TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 2nd Lesson స్నేహబంధం Textbook Questions and Answers.

స్నేహబంధం TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు ?
జవాబు.
ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు ?
జవాబు.
ఉపాధ్యాయిని చెప్పే మాటలు వింటూ, స్నేహం విలువను తెలుసుకున్నారు. టీచరు గారు ముగ్గురు పిల్లలకు నచ్చజెప్పగా ఆ ముగ్గురు నాలుగో విద్యార్థికి తమ దగ్గరున్న డబ్బులలో వాటా ఇచ్చారు.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రశ్న 3.
పై బొమ్మ చూస్తే మీకే భావన కలిగింది ?
జవాబు.
అందరూ స్నేహంగా ఉండాలని, కష్టాల్లో పాలు పంచుకోవాలనే భావన కలిగింది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.12)

ప్రశ్న 1.
తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారుకదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడుతారో చెప్పండి.
జవాబు.
మేము మాతో కలిసిన కొత్త స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారిని జాగ్రత్తగా పరిశీలిస్తాము. వారు మంచివారా ? చెడ్డవారా ? అని గమనిస్తాము. వారి పనులు, మాటలు, ఆలోచనలు మంచివి అని నిర్ణయించుకున్నాకే వారితో మాటలు కొనసాగిస్తాము.

ప్రశ్న 2.
కలిసిమెలిసి ఉండడం వలన కలిగే లాభం ఏమిటి ?
జవాబు.
కలిసిమెలిసి ఉండడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఒకరి అవసరాలకు మరొకరు సాయం చేసుకొనవచ్చు. ఆనందంలో, కష్టాల్లో తోడునీడగా నిలువవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.14)

ప్రశ్న 1.
కన్నవాళ్ళకు, స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి.
జవాబు.
కన్న తల్లిదండ్రులకు, ఇష్టమైన స్నేహితులకు దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్లు, బెంగగా ఉంటుంది. తన కష్టసుఖాలు, సుఖసంతోషాలు చెప్పుకొనడానికి ఎవరూ లేరని బాధతో గడుపుతాము.

ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పని మంచిదా ? చెడ్డదా ? వివరించండి.
జవాబు.
జింక తనలో తాను తన వాళ్ళతో కలిసి ఉంటే బాగుండును అనుకొన్న మాటలు రాజకుమారుడు విన్నాడు. జింకను మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు. రాజకుమారుడు చేసిన పని మంచిదే! మూగ జంతువులు కూడా తన వాళ్ళకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతో ఉంటాయని దీనినిబట్టి అర్థమైంది.

ప్రశ్న 3.
ఎలుక తాబేలును ఎందుకు కోప్పడి ఉండవచ్చు?
జవాబు.
తాబేలు వెంటనే ఎటుపడితే అటు వెళ్ళలేదు. స్నేహితులు కాకి, ఎలుక, జింకల లాగ ఆపద వస్తే తాబేలు తప్పించుకోలేదు. అందుకే ఎలుక తాబేలును కోప్పడి ఉండవచ్చు.

ప్రశ్న 4.
ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఎట్లాగో చెప్పండి.
జవాబు.
అడవిలో వేటగాడికి తాబేలు చిక్కింది. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం వెంటనే ఒక ఆలోచన చేశాయి. వేటగాడి మార్గంలో చెరువు వద్ద జింక చచ్చినదానిలా పడి ఉండగా కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది. వేటగాడు తాబేలును క్రింద పెట్టి జింకకోసం వెళ్ళినంతలో ఎలుక తాళ్ళను కొరగ్గానే తాబేలు మడుగులోకి, జింక అడవిలోకి, కాకి ఆకాశంలోకి, ఎలుక కన్నంలోకి పారిపోయి తమను తాము రక్షించుకున్నాయి. దీనివలన ఉపాయంతో ఎలాంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చని అర్థమైంది.

ఇవి చేయండి

1. విని అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతోంది. ఏమైందని అడిగితే బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురూ జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకూ రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది. అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురూ కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

తాబేలు తప్ప తక్కిన ముగ్గురూ తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళేదారిలో ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడి ఉంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లుకింద పెట్టి పోగానే ఎలుక వింటితాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కన్నంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది.

2. మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా ? ఏ విధంగా సాయం చేశారు ?
జవాబు.
ఒకసారి నా స్నేహితుడి తల్లికి జబ్బు చేసింది. అప్పుడు ఇంట్లో అతని దగ్గర ఎవరూ తోడులేరు. అమ్మను ఆసుపత్రికి ఎలా తీసుకెళ్ళాలో తెలియక భయంతో ఏడుస్తూ కూర్చున్నాడు. బడికి వెళుతూ కలిసిపోదామని నేను వాళ్ళింటికి వచ్చాను. వెంటనే ఒక ఆటో పిలిచి నేను నా స్నేహితుడికి సాయంపట్టి వాళ్ళమ్మను ఆసుపత్రికి చేర్చాను. అతడెంత ఆనందించాడో! నాకు కూడా అలా సాయం చేసినందుకు ఎంతో తృప్తి కలిగింది.

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. కింది పదాలు చదవండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో వెతికి వాటికింద గీత గీయండి.

అ. మడుగు
ఆ. రొప్పుతూనె
ఇ. ఉరుక్కుంటూ
ఈ. గబగబ
ఉ. కానుక
ఊ. గబుక్కున
ఋ. కంచె
ౠ. అంతఃపురం
ఎ. కుండపోత
ఏ. ఊపిరిపీల్చుకుంది
ఐ. వడివడిగా
ఒ. నివ్వెరపోయారు
జవాబు.

1.  ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంథరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరుగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టుమీది కెగిరింది. ఒక కొమ్మమీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని, స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులోనుంచి వచ్చిన తాబేలుజింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటికి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. “నువ్వువరివి ? ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చావు ? ఎందుకు భయపడుతున్నావు ?” అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది.

జింక మెల్లగా గొంతు సవరించుకొని “నేను చిత్రాంగుణ్ణి,” అన్నది. “ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా, నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి” అని వేడుకొన్నది. అప్పుడు తాబేలు, “చిత్రాంగా! భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కన్ను పొదే నీ ఇల్లనుకో! నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తియ్యటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏలోటూ ఉండదు. అందరం హాయిగా ఉందాం,” అన్నది.
ఎలుక, కాకి, “ఔనౌను,” అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి.

2.  ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు, తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కాని, మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరత్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబాపాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తళుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ, కళు ఎ) విప్పార్చి ఇటూ, అటూ చూస్తూనే ఉన్నది. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది.

“ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ, ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి” అన్నది. వెంటనే జింక, “ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను,” అన్నది. “ఔను! వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేనిప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను” అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువ సేపు ఎదురుచూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వలదగ్గర వాలింది. దాని వీపుమీది నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాళ్ళు కొరికింది. ఒక వైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చింది.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

సంతోషంగా స్నేహితులు ముగ్గురూ తిరుగు ప్రయాణం సాగించారు” ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా!” అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక, “ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా! నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు ఆరునెలలు వయస్సున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దుచేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చినచోటికి తిరిగేదాన్ని, నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే ‘ మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని.

“ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీథిలో తిరుగుతూ ఉంటే, కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఒక పూలతోట కంచెమీది నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్లు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను.

ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తరువాత సంగతి అంతా మీకు తెలిసింది”.

3. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగివస్తూ ఉండగా మంథరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. “ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు. నువ్వు ? మేం వస్తూనే ఉన్నాం గదా?” అన్నది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడువండని స్నేహితులను కాకి తొందరపెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉ న్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు.

మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంతదూరంలో, వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చినదానిలా పడి ఉంటే కాకి జింకమీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వేటగాడది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. జింకను భుజానికెత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింకవైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్ళను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులో దూరింది. కాకి కావ్ మంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది.

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

హెలెన్ హృదయం కరుణరసభరితమయినది. దీనులను, దుఃఖితులను తలచుకొంటేనే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే కాని ఆమె శరీరమంతటా స్పర్శరూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకూ ఆమె మనసారా అనుభూతిపొంది, తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటివాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకే జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల్లర్. ప్రపంచమంతా తిరిగి ‘ప్రత్యేకావసరాలున్న’ పిల్లలను కలిసి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలు పర్యటిస్తూ భారతదేశానికి కూడా వచ్చింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి.

ప్రశ్నలు:

అ. హెలెన్ ఎటువంటిది ?
జవాబు.
హెలెన్ కరుణరసభరితమైన హృదయం కలది.

ఆ. హెలెన్ ను పరవశింపజేసేది ఏది ?
జవాబు.
ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది.

ఇ. ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది ?
జవాబు.
ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఈ. హెలెన్ ఏయే దేశాలను పర్యటించింది ?
జవాబు.
హెలెన్ ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలను పర్యటించింది.

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఎలుక, తాబేలు, కాకి మంచి మిత్రులని ఎలా చెప్పగలరు ? వివరించండి.
జవాబు.
ఒక అడవిలో ఎలుక, తాబేలు, కాకి స్నేహంగా జీవిస్తుండేవి. ఎవరికి ఆపద కలిగినా తక్కినవి ఆలోచన చేసి వాటిని రక్షిస్తుండేవి. పరిచయం లేని జింకను సైతం ఆపద నుండి రక్షించి మంచి మిత్రులుగా నిలిచాయి.

ఆ. ఈ కథవల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు ఏవి ?
జవాబు.
మంచివారితో స్నేహం చేయాలి. స్నేహితులు ఆపదలలో ఉంటే ప్రాణానికి తెగించైనా కాపాడాలి. జంతువుల పట్ల స్నేహం, ప్రేమ, దయ కలిగి ఉండాలి. జంతువులను హింసించకూడదు, వేటాడకూడదు. ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఉపాయం ఆలోచించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మిత్రులను వదులుకోకూడదు.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఇ. సాధారణంగా పిల్లలు ఎలాంటి అపాయాలు / ఆపదలు ఎదుర్కొంటారు ? ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు.
సాధారణంగా పిల్లలు ఆరుబయట, పాఠశాల వాతావరణంలో ఆడుకునే సందర్భాల్లో అపాయాలను ఎదుర్కొంటారు. వీధుల్లో వెళ్ళేటప్పుడు కుక్కల బారినపడే అవకాశముంటుంది. అలాగే దీపావళి వంటి పండుగ దినాల్లో చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకోసం పెద్దల సంరక్షణలో వారు ఆడుకునేలా చూడాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి తెలియజేయాలి.

ఈ. ఈ కథకు ఇంకే పేరు పెట్టవచ్చు? ఎందుకు ?
జవాబు.
ఈ కథకు మిత్రలాభం అని పేరు బాగుంటుంది. ఎందుకంటే ఇందులోని మిత్రులందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి వలన మరొకరు లాభం పొందారు. మిత్రుల వలన లాభం కనుక మిత్రలాభం అనే పేరు పెట్టవచ్చు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. ‘స్నేహబంధం’ కథను క్లుప్తంగా సొంతమాటల్లో రాయండి.
జవాబు.
ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతోంది. ఏమైందని అడిగితే బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురూ జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకూ రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది.

అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురూ కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు. తాబేలు తప్ప తక్కిన ముగ్గురూ తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళే దారిలో ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడిఉంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లుకింద పెట్టి పోగానే ఎలుక వింటితాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కన్నంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. జంతువులను, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి.
జవాబు.
పూర్వం ఒక అడవిలో ఒక చెరువు గట్టుమీద పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలలో ఒక దానిమీద హంస, మరొక దానిమీద కాకి ఉండేవి. ఒకరోజు ఒక బాటసారి ఆ దారినపోతూ తన అలసట తీర్చుకోవడానికి వచ్చి ఆ చెట్టుక్రింద నిద్రపోయాడు. కొద్దిసేపటికి సూర్యుని ఎండ ఆ బాటసారిపై పడింది. అది చూసి హంస బాటసారిపై జాలిపడి, సూర్యునికి ఎదురుగా రెక్కలు పరచి బాటసారిమీద ఎండపడకుండా చేసింది. ఇంతలో కాకి వచ్చి ఆ బాటసారి ముఖంపైన రెట్టవేసి పోయింది. బాటసారి ఉలిక్కిపడి లేచి, ఎవరు రెట్టవేసిరా అని కోపంతో చుట్టుప్రక్కల చూశాడు. హంస కనబడింది. ఆ హంసే తనపై రెట్ట వేసిందనుకొని ఆ హంసను చంపాడు.
నీతి: చెడ్డవారితో స్నేహం చేటు తెస్తుంది. .

(లేదా)

2. కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా! ఇలాగే అడవిలోని జంతువులు మనలాగే మాట్లాడితే మన గురించి అవి ఏం మాట్లాడుకుంటాయో ఊహించి రాయండి.
జవాబు.
జింక : ఇది వరకు పచ్చని గడ్డిమేస్తూ తియ్యటి నీళ్ళు తాగుతూ చెట్ల నీడలలో ఆడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు ఎక్కడా కాస్త నీడ కూడా కనబడటం లేదు.
పావురం : నీకు నీడా లేదు. మాకు గూడూ లేదు.
కోతి : చెట్లన్నీ మనిషి నరికి పారేస్తుంటే నీడా గూడూ ఎక్కడి నుంచి వస్తాయి ? ఎంచక్కా కొమ్మలు పట్టుకు దూకేవాళ్ళం. చెట్టే లేకపోతే కొమ్మలెక్కడ ?
కాకి : మాకేమో మెతుకు విసిరెయ్యటం చేతకాదు గాని మన సుఖాలన్నీ లాక్కోడానికి ఈ మనిషికెట్లా మనసొప్పుతుందో!
నక్క : ఏదో ఉపాయం పన్ని ఈ మనిషి ఆగడాలు ఆపాలి.

V. పదజాల వినియోగం

1. కింద గీత గీసిన పదాలకు సమానమయిన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి.

అ కృష్ణకుచేలుర చెలిమి గొప్పది.
జవాబు.
స్నేహం

ఆ. తామరలు కొలనులో పూస్తాయి.
జవాబు.
మడుగు

ఇ. ఎలుక కన్నంలో నివసిస్తుంది.
జవాబు.
కలుగు

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఈ. మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి.
జవాబు.
తాబేలు

ఉ. నిప్పుతో చెలగాటం అపాయకరం.
జవాబు.
ప్రమాదం

2. కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరుచండి. అలా జతపరిచిన ప్రకృతి, వికృతులను పట్టిక రూపంలో రాయండి.

అ. అటవి 1. ఆకాశం
ఆ. స్నేహం 2. సాయం
ఇ. సహాయం 3. రాత్రి
ఈ. రాతిరి 4. నెయ్యం
ఉ. ఆకసం 5. అడవి

జవాబు.

ప్రకృతివికృతి
అటవిఅడవి
స్నేహంనెయ్యం
సహాయంసాయం
రాత్రిరాతిరి
ఆకాశంఆకసం

 

3. కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్థంవచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలకింద గీత గీయండి.

అ. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, రంధ్రం వైపు తొంగిచూసి, బిలంలో దూరింది.
జవాబు.
కన్నం, బిలం

ఆ. కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది.
జవాబు.
కొలను, సరస్సు.

ఇ. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని వాయసం మిత్రులకు చెప్పింది.
జవాబు.
కాకి, వాయసం

ఈ. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది.
జవాబు.
సఖ్యం, నెయ్యం.

4. కింది పదాలు చదువండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ. గబుక్కున : ____________
జవాబు.
కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది.

ఆ. తళుక్కున : ____________
జవాబు.
“ఆకాశంలో మెరుపు తళుక్కున మెరిసింది.

ఇ. చటుక్కున : ____________
జవాబు.
పిల్లిని చూసి ఎలుక చటుక్కున పారిపోయింది.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఈ. మిరుమిట్లు గొలిపే : ____________
జవాబు.
మిరుమిట్లు గొలిపే మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది.

ఉ. మురిసిపోవడం : ____________
జవాబు.
చిన్న పిల్లలు చిన్న చిన్న బహుమతులకే మురిసిపోవడం జరుగుతుంది.

ఊ. వడివడిగా : ____________
జవాబు.
కొందరు నెమ్మదిగాను, మరికొందరు వడివడిగాను నడుస్తారు.

ఋ. నివ్వెరపోయి : ____________
జవాబు.
బాగా చదివే నా మిత్రుడు పరీక్షలో తప్పినందుకు నివ్వెరపోయాను.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

తెలుగుభాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు.
అవి : 1. అచ్చులు 2. హల్లులు 3. ఉభయాక్షరాలు

అచ్చులు:
అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ౠ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ
ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు.

అ) హ్రస్వాలు : ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను ‘హ్రస్వాలు’ అంటారు.
అవి : అ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్ప పాటు కాలం)

ఆ) దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ‘దీర్ఘాలు’ అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – ౠ – ఏ – ఐ – ఓ

హల్లులు :
క ఖ గ ఘ ఙ
చ చ ఛ జ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల
శ ష స హ ళ ఱ

ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు.
అ) క, చ, ట, త, ప – పరుషాలు } వీటిని అల్పప్రాణాలు అని కూడా అంటారు.
ఆ) గ, జ, డ, ద, బ – సరళాలు }

ఇ) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు, వర్గయుక్కులు అని అంటారు.
ఈ) ఙ, ఞ, ణ, న, మ – అనునాసికాలు.
ఉ) య, ర, ల, వ – అంతస్థాలు.
ఊ) శ, ష, స, హ – ఊష్మాలు.

సూచన : “ఱ” అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు ‘ర’ను వాడుతున్నారు. అట్లే చ, జే లు వాడుకలో లేవు. వీటికి బదులుగా చ, జ లను వాడుతున్నారు.

ఉభయాక్షరాలు : మూడు. అవి సున్న ‘మ్’ (పూర్ణబిందువు), అరసున్న ‘C’, విసర్గ ”. ఈ మూడింటిని అచ్చులతోను, హల్లులతోనూ ఉపయోగించడంవల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు.
సూచన : అరసున్నకు గ్రాంథికభాషలో ప్రాధాన్యమున్నది. విసర్గ సంస్కృతపదాలకు మాత్రమే చేరుతుంది.

1. కింది వాక్యంలో పరుషాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.

కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది.
జవాబు.
ష్టడి దివితే ఫలితం ప్పక ఉంటుంది.
పరుషాలు : క, చ, ట, త, ప

2. కింది మాటల్లో సరళాలతో మొదలయిన మాటలను గుర్తించండి.

బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం
జవాబు.
బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం
బలం, గాలి, జలం, దళం, డబ్బు, గళం
సరళాలు : గ, జ, డ, ద, బ

3. కింది మాటల్లో అంతస్థాలను గుర్తించండి.

యమున, కారం, పాలు, వంకర, వేళ, కల
జవాబు.
మున, కారం, పాలు, వం, వేళ, క
అంతస్థాలు : య, ర, ల, ళ, వ

4. కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.

భాష మనిషికి సహజమైన శక్తి.
జవాబు.
భా మనిషికి సహజమైన క్తి.
ఊష్మాలు : శ, ష, స, హ

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం చదవండి. దాంట్లో మీకు నచ్చిన కథను రాసి, తరగతిగదిలో ప్రదర్శించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం లో నచ్చిన కథ రాసి ప్రదర్శించడం.

2. సమాచార సేకరణ :

  • సమాచారం సేకరించిన తేదిః
  • సమాచార వనరు : గ్రంధాలయం
  • చదివిన పుస్తకం : పంచతంత్రం

3. సేకరించిన విధానర: మా పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్రం కథల పుస్తకం నుండి నాకు నచ్చిన కథను సేకరించాను

4. నివేదిక : ఒక చెరువులో ఒక తాబేలు ఉంది. అది రోజూ ఒడ్డుకు వచ్చి అటూ ఇటూ తిరిగి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయేది. ఎక్కడి నుంచో రెండు హంసలు అక్కడికి వచ్చి చేరాయి. తాబేలుతో వాటికి మంచి స్నేహంకుదిరింది. రోజూ ఆ రెండు హంసలు వచ్చి తాబేలుతో కబుర్లు చెబుతూ ఉండేవి. అలా ఆ మూడు బాగా స్నేహంగా ఉండేవి. ఒకసారి వానలు లేక చెరువు ఎండిపోసాగింది. తాబేలుకు ఏం చెయ్యాలో తెలియక దిగులుగా కూర్చుంది.

హంసలు తాబేలును వేరొక చెరువులోకి చేరుస్తామన్నాయి. ఒక పెద్దకర్ర తెచ్చి హంసలు వాటి ముక్కుతో పట్టుకున్నాయి. తాబేలును గట్టిగా కరిచి పట్టుకోమన్నాయి. తాబేలు అలాగే చేసింది. హంసలు ఎగురుతూ ఒక ఊరిలో నుండి పోతూ ఉంటే ఊళ్ళోని వారు తాబేలును చూసి నవ్వసాగారు. అది చూసి తాబేలు “ఎందుకీ మూర్ఖులు ఇలా నవ్వుతారు?” అంటూ నోరు తెరిచింది. అంతే కర్ర నుంచి జారి నేలమీద పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడం వల్ల చనిపోయింది.

నీతి :

  •  చేసే పనిమీద ధ్యాస ఉండాలి.
  • కోపం వల్ల ప్రమాదం కలుగుతుంది.

5. ముగింపు : పంచతంత్రం కథల్లో చిన్న చిన్న జంతువులు, పక్షులు పాత్రలుగా ఉండి అనేక నీతులను మనకు బోధిస్తాయి.

TS 6th Class Telugu 2nd Lesson Important Questions స్నేహబంధం

ప్రశ్న 1.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి అపాయంలో పడతామని జింక ఎందుకు అన్నది ?
జవాబు.
ఎంత జాగ్రత్తగా ఉన్నా అపాయాలు ఎదురౌతాయి. చిన్నప్పటి నుంచి జింకకు అలా అపాయాలు కలుగుతూనే ఉన్నాయి. ఆర్నెల్ల వయసులో వేటగాడి ఉచ్చులో చిక్కుకొని రాజభవనానికి చేరింది. వీధుల్లో తిరుగుతూ పిల్లలు తరిమితే ఉద్యానవనంలోకి దూకి కట్టివేయబడింది. రాజకుమారుడు విడిచి పెట్టగా అడవిలోకి చేరుకుని తన వారితో కలిసుందామనుకుంటే వేటగాడు తరిమాడు. ఎలాగో తప్పించుకొని కాకి, ఎలుక, తాబేలుతో స్నేహం సంపాదిస్తే మళ్ళీ వేటగాడి వలలో చిక్కుకుంది.

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రశ్న 2.
స్నేహానికున్న గొప్పతనాన్ని వివరించే సంఘటనలు మీ పాఠంలో ఏమేమి ఉన్నాయి ?
జవాబు.

  • జింక భయంతో వచ్చినపుడు స్నేహితులు ముగ్గురూ ఒక మాటపై నిలబడి జింకను తమ మిత్రునిగా చేసుకున్నాయి. ఆపదలో ఉన్న జింక రక్షింపబడటం స్నేహానికున్న గొప్పతనాన్ని తెలుపుతోంది.
  • జింకను వేటగాడి నుండి రక్షించటానికి కాకి, ఎలుక కలిసి ప్రయత్నించటం స్నేహం గొప్పదని తెలుపుతోంది.
  • తాబేలు వేటగాడికి చిక్కగానే తక్కిన ముగ్గురూ ఉపాయం ఆలోచించి విడిపించడం కూడా స్నేహం యొక్క గొప్పతనమే.

ప్రశ్న 3.
“తిరిగి అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను” అని జింక అన్నది కదా! దీనివల్ల మీరేం తెలుసుకున్నారు ?
జవాబు.
జంతువులు గాని, పక్షులుగాని తమ జాతి వారితో కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాయి. మనుషులు తమ స్వార్థం కోసం, సంతోషం కోసం వాటిని ఇళ్ళలో బంధించి ఉంచటం తప్పు. వాటిని ఎంత ప్రేమగా చూసినా కూడా అవి స్వేచ్ఛను కోరుకుంటాయని తెలుసుకున్నాను.

ప్రశ్న 4.
చిత్రాంగుడి వృత్తాంతాన్ని పది వాక్యాల్లో రాయండి.
జవాబు.
చిత్రాంగుడు ఒక జింక. దాని ఆర్నెల్ల వయసులో ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. వాడు దానిని ఒక రాకుమారుడికి uగా ఇచ్చాడు. రాకుమారుడు దాన్ని తన ఇంట్లో స్వేచ్ఛగా తిరగనిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకనాడు జింక వీథుల్లో తిరుగుతుంటే పిల్లలు వెంటపడ్డారు. భయంతో పక్కనున్న గోడ దూకగానే అంతఃపుర స్త్రీలు పట్టుకొని రాకుమారుడి పడక గది బయట కట్టేశారు.

అంతలో ఉరుములు మెరుపులతో పెద్దవాన రాగానే దానికి తనవారు, తానుండే అడవి గుర్తుకొచ్చాయి. మళ్ళీ అడవిలోకెళితే ఎంత బాగుంటుందో అని మానవ భాషలో అనుకొన్నది. వెంటనే అది విన్న రాకుమారుడు దానిని అడవికి పంపివేశాడు. కొన్నాళ్ళకు ఒక వేటగాడు తరుముతుంటే పారిపోయి కాకి, ఎలుక, తాబేలు ఉన్న చోటికి వచ్చింది. వారితో స్నేహం కలిసింది. ఒకనాడు అడవిలో వేటగాడి వలలో చిక్కుకుంది. ఎలుక వలను కొరికి చిత్రాంగుడిని రక్షించింది.

ప్రశ్న 5.
జింకను స్నేహితులు రక్షించిన తీరును సొంత మాటల్లో రాయండి?
(లేదా)
వలలో చిక్కుకున్న జింకను వేటగాడి నుండి మిత్రులు ఎలా రక్షించాయి ?
జవాబు.
ఒక నాడు పొద్దు వాలుతున్న వేళ స్నేహితులు ఒక చోటికి చేరాయి. కాని మేతకు వెళ్ళిన జింక రాలేదు. ఎందుకు రాలేదో తెలియలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. కాకి మనసులో ఒక ఉపాయం మెరిసింది. అది గాలిలో ఎగురుతూ అడవిలో అటు ఇటూ చూస్తున్నది. అంతలో ఒక చోట వలలో చిక్కుకున్న జింకను చూసింది. స్నేహితున్ని చూసి దుఃఖించింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీవు ఈ ఆపదనుండి బయట పడాలి అన్నది కాకి. వెంటనే జింక, ఎలుక వచ్చి వలను కొరికేస్తే నేను బయటపడతను అన్నది. కాకి వెంటనే గాలిలో ఎగిరి హిరణ్యకం (ఎలుకు) ను వీపు మీద తీసుకొచ్చింది. వెంటనే ఎలుక వల తాళ్ళను కొరికింది. జింక బయటికి వచ్చింది. ఈ విధంగా స్నేహితులు జింకను రక్షించారు

పర్యాయపదాలు

  • అడవి = వనం, అరణ్యం, కాననం
  • కాకి = వాయసము, బలిభుక్కు, కరటం
  • ఎలుక = మూషికము, ఆఖువు, ఆఖనికం
  • తాబేలు = కమఠము, కూర్మము, కచ్ఛపం
  • నేల = ధరణి, భూమి
  • వేటగాడు = మృగయుడు, వేటరి, షికారి
  • వేడుకొను = ప్రార్థించు, బ్రతిమాలు
  • గాలి = వాయువు, పవనము
  • నారి = స్త్రీ ,ఇంతి, వనిత
  • విల్లు = ధనుస్సు, శరాసనం, చాపం
  • జింక = హరిణము, లేడి
  • స్నేహితులు = మిత్రులు, నేస్తాలు
  • చెట్టు = వృక్షము, తరువు
  • కలుగు = కన్నము, బిలము, రంధ్రము
  • ప్రమాదం = అపాయం, ఉపద్రవం, ఆపద
  • స్నేహం = మైత్రి, చెలిమి, నేస్తం
  • మడుగు = కొలను, సరస్సు
  • వింత = చోద్యం, విచిత్రం
  • కళ్ళు = నయనాలు, నేత్రాలు

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ప్రకృతులు – వికృతులు

ప్రకృతి- వికృతి

  • స్తంభము – కంబము
  • ప్రయాణం – పయనం, పైనం
  • రాజు – రాయలు (ఱేడు కాదు)
  • అంతఃపురం – అంతిపురం
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • స్త్రీ – ఇంతి
  • భాష – బాస
  • భుజం – బుజం
  • బ్రధ్నడు – పొద్దు
  • దవీయము – దవ్వు
  • గ్రా సము – గ్రా సము

సంధులు

పదాలు – విడదీసిన రూపాలు:

  • ఎందుకైనా = ఎందుకు + ఐనా
  • లేదని = లేదు + అని
  • రమ్మని = రమ్ము + అని
  • నువ్వెవరివి – నువ్వు + ఎవరివి
  • మీరిక్కడ = మీరు + ఇక్కడ
  • మంచిదని = మంచిది + అని
  • మీదికెగిరింది = మీదికిన్ + ఎగిరింది
  • అవన్నీ = అవి + అన్నీ
  • పక్కనున్న = పక్క + ఉన్న
  • కావలసినంత = కావలసిన + అంత
  • ఒక్కొక్కప్పుడు = ఒక్కొక్క + అప్పుడు
  • చిన్నప్పుడు = చిన్న + అప్పుడు

I. అ) కింది ఆహ్వాన పత్రికను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఆహ్వానం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చర్లపల్లి, వరంగల్ గ్రామీణ
క్రీడా దినోత్సవము.

x x ఫిబ్రవరి x x x x బుధవారం సాయంత్రం 5 గం॥ 30 ని॥ లకు మా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించబడే “క్రీడాదినోత్సవ” కార్యక్రమానికి రావలసిందిగా మనవి.

అధ్యక్షులు : గౌ|| ప్రకాశరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు
ముఖ్య అతిధి : శ్రీమతి గద్దల పద్మ గారు, జడ్పి చైర్పర్సన్
ఆత్మీయ అతిధి : గౌ|| నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రత్యేక ఆహ్వానము కార్యక్రమం : శ్రీ వెంకటనారాయణ, వాలీబాల్ క్రీడాకారులు

కార్యక్రమం :
జ్యోతి ప్రజ్వలన
అతిధుల సందేశాలు
విద్యార్థులకు బహుమతి
సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
వందన సమర్పణ

సూచన : దూరప్రాంతం వెళ్లవలసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాత్రి భోజనం, వసతి ఏర్పాటు ఉంది. గమనించగలరు

ఇట్లు
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,
పాఠశాల యాజమాన్య కమిటీ,
జి.ప.ఉ.పా. చర్లపల్లి, వరంగల్

ప్రశ్నలు:

పై ఆహ్వాన పత్రికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. పై ఆహ్వాన పత్రిక ఏ వేడుకకు సంబంధించినది ?
జవాబు.
క్రీడాదినోత్సవ వేడుకకు సంబంధించినది

2. పై వేడుకకు ముఖ్య అతిధి ఎవరు ?
జవాబు.
శ్రీమతి గద్దల పద్మగారు (జడ్పి చైర్పర్సన్)

3. పై కార్యక్రమానికి అధ్యక్షత వహించినదెవరు ?
జవాబు.
గౌ|| ప్రకాశరావు గారు (పాఠశాల ప్రధానోపాధ్యాయులు)

4. వేడుకకు ఆహ్వానించు వారెవరు ?
జవాబు.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ.

5. వేడుక నిర్వహించు స్థలం ఏది ?
జవాబు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చర్లపల్లి, వరంగల్ గ్రామీణం

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

ఆ) కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

తోలుబొమ్మల ఆట వలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీథి నాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులని పిలుస్తారు. కొన్ని సంవత్సరముల క్రిందటి వరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. చాలాకాలం నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాటు భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు.

ప్రశ్నలు

1. వీధినాటకాలను ఆడేవారిని ఏమని పిలుస్తారు ?
జవాబు.
వీథి నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు.

2. భాగోతులని ఎవరిని పిలుస్తారు ?
జవాబు.
భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులు అని పిలుస్తారు.

3. తోలుబొమ్మల ఆట వలెనే బహుళ ప్రచారము పొందినవి ఏవి ?
జవాబు.
తోలుబొమ్మలాట వలెనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు.

4. పల్లెటూళ్ళలో విరివిగా జరిగేవి ఏవి ?
జవాబు.
పల్లెటూళ్ళలో విరివిగా జరిగేవి భాగోతుల ఆటలు.

5. యక్షగానాలకు మరొక పేరు ?
జవాబు.
యక్షగానాలకు మరొక పేరు వీథి నాటకాలు.

II. పదజాలం:

సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. ‘ఒక అడవిలో ఒక కాకి, ఎలుక ఉండేవి. అదే వనంలో జింక కూడా ఉంది.’
ఈ వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాలు
a) ఎలుక, జింక
b) అడవి, వనం
c) వనం, ఎలుక
d) అడవి, జింక
జవాబు.
b) అడవి, వనం

2. మిత్రుని కోసం కాకి, ఎలుక కలత పడ్డాయి. నేస్తం కనిపించింది వాటికి.
ఈ వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలు
a) మిత్రుడు, నేస్తం
b) ఎలుక, నేస్తం
c) మిత్రుడు, కాకి
d) కాకి, ఎలుక
జవాబు.
a) మిత్రుడు, నేస్తం

3. ఎవరికైనా ఆపద వస్తుంటుంది. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి.
ఈ వాక్యాల్లోని పర్యాయ పదాలు
a) ఆపద, ఉపాయం
b) ఆపద, అపాయం
c) ఉపాయం, తప్పించుకోవడం
d) ఎవరు, తప్పించుకొను
జవాబు.
b) ఆపద, అపాయం

4. ‘ఆకాశం’ అనే పదానికి వికృతి
a) ఆకాష
b) ఆశాకం
c) ఆకసం
d) అక్షం
జవాబు.
c) ఆకసం

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

5. ‘సహాయం’ అనే పదానికి వికృతి
a) సాయం
b) సహనం
c) సమం
d) సహ్యం
జవాబు.
a) సాయం

6. ‘నెయ్యం’ అనే వికృతి పదానికి తగిన ప్రకృతి పదం
a) నెయ్యి
b) నేహ
c) నయం
d) స్నేహం
జవాబు.
d) స్నేహం

7. ‘ఆశ్చర్యం’ అనే పదానికి వికృతి
a) అచ్చెరువు
b) అచ్చరము
c) అచ్చర
d) ఆసరము
జవాబు.
a) అచ్చెరువు

8. ‘బాస’ అనే వికృతి పదానికి ప్రకృతి
a) బాస్
b) భాస
c) భాష
d) 20
జవాబు.
c) భాష

III. వ్యాకరణం :

1. ‘నీకు కావలసినంత పచ్చిక ఇక్కడ ఉంది’.
a)వ, ది, త
b) నీ, సి, ఇ, ఉ
c) న, క, ఉ, ల
d)కు, కా, త, ప, చ్చి, క, క్క
జవాబు.
d)కు, కా, త, ప, చ్చి, క, క్క

2. కింది వాటిలో సరళంతో మొదలైన పదం
ఈ వాక్యంలో ఉన్న పరుషాలు
a) బయటకు
b) రాలేని
c) చిత్రాంగుడు
d) కలవరపడ్డాడు
జవాబు.
a) బయటకు

3. కింది వానిలో అంతస్థాలు
a) శ, ష, స, హ
b) క, చ, ట, త, ప
c) య, ర, ల, వ
d) గ, జ, డ, ద, బ
జవాబు.
c) య, ర, ల, వ

4. కింది వానిలో ఊష్మాలు
a) హ, స, శ, ష
b) య, వ, ర, ల
c) ళ, క్ష, ఱ
d) ఞ, న, ఙ, ణ, మ
జవాబు.
a) హ, స, శ, ష

5. కింది వానిలో వేటిని అనునాసికాలంటారు ?
a)న, మ, హ
b) ఙ, ఞ, ణ, న, మ
c) గ, జ, ద, డ, బ
d)క, చ, ట, త, ప
జవాబు.
b) ఙ, ఞ, ణ, న, మ

అర్దాలు

  • అంతఃపురస్త్రీలు = రాణులూ వారి పరివారము
  • అపాయం = ప్రమాదం, ఆపద
  • మడుగు = కొలను
  • కలుగు = కన్నం, బొర్రె/బొరియ
  • ఉరుకు = పరుగెత్తు, దూకు
  • రొప్పు = ఆయాసపడు, కేకవేయు, అరచు
  • కలత = బాధ, ఆందోళన, కలవరం
  • వీధి = రెండు ఇళ్ళ వరుసల మధ్య నుంచి సాగేదారి
  • లఘుపతనకం = లఘుపతనకం అంటే సులువుగా వాలేది అని అర్థం. పాఠంలోని కాకి పేరు.
  • హిరణ్య = హిరణ్యకం అంటే బంగారం కోసం ఆశ అని అర్థం పాఠంలో ఎలుక పేరు
  • గబుక్కున = వెంటనే, ఉన్నట్టుండి
  • విహరించు = ఆనందంగా తిరుగు
  • కొలువుకూటం = రాజ దర్బారు
  • బెదరు = భయపడు, భయము
  • ఉపద్రవం = ఆపద, కష్టం

TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

పాఠం ఉద్దేశం

స్నేహమమనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘కథ’ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టు కొనే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణుశర్మ ‘పంచతంత్రం’ ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన ‘మిత్రలాభం’లోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం.

ప్రవేశిక

“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడ కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు ? చిత్రాంగుడు ఎవరు ? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది ? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

“చిత్రాంగా! భయపడకు, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వుకూడ కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం” అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు ? చిత్రాంగుడు ఎవరు ? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది ? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

నేనివి చేయగలనా?

  • కథను సొంతమాటలలో చెప్పగలను. అవును/ కాదు
  • పాఠం చదివి పాఠంలోని కీలకాంశాలను గుర్తించగలను. అవును/ కాదు.
  • కథను సొంతమాటలలో రాయగలను. అవును/ కాదు.
  • జంతువులు, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా కథ రాయగలను. అవును/ కాదు.

Leave a Comment