లేషించింది. ఇల్లిందల సరస్వతీదేవి గారి కథాకథనము అద్భుతంగా ఉంది.

ప్రస్తుత కథ “తీయని పలకరింపు”లో గంగాధరరావు మనస్తత్వాన్ని రచయిత్రి చక్కగా వెల్లడించింది. గంగాధరరావు మంచితనము, ఉదారగుణము, తోడి ఉద్యోగులతో ఆయన నడవడి ఆయనను ఆదర్శమూర్తిగా నిలబెట్టాయి.

అటువంటి సజ్జనుడిని ఇంట్లో వారు, తలోరీతిగా బాధపెట్టడం, గంగాధరరావు తట్టుకోలేకపోయాడని రచయిత్రి వెల్లడించింది. “ఈ జబ్బు వస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు అనే పుత్రరత్నం” అన్న రచయిత్రి మాటలో హాస్యం తొంగి చూసింది. గంగాధరరావు ఇంట్లో ఆయనను ఇంటి సభ్యులు ఎలా బాధించారో రచయిత్రి చక్కగా చెప్పింది.

గంగాధరరావు భార్యగా మంచి చీరలు, నగలతో వైభోగంగా బతికిన సావిత్రమ్మ, ఆయనను నిర్లక్ష్యం చేయడం చిత్రంగా అనిపిస్తుంది. మానవుల మనస్తత్వాలను అద్భుతంగా ఈ కథ వ్యక్తీకరించింది. వృద్ధాప్యంలో పెద్దవారిని అనాదరంగా చూడడం తప్పని, ఈ కథ ఉపదేశం ఇచ్చింది. అవసరమయితే పెద్దవారు తెగించి వృద్ధాశ్రమాలకు వెళ్ళాలని పెద్దలకు ఈ కథ దారి చూపింది. సరస్వతీదేవిగారి ఈ కథ, చక్కని కథా కథనంతో పాఠకులను ఆకట్టుకుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ‘వృద్ధాప్యం మనిషికి శాపం కాకూడదు’ దీని గురించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
వయస్సులో ఉన్నప్పుడు శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకుని జీవిస్తున్నప్పుడు, జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. శరీరంలో సత్తువలేనపుడు వారి జీవితం నరకం అయిపోతుంది.

ముసలితనం అందరికీ వస్తుంది. కాబట్టి వయస్సులో ఉన్నప్పుడే ముసలితనానికి సిద్ధం కావాలి. సంపాదించుకొనే మొత్తంలో కొంత డబ్బు, పెన్షన్ ఫండ్లలో మదుపుచేయాలి. వృద్ధాప్యంలో తమ బ్రతుకుకు అవసరమైన డబ్బు నెలనెలా వచ్చేలా చూసుకోవాలి.

అలాగే వారి శరీరానికి చిన్నపాటి వ్యాయామాలు అవసరం. నిత్యం నడుస్తూ, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ, ఆసనాలు వేస్తూ, బలమైన ఆహారం తింటూ ఉంటే, ముసలితనం వారికి నిజంగా శాపం కాదు. అలాగే వృద్ధాప్యంలో దైవ సంబంధమైన పుస్తకాలు చదువుతూ, దైవపూజ చేస్తూ, గుడులకు వెడుతూ ఆధ్యాత్మిక జీవనం సాగించాలి.

వృద్ధుల పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమగా, ఆదరంగా చూడాలి. తాము తల్లిదండ్రులను ఆదరంగా చూస్తే తమ పిల్లలు, తమను ప్రేమగా ఆదరంగా చూస్తారని వారు గుర్తించాలి. యౌవనంలోనే అందరూ వృద్ధాప్య జీవనానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. శరీరాలను చక్కని వ్యాయామాలతో, సదాచారాలతో మంచి అలవాట్లతో చక్కదిద్దుకోవాలి.

అలా మంచి ప్రణాళిక ఉంటే, వృద్ధాప్యం మనిషికి నిజంగా శాపం కాదు. మన జీవితాన్ని మనమే చక్కగా తీర్చిదిద్దుకోవాలి. బిడ్డలను మంచి ప్రవర్తన కలవారిగా, ప్రేమ మూర్తులుగా తీర్చిదిద్దుకోవాలి. అపుడు వృద్ధాప్యం వరప్రసాదం అవుతుంది.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

(లేదా)

ఆ) వృద్ధాప్యంలో మనుషులకు ఏమి కావాలి? కుటుంబ సభ్యులు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి ?
జవాబు:
వృద్ధాప్యంలో మనుష్యులకు ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి కావాలి. వయస్సులో ఉన్నప్పుడే మనుషులు వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాటు చేసికోవాలి. వృద్ధాప్యంలో సామాన్యంగా మంచి ఆరోగ్యం ఉండదు. అందువల్ల మంచి వైద్య సదుపాయం కావాలి.

పైన చెప్పిన వాటన్నింటితో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. వేళకు తగిన మితాహారం కావాలి. కుటుంబసభ్యులతో కలిసిమెలసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. ఆధ్యాత్మికమైన జీవనం కావాలి. వారు చదువుకోడానికి దైవ సంబంధమైన సాహిత్యం కావాలి.

భారత, భాగవత, రామాయణ గ్రంథాలు కావాలి. నేటి కాలానికి అవసరమైన టీ.వీ., రేడియో,, ఫోను వంటి సౌకర్యాలు వారికి కావాలి. కుటుంబ సభ్యులు, వృద్ధులను ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. మధ్యమధ్య వారిని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి. వారికి ముఖ్యావసరమయిన మందులను అందివ్వాలి. వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చక, తమతోపాటే కలో గంజో వారు త్రాగే ఏర్పాట్లు చేయాలి. వృద్ధులకు ముఖ్యంగా కావలసిన ప్రేమాదరాలను కుటుంబ సభ్యులు వారికి పంచి ఇవ్వాలి.

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) తీయని పలకరింపు కథను పొడిగించి ఒక మంచి ముగింపును రాయండి.
జవాబు:
గంగాధరరావు నిత్యం దైవపూజ చేసేవాడు. ఆశ్రమంలో సభ్యులు అందరూ గంగాధరరావు పట్ల మంచి అభిమానం చూపించేవారు. ఒక రోజున హైకోర్టు నుండి గంగాధరరావును గురించి ఎంక్వైరీ చేస్తూ, ఒక గుమాస్తా వచ్చాడు. ఆశ్రమం సూపర్నెంటును కలిశాడు. గంగాధరరావు మాతామహుడి బాపతు పొలం వంద ఎకరాలు గంగాధరరావుకు సంక్రమించాయని, ఆయన ఆర్డర్లు హైకోర్టు నుండి తెచ్చి ఇచ్చాడు. గంగాధరరావు సంతోషించాడు.

దీన జనసేవలో మునిగిపోయాడు గంగాధరరావు. ఒకసారి కలక్టరు వచ్చి, ఆశ్రమంలో సభ పెట్టి ‘దీనబంధు’ అనే బిరుదును గంగాధరరావుకు ప్రభుత్వం తరపున అందచేశాడు. ఈ వార్త పేపర్లలో, టీ.వీ.ల్లో ప్రముఖంగా వచ్చింది. టీ.వీ. ఎక్కువగా చూసే సావిత్రమ్మ ఆ వార్త చూసి, ఇంట్లో అందరికీ చెప్పింది. తాము తప్పు చేశామని అందరూ తీర్మానించుకొని, వెళ్ళి గంగాధరరావు కాళ్ళపై పడ్డారు.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

సావిత్రమ్మ కూడా ఆశ్రమంలోనే భర్తతో ఉండాలని నిశ్చయించుకుంది. గంగాధరరావు కుటుంబ సభ్యుల పశ్చాత్తాపానికి సంతోషించాడు. వారానికి ఒకరోజు కొడుకు, కోడలు, మనుమడు గంగాధరరావు దంపతులతో ఆశ్రమంలోనే గడుపుతున్నారు. కూతురు, అల్లుడు వచ్చారు. గంగాధరరావు తన ఆస్తిలో సగం ఆశ్రమానికి రాసి ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఆనందించారు.

III. భాషాంశాలు

పదజాలం

1) కింది పట్టికను పరిశీలించండి. పట్టిక కింద ఇచ్చిన పదాలకు సరిపోయే పర్యాయపదాలు వెతికి రాయండి.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు 2
అ) చెట్టు = ……………………
జవాబు:

  1. వృక్షం
  2. తరువు
  3. మహీజం

ఆ) ఆకాశం = ………………………..
జవాబు:

  1. అంబరం
  2. గగనం

ఇ) నిలయం = ………………………….
జవాబు:

  1. ఆవాసం
  2. స్థానం
  3. నెలవు

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఈ) రాత్రి = …………………………
జవాబు:

  1. రజని
  2. రేయి
  3. నిశ
  4. నిశీథి

2. కింది వాక్యాల్లోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి.

అ) ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరువొందారు.
జవాబు:
అచ్చెరువు (వికృతి) – ఆశ్చర్యము (ప్రకృతి)

ఆ) అడిగినవారికి సాయం చేయడం మా నాన్నకు అలవాటు.
జవాబు:
సాయం (వికృతి) – సహాయం (ప్రకృతి)

ఇ) మా తాతయ్య బోనం చేయనిదే బయటికి వెళ్ళడు.
జవాబు:
బోనం (వికృతి) – భోజనం (ప్రకృతి)

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.

అ) రోజులు + ఐనా = …………………………….
జవాబు:
రోజులైనా (ఉత్వసంధి)

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఆ) ఆదర + అభిమానాలు = ……………………………
జవాబు:
ఆదరాభిమానాలు (సవర్ణదీర్ఘ సంధి)

ఇ) లేదనక + ఉండ = ………………….
జవాబు:
లేదనకుండ (అత్వసంధి)

ఈ) వీలు + ఐతే = …………………
జవాబు:
వీలైతే (ఉత్వసంధి)

ఉ) కావలసినవి + అన్నీ = ……………………….
జవాబు:
కావలసినవన్నీ (ఇత్వసంధి)

ఊ) పగలు + పగలు = …………………………
జవాబు:
పట్టపగలు (ఆమ్రేడిత సంధి)

2. కింది విగ్రహ వాక్యాలను సమాసం చేసి, సమాసం పేరు రాయండి.

అ) అధికారం చేత దర్పం = …………………………
జవాబు:
అధికారదర్పం – తృతీయా తత్పురుష సమాసం

ఆ) గది యొక్క తలుపులు = …………………………
జవాబు:
గదితలుపులు – షష్ఠీ తత్పురుష సమాసం

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఇ) మంచివైన బట్టలు = …………………………
జవాబు:
మంచిబట్టలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఈ)పది సంఖ్యగల గంటలు = ……………………………..
జవాబు:
పదిగంటలు – ద్విగు సమాసం

ఉ) న్యాయమూ, అన్యాయమూ = ……………………………..
జవాబు:
న్యాయాన్యాయములు – ద్వంద్వ సమాసం

3. కింది వ్యాక్యాల్లో కర్తరి/కర్మణి వాక్యాలను గుర్తించండి. నియమాలతో సరిపోల్చుకోండి.

అ) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు.
(ఇది కర్తరి వాక్యము. క్రియను ‘ఎవరు సేకరించారు’ అని ప్రశ్నిస్తే ‘రచయిత్రులు’ అని కర్త జవాబు.)
జవాబు:
రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి. (ఇది కర్మణి వాక్యం)

ఆ) ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది.
(ఇది కర్మణి వాక్యం. ‘రికార్డు చేయబడింది.’ అనే క్రియను ‘దేనిని’ అనే దానిచే ప్రశ్నిస్తే, ఇంటర్వ్యూను అనే కర్మ జవాబుగా వస్తుంది.)
జవాబు:
ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. (ఇది కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ఇ) కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు.
(ఇది కర్తరి వాక్యం. ‘ప్రచురించారు’ అనే క్రియను ఏవి ప్రచురించారు అని ప్రశ్నిస్తే, ‘ఇంటర్వ్యూలు’ అనే కర్త జవాబుగా వచ్చింది. కాబట్టి ఇది కర్తరి వాక్యం.)
జవాబు:
కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు, యథాతథంగా ప్రచురింపబడ్డాయి. (కర్మణి వాక్యం)

ఈ) వాళ్ళ భాష మార్పు చేయబడలేదు.
(ఇది కర్మణి వాక్యం. క్రియలో, ‘ఐదు’ ధాతువు చేరింది. ఇందులో ‘మార్పుచేయబడలేదు’ అనే క్రియను, ‘ఏది’ అన్న దానిచే ప్రశ్నిస్తే ‘భాష’ అనే కర్మపదం జవాబుగా వస్తుంది. కాబట్టి ఇది కర్మణి వాక్యం.)
జవాబు:
వాళ్ళ భాషను మార్పు చేయలేదు. (కర్తరి వాక్యం)

ఉ) ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి, మళ్ళా రమ్మని పంపించారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించబడ్డారు. (కర్మణి వాక్యం)

ఊ) దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. (కర్తరి వాక్యం)
జవాబు:
దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. (కర్మణి వాక్యం)

ఋ) ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
‘ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ౠ) గోడలమీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
గోడలమీద అందమైన చిత్రాలను గీశారు. (కర్తరి వాక్యం)

ఎ) దేహం పంచభూతాలచే నిర్మించబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. (కర్తరి వాక్యం)

ఏ) మేం పెద్దలను గౌరవిస్తాం. (ఇది కర్తరి వాక్యం).
జవాబు:
మాచే పెద్దలు గౌరవింపబడతారు. (కర్మణి వాక్యం)

ప్రాజెక్టు పని

మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వృద్ధుల వద్దకు వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకిష్టమైన పనులు ఏవో తెలుసుకొని చెప్పండి. వారేమనుకుంటున్నారో రాయండి. నివేదికను రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

కఠిన పదములకు అర్థములు

I.

125వ పేజీ

ఆజానుబాహువు = మోకాళ్ళ వరకు వ్రేలాడే నిడు వైన చేతులు కలవాడు ; (దీర్ఘ బాహువులు కలిగి యుండడం, ఉత్తమ పురుష లక్షణం)
ఎడ్రసు (Address) = చిరునామా
ఉలిక్కిపడ్డాడు = అదిరిపడ్డాడు
తాత్త్వికమైన = యథార్థమైన
కలతనిద్ర = సరిగాపట్టని నిద్ర (భయంతో కూడిన నిద్ర)
మననం చేసికొను = తలచుకొను

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

126వ పేజి

ఎక్సైజు కమిషనరు (Excise Commissioner) = పన్నుల అధికారి
రిటైరయ్యేవాళ్ళు = పదవీ విరమణ చేసేవారు
జోరుగా = హుషారుగా
ఎల్లకాలం = బ్రతికినంతకాలమూ
సంప్రదింపుల కోసం = ఆలోచనల కోసం
రికమెండేషన్ల కోసం (Recommendations) = సిఫార్సుల కోసం ;
ఆదరాభిమానాలు (ఆదర + అభిమానాలు) = ప్రేమ, గౌరవములు
డిపార్టుమెంటు = శాఖ
వాపోతారు = విచారిస్తారు
నికృష్టంగా = నీచంగా
చనువు = ప్రేమ, స్నేహము
దర్పం = గర్వము
న్యాయాన్యాయాలు (న్యాయ + అన్యాయాలు) = న్యాయము, అన్యాయము
గమనించనివ్వదు = గుర్తింపనివ్వదు
దేహి = ఇవ్వండి మహా ప్రభో అనడం ;
జీవిత భాగస్వామి = భార్య (Life Partner)
విషాదము = దుఃఖము

II.

128వ పేజి

వృద్ధులు = పెద్దలు
అనాథలు = దిక్కులేనివారు
స్మృత్యర్థం (స్మృతి + అర్థం) = జ్ఞాపకం కోసం
నెలకొల్పు = స్థాపించు
లీజు (Lease) = గుత్తకు ఇవ్వడం
నిలయము = ఇల్లు (నివాసస్థానము)
ఎటాచ్డ్ బాత్రూమ్ (Attached Bath Room) = స్నానాల గదితో కలిసినది
ప్రత్యేకంగా (ప్రతి + ఏకంగా) = వేరుగా
రూము = గది
వసతులు = సౌకర్యాలు
సూట్ వేసుకొని = జతబట్టలు ధరించి, (Suite)
టాక్సీ (Taxi) = అద్దె కారు

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

129వ పేజి

చెక్ బుక్కు (Cheque Book) = బ్యాంకు నుండి డబ్బు తీసికొనే చెక్కుల పుస్తకం
ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) = డబ్బును దాచుకున్న సర్టిఫికెట్టు
లైబ్రరికార్డు (Library Card) = గ్రంథాలయకార్డు
స్వంతిల్లు = తన ఇల్లు
స్వజనము = తన వారు
పుత్రరత్నము = రత్నం వంటి కొడుకు
పీడా వదలిందనుకోడం = బాధ వదలిపోయిందనుకోడం
టూరు (Tour) = ప్రయాణము

III.

ఎడ్వాన్స్ చెక్ (Advance cheque) = ముందుగా చెక్కు

130వ పేజి

ఫిజియోథెరపీ = శరీరానికి ప్యాయామము
గెస్ట్ హౌస్ (Guest house) = అతిథిగృహము
తునాతునకలు = ముక్కలు ముక్కలు
గోప్యంగా = రహస్యంగా

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

131వ పేజీ

సర్వీసు (Service) = సేవ, నౌకరి ;
పరాచికమాడు = పరిహాసం చేయు
సూపర్నెంట (Superintendent) = పైన విచారణ చేసే అధికారి

పాఠం ఉద్దేశం

ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. ముసలివారిని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. వృద్ధుల అవసరాలు తీర్చడాన్ని, వారికి ఆత్మీయతను పంచడాన్ని, పిల్లలు మరచిపోతున్నారు. వృద్ధులు తాము పెంచిన పిల్లలు తమ పట్ల చూపుతున్న నిరాదరణనూ, తమ ఆవేదననూ ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. వృద్ధుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఆలోచింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘కథానిక’ ప్రక్రియకు చెందినది. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే ‘కథానిక’ అంటారు. కథనం, సంభాషణ, శిల్పం – ఇవి కథానికలోని ప్రధానాంశాలు.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన ‘తులసిదళాలు’ కథానికల సంపుటి నుండి తీసుకోబడింది.

రచయిత్రి పరిచయం

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు 1
పాఠము “తీయని పలకరింపు”

రచయిత్రి : ఇల్లిందల సరస్వతీదేవి

పాఠం దేనినుండి గ్రహింపబడినది : రచయిత్రి రచించిన “తులసిదళాలు” కథానికల సంపుటి నుండి గ్రహింపబడింది.

జననము : 15 – 06 – 1918

మరణము : 31 – 07 – 1998

రచనలు : ఈమె స్వాతంత్ర్యం రావడానికి ముందే, సృజనాత్మక రంగంలోకి అడుగు పెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలు రచించింది.

అవార్డులు : 1982 లో ఈమె రచించిన ‘స్వర్ణకమలాలు’ కథాసంపుటికి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇచ్చింది. ఈమె ‘సుశీలా నారాయణరెడ్డి’ పురస్కారాన్ని కూడా పొందింది.

కథాసంపుటాలు :

  1. తులసిదళాలు
  2. రాజహంస

పదవి : 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జైలు విజిటర్గానూ పనిచేసింది.

ఆంధ్ర యువతీమండలి : ఈమె 1934 లో స్థాపించిన ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు.

రచనాశైలి : మానవ మనస్తత్త్వ ధోరణులనూ, వివిధకాలాల్లో, వివిధ సందర్భాల్లో జీవన పరిణామాలనూ విశ్లేషించడం, విశ్వజనీన భావాలతో రచనలు చేయడం ఈమె దృక్పథం.

TS 9th Class Telugu Guide 12th Lesson తీయని పలకరింపు

ప్రవేశిక

మానవుడు సంఘజీవి. పదిమందితో కలసి జీవించాలనుకుంటాడు. దేశవిదేశాలతో సంబంధాలు. నెలకొల్పుకొంటున్నాడు. కాని తన కుటుంబసభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాడా ? ఇంటికి పెద్దదిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూసుకుంటున్నాడా ?

నిర్లక్ష్యానికి గురి అయిన గంగాధరరావు అనే వృద్ధుడు, తన ఇల్లువదిలి, తన వాళ్ళందరికీ దూరంగా జీవించసాగాడు. గంగాధరరావు అట్లా వెళ్ళిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి ? వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలేమిటి ? తెలుసుకునేందుకు ఈ కథ చదువుదాం…….

Leave a Comment