TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

Telangana SCERT 7th Class Telugu Guide Telangana 6th Lesson ప్రేరణ Textbook Questions and Answers.

ప్రేరణ TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana

చదవండి ఆలోచించండి చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతీదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహనివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను, సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్న 1.
ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది?
జవాబు.
ప్రజ్ఞకు అనేక సందేహాలున్నాయి. పక్షుల్లా మనుష్యులు ఎందుకు ఆకాశంలో ఎగరలేకపోతున్నారు అనీ, గబ్బిలాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి అనీ ఇలా … చాలా సందేహాలున్నాయి. వాటినన్నింటినీ శాస్త్రవేత్తను అడిగి ఉంటుంది.

ప్రశ్న 2.
శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు?
జవాబు.
ప్రజ్ఞకు వచ్చిన సందేహాలన్నింటికి శాస్త్రవేత్త విసుగుకోకుండా జవాబులు చెప్పి ఉంటాడు.

ప్రశ్న 3.
ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?
జవాబు.
నేను కూడా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను. శాస్త్రవేత్త కావడానికి బాగా చదువుకోవడమేగాక పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. నేను చదివిన విషయాలను పరిసరాలతో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీక్షతో, కృషితో, శ్రద్ధతో బాగా చదువుకొని శాస్త్రవేత్తను అవుతాను. ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 4.
అతిసామాన్య కుటుంబంలో జన్మించి, పరిశోధన సంస్థలకు ప్రాణంపోసి ‘భారతరత్న’ బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా?
జవాబు.
తెలుసు. ఆయనే డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం. మన మాజీ రాష్ట్రపతి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు’ అంటే మీకేమర్థమైంది?
జవాబు.
నా విధిని నేనే వ్రాయగలను అనే పదానికి నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకోగలను అనే విషయం అర్థమైంది. నేను భవిష్యత్తులో నా జీవితంలో సాధించాలనుకొనే లక్ష్యాలను నేను చిన్నప్పుడే నిర్ణయించుకొని ఆ దిశగా కష్టపడితే తప్పక గమ్యాన్ని చేరుకుంటాను అని తెలుసుకున్నాను.

ప్రశ్న 2.
మీరు మీ కుటుంబసభ్యులకెప్పుడైనా సహాయం చేశారా? ఏ సందర్భంలో ఏం చేశారు?
జవాబు.
నేను నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంటాను. ఒకసారి నా సోదరుడు, నేను ఆటలు ఆడుకొని ఇంటికి వస్తున్నాము. దారిలో నా తమ్ముడు గుంటలో పడిపోయాడు. లేపడం నావల్ల కావడం లేదు. ఒక ప్రక్క అతనిని వదలకుండానే గట్టిగా చాలాసేపు కేకలు వేశాను. చివరికి ఎవరో వచ్చి అతడిని బయటకు తీశారు. నాకెంతో భయం వేసింది. కాని నా తమ్ముడు నాకు దక్కాడని ఆనందం కల్గింది.

ప్రశ్న 3.
ఆ కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనేవి విజయాన్నిస్తాయి కదా! వీటిపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు.
మనకు ఏమి కావాలో వాటిని నిర్ణయించుకొని కోరుకోవాలి. కోరికలు తీరాలంటే అదే పనిగా సాధన చేయాలి. నమ్మకం అనేది ఒకరిపై ఒకరికి కలిగే అభిప్రాయం. ఇతరులకు నమ్మకం కలగాలంటే ప్రతివారు నిజాయితీ కలిగి ఉండాలి. నిజాయితీ లేకపోతే ఎవరూ ఎవరినీ నమ్మరు. ఆశపెట్టుకోవడం అంటే మనకు భవిష్యత్తులో జరుగబోయే వాటిపై ఆశగా ఊహించడం. ప్రతివారు మంచి జరుగుతుందని ఆశగా ఊహించాలే కాని నిరాశగా ఉండకూడదు. అపుడే విజయాలు సాధించగలం.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 4.
మీ జీవిత లక్ష్యం ఏమిటి? అది సాధించడానికి ఏం చేస్తారు?
జవాబు.
అబ్దుల్కాలాం స్ఫూర్తితో నేను శాస్త్రవేత్త కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నేను పాఠశాల స్థాయి నుండే పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర విషయాలను కూడా నేర్చుకుంటున్నాను. నిరంతరం నా జీవిత లక్ష్యాన్ని మనసులోనే తలచుకొని దానిని సాధించడానికి ఏఏ చదువులు, ఎలా చదవాలో ఆలోచిస్తాను. కలాం జీవితంలో ఎలా కష్టపడ్డారో పాఠంలో తెలుసుకొన్న వాటిని నా జీవితంలో నేను కూడా అవలంబించి నా గమ్యాన్ని తప్పక చేరుతాను.

ప్రశ్న 5.
‘తనను తాను తెలుసుకోవడం’ అంటే మీకేమర్థమైంది?
జవాబు.
తనను తాను తెలుసుకోవడం అంటే ప్రతివ్యక్తి తనలోని ఆలోచనలు, బలమైన అంశాలు, బలహీన విషయాలు గుర్తించడం. తను ఎలా జీవిస్తున్నాడు. ఇంకా మెరుగ్గా ఎలా ఉండగలడు, అనే అంశాలు గమనించడం. ఆయా వ్యక్తులు తన గురించి తాను తెలుసుకోవాలి! అపుడే వారి భవిష్యత్తును గూర్చి ఆలోచించే శక్తి వారికి ఏర్పడుతుందని అర్థమైంది.

ప్రశ్న 6.
మిమ్మల్ని మీ ఉపాధ్యాయులెట్లా ప్రోత్సహిస్తారో చెప్పండి.
జవాబు.
మమ్మల్ని మా ఉపాధ్యాయులు అన్ని అంశాలు నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు. తెలియని విషయాలు తెలుపుతారు. మాలోని చీకటి అనే తెలియని దానిని పోగొట్టి వెలుగు అనే జ్ఞానాన్ని మాలో నింపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలను అనుసరించి ఉపాధ్యాయులు మా జీవిత లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశిస్తారు.

ప్రశ్న 7.
మా అందరికీ ప్రేరణ మా ఉపాధ్యాయులే. ఆ ‘స్కాలర్షిప్పే నా జీవనభాగ్యరేఖ’ అని కలాం అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
కలాంగారు ఇంజనీరింగ్ కోర్సు చదివే రోజులలో వారి డైరెక్టర్ ఏరోడైనమిక్ డిజైన్ బాధ్యత కలాంగారికి అప్పగించడం జరిగింది. ఆ పని నిరాశాజనకంగా ఉండడంతో ప్రొఫెసర్ గారు కలాంగారికి 3 రోజుల సమయమిచ్చి పూర్తిచెయ్యకపోతే స్కాలర్షిప్పు ఆపి వేస్తానన్నారు. కలాంగారు అప్పుడు ఆ స్కాలర్ షిప్పే తన జీవన భాగ్యరేఖ అని, ఆ పని పూర్తి చెయ్యకపోతే తన చదువు ఇబ్బందుల్లో పడుతుందని, తప్పక డిజైన్ పూర్తిచేయాలని భావించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పనిపూర్తి చేసి ఆ ప్రొఫెసర్ గారి మన్నన పొందాడు. తను కష్టపడకపోతే తాను ఇబ్బందులు పడతానని భావించడంపై వాక్యంలోని ఆంతర్యం.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రశ్న 8.
‘దారిచూపే దీపం’ అనే మాటను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు.
చీకటిలో వెలుగు చూపేది దీపం. దీపపు కాంతులు లేనిదే చీకటిలో వేటినీ చూడలేము. జీవితంలో కూడా అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే వారిని దారిచూపే దీపంగా భావిస్తాం. తల్లిదండ్రులు, స్నేహితులు ప్రతివారికి దారిచూపే దీపాలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
ప్రొఫెసర్ కలాంను ముందువరుసలో కూర్చోమన్నాడుకదా! కలాం స్థానంలో మీరుంటే ఏ విధంగా అనుభూతి చెందేవారు?
జవాబు.
కలాంగారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్య పూర్తి అయిన తర్వాత గ్రూప్ ఫోటో సమయంలో ప్రొఫెసర్ స్పాండర్ కలాంను తనతోపాటు ముందు వరుసలో కూర్చోమన్నారు. కలాం స్థానంలో నేనుంటే చాలా గర్వంగా, ఆనందంగా భావించే వాడిని. నన్ను అందరిముందు గుర్తించి, ప్రత్యేకంగా విలువ ఇవ్వడంగా భావిస్తాను. ఆ ప్రత్యేకత నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

ఇవి చేయండి

1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
‘ప్రేరణ’ అనే పాఠం పేరు వినగానే నీకేమనిపిస్తుంది?
జవాబు.
‘ప్రేరణ’ అంటే కదిలించే వ్యక్తి. ఎవరి మనసునైనా ఆకర్షించి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చి వారికి కొత్త స్ఫూర్తినిచ్చి కొత్తవిషయాల వైపు నడిపించి, కొత్తవిషయాలు కనుక్కోగలిగేటట్లు ప్రోత్సహించేటట్లు ప్రోత్సహించే శక్తిప్రేరణ.
ఈ పాఠం పేరు వినగానే తప్పకుండా ఇది ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన చరిత్ర అని నాకనిపించింది. ఆ వ్యక్తి క్రీడారంగంలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ, కళాసాహిత్యరంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, విద్యావైజ్ఞానిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తికానీ, శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రసిద్ధుడైన వ్యక్తి కానీ అయి ఉంటాడనిపించింది. ఆ వ్యక్తి గురించి త్వరగా చదివి తెలుసుకోవాలని అనిపించింది.

ప్రశ్న 2.
అబ్దుల్ కలాం చదువుకున్న రోజుల్లోని విద్యావిధానం గూర్చి మీ మిత్రులతో చర్చించండి. :
జవాబు.
ప్రవీణ్, లక్ష్మణ్ : మణి! అబ్దుల్ కలాం ఏ కాలంలో చదువుకున్నాడంటావ్?

మణి : బ్రిటిష్వారు మనదేశాన్ని పాలించే రోజులలోనే. అప్పటికింకా మనకు స్వరాజ్యం లేదు.

అంజలి, జయంత్ : అవును. ఆయన హైస్కూల్ చదువు రామనాథపురంలో జరిగింది.

శంకర్ : ఆయన పుట్టింది ధనుష్కోటిలో కదా! మరి రామనాథపురంలో చదవడమేమిటి?

అంజలి : ఇప్పటిలాగా అప్పుడు ఇన్నిన్ని పాఠశాలలు, కళాశాలలు లేవు. ఎలిమెంటరీ పాఠశాలలు కూడా చాలా తక్కువ ప్రదేశాలలో ఉండేవి. పై

చదువులు చదవాలంటే పొరుగూరుగాని, దగ్గరలో ఎక్కడ విద్యాలయం ఉంటే అక్కడికి వెళ్ళి చదువుకోవలసిందే.

మహేష్ : ఔను గాంధీగారు, పటేల్, చిలకమర్తివారు ఇలా అందరూ ఉన్న ఊరు విడిచి వెళ్ళి చదువుకున్నవారే.

రమణ : ఇప్పటిలాగా అప్పుడు కిండర్ గార్టెన్ చదువులు, ఇంగ్లీషుమీడియం చదువులు ఉండేవి కాదు. ప్రాంతీయ పాఠశాలలో ప్రాంతీయ భాషలోనే
విద్యాభ్యాసం జరిగేది.

శంకర్ : ఆంగ్లేయుల పాఠశాలలు, కళాశాలలో మాత్రం తప్పకుండా ఆంగ్లంలో చదవాల్సిందే. అంతేకాదు హయ్యర్ సెకండరీ క్లాసులలో కూడా ప్రాంతీయ భాష ఒక్కటిమాత్రం ఆ భాషలో చదవవచ్చు. తక్కిన సబ్జక్టులన్నీ ఆంగ్లంలోనే చదవాలి.

ప్రవీణ్ : అందుకనేనా ఎ.పి.జె. అబ్దుల్కాలాం అన్నిచోట్ల చదువవలసి వచ్చింది.

అంజలి : చూశారా! విద్యావిధానంలో ఆరోజుకీ ఈరోజుకీ ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో!

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాలను పూర్తిగా రాయండి.

(అ) కలామ్ తత్త్వశాస్త్ర గ్రంథాలు చదవడం
జవాబు.
నేను సెంటోసెఫ్ నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్త్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. దాదాపుగా ఆ సమయంలోనే భౌతికశాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది.

(ఆ) విజయానికి సూత్రాలు మూడు
జవాబు.
నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవితగమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు, జీవితంలో విజయం పొందడానికీ ఫలితాలు సాధించడానికీ నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది- అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) సోదరి సహాయం
జవాబు.
ప్రవేశానికి ఎంపికైతే అయ్యానుగానీ అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారుగాజులు, గొలుసు కుదువపెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంలో ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికున్న ఏకైన మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే.

(ఈ) ప్రొఫెసర్ పక్కన కూర్చుని ఫోటో దిగడం
జవాబు.
ఎమ్.ఐ.టికి. సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొ. స్పాండర్కి సంబంధించిందే. వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందుకూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో నిల్చొన్నాము. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియచూశాడు. నేను మూడో వరుసలో వెనుక నిల్చున్నాను. ‘రా నాతోపాటు ముందుకూర్చో’ అన్నాడు. నేను ప్రొ. స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. ‘నువ్వు నా బెస్టు స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది’ అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొ.స్పాండర్తో కలసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. ‘దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు’ అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ.

2. కింది పేరా చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.

భారతీయ జాతీయోద్యమ నాయకులలో బిపిన్చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయనిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులనూ పండితులను, తత్త్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనూ అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

(అ) బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు (ఒప్పు)
(ఆ) బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి (తప్పు)
(పై పేరాలో బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు నిచ్చాడు అని ఉన్నది. అంటే ఆయన దానిని సమర్థిస్తున్నాడు. ప్రశ్నలో వ్యతిరేకిస్తున్నాడు అని ఉన్నది కనుక ఇది (తప్పు)
(ఇ) బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆహ్వానించాడు (ఒప్పు)
(ఈ) బిపిన్ చంద్రపాలికి స్వాతంత్రోద్యమ కాంక్ష ఉంది. (ఒప్పు)
(ఉ) బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. (ఒప్పు)

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

(అ) ‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం తండ్రి తన కుమారునితో అన్న మాటలివి. విజ్ఞానం కలిగి ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు. విజ్ఞానం అంటే ఇతరులను గురించి తెలుసుకోగలిగే శక్తి. మనం అందరితోనూ స్నేహంగా సత్సంబంధాలు కలిగి ఉండాలంటే వారిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. అలాగే చెడ్డవారి నుంచి దూరంగా ఉంటే ప్రమాదాలను తప్పించుకోగలుగుతాం. విజ్ఞానం కలవాడు ఇతరులను గురించి ఆలోచించగలిగినట్లే తనను గురించి తాను ఆలోచించగలుగుతాడు. అదే వివేకమంటే. వివేకవంతుడు తప్పక విజ్ఞానియై ఉంటాడు. కాని విజ్ఞానమున్నంత మాత్రాన వివేకి కావాలని లేదు. కాబట్టి తప్పకుండా వివేకం కలిగి ఉండాలని నా అభిప్రాయం.

(ఆ) ‘కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం’ అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి ?
జవాబు.
కోరిక అనేది ప్రతివ్యక్తికీ ఉంటుంది. ఐతే కోరిక బలంగా ఉంటేనే మనిషి దాన్ని తీర్చుకోడానికి ప్రయత్నిస్తాడు. అందుకే కోరిక గట్టిదై ఉండాలి. నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. కోరికను సాధించుకోగలను అనే గట్టి పట్టుదలతో తన మీద తను నమ్మకం కలిగి ఉంటే కోరికను సాధించుకోగలడు. ఆశ పెట్టుకోవడం అంటే చేసే ప్రయత్నాలలో ఒక్కొక్కసారి విఫలమైనా నిరాశపడకుండా తప్పక సాధిస్తాను అనే ఆశతో ముందుకు సాగడం. మనిషి ఎప్పుడూ ఆశాజీవిగానే ఉండాలి. కాబట్టి ఎవరైనా తన ప్రయత్నాలలో సఫలీకృతులు కావాలంటే పై మూడు అంశాల మీద పట్టు సాధించాలి.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) “తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తి పరచడమే!” ఈ మాటలు ఎవరినుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
(లేదా)
కలాం ఉపాధ్యాయుల గొప్పదనాన్ని చెప్పిన సందర్భం వివరించండి.
జవాబు.
తనను ప్రోత్సహించిన ఎమ్.ఐ.టి. ఉపాధ్యాయులను ఉద్దేశించి అబ్దుల్కాలాం చెప్పిన మాటలివి. ఎమ్.ఐ.టి. లో చదివేటప్పుడు అబ్దులలాం ఆలోచనలను తీర్చిదిద్ది, కలాం సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ముగ్గురు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కే.ఏ.వి. పండలై, ప్రొఫెసర్ నరసింగరావుగారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ వారి ఆశయం మాత్రం ఒక్కటే. అది- తమ చైతన్యంతోనూ, అకుంఠిత సంకల్పంతోనూ, విద్యార్థుల జ్ఞాన తృష్ణని సంతృప్తిపరచడం ఒక్కటే వారందరి ఆశయం. ఇది ఆ ఉపాధ్యాయుల గొప్పదనాన్ని తెలియచేస్తోంది. తనను తీర్చిదిద్దిన అలాంటి గురువులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చూపిన కలాం వ్యక్తిత్వం గొప్పదని తెలుస్తుంది.

(ఈ) ప్రొ. శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తిచేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు?
జవాబు.
ప్రొ. శ్రీనివాసన్ అబ్దుల్ కలాంకు యుద్ధవిమానం మోడల్ తయారుచేసే పని అప్పగించారు. అది ఆయన స్నేహితులతో కలిసి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వంతు పని తొందరగానే జరిగినా స్నేహితులవైపు నుండి ఆలస్యం జరిగిందని నా కనిపిస్తుంది. నేనైతే పనిచేయడానికి ముందు స్నేహితులతో పనితీరు గురించి ఎంత సమయంలో ఏ పని పూర్తిచేయాలి అనే విషయం గురించి క్షుణ్ణంగా చర్చిస్తాను. అందరూ ఒకరి పనిని మరొకరు పరిశీలిస్తూ, సమిష్టి బాధ్యతతో పని పూర్తయ్యేలా బాధ్యత తీసుకుంటాము.

ప్రతివారిని వారు చేయవలసిన పనిలోని భాగాలను ముందుగానే ప్రణాళిక తయారుచేసి సమయనిర్దేశంతో సహా సిద్ధం చేయిస్తాను. ఆ ప్రణాళికను బట్టి మొత్తం పని పూర్తికావడానికి ఎంత సమయం కావాలో ఆలోచించుకుని ఆ ప్రకారంగా పనులు జరుగుతున్నవో లేదో పర్యవేక్షిస్తూ ముందుగానే నావంతుగా ఎక్కువ సమయం పనిచేసి అనుకున్న దానికన్న ముందుగానే పని పూర్తిచేసి స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తాను. వారిని ప్రోత్సహిస్తూ వారికి సాయం చేస్తూ నిర్ణీత సమయంకంటె ముందుగానే పనిపూర్తిచేసి ఉపాధ్యాయునికి అప్పగిస్తాను.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

1. కలాం తన ఆశయసాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
అబ్దుల్ కలాం చిన్నతనంలో కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండడం చూసి తను కూడా అలా ఎగరాలనుకొనేవాడు. ఆకాశంలోని రహస్యాలు తెలుసుకోవాలని ఆయనకు ఆసక్తి. కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాలపై పట్టు సాధించమని గురువు ఇయదురై సోలోమోన్ ఇచ్చిన ఉపదేశం మనసులో కుదుర్చుకున్నాడు. తన ఆశయం నెరవేర్చుకోడానికి ఎంతో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ రోజుల్లో కాలేజీలో ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమానాలను చూస్తూ ఎక్కువ కాలం గడుపుతూ తన ఆశయాన్ని బలపరచుకున్నాడు. కోర్సు పూర్తి కాగానే సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేశాడు. ప్రొఫెసర్ ఇచ్చిన అతి తక్కువ సమయంలో పూర్తిచేసి అందరి మన్ననలు పొందాడు. వ్యాసరచన పోటీలో ‘మన విమానాన్ని మనమే తయారుచేసుకుందాం’ అనే వ్యాసాన్ని తమిళంలో రాసి మొదటి బహుమతి పొందాడు. ఆ విధంగా కలాఁ తన ఆశయసాధనలో కృతకృత్యుడయ్యాడు.

(లేదా)

కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
కలాం రామనాథపురంలోని హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో అతనిలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ముందుముందు జీవితంలో రాబోయే అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఆయనకేమీ తెలియదు. అక్కడి ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆయనకు మార్గదర్శకుడైనాడు. కలాంకు ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా చిన్నప్పటినుండి ఎంతో ఆసక్తి. పై చదువుల గురించి, ప్రొఫెషనల్ చదువులగురించి ఆయనకేమీ తెలియదు. అందుకే తిరుచినాపల్లిలో ఉన్న సెంట్ జోసఫ్ కాలేజీలో ఇంటర్మీడియెట్, బి.ఎస్.సి. చదివాడు. చివరి సంవత్సరంలో ఇంగ్లీషు సాహిత్యం మీద ఇష్టం కలిగి మంచి మంచి పుస్తకాలు, తత్త్వశాస్త్ర గ్రంథాలు చదివేవాడు. టాల్స్టాయ్, స్కాట్, హార్డీ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆ సమయంలోనే ఆయనకు భౌతికశాస్త్రం పట్ల ఇష్టం ఏర్పడింది.

కానీ తన కలలు నిజం చేసుకోవాలంటే ఫిజిక్స్ కాదు ఇంజనీరింగ్ చదవాలని అర్థం చేసుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రవేశం లభించింది. కాని డబ్బు సమస్య ఎదురైంది. సుమారు 10వేల రూపాయలు కావలసి వచ్చింది. తండ్రికి శక్తి లేదు. సోదరి జొహారా తన బంగారు గొలుసు, గాజులు తాకట్టుపెట్టి డబ్బు ఇచ్చింది. ఎం.ఐ.టిలో చేరిన తరువాత స్కాలర్షిప్ సంపాదించుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నతరహా యుద్ధ విమానాన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసి ప్రొఫెసరు మన్ననలు పొందాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ పనిచేశాడు. ఈ విధంగా అబ్దుల్ కలాం విద్యాభ్యాసం సాగింది.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

2. ‘మనమే విమానాన్ని తయారుచేసుకుందాం’ అన్న వ్యాసంలో అబ్దుల్కలాం ఏమి రాసి ఉంటారు? (అదనపు ప్రశ్న)
అబ్దుల్ కలాం ప్రాజెక్టు పని పూర్తిచేస్తున్న కాలంలో ఎం.ఐ.టి. తమిళ సంఘం వారు వ్యాసరచన పోటీ నిర్వహించారు. కలాం ఆ పోటీలో పాల్గొన్నారు. “మన విమానాన్ని మనమే చేసుకుందాం” అనే అంశం మీద వ్యాసం రాశారు. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. కలాం ఆ పోటీలో గెలిచి ప్రఖ్యాత తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు సంపాదకుడైన దివాన్ చేతులమీదుగా మొదటి బహుమతి అందుకున్నారు. ఆ వ్యాసంలో కలాం ఇలా రాసి ఉండవచ్చు “ఆకాశంలో విహరించడమంటే ఇష్టంలేని వాళ్ళుండరు.

పక్షులైతే రెక్కలతో ఎగురుతాయి. మనిషికి రెక్కలు లేవు గనుక పక్షి ఆకారం కలిగి రెక్కలున్న వాహనంలో అదే విమానంలో కూర్చుని ఆకాశంలో ప్రయాణించవచ్చు. ఈ విమానాన్ని ఎలా తయారుచెయ్యాలంటే ఏరోనాటిక్స్ క్షుణ్ణంగా అభ్యసించాలి. స్వేచ్ఛకు – తప్పించుకోడానికీ, చలనానికీ-గమనానికీ, పక్కకి జారడానికీ – ప్రవహించడానికీ మధ్యగల తేడా తెలుసుకోవడంలోనే విజ్ఞానశాస్త్ర రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. యుద్ధ విమానం తయారు చెయ్యాలంటే ఏరో డైనమిక్ డిజైనింగ్, చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామగ్రి మొదలైన అంశాలమీద దృష్టి పెట్టి తయారు చేయాలి………..” ఈ విధంగా వ్యాసం సాగి ఉండవచ్చునని నా భావన.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కలాం తన కోరికను గురించి చెప్పాడు కదా! అట్లాగే మీరు కూడా మీ కోరికను చిన్న కవిత రూపంలో రాయండి. గోపాలరావు తాతగారు మంచి మనస్సున్న వైద్యుడు
జవాబు.
బాధతో మూలుగుతూ వచ్చే ప్రతి రోగికి ఆయన ఒక సోదరుడు
నవ్వుతూ, ప్రేమతో మాట్లాడుతూ ఉంటే
వారిబాధ తెలుసుకొని, ధైర్యం చెబుతూ ఉంటే
నేను కూడా పెద్దయ్యాక డాక్టరు నవుదామనుకుంటున్నా
రోగులకు, పేదలకు సేవచేసి తరించాలనుకుంటున్నా!

(లేదా)

ఈ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెపుతారు? సందేశమివ్వండి. ఏకపాత్రాభినయం
చేయండి.
మిత్రులారా! గురువు ఉత్తముడైనంత మాత్రాన సరిపోదు. గురువెట్లా ఉన్నా శిష్యుడు చురుగ్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలి. ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ కోరిక బలంగా ఉండాలి. చెయ్యగలనన్న నమ్మకంతో సాధిస్తానన్న ఆశతో పనిచేస్తే తప్పక సాధించగలరు. మీలో విశ్వాసం గట్టిగా ఉంటే మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకోగలరు. అన్ని విషయాల మీద దృష్టి పెట్టి తెలుసుకుంటూ ఉండండి. విజ్ఞానం పొందండి. విజ్ఞానంతోపాటు వివేకం కూడా చాలా అవసరం. వివేకం లేకపోతే విజ్ఞానం వ్యర్థం. ఎప్పుడూ సకాలంలో పనులు పూర్తిచేసుకోవాలి. ఉపాధ్యాయుల మన్ననలు పొందాలి. మీరు సాధించదలచిన లక్ష్యాన్ని మనసులో చక్కగా కుదుర్చుకొని తగినంత కృషి చేసి దాన్ని చేరుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, వైఫల్యాలు ఎదురైనా నిరాశపడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. మీ అందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.

పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
(అ) ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు.
ఔత్సాహికుడైన = ఉత్సాహవంతుడైన
ఉత్సాహవంతుడైన వాడు మొదలు పెట్టిన పనిని తప్పక పూర్తి చేస్తాడు.

(ఆ) జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు.
జిజ్ఞాసువు = తెలుసుకోవాలనే కోరిక కలవాడు.
దేవుని గురించి తెలుసుకోవాలనే కోరిక గల నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను చేరాడు.

(ఇ) సుస్మితకు డాక్టరుగా ఎదగాలని ఆకాంక్ష
ఆకాంక్ష = కోరిక
సుజాతకు మదర్ థెరిసాలాగా సంఘసేవ చేయాలని కోరిక.

(ఈ) అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు.
వాగ్దానం : మాట యివ్వడం
రోజూ ఆలస్యంగా నిద్రలేచే గౌతమి ఇకపై త్వరగా లేస్తానని తల్లికి మాట ఇచ్చింది.

(ఉ) బందు కారణంగా పనులు నిలిచిపోకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసింది.
ప్రత్యామ్నాయం = బదులు / మాఱు
వరద సమయాలలో ప్రజలకు తలదాచుకోవడానికి ప్రభుత్వం సురక్షితమైన బదులు (మాఱు) ఏర్పాట్లు చేస్తుంది.

(ఊ) వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి.
ప్రభావితం చేయు = స్ఫూర్తి కలిగించు
గొప్పగొప్ప వ్యక్తుల బోధనల వలన స్ఫూర్తి కలవారమైన మనం కూడా గొప్పవాళ్ళం కాగలుగుతాం.

2 ఈ పాఠంలో శాస్త్ర సంబంధ పదాలున్నాయి. వాటిని పట్టికగా రాయండి.

ఉదా: ఏరోనాటికల్ ఇంజనీర్
ఈ పాఠంలోని శాస్త్ర సంబంధమైన పదాలు :

సైన్సువాయుపదార్థాలునిర్మాణం
విజ్ఞానశాస్త్రంగతిశీలత
ఫిజిక్స్ఏరోప్లేన్
ఇంజనీరింగ్యుద్ధవిమానం
సాంకేతిక విద్యఏరోడైనమిక్ డిజైన్అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలుచోదనంఅర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్

3. కింది వాక్యాలలో సమానార్థకాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

(అ) ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గగనంలోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి

(ఆ) భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. వసుధలో నిధి నిక్షేపాలుంటాయి. ధరణికి వృక్షాలు అందాన్నిస్తాయి.
జవాబు.
భూమి, వసుధ, ధరణి

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

(ఇ) ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు. ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలైంది. నెలకు దాదాపు పదివేలు సంపాదిస్తున్నాడు.
జవాబు.
ఇంచుమించు, సుమారు, దాదాపు

(ఈ) కిరణ్ు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమిస్తాడు. పరీక్షఫలితాలు రాగానే తన కాంక్ష ఫలించిందని సంతోషించాడు.
జవాబు.
కోరిక, ఆకాంక్ష, కాంక్ష.

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీయండి. సంధులను గుర్తించండి.
(అ) మొదలయ్యింది = మొదలు + అయింది (ఉత్వసంధి)
(ఆ) మేల్కొల్పాడంటే = మేల్కొల్పాడు + అంటే (ఉత్వసంధి)
(ఇ) ఉంటుందని = ఉంటుంది + అని (ఇత్వసంధి)
(ఈ) నాకిప్పటికీ = నాకున్ + ఇప్పటికీ (ఉత్వసంధి)
(ఉ) నైపుణ్యముందో = నైపుణ్యము + ఉందో (ఉత్వసంధి)

2. కింది వాక్యాలు చదవండి. గీతగీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో గుర్తించండి. రాయండి.
ఉదా : (అ) ఆదిత్య మంచి బాలుడు. (ప్రథమావిభక్తి)
(ఆ) సూర్యనారాయణశాస్త్రిగారితో నడిచాను. (తృతీయావిభక్తి)
(ఇ) ఆయనను ఒప్పించలేకపోయాను. (ద్వితీయావిభక్తి)
(ఈ) ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. (చతుర్థీవిభక్తి)
(ఉ) గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది. (షష్ఠీవిభక్తి)
(ఊ) చెరువులయందు ఉన్న తామరలు సౌందర్యాన్నిస్తాయి. (సప్తమీవిభక్తి)
(ఋ) బాలలారా! కలలు కనండి.

ప్రాజెక్టు పని:

1. మీకు నచ్చిన శాస్త్రవేత్తను గురించి వారెట్లా ప్రేరణ పొందారో, ఏ కొత్త విషయాలు కనుక్కొన్నారో వివరాలు సేకరించి వ్యాసం రాయండి.
జవాబు.
నాకు నచ్చిన శాస్త్రవేత్త, కనుక్కొన్న విషయాలు : వ్యాసం ఢిల్లీలో జంతర్మంతర్ గురించి తెలియని వాళ్ళుండరు. ఇది అద్భుతమైన నిర్మాణం. దీని నిర్మాణం 17వ శతాబ్దిలో జరిగింది. దీని సృష్టికర్త రాజపుత్రరాజు జయసింహుడు. మొగల్ రాజు ఔరంగజేబుకు పరమ మిత్రుడు. జయసింహుడికి శాస్త్రీయ దృక్పథం ఏర్పడడానికి కారణం ఒక మహమ్మదీయ వనిత అని చెబుతారు.

ఆమె ఒక వెన్నెల రాత్రి కోట పై భాగన ఆయనతో విహారం చేస్తూ “చంద్రుడికీ మనకూ ఎంత దూరం? చంద్రుడు, సూర్యుడు, భూమి, నక్షత్రాలు- వీటి మధ్య గల సంబంధం ఎలాంటిది?” అని అడిగిందట. ఏదో ఉబుసుపోకకు అడిగిన ప్రశ్నే అయినా జయసింహుడిలో ఆలోచన రేకెత్తించింది. ఆయనలో నిద్రపోతున్న శాస్త్రజ్ఞుణ్ణి మేలు కొలిపింది.

పర్షియన్ అరబిక్ యూరోపియన్ భాషలలో ఉన్న ఖగోళ గణిత గ్రంథాలన్నీ సమగ్రంగా చదివాడు. యూరప్ న్నుంచి టెలిస్కోప్ తెప్పించాడు. స్వయంగా వాటిని రూపొందించడం మొదలుపెట్టాడు. భూభ్రమణ విధానం, భూమి వాలి ఉన్న స్థితి- వాటి కారణాలుగా దొర్లిన లోపాలు సరిచేసి మహమ్మదీయ, హిందూ పర్వదినాలను కచ్చితంగా నిర్ణయించాడు. ఈ పరిశీలనలన్నీ ‘బిజ్ మహమ్మద్ షాహి’ అనే గ్రంథంగా వెలువరించాడు.

ఖగోళ నిర్మాణాలను నిశితంగా పరిశీలించడానికే ఈయన జంతర్ మంతర్లను ఢిల్లీ, జైపూర్, వారణాసి, ఉజ్జయినీ నగరాల్లో నిర్మించాడు. ఈ జంతర్ మంతర్ల గురించి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు చర్చించుకుంటూనే ఉన్నారంటే జయసింహుని శాస్త్రపరిజ్ఞానం లోతేమిటో మనకు అర్థమౌతుంది. ఆయన రూపొందించిన యంత్రాలలో సమ్రాట్ంత్ర, రాయతంత్ర, జయప్రకాశ్ చెప్పుకోదగ్గవి.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

2. వివిధ శాస్త్రవేత్తల గురించి పత్రికల్లో వచ్చిన అంశాలను సేకరించి నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
అల్జీమర్స్ గుట్టువిప్పే సరికొత్త రక్తపరీక్ష :
బెర్లిన్ (8-4-2018) : లక్షణాలు పైకి కనిపించకముందే అల్జీమర్స్ను కనిపెట్టే కొత్త రక్తపరీక్షను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. దీంతో అల్జీమర్స్ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉండేవారిని గుర్తించే వీలుంది. అంతేకాదు కొత్త ఔషధాల తయారీకీ ఇది బాటలు పరుస్తోంది. అల్జీమర్స్ రోగుల మెదడులో అమిలోయిడ్-బీటా సమ్మేళనాల స్థాయిలు పెరుగుతాయి.

రక్తంలో వీటిని గుర్తించేలా తాజా పరీక్షను అభివృద్ధి చేశారు. దీనికోసం ఇమ్యునో ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల సాంకేతికతను ఉపయోగించారు. అంటే భిన్న పౌనఃపున్యాల్లో పరారుణ కిరణాలను ప్రయోగించి రక్తంలో అమిలోయిడ్ బీటా స్థాయిలను గుర్తిస్తారన్నమాట. ఈ పరిజ్ఞానాన్ని 65 మంది రక్తనమూనాలపై విజయవంతంగా పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. మెదడు స్కానింగ్ ఫలితాలతో ఇవి చక్కగా సరిపోయాయని వివరించారు. ఇతర మేథో లోపాల నిర్ధారణకూ ఈ పరీక్ష ఉపయోగపడే అవకాశముందని చెప్పారు.

జబ్బుల బాక్టీరియా గుట్టురట్టు:
కొత్త యాంటీబయాటిక్స్ తయారీకి ఊతం! : వాషింగ్టన్, ఏప్రిల్ 9, 2018 : మనిషి శరీరంలో చాలా బాక్టీరియా ఉంటుంది… అవి రకరకాల ప్రొటీన్లను స్రవిస్తూంటాయి. అయితే జబ్బుతో బాధ పడుతున్న ఓ వ్యక్తి శరీరంలో ఆ జబ్బుకు కారకమైన బాక్టీరియా.. ఆ వ్యక్తి కణజాలాలకు అంటిపెట్టుకుని ఉండేలా చేసే ఓ విభిన్నమైన ప్రొటీన్ ను స్రవిస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

“ఒక పెద్ద మాల్లో మిగిలిన అన్ని సరుకుల చేరవేతకు వివిధ దార్లున్నప్పటికీ, ఆ మాల్ సొంత అవసరాలకు ఒక ప్రత్యేక దారి ఉన్నట్లుగా శరీరంలోని మిగిలిన అన్ని రకాల పనులకూ వేరువేరు రకాల ప్రొటీన్లను స్రవించే బాక్టీరియా కేవలం జబ్బు కారకమైన బాక్టీరియా కోసం ఓ ప్రొటీన్ ను వెలువరిస్తుంది. అంటే ఈ ప్రొటీన్ ఓ రకంగా ఆ జబ్బు నయంకాకుండా యాంటీబయాటిక్స్లో పోరాటం చేస్తుంది” అని పరిశోధన జరిపిన అమెరికా హార్వర్డ్ మెడిక్ స్కూల్ ప్రొఫెసర్ టామ్ రాపోపోర్ట్ చెప్పారు. కొత్త రకాల యాంటీ బయోటిక్స్ తయారీ పరిశోధనలకు ఇది అత్యంత కీలకం కానుంది.

డీఆర్డీవో శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక పురస్కారం :
హైదరాబాద్ : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన శాస్త్రవేత్త బ్రజ్నిష్ సైతరా…. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందిన ప్రతిష్ఠాత్మక యంగ్ ఇంజినీర్ అవార్డును అందుకున్నారు. రూర్కిలో జరిగిన ఐఎన్ఏఈ వార్షిక సమావేశంలో ఈ అవార్డుతోపాటు నగదును ఆయనకు అందజేశారు.

నిలువుగీతల చిహ్నం సృష్టికర్త ఉర్ల్యాండ్ మృతి
న్యూయార్క్ : నిలువుగీతల చిహ్నం (బార్ కోడ్) సృష్టికర్త నార్మన్ జోసెఫ్ ఉర్ల్యాండ్ 9-12-2012న మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమార్తె సుసాన్ ఉర్ల్యాండ్ ప్రకటించారు. 91 ఏళ్ళ ఈయన కొంతకాలంగా అల్జీమర్స్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈయన డిగ్రీ చదువుతున్న రోజుల్లో తన సహ విద్యార్థి బెర్నాడ్ సిల్వర్తో కలిసి ఈ చిహ్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

దీనికి 1940లో మేధోహక్కుల (పేటెంట్) సాధించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని అన్ని ప్రముఖ ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఉత్పత్తికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిలువు గీతల సంకేత రూపంలో చెప్పడాన్ని బార్ కోడింగ్ అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఉర్ల్యాండ్, సిల్వర్ కేవలం 15000 డాలర్లు మాత్రమే సంపాదించారు.

విశేషాంశాలు

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ : విమానాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం.
హెచ్.ఏ.యల్. : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (భారతీయ విమానయాన నిర్మాణ సంబంధిత సంస్థ)

సైన్సువాయుపదార్థాలునిర్మాణం
విజ్ఞానశాస్త్రంగతిశీలత
ఫిజిక్స్ఏరోప్లేన్
ఇంజనీరింగ్యుద్ధవిమానం
సాంకేతిక విద్యఏరోడైనమిక్ డిజైన్అణుధార్మికనశ్వరత
విమానయంత్రాలుచోదనంఅర్థజీవకాలం
ఏరోనాటికల్ ఇంజనీర్


సమానార్ధక పదాలు

1.  గత రెండేళ్ళుగా వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతుంటాయి.
జవాబు.
సంభవించు, జరుగు

2. ఉదయం పూట కొంతసేపు బయట గాలిలో విహరించడం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు చదువుకోకుండా అస్తమానం తిరగడం మంచిది కాదు.
జవాబు.
విహరించడం, తిరగడం

3. ఎవరేం చెప్పినా వినాలి కానీ వెంటనే విశ్వసించకూడదు. నేనింత చెప్పినా నువ్వు నా మాటలు నమ్మడం లేదెందుకని?
జవాబు.
విశ్వసించు, నమ్ము

TS 7th Class Telugu 6th Lesson Important Questions ప్రేరణ

ప్రశ్న 1.
అబ్దుల్ కలాం దారితప్పినప్పుడు ఆయన తండ్రి మాటలు అతణ్ణి దారిలో పెట్టేవికదా! ఆ మాటలు ఏవి?
(లేదా)
తండ్రి మాటలు అబ్దుల్కలాం జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయి?
జవాబు.
మనం ఏ పనిచేసినా కొన్నిసార్లు ఆనందాలు కలుగుతాయి. కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి. వైఫల్యాలు కూడా ఒక్కోసారి తప్పవు. అలాగే అబ్దుల్కలాంకు గూడా అన్ని అనుభవాలూ ఎదురైనాయి. ఆశాభంగం కలిగినప్పుడు, దారితప్పినప్పుడు తన తండ్రిచెప్పిన మంచిమాటలు గుర్తుకొచ్చేవి. అవేమంటే “ఇతరుల్ని తెలుసుకున్నవాడు విజ్ఞాని. తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. వివేకం లేకపోతే విజ్ఞానం ప్రయోజన శూన్యం”. అంటే ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడే అనుకున్న పని చక్కగా పూర్తిచెయ్యగలం. అలా ఆత్మవిమర్శ చేసుకుని కలాం తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.

ప్రశ్న 2.
కలాం బాల్యంలో వేటిని పరిశీలించేవాడు? వాటి ద్వారా ఏ స్ఫూర్తిని పొందాడు?
(లేదా)
కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావడానికి బాల్యంలో ఏది స్ఫూర్తినిచ్చింది?
జవాబు.
కలాం ఎం.ఐ.టి.లో చదివేటప్పుడు అక్కడ ప్రదర్శనకోసం పెట్టిన రెండు పాత విమానాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. విద్యార్థులంతా హాస్టలుకు వెళ్ళిపోయాక చాలాసేపు అక్కడే కూర్చుని పరిశీలిస్తూ ఉండేవాడు. అలా చూస్తూ చూస్తూ ఆయనకు పక్షిలాగా ఆకాశంలో ఎగరాలన్న కోరిక దృఢపడింది. ఆ స్ఫూర్తితోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాడు. తన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించుకున్నాడు.

ప్రశ్న 3.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి కలాంకు ఆర్థిక సహాయం చేసిందెవరు?
జవాబు.
కలాంకు ఇంజనీరింగ్ చదవటానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి అర్హత లభించింది. ఖర్చు దాదాపు వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. కాని తండ్రి దగ్గర అంత సొమ్ములేదు. అవకాశం వదులు కోవడం కలాంకు ఇష్టంలేదు. ఆ సమయంలో ఆయన సోదరి జొహారా ఆయనకు సహాయం చేసింది. తనకున్న బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి డబ్బు అందించింది. అలా కలాం ఎం.ఐ.టి.లో చేరాడు. బాగా చదివి స్కాలర్షిప్ సంపాదించుకొని చదువు కొనసాగించాడు.

ప్రశ్న 4.
వీడ్కోలు సమావేశంలో ఏం జరిగింది?
(లేదా)
ప్రొఫెసర్ స్పాండర్ కలాంని అభినందించిన సన్నివేశం రాయండి.
జవాబు.
వీడ్కోలు సమావేశంలో భాగంగా అందరూ గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. ప్రొఫెసర్లు ముందు కూర్చున్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా మూడు వరుసల్లో వెనుక నుంచున్నారు. హఠాత్తుగా ప్రొ. స్పాండర్ లేచి నుంచొని కలాంను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. “నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో మంచి పేరు తెస్తుంది” అని మెచ్చుకున్నారు. ఆ గుర్తింపునకు కలాం పొంగిపోయారు.

ప్రశ్న 5.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని కలాం ఎలా పూర్తి చేశాడు?
(లేదా)
ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాంలో పట్టుదలకు ఎలా కారణమయ్యాడు?
జవాబు.
ఎం.ఐ.టిలో కోర్సు పూర్తికాగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానాన్ని డిజైన్ చేసే బాధ్యత తీసుకున్నాడు కలాం. అందులో ఏరోడైనమిక్ డిజైన్ చేయడం కలాం వంతు. చోదనం, నిర్మాణం అదుపు, ఉపకరణ సామగ్రి-వీటి తయారీ స్నేహితుల బాధ్యత. ప్రొ. శ్రీనివాసన్ వారికి డిజైనింగ్ ఉపాధ్యాయుడు. పని నెమ్మదిగా సాగుతున్నదని ప్రొ. శ్రీనివాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలాం నెలరోజులు సమయం కోరారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు మూడురోజులు గడువిచ్చి ఆలోగా పూర్తిచేయకపోతే స్కాలర్షిప్ ఆపేస్తానన్నారు. కలాం పట్టుదలతో నిద్రాహారాలు మాని అనుకున్న సమయానికి పని పూర్తిచేశాడు. ప్రొఫెసర్ మనసారా అభినందించారు.

పర్యాయ పదాలు:

  • మాత = తల్లి, జనని, అమ్మ
  • ఆశ = కోరిక, వాంఛ, ఇచ్ఛ
  • అకాశము = గగనము, నింగి, దివి
  • పురము = పట్టణము, నగరము, పురి
  • జీవితము = బ్రతుకు, జీవనము, మనుగడ
  • ఉపాధ్యాయుడు = గురువు, ఒజ్జ, అధ్యాపకుడు

నానార్థాలు:

  • ఆశ = కోరిక, దిక్కు
  • భగవంతుడు = దేవుడు, వష్టు, శవుడు
  • మీతుడు = స్నేహితుడు, సూర్యుడు
  • శౌఖ = చెట్టుకొమ్మ, చేయి, వేదభాగము
  • హృదయము = మనస్సు, [పేమ, అభిప్రాయము
  • కాలము = సమయము, నలుపు, చావు

వ్యుత్పత్త్యర్థాలు:

ఉపాధ్యాయడుసమీపమును పొంది ఈతని వలన అధ్యయనము చేయుదురుగురువు
గురువుఅజ్ఞానాంధకారమును ఛేదించుహాడుఉపాధ్యాయుడు
పక్షిపక్షములు (ఱెక్కలు) గలదిపిట్ట
మానవుడుమనువు సంబంధమైనవాడునరుడు
మిత్రుడు(1) సర్వభూతములయందుసూర్యుడు
(2) స్నేహయుక్తుడుస్నేహితుడు


ప్రకృతి – వికృతులు:

  • స్థిరము – తిరము
  • పంక్తి – పది, బంతి
  • విద్య – విద్దె, విద్దియ
  • బుద్ది – బుద్ది
  • శిఘ్యడు – సిసువుడు
  • గురువు – గులబవ, గుర్వు
  • కాలము – కారు
  • బంధము – బందము
  • ఆశ – ఆస
  • గాఢము – గాటము
  • అకాశము – ఆకసము
  • పక్షి – పక్కి
  • (ప్రయాణము – పయనము
  • సముద్రము – సంద్రము
  • విశ్వాసము – విసువాసము

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

సంధులు:

1. ఉత్వసంధి : సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

  • మొదలయ్యింది = మొదలు + అయ్యింది
  • మొదలైంది = మొదలు + ఐంది
  • నువ్వింత = నువ్వు + ఇంత
  • ఆత్మీయమైన = ఆత్మీయము+ ఐన
  • రైలెక్కాడు = రైలు + ఎక్కాడు
  • పదిహేనేళ్ళు = పదిహేను + ఏళ్ళు
  • అమితమైన = అమితము + దన

2. ఉత్వసంధి : సూత్రం : ప్రథమేతర విభక్తి శత్రర్థ చు వర్ణాల్లే ఉన్న ఉకారానికి సంధి వైకల్పికముగా వస్తుంది.

  • నాకప్పుడే = నాకున్ + అప్పుడే
  • నాకేమి = నాకున్ + ఏమి
  • నేనేమి = నినున్ + ఏమి

3. ఇత్వసంధి : సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

  • ఏమంత – ఏమి + అంత
  • ఇదంతా – ఇది + అంతా
  • ఒకటేమిటి – ఒకటి + ఏమిటి
  • పూర్తయ్యాక – పూర్తి + అయ్యాక

4. ఇత్వసంధి : సూత్రం : క్రియాపదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

  • నేర్పిందిదే – నేర్పింది + ఇదే
  • కావాలనుకుంటే – కావాలి + అనుకుంటే
  • ఉందని – ఉంది + అని
  • కావాలంటే – కావాలి + అంటే

5. అత్వసంధి : సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

  • అయినప్పటికీ = అయిన + అప్పటికీ
  • చిన్నప్పటి = చిన్న + అప్పటి
  • అన్నట్టు = అన్న + అట్టు
  • వెళ్ళినప్బండు = వెళ్ళిన + అప్పుడు

6. సవర్ణదీర్ఘసంధి : సూత్రం : అ,ఇ,ఉ,ఋులకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్లాలు ఏకాదేశమవుతాయి.

  • జీవితావకాశాలు = జీవిత + అవకాశాలు
  • అమితాసక్తి = అమిత + ఆసక్తి
  • విద్యార్థులు = విద్యా + అర్థులు
  • పరమాచార్య = పరమ + ఆచార్య

7. గుణసంధి : సూత్రం : అకారానికి ఇ,ఉ,ఋలు పరమైనప్పుడు క్రరమంగా ఏ,ఓ,అర్లు ఏకాదేశవుతాయి.

  • రామేశ్వరం = రామ + ఈశ్వరం
  • బలోపేం = బల + ఉపేతం
  • ప్రోత్సాహము = ప్ర + ఉత్సాహము
  • స్వేచ్ఛ) = స్ప + ఇచ్ఛ

8. గసడదవాదేశ సంధి సూత్రం:

(1) ద్వంద్వ సమాసంలో పదం మీది పరుషాలకు గసడదవలు వస్తాయి.
తల్లీతండ్రులు – తల్లి + తండ్రి

(2) ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
అదిగాని – అది + కాని
అక్కడే గడపు – అక్కడే + కడపు
పసిగట్టు – పసి + కట్టు

సమాసాలు:

“సమాసములు,
1. షష్ఠీతత్పురుష సమాసం

జీవిత లక్ష్యం – జీవితం యొక్క లక్ష్యం
పనితీరు – పని యొక్క తీరు
కుటుంబ నేపథ్యం – కుటుంబం యొక్క నేపథ్యం
విద్యాభ్యాసం – విద్య యొక్క అభ్యాసం
మాతృభూమి – మాత యొక్క భూమి

2. సప్తమీతత్పురుష సమాసం
ఆకాశ రహస్యాలు – ఆకాశమందలి రహస్యాలు
త్యాగనిరతి – త్యాగమందు నిరతి

3. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నిశిత బోధన – నిశితమైన బోధన
సాంకేతిక విద్య – సాంకేతికమైన విద్య
సూక్ష్మబుద్ధి – సూక్ష్మమైన బుద్ధి
అమితాసక్తి – అమితమైన ఆసక్తి
మహామేధావి – గొప్పవాడైన మేధావి

4. ద్విగు సమాసం
పదిహేనేళ్ళు – పదిహేను సంఖ్యగల ఏళ్ళు
మూడు అంశాలు – మూడైన అంశాలు

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

5. తృతీయా తత్పురుష సమాసం
కష్టార్జితం – కష్టము చేత ఆర్జితం
ఉద్వేగ భరితుడు – ఉద్వేగముతో భరితుడు

6. ద్వితీయా తత్పురుష సమాసం
విద్యార్థులు – విద్యను అర్థించువారు

7. ద్వంద్వ సమాసం

గురుశిష్యులు – గురువును, శిష్యుడును
తల్లీతండ్రులు – తల్లియు, తండ్రియు

8. నఞ తత్పురుష సమాసం
అనివార్యం – నివార్యం కానిది
అస్థిరం – స్థిరం కానిది / స్థిరం లేనిది
అసాధ్యం – సాధ్యం కానిది
అమితం – మితం లేనిది

9. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – భారతము అను పేరుగల దేశం

10. బహువ్రీహి సమాసం
మందబుద్ధి – మందమైన బుద్ధి కలవాడు

11. ప్రథమా తత్పురుష సమాసం
మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము

I. పదజాలం, వ్యాకరణాంశాలు:

అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వండి.

1. జిజ్ఞాసి కొత్త విషయాలను తెలుసుకుంటాడు. గీతగీసిన పదానికి అర్థం
(అ) పరిగెత్తేవాడు
(ఆ) తెలుసుకోవాలనే కోరిక కలవాడు
(ఇ) సామాన్యుడు
జవాబు.
(ఆ) తెలుసుకోవాలనే కోరిక కలవాడు

2. ఆకాంక్ష అనే మాటకు పర్యాయపదాలు
జవాబు.
కోరిక అభిమతం, ఇచ్ఛ

3. కష్టార్జితంతో బ్రతికేవాడు గొప్పవాడు. గీతగీసిన మాటకు అర్థం రాసి ఆ పదంతో సొంతవాక్యం రాయండి.
జవాబు.
కష్టార్జితం = కష్టం చేత సంపాదించబడింది. వ్యాపారంలో నష్టం రావడంతో రవి కష్టార్జితమంతా కోల్పోయాడు.

4. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. గీతగీసిన మాటకు అర్థం
జవాబు.
(అ) మాట ఇవ్వడం
(ఆ) చెప్పినట్లు వినడం
(ఇ) డబ్బు ఇవ్వటం
జవాబు.
(అ) మాట ఇవ్వడం

5. అది ఏమంత పెద్దది కాదు. గీతగీసిన పదం ఏ సంధి?
(అ) ఉత్వసంధి
(ఆ) గుణసంధి
(ఇ) ఇత్వసంధి
జవాబు.
(ఇత్వసంధి)

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

6. జవాబు తెలిసిన ఏకైక విద్యార్థి అతడే. గీతగీసిన మాటను విడదీయండి.
(అ) ఏ + కైక
(ఆ) ఏక + ఏక
(ఇ) ఏక + ఐక
జవాబు.
(ఆ) ఏక + ఏక

7. అతని పనితీరు బాగుంది. గీతగీసినది ఏ సమాసం?
(అ) తృతీయాతత్పురుష
(ఆ) ద్వంద్వ సమాసం
(ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు.
(ఇ) షష్ఠీ తత్పురుష సమాసం

8. ద్రోణుడు, అర్జునుడు గురుశిష్యులు, గీతగీసినది ఏ సమాసం ?
(అ) ద్వంద్వ సమాసం
(ఆ) ద్వితీయాతత్పురుష
(ఇ) బహువ్రీహి
జవాబు.
(అ) ద్వంద్వ సమాసం

9. సమాసంలోని పూర్వపదం సంఖ్య అయితే అది ఏ సమాసం?
(అ) షష్ఠీ తత్పురుష
(ఆ) ద్విగుసమాసం
(ఇ) నఇత్పురుష
జవాబు.
(ఆ) ద్విగుసమాసం

10. గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి – ఇందులో గీతగీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
(అ) స్ఫూర్తి కలిగిస్తాయి
(ఆ) నాశనం చేస్తాయి
(ఇ) అనిశ్చితిలోకి నెడతాయి
జవాబు.
(అ) స్ఫూర్తి కలిగిస్తాయి

11. కిందివాటిలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక అనే అర్థం ఇచ్చే పదం ఏది?
(అ) మృగతృష్ణ
(ఆ) విరహవేదన
(ఇ) జ్ఞానతృష్ణ
జవాబు.
(ఇ) జ్ఞానతృష్ణ

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

12. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గగనంలో సూర్యుడి జాడలేదు. నింగి నేల కలిసిపోయినట్లు చీకటి ముసురుకొన్నది.
ఇందులో సమానార్థక పదాలు గుర్తించండి.
జవాబు.
ఆకాశం, గగనం, నింగి

13. సముద్రంలో గవ్వలు ఉంటాయి. సంద్రంలో అలలు ఎగిరెగిరి పడుతూంటాయి. – ఇందులో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించండి.
జవాబు.
సముద్రం- ప్రకృతి; సంద్రం – వికృతి

14. “విశ్వాసంతో నువ్వు విధిని కూడా తిరిగి రాయగలవు” అనే వారాయన. – దీనిని పరోక్ష కథనంలోకి మార్చండి.
జవాబు.
విశ్వాసంతో వ్యక్తి తన విధిని కూడా తిరిగి రాయ గలడు అనే వారాయన

15. పుస్తక రచనను పూర్తిచేయడానికి నెలరోజుల వ్యవధి కావాలి – దీనికి వ్యతిరేక వాక్యం రాయండి.
జవాబు.
పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అక్కరలేదు.

16. రాజు భారతాన్ని చదివాడు. – దీనికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
(అ) రాజు భారతాన్ని చదివించాడు.
(ఆ) రాజుచే భారతం చదవబడింది
(ఇ) భారతాన్ని చదివినవాడు రాజు
జవాబు.
ఆ (రాజుచే భారతం చదవబడింది)

17. ప్రతి మనిషికీ తల్లి తొలి గురువు. గీతగీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
జవాబు.
మాత, జనని, అమ్మ

18. అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు క్రమంగా ఏవి ఆదేశంగా వస్తాయి?
జవాబు.
(అ) ఆ, ఈ, ఏ
(ఆ) అ, ఇ, ఉ
(ఇ) ఏ, ఓ, అర్
జవాబు.
(ఇ) ఏ, ఓ, అర్

19. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యమని కలాంతో తండ్రి అనేవారు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
జవాబు.
ప్రత్యక్ష కథనం : కలాంతో తండ్రి “వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం.” అని అనేవారు.

II. పరిచిత గద్యభాగాలు

1. క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు తగిన జవాబులు రాయండి.

ఒక రోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి, ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చేశారు. నేను పనిలో జాప్యానికి ఓ డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. ఆ పనిని పూర్తి చెయ్యడానికి చివరికి ఒక నెలరోజుల వ్యవధి కోరాను. ఆ ప్రొఫెసర్ నా వంక కొంత సేపు చూసి, “చూడు యంగ్మేన్, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం. నేను నీకు మూడు రోజుల టైమిస్తున్నాను. సోమవారం ఉదయానికి గానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపెయ్యవలసి ఉంటుంది” అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అదిగాని లేకపోతే ఇక ఏ దిక్కూలేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చెయడ్యం తప్ప మరో మార్గం కనిపించలేదు.

(అ) ఈ మాటలు ఎవరివి?
జవాబు.
ఈ మాటలు ఎ.పి.జె. అబ్దుల్ కలాంగారివి

(ఆ) ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఎవరు?
జవాబు.
ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాం చదువుకునే కళాశాల డైరెక్టరు, డిజైనింగ్ ఉపాధ్యాయుడు

(ఇ) రచయితకు ప్రొఫెసర్ ఎంత సమయం ఇచ్చారు?
జవాబు.
రచయితకు ప్రొఫెసర్ మూడు రోజుల సమయం ఇచ్చారు.

(ఈ) రచయితకు జీవన భాగ్యరేఖ ఏది?
జవాబు.
రచయితకు స్కాలర్షిప్పే అతని జీవనభాగ్యరేఖ

(ఉ) రచయిత ఏ పని కోసం ప్రొఫెసర్ శ్రీనివాసనన్ను నెలరోజుల వ్యవధి కోరాడు?
జవాబు.
రచయిత విమాన నిర్మాణం డ్రాయింగ్ పని పూర్తి చేయడం కోసం ప్రొఫెసర్ శ్రీనివాసన నన్ను నెలరోజుల వ్యవధి కోరాడు.

2. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణముండేది. హైస్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చెయ్యమంటూ పిలిచి, షాపులో కూచోబెట్టి ఇంక గంటలతరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతూండేవాణ్ణి. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లూ, బీడీలూను. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగపీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తాఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుల్లలతోను, శంఖాలతోను చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు.

(అ) రచయిత అన్నయ్యకు స్టేషన్లోడ్లో ఏమి ఉండేది?
జవాబు.
రచయిత అన్నయ్యకు స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది.

(ఆ) ముస్తఫా కమల్ షాపులో సాయంచేసే రోజుల్లో రచయిత ఏం చేస్తుండేవాడు?
జవాబు.
ముస్తఫా కమల్షాపులో సాయం చేసే రోజుల్లో రచయిత హైస్కూల్లో చదువుకునేవాడు.

(ఇ) దుకాణంలో ఏవి తొందరగా అమ్ముడుపోయేవి?
జవాబు.
దుకాణంలో సిగరెట్లు, బీడీలూ తొందరగా అమ్ముడు పోయేవి.

(ఈ) ఫ్యాన్సీషాపు నడుపుతున్న రచయిత తమ్ముడి పేరేమిటి?
జవాబు.
ఫ్యాన్సీషాపు నడుపుతున్న రచయిత తమ్ముడి పేరు కాశీమహమ్మద్.

(ఉ) ఫ్యాన్సీషాపులో ఏవేవి అమ్మేవారు?
జవాబు.
ఫ్యాన్సీషాపులో నత్తగుల్లలతోనూ, శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయచరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలంనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

కవి పరిచయం:

కవి : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్. పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలామ్.
కాలం : ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు.
రచనలు : “ఒక విజేత ఆత్మకథ” (ఇగ్నీటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ ఆటోబయోగ్రఫీ)
బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న
విశేషాంశాలు : సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించారు. దేశ, విదేశాలలోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించాయి.
గ్రంథము : ఈ పాఠ్యభాగం డా॥ అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీతో కలిసి రాసిన “ఒక విజేత ఆత్మకథ”లోనిది.

TS 7th Class Telugu 6th Lesson Questions and Answers Telangana ప్రేరణ

ప్రవేశిక:

ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తంచేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్యసాధన ఎట్లా జరిగిందో చూద్దాం.

పాఠ్యభాగ సారాంశం:

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్కలాం రామనాథపురంలో హైస్కూలులో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడే అతనికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అక్కడి ఉపాధ్యాయుడైన ఇయదురై సోలోమోన్ మార్గదర్శకత్వంలో కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనే అంశాలమీద పట్టు సాధిస్తే ఏ పనైనా చేయగలననే నమ్మకం కలిగింది.

కలాంకు చిన్నప్పటి నుండి ఆకాశంలో రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా ఎంతో ఆసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతున్నట్లే తానూ ఎగరాలని కోరుకొనేవాడు. హైస్కూలు చదువు పూర్తి చేసుకుని ట్రిచి సెంట్ జోసెఫ్ కాలేజీలో చేరి ఇంటర్మీడియెట్ చదివాడు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు అన్నదమ్ములకు వ్యాపారం, పనుల్లో సాయంచేసేవాడు.

డిగ్రీ చివరి సంవత్సరం చదివేటప్పుడు మంచి పుస్తకాలన్నీ చదివాడు. భౌతిక శాస్త్రం మీద అతనికి ఆసక్తి ఏర్పడింది. కాని తాను చదవవలసింది ఇంజనీరింగ్ అని అర్థం చేసుకున్నాడు. తన కలలు నిజం చేసుకోవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. చదువుకు కావలసిన డబ్బు అతని సోదరి జొహారా తన నగలమ్మి ఏర్పాటు చేసింది. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివాడు.

కాలేజీలో ప్రదర్శనకోసం ఉంచిన పాత విమానాన్ని పరిశీలిస్తూ ఉండేవాడు. కోర్సు పూర్తికాగానే నలుగురు సహచరులతో కలిసి యుద్ధవిమానం మోడల్ తయారుచేసి ప్రొ. శ్రీనివాసన్ ప్రశంసలు పొందాడు. బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాడు. తరువాత బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ట్రైనీగా చేరాడు. ఇంజన్ ఓవర్ హాలింగ్లో పనిచేశాడు.

వాయుపదార్థాల డైనమిక్స్ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వైమానికదళంలోను, రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ లోనూ కూడా ఉద్యోగాలకు పిలుపు వచ్చింది. అలా తమిళనాడు నుండి ఉత్తరదేశానికి వెళ్ళిపోయాడు.

కఠిన పదాలు – అర్ధలు

  • జిజ్ఞాసి = తెలుసుకోవాలనే కోరిక కలవాడు
  • ఇదమిత్థం = ఇది ఇలా
  • ప్రత్యామ్నాయం = బదులు
  • ఉదారం = ఉన్నతం
  • దృక్పథం = ఆలోచనావిధానం, దృష్టి మార్గం, చూపుమేర
  • మందబుద్ధి = తెలివితక్కువవాడు, అవివేకి
  • సంభవించటం = జరగటం
  • ఆకాంక్ష = కోరిక
  • ప్రగాఢంగా = దృఢంగా, అధికంగా
  • విశ్వసించటం = నమ్మటం
  • ఆసక్తి = కోరిక
  • విహరించటం = తిరగడం
  • కష్టార్జితం = కష్టం చేత సంపాదింపబడినది (కష్టపడి సంపాదించినది)
  • త్యాగనిరతి = దానం చేయడంలో మిక్కిలి ఆసక్తి
  • మక్కువ = ఇష్టం
  • సూక్ష్మబుద్ధి = చుఱుకైన తెలివి, కుశాగ్రబుద్ధి
  • తృష్ణ = కోరిక
  • సమగ్రవంతం = సంపూర్ణం
  • బలోపేతం = దృఢం (బలంతో కూడుకున్నది)
  • ప్రగతి = అభివృద్ధి
  • వ్యవధి = గడువు
  • జాపన్యం = ఆలస్యం
  • విరామం = విశ్రాంతి
  • మసలటం = కదలడం, విహరించడం
  • నిర్ఘాంతపోవటం = అచేతనమై పోవడం
  • ఉపాధి = ఉద్యోగం, కారణం

నేనివి చేయగలనా ?

  • కలాం విద్యాభ్యాసం గురించి మాట్లాడగలను. అవును/ కాదు
  • అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన వాక్యాల్లో తప్పొప్పులను గుర్తించగలను. అవును/ కాదు
  • కలాం ఆశయసాధన గూర్చి సొంతమాటలలో రాయగలను. అవును/ కాదు
  • నాలోని కోరికలను చిన్న కవిత రూపంలో రాయగలను. అవును/ కాదు

Leave a Comment