గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.
ప్రశ్నలు
ప్రశ్న 1.
పై బొమ్మ దేనిని గూర్చి తెలియజేస్తున్నది?
జవాబు.
జాతర గూర్చి తెలియచేస్తోంది. గుడిముందు పండుగ వాతావరణం కనిపిస్తోంది.
ప్రశ్న 2.
పై బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు?
జవాబు.
పై బొమ్మలో అంగట్లో లడ్డూలు, ప్రసాదాలు అమ్మేవారు, అమ్ముతున్నారు. మెట్లగుండా బోనాలు (మహిళలు) తీసుకు వెళ్ళుతున్నారు. గాలి బుడగలు అమ్ముతున్నారు. రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు.
ప్రశ్న 3.
మీరు ఎప్పుడైనా జాతరలకు వెళ్ళారా? ఏయే జాతరులకు వెళ్ళారు?
జవాబు.
వెళ్ళాం. సికింద్రాబాద్ మహంకాళమ్మ జాతర, మేడారం (సమ్మక్క, సారక్క జాతరలకు వెళ్ళాం. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నది. నాగోబా జాతర (ఆదిలాబాద్ జిల్లాలో) కొమరవెల్లి మల్లన్న జాతర (కరీంనగర్)లకు వెళ్ళాం.
ప్రశ్న 4.
మీకు తెలిసిన / చూసిన జాతర గురించి చెప్పండి.
జవాబు.
సమ్మక్క, సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు. సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. కోటికిపైగా పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.75)
ప్రశ్న 1.
“ఆటలలో అందం” అంటే ఏమిటి?
జవాబు.
ఆటలు మనిషికి మానసిక ఆందోళన తగ్గిస్తాయి. అందం అంటే మనసుకు సంబంధించినది. అందమే ఆనందం అని అంటారు. ఆ ఆనందమే జీవితాన్ని నడిపిస్తుంది. మానసిక ఆనందాన్ని ఆటలలో పొందొచ్చు. కాబట్టి ఆటలలో అందం అంటే మానసికోల్లాసం అని అర్థం.
ప్రశ్న 2.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది? అది ఎందుకు బాగా నచ్చి ఉంటుంది?
జవాబు.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం తోలుబొమ్మలాట. ఇది తెలుగువారి ప్రత్యేక కళారూపం. అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా గట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలుగట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ, మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును జీర్ణించిన కథలు. కాబట్టే అది బాగా నచ్చి ఉంటుంది.
ప్రశ్న 3.
మీకు నచ్చిన గ్రామీణ వినోదం ఏది? అది ఎందుకు నచ్చింది?
జవాబు.
నా(మా)కు నచ్చిన గ్రామీణ వినోదం యక్షగానాలు. దీనినే వీధి నాటకాలు అని కూడా అంటారు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని కూడా పిలుస్తారు. చాలా సంవత్సరాల నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజపలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు. వినేవారికి అత్యంత రసానుభూతిని కల్గచేస్తుంది. కాబట్టి ఇది నాకు నచ్చింది.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.77)
ప్రశ్న 1.
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి.
జవాబు.
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తాయి. రంగులరాట్నము, గిల్లిదండ (చిర్రగోనె), కోడిపందెములు, బొంగరాల ఆట మొదలైనవి స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు. వీటి ద్వారా ప్రత్యక్షంగా ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇవి ప్రజలకు నచ్చుతాయి.
ప్రశ్న 2.
ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్నవేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి.
జవాబు.
ప్రస్తుత పరిస్థితులలో విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే టెలివిజన్లో సీరియల్స్ చూడటం, సినిమాలపై మక్కువ కల్గటం వల్ల ఈ మధ్యాహ్నపు వేళ ఆడే పచ్చీసు మొదలైన ఆటలు ఆడటం లేదు.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.79)
ప్రశ్న 1.
మీకు తెలిసిన జాతర గురించి చెప్పండి.
జవాబు.
సమ్మక్క, సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు, సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. కోటికిపైగా పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర.
ప్రశ్న 2.
ఈ “ముగ్గులు స్త్రీల కళాభిరుచికి ఉదాహరణలు” అనే రచయిత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు, యువతులకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యం ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళలో పుష్కలంగా కనిపిస్తారు. ఈ ముగ్గులు తెలుగు పడతుల సౌందర్యరక్తికి, కళాభిరుచికీ గొప్ప (మంచి) ఉదాహరణలు.
ప్రశ్న 3.
గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు.
- గ్రామీణ ఉత్సవాల వల్ల వినోదానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చారు.
- ఉత్తమ సంస్కృతిని తెలుసుకోవచ్చు.
- సంప్రదాయాలు తెలుస్తాయి.
- మానసికోల్లాసాన్ని కల్గిస్తాయి.
- ఉత్తమ వ్యక్తిత్వం నిర్మాణం జరిగేది.
- క్రీడాస్ఫూర్తి కలుగుతుంది.
- శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత తెలుస్తుంది.
- ఇరుగుపొరుగువారితో, సమాజంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. గ్రామాలలోని కళలు, క్రీడలు నేడు మనకు కనిపించకపోవడానికి కారణాలు చెప్పండి.
జవాబు.
- గ్రామీణప్రాంతాలు ఆటలు, కళలు దాదాపుగా కనుమరుగైపోయాయి.
- ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములు లక్ష్యంగా, జూదంగా పరిణమిస్తున్నాయి.
- పిల్లలు మైదానాలకు దూరమైనారు.
- కంప్యూటర్లలో ఆటలు ఆడుతున్నారు.
- చరవాణి (సెల్ఫోన్)లతో ఆటలాడుతున్నారు.
- పాశ్చాత్య వికృత నృత్యాలు, ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు.
- మానవ సంబంధాలు దూరమవుతున్నాయి.
2. గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఎట్లా ఉంచాయో చర్చించండి.
- గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఉంచాయి.
- మైదానాలలో ఆరుబయలు ప్రదేశాలలో ఆటలవల్ల సమిష్టి తత్వం ఏర్పడేది.
- ఇరుగుపొరుగువారి, సంఘంలోని అందరూ ఒకటేననే భావన (వసుధైక కుటుంబ భావన) బలపడేది.
- ఎడ్లపందాలలో, కోలాటం మొదలగు ఆటలలో పోటీతత్వం బలపడేది.
- విజ్ఞానం అభివృద్ధి అయ్యేది.
- అలుపు, సొలుపు లేకుండా ఆడుతూ, పాడుతూ పనిచేసేవారు.
- కాయకష్టం విలువ తెలిసేది.
- రామాయణ, మహాభారత, భాగవత కథలు ప్రజలకు నీతిని తెల్పేవి. ఉదా : తోలుబొమ్మలాట, ఈ విధంగా ప్రజలను గ్రామీణ క్రీడలు, కళలు సమైక్యంగా ఉంచేవి.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయో వెతికి వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు పట్టికలో రాయండి.
జవాబు.
విషయం | పేరా | ముఖ్యాంశాలు |
1. తోలుబొమ్మలాట | 4 వ పేరా | 1. సమస్త జనులను ఆకర్షిస్తుంది. |
2. ఇది తెలుగువారి ప్రత్యేకత | ||
3. అనేక సం॥ల నుండి ఉపాసించిన కళ | ||
4. రామాయణ, భారత కథలకు చెందినది. | ||
5. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకూ చేతులకు దారాలు కట్టి లాగుతారు. | ||
2. చిర్రగోనె ఆట | 6 వ పేరా | 1. దీనికి మరొక పేరు గిల్లిదండ. |
2. ఇది చాలా పురాతనమైనది. | ||
3. తెలంగాణ పల్లెటూళ్ళలో దీనిని చిర్రగోనె అంటారు. | ||
4. భారతంలో కౌరవులు, పాండవులు ఈ ఆట ఆడారు. | ||
5. ఇది క్రికెట్టు లాంటిదే | ||
3. అక్ష క్రీడ | 7 వ పేరా | 1. ఇప్పుడు ప్రచారం తగ్గిపోయిన ఆట. |
2. మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట. | ||
3. పాచికల ఆట, దీనిని అక్షక్రీడ అని అంటారు. | ||
4. తరతరాలనుండి ప్రజలను ఆకర్షించింది. | ||
5. మన ప్రబంధాలలో రమణీయంగా మన కవులు వర్ణించారు. రుక్మిణీ శ్రీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తరహరివంశములో మనోహరంగా వర్ణించబడింది. |
2. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలను తయారు చేయండి.
మన రాష్ట్రంలో సాధనాశూరులు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు. వీరి ప్రదర్శన గ్రామం మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ప్రేక్షకులు చూస్తుండగానే తెల్లని వస్త్రాలతో ఒక గుడారం ఏర్పాటుచేసి, ప్రదర్శన ప్రారంభిస్తారు. గుడారం ముందు హాస్యగాడు నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని ప్రధాన సాధనాశూరుని కోరతాడు వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, తిరుపతి వెంకన్న, కొండగట్టు అంజన్న…. అంటూ హాస్యగాడు వివిధ దేవుళ్ళ పేర్లు చెబుతుంటాడు.
ప్రధాన సాధనాశూరుడు ఒక్కొక్క రాయిని ఒక్కో దేవునిగా అభివర్ణిస్తూ, మూసి ఉన్న గుడారంలో పెడతారు. చివరకు గుడారం తెరచి చూస్తే రాళ్ళకు బదులుగా దేవతల విగ్రహాలు ధూపదీపనైవేద్యాలతోసహా ప్రత్యక్షమైతాయి. దీంతో చూపరులు ఆశ్చర్యచకితులౌతార. వీరి ప్రదర్శనలో ప్రేక్షకుని తలపై పొయ్యిపెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళకుండలో మూడురంగుల ఇసుకను పోసి, విడివిడిగా మూడురంగుల ఇసుకను ముద్దలు ముద్దలుగా తీయడం, గుడారంలోని ఒక కర్రకు కట్టిన వ్యక్తి మరో కర్రకు మారడం వంటి అంశాలు అందరినీ ఆకర్షిస్తాయి.
ప్రశ్నలు :
1. మనరాష్ట్రంలో సాధనాశూరులు ఏ విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు?
2. ఇంద్రజాల ప్రదర్శనను ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
3. గుడారం ముందు నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని కోరేది ఎవరు?
4. ఏ దేవుళ్ళ పేర్లను హాస్యగాడు చెబుతాడు?
5. ఇంద్రజాల విద్యలో చూపరులను ఆకర్షించే అంశాలు ఏమిటి?
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
జవాబు.
స్త్రీల పాటలు : పొలములో కలుపుతీసే పడుచులు ఎద్దులను గాసే బాలకులు, సంపన్నుల ఇండ్లలో కావల్సినంత తీరక ఉన్న బాలికలు ఈ పాటలను పాడుతూ ఉంటారు. ఈ పాటల వల్ల ఊపు వస్తుంది. సంతోషం కలుగుతుంది. సేద్యము చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికిని కొన్ని ప్రాంతాలలో విశేషవ్యాప్తిలో ఉన్నాయి. వరంగల్లు జిల్లా మానుకోట తాలూకాలో రైతు యువకులు మక్కువతో జాజర పాటలు పాడుతారు. దీనివల్ల ఉత్సాహం కలుగుతుంది.
ఆడుతూ పాడుతూ పనిచేస్తే ఆనందం కలుగుతుంది. అలుపు, సొలుపు ఉండదు. పెండ్లిపాటలు, అప్పగింతపాటలు, మంగళ హారతులు, మేలుకొలుపులు, ఆలపించే పాటలు మన పల్లెటూళ్ళలోని పూర్వపద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నవి. పసిపిల్లల జోలపాటలవల్ల వారికి చక్కటి నిద్ర వస్తుంది. ఈ విధంగా స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఆనందం కలుగుతుంది.
ఆ) వినేవారి రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం” అంటే మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
జవాబు.
బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథలను చెప్పేవారు గంటల తరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింపచేస్తారు. కాని ప్రస్తుత పరిస్థితులలో వీటికి వ్యాప్తి తగ్గిపోయింది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను చెప్తారు. వీరగాథల పేరులోనే వీరరసం ఉంది. అది విన్నప్పుడు మన రక్తం ఉడుకుతుందని, మనము వాటిలో లీనమై పోతామని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు పల్నాటి వీరచరిత్ర (బాలనాగమ్మ కథలు) మొదలైనవి ఈ కోవకు చెందినవి.
ఇ) “కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి” అనే వాక్యాన్ని బట్టి వినోదాలకు, ఆర్థిక స్థితికి గల సంబంధాన్ని చెప్పండి.
జవాబు.
కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్ని సార్వజనికమైన అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండేవి. జనుల ఆర్థిక స్థితిని అనుసరించి క్రీడలు, వినోదాలు తెలుగుసీమలో పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల (వినోదాలు) కొన్ని వినోదాలు ఆర్థికపుష్టి కల శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. “ధనం మూలమ్ ఇదం జగత్” కదా? డబ్బే అన్నింటికి ఆధారం. డబ్బుతో ముడిపడి ఏపని అయినా సాగుతుంది. చిలుకలను పెంచి, వానికి బుద్దులు చెప్పి వినోదించుట తెలుగుసీమలోని పల్లెటూళ్ళలో (డబ్బున్న సుందరాంగులు వేడుకగా పెంచుట) మనకు కన్పించే గొప్ప విషయం.
ఈ) ఒకనాటి బాలికల ఆటలకు, నేటి బాలికల ఆటలకు గల తేడాలను చెప్పండి.
జవాబు.
ప్రాచీన బాలికల ఆటలు | నేటి బాలికల ఆటలు |
1. పాచికల ఆట దీనికి అక్ష క్రీడ అని పేరు. | 1. స్నేక్ ఇన్ లాడర్ అనే ఆట |
2. పచ్చీస్ ఆట | 2. చైనీస్ చెక్కర్ ఆట |
3. ఉయ్యాలలు ఆట | 3. కొలంబస్ (ఆట) |
4. గుర్రపు స్వారీ ఆట | 4. ఇప్పుడు కూడా గుర్రపు ఆట |
5. కబడ్డీ ఆట | 5. కబడ్డీ ఆట ఇప్పుడు ఉన్నది. |
6. శారీరక ఆటలు ఉండేవి. | 6. కంప్యూటర్ ఆటలు ఎక్కువ. |
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎంతో అవసరము.
- క్రీడలు, వినోదాలు మనిషిని ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తాయి.
- ఆలోచనాశక్తిని పెంచుతాయి.
- జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
- చురుకుగా ఉండేటట్లుచేసి, శారీరక స్పందనలు నియంత్రిస్తాయి.
- మనిషి బద్దకాన్ని దూరంగా ఉంచుతాయి.
- మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయి.
- సంస్కృతి తెలుస్తుంది.
- జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
- స్నేహితులు దగ్గరౌతారు.
- మానవ సంబంధాలు మెరుగుపడతాయి.
- శారీరక, మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు.
- పట్టుదల పెరుగుతుంది. ఆశయం ఏర్పడుతుంది.
ఈ విధంగా మానవ జీవితానికి క్రీడలు, వినోదాలు ఎంతో అవసరమని నా అభిప్రాయం.
2. ఆటకు పాటకు విడరాని చుట్టరికమున్నదనే రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి.
జవాబు.
ఆటకు పాటకు వీడరాని సంబంధం ఉంది. (చుట్టరికం)
- ఆటకు పాటకు శృతికి, లయకు ఉన్నంత సంబంధం ఉంది. పగలూ రాత్రి, గెలుపు ఓటములు, కష్టాలు సుఖాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నట్లు ఆటకు పాటకు చుట్టరికమున్నదని నా అభిప్రాయం.
- కబడ్డీ, కబడ్డీ అని కూత పెట్టితే ఉత్సాహంతో ఆడటానికి ఎదుటివాడిని గెలవటానికి ఉపయోగపడుతుంది.
- కో-ఆటకూడా అలాగే ఉంటుంది.
- బ్రతుకమ్మ (బతుకమ్మ) ఆటలో పాట ఆట కలిపి ఆడతారు. తెలంగాణాలో పెద్ద ఎత్తున జరిగే పండుగ ఇది.
- యక్షగానము (జక్కులు)లలో పాటలు పాడుతూ ఆడతారు.
ఉదాహరణ : బొబ్బిలికథ, బాలనాగమ్మ మొదలగునవి. - వీరగాధలను (జంగం కథలను చెపుతారు. ఈ విధంగా ఆటకు పాటకు వీడరాని చుట్టరికమున్నదని నేను నమ్ముతున్నాను.
IV. సృజనాత్మకత/ప్రశంస
మీకు తెలిసిన ఏవేని నాలుగు పద్యాలను బతుకమ్మ పాటగా మార్చి రాయండి.
ఉదా :
ఉప్పుకప్పురంబు ఉయ్యాలో ….
ఒక్క పోలికనుండు ఉయ్యాలో ….
చూడచూడరుచులు ఉయ్యాలో ….
జాడలువేరమ్మ ఉయ్యాలో….
1. ఒక్కో పూవు పూసే చందమామ (బతుకమ్మ పాట)
1. మేడిపండు చూడ ఉయ్యాలో ….
మేలిమై ఉండును ఉయ్యాలో ….
పొట్టవిప్పిచూడ ఉయ్యాలో ….
పురుగులుండ ఉయ్యాలో ….
2. అనగననగా రాగము ఉయ్యాలో….
అతిశయిల్లుచు నుండు ఉయ్యాలో ….
తినగ తినగ వేము ఉయ్యాలో ….
తియ్యనుండు ఉయ్యాలో ….
సాధనమున పనులు ఉయ్యాలో ….
సమకూరు ధరలోన ఉయ్యాలో….
3. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ఉయ్యాలో….
కొంచెమైన నదియు కొదువగాదు ఉయ్యాలో ….
విత్తనంబు మఱి వృక్షమునకు నెంత ఉయ్యాలో ….
2. గ్రామీణ కళాకారులను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
వరంగల్లు,
తేది : X X X X
ప్రియమైన మిత్రుడు రవికి,
నేను క్షేమం. నీవు క్షేమమేనా?
మన గ్రామాలు సంస్కృతికి పట్టుకొమ్మలు. మన గ్రామాలలో కళాకారులు ఆదరణ లేక ఆడేవారు, హరికథలు చెప్పేవారు, భాగోతులు ఒకప్పుడు మంచి బతుకు బతికి కాలం కలిసిరాక ఇలా ఉన్నారు. వారు తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తూ ఉంటే రామాయణ భారతాలు చాలా చక్కగా అర్థం అయ్యేవి. హరికథలు పిట్టకథలతో భలేగా చెప్పేవారు. (భాగోతులు) వివరంగా కథలను చెప్పేవారు. వారు సంస్కృతి పరిరక్షకులు. కొవ్వొత్తిలాగా తను వెలుగుతూ కాంతిని ఇచ్చినట్లే మనకు వినోదాన్ని పంచుతారు. మా నాయనమ్మ, తాతయ్యలు ఈ విషయాలు చెప్పారు. వాటిని ప్రత్యక్షంగా నేను చూశాను. నీవు నీకు తెలిసిన విషయాలు రాయగలవు. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !
ఇట్లు
నీ మిత్రుడు
నాగరాజు
చిరునామా :
పి. రవి
7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
మధిర, ఖమ్మం(జిల్లా)
తెలంగాణ (రాష్ట్రం)
2. నీవు దర్శించిన ఏదైనా పర్యాటక క్షేత్రం గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు.
నేను మా మామయ్యగారింటికి హైదరాబాద్లోని బోరబండకు వెళ్ళాను. మామయ్య హైదరాబాద్ (భాగ్యనగరం) నగరాన్ని చూపించారు. భాగ్యనగరం ఎంతో అందమైన నగరం. నన్ను ఎంతో ఆనందింప చేసింది. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతులు, మతాలు, భాషల కలయిక కేంద్రం. మేము చార్మినార్ను చూశాము. అది ఎత్తైన 4 స్తంభాలు, వాటి నిర్మాణం నాకు నచ్చింది. జంతుప్రదర్శనశాలకు వెళ్ళాం. రంగురంగుల పక్షులు, కీటకాలు, చిన్నచిన్న ప్రాణులు నన్ను ఆనందింప చేసాయి. సాలార్జంగ్ మ్యూజియం చాలా బాగుంది. ప్రాచీనకాలపు శిల్పాలు, వస్తువులు, ఆకృతులు, ఆయుధాలు చూశాం. తెల్లపాలరాతితో కట్టిన బిర్లామందిరం అద్భుతం. ప్లానెటోరియం చాలా నచ్చింది. టాంక్బండ్, బుద్ధుని విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, రామకృష్ణామిషన్(మఠం) మొదలైన అందమైన ప్రదేశాలను చూశాం. ఈ సెలవుల్లో చక్కగా సంతోషంగా గడిపాం.
V. పదజాల వినియోగం:
1. కింది పదాలకు అర్థాలను రాయండి.
ఉదా : మేలు కొలుపు : మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది.
అ) ఆసక్తి
ఆ) వీనుల విందు
ఇ) శోభ
ఈ) పురాతనమైన
ఉదా : మేలుకొలుపు = మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది.
అ) ఆసక్తి = __________
జవాబు.
ఆపేక్ష, ఆస
వాక్యప్రయోగం = ఆశలు గుర్రాల లాగా పరుగెడ్తాయి.
ఆ) వీనులవిందు = __________
జవాబు.
చెవికి ఇష్టమైనది
వాక్యప్రయోగం = సంగీతం వీనులవిందు చేస్తుంది.
ఇ) శోభ = __________
జవాబు.
వస్త్రభూషణాది ప్రయుక్తమైన కాంతి, కాంతి, ఇచ్ఛ
వాక్యప్రయోగం = తెలంగాణ సాధించాలనే ఇచ్ఛ (శోభ) నెరవేరింది.
ఈ) పురాతనమైన = __________
జవాబు.
బహుదినములనాటిది, జీర్ణించినది
వాక్యప్రయోగం : ఓరుగల్లుకోట పురాతనమైనది.
2. కింది వాక్యాలు చదివి సమాన అర్థం వచ్చే పదాలకింద గీత గీయండి.
అ) శ్రీరామనవమి పండుగ వైభవంగా జరిగింది. ఈ పర్వాన్ని చూడటానికి ప్రజలు తరలివచ్చారు. ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.
జవాబు.
పండుగ, పర్వం, వేడుక
ఆ) శ్రీజకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ. ఇష్టం తో బొమ్మలు గీసింది. ఆమె అభిరుచిని ఉపాధ్యాయులు అభినందించారు.
జవాబు.
ఆసక్తి, ఇష్టం, అభిరుచి
ఇ) రామయ్య గృహం నిర్మించుకోవాలనుకుని, ఇల్లుకు సరిపోయే స్థలం కొని, సదనం నిర్మించాడు.
జవాబు.
గృహం, ఇల్లు, సదనం
3. కింది వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గళ్ళలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి.
అ) పబ్బము : __________
జవాబు.
పండుగ
ఆ) పున్నమి : __________
జవాబు.
పౌర్ణమి
ఇ) జీతం : __________
జవాబు.
జీవితం
ఈ) కర్జము : __________
జవాబు.
కార్యము
VI. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది వాక్యాల్లో “సమాపక”, “అసమాపక క్రియలేవో గుర్తించి రాయండి.
అ) శిరీష అన్నం తిని, సినిమాకు వెళ్ళింది.
జవాబు.
అసమాపక క్రియ తిని సమాపక క్రియ వెళ్ళింది.
ఆ) రమ బడికి వెళ్ళి, చదువుకున్నది.
జవాబు.
అసమాపక క్రియ వెళ్ళి సమాపక క్రియ చదువుకున్నది.
ఇ) విజయ్ పుస్తకం చదివి, నిద్రపోయాడు.
జవాబు.
అసమాపక క్రియ చదివి సమాపక క్రియ నిద్రపోయాడు.
ఈ) భరత్ బొమ్మలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.
జవాబు.
అసమాపక క్రియ గీసి సమాపక క్రియ పెట్టాడు.
క్రియలనుబట్టే కాకుండా అర్థాన్నిబట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయని గమనించండి.
ఉదా :
అ) ఆహా ! ఎంత బాగుందో !
ఆ) ‘చేతులు కడుక్కో’
ఇ) మన రాష్ట్ర రాజధాని ఏది ?
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెట్లాగో చూద్దాం !
1. ఆహా ! ఎంత బాగుందో ! ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేస్తే వాక్యం ‘ఆశ్చర్యార్థక వాక్యం’.
2. ఇక రెండో వాక్యం ‘చేతులు కడుక్కో’. ఇది ‘విధిగా చేయాలి’ అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం ‘విధ్యర్థక వాక్యం’.
3. ఇక మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది ? ఇది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ‘ప్రశ్నార్థక వాక్యం’.
2. ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి.
అ) మీరు ఏ ఊరు వెళ్తున్నారు ?
జవాబు.
(ప్రశ్నార్థకం)
ఆ) ఈ పాఠం చదువు.
జవాబు.
(విధ్యర్ధకం)
ఇ) వసంత ఎంత బాగా పాడిందో !
జవాబు.
(ఆశ్చర్యార్థకం)
ఈ) మన పాఠశాలకు ఎవరు వచ్చారు ?
జవాబు.
(ప్రశ్నార్థకం)
ఉ) చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా !
జవాబు.
(ఆశ్చర్యార్థకం)
ఊ) పూలనన్నింటినీ హారంగా కూర్చండి.
జవాబు.
(విధ్యర్థకం)
ప్రశ్నార్థక వాక్యాల చివర ప్రశ్నార్థకం (?), ఆశ్చర్యార్థక వాక్యాల చివర ఆశ్చర్యార్థకం (!) ఉంటుంది.
ప్రాజెక్టు పని
మీ జిల్లాలోని ముఖ్యమైన / పెద్ద చెరువులు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? మొదలగు విషయాలను ఒక పట్టిక ద్వారా వివరించండి. నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
హైదరాబాద్ నగరంలోని, పరిసరాలలోని చెరువులు
చెరువు | ప్రదేశం |
1. ఆల్వాల్ చెరువు | సికింద్రాబాదికి 8 కి.మీ. దూరం. గణేష్ నిమజ్జనానికి వాడతారు. |
2. బంజార్ చెరువు | హమీద్ ఖాన్ కుంట అని మరొక పేరు. బంజారాహిల్స్లో ఉంది. 1930లో నిర్మించారు. |
3. దుర్గం చెరువు | రంగారెడ్డి జిల్లాలో ఉంది. రహస్య చెరువు అంటారు. |
4. నక్క సాగర చెరువు | జీడిమెట్ల చెరువు, కొల్లా చెరువు. కొంపల్లి దగ్గర ఉంది. |
5. హిమాయత్ సాగర్ | 20కి.మీ.దూరంలో ఉంది. ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. మూసీనదికి ఉపనది. |
6. హుస్సేన్ సాగర్ | ఇది హైదరాబాద్ లో ఉంది. హజ్రత్ హుస్సేన్షాహీవాలీ 1962లో నిర్మించారు. ఇదికూడా మూసీనదికి ఉపనది. |
7. మీర్ ఆలం చెరువు | హైదరాబాద్కు రిజర్వాయర్. తాగునీరుగా ఉపయోగం. నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గర |
8. ఉస్మాన్ సాగర్ | ఇది గండిపేటలో ఉంది. 46కి. మీ. దూరంలో ఉంది. చివరి నిజాం కాలంలో నిర్మించారు. |
9. రుక్నుఉద్దౌలా చెరువు | ఇది హైదరాబాద్లో ఉంది. 104 ఎకరములలో ఉంది. |
10. సరూర్ నగర్ చెరువు | హైదరాబాద్లో ఉంది. 1626లో నిర్మించారు. 99 ఎకరాలలో ఉంది. వ్యవసాయానికి, త్రాగునీరుగా ఉపయోగపడేది. |
11. షామీర్పేట | ఇది కృత్రిమ చెరువు. సికింద్రాబాద్ నుండి 24కి. మీ. దూరంలో ఉంది. పక్షుల సందర్శనకు ఇక్కడకు వస్తారు. |
ఈ పై పట్టిక ఆధారంగా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులను వివరించాను. ఇవి అన్నీ చరిత్రలో ఎంతో గొప్ప చెరువులు. తెలంగాణ ప్రభుత్వం “మిషన్ కాకతీయ” పేరుతో చెరువులను పునరుద్ధరించటానికి పథకం చేపట్టింది.
(లేదా)
గ్రామీణ వేడుకలు లేదా క్రీడలకు సంబంధించిన పాట/గేయం/కథ/వ్యాసం సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
1వ పాట :
(పల్లవి మాత్రమే)
ఎవ్వరో ఈ బిడ్డలు నింగిగా నెలవంకలు
ఎవ్వరో ఈ కూనలు అడవి మల్లెపూలు
వాళ్ళ తూటాలు నాకు శాపమయ్యాయిరో || ఎవ్వరో ||
2వ పాట :
కట్టు కట్టర బండి కాడెడ్ల బండి || 2 ||
గుంజు గుంజర బండి కాడెడ్ల బండి
ఎత్తు ఎత్తుర బండి కాడెడ్లా బండి
ఎత్తుర పిలగో ….. నాగులయ్యా …..
(ఎడ్లబండి పాట ఇది)
ఎత్తర పిలగో రాములయ్య …..
3వ పాట :
పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి
నిండుశక్తిని జాపి దుంకు దుంకుర దుంకో ॥
కాశ్మీరం చూడరో కథ మారిపోయెరో
అస్సామీనాడురో నెత్తురు మడుగాయరో
ముడుచుకు కూర్చుంటేరో ముక్కలేను దేశమ్మురో॥
విశేషాంశాలు
1. ఇంద్రజాలం : ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి చూపే ప్రదర్శనా విద్య. ఆంగ్లంలో దీనిని మ్యాజిక్ అంటాం. మల్లయుద్ధం : దేహదారుఢ్యం కలిగిన వస్తాదులు ఒకరితో ఒకరు కలబడే బహుసంబంధ యుద్ధ విద్య.
2.యక్షగానం : జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడేవి యక్షగానాలు. ఇదొక ప్రదర్శనా కళ. ఇది నాటకానికి పూర్వరూపం.
3. కొరవి జాతర : వరంగల్ జిల్లా మానుకోట సమీపంలోని కొరవి గ్రామంలో జరిగే జాతర. ఇక్కడ వీరభద్రస్వామి పూజలందుకొంటాడు.
4. ఐనవోలు జాతర : వరంగల్ జిల్లా మామునూరు సమీపంలోని ఐనవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుంది. ఐనవోలు మల్లన్న జాతరగా జనవ్యవహారం.
5. మేడారం జాతర : ప్రతి మూడు సంవత్సరాల కొకసారి వరంగల్ జిల్లాలో జరిగే జాతర. ఇక్కడ గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను కొలుస్తారు. భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇది.
6. కోలాటం : ఇదొక బృందనాట్యవిశేషం.
TS 7th Class Telugu 8th Lesson Important Questions గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు
కఠిన పదాలకు అర్ధాలు
- ఆవాసం = నివాసం
- నిలయం = నివాసం
- సీమ = ప్రాంతం
- సౌందర్యం = అందం
- గోచరించుట = కనబడుట
- మధురము = తియ్యనైనది
- అతిశయోక్తి = ఉన్నదానికంటె ఎక్కువగా చెప్పుట
- అభిరుచి = కోరిక
- ఆదరణీయం = ఆదరించదగినది
- క్రీడలు = ఆటలు
- రక్తి = కోరిక
- పబ్బము = పర్వము
- సర్వజనులు = సమస్త ప్రజలు
- మనోరంజనం = మనస్సును సంతోషపెట్టేది
- సేద్యము = వ్యవసాయము
- మక్కువ = అభిమానం
- మేలుకొలుపు = నిద్రలేపు
- వీనులు = చెవులు
- సుప్రసిద్ధము = బాగా ప్రసిద్ధి పొందినది
- ఉల్లాసము = సంతోషం
పర్యాయ పదాలు
- ఆవాసము = నివాసము, వాసము, నిలయము, నెలవు
- భాష = పలుకు, మాట, వచనం, ఉక్తి
- సూక్తులు = సుభాషితాలు, సుద్దులు
- ఆనందం = సంతోషం, హర్షం, ముదం, మోదం
- కావ్యము = కృతి, గ్రంథము, ప్రబంధం
- క్రీడ = ఆట, కేళి, గొండ్లి, గొండిలి
- సేద్యము = వ్యవసాయము, కృషి, కిసుక, కర్షణము
- కత = కథ, ఆఖ్యాయిక, కథానిక, గాథ
- వేగం = శీఘ్రం, త్వరితం, లఘువు, వేగిరం
- జగము = జగతి, జగత్తు, లోకం, ప్రపంచం
ప్రకృతులు – వికృతులు
ప్రకృతి – వికృతి
- భాష – బాస
- కార్యము – కర్జము
- కావ్యము – కబ్బము
- సీత్యము – సేద్యము
- జగత్తు – జగము, జాగా
- జీవితము – జీతము
- కథ – కత, కద
- వేగం – వేగిరం, వేగ, వే, వేగి
I. క్రింది ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి.
1. ఇళయరాజా సంగీతం వీనులవిందు చేస్తుంది? (దీనికి అర్థం గుర్తించండి.)
a) కి ఇష్ట
b) కంటికి ఇష్టం
c) తలకు ఇష్టం
జవాబు.
a) కి ఇష్ట
2. మేడారం జాతర వల్ల ప్రకృతికి శోభ వచ్చింది (అర్థం గుర్తించండి.)
a) చీకటి
b) కాంతి
c) నల్లన
జవాబు.
b) కాంతి
3. మితిమీరిన ఆశ ఉండకూడదు. (అర్థం గుర్తించండి.)
a) ఆరోగ్యం
b) శరీరం
c) ఆసక్తి
జవాబు.
c) ఆసక్తి
4. ఓరుగల్లు కోట శిల్పాల అందం చూడముచ్చటగా ఉంది. (అర్థం గుర్తించండి.)
a) సౌందర్యం
b) వికారం
c) సాకారం
జవాబు.
a) సౌందర్యం
5. తెలంగాణ భాష మధురం. తెలంగాణ మాట సుమధురం. తెలంగాణ వచనం మధురాతి మధురం. (పై వాక్యంలో పర్యాయ పదాలు గుర్తించండి.)
a) భాష, మాట, వచనం
b) మధురం, సుమధురం, మధురాతి మధురం
c) తెలంగాణ, వచనం, మధురం
జవాబు.
a) భాష, మాట, వచనం
6. క్రీడలు శరీరానికి ఉల్లాసం ఇస్తాయి. ఆటలు సృజనాత్మకశక్తిని ఇస్తాయి. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) ఉల్లాసం, సృజనాత్మకత
b) శరీరం, ఆటలు
c) క్రీడలు, ఆటలు
జవాబు.
c) క్రీడలు, ఆటలు
7. రవి గృహం కొత్తది. రవి ఇల్లుకు రంగులు వేసారు. రవి సదనం నగరంలో ఉంది. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) రవి, కొత్తది
b) నగరం, సదనం
c) గృహం, ఇల్లు, సదనం
జవాబు.
c) గృహం, ఇల్లు, సదనం
8. శ్రీజకు క్రీడలంటే ఆసక్తి. ఆమె అభిరుచిని మెచ్చుకున్నారు. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) ఆసక్తి, అభిరుచి
b) శ్రీజ, ఆమె
c) క్రీడలు, ఆమె
జవాబు.
a) ఆసక్తి, అభిరుచి
9. తెలంగాణలో దసరా పండుగ బాగా చేస్తారు. (వికృతి గుర్తించండి.)
a) పరువం
b) పౌర
c) పబ్బం
జవాబు.
c) పబ్బం
10. కార్యములు సాధనమున సమకూరును. (వికృతి గుర్తించండి.)
a) కర్ణము
b) కావ్యము
c) సాహిత్యం
జవాబు.
a) కర్ణము
11. జీవితం అందమైనది (వికృతి గుర్తించండి.)
a) జీవితము
b) జీతం
c) గీతం
జవాబు.
b) జీతం
12. వ్యవసాయదారులు సేద్యము చేస్తారు. (ప్రకృతి రాయండి.)
a) సీత్యము
b) గీతము
c) స్వేదము
జవాబు.
a) సీత్యము
13. తెలంగాణలో ఒగ్గుకథ చెపుతారు. (వికృతి రాయండి.)
a) కావ్య
b) కత
c) కర్ణం
జవాబు.
b) కత
14. శ్రావ్య సినిమా చూసి నిద్రపోయింది. (దీనిలో అసమాపక క్రియ గుర్తించండి.)
a) చూసి
b) పోయింది
c) శ్రావ్య
జవాబు.
a) చూసి
15. శృతి పుస్తకం చదివి ఇంటికి వెళ్ళింది. (దీనిలో సమాపక క్రియ)
a) వెళ్ళింది
b) చదివి
c) శృతి
జవాబు.
b) వెళ్ళింది
16. విజయశ్రీ పాఠం చెప్పి, ఖమ్మం వెళ్ళింది. (అసమాపక క్రియ గుర్తించండి.)
a) చెప్పి
b) వెళ్ళింది
c) విజయశ్రీ
జవాబు.
a) చెప్పి
17. రవి బొమ్మలు గీసి, వాటిని అమ్మాడు. (సమాపక క్రియ గుర్తించండి.)
a) గీసి
b) అమ్మాడు
c) రవి
జవాబు.
b) అమ్మాడు
18. రాజు పరీక్ష రాసి, మంచి మార్కులు పొందాడు. (అసమాపక క్రియ గుర్తించండి.)
a) రాజు
b) పొందాడు
c) రాసి
జవాబు.
c) రాసి
19. ఆహా! ఎంత బాగుందో! (ఇది ఏ వాక్యం)
a) విధ్యర్థకం
b) ఆశ్చర్యార్థకం
c) ప్రశ్నార్థకం
జవాబు.
B) ఆశ్చర్యార్థకం
20. మన రాష్ట్ర చిహ్నం ఏది? (ఇది ఏ వాక్యం)
a) ప్రశ్నార్థకం
b) ఆశ్చర్యార్థకం
c) విధ్యర్థకం
జవాబు.
a) ప్రశ్నార్థకం
21. నీవు పాఠం చదువు. (ఇది ఏ వాక్యం)
a) ప్రశ్నార్థకం
b) ఆశ్చర్యార్థక
c) విధ్యర్థకం
జవాబు.
c) విధ్యర్థకం
I. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గౌతమి, కృష్ణవేణులకు ఆవాసమై, పాడిపంటలకు నిలయమైన తెలుగుసీమలోని పల్లెపట్టులలో కళాసౌందర్యము అడుగడుగున గోచరిస్తుంది. తెలుగువారి భాష యెంత మధురమైనదో, వారి సామాజిక జీవనమంత సుందరమైనదని చెప్పితే అతిశయోక్తి ఆవంతయునుగాదు. భారతదేశమంతటిలో నున్నట్లే తెలుగుసీమలో గూడ నూటికి తొంబదిపాళ్ల జనులు పల్లెటూళ్ళలోనున్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నియో ఇక్కడ కలవు. ఈ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది.
1. తెలుగుసీమ ఏ నదులకు ఆవాసమైనది?
జవాబు.
గౌతమి, కృష్ణవేణులకు తెలుగుసీమ ఆవాసమైనది.
2. తెలుగుసీమలోని పల్లెపట్టులు దేనికి నిలయము?
జవాబు.
తెలుగుసీమలోని పల్లెపట్టులు పాడిపంటలకు నిలయం.
3. తెలుగుభాష ఎటువంటిది?
జవాబు.
తెలుగుభాష మధురమైనది.
4. (భారతదేశంలో) తెలుగుసీమలలో ప్రజలు ఎంతశాతం పల్లెటూళ్ళలో ఉన్నారు?
జవాబు.
(భారతదేశం) తెలుగు సీమలలో నూటికి తొంభైశాతం (జనులు) ప్రజలు పల్లెటూళ్ళలో ఉన్నారు.
5. క్రీడావినోదాలలో ఏమి ప్రతిబింబిస్తున్నది?
జవాబు.
క్రీడా వినోదాలలో సుకుమార అభిరుచి ప్రతిబింబి స్తున్నది.
II. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆటలకూ పాటలకూ వీడరాని చుట్టరికమున్నది. తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసము కలిగించే వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాలనుండి ఉపాసించిన కళ. ఒక సన్ననిబట్టను తెరగాగట్టి ఆ తెరవెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలు గట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడింతురు. ఈ ఆటను ఆడించే నిపుణులైనవారు కొందరు, మన పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ మన దేశీయులలో ప్రతి రక్తకణము నందు జీర్ణించిన కథలు.
1. వేటికి వేటికి వీడరాని చుట్టరికమున్నది?
జవాబు.
ఆటలకూ, పాటలకూ వీడరాని చుట్టరికమున్నది.
2. ఆటలు మనకు ఏమి కల్గిస్తాయి?
జవాబు.
ఆటలు, పాటలు మనకు ఉల్లాసాన్ని కల్గిస్తాయి.
3. తెలుగువారి ప్రత్యేకత కల్గించే ఆట ఏది?
జవాబు.
తెలుగువారికి ప్రత్యేకత కల్గించే ఆట తోలుబొమ్మలాట.
4. తోలుబొమ్మలాట ఎట్లా ఆడిస్తారు?
జవాబు.
ఒక సన్నని బట్టను తెరగాకట్టి ఆ తెరవెనుక పెద్ద దివిటీలు వెలిగిస్తారు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ ‘దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడిస్తారు.
5. తోలుబొమ్మలాటలు ఎక్కువగా వేటికి సంబంధించినవి?
జవాబు.
తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ, భారత కథలకు సంబంధించినవి.
III. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఈ తోలుబొమ్మలాటవలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని గూడ పిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రిందటివరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాలనించి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపజేస్తున్న వినోదాలు, వేడుకలు.
ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. భజనమండలులను స్థాపించి, వారానికొకసారి (ఏ శనివారమునాటి సాయంత్రమో) ప్రజలొకచోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదము. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలికథ, బాలనాగమ్మకథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు గంటలతరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింపజేస్తుంటారు. కాని ఈ నాటి మారిన పరిస్థితులలో వీటికన్నింటికీ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను జెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్పుచుందురు.
1. ఈ తోలుబొమ్మలాటవలె బహుళ ప్రచారం పొందినవి ఏవి?
జవాబు.
ఈ తోలుబొమ్మలాట వలె బహుళప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు.
2. యక్షగానాలు ఆడేవారిని ఏమంటారు?
జవాబు.
యక్షగానాలు అనే వీథి నాటకాలను ఆడేవారిని జక్కులని అంటారు.
3. ఏవి తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు?
జవాబు.
యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, భాగోతాలు మన తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు.
4. ఆటపాటలలో చేరే వినోదాలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు.
ఆటపాటలలో చేరే వినోదాలకు బొబ్బిలికథ, బాల నాగమ్మకథ మొదలైనవి ఉదాహరణలు.
5. కథలను చెప్పేవారు వీరగాథలను ఎలా చెపుతారు?
జవాబు.
కథలను చెప్పేవారు వీరగాథలను వినేవారి రక్తం ఉడుకెత్తునట్లుగా చెపుతారు.
IV. గద్యం చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి.
పల్లెటూళ్ళలో ఉయ్యాలలూగుట బాలబాలికలేగాక పెద్దలు గూడ మిక్కిలి మక్కువ జూపించే క్రీడ. ఏదోవిధమైన ఉయ్యాలను మనము అనేక గృహాలలో చూడవచ్చును. ఈ మధ్య యితర క్రీడల వలెనే, సన్నగిల్లిపోతున్నప్పటికినీ గుర్రపుస్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ.
మల్లయుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాలనుండి మనవారు అభిమానించి, ప్రోత్సహించిన క్రీడలు. తెలుగుదేశంలోని జమీందార్లు ఇందులో ప్రవీణులైనవారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించిరి. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన యీ మల్లయుద్ధ ప్రదర్శనలు కుస్తీలు జరిపించి, వారికి బహూకరించే ఆచారము ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళలో ఉండేది. కత్తిసాము, కట్టెసాములలో ప్రవీణులైనవారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును.
ప్రశ్నలు
1. బాలబాలికలేగాక పెద్దలు కూడ మిక్కిలి మక్కువ జూపించే క్రీడ ఏది?
2. గ్రామాలలో బాగా అభిమానించే క్రీడ ఏది?
3. మనవారు, అభిమానించి ప్రోత్సహించిన క్రీడ లేవి?
4. ఏ పండుగ రోజు మల్లయుద్ధ ప్రదర్శనలు ఇస్తారు?
5. వేటిలో ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును?
పాఠం ఉద్దేశం
నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా, ఇంట్లో కూర్చొని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏయే వినోదసాధనాలు ఉండేవో. వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం “రేడియో ప్రసంగం” ప్రక్రియకు చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు.
గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడావినోదాల గురించి
దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు.
కవి పరిచయం
ద్వారా ప్రసారం ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహెూద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు. వరంగల్ సమీపంలోని దేశాయిపేట గ్రామంలో వేంకటచలపతిరావు, ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూలు విద్య హన్మకొండలో పూర్తిచేశాడు. 1939లో బి.ఏ. పట్టా, 1942-44 మధ్యకాలంలో న్యాయశాస్త్రపట్టాలను పొందాడు. 1946లో ‘శోభ’ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా 25-08-1917 ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, 08-06-1993 తెనుగు సాహితి, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. “ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు” ఈయన ఆత్మకథ.
ప్రవేశిక
గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగ కనుమరుగైనాయి. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా, కొన్ని సందర్భాలలో జూదంగా పరిణమించాయి. పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో, చరవాణి (సెల్ఫోన్)లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యాతను ఇవ్వడంలేదు. పాశ్చాత్య వికృతనృత్యాలు, ప్రసారమాధ్యమాలలోని విపరీతపోకడల ప్రవాహంలో కొట్టుకపోతూ ఇరుగుపొరుగు వారి సంబంధాలకు దూరమౌతున్నారు. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఆటలు, వినోదాల గూర్చి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆటపాటలు మన సంస్కృతిలో భాగం, పూర్వం గ్రామాలలో ఎట్లాంటి ఆటలు, వినోదాలు ఉండేవో తెలుసుకుందాం.
నేనివి చేయగలనా?