TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 11th Lesson వాయసం Textbook Questions and Answers.

TS 9th Class Telugu 11th Lesson Questions and Answers Telangana వాయసం

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 113)

నటనలో ఆమె నాట్యమయూరి
ఆ పడతి నడక హంస నడక
ఇంట చిన్నారి చిలుకపలుకులు పలుకుతుంది.
మధుర గాయని సుశీలమ్మది కోకిల స్వరం
కావాలనుకున్న దానికోసం పిల్లలు ఉడుంపట్టు పడతారు.
ఉడతాభక్తిగా భగవంతునికి దక్షిణ సమర్పించాలి.
కొందరు యజమానుల పట్ల కుక్క విశ్వాసం ప్రదర్శిస్తారు.
అతడు అవినీతిపరులకు సింహస్వప్నం.

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై పంక్తుల్లో జనవ్యవహారంలో ఉన్న పదబంధాలేవి ?
జవాబు:
నాట్యమయూరి, హంసనడక, చిలుకపలుకలు, కోకిల స్వరం, ఉడుంపట్టు, ఉడుతాభక్తి, కుక్కవిశ్వాసం, సింహస్వప్నం అనేవి పై పంక్తులలో జనవ్యవహారంలోని పదబంధాలు.

ప్రశ్న 2.
ఇట్లాంటి పదబంధాలు ఏ సందర్భంలో వాడుతారు ?
జవాబు:
ఇట్లాంటి పదబంధాలు ఇతరుల నాట్యాన్ని, కళను, విశ్వాసాన్ని, భక్తిని, సేవను, మాటలను, పట్టుదలను మొదలైన గుణగణాలను ప్రశంసించే సందర్భంలో వాడతారు.

ప్రశ్న 3.
వీటిని వాడడంలో పశుపక్ష్యాదుల పట్ల ఏ భావం కనిపిస్తుంది ?
జవాబు:
వీటిని వాడటంలో పశుపక్ష్యాదుల పట్ల మనకు గౌరవభావం, అభిమానం కనిపిస్తుంది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రశ్న 4.
పశువులను, పక్షులను చిన్నచూపుతో పోల్చే సందర్భాలు కూడా ఉంటాయా?
జవాబు:
పశువులను, పక్షులను చిన్నచూపుతో పోల్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మిక్కిలిగా గోల చేస్తున్నప్పుడు ‘కాకిగోల’ అంటారు. చలించకుండా ఉంటే ‘దున్నపోతు మీద వానపడ్డట్లు’ అంటారు. ఇలా చిన్నచూపుతో పోల్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ప్రశ్న 5.
అటువంటి కొన్ని పోలికలు చెప్పండి. ఇట్లా పోల్చడం సరైందేనా ?
జవాబు:
అటువంటి కొన్ని పోలికలలో – కాకిగోల, అచ్చోసిన ఆంబోతువలె ఉన్నావు, దున్నపోతు మీద వానపడ్డట్లు, టక్కరి నక్క వలె ఉన్నావు మొదలైనవి ఉన్నాయి. ఇలా పోల్చడం తగదు దీని వల్ల మనం పక్షులను, జంతువులను హీనంగా చూసినట్లు అవుతుంది.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 115)

ప్రశ్న 1.
“మానవుల్ మెక్కుటమానినారె ?” అంటే మీకు ఏమర్థమైంది ?
జవాబు:
‘మెక్కటం’ అంటే, ఎక్కువగా ‘పొట్టపట్టినంతా తినడం’ అని అర్థము. మనుషులు మాంసాన్ని మెక్కి తింటున్నారనీ, వారు మాంసాన్ని కాకులకు వేయరనీ, అందువల్ల మాంసంపై కాకి కోరిక పెట్టుకోడం వల్ల ప్రయోజన ముండదనీ, కవి కాకికి హితబోధ చేశాడని అర్థమయ్యింది.

ప్రశ్న 2.
బలికూడు తిని బతుకుతుందని కాకిని ఎందుకన్నారు?
జవాబు:
దేవతలకు, పితృదేవతలకు నైవేద్యంగా బలికూడు పెడతారు. దేవతల తృప్తి కోసం అన్నం పప్పు వండి, దాన్ని నైవేద్యం పెడతారు. ఆ బలి అన్నాన్ని కాకులు తింటాయి. అందుకే కాకికి “బలి భుక్కు” అని పేరు.

ప్రశ్న 3.
కాకిని ‘పేదరికపు పక్షి’ అనడంలో అర్థమేమిటి?
జవాబు:
కాకి మానవులకు మంచి ఉపకారం చేస్తుంది. ఎంగిలి మెతుకులు ఏరుకొని తిని, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. పితృదేవతలకు తృప్తిగా, బలికూడును తింటుంది. ఎంత చేసినా పాపం కాకిని ఎవరూ గౌరవంగా చూడరు. కాకిని ఎవరూ పెంచుకోరు. దానికి ఎవరూ ప్రేమతో ఏమీ పెట్టరు. మనం పారేసిన ఎంగిలి మెతుకులు తిని, అది జీవిస్తుంది. అందుకే కవి, కాకిని ‘పేదరికపు పక్షి’ అన్నారు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రశ్న 4.
కాకిలో ఉన్న కలుపుగోలుతనం ఎట్లాంటిది ?
జవాబు:
కాకి కనబడగానే ప్రజలు దాన్ని ‘హాష్ కాకీ’ అని దూరంగా చెదరగొడతారు. కాని కాకి మాత్రం, అన్నగారి కొడుకు తన పినతండ్రిని “కాక కాక” అని పిలిచినట్లుగా, ప్రేమతో మనలను కేక వేస్తుంది. కాకి మన బంధువుల రాకను తెలియపరుస్తూ, వార్తలు తెస్తుంది. కాబట్టి కాకిలో కలుపుగోలుతనం ఉంది అని చెప్పవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 116)

ప్రశ్న 1.
‘మసిబూసి మారేడు కాయజేయడం’ అనే జాతీయం ఏ సందర్భంలో వాడుతారు ?
జవాబు:
లేని దానిని ఉన్నట్లు కల్పించి చెప్పడాన్ని, ఏదో రంగుపూసి, అది ఫలానా వస్తువని ఇతరులకు చెప్పి వారిని మోసగించడాన్ని “మసిపూసి మారేడు కాయ జేయడం” అంటారు. మారేడు కాయ కాని కాయకు ఏదో మసిపూసి, అదే మారేడు కాయ అని చెప్పి ఇతరులను మోసగించడం అన్నమాట.

ప్రశ్న 2.
‘లిబ్బులబ్బగ పిచ్చి బెబ్బులియై ప్రవర్తించ’డమంటే ఏమర్థమైంది?
జవాబు:
పిచ్చెక్కిన పెద్దపులి, దాని ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా తిరుగుతుంది. ‘లిబ్బులు’ అంటే సొమ్ములు. డబ్బులు రాగానే, ధనాహంకారంతో మనిషి పిచ్చెక్కిన పులిలా, ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా తిరుగుతాడని అర్థం అయ్యింది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రశ్న 3.
“పాపాత్ముని మనసు నలుపు” అనడం సరైందేనా ? ఎందుకు ?
జవాబు:
చెడును నల్లని రంగుతోనూ, మంచిని స్వచ్ఛమైన తెల్లని రంగుతోనూ కవులు పోలుస్తారు. పాపాత్ముడు -ఎండ్రకాయ తీరుగా అడ్డంగా సంచరిస్తాడు. అతడు – బెదరింపులతో ఇతరుల నోళ్ళు మూయిస్తాడు. అతడు పందిలా, మెక్కుతూ, నీచమైన బ్రతుకు బ్రతుకుతాడు. కాబట్టి పాపాత్ముడి మనస్సును నలుపు అనడం సమంజసమే అని చెప్పాలి.

ఆలోచించండి – చెప్పండి? (Textbook Page No. 117)

ప్రశ్న 1.
‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అనే సామెత ఎందుకొచ్చి ఉంటుందో చర్చించండి ?
జవాబు:
కాకి పిల్ల కాకిలాగే నల్లగా అందవికారంగా ఉంటుంది. మన పిల్లలు ఎలా ఉన్నా, మనకు ముద్దు వస్తారు. అలాగే ఎవరి పిల్లలు వారికి అందంగా కనబడతారు. కాకి పిల్ల అందంగా లేకపోయినా, కాకికి అందంగా కనబడినట్లే, మన పిల్లలు అందంగా ఉన్నా లేకపోయినా మనకు అందంగానే కనబడతారని చెప్పడానికి ఈ సామెతను వాడతారు..

ప్రశ్న 2.
‘లొట్టి మీద కాకి లొల్లి’ అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ?
జవాబు:
చెట్ల నుండి కల్లు తీయడానికి చెట్లకు కల్లుముంత కడతారు. ఆ కల్లు ముంతను లొట్టి అంటారు. కాకులు ఆ లొట్టి మీద వ్రాలి కల్లును తాగాలని పెద్దగా అరుస్తూ. ఉంటాయి. అయితే దానికి కల్లు త్రాగడానికి వీలు కాదు. అలాగే ఏదైనా తినే పదార్థం ప్రక్కన చేరి, పెద్దగా చేయడాన్ని “లొట్టి మీద లొల్లి” అంటారు.

ప్రశ్న 3.
కాకిని ప్రాణసఖుడు అనవచ్చా ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మంచి స్నేహితుడిని, అవసరమైతే స్నేహితుడి కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్దం అయ్యే మిత్రుడిని ప్రాణసఖుడు అంటాం. ప్రాణసఖుడు మన దగ్గరకు వచ్చి మన క్షేమ సమాచారాలు అడుగుతాడు. మనల్ని ప్రేమగా. పిలుస్తాడు.

కాకి కూడా మన ఇంటిపై వ్రాలి మన క్షేమాన్ని అడిగే విధంగా కావు కావు మంటుంది. రావద్దని కొట్టినా మానకుండా ప్రాణస్నేహితుడిలా మన ఇంటికి వస్తుంది. కాబట్టి కాకిని ప్రాణసఖుడు అనడం సమంజసమే.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రశ్న 4.
కాకిని చులకన చేసి, కోకిలను ఆదరించడం సరైందేనా ? ఎందుకు ?
జవాబు:
కోకిల వసంత ఋతువులో మాత్రం చెట్ల కొమ్మలలో దాగి, కమ్మగా కూస్తుంది. అప్పుడు అంతా కోకిలను మెచ్చుకుంటారు. కాకి నిత్యం వచ్చి మనలను పలుక రిస్తుంది. కాని జనం కాకిని ఆదరించరు.

దీన్నే ఒక కవి ఇలా చెప్పాడు. కాకి మనలను తిట్టనూలేదు. కోకిల మనల్ని ధనం తీసుకో అని కోరీ పిలువనూలేదు. కాని కోకిలను మెచ్చుకోడానికి కారణము దాని కమ్మని మధుర స్వరమే. కాకిని చులకన చేయడానికి కారణము, దాని పరుష స్వరమే అని.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశం గురించి చర్చించండి.

ప్రశ్న 1.
పక్షిజాతిలో కాకిని చిన్నచూపు చూడడం సరైందేనా? చర్చించండి.
జవాబు:
‘కాకి’ని మనము నిత్యము చూస్తూ ఉంటాము. భగవంతుడు పుట్టించిన ప్రతిప్రాణి ఉపయోగకరమైనదే. అలాగే మనము నిత్యముచూసే కాకి వల్ల, మానవులకు ఎన్నో ఉపయోగాలున్నాయి.
1) మనము పెరటిలో పారవేసే ఎంగిలి మెతుకులను కాకి ఏరుకొని, తిని పెరడును శుభ్రంగా ఉంచుతుంది. కాకులు ఎంగిలి మెతుకులను తినకపోతే, అవి మట్టిలో పడి కుళ్ళి కంపుకొడతాయి. కాబట్టి స్వచ్ఛభారత్ ఉద్యమానికి కాకులు ఎంతో సాయం చేస్తున్నాయి.

2) పెద్దలు పితృ దేవతలకూ, దేవతలకూ పిండాలు పెడతారు. బలులు ఇస్తారు. కాకి వాటిని తింటుంది. కాకికి ‘బలిపుష్టము’ అని పేరు. శ్రాద్ధ కర్మ చేసి పెట్టిన పిండాలు కాకులు తినకపోతే, పితృదేవతలు తృప్తిని పొందలేదని మనం భావిస్తాము. అందువల్ల కాకిని చిన్నచూపు చూడరాదు.

3) కాకికి ‘మౌకలి’ అనిపేరు. అంటే అది యముడికి సంబంధించినది. కాకి వచ్చి అరుస్తూ ఉంటే, బంధువులు మన ఇంటికి వస్తారని మనకు పెద్ద నమ్మకం ఉంది. కాబట్టి కాకి, మనకు ప్రాణస్నేహితుడి వంటిది.

4) కాకి గొంతు, కోయిల గొంతులా తియ్యగా ఉండదు. అందుకే కాకిని మనం ‘కాకిగోల’ అని చీదరించుకుంటాం. కాకిలో ఒక సుగుణం ఉంది. దానికి జాతి ప్రేమ హెచ్చు. ఒక కాకికి ప్రమాదం వస్తే మిగిలిన కాకులన్నీ అక్కడకు. వచ్చి అరుస్తాయి. ఐకమత్యం విషయంలో కాకి, మనకు ‘ఆదర్శ పక్షి’ అని చెప్పాలి.
కాబట్టి కాకిని చిన్నచూపు చూడడం సరిగాదు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రశ్న 2.
పాఠం చదువండి. పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం 2
జవాబు:
TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం 3

ప్రశ్న 3.
కింది పేరా చదువండి. పట్టికలో వివరాలు రాయండి.

“రాకెల్కార్సన్ అనే పర్యావరణవేత్త. 1963లో “సైలెంట్ స్ప్రింగ్” అనే పుస్తకాన్ని రాశాడు. క్రిమిసంహారక మందుల వాడకంవల్ల పక్షులు ఎట్లా కనుమరుగవుతున్నాయో రాశాడు. పక్షులు నశిస్తే మానవజాతికి కూడా నష్టం వాటిల్లుతుంది. రాబందులు, గద్దలు, కాకులు, పిచ్చుకలు అని మనం చిన్నచూపు చూడవచ్చు. ఎందుకంటే వాటి ప్రాధాన్యం మనకు తెలియదు కాబట్టి. జనావాసాల నుండి చెత్తా చెదారం, మలిన పదార్థాలను కాకులు దూరంగా తీసుకొనిపోతాయి. రాబందులు మృతజంతుకళేబరాలను తిని రోగాలు, అంటురోగాలు రాకుండా జనాన్ని కాపాడుతాయి. పిచ్చుకలు పంటలను నాశనం చేసే కీటకాలను, కీటకాలుగా మార్చే గొంగళి పురుగులను తిని, పంట దిగుబడికి తోడ్పడుతున్నాయి.
TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం 4
జవాబు:
TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం 5

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) కాకులను చులకనగా చూడడాన్ని బట్టి మానవ స్వభావం ఎట్లాంటిదని భావిస్తున్నారు ?
జవాబు:
మానవుడు విచిత్రమైన వ్యక్తి. తనకు సాయం చేసే పశుపక్ష్యాదులను తేలికగా చూస్తాడు. మానవుడు కృతఘ్నుడు, అనగా చేసిన మేలును మరచిపోతాడు..

  1. మానవుడు ఎక్కువ మంది చుట్టాలున్న వాడిని చూచి, ‘వాడిది కాకి బలగం’ అని హేళనచేస్తాడు. కాని తాను మాత్రం, బంధువుల ఇళ్ళకు వెళ్ళి, వారి ఆదరణ పొందుతాడు.
  2. ఎవరైనా తమ పిల్లలను ముద్దుగా, గారాబంగా చూస్తూ ఉంటే, ‘కాకిపిల్ల కాకికే ముద్దు’ అని వారిని మానవుడు హేళనగా మాట్లాడతాడు. ఎవరైనా తనపిల్లల్ని ఏమైనా అంటే మాత్రం, వారితో తగవులాడుతాడు.
  3. మానవుడు తాను వదరుబోతును మించి, వాదిస్తాడు. కాని తాను ఆ వదరుపోతును, “లొట్టి మీద కాకి లొల్లి” అని హేళన చేస్తాడు.
  4. పిల్లలు అల్లరిచేస్తే కాకి గోల అని చీకాకు పడతాడు.
  5. కాకి తన్ను కావుమని దేవుణ్ణి ప్రార్థిస్తోంటే, మనిషికి ఆ ధ్వని, ముల్లులా గుచ్చుకుంటుంది. కాబట్టి మానవుని మనస్తత్వము విచిత్రమైనది. కృతజ్ఞత లేనిది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఆ) రామగౌడు కవితాశైలిని వివరించండి.
జవాబు:
రామగౌడు మంచి విద్వత్కవి. కాకి వంటి అల్ప జంతువును, తన కవితా ప్రతిభతో, వాదనాబలంతో మహోన్నతంగా, తీర్చిదిద్దాడు. సీస పద్యాలను మంచి రసవంతంగా, మంచి భావనా బలంతో, ప్రకృతి ప్రేమికునిగా, జీవకారుణ్యవాదిగా అద్భుతంగా రచించాడు.

కాకిని సంబోధిస్తూ ధ్వాంక్షము, బలిపుష్టము, వాయసము, మౌకలి, ఆత్మఘోషము వంటి వివిధ పర్యాయపదాలను అర్థవంతంగా ప్రయోగించడం, గొడుగారి పాండిత్యానికి ప్రబల నిదర్శనం.

కాకి అరచే ‘కాక కాక’ ధ్వనిలో, కవిగారికి అన్న కొడుకు పినతండ్రిని పిలిచే ఆత్మీయత కనిపించింది. మనిషిలో కలుపుగోలుతనం లేనందువల్లే, కాకిని చీదరించుకొంటున్నాడని కవిగారి భావన బాగుంది. నలుపున్న అందరినీ మెచ్చుకొని, కాకి నలుపును మాత్రం కాదనడం బాగోలేదని, కవి చక్కగా సమర్థించారు.

కాకిని నిందిస్తూ లోకంలో వాడే పదబంధాలలో ఉండే దోషాన్ని చక్కగా కవిగారు వెల్లడించారు.

కాకి, చుట్టాల కబురును తెచ్చే ప్రాణసఖుడని, దాన్ని గౌరవించారు. కోయిల ఎప్పుడో సంవత్సరంలో వసంత ఋతువులోనే కూస్తుంది. కాకి నిత్యం వచ్చి మనలను పలకరిస్తుంది. కోకిలను మెచ్చుకొని, కాకిని చులకనగా చూడడం తప్పని, కవిగారు తన ప్రతిభా సంపత్తితో మానవులను హెచ్చరించారు.

రామగౌడు గారు ప్రతిభా సంపన్నులైన ఉత్తమ కవిచక్రవర్తి.

ఇ) కాకి, కోకిల రెండూ నల్లనివే! అయితే ఒకదానిని ఆదరించి, ఇంకొకదాన్ని చులకనగా చూడడం గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
కాకి నలుపు. కోకిల నలుపు. ఈ రెంటికీ భేదము లేదు. కాని వసంత కాలం రాగానే, మామిడి చిగుర్లను తిన్న కోకిల, తియ్యగా కమ్మగా కూస్తుంది. కాని కాకి గొంతు బొంగురుగా, కర్ణకఠోరంగా ఉంటుంది. అందువల్లే కోకిలను ప్రజలు ఆదరిస్తారు. కాకిని చులకనగా చూస్తారు.

మరో కవి కోయిలకూ, కాకికీ తేడా ఇలా చెప్పాడు. “కాకి మనలను ఏమీ తిట్టలేదు. కోయిల ధనాన్ని పుచ్చుకోండి అని మనల్ని పిలువలేదు. మరి ఎందుకు కోయిలను ప్రేమిస్తున్నారంటే, దాని మధుర స్వరం వల్లనే కోయిలను జనం ఆదరిస్తున్నారు. దాని పరుష స్వరం వల్లనే కాకిని, విరోధభావంతో చూస్తున్నారు.

నిజానికి కోకిలకు తన గుడ్లను పిల్లలుగా చేసే శక్తి ఉండదు. కోయిల తన గ్రుడ్లను కాకి గూట్లో పెడుతుంది. కాకులు, అవి తన గ్రుడ్లే అనుకొని, వాటిని పొదిగి పిల్లలుగా తయారుచేస్తాయి. కోయిల పిల్ల గొంతెత్తగానే, వాటిని గుర్తించి “వాటిని గూటి నుండి కాకులు తరిమివేస్తాయి.

దీనినిబట్టి కోయిలకు ఆదరం కేవలం దానిగొంతు వల్లనే వచ్చింది. కాకిని దాని పురుషస్వరం వల్లనే, లోకం దాన్ని అనాదరంగా చూస్తోంది. నిజానికి కాకి మలిన పదార్థాలను మన ఇంటి నుండి దూరంగా తీసుకుపోయి, మనకు ఎంతో ఉపకారం చేస్తోంది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఈ) కాకులు సమైక్యంగా ఉంటాయి. దీనిపై మీ అభిప్రాయం సకారణంగా రాయండి.
జవాబు:
సాధారణంగా మానవులకంటే మూగజీవాల్లోనే సమైక్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాకుల్లో అది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఆహారం ఒక కాకికి కనిపిస్తే అన్ని కాకులను సమాయత్తం చేస్తుంది. అందరిని తీసుకొని వెళ్తుంది. ఉన్న ఆహారాన్ని అన్నీ కలిసి తింటాయి.

అంతేకాదు ఒక కాకికి ఆపదజరిగితే అన్ని కాకులు సానుభూతి తెలుపుతాయి. పడిపోయిన కాకిని సమీపించేవారిని కాళ్ళతో పొడుస్తాయి. కాకులకు ముందుచూపు ఎక్కువ. అందుకనే కాకులన్నీ ఐక్యంగా ఆహారాన్ని ముందుగానే జాగ్రత్త పరచుకుంటాయి. ఆహారాన్ని పరస్పరం అందిపుచ్చుకుంటాయి. విహారానికి కూడా కాకులు ఒక్కటిగా కలిసి వెళతాయి. శత్రువులపై ఒక్కటిగా దాడి చేస్తాయి. అందువల్ల కాకులు సమైక్యంగా ఉంటాయని పేర్కొనవచ్చు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) కాకి విశిష్టతను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కాకి మానవులకు మంచి ఉపకారం చేసే పక్షి. కాకులు జనావాసాల నుండి చెత్తాచెదారాన్నీ, మలిన పదార్థాలనూ దూరంగా తీసుకుపోతాయి. ఆ విధంగా కాకులు మన పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడుతున్నాయి.

మనం కాకిని చీదరించుకుంటాం అయినా అది నొచ్చుకోదు. అన్న కొడుకు తన పినతండ్రిని, ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి ‘కాక’ అని అరుస్తుంది. అది తెలియక కలుపుగోలుతనం లేని మనం, కాకిని చీదరించుకుంటాము.

నిజానికి పాపాత్ముడి మనస్సులో పేరుకుపోయిన నలుపు కంటె, కాకి నలుపు కలుషితమైనది కాదు. శ్రీకృష్ణుడు నలుపు. ఈశ్వరుని కంఠం నలుపు. చంద్రుడి ముఖంలో మచ్చ నలుపు. మనుష్యుల తలలు నలుపు. అటువంటప్పుడు, కాకి నలుపును అసహ్యించుకోడం అనవసరం. అది తప్పు.

కాకి మన ఇళ్ళమీద వాలి, మన క్షేమ సమాచారాన్ని అడుగుతుంది. మనం చీదరించుకున్నా, కాకి మన ప్రాణ స్నేహితుడిలా వచ్చిపోవడం మానదు కాకిని మనం చీదరించి కొట్టినా, కాకి ఏ మాత్రం విసుక్కోదు. రాయబారివలె చుట్టాలు మన ఇంటికి వస్తున్నారన్న వార్తను తెస్తున్నట్లుగా గొంతు చింపుకొని తన నోరు నొప్పిపెట్టేటట్లు అరుస్తుంది.

ఎప్పుడో ఏడాదికొకసారి వచ్చి కూసే కోయిలను మనం మెచ్చుకుంటాం. అదే రోజూ వచ్చి మనలను పలుకరించే కాకిని మనం చులకనగా చూస్తాం. కాని కాకి నిజానికి మనకు ప్రాణస్నేహితుడిలాంటిది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

3. కింది ప్రశ్నకు సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మనుషులు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న కాకి మనుషుల గురించి తాను ఏమనుకుంటుందో ఊహించి కాకి స్వగతం రాయండి.
జవాబు:
కాకి అంతరంగం

ఈ మనుషులు శుద్ధ అమాయకులు. పరిశుభ్రత లేనివాళ్ళు. తాము తినగా మిగిలిన ఎంగిలి మెతుకులను పెరటిలో, వీధుల్లో వీరు పారపోస్తారు. లేదా పెంటకుప్పలపైనా, తమ ఇళ్ళల్లోనూ కుళ్ళిపోయిన, చెడిపోయిన పదార్థాలను వీళ్ళు పారవేస్తారు. అవి అలా కుళ్ళి దుర్వాసన పెరిగితే అంటురోగాలు వస్తాయని పాపం వీళ్ళకు తెలియదు కాబోలు.

ఇప్పటికే ఈ మనుషులు నానా రోగాలతో బాధపడుతున్నారు. అందుకే ఈ మనుష్యులకు శుభ్రత గురించి నేర్పుదామని వీళ్ళు పారవేసిన ఎంగిలి మెతుకులను, చెత్తా చెదారాన్ని వీరి ఇళ్ళ నుండి తీసికెళ్ళి దూరంగా నేను పారవేస్తున్నా. నేను వీళ్ళకు ఎంతో మేలు చేస్తున్నా. అయినా వీళ్ళు కృతజ్ఞత లేనివాళ్ళు. నన్ను ‘హాష్ కాకీ’ అంటూ దూరంగా తరుముతారు.

నేను మనుషులకు ప్రాణస్నేహితుడిని. వాళ్ళ ఆరోగ్యాల గురించి, నేను. అందుకే శ్రద్ధ తీసికొంటున్నా. కాని ఈ మనుష్యులు నన్ను చీదరించుకుంటూ, కర్రతో కొడతారు. నాపై బెడ్డలు విసరుతారు. బహుశా ఈ మనుషులు, నాకు వాళ్ళ ఎంగిలి మెతుకులు పెట్టి పోషిస్తున్నాం అనుకుంటున్నారేమో! నాకు వీళ్ళ మెతుకులే అక్కర్లేదు.

అడవులలో, దొడ్లలో ఎన్నో చెట్ల కాయలు, పళ్ళు ఉన్నాయి. నిజానికి అవి ఎంగిలివి కావు. నాకు బోళ్ళంత ఆహారం ఉంది. వీళ్ళు నన్ను కాకిగోల అని, కాకిబలగం అని, కాకిచూపు అని ఆక్షేపిస్తారు. ఈ మనుషులు చేసే గోల, నా గోల కంటే పెద్దది. మోటారు సైకిళ్ళ చప్పుళ్ళు, ఫ్యాక్టరీల కూతలు, రికార్డుల మోతలు ఎంతో శబ్ద కాలుష్యం. ఈ మనుషులు వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు.

నాకు ఈ మనుషులపై జాలి, దయ. అందుకే వీరి ఇళ్ళల్లో నేను మోడీ పిలుపు రాని క్రితమే, స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నా. నా మంచితనం వీళ్లకి ఎప్పుడు అర్థం అవుతుందో?

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

(లేదా)

ఆ) తన గురించి చులకనగా మాట్లాడడం తగదని కాకి మనుషులతో మాట్లాడింది. దీన్ని ఊహించి సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
కాకి – మనిషి సంభాషణ

మనిషి : ఛీ! కాకీ! నీకు బుద్ధి లేదా! పొమ్మంటే పోవేం! సిగ్గుండాలి. ఒకసారి చెపితే వినాలి. ఇంత సిగ్గులేకుండా ఎలా పుట్టావ్ ?

కాకి : మానవా! నీవు నన్ను తరమడం మానవా? నేను నీకు ఉపకారం చేద్దామనే రోజూ వస్తూ ఉన్నా. కాని నీవు కృతఘ్నుడివి. నీవు పారవేసిన మెతుకులు, పదార్థాలూ కుళ్ళిపోతే మీ మనుషులకు అంటురోగాలు వస్తాయని, జాలిపడి వాటిని ఏరి దూరంగా పడవేద్దామని నేను మీ ఇళ్ళకు వస్తున్నా. నీకు ఎందుకు అర్థం కాదు?

మనిషి : చాలులే. కాకీ! నీది దొంగ బుద్ధి. ఎంగిలి మెతుకులు తినడం మాని, ఇంట్లోకి వచ్చి మేము ఎండబెట్టుకున్న పప్పులు వగైరా పట్టుకుపోతావు. నీకు కారం వేయదేమో! మిరపకాయలు పట్టుకుపోతావు. మా చెట్లకాయలు -కొరికి పారవేస్తావు. నీవు మా ఆరవేసిన బట్టలపై రెట్టలు వేస్తావు. ఏవేవో తెచ్చి మా పెరట్లో పారవేస్తావు. మాంసం ముక్కలు, కోడి వెండ్రుకలు తెచ్చి పడవేస్తావు. నీవు చేసే శుభ్రం నాకు తెలియనిది కాదు.

కాకి : ఏం మనిషివయ్యా! నేను ఎక్కడనుండో ఏవో పనికి రాని పదార్థాలు తీసుకువెడుతుండగా మీ పెరట్లో మీరు పారవేసిన కుళ్ళు మెతుకులు నాకు కనబడతాయి. వాటిని కూడా దూరంగా పారవేద్దామని, మీ పెరట్లో దిగుతా. ఇంతలో నన్ను నీవు బెదరిస్తావు. నానోట్లో వస్తువులు మీ దొడ్లో జారిపడతాయి. దానికి కారణం నువ్వే ! తప్పు నా మీద దొర్లిస్తున్నావు!

మనిషి : నిన్న మా ఇంట్లో కొబ్బరిచిప్పలు తీసుకుపోయావు. మా తమ్ముడిని నీ ముక్కుతో పొడిచావు. మా దొడ్లో పళ్ళను కొరికి పారవేస్తున్నావు? నీవు ఇంక మా ఇంటికి రాకు.

కాకి : నేను మీ ఇంటికి రాకపోతే, నీకే నష్టం. నేను జీతం, నాతం లేకుండా నీ పెరట్లో, పరిసరాల్లో శుభ్రం చేసి, నీకు, ఉపకారం చేస్తున్నా. కృతజ్ఞతగా ఉండు. మనిషివి అనిపించుకో. కొంచెం దయగా ఉండు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

మనిషి : నిజమే కాకీ! నీవు చెప్పినది నాకు అర్థం అయ్యింది. రేపటి నుండి మనం స్నేహితులుగా ఉందాం. కోపం తెచ్చుకోకు.

III. భాషాంశాలు

పదజాలం

1. పాఠం ఆధారంగా కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) కాకి : ……………………
జవాబు:
పర్యాయపదాలు :

  1. ధ్వాంక్షము
  2. బలిపుష్టము
  3. వాయసము
  4. మౌకలి
  5. ఆత్మఘోషము
  6. కరటము
  7. చిరజీవి

ఆ) గృహం : ………………………
జవాబు:
పర్యాయపదాలు :

  1. ఇల్లు
  2. కొంప
  3. గీము
  4. గేహము
  5. భవనము

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఇ) సంతోషం : …………………………
జవాబు:
పర్యాయపదాలు :

  1. హర్షము
  2. సంతసము
  3. ముదము
  4. ప్రమోదము

ఈ) ముల్లు : ………………………
జవాబు:
పర్యాయపదాలు :

  1. కంటకము
  2. ములికి
  3. ములు

2. కింది వ్యుత్పత్తులకు సరైన పదాలు పాఠం ఆధారంగా గుర్తించండి.

అ) బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడేది. ………………….
జవాబు:
బలిపుష్టము

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఆ) మాంసాన్ని కాంక్షించేది. …………………..
జవాబు:
ధ్వాంక్షము

3. కింది వాక్యాల్లో ప్రకృతి, వికృతి పదాలు వేరువేరుగా ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.

అ) సిరి గలవారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటే అదే సంతసం.
జవాబు:
సిరి గలవారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటే అదే సంతసం.

ఆ) విజయం సాధించిన ఆనందం ఆ పక్కి మొగంలో కనిపించింది.
జవాబు:
విజయం సాధించిన ఆనందం ఆ పక్కి మొగంలో కనిపించింది.

ఇ) పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది.
జవాబు:
పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది.

ఈ) శ్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.
జవాబు:
శ్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రకృతి – వికృతి
శ్రీ – సిరి
గృహం – గీము
పక్షి – పక్కి
ముఖం – మొగం
సంతోషం – సంతసం

4. కింది ఇచ్చిన జాతీయాలు, సామెతలను గుర్తించి, వాటిని వినియోగించే సందర్భాన్ని రాయండి.

ప్రశ్న 1.
కాకి బలగం : ………………………..
జవాబు:
బాగా ఎక్కువ మంది బంధుజనం ఉన్నారనే సందర్భంలో పరిహాసం చేస్తూ దీన్ని వినియోగిస్తారు.

ప్రశ్న 2.
కాకిపిల్ల కాకికి ముద్దు : ………………………….
జవాబు:
ప్రతి వారికీ తమ పిల్లలు ముద్దుగా కనిపిస్తారనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.

ప్రశ్న 3.
కాకిగోల : ……………………………
జవాబు:
ఎక్కువగా వాగుతున్నప్పుడు, పెద్దగా మాట్లాడుతున్నపుడు దీన్ని వినియోగిస్తారు.

ప్రశ్న 4.
లొట్టిమీద కాకి లొల్లి : ………………………..
జవాబు:
కల్లుకుండ మీద వ్రాలిన కాకి బాగా అరుస్తుంది. అలా తిండిపదార్థాల పక్కన చేరి, ఆ పదార్థం లభించనప్పుడు దాని కోసం చేసే అల్లరి అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రశ్న 5.
మసిపూసి మారేడుకాయ చేయడం : ……………………………
జవాబు:
మోసం చేసి ఒక వస్తువును మరొక వస్తువుగా నమ్మించడం అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.

వ్యాకరణాంశాలు

1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.

ప్రశ్న 1.
సవర్ణదీర్ఘ సంధి :
జవాబు:
విషాగ్ని = విష + అగ్ని = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు, అవియే అచ్చులు పరమైన సవర్ణదీర్ఘములు ఏకాదేశంబగు.

ప్రశ్న 2.
ఉకారసంధి :
జవాబు:

  1. దినములెన్ని = దినములు + ఎన్ని = ఉత్వసంధి
  2. పాయసమొల్లక = పాయసము + ఒల్లక = ఉత్వసంధి
  3. బోనమబ్బు = బోనము + అబ్బు = ఉత్వసంధి
  4. గంతులిడును = గంతులు + ఇడును = ఉత్వసంధి
  5. లిబ్బులబ్బగ = లిబ్బులు + అబ్బగ = ఉత్వసంధి
  6. జల్లులిడడె = జల్లులు + ఇడడె = ఉత్వసంధి
  7. ములుకులగును = ములుకులు + అగును = ఉత్వసంధి
  8. తగవులాడు = తగవులు + ఆడు = ఉత్వసంధి
    సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి. సూత్రాలు రాయండి.

అ) దినములెన్ని.
జవాబు:
దినములు + ఎన్ని = ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

ఆ) తొడఁగొట్టి
జవాబు:
తొడన్ + కొట్టి = ద్రుత ప్రకృతిక సంధి (లేక) సరళాదేశ సంధి
సూత్రము 1 : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఉదా : తొడన్ + గొట్టి

సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు.
ఉదా : తొడఁగొట్టి

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఇ) లొల్లియనుచు
జవాబు:
లొల్లి + అనుచు = యడాగమ సంధి
సూత్రము : సంధిలేనిచోట అచ్చుకంటే పరమైన అచ్చునకు, యడాగమంబగు.
ఉదా : లొల్లి + య్ + అంచు = లొల్లియంచు

3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.

అ) ఎంగిలిమెతుకులు :
జవాబు:
విగ్రహవాక్యం : ఎంగిలియైన మెతుకులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఆ) కాకిబలగం :
జవాబు:
విగ్రహవాక్యం : కాకి యొక్క బలగం – షష్ఠీ తత్పురుష సమాసం

ఇ) విషాగ్ని :
జవాబు:
విగ్రహవాక్యం : విషము అనెడి అగ్ని – రూపక సమాసం

యమకాలంకారము :

కింది పద్య పాదాలలో ఒకే రకంగా ఉన్న మాటలు (పదాలు) గుర్తించి, రాయండి.
అ) లేమా ! దనుజుల గెలువగ
లేమా! నీవేల కడగి లేచితివిటురా.
జవాబు:

  1. లేమా
  2. లేమా

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఆ) పాఱజూచిన పరసేన పాఱఁజూచు.
జవాబు:

  1. పాఱజూచు
  2. పాఱజూచి

గమనిక : పై ఉదాహరణలలో మీరు రాసిన సమాధానాలు ద్వారా, మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉంటారు. ఒకే శబ్దంతో కూడిన పదాలు రెండుసార్లు వచ్చాయి కదా !

ఇటువంటి పదాలు ఒకే శబ్దంతో ఉన్నా, అర్థంలో తేడా ఉంటుంది. ఒక పదం వచ్చిన తరువాత మరలా అదేపదం రావడం గమనించారు కదా !

పై ఉదాహరణలో ‘లేమా’ అనే పదం రెండుసార్లు వచ్చింది.

మొదటి పాదంలో ‘లేమా’ అనే దాన్ని ‘స్త్రీ’ అనే అర్థంలో, రెండవ ‘లేమా’ అనే పదాన్ని ‘చాలమా’ (గెలువజాలమా) అనే అర్థంలోనూ ప్రయోగించడం జరిగింది.

అదే విధంగా “పాఱజూచు” పదం కూడా రెండు అర్థాల్లో ప్రయోగించబడింది. మొదటిదానికి “తేరిపారచూడటం” అని, రెండవదానికి ‘పారిపోవ చూస్తుంది’ అని అర్థం.

`ఇటువంటి పదప్రయోగం జరిగినట్లయితే, ‘యమకము’ అనే శబ్దాలంకారం అవుతుంది.

యమకం లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షణం : పదాలు తిరిగి తిరిగి వస్తూ, అర్థభేదం కలిగి ఉంటే, అది “యమకాలంకారం”. పదాల విరుపువల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ఇ) మీ పాఠ్యభాగం ‘ధర్మపాలన’లో ‘యమకాలంకార’ పాదాలను గుర్తించి రాయండి. సమన్వయించండి.
జవాబు:

  1. వేయునేటికి నలపాండవేయుసాటి
  2. వింటికొరిగిన రిపురాజి వింటికొరగు
  3. కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు
  4. ఏలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె
    యేలవలె నన్యులన, నా నృపాలుడలరు – మొదలైనవి.

4. కింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, లక్షణాలతో సమన్వయం చేయండి.

‘ఆ పురమేలు ‘మేలుబళి’ ! యంచు బ్రజల్ జయవెట్టుచుండ నా”
జవాబు:
TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం 6
గమనిక :

  1. పై పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల” పద్యపాదం.
  2. యతిస్థానము 10వ అక్షరము. (ఆ – యం)
  3. ప్రాసాక్షరము ‘ప’
  4. ఈ పాదంలో 20 అక్షరాలున్నాయి.

ప్రాజెక్టు పని

అ) పక్షులకు సంబంధించిన కథ/గేయం/ కవిత సేకరించి రాయండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
చిలకమ్మ పెండ్లి (పాట)

చిలకమ్మ పెండ్లి అని – చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి – చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు – సందడి చేయగ
కాకుల మూకలు – బాకాలూద
కప్పలు బెకబెక – డప్పులు కొట్టగ
కొక్కొరో కోయని – కోడి కూయగా
ఝమ్మని తుమ్మెద – తంబుర మీటగ
కుహు కుహూయని – కోయిల పాడగా
పిల్ల తెమ్మెరలు – వేణువూదగా
నెమలి సొగసుగా – నాట్యం చేయగా

సాలీడిచ్చిన – చాపు కట్టుకొని
పెండ్లి కుమారుడు – బింకము చూపగ
మల్లీ మాలతి – మాధవీ లతలు
మైనా గోరింక – పెండ్లి కుమారుని
దీవిస్తూ తమ పూలు రాల్చగ
పెండ్లి కుమారుని = మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత – చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టే – చింతాకు పుస్తె..
– గిడుగు వేంకట సీతాపతి గారి రచన

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

(లేదా)

ఆ) పక్షుల గూళ్ళను పరిశీలించి వాటి గొప్పతనాన్ని గురించి, నివేదిక రాయండి.
జవాబు:
చిత్రగ్రీవుడు
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు. అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలను ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు సలహా చెప్పాడు. ఒక ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు అప్పుడు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి.

హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

పద్యాలు – ప్రతిపదార్థాలు భావాలు

I.

1వ పద్యం

సీ॥ ధ్వాంక్షమా! మాంసమా కాంక్షించుచున్నావు?
మానవుల్మెక్కుట మానినారె?
బలిపుష్టమా! నరుల్ బలినిచ్చుకూటిని
దిని బ్రతుకు గడపు దినములెన్ని?
వాయసమా! తీపి పాయసమొల్లక
నెంగిలి మెతుకులు మ్రింగుటేల?
మౌకలీ! ఏలకో యీ కలి నాకలి
బొబ్బల నీకెట్లు బోనమబ్బు?

తే॥ ఆత్మఘోషమా! చిరజీవివై వెలుంగు
మేకదృష్టి గలట్టి వివేకమునకుఁ
బలువిధమ్ముల బ్రక్కచూపులను జూచు
కపట చిత్తులు మెచ్చరు కరటరాజ!

ప్రతిపదార్థం:
ధ్వాంక్షమా = ఓ కాకీ ! (మాంసాన్ని కాంక్షించే దానా !)
మాంసమా = మాంసమునా? (లేక) (మాంసము + ఆకాంక్షించుచున్నావు) (మాంసం కోరుతున్నావు అని చెప్పవచ్చు).
కాంక్షించుచున్నావు = కోరుతున్నావు
మానవుల్ = మనుష్యులు
మెక్కుట = ఎక్కువగా తినడం (మాంసాన్ని ఎక్కువగా తినడం)
మానినారె (మానినారు + ఎ) = మానివేశారా?
బలిపుష్టమా = ఓ కాకీ!
నరుల్ = మానవులు.
బలన్ = బలిగా (భూతయజ్ఞంగా)
ఇచ్చుకూటిని = ఇచ్చే ఆహారాన్ని
తిని = తిని (నీవుతిని)
బ్రతుకు గడుపు = జీవితాన్ని సాగించే
దినములు = రోజులు
ఎన్ని = ఇంకా ఎన్నాళ్ళు?
వాయసమా = ఓ కాకీ!
తీపి పాయసము = తియ్యని పరమాన్నము
ఒల్లకన్ = ఇచ్చగింపక; (ఇష్టపడక)
ఎంగిలి మెతుకులు = తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు
మ్రింగుట = తినడం
ఏల = ఎందుకు ?
మౌకలీ = ఓ కాకీ !
ఏలకో = ఎందుకో ?
ఆకలిబొబ్బలన్ = ఆకలి కేకలతో బాధపడే
ఈ కలిన్ = ఈ కలి కాలంలో
నీకున్ = నీకు
బొనము = భోజనము
ఎట్లు = “ఏ విధంగా
అబ్బు = లభిస్తుంది ?
ఆత్మఘోషమా = ఓ .కాకీ! (కాకా అని తననామాన్నే అరచేది) (ఆత్మఘోషము)
ఏకదృష్టి = ఒకే దృష్టి
కలట్టి (కల + అట్టి) = కలిగినటువంటి
వివేకమునకున్ = (నీ) జ్ఞానానికి
చిరజీవివై = చాలాకాలము బ్రతికేదానివై
వెలుంగుము = వర్ధిల్లుము
కరటరాజ = ఓ కాకి రాజా!
పలువిధమ్ములన్ = అనేక విధాలుగా
ప్రక్క చూపులను = ప్రక్క చూపులను
చూచు = చూసే
కపటచిత్తులు = మోసబుద్ధులు
మెచ్చరు = (నిన్ను) మెచ్చుకోరు (కాకికి ఏకదృష్టి అనగా అది ఒకవైపుకే చూడగలుగుతుంది. అది చూసిన వైపే దానికి కనబడుతుంది. రెండో వైపు దానికి కనబడదు.)

భావం:
ఓ కాకమా ! మాంసం, నీవు ఎందుకు కోరుతున్నావు? నీకు మాంసం దొరకడానికి, మనుషులు మాంసాన్ని తినడం మానివేశారా? ఏమిటి ! మనుషులు పెట్టే బలికూడును తిని ఎన్నాళ్ళు బతుకు ఈడుస్తావు? నీవు తీపి పాయసం ఇష్టపడక, ఎంగిలి మెతుకులు మింగడం ఎందుకు? జనం ఆకలికేకలతో అలమటించే ఈ కలియుగంలో నీకు భోజనం ఎలా దొరుకుతుంది? కావు కావు మనే నీ కూతతో, నీ పేరును తెలిపే ఓ కాకీ! నీవు చిరకాలం జీవించు. ఒంటి చూపు కలిగిన నీ బుద్ధిని, పలురకాల ప్రక్క చూపులు చూసే మోసగాళ్ళు మెచ్చుకోరు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

వ్యుత్పత్త్యర్ధములు :
1) ధ్వాంక్షము = మాంసమును కాంక్షించేది
2) బలిపుష్టము = బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది (కాకి)
3) వాయసము = తిరుగుచుండునది (కాకి)
4) మౌకలి = ‘మూకలుడు’ అంటే యముడు మూకలునికి సంబంధించినది (కాకి)
5) ఆత్మఘోషము = కాకా అని తన పేరునే అరచేది (కాకి)
6) చిరజీవి = చిరకాలము జీవించేది (కాకి)
7) కరటము = ‘క’ అని పలికేది (కాకి)

2వ పద్యం

సీ॥ అందచందమ్ము లేదంచల నడగాదు
చిలుకల వలె గుల్కి పలుకఁ బోదు
పేదరికపుఁబుల్గు భేదభావము లేక
గడబిడతో భలే గంతులిడును
కొమ్మల మాటునఁ గులుకుచుఁ గమ్మని
రాగాలు దీయ స్వరాలు లేవు
లోకాన దీనులలోఁ గల శోకాలు
కన్నీటి గాథ లేకరువు పెట్టు

ఆ॥ వన్న కొడుకుఁ బిలుచువట్టులఁ బెరిమతో
‘కాక-కాక’ యంచుఁగేక వేయు,
కలుపుగోలు తనము తెలియనట్టి మనము
చీదరించుకొనినఁ జిన్నబోదు.

ప్రతిపదార్థం:
అందచందమ్ము = (కాకి) అందము, చందము
లేదు = కలది కాదు;
అంచల = హంసల
నడ = నడక వంటి అందమైన నడక
కాదు = కాదు
చిలుకలవలెన్ = చిలుకలవలె
కుల్కి = విలాసముగా కుదిలి
పలుకబ్రోదు (పలుకన్+పోదు) = మాట్లాడలేదు.
పేదరికపుఁబుల్గు (పేదరికము+పుల్గు) = చిన్నచూపు చూడబడే పక్షి అయినా
భేదభావము లేక = ఎల్లాంటి భేదభావమూ లేకుండా
గడబిడతోన = అల్లరితో (తొందరగా)
భలే = చక్కగా
గంతులిడును (గంతులు + ఇడును) = గంతులు వేస్తుంది
కొమ్మల మాటునన్ = కొమ్మల మఱుగున
కులుకుచున్ = కులుకుతూ
కమ్మని రాగాలు = కమ్మనిసంగీత రాగాలు
తీయస్వరాలు = తీయని ధ్వనులు
లేవు = లేవు (తీయగా కమ్మగా కోయిల వలె పాడలేదు)
లోకానన్ = లోకంలోని (ప్రపంచంలోని)
దీనులలోఁగల (దీనులన్ + కల) = దుఃఖితులలో కల
శోకాలు = ఏడ్పులు
కన్నీటి గాధలు = కన్నీరు తెప్పించే కథలు
ఏకరువు పెట్టున్ = వల్లె వేస్తుంది (దీనుల బాధలను చెపుతోందా అన్నట్లు బాధాకరంగా అరుస్తుంది)
అన్నకొడుకు = అన్నగారి కొడుకు తన పినతండ్రిని
పిలుచునట్టు = పిలుస్తున్నాడా అన్నట్లు
పెరిమతోన్ = ప్రేమతో
కాక- కాక యంచున్ = ‘కాక, కాక అంటూ
కేకవేయున్ = కేకలు వేస్తుంది
కలుపుగోలుతనము = అందరితో కలిసిమెలసి యుండడం
తెలియనట్టి = తెలియనటువంటి
మనము = మనము
చీదరించుకొనిన = కోపగించుకున్నా (చికాకుగా చూసినా)
చిన్నబోదు = (తాను) చిన్న పుచ్చుకోదు (బాధపడదు)

భావం :
కాకి గొప్ప అందచందాలు కలది కాదు. దాని నడక హంస నడకవలె అందంగా ఉండదు. అది చిలుకల వలె అందంగా పలుకలేదు. తక్కువగా చూడబడే పక్షి అయినా, ఎలాంటి భేదభావాలు చూపించకుండా గడబిడ చేస్తూ అందరి ఇళ్ళమీదా గంతులు వేస్తుంది.

కాకికి కొమ్మల చాటున దాగి, కులుకుతూ కోకిలవలె కమ్మగా తీయగా పాడే స్వరం లేదు. లోకంలోని దీనుల దుఃఖాలనూ, బాధలనూ తాను ఏకరువు పెడుతున్నట్లుగా, బొంగురుగా అరుస్తుంది. అన్నకొడుకు తన పినతండ్రిని ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి అరిచినా, కలుపుకుపోయే మనస్తత్వం లేని మనం, ఆ కాకిని చీదరించుకుంటాము. అయినా కాకి నొచ్చుకోదు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

II.

3వ పద్యం

సీ॥ కపిఁబూని మోసాన మసిఁబూసి మారేడు
కాయ చేతికినిచ్చు ఖలునకంటె
పగఁబట్టి తొడఁగొట్టి పరులకొంపలు నిట్ట
నిలువున ముంచెడి వీచుకంటె
చారుసంపార సంచారుల మధ్య వి
షాగ్ని రగుల్చు పాషండు కంటె
లిబ్బులబ్బగఁబిచ్చి బెబ్బులియై పచ్చి
నెత్తురు జుట్టెడి తొత్తుకంటె

తే॥ నెండ్రకాయ వడత గండ్రగొడ్డలి కోఁత
మందినోళ్ళు మూఁత పంది మేఁత
రోఁత బ్రతుకు గడుపు పాతకు నెదనల్పు
కంటెఁ గాకి నలుపు కలుషితమ్మె ?

ప్రతిపదార్థం :
కసిఁబూని (కసిన్ + పూని). = కోపము వహించి;
మోసానన్ = మోసంతో
మసిఁబూసి (మసిన్ + పూసి) = నల్లని మసిని పూసి
మారేడు కాయ = మారేడు కాయ అని
చేతికినిచ్చు (చేతికిన్+ఇచ్చు) = చేతికి ఇచ్చే (మోసం చేసి) ఒకదానికి బదులు మరొక వస్తువు నిచ్చే ;-
ఖలునకంటెన్ = నీచుని కంటె ;
పగబట్టి (పగన్ + పట్టి) = విరోధము పూని ;
తొడఁగొట్టి (తొడన్ + కొట్టి) = పోరుకు పిలిచి ;
పరులకొంపలు = ఇతరుల ఇండ్లను
నిట్టనిలువునన్ = నిటారుగా
ముంచెడి = ముంచే
నీచుకంటెన్ = నీచుని కంటె ;
చారు సంసార సంచారుల = చక్కగా సంసార జీవితం గడిపే వా
మధ్య = నడుమ
విషాగ్నిన్ = విషమనే అగ్నిని
రగులు = మండించే
పాషండుకంటెన్ = వేద ధర్మములను పాటించని వేదబాహ్యుని కంటె; (సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు (పాషండుడు)
లిబ్బులు = ధనములు
అబ్బగన్ = లభించగానే
పిచ్చి బెబ్బులియై = పిచ్చెత్తిన పెద్దపులి వలె
పచ్చినెత్తురు = పచ్చి రక్తాన్ని
జుట్టెడి = త్రాగే
తొత్తుకంటెన్ = తొత్తుకంటె (తొత్తు = అంకు స్త్రీ)
ఎండ్రకాయనడతన్ = ఎండ్రకాయవలె అడ్డంగా నడుస్తూ
గండ్ర గొడ్డలి కోతన్ = గొడ్డలి కోతతో;
మంది నోళ్ళు మూత = జనం నోళ్ళు మూయిస్తూ
పంది మేతన్ = పందిలా మేస్తూ,
రోతబ్రతుకుగడుపు = ఏవగింపు కల్గించే బ్రతుకును బ్రతికే
పాతకు = పాపాత్ముని యొక్క
ఎదనల్పుకంటెన్ = హృదయపు నల్లదనం కంటే
కాకి నలుపు = కాకి యొక్క నల్లదనము
కలుషితమ్మె(కలుషితమ్ము + ఎ) = చెడ్డదా?

భావం :
కోపంతో, మోసంతో మసిపూసి మారేడు కాయ చేసే దుర్మార్గుని కంటె, పగతో తగవు పెట్టుకొని ఇతరుల కొంపలను నిట్ట నిలువునా ముంచే నీచుని కంటే, చక్కగా సంసార జీవితం గడిపే వారి మధ్య విషాగ్నిని మండించే దుర్మార్గుని కంటె, అంతులేని ధనం కూడగానే పిచ్చెత్తిన పెద్దపులిలా, పచ్చినెత్తురు త్రాగే దుర్మార్గపు తొత్తులకంటే, ఎండ్రకాయ వలె అడ్డంగా నడుస్తూ గొడ్డలి కోతతో, ఇతరుల నోళ్ళు మూయిస్తూ, పందిలాగా మెక్కుతూ, మిక్కిలి నీచమైన బ్రతుకును బ్రతికే పాపాత్ముడి హృదయంలోని నల్లదనం కంటే, కాకి నలుపు కలుషితం కాదు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

4వ పద్యం

సీ॥ నల్లమొగమ్మున నెల్ల లోకాలలో
వెన్నుఁడు పూజ్యుఁడై వెలయలేదె ?
విసపు మేతరి గొంతు విడ్డూరమగు నలు
పున్నను శివుఁడంచుఁ బొగడఁబడఁడె ?
చుక్కల దొరలోన ముక్కున నలుపున్న
చల్లని వెన్నెల జల్లులిడఁడె?
నరుల తలలు నల్పు యిరుల దారులు నల్పు
నింగి నీరును రేయి నీడ నలుపు

ఆ॥ కాకి నలుపటంచు గావుకేకలు బెట్టి
మాయవంటి పొరలు మాయి నలుపు,
అంధకారమైన అజ్ఞానమేనల్పు
వాయసముల నలుపు రోయనేల ?

ప్రతిపదార్థం:
నల్లని మొగమ్మునన్ = నల్లని ముఖంతో (శ్యామల వర్ణపు ముఖంతో)
ఎల్లలోకాలలోన్ = అన్ని లోకాలలో
వెన్నుడు = విష్ణుమూర్తి
పూజ్యుడై = పూజింపబడేవాడై
వెలయలేదే (వెలయలేదు + ఏ) = ఒప్పలేదా? (ప్రకాశింపలేదా?)
విసపుమేతరి (విసము + మేతరి) = గరళకూట విషాన్ని తాగిన ఈశ్వరుడి;
గొంతు = కంఠము,
విడ్డూరమగు = వింత గొలిపే
నలుపున్నను = నలుపు రంగు కలిగి ఉన్న;
శివుడు = పరమశివుడు
అంచున్ = అని;
పొగడబడ = సుత్తింపబడడంలేదా?
చుక్కలదొరలోనన్ = నక్షత్రములకు ప్రభువైన చంద్రునిలో
ముక్కునన్ = ముఖంలో
నలుపున్నన్ (నలుపు + ఉన్నన్) = నల్లదనం ఉన్నప్పటికీ (కళంకం ఉన్నా)
చల్లని వెన్నెలన్ = చల్లని వెన్నెలను
జల్లులిడడై(జల్లులు + ఇడడు + ఎ)= జల్లులుగా కురిపించడం లేదా?
నరుల తలలు నల్పు = మనుషుల తలలు; (తలపై జుట్టు)
నల్పు = నల్లగా ఉంటాయి,
ఇరుల దారులు = చీకటి దారులు
నల్పు = నలుపు
నింగి = ఆకాశమునూ
నీరును = నీరునూ
రేయి = రాత్రియునూ
నీడ = నీడయూ
నలుపు = నల్లగానే ఉంటాయి
కాకి నలుపు + అటంచున్ = కాకి నల్లనిదని అంటూ
గావుకేకలు పెట్టి = పెద్దగా పెట్టి (గావు కేక అంటే బలి ఇచ్చేటప్పుడు వేసే కేక)
మాయనంటి (మాయన్ + అంటి) = మాయలో పడిపోయి
పొరలు = దొర్లే
మాయి = మాయగాడు (మాయ చేసేవాడయిన మాయావి)
నలుపు = నలుపు
అంధకారమైన = చీకటిమయమైన
అజ్ఞానమే = అజ్ఞానము కూడా
నల్పు = నలుపే
వాయసముల = కాకుల
నల్పు = నల్లదనాన్ని
రోయన్ = అసహ్యించుకోడం
ఏల = ఎందుకు ?

భావం:
నల్లనైన వర్ణంతో ఉండే మహావిష్ణువు (శ్రీకృష్ణుడు) సకల లోకాల్లో పూజింపబడేవాడై వెలయలేదా? విషాన్ని త్రాగి నల్లబడిన కంఠంతో వింతగా కనిపించినా, పరమశివుడు శుభకరుడని కీర్తింపబడలేదా? అందమైన చంద్రుని ముఖంలో నల్లని మచ్చ ఉన్నా, చంద్రుడు చల్లని వెన్నెలలు కురిపించడం లేదా?

మనుషుల తలలు నలుపు. చీకటిదారులు నలుపు. ఆకాశం, నీరు, రాత్రి, నీడ నలుపు. కాకి నల్లనిదని ఛీత్కరిస్తూ, మాయలో పడిపోయి పొర్లాడే మాయావి అయిన వ్యక్తి నలుపు. చీకటిమయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపు. అట్లాంటప్పుడు కాకుల నల్లదనాన్ని అసహ్యించుకోడం ఎందుకు?

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

III.

5వ పద్యం : (కంఠస్థ పద్యం)

* సీ॥ కాకిబలఁగమంచు గాబరా పడిదెల్పు
తనబంధుజనుల యాదరణబొందు
‘కాకిపిల్లలు కాకికే కడుముద్ద’ని
తనబిడ్డలను గూర్చి తగవులాడు
వదరుఁబోతును గాంచి వాదమ్ములో మించి
లొట్టిమీఁదం గాకి లొల్లియనును
పిల్లలందఱుఁజేరి యల్లరి బెట్టఁగఁ
గాకి గోలయని చీఁకాకు పఱచు

ఆ ॥ “కావు – కావు” మనుచు దేవుని వేడెడి
పలుకులు చెవులందు ములుకులగును
గీము మీఁద వ్రాలి సేమములడుగును
ప్రాణసఖుని భంగి రాక విడదు.

ప్రతిపదార్థం:
కాకిబలగమంచున్ (కాకిబలగము + అంచున్) = కాకిలా ఎక్కువ మంది చుట్టాలున్నారని
గాబరాపడి = కలవరపడి
తెల్పున్ = చెపుతాడు (కాని)
తన బంధుజనుల = తన చుట్టాల యొక్క
ఆదరణబొందు (ఆదరణన్ + పొందు) = మన్ననను పొందుతాడు
కాకిపిల్లలు = కాకికి పుట్టిన పిల్లలు
కాకికే = ఆ కాకికే
కడుముద్దని (కడున్+ముద్దు+అని) = మిక్కిలి ఇంపును కల్గిస్తాయని అంటూ
తన బిడ్డలను గూర్చి = తన పిల్లలను గుఱించి మాత్రం (ఎవరేమన్నా)
తగవులాడున్ = (వారితో) దెబ్బలాడుతాడు
వదరుఁబోతును = ఊరకే ఎక్కువ మాట్లాడే వాడిని గుఱించి
కాంచి = చూచి
వాదమ్ములో = అతనితో వాదులాడడంలో
మించి = ఆ వదరుబోతును మించి పోయేలా మాట్లాడి;
లొట్టిమీద కాకి లొల్లి = కల్లుకుండ మీద కాకి అల్లరి
అనును = అంటాడు
పిల్లలు = పిల్లలు
అందఱున్ + చేరి = అంతా ఒకచోట చేరి
అల్లరి పెట్టంగన్ = సందడి చేయగా
కాకిగోల అని = కాకుల్లా గోలచేస్తున్నారని
చీకాకు పఱచున్ = చెదరగొడతాడు; (వారిని దూరంగా తరుముతాడు)
కావుకావుమనుచున్ = కావు కావు మంటూ
దేవుని వేడెడి = దేవుడిని ప్రార్థించే
పలుకులు = (కాకి) మాటలు
చెవులందున్ = (మన) చెవులందు
ములుకులగును (ములుకులు + అగును)= బాణాల్లా గుచ్చుకుంటాయి (నొప్పి కల్గిస్తాయి)
గీము మీద వ్రాలి = ఇంటి మీద వ్రాలి ; (కాకి)
సేమములడుగును = మన క్షేమాలను గూర్చీ ప్రశ్నిస్తుంది ;
ప్రాణసఖుని భంగిన్ = ప్రాణ స్నేహితుడిలా
రాక = రాకుండా
విడదు = విడిచిపెట్టదు

భావం:
చుట్టాల సంఖ్య ఎక్కువగా ఉంటే, ‘కాకిబలగము’ అని హేళనగా మాట్లాడుతాం. కాని మనం, మన బంధుజనం ఆదరణను మాత్రం పొందుతాం. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అని వ్యంగ్యంగా ఇతరులను వేళాకోళం చేస్తాం. కాని మన పిల్లల విషయంలో అది మరచిపోయి, మన పిల్లలను ఇతరులు ఏమైనా అంటే, వారితో పోట్లాటకు సిద్ధం అవుతాం. ఎక్కువగా వాగే వాడిని మించి మనం ఇతరులతో వాదిస్తాం. తిరిగి ఎదుటివాడిని ‘లొట్టిమీద కాకిలా వాగుతున్నావు’ అంటాం. పిల్లలు గోలచేస్తే ‘కాకిగోల’ అని చీకాకుపడతాం.

కాకి “కావు కావు” మంటూ దేవుడిని వేడుకొనే కాకి అరుపులు, మన చెవులకు బాణాల ములుకుల వలె గుచ్చు కుంటాయి. కాకి మాత్రం, మన ఇంటి మీద వ్రాలి మన క్షేమ సమాచారం అడుగుతూ, ప్రాణ స్నేహితుడిలా వచ్చి పోవడం. మానదు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

6వ పద్యం :

తే॥ ఇల్లు వెడలింప దొంతుల నెల్ల వెదకు
విధము, పొమ్మని కొట్టిన విసుఁగులేక
నోరునొవ్వంగనే రాయబారమేమొ
తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురొ.

ప్రతిపదార్థం :
ఇల్లు వెడలింప్షన్ = ఇంటి నుండి బయటికి పంపగా
దొంతులనెల్లన్ (దొంతులన్ + ఎల్లన్) = కుండల వరుసల నన్నింటినీ
వెదకు విధము = వెదికే విధంగా;
పొమ్మని కొట్టినన్ = ‘ఛీ’ కాకీ అని రాయి తీసుకొని కొట్టినా
విసుగులేక = విసుక్కోకుండా
నోరు నొవ్వంగన్ = (దాని) నోరు నొప్పిపెట్టేలా
ఏరాయభారమేమొ = అది ఏ రాయబారమో. (తెలియదు)
తెచ్చు వార్తలో = (లేక) అది ఏమైన వార్తలు తెచ్చిందో!
చుట్టాలు వచ్చు కబురో = చుట్టాలు వస్తున్నారని కబురు ఏమైనా తెచ్చిందో !

భావం :
ఇంట్లో నుండి వెళ్ళి పోమ్మంటే, కుండల వరుసలు వెదకుతూ కాలక్షేపం చేసినట్లు, పొమ్మని చీదరించుకుంటూ కొట్టినా కాకి ఏమాత్రం విసుక్కోకుండా రాయబారము తెచ్చిన దానిలా, చుట్టాలు వస్తున్నట్లు కబురు తెచ్చిన దానిలా.. నొప్పి పెట్టేలా అరుస్తూ ఉంటుంది.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

7వ పద్యం

తే॥ కొమ్మకోనలోఁ గూర్చుండి కోకిలమ్ము
కూయఁగా బళాయని గంతువేయుచుంద్రు
ప్రతి దినము వచ్చి మనలను బలుకరించ
నాదరించరు చులకనగాదె కాకి

ప్రతిపదార్థం :
కొమ్మకోనలోన్ = కొమ్మ చివర
కూర్చుండి = కూర్చొని
కోకిలమ్ము = కోకిల
కూయగాన్ = కూయగా
బళా ని అని = భేష్ బాగుంది అని
గంతు వేయుచుంద్రు = ఆనందంతో గంతులు వేస్తారు
ప్రతిదినము వచ్చి = నిత్యమూ వచ్చి
మనలను = మనల్ని
పలుకరించన్ = (కాకి) కుశలం అడుగుతుండగా
ఆదరించరు. = (దాని) ఆదరంగా చూడరు
కాకి = కాకి అంటే
చులకన గాదె = తేలిక కాదా?

భావం:
చిటారు కొమ్మపై ఎక్కడో కూర్చొని కోయిల కూస్తే, ‘బళా’ అని జనం సంతోషిస్తారు. రోజూ వచ్చి పలుకరించే కాకిని మాత్రం, ఆదరించకుండా చీదరిస్తారు..

పాఠం ఉద్దేశం

ప్రకృతిలో భగవంతుడు పుట్టించిన ప్రాణులన్నీ విలువైనవే. వేటి విలువ వాటికి ఉంటుంది. ప్రాణులన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించాలి. మనం ప్రతి ప్రాణినీ, వాటి ప్రత్యేకతలననుసరించి ఆదరించాలి. ‘కాకి’ కూడా ఒక ప్రాణి. అది నల్లగా ఉంటుంది. కాకి యొక్క విశిష్టతను చెపుతూ, కాకి పట్ల చులకన భావం ఉందనీ, అలా వ్యతిరేకభావం తగదని తెలియపరచడమూ, సృష్టిలోని ప్రతిప్రాణి గొప్పదని తెలపడమూ, ‘కాకి’ ప్రత్యేకతను తెలియజేయడమూ ఈ పాఠం ఉద్దేశం.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి శ్రీ మామిండ్ల రామగౌడు రాసిన ‘రస తరంగిణి’ ఖండకావ్య సంపుటిలోని పద్యాలివి.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం 1
పాఠము – ‘వాయసం’

కవి – మామిండ్ల రామగౌడు

జనన-మరణాలు – జననము : 14-01-1943 ; మరణం : 06-06-2003

జన్మస్థలము – ఆధునిక కవుల్లో మామిండ్ల రామగౌడు ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ‘వర్ని’ మండలం ‘రుద్రూరు’ లో జన్మించారు.

తల్లిదండ్రులు – తల్లి ‘బాలమ్మ’, తండ్రి ‘మల్లాగౌడు’ ‘

విద్యాభ్యాసము – ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయింది. తర్వాత వీరు బి.ఓ.ఎల్ పట్టా తీసుకొని, తెలుగు పండితుడిగా పనిచేశారు. తెలుగుభాషపై మక్కువతో 20 ఏళ్ళ వయస్సులోనే రచనలు చేశారు.

రచనలు –

  1. శబరిమాత శతకం
  2. నరసింహ శతకం.
  3. కవి గౌడప్ప శతకం – వంటి భక్తి, నీతి శతకాలు రచించారు.

ఇవే కాక

  1. రసతరంగిణి
  2. కవితాసుధాలహరి
  3. గౌడప్రబోధం – మొదలయిన రచనలు చేశారు.

బిరుదులు – గౌడు గారికి “సుకవిసుధాకర”, “మధురకవి”, “కవికోకిల” వంటి బిరుదులు ఉన్నాయి.

సన్మానాలు – గౌడుగారు పలు సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు.

TS 9th Class Telugu Guide 11th Lesson వాయసం

ప్రవేశిక

సకల జీవులను మనిషి సమాదరించాలి. సర్వప్రాణుల పట్ల దయకలిగి ఉండాలి కాని మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకొంటున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి ఐనప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతుంది. దాని గురించి ఈ పాఠంలో చదువుకుందాం.

Leave a Comment